.webp)
సోషల్ మీడియాలో చిన్మయి శ్రీపాద అడిగే ప్రశ్నలు చెప్పే ఆన్సర్స్ చాలా మందికి నచ్చవు. ఏ విషయం ఉన్నా కడిగి పారేస్తూ ఉంటుంది. ఈ సిస్టంలో ఉన్న లొసుగుల మీద ఫైట్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా కట్నం విషయం గురించి కొంతమంది తనకు డిఎమ్ చేశారని చెప్తూ దానికి ఆన్సర్స్ కూడా ఇచ్చింది. "చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు "ఏంటండీ మీరు కట్నం ఇవ్వాలేదా " అని . "మా కల్చర్ లో కట్నం అస్సలు లేదండి. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గిఫ్ట్స్ కూడా కూడా. ఆడపడుచు కట్నం, బామ్మర్ది కట్నం పక్కింటి ఆంటీకి కట్నం వంటివి ఏమీ కూడా ఇవ్వలేదు. మేము మా సొంత ట్రిప్స్ కి మేమె ఖర్చు పెట్టుకున్నాం. మా పిల్లలను కనడానికి ఐన ఖర్చును రాహుల్ పెట్టుకున్నాడు మా పేరెంట్స్ కాదు.
.webp)
మా పెళ్లి ఖర్చులను నేను రాహుల్ ఇద్దరమే పెట్టుకున్నాం. పెళ్లయ్యాక రాహుల్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను మా అమ్మ దగ్గర ఉండేదాన్ని. దీని గురించి ఎవరూ ఏమీ అన్నారు ఎందుకంటే ఇది నార్మల్ గా అందరూ చేసేదే కాబట్టి. అంటే వివేకవంతులు మీ పేరెంట్స్ ని కలవడానికి పర్మిషన్ తీసుకో అని అనరు. ఒకవేళ అలా అడగాలి అనుకుంటే పురుషులు కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళడానికి అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలి అదే కదా సమానత్వం అంటే ? ఎందుకంటే అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటున్నారు అది న్యూక్లియర్ ఫామిలీ కదా. అబ్బాయిలు వాళ్ళ పేరెంట్స్ దగ్గర వెళ్ళాలి అంటే అమ్మాయి తల్లితండ్రుల పర్మిషన్ తీసుకోవాలి అమ్మాయిలూ కూడా అంతే. ఇద్దరూ ఈక్వల్ గా ఉంటె తప్పు లేదు. ఆత్మగౌరవం ఉన్న ఏ భర్త కూడా తన భార్య డెలివరీకి అయ్యే ఖర్చును మరో వ్యక్తిని చెల్లించమని అడుగుతాడు" అంటూ ఈ సిస్టం మీద చిన్మయి శ్రీపాద గట్టిగానే ప్రశ్నించింది.





