LATEST NEWS
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద  ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఓటర్ల జాబితాల సవరణలోని లోపాలను నిరసిస్తూ సీజేపీ (CJP) ఆధ్వర్యంలో చేపట్టిన 'జంతర్ మంతర్ 2.0' ఆందోళన తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఈ నిరసన ప్రదర్శనలో వందలాది మంది విద్యార్థి సంఘాల కార్యకర్తలు, మహిళలు పాల్గొని భారీ సెక్యూరిటీ వలయాలను, బారికేడ్లను బద్దలు కొడుతూ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఒక యువతి చేసిన సాహస కృత్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆందోళన ఉధృతంగా మారిన సమయంలో భద్రతా బలగాలు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీసు బస్సులలో ఎక్కించే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో పోలీసులకు, యువ ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. నిరసనకారులు పోలీసుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఇదే అదనుగా భావించిన ఒక మహిళా నిరసనకారిణి ఊహించని విధంగా ధైర్యం ప్రదర్శించింది. ఆందోళనకారులను తరలిస్తున్న పోలీసు బస్సు దగ్గరకు వెళ్లిన ఆమె, ఎవరికీ అంతుచిక్కని రీతిలో ఆ బస్సు యొక్క ఇగ్నిషన్ కీని (చావితీ) క్షణాల వ్యవధిలో లాక్కుని అక్కడి నుంచి పరారైంది. కీస్ మాయం కావడంతో నిరసనకారులతో నిండిన ఆ పోలీసు బస్సు అక్కడికక్కడే నిలిచిపోయింది. బస్సు ముందుకు కదలకపోవడంతో పోలీసు అధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. చివరకు చేసేది లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న పోలీసులు, ఆ బస్సును ముందుకు కదిలించడానికి తీవ్రంగా శ్రమించి నెట్టాల్సి వచ్చింది. ఈ అరుదైన విచిత్రమైన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న వారి కెమెరాలలో చిక్కగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ నిరసన కార్యక్రమంలో సుమారు 120 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ భారీ నిరసన ప్రదర్శన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై సుమారు సాయంత్రం 6:30 గంటల వరకు ఉద్రిక్తత మధ్య కొనసాగింది. ఈ ఆందోళనలో వృందా గ్రోవర్, బృందా కారత్ వంటి ప్రముఖ నేతలు కూడా పాల్గొని పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో మహిళా జర్నలిస్టుపై జరిగిన దురుసు ప్రవర్తన ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు పోలీసులను నిలదీశారు. మహిళా భద్రత, ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదాలతో హోరెత్తిన ఈ ఆందోళనలో ఒక యువతి పోలీసుల బస్సు కీస్‌ను ఎత్తుకెళ్లి అధికారులకు చుక్కలు చూపించిన వైనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.       [ Jantar Mantar protest, Delhi police bus key, woman flees with bus key, Delhi news viral, CJP protest Delhi, police bus key stolen,Telugu One, Telugu News ]    
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.! చేతిలో రూ.3 లక్షలు.. మనసులో ఒక పెద్ద కల! ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా, ముగ్గురు స్నేహితులు చాయ్‌తో తమ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఒకప్పుడు సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్లు అమ్మిన ఈ యువకులే.. నేడు వందల కోట్ల వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. కేవలం ఒక చిన్న చాయ్ కేఫ్‌తో మొదలైన వారి ప్రయాణం.. ఏకంగా రూ.100 కోట్ల టర్నోవర్‌ దాటింది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? వాళ్ల ఆలోచన ఏమిటి? రూ.3 లక్షల పెట్టుబడి ఎలా వందల కోట్ల వ్యాపారంగా మారింది? ఇదే ‘చాయ్ సుట్టా బార్’ సక్సెస్ స్టోరీ. ఉద్యోగాల కోసం పెద్ద చదువులు చదివి.. ఇంటర్వ్యూల చుట్టూ తిరిగే యువతకు ఇండోర్‌కు చెందిన ముగ్గురు స్నేహితులు సరికొత్త మార్గాన్ని చూపించారు. కేవలం రూ.3 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన చిన్న చాయ్ వ్యాపారాన్ని.. నేడు రూ.100 కోట్ల టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకెళ్లారు. అదే ‘చాయ్ సుట్టా బార్’.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అనుభవ్ దూబే, ఆనంద్ నాయక్ తొలుత సాధారణ ఉద్యోగాల వైపు వెళ్లకుండా సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్ల విక్రయాలు చేపట్టి వ్యాపార నిర్వహణలో అనుభవం సంపాదించారు. ఆ తర్వాత రాహుల్ పాటిదార్ వీరితో కలవడంతో ముగ్గురి ప్రయాణం మరో మలుపు తిరిగింది.2016లో ఈ ముగ్గురు కలిసి రూ.3 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఇండోర్‌లో తొలి ‘చాయ్ సుట్టా బార్’ ఔట్‌లెట్‌ను ప్రారంభించారు.  సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూ.. ప్లాస్టిక్, పేపర్ కప్పులకు బదులుగా మట్టి కప్పుల్లో అంటే కుల్హాడ్లలో చాయ్ అందించడం ప్రారంభించారు. ఈ ప్రత్యేకత కస్టమర్లను ఆకట్టుకుంది.పేరులో ‘సుట్టా’ ఉన్నప్పటికీ.. కేఫ్‌లలో ఎక్కడా పొగతాగడానికి అనుమతి లేదు. దీంతో యువతతో పాటు కుటుంబాలు కూడా ఈ కేఫ్‌లకు రావడం మొదలైంది. సాధారణ చాయ్‌తో పాటు అల్లం, తులసి, చాక్లెట్, కేసర్ వంటి వివిధ రకాల ఫ్లేవర్డ్ చాయ్‌లను మెనూలో చేర్చారు. చాయ్‌తో పాటు కాఫీ, పాస్తా, బర్గర్లు, నూడుల్స్ వంటి స్నాక్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.అందుబాటు ధరల్లో నాణ్యమైన ఉత్పత్తులను అందించడం.. కస్టమర్లకు ప్రత్యేక అనుభూతిని కల్పించడం.. బ్రాండ్‌ను వేగంగా విస్తరించడం వంటి వ్యూహాలతో ‘చాయ్ సుట్టా బార్’కు ఆదరణ పెరిగింది.  ముఖ్యంగా ఫ్రాంచైజీ మోడల్‌ను అనుసరించడంతో వ్యాపారం వేగంగా విస్తరించింది.ప్రస్తుతం ఈ బ్రాండ్‌కు భారత్‌తో పాటు కెనడా, యూఏఈ, నేపాల్ వంటి దేశాల్లోనూ ఔట్‌లెట్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 650కి పైగా ఔట్‌లెట్లతో విస్తరించిన ఈ సంస్థ.. రూ.100 కోట్లకు పైగా టర్నోవర్ సాధించినట్లు పేర్కొంటోంది. చిన్న ఆలోచనకు పట్టుదల తోడైతే.. భారీ విజయాన్ని సాధించవచ్చని ఈ ముగ్గురు స్నేహితుల ప్రయాణం నిరూపించింది. ఉద్యోగం కోసం ఎదురుచూడటం మాత్రమే కాకుండా.. అవకాశాలను సృష్టించుకోవచ్చని చూపిస్తూ నేటి యువతకు ‘చాయ్ సుట్టా బార్’ సక్సెస్ స్టోరీ ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది.       [ Chai Sutta Bar, Chai Sutta Bar Success Story, Anubhav Dubey, Anand Nayak, Rahul Patidar, Tea Business, Business Success Story, Startup Success Story, Indian Entrepreneurs, Tea Cafe Business, 3 Lakh Investment, 100 Crore Turnover, Franchise Business, Startup India, Entrepreneurial Journey ]
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .! హైదరాబాద్ నగరంలోని రద్దీ ప్రాంతాలలో ఒకటైన కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనాల రాకపోకలను నియంత్రించడానికి అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్క్ పరిసరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ట్రాఫిక్ విధానం మంచి ఫలితాలు ఇవ్వడంతో, దీనిని శాశ్వతంగా కొనసాగించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నిర్ణయించింది. గతంలో నగర పాలక సంస్థ రూపొందించిన భారీ ప్రాజెక్టుల ప్రణాళికల్లో మార్పులు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ రద్దీని నివారించడంలో ఈ సరికొత్త విధానం ఎంతో ఉపయుక్తంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీనివల్ల వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరమవుతుందని భావిస్తున్నారు. ఈ సరికొత్త ట్రాఫిక్ సర్క్యులేషన్ పద్ధతిని మరింత పకడ్బందీగా అమలు చేసే దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టారు. ప్రయాణ వేళల్లో గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయే వాహనదారులకు ఈ నిర్ణయం భారీ ఊరటనిస్తుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన మార్పుల వల్ల ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా నిధులు ఆదా కానున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ. 400 కోట్ల వరకు ప్రజాధనం ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు. నగర అభివృద్ధిలో ఈ నిర్ణయం ఆర్థికంగానూ సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో ప్రతిపాదించిన కొన్ని నిర్మాణాల వ్యూహాలను మార్చి, ఈ ప్రాంతంలో ప్రత్యామ్నాయ ఎలివెటెడ్ కారిడార్లు లేదా మెరుగైన రహదారుల వసతి కల్పించాలని జీహెచ్‌ఎంసీ కసరత్తు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా తక్కువ నష్టంతో పనులు పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్ల విస్తరణ, లేన్ మార్కింగ్‌లు, పాదచారుల భద్రత కోసం ప్రత్యేక సిగ్నల్ వ్యవస్థలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు మరింత సజావుగా సాగుతాయని నగర పాలక సంస్థ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రయాణికుల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో ఈ వన్-వే విధానం భవిష్యత్తులో నగరంలోని ఇతర రద్దీ ప్రాంతాలకు కూడా ఆదర్శంగా మారుతుందని ఆశిస్తున్నారు.       [  GHMC Commissioner, KBR Park, One-way traffic system, Hyderabad traffic updates, R.V. Karnan, CM Revanth reddy,Hyderabad police, DCP Suresh Reddy, Telugu One, Telugu News ]    
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు. తెల్లవారు జామున చడి చప్పుడు కాకుండా షాప్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. చేతికి అందినంతగా దోచుకుని.. ఎలాంటి హడావుడి లేకుండా మెల్లిగా అక్కడి నుంచి పరారయ్యారు. వేలు కాదు.. లక్షలు కాదు.. ఏకంగా కోట్ల విలువైన బంగారు , వజ్రాభరణాలు చోరీకి గురైనట్లు తెలియడంతో స్థానికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్‌ను దుండగులు టార్గెట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 4:10 గంటల సమయంలో షట్టర్‌ను వంచి లోపలికి ప్రవేశించిన దుండగులు.. అక్కడ ఉన్న గ్లాస్‌ను పగలగొట్ట కుండా ఎంతో చాకచక్యం గా ఓపెన్ చేశారు.  అనంతరం వజ్రాభరణా లను ఒక్కొక్కటిగా బయటకు తీసి బ్యాగులో వేసుకుని అక్కడి నుంచి నెమ్మదిగా పరారైనట్లు తెలుస్తోంది. ఈ చోరీలో ఏకంగా రూ.2 కోట్లకు పైగా విలువైనబంగారు ,డైమండ్ నగలు అపహరణకు గురైనట్లు సమాచారం. అయితే చోరీ జరిగిన విషయం ఉదయం వరకు ఎవరికీ తెలియలేదు. ఉదయం సుమారు 7 గంటల సమయంలో బిల్డింగ్ యజమాని షాప్ షట్టర్ ఓపెన్ చేసి ఉండటాన్ని గమనించాడు. అనుమానం వచ్చి పరిశీలించగా దొంగలు పడ్డట్లు గుర్తించాడు. వెంటనే బ్రాంచ్ అధికారికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. బ్రాంచ్ అధికారి వెంటనే మేడిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన జ్యువెలరీ షాప్‌ వద్దకు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దిగి దుండగులకు సంబం ధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. దుండగుల కదలికలను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నా రు. మరోవైపు చోరీ జరిగిన సమయంలో దుండగులు ఏ మార్గంలో వచ్చారు? చోరీ అనంతరం ఏ మార్గంలో వెళ్లారు? ముందస్తు సమాచారంతో చోరీకి పాల్పడ్డారా? లేక జ్యువెలరీ షాప్‌ను రెక్కీ చేసి మరీ టార్గెట్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారీ మొత్తంలో వజ్రాభరణాలు చోరీకి గురికావడంతో ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో కలకలం రేపింది. నిందితు లను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.. ఐదు నిమిషాల్లో రూ.2 కోట్ల ఆభరణాల చోరీ.! క్యారెట్ లేన్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంలో భారీ చోరీ జరిగినట్లుగా సమాచారం అందడంతో డిసిపి సురేష్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ  సురేష్ రెడ్డి మాట్లాడుతూ... ఈ షో రూమ్ లో మొత్తం ఏడుగురు దుండగులు కలిసి చోరీ చేసినట్లుగా గుర్తించామని డీసీపీ సురేష్ రెడ్డి తెలిపారు. వీరిలో కేవలం ఒక్కరు మాత్రమే షోరూం లోపలికి వెళ్లగా.. మిగతా ఆరుగురు బయటే వేచి ఉన్నారు. పక్కా ప్రణాళికతో వచ్చిన ముఠా.. కేవలం ఐదు నిమిషాల్లోనే చోరీని పూర్తి చేసింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఐదు నిమిషాల తర్వాత మరోసారి డోర్ ఓపెన్ చేస్తే అలారం మోగుతుందని ముందే తెలిసిన వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని డీసీపీ  తెలిపారు. దీంతో షోరూం భద్రతా వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఈ ముఠాకు కీలకం గా వ్యవహరించినట్లు తెలుస్తోందన్నారు. చోరీలో పాల్గొన్న ఏడుగురు రాజస్థాన్‌కు చెందిన ముఠా అయి ఉండొచ్చని డీసీపీ  సురేష్ రెడ్డి తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామని డీసీపీ  వెల్లడించారు       [ Massive theft in Medipalli, Carat Lane Diamonds Jewellery Shop, Hyderabad, Crime news, CP Sajjanar, DGP C.V. Anand, Telangana police, CP Sajjanar, Hyderabad police, DCP Suresh Reddy, Telugu One, Telugu News ]   
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు. సోమవారం ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. 2013 బ్యాచ్‌కు చెందిన అద్వైత్ కుమార్ సింగ్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కోఆర్డినేషన్ (కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాలు) ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రెసిడెంట్ కమిషనర్ పదవికి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్టీ నెం.1441, సాధారణ పరిపాలన (Spl.A) శాఖ, తేదీ 03.10.2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.  అద్వైత్ కుమార్ సింగ్‌కు తెలంగాణ భవన్‌తో ఇప్పటికే అనుభవం ఉంది. 2026 ఫిబ్రవరిలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఆయనను ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలులో రాష్ట్రం–కేంద్రం మధ్య సమన్వయం చేయడం ఆయన ప్రధాన బాధ్యతల్లో ఒకటి. తెలంగాణకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాలు, వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేయడంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్ కీలకంగా వ్యవహరిస్తోంది.  ఇటీవల హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించిన అంశాలపై కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖతో జరిగిన సమావేశంలోనూ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఇప్పటివరకు రెసిడెంట్ కమిషనర్‌గా డా. శశాంక్ గోయల్ బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఆయనతో పాటు అద్వైత్ కుమార్ సింగ్ కూడా పాల్గొంటూ వచ్చారు. తాజా ఉత్తర్వులతో రెసిడెంట్ కమిషనర్ బాధ్యతలను అదనంగా చేపట్టిన అద్వైత్ కుమార్ సింగ్, తన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయ బాధ్యతలను కూడా కొనసాగించనున్నారు. [ Delhi Telangana Bhavan, Advait Kumar Singh as Resident Commissioner, CM Revanth reddy, Dr. Shashank Goyal as Commissioner, Telangana goverment, Telangana police, Hyderabad police ]
ALSO ON TELUGUONE N E W S
  'సిగ్మా'తో జాసన్ సంజయ్ దర్శకుడిగా నిరూపించుకున్నాడు. అద్భుతమైన టేకింగ్ తో పస లేని సీన్ ని సైతం ఒక రేంజ్ లో తీర్చిదిద్దాడు. కాకపోతే గతంలో సిగ్మా లాంటి కథతో కూడిన ఎన్నో చిత్రాలని ప్రేక్షకులని చూసి ఉండటంతో సిగ్మా పరాజయాన్ని చాలా గట్టిగా కౌగిలించుకుంది.  కనీసం రివర్స్ స్క్రీన్ ప్లే లో అయినా కథని చెప్పుండాల్సిందనే మాటలు సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు  సందీప్ కిషన్  ఈసారి తమిళ పరిశ్రమలోని ఒక బడా స్టార్ హీరోతో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. తెలుగు అగ్ర హీరో అనే రూమర్స్ సైతం వినిపిస్తున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, సంజయ్ ఇప్పటికే ఒక పవర్‌ఫుల్ మాస్ అండ్ ఎమోషనల్ కథని సిద్ధం చేసుకున్నారట. ఈ స్క్రిప్ట్ లైన్ విన్న ఒక అగ్ర హీరో  ప్రాజెక్ట్ చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే, తన తండ్రి స్టార్‌డమ్‌ను గానీ, రాజకీయాధికారాన్ని గానీ వాడుకోకుండా సొంతంగా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదలతో జేసన్ సంజయ్ ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. సిగ్మా చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లలో కూడా తన తండ్రి విజయ్ పాల్గొనకపోవడం, తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉండాలన్న జేసన్ సంజయ్ ఆలోచనని  స్పష్టం చేస్తోంది.   ఇది కూడా చదవండి: విదేశీ రియాలిటీ షో హోస్ట్ గా మాధవన్! ఆ 'షో' ఎలా జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు       ఏది ఏమైనా  తన మొదటి సినిమా ద్వారా దర్శకుడిగా సెట్స్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్న సంజయ్, రెండో సినిమాని మరింత పక్కా ప్రణాళికతో తెరకెక్కించాలనుకుంటున్నాడు . త్వరలోనే ఈ బడా హీరో ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. మరి రెండో సినిమాతో అయినా కథ, కథనం యొక్క గొప్పతనం తెలుసుకొని సంజయ్ జాగ్రత్త పడతాడేమో చూడాలి.    [Jason Sanjay Next Movie With Big Hero, Jason Sanjay, Vijay son Jason Sanjay, Sigma movie, Sundeep Kishan, Jason Sanjay next movie,Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]    
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమా ఇటీవల థియేటర్లలోకి వచ్చింది. ‘దసరా’ తర్వాత ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉండటంతో సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ ఉంది. ముఖ్యంగా అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అయితే థియేటర్లలో ప్రేక్షకులు మిస్సయిన ఓ పాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమాలో ఓ కీలక సందర్భంలో పెట్టాల్సిన పవర్‌ఫుల్ సాంగ్‌ను చివరి నిమిషంలో పక్కన పెట్టాల్సి వచ్చిందట. ఇప్పుడు అదే పాటను ఓటీటీ వెర్షన్‌లో తీసుకొచ్చేందుకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్‌తో జరిగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో శ్రీకాంత్ ఓదెల ఈ విషయాన్ని చెప్పారు. ‘దేశం’ కాన్సెప్ట్‌తో సాగే ఆ పాట థియేటర్లలో పడితే ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చేదని ఆయన తెలిపారు. అయితే రిలీజ్‌కు ముందు ఆ పాటను పూర్తిచేయడానికి సమయం సరిపోలేదట. అదే సమయంలో అనిరుధ్ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో పాటు కీలక సన్నివేశాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై బిజీగా ఉన్నారు. ఆ పాటకు లైవ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌తో రికార్డింగ్ చేయడంతో పాటు ఫైనల్ మిక్సింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉండటంతో చివరికి దాన్ని థియేట్రికల్ వెర్షన్ నుంచి తప్పించాల్సి వచ్చిందని శ్రీకాంత్ చెప్పారు.  అయితే ఇప్పుడు ఆ పాటను పూర్తిగా వదిలేయడం లేదు. అనిరుధ్‌తో మళ్లీ రికార్డింగ్ చేయించి, పూర్తి వెర్షన్‌ను సిద్ధం చేసి నెట్‌ఫ్లిక్స్ వెర్షన్‌లో జోడించే ఆలోచనలో ఉన్నట్టు శ్రీకాంత్ ఓదెల వెల్లడించారు. ప్రస్తుతం థియేటర్లలోని ఒక కీలక సన్నివేశంలో ఇంగ్లిష్ ట్రాక్ వినిపిస్తుంది. దాని స్థానంలో ఈ కొత్త తెలుగు పాటను పెట్టే ఆలోచన జరుగుతున్నట్టు సమాచారం. అదే జరిగితే థియేట్రికల్ వెర్షన్‌తో పోలిస్తే నెట్‌ఫ్లిక్స్‌లో ‘ది ప్యారడైజ్’ కొంత భిన్నంగా కనిపించనుంది.  ఇప్పటికే ‘ది ప్యారడైజ్’కు నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ పార్ట్‌నర్‌గా ఉంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన ఖచ్చితమైన తేదీని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమా థియేటర్లలో రన్ అవుతుండటంతో ఆ తర్వాతే డిజిటల్ రిలీజ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  ఇది కూడా చదవండి: చుట్టమల్లే AI వీడియో వివాదం.. రంగంలోకి దిగుతున్న పవన్ కళ్యాణ్.!       [The Paradise OTT Version, The Paradise Desam Song, The Paradise Songs, Paradise Movie Songs, Natural Star Nani, Srikanth Odela, Anirudh Ravichander, Telugu Film News]  
Dynamic Star and Movie Artistes Association (MAA) President Vishnu Manchu has strongly reacted to the recent AI deepfake controversy involving the manipulated version of the popular Chuttamalle song featuring NTR and Janhvi Kapoor. Vishnu Manchu said the incident should not be treated as an isolated case but as a warning about the growing dangers of unchecked digital abuse and online anonymity. Quoting Ram Pothineni’s observation , “They’re faceless, so they’re fearless,” Vishnu said the idea of Aadhaar-linked accountability for online identities deserves serious consideration. He stressed that freedom of expression must be protected, but anonymity should never become a tool to abuse, defame or deliberately target individuals. He also raised concerns over organised negativity targeting films, actors and filmmakers, drawing a distinction between genuine criticism and coordinated attempts to damage a film even before audiences get an opportunity to watch it. Referring to Sundeep Kishan’s recent comments and The Paradise approaching the court before its release, Vishnu said: “Behind every film are years of work, hundreds of families and producers risking enormous amounts of money.” He urged audiences to watch a film before forming an opinion and said everyone has the right to love it, dislike it or criticise it.  However, filmmakers should first be given the opportunity to present their work to the audience. “LET THE FILM RELEASE,” he said. Vishnu also expressed concern over fan groups targeting one another, anonymous social media pages claiming neutrality, and accounts allegedly using actors’ photographs while engaging in activities those actors may not support. “The cake is big enough for everyone to have a piece,” he said, stressing that the failure of one Telugu film does not mean the success of another. As MAA President, Vishnu revealed that the association is compiling information on accounts and networks repeatedly involved in targeted abuse and malicious campaigns, including those allegedly misusing actors’ photographs and identities. He clarified that the objective is not to suppress criticism, but to establish accountability. Vishnu further stressed that the latest deepfake controversy highlights the urgent need for an industry-wide system to prevent such incidents, protect individuals from digital abuse and ensure accountability in the online space. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
AI టెక్నాలజీ వచ్చాక ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి. అదే సమయంలో దీన్ని దుర్వినియోగం చేసే ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ డీప్‌ఫేక్ వీడియోలు తయారు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటను కొందరు AIతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంపై ఎన్టీఆర్ ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వీడియోను తయారు చేసిన వారిపై, ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తాజాగా ‘ఆదర్శ కుటుంబం’ ప్రెస్‌మీట్‌లో నిర్మాత నాగవంశీ కూడా ఇదే అంశంపై స్పందించారు. ఆ AI మార్ఫింగ్ వీడియో చాలా డీఫేమింగ్‌గా ఉందని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలను ఇకపై చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇండస్ట్రీ మొత్తం ఒక్కటై పోరాడాల్సిన అవసరం ఉందని నాగవంశీ తెలిపారు. కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన సమస్యగా కాకుండా.. రేపు ఎవరినైనా టార్గెట్ చేసే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ భావిస్తోందని చెప్పారు. అంతేకాదు.. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తామని నాగవంశీ వెల్లడించారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. చిరంజీవి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఈ విషయంలో ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. AI దుర్వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇక నాగవంశీ వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి కేంద్రం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలన్న ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది? AI డీప్‌ఫేక్‌లపై భవిష్యత్తులో ఎలాంటి కఠిన నిబంధనలు వస్తాయి? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: అంత సీన్ లేదు.. ఫేక్ రికార్డులపై నాగవంశీ షాకింగ్ కామెంట్స్.!       [Chuttamalle AI Morphed Video, Aadarsha Kutumbam Press Meet, Chuttamalle AI Video, Naga Vamsi Press Meet, Jr NTR AI Video, Janhvi Kapoor AI Video, Chuttamalle Controversy, AI Deepfake Controversy, Pawan Kalyan, Telugu Film News]  
ధురంధర్ సిరీస్ లో రియల్ ఇండియన్ ఇంటెలిజెన్స్  చీఫ్  'అజిత్ దోవల్' క్యారక్టర్ లో ఇంచు కూడా జీవం తగ్గకుండా జీవించి మెప్పించాడు మాధవన్. దీంతో తను ఎంత వాల్యుబుల్ నటుడో మరోసారి చాటి చెప్పినట్లయింది. మాధవన్‌ ఇప్పుడు ఒక కొత్త అవతారంలో అభిమానులు, ప్రేక్షకులని  పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.   ఒక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బిజినెస్ రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. 'ఆప్టిమిస్టిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా లిమిటెడ్' (Optimystix Entertainment) సంస్థ నిర్మిస్తున్న ఈ సరికొత్త ఇన్నోవేటివ్ షో పేరు 'గేమ్‌ చేంజర్స్‌' (Game Changers). ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగంలో దూసుకుపోతున్న స్టార్టప్‌ వ్యవస్థాపకులని , పెట్టుబడిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం.   ఈ 'గేమ్‌ చేంజర్స్‌' కార్యక్రమానికి దుబాయ్ నగరం ప్రధాన నిర్మాణ కేంద్రంగా (Production Hub) వ్యవహరించనుంది.  ఇది కూడా చదవండి: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'' డిజాస్టర్ అయ్యిందా! రాజమౌళి, కార్తికేయ బ్రాండ్‌కి తగిలిన షాక్!   మిడిల్ ఈస్ట్ మార్కెట్‌ని  లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తున్న ఈ బిజినెస్ రియాలిటీ షోలో ప్రపంచంలోని వివిధ మూలల నుంచి ఎంపిక చేసిన ప్రతిభావంతులైన స్టార్టప్ ఫౌండర్లు పాల్గొంటారు. దుబాయ్, లండన్, రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్ (US) వంటి 4 ప్రధాన అంతర్జాతీయ ప్రాంతాలకు చెందిన దిగ్గజ ఇన్వెస్టర్ల ప్యానెల్ ముందు ఈ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తమ వ్యాపార ఐడియాలను, ఆవిష్కరణలను పిచ్ చేయనున్నారు. కేవలం నిధుల సమీకరణ మాత్రమే కాకుండా, వ్యాపార నిర్మాణంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు, ఆశయాలు, వ్యూహాత్మక ఆలోచనలు మరియు వారి వెనుక ఉన్న భావోద్వేగపూరితమైన నిజ జీవిత కథలను కూడా ఈ షో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.       [Madhavan To Host Game Changers Show,R Madhavan Game Changers, Madhavan business reality show, Game Changers Dubai, Optimystix Entertainment, Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]    
Allu Arjun has been busy with his next film, Raaka, shoot. Atlee Kumar is directing the film and recently, the big budget sci-fi film had created a guinness record by shooting with 37 motion-capture actors at the same time. Currently, Atlee is busy with Baththa movie promotions and by end of this month, next schedule will begin say reports.  Media reports also state that Allu Arjun will mostly finish shoot for his portions by December second week for Raaka. As the movie needs extensive post production work, it will take most of 2027 to complete the works. So, from January, he will join the sets of Lokesh Kanagaraj film, AA23.  Till September, the movie shoot will go on with short gaps between schedules like how Lokesh normally plans shoot of his films. Post DC release, Lokesh has been busy finalising the script and even recce, location scouting has been underway to keep everything ready by the time, Allu Arjun joins sets.  For now, the pre-production works of AA23 are going on at rapid pace and post this film, Lokesh has plans to start Kaithi 2, say reports. Allu Arjun though wants to finish Raaka and then only start Lokesh's film, he doesn't want to make it like Pushpa 2 dragging the shoot, indefinitely, and rush in the last hours.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబర్ 9న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో.. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ పాటపై నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సాంగ్స్‌కు మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం, వాటిలో కొంత భాగం పెయిడ్ వ్యూస్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ రావడం ఈ మధ్య సాధారణంగా మారిపోయింది. ఇదే క్రమంలో ‘నారాయణమ్మ’ పాటకు వచ్చిన 10 మిలియన్ వ్యూస్‌పై నాగవంశీ తనదైన శైలిలో స్పందించారు. ఈ పాటకు వచ్చిన వ్యూస్ కోసం తాము ఎలాంటి డబ్బులు ఖర్చు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. “ఈ పాటకు ఆన్‌లైన్‌లో విపరీతమైన ఆదరణ దక్కి ఇప్పటికే 10 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కానీ నేనేమీ డబ్బులు ఖర్చుపెట్టి ఆ వ్యూస్‌ను కొనలేదు. ప్రస్తుతం ఒక సాంగ్‌కు డబ్బులు పోసి వ్యూస్ కొనేంత శక్తి, సీన్ నా దగ్గర లేవు. ప్రేక్షకులు మనస్ఫూర్తిగా చూసి ఎంజాయ్ చేయడం వల్లే ఆ నంబర్స్ వచ్చాయి తప్ప ఇందులో ఎలాంటి ఫేక్ వ్యవహారాలు లేవు” అని నాగవంశీ తేల్చిచెప్పారు. అంతేకాదు.. ‘నారాయణమ్మ’ పాట విషయంలో మరో చర్చపైనా నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. ఇది పాత రేలంగి పాటకు రీమిక్స్ కాదని చెప్పారు. ఆ పాటను నేటి తరం అభిరుచికి తగ్గట్టుగా ఫ్రెష్‌గా ప్రెజెంట్ చేశామని తెలిపారు. పాత పాటను కొత్త తరానికి కనెక్ట్ అయ్యేలా అందించడమే తమ ఉద్దేశమని ఆయన వివరించారు. మరోవైపు ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ విషయంలో కూడా నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, నెగెటివిటీని దృష్టిలో పెట్టుకునే సినిమా విషయంలో టైం తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. హడావుడిగా రిలీజ్ చేసి 80 శాతం అవుట్‌పుట్ ఇవ్వడం కంటే.. కాస్త ఆలస్యమైనా 100 శాతం క్వాలిటీతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే తమ ఉద్దేశమని నాగవంశీ స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: బాంబు పేల్చిన నాగవంశీ.. ‘ఆదర్శ కుటుంబం’ వాయిదాకు అసలు కారణమిదే.!       [Producer Naga Vamsi On Paid Views, Aadarsha Kutumbam postponed, Narayanamma Song, Naga Vamsi Press Meet, Aadarsha Kutumbam Movie, Producer Naga Vamsi, Victory Venkatesh, Trivikram Srinivas, Telugu Film News]  
నటసింహ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘NBK 112’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా అధికారికంగా లాంచ్ కాగా.. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. బాలయ్యకు ధీటుగా ఉండే మెయిన్ విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో రాజశేఖర్‌ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ స్వయంగా రాజశేఖర్‌ను కలిసి కథతో పాటు ఆయన పాత్ర గురించి వివరించినట్లు, ఈ పాత్ర నచ్చడంతో ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజమై రాజశేఖర్ సినిమాలో విలన్‌గా నటిస్తే మాత్రం బాలయ్య-రాజశేఖర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ఇద్దరూ తమ కెరీర్‌లో యాంగ్రీ హీరోలుగా ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నవారే కావడంతో.. ఒకే సినిమాలో ప్రత్యర్థులుగా కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా రాజశేఖర్‌ను ఇంతవరకు పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్రలో చూడని ప్రేక్షకులకు ఇది కొత్త అనుభూతిగా మారొచ్చు. మరోవైపు ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక సందేశాన్ని కలిపి కొరటాల శివ కథను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విలన్‌గా రాజశేఖర్ ఎంపిక, బాలయ్య ద్విపాత్రాభినయం వంటి అంశాలపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. నిజంగానే ఈ కాంబినేషన్ తెరపైకి వస్తే మాత్రం బాలయ్య వర్సెస్ రాజశేఖర్ పోరు సినిమాపై అంచనాలను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.     [Balakrishna, Rajasekhar, Balakrishna Rajasekhar, NBK 112, NBK 112 Movie, Koratala Siva, Balayya Koratala Movie, Rajasekhar Villain, Balayya Villain, Tollywood News, Balakrishna Upcoming Movie]
  రిలీజ్ కి ముందు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రమోషన్స్ చూసిన ఫ్యాన్స్, సినీ లవర్స్, ప్రేక్షకులు తమ రోజు వారి టైం టేబుల్ ని ఒక సారి చెక్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' కి వెళ్లాలని. అంతలా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ క్రేజ్ తెచ్చుకుంది.  మరి రాజమౌళి  విజయంలోను, నిర్మాణ వ్యవహారాల్లోను వెన్నుముకగా నిలిచిన రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ సమర్పణలో ఎలాంటి సినిమా వచ్చినా, అందులో రాజమౌళి మార్కు ఎగ్జిక్యూషన్ మరియు గ్రాండియర్ ఖచ్చితంగా ఉంటాయని ప్రేక్షకులు బలంగా నమ్ముతారు.దీంతో కథలో ఏదో ఒక అద్భుతం ఉంటుందని భావించిన సాధారణ ప్రేక్షకుడు, థియేటర్లలో రెగ్యులర్ కథతో కూడిన నీరసమైన కథనాన్ని చూసి తీవ్ర నిరాశకి గురయ్యాడు. కార్తికేయ ప్రొడక్షన్ బ్రాండ్‌కు ఈ సినిమా ఎందుకు ఇంత పెద్ద షాక్ ఇచ్చిందంటే, ప్రధానంగా కథలోని లోతు లేకపోవడమే. సాధారణంగా రాజమౌళి లేదా కార్తికేయ ఎంచుకునే ప్రాజెక్టులలో డ్రామా, బలమైన క్యారెక్టర్స్, గ్రాఫిక్స్ పనితనం ఉన్నత స్థాయిలో ఉంటాయి. కానీ  నాణ్యత లేని విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లేలో నిరంతరం కనిపించే లాజిక్ లేని సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. ఈ చిత్రం విడుదలైన తొలిరోజే కేవలం 30% కంటే తక్కువ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఇది కూడా చదవండి: The Paradise: 11 రోజుల కలెక్షన్ల ఊచకోత! ఎవరక్కడ!    దాదాపు 25 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద కేవలం 4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కూడా రాబట్టలేకపోవడం సినీ వర్గాలని తీవ్రంగా ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రదర్శించబడిన థియేటర్లలో రెండవ రోజు నుంచే 60% వరకు షోలు రద్దవ్వడం లేదా ఖాళీగా దర్శనమివ్వడం దీని వైఫల్య తీవ్రతకు నిదర్శనం. ముఖ్యంగా డిజిటల్ మీడియా మరియు సోషల్ మీడియా కామెంట్స్ గమనిస్తే, "రాజమౌళి, కార్తికేయ లాంటి విజనరీ లీడర్స్ నుంచి ఇటువంటి క్వాలిటీ లేని సబ్జెక్ట్‌ను అస్సలు ఊహించలేదు" అని ప్రేక్షకులు ఓపెన్‌గా కామెంట్స్ చేయడం కనిపించింది. అందుకే అంటారు కంటెంట్ ఉంటేనే ఎవరైనా కింగ్ అని.    [Dont Trouble The Trouble Movie Failure Analysis, Dont Trouble The Trouble Movie Review, Rajamouli SS Kartikeya, Sharwanand Box Office Disaster, Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]        
ఇప్పటివరకు రష్మిక మందన్న అంటే గ్లామర్, క్యూట్‌నెస్, మోడ్రన్ లుక్ గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఆమెను చూస్తే మాత్రం ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గుర్తొస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎంఎస్ – ఎ లెగసీ ఆన్ స్క్రీన్’లో రష్మిక.. సుబ్బులక్ష్మి పాత్రను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె కనిపించిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుబ్బులక్ష్మి ప్రత్యేకతగా నిలిచిన నీలిరంగు పట్టుచీరను రష్మిక కూడా ధరించారు. సంప్రదాయ ఆభరణాలు, కాసుల పేరు, జుమ్కాలు, ముక్కుపుడక, వెనక్కి చక్కగా వేసిన కొప్పు, మల్లెపూలతో ఆమెను పాతకాలం నాటి సంగీత విద్వాంసురాలిలా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ‘ఎంఎస్ బ్లూ’గా గుర్తింపు తెచ్చుకున్న నీలిరంగు చీర ఈ లుక్‌కు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది. కేవలం ఓ చీర కట్టుకోవడం మాత్రమే కాకుండా.. పాత్రకు తగ్గట్టుగా ప్రతి చిన్న అంశాన్ని జాగ్రత్తగా ఎంచుకున్నట్టు ఈ మేకోవర్ చూస్తే అర్థమవుతోంది. ఇక మరో సందర్భంలో రష్మిక డార్క్ మెరూన్ చెక్స్ పట్టుచీరలో చాలా సింపుల్‌గా కనిపించారు. చిన్న కమ్మలు, ముక్కుపుడకతో సంప్రదాయ భారతీయ మహిళలా కనిపించిన ఆ లుక్ కూడా ఆకట్టుకుంది. ఈ పాత్ర కోసం రష్మిక కేవలం లుక్ విషయంలోనే కాకుండా నటనలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సుబ్బులక్ష్మి పాత్రలో సహజత్వం కోసం ఆమె కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. సినిమాలో ఆమె స్వయంగా పాటలు పాడే అవకాశాన్ని కూడా మేకర్స్ పరిశీలించినట్టు తెలుస్తోంది. మరోవైపు సెప్టెంబర్‌లో జరిగిన సినిమా లాంచ్ కార్యక్రమంలోనూ రష్మిక.. సుబ్బులక్ష్మి ఐకానిక్ నీలి చీర లుక్‌లోనే కనిపించారు. ఆ సందర్భంగా ఆమె ఈ పాత్ర దక్కడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, తన వంతు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. కమల్ హాసన్ సైతం సుబ్బులక్ష్మి వంటి దిగ్గజాన్ని తెరపై పోషించడం ఎంతో పెద్ద సవాల్ అని వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పటికే ఈ బయోపిక్‌పై ఆసక్తి నెలకొనగా.. రష్మిక మేకోవర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.     [Rashmika Mandanna, MS Subbulakshmi Biopic, Rashmika MS Subbulakshmi, MS A Legacy On Screen, Rashmika Makeover, Rashmika Saree Look, MS Subbulakshmi Blue Saree, Gowtam Tinnanuri, Anirudh Ravichander, Telugu Cinema News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ కర్రీ పేరు వింటేనే నోరూరిపోతుంది. వారాంతాల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో ఇళ్లలో రకరకాల మసాలాలు నూరి చికెన్ కూరను ఎంతో రుచిగా వండుతుంటారు. అయితే కేవలం రుచి కోసమే కాకుండా, మన ఆరోగ్యానికి, ముఖ్యంగా కంటి చూపుకు చికెన్ కర్రీ అద్భుతమైన ఔషధంగా మారుతుందంటే మీరు నమ్ముతారా? సాధారణంగా మనం వంటకాల్లో సువాసన కోసం వాడే కరివేపాకును చాలామంది తినేటప్పుడు పక్కన పడేస్తుంటారు. కానీ, చికెన్ కర్రీ వండేటప్పుడు కరివేపాకులను ధారాళంగా ఉపయోగించి తింటే కంటి చూపు మెరుగుపడి, కాలక్రమేణా కళ్ళజోడు వాడాల్సిన అవసరమే రాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చికెన్‌లో శరీరానికి అవసరమైన అత్యధిక నాణ్యత కలిగిన ప్రొటీన్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రత్యేకించి చికెన్‌లో లభించే విటమిన్ A, విటమిన్ B3 (నియాసిన్), మరియు విటమిన్ B6 కంటి ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. మన కంటిలోని రెటీనా కాంతిని సరిగ్గా గ్రహించి స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరచడానికి విటమిన్ A ప్రాథమిక మూలకం. శరీరంలో విటమిన్ A లోపిస్తే రేచీకటి, కళ్ళు పొడిబారడం (డ్రై ఐస్) వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. చికెన్ కర్రీలోని పోషకాలు కంటి నరాలకు బలాన్ని చేకూర్చి, కంటి కండరాలు అలసిపోకుండా కాపాడతాయి. ఇక కరివేపాకు విషయానికి వస్తే, ఇది కంటి చూపును మెరుగుపరిచే ఒక సహజమైన దివ్యౌషధం. కరివేపాకులో విటమిన్ A, విటమిన్ C మరియు విటమిన్ E తో పాటు ల్యూటిన్, జియాజంతిన్ మరియు కెరోటినాయిడ్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సిడేటివ్ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. వయస్సు పెరగడం వల్ల వచ్చే మెక్యులర్ డిజెనరేషన్, క్యాటరాక్ట్ (కంటి శుక్లాలు) మరియు రేచీకటి వంటి సమస్యలు రాకుండా నిరోధించడంలో కరివేపాకులోని పోషకాలు అద్భుతంగా పనిచేస్తాయి. చికెన్ మరియు కరివేపాకు కలయిక వల్ల విటమిన్ A మరియు యాంటీఆక్సిడెంట్ల లభ్యత రెట్టింపై కంటి ఆరోగ్యానికి అత్యంత మేలు జరుగుతుంది. మరి ఈ అద్భుతమైన కాంబినేషన్ ప్రయోజనాలు పూర్తిగా పొందాలంటే చికెన్ కర్రీని ఎలా వండుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. చికెన్ వండేటప్పుడు నూనెలో కేవలం పోపు కోసం మాత్రమే కాకుండా, గణనీయమైన పరిమాణంలో కరివేపాకులను వేసి మగ్గనివ్వాలి. వీలైతే కరివేపాకును లేతగా ఉన్నప్పుడే సేకరించి, పేస్ట్‌గా నూరి లేదా పొడి చేసి చికెన్ మసాలాలో కలిపి వండుకోవచ్చు. దీనివల్ల కరివేపాకును ఏరి పక్కన పడేసే అవకాశం ఉండదు మరియు అందులోని పోషకాలన్నీ కర్రీ రసంలోకి ఇంకి శరీరానికి సంపూర్ణంగా అందుతాయి. అంతేకాకుండా చికెన్ వండేటప్పుడు విపరీతంగా నూనె, ఘాటైన మసాలాలు వాడకుండా పరిమితంగా ఉపయోగిస్తే పోషక విలువలు దెబ్బతినకుండా ఉంటాయి. ఆధునిక డిజిటల్ యుగంలో గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మరియు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లను చూడటం వల్ల పిల్లల నుండి పెద్దల వరకు అందరిలో కంటి అలసట, మంటలు, కళ్ళు పొడిబారడం మరియు చిన్న వయస్సులోనే సైట్ రావడం సర్వసాధారణమైపోయింది. ఇటువంటి తరుణంలో కంటికి అవసరమైన క్యారెట్లు, ఆకుకూరలతో పాటు చికెన్ కరివేపాకు కాంబినేషన్‌ను క్రమం తప్పకుండా వారంలో కనీసం ఒకట్రెండు సార్లు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కంటి నరాల బలహీనత తగ్గి కంటి చూపు మెరుగవుతుంది. క్రమశిక్షణతో కూడిన ఈ ఆహారపు అలవాట్లతో కళ్ళజోడు ధరించే అవసరం లేకుండా సులభంగా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.     Secret Chicken Curry Ingredient Vision, Improve Eyesight Naturally Foods, Chicken Curry Healthy Additions, Foods to Sharpen Vision Fast, Nutritional Eye Health Recipe.  
మన ఆరోగ్యానికి, శరీర బలానికి ఆహారమే ప్రాథమిక మూలాధారం. సాధారణంగా ఎముకల బలానికి పాలు, శరీర పోషణకు గుడ్లు తప్పనిసరి అని మనమందరం భావిస్తుంటాము. కానీ, మన సాంప్రదాయ ధాన్యాలైన రాగులు మరియు నల్ల శెనగలలో పాలు, గుడ్ల కంటే ఏకంగా 5 రెట్లు ఎక్కువ క్యాల్షియం మరియు అత్యంత సమృద్ధిగా పోషకాలు లభిస్తాయని తెలుసా? ప్రాచీన కాలంలో మన పూర్వీకులు రోజూ ఈ ధాన్యాలను తమ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్లనే రూపంలోనూ, శారీరక దృఢత్వంలోనూ ఎంతో బలంగా, ఆరోగ్యానందంగా జీవించగలిగారు. నేటి ఆధునిక జీవనశైలిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు, ఎముకల బలహీనత మరియు నరాల నిస్సత్తువ వేధిస్తున్న తరుణంలో రాగులు, నల్ల శెనగలను రోజూ తీసుకోవడం ద్వారా వీటన్నింటికీ నాచురల్ పరిష్కారం లభిస్తుంది. రాగుల విశిష్టత విషయానికి వస్తే, ఇందులో క్యాల్షియం పరిమాణం సాధారణ పాలతో పోలిస్తే 5 రెట్లు అధికంగా ఉంటుంది. ఎముకలను ఉక్కులా మార్చడంలో ఇది ఒక సూపర్ ఫుడ్‌లా సహాయపడుతుంది. రాగులను రోజుకు రెండు పూటలా తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. విశేషంగా ఉదయం పరగడుపున అలాగే మధ్యాహ్న సమయంలో రాగి సంకటి లేదా రాగి అంబలి రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన సమగ్ర పోషణ సులభంగా అందుతుంది. రాగులలో ఉండే ప్రత్యేక పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా, జీర్ణక్రియ పనితీరును వేగవంతం చేసి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే రాగులను సరిగ్గా నానబెట్టి ఆహారంగా తీసుకున్నప్పుడే అందులోని పోషకాలన్నీ మన శరీరానికి సంపూర్ణంగా లభిస్తాయి. మరొకవైపు నల్ల శెనగలు పోషకాల ఘనిగా పనిచేస్తాయి. నల్ల శెనగలను ఉడకబెట్టి గానీ లేదా వేయించుకుని గానీ తినవచ్చు, అలాగే పొడి రూపంలో కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. నల్ల శెనగలు గుండె పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా తోడ్పడతాయి. గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరకుండా కాపాడటంతో పాటు నరాల బలహీనతతో బాధపడేవారికి ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. చర్మాన్ని వివిధ రకాల సమస్యలు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించి నిగారింపును అందించడంలో కూడా నల్ల శెనగలలోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. రోజూ వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు ఉక్కులా మారడమే కాక, రోగనిరోధక శక్తి పెరిగి శరీరం రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో ఖరీదైన సప్లిమెంట్ల వెనుక పడకుండా, మన పూర్వీకులు అందించిన రాగి సంకటి, రాగి అంబలి, నానబెట్టిన లేదా ఉడకబెట్టిన నల్ల శెనగలను మన దైనందిన ఆహారంలో చేర్చుకోవడం ఎంతైనా అవసరం. రోజుకు రెండు పూటలా ఈ ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని సరైన పద్ధతిలో తీసుకుంటే ఎముకల బలహీనత, నరాల నీరసం, గుండె సమస్యలు మరియు జీర్ణకోశ సమస్యలకు స్వస్తి చెప్పి సంపూర్ణ ఆరోగ్యాన్ని సులభంగా సొంతం చేసుకోవచ్చు.     Ragi Sangati Health Benefits, Black Chickpeas Benefits Nalla Senagalu, Ragi Sangati and Kala Chana, South Indian Superfood Combo, Ragi Sangati Weight Loss Diabetes.
నేటి ఆధునిక కాలంలో మహిళలను అత్యంత వేగంగా మరియు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్ మొదటి వరుసలో నిలుస్తోంది. రొమ్ము క్యాన్సర్ అనగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది కేవలం రొమ్ములో ఏర్పడే గడ్డలు లేదా భరించలేని తీవ్రమైన నొప్పి మాత్రమే. అయితే వైద్య రంగంలో ఎంతగానో అవగాహన పెరుగుతున్నప్పటికీ, నేటికీ ఎంతోమంది మహిళలు కేవలం గడ్డలు, నొప్పి ఉంటేనే క్యాన్సర్ అని భావిస్తూ తీవ్రమైన పొరపాటు పడుతున్నారు. కానీ క్యాన్సర్ నిపుణులు మరియు ప్రముఖ వైద్యులు స్పష్టం చేస్తున్న విషయమేమిటంటే, రొమ్ము క్యాన్సర్ ప్రారంభ దశలో అసలు ఎటువంటి నొప్పిగానీ, ముట్టుకుంటే తెలిసే గడ్డలుగానీ ఉండాల్సిన అవసరం లేదు. ఎటువంటి శారీరక రుగ్మతలు లేకుండా మహిళలు చాలా ఆరోగ్యంగా ఉన్నారని భావించే సమయంలో కూడా లోపల క్యాన్సర్ కణాలు నిశ్శబ్దంగా విస్తరించే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి మహిళా తన శరీరంలో జరిగే సూక్ష్మమైన, నిశ్శబ్ద మార్పులను కూడా నిశితంగా గమనించడం అత్యంత ముఖ్యం. క్యాన్సర్ వ్యాప్తిని ప్రతిబింబించే ప్రధానమైన మరియు దాగి ఉన్న 5 దాగి ఉన్న హెచ్చరిక సంకేతాలను తెలుసుకోవడం ప్రాణరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. మొదటిది, చంక భాగంలో లేదా కాలర్ బోన్ (ఎముక) దగ్గర అకస్మాత్తుగా కనిపించే వాపులు లేదా గడ్డలు. రొమ్ము భాగంలో ఎటువంటి మార్పులు లేదా నొప్పి కనిపించకపోయినా, రొమ్ము క్యాన్సర్ కణాలు అత్యంత వేగంగా సమీపంలోని లింఫ్ నోడ్స్‌కు వ్యాపిస్తాయి. దీనివలన చంక భాగంలో చిన్నపాటి గడ్డలు లేదా వాపులు ఏర్పడతాయి. వీటిని సాధారణ అలసట లేదా చిన్న ఇన్ఫెక్షన్ అని నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం. రెండవది, రొమ్ము చర్మం యొక్క ఆకృతిలో వచ్చే మార్పులు. రొమ్ముపై ఉండే చర్మం ఒక్కసారిగా గుంటలు పడటం, చర్మం గరుకుగా మారడం, మందంగా అవ్వడం లేదా నారింజ పండు తొక్క రూపంలోకి మారడం క్యాన్సర్ తీవ్రతను సూచించే బలమైన సంకేతం. చర్మంలో వచ్చే ఈ విధమైన మార్పును మెడికల్ పరిభాషలో చాలా కీలకమైన హెచ్చరికగా భావిస్తారు. మూడవది, నిపుల్స్ అమరికలో వచ్చే అకస్మాత్తు మార్పులు. సహజంగా బయటకు కనిపించే నిపుల్స్ సడన్‌గా లోపలికి ముడుచుకుపోవడం లేదా వాటి రూపురేఖలు మారిపోవడం గమనిస్తే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి. నాల్గవ అత్యంత కీలకమైన సంకేతం, నిపుల్స్ నుండి అసాధారణంగా ద్రావణాలు విడుదల కావడం. ఎటువంటి ఒత్తిడి లేదా పిండటం లేకుండానే దానంతట అదే రక్తం, నీరు లేదా పసుపు రంగు స్రావాలు కారడం గమనిస్తే దీనిని ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు. ఐదవ సంకేతం, రొమ్ము పరిమాణం మరియు ఆకారంలో సడన్‌గా వచ్చే తేడాలు. సాధారణంగా రెండు రొమ్ములు పూర్తి స్థాయిలో ఒకేలా ఉండవు, అది సహజమే. కానీ హఠాత్తుగా ఒక రొమ్ము మాత్రమే అసాధారణంగా పెద్దదిగా మారడం, భరించలేని బరువుగా అనిపించడం లేదా వీడని వాపు రావడం జరిగితే ఖచ్చితంగా వైద్య పరీక్షలు అవసరం. చాలామంది మహిళలు నొప్పి ఉంటేనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలని అనుకుంటారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రాథమిక దశల్లో క్యాన్సర్ కణాలు నొప్పిని కలిగించవు. అందుకే ప్రతి మహిళ నెలకు కనీసం ఒకసారైనా ఇంట్లోనే స్వయం రొమ్ము పరీక్ష (సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్) చేసుకోవడం ద్వారా తమ రొమ్ముల సాధారణ ఆకారాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇంటర్నెట్‌లో అరకొర సమాచారం వెతికి భయాందోళనకు గురికాకుండా, ఏ చిన్న అనుమానాస్పద మార్పు కనిపించినా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి మమోగ్రామ్ లేదా స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ప్రాథమిక దశలోనే ముందస్తుగా గుర్తించడమే రొమ్ము క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకోవడానికి ఏకైక మార్గం.     Is Cancer Always Painful, Painless Cancer Symptoms Women, Early Cancer Warning Signs, Women Cancer Awareness Facts, Silent Cancer Symptoms.
ఉదయాన్నే  పరగడుపున టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. రోజును చురుగ్గా ప్రారంభించడానికి కాఫీ, టీ లు తాగుతూ ఉంటారు.  అయినప్పటికీ ఇవి శరీరంలో  అసిడిటీ, హార్మోన్ల అసమతుల్యత , ఇతర జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. వీటి స్థానంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుతూనే శరీరంలో ఉన్న అనారోగ్యాలను, జబ్బులను, ఇబ్బందులను తగ్గించగల పానీయం తాగడం చాలా మంచిది.  ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోవడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంతకీ అంత శక్తివంతమైన ఆ పానీయం ఏమిటో? దాన్ని ఎలా తయారుచేసుకుని తాగాలో.. వివరంగా తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. ధనియాలు,  జీలకర్ర,  సోంపు ,  వాము  పైన పేర్కొన్న దినుసులలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ​తయారీ విధానం... ఈ పానీయాన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని మరిగించాలి. అందులో అర టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు , పావు టీస్పూన్ వాము వేయాలి. ఈ మిశ్రమాన్ని నీరు సగం అయ్యేంత వరకు చిన్న మంటపై బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం లేదా అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం కాస్త నిమ్మరసం లేదా తేనె కూడా కలపవచ్చు. ఈ పానీయం తాగడం వల్ల శరీరానికి కలిగే  ఉపయోగాలు.. ​హార్మోన్ల సమతుల్యత.. మహిళల్లో ఎదురయ్యే థైరాయిడ్, పిసిఓడి , పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం  వంటి సమస్యలకు ఈ పానీయం చాలా మేలు చేస్తుంది. ధనియాలు , సోంపు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి. ​జీర్ణవ్యవస్థ మెరుగుదల.. జీలకర్ర , వాము జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ​రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ పానీయం సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయం.. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో జీలకర్ర , వాము కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ఈ పానీయం తాగడం ద్వారా శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ​చర్మ సౌందర్యం , డిటాక్సిఫికేషన్.. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఫలితంగా చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం సహజంగా మెరుస్తుంది. ​కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఈ పదార్థాల్లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు , వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ​ఈ డిటాక్స్ డ్రింక్‌ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున క్రమం తప్పకుండా తాగడం ద్వారా శరీరంలో సహజమైన మార్పులను గమనించవచ్చు. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా ఈ నేచురల్  పానీయాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా శరీరంలో చాలా మార్పులు గమనించవచ్చు.                       *రూపశ్రీ.
గొంతుకు, గడ్డానికి మధ్య భాగంలో , గడ్డానికి కింద చర్మం, కండర కణజాలం పెరిగి.. గొంతు, గడ్డం ఏకం అయినట్టు చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని డబుల్ చిన్ అని అంటారు. లావు పెరగడం వల్ల డబుల్ చిన్ వచ్చిందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే లావు ఎక్కువగా లేకపోయినా కొందరిలో డబుల్ చిన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే   డబుల్ చిన్ కు,  థైరాయిడ్ సమస్యలకు మధ్య ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయని  వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. డబుల్ చిన్ ఎందుకు, ఎలా వస్తుంది? థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేనప్పుడు శరీర జీవక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో బరువు వేగంగా పెరగడం, శరీరంలో నీరు చేరడం లేదా వాపులు రావడం సాధారణం. దీని ప్రభావం ముఖం , మెడ భాగాలపై స్పష్టంగా కనిపిస్తుంది. మెడ కింద కొవ్వు చేరడం లేదా ముఖం ఉబ్బినట్లు అవ్వడం వల్ల డబుల్ చిన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ సమస్య వల్ల మెడ ముందు భాగంలో ఉన్న గ్రంథి వాచి గాయిటర్ గా మారినప్పుడు కూడా గడ్డం కింద వాపు వచ్చి డబుల్ చిన్ లాగా కనిపించే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు డబుల్ చిన్ తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు , జీవనశైలి మార్పులు పాటించాలి..  థైరాయిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం.. థైరాయిడ్  లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల సలహా మేరకు సరైన మోతాదులో థైరాయిడ్ మందులు క్రమం తప్పకుండా వాడాలి. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు జీవక్రియ వేగవంతమై, అదనపు బరువు , వాపు తగ్గుతాయి.  పోషకాహార నియమం..  ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, మైదా , వేపుళ్లను పూర్తిగా తగ్గించాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు , తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరంలో సోడియం నిల్వలు ఎక్కువైతే నీరు చేరే అవకాశం ఉంది కాబట్టి ఉప్పు చాలా పరిమితంగా తినాలి. నీరు..  ప్రతిరోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. నీరు బాగా తాగితే ముఖం , మెడ భాగంలో నీరు చేరడం తగ్గి వాపు తగ్గుతుంది.  వ్యాయామం.. కేవలం మెడ భాగంలోనే కాకుండా శరీరం మొత్తానికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి. రోజూ క్రమం తప్పకుండా నడక, యోగా లేదా కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరిగి బరువు తగ్గుతారు. దీనితో పాటు మెడ , గడ్డం కండరాలను బలోపేతం చేసే చిన్న చిన్న ముఖ వ్యాయామాలు చేయవచ్చు. ఈ ఫేస్ వ్యాయామాలు మెడ వద్ద ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడానికి తోడ్పడతాయి.  నిద్ర , ఒత్తిడి..  రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్రలేమి , మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ప్రాణాయామం వంటివి పాటించాలి. పైన చెప్పుకున్న విధంగా థైరాయిడ్ కు సరైన వైద్యం పొందుతూ, ఆరోగ్యకరమైన ఆహారం , రోజువారీ వ్యాయామం అలవాటు చేసుకుంటే డబుల్ చిన్ సమస్య నుండి క్రమంగా బయట పడవచ్చు.                                                                                                                                     *రూపశ్రీ.
తలనొప్పి వచ్చిందంటే చాలు.. చాలామంది వెంటనే మెడికల్ షాప్‌‌కి వెళ్లి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తెచ్చుకుని  మింగేస్తుంటారు. కానీ, తరచూ మాత్రలు వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎటువంటి టాబ్లెట్ వాడకుండానే ఇంట్లోనే చాలా తేలిగ్గా, సహజ పద్ధతుల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. ​మనం చేసే చిన్న చిన్న పనులు,  ఆక్యుప్రెషర్ పద్ధతులు తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. టాబ్లెట్ అక్కర్లేకుండానే తలనొప్పి తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుంటే.. LI4 పాయింట్.. ​మన బొటనవేలు, చూపుడు వేలు కలిసే మధ్య భాగంను LI4 పాయింట్ అంటారు. ఈ భాగంలో  మరొక చేతి వేళ్లతో మెల్లగా నొక్కి పట్టి, వృత్తాకారంలో మసాజ్ చేయడం వల్ల తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ పాయింట్‌ను కొన్ని నిమిషాల పాటు నొక్కడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. యాంగ్ టాంగ్ పాయింట్.. ​నుదురు, కనుబొమ్మల మధ్య భాగం, రెంటి మధ్య పాయింట్  ను యాంగ్ టాంగ్ పాయింట్అంటారు. ఈ పాయింట్ వద్ద చూపుడు వేలితో కాసేపు సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, తలనొప్పి క్రమంగా తగ్గుతుంది. నీరు.. ​శరీరంలో నీటి శాతం తగ్గడం (డీహైడ్రేషన్) వల్ల కూడా చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి తలనొప్పిగా అనిపించిన వెంటనే ఒక పెద్ద గ్లాసు నీళ్లు లేదా నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాంప్రెస్.. ​తలనొప్పిగా ఉన్నప్పుడు చల్లని లేదా వేడి కాంప్రెస్ ఉపయోగించడం చాలా మంచిది. ఐస్ క్యూబ్స్‌ను ఒక గుడ్డలో చుట్టి నుదుటిపై లేదా మెడ వెనుక భాగంలో ఉంచడం వల్ల, లేదా వేడి నీటిలో ముంచిన తువ్వాలును ఉంచడం వల్ల రక్తనాళాలు విశ్రాంతి పొంది నొప్పులు తగ్గుతాయి. ఆయిల్స్.. పుదీనా నూనె లేదా ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కొద్దిగా తీసుకుని నుదుటిపై రాసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల లేదా వాటి సువాసన పీల్చడం వల్ల తలనొప్పి, ఒత్తిడి త్వరగా దూరం అవుతాయి. అధిక వెలుతురు, స్క్రీన్ల వెలుతురు వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి కాసేపు లైట్లు ఆర్పివేసి ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో కళ్లు మూసుకుని పడుకోవడం మంచిది. ఈ చిన్న చిన్న సహజ చిట్కాలను పాటించడం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా, టాబ్లెట్ మింగే అవసరం లేకుండా తలనొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు.                      *రూపశ్రీ.