పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు. ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేక  ఆయన అక్కసు వెళ్లగక్కుతున్నారు. గతంలో చేసిన విమర్శలే చేస్తూ.. అదే తప్పును పునరావృతం చేస్తున్నారు. పార్టీ పరాజయానికి కారణాలు, క్యాడర్ లో భరోసా నింపడంలో తన వైఫల్యాలపై ఆత్మ విమర్శ చేసుకోవడం, పార్టీ తీరుపై సమీక్షలు నిర్వహించడం అన్నది ఆయన డిక్షనరీలోనే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.   రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి హవా స్పష్టంగా కనిపించింది. ప్రతిచోటా అధికార పక్షం వైపే ఓటర్లు మొగ్గు చూపడంతో వైకాపాకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ భారీ పరాభవంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైఎస్ జగన్... సోషల్ మీడియా వేదికగా తన అక్కసును వెళ్లగక్కారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పోలీసులు,  ఎన్నికల సంఘాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.  ప్రతిపక్షం పోటీ చేసే అవకాశమే ఇవ్వకుండా ఎన్నికల్లో అద్భుతంగా గెలవడం ఎలాగో మీరు నిరూపించారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.  రాష్ట్రంలో జరిగినవి  ఎన్నికలు కాదని  సెలెక్షన్స్ అనీ జగన్ ఆరోపించారు.  అధికార పార్టీ మరియు ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ విధంగా విమర్శలు చేయడం ద్వారా, ప్రజల తీర్పును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాతీర్పును  గౌరవించకుండా జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదన్న విషయాన్ని చాటుతున్నాయంటున్నారు.  క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని తప్పులను సరిదిద్దుకునే దిశగా వైకాపా అధినాయకత్వం అడుగులు వేయడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇదే వైఖరిని కనుక కొనసాగిస్తే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు.  ప్రజల నుంచి వచ్చిన స్పష్టమైన తీర్పును అంగీకరించి ఆత్మసమీక్ష చేసుకోవడానికి బదులుగా,  నిందలు మోపి, పరాజయానికి నెపం తెలుగుదేశం పార్టీపైనా, ఎన్నికల సంఘంపైనా నెట్టేయడం సరి కాదంటున్నారు.   ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించి, ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై పోరాడితేనే మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని లేకపోతే పార్టీ భవిష్యత్  ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు.  [Jagan Reaction On Defeat, Municipal polls, AP Local Body Election Results,   Team CBN Tweet, AP politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపోల్ ఫలితాలు ఫలితాలు వైసీపీకి కోలుకోలేని పరాభవాన్ని మిగిల్చాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన  మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) రాజధాని ప్రతిపాదనను స్థానిక ప్రజలు పూర్తిగా తిరస్కరించినట్లు ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేస్తోంది. అంటే జగన్ 2029 ఎన్నికలకు మావిగన్ నినాదంతో వెడతామని ప్రకటించారు. అయితే అంత వరకూ ఆగక్కర్లేదు, ఆ నినాదంతో ఎన్నికలకు వెడితే ఫలితం ఇలాగే ఉంటుందని మునిసిపోల్స్ లో తమ విస్పష్ట తీర్పు ద్వారా ప్రజలు నిర్ద్వంద్వంగా చాటారు.  గతంలో మూడు రాజధానుల ముసుగులో విశాఖపట్నాన్ని ప్రధాన కేంద్రంగా చూపేందుకు ప్రయత్నించినప్పటికీ, 2024 ఎన్నికల్లో వైజాగ్ నియోజకవర్గాల ప్రజలు వైసీపీని పూర్తిగా పక్కనబెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకుని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ  మావిగన్ పేరుతో కొత్త పల్లవి ఎత్తుకుంది. అయితే, 2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.   మున్సిపల్ ఫలితాల్లో  అధికార తెలుగుదేశం కూటమి తిరుగులేని ఆధిక్యతను సాధించింది. మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 డివిజన్లలో  తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేనలు ఏకంగా 48 స్థానాలను కైవసం చేసుకోగా, ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. వైసీపీ 9 స్థానాలకే పరిమితమైంది.  ఇక్కడ టీడీపీకి చెందిన షేక్ అబ్దుల్లా అభిదా మేయర్‌గా విజయం సాధించారు. అలాగే విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలోనూ ఇదే ఫలితం వచ్చింది.  విజయవాడ కార్పొరేషన్‌ను జనసేన అభ్యర్థి వంగవీటి రాధా దక్కించుకోగా, 86 డివిజన్లలో అత్యధిక భాగం తెలుగుదేశం కూటమి ఖాతాలోనే పడ్డాయి. అ  గుంటూరు కార్పొరేషన్‌లో మొత్తం 76 డివిజన్లలో  కూటమి మెజారిటీ స్థానాలను గెలుచుకుంది.  టీడీపీకి చెందిన కోవలమూడి లక్ష్మీ అపర్ణ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ మూడు నగరాల్లోనూ వైసీపీ కనీస పోటీ కూడా   కూడా ఇవ్వలేకపోయింది. దీంతో  2029 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే  మావిగున్ రాజధాని ప్రతిపాదనకు అసలైన రెఫరెండమ్ జగన్ గతంలో పలు సందర్భాలలో చెప్పారు. అయితే ప్రస్తుతం ఈమూడు నగరాల  కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి ఎదురైన ఘోర పరాజయం చూస్తుంటే... ఆ రెఫరెండమ్ ఫలితం కోసం ప్రజలు మరో రెండున్నరేళ్లు ఆగాల్సిన అవసరం లేదని స్పష్టమౌతోంది. జగన్ మావిగన్ ప్రతిపాదనను జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారనడానికి ఈ ఫలితాలే నిలువెత్తు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [People Reject MAVIGUN, AP Municipal Corporation Election Results, YSRCP Capital Narrative, TDP Janasena Alliance victory, AP politics, Telugu One]
పులివెందులలో నాలుగు దశాబ్దాల  వైఎస్ కుటుంబ పాలనకు గండి పడింది.  పులివెందుల మునిసిపాలిటీని కైవసం చేసుకోవడం వ్యక్తిగతంగా తనకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రయత్నించినా జగన్ పరాజయాన్ని అడ్డుకోలేకపోయారు.  అసలు గతంలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కకుండా వైసీపీ అభ్యర్థి ఘోరంగా పరాజయం పాలైన రోజే పులివెందులపై జగన్ పట్టు సడలిందన్న సంగతి తేటతెల్లమైంది.  2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.  ​పులివెందుల ప్రజలే కాదు, యావత్ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మాలో ఆయనే చెప్పాలి. అధికారంలో లేకపోతే ఆయన ఆంధ్రప్రదేశ్‌లో ఉండరు. బెంగళూరు యలహంక ప్యాలెస్ లో మకాం వేసి, అతిథి మాదిరిగా వచ్చిపోతూ ఉంటారు. నిజంగా పులివెందులలో పట్టు నిలుపుకోవాలంటే ఆయన చేయవలసిన ప్రయత్నాల పట్ల ఆయనకే స్పష్టత లేదు. తన పార్టీ కార్యకర్తల్లో ఆయన మనోధైర్యం నింపే ప్రయత్నం చేయలేదు.  ఒకరకంగా చెప్పాలంటే ప్రయత్నం చేసే ఉద్దేశం కూడా ఆయనకు ఉన్నట్లు కనిపించదు.   ​ఎన్నికకు ముందు రోజు వచ్చి పులివెందులలో ఉండి ఎన్నికను నడిపిస్తానని చెప్పారు. ఆ తర్వాత ఎన్నిక రోజు ఒంటిగంటకు వస్తానని తన హెలికాప్టర్ ల్యాండింగ్ పర్మిషన్ కోసం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ నాటకీయంగా పదిగంటలకే హెలికాప్టర్ అక్కడకు చేరేలాగా ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఎగరడం మొదలుపెట్టాడు. ముందస్తు సమాచారం ఇవ్వకపోతే   గందరగోళం అవుతుందని ఆయనకు   తెలుసు. జగన్ మోహన్ రెడ్డి కోరుకునేది అటువంటి అయోమయ పరిస్థితినే. తన హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి కూడా ప్రభుత్వం అభ్యంతరాలు తెలిపింది అని చెప్పాలనేది ఆయన ప్రయత్నమని పులివెందులలో చిన్న పిల్లాడు కూడా చెబుతాడు. ఆయన రాజకీయ జీవితం మొదలైన దగ్గర్నుంచీ ఇదే నాటకీయత. అయినా ఒంటిగంటకు వచ్చి ఆయన ఎన్నికలను ఏమి శాసిస్తారు? ​పులివెందులలో ఉండి కూడా ఓటు వేయని జగన్  ప్రజాస్వామ్యం గురించి ఎలా మాట్లాడతారు?  ప్రభుత్వం అరాచకం చేస్తున్నది అని పోరాటం చేయాలనుకున్నా ప్రజాస్వామ్యంలో అతి విలువైన ఓటు హక్కును ఉపయోగించుకుని అప్పుడు ధర్నాకు దిగవచ్చు. కానీ జగన్ మోహన్ రెడ్డి ఓటు వేయడానికి వెళ్లాలన్నా కాన్వాయ్ కావాలి. అధికార దర్పం, పటాటోపం అంటే ఆయనకు అమితమైన ఆసక్తి. ఆయన ధర్నా చేయడానికి లోపల కూర్చున్న ఏజెంట్లే దిక్కయ్యారంటే పులివెందులలో జగన్ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అవగతమౌతుంది.   ఇక తెలుగుదేశం విషయానికి వస్తే పులివెందుల మునిసిపాలిటీని దక్కించుకుంది. ఈ క్రమంలో టీడీపీ  కొంత క్రమశిక్షణ తప్పినా వైసీపీకి సానుభూతి రాకపోవడానికి కారణం జగన్ అధికారంలో ఉన్నప్పటి చర్యలే కారణాలని వైసీపీ శ్రేణులే బాహాటంగా చెబుతూనే ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను జగన్‌కు ఒక గుణపాఠంగా చూపించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుందని, 2024 లో తాను ఓటమి చెందినప్పుడే జగన్ మోహన్ రెడ్డికి తెలుసు.   భయంకరమైన ఓటమిని చూసిన రోజు, ముఖ్యంగా తాను నిలబెట్టాలనుకున్న రాజధాని ప్రాంతం కూడా తనను కాదన్న రోజు చంద్రబాబు పోరాడి గెలిచిన విధానాన్ని చూసి కూడా జగన్..  ఇప్పటికీ తన గెలుపు ప్రజల బాధ్యత అనుకుంటున్నారు. దార్శనికుడు అని పేరున్న చంద్రబాబు లాంటివాడికే ఎన్నికల్లో కుస్తీ పట్టక తప్పడం లేదు, తాయిలాలు ప్రకటించక తప్పడం లేదు. అలాంటిది తన మాటమీద తనకే నిలకడ లేని జగన్   ప్రజలే తనను గెలిపించాలనీ, నిలబెట్టాలనీ ఆయన ఎలా అనుకుంటున్నారన్నది ఆయనకే తెలియాలి. ​పులివెందుల ప్రజలు తనపట్ల ఉన్న అసంతృప్తిని తాను అధికారంలో ఉన్నప్పటి నుండే వ్యక్తపరుస్తున్నారు. తనకు కూడా గతంలో వచ్చినంత మెజారిటీ రానప్పుడే జగన్ విషయం అర్ధం చేసుకుని ఉంాలి.   కానీ జగన్ అలా అనుకోవడం లేదు. జగన్ విధానాల కారణంగానే  వైసీపీ కార్యకర్తలకు  ప్రభుత్వాన్ని  నిలదీసే నైతిక ధైర్యం కరువైంది . ​జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తంతు సక్రమంగా జరగడం లేదు కాబట్టి పోలింగ్ మళ్లీ జరగాలన్నారు. కానీ పులివెందులలో కూడా యాభై శాతానికి పైబడిన ఓటింగ్ నమోదయింది. జగన్ ఒకవైపు ఆర్భాటం చేస్తూ ఉండగానే జనం వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ ఎప్పుడూ ఎలా జరుగుతుందో ఈ పర్యాయం కూడా అదే మాదిరిగా జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని చోట్లా రికార్డెడ్ గానే పోలింగ్ జరిపించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. దీంతో న్యాయస్థానాలు కూడా వైసీపీ రీపోలింగ్ పిటిషన్లను డిస్మిస్ చేశాయి. ఇక పులివెందుల విషయానికి వస్తే.. జగన్ ధర్నా చేస్తున్న సమయంలోనూ పులివెందుల ప్రజలు ఆయనను పట్టించుకోకుండా తమ ఓటు హక్కు వినియోగించుకుని వెళ్లి పోయారు.  జగన్ పులివెందుల కోట బద్దలు కావడం ఆయన రాజకీయ భవిష్యత్ విషయంలో ఇస్తున్న సంకేతాలేమిటన్నదానిపై పరిశీలకులు పలు రకాల విశ్లేషణలకు చేస్తున్నారు. వాటిలో ఏ విశ్లేషణా కూడా జగన్ కు ఇసుమంతైనా ఊరడింపు కలిగించేలా లేదు.  [YCP Loose Pulivendula Municipality, YS Jagan Mohan Reddy, TDP vs YCP, Andhra Pradesh Local Body Elections, YS Family Stronghold, Telugu One] 
ALSO ON TELUGUONE N E W S
సినీ, కళా మాధ్యమం అనేది పంచభూతాల కంటే పవర్ ఫుల్ అంటూ ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా  సింగిల్ టైంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవతరించాడు ఇళయ దళపతి విజయ్. మరి తనకి అంతటి శక్తీని ఇచ్చిన సినిమాకి సాయం చేయడంలో  ఏమైనా వెనుకంజ వేస్తాడా చెప్పండి. సినిమాకి సరికొత్త శక్తిని ఇచ్చాడు. తమిళ చిత్ర పరిశ్రమని  ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించేందుకు, అలాగే అభిమానులకి  సినిమా చూసే అనుభూతిని మరింత చేరువ చేసేందుకు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో సినిమాల ప్రదర్శన సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జీవో  ప్రకారం ఇకపై రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఏకంగా 6 షోలు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతినిచ్చింది. అంతేకాకుండా, అభిమానుల కోసం ఉదయం పూట ఉత్సాహాన్ని నింపేలా ప్రత్యేకంగా 6 AM ఎర్లీ మార్నింగ్ స్క్రీనింగ్స్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నిర్ణయం పట్ల కోలీవుడ్ వర్గాలు, స్టార్ హీరోల అభిమానులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, థియేటర్ యాజమానుల సంఘాలు, నిర్మాతలు గత కొంతకాలంగా కోరుతున్న మరో ప్రధాన డిమాండ్‌పై మాత్రం ప్రభుత్వం భిన్నమైన వైఖరిని ప్రదర్శించింది. విపరీతంగా పెరిగిపోయిన నిర్మాణ వ్యయం, నిర్వహణ భారాలను దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల ధరలను పెంచాలని థియేటర్ యజమానులు గట్టిగా కోరారు. కానీ, సామాన్య ప్రేక్షకులపై ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి విజయ్ ఈ టికెట్ ధరల పెంపు ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారు. రోజువారీ షోల సంఖ్యను 6కి పెంచడం ద్వారా నిర్మాతలు, థియేటర్ల యజమానులు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ వసూళ్లు సాధించే అవకాశం ఉంటుందని, అదే సమయంలో సామాన్య ప్రజలకు తక్కువ ధరకే వినోదం అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం ఈ సమతుల్య నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అది కూడా సినిమా మంచి కోసమే. ఇది కూడా చదవండి: డ్రాగన్ పై క్లారిటీ ఇచ్చేసిన ప్రశాంత్ నీల్: ఫ్యాన్స్ లో హుషారు!   ఈ తాజా నిబంధనల అమలుతో కోలీవుడ్‌లో పెద్ద సినిమాల విడుదల సమయాల్లో నెలకొనే ఇబ్బందులు తొలగిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణ రోజుల్లోనూ, పండుగ సీజన్లలోనూ 6 షోల ప్రదర్శన వల్ల కలెక్షన్ల జోరు మరింత పెరుగుతుందని బాక్సాఫీస్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 6 AM షోల వల్ల మొదటి రోజు కలెక్షన్ల రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టికెట్ ధరలు పెరగకపోవడం వల్ల కుటుంబ ప్రేక్షకులు ఎలాంటి సంకోచం లేకుండా థియేటర్లకు వచ్చేందుకు వెసులుబాటు దొరికింది. మొత్తానికి కోలీవుడ్ ఇండస్ట్రీ మనుగడను కాపాడుతూనే, ప్రేక్షకుల ప్రయోజనాలను దెబ్బతీయకుండా సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో  హాట్ టాపిక్‌గా మారింది.   [Cm Vijay Approves Six Shows Per Day, CM Vijay, Tamil Nadu cinema news, 6 shows per day, Kollywood movie updates, 6 AM screenings, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వన్ మాన్ షో డ్రాగన్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఫ్యాన్స్ అయితే రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తూ డైలీ టీజర్ ని చూస్తూ ఎన్టీఆర్ క్యారక్టర్ డిజైన్ ని పలురకాలుగా ఊహించుకుంటూ వస్తున్నారు. ఇక డ్రాగన్ కి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారని, అందులో ఒకరు రవి బసూర్ కాగా ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ సాస్వత్ సచ్ దేవ్ కూడా ఉన్నాడనే న్యూస్ వచ్చింది  ఈ నేపథ్యంలో స్వయంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో నిర్వహించిన క్యూ అండ్ ఏ (Q&A) సెషన్‌లో ఈ సస్పెన్స్‌కి  తెరదించారు. రవి బస్రూర్ మాత్రమే ఈ భారీ ప్రాజెక్ట్‌కి  సంగీతం అందిస్తున్నట్లు  అధికారికంగా స్పష్టం చేశారు. 'ది వన్ అండ్ ఓన్లీ రవి బస్రూర్ సర్' అంటూ చెప్పాడు. దీంతో రూమర్స్ మరో న్యూస్ పై తమ ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి.   ఇది కూడా చదవండి: సూర్య సినిమాకి నో చెప్పిన క్రేజీ బ్యూటీ: ఫ్యాన్స్ షాక్!    మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న  ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ గత ఏడాది ఏప్రిల్ 22వ తేదీ నుంచే షూటింగ్ స్టార్ట్ చేసింది. 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓపియం (Opium) వార్ నేపథ్యంలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగే  డ్రాగన్ లో బాలీవుడ్ అగ్ర నటుడు అనిల్ కపూర్ కీ రోల్ తో పాటు రుక్మిణి వసంత్ హీరోయిన్.      [Prashanth Neel About Dragon, NTR Dragon Music Director, Prashanth Neel, Ravi Basrur music director, NTR Dragon release date, Tollywood movie updates, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]
నిత్యా మీనన్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సహజమైన నటన, అందమైన చిరునవ్వు, వైవిధ్యమైన పాత్రలు. ఎలాంటి పాత్ర ఇచ్చినా తనదైన నటనతో మెప్పించగల ఈ మలయాళ బ్యూటీ ఇప్పుడు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈసారి ఏకంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. వివేక్ ఒబెరాయ్ హీరోగా నటిస్తున్న హిందీ సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్ గ్రే’లో నిత్యా మీనన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఆమె పాత్రపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ప్రాణంగా ప్రేమించే వ్యక్తే ఒకరోజు ప్రాణాలకు ముప్పుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో కథ సాగనుంది. పోస్టర్‌లో వివేక్ ఒబెరాయ్, నిత్యా మీనన్ ముఖాలు సగం మాత్రమే కనిపించేలా చూపించారు. వారి లుక్‌లో కనిపిస్తున్న సీరియస్‌నెస్, సస్పెన్స్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. నిత్యా పాత్రలో ఊహించని మలుపులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. మరి ఆమె నిజంగానే విలన్‌గా కనిపిస్తారా? లేక కథలో మరో రహస్యం దాగి ఉందా? అనేది ఆసక్తికరంగా మారింది. అంకుర్ పజ్నీ, విశాల్ రంజన్ మిశ్రా సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రేయా శర్మ, ఆశిష్ విద్యార్థి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేవ్‌బ్యాండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు మూడేళ్లుగా రూపొందుతోంది. ఈ చిత్రంతో వివేక్ ఒబెరాయ్, నిత్యా మీనన్ తొలిసారి కలిసి నటిస్తున్నారు. గతంలో ‘మిషన్ మంగళ్’తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నిత్యా.. ఇప్పుడు మరోసారి హిందీ సినిమాలో కనిపించబోతున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో పాటు సినిమాకు సంబంధించిన విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రేమ, నమ్మకద్రోహం, మోసం చుట్టూ తిరిగే ఈ మర్డర్ మిస్టరీలో నిత్యా మీనన్ పాత్ర ఎలాంటి మలుపులు తీసుకురాబోతోందో చూడాలి. ఇప్పటివరకు చూసిన నిత్యాకు భిన్నంగా ఈ సినిమాలో ఆమెను చూడబోతున్నామా? అన్నది అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.     [Nithya Menen Villain Role, Mr and Mrs Grey Movie, Nithya Menen New Movie, Vivek Oberoi Nithya Menen, Mr and Mrs Grey First Look, Nithya Menen Bollywood Comeback, Mr and Mrs Grey Release Date, Murder Mystery Thriller]
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు మరో క్రేజీ ఆఫర్ దక్కింది. ఇప్పటికే తమిళంలో ధనుష్ సరసన 'ఓం' సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలోనూ భాగమైంది. రజినీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న 'ధర్మన్' సినిమాలో శ్రీలీల నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజినీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. తాజాగా శ్రీలీల ఎంట్రీతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. 'షీ ఈజ్ గాట్ ది స్పార్క్.. షీ ఈజ్ గాట్ ది పటాకా' అనే ట్యాగ్‌లైన్‌తో ఆమెను టీమ్‌లోకి ఆహ్వానించారు. ఇక శ్రీలీల ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ చూస్తుంటే.. ఆమె పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉండబోతున్నట్లు అనిపిస్తోంది. అయితే సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలో కనిపించనుంది? రజినీకాంత్‌తో ఆమెకు ఎలాంటి సన్నివేశాలు ఉంటాయి? అనే విషయాలను మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. ఇక 'ధర్మన్'లో ఇప్పటికే నయనతార, సిమ్రన్, రాశీ ఖన్నా వంటి ప్రముఖ నటీమణులు భాగమయ్యారు. రజినీకాంత్‌తో పాటు రామ్ పోతినేని కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 'ఓ మై కడవులే', 'డ్రాగన్' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు.. ఈసారి రజినీకాంత్‌ను డిఫరెంట్ అవతార్‌లో చూపించబోతున్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: లండన్‌లో ఒకే చోట పవన్, షారుఖ్.. అప్పటి సీక్రెట్స్ బయటపెట్టిన రేణు దేశాయ్.! https://x.com/RKFI/status/2117851839286981084       [Sreeleela Joins Rajinikanth Dharman, Sreeleela Dharman Glimpse, Dharman Movie, Sreeleela, Rajinikanth, Ashwath Marimuthu, Kamal Haasan, Anirudh Ravichander, Ram Pothineni, Telugu Film News]
సౌత్ బాక్స్ ఆఫీస్ కి దొరికిన అరుదైన సినీ వజ్రాయుధం  హీరో సూర్య. ఓన్ తమిళ్ లో ఎంత పాపులారిటీ ఉందో, అంతే పాపులారిటీ తెలుగుతో పాటు మిగతా లాంగ్వేజస్ లో ఉంది. అలాంటి సూర్య తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఒక హీరోయిన్ మూడు సార్లు నో చెప్పింది. దీంతో ఫాన్స్ షాక్ అవుతున్నారు. మరి ఆ ముద్దుగుమ్మ ఎవరో చూద్దాం.      సూర్య ఈ నెల 6 న మరో సారి బాక్స్ ఆఫీస్ పై తన కట్ అవుట్ కి ఉన్న స్టామినాని తెలియచేయడానికి 'సీన్' మూవీతో వస్తున్నాడు. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో సూర్య సీన్ లో తనతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న నజ్రియా కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సాధారణంగా ఏ హీరో సినిమాలోనైనా హీరోయిన్‌గా నటించే అవకాశం వస్తే ఎవరైనా వెంటనే అంగీకరిస్తారు, కానీ నజ్రియా మాత్రం సూర్య సరసన నటించే అవకాశాన్ని ఏకంగా మూడు సార్లు తిరస్కరించిందట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన సూర్య.. తాము గతంలో నజ్రియాను తమ మూడు సినిమాలలో నటించాల్సిందిగా సంప్రదించామని, అయితే వివిధ కారణాల వల్ల ఆమె ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో ఆమె తమ చిత్రంలో నటించడానికి అంగీకరించిందని సూర్య నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.  ఇది కూడా చదవండి: జెడి చక్రవర్తి కాళ్ళు మొక్కిన నీహారిక కొణిదెల: రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!   అంతేకాకుండా, గత 12 ఏళ్లలో నజ్రియాకు తమిళ పరిశ్రమ నుంచి పలు భారీ చిత్రాలలో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ, ఆమె నచ్చిన స్క్రిప్ట్‌ల కోసం వాటిని రిజెక్ట్ చేసిందని తెలిపారు. మంచి క్యారక్టర్ ల  కోసం వేచి చూసే ఆమె ఆత్మవిశ్వాసాన్ని, కెరీర్‌పై ఉండే స్పష్టతను సూర్య ఎంతగానో ప్రశంసించారు.   మరోవైపు, నజ్రియా మాట్లాడుతూ.. దాదాపు 12 సంవత్సరాల విరామం తర్వాత తాను తమిళ చిత్రసీమలోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రధాన కారణం సూర్య గారే అని స్పష్టం చేశారు. గతంలో కొన్ని వ్యక్తిగత మరియు కథా పరమైన కారణాల వల్ల ఆయనతో కలిసి పనిచేయలేకపోయినప్పటికీ, ఇప్పుడు ఈ 'సీన్' సినిమా ద్వారా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. మరి నాలుగోసారి కలుసుకున్న ఈ క్రేజీ ద్వయం ఎలాంటి మెరుపులు సెల్యులాయిడ్ కి అందిస్తుందో చూడాలి.   [Suriya ABout Nazriya, Nazriya About Suriya, scene movie, suriya upcoming films, nazriya nazim comeback, jithu madhavan director, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]  
    కొన్ని సన్నివేశాలు చాలా ఇంట్రెస్ట్ ని కలిగిస్తాయి. అలాంటి సన్నివేశమే జెడి చక్రవర్తి, నీహారిక కొణిదెల మధ్య జరిగింది. ప్రొడ్యూసర్ గా రాణిస్తున్న  నిహారిక తాజాగా నిర్మిస్తోన్న చిత్రం 'పాకెట్ రాకెట్స్'. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు మాక్సిమం సిటీ స్టూడియోస్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌కు రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన 'ది ఫస్ట్ హ్యాండ్' టీజర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి కూడా పాల్గొన్నారు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ . తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ బయటపెడుతున్న సమయంలో నిహారిక సరదాగా సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించడం అక్కడున్న వారందరినీ నవ్విచింది. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో  ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రాన్ని తాము జులై నెలలో ప్రారంభించామని, దర్శకుడు రుద్రతో తమకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి పరిచయం ఉందని తెలిపారు. కేవలం ఆరు నెలల短 సమయంలోనే సినిమాను పూర్తి చేసి డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో తమ టీమ్ అంతా మీ సోషల్ మీడియాలోకి, మీ ఇంట్లోకి వచ్చేస్తామంటూ ఆమె ఎంతో ఉత్సాహంగా చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో 'కమిటీ కుర్రోళ్ళు' ఫేమ్ త్రినాథ్ వర్మ మరియు డెబ్యూ హీరో నిర్మల్ ప్రధాన హీరోలుగా నటిస్తుండగా, 'శుభం' ఫేమ్ శ్రియా కొంతం హీరోయిన్‌గా అలరించనుంది. అలాగే పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇది కూడా చదవండి: నాగార్జున, టబు కాంబో మ్యాజిక్ రిపీట్ చేస్తుందా: ప్రేమ ప్లేస్ లో యుద్ధమేనా!      కథాంశం విషయానికొస్తే, ఇది పూర్తిగా విదేశీ చదువులు మరియు ఇంటర్నేషనల్ గ్యాంబ్లింగ్ (జూదం) నేపథ్యంలో సాగుతుంది. బస్తీలో ఉంటూ పూట గడవడానికి కష్టపడే ఇద్దరు సాధారణ యువకులు, సడెన్‌గా శ్రీలంక దేశానికి వెళ్లడం మరియు అక్కడ గ్యాంబ్లింగ్ మాఫియా ఊబిలో చిక్కుకోవడం ఈ చిత్రంలోని అసలైన మెలిక. వారి జీవితాల్లోకి ఓ అందమైన అమ్మాయి ఎంట్రీ ఇచ్చి ఒక ప్లాన్ ప్రకారం శ్రీలంక పంపించడం, అక్కడ సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి గ్యాంగ్ తో ఆ కుర్రాళ్లు ఎలా డీల్ చేశారనేది వెండితెరపై అత్యంత రసవత్తరంగా ఉండబోతోంది. శ్రీనివాస్ అవసరాల, కిరీటి దామరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గ్యానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించగా, ఎదురోలు రాజు కెమెరా వర్క్ అందించారు. డిసెంబర్ 11న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. [Pocket Rockets Teaser Launch Niharika, Niharika Konidela, Pocket Rockets, JD Chakravarthy, Pink Elephant Pictures, Sri Lanka Gambling, Tollywod, tollywood News, Telugu Cinema, Telugu CInema News]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అభిమానుల్లో ఆసక్తి నెలకొంటుంది. ముఖ్యంగా ఆయన సినిమాలు, పాత జ్ఞాపకాలకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. తాజాగా నటి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఒకప్పుడు ఆయన సినిమాల కోసం తాను లండన్, మిలాన్ వరకు వెళ్లి ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ కొనుగోలు చేసేదాన్నని వెల్లడించారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి 'బద్రి', 'జానీ' వంటి సినిమాల్లో నటించారు. అలాగే పవన్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా రేణు దేశాయ్ వ్యవహరించారు. వాటిలో ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు వంటి సినిమాలు ఉన్నాయి. ఖుషి, జానీ వంటి సినిమాల సమయంలో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ కోసం తాను లండన్‌లో షాపింగ్ చేసేదాన్నని రేణు దేశాయ్ తెలిపారు. అక్కడ ఒక ప్రత్యేకమైన షాపింగ్ మాల్ ఉండేదని, పవన్ కోసం ఎక్కువగా అక్కడే దుస్తులు కొనుగోలు చేసేదాన్నని చెప్పారు. అయితే అక్కడ ఆమె తరచూ మరో సెలబ్రిటీ కూడా ఎదురయ్యేవారట. ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్. తాను పవన్ కళ్యాణ్ కోసం దుస్తులు కొనడానికి వెళ్తే.. కరణ్ మాత్రం షారుఖ్ ఖాన్ కోసం కాస్ట్యూమ్స్ కొనడానికి అక్కడికి వచ్చేవారని రేణు దేశాయ్ వెల్లడించారు. ఆయన షారుఖ్ ఖాన్‌కు స్టైలిస్ట్ కాకపోయినా.. ఆయనపై ఉన్న అభిమానంతో ప్రత్యేకంగా దుస్తులు కొనుగోలు చేసేవారట. ఇలా ఒకే షాపింగ్ మాల్‌లో పవన్, షారుఖ్ ఖాన్ కోసం ఇద్దరు ప్రముఖులు కాస్ట్యూమ్స్ కొనడం ఆసక్తికరమైన విషయం. ఇక పవన్ కళ్యాణ్ నటించిన 'బాలు' సినిమాలో ఆయన ధరించిన ఓ ప్యాంట్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. ఆ ప్యాంట్ కోసం ప్రత్యేకంగా మిలాన్ వెళ్లినట్లు రేణు దేశాయ్ తెలిపారు. అక్కడి షాపుల్లో వెతుకుతుండగా ఓ షాప్‌లో వరల్డ్ వార్-2 సమయంలో ఉపయోగించిన ఒరిజినల్ క్లాత్‌తో తయారుచేసిన ప్యాంట్ కనిపించిందట. అప్పట్లోనే దాని ధర రూ.75 వేలు కాగా.. మొత్తం ఐదు ప్యాంట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయట. వాటిలో ఒకదాన్ని పవన్ కళ్యాణ్ కోసం కొనుగోలు చేసినట్లు రేణు గుర్తుచేసుకున్నారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన 'జానీ' సినిమా గురించి కూడా రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మొదట తాను ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సింది కాదని చెప్పారు. హీరోయిన్ ఎంపిక కోసం ముంబై వెళ్లి చాలామందిని పరిశీలించినప్పటికీ పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్‌లకు ఎవరూ నచ్చలేదట. చివరకు షూటింగ్ ప్రారంభానికి వారం రోజుల ముందు తననే హీరోయిన్‌గా నటించమని అడిగారని, పాత్ర నచ్చడంతో అంగీకరించినట్లు తెలిపారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పాత సినిమాల వెనుక రేణు దేశాయ్ చేసిన కాస్ట్యూమ్ వర్క్, అప్పటి అనుభవాలు ఇప్పుడు మరోసారి ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా 'బాలు' సినిమాలోని ప్యాంట్ కోసం రూ.75 వేలు ఖర్చు పెట్టడం, లండన్‌లో కరణ్ జోహార్‌ను కలిసిన విషయాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది కూడా చదవండి: ‘దాదా’ ఫస్ట్ సింగిల్.. బాలయ్య ఫ్యాన్స్ కోసం తమన్ అదిరిపోయే ట్రీట్.!       [Renu Desai About Pawan Kalyan, Renu Desai Interview, Pawan Kalyan Costumes, Pawan Kalyan Balu Pant, Kushi Movie, Johnny Movie, Pawan Kalyan, Renu Desai, Karan Johar, Shah Rukh Khan]  
Sensational actress Sreeleela has joined the cast of Superstar Rajinikanth's upcoming action entertainer Dharman, adding another prominent name to its already impressive ensemble. The makers announced her inclusion with a special glimpse carrying the tagline, "SHE'S GOT THE SPARK. SHE'S GOT THE PATAKA."  The actress, who has emerged as one of the most sought-after young stars in Telugu cinema, is now expanding her presence across other industries with big-ticket projects. Dharman marks the first collaboration between Rajinikanth and Ulaganayagan Kamal Haasan, who is producing the film.  The ensemble already includes Nayanthara, Simran and Raashii Khanna in prominent roles, with Nayanthara having recently joined the shoot. Sreeleela's addition further strengthens the cast, while her character glimpse, accompanied by Anirudh Ravichander's striking classical-western fusion score, offers a glimpse of her screen presence. Directed by Ashwath Marimuthu, the film features Rajinikanth as a doctor who takes a fierce stand against crime, promising a high-voltage action entertainer. Produced by RKFI and Turmeric Media, with Mahendra as co-producer, Dharman is progressing at a brisk pace. With two legends coming together for this ambitious project and an exciting ensemble backing them, the film has already become one of the most anticipated films. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది మరియు అద్భుతమైన ఐదు రోజుల దీపావళి వేడుకలకు ధన త్రయోదశి లేదా ధంతేరస్ పర్వదినంతో అత్యంత ఘనంగా అంకురార్పణ జరుగుతుంది. కార్తీక మాసపు కృష్ణ పక్ష త్రయోదశి తిథి నాడు వైభవంగా వచ్చే ఈ పవిత్ర దినం సంపద, ఆరోగ్యం, సిరులు మరియు సర్వ శుభారంభాలకు సజీవ ప్రతీకగా నిలుస్తుంది. ఈ ఏడాది నవంబర్ 6 మరియు నవంబర్ 7 తేదీల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న ఈ అరుదైన పండుగ వేళ, ఏ రోజు ఏ ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేస్తే ఇంట్లో సిరుల వర్షం కురుస్తుందనే అంశంపై ప్రతి ఒక్కరిలోనూ అమితమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ధంతేరస్ తొలి రోజున బంగారం, వెండి నాణేలు, ఆభరణాలతో పాటు రాగి, ఇత్తడి లేదా ఉక్కుతో తయారు చేసిన సరికొత్త వంట పాత్రలను కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదమని వేద శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఖరీదైన లోహాలే కాకుండా, సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఇంట్లో ఉండటం కోసం సరికొత్త చీపురు, మంగళప్రదమైన కొత్తిమీర గింజలను కూడా మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చుకోవడం మన సాంప్రదాయంలో ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటా బయటా సరిగ్గా 13 మట్టి దీపాలను వరుసగా వెలిగించి, ధనానికి అధిపతి అయిన కుబేరుడు, లక్ష్మీదేవితో పాటు ఆయుర్వేద దైవమైన ధన్వంతరి భగవానుడిని భక్తితో పూజించడం వల్ల సమస్త ఆర్థిక బాధలు పూర్తిగా తొలగిపోయి, కుటుంబంలో సానుకూల శక్తి వెల్లివిరుస్తుందని పెద్దలు బలంగా నమ్ముతారు. అయితే, జ్యోతిష్య మరియు మత విశ్వాసాల ప్రకారం ఈ పవిత్ర దినాన కొన్ని నిర్దిష్ట వస్తువులకు మాత్రం దూరంగా ఉండాలని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. రాహువుకు ప్రతీకగా భావించే గాజు సామగ్రి, శనితో ముడిపడి ఉండే ఇనుప వస్తువులు, కత్తులు లేదా కత్తెరల వంటి పదునైన వస్తువులు, అలాగే నలుపు రంగు దుస్తులు లేదా వస్తువులను ధంతేరస్ రోజున పొరపాటున కూడా కొనుగోలు చేయడం పూర్తిగా అశుభమని, ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని తెస్తాయని విశ్వసిస్తారు. కేవలం ఒక రోజనే కాకుండా దీపావళి వచ్చే మొత్తం ఐదు రోజుల పండుగ ప్రయాణంలో ప్రతి రోజుకు తగినట్లుగా ఇంటి అవసరాలకు తగ్గట్టుగా షాపింగ్ చేయడం వల్ల ఆయురారోగ్యాలతో పాటు లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం ఉంటుందని పెద్దల మాట. బడ్జెట్ ఏదైనా సరే, మనస్ఫూర్తిగా మరియు భక్తిభావంతో కొనుగోలు చేసే ప్రతి కొత్త వస్తువు ఇంట్లో ధనలక్ష్మిని ఆహ్వానిస్తుందని, ఈ దీపావళి షాపింగ్ ప్రతి ఒక్కరి జీవితంలో సరికొత్త వెలుగులు నింపుతుందని నమ్ముతారు.     Dhanteras Shopping Guide, What To Buy On Dhanteras, Diwali Festival Purchases, Wealth Bringing Items, Auspicious Days For Buying Gold, Festival Traditions, Spiritual Articles In Telugu.  
ప్రస్తుత ఆధునిక కాలంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో, వైద్య మరియు ఆరోగ్య రంగాలలో కృత్రిమ మేధస్సు (AI) పాత్ర రోజురోజుకూ అత్యంత కీలకంగా మారుతోంది. ముఖ్యంగా మానవ పోషకాహార విధానాలు, జీవక్రియ (Metabolism) మరియు వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికింది. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలకు శాస్త్రవేత్తలు సరికొత్త AI ఆధారిత ఫ్రేమ్‌వర్క్‌లను రూపకల్పన చేస్తున్నారు. ఈ అత్యాధునిక విధానాలు మనిషి శరీరం యొక్క ప్రత్యేకమైన జన్యుపరమైన అవసరాలను గుర్తించి, దానికి తగినట్లుగా ఖచ్చితమైన పోషకాహార మార్గదర్శకాలను అందించడంలో అద్భుతంగా పనిచేస్తున్నాయి. సాధారణంగా అందరికీ వర్తించే ఒకే రకమైన డైట్ ప్లాన్‌లకు స్వస్తి చెప్పి, ప్రతి వ్యక్తి యొక్క బయోమార్కర్స్ మరియు ఆరోగ్య స్థితిగతులను విశ్లేషించి వ్యక్తిగతీకరించిన ప్రయోజనాలను చేకూర్చడంలో ఈ సాంకేతికత ఎంతో ముందంజలో ఉంది. పరిశోధకులు వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఆధునిక పోషకాహార మార్గదర్శకాలను మరియు ప్రివెంటివ్ మెడిసిన్‌ను సరిగ్గా అమలు చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు. నేడు కేవలం ఒకే రకమైన మందులు లేదా సాధారణ ఆహార నియమాలపై ఆధారపడకుండా, సిస్టమ్స్ బయాలజీ మరియు ప్రిడిక్టివ్ అనలిటిక్స్ సాయంతో మానవ ఆరోగ్యాన్ని ముందే అంచనా వేయడం సాధ్యమవుతోంది. ముఖ్యంగా గ్లోబల్ హెల్త్ సర్వేలు మరియు మెడికల్ రీసెర్చ్ నివేదికల ఆధారంగా, డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు AI అల్గారిథమ్‌లు సుమారు 70 శాతానికి పైగా ప్రజల్లో జీవక్రియ సంబంధిత సమస్యలను ముందస్తుగా గుర్తించి తగిన నివారణ చర్యలను సూచించగలవు. ఈ సాంకేతిక విప్లవం ద్వారా ప్రతి ఒక్కరూ తమ దైనందిన ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటూ, వ్యాధిని నివారించే శక్తిని కూడగట్టుకుంటున్నారు. ఈ వినూత్న ఫ్రేమ్‌వర్క్ కేవలం బరువు నియంత్రణకే పరిమితం కాకుండా, గుండె జబ్బులు, మధుమేహం మరియు ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాల నివారణలోనూ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో శరీరంలోని విభిన్న పోషకాల శోషణ శాతాన్ని, విటమిన్ల లోపాలను అత్యంత కచ్చితత్వంతో విశ్లేషించడం ఇప్పుడు సాధ్యమైంది. దీనివల్ల వైద్యులు మరియు పోషకాహార నిపుణులు రోగులకు అవసరమైన కచ్చితమైన మోతాదులో పోషకాలను సిఫారసు చేయడానికి వీలవుతుంది. డిజిటల్ టెక్నాలజీ మరియు క్లినికల్ సైన్స్ సంయుక్తంగా మానవుని ఆయురారోగ్యాలను మెరుగుపరచడంలో అపూర్వమైన మార్పులను తెస్తున్న ఈ తరుణంలో, భవిష్యత్ వైద్య రంగం మరింత సురక్షితంగా మరియు కచ్చితమైన ఫలితాలతో ముందుకు సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.     AI In Healthcare, Modern Nutrition Frameworks, Personalized Health Tech, Artificial Intelligence Wellness, Preventive Medicine Trends, Digital Health Innovations, Health Articles In Telugu.
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మందిని వేధిస్తున్న అతి సాధారణ ఆరోగ్య సమస్య మలబద్దకం. ఉదయాన్నే మోషన్ ఫ్రీగా రాక, పొట్ట భారంగా అనిపించి రోజంతా నీరసంగా గడిపే వారు ఎందరో ఉన్నారు. దీనికోసం హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతూ, వేల రూపాయలు ఖర్చు పెట్టి రకరకాల మందులు వాడుతుంటారు. అయితే ఎలాంటి ఖరీదైన మందులు వాడకుండా, కేవలం మన దైనందిన డైట్ లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఈ నరకం వంటి మలబద్దకం సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చని ప్రముఖ నిపుణులు డాక్టర్ బాలు యెల్లెపు వెల్లడించారు. ఉదయం లేచింది మొదలు పొట్ట సాఫీగా సాగిపోవడానికి మరియు మోషన్ ఫ్రీగా అవ్వడానికి ఆయన సూచించిన ఆ 10 అద్భుతమైన సూపర్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్దకంతో బాధపడేవారికి సిలియం హస్క్ (ఇస్బాగోల్) ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అన్నం తినడానికి కొద్దిసేపు ముందు ఒక గ్లాసు నీటిలో ఒక్క స్పూన్ సిలియం హస్క్ కలుపుకుని తాగితే, శరీరానికి కావలసిన ఫైబర్ పర్ఫెక్ట్ గా అందుతుంది. అంతేకాకుండా ఇది షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలోనూ అద్భుతంగా సహకరిస్తుంది. ఇది స్థానిక కిరాణా షాపులతో పాటు ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలో కూడా సులభంగా లభిస్తుంది. ఇక అత్యంత తక్కువ ధరకు, ఎల్లప్పుడూ ఈజీగా అందుబాటులో ఉండే బొప్పాయి పండు మలబద్దక బాధితులకు బ్రహ్మాండంగా సహాయపడుతుంది. బొప్పాయిలోని ప్రత్యేక ఎంజైమ్స్ పేగుల్లోని వ్యర్థాలను, మలాన్ని మృదువుగా మార్చి మోషన్ ఫ్రీగా అయ్యేలా చేస్తాయి. అలాగే జామకాయలో పీచు పదార్థం (ఫైబర్) విరివిగా లభిస్తుంది. జామకాయను గింజలతో సహా పూర్తిగా నమిలి తినడం వల్ల పేగుల కదలికలు చురుగ్గా మారి మలబద్దకం నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. సాధారణంగా జ్వరాల సమయంలో ప్లేట్‌లెట్స్ పడిపోయినప్పుడు మాత్రమే తినే కివీ ఫ్రూట్ లో విటమిన్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తూ మలబద్దకం నుంచి వేగంగా బయటపడేస్తుంది. ఇక ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ లో ప్రాసెస్ చేసిన తిండికి బదులుగా ఓట్స్ తీసుకోవడం కడుపును శుభ్రపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఓట్స్ తీసుకోవడం వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మన వంటింట్లో సులభంగా అరిగే ఆహార పదార్థాలలో పెసరపప్పు (మూంగ్ దాల్) ముందుంటుంది. ఇది పొట్టకు ఎంతో తేలికగా ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పాలకూర, తోటకూర వంటి ఆకుపచ్చ ఆకుకూరల్లో ఫైబర్‌తో పాటు మెగ్నీషియం కూడా సమృద్ధిగా లభిస్తుంది. ఈ మెగ్నీషియం పేగుల్లోకి నీటిని చేర్చి మలాన్ని సులభంగా బయటికి పంపేలా చేస్తుంది. ఇక కేవలం 100 గ్రాముల చియా విత్తనాలలోనే దాదాపు 30 నుంచి 35 గ్రాముల వరకు ఫైబర్ నిల్వలు ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టుకుని తీసుకోవడం ద్వారా జీర్ణశక్తి బలపడుతుంది. వైట్ రైస్‌తో పోలిస్తే గోధుమ పిండితో చేసిన చపాతీలు తినడం ద్వారా కూడా ఫైబర్ అంది మోషన్ ఫ్రీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు శనగలలో ఉండే అధిక పీచు పదార్థం పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇవన్నీ సరిగ్గా పనిచేయాలంటే వీటన్నింటితో పాటు తగినంత మోతాదులో నీరు తాగడం అత్యంత ప్రధానమని డాక్టర్ బాలు యెల్లెపు స్పష్టం చేస్తున్నారు. తగినన్ని నీళ్లు తాగకుండా పైన చెప్పిన ఏ పదార్థాలు తీసుకున్నా ప్రయోజనం ఉండదని గుర్తించుకోవాలి.     Constipation Relief Foods, Dr Balu Yellepu Health Tips, Superfoods For Digestion, Gut Health Diet Guide, Natural Remedies For Constipation, Fiber Rich Foods, Health Tips In Telugu.
వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు మనుషుల జీవన శైలిని , బాధ్యతలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ , గర్భనిరోధక బాధ్యతలు ఎక్కువగా మహిళల మీదే ఉంటూ వచ్చాయి. మార్కెట్లో లభించే వివిధ రకాల గర్భనిరోధక మాత్రలు లేదా పద్ధతులు అన్నీ మహిళల శారీరక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. కానీ మారుతున్న కాలానికి తగినట్టుగా వైద్య శాస్త్రం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా పురుషుల కోసం ప్రత్యేకంగా గర్భనిరోధక మాత్రలను తీసుకువచ్చే దిశగా పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ఈ కొత్త  ఆవిష్కరణ భవిష్యత్తులో గర్భనిరోధక పద్ధతులపై  చాలా అంచనాలు సృష్టిస్తోంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  గర్బనిరోధక మాత్రలు.. సాధారణంగా మహిళలు వాడే గర్భనిరోధక మాత్రలు వారి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల వారిలో కొన్ని రకాల శారీరక మార్పులు లేదా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. కానీ పురుషుల కోసం తయారు చేస్తున్న ఈ సరికొత్త  మాత్రల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎలాంటి హార్మోన్ మార్పులకు గురిచేయవు. కేవలం పురుషుల శరీరంలో ఉండే శుక్రకణాల కదలికలను మాత్రమే నేరుగా ప్రభావితం చేసేలా ఈ మందులను రూపొందిస్తున్నారు. మానవ శరీరంలో , పురుషుల వ్యవస్థలో ప్రత్యేకంగా ఉండే ఒక ఎంజైమ్ పై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. శుక్రకణాలు ముందుకు కదలడానికి , మహిళల అండం వరకు సులభంగా చేరుకోవడానికి ఈ ప్రత్యేక ఎంజైమ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా కనిపెడుతున్న  ఔషధం తీసుకున్నప్పుడు ఆ ఎంజైమ్ కొన్ని గంటల పాటు తాత్కాలికంగా నిలిచిపోతుంది. దీనివల్ల శుక్రకణాలు సాధారణ పద్ధతిలో ముందుకు కదలలేవు. ఫలితంగా అవి అండం వరకు చేరే సామర్థ్యాన్ని కోల్పోతాయి కాబట్టి  గర్భధారణ జరిగే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది. పురుషుల కోసం కనిపెడుతున్న ఈ కొత్త  గర్భనిరోధక మాత్రల గురించి శాస్త్రవేత్తలు వెల్లడించిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా మింగాల్సిన అవసరం ఉండదు. శారీరక సంబంధానికి కేవలం ముప్పై నిమిషాల ముందు ఈ మాత్రను తీసుకుంటే సరిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి దశలో జరిపిన పరీక్షల ప్రకారం ఈ మందు ప్రభావం శరీరంలో కొన్ని గంటల పాటు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో జరిగే క్లినికల్ పరీక్షలు , పరిశోధనలు విజయవంతమైతే పురుషులు రోజూ ఎలాంటి మందులు వాడకుండా కేవలం అవసరమైనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించే వెసులుబాటు కలుగుతుంది. ఈ మాత్రలు తీసుకుంటే పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుందా అని చాలా మందిలో ఒక  సందేహం కలుగుతుంది . అయితే ఈ మాత్రల ప్రధాన ఉద్దేశం పురుషులలో శుక్రకణాలు పుట్టకుండా చేయడం కాదు. కేవలం తాత్కాలికంగా వాటి కదలికలను నిలిపివేయడం లేదా మందగించడం మాత్రమే. ఈ  మాత్ర  ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత శుక్రకణాలు నార్మల్ గా  తమ సాధారణ స్థితికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ మందు ప్రభావం పోయిన తర్వాత పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందా లేదా అనేదానిపై మరింత లోతైన పరీక్షలు అవసరం అంటున్నారు. ఈ కొత్త ఆవిష్కరణను ప్రస్తుతం జంతువులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. మనుషులపై వీటిని వాడే ముందు వాటి భద్రత , సరైన మోతాదును నిర్ణయించడం  చాలా ముఖ్యం. ఏవైనా దుష్ప్రభావాలు వస్తాయా లేదా అని నిరంతరం పరిశీలించాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు అన్నీ విజయవంతమైతే భవిష్యత్తులో గర్భనిరోధక బాధ్యతలను కేవలం మహిళలు మాత్రమే కాకుండా  భాగస్వాములిద్దరూ సమానంగా పంచుకోవడానికి ఒక చక్కటి అవకాశం లభిస్తుంది. అయితే ఈ మాత్రలు కేవలం గర్భధారణను మాత్రమే నివారిస్తాయి కానీ ఎలాంటి లైంగిక  వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వలేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు                             *రూపశ్రీ.
గుండెపోటు (Heart Attack) అనగానే చాలామందికి ఛాతీలో తీవ్రమైన నొప్పి గుర్తుకొస్తుంది. అయితే గుండెకు సంబంధించిన సమస్యలు కొన్నిసార్లు గ్యాస్ నొప్పిగా అనిపించవచ్చు. గ్యాస్ నొప్పి అనుకుని గుండెపోటు లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చు. మరి గ్యాస్ నొప్పికి, గుండె నొప్పికి మధ్య తేడా ఏమిటి? గుండెపోటు వచ్చే ముందు శరీరం ఎలాంటి హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది? నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి (Stress), నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం, పని ఒత్తిడి, సరైన విశ్రాంతి లేకపోవడం గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఒత్తిడి వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందా? జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భీష్మ చౌదరి గారు గుండె ఆరోగ్యానికి సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను వివరించారు. గుండెపోటు లక్షణాలను ఎలా గుర్తించాలి? గ్యాస్ నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేయకూడని సంకేతాలు ఏమిటి? ఒత్తిడి, నిద్రలేమి గుండెపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? వ్యాయామం చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? వంటి సందేహాలకు ఈ వీడియోలో సమాధానాలు తెలుసుకోవచ్చు. గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడంతో పాటు, గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించడం ఎంతో ముఖ్యం. ఛాతీలో నొప్పి, బిగుతుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన చెమటలు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. గుండెపోటు లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందండి మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)