తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి  అన్నామలై కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఒక్కప్పుడు ప్రధాని మోడీకి అత్యంత విధేయుడు, కరడుగట్టిన బీజేపీ కార్యకర్త, అయిన అన్నామలై  బీజేపీకి గుడ్ బై చెప్పి..  వి ది లీడర్ అనే పేరుతో ఒక కొత్త స్వతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. అయితే సొంత కుంపటి పెట్టిన అన్నామలై ఇంత వరకూ కేంద్రంపై కానీ, కేంద్ర విధానాలపై కానీ ఘాటు విమర్శలు చేసిన సందర్భం లేదు. అటువంటి అన్నామలై, ఇప్పుడు..  ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా, అలాగే సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా సీజేపీ చేస్తున్న ఆందోళనకు బాహాటంగా మద్దతు పలికారు.   దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశమవుతున్న ఎస్‌ఐఆర్  వివాదాలు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీనామా డిమాండ్లు, అలాగే విపక్షాలు,  యువత చేపడుతున్న ఆందోళనలను కేంద్రం అణచివేయాలని చూడటాన్ని అన్నమలై తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి రాసిన సుదీర్ఘ లేఖలో  ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించిన పాత వ్యాఖ్యలను గుర్తుచేశారు. అప్పట్లో మోదీ చేసిన కామెంట్లను నేడు కేంద్ర ప్రభుత్వానికి అన్వయిస్తూ ఆయన పలు ప్రశ్నలు సంధించారు. మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జంతర్ మంతర్ ప్రాంతాన్ని నిరసనలకు అనర్హమైనదిగా ప్రకటించడం, నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారాలు వంటి అనేక కీలక అంశాలను ఆయన తన   లేఖలో ప్రస్తావించారు. కేవలం  వాట్సాపిజం ఎదురుదాడి ధోరణిని ప్రదర్శించకుండా, ప్రజలు లేవనెత్తుతున్న   ప్రశ్నలకు కేంద్రం సూటిగా సుత్తి లేకుండా సమాధానం ఇవ్వాలని అన్నామలై తన లేఖలో డిమాండ్ చేశారు.    సమస్యలకు వ్యతిరేకంగా వినిపిస్తున్న గొంతులను అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నామలై నిప్పులు చెరిగారు.    దసరా సందర్భంగా రావణ దహనంలో బొద్దింక దిష్టిబొమ్మను తగలబెట్టడం వంటి ఘటనలను సీజేపీకి ఉచిత ప్రచారం కల్పించడమేనని వ్యాఖ్యానించారు.  ఈ సందర్భంగా అన్నామలై కేంద్రంలోని మోడీ సర్కార్ ను నిలదీస్తూ కొన్ని ప్రశ్నలను సంధించారు.  సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.  ఇప్పటికే పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతతో అసలే ఇబ్బందుల్లో ఉన్న బీజేపీకి, ఇప్పుడు నాటి మోడీ విధేయుడు సంధించిన ప్రశ్నాస్త్రాలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసినట్లైందనడంలో సందేహం లేదు.   [Annamalai Fires Center, Repression, Peoples Movement, BJP Central Government, Modi Old Comments, Tamil Nadu Politics, Annamalai We The Leader, Telugu One]
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో  భేటీ అయ్యారు. గురువారం (అక్టోబర్ 22) ఆయన   కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.   ఎన్నికల సంఘం 100 నియోజకవర్గాల్లో ఎన్నికలను నిలిపివేయడం, ఈ ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో  వీరిరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  అంతేకాకుండా, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు, ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. అన్నిటికీ మించి   ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ రాజీనామా చేస్తారనీ, తెలుగుదేశం, జనసేన పొత్తు విచ్ఛిన్నం అంటూ సోషల్  మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మధ్య జరిగిన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ముఖ్యంగా బుధవారం (అక్టోబర్ 21) రాత్రి నుంచీ  సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయబోతున్నారని, తెలుగుదేశం పార్టీతో జనసేన తెగతెంపులు చేసుకోనుందంటూ కొందరు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీకి చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఈ వదంతు ప్రచారం అయ్యాయి.  దీంతో  ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ పవన్ కళ్యాణ్ నేరుగా సీఎం నివాసానికి వెళ్లి ఎలాంటి భద్రత లేకుండా సమావేశం అయ్యారని అంటున్నారు.  కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన జనసేన, తెలుగుదేశం మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, రాష్ట్ర అభివృద్ధి,  ఎన్నికల వ్యూహాలపై ఇద్దరు నేతలు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని ఈ భేటీ మరోసారి చాటింది. ఎలాంటి ప్రోటోకాల్స్‌ను పాటించకుండా, అత్యంత సాధారణంగా పవన్ కళ్యాణ్  సీఎంను ఆయన అధికారిక నివాసానికి వెళ్లి కలవడం ఇరు పార్టీల మధ్యా ఉన్న సఖ్యత, సమన్వయాన్ని మరింత బలంగా చాటిందని పరిశీలకులు అంటున్నారు.    [Pawan Kalyan Meet  Chandrababu Naidu, AP Politics, Jana Sena TDP Alliance, Local Body Elections, Resign Rumours, Andhra Pradesh Politics, Telugu One]
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ'   చేపట్టిన ఉద్యమాన్ని అడ్డుకోవడానికి, లేదా అణచివేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ చేయగలిగినంతా చేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతలను అరెస్టు చేయడం, అలాగే మొదటి దశ నిరసనను అణచివేయడంలో కేంద్రం ఒకింత సక్సెస్ అయ్యింది కూడా. వరుస అరెస్టులు కేసులతో బొద్దింకల పార్టీ ఓ మెట్టు దిగి.. దీపావళి తరువాత వరకూ ఉద్యమానికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది కూడా. కానీ అంతలోనే మళ్లీ  శుక్రవారం (అక్టోబర్23) నిరసనకు పిలుపునిచ్చారు. అది పక్కన పెడితే.. కాక్రోచ్ ఉద్యమానికి పరకాల ప్రభాకర్ బహిరంగంగా మద్దతు తెలపడం ద్వారా కేంద్రానికి బిగ్ షాక్ ఇచ్చారు. ఇంతకీ ఈ పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.    కేంద్ర విత్త మంత్రి భర్త, ప్రముఖ ఆర్థిక వేత్త అయిన  పరకాల ప్రభాకర్, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 23న జరగనున్న బొద్దింకల నిరసనలో  పాల్గొంటానని ప్రకటించడం ద్వారా కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.  ఎన్నిక  అక్రమాలు, ఈవీఎం  నిర్వహణలో అవకతవకలపై పరకాల ప్రభాకర్ గత కొంతకాలంగా బహిరంగ విమర్శలు చేస్తున్న సంగతి విదితమే.  కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న నిర్మలా సీతారామన్ భర్తే  ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనడం కేంద్రానికి మింగుడుపడటం లేదు.    శుక్రవారం (అక్టోబర్ 23) జరగనున్న బొద్దింకల నిరసనలో కేంద్ర విత్త మంత్రి భర్త పరాకాల ప్రభాకర్‌తో పాటు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ తదితరులు  పాల్గొంటున్నారు.  అసలింతకీ సర్ విషయంలో పరకాల ప్రభాకర్ గత కొంత కాలంగా తన అభ్యంతరాలను బాహాటంగానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి అర్హుల పేర్లను కూడా తొలగిస్తున్నారంటూ ఆయన ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించారు.  ఓటర్ల జాబితాల్లో పేర్లు తొలగిన వారు  తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని కూడా ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.   ఈ నేపథ్యంలోనే ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఇప్పుడీ ఆందోళనలో ప్రత్యక్షంగా పొల్గొనేందుకు సిద్ధపడటం ద్వారా కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. పరకాల ప్రభాకర్ బొద్దింకల ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ప్రకటించడం విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు నిస్సందేహంగా ఇబ్బందికరంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అది పక్కన పెడితే.. విధానాల పరంగా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ ల అభిప్రాయాలు వేరు వేరు అన్న సంగతి గతంలో కూడా పలు సందర్భాలలో బయటపడింది. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలను గతంలో కూడా పరకాల ప్రభాకర్ పలు మార్లు విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై పలు మార్లు ఘాటు విమర్శలు చేశారు.  మరీ ముఖ్యంగా  ఆయన రచించిన ది క్రూకడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా ( The Crooked Timber of New India) పుస్తకంలోనూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనను బాహాటంగా మద్దతు ఇవ్వడం ద్వారా ఆయన కేంద్రానికి బిగ్ షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [Parakala Prabhakar Join CJP Protests, Union Minister Nirmala Sitharaman Husband, SIR Protest, Gyanesh Kumar,Resign Demand,  Shock, Center, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Following the traction garnered by Caution 1 and the audience interest in its irreverent humour and eccentric characters, the makers of Jo Jo have unveiled Caution 2, offering another glimpse into the film’s raw, rustic world. Presented by filmmaker Deva Katta, the latest instalment shifts the spotlight from the pursuit of diamonds to the complications of romance, with a sharp exchange about masculinity, commitment and what it takes to stand by someone. Written and directed by Kiran Jay Kumar and produced by Vijay Krishna Lingamaneni under the Vijayam banner, Jo Jo continues to build its identity around an unfiltered comic voice and distinctly rooted characters. The first glimpse introduced audiences to the drought-hit diamond fields of Jonnagiri, where the promise of sudden fortune brought together an unlikely group of dreamers. Its blend of absurd situations, earthy dialogue and unapologetic humour established the film’s distinctive tonal space. Caution 2 carries that sensibility forward, this time through a relationship dynamic that turns a seemingly straightforward conversation into a test of character. Opening with villagers moving through Jonnagiri and visuals of people working in the fields against a landscape dotted with wind turbines, the glimpse establishes its rural setting before moving into a candid exchange between the lead characters. The woman challenges the protagonist’s understanding of manhood, questioning whether it is defined by physical attributes or by the courage to take responsibility for the woman he claims to love. She draws a clear distinction between pursuing a girl for a few days and being willing to marry her, share her burdens and stand beside her for a lifetime. The protagonist responds with an emphatic assurance that he never goes back on his word, crediting his upbringing for his conviction. The exchange then takes an unexpected comic turn with a reference to Balakrishna, adding a familiar pop-culture touch to the scene. The humour lies not merely in the punchline but in the contrast between the woman’s pointed questioning and the protagonist’s earnest defence of himself. It is this interplay of character, colloquial dialogue and irreverence that gives Caution 2 its appeal, allowing the comedy to emerge from the situation rather than feel imposed upon it. At the heart of Jo Jo are two penniless dreamers and a fearless young woman pursuing the possibility of a life-changing diamond discovery. Their ambitions soon become entangled with romance, greed, betrayal, danger and comic misadventures. With the first glimpse establishing the eccentricities of their treasure hunt, the second expands the film’s canvas by introducing another dimension of the relationships that drive the story. Krishna Kamal plays Seenu, while Maahi Sri portrays Supraja. The ensemble cast includes Phanindra Devarapalli as Venkatesh, Prabhavathi as Vijayamma, Mahaboob Basha as Suri, Satish Devatte Tanjore as Rangasaami, Puduru Sharath Babu as Ramana and Makarand Deshpande as Mukesh Shah. The technical team comprises Rohit Kumar as Director of Photography, Mahesh Shankar as Music Director and Madhav Kumar Gullapalli as Editor, with lyrics by Rehman, Srinivas Mouli and Ramachandra. With Caution 2, Jo Jo continues to build on the distinctive comic sensibility introduced in its first glimpse, pairing a rural backdrop with sharp exchanges and unconventional romantic dynamics. The film is positioned as a raw, rustic romantic comedy, and is coming soon in theatres. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
సావిత్రి, శ్రీదేవి.. తరాలు తేడా ఉన్నా తమ అందం, అంతంకంటే అందమైన అభినయంతో తెలుగు సినిమాని మహారాణి హోదాలో ఏలిన లెజండ్రిస్. ఎంత పెద్ద హీరో కట్ అవుట్ పెత్తనం అయినా ఆ ఇద్దరి ముందు మాత్రం చెల్లదు. ఈ మాట సత్యం కాదనే సాహసం ఎవరు చెయ్యరు. అంతలా తెలుగు సెల్యులాయిడ్ పై తమ ఆధిపత్యాన్ని చెలాయించి తెలుగు కళామతల్లి సిగలో మణిహారంగా నిలిచారు. అందుకే అభిమానుల నిత్య నామ స్మరణలో  ఈ ఇద్దరు అంతకు ముందే పెళ్లి అయిన వ్యక్తులని పెళ్లి ఎలా చేసుకున్నారనే చర్చ జరుగుతూనే ఉంటుంది.   కేవలం ఆకర్షణో లేక అనుకోని పరిణామాలో కాకుండా, వారి మనసులని  గాయపరిచిన గాఢమైన ప్రేమలే ఆ వైవాహిక నిర్ణయాలకు ప్రధాన కారణమయ్యాయని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమిళ చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని నటుడిగా వెలుగొందుతున్న జెమినీ గణేశన్‌తో సావిత్రికి ఏర్పడిన పరిచయం కాలక్రమేణా గాఢమైన ప్రేమగా రూపాంతరం చెందింది. అప్పటికే వివాహితుడైన జెమినీ గణేశన్‌ను సావిత్రి చాలా గాఢంగా ప్రేమించింది. వారిద్దరి కెమిస్ట్రీ తెరపై ఎంతగా అద్భుతాలు సృష్టించిందో, నిజ జీవితంలోనూ వారి బంధం అలాగే కొనసాగింది. సమాజం యొక్క కట్టుబాట్లను, కుటుంబ సభ్యుల వ్యతిరేకతను సైతం లెక్కచేయకుండా జెమిని గణేష్ ని  సావిత్రి జీవిత భాగస్వామిగా స్వీకరించారు. 1952 నాటి కాలంలోనే ఇరువురి మనసులు కలవడంతో ఈ వివాహ బంధం ఏర్పడింది. అయితే, ఈ ప్రేమ ప్రయాణం సావిత్రి కెరీర్‌ను ఓ వెలుగు వెలిగించినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆమె తీవ్రమైన మానసిక సంఘర్షణను ఎదుర్కొనేలా చేసింది. జెమినీ గణేశన్‌తో ఉన్న అనుబంధం వల్ల కలిగిన మనస్తాపం, ఆ తర్వాత ఎదురైన ఆర్థిక ఇబ్బందులు ఆమెను మద్యానికి బానిసను చేశాయి. 1981 నాటికి వీరిద్దరూ పూర్తిగా విడిపోయారు. చివరికి 47 ఏళ్ల చిన్న వాయస్సులోనే, అనారోగ్య సమస్యలతో డిసెంబర్ 26, 1981న సావిత్రి తుదిశ్వాస విడిచారు. ప్రేమ కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ మహానటి జీవితం విషాదాంతం కావడం తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ తీరని లోటే. మరోవైపు, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన అద్భుత అభినయంతో 'ది ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమా'గా కీర్తించబడిన శ్రీదేవి జీవితంలోనూ ప్రేమ ప్రయాణం ఇలాంటిదే ఒక పెద్ద మలుపు తిరిగింది.శ్రీదేవిని  బోనీ కపూర్ మొట్టమొదటిసారిగా 1970ల చివరలో ఒక తమిళ చిత్రంలో చూసి మనసు పారేసుకున్నారు. అప్పటి నుంచి ఆమెపై ఉన్న ఏకపక్ష ప్రేమతో ఎలాగైనా ఆమెను తన చిత్రంలో నటింపజేయాలని ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. 'మిస్టర్ ఇండియా' సినిమా షూటింగ్ సమయంలో బోనీ కపూర్ ఆమెకు ఇచ్చిన భరోసా, చూపిన ప్రత్యేక శ్రద్ధ శ్రీదేవి మనసును గెలుచుకున్నాయి. ముఖ్యంగా శ్రీదేవి తల్లి మరణించిన సమయంలో మరియు ఆమె విదేశాల్లో షూటింగ్స్‌లో ఉన్నప్పుడు బోనీ కపూర్ ఆమెకు అండగా నిలిచి ఒక నిజమైన మిత్రుడిగా, ధైర్యంగా తోడుగా నిలిచారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం గాఢమైన ప్రేమకి దారితీసింది. ఇది కూడా చదవండి: హీరోయిన్ కి మంచి రోజులు వస్తాయా:గతమెంతో వైభవం!       అప్పట్లో బోనీ కపూర్ వివాహితుడైనప్పటికీ, శ్రీదేవితో ఆయనకున్న బంధం మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ఎన్నో విమర్శలను, సంచలనాలను ఎదుర్కొంటూనే వీరు జూన్ 2, 1996 న షిర్డీలోని సాయిబాబా ఆలయంలో  రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో జాన్వి కపూర్, ఖుషీ కపూర్‌లకు తల్లిగా మారి తన సంసార జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపారు. అయితే ఊహించని విధంగా ఫిబ్రవరి 2018లో దుబాయ్‌లో జరిగిన దురదృష్టకర సంఘటనలో శ్రీదేవి కన్నుమూయడం యావత్ సినీ ప్రపంచాన్ని శోఖసంద్రంలో ముంచెత్తింది. ఇలా సావిత్రి, శ్రీదేవి ఇద్దరూ కూడా ఆల్రెడీ పెళ్లి అయిన వ్యక్తిలనే తమ జీవితంలోకి ఆహ్వానించడానికి కారణం ప్రేమ.. అనురాగం, ఆరాధనా భావం. ఈ విశ్వంలో ఆ మూడింటిని మించిన పవర్ ఫుల్ వెపన్స్ లేవు.   Savithri And sridevi Second Marriage, Savithri second marriage, Sridevi love story, Gemini Ganesan Savithri, Boney Kapoor Sridevi wedding, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]   [Savithri And sridevi Second Marriage, Savithri second marriage, Sridevi love story, Gemini Ganesan Savithri, Boney Kapoor Sridevi wedding, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమాల్లో ‘నరసింహా’కు ఉండే ప్రత్యేకతే వేరు. 1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ దగ్గర సంచలనం సృష్టించడమే కాదు.. రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్రను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. ఇన్నేళ్ల తర్వాత రీ-రిలీజ్‌లోనూ ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో సీక్వెల్‌పై మరోసారి ఆసక్తి పెరిగింది. ‘నరసింహా 2’ కథపై గతంలోనే చర్చలు జరిగినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ వెల్లడించారు. మొదటి భాగంలో చనిపోయిన నీలాంబరి పునర్జన్మ ఎత్తి, నరసింహాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించే కథాంశాన్ని ఆయన సిద్ధం చేశారట. ఈ ఆలోచనతో పాటు మరో కథా లైన్‌ను కూడా రజనీకాంత్‌కు వినిపించారట. అయితే, నరసింహా రీ-రిలీజ్‌ కి వచ్చిన అద్భుతమైన చూసిన తర్వాత సీక్వెల్‌ విషయంలో రజనీ ఆలోచన మారిందట. అప్పటి ప్రేక్షకులతో పాటు నేటి యువతను కూడా ఆకట్టుకునేలా కథ, స్క్రీన్‌ప్లే ఉండాలని సూచించారట. దీంతో స్క్రిప్ట్ పై కేఎస్‌ రవికుమార్‌ మరింత శ్రద్దగా వర్క్ చేస్తున్నారు. నిజానికి సీక్వెల్‌ అంటే పాత సినిమాలోని పాత్రలను మళ్లీ చూపించడమే కాదు.. మొదటి భాగానికి తగ్గ స్థాయిలో భావోద్వేగాలు, కథా బలం ఉండాలి. ‘నరసింహా’లో రజనీకాంత్‌-నీలాంబరి మధ్య పోరాటం ఎంత కీలకంగా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే రెండో భాగంలోనూ ఆ స్థాయి సంఘర్షణను ఎలా చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 'జైలర్ 2'తో బాక్సాఫీస్ ను చేస్తున్న రజినీకాంత్.. ‘నరసింహా 2’తో ఇంతకుమించిన విధ్వంసం సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం క్లాసిక్ మూవీని టచ్ చేయొద్దని, అప్పటి మ్యాజిక్ చేయడం కష్టమని కోరుతున్నారు. మరి స్క్రిప్ట్ విన్నాక ఈ ప్రాజెక్ట్ విషయంలో సూపర్ స్టార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇది కూడా చదవండి: ప్రభాస్ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు: నంబర్ 1 ఏదో తెలుసా.?       [Rajinikanth Narasimha 2 Update, Rajinikanth Padayappa 2 Update, Narasimha Neelambari, Rajinikanth New Movie, Rajinikanth, Narasimha 2, Padayappa 2, Neelambari, KS Ravikumar, Telugu Film News]  
Dhanush is reportedly among the guests expected at Anirudh Ravichander and Kavya Maran's wedding, while the differences between the famous "DnA" combination seemed to never end. It is stated that the composer extended an invitation to Dhanush personally and Superstar Rajinikanth asked him to do so.  Dhanush and Anirudh shared a successful professional association, delivering several popular albums together. However, reports of differences between them emerged following Dhanush's separation from Aishwarya Rajinikanth. While Anirudh did compose for Thiruchitrambalam, they have stopped associating with each other.  According to industry gossip, Rajinikanth has reportedly asked Anirudh to invite Dhanush to the wedding, believing that the occasion could help ease any awkwardness and allow the families to maintain cordial relationships. The reported invitation has consequently fuelled speculation that Dhanush and Aishwarya could reconcile too. There is also talk that Anirudh could reunite with Dhanush professionally by composing music for one of the actor's upcoming films. Their previous collaborations produced memorable soundtracks, and a reunion would undoubtedly interest fans who have followed their DnA albums. However, these are just rumors. It is majorly noted that Rajinikanth did not want his grandsons to suffer further as the differences between their parents could make it awkward for them and the families to be cordial. While reconcilation could happen or not, Rajini does want the friendship between families to continue, it seems.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
హీరోయిన్.. సకల సుగుణాలు కలిగి ఉన్న సౌందర్య రాశి. తన పలుకులు,చూపు తగిలితే చాలు నిండు జాబిలి పున్నమి వెలుగులతో  కళ్ళ ముందు ఉన్నట్టుగా ఉంటుంది. అభిమానులకైతే ఆరాధ్య దేవత. కానీ ఈ ఆరాధ్య దేవతకి చాలా ఏళ్ళ నుంచి అన్యాయం జరుగుతుందనే మాటలు సినీ ప్రేమికుల నుంచి వినపడుతున్నాయి. హిట్ శాతం తగ్గడానికి కూడా హీరోయిన్ ని పట్టించుకోకపోవడమే అని కూడా వాళ్ళ అభిప్రాయం  ఒకప్పుడు సినిమా అంటే కేవలం హీరోల విజృంభణ మాత్రమే కాదు, కథను తన భుజస్కంధాలపై నడిపించే కథానాయికల అద్భుత ప్రదర్శన కూడా. సావిత్రి, జయప్రద, శ్రీదేవి, విజయశాంతి వంటి మహానటుల కాలంలో హీరోయిన్ రోల్ కి  ఉన్న ప్రాధాన్యత, గౌరవం ప్రత్యేకమైనవి. కథలో వారి క్యారెక్టర్స్ కి బలమైన భావోద్వేగాలు, సొంత లక్ష్యాలు ఉండేవి. కానీ నేటి ఆధునిక సినిమాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం వెండితెరపై కథానాయికల స్వభావం, పరిధి తీవ్రంగా క్షీణించిందనే వాదన చిత్రసీమలో బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ క్యారెక్టర్లకు మళ్లీ పూర్వ వైభవం మరియు మంచి రోజులు వస్తాయా అనేది ఇప్పుడు సినీ ప్రేమికులను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న. నేటి తరం పెద్ద సినిమాలను ఒక్కసారి పరిశీలిస్తే, దాదాపు 80% నుండి 90% వరకు కథలన్నీ కేవలం హీరోల చుట్టూ, వారి యాక్షన్ సన్నివేశాల చుట్టూనే తిరుగుతున్నాయి. హీరోయిన్ల పాత్రలు కేవలం రెండు పాటలకు, నాలుగైదు ప్రేమ సన్నివేశాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. ఒక నివేదిక ప్రకారం, ప్రస్తుతం రూపొందుతున్న ప్రతి 10 వాణిజ్య చిత్రాలలో 8 చిత్రాలలో హీరోయిన్ స్క్రీన్ టైమ్ 15 నుండి 20 నిమిషాల కంటే ఎక్కువ ఉండటం లేదు. కథా గమనంలో వారికి ఎలాంటి నిర్ణయాత్మక రోల్ ఉండకపోవడం  బాధాకరం. కేవలం గ్లామర్ కోషెంట్ పెంచడానికి, విరామ సమయానికి ముందు చిన్న మలుపు తిప్పడానికి మాత్రమే హీరోయిన్లను ఉపయోగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ పరిస్థితులలో కూడా కొందరు దర్శకులు ట్రెండ్‌కు భిన్నంగా ఆలోచిస్తున్నారు. ఇండస్ట్రీలో కేవలం 5% నుండి 10% మంది దర్శకులు మాత్రమే కథానాయికల పాత్రలకు పూర్తి స్థాయి ప్రాధాన్యతనిస్తూ, వారి నటనకు ఆస్కారం ఉన్న కథలను రాస్తున్నారు. శేఖర్ కమ్ముల, నాగ్ అశ్విన్, శివ నిర్వాణ వంటి కొద్దిమంది దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్లకు బలమైన గుర్తింపునిస్తున్నారు. కానీ మెజారిటీ దర్శకులు మాత్రం రొటీన్ మాస్ ఎంటర్‌టైనర్ల వెనుకే పరుగులు తీస్తున్నారు. 100% నటనను ప్రదర్శించే సత్కళ ఉన్న నటీమణులు ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నప్పటికీ, కథల్లో సరైన ప్రాధాన్యత లేకపోవడంతో వారి ప్రతిభ మూలనపడిపోతోంది. ఇది కూడా చదవండి: రణబీర్ కపూర్ ఇంటి వద్ద రెక్కీ: డెడ్ డ్రాప్ ద్వారా తుపాకుల సరఫరా!   ఒక కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, రూ. 50 కోట్ల నుండి రూ. 100 కోట్ల వరకు వసూళ్లు సాధించగలదని గతంలో కొన్ని లేడీ ఓరియంటెడ్ చిత్రాలు నిరూపించాయి. అయినప్పటికీ, నిర్మాతలు మరియు దర్శకులు బడ్జెట్‌లో 60% కంటే ఎక్కువ భాగాన్ని కేవలం హీరోలు మరియు యాక్షన్ ఘట్టాలకే కేటాయిస్తున్నారు. మహిళా ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు పెట్టే పెట్టుబడి మొత్తం బడ్జెట్‌లో 10% కంటే తక్కువగానే ఉంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి మేకర్స్ అపురూప సౌందర్య వతి, అభిమానుల ఆరాధ్య దైవం హీరోయిన్ కి కూడా సమ ప్రాధాన్య ఉండేలా కథలు రాసుకొవాలి. అప్పుడు పరిపూర్ణమైన సినిమాగా రూపాంతరం చెందుతుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వద్దన్నా కల్లెక్షన్స్.  సినీ సైక్లోన్ గా కూడా నామకరం చేయవచ్చు     [Heroine Roles In Tollywood Future, heroine roles in tollywood, female lead importance, telugu movie heroines, lady oriented movies, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
ఈ ఏడాది దీపావళి సందర్భంగా టాలీవుడ్‌లో అనువాద చిత్రాల సందడి కనిపించనుంది. నవంబర్ 5న ‘రామాయణ’ విడుదల కానుండగా.. నవంబర్ 6న ‘మహాశక్తి’, ‘సీన్’, ‘నాన్న కుట్టి’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు కిరణ్ అబ్బవరం నిర్మించిన ‘హతః’ స్ట్రెయిట్ తెలుగు సినిమాగా బాక్సాఫీస్ బరిలో నిలవనుంది. దీంతో ఈ పండగ సీజన్‌లో తెలుగు ప్రేక్షకులను పలకరించబోయే సినిమాలపై ఆసక్తి నెలకొంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ నవంబర్ 5న పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు యశ్ నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, యశ్‌కు సోదరిగా ‘టాక్సిక్’ చిత్రంలో నటించిన నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ అనువాద చిత్రం ‘మహాశక్తి’ నవంబర్ 6న విడుదల కానుంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెజీనా కసాండ్రా, దునియా విజయ్, యోగిబాబు, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. ‘రామాయణ’ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేస్తుండగా, ‘మహాశక్తి’ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇక సూర్య నటించిన తమిళ చిత్రం ‘సీన్’ కూడా నవంబర్ 6న థియేటర్లలోకి రానుంది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ యాక్షన్ కామెడీ సినిమాలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించారు. సూర్యకు చెందిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. అదే రోజున విజయ్ ఆంటోని నటించిన తమిళ చిత్రం ‘నాన్న కుట్టి’ కూడా తెలుగులో విడుదల కానుంది. ఇలా ఒక హిందీ అనువాద చిత్రంతో పాటు మూడు తమిళ డబ్బింగ్ సినిమాలు దీపావళి సందర్భంగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇన్ని అనువాద చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం దీపావళి బరిలో ఉన్న స్ట్రెయిట్ తెలుగు సినిమా మాత్రం ‘హతః’ ఒక్కటే. కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెహమాన్, కుష్లు, తనూజ పుట్టుస్వామి, నమ్రిత ఎంవీ ప్రధాన పాత్రలు పోషించారు. అనుష్ గోరక్ దర్శకత్వం వహించారు. రాబోయే రోజుల్లో మరిన్ని తెలుగు సినిమాలు ఈ పండగ రేసులో చేరతాయా? లేక డబ్బింగ్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం ప్రదర్శిస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.     [Telugu Diwali Movie Releases 2026, Ramayana Movie, Mahashakti Movie, Suriya Scene Movie, Nanna Kutti Telugu Release, Hatha Movie, Diwali Box Office Clash]
Kiran Abbavaram is making his directorial debut with Reality, a family entertainer that explores middle-class emotions through relatable everyday moments. After generating positive buzz with its first glimpse, the film has now released its first single, Bhaja Govindam, sung by Vaikom Vijayalakshmi. Composed by Bheems Ceciroleo and written by Sanare, the song stands out for its simplicity and meaningful lyrics. Rather than relying on loud arrangements and heavy percussion, it celebrates the little joys of everyday life and conveys how contentment can bring happiness beyond the pursuit of material milestones.  Vaikom Vijayalakshmi's soulful rendition adds warmth to this pleasant musical outing. Kiran's approach to the song is equally noteworthy. The visuals capture familiar middle-class situations with a naturalness that makes them feel like moments from everyday life rather than staged cinematic sequences.  His performance adds a light-hearted touch, while his directorial choices underline the beauty of ordinary experiences. The song offers another glimpse into his attempt to portray familial emotions without unnecessary exaggeration. Devika Bhat plays the female lead in the film, produced by Sudhakar Chaganti. Reality is scheduled to release in theatres on December 25. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
హాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొల్పిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘డ్యూన్: పార్ట్ త్రీ’ విడుదలకు ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న ‘ది ఓడిస్సీ’ సినిమాపై ఉన్న అంచనాలను మించి, అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. లండన్‌లోని ప్రముఖ బీఎఫ్‌ఐ ఐమ్యాక్స్ థియేటర్‌లో కేవలం 24 గంటల్లోనే 33 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ టికెట్ల విక్రయాల ద్వారా 8.8 లక్షల పౌండ్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఈ థియేటర్‌లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు ‘ది ఓడిస్సీ’ పేరిట ఉండేది. ఆ సినిమా 24 గంటల్లో సుమారు 7.5 లక్షల పౌండ్ల విలువైన టికెట్లను విక్రయించింది. ఇప్పుడు ‘డ్యూన్: పార్ట్ త్రీ’ ఆ రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ లెక్కలు ప్రపంచవ్యాప్తంగా జరిగిన బుకింగ్స్‌కు సంబంధించినవి కావు.. ఒక్క బీఎఫ్‌ఐ ఐమ్యాక్స్ థియేటర్‌లో నమోదైన అడ్వాన్స్ టికెట్ విక్రయాలు మాత్రమే. డెనిస్ విల్లెన్యూవ్ దర్శకత్వం వహిస్తున్న ‘డ్యూన్: పార్ట్ త్రీ’లో తిమోతీ షాలమే మరోసారి పాల్ అట్రైడీస్ పాత్రలో కనిపించనున్నారు. జెండయా, ఫ్లోరెన్స్ పగ్, జాసన్ మోమోవా, రాబర్ట్ ప్యాటిన్సన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మునుపటి చిత్రాల కథకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమా, పాల్ అట్రైడీస్ పాలనలో ఎదురయ్యే పరిణామాలు, కొత్త శత్రువులు, ద్రోహాల చుట్టూ సాగనుంది. ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ 70ఎంఎం ఫార్మాట్‌లో ప్రదర్శించనుండటంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 15 నుంచి బీఎఫ్‌ఐ ఐమ్యాక్స్‌లో ప్రత్యేక ప్రివ్యూ ప్రదర్శనలు ప్రారంభం కానుండగా, ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18, 2026న సినిమా విడుదల కానుంది. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ‘డ్యూన్: పార్ట్ త్రీ’ చూపిస్తున్న ప్రభావం హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.     [Dune Part Three, Dune Part Three Advance Bookings, The Odyssey Movie, Dune 3 IMAX Record, Denis Villeneuve, Dune Part Three Release Date, BFI IMAX Ticket Sales]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
 ఎమోషనల్ చీటింగ్.. తామే తప్పు చేసి, భాగస్వామిని మోసం చేసే వ్యక్తుల తెలివైన  మార్గమిది..! ఒక ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది పరస్పర నమ్మకం, గౌరవం , నిజాయితీ. రెండు మనస్సులు కలిసి ప్రయాణించేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు, అభిప్రాయ భేదాలు రావడం చాలా సహజం. అయితే, కొన్ని సంబంధాలలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. తప్పు ఒకరు చేస్తే, ఆ నిందను మరొకరిపైకి నెట్టేసి, ఎదుటివారిని తప్పుగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతుంటాయి. దీనినే మానసిక నిపుణులు ఎమోషనల్ మానిప్యులేషన్ లేదా ఎమోషనల్ చీటింగ్  అని పిలుస్తారు. భాగస్వామి తన స్వార్థం కోసం లేదా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారి ఎమోషన్స్ తో  ఆడుకుంటున్నప్పుడు, అది మీ మనశాంతిని, ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఇలాంటి ప్రవర్తనను ప్రేమ అనుకుని పొరబడటం వల్ల చాలామంది మానసికంగా నలిగిపోతున్నారు. భాగస్వామి చేసే తప్పులకు మిమ్మల్ని బాధ్యులను చేస్తూ, మిమ్మల్ని మానసిక గందరగోళంలోకి నెట్టే మోసగాళ్ల మార్గాలు , వారు ఉపయోగించే ప్రమాదకరమైన పద్దతులు ఉన్నాయి. వాటి  గురించి వివరంగా తెలుసుకుంటే.. విషయాన్ని పక్కదారి పట్టించడం.. ఎప్పుడైనా భాగస్వామి చేసిన పొరపాటును మీరు ఎత్తిచూపినప్పుడు, వారు ఆ పొరపాటు  గురించి సమాధానం చెప్పడానికి నిరాకరిస్తారు. నిజమైన విషయాన్ని పక్కన పెట్టి, సంభాషణను పూర్తిగా వేరే వైపు తిప్పుతారు. చివరకు అసలు సమస్య ఏంటో మర్చిపోయి, వారు బాధితుల్లా నటించడం మొదలుపెడతారు. మీరు లేవనెత్తిన తప్పును వదిలేసి, మీరు మాట్లాడే తీరును లేదా ఇతర చిన్న విషయాలను పెద్దది చేసి, మీరే వారిని వేధిస్తున్నట్లు క్రియేట్ చేస్తారు. నిందను ఎదుటివారిపైకి నెట్టడం , గిల్ట్ ఫీలింగ్ కలిగించడం.. ఎమోషనల్ మానిప్యులేటర్లు తమ తప్పును ఎప్పటికీ ఒప్పుకోరు. క్షమాపణలు చెప్పడానికి బదులుగా, మీకే మానసిక అసౌకర్యం లేదా తప్పు చేశాం అనే ఫీలింగ్  కలిగేలా ప్రవర్తిస్తారు. ఉదాహరణకు, మీ వల్ల వారు ఎంత బాధపడుతున్నారో, వారి మానసిక ప్రశాంతత ఎలా పాడైందో చెబుతూ మిమ్మల్ని గిల్ట్ త్రిప్‌లోకి నెడతారు. వారు చేసే తప్పులన్నింటికీ మీ ప్రవర్తనే కారణమని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. దీంతో మీరు అసలు తప్పును వదిలేసి, వారిని సముదాయించే పనిలో పడిపోతారు. మీ ఆలోచనలనే అనుమానించేలా చేయడం.. దీనినే గ్యాస్‌లైటింగ్ అని అంటారు. వీరు తమ తప్పుల నుంచి తప్పించుకోవడానికి మీ జ్ఞాపకశక్తిని లేదా మీ అర్థం చేసుకునే సామర్థ్యాన్నే ప్రశ్నిస్తారు. అలాంటిదేమీ జరగలేదని, మీరు ఊహించుకుంటున్నారని, లేదా మీకు సరిగ్గా గుర్తులేదని పదే పదే చెబుతారు. దీంతో మీపై మీకే అనుమానం మొదలవుతుంది. నేను ఆలోచిస్తున్నది నిజమేనా లేదా నేను పొరబడుతున్నానా అనే గందరగోళంలోకి మీరు వెళ్ళిపోతారు. ఇది ఎదుటి వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా తన అదుపులోకి తీసుకోవడానికి వాడే అత్యంత ప్రమాదకరమైన మార్గం. పాత విషయాలను మధ్యలోకి తీసుకురావడం.. ప్రస్తుతం జరుగుతున్న వివాదంలో తమ తప్పు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, వీరు వెంటనే గతాన్ని తవ్వుతారు. మీరు ఎప్పుడో గతంలో చేసిన చిన్న తప్పులను లేదా పొరపాట్లను గుర్తుచేస్తూ, నువ్వు కూడా ఆ రోజు ఇలాగే చేశావు కదా అని ఎదురుదాడి చేస్తారు. పాత విషయాలను మధ్యలోకి తీసుకురావడం వల్ల మీరు డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్తారు. దీనివల్ల ప్రస్తుత తప్పు గురించి మాట్లాడటం ఆగిపోయి, పాత విషయాలపై చర్చ మొదలవుతుంది.  నకిలీ క్షమాపణలు.. ఒకవేళ వారు క్షమాపణలు చెప్పాల్సి వచ్చినా, అది ఎంతో నాటకీయంగా ఉంటుంది. మనస్ఫూర్తిగా తమ తప్పును అంగీకరించి  క్షమాపణ చెప్పరు.  గొడవను తొందరగా ముగించడానికో లేక మిమ్మల్ని నోరు మూయించడానికో నకిలీ క్షమాపణలు చెబుతారు. సారీ చెప్పేటప్పుడు కూడా, నీకు అంతగా అనిపిస్తే సారీ లేదా నేను చేసిన ప్రతిదీ తప్పేలే అనే వ్యాఖ్యలు జోడిస్తారు. ఇందులో నిజమైన పశ్చాత్తాపం ఉండదు. పైగా దెప్పిపొడుపు ఉంటుంది. మానసిక ఆరోగ్యానికే ప్రమాదం.. ఇలాంటి పరిస్థితులు సంబంధంలో ఎప్పుడూ  కొనసాగుతూ ఉంటే , అది మీ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్రమంగా మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ప్రతి చిన్న విషయానికి మీరే బాధ్యులమనే భయం  స్థిరపడిపోతుంది. భాగస్వామి ప్రవర్తనలో ఈ ప్రమాదకరమైన సంకేతాలు కనిపిస్తే వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. సరిహద్దులను నిర్ణయించుకోవడం, స్పష్టంగా మాట్లాడటం , అవసరమైతే సంబంధం గురించి బాగా ఆలోచించుకోవడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.                                           *రూపశ్రీ.
 భార్యాభర్తల మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందా..ఈ విషయాలు నిర్లక్ష్యం చేయకండి..! భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒకరికొకరు తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉండే భావోద్వేగాల అనుబంధం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు దంపతులు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, వారి మధ్య మానసిక దూరం పెరుగుతూ వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో లేదా మనసులోని భావాలను పంచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో భాగస్వామి మనల్ని పట్టించుకోవడం లేదనే భావన కలగడం సహజం. బంధంలో ఇలాంటి ఎమోషనల్ గ్యాప్ రావడం వల్ల ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.  ఈ విషయాన్ని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. వివాహం తర్వాత పెరిగే దూరం.. పెళ్లయిన కొత్తలో ఉన్న ఆప్యాయత, సంభాషణలు కాలక్రమేణా మరుగున పడిపోవడం చాలా జంటల్లో కనిపిస్తుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం, మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల ఒకరికొకరు సమయం కేటాయించడం తగ్గిపోతుంది. అయితే, ఈ దూరం చిన్న చిన్న విషయాల నుంచి ప్రారంభమై పెద్ద సమస్యగా మారుతుంది. భాగస్వామి ప్రవర్తనలో వచ్చే మార్పులను సరిగ్గా గమనించకపోతే, అది మానసికంగా ఇద్దరినీ ఒంటరి చేసేస్తుంది. కాబట్టి సంబంధంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందో లేదో తెలుసుకోవడానికి కొన్ని కీలకమైన లక్షణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. రెస్పాండ్ కాకపోవడం.. మీరు చెప్పే విషయాలను లేదా మీ సమస్యలను భాగస్వామి గమనించకపోవడం లేదా వాటికి సరైన స్పందన ఇవ్వకపోవడం చాలా స్పష్టమైన సంకేతం. రోజులో జరిగిన విషయాలు లేదా  మనసులోని ఆందోళనలను పంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు ఫోన్ చూస్తూ ఉండటం లేదా మీ మాటలను మధ్యలోనే ఆపేయడం చేస్తుంటే అక్కడ ఎమోషనల్ బాండింగ్  సన్నగిల్లుతోందని అర్థం చేసుకోవాలి. కేవలం వినడం మాత్రమే కాకుండా, మీ మాటలకు విలువ ఇవ్వకపోవడం వల్ల  అభద్రతాభావం పెరుగుతుంది. నిర్లక్ష్యం.. మీ ఫీలింగ్స్  లేదా మీ ఆవేదనను తేలికగా తీసుకోవడం లేదా చిన్నచూపు చూడటం కూడా ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందని చెప్పడానికి ఒక సంకేతం. మీకు ఏదైనా విషయంలో బాధ కలిగినప్పుడు, భాగస్వామి మిమ్మల్ని ఓదార్చాల్సింది పోయి మీరు అతిగా  ఆలోచిస్తున్నారని అనడం లేదా చిన్న విషయాలకే పెద్దవి చేస్తున్నారని అనడం సరికాదు. మీ ఫీలింగ్స్ కు  గౌరవం ఇవ్వకపోవడం వల్ల మీ మనసులోని మాటలను ఎవరితో పంచుకోవాలో తెలియని అయోమయం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రవర్తన ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ ను  మరింత పెంచుతుంది. షేర్ చేసుకోకపోవడం..   భాగస్వామి తమ వ్యక్తిగత విషయాలు లేదా మనసులోని ఆలోచనలను మీతో పంచుకోవడం మానేయడం కూడా ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోంది అనడానికి సంకేతం. గతంలో ప్రతి చిన్న విషయాన్ని మీతో చెప్పే వారు, ఇప్పుడు తమ ప్లానింగ్స్, ఇబ్బందులు లేదా అనుభవాలను పూర్తిగా దాచడం ఒకవేళ అడిగినా కూడా   ఏదో ఒక సాకు  చెప్పి దాటవేయడం చేస్తుంటే అక్కడ దూరం పెరుగుతోందని గ్రహించాలి. ఎమోషన్స్ ను లేదా మనసులోని విషయాలను ఒకరికొకరు షేర్ చేసుకోలేని చోట బంధం కేవలం పేరుకే మిగులుతుంది. బంధం కోసం ప్రయత్నం.. బంధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడూ ఒక  వైపు నుంచే జరగడం  అనేది కూడా భార్యాభర్తల మధ్య ఎమోషనల్ దూరం పెరుగుతోంది అనడానికి సంకేతం. మాట్లాడటం మొదలుపెట్టడం, కలిసి సమయం గడపడానికి ప్లాన్ చేయడం లేదా మనస్పర్ధలను సరిదిద్దడానికి ప్రయత్నించడం వంటి బాధ్యతలన్నీ  ఒక్కరి మీదే పడటం గమనించవచ్చు. భాగస్వామి తరపు నుంచి ఎలాంటి చొరవ లేకపోవడం వల్ల ఆ బంధం ఒకే వైపు నుంచి నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒంటరితనం.. భాగస్వామి పక్కనే ఉన్నప్పటికీ తీవ్రమైన ఒంటరితనం అనుభవించడం. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నా, ఒకరినొకరు పలకరించుకోకుండా ఎవరి ప్రపంచంలో వారు ఉండటం భావోద్వేగ శూన్యతను సూచిస్తుంది. మీ మనసులోని సంతోషాన్ని లేదా బాధను పంచుకునే ముందు అవతల వ్యక్తి వింటారో లేదో అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే, ఆ బంధంలో మార్పు అవసరమని అర్థం. పరిష్కారం ఎలా? ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కంటే ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. వారి ప్రవర్తన వల్ల మీకు కలుగుతున్న భావోద్వేగాలను నిరాశకు గురి కాకుండా, స్పష్టంగా వివరించాలి. అవతలి వ్యక్తి ఏవైనా ఇతర ఒత్తిళ్లలో ఉన్నారేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇద్దరూ కలిసి కూర్చుని మనసు విప్పి మాట్లాడితే చాలా వరకు ఈ దూరాన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ పరిస్థితి అలాగే కొనసాగితే, నిపుణుల సహాయం తీసుకోవడం,  కౌన్సెలింగ్ తీసుకోవడం  ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.                                                                                                                                                  *రూపశ్రీ.
 భార్యాభర్తల మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందా..ఈ విషయాలు నిర్లక్ష్యం చేయకండి..! భార్యాభర్తల మధ్య బంధం కేవలం ఒకరికొకరు తోడుగా ఉండటం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య ఉండే భావోద్వేగాల అనుబంధం కూడా చాలా ముఖ్యం. కొన్నిసార్లు దంపతులు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ, వారి మధ్య మానసిక దూరం పెరుగుతూ వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో లేదా మనసులోని భావాలను పంచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో భాగస్వామి మనల్ని పట్టించుకోవడం లేదనే భావన కలగడం సహజం. బంధంలో ఇలాంటి ఎమోషనల్ గ్యాప్ రావడం వల్ల ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.  ఈ విషయాన్ని ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. వివాహం తర్వాత పెరిగే దూరం.. పెళ్లయిన కొత్తలో ఉన్న ఆప్యాయత, సంభాషణలు కాలక్రమేణా మరుగున పడిపోవడం చాలా జంటల్లో కనిపిస్తుంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటం, మానసిక ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల ఒకరికొకరు సమయం కేటాయించడం తగ్గిపోతుంది. అయితే, ఈ దూరం చిన్న చిన్న విషయాల నుంచి ప్రారంభమై పెద్ద సమస్యగా మారుతుంది. భాగస్వామి ప్రవర్తనలో వచ్చే మార్పులను సరిగ్గా గమనించకపోతే, అది మానసికంగా ఇద్దరినీ ఒంటరి చేసేస్తుంది. కాబట్టి సంబంధంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందో లేదో తెలుసుకోవడానికి కొన్ని కీలకమైన లక్షణాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. రెస్పాండ్ కాకపోవడం.. మీరు చెప్పే విషయాలను లేదా మీ సమస్యలను భాగస్వామి గమనించకపోవడం లేదా వాటికి సరైన స్పందన ఇవ్వకపోవడం చాలా స్పష్టమైన సంకేతం. రోజులో జరిగిన విషయాలు లేదా  మనసులోని ఆందోళనలను పంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారు ఫోన్ చూస్తూ ఉండటం లేదా మీ మాటలను మధ్యలోనే ఆపేయడం చేస్తుంటే అక్కడ ఎమోషనల్ బాండింగ్  సన్నగిల్లుతోందని అర్థం చేసుకోవాలి. కేవలం వినడం మాత్రమే కాకుండా, మీ మాటలకు విలువ ఇవ్వకపోవడం వల్ల  అభద్రతాభావం పెరుగుతుంది. నిర్లక్ష్యం.. మీ ఫీలింగ్స్  లేదా మీ ఆవేదనను తేలికగా తీసుకోవడం లేదా చిన్నచూపు చూడటం కూడా ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోందని చెప్పడానికి ఒక సంకేతం. మీకు ఏదైనా విషయంలో బాధ కలిగినప్పుడు, భాగస్వామి మిమ్మల్ని ఓదార్చాల్సింది పోయి మీరు అతిగా  ఆలోచిస్తున్నారని అనడం లేదా చిన్న విషయాలకే పెద్దవి చేస్తున్నారని అనడం సరికాదు. మీ ఫీలింగ్స్ కు  గౌరవం ఇవ్వకపోవడం వల్ల మీ మనసులోని మాటలను ఎవరితో పంచుకోవాలో తెలియని అయోమయం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రవర్తన ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ ను  మరింత పెంచుతుంది. షేర్ చేసుకోకపోవడం..   భాగస్వామి తమ వ్యక్తిగత విషయాలు లేదా మనసులోని ఆలోచనలను మీతో పంచుకోవడం మానేయడం కూడా ఇద్దరి మధ్య ఎమోషనల్ గ్యాప్ పెరుగుతోంది అనడానికి సంకేతం. గతంలో ప్రతి చిన్న విషయాన్ని మీతో చెప్పే వారు, ఇప్పుడు తమ ప్లానింగ్స్, ఇబ్బందులు లేదా అనుభవాలను పూర్తిగా దాచడం ఒకవేళ అడిగినా కూడా   ఏదో ఒక సాకు  చెప్పి దాటవేయడం చేస్తుంటే అక్కడ దూరం పెరుగుతోందని గ్రహించాలి. ఎమోషన్స్ ను లేదా మనసులోని విషయాలను ఒకరికొకరు షేర్ చేసుకోలేని చోట బంధం కేవలం పేరుకే మిగులుతుంది. బంధం కోసం ప్రయత్నం.. బంధాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎప్పుడూ ఒక  వైపు నుంచే జరగడం  అనేది కూడా భార్యాభర్తల మధ్య ఎమోషనల్ దూరం పెరుగుతోంది అనడానికి సంకేతం. మాట్లాడటం మొదలుపెట్టడం, కలిసి సమయం గడపడానికి ప్లాన్ చేయడం లేదా మనస్పర్ధలను సరిదిద్దడానికి ప్రయత్నించడం వంటి బాధ్యతలన్నీ  ఒక్కరి మీదే పడటం గమనించవచ్చు. భాగస్వామి తరపు నుంచి ఎలాంటి చొరవ లేకపోవడం వల్ల ఆ బంధం ఒకే వైపు నుంచి నడుస్తున్న అనుభూతి కలుగుతుంది. ఒంటరితనం.. భాగస్వామి పక్కనే ఉన్నప్పటికీ తీవ్రమైన ఒంటరితనం అనుభవించడం. ఇద్దరూ ఒకే గదిలో ఉన్నా, ఒకరినొకరు పలకరించుకోకుండా ఎవరి ప్రపంచంలో వారు ఉండటం భావోద్వేగ శూన్యతను సూచిస్తుంది. మీ మనసులోని సంతోషాన్ని లేదా బాధను పంచుకునే ముందు అవతల వ్యక్తి వింటారో లేదో అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే, ఆ బంధంలో మార్పు అవసరమని అర్థం. పరిష్కారం ఎలా? ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం కంటే ప్రశాంతమైన వాతావరణంలో మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. వారి ప్రవర్తన వల్ల మీకు కలుగుతున్న భావోద్వేగాలను నిరాశకు గురి కాకుండా, స్పష్టంగా వివరించాలి. అవతలి వ్యక్తి ఏవైనా ఇతర ఒత్తిళ్లలో ఉన్నారేమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇద్దరూ కలిసి కూర్చుని మనసు విప్పి మాట్లాడితే చాలా వరకు ఈ దూరాన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ పరిస్థితి అలాగే కొనసాగితే, నిపుణుల సహాయం తీసుకోవడం,  కౌన్సెలింగ్ తీసుకోవడం  ద్వారా సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.                                                                                                                                                  *రూపశ్రీ.
ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో ధనియాల నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? రోజూ నీళ్లు తాగే విషయంలో మనం చేసే పొరపాట్లు ఏమిటి? భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగవచ్చా? నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఆయుర్వేదం నీటిని తాగే విధానం గురించి ఏం చెబుతోంది? ఇలాంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఈ TeluguOne Health వీడియోలో సీనియర్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష నీటి ప్రాముఖ్యత, నీళ్లు తాగే సరైన పద్ధతులు, ఉదయం నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, ధనియాల నీటి వినియోగం గురించి వివరిస్తున్నారు. అలాగే భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం మంచిదా కాదా, జీర్ణక్రియకు సంబంధించి ఉన్న అపోహలు ఎంతవరకు నిజం, ఆయుర్వేదంలో చెప్పే ఫాంట (Phanta) తయారీ విధానం వంటి ఆసక్తికరమైన విషయాలను వివరిస్తారు. మన శరీరానికి నీరు ఎంతో అవసరం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, పోషకాలు శరీరంలోని వివిధ భాగాలకు చేరడం, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లడం వంటి అనేక ముఖ్యమైన పనులకు నీరు సహాయపడుతుంది. అయితే నీటిని ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి, భోజనానికి ముందు లేదా తర్వాత తాగాలా అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఈ విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండటం ఆరోగ్యకరమైన జీవనశైలికి ఉపయోగపడుతుంది. ధనియాలను నీటిలో నానబెట్టి లేదా తగిన విధంగా తయారుచేసి తీసుకునే పద్ధతుల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ధనియాల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది? దానిని ఎలా తయారుచేసుకోవాలి? నీటిని తాగే విషయంలో పాటించాల్సిన పద్ధతులు ఏమిటి? అనే అంశాలపై డాక్టర్ శిరీష వివరణను తెలుసుకోండి. అలాగే ఆయుర్వేదంలో ఫాంట (Phanta) అని పిలిచే మూలికా పానీయాన్ని ఎలా తయారుచేస్తారు, దాని తయారీలో పాటించాల్సిన విధానం ఏమిటి అనే విషయాలను తెలుసుకోవచ్చు. జీర్ణక్రియకు సంబంధించిన అపోహలను తొలగించుకోవడానికి, రోజువారీ నీటి వినియోగంపై అవగాహన పెంచుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి, వయస్సు, శారీరక శ్రమను బట్టి నీటి అవసరాలు మారవచ్చు. కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యల కారణంగా నీటి పరిమాణంపై పరిమితులు ఉన్నవారు వైద్యుల సూచనలను పాటించాలి. ధనియాల నీటిని ఏదైనా వ్యాధికి నిర్ధారిత చికిత్సగా భావించకూడదు. ధనియాల నీటిని తాగే పద్ధతి, నీటి ప్రాముఖ్యత, భోజన సమయంలో నీళ్లు తాగడం, జీర్ణక్రియపై అపోహలు, ఆయుర్వేద ఫాంట తయారీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి.  
ఇయర్ బడ్స్ పెట్టుకుని రాత్రిళ్లు నిద్రపోయే అలవాటుందా.. ఈ నిజాలు తెలుసుకోండి..! ఈరోజుల్లో చాలామందికి రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా నిద్ర పట్టడం కోసం ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు, భజనలు లేదా పాడ్‌కాస్ట్‌లు వినే అలవాటు ఉంటుంది. ఈ చిన్న అలవాటు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి అంతా లేదా ఎక్కువ సమయం పాటు ఇయర్ బడ్స్ ధరించి పడుకోవడం వల్ల  చెవుల ఆరోగ్యానికి ఎంతో హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఈ చిన్న అలవాటు వల్ల భవిష్యత్తులో చెవులకు సంబంధించి పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. రాత్రి సమయంలో ఇయర్ బడ్స్ పెట్టుకుని పడుకోవడం వల్ల మన చెవుల్లో రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా నిద్రలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు లేదా  బోర్లా పడుకున్నప్పుడు దిండుకు ఇయర్ బడ్స్‌కు మధ్య పడే ఒత్తిడి కారణంగా చెవి భాగంలో తీవ్రమైన నొప్పి, చికాకు లేదా మంట పుట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రోజూ జరగడం వల్ల చెవి చుట్టూ ఉన్న సున్నితమైన చర్మం దెబ్బతింటుంది , నొప్పి మరింత పెరుగుతుంది. ఇయర్ బడ్స్ చెవి రంధ్రంలో బిగుతుగా ఉండటం వల్ల చెవి లోపలికి గాలి సరిగ్గా వెళ్లకుండా అడ్డుపడుతుంది. దీనివల్ల చెవిలో తేమ , చెమట పేరుకుపోయి బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది చెవిలో ఇన్‌ఫెక్షన్లు రావడానికి ప్రధాన కారణం అవుతుంది. కొందరు ఇయర్ బడ్స్‌ను శుభ్రం చేయకుండా వాడటం లేదా ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. చెవుల్లో దురద, వాపు లేదా ఒక రకమైన ద్రవం కారడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ఇన్‌ఫెక్షన్‌గా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. రాత్రి మొత్తం ఇయర్ బడ్స్ ద్వారా పెద్ద శబ్దాలతో మ్యూజిక్ వినడం వల్ల మన వినికిడి శక్తి క్రమంగా మందగించే ప్రమాదం ఉంది. ఎక్కువ గంటలు చెవులకు శబ్దం తగలడం వల్ల చెవిలోని నరాలు బలహీనపడతాయి. కొందరు తక్కువ సౌండ్ పెట్టుకుని   వింటున్నాము కదా అనుకుంటారు, కానీ రోజంతా లేదా రాత్రంతా చెవుల్లో ఆ పరికరాలు ఉంచుకోవడం వల్ల చెవి లోపల ఉండే సున్నితమైన భాగాలకు  నష్టం కలుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వినికిడి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. మ్యూజిక్ వింటే ప్రశాంతంగా నిద్ర పడుతుందని అనుకుంటాం కానీ, రాత్రి అంతా పాటలు లేదా పాడ్‌కాస్ట్‌లు ప్లే అవుతూ ఉంటే  మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోలేకపోతుంది. శబ్దాల కారణంగా మధ్యమధ్యలో నిద్రకు డిస్టర్బ్  కలుగుతుంది. దీనివల్ల ఉదయం లేచిన తర్వాత కూడా శరీరం అలసిపోయినట్లుగా , సుస్తీగా అనిపిస్తుంది. నిద్ర నాణ్యత దెబ్బతినడం వల్ల రోజంతా ఉత్సాహం లోపిస్తుంది. ఈ సమస్యలన్నింటి నుంచి సురక్షితంగా ఉండాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం... మీకు ఒకవేళ మ్యూజిక్ వింటూ నిద్రపోయే అలవాటు ఉంటే, పాటలు ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. వీలైతే ఇయర్ బడ్స్‌కు బదులుగా తక్కువ సౌండ్‌తో రూమ్‌లో చిన్న స్పీకర్ ఉపయోగించవచ్చు.  ఇయర్ బడ్స్‌ను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి , అంతేకాదు  ఎవరితోనూ వాటిని షేర్ చేసుకోకూడదు. చెవుల్లో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.                                                                                                                                                *రూపశ్రీ.