బోడుప్పల్ భూ పోరాటం ఉద్రిక్తం.. కల్వకుంట్ల కవిత అరెస్ట్

posted on: Jul 2, 2026 2:21PM

బోడుప్పల్‌లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం చేపట్టిన భూ పోరాటం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్ ) అధినేత్రి  కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారు లను పోలీసులు అరెస్టు చేసి  బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత.. ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని  ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.

"మేము కొత్త డిమాండ్లు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను  అమలు చేయాలని కోరాం. ఉద్యమకారులకు ఇస్తామని చెప్పిన 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరితే రక్తం కళ్ల చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఉద్యమకారులు హామీలు అమలు చేయాలని అడిగినందుకే లాఠీఛార్జ్ చేసి రక్తం చిందేలా కొట్టడం అన్యాయమన్న కవిత..  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.  "కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ్టి నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభదన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రతి రోజూ ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...