పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో  తృణమూల్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదనీ, ఎన్నికలలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆమె ప్రజాదరణ చెక్కు చెదరకుండా నిలిచే ఉందనీ తేలింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలైంది. ఆ ఎన్నికలలో మమతా బెనర్జీ స్వయంగా పరాజయం పాలయ్యారు. అయినా పొలిటికల్ గా ఆమె బలం, పట్టు అలాగే ఉన్నాయి.   తాజాగా పశ్చిమ బెంగాల్ బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్   ఘనవిజయాన్ని సాధించడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ రాజకీయ భవిష్యత్తు మరియు టీఎంసీ   బలంపై  అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో.. తాజాగా జరిగిన  బార్ కౌన్సిల్ ఎన్నికల టీఎంసీ విజయం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపిందనడంలో సందేహం లేదు.   బార్ కౌన్సిల్ ఎన్నికల మొత్తం 23  స్థానాలకు గానూ  తృణమూల్ కాంగ్రెస్  15 స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని చాటింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడంటే మూడు స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది.   లెఫ్ట్ ఫ్రంట్ 3 స్థానాలు,   కాంగ్రెస్ 2 స్థానాలను గెలుచుకున్నాయి.   బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత టీఎంసీ  ప్రభ  కోల్పోయిందన్న విమర్శలకు బార్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు ఒక విధంగా చెక్ పెట్టాయని చెప్పాలి.   Mamata Banerjee, TMC victory, West Bengal Bar Council, Bengal politics, Bar Council election results
తెలుగుదేశం సీనియర్ నాయకుడు వర్ల రామయ్య బుధవారం (ఆగస్టు 19) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్సీగా, ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఏక కాలంలో  చట్టసభలలో ప్రతినిధులుగా ఉన్ననట్లైంది.  రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే పలు  కుటుంబాలు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ జాబితాలోకి ఇప్పుడు  వర్ల కుటుంబం  చేరింది.వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా  పామర్రు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.   వర్ల రామయ్య  తెలుగుదేశంలో  కీలకమైన నాయకుడిగా, విశ్లేషకుడిగా సేవలు అందిస్తున్నారు. గతంలో ఆయన  ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ,   విజయాన్ని అందుకోలేకపోయారు. అయినా  పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా నిలబడి, పార్టీ సిద్ధాంతాలను గట్టిగా వినిపించారు.  ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన  వర్ల రామయ్య  సేవలకు గుర్తింపుగా, పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధతకు ప్రతిఫలంగానూ అధిష్టానం ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక  చేసింది. ఈ నిర్ణయంతో ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి తగిన గౌరవం లభించిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు సభ్యులు ఏకకాలంలో చట్టసభలలో సభ్యులుగా ఉండటం ఇదే ప్రథమం కాదు కానీ, ఇది అరుదుగా జరిగే విషయం.   నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, నాగబాబు,  చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతకాయల విజయ్..  వంటి ఇలా తండ్రీ కొడుకులు ఒకే సమయంలో చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇప్పుడు వర్ల రామయ్య, వర్ల కుమార్ రాజా వారి సరసన చేరారు.    Varla Ramaiah MLC, Varla Kumar Raja Pamarru MLA, AP Politics,  Father MLC Son MLA,  Andhra Pradesh, TeluguOne
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ క్రమశిక్షణ చర్య తీసుకుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆయనను  పార్టీ  నుంచి  సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ   ఆదేశాలు జారీ చేసింది. ఎల్బీ నగర్ లో  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, క్షేత్రస్థాయిలో బలమైన అనుచరవర్గం ఉన్న   సీనియర్ నేతపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్ లో కలకలం సృష్టించింది.  ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలలో విభేదాలు, గ్రూపు తగాదాలు ఇందుకు కారణంగా చెబుతున్నారు. గత కొంత కాలంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి    నియోజకవర్గ స్థాయిలో పార్టీ వ్యవహారాలు, నిర్ణయాల పట్ల  అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తిని పలు సందర్భాలలో బాహాటంగానే వ్యక్త పరిచారు. అంతే కాకుండా పార్టీ నిర్ణయాలను గట్టిగా వ్యతిరేకిస్తూ, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.   కాగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్  తో ఎల్బీ నగర్ కాంగ్రెస్ లో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ప్రభాకర్ రెడ్డి మద్దతుదారులు, అనుచరులు ఆయనపై సస్పెన్షన్ వేటుపై   అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు నాయకులు  నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.   Jakkidi Prabhakar Reddy, LB Nagar Congress, TPCC Suspension, Telangana Congress,  TPCC Disciplinary Committee
ALSO ON TELUGUONE N E W S
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి పూర్ణ, ప్రస్తుతం తన కెరీర్ రెండో ఇన్నింగ్స్‌లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఒకప్పుడు కథానాయికగా విభిన్నమైన పాత్రలతో అలరించిన ఆమె, ఇప్పుడు సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్ల భారీ ప్రాజెక్టులలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గతంలో మహేష్ బాబు కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'గుంటూరు కారం'లో పూర్ణ చేసిన సందడి నెవర్ బిఫోర్ అని చెప్పవచ్చు. ఆ చిత్రంలోని చార్ట్‌బస్టర్ సాంగ్ 'కుర్చీ మడతపెట్టి'లో ఆమె వేసిన ఎనర్జిటిక్ మాస్ మూవ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తక్కువ స్క్రీన్ టైమ్ దక్కినప్పటికీ తన ప్రదర్శనతో సాంగ్‌కు మరింత ఎనర్జీ తీసుకువచ్చారు. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' చిత్రంలోనూ పూర్ణ తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల విడుదలైన 'జైలర్ 2' ఫస్ట్ సింగిల్ ప్రోమోలో పూర్ణ తన డ్యాన్స్ మూవ్స్‌తో విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ ప్రోమో బయటకు వచ్చినప్పటి నుండి సోషల్ మీడియాలో ఆమె ప్రదర్శనపైనే గట్టి చర్చ నడుస్తోంది. ఒకవైపు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మరోవైపు కోలీవుడ్ తలైవర్ రజనీకాంత్.. ఇలా ఇద్దరు అగ్ర కథానాయకుల భారీ ప్రాజెక్టులలో పూర్ణ స్పెషల్ సాంగ్స్ సాధించడం సాధారణ విషయమేమీ కాదు. నిడివి చిన్నదే అయినా, స్క్రీన్ పై కనిపించిన ఆ కొద్ది నిమిషాల్లోనే ప్రేక్షకులలో బలమైన ముద్ర వేసేలా ఆమె ప్లాన్ చేసుకుంటున్న తీరు సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది. 'జైలర్ 2' ప్రోమోలో పూర్ణ ఎంట్రీ సీక్వెన్స్‌ను మేకర్స్ ప్రత్యేకంగా హైలైట్ చేయడంతో ఈ పాటపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పాటలో ఆమె ఎనర్జీ ఈ ట్రాక్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫుల్ సాంగ్ విడుదలైన తర్వాత దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు వెలుగులోకి రానున్నాయి. కేవలం గ్లామరస్ రోల్స్ లేదా లీడ్ క్యారెక్టర్లకే పరిమితం కాకుండా, వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇంపాక్ట్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా పూర్ణ ముందుకు సాగుతున్నారు. స్క్రీన్ టైమ్ కంటే కంటెంట్ అండ్ ఇంపాక్ట్ ముఖ్యమని నిరూపిస్తున్న పూర్ణ రూట్ ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే పూర్తి స్థాయి పాట విడుదల కానుండగా, రజనీకాంత్ మాస్ మేనియాతో పాటు పూర్ణ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఊపేస్తుందో వేచి చూడాలి.
Christopher Nolan’s The Odyssey has officially made box-office history. The epic has crossed $1.34 billion worldwide, overtaking Deadpool & Wolverine to become the highest-grossing R-rated movie of all time. The milestone puts The Odyssey ahead of Deadpool & Wolverine, which finished its theatrical run with around $1.338 billion worldwide in 2024. Nolan’s film has now become the latest R-rated title to break through the billion-dollar mark, following Joker, while Oppenheimer had previously reached $985 million. What makes the achievement more significant is the film’s genre and rating. Unlike the franchise-driven Deadpool & Wolverine, The Odyssey is Christopher Nolan’s ambitious adaptation of Homer’s ancient Greek epic, mounted as a large-scale theatrical event. The film stars Matt Damon, Tom Holland, Anne Hathaway, Robert Pattinson, Zendaya, Lupita Nyong’o and Charlize Theron, with Nolan directing and co-writing the film. The record also marks another major milestone for Nolan at the box office. The Odyssey has now surpassed his previous career-best, The Dark Knight Rises, which grossed about $1.08 billion worldwide. Current box-office projections suggest that the film could continue its run toward the $1.6 billion mark, potentially giving Nolan the biggest commercial success of his career by a considerable margin. Interestingly, The Odyssey has achieved the R-rated record even though Deadpool & Wolverine remains ahead domestically for now. The Marvel film collected roughly $632 million in North America, compared with around $515 million for Nolan’s film, meaning The Odyssey has built its record largely through its international performance. With its $1.34 billion global haul, The Odyssey has gone from being one of 2026’s biggest theatrical bets to becoming a historic box-office success. For Nolan, it is yet another reminder that an original filmmaker-led spectacle can still command enormous audiences worldwide—and this time, with an R rating. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అంతే ప్రశాంతంగా విశ్వనాధ్ అండ్ సన్స్ వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద పెను తుఫాను సృష్టిస్తుంది. సృష్టించడమే కాదు ఫ్యామిలీ సినిమాలు ఈ రోజుల్లో చూడరేమో అనుకునే వాళ్ల కళ్ళు తెరిపించి, అలాంటి వాళ్ళని సైతం రిపీట్ ఆడియెన్స్ గా మార్చేసింది. దీన్ని బట్టి  విశ్వనాధ్ అండ్ సన్స్  సునామి అర్ధం చేసుకోవచ్చు.  తెలుగు ,తమిళ్ తో సహా సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకి పైగా గ్రాస్ ని దాటి 200 కోట్ల క్లబ్ అందుకోవాలని ఆశపడుతోంది. ఆశపడే  హక్కు కూడా తనకి ఉందని ట్రేడ్ సర్కిల్స్ రిపోర్ట్ చెప్తున్నాయి. అయితే  యూఎస్ మార్కెట్ లో  లేటెస్ట్ గా 2 మిలియన్ యూఎస్ డాలర్స్ గ్రాస్ మార్క్ ని దాటేసి అదరగొట్టింది. ఇందులో తెలుగు వెర్షన్ నే అధికంగా ఉండడం విశేషం. ఈ విషయాన్ని యుఎస్ లో రిలీజ్ చేసిన శ్లోకా ఎంటర్ టైన్ మెంట్ అధికారకంగా ప్రకటించింది.      Also Read: తమన్ గొప్ప మనస్సు.. 12 కోట్లతో వృద్ధాశ్రమం నిర్మాణం పెళ్లిపై మంచి అభిప్రాయం లేనినాలుగుపదుల వయసు దాటిన సంజయ్ విశ్వనాథన్ అనే మిలినియర్, తన వంశానికి వారసత్వం కోసం సరోగసి ద్వారా ఒక అబ్బాయిని తెచ్చుకుంటాడు. అందుకు ఫారిన్ కంట్రీ అబ్రాయిడ్ కి చెందిన మ్యాగీ అనే ఇరవైసంవత్సరాల పెళ్లి కానీ అమ్మాయి తన గర్భాన్ని అద్దెకి ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే విశ్వనాధ్ అండ్ సన్స్ .రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా జీవి ప్రకాష్ సంగీతం అందించాడు. నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాణంలో వెంకీ అట్లూరి తెరకెక్కించాడు. Vishwanath And Sons, Suirya, Mamitha Bhaiju    
మలయాళ చిత్రపరిశ్రమ నుంచి వచ్చే క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు డిజిటల్ ఆడియన్స్‌లో ఉండే క్రేజ్ ప్రత్యేకమైనది. విభిన్నమైన కథాంశాలతో ఉత్కంత రేపే కంటెంట్‌ను ఇష్టపడే సినీ ప్రియుల కోసం మరొక ఆసక్తికర చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. స్టార్ హీరో కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'ఉన్మాదం' త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించబోతోంది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న కుంచాకో బోబన్, ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించారు. ఎడిటింగ్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న కిరణ్ దాస్ ఈ సినిమాతో దర్శకుడిగా మారి ఈ చిత్రాన్ని మలిచారు. జులై 31న థియేటర్లలో విడుదలైన ఈ సస్పెన్స్ డ్రామా, త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సోనీ లివ్' (Sony LIV) లో ప్రసారం కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రంలో 'జై భీమ్' ఫేమ్ లిజోమోల్ జోస్ కథానాయికగా నటించి తన నటనతో అలరించారు. అలాగే సిద్ధుఖీ, కృష్ణప్రభ, విశాఖ్ నాయర్, సుధీశ్, కొట్టాయం నజీర్ వంటి బలమైన నటీనటుల తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ముజీబ్ మజీద్ స్వరాలు సమకూర్చగా, జస్టీన్ వర్గీస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను మరింత పెంచిందని ప్రశంసలు దక్కాయి. సినిమా కథాంశానికి వస్తే.. షెల్లీ అనే పోలీస్ ఆఫీసర్ తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తుంటాడు. అయితే అతని అంతరంగంలో ఓ మంచి సినిమా రచయితగా మారాలనే బలమైన ఆకాంక్ష ఉంటుంది. ఈ క్రమంలో ఒక పాత కేసుకు సంబంధించిన ఫైల్ అతని చేతికి చిక్కుతుంది. ఆ కేసులో ఉన్న చిక్కుముడులు, ఊహించని మలుపులు షెల్లీని అమితంగా ఆకట్టుకోవడంతో దాని ఆధారంగానే కథ రాయాలని నిర్ణయించుకుంటాడు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి అనేదే ఈ చిత్ర ముఖ్యాంశం. కుంచాకో బోబన్ గతంలో నటించిన 'అంజామ్ పతిరా' (Anjaam Pathiraa) వంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు దక్షిణాది అంతటా ఘన విజయాన్ని సాధించాయి. ఆ క్రమంలోనే 'ఉన్మాదం' సినిమాపై కూడా ఓటీటీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లను ఆస్వాదించే నెటిజన్లు ఈ సినిమా డిజిటల్ విడుదల కోసం సోషల్ మీడియాలో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. థియేటర్లలో మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించిన ఈ చిత్రం, సోనీ లివ్ ద్వారా డిజిటల్ వీక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
తమన్.. సాంగ్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొడితే ప్రేక్షకుడు తనకి తెలియకుండానే సీట్ లో నుంచి లేచి పూనకంతో డాన్స్ చేస్తాడు. హీరోకి గాని, ప్రతినాయకుడుకి గాని ఇచ్చే  ఎలివేషన్ అయితే నభూతో నభవిష్యత్. కథ, కథనంకి తగ్గ మూడ్ తో బిజిఎమ్ ఇవ్వడంలో కూడా స్పెషలిస్ట్.    తమన్  రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'సమాజంలో ఆదరణ కరువై అనాథలుగా మారుతున్న వృద్ధుల కోసం ఒక అత్యాధునిక ఓల్డ్ ఏజ్ హోమ్‌  నిర్మిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం 12 కోట్లు. ఇప్పటికే  4 కోట్లు  ఖర్చు చేశాను. సినిమాల ద్వారా వచ్చే రెమ్యునరేషన్‌ మాత్రమే కాకుండా విదేశీ, స్వదేశీ మ్యూజిక్ కాన్సర్ట్స్  ద్వారా వచ్చే ఆదాయాన్ని సంపూర్ణంగా ఈ వృద్ధాశ్రమ నిర్మాణానికే కేటాయిస్తున్నానని చెప్పుకొచ్చాడు. చాలా మంది ఈ మంచి కార్యక్రమానికి విరాళాలు ఇస్తామని ముందుకు వచ్చినప్పటికీ, తమన్  ప్రేమగా తిరస్కరించడం విశేషం. సొంత కష్టార్జితంతోనే ఈ కలల ప్రాజెక్టును పూర్తి చేయాలని  దృఢ సంకల్పంతో ఉన్నారు. కేవలం వృద్ధాశ్రమమే కాకుండా, పేద విద్యార్థుల చదువులకు సహాయం చేయడం, అత్యవసర వైద్య శస్త్రచికిత్సలకు ఆర్థిక సాయం అందించడం వంటి ఎన్నో గుప్తదానాలను తమన్ ఏళ్ల తరబడి చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక టీమ్‌ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. రీల్ హీరోగానే కాకుండా రియల్ లైఫ్‌లోనూ తోటివారికి సహాయపడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్న తమన్ మానవత్వానికి సినీ ప్రముఖులు మరియు అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. Also Read: ఇరుముడి మూవీ ఫస్ట్ రివ్యూ.. మాస్ మహారాజా హిట్ కొట్టబోతున్నాడా! కేవలం తన అద్భుతమైన మ్యూజిక్‌తోనే కాకుండా, తన ఉదార స్వభావంతో కూడా లక్షలాది మంది అభిమానుల హృదయాలని గెలుచుకుంటున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఎన్నో కష్టనష్టాల నడుమ గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగిన ఆయన జీవిత ప్రయాణం అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. అయితే సమాజం నుంచి తాను పొందిన ఆదరాభిమానాలను తిరిగి సమాజానికే అందించాలనే ఆలోచన అనేది నిజంగా అభినందనీయం.  Thaman, Old Age Home, Tollywood
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన విజువల్ వండర్ 'మిరాయ్' అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. జపాన్‌లో డే-1 అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'బాహుబలి 2' రికార్డులను బ్రేక్ చేస్తూ టాప్-7 స్థానంలో నిలిచింది. 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకొని రికార్డులు క్రియేట్ చేసిన తేజ సజ్జా, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడు. జపాన్‌లో డే-1 అడ్వాన్స్ బుకింగ్స్ లో అత్యధిక టికెట్లు అమ్ముడైన టాప్ 10 భారతీయ సినిమాల లిస్ట్‌లో 'మిరాయ్' ఏకంగా 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది. విచిత్రం ఏంటంటే.. 'బాహుబలి 2', 'టైగర్ జిందా హై', 'ధురంధర్ 2' వంటి భారీ చిత్రాల డే-1 బుకింగ్ రికార్డులను మిరాయ్ అధిగమించేసింది. RRR, ముత్తు, పుష్ప 2, దేవర, సలార్ వంటి బిగ్ స్టార్స్ ప్రాజెక్ట్స్ తర్వాత.. ఒక యంగ్ హీరో నటించిన సినిమా ఈ స్థాయిలో జపాన్ లో ట్రెండ్ అవ్వడం చూసి ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఇంకా రిలీజ్‌కు ముందే ఈ రేంజ్ రెస్పాన్స్ ఉందంటే.. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక బాక్సాఫీస్ నంబర్స్ విషయానికి వస్తే.. 'మిరాయ్' ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు జపాన్ కలెక్షన్స్ తో ఆ నెంబర్ పెరగనుంది. అసలు జపాన్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎందుకు అంతగా కనెక్ట్ అయ్యిందో తెలుసా? కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కాన్సెప్ట్ అలాంటిది. చక్రవర్తి అశోకుడు, అలాగే కళింగ యుద్ధం తర్వాత దాచిన తొమ్మిది పవిత్ర గ్రంథాల వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంతో ఈ కథ నడుస్తుంది. ఆ పవిత్ర గ్రంథాలను కాపాడే 'సూపర్ యోధ'గా తేజ సజ్జా నటిస్తే.. ఆ గ్రంథాల ద్వారా అమరత్వాన్ని పొందాలని చూసే 'బ్లాక్ స్వోర్డ్' రోల్‌లో మంచు మనోజ్ విలన్‌గా పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ హై-వోల్టేజ్ విజువల్ స్పెక్టాకిల్, పవర్ పుల్ మైథలాజికల్ యాక్షన్ కాన్సెప్ట్ జపనీస్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకుంటోంది.         Mirai Japan Release, Mirai Movie, Teja Sajja, Manchu Manoj  
కోలీవుడ్ మాస్ యాక్షన్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'మకుటం' డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. థియేటర్లలో తనదైన మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, ఇప్పుడు బుల్లితెర వీక్షకులను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి రాబోతోంది. మాస్, యాక్షన్ తో పాటు విపరీతమైన ఎమోషన్స్ నింపడంలో విశాల్ నైపుణ్యం ప్రత్యేకమైనది. తమిళంతో పాటు తెలుగునాట కూడా ఆయన సినిమాలకు విశేష ఆదరణ లభిస్తుంటుంది. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, సెప్టెంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు మరో విశేషం ఏమిటంటే.. విశాల్ స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా, ఇందులో ఆయన తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. కథానాయికలుగా అంజలి, దుషారా విజయన్ నటించగా, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. కథ విషయానికి వస్తే.. కృపాకర్ అనే సాదాసీదా ఉద్యోగి తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. సరదాగా విహారయాత్రకు వెళ్లిన సమయంలో అనుకోకుండా ఒక రౌడీ ముఠా అతని కారుపై దాడి చేస్తుంది. ఈ ప్రమాదంలో భార్యాపిల్లలను కోల్పోయిన కృపాకర్, ఆ దుండగులపై ఎలా పగ తీర్చుకున్నాడు? ఆ గ్యాంగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అనే ఆసక్తికర అంశాలతో ఈ రివెంజ్‌ డ్రామా తెరకెక్కింది. విశాల్ కి గతంలో 'పందెం కోడి', 'అభిమన్యుడు', 'మార్క్ ఆంటోని' వంటి విలక్షణమైన యాక్షన్ చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్ లభించింది. అదే తరహాలో 'మకుటం'లో ఆయన చూపించిన వైవిధ్యమైన నటనకు, ముఖ్యంగా తండ్రీ కొడుకుల పాత్రల నడుమ ఉన్న వ్యత్యాసానికి ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. ఈ సినిమా డిజిటల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో మాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ మిస్సయిన యాక్షన్ లవర్స్ ఈ సినిమా కోసం అమెజాన్ ప్రైమ్‌లో ఎదురుచూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి థియేటర్లలో అలరించిన ఈ యాక్షన్ డ్రామా, సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీ వేదికగా డిజిటల్ ఆడియన్స్‌ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో వేచి చూడాలి.
    మాస్ మహారాజా రవితేజ రేపు ఉదయం ఎనిమిది గంటల ఆట నుంచి ఇరుముడితో వరల్డ్ సెల్యులాయిడ్ పై సందడి చేయనున్నాడు. సాంగ్స్ తో పాటు ప్రచార చిత్రాలు పాజిటివ్ గా ఉండటంతో అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఇరుముడి వీక్షించడానికీ థియేటర్స్ దగ్గర బారులు తీరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.      ఈ చిత్రం ఇప్పటికే తన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి  U/A 16+ సర్టిఫికెట్ లభించగా, రన్‌టైమ్  2 గంటల 25 నిమిషాలు. సెన్సార్ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ రివ్యూ టాక్ ప్రకారం,  రవితేజ కెరీర్‌లోనే ఒక అద్భుతమైన ఎమోషనల్ అండ్ పవర్ ప్యాక్డ్ కంబ్యాక్ మూవీగా నిలవబోతోంది.  ఈ కథలో రవితేజ "త్రినాథ్" అనే ఆటో డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు. మొదట్లో మద్యానికి విపరీతంగా బానిసైన నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తిగా రవితేజ నటన మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుంది. తన భార్య (ప్రియా భవానీ శంకర్), ముద్దుల కూతురు మణెమ్మ (బేబీ నక్షత్ర)లతో సాధారణ జీవితం గడుపుతున్న క్రమంలో, కూతురి కోరిక మేరకు ఆయన అయ్యప్ప మాల ధరిస్తారు. మద్యానికి బానిసైన ఒక తండ్రి అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాత అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పులు వచ్చాయి, నిష్టగా మాల ఎలా కొనసాగించాడు అనేది సినిమాకు ప్రధాన హైలైట్‌గా మారనుంది.  అంతేకాకుండా, ఊరిలో ఆడపిల్లలకు ముప్పు తలపెడుతున్న ఒక క్రైమ్ సస్పెన్స్ డ్రామాను దర్శకుడు శివ నిర్వాణ ఈ తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌కు అద్భుతంగా ముడిపెట్టారు. తన కూతురితో పాటు గ్రామంలోని మహిళల రక్షణ కోసం అయ్యప్ప దీక్షలో ఉన్న త్రినాథ్ ఏ విధంగా పోరాడాడు అనే అంశం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయం.  Also Read: లెజండ్రీ డైరెక్టర్ తో వరుణ్ తేజ్ రొమాంటిక్ మూవీ.. బాక్స్ బద్దలే మాస్ యాక్షన్‌కి  తోడుగా భక్తి రసం, తండ్రీ కూతుళ్ల మధ్యన సాగే ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.  సాంకేతిక విభాగంలో జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, ముఖ్యంగా అయ్యప్ప స్వామి "ఇరుముడి కట్టు" పాటలు మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  ప్రధాన బలంగా నిలిచాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలకి తోడు, సాయి కుమార్, అజయ్ ఘోష్, స్వసిక నటన సినిమాను తదుపరి స్థాయికి తీసుకెళ్లాయి. మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ మరియు 145 నిమిషాల క్రిస్పీ రన్‌టైమ్‌తో "ఇరుముడి" ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ అభిమానులకు పండగ వాతావరణం తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. నిన్ను కోరి, మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకుడు. Irumudi, Raviteja, Shiva Nirvana, priya Bhavani Shankar  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఫౌజి, స్పిరిట్, కల్కి-2.. ఇలా ఆయన లైనప్ లో ఉన్న ప్రతి ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా సోషల్ మీడియాలో, అలాగే కొన్ని బాలీవుడ్ సైట్స్ లో ఒక షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అయ్యింది. అదేంటంటే.. 'ఆదిపురుష్' లాంటి డిజాస్టర్ తీసిన డైరెక్టర్ ఓం రౌత్‌తో ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఒక మిస్టీరియస్ జంగిల్ జర్నీ నేపధ్యంలో ఓం రౌత్ ఒక కథ చెప్పారని, ఆ లైన్ నచ్చడంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫైనల్ స్క్రిప్ట్ తో రమ్మని చెప్పారని బాలీవుడ్‌లో గట్టిగా ప్రచారం జరిగింది. నిజానికి ఆదిపురుష్ సినిమా రిలీజ్ తర్వాత ఓం రౌత్ ఏ రేంజ్‌లో ట్రోల్ అయ్యాడో మనందరికీ తెలిసిందే. గ్రాఫిక్స్ నుంచి నటీనటుల లుక్స్ వరకు ప్రతి విషయంలోనూ విమర్శలు ఎదుర్కొన్నారు. అలాంటి దర్శకుడికి ప్రభాస్ మళ్ళీ ఛాన్స్ ఇస్తాడా అని అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ కి రిలీఫ్ ఇచ్చే బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ ప్రచారంపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ఓం రౌత్‌తో ప్రభాస్ కొత్త సినిమా అంటూ వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ప్రభాస్ టీమ్ స్పష్టం చేసింది.      Prabhas, Om Raut, Adipurush
  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన సోలో విజయం కాబట్టి  కనకరాజు మూడ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వరుణ్   మాట్లాడుతు ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ ని కోరుకుంటున్నారనే విషయం బాగా అర్థమైందని చెప్పుకొచ్చాడంటే తన అప్ కమింగ్ సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలతో ఉండబోతున్నాడో తెలుస్తుంది.   వరుణ్ తేజ్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే తన సోదరి నీహారిక నిర్మాణ సారధ్యంలో కమిటి కర్రోళ్ళు డైరెక్టర్ తో   'బరి' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన లిస్ట్ లో తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్ సృష్టించిన స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో ఓ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతుంది. ఇటీవలే "కొరియన్ కనకరాజు" చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకని పూర్తి జోరు మీదున్న వరుణ్ తేజ్, తన తదుపరి సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రొటీన్ మాస్, యాక్షన్ సినిమాల బాటలో వెళ్లకుండా, కథాంశంలో వైవిధ్యం ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తూ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే  కార్తీక్ సుబ్బరాజ్‌తో కలిసి ఓ విభిన్నమైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. సాధారణంగా ప్రేమకథలంటే ఒకే రకమైన మూస ధోరణిలో, రెగ్యులర్ ఎమోషన్స్‌తో సాగుతుంటాయి. కానీ, ఈ సినిమా మాత్రం దానికి నూటికి నూరు శాతం భిన్నంగా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తన ప్రస్తుత వయస్సుకు, మెచ్యూరిటీకి సరిగ్గా సరిపోయే ఒక పరిణతి చెందిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కనుందని వరుణ్ తేజ్ స్వయంగా వెల్లడించారు. ఇది రొటీన్ లవ్ స్టోరీలా కాకుండా, ప్రేక్షకులు అస్సలు ఊహించని కొత్త కోణంలో సాగుతుందని, కథనంలో ఉండే వినూత్న ట్విస్టులు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ స్టైల్ మరియు వరుణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే వెండితెరపై ఒక సరికొత్త మ్యాజిక్ క్రియేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. Also Read: సీనియర్ నటీమణి షావుకారు జానకి తీవ్ర అస్వస్థత.. వెంటిలెటర్ పై చికిత్స పిజ్జా, జిగర్తండ, పేట, మహాత్మా వంటి సూపర్ హిట్ సినిమాలతో తన మార్క్ చూపించిన కార్తీక్ సుబ్బరాజ్, మొదటి నుంచి డిఫరెంట్ మేకింగ్‌తో ప్రసిద్ధి చెందారు. ఇండియన్ సినిమాలో ఎస్‌.ఎస్‌. రాజమౌళి, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, సుకుమార్, వెట్రిమారన్ వంటి దిగ్గజ దర్శకుల జాబితాలో కార్తీక్ సుబ్బరాజ్ పేరు కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆయన కథ చెప్పే విధానం, పాత్రల చిత్రణ, విజువల్స్ నిలిపే శైలి ఎంతో ప్రత్యేకం. అలాంటి మైండ్ బ్లోయింగ్ మేకర్, వరుణ్ తేజ్ వంటి వైవిధ్యమైన నటుడితో ఓ లవ్ స్టోరీ చేయడం టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. Varun Tej, Karthik Subbaraj, Tollywood    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                  *రూపశ్రీ.  
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                                                                                                                                   *రూపశ్రీ.
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి.  అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.  కొందరు నిదానంగా తింటారు.  మరికొందరు చాలా వేగంగా తింటారు.  అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు.  కుటుంబ సభ్యులు అయినా,  స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు.  వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్  చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం  కాకుండా ఆ తరువాత  సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట.   స్ట్రాంగ్ ప్రాక్టీస్  ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం  కంటే తినడాన్ని కూడా ఒక  పనిగా భావిస్తారని అంటున్నారు.  తినే వేగాన్ని బట్టి వ్యక్తిత్వం లక్షణాలను,  తినే వేగానికి,  వ్యక్తిత్వానికి మధ్య గల సంబంధాలను వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు కనుక్కున్నారు. వేగంగా తినేవారు తరచుగా వేచి ఉండటానికి ఇష్టపడరు. ఇది క్యూలలో నిలబడినా, నెమ్మదిగా మీటింగ్స్  లో ఉన్నా లేదా ఆహారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చినా.. ఇలా అన్ని సందర్బాలలో వారు అన్ని వేగంగానే జరగాలని కోరుకుంటారట.  అన్ని విషయాలలోనూ సహజంగా వేగాన్ని వీరు ఇష్టపడతారట. ఈ ధోరణి భోజన చేయడం వరకు తీసుకువెళుతుందట.  చాలామందిలో తినే స్వభావం మానసిక , పర్యావరణ కారకాల ద్వారా ఏర్పడతాయని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.   వేగంగా తినే వ్యక్తులలో ఇతర పనులను కూడా వేగంగా పూర్తీ చేసే సామర్థ్యం ఉంటుందట. వర్తమానంతో పూర్తీగా నిమగ్నమవడానికి బదులుగా  తరువాత ఏమి జరుగుతుందో  అనే విషయం పై దృష్టి పెట్టేలా చేస్తుందట.  ఈ కారణంగా వీరికి భవిష్యత్తు గురించి స్పష్టమైన అంచనాలు, ప్రణాళికలు కూడా ఉంటాయట. అలాగని వేగంగా తినడాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే.. వేగంగా తినడం అనేది ఆహారం సరిగా నమలకపోవడం, తినే ఆహారం మీద దృష్టి పెట్టలేకపోవడం,  ఆహారం అతిగా తినడం.. ఇలా చాలా సమస్యలకు కారణం అవుతుంది.                                                                                                                                                   *రూపశ్రీ.  
  మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు ఒకప్పుడు 60–70 ఏళ్ల వయసులో ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు 40లలో ఉన్నవారిలో కూడా మోకాళ్ల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరికి చిన్న వయసులోనే Knee Replacement అవసరమయ్యే పరిస్థితి ఎందుకు వస్తోంది? ఈ సమస్యలకు సరైన వ్యాయామం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం, Vitamin D, Vitamin B12 లోపం వంటి కారణాలు ఎంతవరకు ప్రభావం చూపుతాయి? ఎముకలు, కీళ్లు, మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో Dr. Anvesh Reddy (MS Ortho) మోకాళ్లు, కీళ్లు, ఎముకల ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అలాగే Vitamin D, Vitamin B12 లభించే ఆహారాలు, రోజువారీ జీవితంలో పాటించాల్సిన వ్యాయామాలు, మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తున్నారు. 40 ఏళ్లలోనే మోకాళ్ల సమస్యలు ఎందుకు వస్తున్నాయి? Vitamin D, B12 లోపం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఏ ఆహారాల్లో ఈ విటమిన్లు లభిస్తాయి? మోకాళ్ల ఆరోగ్యం కోసం ఎలాంటి వ్యాయామాలు చేయాలి? వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.  గమనిక: మోకాళ్ల నొప్పులు లేదా ఇతర కీళ్ల సమస్యలు ఉంటే స్వయంగా చికిత్స చేసుకోకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటారు.  అయితే  రోజూ రెండు ఉడికించిన గుడ్లు తినడం  మంచిదేనా? ఫిట్‌నెస్ ట్రైనింగ్ లో ఉన్నవారు,  పోషకాహార లోపంతో ఉన్నవారు ప్రతిరోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు.  రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. గుడ్లలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో , బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే ఎముకల బలానికి కావలసినంత కాల్షియం,  విటమిన్-డి పొందవచ్చు. మెదడు ఆరోగ్యానికి.. గుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరు,  జ్ఞాపకశక్తికి చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే.. అది మెదడు  చురుగ్గా ఉండటానికి,  మెదడు  ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,  అలాగే నరాల పనితీరును  కూడా మెరుగ్గా ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి.. గుడ్లలో ల్యూటిన్ , జీక్సాంథిన్ ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుండి కళ్ళను రక్షించే యాంటీఆక్సిడెంట్లు.  మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారంతో పాటు మితంగా గుడ్లు తినడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కు మంచిది.. రెండు ఉడికించిన గుడ్లు సుమారు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తు , కడుపు నిండిన ఫీలింగ్ ఇవవ్డంలో సహాయపడతాయి. ఫిట్‌నెస్ ప్రియులకు , లీన్ కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బరువు నిర్వహణకు.. గుడ్లలో అధిక ప్రోటీన్ , తక్కువ కేలరీలు ఉంటాయి.  దీని కారణంగా ఉడికించిన గుడ్లు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి , శరీరానికి కావలసిన పోషకాలు కూడా మెరుగ్గా అందిస్తాయి. ఇవి అతిగా తినడాన్ని,  వెంటనే ఆకలి కావడాన్ని అరికట్టడానికి , బరువు నిర్వహణకు సహాయపడతాయి.                                                                                                                                                   *రూపశ్రీ.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు. అయితే పదేపదే తిమ్మిర్లు రావడం, ఎక్కువసేపు తగ్గకపోవడం లేదా శరీరంలో ఒక వైపు మాత్రమే అకస్మాత్తుగా తిమ్మిరి రావడం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడానికి నరాలకు సంబంధించిన సమస్యలు ఒక కారణం కావచ్చు. నరాలు దెబ్బతిన్నప్పుడు తిమ్మిరితో పాటు మంట, జలదరింపు, సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, నొప్పి లేదా చేతులు, కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే శరీరంలో ఒక వైపు అకస్మాత్తుగా చేయి లేదా కాలు తిమ్మిరిగా మారడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను మాత్రం ప్రత్యేకంగా గమనించాలి. ముఖ్యంగా వీటితో పాటు ముఖం ఒక వైపు వంగడం, మాట స్పష్టంగా రాకపోవడం, నడవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు కావచ్చు. ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాధారణంగా వచ్చే తిమ్మిరికి, నరాల దెబ్బతినడం లేదా స్ట్రోక్‌కు సంబంధించిన తిమ్మిరికి తేడా ఏమిటి? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? శరీరంలో ఒక వైపు మాత్రమే తిమ్మిరి ఎందుకు వస్తుంది? ఈ విషయాలపై Dr. Anirudh Deshmukh ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. సాధారణ తిమ్మిరి ఎప్పుడు ఆందోళన చెందాల్సిన సమస్యగా మారుతుంది? నరాల సమస్యకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి? స్ట్రోక్‌ను సూచించే సంకేతాలు ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. అకస్మాత్తుగా ఒక వైపు తిమ్మిరి, బలహీనత లేదా స్ట్రోక్‌ను సూచించే ఇతర లక్షణాలు కనిపిస్తే స్వయంగా చికిత్స చేసుకోకుండా వెంటనే వైద్య సహాయం పొందండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)