ఆంధ్రప్రదేశ్‌ కు మరో వాయుగుండం పొంచి ఉంది.   ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో  ఉత్తరాంధ్రలో   ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉంది.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన గురి చేసిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.  శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను ఇది తీవ్రంగా కలిచి వేస్తోందన్నారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదన్నారు.  సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశముందన్నారు.  తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ ఆ లేఖలో చంద్రబాబును కోరారు.
రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులకు  రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ నిర్ణయించారు.  అతిథుల గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు, శాలువాలకు శాఖాపరంగా బడ్జెట్  ఉన్నప్పటికీ తన శాఖకు కేటాయించిన సంబంధిత బడ్జెట్ నుంచి 40 శాతం మాత్రమే తీసుకొని మిగిలిన 60 శాతం తన సొంత సొమ్మును జోడించి కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధపరచాలని తన పేషీ అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు.
ALSO ON TELUGUONE N E W S
లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి కార్యక్రమంలో కింగ్ నాగార్జున కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వబోతున్నట్లు అనౌన్స్ చేశారు. నాన్న గారి పేరు మీద రెండేళ్లకు ఒకసారి అవార్డు ఇస్తున్నామని, ఈసారి చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని నాగార్జున తెలిపారు. ఈ విషయం చిరంజీవి గారికి చెప్తే ఎంతో సంతోషించారని, ఏఎన్నార్ గారి శతజయంతి ఏడాది నాకు ఈ అవార్డు ప్రకటించడం చాలా హ్యాపీగా ఉందని, ఇంతకంటే పెద్ద అవార్డు నాకు లేదని అన్నారు. అంతేకాదు, అక్టోబర్ 28 న అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా అవార్డు ప్రధానం చేయనున్నట్లు నాగార్జున ప్రకటించారు. (ANR Lives On)
Known for her roles in "Kanchana 3" and "Ruler," Vedhika has become familiar to the Telugu audience. She plays the lead role in the suspense thriller "Fear," produced by AR Abhi under the Dattatreya Media banner, with co-producers Sujatha Reddy and Sama Surender Reddy. The film is directed by Haritha Gogineni, featuring Arvind Krishna in a special role. Recently, the first look poster of the movie "Fear" released by star choreographer Prabhu Deva has received a huge response. Rana Daggubati launched the teaser in Telugu, wishing the entire team the best. Kichcha Sudeep unveiled it in Kannada, Emraan Hashmi in Hindi, and Makkal Selvan Vijay Sethupathi in Tamil. The teaser opens with an eerie atmosphere, immersing viewers in a world of fear. It then transitions to a heartwarming scene featuring a charming story between two adorable kids. The enchanting moments shared by the couple, Vedhika and Arvind Krishna, stand out. Suddenly, the mood shifts to one of suspense as Vedhika searches for her boyfriend, whose phone is persistently off. This intriguing quest unfolds with numerous thrills and spine-chilling scenes. The haunting atmosphere and pulsating background score are sure to send shivers down your spine. Will Vedhika locate her boyfriend? Audiences will find out in theaters very soon. The teaser is infused with mystery and an unsettling vibe. Vedhika's character in "Fear" will be fresh and captivating for the audience, marking a special movie in her career. The movie's theatrical release date will be announced shortly. It is known that the film won more than 60 international awards and the film will impressed Pan India audience very soon.
Chetan Krishna and Hebah Patel stars in "Dhoom Dhaam." Sai Kumar, Vennela Kishore, Prithviraj, and Goparaju Ramana play other significant roles. This film is produced by MS Ram Kumar under the Friday Frame Works banner. "Dhoom Dhaam" is a love and family entertainer directed by Sai Kishore Macha, with the story and screenplay by Gopi Mohan. Makers planning for a grand theatrical release on October 18. The content released so far from "Dhoom Dhaam" has garnered significant attention. The songs composed by Gopi Sundar have become chartbusters. With this positive momentum, the makers are excited to present "Dhoom Dham" as a wholesome family entertainer. Today, a special video from "Dhoom Dham" was released as a tribute to Legendary actor amd King of Silver Screen Akkineni Nageswara Rao garu on his 100th birth anniversary. The video features Vennela Kishore singing "Manasu Gathi Inthe" from ANR's classic movie "Prem Nagar," which has impressed audiences. Makers also announced the film's release date. Dhoom Dhaam is set for grand theatrical release on October 18th.
  తారాగణం: సాయి తేజ, పావని కరణం, డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు సంగీతం: యశ్వంత్ నాగ్ డీఓపీ: సందీప్ బద్దుల ఎడిటర్: రవితేజ, శైలేష్ దరేకర్ దర్శకత్వం: ఆనంద్ గుర్రం నిర్మాతలు: రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్  బ్యానర్: హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ విడుదల తేదీ: సెప్టెంబర్ 20, 2024  హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణ బొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'పైలం పిలగా'. సాయి తేజ, పావని కరణం జంటగా నటించిన ఈ సినిమాలో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించిన ఈ ఈ సినిమా సెప్టెంబర్ 20న థియేటర్స్ లో విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: గాల్లో మేడలు కట్టే శివ(సాయి తేజ) దుబాయ్ వెళ్లి బాగా డబ్బు సంపాదించాలి అనుకుంటాడు. దుబాయ్ వెళ్లాలనే శివ కల నెరవేరడం కోసం అతని నానమ్మ ఒక దారి చూపిస్తుంది. ఒక స్థలం ఉంది, ఇది అమ్మితే డబ్బు వస్తుంది, దుబాయ్ వెళ్ళవచ్చు అని చెబుతుంది. దీంతో శివ తన స్నేహితుడు శ్రీను (ప్రణవ్ సోను) తో కలిసి స్థలం అమ్ముదామని అనుకుంటాడు. కానీ ఆ స్థలం లిటికేషన్ లో ఉంటుంది. మరోవైపు తనకు పూర్తిగా భిన్నంగా, డబ్బుపై ఆశలేని దేవి(పావని కరణం) అనే అమ్మాయిని శివ ప్రేమిస్తాడు. దుబాయ్ వెళ్లాలనుకున్న శివ ప్లాన్ ఏమైంది? దేవితో అతని ప్రేమ పెళ్లిపీటలు ఎక్కిందా? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: హీరోనేమో పైసాను ప్రేమించే పిలగాడు. హీరోయిన్ ఏమో ప్రకృతిని ప్రేమించే పిల్ల. గాల్లో మేడలు కట్టే అబ్బాయి, చిన్న గూడైనా సంతోషంగా ఉంటే చాలు అనుకునే అమ్మాయి మధ్య ప్రేమ కథగా 'పైలం పిలగా' రూపొందింది. దుబాయ్ వెళ్లి కోట్లు సంపాదించాలి, ఊళ్ళో కింగ్ అనిపించుకోవాలని ఆరాటపడే హీరో.. తనకి పూర్తి భిన్నమైన వ్యక్తికత్వం ఉన్న అమ్మాయితో ప్రేమలో పడ్డాక.. అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది వినోదాత్మకంగా చెప్పారు.  డైరెక్టర్ ఆనంద్ గుర్రం రాసుకున్న కథలో కొత్తదనం లేనప్పటికీ.. ఆసక్తికర కథనం, ఆకట్టుకునే సన్నివేశాలతో బోర్ కొట్టకుండా సినిమాని మలిచాడు. హాస్యభరిత వ్యంగ చిత్రంగా రూపొందిన 'పైలం పిలగా'లో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అంశాలను కళ్ళకు కిట్టినట్లు చూపించారు. దర్శకుడిగా మొదటి సినిమానే అయినప్పటికీ మంచి ప్రతిభ కనబరిచారు. యస్వత్ నాగ్ సంగీతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. సందీప్ బద్దుల కెమెరా పనితనం ఆకట్టుకుంది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. సాయి తేజ, పావని కరణం వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఫైనల్ గా... హాస్యభరిత వ్యంగ చిత్రంగా రూపొందిన 'పైలం పిలగా'ను పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా హ్యాపీగా చూసేయొచ్చు.
జానీ మాస్టర్(jani master)ని కస్టడీ కి కోరుతు నార్సింగ్ పోలీసులు సంబంధిత ఉప్పరపల్లి కోర్టులో వేసిన పిటిషన్ ని కోర్టు అనుమతించింది.దీంతో పోలీసులు జానీ మాస్టర్ ని చర్లపల్లి జైలుకి తరలించడం జరిగింది. ఆ సమయంలో జానీ మాస్టర్ పోలీసుల దగ్గర నన్ను ఈ కేసులో కావాలని ఇరికించారని, ఆ విధంగా చేసిన వాళ్లని వదలనని చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. జానీ మాస్టర్ వేధింపుల కేసులో ఫిలింఛాంబర్ సభ్యురాలైన ప్రముఖ సినీ నటి ఝాన్సీ మాట్లాడుతూ ఒక బిగ్ హీరో తన   మేనేజర్ ని పంపించి బాధిత అమ్మాయికి సపోర్టుగా నిలిచారని చెప్పింది. దాంతో ఆ బిగ్ హీరో అల్లు అర్జున్(allu arjun)అనే న్యూస్ సోషల్ మీడియాలో బాగానే స్ప్రెడ్ అవుతుంది.పైగా బన్నీ తన ప్రతి సినిమాతో పాటుగా గీతా ఆర్ట్స్ నుంచి వచ్చే ప్రతి సినిమాలోను  ఆ అమ్మాయికి ఆఫర్స్ ఇస్తానని చెప్పినట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గురించి తాజాగా ఒక చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ గతంలో తనతో పాటు పుష్ప లో చేసిన కేశవ ఒక అమ్మాయిని లైంగిక వేధింపులకి గురి చెయ్యడం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది.  దాంతో కేశవ్ ని పోలీసులు అరెస్ట్ కూడా చేసారు.అప్పుడు అల్లు అర్జున్ ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడలేదు. సీక్రెట్ గా కేశవ్ కి బెయిల్ ఇప్పించి పుష్ప 2  లో చేయించుకుంటున్నాడు.మరి ఇప్పుడు జానీ మాస్టర్  విషయంలో మాత్రం బాధిత అమ్మాయి గురించి ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకున్నాడనే చర్చ జరుగుతుంది. జానీ మాస్టర్ జనసేనలో యాక్టీవ్ గా ఉన్ననందుకే అనే ప్రచారం కూడా ఉంది.  
'మిర్చి' వంటి సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన కొరటాల శివ (Koratala Siva).. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'భరత్ అనే నేను' వంటి వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి కొరటాలకు 'ఆచార్య' రూపంలో ఘోర పరాజయం ఎదురైంది. చిరంజీవి, రామ్ చరణ్ మొదటిసారి కలిసి నటించిన ఈ సినిమా.. భారీ అంచనాలతో విడుదలై బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. అంతేకాదు, ఈ చిత్రం కారణంగా చిరంజీవి, కొరటాల మధ్య దూరం కూడా ఏర్పడింది. ఆచార్య పరాజయానికి కొరటాలే కారణమనే అర్థమొచ్చేలా అప్పట్లో చిరంజీవి కామెంట్స్ చేశారు. తమ ఇన్నేళ్ల సీనియారిటీతో సినిమా చేసేటప్పుడు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తామని.. అవి పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయని.. కొందరు పాటించకనే చేదు ఫలితాయి వచ్చాయి అన్నట్టుగా అప్పుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు.. పరోక్షంగా కొరటాలను టార్గెట్ చేసినట్టుగానే ఉన్నాయి. ఆచార్య వచ్చి రెండేళ్లు దాటిపోయినా.. ఆ ఫెయిల్యూర్ పై కొరటాల స్పందించిన సందర్భాలు లేవు. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. అలాంటి కొరటాల మొదటిసారి చిరంజీవిపై ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. 'ఆచార్య' వంటి డిజాస్టర్ తర్వాత కూడా.. తనకు 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల ప్రతిభ మీద నమ్మకంతో జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' (Devara) సినిమా చేశాడు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ హోస్ట్ లుగా ఎన్టీఆర్, కొరటాల ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో "మీరు భయం గురించి సినిమా చేశారు కదా.. మరి మీరు దేనికి భయపడతారు?" అని కొరటాలను సిద్ధు ఆసక్తికర వేశాడు. దీనికి కొరటాల సంచలన సమాధానం చెప్పాడు. "మనకి ఇచ్చిన పనికి మనం జవాబుదారీ. ఆ పనిని పూర్తి చేయాలనే భయంతో, మనం దానిని పూర్తి చేస్తే.. ఎవరికీ భయపడాల్సిన అవసరంలేదు. ఎవడి పని వాడు చేస్తే.. ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. మనది మనం చెయ్యక.. పక్కనోడి పనుల్లో చెయ్యి దూర్చి, ఆయన్ని ఇబ్బందిపెట్టి.. ఇలాంటి చేస్తేనే సమస్య." అని కొరటాల అన్నాడు. అయితే కొరటాల చేసిన ఈ కామెంట్స్ పరోక్షంగా చిరంజీవిని టార్గెట్ చేసినట్లు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 'ఆచార్య' విషయంలో కొరటాల పనిని కొరటాలను చేసుకోనివ్వలేదని, చిరంజీవి కథను మార్చేలా చేశారని సోషల్ మీడియాలో ఒక ప్రచారం ఉంది. కొరటాల తాజా కామెంట్స్.. ఆ ప్రచారాన్ని గుర్తు చేసేలా ఉన్నాయి.
  లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్(jani master)ని పోలీసులు గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆల్రెడీ పోక్సో కేసు కూడా నమోదు కావడంతో ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్ ని ప్రవేశ పెట్టడం జరిగింది.దీంతో  జానీ మాస్టర్ ని కస్టడీ కి కోరుతు పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ కి కోర్టు తమ ఆమోదాన్ని తెలిపింది. కోర్టు పధ్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు జానీ మాస్టర్ ని చర్లపల్లి జైలుకు తరలించారు. దీంతో  వచ్చే నెల 3వ తేదీ వరకు రిమాండ్ ఖైదీ గా చర్లపల్లి జైలులోనే ఉండనున్నాడు. కోర్టులో ప్రవేశపెట్టడానికంటే ముందే  పోలీసులు జానీ మాస్టర్ ని విచారించగా పలు సంచలన విషయాలు బయటకి వచ్చినట్టుగా  తెలుస్తుంది. ఆ అమ్మాయి పై ఎలాంటి  లైంగిక వేధింపులకు పాల్పడలేదని, కావాలనే కొందరు ఆ అమ్మాయి ద్వారా ఫిర్యాదు చేయించి నాపై తప్పుడు కేసు నమోదు చేయించారు. నేను లీగల్ గానే పోరాడుతా, నిజాయితీగా బయటకి వస్తాను. నన్ను ఇరికించిన వారిని మాత్రం  వదలనని జానీ మాస్టర్ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.   
ఉషాకిరణ్ మూవీస్ నుంచి వచ్చిన నచ్చావులే అనే  మూవీతో హీరోయిన్ గా తెరంగ్రేటం చేసిన మాధవి లత(madhavi latha)గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు.చాలా కాలం నుంచి చిత్ర పరిశ్రమకి సంబంధించి గాని, బయట సొసైటీ కి సంబంధించి గాని జరిగే అన్యాయాలపై తన వంతుగా పోరాటాలు చేస్తు సోషల్ మీడియా వేదికగా అందుబాటులోనే ఉంది . రీసెంట్ గా  జానీ మాస్టర్ ఇష్యూ పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.    నాగబాబు(nagababu)గారు జానీ మాస్టర్ కి సపోర్ట్ గా పోస్ట్ చెయ్యడంతో  నేను చాలా బాధపడ్డాను. నాగబాబు గారికి కూడా ఒక కూతురు ఉంది.పైగా తన కూతురు కంటే బాధిత అమ్మాయిది చాలా చిన్న వయసు. అలాగే మహాసేన రాజేష్ అనే వ్యక్తి  జానీ మాస్టర్ కి సపోర్ట్ గా మాట్లాడుతు తన ఫాలోవర్లు ని తప్పు దారి పట్టిస్తున్నాడు.ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం ఇది. జానీ అనే వ్యక్తి మీ వరకు మంచి వాడు కావచ్చు.కానీ ఆ అమ్మాయి విషయానికి వచ్చే సరికి మంచి వ్యక్తి కాదు. బాధిత అమ్మాయి పదహారేళ్ల వయసులో ఉన్నపుడు  జానీ మాస్టర్ ప్రేమ మాటలకి మోసపోయింది.కేవలం  ఒక ఆరునెలలు మాత్రమే జానీ తో  రిలేషన్ లో ఉంది. ఆ తర్వాత అతని నిజ స్వరూపం తెలుసుకొని బయటకి వచ్చి ఇండిపెండెంట్ గా వర్క్ చేసుకుంటుంది. కానీ జానీ మాస్టర్ మాత్రం ఆ అమ్మాయిని చాలా టార్చర్ చేసాడు.నువ్వు లేకుండా నేను బతకలేను అంటు షూటింగ్ ల దగ్గరకి వెళ్లి  గొడవ చేసేవాడు. పైగా చాలా సార్లు  కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ తెలుసుకొనే  మూవీ ఛాంబర్ పెద్దలు జానీ మాస్టర్ ని సస్పెండ్ చేసారు.  టాలెంట్ వేరు క్యారక్టర్ వేరు..  పుష్ప 2 సెట్స్ లో గొడవ జరగడం వలన  అల్లు అర్జున్, సుకుమార్ లకి కూడా ఈ విషయం తెలుసు.అందుకే ఆ అమ్మాయికి సపోర్ట్ గా ఉన్నారు. ఏది ఏమైనా ఒక ఆడపిల్లకి ఇష్టం లేనప్పుడు  నన్ను ప్రేమించు ప్రేమించు అని ఆమెని హరాస్ చేయడం చాలా పెద్ద తప్పు. అందుకు తగ్గ ఆధారాలన్నీ వాట్స్ అప్ చాటింగ్ లో ఉన్నాయని చెప్పుకొచ్చింది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
అప్పు ఆకర్శించని మనిషి ఎవరైనా ఉంటారా ? ఎవరూ ఉండరనే చెప్పాలి. దీన్నే ఆసరాగా చేసుకుని కార్పొరేట్ బ్యాంకులు, సంస్థలు ఇబ్బడిముబ్బడిగా క్రెడిట్ కార్డులను ఇస్తుంది. ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డుల వినియోగంలో సింహభాగం యువతదే! ఈ ప్రీ క్రెడిట్ వ్యామోహంలో పడి ఫైనాన్సిల్ మానేజ్మెంట్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది యువత. తద్వారా వడ్డీలు కట్టలేక ఒత్తిడికి లోనై కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మనం క్రెడిట్ కార్డ్ నుంచి వినియోగించుకున్న మొత్తం సొమ్ముని ఔట్ స్టాండింగ్ అమౌంట్ అంటారు. ఈ మొత్తాన్ని చెల్లించడానికి బిల్ జనరేట్ అయిన తర్వాత 20 నుంచి 25 రోజుల వ్యవదిలో కార్డుకి ఆ మొత్తాన్ని జమ చేయాలి. లేదా అలా మొత్తాన్ని కట్టలేని పక్షంలో మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది. మినిమం డ్యూ అమౌంట్ కట్టమని ఉంటుంది. అంటే మనం వాడుకున్న మొత్తానికి ఇది వడ్డీ మాత్రమే! ఇక్కడే మనవాళ్ళు తప్పులో కాలేస్తుంటారు. కట్టాల్సిన అసలు వదిలేసి మినిమం డ్యూ అమౌంట్ తక్కువ ఉంది కదా అని ఆ పేమెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలా కట్టడం ద్వారా తమ అసలు కట్టాల్సిన నగదు తగ్గుతూ వస్తుంది అనుకుంటారు. అలా ఎప్పుడూ జరగదు. మినిమం డ్యూ అమౌంట్ కడుతున్నంత కాలం కట్టాల్సిన అసలు మాత్రం అలానే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ వడ్డీ ఛార్జీలపై పెద్దగా అవగాహన లేని వారు ఇలా కొన్ని నెలలు చెల్లించాక గానీ విషయం గ్రహించరు. అప్పటికే వీలైనంత వరకు మన జేబుల్ని ఖాళీ చేస్తుంది క్రెడిట్ కార్డ్. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా కేవలం నష్టమే కాదు లాభాలు కూడ ఉన్నాయి అని చెప్పాలి. అత్యవసర పరిస్థితుల్లో రుణ వేసులుబాటుని కల్పిస్తుంది. అయితే బిల్ జనరేట్ అయిన తర్వాత సకాలంలో తిరిగి చెల్లిస్తే ఎటువంటి వడ్డీ చార్జీలు ఉండవు. కానీ ఎప్పటికప్పుడు కొత్త ఆర్ధిక సంస్కరణలతో రుణ నిబంధనలు మార్చుకునే బ్యాంకుల పై కొంత అవగాహనతో మనం వీటిని వినియోగించుకోవాలి. ఇకనుంచి క్రెడిట్ కార్డ్ వినియోగించే ముందు పూర్తి కంపెనీ కస్టమర్ కేర్ కి కాల్ చేసి పూర్తి సమాచారంతో కార్డుని వినియోగిస్తే మంచిది. డబ్బుని సంపాదించడమే కాదు ఎలా వినియోగించుకోవాలో కూడా తెలుసుకోవాలి. దీన్నే ఆర్ధిక క్రమశిక్షణ అంటారు. క్రెడిట్ ఆకర్షణల్లో పడి అవసరం లేకున్నా అందుబాటులో ఉంది కదా అని వాడేస్తే కుదరదు. కార్పొరేట్లు వడ్డీలతో మనల్ని పీల్చి పిప్పి చేస్తారు. ఏ స్నేహితుడో పక్కింటివాడో అయితే కాస్త ఆలస్యం అయినా ఊరుకుంటాడు. కానీ ఇక్కడ బ్యాంకు ప్రతినిధిలు, యంత్రాలు ఫోన్లు చేసి మాట్లాడతాయి. నీ సమస్యలు, కష్టాలు ఇవేమీ పట్టవు వాటికి. చెల్లింపుల్లో మరింత ఆలస్యం అయితే కోర్ట్ నోటీసులు కూడా పంపిస్తారు. కాబట్టి క్రెడిట్ కార్డు కి సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండండి. తప్పని పరిస్థితుల్లో బ్రహ్మాస్త్రంగానే దాన్ని వాడండి. ◆వెంకటేష్ పువ్వాడ  
హాస్యం-అపహాస్యం!! నవ్వడం ఒక భోగం!! నవ్వించడం ఒక యోగం!! నవ్వలేకపోవడం ఒక రోగం!! అబ్బబ్బా ఏమైనా చెప్పారా జంధ్యాల. కేవలం చెప్పడంతో ఆగిపోలేదే, హాస్యాన్ని జోడించి, ఆ హాస్యంలో కూడా సమాజానికి కాస్తో, కూస్తో సందేశాలు ఇస్తూ సినిమాలు తీసి, నవ్వుల జల్లు కురిపించిన ఘనుడు ఆయన. ఎక్కడా అసభ్య పదజాలం వాడకుండా, ఎంతో ఆరోగ్యవంతమైన హాస్యాన్ని ప్రజలకు సినిమాల ద్వారా అందించినవారు జంధ్యాల. ఇదేమి జంధ్యాల గారి గురించి ఊదరగొట్టడానికి రాస్తున్నది కాదు కానీ ఉత్తమ హాస్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచినవారు కాబట్టి చెప్పుకోవలసిందే.  అంతకు ముందు…. పాత సినిమాలు చూస్తే అందులో రేలంగి, రాజబాబు, పేకెటి రంగా, గిరిజ, రమాప్రభ వీళ్ళ నుండి హాస్యాన్ని దోసిళ్ళతో పట్టుకున్న రాజేంద్రప్రసాద్, ఆలీ, చంద్రమోహన్, శ్రీలక్ష్మి వీళ్ళందరూ ఉన్న సినిమాలలో ఎలాంటి భయం లేకుండా హాయిగా నవ్వుకుంటూ సినిమాలు చూసే వెసులుబాటు ఉండేది. ఆ తరువాత తరువాత తరువాత కాలం మారేకొద్ది కొత్తదనం పేరులో హాస్యాన్ని అపహాస్యం చేయడం  మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా హాస్యం పేరుతో అసభ్య పదజాలన్ని వాడుతున్నారు. వాటిని పిల్లల కోసం ప్రత్యేకం అన్నట్టు కవరింగ్ ఇచ్చి నిజంగా పిల్లల్ని కూడా అసభ్య పదజాలానికి అలవాటు చేస్తున్నారు. షోస్ లో ఏముంది?? టీవీ లో ప్రసారం అయ్యే ప్రతి చానల్ లో ఒక కామెడీ షో తప్పక ఉంటోంది. ఆ షో లలో పిల్లల్ని కూడా భాగస్వాములను చేసి వాళ్ళతో పెద్ద పెద్ద డైలాగులు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడిస్తూ ఉంటారు. అవన్నీ చూసే ఇంట్లో పిల్లలు కూడా వాటిని అలవాటు చేసేసుకుంటారు. చిన్నా పెద్దా లేకుండా పంచు డైలాగులు వేయడం అన్ని చోట్లా కామన్ అయిపోతోంది. అసలింతకూ అసలైన హాస్యం అంటే ఏమిటి?? అసభ్యత లేకుండా, ఒకరిని నొచ్చుకునేలా చేయకుండా, సరదాగా నవ్వించేది హాస్యం. అలా నవ్వించే వారు నిజంగా నవ్వుల రాజులు, కిలకిల రాణులు అనుకోవచ్చు. కానీ ఇప్పుడెక్కడుంది అలాంటి హాస్యం. సాడిజంలో హాస్యం ప్రస్తుత టీవీ షోల పుణ్యమా అని ఒకరిని కొట్టడంలో, ఒకరిని తిట్టడంలో, ఒకరి ఇబ్బందిని ఎగతాళి చేయడంలో హాస్యం పాళ్లు పుష్కలంగా నింపేస్తున్నారు. ఫలితంగా ఇళ్లలో పిల్లలు కూడా వాటిలోని హాస్యాన్ని చూస్తూ వాటి ద్వారానే హాస్యాన్ని సృష్టిస్తున్నారు. ఒక అరభై సంవత్సరాల తాతయ్య తన పదేళ్ల మనవడితో ఒరేయ్ నువ్వు ఉద్యోగం చేసి,డబ్బు సంపాదించి నాకు మంచి బట్టలు కొనివ్వాలిరా అని అడిగితే, ఆ పదేళ్ల బుడ్డోడు తన తాతతో  నేను చదువు పూర్తి చేసి, ఉద్యోగం తెచ్చుకుని సంపాదించే వరకు నువ్వు బతికే ఉంటావా?? అప్పుడు నేను బట్టలు కొని నీ సమాధి మీద కప్పుతాలే అంటాడు. ఇలాంటివి ఈ కాలంలో ఎన్నో వింటున్నారు, చూస్తున్నారు.  పిలల్లో విలువల స్థాయి అంతకంతకూ తగ్గిపోతోంది, వాళ్ళు వయసును మించి మాట్లాడే ప్రతి మాటా బాల్యానికి ఉన్న అర్థాన్ని మార్చేస్తున్నాయి. ఏమి చేయాలిప్పుడు?? హాస్యం అంటే మనసారా నవ్వుకుంటూ పిల్లల్లో ఆలోచనా శక్తిని పెంపొందించేలా ఉండాలి. ఆ కోవలోకి చెందినవే అక్బర్-బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, పంచతంత్ర కథలు మొదలైనవి. ఇవన్నీ పిల్లలకు నవ్వు తెప్పిస్తూనే అందులో నీతిని, విలువలను మెల్లగా మెదడులలోకి జోప్పిస్తాయి. అవన్నీ కూడా పుస్తకాల ద్వారా కాకపోయినా ఆడియో, వీడియో లు అందుబాటులో ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు కాస్త శ్రద్ధ పెట్టి, పిల్లలకు అసభ్య హాస్యాన్ని దూరంగా ఉంచుతూ ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించాలి. పార్కులలో కూర్చుని ఊరికే గట్టిగా నవ్వుతూ నవ్వుతో ఆరోగ్యం అని చెప్పుకునే బదులు, కాసేపు చిన్నపిల్లల్లా మారిపోయి చిన్ననాటి కథల పుస్తకాల్లో పేజీలను తిరిగేస్తూ, వాటిలో నుండి మిమ్మల్ని మీరు వెతుక్కుంటే హాస్యం అపహాస్యం కాకుండా ఆరోగ్యమస్తు అని దీవించడం ఖాయం. కాదంటారా?? ◆ వెంకటేష్ పువ్వాడ
చాలా మంది జీవితాల్లో భిన్న సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో ఒక్కోటి ఒకో విధంగా ఉంటాయి. ప్రతి మనిషీ తన జీవితంలో ఏదో ఒకటి ఆశించే ప్రతి పనీ చేస్తాడు. కొన్ని పనులలో స్వేచ్ఛ ఉంటుంది. అభిరుచి ప్రదర్శించే అవకాశం ఉంటుంది.  అయితే కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని నియమాలు లోబడి, కొన్ని పరిధులలో మాత్రమే ఉండి చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా జీవితంలో చాలా మంది విలువ ఇచ్చే విద్య,  ఉద్యోగం, జీవితాంతం తోడుండే భాగస్వామి, ఇంకా వ్యక్తిగతంగానూ, ఆర్థికంగానూ ఎదుగుతూ ఉండే విషయాలు. ఇలా అన్నింటిలో కూడా అన్నీ అనుకున్నట్టు జరగవు, అనుకున్నట్టుగా సొంతమవ్వవు అని అంటారు. అందుకే సర్దుకుపోవాలి అనే సూత్రాన్ని అందరి బుర్రల్లో జొప్పించేస్తూ ఉంటారు. అయితే అది నిజమేనా?? జీవితంలో దేన్నీ కోల్పోకుండా, ఏ విధంగానూ కాంప్రమైజ్ కాకుండా జీవించడం సాధ్యమవుతుందా?? వాస్తవ కోణంలో…. నిజానికి చిన్నతనంలో భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు చెప్పింది, తల్లిదండ్రులకు నచ్చింది చేసుకుంటూ పోవడంలోనే జీవితాలు సగం అరిగిపోతున్నాయి. ఏమి చదవాలి, భవిష్యత్తులో ఏమి చేయాలి అని నిర్ణయాలు తీసుకోవడానికి ఎలాంటి అవకాశాలు ఇవ్వరు తల్లిదండ్రులు. అలాంటి అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. అలా ఉన్నవాళ్లు మంచి విద్యావేత్తలూ, సమాజాన్ని ఎంతో లోతుగా చూసి విశ్లేషించి పరిపక్వత కలిగిన వాళ్ళు అయిఉంటారు. కాబట్టి వాస్తవకోణంలో చూస్తే నీకేం కావాలి అని అడిగే తల్లిదండ్రుల కంటే ఇది తీసుకో, ఇదే తీసుకో అనే వాళ్ళు ఎక్కువ. అభిరుచులు, ఇష్టాలు, ప్రాధాన్యత!! చిన్నతనం నుండి ఏదో ఒక విషయంలో అధిక ఆసక్తి ఉండటం గమనించవచ్చు. అది క్రమంగా పెద్దవుతూ ఉంటే దానిలో నైపుణ్యం కూడా పెంచుకోవచ్చు. కానీ భారతీయ తల్లిదండ్రులలో భవిష్యత్తులో ఉద్యోగాలు చెయ్యాలి. అలా చేయాలంటే చదువే ముఖ్యం. అభిరుచులు గట్రా అన్నీ పనికిమాలినవి అనే అభిప్రాయం స్థిరపడిపోయింది. దాని కారణంగా ఎంతోమంది సృజనాత్మకతను మొగ్గదశలోనే చంపేసుకుంటున్నారు. అలా ఆకాకుండా సృజనాత్మకతను విద్యకు ఉత్ప్రేరకంగా వాడుకుంటే ఎంతో గొప్ప భవిష్యత్తును చూడవచ్చు.  ఆత్మవిశ్వాసం ఉంటే సాధ్యమే!! కొందరికి కొన్ని ఇష్టాలు, అభిరుచులు ఉంటాయి. ఆ ఇష్టాలు అభిరుచులు చాలా చిన్నవి అయి ఉంటాయి. కానీ వాటిని కాదని పెద్ద వాటికి ప్రాముఖ్యత ఇవ్వాల్సి వస్తుంది జీవితంలో. బహుశా అవి ముఖ్యమైన విషయాలు కూడా కావచ్చు. కానీ ఆత్మతృప్తిని లేకుండా ఎంత పెద్ద పనులు చేసినా ఎంత ఎత్తుకు ఎదిగినా మనసులో ఏదో ఒక అసంతృప్తి ఉండనే ఉంటుంది. కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఇష్టమైనవి ఆత్మతృప్తి కోసం చేసుకుంటూ, జీవితంలో ఎదగడానికి అవసరమైనవి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సినది ఆత్మతృప్తిని, ఆర్థిక ఎదుగుదలను పోల్చి చూడకూడదు. వాటిని మాత్రమే కాదు జీవితంలో ఏ పని ప్రాధాన్యత దానిది అని గుర్తిస్తే ఇది కావాలి ఇది వద్దు అనే ప్రసక్తి లేకుండా ఇష్టమైనవి అన్ని పొందవచ్చు. అవ్వా కావాలా?? బువ్వ కావాలా??  కాదు కాదు  మనసుకు నచ్చింది చేసుకుపోవాలి. నిజమే మరి మనసుకు నచ్చింది ఏదైనా వంద శాతం శ్రద్ధతోనూ, ఆసక్తితోనూ, ఇష్టంతోనూ చేస్తాము కాబట్టి జయం మనదేరా తృప్తి మనదేరా అనుకోవాలి. అవ్వా, బువ్వా ఒక్కటే తీసుకో అని అంటే ఎలాంటి సందేహం లేకుండా అవ్వతో బువ్వ పెట్టించేసుకోవడం లాంటిదన్నమాట. ◆ వెంకటేష్ పువ్వాడ   
పొటాషియం మన శరీరానికి అత్యవసరమైన అల్కలైట్ అదే సోడియం పొటాషియం  ఎలక్ట్రో లైట్స్ ఎక్కువైనా ఇబ్బందే తక్కువైనా ఇబ్బందే అని అంటున్నారు నిపుణులు.ఒక కేస్ స్టడీ లో శరీరం లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల ఒక్కో సారి పొటాషియం ఎక్కువైతే పాక్షవాతం,లేదా గుండె పోటు కు కూడా దారి తీయవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఒక కేసును కిమ్స్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎన్ పాపారావు మాట్లాడుతూ ఒక రోగి ఆసుపత్రికి వచ్చాడని కాళ్ళు కదపలేని స్థితిలో ఉన్నాడని అసలు కాలు కదపడం లేదంటే ఏదైనా న్యూరో సమస్య ఉండి ఉండవచ్చని భావించి ఎం అర్ ఐ స్పైన్ బ్రెయిన్ స్కాన్  పరీక్షలు  చేయించా మని అక్కడ ఏ రకమైన సమస్య బయట పడలేదని అయితే  ఇక మిగిలింది రక్త పరీక్ష చేయించగా రక్తం లో పొటాషియం శాతం ఎక్కువగా ఉందని గమనించి నట్లు డాక్టర్ పాపారావు వివరించారు.   ముఖ్యంగా పొటాషియం పెరగడాన్ని వైద్యులు హైపెర్ కలేమియా గా నిర్ధారించా మని తెలిపారు.కాగా పొటాషియం లెవెల్స్ రక్త్గం లో  పెరగడం వల్ల అది కార్డియో వాస్క్యులర్ అంటే గుండె రక్తనాళా లలో సమస్యలు వస్తాయని డాక్టర్ పాపారావుపేర్కొన్నారు.ఒక్కో సారి పొటాషియం ప్రతి వ్యక్తికి 4,7౦౦ ఎం  జి తీసుకోవాల్సి ఉంటుందని పాపారావు వివరించారు.ప్రతి గంటకు పొటాషియం శాతం మానీటర్ చేస్తూ పొటాషియం పెరగడం వల్ల వచ్చే ఇతర సమస్యలు రాకుండా నిత్యం నిపుణులైన విద్యుల పర్య వేక్షణలో ఉండాలని సూచించారు.పొటాషియం పెరగడం వల్ల కిడ్నీ ఫెయిల్ యుర్ కు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారుహై పర్ కేల్మియా వల్ల కిడ్నీ పనుచేయదని కిడ్నీ సరిగా పనిచేయకుంటే శరీరం నుండి పొటాషియం తొలగించలేదని అన్నారు కాగా హైపర్ కెల్మియా చాలా సహజమైన సమస్య అని అన్నారు వాస్తవానికి కిడ్నీ పొటాషియం ను నియంత్రిస్తుంది.అలాగే శరీరాన్ని పొటాషియం ను సమతౌ లయం గా ఉంచుతుంది. కిడ్నీ సరిగా పనిచేయానట్లితే అదనపు పొటాషియం ఫిల్టర్ చేయాలేదు.రక్తం లో చేరిన పొటాషియం తొలగించలేదు.కిడ్నీ లోని ఆల్టో స్టేరాన్ ఎప్పుడు పొటాషియం ను తొలగించాలో చెబుతుంది.ఒక వేళ ఆల్టో స్టేరాన్ ఉత్పత్తి తగ్గితే అడిసన్స్, వ్యాధి సోకే అవకాశం ఉందని.అది హైపర్ కేల్మియా కు దారి తీస్తుందని నిపుణులు స్పష్టం చేసారు. హైపెర్ కీల్మియా సమస్యలు... *రక్త కణాలు పనిచేయకుండా పోవడం.హేమోలసిస్.అని అంటారు. *కండరాలు కణాలు రబ్బో మయోసిస్ వంటి సమస్య వస్తుంది. *కాళ్ళలో మంటలు కణాలు ప్రమాదం బారిన పడతాయి. *డయాబెటీస్ నియంత్రణ సాధ్యం కాదని నిపుణులు పేర్కొన్నారు.        రక్తనాళా లలో పొటాషియం శాతం పెరిగితే మూత్ర నాళం ద్వారా బయటికి పోతుందని అయితే పొటాషియం పెరగడం వల్ల అలసట నాజియా గుండె హృదయ స్పందనలో హెచ్చు తగ్గులు ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కాగా పొటాషియం వల్ల కండరాలలో నొప్పులు అలాగే పాక్షవాతానికి దారి తీస్తుందని డాక్టర్ పాపారావు వెల్లడించారు.కాగా కాళ్ళు వేళ్ళు స్పర్స కోల్పోవడం,పొట్టలో పట్టి నట్లు గా ఉండడం.విరేచనాలు,కళ్ళు తిరగడం వంటి సమస్యలు తలేత్తుతాయాని పొటాషియం సమస్యను సకాలం లో గుర్తించ కుంటే రోగులు కోమాలోకి చేరతారని ఈ విషయాన్ని పూర్తిగా గమనించాలని తగిన విధమైన చికిత్స సకాలం లో అందిస్తే రోగిని తీవ్రత నుండి కాపాడ వచ్చని డాక్టర్ పాపారావు స్పష్టం చేసారు. ఆహారం లో పొటాషియం తగ్గడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని తెలిపారు.ఒక్కో సారి కిడ్నీద్వారా ఫిల్టర్ కావాల్సిన రక్తం  పనిచేయకుంటే డయాలసిస్ చేయాల్సి ఉంటుందని. నిపుణులు పేర్కొన్నారుఅదనంగా వచ్చి చేరిన పొటాషియం తగ్గించాలంటే .పొటాషియం బైన్ డర్స్ వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు.లేదా బీటా బ్లాకర్స్ వాడాల్సి ఉంటుంది. శరీరానికి కావాల్సిన పొటాషియంఅంటే సమతౌల్యం గా ఉండాలంటే. అవకాడో, టమాటా, ఆలు, కొత్తిమీర,పాలకూర కివి పళ్ళు,అరటి పళ్ళు,వంటివి మన శరీరంలో పొటాషియం  ను సమతౌల్యం లో ఉంచుతాయి.                                           
పసుపు పాలు రోజూ తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. పసుపును ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది సహజ యాంటీబయాటిక్గా పరిగణించబడుతుంది. అయితే కాల్షియం, ప్రోటీన్ తో సహా  అనేక విటమిన్లు పాలలో ఉంటాయి. పసిపిల్లల నుండి వృద్దుల వరకు పాలు తాగడం ఎంతో అవసరమని వైద్యులు ఎన్నో ఏళ్ళ నుండి చెబుతూనే ఉన్నారు. ఇలా ఔషద గుణం కలిసిన పసుపు, ఆరోగ్యం చేకూర్చే పాలు రెండింటిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి డబుల్ ప్రయోజనాలు పొందవచ్చని సాధారణంగా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా పసుపు పాలు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందనే నమ్మకం ఉంది. అది నిజం కూడా.. కానీ రోజూ  రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే ఇమ్యూనిటి మాత్రమే కాదు ఇంకా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఈ రోజు నుండే రాత్రి పూట పసుపుపాలు తాగడం మొదలెట్టేస్తారు. పసుపు పాలను గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.  ఏ సమస్య ఉన్నవారు పసుపు పాలను ఎలా తయారుచేసుకోవాలో.. పసుపుపాలు కేవలం ఇమ్యూనిటికే కాకుండా ఇంకా ఏ ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలుసుకుంటే.. రాత్రిపూట నిద్ర సంబంధ సమస్యలతో బాధపడేవారు పసుపు పాలు తాగాలని కొందరు సలహా ఇస్తారు.  ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే, రోజూ రాత్రిపూట ఒక గ్లాసు పసుపు పాలు తాగాలి. ఇది  బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.  పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుందనే విషయం అందరికీ తెలిసిందే. రాత్రి పూట పసుపు పాలు తాగడం  ద్వారా దగ్గు, జలుబు , జ్వరం వంటి సమస్యలు  నివారించవచ్చు. బోలెడు వ్యాధుల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  సీజన్ ఏదైనా  తప్పనిసరిగా పసుపు పాలు తాగడం మంచిది. పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి పసుపు పాలు దివ్యౌషధం. ఇది వాపు,  నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అందుకే ప్రతిరోజు పసుపు పాలు తాగుతుంటే కీళ్ళు, ఎముకల సమస్యలు మెల్లిగా తగ్గుతాయి. పసుపును వందల ఏళ్ళ నుండి  చర్మ సంరక్షణలో  ఉపయోగిస్తున్నారు. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.  హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. పసుపు పాలు తీసుకోవడం వల్ల  చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. ఏ సమస్య ఉన్నవారు పసుపు పాలు ఎలా తాగాలంటే.. సాధారణంగా ఇమ్యునిటీ కోసం తాగాలని అనుకుంటే ముందుగా పాలు మరిగించాలి. రుచికి చిటికెడు పసుపు, పంచదార లేదా బెల్లం  జోడించాలి. అసలు తీపి జోడించకపోయినా పర్లేదు. పడుకునే ముందు వేడిగా లేదా గోరువెచ్చగా తాగాలి.  మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు పసుపు పాలలో  చిటికెడు జాజికాయ కూడా  కలిపి తాగవచ్చు. ఇది చక్కగా పనిచేస్తుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు  పసుపు పాలు తయారుచేసేటప్పుడు  కొన్ని జీడిపప్పులను కూడా కలుపుకోవచ్చు. లేదంటే జీడిపప్పు పొడిగా చేసి పాలు మరిగేటప్పుడు కొద్దగా జోడించవచ్చు. పసుపు పాలలో చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి మరిగించి తాగితే   గొంతు నొప్పి,  ఇన్ఫెక్షన్‌లు తగ్గుతాయి.                                                *నిశ్శబ్ద.