ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య   సమన్వయం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం   కూటమి ప్రభుత్వ స్థిరత్వంలో కీలక భూమిక పోషిస్తోంది. అలాగే కూటమి భాగస్వామ్య పార్టీల ఐక్యతకు ఊతంగా నిలుస్తోంది.  గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు.  ఇందుకు పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య కారణం. గత కొంత కాలంగా ఆయన పలు కేబినెట్ భేటీలకు హాజరు కాలేదు. ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలలోనూ కనిపించలేదు. దీంతో వైసీపీ తెలుగుదేశం, జన సేన మధ్య విభేదాలు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎడముఖం పెడముఖం అంటూ కథనాలు వండి వార్చాయి. కూటమిలో చీలిక అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాయి. అయితే వైసీపీ ఆరోపణలు, విమర్శలు, ప్రచారాన్ని పూర్వ పక్షం చేస్తూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల మధ్య సయోధ్య ఇసుమంతైనా సడలలేదనడానికి నిదర్శనంగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించారు.  నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మంగళవారం (సెప్టెంబర్ 29)న నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వేదిక పంచుకున్నారు. చాలా కాలం తరువాత, పొలిటికల్ భాషలో చెప్పాలంటే సుదీర్ఘ విరామంతరువాత  ఈ ఇద్దరూ ఒకే వేదికను పంచుకోవడం ఇటు తెలుగుదేశం శ్రేణుల్లోనూ, అటు జనసేన క్యాడర్ లోనూ ఉత్సాహాన్ని నింపింది.  భుజం నొప్పికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్.. ఆ తరువాత కేరళలో చికిత్స, పునరావాసం తీసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా కోలుకుని మళ్లీ క్రియాశీలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ, పార్టీ వ్యవహరాలలోనూ క్రియాశీలంగా పాల్గొంటున్నారు. ఈ పరిణామంతొ వైసీపీ సైలెంట్ అయిపోయింది. విభేదాలంటూ ఆ పార్టీ పెద్ద ఎత్తున చేసిన ప్రచారానికి పవన్ కల్యాణ్ చంద్రబాబులు ఒకే వేదికపై కనిపించడం చెక్ పెట్టింది.  [Palle Panduga, Chandrababu Naidu, Pawan Kalyan, Andhra Pradesh Rural Development, Nellore Ramapuram Meeting, Check, YCP Rumors, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వైసీపీ తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. ఆ పార్టీ ఆరోపణలు, విమర్శలకు ఆధారాలు ఉండాలని భావించదు. ఆ పార్టీ ఎకో సిస్టమ్ (వ్యవస్థ)లోనే ఈ లోపం ఉందన్నది పరిశీలకుల విశ్లేషణ. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి విదేశీ పర్యటనపై కూడా వైసీపీ ఆరోపణలు గుప్పిస్తున్నది.  ఏపీ పొలిటికల్ ఎరీనాలో వైసీపీ తీరు ఎప్పుడూ విలక్షణమే. చంద్రబాబు విదేశీ పర్యటనపై  వైసీపీ సోషల్ మీడియా వింగ్ లో గత రెండు రోజులుగా   ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  చంద్రబాబు రహస్యంగా వియత్నాం   పర్యటనకు వెళ్లారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. చెప్పాపెట్టకుండా చంద్రబాబు చేపట్టిన ఈ విదేశీ పర్యటన వెనుక భారీ కుట్ర ఉందంటూ క్యాంపెయిన్ ఆరంభించింది.   వైసీపీ ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ కొట్టి పారేశారు. ఎదుటి వారి  మీద పడి ఏడవడం మాని మీ పని చూసుకోండంటూ సుతిమెత్తగా కాకుండా ఘాటుగా, దీటుగా ఆ దుష్ప్రచారానికి చెక్ పెట్టారు. చంద్రబాబు దంపతులు వారి మనవడితో కలిసి చిన్న హాలీడే ట్రిప్ కు వెళ్లారని లోకేష్ స్పష్టం చేశారు. పనీ పాటా లేని వైసీపీ చంద్రబాబు పర్యటనపై అర్ధంపర్ధం లేని ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీ ప్రచారంపై సామాజిక మాధ్యమ వేదికలో స్పందించిన లోకేష్..  సీఎం చంద్రబాబు, భువనేశ్వరి తమ మనుమడు దేవాన్ష్‌తో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారనీ, అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు కూడా మనుషులేనన్న వాస్తవాన్ని ఇక్కడ గమనించాలి. పొలిటికల్ యాక్టివిటీస్ తో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో కూడా కొంత సమయం గడపాలి కదా. చంద్రబాబు అందుకు మినహాయింపు కూడా ఏమీ లేదు. అయినా.. స్థానిక ఎన్నికల వేళ విదేశీ పర్యటనకు సిద్ధమైన జగన్ ను వదిలేసి వైసీపీయులు, చంద్రబాబు మనవడిని తీసుకుని భార్యతో హాలీడే ట్రిప్ కు వెళ్లడంపై దుష్ప్రచారం ఏంటని పరిశీలులు విమర్శస్తున్నారు. అది పక్కన పెడితే..  విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు. అయినప్పటికీ, వైఎస్సార్‌సీపీ మాత్రం ఆయన విదేశీ పర్యటనపై పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వారుస్తోంది.  [Chandrababu Naidu, YCP, AP Politics, Personal Tour, YCP Social Media, Naralokesh, Telugu One]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దక్షిణాది ప్రజల సాంస్కృతిక, మత గుర్తింపునకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి.  దేశ రాజధాని హస్తినలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజల సాంస్కృతిక, మతపరమైన గుర్తింపుల గురించి చేసిన విశ్లేషణ రాజకీయదుమారాన్ని రేపింది. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో విభజన తెచ్చేలా సీఎం రేవంత్ మాట్లాడారంటూ బీజేపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తోంది.   దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల ఆరాధనా విధానాలు, దేవుళ్ల ప్రాధాన్యతను వివరిస్తూ.. రేవంత్ రెడ్డి ఆ మీడియా సమావేశంలో దక్షిణాది  వారు ద్రావిడులని, ఉత్తరాది వారులు  ఆర్యులని అన్నారు.   దక్షిణాది వారు శివభక్తులు, ఉత్తరాది వారు శ్రీరామ భక్తులుగా అభివర్ణించారు.  అక్కడితో ఆగకుండా  బీజేపీ నాయకులు ఎప్పుడూ  జై శ్రీరామ్ నినాదాలకే పరిమితమవుతారని,  హర హర మహాదేవ్'అని ఎందుకు అనరని నిలదీశారు. శివుడిని పేదల దేవుడిగా, రాముడిని ధనవంతుల దేవుడిగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. పెను వివాదానికి హేతువయ్యాయి.   రేవంత్ర రెడ్డి వ్యాఖ్యలపై  నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.  ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హిందువులను ప్రాంతాల వారీగా, దేవుళ్ల పేరుతో విడగొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. సోమనాథ్ ఆలయ నిర్మాణం మొదలుకొని అనేక ధార్మిక ప్రాజెక్టులను గతంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని, ఇప్పుడు మళ్లీ అదే వైఖరిని ప్రదర్శిస్తోందని గుర్తు చేస్తున్నారు.  అంతేకాకుండా..  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జై శ్రీరామ్'తో పాటు 'హర హర మహాదేవ్ అని కూడా నినదించే   అంటున్నారు. రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.  హిందువుల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు.   [Revanth Reddy Comments, Lord Rama, Lord Shiva controversy, BJP,  Congress, North South India Identity, National politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
సినిమా థియేటర్లలో మిస్ అయినా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే ప్రేక్షకులకు అక్టోబర్ నెలలో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. వివిధ జానర్లకు చెందిన చిత్రాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలకు చెందిన సినిమాలతో పాటు పలు డబ్బింగ్ కంటెంట్ కూడా ప్రేక్షకులను అలరించనుంది. అక్టోబర్ 1 నుంచే ఈ ఓటీటీ సందడి మొదలుకానుంది. అక్టోబర్ 1న సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ నటించిన ‘రోమాంచకం’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే రోజున కార్తి నటించిన ‘సర్దార్ 2’ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది. అలాగే ‘దుపహియా’ రెండో సీజన్ కూడా ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుండగా.. పంకజ్ త్రిపాఠి, పవన్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓహ్ మై డాగ్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక అక్టోబర్ 2న నివిన్ పౌలీ, మమిత బైజు నటించిన ‘బెత్లెహెమ్ కుటుంబం యూనిట్’ జియోహాట్‌స్టార్‌లోకి రానుంది. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి నటించిన ‘లవ్’ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో, మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి నటించిన ‘పూజా మేరీ జాన్’ జీ5లో స్ట్రీమింగ్ కానున్నాయి. అక్టోబర్ 8న సూరి, సుహాస్ నటించిన ‘మండాడి’ ఓటీటీలోకి రానుండగా.. అక్టోబర్ 9న పరిణీతి చోప్రా నటించిన ‘రిపోర్టింగ్ లైవ్’ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. అదే అక్టోబర్ 9న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇక కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘అక్క’పై కూడా ఆసక్తి నెలకొంది. 1980ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తంగా అక్టోబర్ నెలలో ఓటీటీ ప్రేక్షకులకు విభిన్న జానర్లలో మంచి కంటెంట్ అందుబాటులోకి రానుంది.     [OTT Movies October 2026, October OTT Releases, OTT Movies, Telugu OTT Releases, Sardar 2 OTT, Romancham OTT, Akka Web Series, Netflix Movies, Amazon Prime Video, Telugu Movies OTT]
కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన ప్రదోష్ రావు కోర్టు ముందు పలు విషయాలను వెల్లడించారు. బెంగళూరులోని 59వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో తనకు తెలిసిన వివరాలను ఆయన వివరించారు. రేణుకాస్వామిపై దాడి జరిగిన సమయంలో నటుడు దర్శన్ వ్యవహరించిన తీరుకు సంబంధించి ప్రదోష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. తన వాంగ్మూలంలో భాగంగా.. రేణుకాస్వామిపై దర్శన్ తీవ్రంగా దాడి చేశారని ప్రదోష్ ఆరోపించినట్లు సమాచారం. రేణుకాస్వామి ప్యాంటు విప్పించి, అతడి మర్మాంగంపై తన్నారని ఆయన కోర్టుకు తెలిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నేలపై ఉమ్మి వేసి దాన్ని నాకాలని సూచించినట్లు కూడా ప్రదోష్ వెల్లడించారు. ఈ సమయంలో రేణుకాస్వామిని రక్షించేందుకు నాగరాజు ప్రయత్నించగా దర్శన్ తీవ్రంగా స్పందించారని, అనంతరం రేణుక ముఖంపై పంచ్ కొట్టారని చెప్పారు.  రేణుకాస్వామి హత్య కేసులో ప్రదోష్ రావు గతంలో అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించారు. పూర్తి, నిజమైన వివరాలను వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొనడంతో కోర్టు ఆయనకు అప్రూవర్ హోదా కల్పించింది. ఈ కేసులో తాను చూసిన, తనకు తెలిసిన విషయాలను కోర్టు ముందు వెల్లడించాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం ఇస్తే లేదా కీలక విషయాలను దాచిపెడితే మళ్లీ నిందితుడిగా మారే అవకాశం కూడా ఉందని కోర్టు షరతులు విధించింది. 2024 జూన్‌లో చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడతో పాటు పలువురు నిందితులుగా ఉన్నారు. రేణుకాస్వామిపై జరిగిన దాడిలో మొత్తం 39 గాయాలు నమోదైనట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అప్రూవర్‌గా మారిన ప్రదోష్ రావు చెప్పిన వివరాలు కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఆయన కోర్టులో వెల్లడించిన అంశాలు విచారణలో నిర్ధారణ కావాల్సి ఉంటుంది.     [Renukaswamy Murder Case, Darshan Case, Darshan Renukaswamy Case, Pradosh Rao Approver, Renukaswamy Murder, Darshan Latest News, Pradosh Rao Statement, Pavithra Gowda, Kannada Cinema, Renukaswamy Case Court Hearing]
Nora Fatehi has made a name for herself with her dancing skills and beauty. Now, the actress got a special appearance in Jailer 2. Her song is titled, Bindass and it is releasing on 30th September. Anirudh Ravichander is composing music for the film and Jailer 2 promotions have started on a big scale.  Superstar Rajinikanth is back as Jailer for this sequel in the direction of Nelson Dilipkumar. After becoming a surprise blockbuster in 2023, the makers have decided to continue the character's journey post killing his son. Entire illegal racketing network goes against him.  As he starts investigating and taking them down, he seems to meet big stars as well as Vijay Sethupathi confirmed his cameo. Mohanlal, Shiva Rajkumar, Hrithik Roshan are said to be playing cameos with Vidya Balan, SJ Suryah and Suraj Venjermoodu in negative roles.  Anirudh songs for this movie have not been receiving similar reception of his recent DC and The Paradise albums. But the makers are confident that movie will surprise in theatres as they worked over three years on script and execution. Jailer 2 is releasing on 15th October.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
   అక్టోబర్ 15 నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ వన్ మాన్ షో 'జైలర్ 2 నామ నెలగా మారనుంది.  దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ మొదటి భాగాన్ని మించి అత్యద్భుతంగా తెరకెక్కించాడనే టాక్ వినిపిస్తుంది. ఇక ఫస్ట్ పార్ట్ లో  మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన  'కావాలయ్యా' స్పెషల్ సాంగ్ సృష్టించిన సంచలన విషయం తెలిసిందే. జైలర్ హిట్ రేంజ్ శక్తిని కూడా పెంచిన రికార్డు కూడా.     ఈ క్రమంలోనే ఇప్పుడు పార్ట్ 2 లో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ డ్యాన్స్ క్వీన్ నోరా ఫతేహీగ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తన మాస్ డ్యాన్స్ మూవ్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించే నోరా ఫతేహీ, రజినీకాంత్‌తో కలిసి ఒక పవర్‌ఫుల్ అండ్ హై ఎనర్జీ స్పెషల్ డ్యాన్స్ నెంబర్‌లో స్టెప్పులేయనుంది. ఇదివరకు 'దిల్‌బర్', 'సాకి సాకి', 'మాణికే' వంటి సూపర్ హిట్ ఐటమ్ సాంగ్స్‌తో సంచలనం సృష్టించిన నోరా, సూపర్ స్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే తొలిసారి కావడంతో ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇది కూడా చదవండి: పాట వినండి.. ఉద్యోగం పొందండి..కొంతమందికి ఆఫర్స్ లెటర్ కూడా ఇచ్చారు!   చెన్నైలోని ఓ వేసిన భారీ సెట్‌లో ఏకంగా 8 రోజుల పాటు ఈ హై-వోల్టేజ్ డ్యాన్స్ నంబర్ షూటింగ్ సాగింది.   సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ ఈ మాస్ ట్రాక్‌కు అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేసారని టాక్.  తాజాగా ఈ సాంగ్ రిలీజ్ టైమ్ కూడా లాక్ అయిందనే వార్తలు బయటకు రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఈ రోజు సాయంత్రం 6 గంటల సమయానికి ఈ స్పెషల్ సింగిల్‌ను గ్రాండ్‌గా విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సాయంత్రం ఆరు నుంచి ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు.     [Jailer 2 Nora Fatehi Special Song Update, Jailer 2, Rajinikanth Jailer 2, Nora Fatehi Special Song, Jailer 2 Song Release Time, Anirudh Ravichander, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]
25 ఏళ్ల క్రితం ‘స్టూడెంట్ నెం.1’ సినిమా వచ్చింది. ఆ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ అయ్యాడు, ఎస్.ఎస్. రాజమౌళి గ్లోబల్ లెవెల్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అదే సినిమాతో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్ లో యాంకర్ గా తన కెరీర్‌‌ను ప్రారంభించిన ఒక మలయాళీ అమ్మాయి, ఇప్పుడు తెలుగువారి ఇంట ఓ కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు.. స్టార్ యాంకర్, టెలివిజన్ క్వీన్ సుమ కనకాల. తాజాగా జరిగిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుమ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సినిమాకు రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాత కావడం విశేషం. ఈ ఈవెంట్ లో సుమను రాజమౌళి ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా, ఆమె కోసం స్పెషల్ AV కోసం ప్లే చేశారు. ఈ సందర్భంగా సుమ కాస్త ఎమోషనల్ అవుతూ తన జర్నీని గుర్తుచేసుకున్నారు. ‘స్టూడెంట్ నెం.1’తో రాజమౌళి గారితో పాటు, తాను కూడా హోస్ట్ గా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. "నేను మైండ్ లోకి తెచ్చుకునే తొలి జ్ఞాపకం 'స్టూడెంట్ నంబర్ 1'. ఆ సినిమాతో ఎన్టీఆర్, రాజమౌళి వెనక్కి తిరిగి చూడలేదు, నేను కూడా ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూడలేదు" అన్నారు. సుమ అన్న మాట నిజమే. సినిమా ఈవెంట్లు, ప్రమోషన్ స్ట్రాటజీలు మారుతూ వచ్చాయి. కానీ ఇండస్ట్రీలో ఎంతమంది వచ్చినా, ఎన్ని మార్పులు వచ్చినా.. ‘యాంకర్ అంటే సుమ.. సుమ ఉంటేనే ఆ ఈవెంట్ సూపర్‌హిట్’ అనే బ్రాండ్ ఇమేజ్ మాత్రం అస్సలు మారలేదు. తెలుగు సరిగ్గా రాని ఒక మలయాళీ కుటుంబం నుంచి వచ్చి, తన అనర్గళమైన తెలుగు భాషా పటిమతో, సమయస్ఫూర్తితో, పంచ్‌లతో, ఎనర్జీతో కోట్లాది మంది తెలుగు ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదు. చిన్న సినిమాల ఆడియో లాంచ్ అయినా, 1000 కోట్ల భారీ సినిమా ఈవెంట్ అయినా.. వేదికపై సుమ ఉంటే అక్కడ పండే ఎంటర్‌టైన్‌మెంట్ వేరే లెవెల్. పాతికేళ్లుగా ఏమాత్రం చెక్కుచెదరని ఆ ఎనర్జీ, సొంత గుర్తింపును నిలబెట్టుకున్న ఆ డెడికేషన్ నిజంగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఇది కూడా చదవండి: మెగా హీరో ఏమైపోయాడు.. త్వరలోనే అభిమానులకు ఆ న్యూస్ చెబుతాడా.?       [Suma Kanakala 25 Years Journey, Don't Trouble The Trouble, Student No 1 Movie 25 Years, Anchor Suma 25 Years, Suma Kanakala, Student No 1, Jr NTR, SS Rajamouli, Telugu Film News, Tollywood News]  
హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల్లో ‘డిమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే రెండు భాగాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఇప్పుడు మూడో భాగం ‘డిమాంటీ కాలనీ 3’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరుళ్ నిధి హీరోగా, ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు విడుదలకు ముందే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. అయితే తాజాగా ఆ అడ్డంకి తొలగిపోవడంతో సినిమా రిలీజ్‌కు మార్గం సుగమమైంది. ‘డిమాంటీ కాలనీ 3’ నిర్మాణ భాగస్వామ్యం, హక్కులకు సంబంధించి వైట్ నైట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థకు, దర్శకుడు అజయ్ జ్ఞానముత్తుకు మధ్య వివాదం తలెత్తింది. ఒప్పంద నిబంధనలు ఉల్లంఘించారంటూ సదరు సంస్థ కోర్టును ఆశ్రయించడంతో మద్రాస్ హైకోర్టు సినిమా విడుదలపై తాత్కాలిక స్టే విధించింది. దీంతో ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందనే దానిపై కొంతకాలంగా అనిశ్చితి నెలకొంది. అయితే తాజాగా జరిగిన విచారణలో మద్రాస్ హైకోర్టు గతంలో విధించిన తాత్కాలిక స్టేను ఎత్తివేసింది. దీంతో ప్రస్తుత నిర్మాణ సంస్థ ప్యాషన్ స్టూడియోస్ సినిమా విడుదలకు ముందుకు వెళ్లేందుకు అనుమతి లభించింది. ఈ పరిణామంతో ‘డిమాంటీ కాలనీ 3’కు ఎదురైన ప్రధాన న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయినట్లైంది. స్టే ఎత్తివేయడంతో ఈ హారర్ థ్రిల్లర్‌ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. అరుళ్ నిధి ప్రధాన పాత్రలో నటించగా.. అజయ్ జ్ఞానముత్తు మరోసారి ఈ ఫ్రాంచైజీకి దర్శకత్వం వహించారు. దీంతో ‘డిమాంటీ కాలనీ 3’ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.     [Demonte Colony 3, Demonte Colony 3 Release Date, Arulnithi, Ajay Gnanamuthu, Demonte Colony 3 Movie, Demonte Colony 3 Telugu News, Tamil Horror Movie, Demonte Colony 3 Court Stay, Passion Studios]
BRS leader and former Telangana minister Harish Rao felicitated actor Priyadarshi for his performance as MLA Shankar in Nani’s The Paradise. The character is inspired by former Telangana Chief Minister K Chandrashekar Rao, with Priyadarshi drawing attention for his mannerisms, dialect and screen presence. Sharing a video from the felicitation ceremony on X, Harish Rao praised Priyadarshi’s journey and his portrayal in the Srikanth Odela directorial. “From Balagam and Mallesham to portraying KCR garu as MLA Shankaranna in #TheParadise his mannerisms, dialect, and screen presence are remarkable. “చావు నోట్లో తల పెట్టయినా… మీకు గుర్తింపు తెస్తా!!” Congratulations to the entire #TheParadise Movie @odela_srikanth, @NameisNani and everyone involved. Wishing you many more memorable films and greater success ahead, Darshi. All the very best for your future endeavours!” Priyadarshi’s portrayal of MLA Shankar has emerged as one of the notable aspects of The Paradise, with the actor receiving appreciation for bringing the character’s Telangana identity and mannerisms to the screen. Nani's The Paradise has been watched in theatres by KTR and BRS party workers in a special screening.  Even they also appreciated Priyadarshi for representing their leader in such a powerful role. The Paradise is collecting huge in Nizam and it is nearing breakeven mark while in all other areas, movie has crashed following first weekend and it could end up being loss venture.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  రాగం, తాళం ఏదైనా సరే మంచి 'పాట' వింటే పులకరించిపోతాం. ఇప్పుడు ఆ పాటే ఉద్యోగం కూడా కల్పిస్తే! ఏంటి జోక్ అనుకుంటున్నారా! జోక్ కాదు పచ్చి నిజం. పాట ఉద్యోగాన్ని కూడా ఇస్తుంది.  ఓ నా సిద్ధయ్య’.. సిద్ధు రెడ్డి, కాత్యాయని జగన జంటగా ఈ సాంగ్ లో చేసారు. రామ్ అద్నాన్ పాటని రాయడంతో పాటు  తెరకెక్కించారు. కళ్యాణ్ కీస్ సంగీత సారథ్యంలో రామ్ అద్నాన్, శ్రీనిధి ఈ పాటను పాడారు. ఈ సాంగ్ బృందం ఆధ్వర్యంలో హైదరాబాద్ హైటెక్ సిటీలోని సైబర్ గార్డెన్స్‌లో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 70 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు మేళాలో పాల్గొని ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హత కలిగిన అభ్యర్థులను అక్కడికక్కడే ఎంపిక చేసి, పలువురికి వెంటనే ఆఫర్ లెటర్లు అందజేశారు. ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం'శ్రీనిధి శెట్టి కెరీర్‌ని మలుపు తిప్పుతుందా:ట్రాక్ రికార్డు మాత్రం ఇదే!   [O Naa Siddayya Song Titile First look announced,  O Naa Siddayya,Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tolywood News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
నేటి వేగవంతమైన జీవనశైలిలో అధిక రక్తపోటు లేదా సైలెంట్ కిల్లర్‌గా పిలిచే హై బీపీ సమస్య మిలియన్ల మంది ప్రజలను వేధిస్తోంది. బీపీని సహజసిద్ధంగా అదుపులో ఉంచుకోవడానికి సరైన ఆహార నియమాలు పాటించడం అత్యంత కీలకమని వైద్య నిపుణులు నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మన దైనందిన ఆహారంలో ఎక్కువగా భాగమయ్యే అరటిపండు, నారింజలలో ఏది రక్తపోటును తగ్గించడానికి ఎక్కువ మేలు చేస్తుందనే ఆసక్తికరమైన ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదులుతుంది. నిజానికి ఈ రెండు పండ్లూ ఆరోగ్యానికి ఎంతో శ్రేష్ఠమైనవే అయినప్పటికీ, వాటిలో ఉండే పోషక విలువలు శరీరంలో భిన్నమైన రీతిలో ప్రభావం చూపుతాయి. హై బీపీని నియంత్రించడంలో పొటాషియం అనే ఖనిజ లవణం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారంలో పొటాషియం తగినంతగా లభించినప్పుడు అది శరీరంలో ఉండే అధిక సోడియం లేదా ఉప్పు ప్రభావాన్ని సమర్థవంతంగా సమతుల్యం చేస్తుంది. అలాగే రక్తనాళాల మూత్రపిండ వ్యవస్థ ద్వారా అదనపు సోడియంను మూత్రం రూపంలో బయటకు పంపివేసి, రక్తనాళాల గోడలపై పడే విపరీతమైన ఒత్తిడిని తగ్గించి వాటి సాధారణ పనితీరుకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది. అరటిపండును పరిశీలిస్తే, ఇది పొటాషియానికి ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన మూలంగా నిలుస్తుంది. ఒక సాధారణ మధ్యస్థ పరిమాణంలో ఉండే అరటిపండు ద్వారా శరీరానికి సుమారు 400 మిల్లీగ్రాముల అత్యధిక పొటాషియం లభిస్తుంది. ఈ అధిక పొటాషియం మోతాదు రక్తనాళాల సంకోచ సడలికలను క్రమబద్ధీకరించి, పెరిగిన రక్తపోటును తక్షణమే నియంత్రణలోకి తేవడానికి అమితంగా తోడ్పడుతుంది. మరోవైపు నారింజ పండు విషయానికి వస్తే, అరటిపండుతో పోలిస్తే ఇందులో పొటాషియం మోతాదు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, ఇది రోగనిరోధక శక్తిని పెంచే శక్తివంతమైన విటమిన్ సి, ఫోలేట్ మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి విశిష్టమైన పోషకాలను, యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా అందిస్తుంది. నారింజను కేవలం జ్యూస్‌ రూపంలో కాకుండా నేరుగా పూర్తి పండుగా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత విటమిన్ సీతో పాటు నాణ్యమైన ఫైబర్ కూడా లభించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల హై బీపీ ఉన్నవారు ఈ రెండింటిలో కేవలం ఒకే పండుపై ఆధారపడవలసిన అవసరం లేదు. అరటిపండు శరీరానికి కావలసిన పొటాషియంను అందిస్తే, నారింజ విటమిన్ సి, ఫోలేట్ వంటి పోషకాలతో రక్తనాళాల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. కాబట్టి రోజువారీ డైట్‌లో ఈ రెండింటితో పాటు ఆపిల్, కివి, పుచ్చకాయ మరియు అవకాడో వంటి రకరకాల పండ్లను సమతుల్యంగా చేర్చుకోవడం అత్యంత శ్రేయస్కరం. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి; కేవలం పండ్లు తినడం వల్లే బీపీ పూర్తిగా తగ్గిపోదు. దీనితో పాటు ఉప్పు వాడకం తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు బరువును అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి. అలాగే తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉన్నవారు పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్ల వంటి ఆహారాన్ని తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.     Potassium Vs Vitamin C For Blood Pressure, High BP Control Potassium Benefits, Potassium 400mg For Hypertension, Vitamin C Blood Pressure Lowering, Best Nutrient To Lower BP, Sodium And Potassium Balance BP, Natural Remedies For High Blood Pressure, Hypertension Control Tips Telugu.  
నేటి తరం యువత లేదా జెన్ జీ (Gen Z) పండుగల షాపింగ్ చేసే విధానం పాత పద్ధతులకు పూర్తి భిన్నంగా, అత్యంత వినూత్నంగా మారుతోంది. ఒకప్పుడు పండుగ వస్తోందంటే నేరుగా బట్టల షాపులకు వెళ్లడం, నచ్చిన దుస్తులను కొనుగోలు చేయడం ఒక ఆనవాయితీగా ఉండేది. కానీ నేటి జెన్ జీ వినియోగదారులకు పండుగ షాపింగ్ అనేది కేవలం ఒక ట్రెండ్ చూసి వెంటనే బట్టలు కొనడం మాత్రమే కాదు; అదొక పెద్ద రీసెర్చ్ ప్రాసెస్. సోషల్ మీడియా ఆధారిత ఐడియాలు, పాత బట్టలను సరికొత్తగా మార్చే అప్‌సైక్లింగ్ హ్యాక్స్, నిజమైన కస్టమర్ రివ్యూలు, మరియు ఏఐ పరిజ్ఞానంతో బేరాలు ఆడటం వంటి అనేక ఆసక్తికరమైన వ్యూహాలు వీరి షాపింగ్ ప్లాన్‌లో ప్రధాన భాగంగా మారాయి. ఇటీవల వెలువడిన ప్రముఖ స్నాప్‌చాట్  జీడబ్ల్యూఐ (Snapchat GWI) అధ్యయనం ప్రకారం, ప్రతి 10 మంది జెన్ జీ వినియోగదారులలో ఏకంగా 7 మంది (70%) కొత్త దుస్తులు లేదా ప్రాడక్ట్‌లను కనుగొనడానికి సోషల్ మీడియా క్రియేటర్ల కంటెంట్‌‌పైనే ఆధారపడుతున్నారు. అంతేకాకుండా, అందులో 40 శాతం మంది ఏదైనా వస్తువును కొనుగోలు చేసే ముందు కచ్చితంగా ఇతర నెటిజన్లు లేదా స్నేహితుల సలహాలు, అభిప్రాయాలను కోరుతున్నారని ఈ గణంకాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. జెన్ జీ పండుగ షాపింగ్‌లో  అప్‌సైక్లింగ్  (Upcycling) అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాక్‌గా నిలుస్తోంది. దుస్తుల కోసం వేలాది రూపాయలు తగలేయకుండా, ఇంట్లో ఉండే అమ్మల, నానమ్మల పాత పట్టు చీరలను, సూట్లను సరికొత్త డిజైనర్ దుస్తులుగా మార్చుకోవడానికి నేటి యువత అమితంగా ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు, దీపావళి వంటి పెద్ద పండుగలకు తల్లి పట్టు చీరను ట్రెండీ కో ఆర్డ్ సెట్ (Co ord set) గా మార్చడం, లేదా పాత పట్టుచీర సరిహద్దులను (Borders) కొత్త కుర్తాలకు లేదా ప్లెయిన్ దుస్తులకు కుట్టించి సరికొత్త లుక్ తీసుకురావడం నేటి ట్రెండ్. ఇటీవలే ట్రెండ్ అయిన  గోటా పట్టీ  (Gota Patti) లేస్‌ను సాధారణ కుర్తాలకు జతచేసి సరికొత్త పండుగ డ్రెస్‌గా డిజైన్ చేసుకోవడం యువతను బాగా ఆకట్టుకుంటోంది. సంప్రదాయబద్ధమైన దుస్తుల రూపాన్ని కోల్పోకుండానే, బ్లౌజ్ డిజైన్, శారీ డ్రేపింగ్, ట్రెండీ జ్యువెలరీ లేదా సరికొత్త రంగుల కాంబినేషన్‌తో మోడర్న్ టచ్ ఇవ్వడం జెన్ జీ క్రియేటివిటీకి అద్దం పడుతోంది. పండుగ ఫ్యాషన్ ట్రెండ్స్‌‌ను తెలుసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్ (Instagram), పింటరెస్ట్ (Pinterest) వంటి ప్లాట్‌ఫామ్‌లు వీరికి ప్రధాన ఆమోదయోగ్యమైన మూలాలుగా మారాయి. పండుగలకు నెల రోజుల ముందే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ధరించే దుస్తులు రాబోయే పండుగ సీజన్ ట్రెండ్స్‌ను నిర్దేశిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కొత్త ఫ్యాషన్ ఐడియాలను చూసే యువత, వాటిని తాము నిజంగా కొనుగోలు చేయవచ్చా లేదా అని లోతుగా విశ్లేషించడానికి పింటరెస్ట్‌లో రీసెర్చ్ చేస్తున్నారు. ఇక్కడే కాకుండా, ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లలో బెస్ట్ డీల్స్ పొందడానికి కూడా ప్రత్యేకమైన ట్రిక్స్ వాడుతున్నారు. ఆన్‌లైన్ విష్‌లిస్ట్ (Wishlist) లేదా కార్ట్‌‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ, ధరలు తగ్గగానే నోటిఫికేషన్లు పొందడం ద్వారా బడ్జెట్ ఆదా చేస్తున్నారు. ఉత్పత్తుల నాణ్యతను అంచనా వేయడానికి ఫేక్ రివ్యూలను పక్కనబెట్టి, అత్యంత నిజాయితీతో కూడిన రివ్యూలు లభించే  రెడ్డిట్  (Reddit) వేదికను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మరో ఆసక్తికరమైన అంశమేమిటంటే, ఈ ఆధునిక పండుగ షాపింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరగడం. రకరకాల ఈ కామర్స్ సైట్లలో ఉన్న ధరలను పోల్చి చూడటానికి, అలాగే ఏవి ఒరిజినల్ కస్టమర్ రివ్యూలు, ఏవి బాట్ (Bot) రివ్యూలు అని విశ్లేషించడానికి జెన్ జీ యువత ఏఐ ప్రాంప్ట్‌లను వాడుతోంది. లగ్జరీ డిజైనర్ వేర్ నచ్చినప్పుడు, అదే డిజైన్ కలిగిన కాపీ లేదా డ్యూప్ (Dupe) దుస్తులు తక్కువ ధరలో ఎక్కడ లభిస్తాయో ఆన్‌లైన్‌లో వెతుకుతున్నారు. ఒకవేళ ఆన్‌లైన్ డ్యూప్ ధర, సొంతంగా బట్ట తీసి కుట్టించే ఖర్చు సమానంగా ఉంటే, లజపత్ నగర్ లేదా సరోజినీ నగర్ వంటి స్థానిక మార్కెట్లలో మెటీరియల్ కొని డిజైనర్ చేత కుట్టించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ట్రెండ్స్, మరియు సాంప్రదాయకమైన పొదుపు సూత్రాలను సమ్మేళనం చేస్తూ జెన్ జీ జరిపే పండుగ షాపింగ్ ఇప్పుడు కొత్త చరిత్రను సృష్టిస్తోంది.     Gen Z Festive Fashion, Old Saree Conversion Ideas, DIY Designer Dresses Saree, Sustainable Fashion Gen Z, Old Saree to Indo Western Dress, Festive Shopping Hacks, Old Silk Saree Upcycling, Trending Saree Reuse Ideas.  
ఎవరూ దోచుకోలేని సంపద ఇదే.. చాణక్యుడు చెప్పిన గొప్ప సత్యం! జీవితంలో మనిషికి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. డబ్బు, పదవి, అధికారం ఉన్నా.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే అవేవీ మనకు ఉపయోగపడవు. అందుకే చాణక్యుడు జ్ఞానానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. చాణక్య నీతి ప్రకారం.. మనిషి నిరంతరం జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి. ఎందుకంటే జ్ఞానం అనేది ఎవరూ దోచుకోలేని సంపద. మన దగ్గర ఉన్న డబ్బు పోవచ్చు.. పదవి మారిపోవచ్చు.. కానీ మనం నేర్చుకున్న జ్ఞానం మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. జ్ఞానం ఒక ఆయుధంలా పనిచేస్తుంది. ఏ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలి? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఎవరిని నమ్మాలి? ఎలాంటి సమస్యను ఎలా పరిష్కరించాలి? అనే విషయాల్లో జ్ఞానం మనకు మార్గనిర్దేశం చేస్తుంది. జ్ఞానం ఉన్న వ్యక్తి సమస్యలను చూసి భయపడకుండా.. వాటికి పరిష్కారం వెతుకుతాడు. ఒక సమస్య ఎదురైతే నిరాశ చెందకుండా, దాని నుంచి పాఠం నేర్చుకుని మరింత తెలివిగా ముందుకు సాగుతాడు. అందుకే జీవితంలో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే అలవాటు చేసుకోవాలి. పుస్తకాలు చదవడం, అనుభవజ్ఞుల మాటలు వినడం, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మన తప్పుల నుంచి పాఠాలు తీసుకోవడం.. ఇవన్నీ జ్ఞానాన్ని పెంచే మార్గాలే. గుర్తుంచుకోండి.. సంపదను కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ జ్ఞానం లేకపోతే.. సంపద ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకోవడం కష్టం. కాబట్టి జీవితంలో ఎదగాలంటే.. డబ్బుతో పాటు జ్ఞానాన్ని కూడా సంపాదించండి. ఎందుకంటే జ్ఞానం మీకు దారి చూపే దీపం మాత్రమే కాదు.. కష్టాలను ఎదుర్కొనే ఆయుధం కూడా. ఇక నుంచి రోజుకు కనీసం 20 నిమిషాలు మీ జ్ఞానం కోసం కేటాయించండి. ఒక మంచి పుస్తకం చదవండి.. ఒక కొత్త విషయం నేర్చుకోండి.. ఒక తప్పు నుంచి ఒక పాఠం తీసుకోండి. ఎందుకంటే ఒక మంచి జ్ఞానం.. ఒక జీవితాన్నే మార్చగలదు.! 
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఒక వినూత్నమైన వ్యాయామ విధానం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. నెమ్మదిగా, ప్రశాంతంగా, డాన్స్ చేస్తున్నట్లుగా సాగే ఆ కదలికలే "తాయ్ చి". నార్మల్ గా అందరూ చేసే  జిమ్ వర్కౌట్లు, వేగంగా రన్నింగ్ చేయడం వంటివి కాకుండా  మానసిక ప్రశాంతతతో పాటు శరీరానికి  దారుఢ్యాన్ని ఇచ్చే ఈ ప్రాచీన విధానం వైపు నేటి యువత, ఫిట్‌నెస్ ప్రేమికులు విశేషంగా ఆకర్షితులవుతున్నారు. సోషల్ మీడియా లో రీల్స్, షార్ట్స్ లో వేలాదిమంది దీనికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుండటంతో ఇది నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఏమిటీ తాయ్ చి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. తాయ్ చి.. తాయ్ చి అనేది చైనాకు చెందిన ఒక ప్రాచీన మార్షల్ ఆర్ట్ విధానం. మొదట్లో  ఇది ఒక ఆత్మరక్షణ విద్యగా ఉద్భవించినప్పటికీ, కాలక్రమేణా ఇది ఒక అద్భుతమైన ఆరోగ్య, ఫిట్‌నెస్ సాధనగా రూపాంతరం చెందింది. దీనిని తరచుగా మూమెంట్ మెడిటేషన్ అని పిలుస్తారు. ఈ విధానంలో వేగవంతమైన కదలికలు ఉండవు. చాలా నెమ్మదిగా, శ్వాసపై ధ్యాస ఉంచుతూ, శారీరక సమతుల్యతను కాపాడుకుంటూ ఒక పోజిషన్ నుంచి మరొక పొజిషన్ కు  శరీరాన్ని తిప్పుతారు. శ్వాస ప్రక్రియను శరీర కదలికలతో అనుసంధానించడమే దీనిలోని ప్రధాన సూత్రం. ఇది శరీరంలోని అంతర్గత శక్తిని నిద్రలేపి, శరీరం అంతటా సరిగ్గా ప్రసరించేలా చేస్తుంది. చైనీస్ సంస్కృతిలో దీనిని 'చి' అని పిలుస్తారు. తాయ్ చి చేసే విధానం.. తాయ్  చి సాధనలో మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి.. నెమ్మదిగా చేసే కదలికలు.. శరీరంలోని ప్రతి కండరాన్ని ఉపయోగిస్తూ, కీళ్లపై ఎటువంటి ఒత్తిడి పడకుండా చాలా సజావుగా కదలికలు ఉంటాయి. లోతైన శ్వాస.. కదలికలకు అనుగుణంగా ప్రశాంతంగా, లోతుగా శ్వాస తీసుకోవడం , వదలడం జరుగుతుంది. మానసిక ఏకాగ్రత.. వ్యాయామం చేసే సమయంలో దృష్టి మొత్తం శరీరం , శ్వాసపైనే ఉంటుంది. దీనివల్ల బయటి ఆలోచనల నుంచి మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. తాయ్ చి అందించే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. సోషల్ మీడియాలో ఇది కేవలం ఒక ఫ్యాషన్ గా మాత్రమే ట్రెండ్ కావడం లేదు, దీని వెనుక ఎన్నో శాస్త్రీయ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి తగ్గింపు.. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన సర్వసాధారణమయ్యాయి. తాయ్ చి లోని లోతైన శ్వాస , ఏకాగ్రతతో కూడిన కదలికలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది శారీరక ఒత్తిడిని తగ్గించి, మనస్సుకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. శరీర బ్యాలెన్స్ , దృఢత్వం.. వయసు పైబడిన వారికి లేదా కాళ్ళ బలం తక్కువగా ఉన్నవారికి తాయ్ చి ఒక వరప్రసాదం. ఇది కాళ్ళు, నడుము భాగాల్లోని కండరాలను బలోపేతం చేసి, శరీర సమతుల్యతను పెంచుతుంది. దీనివల్ల కింద పడిపోయే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.. ఇది తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామం అయినప్పటికీ, రక్తాప్రసరణను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఆర్థరైటిస్ (కీళ్ల వాతం) లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. వేగవంతమైన వర్కౌట్ల వల్ల కీళ్లపై పడే భారంతో పోలిస్తే, తాయ్ చి కీళ్లను మెల్లిగా కదిలిస్తూ నొప్పులను తగ్గిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థకు మంచిది.. దీనిలో శ్వాసపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. శరీరంలోని ప్రతి కణానికి ప్రాణవాయువు సమృద్ధిగా అందుతుంది. నిద్రలేమి సమస్యకు పరిష్కారం.. ప్రతిరోజూ కొద్దిసేపు తాయ్ చి సాధన చేయడం వల్ల రాత్రి వేళల్లో మంచి, ప్రశాంతమైన నిద్ర పడుతుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఏకాగ్రత , జ్ఞాపకశక్తి.. శరీరం , మనస్సు రెండింటినీ ఒకేసారి ఉపయోగించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇది ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచడంలో దోహదపడుతుంది. ఎవరైనా చేయవచ్చా? తాయ్ చి యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, దీనికి ప్రత్యేక పరికరాలు కానీ, పెద్ద స్థలం కానీ అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనిని సాధన చేయవచ్చు. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా, సున్నితమైన పద్ధతిలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన మార్గం.                    *రూపశ్రీ.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో బొప్పాయి పండుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.  పీచు పదార్థాలు, విటమిన్లు, అలాగే జీర్ణక్రియకు దోహదపడే పపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి. ఇది కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఎంతో సహాయపడుతుంది. ఉదయాన్నే పరగడుపున లేదా సాయంత్రం వేళల్లో బొప్పాయిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే ఎంతటి ఆరోగ్యకరమైన ఆహారమైనా దాన్ని తినే విధానం సరిగ్గా ఉండాలి. ముఖ్యంగా బొప్పాయిని కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల ప్రయోజనాలకు బదులు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. జీర్ణ వ్యవస్థను దెబ్బతీసే అటువంటి కొన్ని ఆహార కలయికల గురించి వివరంగా తెలుసుకుంటే.. పాలు , డైరీ ఉత్పత్తులు.. చాలామంది పండ్లతో పాటు పాలు లేదా ఇతర పాల పదార్థాలను తీసుకోవడం అలవాటుగా చేసుకుంటారు. ఎక్కువ శాతం మంది పండ్లతో మిల్క్ షేక్ తీసుకోవడానికే ఇష్టపడతారు.  కానీ బొప్పాయిని పాల ఉత్పత్తులతో కలిపి తీసుకున్నప్పుడు అందులోని ఎంజైములు రియాక్షన్ జరిపి కడుపులో గ్యాస్, యాసిడిటీ , ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తాయి. జీర్ణవ్యవస్థపై ఇది తీవ్రమైన భారాన్ని పెంచి పొట్టలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.  అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాలు.. బొప్పాయిలోని ఎంజైములు ప్రోటీన్లను సులభంగా విచ్ఛిన్నం చేయగలవు. అయితే మాంసం, గుడ్లు లేదా పప్పు ధాన్యాలు వంటి అధిక ప్రోటీన్ కలిగిన భారీ ఆహారాలతో బొప్పాయిని ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో తేడా జరుగుతుంది.  కాబట్టి బొప్పాయిని ఎల్లప్పుడూ తేలికపాటి ఆహారంతో మాత్రమే తీసుకోవడం శ్రేయస్కరం. నూనెలో వేయించిన పదార్థాలు.. బొప్పాయి వేగంగా అరిగిపోయే గుణం కలిగి ఉండే పండు, కానీ వేపుళ్లు లేదా నూనె పదార్థాలు జీర్ణం కావడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటిని కలిపి తిన్నప్పుడు జీర్ణ వ్యవస్థ  సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల కడుపులో భారం, అసౌకర్యం , గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. ఆహారం తినగానే పండ్లు తినే అలవాటు ఉండేవారు నూనెలో వేయించిన ఆహారాలు తిన్న వెంటనే బొప్పాయి తినడం అంత మంచిది కాదు.  పులియబెట్టిన లేదా ఈస్ట్ తో తయారు చేసిన ఆహారాలు..  ఫర్మెంటేషన్ ప్రక్రియ ద్వారా తయారయ్యే ఆహార పదార్థాలతో బొప్పాయిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కాంబినేషన్ వల్ల ఇబ్బందులు మరింత ఎక్కువవుతాయి. అరటిపండు కాంబినేషన్.. అరటిపండు,  బొప్పాయి రెండూ పండ్లే అయినప్పటికీ, అరటిపండు , బొప్పాయిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది కాదు. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణక్రియ వేగం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా ఎప్పుడూ  కడుపు నిండిపోయినట్లు, భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి బొప్పాయి ఇచ్చే సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలను పొందాలంటే దాన్ని ఇతర ఆహారాలతో కలపకుండా విడిగా మాత్రమే తినడం మంచిది. అది కూడా ఆహారం తీసుకున్న వెంటనే కాకుండా కనీసం అరగంట నుండి గంట సమయం వ్యవధి ఇచ్చి పండిన బొప్పాయిని సరైన మోతాదులో తీసుకుంటే  ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.                                                                                                                                                     *రూపశ్రీ.