ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో హోం మంత్రి మార్పు జరగనుందా?  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే రాష్ట్ర హోంమంత్రిగా  బాధ్యతలు చేపట్టనున్నారా అంటే.. రాజకీయవర్గాలు ఔననే అంటున్నాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటున్నాయి.   అసలీ చర్చకు మూలం ఏమిటంటే.. గత వారం ఒక బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..  రాష్ట్రంలో నేరగాళ్లు చాలా అదృష్టవంతులన్నారు.  తాను రాష్ట్ర హోం మంత్రి కాకపోవడం వల్లే నేరస్థఉలు   స్వేచ్ఛగా తిరుగుతున్నారనీ,   ఒకవేళ తానే గనుక హోం మంత్రిని అయి ఉంటే నేరగాళ్ల ఆటలు సాగేవి కావని పవన్ అన్నారు. పవన్ మాటలు అప్పట్లో తీవ్ర సంచలనం రేపాయి.  ఇక పవన్ వ్యాఖ్యలపై తాజాగా డిప్యూటీ స్పీకర్  రఘురామకృష్ణ రాజు స్పందిస్తూ..  పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఎటువంటి అవగాహన లేకుండా మాట్లాడరనీ, ఆయన తాను హోంమంత్రిని అయితే.. అంటూ పవన్ అన్నారంటూ.. ఆయన  ఆ పదవి చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లేనంటూ రఘురామకృష్ణం రాజు అన్నారు.  దీంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హోంమంత్రిగా పవన్ కల్యాణ్ అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారన్న సమాచారం నేపథ్యంలో హోంమంత్రి మార్పు తథ్యమన్న చర్చ రాజకీయవర్గాలలో మొదలైంది.   పవన్ కళ్యాణ్ హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే..  ఆయన  దూకుడు,  పారదర్శకమైన శైలి కారణంగా రాష్ట్ర శాంతిభద్రతల విభాగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పరిశీలకులు అంటున్నారు.  ఆయన చూపే చొరవ రాష్ట్రంలో నేర నియంత్రణకు నిస్సందేహంగా దోహదపడుతుం దని అంటున్నారు.   హోం శాఖ వంటి అత్యంత సున్నితమైన,  కీలకమైన మంత్రిత్వ శాఖను నిర్వహించడానికి అవసరమైన ఓర్పు పవన్ కు ఉందా అన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జరుగుతోంది.  
  తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్రంలో రాబోయే మూడు నుంచి ఆరు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. చెన్నైలో నిర్వహించిన రాజకీయ కార్యక్రమంలో ఏఐఏడీఎంకే మాజీ మంత్రి బెంజమిన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదని స్టాలిన్ ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సి ఉండగా, అధికార పక్షానికి కేవలం 108 మంది సభ్యుల బలమే ఉందని పేర్కొన్నారు. ఇతర పార్టీల మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీల సహకారంతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉందని అన్నారు. గత కొన్ని నెలలుగా తమిళనాడులో అభివృద్ధి మందగించిందని స్టాలిన్ ఆరోపించారు. శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని, మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దోపిడీలు, పెట్రోల్ బాంబు దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల విషయంలో వెనుకంజ వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రకటన కోసం ఎదురుచూడకుండా, ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి పనిచేయాలని, డీఎంకేను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్టాలిన్ సూచించారు. మరోవైపు, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన తమిళనాడు పాలన నేడు గాడితప్పిందని వ్యాఖ్యానించారు. ప్రజలు తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతుంటే, ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలకే పరిమితమైందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చించే వేదికలుగా కాకుండా, రాజకీయ ప్రదర్శనల వేదికలుగా మారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.  
ఉభయ తెలుగు రాష్ట్రాల  రాజకీయాల్లో  బీఆర్ఎస్, వైసీపీల బంధం గురించి చర్చ బాహాటంగా సాగడం కద్దు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైపీపీ అధినేత జగన్, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుల మధ్య స్నేహం, అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఇరువురు నేతలూ పరస్పరం ప్రశంసలను గుప్పించుకోవడం తెలిసిందే.   తాజాగా   వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు  నిర్వహించిన ఒక భారీ   ర్యాలీలో  బీఆర్ఎస్ గులాబీ జెండాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. కేటీఆర్ పర్యటన వేదిక వద్ద కేటీఆర్, వైఎస్ జగన్ ఇద్దరి చిత్రాలు పక్కపక్కనే ఉన్న కటౌట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.   తెలంగాణ వేదికగా జరిగిన ఈ పొలిటికల్  డెవలప్‌మెంట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఫ్లెక్సీల వెనుక ఉన్న అసలు కథేంటి, దీని వెనుక ఏవైనా పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయా  అన్నది ఇప్పుడు రాజకీయవర్గాలలో  తెగ చర్చనీయాంశంగా మారింది.  సాధారణంగా తెలంగాణ రాజకీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ కి నాయకుల ఫోటోలు లేదా ఫ్లెక్సీలు   చాలా చాలా  అరుదుగా కనిపిస్తుంటాయి.  గతంలో 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సమాఖ్య కూటమి ఏర్పాటు కోసం కేటీఆర్ స్వయంగా హైదరాబాద్‌లో జగన్ తో భేటీ అఅయ్యారు.  అయితే ఆ తర్వాత కాలంలో రెండు పార్టీల మధ్య, అలాగే  కేటీఆర్, జగన్ మధ్య అనుబంధానికి సంబంధించిన వార్తలుపెద్దగా వినిపించలేదు. మధ్యలో అడపాదడపా వైసీపీ బీఆర్ఎస్ అనుబంధం, జగన్, కేటీఆర్ స్నేహం గురించిన ప్రస్తావనలు వచ్చినా, తాజాగా  వికారాబాద్ లో కేటీఆర్ ర్యాలీ జరుగుతున్న సమయంలో జగన్ ఫ్లెక్సీలు కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక పొలిటికల్ స్ట్రాటజీ ఉందన్న ప్రచారం జోరందుకుంది.    ఈ పరిణామంపై తెలంగాణలో కాంగ్రెస్,   ఏపీ తెలుగుదేశం నేతలు తమదైన శైలిలో విమర్శలు, సెటైర్లు గుప్పిస్తున్నారు.  గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్, వైసీపీల మధ్య అంతర్గత అవగాహన ఉందంటూ తాము చేసిన ఆరోపణలకు ఈ ఫ్లెక్సీలు బలమైన నిదర్శనమని అంటున్నారు. మరోవైపు, వికారాబాద్ లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత ఓటర్లను ఆకర్షించేందుకు, వైసీపీ సానుభూతిపరుల మద్దతును కూడగట్టేందుకే ఈ తరహా ఫ్లెక్సీల వ్యూహాన్ని తెరపైకి తెచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
  మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో 'గాడ్ ఆఫ్ వార్' చిత్ర అధికార ప్రకటన నిన్న వచ్చిన విషయం తెలిసిందే. లార్డ్ మురుగన్ (కార్తికేయ) కథాంశంతో, నార్త్ నుండి సౌత్ వరకు విశ్వవ్యాప్తంగా కనెక్ట్ అయ్యేలా భారీ బడ్జెట్‌తో  నిర్మిస్తున్నారు. ఈ మూవీ  ప్రకటన రాకముందు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత నాగవంశీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌ను తమన్ రీపోస్ట్ చేయడంతో, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు తమనే సంగీతం అందిస్తాడనే నమ్మకంతో అందరూ ఉన్నారు. కొన్నాళ్ల క్రితం తమన్ కూడా తను 'గాడ్ ఆఫ్ వార్' చిత్రానికి వర్క్ చేయబోతున్నట్లు పరోక్ష సంకేతాలిచ్చారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ కాంబినేషన్‌కి  ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వచ్చిన 'అల వైకుంఠపురములో', 'అరవింద సమేత వీర రాఘవ', 'గుంటూరు కారం' వంటి సినిమాలు మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా తమన్ అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ త్రివిక్రమ్ సినిమాలని  మరో స్థాయికి తీసుకెళ్లేది. అయితే, ఈ విజయవంతమైన జోడీ మధ్య ఇటీవల కొన్ని ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొదట విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం' సినిమా నుండి తమన్‌ ని  పక్కన పెట్టి, 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్‌ని ఎంపిక చేయడంతో ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాల పుకార్లు షురూ అయ్యాయి. ఆ సమయంలో తమన్ స్వయంగా స్పందిస్తూ, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కేవలం కొత్త టీమ్‌తో ప్రయోగం చేయాలనే ఉద్దేశంతోనే త్రివిక్రమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. Also read: Brigida saga: ప్రియుడ్ని పరిచయం చేసిన పెదకాపు హీరోయిన్.. తెలుగు దర్శకుడు కాదు  కట్ చేస్తే, నిన్న విడుదలైన అధికారిక పోస్టర్‌లో సంగీత దర్శకుడిగా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పేరు ప్రత్యక్షమవడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. 'ఆదర్శ కుటుంబం' సినిమాకు బ్రేక్ ఇచ్చినా, ఎన్టీఆర్ లాంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులో తమన్ ఖచ్చితంగా ఉంటాడని ఆశించిన ఇండస్ట్రీ వర్గాలకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. గతంలో ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'అరవింద సమేత'కు తమన్ అద్భుతమైన ఆల్బమ్, అంతకంటే పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన ట్రాక్ రికార్డ్ ఉంది. అయినప్పటికీ, ఈ మైథలాజికల్ వార్ డ్రామా కోసం త్రివిక్రమ్ అనిరుధ్‌ వైపే మొగ్గు చూపడం వెనుక తెరవెనుక చాలా పెద్ద చర్చలే నడిచినట్లు తెలుస్తోంది. పాన్-ఇండియా మార్కెట్‌లో అనిరుధ్ మ్యూజిక్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్, అలాగే లార్డ్ మురుగన్ బ్యాక్‌డ్రాప్ కథ కావడంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ రీచ్ కోసం మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా రెండు పెద్ద ప్రాజెక్టుల్లో త్రివిక్రమ్ తనను పక్కన పెట్టడం తమన్ కెరీర్‌లో ఒక ఊహించని ట్విస్ట్‌గా మారింది. ముఖ్యంగా తమన్ అభిమానులని  తీవ్ర షాక్ కి గురిచేసింది.    
కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) విలక్షణమైన పాత్రలతో, వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ తనను తాను నిరంతరం కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. తాజాగా ఆయన తన మార్క్ వినోదాల ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తూ సరికొత్త చిత్రంతో ముందుకు వచ్చారు. నరేష్ 65వ చిత్రం (#Naresh65) అధికారిక టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రానికి 'రంభ ఊర్వశి మేనక' (Ramba Oorvasi Menaka) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం నరేష్, దర్శకుడు చంద్ర మోహన్ చింతడతో చేతులు కలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సరికొత్త ఫాంటసీ మరియు అవుట్ అండ్ అవుట్ హిల్లేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు "కామెడీ గోస్ కాస్మిక్" అనే క్రేజీ టాగ్ లైన్ పెట్టారు. మేకర్స్ ప్రామిస్ చేస్తున్నట్లుగా, ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త లోకాన్ని పరిచయం చేస్తూ అద్భుతమైన మలుపులు, మునుపెన్నడూ చూడని నవ్వుల విందును థియేటర్లలో అందించబోతోంది.  అల్లరి నరేష్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఈ పోస్టర్‌లో అల్లరి నరేష్ చేతిలో ఒక పొడవైన స్క్రోల్, పెన్ను పట్టుకుని స్టైలిష్ గ్లాసెస్‌తో స్వర్గపు మెట్లపై కూర్చుని కనిపించారు. ఆ స్క్రోల్‌పై రంభ, ఊర్వశి, మేనక అనే పేర్లు స్పష్టంగా రాసి ఉండగా, ఆయన వెనుక మేఘాల మధ్య దేవకన్యలు (అప్సరసలు) విహరిస్తూ కనిపించడం సినిమాపై ఉన్న కుతూహలాన్ని అమాంతం పెంచేసింది. దేవతా అంశాలు మరియు నరేష్ ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్ మిళితం చేసి డిజైన్ చేసిన ఈ ఫస్ట్ లుక్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ కాస్మిక్ రైడ్‌లో వినోదాన్ని మరింత రెట్టింపు చేయడానికి వెన్నెల కిషోర్, నరేష్ వికె, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. వీరి కాంబినేషన్ థియేటర్లలో నవ్వుల జాతర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.  ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ విజువల్ వండర్‌గా మార్చేందుకు శ్రమిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువల మధ్య రూపుదిద్దుకుంటున్న 'రంభ ఊర్వశి మేనక' చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.   https://x.com/AnnapurnaStdios/status/2071816330341433500
After experimenting with a variety of roles over the last few years, Allari Naresh is returning to the comedy space with Ramba Oorvasi Menaka. The actor, who built his career on successful entertainers before exploring more serious and content-driven films, appears to be revisiting his trademark humorous style with the upcoming release. The makers unveiled the film's first look on Tuesday, offering a glimpse into Naresh's quirky character. The poster shows him constantly writing and thinking about the names Ramba, Oorvasi and Menaka, hinting at a story revolving around the three mythical celestial beauties. Interestingly, the actresses playing these roles have not been revealed yet, with the first look using symbolic idols instead, adding an element of mystery to the project. Directed by Chandra Mohan Chintada, the film is said to blend mythology with comedy, a combination that has already sparked curiosity among moviegoers. The makers are positioning it as a full-fledged entertainer that showcases Allari Naresh's comic timing in a fresh setup. The film is being produced by Razesh Danda and Prasad Nimmakayala, while Annapurna Studios is presenting the project. Ramba Oorvasi Menaka is scheduled to hit theatres on September 4, marking Allari Naresh's return to the genre that earned him a loyal fan following. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
    పెద కాపు ఫేమ్ 'బ్రిగిడా సాగా'  పెళ్లి, డేటింగ్ గురించి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో పలు రూమర్స్ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం ఒక తమిళ దర్శకుడితో పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కి  గురయ్యారు. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ బ్రిగిడా సాగా తన అసలైన ప్రియుడిని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి  పరిచయం చేసింది ప్రముఖ నటుడు, దర్శకుడు ఆనంద్ రామ్‌తో తాను ప్రేమలో ఉన్నట్లుగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వారి అందమైన ప్రేమ ప్రయాణాన్ని వివరిస్తూ 'చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసే అద్భుతమైన ప్రేమకథలు కేవలం వెండితెరకే పరిమితం అనుకునేదాన్ని. కానీ నా  జీవితంలో అంతకంటే అందమైన నిజమైన ప్రేమకథని దేవుడు రాసిపెట్టాడు. ఇండస్ట్రీలో  ప్రయాణం చేస్తున్న సమయంలోనే నా లాంటి కలలు, ఒకే రకమైన ఇష్టాలు ఉన్న ఆనంద్ రామ్‌ని కలుసుకున్నాను. మొదట మా ఇద్దరి మధ్య స్నేహం ప్రారంభమైం ది. ఆ స్నేహమే కాలక్రమేణా ఎంతో బలమైన ప్రేమగా రూపాంతరం చెందింది.  తామిద్దరూ కేవలం 'ఐ లవ్ యూ' చెప్పుకునే సాధారణ జోడీ కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితాంతం తోడుండే ఒక పరిపూర్ణమైన బంధమని ఇనిస్టాలో రాసుకొచ్చింది. 2019లో వచ్చిన తమిళ చిత్రం 'అయోగ్య' ద్వారా బ్రిగిడా సాగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత దళపతి విజయ్ బ్లాక్‌బస్టర్ మూవీ 'మాస్టర్'లోనూ, ఆర్. పార్తీబన్ తెరకెక్కించిన  'ఇరవిన్ నిళల్'లోనూ కీలక రోల్స్  పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. తెలుగులో శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో వచ్చిన 'సింధూరం' చిత్రంలో నక్సలిజం నేపథ్యంలో సాగే లీడ్ రోల్ పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాతనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా 'పెదకాపు-1'లో కథానాయకుడి లవర్ లక్ష్మి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకి  మరింత చేరువైంది. ఇండస్ట్రీలో ఒకానొక దశలో శ్రీకాంత్ అడ్డాల, బ్రిగిడా సాగా డేటింగ్‌లో ఉన్నారంటూ కొన్ని రూమర్స్ కూడా వినిపించాయి, కానీ తాజాగా ఆమె చేసిన పోస్ట్‌తో ఆ వార్తలకు పూర్తిగా తెరపడింది. బ్రిగిడా సాగా మనసు దోచుకున్న ఆనంద్ రామ్ కూడా తమిళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు ఉన్న నటుడే. హిప్ హాప్ ఆది హీరోగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ 'మీసయ్య మురుక్కు' చిత్రంలో ఆనంద్ రామ్ కీలక పాత్రలో నటించాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా రాణిస్తూ మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటున్నాడు. ఇద్దరి ఆలోచనలు, కెరీర్ గోల్స్ ఒకేలా ఉండటంతో వీరి బంధం మరింత స్ట్రాంగ్‌గా మారింది. ఈ స్టార్ కపుల్ తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో కోలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.    
'రాజు వెడ్స్ రాంబాయి' (Raju Weds Rambai) సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అఖిల్ రాజ్ (Akhil Raj) ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాయ్‌పై ఆయన భౌతిక దాడికి దిగినట్లు చూపుతున్న ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక సామాన్య కార్మికుడి పట్ల సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే, ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పొరపాటున రాంగ్ ఆర్డర్‌తో అఖిల్ రాజ్ నివాసానికి పార్సిల్ తీసుకువచ్చాడు. తన పొరపాటును వెంటనే గ్రహించిన సదరు డెలివరీ బాయ్ అక్కడికక్కడే క్షమాపణలు కోరాడు. అయినప్పటికీ హీరో అఖిల్ రాజ్, అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఈ ఘటనను బాధితుడైన డెలివరీ బాయ్ స్వయంగా తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. వైరల్ అవుతున్న ఆ విజువల్స్ ప్రకారం, అపార్ట్‌మెంట్ బిల్డింగ్ మెట్లపై నుంచి కిందకు వస్తున్న డెలివరీ బాయ్ వైపు హీరో కోపంతో దూసుకురావడం, అతనిని కొట్టడానికి ప్రయత్నించడం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న హీరో తల్లిదండ్రులు, కొందరు మహిళలు అఖిల్‌ను వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాత్రం శాంతించకుండా తీవ్ర స్వరంతో మాట్లాడటం వీడియోలో రికార్డ్ అయింది. ఆగ్రహంతో ఊగిపోతూ డెలివరీ బాయ్‌పైకి అఖిల్ దూసుకెళ్తుండగా, అతని తండ్రి అడ్డుకుని ఆపే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, రికార్డ్ చేసిన వీడియోను వెంటనే డిలీట్ చేయాలంటూ అఖిల్ ఆ డెలివరీ బాయ్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. బాధితుడు ఈ దృశ్యాలను చూపిస్తూ నెటిజన్లకు తన ఆవేదనను పంచుకున్నాడు. తాను పొరపాటుకు సారీ చెప్పినా వినకుండా హీరో తనపై పిడిగుద్దులు కురిపించాడని, అంతటితో ఆగకుండా హీరో తల్లి తన ముఖంపై ఉమ్మివేసి తీవ్రంగా అవమానించిందని ఆరోపించాడు. "నేను సారీ చెప్పినా కూడా నన్ను కొట్టడానికి ఎలా వస్తారు?" అంటూ అతను ఆ వీడియోలో ప్రశ్నించాడు. గతేడాది నవంబర్ లో చిన్న సినిమాగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన చిత్రం 'రాజు వెడ్స్ రాంబాయి'. ఈ సినిమా విజయంతో హీరోగా నిలదొక్కుకునేందుకు అఖిల్ రాజ్ శ్రమిస్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నారు. కెరీర్ ఎదుగుతోన్న ఇలాంటి కీలక సమయంలో ఒక చిన్న పొరపాటుకు ఇంత అహంకారపూరితంగా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.  అయితే ఈ వివాదంపై కేవలం డెలివరీ బాయ్ వర్షన్ మాత్రమే బయటకు వచ్చింది. హీరో అఖిల్ రాజ్ లేదా వారి కుటుంబ సభ్యులు అధికారికంగా స్పందిస్తేనే ఈ గొడవకు గల పూర్తి కారణాలు మరియు అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.   https://x.com/Theteluguone/status/2071624402631020544
కొన్ని కాంబినేషన్లు కేవలం రికార్డుల కోసమే కాకుండా, ప్రేక్షకులలో ఒక సరికొత్త ఊహల ప్రపంచాన్ని సృష్టించడానికి పుట్టుకొస్తాయి. అలాంటి ఒక మైలురాయి లాంటి కలయికే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) లది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ఘన విజయం సాధించింది. ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, ఈ క్రేజీ కాంబో మళ్లీ పట్టాలెక్కబోతోందని అధికారిక ప్రకటన రావడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఊగిపోయింది. అయితే ఈసారి త్రివిక్రమ్ కలానికి ఉన్న పదును కేవలం ఒక ఫ్యామిలీ డ్రామాకో లేదా కమర్షియల్ యాక్షన్ కో పరిమితం కావడం లేదు. సరిహద్దులు లేని ఒక భారీ కాన్వాస్ పై, దైవత్వంతో కూడిన ఒక అద్భుతమైన పౌరాణిక యుద్ధగాథను ఆవిష్కరించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదలైన క్షణం నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. యుద్ధభూమి నేపథ్యంలో లార్డ్ మురుగన్ ఆయుధమైన శక్తివంతమైన ఈటె, మానవ డిఎన్ఏ ఆకృతితో ముడిపడి ఉన్న దృశ్యం ప్రేక్షకులలో ఎన్నో సరికొత్త ఆలోచనలను రేకెత్తించింది. తాజాగా అందుతున్న విశ్వసనీయమైన సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏకంగా రెండు విభిన్నమైన, అత్యంత శక్తివంతమైన దైవిక అవతారాలలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. తారక్ ఈ సినిమాలో ఒకేసారి తండ్రి మరియు కొడుకులైన పరమశివుడు (Lord Shiva), అలాగే కుమారస్వామిగా (Lord Muruga) ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. "ద సన్... ద ఫాదర్... ఒన్ ఎటర్నల్ లెగసీ" అనే కాన్సెప్ట్ తో నడిచే ఈ కథాంశం వెండితెరపై ఒక అద్భుతమైన విజువల్ వండర్ గా మారబోతోంది. త్రివిక్రమ్ రాసుకున్న ఈ అద్భుతమైన కథాంశం పాన్-ఇండియా స్థాయిలోనే కాకుండా గ్లోబల్ ఆడియన్స్ ను సైతం ఆకట్టుకునేలా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోనుంది. "ఉత్తరాదిన జన్మించి, మధ్యభారతంలో రూపుదిద్దుకుని, దక్షిణాదిన పూజలందుకుంటున్న దైవం" అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.  ఈ విజువల్ ఎపిక్ కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కళ్యాణ్ రామ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలలో చూపించిన విశ్వరూపాన్ని తలపిస్తూ.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా లార్డ్ శివ, లార్డ్ మురుగన్ పాత్రలలో మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ రెండు దివ్య అవతారాలలో తారక్ వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి!  
బాలీవుడ్ స్టార్ కిడ్, దివంగత అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సౌత్ సినిమా ఇండస్ట్రీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. టాలీవుడ్‌లో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాతో ఘనమైన ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'పెద్ది' (Peddi) సినిమాలోనూ కథానాయికగా అవకాశం దక్కించుకుంది. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌లతో తెలుగులో తన హవా చాటుతున్న జాన్వీ, ఇప్పుడు తాజాగా కోలీవుడ్ (తమిళ చిత్ర పరిశ్రమ) లోకి కూడా అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. ఒకేసారి పెద్ద ప్రాజెక్ట్‌లతో దక్షిణాదిని చుట్టేయాలనే పక్కా ప్లాన్‌తో ఆమె అడుగులు వేస్తోంది. తమిళంలో జాన్వీ కపూర్ ఒక భారీ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సరికొత్త ప్రాజెక్ట్‌కు 'కురత్తి' (Kuratti) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్‌ను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ 'నీలం ప్రొడక్షన్స్' నిర్మించనుంది. సామాజిక అంశాలను, అట్టడుగు వర్గాల కథలను వెండితెరపై ఎంతో అద్భుతంగా ఆవిష్కరించే పా.రంజిత్ బ్యానర్ నుండి వస్తున్న సిరీస్ కావడంతో దీనిపై ఇండస్ట్రీ వర్గాలలోనూ, ప్రేక్షకులలోనూ అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ తమిళ దర్శకుడు సర్గణమ్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. 'కలవాణి', 'నైయాండి' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సర్గణమ్, ఈ ఓటీటీ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఈ కథకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, జాన్వీ కపూర్‌కు కథ బాగా నచ్చడంతో ఆమె వెంటనే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని ఇండస్ట్రీ టాక్. అయితే తెలుగులో జాన్వీ నటించిన 'దేవర' కమర్షియల్‌గా సక్సెస్ సాధించినప్పటికీ, ఆమె నటనపై మరియు పాత్ర నిడివిపై సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వచ్చాయి. నటన పరంగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో మరి తమిళంలో పా.రంజిత్ నిర్మించే ఈ రా అండ్ రస్టిక్ వెబ్ సిరీస్‌తో జాన్వీ కపూర్ ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుంది, విమర్శకుల ప్రశంసలు ఎలా అందుకుంటుంది అనేది ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చగా మారింది. ఓటీటీ ప్రియులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఈ 'కురత్తి' సిరీస్ ఉండబోతోందని సమాచారం.
SS Rajamouli is gearing up for one of the biggest schedules of his upcoming film Varanasi. The filmmaker is reportedly set to commence filming a massive battle sequence from July 7 at a specially constructed set in Hyderabad, with nearly 3,500 junior artists expected to take part in the shoot. Although the sequence is set in Varanasi, the makers have recreated the city's landscape on an elaborate set in Hyderabad. The schedule is said to be one of the most ambitious portions of the film, involving large-scale action choreography, extensive crowd management and elaborate production planning. The update comes after Rajamouli recently revealed that the film's major IMAX-specific action episodes had already been completed. The upcoming schedule is expected to be another key milestone in the production of the much-awaited globe-trotting adventure. Varanasi stars Mahesh Babu in the lead role, with Priyanka Chopra Jonas and Prithviraj Sukumaran playing pivotal characters. Rajamouli has previously described the film as a standalone epic featuring a Ramayana-inspired narrative, making it one of the most anticipated Indian films currently under production. While the makers are yet to officially confirm details of the battle sequence, the reported scale of the shoot has already created excitement among fans. With thousands of junior artists, an elaborate Varanasi set and Rajamouli's trademark vision, the sequence is expected to be one of the biggest highlights of the film. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు.  రిలేషన్ లో ఉండే ఈ పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు ట్రామా బాండింగ్ అనే పదాన్ని లైఫ్ స్టైల్ నిపుణులు వాడుతూ ఉంటారు.  అయితే నేటి కాలంలో మాత్రం ఈ ట్రామా బాండింగ్ అనేది మానసిక భావనగా మారింది.  చాలామంది తమను మానసికంగా ప్రభావితం చేసే బంధాలలో చాలామంది ఉండిపోతారు. కానీ ఇలాంటి బంధాల నుండి బయటపడటం కష్టంగా ఉంటుంది. ఇది మనిషి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం,  ఏదైనా అర్థం చేసుకునే తత్వం మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. బంధాలలో వాస్తవాన్ని గుర్తించి,  సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలంటే ట్రామా బాండింగ్ ను అర్థం చేసుకోవాలి.  అసలు ట్రామా బాండింగ్ అంటే ఏమిటి?  దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎలా ఏర్పడుతుంది? దీన్నుండి ఎలా బయటపడాలి లేదా దీనికి లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?  తెలుసుకుంటే.. ట్రామా బాండింగ్.. ట్రామా బాండింగ్ అనేది ఒక మానసిక పరిస్థితి. దీనిలో ఒక వ్యక్తి, తమకు మానసిక ఒత్తిడి, బాధ లేదా స్థిమితంగా ఉండలేక పోవడం వంటివి  కలిగించే రిలేషన్ కు  ఎమోషన్ గా  అతుక్కుపోయి ఉంటారు. ఈ పరిస్థితిలో ప్రేమ, ఆప్యాయత, ఆపై ఆకస్మిక అవమానం లేదా ఎమోషన్ గా దెబ్బ తినడం  అనే ఒక చక్రం ఉంటుంది. ఇది ఆ వ్యక్తిని చిక్కుకుపోయినట్లుగా, గందరగోళంగా భావించేలా చేస్తుంది. క్రమంగా, వారు దానికి అలవాటుపడి, దాని నుండి బయట పడటం కష్టంగా మారుతుంది. ట్రామా బాండింగ్ ఎలా ఏర్పడుుతంది? ఎమోషనల్ బ్యాలెన్స్ సరిగా లేని  సంబంధాలలో సాధారణంగా ట్రామా బాండింగ్ ఏర్పడుతుంది. ఇది అనేక కారణాల వల్ల సంభవిస్తుంది. వాటిలో కొన్ని.. రిలేషన్ లో  పదేపదే పాజిటివ్, నెగిటివ్ ప్రవర్తన ఉంటుంది.  ఇవి మారుతూఉంటాయి.  కొన్నిసార్లు చాలా  ప్రేమ కనిపిస్తుంది,   మరికొన్నిసార్లు ఉన్నట్టుండి  దూరం  పెరిగినట్టు లేదా అగౌరవం జరిగినట్టు జరుగుతుంది. ఎమోషన్ పరంగా బాగా ఎక్కువై ఇతరుల మీద ఆదారపటం,  భయం, ఒంటరితనం, అభద్రతా భావంతో కూడిన వాతావరణం ఉంటుంది.  ఆత్మగౌరవం క్రమంగా బలహీనపడుతుంది.   భాగస్వామి ద్వారా భావోద్వేగ నియంత్రణ లేదా తారుమారు అవుతుంది. ట్రామా బాండింగ్ సిగ్నల్స్.. ట్రామా బాండింగ్ ను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.    సంబంధాన్ని వదిలిపెట్టలేకపోవడం,   మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తి దగ్గరికి వెళ్లడం లేదా వెళ్లాలని అనిపించడం. ప్రతి సమస్యకు తనను తాను నిందించుకోవడం,  ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళన లేదా మానసికంగా అలసిపోయినట్లు అనిపించడం.  సంబంధంలో ఉన్నప్పటికీ అసంతృప్తిగా , సంతోషంగా లేకపోవడం.  ఇతరులు చెప్పేది పట్టించుకోకుండా, కేవలం ఆ సంబంధంలోనే లీనమై ఉండటం. ఎలా బయట పడాలి.. ట్రామా బాండింగ్‌ను అధిగమించడం అంత సులభం కాదు, కానీ సరైన చర్యలతో అది సాధ్యమేనని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు.    మొదట, పరిస్థితిని అంగీకరించాలి. నమ్మకమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం  మానసిక ఆరోగ్య నిపుణుడు లేదా కౌన్సిలర్ నుండి సహాయం కోరడం మంచిది.  ట్రామా బాండింగ్ లో చిక్కుకున్న  వ్యక్తికి క్రమంగా దూరమవ్వాలని.  ఆత్మగౌరవంతో,  ఆత్మవిశ్వాసంతో  పనిచేయాలి.  తమ కోసం తాము  సురక్షితమైన , సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ట్రామా బాండింగ్ గుర్తించడం ఎందుకు ముఖ్యం.. ట్రామా బాండింగ్ అనేది ఒక తీవ్రమైన భావోద్వేగ పరిస్థితి, ఇది ఒక వ్యక్తి  మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం , జీవిత నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. దీనిని ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా ఆ వ్యక్తి ఆరోగ్యకరమైన , సమతుల్యమైన జీవితం వైపు పయనించగలుగుతారు.                                  *రూపశ్రీ.
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో పెళ్లిలో ఆడపిల్ల తల్లిదండ్రులు కట్నం ఇస్తుంటారు. చాలా కుటుంబాలు కట్నం ఇవ్వడం తమ ప్రతిష్టకు చిహ్నంగా కూడా భావిస్తారు.  కానీ కట్నానికి బదులుగా కొన్ని వస్తువులు ఇవ్వడం వల్ల ఆడపిల్లల జీవితాలు, వారి భవిష్యత్తులో కూడా సురక్షితంగా,  బంగారంలా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. కట్నానికి బదులు ఆడపిల్లకు ఇవ్వాల్సినవి.. విద్య, నైపుణ్యాలు.. విద్యను ప్రపంచంలోనే గొప్ప సంపదగా పరిగణిస్తారు. ఆడపిల్ల  విద్యావంతురాలై, ఏదైనా నైపుణ్యంలో ప్రావీణ్యం సంపాదిస్తే, ఆమె ఏ పరిస్థితిలోనైనా స్వయం సమృద్ధి సాధించగలదు. విద్య ఆడపిల్లలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని  ఇస్తుంది,  ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో నేటి కాలంలో ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఆడపిల్లలను బాగా చదివిస్తే అది వారికి  కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది. పెళ్లి సమయంలో ఖరీదైన వస్తువులు కొనడం కంటే, ముందునుంచే  కూతురి చదువు కోసం డబ్బు ఖర్చు చేసి విద్యావంతురాలిగా మారిస్తే.. అదే ఆమె భవిష్యత్తుకు గొప్ప బహుమానం అవుతుంది.   ఆర్థిక భద్రత.. నేటి కాలంలో ప్రతి మహిళకు ఆర్థిక అవగాహన చాలా ముఖ్యం. ఆడపిల్లలకు  బ్యాంకింగ్, పెట్టుబడి, బీమా . పొదుపు గురించి సమాచారం ఇవ్వడం ఆమె భవిష్యత్తును సురక్షితం చేస్తుంది. అందుకోసం, ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా పొదుపు కోసం ధనం  ఉంచుకోవాలి. ఇంటి ఆడపిల్లకు  ఆరోగ్య బీమా చేయించాలి. అలాగే  పెట్టుబడికి సంబంధించిన సమాచారాన్ని తప్పకుండా  తెలపాలి.  అలాగే ఆడపిల్లల  ఆర్థిక ప్రణాళికపై అవగాహన ఉండాలి. ఈ ఆస్తి ఏ కట్నం కన్నా ఎక్కువ విలువైనదిగా ఏదో ఒకరోజు అనుభవం అవుతుంది. ఆత్మవిశ్వాసం.. జీవితంలో చాలాసార్లు మన భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఆత్మవిశ్వాసం, సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యమే అతిపెద్ద బలాలు అవుతాయి.  ఇది ఆడపిల్లలో అభివృద్ది చెందాలి అంటే.. వారి అభిప్రాయాలకు, నిర్ణయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. స్వతంత్రంగా ఆలోచించేలా ఆడపిల్లలను  ప్రోత్సహించాలి.  జీవిత అనుభవాలను వారితో పంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉన్న ఆడపిల్ల  ప్రతి ఛాలెంజ్ ను మరింత మెరుగ్గా ఎదుర్కోగలదు. నడవడిక, విలువలు.. సంస్కృతి అంటే కేవలం సంప్రదాయాలను పాటించడం మాత్రమే కాదు, ఇతరులను గౌరవించడం, నిజాయితీగా, బాధ్యతగా ఉండటం కూడా. ఇది సంబంధాలను బలపరుస్తుంది.  కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. జీవితంలో సమతుల్యత ఏర్పడటానికి సహాయపడుతుంది.  మంచి విలువలు ఉన్న ఆడపిల్లకు  ప్రతిచోటా గౌరవం ఉంటుంది. ఎమోషనల్ సపోర్ట్, నమ్మకం.. పెళ్లి తర్వాత కూడా తన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తనకు అండగా ఉంటారని కూతురు అనుకోవాలి.  ఇలాంటి నమ్మకాన్ని తల్లిదండ్రులే ఆడపిల్లకు కలిగించాలి  ఇది ఆడపిల్లలకు మానసిక బలాన్ని ఇస్తుంది.  ఆడపిల్లలకు  కష్ట సమయాల్లో సపోర్ట్ గా నిలుస్తుంది.  సంబంధాల పట్ల  నమ్మకం కూడా నిలిచి ఉంటుంది.  తల్లిదండ్రుల నమ్మకం, సపోర్ట్  ఉంటే.. ఆడపిల్లలకు వస్తువులు, ఆస్తుల కంటే ఎక్కువ ధైర్యం ఉంటుంది.                               *రూపశ్రీయ
  మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం.  అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే.. ఆర్థిక పరిస్థితి గురించి  ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు.  కొన్నిసార్లు ఇలాంటి  సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని  ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి  దొంగతనం లేదా మోసపోవడానికి  దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం. ఆరోగ్యం, వైద్య సమాచారం.. ఆరోగ్యం,  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది.  తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.   ఉదాహరణకు..  దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు. ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు.. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.  వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే  ఎగతాళి చేయవచ్చు. కాబట్టి,  ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి. రిలేషన్స్, పర్సనల్ లైఫ్.. రిలేషన్స్ గురించి,  వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం  గోప్యతకు భంగం కలిగించవచ్చు.  ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే  ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది.  అంతేకాదు..  బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.                                 *రూపశ్రీ.
  ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు..  ఇది మాత్రమే కాదు..  రోజంతా  మనసు ఏదో మబ్బుపట్టినట్లుగా అనిపించడం వంటిది కూడా జరుగుతూ ఉంటుంది. చాలామంది దీన్ని పరధ్యానం అనో లేక జీవితంలో ఏదో కోల్పోయినట్టు అంత విరక్తిగా ఉండటం ఎందుకనో..  ఆరోగ్యం బాగాలేదేమో అనో.. ఇలా చాలా రకాలుగా సాకులు, కారణాలు చెప్పుకుని అప్పటికి సైలెంట్ అయిపోతూ ఉంటారు.  అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే.  ఒత్తిడి , ఆందోళన ఈ సమస్యలకు కారణం కావచ్చు. అయితే, ఎప్పుడో ఒకసారి అన్నట్టు కాకుండా.. పదే పదే ఎక్కువగా జరుగుతూ ఉంటే మాత్రం ఆలోచించాల్సిందే అంటున్నారు వైద్యులు. తరచుగా మతిమరుపు, ఏకాగ్రత లోపం , మానసిక అలసట వంటి సమస్యలు బ్రెయిన్ ఫాగ్ యొక్క సంకేతాలుగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి?  ఇది ఆరోగ్యానికి ఎంతవరకు ఇబ్బందిగా మారుతుంది? ఎవరికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? వివరంగా తెలుసుకుంటే.. బ్రెయిన్ ఫాగ్.. బ్రెయిన్ ఫాగ్ ఒక వ్యాధి కానప్పటికీ, ఇది తాత్కాలికంగా ఆలోచించడం, గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం , ఏకాగ్రత వహించడం వంటి మెదడు సామర్థ్యాలను దెబ్బతీసే ఒక పరిస్థితి.  వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత చాలామంది తరచుగా కొద్దికాలం పాటు బ్రెయిన్ ఫాగ్‌ సమస్యను ఎదుర్కుంటారు. వైద్య నివేదికల ప్రకారం, దీర్ఘకాలిక మానసిక అలసట, గందరగోళం , అయోమయం వంటి సమస్యకు 'బ్రెయిన్ ఫాగ్' అనే పదాన్ని ఉపయోగిస్తారు. బ్రెయిన్ ఫాగ్ ఎందుకు వస్తుంది? తరచుగా ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం , శరీరంలో నీటి కొరత వంటి సమస్యల వల్ల ఇది వస్తుంది. చాలా సందర్భాలలో, విటమిన్ లోపం లేదా హార్మోన్ల మార్పులు వంటి అంతర్గత సమస్యల వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ ఏర్పడవచ్చు. థైరాయిడ్, రక్తహీనత, విటమిన్ బి12 లోపం, డిప్రెషన్ వంటి వాటిలో కూడా బ్రెయిన్ ఫాగ్ వంటి సమస్యలు కనిపిస్తాయి, కాబట్టి బ్రెయిన్ ఫాగ్ సమస్య ఉన్నట్టు అనిపిస్తే వైద్యులను సంప్రదించి సమస్య తెలుసుకోవడం ఎంతో మంచిది. బ్రెయిన్ ఫాగ్ ఎలా గుర్తించాలి? బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు వ్యక్తిని బట్టి మారవచ్చు, కానీ కొన్ని సంకేతాలు చాలా సాధారణంగా ఉంటాయి. చిన్న విషయాలు మర్చిపోవడం, ఇతరులతో మాట్లాడే సమయంలో సరైన పదాలు గుర్తుకు రాకపోవడం, పని చేస్తున్నప్పుడు తరచుగా పరధ్యానానికి గురికావడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటం అనేవి సర్వసాధారణమైన లక్షణాలు. కొంతమంది తాము ఇటీవల చదివిన విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, మరికొందరు మీటింగ్స్ లేదా ఇతరులతో మాట్లాడే  సమయంలో విషయాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ లక్షణాలు కొన్ని వారాల పాటు కొనసాగి, రోజువారీ  జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే తప్పకుండా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి. ఇవి కూడా తెలుసుకోవాలి.. మెదడు మొద్దుబారడం  అనేది ఎల్లప్పుడూ మర్చిపోవడానికి లేదా ఏకాగ్రత కోల్పోవడానికి సంకేతం కాదు. ఒత్తిడి లేదా ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల అప్పుడప్పుడు మతిమరుపు రావడం సాధారణమే. అయితే, నిరంతరంగా ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది, మానసిక స్పష్టత లోపంతో పాటు, మతిమరుపు ఎక్కువగా  సంభవిస్తే, దానిని సీరియస్ గా తీసుకోవాలి. బ్రెయిన్ ఫాగ్ , డిమెన్షియా వంటి తీవ్రమైన సమస్యల  లక్షణాలు కూడా చాలా వరకు ఒకేలా ఉంటాయి, కాబట్టి వైద్యుడిని సంప్రదించి సరైన రోగ నిర్ధారణ చేయించుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల  ప్రకారం గర్భధారణ , మెనోపాజ్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు మహిళల్లో బ్రెయిన్ ఫాగ్ వంటి లక్షణాలను కూడా కలుగజేస్తాయి. థైరాయిడ్ వ్యాధి, మధుమేహం, రక్తహీనత , ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.                                     *రూపశ్రీ.
మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో మెగ్నీషియం (Magnesium) ఒకటి. ఇది కండరాల పనితీరు, నరాల వ్యవస్థ, గుండె ఆరోగ్యం, ఎముకల బలం, రక్తంలో చక్కెర నియంత్రణ వంటి అనేక కీలక శారీరక ప్రక్రియల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వీడియోలో డాక్టర్ హరిత మెగ్నీషియం లోపం వల్ల కనిపించే ప్రధాన లక్షణాలు, ఆ లోపం శరీరంపై చూపే ప్రభావం గురించి సులభంగా వివరిస్తారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: మెగ్నీషియం అంటే ఏమిటి? మెగ్నీషియం శరీరానికి ఎందుకు అవసరం? మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు కండరాల తిమ్మిర్లు, అలసట, నిద్రలేమి వంటి సమస్యలకు మెగ్నీషియం సంబంధం డయాబెటిస్ ఉన్నవారిలో మెగ్నీషియం ప్రాముఖ్యత ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం ఎలా సహాయపడుతుంది? మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు ఎప్పుడు సప్లిమెంట్లు అవసరం అవుతాయి? మెగ్నీషియం తీసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు మెగ్నీషియం లోపాన్ని ముందుగానే గుర్తించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. సరైన ఆహారం, జీవనశైలి, వైద్యుల సూచనలతో మెగ్నీషియం స్థాయిని సమతుల్యంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)