లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి తన వ్యాఖ్యలతో దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా దేశ అంతర్గత విషయాలపై విమర్శలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందన్న విమర్శలు మళ్లీ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో  చర్చకు దారితీశాయి.   కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో  అనేక లోపాలు ఉన్నాయని విదేశీ వేదికపై విమర్శించడం ఇప్పుడు అధికార పక్షంతో పాటు రాజకీయ పరిశీలకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  సాధారణంగా విదేశాలకు వెళ్లినప్పుడు తమ మాతృభూమి గొప్పతనాన్ని చాటిచెప్పడం భారత సంప్రదాయం. మన ఇతిహాసమైన మహాభారతంలో సైతం, అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా బయటి వ్యక్తుల ముందు మన లోపాలను ఎత్తిచూపకూడదని ధర్మరాజు తన తమ్ముళ్లకు సూచించిన సందర్భాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  అయితే.. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ.. విదేశీ సదస్సుల్లో, విదేశీ మీడియా ముందు దేశ ప్రతిష్ఠను మసకబార్చులా  మాట్లాడటం   సమంజసం కాదన్న అభిప్రాయం గట్టిగా వ్యక్తమౌతోంది.    దేశంలో ఏవైనా సమస్యలు ఉంటే, ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే  హక్కు రాహుల్ గాంధీకి ఉంది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రజలను చైతన్యవంతం చేయాలి. అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వానికి నిర్దిష్ట సూచనలు ఇవ్వాలి.. కానీ, స్వదేశంలో చేయాల్సిన రాజకీయ పోరాటాన్ని పక్కనపెట్టి, విదేశీ గడ్డపై దేశ ఆర్థిక వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఇండియా ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.  ప్రస్తుతం ఇండియా చుట్టూ ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు   సున్నితంగా ఉన్నాయి. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలు భారత్‌లో అస్థిరతను సృష్టించేందుకు నిరంతరం ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో   దేశ బలహీనతలను విదేశీ వేదికలపై ఎత్తిచూపడం ద్వారా  శత్రుదేశాలకు   ఆయుధాలు అందించినట్లు అవుతుందని పరిశీలకులు అంటున్నారు.  ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి నేతలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని   అభిప్రాయపడుతున్నారు.   కొలంబియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ  విరుచుకుపడింది. రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ, గత పన్నెండేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలు  సుఖసంతోషాలతో జీవిస్తున్నారని పేర్కొంది.. ఇప్పటికే ప్రధాని మోదీ పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ రాజకీయ వైఖరిని ఎద్దేవా చేస్తూ మాట్లాడిన విషయాన్ని వారు గుర్తుచేశారు.  ఇది కూడా చదవండి:  రాహుల్ విదేశీ పర్యటన: శశిథరూర్ వ్యాఖ్యలు వైరల్.!​ అదలా ఉంటే.. ఇటీవల సోనియా గాంధీ ఆత్మకథ విడుదల సందర్భంగా తన తల్లిదండ్రులను పార్వతీపరమేశ్వరులతో పోలుస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసి, మరో వివాదానికి తెరలేపాయి.   నిజానికి ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలు సామాన్య ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. ఒక బలమైన ప్రతిపక్ష నేతగా ఆయన ఎదుగుతున్నారనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ, ఆ సానుకూల వాతావరణాన్ని నిలబెట్టుకోవాల్సింది పోయి, ఆయన ఇలాంటి అనవసర వివాదాల్లో చిక్కుకుంటూ తన వ్యక్తిత్వాన్ని, రాజకీయ ప్రతిష్ఠను ఆయనే స్వయంగా తగ్గించుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.    రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ తన ప్రసంగాల శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సందర్భోచితంగా, దేశ ప్రయోజనాలకు భంగం కలగని రీతిలో వ్యవహరించకపోతే, అది వ్యక్తిగతంగా ఆయనకే కాకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమయోచిత వ్యాఖ్యలు చేయనంత కాలం హస్తం పార్టీకి రాజకీయ కష్టాలు తప్పవని, ప్రజల విశ్వాసాన్ని పూర్తిస్థాయిలో గెలుచుకోవడం కష్టతరమవుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.   మీకు నచ్చవచ్చు: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై దుమారం​ 8 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు.. అదానీ ఆస్తులు ఎలా పెరిగాయి: రాహుల్ గాంధీ   [Rahul Gandhi, ColumbiaUniversitySpeech, IndianEconomy, BJPReaction, TeluguOne]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ వివాదం మరోసారి బహిర్గతమైంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత  జగన్‌ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ జగన్ మీడియా ప్రచురించిన కథనంపై షర్మిల నిప్పులు చెరిగారు. తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.  సాధారణ కుటుంబ సంబంధాలను కూడా వక్రీకరించి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.   మహిళలను గౌరవిస్తామని చెప్పే జగన్..  ఇలాంటి నిరాధారమైన,  దిగజారిన వార్తలను తన సొంత మీడియా ప్రచురించడాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఈ  ప్రచురణ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో జగన్ స్వయంగా సమాధానం చెప్పాలని   డిమాండ్ చేశారు. గతంలో తమ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం రాజకీయ విభేదాలను పక్కనబెట్టి తన పిల్లల పెళ్లిళ్లకు అందరినీ ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా  గుర్తుచేశారు. రాజకీయంగా ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, కుటుంబ వేడుకల్లో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం జగన్ దిగజారుడుతనానికి పరాకాష్ఠగా షర్మిల అభివర్ణించారు. అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న   వివాదాల నేపథ్యంలో ఈ తాజా పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం రాజకీయ లబ్ది కోసమే జగన్  కుటుంబ వ్యవహారాలను బహిరంగ వేదికలపైకి లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని షర్మిల పదేపదే ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఇది కూడా చదవండి: వెల్తారా, వెళ్లరా: షర్మిల కుమార్తె వివాహానికి జగన్ హాజరుపై చర్చ.! అయినా..  తమ ప్రత్యర్థి అయితే చాలు…  వ్యక్తిత్వహననానికి పాల్పడడం, మహిళలను కించపరచడం వైసీపీ నేతలకు అలవాటేనంటూ.. నాడు నిండు సభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ పరిశీలకులు సైతం షర్మిలపై అనుచిత వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.    అంతెందుకు గతంలో షర్మిల కూడా పలు సందర్భాలలో జగన్ ది సైతాన్ సైన్యం   విమర్శించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబుకు తన కుమారుడి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు పసుపు రంగు చీర కట్టుకొని వెళ్లిన షర్మిలను దూషించిన ఘనత వైసీపీ సైకో సైన్యానిది. ఇప్పుడు కూడా తన కూతురు అంజిలి పెళ్లి పత్రిక అందించేందుకు చంద్రబాబును కలిసిన షర్మిలపై వైసీపీయులు దుర్భాషలాడుతున్నతీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మీకు నచ్చవచ్చు:   ఉంటే ఉండు, లేకుంటే దేశం విడిచిపో: వైఎస్ కంటే గొప్పోడివా.. జగన్ ను ఉతికి ఆరేసిన షర్మిల కుటుంబం.! ఎలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి: పేర్ని నానికెందుకు నొప్పి.? [YSSharmila, YSJagan, SharmiladaughterMarriage, Invitation, CBN, CharacterAssassination, TeluguOne]
 దేశ రాజధాని నూతన దిల్లీలో జరిగిన సోనియాగాంధీ ఆత్మకథ  బిలాంగింగ్ పుస్తకావిష్కరణ వేడుకలో సీటింగ్ అరేంజ్ మెంట్ రాజకీయ చర్చకు తావిచ్చింది.  ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి  దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియా కూటమి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో వేదికపై అతిథుల సీటింగ్  అరేంజ్ మెంట్ లో ప్రాధాన్యతల క్రమం రాజకీయ చర్చకు తెరలేపింది.   ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొదటి వరుసలో అదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన కూర్చుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  కర్ణాటక  ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు రెండో వరుసలో సరిపెట్టుకున్నారు.  ఇదే వేదికపై అఖిలేష్ యాదవ్ వంటి ఇతర విపక్ష నేతలు కూడా మొదటి వరుసలో ఆసీనులయ్యారు.  కాంగ్రెస్ పార్టీ  కార్యక్రమంలో సొంత పార్టీ ముఖ్యమంత్రులను రెండో వరుసలో కూర్చోబెట్టి, బయటి నుంచి వచ్చిన మిత్రపక్ష నేతలకు వారికి మించిన ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయంగా సంచలనంగా మారింది.  అంతే కాకుండా సోనియాగాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తొలి వరుసలో తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ రాహుల్ పక్కన ఆసీనులైన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అదే సమయంలో రేవంత్, డీకే వంటి నేతలు రెండో వరుసలో కూర్చున్న ఫొటోలు సైతం అదే స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కాగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ వద్ద ప్రాధాన్యత తగ్గిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.  అయితే  పరిశీలకులు మాత్రం అతిథి మర్యాదలో భాగంగానే కాంగ్రెస్ ఈ విధమైన సీటింగ్ అరేంజ్ మెంట్ చేసి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.  ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిలో అసంతృప్తి నిజమేనా? సొంత కార్యక్రమంలో సొంత నేతల కంటే.. ఇతర పార్టీల నేతలను గౌరవించడం సముచితంగా ఉంటుందని, అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ఆ విధమైన ఏర్పాట్లు చేసిందని చెబుతున్నారు.   నాయకులకు సముచిత గౌరవం ఇచ్చి మొదటి వరుసలో సీట్లు కేటాయించిందని కాంగ్రెస్ శ్రేణులు కూడా చెబుతున్నాయి.  పార్టీలో అత్యంత కీలకమైన నాయకురాలు ప్రియాంకా గాంధీ సైతం రెండో వరుసలోనే ఆసీనులవ్వడాన్ని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు.  అతిథులకు మర్యాదపూర్వకంగా మొదటి స్థానం కల్పించడం కాంగ్రెస్ సంప్రదాయమని, సోనియా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అదే చేసిందని అంటున్నారు.  మీకు నచ్చవచ్చు:  పార్టీ, ప్రభుత్వంపై పట్టుబిగించిన సీఎం రేవంత్.! రాహుల్ కు ఫిర్యాదు చేస్తా: తెలంగాణ సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబావుటా.!​ [Sonia, biography Belonging, Revanth Reddy Vijay,Seat, TeluguOne] 
ALSO ON TELUGUONE N E W S
  బిచ్చగాడుతో పాటు పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించాడు విజయ్ ఆంథోనీ.. రీసెంట్ గా ఆయన వైఫ్ ప్రముఖ ప్రొడ్యూసర్  ఫాతిమా తొలిసారిగా ఒక బహిరంగ సినిమా కార్యక్రమంలో పాల్గొని తమ కుటుంబంలోని ఎన్నో హృదయాన్ని కదిలించే విషయాలని పంచుకున్నారు.  సాధారణంగా సెలబ్రిటీలు లక్షల రూపాయల విలువైన ఖరీదైన బ్రాండెడ్ వాచ్‌లను ధరిస్తుంటారు. కానీ విజయ్ ఆంటోనీ మాత్రం తన వద్ద ఉన్న విలాసవంతమైన స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఖరీదైన గడియారాలను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఆయన చేతికి కేవలం రూ. 3,900 విలువ చేసే ఒక సాధారణ వాచ్ మాత్రమే ఉంటోంది. మీరాను చివరిసారిగా చూసినప్పుడు ఆమె మణికట్టుపై ఉన్న వాచ్ అదేనని ఫాతిమా వెల్లడించారు. ఆ వాచ్‌ను మొదటిసారి కట్టుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు విజయ్ ఆంటోనీ ఎప్పుడూ తీయలేదని, "ఇది నా మీరా వాచ్, నా ఆరోగ్యాన్ని ఇకపై ఆమే దగ్గరుండి చూసుకుంటుంది" అని ఆయన ఎంతో ఆవేదనతో చెప్పిన మాటలను ఫాతిమా గుర్తుచేసుకున్నారు. ఒక తండ్రికి తన కూతురిపై ఉన్న అంతులేని ప్రేమకు ఈ ఒక్క విషయం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.  మీరా జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న మరో హృదయ విదారక నిర్ణయాన్ని కూడా ఫాతిమా బయటపెట్టారు. గతంలో మీరా కోసం కొనుగోలు చేసిన చెప్పులు, షూలతో ఇంట్లోని ఒక గది మొత్తం నిండిపోయి ఉండేదట. ఆ జ్ఞాపకాలని చూసిన తర్వాతే విజయ్ ఆంటోనీ కాళ్ళకి చెప్పులు వేసుకోవడమే మానేశారు. ఇప్పుడు కేవలం కొన్ని ప్రత్యేకమైన అధికారిక కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు మాత్రమే  షూ ధరిస్తున్నారని ఆమె తెలిపారు. ఇది కూడా చదవండి: బాబు మీరు సినిమా హీరో: మర్చిపోయావా..గుర్తు చేశాను చూడు! అలాగే మీరా ఎప్పుడూ ఒకే ఒక కమ్మ పెట్టుకునేదని, ఆమెను చివరిసారిగా సాగనంపేటప్పుడు ఆ కమ్మను తీసి పంపానని ఫాతిమా భావోద్వేగంతో చెప్పారు. మీరా ఉపయోగించిన గదిని ఇప్పటికీ ఆమె జ్ఞాపకాలతో అలాగే ఉంచామని, త్వరలోనే ఆమె కోరుకున్న విధంగా ఆ గదిని తమ గదిగా మార్చుకోబోతున్నామని ఆమె వివరించారు.   బయటకు ఎంతో గంభీరంగా, మౌనంగా కనిపించే విజయ్ ఆంటోనీ ఇంట్లో మాత్రం ఎంతో సరదాగా, అల్లరిగా ఉంటారని ఫాతిమా చెప్పారు. ఆయన చేసే అల్లరి వల్ల ఇంట్లో సెల్‌ఫోన్లు, టీవీలు పగిలిపోతుంటాయని నవ్వుతూనే, కొత్తవి కొనాలంటే చేతిలో డబ్బులు లేవని, ఈ సినిమా బాగా ఆడితేనే వాటిని కొనుక్కోవాలని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ కష్టకాలంలో తనను, తమ చిన్న కూతురు లారాను విజయ్ ఆంటోనీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని ఆమె కృతజ్ఞత తెలిపారు.    మీకు నచ్చవచ్చు:ఆదర్శ కుటుంబంపై రంగస్థలం భామ పూజిత పొన్నాడ షాకింగ్ కామెంట్స్! మీకు నచ్చవచ్చు :విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్: ప్లాప్ మూవీకి సక్సెస్ మీట్!     [Vijay Antony, Meera, Fatima Vijay Antony, Kollywood]
ఒక ఫేమస్ రైటర్ ఎప్పుడో చెప్పాడు.. ప్రేయసి తన ప్రియుడితో దూరముంటానులే దగ్గరయ్యేందుకు అంటుంది అని. తన ప్రేమని దక్కించుకోవడం కోసం సాక్షాత్తు ప్రేయసినే ఆ విధంగా ఫిక్స్ అయితే మరి సెల్యులాయిడ్ పై లక్షలాది మంది అభిమానులని, ప్రేక్షకులని అలరించడానికి  హీరో ఏం చేయాలి. ఇదేంటి ఆ రెండు మ్యాటర్స్ కి మధ్య సంబంధం ఏంటంటారా? అయితే మీరే చూడండి.     సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హీరోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో కనిపిస్తూ అభిమానులతో, ప్రేక్షకులతో నేరుగా టచ్‌లో ఉండటం మంచిదా లేక ప్రమాదకరమా అనే విషయంపై సినీ విశ్లేషకులు కీలక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలను చూడాలంటే కేవలం వెండితెర మీద మాత్రమే సాధ్యమయ్యేది. నెలల తరబడి ఎదురుచూసి, మొదటి రోజు థియేటర్‌కు వెళ్లి తమ అభిమాన హీరోను బిగ్ స్క్రీన్‌పై చూడగానే ప్రేక్షకులకు ఒక రకమైన పూనకం వచ్చేది.   ఆ నిరీక్షణే హీరో ఇమేజ్‌ ఆకాశానికి ఎత్తేది. కానీ నేటి డిజిటల్, జెన్ జీ యుగంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హీరోలు ప్రతి చిన్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపై షేర్ చేస్తూ ప్రేక్షకులకు మరీ అందుబాటులోకి వచ్చేస్తున్నారు. నిత్యం ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుండటం వల్ల హీరోల చుట్టూ ఉండే ఆ ప్రత్యేకమైన ఆరా, మిస్టరీ క్రమంగా తగ్గిపోతోంది. ఉదయం లేచినప్పటి నుండి జిమ్ వర్కౌట్లు, విదేశీ విహారయాత్రలు, వ్యక్తిగత ఫోటోలు ఇలా అన్నీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుండటంతో ప్రేక్షకుడికి హీరో మరీ సాధారణ వ్యక్తిలా కనిపిస్తున్నాడు. దీనివల్ల మూవీ రిలీజ్ రోజు  థియేటర్‌కి  వెళ్లిన ప్రేక్షకుడు తెరపై హీరోను చూసి ఆ ఆశ్చర్యాన్ని, అసలైన హీరో మజాను పొందలేకపోతున్నాడు. కొత్తదనం లోపించడంతో థియేటర్లలో విజిల్స్, చప్పట్ల జోరు కూడా తగ్గుతోంది. ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబంపై పూజిత పొన్నాడ షాకింగ్ మాటలు: నిజగానే అన్యాయం జరిగిందా!   ఈ అతి సాన్నిహిత్యం బాక్సాఫీస్ ఫలితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. కథలో బలం ఉండి, ఒక మాదిరిగా ఆడాల్సిన సినిమాలు కూడా కేవలం హీరోపై ఉన్న ఆసక్తి తగ్గిపోవడం వల్ల ఫ్లాప్‌లుగా నిలుస్తున్నాయి. అద్భుతమైన కంటెంట్ ఉంటే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపడం లేదు. హీరోను చూడటం కోసమే థియేటర్‌కు వెళ్లే రోజులు కనుమరుగవుతున్నాయి. ఓవర్ ఎక్స్‌పోజర్ కారణంగా యావరేజ్ సినిమాలను నిలబెట్టే స్టార్ పవర్ బలహీనపడుతోందని ట్రేడ్ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ విషయంలో సీనియర్ హీరోలు ఇప్పటికీ తమ పాత పంథానే కొనసాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలు సోషల్ మీడియాకు వీలైనంత దూరంగానే ఉంటున్నారు. కేవలం సినిమా అప్‌డేట్లు, పండుగ శుభాకాంక్షలు లేదా ఏదైనా ముఖ్యమైన సామాజిక అంశాలపై స్పందించడానికి మాత్రమే వారు సోషల్ మీడియాను వాడుతున్నారు. అనవసరమైన వ్యక్తిగత పోస్టులు పెట్టకుండా తమ స్టార్‌డమ్‌కు ఒక హుందాతనాన్ని కాపాడుకుంటున్నారు. అందుకే వారి సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్లలో ఆ క్రేజ్, ఆ సంబరం ఇప్పటికీ చెక్కుచెదరకుండా కనిపిస్తోంది. నేటి యువ హీరోలు కూడా ఈ విషయాన్ని గ్రహించి, సోషల్ మీడియా వినియోగానికి ఒక పరిమితి పెట్టుకుంటేనే థియేటర్లలో మళ్లీ అసలైన హీరోయిజం పండుతుందని సినీ అభిమానులు  సూచిస్తున్నారు. సో... జెన్ జీ బ్యాచ్ కోసం సోషల్ మీడియాలో పనిగట్టు కొని కావాలని టచ్ లో ఉండి, మీ గొయ్యి మీరే తీసుకోకండి.  ఎందుకంటే మీరు హీరో.. సినిమా హీరో బాబు.....మరువకు సుమీ... మీకు నచ్చవచ్చు :ఈ నగరానికి ఏమైంది రిపీట్  హిట్టా, ఫట్టా! మీకు నచ్చవచ్చు :సంజయ్ దత్ గత జన్మలో: మంత్రిని, తన భార్యని.. ఏం చేసాడంటే!     [Tollywood Heroes, Social Media, Senior heroes, young Heros]
సినిమా ప్రమోషన్లను కూడా ఓ వినోదాత్మక కార్యక్రమంలా మార్చడంలో దర్శకుడు అనిల్ రావిపూడి స్టైలే వేరు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచే ఆసక్తికరమైన వీడియోలు, ఫన్నీ అప్డేట్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ కోసం కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్లకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను మూవీ టీమ్ విడుదల చేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌, శోభన నటించిన మణిరత్నం క్లాసిక్ ‘దళపతి’ సినిమాలోని ఓ ఐకానిక్ సీన్‌ను అనిల్ రావిపూడి, కృతి శెట్టి కలిసి రీక్రియేట్ చేశారు.  ఈ వీడియోలో కీర్తి సురేష్‌, కృతి శెట్టి ఓ గర్ల్స్ సాంగ్‌ కోసం రీల్‌ చేయాలని అనుకుంటారు. అయితే తను లేకుండా రీల్ చేస్తుండటంతో అనిల్ రావిపూడి హర్ట్ అవుతారు. దాంతో ప్రమోషన్ల విషయం వస్తే చాలు వెంటనే వచ్చేస్తాడనే అర్థం వచ్చేలా అనిల్‌పై సరదాగా సెటైర్లు వేశారు హీరోయిన్లు. ‘ప్రమోషన్స్‌ అంటే చాలు.. అందరికంటే ముందుంటాం’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను విడుదల చేశారు. సినిమా ప్రమోషన్లలో అనిల్ రావిపూడి ఎంత యాక్టివ్‌గా ఉంటారో మరోసారి ఈ వీడియోతో సరదాగా చూపించారు. ఇక కీర్తి, కృతి స్టెప్స్ కూడా అదిరిపోయాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇది కూడా చదవండి: భర్త కోసం న్యాయ పోరాటం.. కీర్తి సురేష్‌ని ఎవరూ పట్టించుకోట్లేదేంటి.? ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్లను నవంబర్ 20 నుంచి ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో ముందుగానే మ్యూజిక్ ప్రమోషన్లు మొదలుపెడుతున్న చిత్రంగా ‘జనవరి 12 విడుదల’ నిలుస్తోంది. ఈ సినిమాకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌ బావాబామ్మర్దులుగా కనిపించనున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కీర్తి సురేష్‌, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2027 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మీకు నచ్చవచ్చు: సాత్విక వీరవల్లి.. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఆఫర్లు.! బాలకృష్ణ 'దాదా' లేటెస్ట్ అప్డేట్.. సినిమాలో అదిరిపోయే ట్విస్ట్.!       [January 12 Vidudala, Anil Ravipudi, Thalapathi Scene, Keerthy Suresh, Krithi Shetty]  
పూజిత పొన్నాడ..అచ్చ తెలుగు హీరోయిన్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలంతో పూజిత అనే కట్ అవుట్ ఒకటుందని నిరూపించుకుంది. సోలో హీరోయిన్ గాను కొన్ని సినిమాలు కూడా చేసిన ఈ ముద్దుగుమ్మ  త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేశ్ ఆదర్శ కుటుంబం పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసి అసలు నిజం ఇదా అని ఊహించని షాక్ కి గురి చేసింది. పూజిత పొన్నాడ తాను యూకేలో ఉన్న సమయంలో ఆదర్శ కుటుంబంకి సంబంధించిన  అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి ఆదర్శ కుటుంబం ప్రాజెక్ట్ గురించి చెప్పగానే, త్రివిక్రమ్ సినిమాలో నటించే అవకాశం వస్తోందన్న ఆనందంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హైదరాబాద్‌కి వచ్చేసింది. ఆడిషన్ ప్రక్రియ ద్వారా ఆమెను ఎంపిక చేశారని, త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పారని పూజిత తెలిపారు. అంతేకాదు, తొలి షెడ్యూల్‌లో ఆమెతో షూటింగ్ కూడా నిర్వహించారు. అయితే అసలు సమస్య రెండో షెడ్యూల్ దగ్గర మొదలైంది. మొదటి షెడ్యూల్ పూర్తయ్యాక సుమారు 3 నెలల పాటు రెండో షెడ్యూల్ గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదని పూజిత చెప్పారు. మధ్యలో విదేశాలకు వెళ్లే ప్లాన్ ఉన్నందున, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో స్పష్టత కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందన కరువైందని వాపోయారు. ఆ తర్వాత మరో అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి, ఆమెకు షూటింగ్ షెడ్యూల్ ఏదీ లేదని చెప్పారట. ఇది కూడా చదవండి:ఈ నగరానికి ఏమైంది రిపీట్ హైలైట్స్ ఇవేనంట: హిట్టుని అందుకుందా!   దీనిపై పూజిత కారణం అడిగి స్పష్టత కోరగా, తన క్యారక్టర్ లోకి  మరో నటిని తీసుకున్నారని తెలిసి ఒక్కసారిగా షాక్ తిన్నట్లు వెల్లడించారు. పద్ధతిగా ఆడిషన్ చేసి ఎంపిక చేసిన తర్వాత, కనీసం చెప్పకుండా తనను క్యారక్టర్ నుంచి తొలగించడం తనకు తీవ్ర నిరాశ కలిగించిందని ఆమె అన్నారు. ఇక సినిమా విడుదలైన తర్వాత ఆమెకు మరో పెద్ద షాక్ తగిలిందట. థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ సన్నివేశంలో కేవలం ఒక  చిన్న సీన్‌లో, అది కూడా దాదాపు 40 సెకన్ల పాటు మాత్రమే కనిపించడం చూసి ఆశ్చర్యపోపోయింది. ఆమె చెప్పినట్టుగా ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. పూజిత ఇలాంటి క్యారక్టర్ లో కనిపించటం ఏంటా అని!    మీకు నచ్చవచ్చు :అలీ వ్యాఖ్యలు వైరల్: ఆమె నర్సు అంట! మీకు నచ్చవచ్చు :విశ్వక్ సేన్ కొత్త మూవీ ఓటిటి డేట్ ఇదే: త్వరగానే కానిచ్చేశారు!    [Pujita Ponnada,  Adarsha Kutumbam, Venkatesh, Trivikram, Tollywood]
Ramayana: Part 1 is creating box-office history, grossing Rs.1,519.05 crore worldwide in just 14 days. Headlined by Ranbir Kapoor, Yash and Sai Pallavi, the mythological epic has emerged as the biggest blockbuster in the careers of both Ranbir and Yash. Its phenomenal run has also put it in contention to challenge the lifetime collections of some of Indian cinema's biggest blockbusters, including Dhurandhar 2. The achievement becomes particularly significant when compared with the first instalments of successful Indian franchises. SS Rajamouli's Baahubali: The Beginning collected approximately Rs.650 crore worldwide, while Prashanth Neel's KGF: Chapter 1 earned around Rs.238 crore. Rishab Shetty's Kantara grossed approximately Rs.400 crore, while Aditya Dhar's Dhurandhar, the first instalment of the spy franchise, collected around Rs.1,300 crore. Nag Ashwin's Kalki 2898 AD, which launched another ambitious franchise, also finished below the current collections of Ramayana. In fact, Ramayana has gone beyond the lifetime collections of several successful second instalments as well. Its current total is higher than the worldwide gross of KGF: Chapter 2 and even SS Rajamouli's standalone blockbuster RRR. However, Baahubali 2: The Conclusion and Pushpa 2: The Rule remain ahead. With Rs.1,519.05 crore worldwide, Ramayana: Part 1 currently occupies the fifth position among the highest-grossing Indian films of all time. Only Dangal, Dhurandhar 2, Baahubali 2 and Pushpa 2 are ahead of it. The film has collected Rs.1,009.05 crore gross in India and Rs.510 crore from overseas markets. Also Read: ENE Repeat Movie Review  Interestingly, Ramayana is now within striking distance of Dhurandhar 2's reported lifetime worldwide gross of approximately Rs.1,813 crore. With a difference of around Rs.294 crore, the film has a realistic target to chase as its theatrical run continues. Surpassing that figure would take it past one of the biggest box-office records in Indian cinema. Produced by Namit Malhotra and directed by Nitesh Tiwari, Ramayana features Ranbir Kapoor as Lord Rama, Sai Pallavi as Sita, Yash as Ravana, Ravi Dubey as Lakshman and Sunny Deol as Hanuman. The two-part adaptation will conclude with its second instalment, scheduled for Diwali 2028. What would be second part collections as it will have Sunny Deol in full fledged role as Hanuman, is giving thills even to imagine.  Check Out: Salman Khan’s Maatrubhumi finally clears censor                      RAPO23 Pre-look: Ram as Lone Wolf  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎట్టకేలకు సినిమా అభిమానులు, ప్రేక్షకులు 'ఈఎన్‌ఈ రిపీట్ ఉరఫ్ 'ఈ నగరానికి ఏమైంది' పార్ట్ 2 (నిన్న ప్రీమియర్స్) బాగుందనే మాటని సూర్యోదయం ముందుగానే  వింటూ తమ దిన చర్యని స్టార్ట్ చేసారు. దీంతో ప్రెజెంట్ 50 దాటిన వాళ్ళు కూడా   ఈఎన్‌ఈ రిపీట్ కోసం థియేటర్స్ కి తరలి వెళ్తున్నారు. మరి యూత్ క్రౌడ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.  ఈ మూవీ హైలైట్స్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది.   మొదటి సినిమా ముగిసిన చోటు నుంచే ఈ కథ మొదలవుతుంది. వివేక్, కార్తీక్, కౌశిక్, ఉపేంద్ర కలిసి కన్యారాశి టీమ్ పేరుతో తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవుతుంది. ఆ నష్టాలతో నిర్మాత తీవ్ర ఇబ్బందుల్లో పడటం, స్నేహితుల మధ్య దూరం పెరగడం వంటి ఆసక్తికర మలుపులతో కథ ముందుకు సాగుతుంది. తమను తాము నిరూపించుకోవడానికి మరియు ఎదురైన సవాళ్లను అధిగమించడానికి ఈ గ్యాంగ్ మరోసారి సినిమా తీసేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో కథ థాయ్‌లాండ్‌కు మారడం, అక్కడి అడవిలో జరిగే షూటింగ్ ఎపిసోడ్లు, బీచ్ మరియు బార్ సన్నివేశాలు ప్రేక్షకులకి  కొత్త అనుభూతిని ఇస్తాయి.  అతిపెద్ద హైలైట్‌గా కౌశిక్ గా చేసిన అభినవ్ గోమటం నిలిచారు. తన సహజమైన కామెడీ టైమింగ్, హావభావాలు, రియాక్షన్లతో థియేటర్లలో నవ్వులు పూయించారని పలువురు ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. వివేక్ పాత్రలో విశ్వక్ సేన్ ఆర్థిక ఒత్తిళ్లు, సీరియస్ యాటిట్యూడ్‌తో కనిపిస్తూ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. మొదటి భాగంలో కార్తీక్ పాత్ర పోషించిన సాయి సుశాంత్ రెడ్డి స్థానంలో ఈసారి శ్రీనాథ్ మాగంటి కనిపించడం గమనార్హం. వెంకటేష్ కాకుమాను ఉప్పు పాత్రలో అలరించగా, శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్, ప్రియదర్శిని రామ్ కీలక పాత్రల్లో మెరిశారు.   సాంకేతిక విభాగంలో వివేక్ సాగర్ నేపథ్య సంగీతం, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇది కూడా చదవండి:అలీ వ్యాఖ్యలు వైరల్: ఆమె నర్సు అంట.. ఎవర్ని ఉద్దేశించి అన్నాడో ఆ హీరో ఫ్యాన్స్ కి బాగా అర్థమైంది! సుమారు 2 గంటల 35 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో సెకండాఫ్‌లోని చివరి సుమారు 40 నిమిషాలు, గెస్ట్ అప్పియరెన్స్‌లుగా కనిపించే దర్శకుల సన్నివేశాలు థియేటర్లలో సందడి చేస్తాయి. S Originals మరియు Rootnode Cinema బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు. 2018 నాటి ఒరిజినల్ మ్యాజిక్‌తో పోల్చకుండా, స్నేహితులతో కలిసి సరదాగా నవ్వుకోవాలనుకునే వారికి ఈ సీక్వెల్ ఒక ఫ్రెండ్లీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది.   మీకు నచ్చవచ్చు: సల్మాన్ ఖాన్ మాతృభూమికి  సెన్సార్ ఇచ్చిన గిఫ్ట్! మీకు నచ్చవచ్చు :పవన్ కళ్యాణ్ పై కోట రుక్మిణి కీలక వ్యాఖ్యలు     [ENE Repeat , Viswak sen, Tharun Bhascker, Abhinav Gomatam Tollywood]  
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్తీ మేరీకి భారతీయ సంప్రదాయాలను పరిచయం చేస్తూ ఉంటారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ మన సంస్కృతి, పండుగలు, ఆచారాలకు ఆమె ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా ప్రియాంక షేర్ చేసిన ఓ వీడియో ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. తన ఫ్యామిలీ వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రియాంక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో ఓ వీడియోలో చిన్నారి మాల్తీ తన తల్లి ఒడిలో కూర్చొని గాయత్రీ మంత్రాన్ని ఎంతో ముద్దుగా చెబుతోంది. ఇంట్లోని పూజా మందిరం ముందు కూర్చున్న మాల్తీ.. ‘ఓం భూర్భువః స్వః’ అంటూ మంత్రాన్ని చదువుతుండటం ఈ వీడియోలో కనిపిస్తుంది. చివర్లో ప్రియాంక ‘సో బ్యూటిఫుల్’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వీడియోతో పాటు ప్రియాంక మరికొన్ని వెకేషన్ ఫొటోలను కూడా పంచుకున్నారు. కుమార్తె మాల్తీతో కలిసి బీచ్‌లో సరదాగా గడుపుతున్న ఫొటోలు, ఇసుకతో బొమ్మలు చేస్తూ ఆడుకుంటున్న మాల్తీ పిక్స్ అందులో ఉన్నాయి. ప్రియాంక తల్లి మధు చోప్రా కూడా ఈ వెకేషన్‌లో పాల్గొన్నారు. ప్రియాంక, నిక్ జోనాస్ దంపతులు తమ కుమార్తెకు భారతీయ, అమెరికన్ సంస్కృతుల పరిచయం కల్పించాలని భావిస్తున్నట్లు గతంలోనూ వెల్లడించారు. దీపావళి వంటి భారతీయ పండుగలను జరుపుకోవడంతో పాటు సంప్రదాయ ప్రార్థనలను కూడా మాల్తీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని మాల్తీ చదువుతున్న వీడియో చూసిన అభిమానులు ఆమెను అభినందిస్తున్నారు. ఇది కూడా చదవండి: వారణాసి వాయిదా.. బాల్ రాజమౌళి కోర్టులో లేదా.? ఇక సినిమాల విషయానికొస్తే.. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘వారణాసి’లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. మీకు నచ్చవచ్చు: రెండేళ్లుగా మంచానికే పరిమితమైన స్టార్.. కన్నీళ్లు తెప్పిస్తున్న రియల్ స్టోరీ.! రెండు వారాల్లోనే 1500 కోట్లు.. ధురంధర్‌ 2, పుష్ప 2 రికార్డులు బ్రేక్‌.! https://www.instagram.com/p/Df6T96xo7LX/       [Priyanka Chopra Daughter, Malti Marie, Gayatri Mantra, Nick Jonas, Varanasi Movie]  
అలీ.. తెలుగు సినిమాకి దొరికిన అరుదైన యాక్టర్. కమెడియన్ గా అయితే చెప్పక్కర్లేదు. తన ఆరా కనిపిస్తూనే, వినిపిస్తూనే ఉంటుంది.  హీరోగాను రాణించి అభిమానులని సంపాదించుకున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి సినిమాలు బాగా తగ్గిపోయాయి. కానీ ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాల్లో కనిపిస్తూ ఉన్నాడు.        ఈ కోవలోనే 'మన డాక్టర్ బాబే' అనే మూవీతో వస్తున్నాడు. తాజాగా 'మన డాక్టర్ బాబే' సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ మోహన సిద్ధి, హీరో శ్రీ స్కంద, శృతి శంకర్‌లతో కలిసి అలీ చేసిన సరదా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో మంచి ఆసక్తిని రేపుతోంది. ఇది కూడా చదవండి: సల్మాన్ ఖాన్ మాతృభూమికి సెన్సార్ షాకింగ్ డేసిషన్: ఇప్పుడు ఫ్యాన్స్ ఏం చెయ్యాలి!    ఈ నెల  20 న   విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే అంచనాలు పెరుగుతున్నాయి.ఈ ఇంటర్వ్యూలో అలీ అడిగిన ప్రశ్నలకు మోహన సిద్ధి ఇచ్చిన సమాధానాలు, వారి మధ్య సాగిన సరదా సంభాషణలు చూసేవారిని బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మోహన సిద్ధి తన తదుపరి ప్రాజెక్టులు, నెక్స్ట్ మూవీ గురించి పంచుకున్న విషయాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.  అలీ మాట్లాడుతు మూవీలో మోహన సిద్ధితో ఎలాంటి సీన్స్ లేవు. కానీ పార్ట్ 2 లో  మోహన నర్సు అయితే నేను డాక్టర్ అని సరదగా చెప్పాడు.    మీకు నచ్చవచ్చు:స్టార్ యాక్టర్ పై దియామీర్జా కీలక వ్యాఖ్యలు: మీకు నచ్చవచ్చు :సంజయ్ దత్ గత జన్మలో ఏ పని చేసే వాడో తెలుసా!     [Ali, Mana Doctor Babe, Mohana Siddhi, Tollywood, Bollywood]
మన సంస్కృతిలో కొన్ని ప్రాంతాల ప్రజల ఆహారపు అలవాట్లు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా బెంగాలీలు చేపలను ఎంత ఇష్టంగా తింటారో మనందరికీ తెలిసిందే. రోజులో ఒక్కసారైనా చేప రుచి చూడాలని వారు ఎంతో ఆశ పడతారు, చేపలు లేకుండా తమ రోజువారీ భోజనం అసంపూర్ణమని భావిస్తారు. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, చేపలలో సమృద్ధిగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు మరియు విటమిన్ల వల్లే వారు వీటిని అంతగా ఇష్టపడతారు. కేవలం 5 దశల్లో అర్థమయ్యే ఈ ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే, ప్రతిరోజూ లేదా కనీసం వారానికి ఒకసారైనా చేపలను ఆహారంలో చేర్చుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. చేపలను రోజూ లేదా క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. మారుతున్న వాతావరణంలో వచ్చే సాధారణ అనారోగ్యాలను ఎదుర్కొనేందుకు ఈ ఇమ్యూనిటీ పవర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక చేపలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మన శరీరంలోని రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి చేపలు ఒక అద్భుతమైన సహజసిద్ధమైన ఆహారంగా నిలుస్తాయి. గుండెతో పాటు మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా చేపలు అమోఘంగా పనిచేస్తాయి. చేపలను క్రమం తప్పకుండా తినడం వల్ల జ్ఞాపకశక్తి చురుగ్గా మారుతుంది మరియు వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు వంటి సమస్యలు దరిచేరవు. అంతేకాకుండా, వయసు సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ఇవి తగ్గిస్తాయి. చేపలలో ఉండే ప్రోటీన్లు చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఇవి కండరాల నిర్మాణానికి తోడ్పడటంతో పాటు, శరీరానికి అవసరమైన బలాన్ని అందించి మనల్ని రోజంతా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. మన కంటి చూపును కాపాడుకోవడానికి కూడా చేపలలోని పోషకాలు మరియు విటమిన్లు ఎంతగానో సహాయపడతాయి. వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మందగించకుండా ఉండాలంటే పోషకాహారం అవసరం, దానికి చేపలు మంచి ఎంపిక. కేవలం అంతర్గత ఆరోగ్యమే కాకుండా, బాహ్య సౌందర్యాన్ని పెంచడంలోనూ చేపలు ముందుంటాయి. చేపలలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి. అలాగే జుట్టు రాలడాన్ని పూర్తిగా తగ్గించి, కురులు ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉండేలా చేస్తాయి. ఇది కూడా చదవండి:కేలరీల ఖజానా, నల్ల శెనగలు.. చలికాలంలో ఇవి తింటే మీ శరీరానికి అసలైన శక్తి! ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి ఎంతో అవసరం. చేపలలో ఉండే విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచడమే కాకుండా, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. కొందరు చేపలను రోజూ తింటే, మరికొందరు వారానికి ఒక్కసారైనా తింటూ ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఏదేమైనా, సరైన మోతాదులో చేపలను మన ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి అందే పోషకాలు అపారం. సరళమైన ఆహారపు అలవాటుతో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటే ఆశ్చర్యం కలగక మానదు. గుండె రక్షణ, మెదడు చురుకుదనం, కండరాల బలం, కంటి చూపు, చర్మ సౌందర్యం, జుట్టు రక్షణ మరియు బలమైన ఎముకలు—ఇలా అన్నింటికీ చేపలు ఒక సమగ్ర పరిష్కారంగా నిలుస్తాయి. మీ రోజువారీ లేదా వారపు డైట్‌లో చేపలను చేర్చుకోవడం ద్వారా మీరు కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు ఒక అడుగు వేయవచ్చు. మీకు నచ్చవచ్చు:కిడ్నీలు సేఫ్‌గా ఉండాలంటే, రోజూ ఈ డ్రింక్ తాగండి!                                రోగనిరోధక శక్తిని పెంచే, క్యాప్సికమ్ గురించిన, ఆసక్తికర విషయాలు!       Eating Fish Daily Benefits, Omega 3 Health, Coastal Diet Longevity, Heart And Brain Foods, Healthy Seafood Nutrition, Doctor Health Advice, Health Tips In Telugu.  
చలికాలం రాగానే చాలామందిని వేధించే పెద్ద సమస్య జుట్టు రాలడం మరియు జుట్టు పెరుగుదల మందగించడం. మారుతున్న వాతావరణం, పొడి గాలి, ఆహారపు అలవాట్ల వల్ల దువ్వెన పట్టినప్పుడల్లా వెంట్రుకలు ఊడిపోతూ ఆందోళన కలిగిస్తాయి. అయితే నిపుణుల ప్రకారం చలికాలంలో హెయిర్ గ్రోత్ పూర్తిగా ఆగిపోదు, కానీ వేగం మాత్రం తగ్గుతుంది. చల్లని గాలి కారణంగా తల చర్మంలోని రక్తనాళాలు కుచించుకుపోతాయి. దీనివల్ల జుట్టు కుదుళ్లకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు తగ్గిపోయి వెంట్రుకలు బలహీనపడతాయి. దీనికి తోడు శరీరంలో విటమిన్ డి లోపం కూడా జుట్టు పెరుగుదల తగ్గడానికి ఒక ప్రధాన కారణంగా నిలుస్తుంది. చలికాలంలో మనం వేసుకునే ఉన్ని టోపీలు, స్కార్ఫ్‌ల రాపిడి వల్ల కూడా వెంట్రుకలు చిక్కులు పడి మధ్యలోనే తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ కలరింగ్, బ్లీచింగ్, స్ట్రెయిట్‌నర్లు వంటి స్టైలింగ్ సాధనాలను తరచూ వాడటం వల్ల కురులు తేమ కోల్పోయి నిర్జీవంగా మారుతాయి. చలిని తట్టుకోవడానికి మరీ వేడినీళ్లతో తలస్నానం చేస్తే జుట్టులోని సహజ నూనెలు పూర్తిగా పోతాయి. అందుకే ఎప్పుడూ గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. వారానికి 2 లేదా 3 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. జుట్టు కుదుళ్లకు తిరిగి బలం చేకూర్చాలంటే రోజుకు 10 నిమిషాల పాటు సున్నితమైన ఆయిల్ మసాజ్ ఎంతో మేలు చేస్తుంది. గోరువెచ్చని కొబ్బరి నూనె, ఆముదం లేదా ఆర్గాన్ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల తల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడి హెయిర్ గ్రోత్‌కు తోడ్పడుతుంది.  షాంపూ విషయంలో సల్ఫేట్, పారాబెన్ లేని మాయిశ్చరైజింగ్ షాంపూలను ఎంచుకోవాలి. గ్లిజరిన్, హయలురోనిక్ యాసిడ్, షియా బటర్ ఉన్న కండీషనర్లు వాడటం వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది. అలాగే వారానికి ఒకసారి డీప్ కండీషనింగ్ హెయిర్ మాస్క్ వేసుకుని 30 నిమిషాల తర్వాత కడిగేస్తే కురులకు లోతైన తేమ అందుతుంది. ఇది కూడా చదవండి:స్టెంట్‌లు, బైపాస్ సర్జరీల వల్ల ఆయుష్షు పెరుగుతుందా? తాజా అధ్యయనం ఏం చెబుతోంది? తలస్నానం తర్వాత జుట్టు కొద్దిగా తడిగా ఉన్నప్పుడే వెంట్రుకల చివర్లకు హెయిర్ సీరమ్ రాయాలి. ఇది బయటి పొడిగాలి నుంచి కురులకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతి 6 నుంచి 8 వారాలకు ఒకసారి జుట్టు చివర్లను కొద్దిగా కత్తిరించుకోవడం వల్ల చిట్లిపోయే సమస్య తగ్గి ఆరోగ్యకరమైన పెరుగుదల కనిపిస్తుంది. బయటి సంరక్షణతో పాటు లోపలి పోషణ కూడా అంతే ముఖ్యం. ఆహారంలో బయోటిన్, ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, ఆకుకూరలు, చేపలు, అవకాడో వంటి పోషకాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. చలికాలంలో దాహం తక్కువగా ఉన్నా రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం మర్చిపోకూడదు. ఈ చిన్న మార్పులతోనే చలికాలపు జుట్టు సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. ఒకవేళ విపరీతంగా జుట్టు ఊడిపోతున్నా, తలపై ప్యాచెస్ లాగా బట్టతల కనిపిస్తున్నా లేదా చుండ్రు సమస్య తీవ్రంగా ఉన్నా సొంత చిట్కాలు ఆపి వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం. మీకు నచ్చవచ్చు:నేచర్ ప్రిస్క్రిప్షన్: డాక్టర్లు సైతం సిఫారసు చేస్తున్న ,అద్భుతమైన ప్రకృతి రహస్యం!                                 సరికొత్త క్యాన్సర్ చికిత్సలు: వైద్య రంగంలో నూతన మైలురాళ్ళు ఇవే!       Winter Hair Growth, Winter Hair Care Tips, Stop Winter Hair Fall, Scalp Hydration Tips, Healthy Hair Routine, Dermatologist Hair Advice, Health Tips In Telugu.
అమ్మమ్మ చేతి వంట తలచుకోగానే మనసులో ఒక తీయని జ్ఞాపకం మెదులుతుంది. ముఖ్యంగా ఆంధ్ర సంప్రదాయ స్వీట్లలో నెయ్యి సున్నుండలు ప్రత్యేక స్థానంలో నిలుస్తాయి. బయట కొనే మిఠాయిలతో పోలిస్తే ఇంట్లోనే స్వచ్ఛమైన పదార్థాలతో తయారుచేసే సున్నుండల రుచే వేరు. పొట్టు లేని మినపప్పు, బెల్లం లేదా పంచదార పొడి, యాలకుల పొడి, మంచి నెయ్యి కలిపి చేసే ఈ ఆంధ్ర స్వీట్ నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. నాణ్యమైన నెయ్యి వాడితే ఈ సున్నుండలు ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉంటాయి. ఈ కమ్మని సున్నుండల తయారీ విధానం కోసం ముందుగా కొలతలను సరిగ్గా సిద్ధం చేసుకోవాలి. పొట్టు లేని మినపప్పు లేదా మినపగుళ్లు 2 కప్పులు తీసుకోవాలి. కావాలనుకుంటే వీటిలో కొద్దిగా బియ్యం కూడా కలుపుకోవచ్చు. తీపి కోసం బెల్లం లేదా పంచదార పొడి 1 కప్పు, సువాసన కోసం అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలాగే కరిగించి కొద్దిగా గోరువెచ్చగా చేసుకున్న నెయ్యి సుమారు అర కప్పు వరకు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు వేయించే ప్రక్రియతో అసలైన రుచి మొదలవుతుంది. ముందుగా తీసుకున్న 2 కప్పుల మినపప్పును మీడియం మంటపై వేయించాలి. గరిటెతో రెండు, మూడు సార్లు కలుపుతూ మంచి సువాసన వచ్చే వరకు, రంగు మారే వరకు నిదానంగా వేయించాలి. పప్పు మాడిపోకుండా జాగ్రత్త పడుతూ వేయించిన తర్వాత, వాటిని కాసేపు ఫ్యాన్ కింద పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన పప్పుతోనే పిండి మెత్తగా, కమ్మగా వస్తుంది. ఆ తర్వాత మిక్సీలో మెత్తని పిండి సిద్ధం చేసుకోవాలి. చల్లారిన మినపప్పును మిక్సీ జార్‌లో వేసి, దానిలో 5 యాలకులు కూడా జత చేయాలి. వీటిని మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పంచదార వాడుతుంటే, ఆ పంచదారను కూడా ఇందులో వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండి సమానంగా మెత్తగా ఉండటం వల్ల సున్నుండలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇది కూడా చదవండి:శీతాకాలంలో, పచ్చి బఠానీలు తింటే బరువు తగ్గవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు? ఇక సున్నుండలు చుట్టే ఘట్టం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో ముందుగా కరిగించి గోరువెచ్చగా ఉంచుకున్న అర కప్పు నెయ్యిని కొద్దికొద్దిగా పోస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం నెయ్యి పట్టేలా చేతితో చక్కగా కలపాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండి వేడి మీద ఉన్నప్పుడే నిమ్మకాయ సైజంతా ఉండలుగా చుట్టుకోవాలి. పిండి చల్లారితే ఉండలు సరిగ్గా కట్టడం కష్టమవుతుంది కాబట్టి గోరువెచ్చని వేడి ఉన్నప్పుడే వేగంగా చుట్టడం ముఖ్యం. ఇలా తయారుచేసుకున్న నెయ్యి సున్నుండలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటాయి. రోజుకో సున్నుండ తిన్నా ఆ కమ్మదనం, సంప్రదాయ రుచి మనసును నింపుతుంది. మీరు కూడా ఇంట్లోనే ఈ సులభమైన పద్ధతిలో చేసి చూసి, అమ్మమ్మ నాటి తీపి రుచిని ఆస్వాదించండి. మీకు నచ్చవచ్చు:ఇంజెక్షన్లతో పనిలేదు, ఇకపై మాత్రలతోనే బరువు తగ్గింపు: పూర్తి వివరాలు ఇవే!                                 ఉదయం పూట, వ్యాయామాలు చేసేవారికి, బ్లడ్ షుగర్ ఎందుకు పెరుగుతుంది?       Ghee Sunnundalu Recipe, Minapa Sunnundalu, Urad Dal Ladoo, Andhra Traditional Sweets, Healthy Indian Desserts, Homemade Festival Recipes, Cooking Recipes In Telugu.  
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తూ, శరీరంలోని వ్యర్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అయితే, జీవనశైలిలో మార్పులు , వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా కిడ్నీలు బలహీనపడే ప్రమాదం ఉంది. కిడ్నీలు దెబ్బతినడం మొదలైనప్పుడు మన శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా, మూత్ర విసర్జనలో వచ్చే మార్పులు కిడ్నీ సమస్యలకు తొలి సంకేతాలుగా భావించవచ్చు. వీటిని ముందుగానే గుర్తించడం ద్వారా పెద్ద ముప్పు నుంచి బయటపడవచ్చు. మూత్రంలో నురుగు.. సాధారణంగా కిడ్నీల పనితీరు మందగించినప్పుడు మూత్రం రంగు, పరిమాణం , దాని స్వభావంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. కొందరిలో మూత్రం చేసే సమయంలో విపరీతంగా , ఎక్కువసేపు నిలిచి ఉండే తెల్లటి నురగ వస్తుంటుంది. ఇలా తరచూ జరగడం మూత్రంలో ప్రొటీన్ బయటకు పోతున్నదనేదానికి ముఖ్య సంకేతం. ఆరోగ్యవంతమైన కిడ్నీలు శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను ఉంచుకుని వ్యర్థాలను మాత్రమే బయటకు పంపిస్తాయి. కానీ కిడ్నీ ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు ప్రొటీన్ మూత్రం ద్వారా కారిపోతుంది. మూత్రం రంగు.. మూత్రం రంగులో వచ్చే మార్పులను కూడా తేలికగా తీసుకోకూడదు. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ ఎటువంటి కారణం లేకుండా మూత్రం ముదురు పసుపు రంగులో, గోధుమ రంగులో లేదా తేయాకు రంగులో పడుతుంటే అప్రమత్తం కావాలి. కొన్ని సందర్భాల్లో మూత్రం గులాబీ రంగులో లేదా ఎరుపు రంగులో రావడం కూడా జరుగుతుంది. దీనిని వైద్య పరిభాషలో హెమటూరియా అంటారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, ఇన్ఫెక్షన్లు తలెత్తడం లేదా వాపు కారణంగా ఇలా జరగవచ్చు. నొప్పులు లేకపోయినా మూత్రంలో రంగు మారడం లేదా రక్తం పడటం జరిగితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. మూత్రవిసర్జన వేళలు.. మూత్ర విసర్జన చేసే వేళల్లో వచ్చే తేడాలు కూడా కిడ్నీ సమస్యలను సూచిస్తాయి. పగటిపూట లేదా రాత్రి సమయంలో సాధారణం కంటే చాలా ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం కిడ్నీల సామర్థ్యం తగ్గడానికి ఒక కారణం కావచ్చు. కిడ్నీలు మూత్రాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోవడం  వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీనికి తోడు డయాబెటిస్ లేదా ప్రోస్టేట్ సమస్యలు కూడా కారణం కావొచ్చు. మరోవైపు, అకస్మాత్తుగా మూత్రం వచ్చే పరిమాణం చాలా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరిగితే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి సంకేతం. ఇది కూడా చదవండి   కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే! వాసన.. మూత్రం నుండి తీవ్రమైన లేదా సాధారణం కాని ఘాటైన వాసన రావడం కూడా కొన్నిసార్లు శరీరంలో నీటిశాతం తగ్గడం వల్ల లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ఈ లక్షణాలతో పాటు పొత్తి కడుపులో  నొప్పి, జ్వరం లేదా మంట వంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మరికొన్ని సిగ్నల్స్.. మూత్రంలో కనిపించే ఈ మార్పులతో పాటు శరీరం ఇతర సంకేతాలను కూడా ఇస్తుంది. ముఖం మరియు పాదాలు ఉబ్బడం, ఒంట్లో తీవ్రమైన నీరసం నిరంతరం వేధించడం, ఆకలి మందగించడం, వికారంగా అనిపించడం, చర్మంపై విపరీతమైన దురద పుట్టడం , కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని అర్థం చేసుకోవాలి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్లే ఇవన్నీ జరుగుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం దీర్ఘకాలికంగా నియంత్రణలో లేకపోవడం, కిడ్నీలో రాళ్లు, పదే పదే వచ్చే మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు , వైద్యుల సలహా లేకుండా విచ్చలవిడిగా పెయిన్‌కిల్లర్స్ వంటి మందులను వాడటం వల్ల కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, తగినంత నీరు తాగుతూ ఉండటం , ఏ చిన్న అనారోగ్య లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..​                                  మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​  
మన శరీరంలోని కిడ్నీలు, లివర్ వంటి ముఖ్యమైన అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తున్నాయా? వాటిలో ఏవైనా సమస్యలు మొదలైతే శరీరం ముందుగానే కొన్ని సంకేతాలను ఇస్తుందా? అసలు ఈ సంకేతాలను ఎలా గుర్తించాలి? మన శరీర ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడంలో చెవులు, కళ్లు, పెదవుల ఆకృతి వంటి బాహ్య లక్షణాలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మన శరీరంలోని ప్రతి అవయవం తనదైన ప్రత్యేక విధులను నిర్వహిస్తుంది. కిడ్నీలు రక్తంలోని వ్యర్థ పదార్థాలను వడపోసి బయటకు పంపడంలో, శరీరంలో నీరు, లవణాల సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే లివర్ ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన పిత్తరసాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు శరీరంలోని అనేక ముఖ్యమైన జీవక్రియల్లో పాల్గొంటుంది. ఈ అవయవాల పనితీరులో మార్పులు వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఈ వీడియోలో డాక్టర్ ఉమా వెంకటేష్ (Dr. Uma Venkatesh) పంచభూతాల సిద్ధాంతం, శరీరంలోని అవయవాల పనితీరు, నాడి ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటు చెవులు, కళ్లు, పెదవుల ఆకృతిని పరిశీలించడం ద్వారా శరీరంలోని అంతర్గత ఆరోగ్య పరిస్థితుల గురించి ఎలా అర్థం చేసుకోవచ్చనే అంశాలను పల్స్ బ్యాలెన్సింగ్ (Pulse Balancing) విధానం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోగలిగే ముఖ్యమైన అంశాలు: కిడ్నీలు, లివర్ మన శరీరంలో నిర్వహించే ముఖ్యమైన విధులు ఏమిటి?   ఈ అవయవాల ఆరోగ్యంలో మార్పులు వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి?   కిడ్నీ సమస్యలకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను ఎలా  గుర్తించాలి?   లివర్ ఆరోగ్యాన్ని సూచించే లక్షణాలు ఏమిటి?    చెవులు, కళ్లు, పెదవుల ఆకృతికి శరీర ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏమిటి?   పంచభూతాల సిద్ధాంతం ప్రకారం శరీర అవయవాల పనితీరును ఎలా వివరిస్తారు?   నాడి పరిశీలన, పల్స్ బ్యాలెన్సింగ్ విధానంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?   మన అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శరీరం ఇచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయకుండా గమనించడం, అవసరమైనప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం. కేవలం బాహ్య లక్షణాలు లేదా అవయవాల ఆకృతిని బట్టి కిడ్నీ, లివర్ వ్యాధులను నిర్ధారించలేము. సరైన వైద్య పరీక్షలు, నిపుణుల సలహాతోనే ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకోవాలి. కిడ్నీ, లివర్ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడానికి డాక్టర్ ఉమా వెంకటేష్ అందిస్తున్న ఈ విలువైన సమాచారాన్ని పూర్తిగా చూడండి. TeluguOne Health – ఆరోగ్యంపై అవగాహన, ఆరోగ్యకరమైన జీవితానికి మార్గదర్శకం.