LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ బాయ్ కాట్ నిర్ణయంపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ జరుగుతోంది. డిస్ క్వాలిఫై చేయాలి. జీత భత్యాలు నిలిపివేయాలి  అంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లను పక్కన పెట్టినా.. జగన్ శైలి, తీరు పట్ల పొలిటికల్ సర్కిల్స్ లో హా పెద్ద ఎత్తున జరుగుతోంది.  అసెంబ్లీ వేదికగా  ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన వైసీపీ..   ప్రతిపక్ష హోదా అంటూ సభా సమావేశాలను బాయ్ కాట్ చేయడం.. యుద్ధ రంగంలోకి దిగకుండా నాలుగు గోడల మధ్యా కూర్చుని తొడగొడుతున్న చందంగా ఉందని పరిశీలకులు అంటున్నారు. యుద్ధ భూమిలో వెన్ను చూపడం ఎలాంటిదో.. రాజకీయ సమరంలో ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీకి గైర్హాజరు కావడం కూడా అలాంటిదేనని పరిశీలకులు అంటున్నారు.    ప్రజలు ఇవ్వని11 మంది ఎమ్మెల్యేలతో విపక్ష హోదా అన్నది నిబంధనల ప్రకారం అవకాశం లేదు. ఆ సంగతి తెలిసికూడా ప్రతిపక్ష హోదా  కోసం మంకుపట్టు పడుతూ సభా సమావేశాలకు దూరంగా ఉండటం ఆయన పరిణితి లేమికి, పలాయనవాదానికీ నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇదే ఆయనలోని నాయకత్వసమర్థతపై కూడా సందేహాలకు తావిస్తోందంటున్నారు.   చట్టసభ వేదికగా ప్రజల సమస్యలను వినిపించడం, ప్రభుత్వ పథకాలు, విధానాలలో ఉన్న లోపాలను ఎండగట్టాల్సిన ఆయన.. ప్రతిపక్ష హోదా కోసం సభా బహిష్కరణకు నిర్ణయించుకోవడం సమజసం కాదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది.  నియమ నిబంధనల ప్రకారం అసెంబ్లీలో మొత్తం స్థానాలలో కనీసం పది శాతం సభ్యుల బలం ఉన్న పార్టీకే అధికారికంగా ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది. 2024   అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో.. ఏ రకంగా చూసినా, ఆయన ఎంతగా పట్టుబట్టినా ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఇసుమంతైనా లేదు. ఐదేళ్లు రాష్ట్రానికి సీఎంగా పని చేసిన జగన్ కు ఆ విషయం తెలియని భావించలేం. ఒక వేళ విపక్ష హోదా లేకపోయినా.. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా అయినా సభకు హాజరై నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించాలి. తనను నమ్మి గెలిపించిన పులివెందుల ప్రజల పట్ల ఆ మాత్రమైనా బాధ్యత వహించాలి.   పులివెందుల నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా, వైసీపీ  అధినేతగా జగన్ సభకు హాజరై  ప్రభుత్వాన్ని నిలదీయడం మాని తనకు వీలున్నప్పుడు, వీలైనప్పుడు మాత్రమే బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి మీడియాకు ముఖం చూపించి తన పని ఇంతే అన్నట్లు వ్యవహరించడంపై పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది.   అసెంబ్లీకి దూరంగా ఉంటూ  తాడేపల్లి ప్యాలెస్ లో  మీడియా సమావేశాలకు పరిమితమై,  ఆ ప్రెస్ మీట్ లలో కూడా రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదివేసి అంతేనని చుతులు దులుపుకుపోతున్న జనగ్ తీరు పట్ట వైసీపీ క్యాడర్ లో సైతం అసంతృప్తి వ్యక్తమౌతోంది.   ప్రభుత్వ నిర్ణయాలను సభలో నిలదీస్తే వచ్చె ఎఫెక్ట్ ప్రోస్ మీట్ లో ప్రసంగాల వల్ల రాదని పరిశీలకులు అంటున్నారు.    శాసనమండలిలో వైసీపీకి  సంఖ్యాబలం ఉన్నందున, అక్కడ గట్టిగా పోరాటం చేయాలని జగన్ తన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు సరే.. కానీ  , అసెంబ్లీలో స్వయంగా పార్టీ అధినేత జగన్ పోరాడకుండా ప్యాలెస్ కే పరిమితం అవ్వడం పార్టీ శ్రేణులకే కాదు ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలే ఇస్తున్నాయి.   ఇక పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నిలుపుకోవాలనుకునే నాయుడు ప్రజా పోరాటాల్లో వారిని ముందుండి నడిపించాలే కానీ, పిలుపు ఇచ్చాను చాలదా అన్న తీరున వ్యవహరిస్తే... పార్టీ శ్రేణులు డీలా పడతాయనీ, కంచె చేను సామెత చెప్పినట్లు తాడేపల్లి ప్యాలస్ నుంచే  పార్టీని నడిపిస్తానంటే.. ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ కూడా కడపదాటకుండానే  మమ అనిపించేస్తారని అంటున్నారు.   AP Assembly Sessions, YS Jagan Mohan Reddy Assembly Boycott, Chandrababu Naidu Leadership, AP Political News Telugu, Opposition Status Issue AP
 ఏపీ రాజధాని అమరావతికి అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురువారం (ఆగస్టు 13) ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాజధాని రాకపోకలకు, రవాణా వ్యవస్థకు వెన్నుముక అయిన ఈ  సీడ్ యాక్సెస్ రోడ్డు విషయంలో  ఒకచోట ఉన్న ఎస్ ఆకారంలోని కర్వ్ పై విమర్శలు వస్తున్నాయి. దీనిపై వివరణ ఇచ్చింది. అత్యంత కీలకమైన #యాక్సెస్ రోడ్డులో ఎస్ కర్వ్ ఏంటంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున విమర్శల దాడికి దిగింది.   ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ,  ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.   ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిజానిజాలతో వివరణ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.  రాజధాని మాస్టర్ ప్లాన్, భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకునే ఈ డిజైన్ రూపొందించినట్లు స్పష్టం చేసింది. సీడ్ యాక్సెస్ రోడ్డు మూడో విడత విస్తరణలో భాగంగా #మణిపాల్ హాస్పిటల్ సమీపంలో విజయవాడ, చెన్నై జాతీయ రహదారికి ఈ రోడ్డును అనుసంధానించేందుకు ఒక  కారిడార్‌ ఏర్పాటు కానుందనీ,  భవిష్యత్తులో రాబోయే ఈ కారిడార్ అవసరాలు, భూభౌగోళిక పరిస్థితులు, వాహనాల రద్దీ నిర్వహణను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.  అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాథమిక లక్ష్యం రాజధాని నగరానికి మంగళగిరి, విజయవాడ ప్రాంతాలతో సులువైన అనుసంధానాన్ని కల్పించడమేనని స్పష్టం చేసిన ప్రభుత్వం..  కరకట్ట రహదారిపై రోజురోజుకూ పెరుగుతున్న  వాహనాల రద్దీని తగ్గించడం కూడా ఈ ప్రాజెక్టు   ఉద్దేశమని వెల్లడించింది. రాబోయే దశాబ్దాల రవాణా అవసరాలను తీర్చడానికి తగిన భద్రతా ప్రమాణాలు పాటించి  డిజైన్  చేశామనీ,  అందువల్ల సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉన్న #ఎస్ కర్వ్  మలుపులను   రాజకీయ కోణంలో కాకుండా..  భవిష్యత్ ట్రాఫిక్ కనెక్టివిటీ, మాస్టర్ ప్లాన్ విస్తరణలో భాగంగానే  చూడాలని ఆ ప్రకటనలో పేర్కొంది.  Amaravati Seed Access Road, S Curve, Chandrababu Naidu, CMCBN,  Government, Clarification, Capital Connectivity 
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో  కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (ఆగస్టు 13) ప్రారంభించారు. ఈ సందర్భంగా  అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస గృహాల తాళం చెవులను సీఆర్డీఏ  అధికారులు సీఎంకు అధికారికంగా అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలు అమరావతి పునర్నిర్మాణంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే.. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కీలక  ఈవెంట్‌లోనూ ముందు వరుసలో ఉండే  ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.   భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాల్సి వస్తే ఆప్షన్లు తెరిచి ఉంచుకోవడానికే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా అమరావతి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటై వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున పోస్టులు షేర్ చేయడం ప్రారంభించింది.   ఈ నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణాలు ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ను రాష్ట్ర మంత్రి నారాయణ స్వయంగా మంగళగిరిలోని  ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్లి మరీ ఆహ్వానించారు.   అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవం రోజునే.. పవన్ కల్యాణ్ కు అంతకు ముందే నిర్ణయమైన పర్యటన ఖారరై ఉండటంతో రావడం లేదని పొంగూరు నారాయణకు పవన్ కల్యాణ్ చెప్పారు.   ఆగస్టు 12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించే వేడుకలలో పాల్గొనేందుకు ముందుగానే షెడ్యూల్ ఖరారైంది. అటవీ శాఖ మంత్రిగా పవన్ ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఈ కాకర్యక్రమానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ నుంచి వస్తుండటంతో..పవన్ తన పర్యటన రద్దు చేసుకోలేకపోయారు.   కేంద్ర మంత్రిని తాను స్వయంగా ఆహ్వానించాననీ, అందుకే తప్పని సరిగా హాజరుకావాలని పవన్ ఈ సందర్భంగా మంత్రి నారాయణకు వింరించారు. అంటే ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉండటం వల్లనే పవన్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.  సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రత్యేకంగా ప్రశంసించి అమరావతి నిర్మాణంలో ఆయన పాత్రను ప్రశంసించారు. దీనిని బట్టి  తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇద్దరు అగ్రనేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ప్రభుత్వ నిర్వహణ  సమన్వయంతో సాగుతోందని తేటతెల్లమైంది. తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు ఏర్పడి ఇరు పార్టీలూ విడిపోతే తప్ప రాజకీయంగా తమ మనుగడ కష్టమన్న భావనతోనే వైసీపీ ఇలా లేని విషయాలను కూడా వివాదాస్పదం చేస్తూ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   Pawan Kalyan Amaravati event, Seed Access Road Amaravati, Chandrababu Naidu, Narayana Minister, World Elephant Day Visakhapatnam, TDP Janasena Alliance
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఫస్ట్రేషన్ లో ఉన్నారా? ఆ కారణంగానే కుల రాజకీయాలకు తెరలేపి రాజకీయ లబ్ఢి పాందాలని ప్రయత్నిస్తున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో ప్రగతి పరుగులు తీస్తుండటం, మెగా డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ తన పిలుపు మేరకు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు ప్రజల నుంచి స్పందన కరవవ్వడంతో జగన్ లో  ఫస్ల్రేషన్ పీక్స్ కు చేరిందని అంటున్నారు. అందుకే ఆయన కుల రాజకీయాలకు తెరలేపి లబ్థి కోసం అర్రులు చాస్తున్నారని చెబుతున్నారు. అయితే.. ఆయన  వ్యూహాలు, వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ముఖ్యంగా గతంలో తాను అధికారంలో ఉన్న సమయంలో  వైసీపీకి చెందిన కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆరోపణలు, అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. స్వయంగా జగన్ పైనే మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు అన్న ఆరోపణలు ఉన్నాయి.  2024 ఎన్నికలలో విజయం సాధించి చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం కూటమి  అధికారంలోకి వచ్చిన తర్వాత.. చట్టబద్ధమైన చర్యల్లో భాగంగా పోలీసులు జగన్ హయాంలో అక్రమాలు, అవినీతికి పాల్పడిన కేసుల వచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో అరెస్టులు జరుగుతున్నాయి. అయితే ఈ అరెస్టులు, న్యాయపరమైన చర్యలు జగన్ లో అసహనాన్ని పెంచుతున్నాయని అంటున్నారు.   పార్టీ నేతలకు మద్దతుగా మాట్లాడే క్రమంలో జగన్ హద్దు మీరుతున్నారన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.  నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి అరెస్టుల విషయంలో జగన్ కుల రాజకీయాలకు తెరలేపుతున్నారంటున్నారు.   తాజాగా కర్నూలు జిల్లా జైలులో  రిమాండ్‌ ఖైదీగా  ఉన్న వైసీపీ నేత  విరూపాక్షిని జగన్ పరామర్శించారు. తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో జగన్ కర్నాలు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విరూపాక్షను ములాఖత్  ద్వారా కలిసి పరామర్శించారు.  అనంతరం జైలు బయట  జగన్ మీడియా సమావేశంలో  చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బలహీన వర్గాలను, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను అణచివేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా  బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు.  నేరాలకు పాల్పడిన వారు అరెస్టైతే.. కులం పేరెత్తడమేంటని నెటిజనులు జగన్ వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.  వీడియో ఆధారాలతో సహా ప్రత్యక్షంగా నేరానికి పాల్పడినట్లు  కనిపించిన సంఘటనల్లో నేరస్థులను వెనకేసుకు రావడానికి కులం కార్డు ఉపయోగించడం సరి కాదని విమర్శిస్తున్నారు.  ఒక వ్యక్తి  నేరం చేశాడా లేదా అనేదే చట్టం ముందు ముఖ్యమని,  కులాన్ని ఆధారం చేసుకుని నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా నిలవడం సరి కాదనీ అంటున్నారు. . గతంలో వైకాపా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విషయంలో కూడా జగన్ ఇదే తీరున వ్యవహరించిన సంగతి గుర్తు చేస్తున్నారు.    Kurnool Jail, Virupakshi, Seediri Appalaraju, Andhra Pradesh politics, NDA government, TeluguOne News, Jagan casterelated remarks
  కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం, అవినీతిరహిత పాలనను అందిస్తామనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లో కల్పించినప్పటికీ, రక్షణ రంగ ఒప్పందాలైన రఫేల్ కొనుగోళ్లలో రూ. 650 కోట్ల అంచనాల మార్పులు, సాంకేతిక పరిజ్ఞానం నవీకరణలు  అధిక వ్యయాల విషయంలో పలు విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. మరొకవైపు ఉత్తర భారతదేశంలో అయోధ్య రామమందిర నిర్మాణం ఒక గొప్ప భావోద్వేగపూరిత అంశంగా మారగా, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి మరిన్ని అంశాలపై వాస్తవ వేదిక' కార్యక్రమంలో  'జమీన్ రైతు' ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్  తెలుగువన్ ఎం.డి కంఠమనేని రవిశంకర్ మధ్య జరిగిన ఆసక్తికర చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే, వైఎస్సార్ సీపీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయం, రైతాంగ సమస్యలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలపై తనదైన అవగాహనతో ప్రత్యేక రాజకీయ వైఖరిని కనబరిచారు. మరోవైపు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  నారా లోకేష్‌లతో కూడిన నాయకత్వం వర్తమాన పాలనాపరమైన, నాయకత్వ సమీకరణల్లో తీవ్రమైన పోటీని, సరికొత్త రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటోంది. వ్యూహాలు  పరిణామాలుప్రస్తుత రాజకీయంలో ప్రతి ప్రధాన పార్టీ కూడా ఒక నిర్దిష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. జాతీయ స్థాయిలో బిజెపి ప్రభుత్వం భద్రత, జాతీయతా భావాలు  సెంటిమెంట్ ఆధారంగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలు, ఆర్థిక లోపాలు, కుంభకోణాల ఆరోపణలను ఎత్తిచూపుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, వైఎస్ జగన్ వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ ప్రజల సంక్షేమాన్ని తన ప్రధాన రాజకీయ వ్యూహంగా మలుచుకునే క్రమంలో అడుగులు వేశారు. మరోవైపు, టీడీపీ గతంలో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) కాలంలో ఉన్నటువంటి విప్లవాత్మకమైన ప్రజాదరణ  పాలనా శైలిని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, నేటి మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో ఎన్టీఆర్ కాలం నాటి శైలిని మళ్లీ తీసుకురావడం దాదాపు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాలనలో ముఖ్యమంత్రి కార్యాలయం మరియు ఐఏఎస్ అధికారుల ప్రాబల్యం పెరగడం, నిర్ణయాధికారాల కేంద్రీకరణ వంటివి క్షేత్రస్థాయి నాయకత్వంలో అసంతృప్తికి కారణమవుతున్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావందీర్ఘకాలికంగా ఈ రాజకీయ వ్యూహాలు మరియు విమర్శలు రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. టీడీపీ తమ సంప్రదాయ రాజకీయ శైలి నుండి మారకపోతే భవిష్యత్తులో గందరగోళ పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్‌లు తమ వ్యూహాత్మక విధానాలు, పాలనాపరమైన నిర్ణయాల్లో జరిగిన లోపాలను గ్రహించే సమయానికి రాజకీయ చిత్రం చేజారిపోవచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి.  ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయ నమూనా నేటి ఆధునిక డిజిటల్ యుగంలో పనిచేయదని, వర్తమాన సమాజపు ఆర్థిక, సామాజిక అవసరాలకు తగినట్లుగా పరివర్తన చెందకపోతే రాజకీయ మనుగడ కష్టమవుతుందని స్పష్టమవుతోంది. అదే సమయంలో, జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వంపై వచ్చే విమర్శలు ప్రజాభిప్రాయాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తాయో మున్ముందు తేలనుంది. మొత్తానికి, ఈ సమీకరణలు భవిష్యత్తులో సరికొత్త రాజకీయ ఆవిర్భావాలకు  బలాల మార్పునకు నాంది పలుకుతాయి.   Vasthava Vedika, AP Politics, Kantamaneni Ravi Shankar, Dolendra Prasad, 2029 Elections, Tone News
ALSO ON TELUGUONE N E W S
విక్టరీ వెంకటేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి విజయవంతంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1986 ఆగష్టు 14న విడుదలైన 'కలియుగ పాండవులు' సినిమాతో మొదలైన ఆయన నట ప్రస్థానం.. నేటికీ అదే ఎనర్జీతో, అదే చార్మ్‌తో దిగ్విజయంగా కొనసాగుతోంది. నాలుగు పదుల ఈ సినీ ప్రయాణంలో ఆయన సాధించిన విజయాలు, నమోదు చేసిన రికార్డులు సాధారణమైనవి కావు. మరి వెంకటేష్ ని టాలీవుడ్ 'విక్టరీ హీరో'గా నిలబెట్టిన ఆ మైలురాళ్లు ఏంటి? ఆయన ప్రయాణంలోని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. వెంకటేష్ కెరీర్ ప్రారంభించిన కొత్తలోనే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్‌ని క్రియేట్ చేసుకున్నారు. 'కలియుగ పాండవులు'తో పవర్‌ఫుల్ డెబ్యూ ఇచ్చిన వెంకీ.. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. 'బొబ్బిలి రాజా' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ సృష్టిస్తే.. 'చంటి' సినిమాతో కలెక్షన్ల సునామీ అంటే ఏంటో ఇండస్ట్రీకి చూపించారు. నాటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి, గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రాలకు ఒక కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేశారు. వెంకటేష్ అసలైన బలం.. ఫ్యామిలీ ఆడియన్స్. ఒక ఇంట్లోని అమ్మ, నాన్న, అక్క, చెల్లి.. ఇలా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ థియేటర్‌కి వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకోవాలన్నా, ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వాలన్నా వెంకటేష్ సినిమా ఉండాల్సిందే. 'పవిత్ర బంధం', 'రాజా', 'సూర్యవంశం', 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే'.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరీర్‌లో ప్రతి ఒక్క సినిమా ఒక క్లాసిక్. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి సినిమాలు ఈరోజు టీవీలో వస్తే ఇప్పటికీ రిమోట్ పక్కన పెట్టేసి నవ్వుకునే ప్రేక్షకులు లక్షల్లో ఉంటారంటే ఆశ్చర్యం లేదు. వెంకటేష్ ని ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలబెట్టిన మరొక పాయింట్ ఏంటనే.. ఆయన ప్రయోగాత్మక వైఖరి, మల్టీస్టారర్ సినిమాలు. ఇమేజ్ చట్రంలో చిక్కుకుపోకుండా కొత్త తరం నటులతో కలిసి నటించడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో టాలీవుడ్‌లో మళ్లీ మల్టీస్టారర్ సంస్కృతికి ప్రాణం పోసింది ఆయనే. ఆ తర్వాత 'గోపాల గోపాల', 'ఎఫ్ 2', 'వెంకీ మామ' లాంటి చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేశారు. ఇక నటనలో ఆయన వైవిధ్యానికి 'ధర్మచక్రం', 'గణేష్', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే', 'దృశ్యం' లాంటి సినిమాలు నిలువెత్తు నిదర్శనం. యాక్షన్, డ్రామా, థ్రిల్లర్, కామెడీ.. ఎలిమెంట్ ఏదైనా సరే వెంకీ మామ స్క్రీన్ మీద కనిపిస్తే ప్రేక్షకుడు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాల్సిందే. వివాదాలకు దూరంగా, ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో, తోటి నటులను ప్రోత్సహిస్తూ వెంకటేష్ చూపించిన మార్గం వర్తమాన హీరోలకు ఒక నిదర్శనం.       Victory Venkatesh, 40 Years, Kaliyuga Pandavulu, Telugu Cinema, Tollywood  
చార్మింగ్ స్టార్ శర్వానంద్, వింటేజ్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్‌లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'జార్జ్ క్రిష్' ఈరోజే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీను వైట్ల అంటేనే మనకు గుర్తొచ్చేవి మైండ్ బ్లోయింగ్ పంచ్ డైలాగ్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఈ సినిమాకి కూడా సీనియర్ రైటర్ గోపీమోహన్, నందు సవిరిగాన తమ పవర్‌ఫుల్ అండ్ హిలేరియస్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. కే.వి. గుహన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా అవినాష్ కొల్లా, ఎడిటర్‌గా అమర్ రెడ్డి తమ మ్యాజిక్‌ని చూపించబోతున్నారు.  సంక్రాంతి రేసులో శర్వానంద్‌కి ఎంతటి ఘనమైన రికార్డు ఉందో తెలిసిందే. సరైన కామెడీ, ఎమోషన్స్ కుదిరితే సంక్రాంతి విన్నర్‌గా నిలవడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అలాంటిది శ్రీను వైట్ల డైరెక్షన్ తోడైతే థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయడం ఖాయం.  ఒకప్పుడు ఎన్నో ఎవర్గ్రీన్ కామెడీ ఫిలిమ్స్ ని అందించిన శ్రీను వైట్ల.. సంక్రాంతి హీరో శర్వానంద్ తో వచ్చి, సాలిడ్ కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి.  https://x.com/AKentsOfficial/status/2088162162682609772       Sharwanand, Sreenu Vaitla, George Krish, Movie Launch, AK Entertainments  
ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కృంగి పోకుండా.. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చి, టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలి. అలాగే కమ్ బ్యాక్ ఇవ్వగానే రిలాక్స్ అవ్వకుండా, ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలి. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి జర్నీ సరిగ్గా ఇలాగే ఉంది. యాక్టర్ గా, రైటర్ గా తన సినీ జర్నీ స్టార్ట్ చేసిన వెంకీ అట్లూరి.. 2018లో వచ్చిన 'తొలి ప్రేమ'తో డైరెక్టర్ గా పరిచయమయ్యారు. రైటర్ గా, డైరెక్టర్ గా ఇంప్రెస్ చేయడమే కాకుండా.. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించడంతో.. అందరి దృష్టి వెంకీపై పడింది.  అయితే ఆ తర్వాత ఆయన డైరెక్షన్ లో వచ్చిన 'మిస్టర్ మజ్ను', 'రంగ్ దే' సినిమాలు బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. దాంతో ఇక వెంకీ అట్లూరి పని అయిపోయిందనే కామెంట్స్ వినిపించాయి. ఒకే తరహా సినిమాలు చేస్తున్నాడే ట్రోల్స్ కూడా వచ్చాయి. వాటన్నింటికీ చెక్ పెడుతూ.. అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు వెంకీ. 'రంగ్ దే' ఫెయిల్యూర్ తర్వాత కూడా.. ఆ సినిమాను నిర్మించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్.. వెంకీ టాలెంట్ ని నమ్మి మరో ఛాన్స్ ఇచ్చింది. అలా వచ్చిన సినిమానే 'సార్'. వెంకీ అట్లూరి ఎంచుకున్న పాయింట్, రైటింగ్, డైరెక్షన్ మెప్పించాయి. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా, కమర్షియల్ సక్సెస్ సాధించింది.  ఇక ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన 'లక్కీ భాస్కర్' మూవీ ఒక వండర్ అని చెప్పొచ్చు. ఆయన రైటింగ్, డైరెక్షన్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా.. వెంకీకి బెస్ట్ డైలాగ్ రైటర్ గా నేషనల్ అవార్డు తెచ్చి పెట్టింది. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన 'విశ్వనాథ్ & సన్స్' మూవీ థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో నుంచే ఈ సినిమా ప్రశంసలు అందుకుంటోంది. వెంకీ ఎంచుకున్న సెన్సిటివ్ పాయింట్ కి, దానిని ఆయన డీల్ చేసిన విధానానికి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ముఖ్యంగా వెంకీ రైటింగ్ పై ప్రశంసల వర్షం వర్షం కురిపిస్తోంది. ఎమోషనల్ సీన్స్ బాగా రాసుకున్నారని, అందునా డైలాగ్స్ లో డెప్త్ కట్టిపడేసిందని అంటున్నారు.  సినిమా సినిమాకి తన రైటింగ్ టాలెంట్ ని మరింత మెరుగుపరుచుకుంటూ వరుస సక్సెస్ లు కొడుతున్న వెంకీ అట్లూరి.. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ గా మారిపోయారు.       Venky Atluri, Vishwanath And Sons, Suriya, Mamitha Baiju  
అన్ష్ త్రోరాట్, వాసవి గణేషన్ జంటగా బిక్షు యాదవ్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా 'హుషార్ పిట్టలు' ప్రీమియర్స్ పూర్తయ్యాయి. సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ ఫిల్మ్స్ లాంటి బడా డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ చేస్తున్న ఈ చిన్న సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. అదే సమయంలో ఒక అడల్ట్ కామెడీ ఫిల్మ్ అనే అభిప్రాయాన్ని కలిగించింది. మరి ఈ సినిమా కేవలం అడల్ట్ కంటెంట్‌కే పరిమితమైందా? లేక టీనేజర్స్, తల్లిదండ్రులు చూడాల్సిన ఒక పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చిందా? ఈ సినిమా కథ విషయానికి వస్తే... ఒక పల్లెటూర్లో ఉండే ఇద్దరు టీనేజర్స్.. ఆకర్షణ, పరిపక్వత లేని వయసులో శారీరక హద్దులు దాటేస్తారు. ఈ విషయం ఊర్లో బయటపడటం, దాని వల్ల తల్లిదండ్రులు పడే వేదన, ఆ తర్వాత ఆ టీనేజర్స్ తీసుకునే నిర్ణయాలు ఏంటి అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. మొదటి షో చూసిన ఆడియన్స్ ట్విట్టర్‌లో ఏమంటున్నారంటే.. యూత్‌ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ అంటున్నారు. అడల్ట్ కామెడీ ఉన్నప్పటికీ, ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫన్ అండ్ లవ్ ట్రాక్ వర్కవుట్ అయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి సినిమా రూపురేఖలు మారిపోతాయి. ఆకర్షణలో పడి తప్పుడు దారిలో వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, పరువు కోసం తండ్రి పడే ఆవేదన ఏంటి అనేది చాలా ఎమోషనల్ గా చూపించారు. దర్శకుడు బిక్షు యాదవ్ ఎంచుకున్న కథాంశం చాలా రియలిస్టిక్ గా ఉందని, కేవలం యూత్ మాత్రమే కాదు.. తల్లిదండ్రులు కూడా చూడాల్సిన సినిమా అని ట్విట్టర్ లో ప్రశంసిస్తున్నారు. టీనేజ్ లో పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి? ఆ వయసులో వేసే తప్పటడుగులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? వంటి అంశాలను ఇందులో చూపించారు. నటీనటుల విషయానికి వస్తే.. అన్ష్, వాసవి గణేషన్ కొత్తవారైనా సరే చాలా నాచురల్ గా నటించారు. ఎమోషనల్ సీన్స్‌లో వారి పర్‌ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. సపోర్టింగ్ రోల్స్ చేసిన అంజి వల్గుమాన్, సునీతా మనోహర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే.. చరణ్ అర్జున్ అందించిన సంగీతం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌కి సరిగ్గా సెట్ అయింది. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ సినిమాని ఎక్కడా బోర్ కొట్టకుండా క్రిస్ప్‌గా ఉంచింది. ట్విట్టర్ టాక్ ప్రకారం.. ప్రారంభంలో కాస్త అడల్ట్ హ్యూమర్ ఉన్నప్పటికీ, ఓవరాల్‌గా 'హుషార్ పిట్టలు' ఒక ఎమోషనల్ అండ్ మెసేజ్ ఒరియంటెడ్ యూత్‌ఫుల్ డ్రామా.        Hushar Pittalu Review, Ansh Thorat, Vasavi Ganeshan, Bikshu Director  
నటీనటులు: సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, సునీల్ రెడ్డి, భవానీ శ్రీ   సాంకేతిక వర్గం: సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్ ఎడిటింగ్: నవీన్ నూలి రచన - దర్శకత్వం: వెంకీ అట్లూరి నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య   సౌత్ సినిమాలో సూర్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కరుప్పు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూర్య, ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించారు. 'లక్కీ భాస్కర్' వంటి సూపర్ హిట్ తర్వాత వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కించిన చిత్రం కావడంతో విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు వివరంగా చూద్దాం.   కథ: తన తల్లి (Radhikaa) కోరికను నెరవేర్చడం కోసం సంజయ్ విశ్వనాథ్ (Suriya) ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తాడు. తల్లి పెళ్లి చేసుకోమని ఎంత ఒత్తిడి చేస్తున్నా, అతనికి వివాహ బంధంపై ఆసక్తి ఉండదు. దీంతో సరోగసీ ద్వారా తండ్రి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ సరోగసీకి మ్యాడీ జె (Mamitha Baiju) అనే యువతి అంగీకరిస్తుంది. మెడికల్ స్టూడెంట్ అయిన మ్యాడీ తన చదువు ఫీజుల కోసమే ఈ సరోగసీకి ఒప్పుకుంటుంది. అయితే, మొదట్లో వీరు కలుసుకోరు. కానీ సరోగసీ ద్వారా పుట్టిన కొడుకు అభయ్‌కి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం కావడంతో, సంజయ్ మ్యాడీని కలుస్తాడు. ఆమెను తన ఇంటికి తీసుకురాగా, మ్యాడీ ఆ కుటుంబంతో ఎంతో కలిసిపోతుంది. తన కొడుకు కంటే కూడా సంజయ్‌కి ఎక్కువ దగ్గరవుతుంది. కానీ, తన తండ్రి (Rajeev Menon) మరో నటిని (Raveena Tandon) రెండో పెళ్లి చేసుకోవడం వల్ల ఏర్పడిన చిన్ననాటి చేదు జ్ఞాపకాలు (trauma) సంజయ్‌ని వెంటాడుతూ ఉంటాయి. దీంతో అతను మ్యాడీకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాడు. మరి సంజయ్ ఆ గతం నుంచి బయటపడి, వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ మ్యాడీని అంగీకరించాడా? లేదా? అన్నది మిగిలిన కథ.   విశ్లేషణ: భావోద్వేగాలను పండించడంలో సూర్య తనదైన అద్భుత నటన కనబరిచాడు. అతని ఛార్మ్, స్టైలిష్ లుక్ సినిమాను ముందుండి నడిపించాయి. మమితా బైజు నటనలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించింది. సినిమాలో ఆమె పాత్ర ఎంతో ఎనర్జిటిక్ గా సాగుతుంది. రాధిక, రవీనా టాండన్‌లకు చాలా సహజమైన తల్లి పాత్రలు దక్కాయి. వారి నటన మనసుకు హత్తుకుంటుంది. సునీల్ రెడ్డి తన పరిధి మేరకు మెప్పించాడు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు డీసెంట్‌గా సరిపోయింది. తన నేపథ్య సంగీతంతో కీలక సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాడు. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి, సాంకేతిక అంశాలు కథను మరింత అందంగా తీర్చిదిద్దాయి. ఓ ఎమోషనల్ డ్రామాను రూపొందించడంలో రచయితగా వెంకీ అట్లూరి తన బెస్ట్ ఇచ్చారు. ఆయన రాసిన డైలాగులు చాలా అద్భుతంగా ఉండి, భావోద్వేగాలను మరింత పెంచాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే సంభాషణలు ప్రేక్షకుడిని ప్రతి ఎమోషన్‌తో కనెక్ట్ చేస్తాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా రాసుకున్న సన్నివేశాలు, డైలాగులు సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. దర్శకుడిగా వెంకీ ఒక సేఫ్ టెంప్లేట్‌ను ఎంచుకున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల నెమ్మదించినట్లు అనిపిస్తుంది. ఎమోషన్స్ అన్నీ సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి సినిమా కొంత సమయం తీసుకుంటుంది. కానీ ఒకసారి కథలోకి వెళ్లాక, సన్నివేశాలు బాగా పండాయి. ఫ్యామిలీ ఆడియన్స్ మరియు యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. ఎమోషన్స్, కామెడీని సరైన పాళ్లలో రంగరించి మంచి వినోదాన్ని అందించారు.   ప్లస్ పాయింట్స్: సూర్య నటన మమితా బైజు పెర్ఫార్మెన్స్ కామెడీ సన్నివేశాలు ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకునే సెకండాఫ్ అద్భుతమైన డైలాగులు కథను పరిపక్వతతో డీల్ చేసిన విధానం మైనస్ పాయింట్స్: కాస్త నెమ్మదిగా సాగే కథనం అక్కడక్కడా సాగదీసినట్లు అనిపించే సన్నివేశాలు   చివరి గా:  అద్భుతమైన భావోద్వేగాలు, వినోదం కలగలిపిన ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్.   రేటింగ్: 3.0/5   గమనిక: ఈ సమీక్షలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతమైనవి. వీటికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. పాఠకులు తమ సొంత విచక్షణతో సినిమాను అంచనా వేయగలరు.
Cast: Suriya, Mamitha Baiju, Radhikaa Sarath Kumar, Raveena Tandon, Sunil Reddy, Bhavani Sre Crew:  Cinematography by Nimish Ravi  Music by GV Prakash Kumar  Editing by Navin Nooli  Written & Directed by Venky Atluri  Produced by Suryadevara Naga Vamsi, Sai Soujanya    Suriya is one of the most popular actors in South Cinema. The actor delivered a huge blockbuster with Karuppu previously and he joined hands with director Venky Atluri. The director made an unanimous hit like Lucky Baskhar. So, their collaboration for Vishwanath and Sons raised humungous anticipation. The movie released today and let's discuss about it in detail.    Plot:  Sanjay Vishwanath (Suriya) wins gold medal in Olympics, to fulfill his mother (Radhikaa)'s wishes. But he has issues with getting married while his mother edges him. He decides to get a surrogate baby and finds Maddy J (Mamitha Baiju) as the surrogate mother. While they do not meet earlier, as his son Abhay needs bone marrow transplantation, he meets Maddy. She is a medical student and accepted to become a surrogate for her tuition fees.  Sanjay brings her to his home and she connects with the family. She connects with Sanjay more than her son. But Sanju keeps pushing away as his childhood trauma is connected to his father (Rajeev Menon) choosing to marry an actress (Raveena Tandon) for second time. Will he ever get over this trauma and accept Maddy, despite age difference? Watch the movie to know more.    Analysis:  Suriya delivered a remarkable performance balancing every emotion. His charm and his stylish look work big time in carrying the film. Mamitha Baiju is confident, superb and fantastic in her performance. She is the livewire. Radhikaa and Raveena Tandon got very believable mother roles. Their performances are heart touching. Sunil Reddy is good.  GV Prakash Kumar music is decent for the film. He elevated key moments with his good score. Nimish Ravi cinematography and Navin Nooli editing are apt for the movie. Production values are top notch and technical values elevate the story.  Venky Atluri as a writer delivers his best in crafting emotional drama. His dialogues stand out and elevate emotions. In the second half, he came up with brilliant lines and connect with each emotion. Each character gets a good scene and line that really makes the movie stand-out.  As a director though he did take a very safe template and screenplay does tend to drag at few places. Also the movie takes it own time to establish all the emotions but the pay-offs work big time. Family audiences and youth will connect to the movie in a big way. He blended the emotions and comedy making it a perfect treat to watch.    Positives:  Suriya performance  Mamitha performance  Comedy scenes  Emotional scenes  Engaging Second Hour  Superb Dialogues  Matured Handling of story    Negatives:  Slightly Slow Paced narrative  Few scenes and moments drag a bit    Bottomline:  A complete Entertainer with splendid moments that works big time.    Rating: 3.0/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన డిఫరెంట్ అండ్ హార్ట్ టచింగ్ రూరల్ డ్రామా 'పళ్లబురుసు' ఈరోజే గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చింది. 'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించగా, ఉదయ్ చౌహాన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫస్ట్ డే ఫస్ట్ షోలు పూర్తయ్యేసరికి సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్ (X) లో ఈ సినిమా టాక్ ఏంటి? ఒక చిన్న పళ్లబురుసు చుట్టూ అల్లుకున్న ఈ తెలంగాణ నేటివిటీ డ్రామా ప్రేక్షకులను ఏ రేంజ్‌లో మెప్పించింది? సినిమా కథలోకి వెళ్తే.. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక 68 ఏళ్ల ముసలాయన (సుధాకర్ రెడ్డి), తన కొడుకుతో (మురళీధర్ గౌడ్) ఉన్న విభేదాల వల్ల దూరంగా ఉంటాడు. ఆయనకు ఒక చిన్న టూత్‌బ్రష్ (పళ్లబురుసు) కావాలనే కోరిక ఉంటుంది. కానీ ఆ చిన్న విషయమే పెద్దదై, చివరికి తన కొడుకుపైనే కోర్టులో కేస్ వేసే వరకు వెళ్తుంది. అసలు ఒక పళ్లబురుసు కోసం కొడుకుపై కేస్ ఎందుకు వేయాల్సి వచ్చింది? ఆ చిన్న కోరిక వెనుక ఉన్న ఆత్మాభిమానం, ప్రేమ, ఆవేదన ఏంటి? అనేది ఈ సినిమా ముఖ్య కథాంశం. ట్విట్టర్‌లో మొదటి షోలు చూసిన ఆడియన్స్ చెబుతున్న మాట ఏంటంటే.. "ఇదొక బ్యూటిఫుల్, హార్ట్‌వార్మింగ్ అండ్ ఎమోషనల్ డ్రామెడీ". సినిమా ప్రారంభంలోనే తెలంగాణ గ్రామీణ వాతావరణం, అక్కడి మనుషుల సహజమైన యాస, పాత్రల పరిచయంతో మనల్ని ఆ కథలోకి తీసుకెళ్తారు. నటన విషయానికి వస్తే.. 'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ల పర్‌ఫార్మెన్స్ సినిమాకి అతిపెద్ద పిల్లర్. తండ్రీ కొడుకులుగా వీరిద్దరి మధ్య వచ్చే ఈగోలు, చిన్న చిన్న గొడవలు, కామెడీ సీన్లు థియేటర్లలో నవ్వులు పూయిస్తే.. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి అదే కాంబినేషన్ కంటతడి పెట్టిస్తుంది. మనుషుల మధ్య తగ్గుతున్న అనుబంధాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొనే ఒంటరితనాన్ని దర్శకుడు ఉదయ్ చౌహాన్ చాలా హుందాగా, ఎక్కడా డ్రామా ఎక్కువ కాకుండా సహజంగా తెరకెక్కించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక ఇతర పాత్రల్లో నటించిన ప్రజ్వల్ యాద్మ, గోమతి రెడ్డి, చంద్రవ్వ తమ పరిధి మేర బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చారు. సాంకేతికంగా చూస్తే.. 'లవ్ స్టోరీ' ఫేమ్ పవన్ సీహెచ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గ్రామీణ ఎమోషన్స్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ ఊరి వాతావరణాన్ని చాలా కలర్‌ఫుల్‌గా, నాచురల్‌గా క్యాప్చర్ చేసింది. నాగార్జున ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్లే.. 'పళ్లబురుసు' కేవలం ఒక కామెడీ సినిమా కాదు, ప్రతి ఇంట్లో ఉండే తండ్రీ కొడుకుల కథ. కోర్టు రూమ్ డ్రామా సీన్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆడియన్స్‌కి ఒక మంచి అనుభూతిని ఇస్తాయి. ట్విట్టర్ టాక్ ప్రకారం.. క్లీన్ అండ్ ఎమోషనల్ రూరల్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా పర్ఫెక్ట్ ఛాయిస్.       Pallaburusu Review, Sudhakar Reddy, Muralidhar Goud, Uday Chauhan, Annapurna Studios  
యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాల్ మొదటిసారి మెగాఫోన్ పట్టాడు. విశాల్ హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మకుటం' ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో 99వ ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ సినిమా, ఫస్ట్ డే ఫస్ట్ షో పడిందో లేదో.. సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ట్విట్టర్ (X) లో రివ్యూల వర్షం కురుస్తోంది. సినిమా కథ విషయానికి వస్తే.. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న ఒక సామాన్య తండ్రి, తన కొడుకుని ప్రమాదకరమైన క్రిమినల్స్ నుంచి కాపాడుకోవడానికి తన గతాన్ని, హింసాత్మకమైన నేపథ్యాన్ని తిరగరాయాల్సి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే.. సెంటిమెంట్, యాక్షన్ సమిష్టిగా కలగలిపిన పక్కా మాస్ కథ ఇది. మరి మొదటి షో చూసిన ఆడియన్స్ ట్విట్టర్‌లో ఏమంటున్నారంటే.. "అంబిషియస్, గ్రాండ్ అండ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్!" అని చెబుతున్నారు. విశాల్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రమే కాదు, ఆయన దర్శకత్వ ప్రతిభ కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో ఉండే మూడు భారీ యాక్షన్ సీక్వెన్సులు బిగ్ స్క్రీన్ మీద కేక పెట్టించేలా ఉన్నాయట. దిలీప్ సుబ్బరాయన్ డిజైన్ చేసిన ఈ ఫైట్స్ మాస్ ఆడియన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్నాయని కామెంట్స్ వేస్తున్నారు. అసలైన హైలైట్ ఏంటంటే.. ఈ సినిమా క్లైమాక్స్. క్లైమాక్స్ సీక్వెన్స్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుందని, విశాల్ ఒక డైరెక్టర్‌గా సెకండ్ హాఫ్‌ను, ముగింపును ప్లాన్ చేసిన విధానం మైండ్ బ్లోయింగ్ అని ట్వీట్స్ దర్శనమిస్తున్నాయి. హీరోయిన్లు దుషారా విజయన్, అంజలి ఇద్దరూ కథకి చాలా కీలకమైన పాత్రలలో మెరిశారు. పవర్ ఫుల్ ఎమోషన్స్ వర్కవుట్ అవ్వడానికి వీరి పర్‌ఫార్మెన్స్ ఎంతగానో ఉపయోగపడింది. ఇక సపోర్టింగ్ క్యాస్టింగ్ విషయానికి వస్తే.. జాన్ విజయ్, జయప్రకాష్, వంశీ కృష్ణ లాంటి నటులు సినిమా గ్రాండ్‌నెస్‌ని పెంచేశారు. టెక్నికల్ సైడ్ చూస్తే.. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లకి ప్రాణం పోసింది. నాథన్, అభినందన్ రామానుజమ్, జై కార్తీక్ అందించిన విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. తెలుగు డైలాగ్స్ విషయానికి వస్తే రాజేష్ ఎ. మూర్తి అందించిన సంభాషణలు చాలా పవర్‌ఫుల్‌గా పేలాయి. మొత్తానికి 'మకుటం' సినిమాతో విశాల్ కేవలం హీరోగానే కాదు, ఒక మాస్ అండ్ ఎమోషనల్ డైరెక్టర్‌గా కూడా ఫస్ట్ అటెంప్ట్‌లోనే సక్సెస్ సాధించారని టాక్ స్పష్టంగా చెబుతోంది. ఒక వైపు గుండెను పిండేసే ఫాదర్-సన్ సెంటిమెంట్.. మరోవైపు సీటు అంచున కూర్చోబెట్టే యాక్షన్.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ విశాల్ బాక్సాఫీస్ దగ్గర తన 'మకుటాన్ని' పదిలం చేసుకున్నారు.       Vishal, Makutam Review, Magudam Review, Makutam Public Talk, Magudam Public Talk  
కోలీవుడ్ స్టార్ సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'విశ్వనాథ్ & సన్స్'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా నేడు(ఆగష్టు 14) థియేటర్లలోకి వచ్చింది.  వింటేజ్ సూర్యను స్క్రీన్ పై చూడటం కోసం ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న 'విశ్వనాథ్ & సన్స్' మార్నింగ్ షోలు పూర్తి చేసుకుని, ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ టాక్‌తో ట్రెండ్ అవుతోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న ఒకే ఒక్క మాట.. "ఇదొక హార్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్". ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. సినిమా ప్రారంభంలో ఒక 20 నిమిషాలు కాస్త నిమ్మదిగా సాగినప్పటికీ, కథలోకి వెళ్లేకొద్దీ వేగం పుంజుకుంటుంది. న్యాచురల్ ఫన్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఫస్ట్ హాఫ్ హాయిగా సాగిపోతుంది. ముఖ్యంగా హీరో సంజయ్ విశ్వనాథ్‌గా సూర్య క్యారెక్టరైజేషన్, అతని బాడీ లాంగ్వేజ్ టాప్ నాచ్ ఉన్నాయి. 'గజినీ'లో సంజయ్ రామస్వామిని చూసినట్లే.. మళ్లీ సూర్యలోని ఆ మేజిక్ అండ్ చార్మ్ ఈ సినిమాలో క్లియర్‌గా కనిపిస్తుందని ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు. ఇక సినిమాలో మరో బిగ్గెస్ట్ హైలైట్ మమితా బైజు. తన ఎనర్జీ, ఫ్రెష్ లుక్స్, సూర్యతో ఆమె కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్‌గా వర్కవుట్ అయ్యాయి. సూర్య, రాధికా శరత్‌కుమార్, మమితా బైజు మధ్య వచ్చే ఫ్యామిలీ సీన్స్ అండ్ కామెడీ డ్రామా ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే హాస్పిటల్ సీక్వెన్స్, ట్రిప్ కామెడీ, హోటల్ ఫైట్ సీన్ థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే రెట్రో ట్రాక్ అయితే ప్రేక్షకులను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తుంది. ఇక అసలు సిసలైన మ్యాజిక్ దాగుంది సెకండ్ హాఫ్‌లోనే. వెంకీ అట్లూరి మార్క్ ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ డ్రామా సెకండ్ హాఫ్‌ను నడిపించాయి. మనకు గతంలో వచ్చిన 'అల వైకుంఠపురములో', 'అత్తారింటికి దారేది', 'బొమ్మరిల్లు', 'మిస్టర్ పర్‌ఫెక్ట్' లాంటి క్లాసిక్ ఫ్యామిలీ డ్రామాలలో ఉన్న ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాలో మళ్లీ కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒక మాజీ ఒలింపిక్ షూటర్ అయిన సూర్య జీవితంలోకి అనుకోకుండా ఒక సర్రోగేట్ మదర్ వచ్చినప్పుడు, ఆ పసిపాప ఆరోగ్యం చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామా ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. 'లక్కీ భాస్కర్' విజయం తర్వాత డైరెక్టర్ వెంకీ అట్లూరి ఎమోషనల్ డ్రామాలను ఎంత పర్‌ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరో మళ్లీ నిరూపించారు. ఆయన రాసిన మాటలు, స్క్రీన్‌ప్లే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. ఇక సినిమా క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ సాటిస్‌ఫైయింగ్ అండ్ ఎమోషనల్ ఎండింగ్స్ లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. థియేటర్ నుంచి బయటకి వచ్చేటప్పుడు ప్రేక్షకుడి కళ్లలో నీళ్లు తిరగడం ఖాయం. ట్విట్టర్ టాక్ ప్రకారం.. పర్ఫెక్ట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూడాలనుకునేవారికి 'విశ్వనాథ్ & సన్స్' బెస్ట్ ఛాయిస్.       Vishwanath and Sons Review, Suriya, Mamitha Baiju, Venky Atluri  
    -సినిమా పేరు: అగధ  -న‌టీన‌టులు: కామాక్షి భాస్కర్ల , భానుచందర్, సిజ్జు, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, -వనితా విజయ్ కుమార్, శ్రేయ రాణిరెడ్డి, రోషన్ బషీర్  తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: నాని చమిడిశెట్టి  -ఎడిటింగ్: జునైద్ సిద్ధికి  -మ్యూజిక్: రాకేష్ వెంకటాపురం  -నిర్మాత‌ కాశీ విశాలాక్షి బలుసు  -బ్యానర్: శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్  -సమర్పణ: అజయ్ కె. ఆర్   -రచన,దర్శకత్వం: ఎం ఎస్ రాజు  -రిలీజ్ డేట్ : ఆగష్టు 14 ,2026  మహేష్, ప్రభాస్ ని ఒక్కడు, వర్షం సినిమాలతో స్టార్స్ గా నిలబెట్టిన హిట్ మేకర్  ఏంఎస్ రాజు. దర్శకుడు గాను తన సత్తా చాటుతూ ఈ రోజు హర్రర్, మిస్టరీ థ్రిల్లర్ 'అగధ'  తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రచార చిత్రాలతో క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు నిన్న ప్రీమియర్స్ కూడా ప్రదర్శించడంతో థియేటర్స్ హౌస్ ఫుల్స్ తో దర్శనమిచ్చాయి.  మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ మహాదేవి( కామాక్షి భాస్కర్ల) ఐదేళ్ల చిన్నవయసులోనే తనకి తాను అమ్మవారి రూపంలో కనిపించడంతో పాటు దైవశక్తీ మహాదేవిని కాలినడకన సుదూర ప్రయాణం చేయించి ఒక ప్రాంతంలో ఉండే అమ్మవారి ప్రతిమ దగ్గరకి చేరుస్తుంది. భారీ ఆకారంతో చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించాలనే విధంగా అమ్మవారి రూపం ఉంటుంది.  అప్పట్నుంచి అమ్మవారి ఆరాధికారులుగా ఉంటూ తన దగ్గరికి వచ్చే మనుషులని దుష్ట పీడల నుంచి రక్షిస్తుంది. మహాదేవికి ఆత్మలు, ప్రేతాత్మలు  కూడా కనపడుతుంటారు. అగధ (రూపంలేని ఒక మహా పురుష క్షుద్రశక్తీ). ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ లో ఉండే 'శుక్లా' అనే గ్రామ సరిహద్దులో ఉండే  ఒక దండకారణ్యంలో ప్రేతాత్మలని, తల్లి కడుపులో పురుడు పోసుకుంటున్న జీవులతో కలిసి మహాసామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ విధమైన రెండు పార్శ్యాలుతో ఉన్న మహాదేవి, అగధ మధ్య జరిగే కథలో మిగతా క్యారక్టర్ ల కథ ఏంటి? చైత్ర అమావాస్యతో పాటు 144 ఏళ్ళకి వచ్చే క్షుద్రగ్రహణం యొక్క లక్ష్యం ఏంటనేదే అగధ. ఎనాలసిస్  ఓవర్ ఆల్ గా చూసుకుంటే చాలా మంచి కథ..   కలియుగంలో దుష్ట శక్తిని అంతమొందించలేం, అమ్మవారి దగ్గర బంధించగలం అనే కాన్సెప్ట్ నేటి కలియుగానికి కరెక్ట్ గా సరిపోతుంది. ఊరూరా అమ్మవారు ఇందుకే వెలిశారా అనే ఆలోచన  మన మనసులో తడుతుంది. కాకపోతే కొన్ని సీన్స్ బలంగా లేక తేలిపోయాయి. ఆర్టిసుల పరంగా కూడా మైనస్. ఇదే కథలో కామాక్షి భాస్కర్ల లాగా కొంచం పేరెన్నికిగన్న నటీనటులైతే అగధ ఎట్మాస్పియర్ మరోలా ఉండేది. ఎంటర్ టైన్ మెంట్ ని  ని  ఏదో ఒక రకంగా మిక్స్ చేయాల్సింది. దీనివలన మూవీ మొత్తం మిస్టరీ గా నడపడానికి కావాల్సిన సీన్స్ విషయంలో ఇబ్బంది పడకుండా ఉండేవాళ్లు. ఎందుకంటే మూవీ మొత్తం సీరియస్ గా సాగుతుంది. కాకపోతే  ఏంఎస్ రాజు గారి దర్శకత్వ ప్రతిభ కట్టిపడేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో   చూసుకుంటే మహిమ , బబ్లు పై వచ్చిన సీన్ తో మంచి క్యూరియాసిటీ కలుగుతుంది. ఆ తర్వాత వచ్చిన మహాదేవి ఫ్లాష్ బ్యాక్ సీన్ తో కథనంపై చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటాం.  కానీ నార్మల్ గా సీన్స్ వచ్చాయి. మహాదేవి క్యారక్టరయిజేషన్ ని, ఆమె పరిష్కరించే సమస్యలని డెప్త్ గా చూపించాల్సింది. మహిమ తండ్రి  భానుచందర్, అండ్ ఫ్యామిలీ పై వచ్చే సీన్స్ పర్లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ బాంగ్ ముందు వచ్చే ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంది. సెకండ్ హాఫ్ లో కథనం ఫస్ట్ హాఫ్ కంటే వేగంగా నడిచింది. ప్రతి సీన్ ఎక్కడా బోర్ కొట్టలేదు. ముఖ్యంగా హరిణి( జోవికా విజయ్‌కుమార్), సలీం(శ్రవణ్ రెడ్డి) ఎపిసోడ్ ఒక రేంజ్ లో ఉంది. ఆ ఇద్దరి క్యారెక్టర్స్ తో అసలు కథ చెప్పడం ప్లస్ పాయింట్. అగధ తన లక్ష్యం చెప్పడంతో పాటు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ బాగున్నాయి. కాకపోతే అగధ లాంటి సబ్జెట్స్ కి ఉండాల్సిన బీభత్సం, హడావిడి కొంచం తక్కువయ్యింది  నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు  మహాదేవి గా కామాక్షి భాస్కర్ల తన క్యారక్టర్ కి పూర్తి న్యాయం చేసింది. ఆ   క్యారక్టర్ కి సబ్జెక్టుకి తగ్గట్టుగా ప్రశాంతతతో కూడిన ముఖకవళికలు చాలా ముఖ్యం. వాటన్నిటిలో తన సత్తా చాటింది. సింహ, సలీం గా చేసిన శ్రవణ్ రెడ్డి తన రెండు క్యారెక్టర్స్ లో డిఫరెంట్ మాడ్యులేషన్ తో కూడిన పెర్ఫార్మ్ ప్రదర్శించి మెప్పించాడు.  మిగతా క్యారెక్టర్స్ లో చేసిన వాళ్ళందరూ కూడా తమ అద్భుతమైన పెర్ఫార్మ్ తో అగధకి హెల్ప్ అయ్యారు. జోవికా విజయ్ కుమార్ తన కెరీర్ లో గుర్తుండి పోయే పెర్ఫార్మ్ ఇచ్చింది.  ఏం ఎస్ రాజు గారు దర్శకుడిగా సక్సెస్ అవ్వడంతో పాటు టెక్నాలిజీని వాడుకోవడంలో కూడా సక్సెస్ అయ్యారు. రచయితగా బలమైన సీన్స్ రాసుకోలేకపోయారేమో అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా అగధ లాంటి సబ్జెట్స్ కి ఇంకాస్త మెరుపులు కావాలి. ఫొటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్. నిర్మాణ విలువలు పర్లేదు. బలాలు 1 . కథ  2 . కామాక్షి భాస్కర్ల పెర్ ఫార్మెన్స్  3 . ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్  4 . సెకండ్ హాఫ్  బలహీనతలు  1 . కొన్ని సన్నివేశాల్లో బలం లేకపోవడం  2 .రాంగ్ కాస్టింగ్  చివరిగా చెప్పుకోవాలంటే ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్, సెకండ్ హాఫ్ పర్వాలేదనే స్థాయిలోనే ఉన్నాయి.నిర్మాణ విలువలు ఇంకొంచం బాగుండి ఉంటే అగధ ఇంకాస్త బెటర్ పొజిషన్ లో ఉండేదేమో. రేటింగ్ 2 .5 /5                                                           అరుణాచలం 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                                                                                                                                   *రూపశ్రీ.
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి.  అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.  కొందరు నిదానంగా తింటారు.  మరికొందరు చాలా వేగంగా తింటారు.  అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు.  కుటుంబ సభ్యులు అయినా,  స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు.  వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్  చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం  కాకుండా ఆ తరువాత  సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట.   స్ట్రాంగ్ ప్రాక్టీస్  ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం  కంటే తినడాన్ని కూడా ఒక  పనిగా భావిస్తారని అంటున్నారు.  తినే వేగాన్ని బట్టి వ్యక్తిత్వం లక్షణాలను,  తినే వేగానికి,  వ్యక్తిత్వానికి మధ్య గల సంబంధాలను వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు కనుక్కున్నారు. వేగంగా తినేవారు తరచుగా వేచి ఉండటానికి ఇష్టపడరు. ఇది క్యూలలో నిలబడినా, నెమ్మదిగా మీటింగ్స్  లో ఉన్నా లేదా ఆహారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చినా.. ఇలా అన్ని సందర్బాలలో వారు అన్ని వేగంగానే జరగాలని కోరుకుంటారట.  అన్ని విషయాలలోనూ సహజంగా వేగాన్ని వీరు ఇష్టపడతారట. ఈ ధోరణి భోజన చేయడం వరకు తీసుకువెళుతుందట.  చాలామందిలో తినే స్వభావం మానసిక , పర్యావరణ కారకాల ద్వారా ఏర్పడతాయని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.   వేగంగా తినే వ్యక్తులలో ఇతర పనులను కూడా వేగంగా పూర్తీ చేసే సామర్థ్యం ఉంటుందట. వర్తమానంతో పూర్తీగా నిమగ్నమవడానికి బదులుగా  తరువాత ఏమి జరుగుతుందో  అనే విషయం పై దృష్టి పెట్టేలా చేస్తుందట.  ఈ కారణంగా వీరికి భవిష్యత్తు గురించి స్పష్టమైన అంచనాలు, ప్రణాళికలు కూడా ఉంటాయట. అలాగని వేగంగా తినడాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే.. వేగంగా తినడం అనేది ఆహారం సరిగా నమలకపోవడం, తినే ఆహారం మీద దృష్టి పెట్టలేకపోవడం,  ఆహారం అతిగా తినడం.. ఇలా చాలా సమస్యలకు కారణం అవుతుంది.                                                                                                                                                   *రూపశ్రీ.  
నేటికాలంలో ప్రేమ, ఆకర్షణ మధ్య తేడాను తెలుసుకోలేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆకర్షణను ప్రేమగా పొరబడేవారు.. హద్దులు దాటి ముందుకు వెళ్లేవారు కోకొల్లలు ఉన్నారు. అయితే.. నిజమైన ప్రేమకు, ఆకర్షణకు మధ్య గల తేడా గురించి మాత్రమే కాకుండా..  ప్రేమకు  అనుబంధానికి మధ్య తేడా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?  వివరంగా తెలుసుకుంటే.. నిజమైన ప్రేమ, ఆకర్షణ..అనుబంధం.. ఒకరితో కలిసి ఉంటే సంతోషంగా ఉండటం ప్రేమ కావచ్చు, కానీ వారు లేకుండా అశాంతిగా ఉండటం ఎల్లప్పుడూ ప్రేమ కాదని అంటున్నారు. చాలాసార్లు  బంధాలలో  ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకుంటున్నారనే ఫీలింగ్ ఎంత డీప్ గా ఉంటుందంటే..  ప్రేమలో ఉన్నామో లేక ఎదుటి వ్యక్తి పట్ల ఆకర్షితులవుతున్నారో,  లేదా లోతుగా అనుబంధంలో ఉన్నారో  కూడా    తెలియనంతగా ఉంటుంది. ప్రేమ మనసును విశాలం చేస్తుంది, అయితే అనుబంధం  నెమ్మదిగా మనసును బంధిస్తుంది. ప్రేమలో స్వేచ్ఛ, అనుబంధంలో  సొంతమనే బావన ఉంటుంది.. నిజమైన ప్రేమ  వ్యక్తిని తన కోరికలకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నించదు. అది ఎదుటి వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలను, భావాలను , స్వేచ్ఛను గౌరవిస్తుంది. దీనికి విరుద్ధంగా అనుబంధం ఎక్కువగా ఉంటే మాత్రమే ఉంటే  ఎదుటి వ్యక్తి ఎల్లప్పుడూ తన కోరికల ప్రకారమే ప్రవర్తించాలనే వాంఛను బలపరుస్తుంది. ఇది స్వార్థం కూడా కావచ్చు. నమ్మకం ఉన్నచోట.. భయం ఉండదు..  సంబంధంలో నిజమైన ప్రేమ ఉంటే, దూరం ఉన్నా లేదా ఎంత బిజీగా ఉన్నా నమ్మకం నిలిచి ఉంటుంది. అయితే, అనుబంధం ఎక్కువగా ఉంటే..  కాలంతో పాటు అవతలి వ్యక్తి తమను విడిచిపెడతారేమోనని పదేపదే ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా చేసే ఫోన్ కాల్స్, అరుదుగా , లేదా ఒంటరిగా సమయం గడపడం వంటివి కూడా ఆందోళనకు కారణం కావచ్చు. అందుకే మనసు స్థిరంగా ఉండాలి. ప్రేమలో సాన్నిహిత్యం ఉంటే.. అనుబంధం  కోల్పోతామేమో అనే భావన ఉంటుంది.. ఒకరిని మన సొంతవారిగా భావించడం సహజం. ఆ సొంతమనే భావనే భయంగా మారినప్పుడు సమస్య మొదలవుతుంది. ఆ వ్యక్తి లేకుండా మన జీవితం అసంపూర్ణంగా ఉందని, మన సంతోషం పోతుందని, లేదా మనల్ని మనం చూసుకోలేమని అనిపించడం మొదలైనప్పుడు, ఈ భావన ప్రేమను దాటి అనుబంధంగా డెవలప్  చెందుతుంది. అంచనాలు ఉంటే బంధం బలహీనమవుతుంది.. బంధంలో అంచనాలు ఉన్నప్పుడు ఆ బంధం బలహీనంగా మారుతుందట. అంచనాలు ఉన్నప్పుడు ఆ అంచనాలను చేరుకోలేక పోవడం వల్ల  డిజప్పాయింట్ కావడం జరుగుతుంది.  ఇది బంధంలో ఉన్న మనిషి మీద కూడా అభిప్రాయం మారేలా చేస్తుంది. గొడవలు,  వాగ్వాదాలకు కూడా కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రేమ కోసం  తమను తాము కోల్పోతే.. చాలామంది ప్రేమ కోసం తమను తాము కోల్పోతారు.  ఇలా చేయడం వల్ల ప్రేమించిన వ్యక్తి మీద ఆధారపడినట్టు అవుతుంది.  ఆ వ్యక్తి ఏదైనా అన్నా లేదా దూరమైనా.. ఆ సమయంలో జీవితం మొత్తం శూన్యమైనట్టు అనిపిస్తుంది. అంతే కాదు..  చూసుకోవడానికి  తమకంటూ ఏమీ మిగలకుండా అయినట్టు అనిపిస్తుంది.                                                                                                                                              *రూపశ్రీ.  
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటారు.  అయితే  రోజూ రెండు ఉడికించిన గుడ్లు తినడం  మంచిదేనా? ఫిట్‌నెస్ ట్రైనింగ్ లో ఉన్నవారు,  పోషకాహార లోపంతో ఉన్నవారు ప్రతిరోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు.  రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. గుడ్లలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో , బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే ఎముకల బలానికి కావలసినంత కాల్షియం,  విటమిన్-డి పొందవచ్చు. మెదడు ఆరోగ్యానికి.. గుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరు,  జ్ఞాపకశక్తికి చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే.. అది మెదడు  చురుగ్గా ఉండటానికి,  మెదడు  ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,  అలాగే నరాల పనితీరును  కూడా మెరుగ్గా ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి.. గుడ్లలో ల్యూటిన్ , జీక్సాంథిన్ ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుండి కళ్ళను రక్షించే యాంటీఆక్సిడెంట్లు.  మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారంతో పాటు మితంగా గుడ్లు తినడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కు మంచిది.. రెండు ఉడికించిన గుడ్లు సుమారు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తు , కడుపు నిండిన ఫీలింగ్ ఇవవ్డంలో సహాయపడతాయి. ఫిట్‌నెస్ ప్రియులకు , లీన్ కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బరువు నిర్వహణకు.. గుడ్లలో అధిక ప్రోటీన్ , తక్కువ కేలరీలు ఉంటాయి.  దీని కారణంగా ఉడికించిన గుడ్లు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి , శరీరానికి కావలసిన పోషకాలు కూడా మెరుగ్గా అందిస్తాయి. ఇవి అతిగా తినడాన్ని,  వెంటనే ఆకలి కావడాన్ని అరికట్టడానికి , బరువు నిర్వహణకు సహాయపడతాయి.                                                                                                                                                   *రూపశ్రీ.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు. అయితే పదేపదే తిమ్మిర్లు రావడం, ఎక్కువసేపు తగ్గకపోవడం లేదా శరీరంలో ఒక వైపు మాత్రమే అకస్మాత్తుగా తిమ్మిరి రావడం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడానికి నరాలకు సంబంధించిన సమస్యలు ఒక కారణం కావచ్చు. నరాలు దెబ్బతిన్నప్పుడు తిమ్మిరితో పాటు మంట, జలదరింపు, సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, నొప్పి లేదా చేతులు, కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే శరీరంలో ఒక వైపు అకస్మాత్తుగా చేయి లేదా కాలు తిమ్మిరిగా మారడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను మాత్రం ప్రత్యేకంగా గమనించాలి. ముఖ్యంగా వీటితో పాటు ముఖం ఒక వైపు వంగడం, మాట స్పష్టంగా రాకపోవడం, నడవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు కావచ్చు. ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాధారణంగా వచ్చే తిమ్మిరికి, నరాల దెబ్బతినడం లేదా స్ట్రోక్‌కు సంబంధించిన తిమ్మిరికి తేడా ఏమిటి? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? శరీరంలో ఒక వైపు మాత్రమే తిమ్మిరి ఎందుకు వస్తుంది? ఈ విషయాలపై Dr. Anirudh Deshmukh ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. సాధారణ తిమ్మిరి ఎప్పుడు ఆందోళన చెందాల్సిన సమస్యగా మారుతుంది? నరాల సమస్యకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి? స్ట్రోక్‌ను సూచించే సంకేతాలు ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. అకస్మాత్తుగా ఒక వైపు తిమ్మిరి, బలహీనత లేదా స్ట్రోక్‌ను సూచించే ఇతర లక్షణాలు కనిపిస్తే స్వయంగా చికిత్స చేసుకోకుండా వెంటనే వైద్య సహాయం పొందండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామం శ్వాసను నియంత్రిస్తూ చేసే ఒక సాధారణ యోగాభ్యాసం. దీన్ని సరైన పద్ధతిలో, సరైన సమయంలో చేయడం ముఖ్యమని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ప్రాణాయామం చేయడం సరికాదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం ఉన్న సమస్యలను బట్టి విధానం మారవచ్చు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ శ్రావంతి రఘు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎవరు చేయవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలి? వీడియోలో అనులోమ విలోమాన్ని స్టెప్ బై స్టెప్‌గా ఎలా చేయాలో చూపించారు. శ్వాసను నెమ్మదిగా, నియంత్రణతో తీసుకోవడం, వదలడం వంటి అంశాలను సరైన పద్ధతిలో పాటించడం గురించి వివరించారు. ప్రాణాయామం చేసేటప్పుడు శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడం, తొందరపడకుండా శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యమైన అంశాలు. మొదటిసారి ప్రయత్నించేవారు నిపుణుల సూచనతో ప్రారంభించడం మంచిది. BP ఉన్నవారు చేయవచ్చా? అధిక రక్తపోటు ఉన్నవారు కూడా కొన్ని శ్వాసాభ్యాసాలను తగిన జాగ్రత్తలతో చేయవచ్చు. అయితే అధిక బీపీ ఉన్న ప్రతి వ్యక్తికి ఒకే విధమైన ప్రాణాయామ పద్ధతి సరిపోదు. ముఖ్యంగా శ్వాసను బిగపట్టడం వంటి పద్ధతులను స్వయంగా ప్రయత్నించకుండా, నిపుణుల సూచనలు పాటించడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు చేయవచ్చా? డయాబెటిస్ ఉన్నవారు కూడా అనులోమ విలోమ ప్రాణాయామం గురించి నిపుణుల సలహా తీసుకుని సాధన చేయవచ్చు. అయితే ప్రాణాయామం ఏదైనా వ్యాధికి మందులకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యులు సూచించిన మందులు, ఆహారం, వ్యాయామాన్ని కొనసాగిస్తూ మాత్రమే యోగాభ్యాసాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి. సైనసైటిస్ ఉన్నవారు? సైనసైటిస్ లేదా ముక్కు సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రాణాయామం చేసే ముందు తమ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. ముక్కు పూర్తిగా బ్లాక్‌గా ఉన్నప్పుడు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు బలవంతంగా శ్వాసాభ్యాసం చేయకూడదు. అవసరమైతే యోగా థెరపిస్ట్ లేదా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. రోజూ 10 నిమిషాలు చేస్తే స్ట్రెస్, BP శాశ్వతంగా పోతాయా? ప్రాణాయామం వల్ల రిలాక్సేషన్, శ్వాస నియంత్రణ, మానసిక ప్రశాంతతకు సహాయం లభించవచ్చు. అయితే రోజూ 10 నిమిషాలు అనులోమ విలోమం చేస్తే స్ట్రెస్ లేదా బీపీ శాశ్వతంగా పూర్తిగా నయమవుతాయని చెప్పడం సరైనది కాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఒక వైద్య పరిస్థితి. దాని కోసం వైద్యుల సూచనలు, మందులు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం. ఈ వీడియోలో అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎవరు చేయవచ్చు? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? సరైన పద్ధతి ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రావంతి రఘు వివరిస్తున్నారు. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు బీపీ, డయాబెటిస్, సైనసైటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రాణాయామం ప్రారంభించే ముందు మీ వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా థెరపిస్ట్‌ను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)