తెలుగుదేశం మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. వర్చువల్ గా జరుగుతున్న  ఈ మహానాడులో  తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్  వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత  జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.   వైసీపీ హయాంలో  పాలనలో తెలుగుదేశం కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, తనపైనే 23 కేసులు పెట్టి వేధించారని, అయినా తాము వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు.  మాట తప్పం.. మడమ తిప్పం  అన్న నినాదంతోనే ముందుకు సాగామన్న లోకేష్. గత వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు, దాడులను ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చకు తాను సిద్ధమన్న ఆయన..  గత ప్రభుత్వ పాలనతో ప్రస్తుత ప్రభుత్వ పనితీరును పోల్చేందుకు ఓపెన్ డిబేట్‌కు రావాలని సవాల్ చేశారు.     ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని లోకేశ్ ప్రశంసించారు. చంద్రబాబులో ఇప్పటికీ యువతరానికి సరిపోయే ఉత్సాహం ఉందనీ, ఆయన జెట్‌ స్పీడ్‌తో పని చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తుండటానికి చంద్రబాబు విజన్ కారణమన్నారు. నేషన్ ఫస్ట్ అనేది టీడీపీ సిద్ధాంతమని చెప్పారు. వైకాపా వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో ఓ కుటుంబం సూసైడ్ చేసుకుంది. ఎంతో మంది బీసీ, ఎస్టీ, మైనారిటీ సోదరులను చంపేశారని గుర్తు చేశారు. బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్‌ను ఏకంగా కిరోసిన్ పోసి చంపేశారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపేసి.. డోర్ డెలివరీ చేసి చరిత్ర మీది అంటూ విమర్శించిన లోకేష్.. గొడ్డలి పార్టీ అంటే వైసీపీకి కోపం వచ్చింది. మాది గూగుల్.. మీది గొడ్డలి. మాది ఫైటర్ జెట్.. మీది ఫ్యాక్షన్. మాది కియా అయితే.. మీది కిడ్నాప్  అంటూ   విమర్శలు గుప్పించారు. టీడీపీ కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలన్న లోకేష్.. మహానాడును కార్యకర్తల పండుగగా అభివర్ణించా3రు.  ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా మహానాడు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతుందన్నారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఓట్ల తొలగింపు అంశంపై తాజాగా ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు, బీజేపీపై ఆయనకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని మరోసారి చాటాయి.  ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన  ఎస్ఐఆర్  కారణంగానే కొన్ని రాష్ట్రాల్లో అధికార పక్షాలు నష్టపోయాయన్న జగన్, ఈ సందర్భంగా కేంద్రంలోని మోడీ సర్కార్ ని  కానీ, బీజేపీని కానీ పన్నెత్తు మాట  అనలేదు. ఎన్నికల ప్రక్రియలో  పెద్ద లోపం జరిగిందని వేలెత్తి చూపిన జగన్.. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని వేలెత్తి చూపడానికి మాత్రం ధైర్యం చేయలేదు.   బుధవారం (మే 27) మీడియాతో మాట్లాడిన జగన్  పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఉదాహరణగా చూపుతూ.. ఎన్నికల సంఘం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల పశ్చిమ బెంగాల్‌లో సుమారు 91 లక్షల ఓట్లు, అలాగే తమిళనాడులో దాదాపు 74 లక్షల ఓట్లు తొలగిపోయాయన్నారు.   ఈ ఓట్ల తొలగింపు కారణంగానే   అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు పరాజయం పాలయ్యాయన్నారు.   పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్   కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన  ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్..  అలాగే..  తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.  దేశంలోని ఎన్నికల నిర్వహణ వ్యవస్థపై, కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై జగన్  తీవ్రమైన ఆరోపణలు చేసిన జగన్..  దీని వెనుక ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దల పాత్రను కనీసం మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు.  సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రతిపక్షాలు కేంద్రంలోని అధికార పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తాయి.. కానీ జగన్ కేవలం ఎన్నికల సంఘం వ్యవస్థాగత లోపాలే ఓట్ల తొలగింపునకు కారణమని విమర్శలు గుప్పించి  చేతులు దులిపేసుకున్నారు.  గత కొంతకాలంగా వైఎస్ జగన్ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో, ముఖ్యంగా ప్రధాని మోదీ నాయకత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన బుధవారం  (మే 27) మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలు బలం చేకూర్చాయి.  కేంద్ర ప్రభుత్వ విధానాలను నేరుగా విమర్శించేందుకు జగన్ సిద్ధంగా లేరని తాజా ప్రెస్ మీట్ మరో సారి నిర్ద్వంద్వంగా నిరూపించింది.  వ్యవస్థలను తప్పుబడుతూనే, కేంద్ర పెద్దలను నొచ్చుకోకుండా మాట్లాడటం జగన్ రాజకీయ శైలిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఆయన రాజకీయ శైలిగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో తన ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశంను తీవ్రంగా విమర్శిస్తూనే.. ఆ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న బీజేపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేసుల భయంతోనే జగన్ బీజేపీకి వంతపాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం: మే 30న కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్!  కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నాయకత్వంలో  మార్పు  చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం (మే 30) నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.   ఢిల్లీ వేదికగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంతర్గత చర్చల అనంతరం అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చడంలో డీకే శివకుమార్   కీలక పాత్ర పోషించారు. నాటి నుంచి ఆయనకు సీఎం పీఠం దక్కుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ, సీనియార్టీ దృష్ట్యా అధిష్టానం సిద్ధరామయ్యకు తొలి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.   ఈ అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా  చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు  రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.  ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ శనివారం (మే30)  ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు  ముహూర్తం కూడా ఖరారైందని అంటున్నారు.  ఇందుకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటనే తరువాయి అని అంటున్నారు.  కర్ణాటకలో గత ఎన్నికల ఫలితాల సమయంలోనే ముఖ్యమంత్రి పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడ్డారు.   ఆ సమయంలో అధిష్టానం ఇద్దరు నేతలను ఒప్పించి అధికార పంపకాల ఫార్ములాను కుదిర్చినట్లు వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే ఇప్పుడు నిర్ణీత కాలపరిమితి ముగియడంతో సిద్ధరామయ్య తప్పుకుని, శివకుమార్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రానున్న రెండు రోజుల్లో ఈ నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన మరియు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.   
ALSO ON TELUGUONE N E W S
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించబోయే 111వ సినిమా (NBK 111) ముంబై నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ కోసం బాలకృష్ణ ఈ వారంలోనే ముంబై వెళ్లనున్నారు. అక్కడ జరగబోయే సుదీర్ఘమైన షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు, భారీ యాక్షన్ సీన్స్ కూడా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక గ్యాంగ్‌స్టర్‌గా సందడి చేయనున్నట్లు సమాచారం. బాలకృష్ణ సరసన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 'భగవంత్ కేసరి' తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. అలాగే, బ్లాక్ బస్టర్ మూవీ 'వీరసింహారెడ్డి' తర్వాత బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న రెండో సినిమా ఇది. ఇద్దరి శైలికి తగినట్లుగా పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.  
టాలీవుడ్‌(Tollywood)లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన ‘పర్సంటేజ్ వివాదం’ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. సినిమా కలెక్షన్ల షేరింగ్ విషయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య తలెత్తిన విభేదాలు పరిశ్రమ భవిష్యత్తుపై కాస్త ఆందోళన కలిగించాయి. అయితే, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగడంతో ఈ వివాదానికి తెరపడింది. ఆయన చేసిన సమన్వయ ప్రయత్నాలు ఫలించడంతో ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఒక అవగాహనకు వచ్చారు. ఈ వివాదానికి సంబంధించి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చిరంజీవిని ప్రత్యేకంగా కలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను, థియేటర్ల నిర్వహణ భారాన్ని వారు చిరంజీవికి వివరించారు. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో వస్తున్న లాభనష్టాల సమీకరణాలను ఆయన ముందు ఉంచారు. ఎగ్జిబిటర్ల బాధలను విన్న చిరంజీవి, పరిశ్రమలో అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఒక కీలక సూచన చేశారు. ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఇచ్చే నివేదికకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని, అప్పుడే పరిశ్రమకు మేలు జరుగుతుందని ఆయన హితవు పలికారు. మెగాస్టార్ సూచనను గౌరవించిన ఎగ్జిబిటర్లు ఆయన నిర్ణయానికి సానుకూలంగా స్పందించారు. ఇందులో భాగంగా ఎగ్జిబిటర్లు కొన్ని కీలకమైన నిర్ణయాలను ప్రకటించారు. జూన్ 30 లోపు రాబోయే రోజుల్లో పెద్ద చిత్రాలను కేవలం ‘రెంటల్ విధానంలోనే’ థియేటర్లలో ప్రదర్శించాలని వారు తీర్మానించారు. అయితే, ఇందులో ఒక ముఖ్యమైన నిబంధనను కూడా చేర్చారు. ఒకవేళ పెద్ద సినిమాల విడుదల సమయంలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులతో టికెట్ రేట్లు పెంచినట్లయితే, ఆ పెంచిన రేట్లకు అనుగుణంగా థియేటర్ రెంట్‌తో పాటు అదనంగా 7.5 శాతం మొత్తాన్ని ఎగ్జిబిటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 30 తర్వాత థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలన్నింటినీ ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ ఇచ్చే తుది నివేదికకు అనుగుణంగానే ప్రదర్శిస్తారు. ఆ కమిటీ సూచించే పర్సంటేజీ విధానాన్ని అందరూ తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయించారు. ఈ సమన్వయ నిర్ణయంతో టాలీవుడ్‌లో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది.  దీని వల్ల ముఖ్యంగా రామ్ చరణ్ 'పెద్ది' (Peddi) సినిమాకు పెద్ద తలనొప్పి తప్పింది. పెద్ది చిత్రాన్ని రెంటల్ విధానంలోనే ప్రదర్శించనున్నారు. ఒకవేళ టికెట్ రేట్లు పెంచితే, రెంట్ తో పాటుగా 7.5% ఎగ్జిబిటర్లకి చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలను మాత్రం, ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ నివేదికకు అనుగుణంగా పర్సంటేజ్ విధానంలో ప్రదర్శించనున్నారు.  
వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ సెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకుడు అజయ్ నాగ్ వి సారథ్యంలో సత్యదేవ్ నటిస్తున్న వినూత్న చిత్రం 'సమవర్తి'. ఇండస్ట్రీలో ఎవరూ పెద్దగా టచ్ చేయని బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'బీహైండ్ ద వుడ్స్' పేరుతో మేకర్స్ విడుదల చేసిన బిహైండ్ ద సీన్స్ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలోనే మొట్టమొదటిసారిగా ఒక సరికొత్త 'ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్'గా ఈ సినిమాను రూపుదిద్దుతుండటం విశేషం. ప్రకృతి నేపథ్యంలో సాగే ఈ సర్వైవల్ కథలో సత్యదేవ్ రోల్ అత్యంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని ఈ ప్రోమో హింట్ ఇస్తోంది. ఈ సినిమా విజువల్స్ చాలా నేచురల్‌గా రావాలనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ గ్రాఫిక్స్ పై కాకుండా రియలిస్టిక్ లొకేషన్స్ పైనే భారం వేసింది. అందుకోసం సౌత్ ఇండియాలోని అత్యంత దట్టమైన సుమారు 7 అడవులలో, ఇప్పటివరకు ఎవరూ వెళ్ళని దాదాపు 42 ప్రత్యేక ప్రదేశాలలో షూటింగ్ జరిపారు. వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, ప్రాణాలకు తెగించి నటీనటులు, టెక్నీషియన్లు పడిన శ్రమ అంతా ఈ మేకింగ్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తన విలక్షణమైన యాక్టింగ్‌తో అలరించే సత్యదేవ్ కెరీర్‌లో ఇదొక మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రంలో దిలీప్ పోతన్, రాజీవ్ కనకాల, గనవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్ వంటి సీనియర్ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం సత్యదేవ్ చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో వస్తున్న 'రావు బహదూర్' లాంటి భారీ ప్రాజెక్ట్ కూడా ఉండటం విశేషం. ప్రస్తుతం విడుదలైన 'సమవర్తి' ప్రోమోపై నెటిజన్లు, సినిమా లవర్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకే చిత్రబృందం ఇంత కష్టపడిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ ఎకోలాజికల్ థ్రిల్లర్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Chiranjeevi once again showcased why many within Telugu cinema consider him the guiding force of the industry as he stepped in to resolve the ongoing Percentage vs Rental issue between producers, exhibitors, and distributors in Andhra Pradesh and Telangana. The issue had intensified after several exhibitors openly objected to the rental system and raised concerns about the Film Chamber’s proposed 18-member committee and the delay in reaching a final decision. As tensions grew and fears of ego clashes increased within the industry, Chiranjeevi reportedly took matters into his own hands and brought all parties together for discussions. According to reports, he met producers, exhibitors, and distributors individually, listened to their concerns, and assured them that he would personally monitor the committee’s progress and ensure that a final resolution is reached by June 30. Until then, the rental system will continue. His intervention has also reportedly cleared the path for the smooth release of Peddi, which was indirectly affected by the uncertainty surrounding the revenue-sharing model. It was also decided that whenever big-budget films receive ticket hikes, exhibitors would receive an additional 7.5% share from the increased revenues.  Industry circles are now appreciating Chiranjeevi for resolving the matter amicably and preventing it from turning into a prolonged industry divide during difficult theatrical times. Well, He did intervene when Peddi came into trouble but he made sure that the problem won't repeat ever too.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual accuracy of the reports. While we do try to do thorough research, some sources could misguide or be untruthful. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నైజాం (తెలంగాణ) ఫిల్మ్ ఛాంబర్ తాజాగా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఈ వివాదానికి ముగింపు పలికేలా అడుగులు వేస్తున్నాయి. టికెట్ ధరల పెంపుదల, థియేటర్ల కమీషన్ల చుట్టూ తిరుగుతున్న ఈ పంచాయితీపై ఇండస్ట్రీ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కొత్తగా వస్తున్న ప్రతిపాదనల ప్రకారం.. భవిష్యత్తులో సినిమాలకు అదనపు టికెట్ ధరల పెంపుదల లభిస్తే, ఆ పెరిగిన రేట్లపై థియేటర్ల యాజమాన్యాలకు 7.5 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వాల నుంచి ఎలాంటి అదనపు రేట్ల పెంపుదలకు అనుమతి రాకపోతే మాత్రం, పాత పద్ధతిలోనే లావాదేవీలు కొనసాగుతాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి, ఒక సమగ్రమైన పరిష్కారాన్ని సూచించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ మరో నెల రోజుల్లో తన తుది నివేదికను సమర్పించనుంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ సినీ మార్కెట్‌లో ఈ పర్సంటేజ్ సమస్య ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఏపీలో థియేటర్ల యాజమాన్యాలతో నిర్మాతల ఒప్పందాలు ఇప్పటికే దాదాపు ఒక కొలిక్కి వచ్చాయి. అక్కడ ఆటోపైలట్ మోడ్‌లో అనుమతులు లభిస్తుండటంతో ఎలాంటి గందరగోళం లేదు. అయితే, నైజాం ఎగ్జిబిటర్ల మధ్య ఉన్న అంతర్గత భేదాభిప్రాయాలను తొలగించి, ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ రూపొందించేందుకు ఎగ్జిబిషన్ రంగానికి చెందిన ముఖ్య పెద్దలు అత్యవసర సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా టాలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలైనప్పుడు టికెట్ ధరల పెంపు అనేది సర్వసాధారణం అయిపోయింది. గతంలో రిలీజైన పలు పాన్ ఇండియా సినిమాలకు కూడా ప్రభుత్వాలు ప్రత్యేక జీవోల ద్వారా రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాయి. ఇప్పుడు రాబోయే పెద్ద సినిమాలకు కూడా ఇదే తరహా అదనపు ధరలు వర్తించే అవకాశం ఉండటంతో, ఈ సరికొత్త పర్సంటేజ్ విధానం వల్ల అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ, ఈ సరికొత్త పర్సంటేజ్ మోడల్ అమలులోకి వస్తే చిన్న సినిమాలు, చిన్న నిర్మాతల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొత్త నిబంధనల వల్ల థియేటర్ల యాజమాన్యాలు ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పెద్ద సినిమాల వైపే మొగ్గు చూపుతాయని, దీనివల్ల మంచి కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలకు థియేటర్లు దొరకడం గగనంగా మారుతుందని సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలు తమ వ్యాపార సమీకరణాలను చక్కబెట్టుకుంటున్న ఈ తరుణంలో, సామాన్య ప్రేక్షకుల జేబులకు చిల్లు పడకుండా ఉండాలని సగటు సినిమా అభిమాని కోరుకుంటున్నాడు. త్వరలో రాబోయే ప్రత్యేక కమిటీ నివేదిక చిన్న సినిమాల భవిష్యత్తును, ప్రేక్షకుల ప్రయోజనాలను ఏ మేరకు కాపాడుతుందో వేచి చూడాలి.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సరైన జోష్‌లో ఉన్నారు. రీసెంట్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా దర్శకుడు బాబీతో తన తదుపరి చిత్రాన్ని కూడా పట్టాలెక్కించారు. ఈ కొత్త ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు ముగించుకుని మరుసటి రోజు నుంచే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాబీ సినిమా అప్‌డేట్స్ చాలా స్పీడ్‌గా వస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే, ఇదే సమయంలో ఎప్పుడో మొదలైన మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వంభర’ పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘బింబిసార’ చిత్రంతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనౌన్స్‌మెంట్ నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో మెగా అభిమానుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. అస్సలు ఈ ప్రాజెక్ట్ ఊసే వినిపించకపోవడంతో ఫ్యాన్స్ దాదాపుగా ఈ సినిమాను మర్చిపోయే పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నిజానికి, ఈ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్ కానుకగా థియేటర్లలోకి తీసుకువస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు వేసవి కాలం ముగిసిపోతున్నా.. కనీసం విడుదల తేదీపై ఎలాంటి అధికారిక స్పష్టత లేదు. సాధారణంగా పెద్ద సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ చాలా ముందుగానే మొదలవుతాయి. కానీ ‘విశ్వంభర’ టీజర్ కానీ, ఫస్ట్ సింగిల్ కానీ, లేదా అసలు సినిమా ఎప్పుడు వస్తుందనే కనీస సమాచారం కానీ చిత్ర యూనిట్ నుంచి రాకపోవడం గమనార్హం. ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు భారీ స్థాయిలో ఉన్నాయి. గ్రాఫిక్స్ వర్క్‌లో ఆలస్యం జరగడం వల్లే సినిమా అనుకున్న సమయానికి ముందుకు రాలేకపోతోందని టాక్ వినిపిస్తోంది. అయితే, కేవలం వీఎఫ్ఎక్స్ కారణమేనా లేక మరేదైనా అంతర్గత కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఇండస్ట్రీలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. మేకర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో సినిమాపై ఉన్న క్రేజ్ మరియు బజ్ క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. మెగాస్టార్‌ను ఒక సరికొత్త సోషియో ఫాంటసీ ప్రపంచంలో చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ నిశ్శబ్దం కాస్త ఇబ్బందిగానే మారింది. రాబోయే రోజుల్లో అయినా యూవీ క్రియేషన్స్ మరియు దర్శకుడు వశిష్ట స్పందించి, సినిమా రిలీజ్ డేట్‌తో పాటు ఒక పవర్‌ఫుల్ టీజర్ అప్‌డేట్‌ను ప్రకటిస్తారేమో చూడాలి. మరి ఈ 'విశ్వంభర' సస్పెన్స్‌కు మేకర్స్ ఎప్పుడు తెరదించుతారో వేచి చూడాల్సిందే.
Mister Middle Class teaser immediately grabs attention with its hilariously relatable premise. Starring Srikanth, Laya, Rajendra Prasad, Sunil, and Ali, this G Nageswara Reddy directorial promises to be a total laugh riot with its unique spin on everyday struggles. The teaser introduces us to a man who handles every crisis—from paying rent and managing hospital bills to dodging people asking for money—with the same default solution: chanting "Govinda, Govinda" to the gods. In one of the most amusing moments, he even prays to a portrait of Lord Ganesha by calling him Govinda.  When corrected by his wife, he nonchalantly replies that to him, every god is Govinda, which even leaves the real Govinda facepalming in heaven. It is a clever, light-hearted take on the typical middle-class mindset where faith is the ultimate stressbuster, and every financial problem is outsourced to the divine.  The casting is spot-on, with veteran actors adding their trademark comic timing. With diamond Rathnababu's sharp dialogues and what looks like a tight, entertaining screenplay, Mister Middle Class seems poised to be a delightful entertainer. It’s exactly the kind of breezy comedy that Telugu audiences love.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual accuracy of the reports. While we do try to do thorough research, some sources could misguide or be untruthful. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్ ఎనర్జిటిక్ అండ్ వర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తాను ఎంతటి ‘రాక్‌స్టార్’ అనేది మరోసారి నిరూపించుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే మనోజ్.. తాజాగా ఒక అనాథ ఆశ్రమంలో సాటి మనుషుల పట్ల చూపిన ఆదరణ, మానవత్వం ఇప్పుడు సినీ వర్గాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. తోటి వారి కష్టాలను చూసి చలించిపోయే మనోజ్ చేసిన ఈ తాజా మంచి పని ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. తాజాగా మంచు మనోజ్ ‘మాతృదేవోభవ ఆశ్రమం’ను సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న, మానసిక వికలాంగుడైన సంతోష్ అనే అనాథ యువకుడిని చూసి మనోజ్ రియాక్ట్ అయ్యారు. స్వయంగా సెలూన్ కుర్చీ వేయించి, ఆ యువకుడికి తానే స్వయంగా హెయిర్ కట్ చేసి, గడ్డం గీసి అద్భుతమైన మేకోవర్ ఇచ్చారు. అనంతరం ఆ యువకుడిని శుభ్రం చేసి, సరికొత్త వస్త్రాలను బహుకరించారు. దీన స్థితిలో ఉన్న ఆ యువకుడు, మనోజ్ చేసిన ఈ ‘రీబర్త్ ఛాలెంజ్’తో ఒక్కసారిగా సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు. ఒక అనాథ యువకుడు సినిమా హీరో రేంజ్‌లో మెరిసిపోవడం చూసి అక్కడి వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. సమాజం ఇంతగా అభివృద్ధి చెందుతున్నా, ఇంకా తోటి మనుషులు రోడ్లపై అనాథలుగా మిగిలిపోవడం తన మనసును తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మానసిక వైకల్యంతో ఉండి బంధువులు వదిలేసిన వారి కోసం త్వరలోనే తన ఆధ్వర్యంలో ఒక భారీ పునరావాస కేంద్రాన్ని నిర్మించబోతున్నట్లు ఒక సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఆశ్రమంలో కొందరు వృద్ధులు, రోగులు సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడటం చూసిన మనోజ్.. వారికి తక్షణమే మంచాలు, కుర్చీలు ఏర్పాటు చేస్తానని నిర్వాహకులకు ప్రామిస్ చేశారు. తమ ఆశ్రమాన్ని సందర్శించి ఇలా సేవ చేసిన మొట్టమొదటి సెలబ్రిటీ మంచు మనోజ్ మాత్రమేనని నిర్వాహకులు కొనియాడారు. ప్రస్తుతం ఈ ‘సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్’ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మనోజ్ చేసిన ఈ గొప్ప ప్రయత్నంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘సినిమాల్లోనే కాదు బ్రదర్.. రియల్ లైఫ్‌లోనూ నువ్వే రియల్ హీరో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. విలక్షణ నటుడిగా ప్రేక్షకులను మెప్పించే మనోజ్.. భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన ప్రాజెక్ట్‌లతో పాటు, త్వరలోనే ప్రారంభించబోయే సామాజిక సేవా ఆశ్రమం ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా  ఎక్కువ సేపు బయట ఉండాల్సి వచ్చినప్పుడు లేదా తీవ్రమైన వేడిలో పని చేస్తున్నప్పుడు, శరీర దుర్వాసన చాలా ఇబ్బంది పెడుతుంది.  చాలా మంది ఖరీదైన డియోడరెంట్లు , పెర్ఫ్యూమ్‌లను ఉపయోగిస్తారు, కానీ వాటి ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. శరీరంలోని బ్యాక్టీరియా చెమటతో కలిసి దుర్వాసనను ఉత్పత్తి చేసినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ ఖర్చు పెట్టకుండా శరీర దుర్వాసనను వదిలించుకోవాలనుకుంటే, కొన్ని ఇంటి చిట్కాలు సహాయపడతాయి.  ఆ సులభమైన ఇంటి చిట్కాలేంటో తెలుసుకుంటే.. వేసవిలో శరీర దుర్వాసన ఎందుకు పెరుగుతుంది? వేసవిలో శరీరానికి ఎక్కువగా చెమట పడుతుంది. ఈ చెమట చర్మంపై ఉండే బ్యాక్టీరియాతో సంపర్కంలోకి వచ్చినప్పుడు, దుర్వాసన వెలువడుతుంది. శరీరాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే లేదా చెమట ఎక్కువసేపు శరీరంపై ఉండిపోతే, శరీర దుర్వాసన సమస్య పెరుగుతుంది. శరీర దుర్వాసన రాకూడదంటే.. స్నానం నీటిలో వీటిని కలపాలి.. నిమ్మరసం.. బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది శరీరానికి తాజా అనుభూతిని కలిగిస్తుంది. చెమట వాసనను తగ్గించవచ్చు ఒక బకెట్ నీటిలో ఒకటి రెండు స్పూన్ల నిమ్మ రసం కలుపుకుని స్నానం చేయడం వల్ల రిఫ్రెషింగ్  అనుభూతి కలుగుతుంది. రోజ్ వాటర్.. గులాబీ నీరు చల్లదనాన్ని, తేలికపాటి సహజ సువాసనను అందిస్తుంది.  స్నానపు నీటిలో 3-4 టీస్పూన్ల రోజ్ వాటర్ కలపాలి.  ఇది చర్మానికి తాజా అనుభూతిని కూడా కలిగిస్తుంది. వేసవిలో శరీర జిగట తగ్గిస్తుంది. బేకింగ్ సోడా.. బేకింగ్ సోడా శరీర దుర్వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది.  అయితే దీన్ని అధిక పరిమాణంలో ఉపయోగించకూడదు.  సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు మాత్రమే వాడాలి. పటిక.. పటికలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి.  ఇది చెమట వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. వేప నీరు.. వేప నీరు చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. దురద , బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది.  వేప ఆకులను ఉడకబెట్టి, ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవచ్చు.                                  *రూపశ్రీ.  
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా.. చాలా పానీయాల తయారీలో కూడా పుదీనాను ఉపయోగిస్తారు. పుదీనా పానీయాల రుచిని పెంచుతుంది. శరీరాన్ని చల్లబరుచుతుంది. అయితే వేడి ఎక్కువగా ఉంటే పుదీనా మొక్క చాలా తొందరగా వాడిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మొక్కకు పచ్చదనాన్ని పెంచడానికి , మొక్క పచ్చగా ఎదగడానికి కొన్నిచిట్కాలు ఉపయోగించవచ్చు. వాటిలో ఎంతో ప్రబావవంతంగా పనిచేసే చిట్కా తెలుసుకుంటే.. పటిక నీరు.. పుదీనా మొక్కకు పటిక నీటిని కలపడం వల్ల మట్టి ఆమ్లంగా మారుతుంది. కుండీలోని మట్టి క్షారంగా మారినప్పుడు, పుదీనా పెరుగుదల కుంటుపడి, ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఇటువంటి పరిస్థితిలో, పటిక నీటిని ఉపయోగించడం మొక్కకు మేలు చేస్తుంది. పటిక నీరు మట్టి  pH స్థాయిని తగ్గిస్తుంది, దీనివల్ల అది పుదీనా మొక్కకు అనుకూలంగా మారి, పోషకాలను మరింత సులభంగా గ్రహించడానికి వీలు కలుగుతుంది. క్రిమినాశకం.. పుదీనా వాసన తరచుగా కీటకాలను దూరంగా ఉంచుతుంది, కానీ కొన్నిసార్లు చీమలు , బూజు దాని వేళ్ళను ఆశించి, మొక్క దెబ్బతినేలా చేస్తాయి. ఈ సమస్యలున్నప్పుడు   మొక్కపై పటిక నీటిని చల్లవచ్చు. పటికలో యాంటీ బాక్టీరియల్  యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, ఇవి మొక్కను కీటకాలు, బూజు , చీమల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగుదల.. కొన్నిసార్లు, మొక్కలకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఆకుల పెరుగుదల మందగిస్తుంది. పటిక నీటిని కలపడం వల్ల ఆకులు పెద్దవిగా, పచ్చగా, , మరింత నిగనిగలాడేలా పెరగడానికి సహాయపడుతుంది. మొక్క  కొమ్మలను చిగురింపజేసి, మరింత దట్టంగా పెరగడం ప్రారంభిస్తుంది. ఎలా వాడాలి? ఒక లీటరు శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో ఒక పటిక ముక్కను వేయాలి. అర టీస్పూన్ పటిక పొడి వచ్చేంత ముక్కను వాడాలి. దానిని 10 నుండి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. . నీరు మరీ చిక్కగా ఉండకూడదు. ఈ పటిక నీటిని పుదీనా వేర్లకు అందేలా  పోయాలి. నీటిని కేవలం మట్టికి మాత్రమే అందించాలి.                                 *రూపశ్రీ.
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే  వారు ఎంతో మంది ఉన్నారు. సాధారణంగా కాలం గడిచేకొద్ది జీవితాలలో  ఎంతో కొంత ఎదుగుదల అనేది ఉండాలి.  అలా ఉండకపోవడానికి కారణాలు ఉన్నాయి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు.. కానీ పేదవాడిగా మరణించడం తప్పు అని ఒక వాక్యం ఉంది.  మనిషి జీవితంలో ఎదగాలని కాలంతో పాటు జీవితాన్ని మెరుగ్గా మార్చుకోవాలని ఈ వాక్యం చెబుతుంది, చాలామంది పేదవాళ్లుగానే మిగిలిపోవడానికి దారితీసే కారణాలు ఏంటో తెలుసుకుంటే.. టీవి, పోన్.. చాలామందికి రోజంతా టీవీ లేదా ఫోన్ చూస్తూ గడిపే అలవాటు ఉంటుంది.  టీవి, ఫోన్ వంటివి మనిషిని వ్యసనపరుడిగా మారుస్తాయి.  టీవిలో ఛానెల్స్ కానీ,  స్మార్ట్ ఫోన్ లో ఎంటర్టైన్మెంట్ యాప్స్ కానీ ఎంత సేపు అయినా అలా మార్చి మార్చి చూస్తుంటారు.  పోన్ లో అయితే స్క్రోల్ చేస్తూ ఉంటే అసలు సమయమే తెలియకుండా గడిచిపోతుంది.   జీవితంలో ఏమీ సాధించకుండా పేదవారిగా ఉండిపోవడానికి టీవి,  స్మార్ట్ ఫోన్ వంటివి ప్రధాన కారణాలు. అలవాట్లు,  అభిరుచులు.. ప్రతి ఒక్కరికి అభిరుచులు, అలవాట్లు అంటూ కొన్ని ఉంటాయి. జీవితంలో ఎదుగుదల ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయినట్టు ఉన్నవారిని గమనిస్తే.. వారికి ఎలాంటి అలవాట్లు,  అభిరుచులు ఉండవు.  అందుకే వారికి జీవితంలో ఎదుగుదల లేకుండా కేవలం ఒకేచోట కూర్చుని కాలక్షేపం చేస్తూ అందులోనే సుఖం అనుభవిస్తూ ఉంటారు. లక్ష్యాలు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం అనేది ఉండాలి.  లక్ష్యం లేని జీవితంలో ఎదుగుదల అనేది అసలు ఉండదు. లక్ష్యం ఉంటే కష్టపడటం,  జ్ఞానాన్ని ఆర్జించడం,  ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండటం వంటివి జరుగుతాయి. కానీ లక్ష్యం లేకపోతే జీవితం ఒకేచోట పాతిన స్ధంభంలా ఉండిపోతుంది. కంఫర్ట్ జోన్.. చాలామందికి సుఖంగా బ్రతకడం ఇష్టం.  ఛాలెంజ్ తీసుకోవాలన్నా, రిస్క్ చేయాలన్నా అస్సలు ఇష్టపడరు. ఉన్న సంతోషం,  ఉన్న సౌకర్యాలు చాల్లే అనుకుంటారు.  కొత్తగా అ ప్రయత్నం చేయాలన్నా అస్సలు సిద్దపడరు. అందుకే కాలం ఎంత గడిచినా అలాంటి వారు పేదవారిగానే ఉండిపోతారు తప్ప ధనవంతులు, గొప్ప వారు కాలేరు. అదృష్టం.. ప్రపంచంలో కష్టం కంటే అదృష్టాన్ని నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. ఏ అదృష్టమో వచ్చి తమను ధనవంతులను చేస్తుందని నమ్ముతూ.. కష్టపడకుండా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అలాగే ఉండిపోతారు. జాతకాలలోనూ, రంగు రాళ్లలోనూ,  గ్రహాల మార్పులోనూ తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్ముతూ ఉంటారు. ఇతరులను నిందించడం.. నన్ను బాగా చదివించి ఉంటే నేను పెద్ద  ఉద్యగం తెచ్చుకునేవాడిని,  నాకు  బాగా డబ్బు ఇచ్చి ఉంటే నేను మంచి వ్యాపారం చేసేవాడిని అని తల్లిదండ్రుల మీద నిందలు వేస్తూ జీవితంలో ఎదగకుండా ఆగిపోయిన వారు చాలామంది ఉంటారు.  తాము ఎదగకపోవడానికి కారణం పక్కవారే అని చెప్పి పేదవారిగానే ఉండిపోతున్న వారే ఎక్కువగా ఉన్నారు. జీవితంలో ఎదగడానికి కష్టపడేవారు చాలా తక్కువ ఉన్నారు.  పైన చెప్పుకున్న విషయాలే.. ఏ మనిషి అయినా పేదవాడిగానే ఉండిపోవడానికి అసలు కారణాలు.                            *రూపశ్రీ.
నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది చేసే అతిపెద్ద తప్పు – ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) మానేయడం. ఆఫీసులకో, కాలేజీలకో వెళ్లే తొందరలోనో.. లేదా బరువు తగ్గిపోతామనే అపోహతోనో చాలా మంది ఉదయపు ఆహారాన్ని పూర్తిగా స్కిప్ చేస్తుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం పక్కన పెడితే.. మీరు మరింత వేగంగా లావెక్కిపోయే (Overweight) ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ప్రముఖ సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ పి. జానకి శ్రీనాథ్.  ప్రత్యేక వీడియోలో ఆమె మాట్లాడూతూ.. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, అది ఊబకాయానికి ఎలా దారితీస్తుందో ఈ VIDEO లో సరళంగా వివరించారు. 1. మెటబాలిజం (జీర్ణక్రియ) నెమ్మదిస్తుంది: రాత్రంతా నిద్రపోవడం వల్ల దాదాపు 8 నుండి 10 గంటల పాటు మన శరీరం ఉపవాసంలో (Fasting) ఉంటుంది. అందుకే ఉదయం తీసుకునే ఆహారాన్ని 'బ్రేక్-ఫాస్ట్' (ఉపవాసాన్ని విరమించడం) అంటారు. ఉదయాన్నే ఆహారం తీసుకోకపోతే, శరీరం ఎనర్జీని ఆదా చేయడం కోసం మెటబాలిజం రేటును తగ్గించేస్తుంది. దీనివల్ల క్యాలరీలు త్వరగా కరగవు. 2. మితిమీరిన ఆకలి – ఓవర్ ఈటింగ్ (Overeating): ఉదయం టిఫిన్ మానేయడం వల్ల మధ్యాహ్న సమయానికి ఆకలి విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల లంచ్ టైమ్‌లో మనకు తెలియకుండానే ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని, ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలను తినేస్తాము. ఈ క్రమంలో శరీరం అవసరానికి మించి క్యాలరీలను స్టోర్ చేసుకుని, కొవ్వుగా మారుస్తుంది. 3. జంక్ ఫుడ్స్ వైపు మొగ్గు: బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవడం వల్ల, ఉదయం 11 గంటల సమయంలో చిప్స్, బిస్కెట్లు, సమోసాలు లేదా టీ/కాఫీ వంటి అన్‌హెల్తీ స్నాక్స్ వైపు మనసు మళ్లుతుంది. ఇవి శరీరంలో కొవ్వును పెంచడానికి ముఖ్య కారణాలు. 4. నీరసం, ఏకాగ్రత లోపించడం: మెదడు సజావుగా పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే రోజంతా నీరసంగా ఉండటంతో పాటు, పనులపై శ్రద్ధ పెట్టడం కష్టమవుతుంది. ఆరోగ్యంగా, స్లిమ్‌గా ఉండాలనుకునే వారు ఉదయం పూట ప్రోటీన్లు, ఫైబర్ (పీచుపదార్థం) ఎక్కువగా ఉండే ఇడ్లీ, ఉప్మా, మొలకెత్తిన గింజలు లేదా ఓట్స్ వంటి పోషకాహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. బరువు తగ్గాలనుకునే వారు డైట్ కంట్రోల్ చేయాల్సింది రాత్రి పూట మాత్రమే, ఉదయం కాదు అని డాక్టర్ జానకి శ్రీనాథ్ స్పష్టం చేశారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పదం నౌతప.. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం.  గత ఒకటి రెండు నెలలుగా వేసవి కాలం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. వడగాలులు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఈ  వడగాలులు మరింత తీవ్రతరం కాబోతున్నాయి. నౌతప ఎంటర్ అయ్యింది. ఇది మే 25న ప్రారంభమై, జూన్ 2వ తేదీ వరకు కొనసాగుతుంది. నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజులలో గ్రహాల స్థానాలు అనుకూలంగా ఉండటం వల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిపై పడతాయట, దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  నౌతప అంటే తొమ్మిది రోజుల పాటు ఉండే ప్రమాదకరమైన వేడి వాతావరణం. నౌతప అనేక విధాలుగా అవసరమైనదనే చెబుతారు. ఇది పొలాల్లోని హానికరమైన కీటకాలను, తెగుళ్లను నాశనం చేసి, పంట నష్టాన్ని నివారిస్తుంది, ఈ తొమ్మిది రోజులు ఆరోగ్య పరంగా చాలా సవాలుగా ఉంటాయి. ఇప్పటికే తీవ్రంగా ఉన్న వేడికి తోడు ఈ తొమ్మిది రోుల  సమయంలో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంది, ఇది వడదెబ్బ , డీహైడ్రేషన్ వంటి సమస్యలను తీవ్రతరం చేస్తుంది. అనేక ప్రాంతాలలో నౌతప సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణంగా 45 డిగ్రీల సెల్సియస్‌ను మించిపోతాయి, ఇది శరీరంలోని అనేక భాగాలపై ప్రమాదకరమైన ప్రభావాలను కలిగిస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో  ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేదే పెద్ద ప్రశ్న. నౌతప సమయంలో అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? తెలుసుకుంటే.. ఆరోగ్య నిపుణుల అబిప్రాయం.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, నౌతప అందరికీ ప్రమాదకరమైనప్పటికీ, పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు,  ముందు నుంచే గుండె మరియు మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక శరీర ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం పెరుగుతుంది, ఇది ప్రాణాంతకం కూడా కావచ్చని వైద్యులు చెబుతున్నారు. వడదెబ్బ , ఎండదెబ్బ, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, అలసట, నిద్ర సమస్యలు , చిరాకును గణనీయంగా పెంచుతాయి. తీవ్రమైన వేడి కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది మరణిస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల కాలం గుండె , మూత్రపిండాల రోగులకు ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. తీవ్రమైన వేడి కారణంగా గుండె దడ , గుండెపోటు వచ్చే ప్రమాదం పెరగవచ్చు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? నౌతప సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీరు , ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం, ఎండకు దూరంగా ఉండటం చాలా అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్నపాటి అజాగ్రత్త కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పిల్లలు, వృద్ధులు , గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే వారి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్థ్యం బలహీనంగా ఉంటుంది. వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లడం మానుకోవాలి. ఈ సమయంలో లేత రంగు దుస్తులు ధరించడం, పుష్కలంగా నీరు త్రాగడం , శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ తొమ్మిది రోజులు ఇవి తప్పనిసరిగా చేయాలి.. వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి దాహం వేయకపోయినా రోజంతా పుష్కలంగా నీరు త్రాగడం చాలా అవసరం. నీటితో పాటు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ , ఓఆర్ఎస్ (ORS) తాగాలి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడటానికి సహాయపడతాయి. తేలికపాటి భోజనం చేయడం ఉత్తమం. పుచ్చకాయ, దోసకాయ, కర్బూజా , పెరుగు వంటి ఆహారాలు శరీరాన్ని చల్లబరచడానికి సహాయపడతాయి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ లేదా టవల్ ఉపయోగించాలి. ఈ తొమ్మిది రోజులు ఏం చేయకూడదు? తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలి, ఖాళీ కడుపుతో బయటకు వెళ్లకూడదు. ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే, శరీరాన్ని పూర్తీగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.  అలాగే గొడుగు వాడాలి. అధికంగా టీ, కాఫీ , మద్యం తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత పెరగవచ్చు. కాబట్టి వాటిని చాలా తగ్గింతాలి. మూసివున్న, వేడి గదిలో ఎక్కువసేపు ఉండటం కూడా ప్రమాదకరం. అధిక జ్వరం, తల తిరగడం, స్పృహ కోల్పోవడం, వాంతులు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే,  వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవి వడదెబ్బకు సంకేతాలు కావచ్చు.                                       *రూపశ్రీ.