Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ ఎందుకు గైర్హాజరయ్యారో తెలుసా?
posted on: Aug 14, 2026 11:43AM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం (ఆగస్టు 13) ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస గృహాల తాళం చెవులను సీఆర్డీఏ అధికారులు సీఎంకు అధికారికంగా అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలు అమరావతి పునర్నిర్మాణంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే.. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి కీలక ఈవెంట్‌లోనూ ముందు వరుసలో ఉండే ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాల్సి వస్తే ఆప్షన్లు తెరిచి ఉంచుకోవడానికే పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా అమరావతి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటై వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున పోస్టులు షేర్ చేయడం ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణాలు ఫ్యాక్ట్ చెక్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ను రాష్ట్ర మంత్రి నారాయణ స్వయంగా మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్లి మరీ ఆహ్వానించారు. అయితే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవం రోజునే.. పవన్ కల్యాణ్ కు అంతకు ముందే నిర్ణయమైన పర్యటన ఖారరై ఉండటంతో రావడం లేదని పొంగూరు నారాయణకు పవన్ కల్యాణ్ చెప్పారు.
ఆగస్టు 12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించే వేడుకలలో పాల్గొనేందుకు ముందుగానే షెడ్యూల్ ఖరారైంది. అటవీ శాఖ మంత్రిగా పవన్ ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. ఈ కాకర్యక్రమానికి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఢిల్లీ నుంచి వస్తుండటంతో..పవన్ తన పర్యటన రద్దు చేసుకోలేకపోయారు. కేంద్ర మంత్రిని తాను స్వయంగా ఆహ్వానించాననీ, అందుకే తప్పని సరిగా హాజరుకావాలని పవన్ ఈ సందర్భంగా మంత్రి నారాయణకు వింరించారు. అంటే ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉండటం వల్లనే పవన్ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రత్యేకంగా ప్రశంసించి అమరావతి నిర్మాణంలో ఆయన పాత్రను ప్రశంసించారు.
దీనిని బట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇద్దరు అగ్రనేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ప్రభుత్వ నిర్వహణ సమన్వయంతో సాగుతోందని తేటతెల్లమైంది. తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు ఏర్పడి ఇరు పార్టీలూ విడిపోతే తప్ప రాజకీయంగా తమ మనుగడ కష్టమన్న భావనతోనే వైసీపీ ఇలా లేని విషయాలను కూడా వివాదాస్పదం చేస్తూ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Pawan Kalyan Amaravati event, Seed Access Road Amaravati, Chandrababu Naidu, Narayana Minister, World Elephant Day Visakhapatnam, TDP Janasena Alliance



.webp)


