LATEST NEWS
ఇకపై  ఎమ్మెల్యే పనితీరు గురించి ప్రజలనే అడుగుతా..  ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకుంటే వారు పద్దతి మార్చుకోవాలి... లేకపోతే వారికి ఇంకో ఛాన్స్ ఉండదు. ఇదీ తెలుగుదేశం ప్రజాప్రతినిధులకు ముఖ్మమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన స్త్రాంగ్ వార్నింగ్.  పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకుచంద్రబాబు శుక్రవారం (మే 1)  కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించారు.  వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల కోసం సీఎం చంద్రబాబు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమావేశాల సందర్భంగా ఆ ప్రాంత ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.   మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.  శుక్రవారం (మే1) నుంచి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు అంతర్గత సర్వేల ద్వారా టీడీపీ అధినేత నివేదికలు తెప్పించుకుంటున్నారు. పనితీరు సరిగా లేని వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలని, ప్రజా క్షేత్రంలో ఉండాలంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాలను కూడా నిర్వహించారు. అయితే ఎమ్మెల్యేల పనితీరుపై ఇక నుంచి నేరుగా ప్రజల నుంచే అభిప్రాయాలు తెలుసుకోవాలని భావిస్తున్నారు.  ఎమ్మెల్యే పనితీరు గురించి ఈ రోజు నుంచి సమావేశాల్లోనే ప్రజలను అడుగుతా. ప్రజలు అనుకూలంగా చేతులెత్తకపోతే ఎమ్మెల్యే తన పనితీరు మార్చుకోవాలి. ఎమ్మెల్యేలు పనితీరును సరిదిద్దుకోకపోతే ప్రజల తరుఫున ఉంటాను కానీ.. ఎమ్మెల్యేల తరుఫున ఉండను. వారికి మళ్లీ ఛాన్స్ ఉండదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తున్న తరుణంలో కోల్‌కతాలో తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం (ఏప్రిల్ 30) రాత్రి కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గ ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్ వద్దకు చేరుకున్న ఆమె..  అక్కడ సుమారు మూడు గంటల పాటు ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆమె కేంద్రాన్ని హెచ్చరించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ..  అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ..  ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.  ఇది తమకు చావో రేవో తేల్చుకునే పోరాటంటూ ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేశారు.  అంతకుముందు, తృణమూల్ కాంగ్రెస్ ( నాయకులు కునాల్ ఘోష్, శశి పంజా ఖుదీరామ్ అనుశీలన్  స్ట్రాంగ్ రూం వెలుపల   వెలుపల ధర్నాకు దిగారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు లేకుండానే బాలెట్ బాక్సులను తెరుస్తున్నారని వారు ఆరోపించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా పార్టీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో కలకలం రేగింది. ఈ క్రమంలో టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మరోవైపు..  కేంద్ర దళాలు తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థి లేదా ఏజెంట్ స్ట్రాంగ్ రూమ్ వరకు వెళ్లే అధికారం ఉంటుందన్నారు. తమ పార్టీ ఏజెంట్లను అరెస్టు చేయడం ద్వారా ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని   విమర్శించారు. ఫలితాలు వెలువడే మే 4వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా ఈ  ఆరోపణలను పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం..  మూడంచెల భద్రత మధ్య ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయంది. . సిసిటివి ఫుటేజీలో కనిపిస్తున్నది కేవలం పోస్టల్ బ్యాలెట్ల విభజన ప్రక్రియే తప్ప..  ఈవీఎంలను తాకడం లేదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి బెంగాల్‌లో రాజకీయ వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో..  ప్రతి ఓటును కాపాడుకోవాలన్న  పట్టుదలతో టీఎంసీ ఉంది. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతను మరింత కఠినతరం చేయాలని, నిరంతరం నిఘా ఉంచాలని మమతా బెనర్జీ తమ పార్టీ  అభ్యర్థులను ఆదేశించారు.  
  తెలుగువన్ ‘వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ  భవిష్యత్తు వారసుడిగా నారా లోకేష్ ఎదుగుదల, పార్టీలో ఆయన పోషిస్తున్న పాత్రపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగింది. సీనియర్ జర్నలిస్టులు మరియు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గతంతో పోలిస్తే లోకేష్ రాజకీయ శైలిలో గణనీయమైన మార్పులు వచ్చాయి. రాజకీయ పరిస్థితి - ఒక అవలోకనం రాష్ట్రంలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటువంటి క్లిష్ట సమయంలో లోకేష్ పార్టీ పగ్గాలను సమర్థవంతంగా చేపడుతున్నారా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. గత ఎన్నికల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకున్న లోకేష్, 'యువగళం' పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. ఇది కేవలం ఒక యాత్రగానే కాకుండా, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపే వేదికగా మారింది. క్షేత్రస్థాయిలో సమస్యలను అర్థం చేసుకోవడం, ప్రజలతో నేరుగా మమేకమవ్వడం ద్వారా తనపై ఉన్న విమర్శలకు ఆయన చేతలతో సమాధానం చెబుతున్నారు. వ్యూహాలు మరియు అంతరార్థాలు లోకేష్ అనుసరిస్తున్న ప్రస్తుత వ్యూహం ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంది: ఒకటి సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవడం, రెండు యువతను ఆకర్షించడం. సామాజిక మాధ్యమాల వినియోగం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన ముందుంటున్నారు. అయితే, రాజకీయాల్లో వ్యూహం ఎంత ముఖ్యమో, సమయం కూడా అంతే ముఖ్యం. పొత్తుల విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా లోకేష్ తన ప్రచార పంథాను మార్చుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా, అభివృద్ధి ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఒక పరిణతి చెందిన నాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయ ప్రభావం రాబోయే ఎన్నికలు లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్ష వంటివి. పార్టీని క్లిష్ట పరిస్థితుల్లో నడిపించగలిగితే, ఆయన నాయకత్వంపై ఉన్న సందిగ్ధతలు పూర్తిగా తొలగిపోతాయి. రాబోయే కాలంలో లోకేష్ పోషించబోయే పాత్ర కేవలం తెలుగుదేశం పార్టీకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయ గమనాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒకవేళ పార్టీ సానుకూల ఫలితాలను సాధిస్తే, లోకేష్ కేవలం ఒక వారసుడిగానే కాకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న శక్తివంతమైన నాయకుడిగా స్థిరపడతారా... ఇలాంటి ఆసక్తికర అంశాలపై కంఠంనేని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్‌ల మధ్య జరిగిన పూర్తి స్థాయి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి  
ALSO ON TELUGUONE N E W S
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న "భగవంతుడు" సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి 'శరణమన్న శరణం' సాంగ్ రిలీజ్ చేశారు. శ్రామిక శక్తికి నమస్కరిస్తూ 'శరణమన్న శరణం' పాటను రూపొందించారు. ఈ పాటకు  హాయ్ కే.పి స్ఫూర్తికరంగా కంపోజ్ చేయగా, సింగర్ కుమార వాగ్దేవి పాటలోని భావోద్వేగాలను పలికిస్తూ పాడారు. ఈ పాట గురించి "భగవంతుడు" మేకర్స్ స్పందిస్తూ - మన మట్టిలో ప్రతి పని ఒక అమ్మ దేవత సాక్షిగానే మొదలవుతుంది. పొలం గట్టున నాగలి సాగేముందు 'పోలేరమ్మ'ను, చెరువు కట్టపై అలుగులు పోసేటప్పుడు 'గంగమ్మ'ను, కష్ట, సుఖాల్లో  'ఎల్లమ్మ'ను స్మరించుకోవడం మన శ్రామిక సంస్కృతిలో భాగం. ఈ అమ్మ దేవతలు శ్రామికుల చెమట చుక్కల్లో తోడుండే ధైర్య రూపాలు. మన సంస్కృతిలో అమ్మ దేవతల శరణుజొచ్చంది ఏ పనీ మొదలు కాదు. పూర్తి కాదు. అమ్మలకు, సబ్బండ వర్గాలకు ఘనమైన ట్రిబ్యూటే మా ఈ "శరణమన్న శరణం". ఇది నాగలి పట్టిన రైతు, సుత్తి పట్టిన కమ్మరి, చక్రం తిప్పిన కుమ్మరి... ఇలా సకల సబ్బండ కులాల శ్రమజీవుల గుండె చప్పుడు. రక్తాన్ని చెమటగా మార్చి, ఉత్పత్తి చేసే మట్టి చేతులకు, మట్టి చేతులు మోసే పనిముట్లకు నివాళి ఈ గీతం. ఇది ఈ దేశపు సబ్బండ కులాల పతాక గీతం. శ్రమను, తల్లిని ప్రేమించే, పూజించే వారి బతుకు గీతం. మట్టి మనుషులకి వారిని కంటికి రెప్పలా కాపాడే అమ్మ దేవతలకీ మే డే సందర్భంగా మా వందనం. అంటూ కార్మిక లోకానికి సెల్యూట్ చేశారు.
బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటుతున్న నటుడు గెటప్ శ్రీను (Getup Srinu) తాజాగా ఒక ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గెటప్ శ్రీను ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబుతో కలిసి ఒక సరికొత్త వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు 'మేము కాపులం' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే, యాంకర్ ఈ టైటిల్ గురించి ప్రస్తావిస్తూ.. "సినిమా కోసం కులాన్ని వాడుకోవడం నాకు నచ్చలేదు. ఇలాంటి టైటిల్స్ విషయంలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది కదా?" అని ప్రశ్నించారు.  ఈ వ్యాఖ్యలతో గెటప్ శ్రీను అసహనానికి లోనయ్యారు. "ఆ టైటిల్ వెనుక ఒక బలమైన కారణం ఉంది. కథకు తగ్గట్టుగానే ఆ పేరు పెట్టాం తప్ప, కేవలం వివాదం కోసం కులాన్ని వాడుకోలేదు" అని వివరించారు. అయినప్పటికీ యాంకర్  తన వాదనను కొనసాగిస్తూ, గతంలో రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు కూడా ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. దీనికి శ్రీను సీరియస్ అవుతూ.. "తొక్కలో ఇంటర్వ్యూ" అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. గెటప్ శ్రీను ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం చేసిన స్టంట్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.  
'దసరా' వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' (The Paradise). పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేయగా, ఇప్పుడు సెకండ్ సింగిల్‌కు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రేమ పాటకు ముహూర్తం: ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన "ఆయా షేర్.." అనే పాట మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పుడు క్లాస్, యూత్‌ను ఆకట్టుకునేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. మే రెండో వారంలో ఈ సినిమా నుంచి రెండో గీతాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక మెలోడియస్ లవ్ ట్రాక్ అని సమాచారం. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ బాణీలు కట్టిన ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై  నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. భారీ సెట్టింగ్స్, రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 21న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. 'దసరా' మ్యాజిక్‌ను మించి ఈ ప్యారడైజ్ ఉంటుందని, నాని నటనలో మరో కోణాన్ని ఈ చిత్రం చూపిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.   
  మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers).. అగ్ర నిర్మాణ సంస్థగా  తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బ్రాండ్ ని సంపాదించుకుంది. నిర్మాణ రంగంలోనే కాకుండాపంపిణీ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవల మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరియు థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య తలెత్తిన  వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వివాదం ఈ రోజు మైత్రి సమర్పణలో తెరకెక్కిన  'జెట్లీ' పంపిణీ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది. దిల్ రాజు, ఏషియన్, సురేష్, గీతా డిస్ట్రిబ్యూటర్స్ ఆధీనంలోని సింగిల్ థియేటర్స్ మరియు మల్టీప్లెక్స్‌లలో (AMB, AAA)లో జెట్లీ  ప్రదర్శించబడలేదు. ఈ విషయంపై మైత్రి భాగస్వామి కేతిరెడ్డి శశిధర్ స్పందిస్తు సింగిల్ స్క్రీన్ కి మాకు మధ్య సమస్యలు ఉన్న మాట నిజమే. కానీ మల్టిప్లెక్స్ రిలీజ్ విషయంలో మాకు ఎలాంటి గొడవలు లేవు. కానీ కొన్నిమల్టిప్లెక్స్ లలో జెట్లీ  రిలీజ్ చెయ్యలేదని ఒక నోట్ రిలీజ్ చేసాడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఫిలిం చాంబర్ రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమా విడుదలైనప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మధ్య ఒప్పందాలు జరుగుతుంటాయి. కానీ 'జెట్లీ'కి సంబంధించి మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థకు, కొంతమంది థియేటర్ల యజమానులకి మధ్య విబేధాలు వచ్చాయి. ఎగ్జిబిటర్ల వాదన ప్రకారం, సినిమా ప్రదర్శన సమయంలో తాము చెల్లించిన అడ్వాన్సులు లేదా సెటిల్‌మెంట్ నిధుల విషయంలో మైత్రీ సంస్థ నుంచి సరైన స్పందన రావడం లేదు. దీనివల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు, పంపిణీ సంస్థ నియమ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని మైత్రీ వర్గాలు అంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం గందరగోళంగా ఉంది. Also read: Peddi: పెద్ది రిలీజ్ డేట్ వచ్చేసింది..  జూన్ 24 కంటే ఇంకా ముందే   తెలంగాణ ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ప్రదర్శిస్తామని స్పష్టం చేస్తుండగా  గిల్డ్ నిర్మాతలు రెంటల్ సిస్టమ్‌లోనే రిలీజ్ కావాలని పట్టుబడుతున్నారు. ఏదైనా వివాదం తలెత్తినప్పుడు చర్చల ద్వారా పరిష్కరించుకోవడం సినిమా పరిశ్రమ ఆరోగ్యానికి మంచిది. 'జెట్ లీ' సినిమా విషయంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్లు ఒకే తాటిపైకి వచ్చి, ఆర్థిక లావాదేవీలను పారదర్శకంగా ముగించుకోవాలని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.     
తమిళ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), కృతి శెట్టి (Krithi Shetty) జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (Love Insurance Kompany - LIK) ఇప్పుడు తన డిజిటల్ ప్రయాణానికి సిద్ధమైంది. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై అధికారిక స్పష్టత వచ్చేసింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. సుమారు 60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించి, ప్రదీప్ రంగనాథన్ క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ, అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. సుమారు మూడు వారాల థియేట్రికల్ రన్ తర్వాత, ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతోంది. ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు: ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. ఈ చిత్రం మే 6, 2026 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ కి రానుంది. టెక్నాలజీతో ముడిపడిన ప్రేమకథ కావడంతో ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.   https://x.com/PrimeVideoIN/status/2050134607681703960
The Telangana film exhibition sector is currently witnessing a heavy power struggle between distributors and theater owners, with the new release Jet Lee caught in the crossfire. A long-standing dispute over revenue sharing and weekly rentals in single-screen theaters has unexpectedly spilled over into the multiplex arena. Mythri Movie Distributors LLP has publicly accused certain exhibitors of using unfair pressure tactics by halting the screening of Jetlee in their multiplex properties. According to Mythri's designated partner Kethireddy Sasidhar, the distributor and the exhibitors have no active disagreements regarding multiplex terms. However, the exhibitors appear to be leveraging their control over multiplex screens to force a favorable agreement in the ongoing single-screen deadlock. This move essentially holds a major release hostage to settle an unrelated score.  This situation highlights the growing tensions within the local film business, where a disagreement in one sector can easily be used to paralyze operations in another. While the distributor is calling for a separation of the two issues and a return to fair negotiations, the blockade of Jetlee points to a deeper systemic issue regarding exhibition control and distribution leverage. How this standoff resolves could set a lasting precedent for future business dealings between distributors and theater chains in the region.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో  'పెద్ది'(Peddi)రిలీజ్ డేట్ జూన్ 24 అని కొన్ని రోజుల క్రితం మేకర్స్ అధికారకంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆ డేట్ కూడా మారుతుందనే వ్యాఖ్యలు కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అవును డేట్ మారింది. కాకపోతే ఇంకొంచం ముందు వస్తుంది. దీంతో సోషల్ మీడియాకి పెద్ది కొత్త చిరునవ్వులు తెచ్చాడు. మరి ఆ డేట్ చూద్దాం.  జూన్ 4, 2026న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. నిశ్చయమే అతని ఆయుధం అనే క్యాప్షన్ తో రిలీజ్ డేట్ ని ప్రకటించారు. దీంతో మెగా ఫ్యాన్స్ లో జోష్ వచ్చినట్లయింది. రికార్డులే లక్ష్యంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పెద్ది తన సునామీ స్టార్ట్ చేయడానికి జూన్ 4 ని ఎంపిక చేసుకుందని అనుకోవాలి. also read: Aamir Khan: చనిపోతాననే భయంతోనే ఆ పని చేస్తున్నా.. అమీర్ ఖాన్ సీక్రెట్ నోట్ బయటపడింది     
1. 'జెట్లీ' మూవీ రివ్యూ సత్య, దర్శకుడు రితేష్ రానా కాంబినేషన్‌లో వచ్చిన 'జెట్లీ' (Jetlee) మూవీ డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. సత్య తన మార్క్ కామెడీ టైమింగ్‌తో వన్ మ్యాన్ షో చేయగా.. సినిమాలో బలమైన కథ లేకపోవడం, సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సన్నివేశాలు మైనస్ గా మారాయి. సత్య కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు. 2. 'గాయపడ్డ సింహం' మూవీ రివ్యూ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్ర పోషించిన 'గాయపడ్డ సింహం' కూడా డివైడ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. అమెరికా నుండి డిపోర్ట్ అయిన యువకుడు.. డోనాల్డ్ ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం అనే సిల్లీ పాయింట్‌తో సాగుతుంది. దర్శకుడు కాశ్యప్ శ్రీనివాస్ ఎంచుకున్న కథాంశం సిలీగా ఉండటమే కాకుండా.. సినిమా అంతా పాతకాలపు కామెడీతో బోర్ కొట్టిస్తుంది. అక్కడక్కడా మాత్రమే నవ్విస్తుంది. 3. బాలయ్య-కొరటాల మూవీ ప్రకటన నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'NBK112'ను అధికారికంగా ప్రకటించారు. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కొరటాల శివ తనదైన శైలిలో సామాజిక సందేశంతో కూడిన ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను బాలయ్య కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.   4. మారిన పెద్ది రిలీజ్ డేట్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న 'పెద్ది' మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ స్పోర్ట్స్ డ్రామాను వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. మొదట జూన్ 25న విడుదల చేయాలనుకున్నా.. 'టాక్సిక్' వాయిదాతో జూన్ 4 స్లాట్ ఖాళీ అవ్వడంతో ఈ డేట్ పై కర్చీఫ్ వేసింది 'పెద్ది' టీమ్.  5. 'డ్రాగన్'పై 'వార్ 2' ఎఫెక్ట్  ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న 'డ్రాగన్' సినిమా షూటింగ్ ఆలస్యంపై మైత్రీ మూవీ మేకర్స్ ప్రతినిధి శశి స్పందించారు. ఎన్టీఆర్ గత చిత్రం 'వార్ 2' ఫలితాన్ని విశ్లేషించుకున్న తర్వాత.. ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్‌లోని కీలక అంశాలను మరింత మెరుగుపరిచేందుకు కొంత సమయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు స్క్రిప్ట్  అద్భుతంగా వచ్చిందని, ప్రస్తుతం సినిమా షూటింగ్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని శశి వెల్లడించారు. 6. నారా ఇంట పండుగ వాతావరణం టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో తండ్రి కాబోతున్నారు. తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రోహిత్ భార్య శిరీష లెళ్ళ సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 7. అషురెడ్డి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డికి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా నిరాధార కథనాలను ప్రసారం చేయకూడదని మీడియా, సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై స్పందించిన అషురెడ్డి.. తన ప్రైవసీని గౌరవించాలని, అభ్యంతరకర పోస్టులను వెంటనే తొలగించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 8. మల్లారెడ్డి బయోపిక్ తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలో తన జీవిత కథ ఆధారంగా బయోపిక్ రూపొందించనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తన సినీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. ఒకవేళ తన బయోపిక్ తీస్తే దానికి తానే నిర్మాతగా వ్యవహరిస్తానని, అలాగే ఆ సినిమాలో ఒక పాత్రలో కూడా నటిస్తానని ఆయన పేర్కొన్నారు. గతంలో విలన్ పాత్రలు ఆఫర్ వచ్చినప్పటికీ, తన గౌరవానికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో వాటిని తిరస్కరించినట్లు ఆయన తెలిపారు.  9. టాలీవుడ్ మేకర్స్ పై రవిబాబు ఫైర్ టాలీవుడ్ సినిమా నిర్మాణ శైలిపై నటుడు, దర్శకుడు రవిబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "అప్పుడు సినిమాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేవాళ్ళు.. ఇప్పుడు కొందరు ఒళ్ళు బలిసి చేస్తున్నారు." అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాలు అనవసరంగా ఆలస్యం అవుతున్నాయని.. రచయితలు, దర్శకులు హీరోల ఇమేజ్ కోసం రాజీ పడటం వల్ల నాణ్యత దెబ్బతింటుందని ఆయన విమర్శించారు. సినీ పరిశ్రమలో మారుతున్న ఈ పోకడలు ఆరోగ్యకరమైనవి కావని.. నిర్మాతల సమయం, డబ్బు వృథా కాకుండా ఉండాలంటే మార్పు అవసరమని రవిబాబు పేర్కొన్నారు. 10. సూపర్‌హీరో సినిమాలో సల్మాన్ ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పాపులర్ డైరెక్టర్ల ద్వయం రాజ్-డీకే కాంబినేషన్‌లో ఒక భారీ సూపర్‌హీరో మూవీ పట్టాలెక్కబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2026 అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లోనే మొదటిసారిగా ఒక పూర్తిస్థాయి సూపర్‌హీరో పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.