సీనియర్ ఐఏఎస్ అధికారి  శ్రీలక్ష్మి రిటైర్‌మెంట్ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారు.  మంగళవారం (జూన్ 30) శ్రీలక్ష్మి పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్ అయిన తరువాత ఆమె యాక్టివ్ పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పటి నుంచి..  జగన్‌ నమ్మినబంటులా వ్యవహరించారన్న విమర్శులు ఎదుర్కొంటున్న శ్రీలక్ష్మి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా  పోటీ చేయడానికి కి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.  ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ స్థానం, లేదా ఏలూరు, నరసాపురం లోక‌సభ స్థానాలలో ఏదో ఒక చోట నుంచి ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.   22 ఏళ్ల వయస్సులోనే ఐఏఎస్‌గా ఎంపికైన శ్రీలక్ష్మి  కెరీర్‌ మొత్తం వివాదాస్పదంగానే సాగింది. ఉమ్మడి ఏపీలో గనుల శాఖ సీఎస్‌గా పనిచేసిన శ్రీలక్ష్మి ఓబుళాపురం మైనింగ్ కేటాయింపుల్లో ఆరోపణలు ఎదుర్కొని,  వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తుల కేసులో ఆరో నిందితురాలిగా ఉన్నారు.  2011 నుంచి 2013 మార్చి వరకు చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్‌పై వచ్చిన శ్రీలక్ష్మి  రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్‌లో కొనసాగి.. వైసీపీ ప్రభుత్వంలో ఏపీకి వచ్చారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమెను కూటమి ప్రభుత్వం రాగానే పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. తాజాగా రిటైర్‌మెంట్‌కు 4 రోజుల ముందు ఆమెకు పోస్టింగ్ దక్కింది. ఇప్పుడు జగన్‌ కేసుల్లో సహనిందితురాలిగా ఉన్న అనుబంధం, తనకున్న ఫైనాన్షియల్ బ్యాంక్‌గ్రౌండ్‌తో శ్రీలక్ష్మి వైసీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీకి సిద్దమవుతుండటం రాజకీయవర్గాల్లో బర్నింగ్ హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా  బీజేపీ) వ్యూహాలకు పదును పెడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్  పార్టీ తెలంగాణ నాయకత్వానికి దిశా నిర్దేశం చేశారు.   ఈ ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని, అక్కడ క్షేత్రస్థాయిలో చేసిన ప్రజా పోరాటాలను తెలంగాణ బీజేపీ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలని  పిలుపునిచ్చారు. బెంగాల్ మోడల్ తరహాలోనే ఇక్కడ కూడా ప్రజా సమస్యలపై పోరాడి విజయం సాధించాలన్న నితిన్ నబీన్.. రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యాన్ని ఇక ఎంత మాత్రం సహించబోమని స్పష్టమైన హెచ్చరిక చేశారు. అయితే తెలంగాణలో బెంగాల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అంటే పరిశీలకులు మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు.  బెంగాల్‌తో తెలంగాణను పోల్చడం సాధ్యం కాదని కుండబద్దలు కొడుతున్నారు.   పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల మధ్య  రాజకీయంగా  భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. బెంగాల్‌లో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన కమ్యూనిస్టులు క్షేత్రస్థాయిలో పూర్తిగా పట్టు కోల్పోవడం బీజేపీకి  ప్లస్ పాయింట్‌ అయ్యింది. దానికి తోడు అక్కడ  తృణమూల్ కాంగ్రెస్పై తీవ్రమైన అవినీతి, అక్రమాల ముద్ర పడటం, మమతా బెనర్జీ తర్వాత వారసుడిగా కుటుంబ సభ్యులను ముందుకు తీసుకురావడాన్ని బెంగాల్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. వీటన్నింటికీ మించి బెంగాల్‌లో సువేందు అధికారి లాంటి బలమైన, మాస్ ఇమేజ్ ఉన్న ఒక ఐకాన్ లీడర్ బీజేపీకి దొరకడం కలిసి వచ్చింది. ఈ రాజకీయ, సామాజిక సమీకరణాలే అక్కడ బీజేపీ విజయానికి మార్గం సుగమం చేశాయి. కానీ..  అటువంటి పరిస్థితి లేదు.  రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై గానీ, సీఎంపై గానీ ప్రజల్లో పెద్దగా  వ్యతిరేకత కనిపించడం లేదు. అదే సమయంలో ఈ మూడేళ్లలో కాంగ్రెస్ సర్కార్ పై అవినీతి ముద్ర పడిన దాఖలాలు కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో   కొన్ని ఆరోపణలు వస్తున్నప్పటికీ..  వాటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తోంది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్లో   బలమైన   నేతగా, మాస్  లీడర్‌గా, అసెంబ్లీ లోపలా  బయటా గట్టిగా గళం ఎత్తగల నాయకుడిగా  గుర్తింపు పొందారు. ఇటువంటి బలమైన వ్యూహకర్తను ఢీకొట్టడం బీజేపీ అంత సులభ సాధ్యం కాదని పరిశీలకులు అంటున్నారు.  మరోవైపు..  బెంగాల్‌లో సువేందు అధికారి తరహాలో రాష్ట్రం మొత్తం ప్రభావం చూపించగల  నాయకుడు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఎవరూ కనిపించడం లేదని చెబుతున్నారు. అలాగే తెలంగాణ బీజేపీలో ముఖ్య నేతల మధ్య  అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరాటాలు, కుమ్ములాటలు క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను గందరగోళంలో పడేశాయని చెబుతున్నారు.   అలాగే.. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితికి క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంక్  ఇప్పటికీ బలంగానే ఉండటం కూడా బీజేపీకి అధికారం అంత సులువుగా దక్కదన్న అభిప్రాయానికి కారణం అవుతోంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా.. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో   త్రిముఖ పోటీ తధ్యమని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే.. బెంగాల్ తరహా ఏకపక్ష వ్యూహాలు ఇక్కడ ఫలించే అవకాశాలు అంతంత మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి  రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నా..  విభజన చట్టంలో పేర్కొన్న ప‌లు కీలక ప్రాజెక్టులు, హామీలు, తెలంగాణకు రావాల్సిన నిధులు వంటి హామీలను  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా నెరవేర్చలేదనే అసంతృప్తి స్థానికంగా చాలా చాలా బలంగా ఉంది.  తెలంగాణ ఆవిర్భావానికి  పార్లమెంట్‌లో తాము కూడా మద్దతు తెలిపామని బీజేపీ క్రెడిట్ కోరుకుంటున్నప్పటికీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పుష్కర కాలంలో  రాష్ట్రానికి చేసిన ఆర్థిక సాయం ఎంత అనే ప్రశ్నకు రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పలేక తడబడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే..   కేవలం బెంగాల్ ఫార్ములాను నమ్ముకుని తెలంగాణలో పాగా వేయాలనుకోవడం నేల విడిచి సాము చేయడంగా మారుతుందన్నది పరిశీలకుల విశ్లేషణ. 
భారతీయ రాజకీయాలలొప్రశాంత్ కిషోర్ (పీకే) పేరుకు పరిచయం అక్కర్లేదు.  రాజకీయ వ్యూహకర్తగా పీకే ఎన్నో చారిత్రాత్మక విజయాల వెనుక పీకే ఉన్నారు. అయితే సొంత రాష్ట్రం బీహార్ లో సొంత రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగి బొక్కబోర్లా పడ్డారు. అయితే ఇప్పుడు ఆయన మరో సారి ఎన్నికల బరిలోకి దిగనున్నారు.  సొంత పార్టీ పెట్టి  బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలలోనూ  తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన ప్రశాంత్ కిశోర్ అప్పుడు తాను స్వయంగా పోటీ చేయలేదు. పార్టీ ఘోర పరాజయం తరువాత ఇప్పుడు ఆయన బీహార్ అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు  సిద్ధమౌతున్నారు.    బిహార్‌లో ఆయన స్థాపించిన  జన్ సూరజ్  పార్టీకి ఏ మాత్రం ఆదరణ లభించలేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయినా వెనుకడుగు వేయని ప్రశాంత్ కిశోర్..  ఇప్పుడు బీహార్ కొత్త పాట్నా పరిధిలోని  బాంకీపూర్  నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో తానే స్వయంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.   బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా  బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి  బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.  దీంతో బాకింపూర్ కు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీకి బలమైన నియోజకవర్గమే అయినప్పటికీ..  పీకే ఇక్కడ నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు.  ఈ విషయాన్ని ఆయన సూచన ప్రాయంగా వెళ్లడడించారు.  బాంకీపూర్‌లో బీజేపీ ఆధిపత్యాన్ని ఎలాగైనా తగ్గించడమే తన ప్రధాన లక్ష్యమనీ.. అవసరమైతే తానే స్వయంగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు   పొలిటికల్ స్క్రీన్‌ప్లే లకే పరిమితమైన  ప్రశాంత్ కిషోర్..    ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అదీ బీజేపీకి గట్టిపట్టున్న బాంకీపూర్ నియోజకవర్గం నుంచి. బీజేపీ కోటలాంటి బాంకీపూర్ లో పీకే గెలుపు కష్టసాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రాశాంత్ కిశోర్ మాత్రం  దశాబ్దాల బీజేపీ కోటను బద్దలు కొడతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
సినిమా ప్రియులకు సరికొత్త వినోదాన్ని పంచేందుకు జూలై మొదటి వారం సిద్ధమైపోయింది. ఈ వారం ఇటు థియేటర్లలోనూ, అటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అస్సలు కొదవ లేదు. థియేటర్లలో 'నాగబంధం', 'రావు బహదూర్' లాంటి విభిన్నమైన తెలుగు చిత్రాలతో పాటు ఆలియా భట్ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఆల్ఫా' సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. అయితే థియేటర్లకే వెళ్లకుండా ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని వీకెండ్ ఎంజాయ్ చేయాలనుకునే సినీ లవర్స్ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 15 కి పైగా సరికొత్త ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, జీ5, ఆహా వంటి ప్రముఖ ఓటీటీ సంస్థలు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ వారం ఓటీటీ రేసులో డిఫరెంట్ తెలుగు వెబ్ సిరీస్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. టాలెంటెడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్‌లో నటించిన సరికొత్త ఒరిజినల్ తెలుగు సిరీస్ 'సూపర్ సుబ్బ' జూలై 2 వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఒక దురదృష్టవంతుడైన టీచర్, అసలు ఏమాత్రం అనుకూలంగా లేని ఒక పల్లెటూర్లో 'సెక్స్ ఎడ్యుకేషన్' బోధించాల్సి వస్తే ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఎలాంటి విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనే ఆసక్తికరమైన లైన్‌తో ఈ క్రేజీ స్టోరీ రాబోతోంది. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో వరల్డ్ వైడ్ భారీ క్రేజ్ ఉన్న 'ఎనోలా హోమ్స్ సీజన్ 3' కూడా జూలై 16 వ తేదీన డిజిటల్ స్క్రీన్స్ పై అలరించడానికి వస్తోంది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్ 'పెద్ది' కూడా ఇదే రోజున అంటే జూలై 16 వ తేదీన రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సూపర్ కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాలెంటెడ్ యాక్ట్రెస్ ఐishwarya రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు వెబ్ సిరీస్ 'ఇసకపట్నం' జూలై 2 వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది. దీనితో పాటు లేటెస్ట్ గ్లోబల్ సెన్సేషన్ క్రియేట్ చేసిన హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీ 'అబ్సెషన్' జూన్ 30 వ తేదీ నుండి ప్రైమ్‌లో రెంట్ మోడల్ పద్ధతిలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక జియో హాట్‌స్టార్ విషయానికి వస్తే, 'ప్రేమలు' సినిమా ఫేమ్ నస్లెన్ నటించిన మలయాళ సూపర్ హిట్ కామెడీ డ్రామా 'మాలీవుడ్ టైమ్స్' జూలై 3 వ తేదీ నుంచి తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది. మంచి క్లీన్ కామెడీ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కు ఈ వీకెండ్‌లో ఇదొక బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. రీజినల్ ఓటీటీలు అయిన జీ5 మరియు ఆహా యాప్స్ కూడా ఈ వారం సరికొత్త సరిహద్దులను దాటుతున్నాయి. జీ5 ఓటీటీలో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే సస్పెన్స్ క్రైమ్ డ్రామా తెలుగు సిరీస్ 'మర్మదేశం' జూలై 3 వ తేదీ నుండి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయనుంది. అలాగే మన తెలుగు ఓటీటీ 'ఆహా' లో సరికొత్త రియాలిటీ షో 'టాప్ తెలుగు ఇన్‌ఫ్లూయెన్సర్' జూలై 3 వ తేదీ నుండి గ్రాండ్‌గా స్టార్ట్ కాబోతోంది. సోషల్ మీడియా స్టార్స్ హంగామాను ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుంది. సైన్స్ ఫిక్షన్ కథలను, మిస్టరీ థ్రిల్లర్స్‌ను అమితంగా ఇష్టపడే వారి కోసం ఆపిల్ టీవీ ప్లస్‌లో మోస్ట్ అవేటెడ్ 'సిలో సీజన్ 3' జూలై 3 వ తేదీ నుండి వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్ కానుంది. ఇవే కాకుండా సన్ నెక్స్ట్ ఓటీటీ లో 'హ్యాంగ్ మ్యాన్' అనే ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమా కూడా జూలై 3 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సస్పెన్స్, కామెడీ, యాక్షన్, మిస్టరీ ఇలా అన్ని జోనర్ల సినిమాలు ఈ వారం లైన్‌లో ఉన్నాయి కాబట్టి మీ ఇంట్రెస్ట్‌ను బట్టి మీ ఫేవరెట్ మూవీస్, సిరీస్‌ల లిస్ట్‌ను ఇప్పుడే నోట్ చేసుకుని మీ వీకెండ్ ఓటీటీ ప్లాన్‌ను పక్కాగా సెట్ చేసుకోండి.
Eight years after Ee Nagaraniki Emayyindi went on to become a cult favourite among Telugu audiences, its much-awaited sequel, ENE Repeat, has finally locked its theatrical release date. The makers have announced that the film will hit cinemas on November 19, marking the next chapter in the beloved friendship saga. The release date was unveiled through a visually intriguing announcement video featuring the original gang—Vishwak Sen, Abhinav Gomatham, Maganti Srinath and Venkatesh Kakumanu. Unlike the carefree energy associated with the first film, the four friends are seen travelling through the lush forests of Thailand in a vintage Cadillac, with the iconic friendship anthem from Prema Desam playing in the background. Interestingly, the characters remain silent and appear unusually serious, hinting that the sequel could explore a different emotional tone. The announcement has further raised curiosity, especially as the original film earned a loyal fan base for its relatable humour, memorable characters and road-trip narrative. With writer-director Tharun Bhascker returning to helm the sequel, expectations are naturally high among fans eager to see the gang reunite on screen. The film is currently progressing at a brisk pace, with production underway. Anisha Ambrose and Shivathmika Rajasekhar play the female leads, while producers Srujan Yarabolu and Sandeep Nagireddy are backing the project on a larger scale than its predecessor. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
    మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ప్రస్తుతం తన 158 వ చిత్రం షూటింగ్ తో  బిజీగా ఉన్నాడు. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ(bobby)దర్శకుడు కావడంతో సదరు 158 వ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.  నిన్న హైదరాబాద్ లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన క్రీడల పోటీలకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో కలిసి చిరంజీవి హాజరయ్యారు. దీంతో సదరు వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్‌పీఎల్) సీజన్-2 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌కి  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మెగాస్టార్ హాజరయ్యారు. ఒకే వేదికపై రాజకీయ, సినీ రంగాల అగ్రనేతలు కలిసి కూర్చొని రగ్బీ ఆటను ఆసక్తిగా వీక్షించడం అక్కడ ఉన్న క్రీడాభిమానులని  ఎంతగానో అలరించింది. ఈ అద్భుతమైన ఫైనల్ మ్యాచ్‌లో హోరాహోరీ పోరు సాగింది. గత ఏడాది తృటిలో టైటిల్ చేజార్చుకుని రన్నరప్‌గా నిలిచిన హోమ్ టీమ్ హైదరాబాద్ హీరోస్ ఈసారి మాత్రం పట్టు వదలకుండా సింహ గర్జన చేసింది. మైదానంలో పక్కా వ్యూహాలు, అద్భుతమైన డిఫెన్స్‌తో ముంబై డ్రీమర్స్ జట్టును ఉక్కిరిబిక్కిరి చేసింది. మ్యాచ్ ముగిసేసరికి హైదరాబాద్ హీరోస్ 41-17 పాయింట్ల తేడాతో ముంబై డ్రీమర్స్‌పై ఘన విజయం సాధించి, సరికొత్త రగ్బీ ఛాంపియన్‌గా అవతరించింది. టోర్నీ ముగిసిన అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి విజేత హైదరాబాద్ హీరోస్ జట్టుకి  ఛాంపియన్‌షిప్ ట్రోఫీని అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, నటి మృణాల్ ఠాకూర్, రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్ చేతుల మీదుగా రన్నరప్‌గా నిలిచిన ముంబై జట్టుకు, ఇతర క్రీడాకారులకి  పతకాలని  ప్రదానం చేశారు. జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక లీగ్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టుకు ఏకంగా . 45 లక్షల భారీ ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్‌గా నిలిచిన ముంబై డ్రీమర్స్ జట్టు రూ. 25 లక్షలు గెలుచుకోగా, మూడో స్థానం కోసం జరిగిన ప్లే-ఆఫ్ పోరులో చెన్నై బుల్స్‌పై 22-19తో గెలిచిన బెంగళూరు బ్రేవ్‌హార్ట్స్ జట్టు రూ. 15 లక్షల నగదు బహుమతిని సొంతం చేసుకుంది.    
ఇటీవల కాలంలో మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన మూడు నాలుగు వారాలకే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. అయితే తాజాగా ఒక తెలుగు సినిమా మాత్రం.. థియేటర్లలో విడుదలైన రెండు రోజులకే యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చి షాక్ ఇచ్చింది. తల్లాడ సాయికృష్ణ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'చెట్టు కింద దెయ్యం నాకేం భయం' (Chettu Meedha Dhayyam Nakem Bhayam). జూన్ 26న ఈ సినిమా పరిమిత సంఖ్యలో థియేటర్లలో విడుదలైంది. అయితే ఊహించని విధంగా జూన్ 28 సాయంత్రం యూట్యూబ్‌లోకి వచ్చేసింది. దీనిపై తల్లాడ సాయికృష్ణ స్పందిస్తూ.. తమ సినిమా తక్కువ థియేటర్లలో విడుదలైందని, ఎక్కువమందికి చేరువ కావాలనే ఉద్దేశంతో ఇలా యూట్యూబ్ లో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మరి యూట్యూబ్‌లో ఈ మూవీ ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.  
సోషల్ మీడియాలో చిన్మయి శ్రీపాద అడిగే ప్రశ్నలు చెప్పే ఆన్సర్స్ చాలా మందికి నచ్చవు. ఏ విషయం ఉన్నా కడిగి పారేస్తూ ఉంటుంది. ఈ సిస్టంలో ఉన్న లొసుగుల మీద ఫైట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా కట్నం విషయం గురించి కొంతమంది తనకు డిఎమ్ చేశారని చెప్తూ దానికి ఆన్సర్స్ కూడా ఇచ్చింది. "చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు "ఏంటండీ మీరు కట్నం ఇవ్వాలేదా " అని . "మా కల్చర్ లో కట్నం అస్సలు లేదండి. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గిఫ్ట్స్ కూడా కూడా. ఆడపడుచు కట్నం, బామ్మర్ది కట్నం పక్కింటి ఆంటీకి కట్నం వంటివి ఏమీ  కూడా ఇవ్వలేదు. మేము మా సొంత ట్రిప్స్ కి మేమె ఖర్చు పెట్టుకున్నాం. మా పిల్లలను కనడానికి ఐన ఖర్చును రాహుల్ పెట్టుకున్నాడు మా పేరెంట్స్ కాదు.  మా పెళ్లి ఖర్చులను నేను రాహుల్ ఇద్దరమే పెట్టుకున్నాం. పెళ్లయ్యాక రాహుల్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను మా అమ్మ దగ్గర ఉండేదాన్ని.  దీని గురించి ఎవరూ ఏమీ అన్నారు ఎందుకంటే ఇది నార్మల్ గా అందరూ చేసేదే కాబట్టి. అంటే వివేకవంతులు మీ పేరెంట్స్ ని కలవడానికి పర్మిషన్ తీసుకో అని అనరు. ఒకవేళ అలా అడగాలి అనుకుంటే పురుషులు కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళడానికి అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలి అదే కదా సమానత్వం అంటే ? ఎందుకంటే అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటున్నారు అది న్యూక్లియర్ ఫామిలీ కదా. అబ్బాయిలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళాలి అంటే అమ్మాయి తల్లితండ్రుల పర్మిషన్ తీసుకోవాలి అమ్మాయిలూ కూడా అంతే. ఇద్దరూ ఈక్వల్ గా ఉంటె తప్పు లేదు. ఆత్మగౌరవం ఉన్న ఏ భర్త కూడా  తన భార్య డెలివరీకి  అయ్యే ఖర్చును మరో వ్యక్తిని చెల్లించమని అడుగుతాడు" అంటూ ఈ సిస్టం మీద చిన్మయి శ్రీపాద గట్టిగానే ప్రశ్నించింది.  
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కీర్తి కిరీటంలో మరొక అరుదైన అంతర్జాతీయ గౌరవం వచ్చి చేరింది. తన అద్భుతమైన దృశ్యకావ్యాలతో, వైవిధ్యభరితమైన కథనాలతో భారతీయ సినిమా ముఖచిత్రాన్ని మార్చేసిన ఈ 'జాక్కన్న'కు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో అపూర్వమైన సత్కారం లభించింది. ప్యారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన గైమెట్ మ్యూజియం (Guimet Museum) రాజమౌళిని ప్రత్యేకంగా ఆహ్వానించి, ఆయనను ఘనంగా సన్మానించింది. ఈ మ్యూజియం అంతర్జాతీయంగా ఆసియా కళలకు మరియు సంస్కృతికి ఎంతగానో ప్రసిద్ధి చెందింది. అలాంటి ఒక గొప్ప వేదికపై ఒక భారతీయ దర్శకుడికి ఇంతటి గౌరవం దక్కడం ప్రతి ఒక్క సినిమా అభిమానికి ఎంతో గర్వకారణంగా మారింది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన రాజమౌళి, అక్కడ తన ప్రసిద్ధ చిత్రాలైన 'మగధీర', 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కంక్లూజన్', మరియు ఆస్కార్ విజేత 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రాల ప్రత్యేక ప్రదర్శనలలో పాల్గొన్నారు. ఈ నాలుగు అద్భుత దృశ్యకావ్యాలు గైమెట్ మ్యూజియంలో ప్రదర్శించబడటం విశేషం. గ్లోబల్ ఆడియన్స్ ఈ చిత్రాలను చూసి మంత్రముగ్ధులయ్యారు. ఈ స్క్రీనింగ్స్ అనంతరం దర్శకుడు రాజమౌళి అంతర్జాతీయ ప్రేక్షకులతో మరియు అక్కడి సినీ విశ్లేషకులతో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ సినిమా సంస్కృతి, పురాణాలు మరియు తాను చిత్రాలను తెరకెక్కించే విధానం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ అద్భుతమైన అంతర్జాతీయ గౌరవానికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను గైమెట్ మ్యూజియం తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేయడంతో అవి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. భారతీయ సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో రాజమౌళి చేసిన కృషిని ఈ మ్యూజియం నిర్వాహకులు కొనియాడారు. గ్లోబల్ వైడ్‌గా 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా సాధించిన బిలియన్ డాలర్ల విజయం మరియు ఆస్కార్ వేదికపై 'నాటు నాటు' సృష్టించిన ప్రభంజనం తర్వాత రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ క్రేజ్‌కు నిదర్శనంగానే ప్యారిస్ మ్యూజియం ఈ అరుదైన సత్కారాన్ని ఏర్పాటు చేసింది. ప్యారిస్ వేదికపై రాజమౌళి సత్కారం పొందిన దృశ్యాలు చూసి మహేష్ బాబు అభిమానులతో పాటు యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో హర్షం వ్యక్తం చేస్తోంది. రాబోయే రోజుల్లో రాజమౌళి సరిహద్దులను చెరిపేస్తూ మరిన్ని గ్లోబల్ రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
హాలీవుడ్ చలనచిత్ర చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ 'అబ్సెషన్' (Obsession). ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై అలరించేందుకు సిద్ధమైంది. కేవలం 750,000 డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల ($248.6 Million కంటే ఎక్కువ) వసూళ్లని  సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్‌లో గతంలో సంచలనం సృష్టించిన 'ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్', అలాగే ఆస్కార్ గెలుచుకున్న 'గెట్ అవుట్' వంటి పెద్ద చిత్రాల లైఫ్‌టైమ్ కలెక్షన్ల రికార్డులని  సైతం ఈ సినిమా బద్దలు కొట్టడం విశేషం. భారతదేశంలో కూడా ఈ హారర్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మన దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచిన అబ్సెషన్, కేవలం ఇండియా బాక్సాఫీస్ వద్దే .77 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో అపూర్వమైన ప్రజాదరణ పొందడం వల్ల డిస్ట్రిబ్యూటర్ సంస్థ ఫోకస్ ఫీచర్స్ దీని డిజిటల్ విడుదలను వాయిదా వేస్తూ వచ్చింది. జూన్ 2వ తేదీనే ఓటీటీలోకి రావాల్సిన ఈ చిత్రం, థియేట్రికల్ రన్ అద్భుతంగా సాగడంతో పాటు జూన్ 2 ఒక్కరోజే థియేటర్లలో ఏకంగా 5.7 మిలియన్ డాలర్లు వసూలు చేయడంతో డిజిటల్ రిలీజ్ డేట్‌ని  పొడిగించారు. ఈ చిత్ర కథాంశం విషయానికి వస్తే, బేర్ లేదా బారన్ బెయిలీ (మైఖేల్ జాన్‌స్టన్) అనే మ్యూజిక్ స్టోర్ ఉద్యోగి తన చిన్ననాటి స్నేహితురాలు నిక్కీ ఫ్రీమెన్ (ఇండీ నవరెట్టే)ను ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ తన ప్రేమను వ్యక్తపరిస్తే ఆమె ఎక్కడ దూరమవుతుందో అనే భయంతో మనసులోనే దాచుకుంటాడు. ఈ క్రమంలోనే అతనికి కోరికలు నెరవేర్చే 'వన్ విష్ విల్లో' అనే ఒక వింత మాయా స్టిక్ లభిస్తుంది. దాన్ని విరగ్గొట్టి 'ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నిక్కీ నన్నే ప్రేమించాలి' అని బేర్ కోరుకుంటాడు. ఆ మాయా శక్తి ప్రభావంతో నిక్కీ అతడిని విపరీతంగా ప్రేమించడం ప్రారంభిస్తుంది. Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోడిగా పూజాహెగ్డే! అయితే మొదట్లో ఎంతో అందమైన రొమాంటిక్ ఫాంటసీలా కనిపించిన ఈ ప్రేమ, రానురాను ఒక పీడకలగా మారుతుంది. నిక్కీ ప్రేమ క్రమంగా పిచ్చిగా, ఒక భయంకరమైన సైకో అబ్సెషన్‌గా రూపాంతరం చెందుతుంది. ఆ మితిమీరిన ప్రేమ కాస్తా ప్రాణాంతక పరిస్థితులకు దారితీసి కథను ఒక డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా మారుస్తుంది. డైరెక్టర్ కర్రీ బార్కర్ అద్భుతమైన స్క్రీన్‌ప్లే, లీడ్ పెయిర్ నటన ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడతాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ గ్లోబల్ హారర్ ఫెనామినా చివరకు జూన్ 30, అంటే రేపటి నుంచి యాపిల్ టీవీ (Apple TV)తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ పర్చేజ్ మరియు రెంటల్ విధానంలో అందుబాటులోకి రానుంది. హారర్ ప్రేమికులని  భయపెట్టేందుకు వస్తున్న ఈ మాస్టర్‌పీస్‌ను అస్సలు మిస్ అవ్వకండి.   
The makers of Oh Sukumari have unveiled the film's first single, YaadhiGani Pelli, offering a lively glimpse into the rural comedy's quirky world. Starring Thiruveer and Aishwarya Rajesh, the film had already caught attention with its teaser, which introduced an unusual premise involving a young woman whose touch causes electric shocks and a miserly groom. The song builds on that concept by placing the lead pair at the centre of a vibrant rural wedding. Director Bharat Dharshan has also penned the lyrics, weaving the film's quirky premise into playful lines filled with humour. Composer Bharath Manchiraju gives the track an energetic flavour by blending EDM beats with rural folk instruments, while Jassie Gift's spirited vocals add to its celebratory mood. Visually, the song captures the atmosphere of a traditional village wedding, with Thiruveer and Aishwarya Rajesh sharing effortless chemistry on the dance floor. Their pairing emerges as one of the song's biggest strengths, making the festivities feel lively and entertaining rather than merely promotional. The picturisation also drops subtle hints about the film's storyline. Wedding guests are seen reacting nervously to Aishwarya Rajesh's character, and the sudden power outage towards the end teases another humorous twist connected to her unusual condition. These touches make the song more than just a dance number, as it also advances the narrative. Produced by Gangaa Entertainments, Oh Sukumari is being mounted as a Pan-India rural entertainer. With YaadhiGani Pelli delivering catchy music, colourful visuals and story-driven humour, the makers have added another layer of curiosity around the film ahead of its theatrical release.     Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో పెళ్లిలో ఆడపిల్ల తల్లిదండ్రులు కట్నం ఇస్తుంటారు. చాలా కుటుంబాలు కట్నం ఇవ్వడం తమ ప్రతిష్టకు చిహ్నంగా కూడా భావిస్తారు.  కానీ కట్నానికి బదులుగా కొన్ని వస్తువులు ఇవ్వడం వల్ల ఆడపిల్లల జీవితాలు, వారి భవిష్యత్తులో కూడా సురక్షితంగా,  బంగారంలా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. కట్నానికి బదులు ఆడపిల్లకు ఇవ్వాల్సినవి.. విద్య, నైపుణ్యాలు.. విద్యను ప్రపంచంలోనే గొప్ప సంపదగా పరిగణిస్తారు. ఆడపిల్ల  విద్యావంతురాలై, ఏదైనా నైపుణ్యంలో ప్రావీణ్యం సంపాదిస్తే, ఆమె ఏ పరిస్థితిలోనైనా స్వయం సమృద్ధి సాధించగలదు. విద్య ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని  ఇస్తుంది,  ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో నేటి కాలంలో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఆడపిల్లలను బాగా చదివిస్తే అది వారికి  కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది. పెళ్లి సమయంలో ఖరీదైన వస్తువులు కొనడం కంటే, ముందునుంచే  కూతురి చదువు కోసం డబ్బు ఖర్చు చేసి విద్యావంతురాలిగా మారిస్తే.. అదే ఆమె భవిష్యత్తుకు గొప్ప బహుమానం అవుతుంది.   ఆర్థిక భద్రత.. నేటి కాలంలో ప్రతి మహిళకు ఆర్థిక అవగాహన చాలా ముఖ్యం. ఆడపిల్లలకు  బ్యాంకింగ్, పెట్టుబడి, బీమా . పొదుపు గురించి సమాచారం ఇవ్వడం ఆమె భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. అందుకోసం, ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా పొదుపు కోసం ధనం  ఉంచుకోవాలి. ఇంటి ఆడపిల్లకు  ఆరోగ్య బీమా చేయించాలి. అలాగే  పెట్టుబడికి సంబంధించిన సమాచారాన్ని తప్పకుండా  తెలపాలి.  అలాగే ఆడపిల్లల  ఆర్థిక ప్రణాళికపై అవగాహన ఉండాలి. ఈ ఆస్తి ఏ కట్నం కన్నా ఎక్కువ విలువైనదిగా ఏదో ఒకరోజు అనుభవం అవుతుంది. ఆత్మవిశ్వాసం.. జీవితంలో చాలాసార్లు మన భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఆత్మవిశ్వాసం, సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యమే అతిపెద్ద బలాలు అవుతాయి.  ఇది ఆడపిల్లలో అభివృద్ది చెందాలి అంటే.. వారి అభిప్రాయాలకు, నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. స్వతంత్రంగా ఆలోచించేలా ఆడపిల్లలను  ప్రోత్సహించాలి.  జీవిత అనుభవాలను వారితో పంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉన్న ఆడపిల్ల  ప్రతి ఛాలెంజ్ ను మరింత మెరుగ్గా ఎదుర్కోగలదు. నడవడిక, విలువలు.. సంస్కృతి అంటే కేవలం సంప్రదాయాలను పాటించడం మాత్రమే కాదు, ఇతరులను గౌరవించడం, నిజాయితీగా, బాధ్యతగా ఉండటం కూడా. ఇది సంబంధాలను బలపరుస్తుంది.  కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. జీవితంలో సమతుల్యత ఏర్పడటానికి సహాయపడుతుంది.  మంచి విలువలు ఉన్న ఆడపిల్లకు  ప్రతిచోటా గౌరవం ఉంటుంది. ఎమోషనల్ సపోర్ట్, నమ్మకం.. పెళ్లి తర్వాత కూడా తన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటారని కూతురు అనుకోవాలి.  ఇలాంటి నమ్మకాన్ని తల్లిదండ్రులే ఆడపిల్లకు కలిగించాలి  ఇది ఆడపిల్లలకు మానసిక బలాన్ని ఇస్తుంది.  ఆడపిల్లలకు  కష్ట సమయాల్లో సపోర్ట్ గా నిలుస్తుంది.  సంబంధాల పట్ల  నమ్మకం కూడా నిలిచి ఉంటుంది.  తల్లిదండ్రుల నమ్మకం, సపోర్ట్  ఉంటే.. ఆడపిల్లలకు వస్తువులు, ఆస్తుల కంటే ఎక్కువ ధైర్యం ఉంటుంది.                               *రూపశ్రీయ
  మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం.  అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే.. ఆర్థిక పరిస్థితి గురించి  ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు.  కొన్నిసార్లు ఇలాంటి  సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని  ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి  దొంగతనం లేదా మోసపోవడానికి  దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం. ఆరోగ్యం, వైద్య సమాచారం.. ఆరోగ్యం,  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది.  తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.   ఉదాహరణకు..  దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు. ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు.. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.  వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే  ఎగతాళి చేయవచ్చు. కాబట్టి,  ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి. రిలేషన్స్, పర్సనల్ లైఫ్.. రిలేషన్స్ గురించి,  వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం  గోప్యతకు భంగం కలిగించవచ్చు.  ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే  ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది.  అంతేకాదు..  బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.                                 *రూపశ్రీ.
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువుగా  కుళ్ళిపోతాయి.  ఇది చాలా మంది ఎదుర్కునే  సాధారణ సమస్య. వాటిని సరిగ్గా నిల్వ చేయడం ద్వారా పాడవకుండా నివారించవచ్చు. అందుకోసం టమాటాలను ఎలా నిల్వ చేయాలి తెలుసుకుంటే.. పచ్చి టమాటాలు.. టమాటా పూర్తిగా పండకపోయినా, ఇంకా కొంచెం గట్టిగా ఉంటే, దానిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవచ్చు. పండని టమాటాలను డైరెక్ట్ సన్ లైట్ కు  దూరంగా ఉంచాలి. పచ్చి గా ఉన్నవి, పూర్తీగా  పండని టమాటాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి  రుచిని కోల్పోయి, సరిగ్గా పండకుండా ఉంటాయి. పండిన టమోటాలు.. టమోటాలు పూర్తిగా పండి, ఎర్రగా ఉంటే, అవి గట్టిగా ఉంటే..  వాటిని గది ఉష్ణోగ్రత వద్ద కౌంటర్‌పై నిల్వ చేయాలి.  ఈ టమోటాలను 1 నుండి 2 రోజుల వరకు ఉపయోగించవచ్చు. టమోటాలను కాడ భాగం కిందికి ఉండేలా నిల్వ చేయాలి. దీనివల్ల కాడ చుట్టూ ఉన్న తేమ బయటకు పోతుంది , అవి త్వరగా వాడిపోకుండా  ఉంటాయి. టమోటాలను ఒకదాని మీద ఒకటి కాకుండా అన్నింటికి పక్కన పక్కన ఉంచి నిల్వ చేయాలి. బాగా పండిన టమోటాలు.. టమోటాలు బాగా పండితే పాడైపోతాయని చాలామంది భయపడతారు. వాటిని రిఫ్రిజిరేటర్‌లోని చల్లదనంలో ఉంచడం వల్ల పండే ప్రక్రియ నెమ్మదిస్తుంది. రిఫ్రిజిరేటర్ నుండి తీసిన వెంటనే టమోటాలను తినకూడదు. అవి గది ఉష్ణోగ్రతకు వచ్చినప్పుడు మాత్రమే తినాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. టమోటాలను కడగకుండా, ఆరబెట్టకుండా ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి. టమోటాలు పండినప్పుడు, అవి ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల, బాగా పండిన టమోటాలను ఎక్కువగా ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి. టమోటాలను అతి చల్లని ఉష్ణోగ్రతలలో నిల్వ చేయడం వాటి రుచిని పాడు చేస్తుంది. దీనివల్ల వాటి తొక్క బలహీనపడి, మరింత త్వరగా పాడైపోతాయి.                                         *రూపశ్రీ.
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం (Magnesium) ఒకటి. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ, గుండె ఆరోగ్యం, ఎముకల బలం, రక్తంలో చక్కెర నియంత్రణ వంటి అనేక కీలక శారీరక ప్రక్రియల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వీడియోలో డాక్టర్ హరిత మెగ్నీషియం లోపం వల్ల కనిపించే ప్రధాన లక్షణాలు, ఆ లోపం శరీరంపై చూపే ప్రభావం గురించి సులభంగా వివరిస్తారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: మెగ్నీషియం అంటే ఏమిటి? మెగ్నీషియం శరీరానికి ఎందుకు అవసరం? మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు కండరాల తిమ్మిర్లు, అలసట, నిద్రలేమి వంటి సమస్యలకు మెగ్నీషియం సంబంధం డయాబెటిస్ ఉన్నవారిలో మెగ్నీషియం ప్రాముఖ్యత ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం ఎలా సహాయపడుతుంది? మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు ఎప్పుడు సప్లిమెంట్లు అవసరం అవుతాయి? మెగ్నీషియం తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు మెగ్నీషియం లోపాన్ని ముందుగానే గుర్తించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. సరైన ఆహారం, జీవనశైలి, వైద్యుల సూచనలతో మెగ్నీషియం స్థాయిని సమతుల్యంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.  తరచుగా ఏమి తినాలి అనే దానిపై చాలా మంది దృష్టి పెడతారు.  నిజానికి ఆరోగ్యం కోసం ఏం తినాలో అనే కాదు..  ఎప్పుడు తినాలనే విషయం  కూడా అంతే ముఖ్యమని  ఆహార నిపుణులు అంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలు పోషకాలతో నిండి ఉండి, పగటిపూట శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి, కానీ వాటిని రాత్రిపూట తింటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఆహార  నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట తప్పుడు ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ, నిద్ర , విశ్రాంతిపై ప్రభావం చూపుతుంది. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు పగటిపూట శరీరానికి మేలు చేస్తాయని  అనుకుంటారు, , కానీ  ఆ ఆహారాలను రాత్రిపూట తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం , నిద్ర సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి, ఉదయం అమృతంలా ఉండి రాత్రికి విషంగా మారే ఆహారాలు ఏమిటో, వాటిని తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుంటే.. పెరుగు.. పెరుగు అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పెరుగులోని ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని కూడా నమ్ముతారు. అయితే, రాత్రిపూట పెరుగు తినడం హానికరం కావచ్చని ఆహార నిపుణులు అంటున్నారు. పెరుగులో ఉండే చలువ చేసే గుణం శ్లేష్మం ఉత్పత్తికి కారణం కావచ్చని, కొంతమందికి కడుపులో గ్యాస్ , బరువుగా ఉన్నట్లు కూడా అనిపించవచ్చని అంటున్నారు. పండ్లు.. పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి , దాదాపు ప్రతిఒక్కరికీ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు.  అయితే పండ్లను  పగటిపూట తినడం ఉత్తమం. రాత్రిపూట పండ్లు తినడం కొంతమందికి వివిధ అనారోగ్య  సమస్యలను కలిగిస్తుంది. పండ్లలో సహజ చక్కెరలు , కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి, నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. కొన్ని సందర్భాల్లో రాత్రిపూట పండ్లు తినడం వల్ల గ్యాస్ , మలబద్ధకం కూడా కలగవచ్చు. చికెన్.. కోడి మాంసం లేదా చికెన్ ను ప్రోటీన్‌కు మంచి మూలంగా చెబుతారు. అయితే అందులో ఉండే ప్రోటీన్‌ను జీర్ణం చేసుకోవడానికి శరీరానికి ఎక్కువ సమయం , శక్తి అవసరం. అందుకే రాత్రిపూట చికెన్  తినడం జీర్ణక్రియ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది, ఇది నిద్రపై ప్రభావం చూపుతుంది. ఒకవేళ  రాత్రిపూట చికెన్  తినాలని అనుకుంటే దానిని పరిమిత పరిమాణంలో , సమతుల్యంగా తినడం మంచిది. ఆయిల్, ఫ్యాట్ ఫుడ్స్.. రాత్రిపూట నూనె, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల, వాటిని విచ్ఛిన్నం చేసి జీర్ణం చేయడానికి జీర్ణవ్యవస్థ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల తగినంత విశ్రాంతి లభించక, నిద్రకు ఆటంకం కలగవచ్చు. అందుకే నిపుణులు రాత్రిపూట కొవ్వు పదార్థాలను తినవద్దని సిఫార్సు చేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్.. ఎండిన పండ్లలో కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెరలు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని ఉదయం పూట తినడం వల్ల శక్తి , పోషణ లభిస్తాయి. అయితే, వాటిని సాయంత్రం ఆలస్యంగా లేదా రాత్రిపూట తినడం వల్ల జీర్ణ సమస్యలు , కడుపులో భారంగా అనిపించడం వంటివి ఎదురవుతాయట, ఎందుకంటే కడుపులోని ఎంజైమ్‌లు డ్రై ప్రూట్స్ ను  సులభంగా విచ్ఛిన్నం చేయలేవు. క్రూసిఫెరస్ కూరగాయలు.. క్రూసిఫెరస్ కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, వీటిలో కార్బోహైడ్రేట్లు , ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిని రాత్రి ఆలస్యంగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ , జీర్ణ సమస్యల ప్రమాదం పెరగవచ్చు. అందువల్ల, ఈ కూరగాయలను పగటిపూట తినడం మంచిది.                                      *రూపశ్రీ.