తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా అంబసముద్రం ఎమ్మెల్యే సుబ్బయ్య కూడా తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన నేరుగా లోక్‌భవన్‌కు వెళ్లి అసెంబ్లీ స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిశారు. అనంతరం తన రాజీనామా లేఖను స్పీకర్‌కు సమర్పించారు. సుబ్బయ్య ఇచ్చిన రాజీనామా పత్రాన్ని పరిశీలించిన తర్వాత త్వరలోనే అధికారిక నిర్ణయం వెల్లడిస్తామని స్పీకర్ మీడియాకు తెలిపారు.  ఇటీవల రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీవీకే పార్టీలో చేరగా, సుబ్బయ్య కూడా త్వరలోనే ఆ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరుస రాజీనామాలతో అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే వేలుమణి వర్గానికి చెందిన 25 మంది  ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లు అసెంబ్లీలో మద్దతు తెలిపాయి.  
  జనసేన పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. పార్టీలో ఎట్టిపరిస్థితుల్లోనూ క్రమశిక్షణారాహిత్యాన్ని సహించేది లేదని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా జనసేన కమిటీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజమండ్రి వేదికగా నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి కీలక ప్రతినిధులు, క్రియాశీలక కార్యకర్తల సదస్సులో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత పన్నెండేళ్లుగా తాను చూపిస్తూ వస్తున్న ఓపికకు ఇక ముగింపు పలికే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. పార్టీని మరింత పటిష్ఠమైన సైనిక క్రమశిక్షణ గల వ్యవస్థగా రూపాంతరం చెందించేందుకు కఠిన నిర్ణయాలకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా కమిటీ పరిధిలో చోటుచేసుకుంటున్న గ్రూపు రాజకీయాల పట్ల పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పాతిక మంది సభ్యులు ఉన్న చోట ఏకంగా యాభైకి పైగా అంతర్గత వివాదాలు తలెత్తడంపై ఆయన ఆవేదన చెందారు. ఇలాంటి వర్గ విభేదాల కారణంగా ఒకరిని ఒకరు తొక్కేస్తూ, పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నారని నేతల తీరును తప్పుబట్టారు. సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేస్తూ.. ఇప్పటివరకు పార్టీ శ్రేణులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చానని, కానీ ఇకపై నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. "పార్టీ నిర్దేశించిన మార్గంలో కలిసి నడవండి, లేదంటే తప్పుకోండి" (ఫాల్ ఇన్ లైన్ ఆర్ ఫాల్ అవుట్ ఆఫ్ లైన్) అంటూ గట్టి సంకేతాలు పంపారు. ఈ నిర్ణయంతో పార్టీలో పదవులు అనుభవిస్తూ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించే ఏ స్థాయి నేతలకైనా కఠిన చర్యలు తప్పవనే స్పష్టమైన హెచ్చరిక వెళ్ళింది. కేవలం ఎన్నికల విజయాలతో సరిపెట్టుకోకుండా, సంస్థాగతంగా పార్టీని పటిష్ఠం చేయడమే తన లక్ష్యమని ఆయన నిరూపించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ నిర్ణయం జనసేన శ్రేణుల్లో పెను సంచలనంగా మారింది. పార్టీ అధినేత తీసుకున్న ఈ కఠిన నిర్ణయం తర్వాత జిల్లా రాజకీయ సమీకరణాలు వేగంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఎలాంటి వర్గపోరుకు తావులేకుండా సరికొత్త నాయకత్వంతో ప్రకాశం జిల్లాకు సరికొత్త కార్యవర్గాన్ని ప్రకటించేందుకు కసరత్తులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.  
  కర్ణాటక పాలిటిక్స్‌లోకి టీవీకే ఎంట్రీ సంచలన వ్యూహం.. దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి, ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు సృష్టించిన కోలీవుడ్ సూపర్ స్టార్, 'దళపతి' విజయ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. తమిళనాడులో తన సొంత పార్టీ 'తమిళగ వెట్రి కజగం' (TVK) తరఫున ఒంటరిగా బరిలోకి దిగి 34.9 శాతం ఓట్ల శాతాన్ని కొల్లగొట్టడమే కాకుండా, ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్, కాంగ్రెస్ మరియు సీపీఐ(ఎం) మద్దతుతో 118 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.  అయితే తమిళనాడులో సాధించిన ఈ చారిత్రాత్మక విజయంతో ఆయన ప్రస్థానం ఆగడం లేదు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టేందుకు దళపతి విజయ్ వ్యూహాత్మక అడుగులు వేస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపుతోంది.  ముఖ్యంగా కర్ణాటకలోని బెంగుళూరు నగరంతో పాటు తమిళ ప్రజలు అధిక సంఖ్యలో నివసించే సరిహద్దు జిల్లాలను లక్ష్యంగా చేసుకుని విజయ్ తన 'టివికె' పార్టీని విస్తరించాలని యోచిస్తున్నారు.  కర్ణాటకలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) మరియు గ్రామీణ స్థానిక సంస్థల (GBA) ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించడానికి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కర్ణాటక వ్యాప్తంగా విజయ్‌కు లక్షలాది మంది అభిమానులు ఉండటం, బెంగళూరులోని కొన్ని ప్రాంతాలలో తమిళ ఓటర్ల శాతం దాదాపు 25 నుండి 30 శాతం వరకు ఉండటంతో ఈ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చని టీవీకే అధినేత భావిస్తున్నారు.  ఈ పరిణామాలు కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ప్రతిపక్ష బీజేపీ-జేడీఎస్ కూటమికి పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే అంతర్గత నివేదికల ద్వారా విజయ్ ఎంట్రీ ప్రభావంపై ఆరా తీస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. తమిళనాడులో 2024 ఫిబ్రవరిలో పార్టీ పెట్టిన కేవలం రెండేళ్లలోనే ద్రావిడ దిగ్గజాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలను మట్టికరిపించి 234 స్థానాల్లోనూ బలమైన ఉనికిని చాటుకున్న విజయ్ క్రేజ్ సాధారణమైనది కాదు.  గతంలో 2025 సెప్టెంబర్ 27న జరిగిన కరూర్ భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది అభిమానులు మరణించిన దురదృష్టకర సంఘటన జరిగినప్పటికీ, విజయ్ ప్రజాబలం ఏమాత్రం తగ్గలేదు. అటువంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు బెంగళూరు రాజకీయాల్లో వేలు పెడితే, అది కర్ణాటక పాలిటిక్స్ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో దళపతి విజయ్ కర్ణాటక పర్యటనకు రానున్నట్లు సమాచారం రావడంతో కన్నడ నాట రాజకీయం మరింత వేడెక్కింది  
ALSO ON TELUGUONE N E W S
సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu),ప్రశాంత్ నీల్(Prashanth Neel)కాంబోలో  ఒక భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాని, ఇండస్ట్రీ వర్గాలని ఊపేస్తోంది. ఈ మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్‌ కి  సంబంధించిన ప్రాథమిక చర్చలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఈ కాంబో గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, సినీ ప్రియులు, అభిమానులు మాత్రం ఈ వార్తతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ పవర్‌ఫుల్ ఎలివేషన్స్, అద్భుతమైన స్టోరీ నరేషన్,   మహేశ్ వన్ మ్యాన్ షో స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం  మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌(Ntr)తో చేస్తున్న 'డ్రాగన్'(Dragon)తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల విడుదలైన 'డ్రాగన్' గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ వ్యూస్ సాధించి అంచనాలను పెంచేసింది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో 'సలార్ 2' సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. అదే సమయంలో ప్రశాంత్ నీల్ తన మార్క్ డార్క్ టోన్, నియో నాయర్ యాక్షన్ సినిమాలకి  కొంత విరామం ఇచ్చి, మైథాలజికల్ లేదా డిఫరెంట్ జానర్ వైపు అడుగులు వేయబోతున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ సరికొత్త ప్రయోగంలో భాగంగానే మహేశ్ బాబు కోసం ఒక మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మహేశ్ ప్రస్తుతం గ్లోబల్ డైరెక్టర్  రాజమౌళి(Rajamouli)దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాన్వ రల్డ్ మూవీ 'వారణాసి'(Varanasi)షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 'వారణాసి' తర్వాత మహేశ్ బాబు, సుకుమార్ లేదా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేసే  అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ప్రశాంత్ నీల్ లాంటి మాస్ డైరెక్టర్ నుంచి వచ్చిన సరికొత్త ప్రపోజల్ మహేశ్ బాబుని  ఆలోచనలో పడేసిందని, మైత్రి మూవీ మేకర్స్ ఈ క్రేజీ కాంబినేషన్‌ ని సెట్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. Also read: VIJay: సీఎం విజయ్‌పై సముద్రఖని సంచలన వ్యాఖ్యలు..ఏం అర్హత ఉందో ఇప్పుడు అర్థమైందా! అయితే ఈ ఊహించని కాంబో పట్టాలెక్కడానికి కనీసం మూడేళ్ళ సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే మహేశ్ బాబు 'వారణాసి' ప్రాజెక్ట్‌ కి  ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది.  ప్రశాంత్ నీల్ కూడా 'డ్రాగన్', 'సలార్ 2', మరియు హోంబాలే ఫిలిమ్స్‌తో ఉన్న ఒప్పందాల ప్రకారం 'కేజీఎఫ్ 3' లాంటి భారీ కట్టుబాట్లని  పూర్తి చేయాలి. ఒకవేళ వీరద్దరి షెడ్యూల్స్ అన్నీ అనుకూలించి, కథ లాక్ అయితే మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కావడం ఖాయం.   
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత కన్నుల పండువగా జరిగింది. రాష్టప్రతి భవన్‌లోని ప్రత్యేక ప్రాంగణంలో నిర్వహించిన ఈ సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ రంగాల ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలకు దక్కిన గౌరవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా గతేడాది నవంబర్‌లో కన్నుమూసిన బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం 'పద్మవిభూషణ్' ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయన సతీమణి, సీనియర్ నటి హేమమాలిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కాస్త భావోద్వేగానికి గురయ్యారు. సుమారు ఆరు దశాబ్దాల పాటు వెండితెరపై ధర్మేంద్ర అందించిన సేవలకు గాను ఈ అత్యున్నత గౌరవం దక్కింది. మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సీనియర్ హీరో మమ్ముట్టి, ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్‌లు ఈ వేడుకలో 'పద్మభూషణ్' పురస్కారాలను స్వయంగా అందుకున్నారు. కళారంగానికి వారు చేసిన అసమాన సేవలకు గాను ఈ గౌరవం లభించింది. అలాగే సంగీత ప్రపంచంలో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న వయొలిన్ విద్వాంసురాలు ఎన్. రాజం కూడా పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి సీనియర్ నటులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌లతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆర్. మాధవన్‌లకు ఈ ఏడాది కేంద్రం 'పద్మశ్రీ' పురస్కారాలను ప్రకటించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీరు ఈ దఫా వేడుకకు హాజరుకాలేకపోయారు. తెలుగు రాష్ట్రాల నుంచి క్లాసికల్ డ్యాన్సర్ దీపికారెడ్డి, దివంగత గాయకులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కుమారుడు అనిల్ కుమార్ అందుకున్నారు) తదితరులు పద్మశ్రీ అవార్డులను స్వీకరించిన వారిలో ఉన్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ విశేషాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సినిమా రంగం నుంచి ఎంతోమంది అర్హులైన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఈసారి తగిన గుర్తింపు లభించిందంటూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మమ్ముట్టి, ధర్మేంద్ర వంటి నటుల పేర్లు ఈ జాబితాలో ఉండటంపై నెటిజన్లు పెద్ద ఎత్తున అభినందనలు కురిపిస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించగా.. తొలి విడతలో భాగంగా 66 మంది విజేతలకు రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేశారు. మిగిలిన విజేతలకు తదుపరి విడతలో అవార్డులను బహూకరించనున్నారు. 
    ఇళయ దళపతి విజయ్(Vijay)తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ తనదైన స్టయిల్లో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమతో పాటు సౌత్ సినీ పరిశ్రమలో  విలక్షణ నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని తాజాగా విజయ్ రాజకీయ ప్రస్థానంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సౌత్  చిత్ర పరిశ్రమలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  ఒక మీటింగ్ కి హాజరైన సముద్రఖని(samuthirakani)మాట్లాడుతు తమిళనాడు ప్రజలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. గతంలో తాను ఒక శ్రేయోభిలాషిగా, మంచి స్నేహితుడిగా మాత్రమే కొన్ని సూచనలు చేశాను . వాటిని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. రాజకీయాలు అనేవి రంగుల ప్రపంచమైన సినిమా లాంటివి కావని, ఇక్కడ ప్రతి అడుగు ఎంతో వ్యూహాత్మకంగా ప్రజా క్షేమం వైపు ఉండాలని తాను నమ్మిన మాట వాస్తవమేనని, కానీ విజయ్ ఆ సవాళ్లన్నింటినీ అధిగమించి 100 శాతం నిబద్ధతతో ప్రజల మనసులు గెలుచుకున్నారని కొనియాడారు. అసలు విజయ్ రాజకీయాల్లోకి రావడానికి ఏం అర్హత ఉందని కొంత మంది అడిగారు. అయితే ఆ అర్హత ఉందని చెప్పుకునే వాళ్ళు ప్రజల కోసం ఏం చేసారు. కేవలం స్టార్ డమ్‌ని నమ్ముకోకుండా ప్రజల్లోకి వెళ్లడం వల్లే ఈ రోజు విజయ్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టించగలిగారు. also read: ఒకే మూవీకి అనిరుధ్, థమన్ మ్యూజిక్.. ఏ అగ్ర హీరో మూవీకో తెలుసా! ముఖ్యంగా తమిళనాడులో గత కొన్ని దశాబ్దాలుగా సినిమా రంగానికి, రాజకీయాలకు విడదీయరాని బంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు సినీ గ్లామర్ నుంచి వచ్చి రాజకీయాలను శాసించినవారే. అయితే మారుతున్న కాలంలో, అంటే 2026 నాటి ఆధునిక రాజకీయాల్లో కేవలం సినిమా క్రేజ్ మాత్రమే సరిపోదని సముద్రఖని నొక్కి చెప్పారు. నేటి తరం ఓటర్లు ఎంతో చైతన్యవంతంగా ఉన్నారని, 80 శాతం కంటే ఎక్కువ మంది యువత కేవలం నాయకుడి సిద్ధాంతాలను, వారి ఆచరణాత్మక విధానాలను చూసి మాత్రమే ఓటు వేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో విజయ్ తన సరికొత్త రాజకీయ సైన్యంతో ప్రజా క్షేమం కొరకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారనేది అత్యంత కీలకంగా మారిందని విశ్లేషించారు.   
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'పెద్ది'. విడుదలకు సిద్ధమవుతున్న ఈ  చిత్రం నుండి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు అత్యంత కీలకమైన క్యారెక్టర్ రోల్‌లో నటిస్తున్నారు. సినిమాలో కథను ఊహించని మలుపు తిప్పే 'అప్పలసూరి' అనే పవర్‌ఫుల్ పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. తాజాగా ఈ క్యారెక్టర్‌కు సంబంధించి జగపతిబాబు డబ్బింగ్ చెబుతున్న ఒక సాలిడ్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. డబ్బింగ్ థియేటర్ లో జగపతిబాబు ఒక ఎమోషనల్ సీన్‌కి డైలాగులు చెబుతూ ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయారు. ఆయన గంభీరమైన వాయిస్ బేస్, డైలాగ్ డెలివరీ చూస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పలసూరిగా జగపతిబాబు చేసిన పర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని ఈ వీడియో స్పష్టం చేస్తోంది.  https://x.com/IamJagguBhai/status/2059150640660861061 గతంలో రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ 'రంగస్థలం' చిత్రంలో జగపతిబాబు పోషించిన 'ఫణీంద్ర భూపతి' పాత్ర ఎంతటి ప్రభావాన్ని చూపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న 'పెద్ది' మూవీలోని అప్పలసూరి క్యారెక్టర్ ఆ ప్రెసిడెంట్ పాత్రను మించిపోయేలా అత్యంత రా అండ్ రస్టిక్‌గా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ డబ్బింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. మెగా అభిమానులతో పాటు సినిమా లవర్స్ కూడా ఈ వీడియోపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. జగపతిబాబు నటనకు, బుచ్చిబాబు టేకింగ్‌కు ఈ సినిమాతో మరో నేషనల్ అవార్డు ఖాయమంటూ నెటిజన్లు హంగామా సృష్టిస్తున్నారు. భారీ అంచనాల నడుమ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి!
  భారతీయ సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త సంచలనానికి తెర లేచింది. తమ ట్యూన్స్ తో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించే రాక్‌స్టార్స్ అనిరుధ్ రవిచందర్, థమన్ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం సౌత్  అభిమానుల్లో టాక్ హాఫ్ ది డే గా మారింది.   థమన్ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి ఎక్స్ వేదికగా 'నన్బా ఇక మొదలెడదామా’ అంటూ అనిరుద్ కి టాగ్  చేసాడు. ఇప్పుడు ఈ పోస్ట్ నిమిషాల్లో వైరల్ గా మారడంతో ఏ మూవీకి ఇద్దరు కలిసి పని చేయబోతున్నారనే చర్చలు ఇరువురి ఫ్యాన్స్ లో మొదలయ్యాయి. కానీ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం అనిరుద్ తో థమన్ తన అప్ కమింగ్ మూవీలో ఒక  పాటని మాత్రమే పాడించుకుంటున్నట్టుగా టాక్. అనిరుద్ సింగర్ గాను తన సత్తా చాటుతూ వస్తున్న విషయం తెలిసిందే. Also read: sri Gouri Priya: లెజండ్రీస్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న  శ్రీ గౌరిప్రియ.. అచ్చ తెలుగు యంగ్ హీరోయిన్ మరి ఇప్పుడు థమన్ ఏ మూవీలో అనిరుద్ చేత సాంగ్ పాడించుకుంటాడో చూడాలి. థమన్ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇటీవల వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం, మెగా 158 కి థమన్ ఎంపిక అయిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రానికి కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడనే టాక్ వినపడుతుంది.  
   శ్రీ గౌరి ప్రియ(sri Gouri Priya).. మ్యాడ్, రైటర్ పద్మభూషణ్, లవర్ వంటి చిత్రాలతో హీరోయిన్ గా అశేష అభిమానులని, ప్రేక్షకులని మెప్పించింది. తమిళ్ లోను సత్తా చాటుతున్న ఈ అచ్చ తెలుగు భామ కిరణ్ అబ్బవరంతో కలిసి చెన్నై లవ్ స్టోరీ అనే చిత్రంతో త్వరలోనే థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ 'వదలనే..' అనే బ్యూటిఫుల్ లిరికల్ పాటని హైదరాబాద్‌లో జరిగిన ఒక భారీ గ్రాండ్ ఈవెంట్‌లో ఆస్కార్ విజేత, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా లాంఛ్ చేశారు.  ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురై, స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఆమె ఎమోషనల్ కావడం అక్కడున్న వారందరినీ కదిలించింది. గౌరి ప్రియ మాట్లాడుతూ.. 'నేను చిన్నప్పుడు ఏ సింగింగ్ కాంపిటీషన్‌కు వెళ్లినా మణిశర్మ గారి పాటలే పాడేదాన్ని. అలాంటి లెజెండ్ సంగీతం అందిస్తున్న సినిమాలో నేను హీరోయిన్‌గా నటించడం నా అదృష్టం. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లతో స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది' అని చెబుతూనే, ఈ స్థాయికి చేరుకోవడంలో తన తల్లి పడ్డ కష్టాలను, ఆమే ఇచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుని స్టేజ్ పైనే కన్నీరు మున్నీరయ్యారు. ఆమెను చూసి వేదికపై ఉన్న వారు, ఆడిటోరియంలోని ప్రేక్షకులు కూడా కాస్త భావోద్వేగానికి లోనయ్యారు.  Also read: Divyenndu sharma: పెద్ది చేసింది ఆయన కోసమే.. తెలుగోళ్ళకి భలే మర్యాద ఇచ్చావు   అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ 'చెన్నై లవ్ స్టోరీ'. . సాయి రాజేశ్ కథని  అందిస్తుండగా, రవి నంబూరి ఈ చిత్రానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ మ్యూజికల్ ఫెస్టివల్ ఈవెంట్‌లో టాలీవుడ్‌కి చెందిన టాప్ 12 మంది ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు అతిథులుగా హాజరై సందడి చేశారు.    
డిజిటల్ వినోదాన్ని ఆస్వాదించే ఓటీటీ ప్రియులకు ఈ వారం సరికొత్త సరిహద్దులు దాటబోతోంది. థియేటర్లలో మిస్ అయిన వైవిధ్యమైన చిత్రాలతో పాటు, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన క్రేజీ వెబ్ సిరీస్‌లు ఈ వీకెండ్ వినోదాన్ని పంచడానికి డిజిటల్ స్క్రీన్‌లపై క్యూ కట్టాయి. యాక్షన్, కామెడీ, సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని జోనర్ల కంటెంట్ ఈ వారం సిద్ధంగా ఉంది. ప్రముఖ కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'జెట్లీ' చిత్రం మే 25 నుంచే జియో హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు దక్షిణాది ప్రధాన భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సత్య మార్క్ హ్యుమర్‌తో సాగే ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్‌ను ఎంతగానో నవ్విస్తోంది. దీనితో పాటు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ 'కజిన్స్ అండ్ కళ్యాణమ్స్' మే 29 నుంచి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మరోవైపు నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 28న వైవిధ్యభరిత నటుడు, పాన్ ఇండియా స్టార్ ధనుష్ నటించిన క్రేజీ మూవీ 'కర' విడుదల కాబోతోంది. ఈ సినిమాతో పాటు ఫుట్‌బాల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'ఎమి మార్టినెజ్: ది కిడ్ హూ స్టాప్స్ టైమ్' అనే స్పోర్ట్స్ డాక్యుమెంటరీ కూడా అదే రోజున సందడి చేయనుంది. మే 29 నుంచి 'రాఫా: సీజన్ 1', 'డెడ్ మ్యాన్స్ వైర్' వంటి ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ చిత్రాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో విషయానికి వస్తే.. మే 29 నుంచి సౌత్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ 'లీడర్' అనే ఆసక్తికర చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అలాగే 'ఫ్యూజ్', 'యానిమల్ ఫామ్', 'డెసర్ట్ వారియర్' వంటి పలు ఇంగ్లీష్ చిత్రాలను రెంట్ పద్ధతిలో ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. సన్ నెక్స్ట్ ప్లాట్‌ఫామ్‌లో మల్టీలింగ్వల్ సస్పెన్స్ చిత్రం 'ఫేసెస్' మే 29 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు థియేటర్ల కంటే ఓటీటీ కంటెంట్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా విభిన్న భాషలకు చెందిన విలక్షణమైన కథలను ఆదరిస్తుండటంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు సరికొత్త కంటెంట్‌తో పోటీపడుతున్నాయి. ధనుష్, సత్య లాంటి స్టార్స్ నటనకు తోడు క్రేజీ వెబ్ సిరీస్‌లు తోడవడంతో సోషల్ మీడియాలో కూడా ఈ వారం లైనప్‌పై గట్టి చర్చ నడుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇష్టమైన జోనర్ సినిమాలను ఇప్పుడే వాచ్‌లిస్ట్‌లో యాడ్ చేసుకొని, ఈ వీకెండ్ ఇంట్లోనే హాయిగా పాప్‌కార్న్ తింటూ వినోదాన్ని ఎంజాయ్ చేసేయండి!
  పెద్ది ట్రైలర్ చూసిన దగ్గర్నుంచి బాలీవుడ్ ప్రముఖ నటుడు దివ్యేందు శర్మ గురించి మాట్లాడుకొని తెలుగు ప్రేక్షకుడు లేడు. 'రాంబుజ్జి' అనే పవర్‌ఫుల్ క్యారక్టర్ లో  కనిపించనున్నాడు. జూన్ 4 కి కౌంట్ డౌన్ మొదలు కావడంతో  ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దివ్యేందు శర్మ పాల్గొని పలు ఆసక్తికర విషయాలని అభిమానులకి, ప్రేక్షకులకి తెలియచేస్తున్నాడు.  రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నేను పెద్దిలో చేయడానికి  ప్రధాన కారణం  దర్శకుడు బుచ్చిబాబు. ఉత్తరాఖండ్‌లో ఒక షూటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో 'పెద్ది' చిత్ర బృందం నుంచి ఫోన్ వచ్చింది. ఆ సమయంలో వీలు చూసుకుని వస్తానని చెప్పినప్పటికీ, దర్శకుడు బుచ్చిబాబు నన్ను కలవాలని  వరుసగా మెసేజ్‌లు చేస్తు ఉన్నాడు. కళపై బుచ్చిబాబు చూపించిన  నిబద్ధత, గౌరవం చూసి ఆశ్చర్యపోయాను. అందుకే  షూటింగ్‌ మధ్యలోనే ఆపేసి, ఎంతో శ్రమించి సుదీర్ఘ ప్రయాణం చేసి ఆయనను కలవడానికి వెళ్ళాను. బుచ్చిబాబు తనని  రిసీవ్ చేసుకున్న విధానం, కథని, నా క్యారక్టర్    వివరించిన తీరు  నన్ను ఎంతగానో ప్రభావితం చేసాయి. ఆ క్షణంలోనే, ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే బుచ్చిబాబు కోసమైనా ఈ ప్రాజెక్ట్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. 'కథ విన్నప్పుడు  ఆశ్చర్యానికి లోనయ్యాను. అంత అద్భుతంగా  బుచ్చిబాబుస్క్రిప్ట్‌ రాసాడు.కథలో ఎన్నో ఊహించని మలుపులు,శక్తివంతమైన క్యారక్టర్ లు ఉన్నాయి.సమాజంలో ఒక వ్యక్తి తన సొంత గుర్తింపు కోసం ఎంతటి యుద్ధానికైనా వెనుకాడకూడదనే బలమైన సందేశం పెద్ది ద్వారా వస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ పోషించిన 'పెద్ది'  తన అస్తిత్వం కోసం, కలల కోసం చేసే పోరాటం ప్రేక్షకులని  భావోద్వేగానికి గురిచేస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టడం  సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ఒక కొత్త భాష, సంస్కృతిని నేర్చుకునే క్రమంలో మళ్లీ సినిమా నిర్మాణ ప్రక్రియతో ప్రేమలో పడ్డాను. తెలుగులో పెద్ద పెద్ద డైలాగులు నేర్చుకుని సొంతంగా పలకడం అంత సులువు కాలేదు. కానీ నా క్యారక్టర్  యొక్క రాజసం ఉట్టిపడేలా శ్వాస తీసుకోకుండా మాట్లాడే డైలాగ్ డెలివరీని ట్రై చేశానని నవ్వుతూ చెప్పారు. Also read: Rukmini vasanth: రుక్మిణి వసంత్ పిక్స్ మళ్ళీ వైరల్.. ఇంత అందంగా ఉందేంటి బాలీవుడ్ లో   2007 లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన దివ్యేందు శర్మ ప్యార్ కా పంచనామా, చష్మే బద్దూర్, టాయిలెట్ః ఏక్ ప్రేమ్ కథ చిత్రాలలో సహాయక పాత్రలు పోషించాడు. 2018 లో వచ్చిన  మీర్జా పూర్ వెబ్ సిరీస్ తో  అయితే ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా.. చాలా పానీయాల తయారీలో కూడా పుదీనాను ఉపయోగిస్తారు. పుదీనా పానీయాల రుచిని పెంచుతుంది. శరీరాన్ని చల్లబరుచుతుంది. అయితే వేడి ఎక్కువగా ఉంటే పుదీనా మొక్క చాలా తొందరగా వాడిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మొక్కకు పచ్చదనాన్ని పెంచడానికి , మొక్క పచ్చగా ఎదగడానికి కొన్నిచిట్కాలు ఉపయోగించవచ్చు. వాటిలో ఎంతో ప్రబావవంతంగా పనిచేసే చిట్కా తెలుసుకుంటే.. పటిక నీరు.. పుదీనా మొక్కకు పటిక నీటిని కలపడం వల్ల మట్టి ఆమ్లంగా మారుతుంది. కుండీలోని మట్టి క్షారంగా మారినప్పుడు, పుదీనా పెరుగుదల కుంటుపడి, ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఇటువంటి పరిస్థితిలో, పటిక నీటిని ఉపయోగించడం మొక్కకు మేలు చేస్తుంది. పటిక నీరు మట్టి  pH స్థాయిని తగ్గిస్తుంది, దీనివల్ల అది పుదీనా మొక్కకు అనుకూలంగా మారి, పోషకాలను మరింత సులభంగా గ్రహించడానికి వీలు కలుగుతుంది. క్రిమినాశకం.. పుదీనా వాసన తరచుగా కీటకాలను దూరంగా ఉంచుతుంది, కానీ కొన్నిసార్లు చీమలు , బూజు దాని వేళ్ళను ఆశించి, మొక్క దెబ్బతినేలా చేస్తాయి. ఈ సమస్యలున్నప్పుడు   మొక్కపై పటిక నీటిని చల్లవచ్చు. పటికలో యాంటీ బాక్టీరియల్  యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, ఇవి మొక్కను కీటకాలు, బూజు , చీమల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగుదల.. కొన్నిసార్లు, మొక్కలకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఆకుల పెరుగుదల మందగిస్తుంది. పటిక నీటిని కలపడం వల్ల ఆకులు పెద్దవిగా, పచ్చగా, , మరింత నిగనిగలాడేలా పెరగడానికి సహాయపడుతుంది. మొక్క  కొమ్మలను చిగురింపజేసి, మరింత దట్టంగా పెరగడం ప్రారంభిస్తుంది. ఎలా వాడాలి? ఒక లీటరు శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో ఒక పటిక ముక్కను వేయాలి. అర టీస్పూన్ పటిక పొడి వచ్చేంత ముక్కను వాడాలి. దానిని 10 నుండి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. . నీరు మరీ చిక్కగా ఉండకూడదు. ఈ పటిక నీటిని పుదీనా వేర్లకు అందేలా  పోయాలి. నీటిని కేవలం మట్టికి మాత్రమే అందించాలి.                                 *రూపశ్రీ.
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే  వారు ఎంతో మంది ఉన్నారు. సాధారణంగా కాలం గడిచేకొద్ది జీవితాలలో  ఎంతో కొంత ఎదుగుదల అనేది ఉండాలి.  అలా ఉండకపోవడానికి కారణాలు ఉన్నాయి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు.. కానీ పేదవాడిగా మరణించడం తప్పు అని ఒక వాక్యం ఉంది.  మనిషి జీవితంలో ఎదగాలని కాలంతో పాటు జీవితాన్ని మెరుగ్గా మార్చుకోవాలని ఈ వాక్యం చెబుతుంది, చాలామంది పేదవాళ్లుగానే మిగిలిపోవడానికి దారితీసే కారణాలు ఏంటో తెలుసుకుంటే.. టీవి, పోన్.. చాలామందికి రోజంతా టీవీ లేదా ఫోన్ చూస్తూ గడిపే అలవాటు ఉంటుంది.  టీవి, ఫోన్ వంటివి మనిషిని వ్యసనపరుడిగా మారుస్తాయి.  టీవిలో ఛానెల్స్ కానీ,  స్మార్ట్ ఫోన్ లో ఎంటర్టైన్మెంట్ యాప్స్ కానీ ఎంత సేపు అయినా అలా మార్చి మార్చి చూస్తుంటారు.  పోన్ లో అయితే స్క్రోల్ చేస్తూ ఉంటే అసలు సమయమే తెలియకుండా గడిచిపోతుంది.   జీవితంలో ఏమీ సాధించకుండా పేదవారిగా ఉండిపోవడానికి టీవి,  స్మార్ట్ ఫోన్ వంటివి ప్రధాన కారణాలు. అలవాట్లు,  అభిరుచులు.. ప్రతి ఒక్కరికి అభిరుచులు, అలవాట్లు అంటూ కొన్ని ఉంటాయి. జీవితంలో ఎదుగుదల ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయినట్టు ఉన్నవారిని గమనిస్తే.. వారికి ఎలాంటి అలవాట్లు,  అభిరుచులు ఉండవు.  అందుకే వారికి జీవితంలో ఎదుగుదల లేకుండా కేవలం ఒకేచోట కూర్చుని కాలక్షేపం చేస్తూ అందులోనే సుఖం అనుభవిస్తూ ఉంటారు. లక్ష్యాలు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం అనేది ఉండాలి.  లక్ష్యం లేని జీవితంలో ఎదుగుదల అనేది అసలు ఉండదు. లక్ష్యం ఉంటే కష్టపడటం,  జ్ఞానాన్ని ఆర్జించడం,  ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండటం వంటివి జరుగుతాయి. కానీ లక్ష్యం లేకపోతే జీవితం ఒకేచోట పాతిన స్ధంభంలా ఉండిపోతుంది. కంఫర్ట్ జోన్.. చాలామందికి సుఖంగా బ్రతకడం ఇష్టం.  ఛాలెంజ్ తీసుకోవాలన్నా, రిస్క్ చేయాలన్నా అస్సలు ఇష్టపడరు. ఉన్న సంతోషం,  ఉన్న సౌకర్యాలు చాల్లే అనుకుంటారు.  కొత్తగా అ ప్రయత్నం చేయాలన్నా అస్సలు సిద్దపడరు. అందుకే కాలం ఎంత గడిచినా అలాంటి వారు పేదవారిగానే ఉండిపోతారు తప్ప ధనవంతులు, గొప్ప వారు కాలేరు. అదృష్టం.. ప్రపంచంలో కష్టం కంటే అదృష్టాన్ని నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. ఏ అదృష్టమో వచ్చి తమను ధనవంతులను చేస్తుందని నమ్ముతూ.. కష్టపడకుండా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అలాగే ఉండిపోతారు. జాతకాలలోనూ, రంగు రాళ్లలోనూ,  గ్రహాల మార్పులోనూ తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్ముతూ ఉంటారు. ఇతరులను నిందించడం.. నన్ను బాగా చదివించి ఉంటే నేను పెద్ద  ఉద్యగం తెచ్చుకునేవాడిని,  నాకు  బాగా డబ్బు ఇచ్చి ఉంటే నేను మంచి వ్యాపారం చేసేవాడిని అని తల్లిదండ్రుల మీద నిందలు వేస్తూ జీవితంలో ఎదగకుండా ఆగిపోయిన వారు చాలామంది ఉంటారు.  తాము ఎదగకపోవడానికి కారణం పక్కవారే అని చెప్పి పేదవారిగానే ఉండిపోతున్న వారే ఎక్కువగా ఉన్నారు. జీవితంలో ఎదగడానికి కష్టపడేవారు చాలా తక్కువ ఉన్నారు.  పైన చెప్పుకున్న విషయాలే.. ఏ మనిషి అయినా పేదవాడిగానే ఉండిపోవడానికి అసలు కారణాలు.                            *రూపశ్రీ.
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా మంచి గ్రేడ్‌లు సాధించడం అని చాలామంది అనుకుంటారు. కానీ పిల్లలలో  మానసిక బలాన్ని పెంపొందించడం, వారు భవిష్యత్తులో గొప్పగా ఎదగడం మరీ ముఖ్యంగా నాయకత్వ లక్షణాలతో ఉండటం చాలా ముఖ్యం.  ఆత్మవిశ్వాసం అనేది ఏ బిడ్డ వ్యక్తిత్వానికైనా పునాది. అది వారికి తమ మనసులోని మాటను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని, అలాగే వైఫల్యాల నుండి నేర్చుకుని ఓపికతో ముందుకు సాగే బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు కాలక్రమేణా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. అయితే, ఈ లక్షణాలు రాత్రికి రాత్రే పుట్టేవి కాదు.. వీటికి చిన్నతనం నుండే సరైన మార్గదర్శకత్వం అవసరం. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి వారిలో నాయకత్వ లక్షణాలు మెరుగుపడి వారు లీడర్లుగా తయారవ్వాలంటే.. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను పెంచే సమయంలో కొన్ని టిప్స్ పాటించాలి.  అవేంటో తెలుసుకుంటే.. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి నాయకత్వ లక్షణాలు పెంచే టిప్స్.. వ్యక్తీకరణ..  పిల్లలకు వారి అభిప్రాయాలను, భావాలను వ్యక్తపరిచే అవకాశం ఇవ్వడం వల్ల వారు స్వేచ్ఛగా తమను తాము వ్యక్తపరచుకోవడానికి , వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. విజయాల గుర్తింపు.. పిల్లలు ఒక చిత్రాన్ని గీసినా లేదా ఒక పద్యాన్ని చదివినా, వారి కృషిని ప్రశంసించాలి. ఇలా మెచ్చుకోవడం వల్ల  పిల్లలలో తాము గౌరవించబడుతున్నామనే భావన కలుగుతుంది, ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని, ప్రేరణను రెండింటినీ పెంచుతుంది. విలువలు,సంప్రదాయాలు.. పిల్లలను కుటుంబ సంప్రదాయాలు, పండుగలు , ఆచారాలతో అనుసంధానించడం వారిలో సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి , వారి గుర్తింపు పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. సహనం, ఓర్పు..  గెలవడం ఎల్లప్పుడూ అవసరం కాదని, వెంటనే  ఫలితాలు ఆశించాల్సిన అవసరం లేదని పిల్లలకు నేర్పించడం ముఖ్యం. ఓర్పు, సహనం వారు పరిణతి చెందడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు..  సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి నిద్రలేవడం , రాత్రి సమయానికి నిద్రపోవడం,  వంటివి పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని అంతర్గతంగా బలపరుస్తాయి. ఇది క్రమశిక్షణ , ఆత్మనియంత్రణను కూడా నేర్పిస్తుంది. వైఫల్యాల నుండి నేర్చుకోవడం..  పిల్లలు చేసే  ఏదైనా పనిలో  విఫలమైతే, వైఫల్యం అనేది నేర్చుకోవడంలో ఒక భాగమని వారికి వివరించాలి. ఇది వైఫల్యం  తర్వాత తిరిగి లేచి ముందుకు సాగడాన్ని వారికి నేర్పుతుంది, ఇదే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కీలకం అవుతుంది. చెప్పేది వినాలి..   పిల్లలతో నిష్కపటంగా మాట్లాడాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. దీనివల్ల, వారు తమ సమస్యలను, ప్రశ్నలను  పంచుకోగలరనే నమ్మకం వారిలో పెరుగుతుంది . వినయం..  ఇతరులకు సహాయం చేయడం, చిన్న విషయాలకే కృతజ్ఞత చూపడం, అందరితో మర్యాదగా ప్రవర్తించడం పిల్లలకు నేర్పాలి. ఇవి వారు ఇతరులతో మమేకమవ్వడానికి, సమాజంలో గౌరవం సంపాదించుకోవడానికి సహాయపడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో పైవన్నీ నేర్పిస్తూ ఉంటే.. పిల్లలు తప్పకుండా తమ జీవితంలో ఆత్మవిశ్వాసంలో ఉంటారు.  నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకుని వారి జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. జీవనశైలి సరిగా లేకపోవడం,  ఊబకాయం,  శారీరక శ్రమ తక్కువగా ఉండటం లేదా అసలు శారీరక శ్రమ లేకపోవడం కీళ్ల వాతానికి దారి తీస్తుంది.  కీళ్లవాతం దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలంటే.. కొన్ని పనులు చేయాలి.  అవేంటో తెలుసుకుంటే.. ఊబకాయం.. సాధారణంగా ఎత్తుకు తగ్గ బరువు ఉండాలని చెబుతూ ఉంటారు.  దీన్ని బిఎమ్ఐ అని చెబుతారు. అయితే ఎత్తుకు తగ్గ బరువు కాకుండా ఎక్కువ బరువు ఉండే అధిక బరువు అంటారు.  ఈ అధిక బరువు కంటే కూడా ఎక్కువ బరువు ఉంటే దాన్ని ఊబకాయం అని అంటారు.  కీళ్లవాతం సమస్య ఎక్కువగా ఊబకాయం ఉన్నవారికే వస్తుంది.  అందుకే కీళ్లవాతం రాకూడదంటే ఊబకాయం రాకుండా చూసుకోవాలి.  బరువును అదుపులో ఉంచుకోవాలి.  అదిక బరువు సమస్యలు.. అధిక బరువు ఉంటే మోకాళ్లు, కీళ్లపై ఒత్తిడిని పెంచి ఆర్థరైటిస్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. పరిష్కారం.. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. అలాగే వాకింగ్,  యోగా,  స్ట్రెచింగ్ వ్యాయామాలు కూడా చేయాలి.  ఇది కీళ్లను బలపరుస్తుంది. కీళ్ల వాతం రాకుండా చేస్తుంది. ఎముకల బలం.. ఎముకలు బలంగా ఉంటే కీళ్ల వాతం కూడా అంత సులువుగా రాదు.  అందుకే ఎముకలను బలంగా ఉంచేందుకు కాల్షియం,  విటమిన్-డి ఉన్న ఆహారాలు చాలా బాగా తీసుకోవాలి. సిట్టింగ్ పొజిషన్.. నేటికాలంలో ఉద్యోగాలు అన్నీ ఒకేచోట కూర్చుని చేసేవే.  ఈ సిట్టింగ్ వర్క్ వల్ల కీళ్లు బిగుసుకుపోయి నొప్రి పెరగడానికి దారితీస్తుంది. అందుకే సిట్టింగ్ వర్క్ చేసేవారు కనీసం అరగంట లేదా గంటకు ఒకసారి లేచి కాస్త అటు ఇటు తిరుగుతూ ఉండాలి. దీనివల్ల కీళ్లు రిలాక్స్ అవుతాయి. ఆహారం.. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు,  ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరంలో వాపును పెంచడం ద్వారా కీళ్ల సమస్యలకు కారణం అవుతాయి.  అందుకే చక్కెర అధికంగా ఉన్న ఆహారాలను, ప్రాసెస్ చేసిన ఆహారాలను వీలైనంత తక్కువగా లేదా అసలు తీసుకోకుండా ఉండటం మంచిది.                                  *రూపశ్రీ.
దంతాల నొప్పి (Toothache) అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. పంటి నొప్పి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కోసారి రాత్రి వేళల్లో అకస్మాత్తుగా నొప్పి వస్తే ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో మన ఇంటి చుట్టుపక్కల సులభంగా దొరికే జామ ఆకులు (Guava Leaves) అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని ప్రముఖ హెర్బలిస్ట్ చెబుతున్నారు.  తెలుగువన్ హెల్త్ (TeluguOne Health) ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ & మెడిసిన్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు, Ph.D (Australia) గారు జామ ఆకుల విశిష్టతను, వాటితో దంతాల నొప్పిని ఎలా నయం చేసుకోవచ్చో క్లియర్ గా ఈ వీడియోలో వివరించారు.  జామ ఆకుల్లోని ఔషధ గుణాలు: జామ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (Anti-inflammatory), యాంటీ మైక్రోబియాల్ (Anti-microbial) మరియు అనల్జెసిక్ (నోప్పి నివారణ) గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోట్లోని బ్యాక్టీరియాను నశింపజేసి, చిగుళ్ల వాపులను మరియు పంటి నొప్పిని తక్షణమే తగ్గించడంలో సహాయపడతాయి. డాక్టర్ లక్ష్మణరావు గారు సూచించిన సులువైన ఇంటి చిట్కాలు: జామ ఆకులను నమలడం: లేత జామ ఆకులను శుభ్రంగా కడిగి, నోట్లో వేసుకుని బాగా నమలాలి. ఆ రసం పంటి నొప్పి ఉన్న భాగంలోకి చేరడం వల్ల నొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.  జామ ఆకుల కషాయం (మౌత్ వాష్): కొన్ని జామ ఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా ఉప్పు కలిపి, నోట్లో పోసుకుని పుక్కిలించాలి (Gargling). ఇది సహజసిద్ధమైన మౌత్ వాష్‌లా పనిచేసి చిగుళ్ల వాపులను, నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!