
శ్రీ గౌరి ప్రియ(sri Gouri Priya).. మ్యాడ్, రైటర్ పద్మభూషణ్, లవర్ వంటి చిత్రాలతో హీరోయిన్ గా అశేష అభిమానులని, ప్రేక్షకులని మెప్పించింది. తమిళ్ లోను సత్తా చాటుతున్న ఈ అచ్చ తెలుగు భామ కిరణ్ అబ్బవరంతో కలిసి చెన్నై లవ్ స్టోరీ అనే చిత్రంతో త్వరలోనే థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్ 'వదలనే..' అనే బ్యూటిఫుల్ లిరికల్ పాటని హైదరాబాద్‌లో జరిగిన ఒక భారీ గ్రాండ్ ఈవెంట్‌లో ఆస్కార్ విజేత, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా లాంఛ్ చేశారు.
ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురై, స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఆమె ఎమోషనల్ కావడం అక్కడున్న వారందరినీ కదిలించింది. గౌరి ప్రియ మాట్లాడుతూ.. 'నేను చిన్నప్పుడు ఏ సింగింగ్ కాంపిటీషన్‌కు వెళ్లినా మణిశర్మ గారి పాటలే పాడేదాన్ని. అలాంటి లెజెండ్ సంగీతం అందిస్తున్న సినిమాలో నేను హీరోయిన్‌గా నటించడం నా అదృష్టం. ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్లతో స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది' అని చెబుతూనే, ఈ స్థాయికి చేరుకోవడంలో తన తల్లి పడ్డ కష్టాలను, ఆమే ఇచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుని స్టేజ్ పైనే కన్నీరు మున్నీరయ్యారు. ఆమెను చూసి వేదికపై ఉన్న వారు, ఆడిటోరియంలోని ప్రేక్షకులు కూడా కాస్త భావోద్వేగానికి లోనయ్యారు.
Also read: Divyenndu sharma: పెద్ది చేసింది ఆయన కోసమే.. తెలుగోళ్ళకి భలే మర్యాద ఇచ్చావు
అమృత ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న లేటెస్ట్ ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ 'చెన్నై లవ్ స్టోరీ'. . సాయి రాజేశ్ కథని అందిస్తుండగా, రవి నంబూరి ఈ చిత్రానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మ్యూజికల్ ఫెస్టివల్ ఈవెంట్‌లో టాలీవుడ్‌కి చెందిన టాప్ 12 మంది ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు అతిథులుగా హాజరై సందడి చేశారు.





