మునిసిపోల్స్ లో పులివెందులలో వైసీపీకి ఎదురైన ఘోర పరాభవం నుంచి తేరుకోకముందే పరిషత్ ఎన్నికలలోనూ ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. పులివెందుల మునిసిపాలిటీని కోల్పోయిన రోజుల వ్యవధిలోనూ వైసీపీ పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కూడా కోల్పోయింది. . తాజాగా నిర్వహించిన స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో పులివెందుల జడ్పీటీసీ   స్థానాన్ని టీడీపీ  భారీ ఆధిక్యతతో గెలుచుకుంది.   ఈ పరిషత్ పోరులో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి భారతి ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ప్రత్యర్థిపై నిలకడగా ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చారు. తుది ఫలితం వెలువడేసరికి ఆమె తన  సమీప ప్రత్యర్థి  వైసీపీ అభ్యర్థిపై 1,463 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఫలితం వెలువడగానే కౌంటింగ్ కేంద్రం వెలుపల అలాగే నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కొద్దిరోజుల క్రితమే నిర్వహించిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగించిన సంగతి తెలిసిందే. పట్టణ ప్రాంతంలో లభించిన ఆ అనూహ్య మద్దతు కాకతాళీయం కాదని, గ్రామీణ ప్రాంత పరిధిలోకి వచ్చే ఈ జడ్పీటీసీ ఎన్నికలలోనూ తెలుగుదేశం విజయం, పులివెందులలో వైసీపీ పట్టు కోల్పోయిందనడానికి తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వరుసగా మున్సిపాలిటీ, పరిషత్ స్థానాల్లో   వైసీపీ పరాజయం పాలుకావడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర  ఆందోళనకు గురిచేయడమే కాకుండా, వారిలో నిరాశను, నిస్ఫృహను నింపింది.  ఫలితాలు అధికారికంగా వెలువడిన వెంటనే స్థానిక నాయకులు బాణాసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయి  తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. స్థానిక స్థాయిలో  సాధించిన ఈ వరుస విజయాలు రాబోయే రోజుల్లో పులివెందుల రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తాయని తెలుగుదేవం శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  ఇది కూడా చదవండి: ఎస్కార్ట్ నంటూ నీడలా వెంబడించి: చెవిరెడ్డికి చెమటలు పట్టించి, చుక్కలు చూపించిన సుధారెడ్డి.! వైసీపీకి కంచుకోట అయిన పులివెందులలో చోటుచేసుకున్న ఈ రాజకీయ మార్పు   వెనుక స్థానిక ప్రజల నాడిలో వచ్చిన మార్పే కారణమంటున్నారు.  వరుస ఓటములతో వైసీపీకి తమ సొంత నియోజకవర్గంలోనే ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందా అన్న అంతర్మథనంలో వైసీపీ ఉంది.   రాబోయే రోజుల్లో   పులివెందులలో తెలుగుదేశం పార్టీ తన పట్టును మరింత పటిష్టం చేసుకునే దిశగా ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదు. నియోజకవర్గవ్యాప్తంగా   స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరోవైపు, వరుస పరాజయాల నుంచి కోలుకుని తిరిగి పుంజుకునేందుకు వైసీపీ ఏ విధమైన దిద్దుబాటు చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సి ఉంది.   మీకు నచ్చవచ్చు: పోటీ నుంచి వైదొలగిన వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థలు: మైదుకూరు, చిన్నమండెంలో వైసీపీకి బిగ్ షాక్.! పులివెందులలో ఉద్రిక్తత: పార్నపల్లె వద్ద అవినాష్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు.! [Telugudesham Bags Pulivendula ZPTC, Jagan Bastion, Collapse, YCP, Shock, TeluguOne]
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.    ఒకరిద్దరి ప్రయోజనాల కోసం పార్టీలో తనను అణగదొక్కే ప్రయత్నాలు జరిగాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించినప్పటికీ, తనను మానసికంగా ఇబ్బంది పెట్టేలా పరిస్థితులు సృష్టించారని ఆయన వాపోయారు.    తాను స్వచ్ఛందంగా పార్టీని వీడలేదని, అక్కడి వాతావరణం వల్ల బయటకు వచ్చేలా బలవంతం చేశారని ఆయన స్పష్టం చేశారు. ఏనాడూ లేనివిధంగా పార్టీలో తనను ఇబ్బందులకు గురిచేస్తూ, మానసిక క్షోభ కలిగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తనకు దక్కిన గౌరవం, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో కరువైందని ఆయన గుర్తు చేసుకున్నారు. కొందరి తప్పుడు మాటలు నమ్మి తనను దూరం పెట్టారని, ఇది తనను తీవ్రంగా బాధిచించిందని ఆయన పేర్కొన్నారు.    ఎన్నికల సమయంలోనూ, అంతర్గత సమావేశాల్లోనూ తనను కించపరిచేలా వ్యవహరించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 70కి పైగా అవమానాలను మౌనంగా భరించానని, ఇక ఆత్మగౌరవాన్ని చంపుకుని అక్కడ కొనసాగలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.    రాజకీయాల్లో ఎవరికైనా ఆత్మగౌరవం ముఖ్యం అని, దానిని తాకట్టు పెట్టి బతకలేమని ఆయన స్పష్టం చేశారు. కూర్చున్న కొమ్మను నరికేసేలా కొందరు వ్యవహరించిన తీరు తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.     ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ, రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్న పార్టీలకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.    భవిష్యత్తులో నూతన రాజకీయ వేదిక ద్వారా ప్రజల గొంతుకగా మారుతామని, అందరికీ సమాన అవకాశాలు కల్పించే పాలనను అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను స్పష్టం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.          [ Vijay Sai Reddy, Jagan Mohan Reddy, YSRCP, New Political Party Andhra Pradesh, Andhra Pradesh Politics, Sumathi Reddy, Andhra Pradesh politics, New political party AP ]  
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో   కాంగ్రెస్ ఖాతా తెరిచింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల ఫలితాలను ప్రకటించారు. తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.  మరి కొన్నింటిలో ఆధిక్యంలో ఉంది.  చీరాల మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలలో   వైసీపీ సోదిలోకి కూడా కనిపించలేదు. అనూహ్యంగా అక్కడ తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఫలితాలు వెలువడ్డాయి. చీరాల మునిసిపాలిటీ ఎన్నికలలో ప్రధానంగా తెలుగుదేశం కూటమితో కాంగ్రెస్ హోరాహోరీ తలపడింది. ఇక్కడ వైపీపీ మూడో స్థానానికే పరిమితమైంది.  మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య  శుక్రవారం ప్రారంభించారు.    చీరాల మున్సిపాలిటీలో  తెలుగుదేశం అభ్యర్థులు ముందంజలో ఉండగా, రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. పలు వార్డులలో తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చింది. అయితే వైసీపీ మాత్రం కనీస పోటీ ఇవ్వలేక చతికిల బడింది. చీరాల మునిసిపాలిటీలో పలు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చారు.  గతంలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన రాజకీయ పరిణామాలు, స్థానిక సమీకరణాల ప్రభావం ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చీరాలలో ఆమంచి కృష్ణ ప్రసాద్ కు ఉన్న పట్టు కాంగ్రెస్ కు లాభించిందని అంటున్నారు. 2024 ఎన్నికల ముందు వైసీపీ నుంచి ఆమంచి కాంగ్రెస్ లో చేరారు. కాగా.. 2024 ఎన్నికల్లోనూ చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి 41,859ఓట్లు దక్కించుకున్నారు. మూడో స్థానంలో నిలిచారు.  ఇది కూడా చదవండి:  ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.! ఆమంచికి చీరాలలో ఉన్న పట్టు వైసీపీకి మైనస్ గా మారింది. చీరాలలోని ఒక్క వార్డులో కూడా వైసీపీ అభ్యర్థి కనీసం రెండో స్దానానికి చేరుకోలేకపోయారు. ఇక కాంగ్రెస్ విజయం సాధించిన 25వ వార్డులో వైసీపీ బాగా వెనుక బడింది.    చీరాల మున్సిపాలిటీలోని మెజారిటీ వార్డులను కైవసం చేసుకుంటూ తెలుగుదేశం కూటమి ముందంజలో దూసుకుపోతోంది.  మున్సిపల్ చైర్మన్  ఓటింగ్‌లోనూ తెలుగుదేశం అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యతలో ఉన్నారు. మొత్తంగా కడపటి సమాచారం అందే సరికి చీరాలలో ఎనిమిది  వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే చీరాలలో ఆ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉంది.   మీకు నచ్చవచ్చు:  [Chirala Municipal Election, Congress, Ahead Ycp,  Competition TDP Versus Congress, Andhra Pradesh Politics, Amanchi Krishna Mohan, Effect, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
లోక కళ్యాణం కోసం అయోధ్య రాముడు ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కున్నాడో గాని వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం పెద్దగా కష్టం( భారీ ప్రమోషన్స్) లేకుండానే భారీ కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు.దీంతో అరుదైన రికార్డులు తన ఖాతాలో చేరుతున్నాయి.  ముఖ్యంగా ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ 'బుక్‌మైషో' (BookMyShow) లో సృష్టిస్తున్న రికార్డులు చూస్తే టాలీవుడ్, బాలీవుడ్ వర్గాలు సైతం అవాక్కవుతున్నాయి. విడుదలైన తొలి రోజు నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఊపందుకున్న ఈ జోరు, థియేటర్లలోకి వచ్చాక మరింత తీవ్రమైంది.  ట్రెండ్ అనాలసిస్ ప్రకారం, బుక్‌మైషోలో కేవలం గంట వ్యవధిలోనే సుమారు 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడై అప్పట్లోనే సంచలనం సృష్టించగా, ఆ తర్వాత ఈ వేగం మరింత పెరిగింది. మరీ ముఖ్యంగా వీకెండ్ ముగిసిన తర్వాత కూడా సోమవారం వర్కింగ్ డే రోజున ఉదయం కేవలం ఒకే గంటలో ఏకంగా 1 లక్ష టికెట్లు అమ్ముడై ఆల్‌టైమ్ బెంచ్‌మార్క్‌ని సెట్ చేసింది.    ఇది కూడా చదవండి: సాయి ధరమ్ తేజ్ ని మోసం చేసిన హీరోయిన్ ఆమెనేనా!: అందుకే ఇన్ని రోజులు పెళ్లి చేసుకోలేదా! సాధారణంగా వీక్‌డేస్‌లో సినిమా టికెట్ల అమ్మకాలు మందగిస్తుంటాయి, కానీ 'రామాయణం' విషయంలో మాత్రం ఈ రూల్ పూర్తిగా తల్లకిందులైంది.   తొలి నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ ఏకంగా 1 మిలియన్ (10 లక్షలు) పైచిలుకు టికెట్ల సేల్స్ నమోదు చేస్తూ ఈ రేర్ ఎలైట్ క్లబ్‌లో స్థానం సంపాదించుకున్న మూడవ చిత్రంగా 'రామాయణం' నిలిచింది.   ఈ దూకుడు ఇలాగే కొనసాగితే బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం 500 కోట్ల ని దాటి బాక్స్ ఆఫీస్ పై తన హవా చాలా బలంగా చాటుతూ ఉంది.     మీకు నచ్చవచ్చు:రామాయణ మూవీ రివ్యూ  మీకు నచ్చవచ్చు: గత రామాయణ చిత్రాలకి ఇప్పటి రామాయణకి ఉన్న తేడా ఇదే! [Ramayana Movie Bookmyshow Record, Ramayana movie, BookMyShow records, Ramayana box office collections, Ranbir Kapoor Ramayana, Nitesh Tiwari film, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]  
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ‘సీన్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాని తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు వీక్షించారు. సినిమా నచ్చడంతో సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘సీన్’ సినిమా చూసి ఎంజాయ్ చేశానని మహేష్ బాబు తెలిపారు. కూల్‌గా, స్మార్ట్‌గా, ఎంతో వినోదాత్మకంగా సినిమా ఉందంటూ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇందులో ఇన్‌బరాజ్ పాత్రలో సూర్య అద్భుతంగా నటించారని ప్రశంసించారు. నజ్రియా, నస్లెన్ కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. దర్శకుడు జితు మాధవన్ రైటింగ్, సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉన్నాయని మహేష్ కొనియాడారు. ప్రతి విభాగంలోనూ సినిమా ఆకట్టుకుందని, తప్పకుండా చూడాల్సిన చిత్రమని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒకవైపు విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న సూర్యకు, మరోవైపు ‘సీన్’తో మంచి వినోదాన్ని అందించిన దర్శకుడు జితు మాధవన్‌కు మహేష్ ప్రశంసలు దక్కడం విశేషం. ఇక మహేష్ ట్వీట్‌తో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది. ఇది కూడా చదవండి: ‘గాడ్ ఆఫ్ వార్’కు బ్రేకులు.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా.? ‘ఆవేశం’, ‘రోమాంచం’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ దర్శకుడు జితు మాధవన్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఆయనకు ఇది తొలి తమిళ సినిమా. ఇందులో సూర్య డీఎస్పీ ఇన్‌బరాజ్ పాత్రలో కనిపించగా.. నజ్రియా మాయగా, మలయాళ నటుడు నస్లెన్ ఈశ్వరన్‌గా నటించారు. క్రైమ్, కామెడీ, యాక్షన్ అంశాలను కలిపి జితు మాధవన్ ఈ సినిమాను రూపొందించారు. సూర్య, జ్యోతిక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి సుషిన్ శ్యామ్ సంగీతం అందించారు. మీకు నచ్చవచ్చు: సముద్రంలో కొట్టుకుపోయిన అమల అక్కినేని.. ఎవరు కాపాడారో తెలుసా.? వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!       [Scene Review By Mahesh Babu, Mahesh Babu Twitter, Scene Movie, Suriya, Jithu Madhavan, Nazriya, Naslen, Mahesh Babu, Telugu Film News]  
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన అద్భుతమైన నటనతో మరియు మంచి మంచితనంతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు. అయితే, కెరీర్ ప్రారంభ రోజుల్లోనూ, ఆ తర్వాత కూడా ఆయన ఎదుర్కొన్న కొన్ని అనుకోని పరిణామాలు, వివాదాలు సోషల్ మీడియాలో తరచూ చర్చనీయాంశం అవుతుంటాయి. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో మరియు వెబ్ మీడియాలో సాయి ధరమ్ తేజ్‌ను ఒక ప్రముఖ హీరోయిన్ కెరీర్ తొలినాళ్లలో లేదా షూటింగ్ సమయంలో అవమానించిందంటూ వస్తున్న వార్తలు సినిమా సర్కిల్స్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ రకమైన వార్తలు కేవలం రూమర్ల రూపంలోనే కాకుండా, కొందరు ఆర్టిస్టులు చేసిన కామెంట్ల ఆధారంగా ప్రచారంలోకి రావడం విశేషం. సాధారణంగా మెగా హీరోలపై వచ్చే ఏ చిన్న వార్తయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఎంతో సాఫ్ట్ నేచర్ కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్, అందరితోనూ చాలా ఆప్యాయంగా మెలగుతారనే పేరుంది. అయినప్పటికీ, కొందరు తోటి నటీనటులు లేదా హీరోయిన్లు తమ ప్రవర్తనతో లేదా వ్యాఖ్యలతో పరోక్షంగా ఆయనను కించపరిచేలా వ్యవహరించారనే ప్రచారం అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఇది కూడా చదవండి: బావ మరదళ్ల క్యూట్ వీడియో అయితే, ఈ వార్తల వెనుక అసలు నిజానిజాలు ఏంటనే దానిపై సినీ విశ్లేషకులు వివిధ కోణాల్లో విశ్లేషిస్తున్నారు. కేవలం సినిమా ప్రమోషన్లలో భాగంగానో లేదా సరదాగా జరిగిన కొన్ని సంఘటనలను బేస్ చేసుకుని కొందరు కావాలనే ఇలాంటి వివాదాలను సృష్టిస్తున్నారని మరికొందరు వాదిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో విజయాలు, అపజయాలు ఎంత సాధారణమో, ఇలాంటి ఊహాగానాలు, వివాదాలు కూడా అంతే సహజం. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో 'పిల్ల నువ్వు లేని జీవితం', 'సుబ్రమణ్య ఫಾರ್ సేల్', 'చిత్రలహరి' మరియు రీసెంట్‌గా వచ్చిన బ్లాక్‌బస్టర్ 'విరూపాక్ష' వంటి అనేక విజయవంతమైన చిత్రాలు ఆయన స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి. కేవలం కమर्शియల్ హిట్స్ మాత్రమే కాకుండా, రోడ్డు ప్రమాదం తర్వాత కోలుకుని మరింత స్ట్రాంగ్‌గా రీఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఇన్ని విజయాలు సాధించిన ఒక అగ్ర హీరోపై ఇలాంటి నిరాధారమైన అవమానాల వార్తలు రావడం ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.   ఈ నేపథ్యంలో సంబంధిత హీరోయిన్ ఎవరా అని నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా అన్వేషిస్తున్నారు. గతంలో ఆయనతో నటించిన సహనటిల ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో జరిగిన చిన్నపాటి పొరపాట్లు లేదా సరదా సంభాషణలను కూడా వెలికితీసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఇలాంటి పుకార్లను సాయి ధరమ్ తేజ్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇండస్ట్రీలో అందరితోనూ కలివిడిగా ఉండే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గురించి వస్తున్న ఈ రూమర్లలో ఎటువంటి వాస్తవం లేదని, కేవలం వ్యూస్ మరియు క్లిక్‌ల కోసం కొన్ని వెబ్‌సైట్లు ఇలాంటి హెడ్‌లైన్స్ సృష్టిస్తున్నాయని స్పష్టమవుతోంది. చిత్ర పరిశ్రమలో రాణించాలనుకునే నటీనటుల మధ్య పరస్పర గౌరవం ఎప్పుడూ ఉంటుందని, ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని టాలీవుడ్ నిపుణులు సూచిస్తున్నారు.   మీకు నచ్చవచ్చు: సీన్ డైరెక్టర్ జీతూ మాధవన్ నెక్స్ట్  హీరో తెలిస్తే షాక్ అవుతారు! మీకు నచ్చవచ్చు: ఇరుముడి దర్శకుడితో బాలయ్య!     [Sai Dharam Tej Insulted By Heroine, Sai Dharam Tej, Sai Dharam Tej heroine, Tollywood news, Mega hero controversy, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]      
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గాడ్ ఆఫ్ వార్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ భారీ మైథలాజికల్ సినిమాను ప్రకటించారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయనే ప్రచారం మొదలైంది. సినిమా ఆగిపోతుందా? లేక బడ్జెట్‌లో మార్పులు చేసి ముందుకు వెళ్తారా? అనే చర్చ నడుస్తోంది. ఈ సినిమాను దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం సినిమా మార్కెట్‌లో పరిస్థితులు గతంలోలా లేవు. ముఖ్యంగా ఓటీటీ, నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం విషయంలో అనిశ్చితి నెలకొంది. గతంలో పెద్ద సినిమాలకు డిజిటల్ హక్కుల రూపంలో భారీ మొత్తాలు వచ్చేవి. ఇప్పుడు మాత్రం కంటెంట్, మార్కెట్ పరిస్థితులను బట్టి ఓటీటీ సంస్థలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మించడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారంగా మారిందని టాక్. మరోవైపు త్రివిక్రమ్ ఇటీవల తెరకెక్కించిన ‘ఆదర్శ కుటుంబం’ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ ఫలితాన్ని అందుకోకపోవడంతో నిర్మాతల ఆలోచనపై ప్రభావం చూపుతోందని ప్రచారం జరుగుతోంది. ఇది కూడా చదవండి: అప్పుడు ఫిట్‌గా ఉండాల్సింది.. తన ఓల్డ్ లుక్స్‌పై ఎన్టీఆర్ కామెంట్స్.! అయితే ఈ ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదని, ‘గాడ్ ఆఫ్ వార్’ ఖచ్చితంగా ఉంటుందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం  త్రివిక్రమ్ స్క్రిప్ట్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌ను అనుకున్న బడ్జెట్‌తోనే ముందుకు తీసుకెళ్లాలా? లేక బడ్జెట్‌ను తగ్గించి రీ-డిజైన్ చేయాలా? అనే అంశంపై చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీకు నచ్చవచ్చు: సముద్రంలో కొట్టుకుపోయిన అమల అక్కినేని.. ఎవరు కాపాడారో తెలుసా.? వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!       [NTR Trivikram Movie, God Of War Budget, NTR Mythological Movie, NTR Dragon, Jr NTR Upcoming Movies, Trivikram Srinivas, Jr NTR, God Of War, Telugu Film News]  
టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ‘బెంగాల్ టైగర్’, ‘సీటీమార్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1960ల నాటి తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా పడింది. ఇందుకు సెన్సార్ సమస్యలే కారణంగా తెలుస్తోంది.  నిజానికి ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లను చిత్రబృందం ప్రారంభించింది. ఇందులో భాగంగా ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే అనూహ్యంగా ట్రైలర్ విడుదలతో పాటు ప్రీ రిలీజ్ వేడుకను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తొలుత సాంకేతిక కారణాల వల్ల కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు చెప్పినప్పటికీ.. తాజాగా సెన్సార్ సమస్యల కారణంగానే సినిమా విడుదల కూడా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, హింసాత్మక దృశ్యాల తీవ్రత కారణంగా సెన్సార్ బోర్డు సినిమాను రివైజింగ్ కమిటీకి పంపినట్లు సమాచారం. దీంతో చిత్రానికి ఇంకా తుది సర్టిఫికెట్ లభించలేదు. రివైజింగ్ కమిటీ పరిశీలన పూర్తయి, సెన్సార్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతే కొత్త విడుదల తేదీని ప్రకటించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1960ల నాటి తెలంగాణలో కొనసాగిన పటేల్ వ్యవస్థ, భూస్వాముల ఆధిపత్యం, వారికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలు సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు సమాచారం. శర్వానంద్ ఇందులో ఐదుగురు అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచే ఓ రగ్డ్ విలేజ్ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అప్పటి సామాజిక పరిస్థితులు, సంప్రదాయాలు, ఆధిపత్య పోరాటాలను ఈ సినిమాలో ప్రధానంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: బొమ్మ ఎందుకు హిట్ అయిందో తెలుసా? ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిజం.! ఈ సినిమాలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా శర్వానంద్ మాస్ లుక్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దిలీప్ సుబ్బరాయన్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. మొత్తానికి భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన ‘భోగి’కి సెన్సార్ రూపంలో బ్రేకులు పడటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ముఖ్యంగా హింసాత్మక సన్నివేశాలు, పీరియాడిక్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో రివైజింగ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. సెన్సార్ సమస్యలు త్వరగా పరిష్కారమై కొత్త విడుదల తేదీ ఖరారవుతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ భోగి థియేటర్లలో ఎప్పుడు రగులుతుందో చూడాలి.  మీకు నచ్చవచ్చు: ఉర్రూత‌లూగించిన ప్ర‌భాస్‌, అనుష్క రొమాన్స్‌.. ‘కాటుక కళ్ళను చూస్తే..’           [Sharwanand Bhogi Movie, Bhogi Movie Story, Bhogi Movie Censor Issues, Sampath Nandi, Anupama Parameswaran, Dimple Hayathi, Bhogi Movie Postponed, Telangana Period Drama, Sharwanand New Movie]
  ఇప్పుడు ఎక్కడ చూసినా సీన్  మూవీ డైరెక్టర్ జీతూ మాధవన్ పేరు మారుమోగిపోతూ ఉంది. మరో సారి తన అద్భుతమైన టేకింగ్ తో కథనాన్ని పరుగెత్తించి మరో సారి క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ పలానా హీరోతో ఉండబోతోందనే న్యూస్ సోషల్ మీడియాకి ఎనలేని జోష్ తీసుకొస్తూ ఉంది.   జీతూ మాధవన్ నెక్స్ట్ మూవీ దుల్కర్ సల్మాన్ తో ఉండబోతున్నట్టుగా మలయాళ సినీ వర్గాల్లో బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, యూత్ హార్ట్ థ్రోబ్‌గా మారి దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ మమిత బైజు ఈ చిత్రంలో కథానాయకిగా నటించనుందనే రూమర్స్ సోషల్ మీడియాని షేక్ చెస్ చేసే పనిలో ఉన్నాయి ఈ అనూహ్య కాంబినేషన్ గురించిన ప్రకటన వెలువడినప్పటి నుంచి సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ ఇటీవల మలయాళంలో చేసిన సినిమాలకు ఆశించిన స్థాయి ఫలితాలు రాలేదు. దీంతో  దుల్కర్ అభిమానులు ఒక బలమైన మలయాళ కంబ్యాక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో నూతన ట్రెండ్‌కు తగినట్లుగా కథలను తెరకెక్కించడంలో దిట్ట అయి జీతూ మాధవన్‌తో దుల్కర్ జతకట్టనుండటం అభిమానులకి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.  మమిత బైజు హీరోయిన్ అంటుండటం మరింత తీపి వార్త. మరి ఈ న్యూస్ అక్షరాలా నిజం కావాలని కోరుకుందాం. ఇది కూడా చదవండి: థియేటర్లలో భారీ బడ్జెట్ సినిమాల యాడ్స్: చిన్న సినిమాల ఫలితాన్ని మార్చేస్తున్నాయా? జీతూ మాధవన్  మొదటి సినిమా 'రోమాంచకం' తోనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించి మలయాళ ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఆ తర్వాత ఫహద్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన 'ఆవేశం' సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఏకంగా వందల కోట్ల వసూళ్లను రాబట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.   ఇప్పుడు  'సీన్' సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ కేవలం కేరళ బాక్సాఫీస్ వద్దే తొలి వారాంతంలో సుమారు 6 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించి సంచలనం సృష్టిస్తోంది. తద్వారా వరుసగా మూడు విజయాలను తన ఖాతాలో వేసుకున్న జీతూ  మాధవన్, టాలీవుడ్ మరియు కోలీవుడ్ డైరెక్టర్లకు సైతం గట్టి పోటీ ఇస్తూ హ్యాట్రిక్ డైరెక్టర్‌ హోదాలో దూసుకుపోతున్నాడు.   మీకు నచ్చవచ్చు:  ఈ నగరానికి ఏమైంది సీక్వెల్.. నెట్ ఫ్లిక్స్ ఎన్ని కోట్లకి కొనుక్కుందో తెలుసా? మీకు నచ్చవచ్చు:రామాయణ దెబ్బకి ధురంధర్ 2 , పుష్ప రికార్డ్స్ అవుట్!      [Jithu Madhavan Next Movie After scene Movie, Jithu Madhavan ANd Dulquer Salmaan Movie, Dulquer Salmaan, Jithu Madhavan, Mamitha Baiju,Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]  
సినిమా షూటింగ్‌లలో నటీనటులకు ఎదురయ్యే ప్రమాదాలు అప్పుడప్పుడు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ముఖ్యంగా సముద్రం, నదులు, కొండలు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో చిత్రీకరణ అంటే మరింత జాగ్రత్త అవసరం. అలాంటి ఓ భయానక అనుభవాన్ని అక్కినేని అమల ఎదుర్కొన్నారట. ఓ సినిమా షూటింగ్ సమయంలో ఆమె ఏకంగా సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారట. అయితే అక్కడే ఉన్న మత్స్యకారులు సమయానికి స్పందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఇన్నేళ్ల తర్వాత ఆ ఘటనను స్వయంగా ఆ సినిమా దర్శకుడు గుర్తుచేసుకున్నారు. మోహన్‌లాల్, అమల అక్కినేని, శోభన ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘ఉల్లడక్కం’. 1991లో విడుదలైన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అమల ‘రేష్మ’ అనే మానసిక సమస్యతో బాధపడే యువతి పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం గురించి దర్శకుడు కమల్ తాజాగా ‘వనిత’ మ్యాగజైన్‌లో తన కాలమ్ ద్వారా వెల్లడించారు. ‘ఉల్లడక్కం’ కథ ప్రకారం.. రేష్మ ప్రియుడు సముద్రంలో పడిపోయే ఓ కీలకమైన ఎమోషనల్ సీన్‌ను చిత్రీకరించాల్సి వచ్చింది. అయితే ఆ రోజు సముద్రంలో అలలు చాలా ఉధృతంగా ఉన్నాయి. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానిక మత్స్యకారులు ముందుగానే చిత్రబృందాన్ని హెచ్చరించారు. ఏదైనా అనుకోని ఘటన జరిగితే రక్షించేందుకు వారు కూడా నీళ్లలో సిద్ధంగా ఉన్నారు. ఆ సీన్ కోసం అమల తన పాత్రలో పూర్తిగా లీనమై సముద్రం వైపు చూస్తూ నిలబడ్డారు. ఆమె నటనలోని తీవ్రతను గమనించిన దర్శకుడు కమల్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆ తర్వాత కెమెరా ఆన్ చేసి ‘యాక్షన్’ చెప్పగానే.. ఒక్కసారిగా భారీ అల వచ్చి అక్కడున్న వారిని ముంచెత్తింది. ఆ అల ధాటికి అమలతో పాటు కెమెరా కూడా సముద్రంలోకి కొట్టుకుపోయాయి. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో చిత్రబృందం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇది కూడా చదవండి: వారణాసి స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.! అక్కడే అప్రమత్తంగా ఉన్న మత్స్యకారులు వెంటనే నీళ్లలోకి దూకి అమలను రక్షించారు. ప్రాణాలకు తెగించి ఆమెను ఒడ్డుకు చేర్చారు. మరోవైపు సముద్రంలో మునిగిపోతున్న కెమెరాను కాపాడేందుకు కెమెరా అసిస్టెంట్ కూడా తీవ్రంగా ప్రయత్నించారు. తన సొంత బిడ్డను కాపాడుకున్నట్లుగా ఆ కెమెరాను నీళ్లపైకి ఎత్తి పట్టుకున్నారని దర్శకుడు కమల్ గుర్తుచేసుకున్నారు. వెంటనే యూనిట్ సభ్యులు స్పందించి అతడిని, కెమెరాను బయటకు తీసుకొచ్చారు. అమల ప్రాణాలతో బయటపడటం దేవుడి దయేనని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదం మాత్రమే కాదు.. ‘ఉల్లడక్కం’ షూటింగ్‌లో అమల నటనకు సంబంధించిన మరో విషయాన్ని కూడా దర్శకుడు పంచుకున్నారు. మానసిక వైద్యశాలలో డాక్టర్ ముందు నటించే సన్నివేశంలో ఆమె అద్భుతంగా నటించారని, సెట్‌లో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారని తెలిపారు. ‘కట్’ చెప్పిన తర్వాత కూడా ఆమె ఆ పాత్ర నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టేదని అమల అంకితభావాన్ని ప్రశంసించారు. మోహన్‌లాల్‌కు ఉత్తమ నటుడిగా, దర్శకుడు కమల్‌కు ఉత్తమ దర్శకుడిగా కేరళ రాష్ట్ర అవార్డులు అందించిన చిత్రంగా ‘ఉల్లడక్కం’ నిలిచింది. మూడు దశాబ్దాలకు పైగా గడిచినా ఈ సినిమా షూటింగ్‌లో జరిగిన భయానక ఘటన మాత్రం దర్శకుడి జ్ఞాపకాల్లో అలాగే ఉండిపోయింది. అమల ప్రాణాలకు ముప్పు తెచ్చిన ఆ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకున్న అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీకు నచ్చవచ్చు: బాలయ్య నన్ను ‘ఏరా పెద్దిరెడ్డి’ అని పిలుస్తారు.. ‘దాదా’ సినిమా ఎలా ఉండబోతుందంటే.? అలియాస్ రుక్మిణి: మూడు నెలల్లో సినిమా పూర్తి.. మామూలు స్పీడ్ కాదు.!       [Amala Near Death Experience, Amala Akkineni Shooting Accident, Ulladakkam Movie Amala Incident, Ulladakkam Movie, Amala Akkineni, Director Kamal, Mohanlal, Telugu News]  
బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా జంటగా నటించిన చిత్రం 'ది వ్వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్'. ఫాంటసీ, మిస్టరీ, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. భారతీయ జానపద కథలు, అడవుల నేపథ్యంలో సాగే అతీంద్రియ శక్తుల కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 6 నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడే ప్రేక్షకులకు ఒక చిన్న షాక్ తగిలింది. సాధారణంగా ప్రైమ్ వీడియోలో సినిమా అందుబాటులోకి వస్తే సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు ఉచితంగా చూడొచ్చని భావిస్తారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ప్రస్తుతం దీనిని చూడాలంటే అదనంగా రెంటల్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం 'ది వ్వాన్' సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో రూ.349 చెల్లించి రెంట్‌కు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే నవంబర్ 20 నుంచి సాధారణ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లోనే ఈ సినిమా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో ఇప్పుడే అదనంగా డబ్బులు చెల్లించి చూడాలా? లేదంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాలా? అనే ఆలోచనలో ఓటీటీ ప్రేక్షకులు ఉన్నారు.   ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రిషి అనే నగరానికి చెందిన వ్యక్తి తన భార్య మమతతో కలిసి బీహార్‌లోని తన పూర్వీకుల గ్రామానికి వెళ్తాడు. అక్కడ ఒక పవిత్రమైన అడవి ఉంటుంది. ఆ అడవిలో వనదేవి కొలువై ఉంటుందని గ్రామస్థులు నమ్ముతుంటారు. సూర్యాస్తమయం తర్వాత ఆ అడవిలోకి వెళ్లకూడదని కొన్ని నియమాలు పాటిస్తుంటారు. అయితే రిషి మాత్రం వీటన్నింటినీ మూఢనమ్మకాలుగా భావిస్తాడు. అనుకోకుండా ఆ అడవిలోకి వెళ్లడంతో అతడి జీవితంలో అనూహ్యమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా కథ. ఇది కూడా చదవండి: అనుకోని అతిథుల రాకతో మొదలైన ఉత్కంఠ.. ఆసక్తి రేపుతున్న ‘అనిరీక్షిత అతిథిగలు’! ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా రిషి పాత్రలో నటించగా, తమన్నా భాటియా మమత పాత్రలో కనిపించారు. వీరితో పాటు శ్వేతా తివారీ, సునీల్ గ్రోవర్, అనుప్ సోని, మనీష్ పాల్ కీలక పాత్రలు పోషించారు. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అరుణాభ్ కుమార్ కథ అందించారు. ఏక్తా కపూర్, శోభా కపూర్, అరుణాభ్ కుమార్, నిరజ్ కొఠారి నిర్మాతలుగా వ్యవహరించారు. మొత్తానికి థియేటర్లలో విడుదలైన రెండు నెలల్లోపే 'ది వ్వాన్' ఓటీటీలోకి రావడంతో ఈ సినిమాను ఇంట్లోనే చూడాలనుకునే ప్రేక్షకులకు మంచి అవకాశం లభించింది. అయితే ప్రస్తుతం రూ.349 రెంటల్ ధర ఉండటంతో కొంతమంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 20 నుంచి సాధారణ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో అందుబాటులోకి వస్తుందనే వార్త నేపథ్యంలో అప్పటివరకు వేచి చూడాలని మరికొందరు భావిస్తున్నారు. మీకు నచ్చవచ్చు: సినిమాల్లో ఎంట్రీకి శ్రీ‌దేవి పెట్టిన కండిష‌న్ ఇదే..  త‌ల్లి గురించి జాన్వీ కామెంట్స్‌.!     [The Vvaan OTT Release, The Vvaan Amazon Prime Video, Sidharth Malhotra, Tamannaah Bhatia, The Vvaan Movie, The Vvaan OTT Price, The Vvaan Streaming Date, Amazon Prime Video Movies, Bollywood OTT Releases]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
దీపావళి పండుగ అనగానే మనకు టపాకాయలు, దీపాలతో పాటు నోరూరించే పిండివంటలు, రకరకాల స్నాక్స్ గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా కలిసి గడిపే ఈ వేడుకల్లో విభిన్నమైన రుచులను ఆస్వాదించడం అందరికీ ఇష్టమే. ఈ ఫెస్టివల్ సీజన్లో మీ పార్టీలన్నింటిలోనూ అందరినీ ఆకట్టుకునేలా ఒక అద్భుతమైన ట్రెండింగ్ రెసిపీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదే అద్భుతమైన  ధోక్లా చాట్ . సాధారణంగా మనం ఎప్పుడూ చేసుకునే ఇన్స్టెంట్ ధోక్లాను మరింత రుచికరంగా మార్చి, ఒక అద్భుతమైన చాట్ రూపంలోకి తీసుకువస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ టేస్టీ వంటకం. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ పూజా పురోహిత్ షేర్ చేసిన ఈ రెసిపీ ప్రకారం, దీపావళి పార్టీలలో చాట్ స్టార్టర్స్ లేకపోతే అసలు మజాయే రాదు. సాధారణ ధోక్లాకు బదులుగా ఈసారి దానికి ఒక సరికొత్త చాట్ మేకోవర్ ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో దీన్ని తయారు చేశారు. తీపి, కారం, పులుపు అన్నీ కలగలిసిన అద్భుతమైన స్ట్రీట్ ఫైట్ రుచిని ఇది ఇస్తుంది. దీన్ని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు, పైగా ఇది ఎప్పటికీ ఫెయిల్ కాని ఒక పర్ఫెక్ట్ పార్టీ స్టార్టర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నోరూరించే ధోక్లా చాట్ తయారీ కోసం మొదట 1 కప్పు శనగపిండి (బెసన్), ముప్పావు కప్పు నీళ్లు, పావు టీస్పూన్ పసుపు పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె మరియు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. శనగపిండిలో ఉప్పు, పసుపు వేసి, ఉండలు లేకుండా కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ కలపాలి. ఆ తర్వాత చివరగా 1 టీస్పూన్ ఈనో (Eno) ఫ్రూట్ సాల్ట్ కలిపి తేలికగా, మెత్తగా అయ్యేలా గిలకొట్టాలి. నూనె రాసిన మోల్డ్స్‌లో ఈ పిండిని ముప్పావు వంతు వరకు పోసి, స్ట్రీమర్‌లో ఉంచి సరిగ్గా 12 నుంచి 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఇలా ఉడికించిన సాఫ్ట్ ధోక్లాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు కోసం చిన్న పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, అర టీస్పూన్ ఆవాలు చిటపటలాడించాలి. అందులో 7 నుంచి 8 కరివేపాకులు, 1 లేదా 2 చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించి, ఆ తాలింపును ఆవిరిపై ఉడికిన ధోక్లా ముక్కలపై పోయాలి. దీనివల్ల ధోక్లా ముక్కలు ఆ సువాసనను, రుచిని చక్కగా పీల్చుకుంటాయి. ఇది కూడా చదవండి: జ్వరం లెక్కలు, మారుతున్నాయా? సగటు శరీర ఉష్ణోగ్రతపై తాజా స్టడీ! అలంకరణ మరియు అసలైన చాట్ ఫీల్ కోసం, సర్వింగ్ బౌల్‌లో అడుగుభాగంలో అర కప్పు చిక్కటి గిలకొట్టిన పెరుగును పరచాలి. దానిపై 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పచ్చని పుదీనా చట్నీ, అలాగే మరో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల చింతపండు చట్నీని వేయాలి. ఆ తర్వాత తయారు చేసి పెట్టుకున్న ధోక్లా ముక్కలను ఈ చట్నీలు, పెరుగుపై అమర్చాలి. దానిపై అర టీస్పూన్ చాట్ మసాలా, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడిని చల్లుకోవాలి. చివరిగా గుప్పెడు కరకరలాడే సేవ్, దానిమ్మ గింజలు, కొద్దిగా బూందీ మరియు సన్నగా తరిగిన తాజా కొత్తిమీర ఆకులతో దీన్ని అద్భుతంగా గార్నిష్ చేయాలి. అతిథులు అందరికీ వడ్డించడానికి కేవలం నిమిషాల ముందే ఈ బౌల్స్‌ను సిద్ధం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ధోక్లా ఎంతో సాఫ్ట్‌గా, పైన చల్లుకున్న సేవ్ దాని కరకరలాడే క్రంచ్‌ను కోల్పోకుండా పర్ఫెక్ట్ టేస్ట్‌ను అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ దీపావళికి మీ ఇంటికి వచ్చే అతిథుల కోసం ఈ వైరల్ ధోక్లా చాట్‌ను ట్రై చేసి ప్రశంసలు అందుకోండి. మీకు నచ్చవచ్చు:రోజూ మినప్పప్పు తింటే, మీ శరీరానికి అందే అమేజింగ్, ఆరోగ్య ప్రయోజనాలు!                            వెన్నెముక దృఢంగా ఉండాలా? అయితే ఈ 5 సులువైన అలవాట్లు పాటించండి!   Dhokla Chaat Recipe, Diwali Party Snacks, Fusion Street Food, Festival Appetizers, Quick Party Snacks, Indian Snack Recipes, Food Articles In Telugu.
దీపావళి పండుగ అంటేనే కాంతులు, మిఠాయిలు మరియు అద్భుతమైన టపాసుల శబ్దాలు. కానీ ప్రతి ఏటా దీపావళి సమయంలో ఎమర్జెన్సీ వార్డుల్లో కాలిపోయిన గాయాలతో వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతుంటుంది. అకస్మాత్తుగా టపాసులు పేలడం, దివ్య కింద పడడం లేదా స్పార్క్లర్ తాకడం వల్ల క్షణాల్లో ప్రమాదం జరగవచ్చు. ఈ ఆందోళనకరమైన క్షణంలో చాలా మంది వెన్న, టూత్‌పేస్ట్ లేదా ఐస్ క్యూబ్స్ వంటి తప్పుడూ ఇంటి చిట్కాలను ఆశ్రయిస్తుంటారు. కానీ ఇలాంటి వాటి వల్ల గాయం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, ప్రమాదం జరిగిన వెంటనే ఆ మొదటి ఐదు నిమిషాల్లో మనం తీసుకోవాల్సిన అత్యవసర చర్యలు ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.ఎం. ఫయాజ్ (KIMS హాస్పిటల్స్, మహాదేవపుర ఇంటర్నల్ మెడిసిన్ లీడ్ అండ్ సీనియర్ కన్సల్టెంట్) ప్రకారం, ముందుగా ప్రమాదానికి గురిచేసిన ప్రదేశం లేదా వస్తువు నుండి దూరంగా జరగాలి. ఆ తర్వాత కాలిపోయిన భాగాన్ని సుమారు 20 నిమిషాల పాటు చల్లటి పారుతున్న నీటి కింద ఉంచాలి. వెంటనే వేలికి ఉన్న ఉంగరాలు, గాజులు, గడియారాలు లేదా బిగుతుగా ఉన్న వస్తువులను తొలగించాలి. గాయంపై ఎలాంటి ఐస్, వెన్న, టూత్‌పేస్ట్ లేదా ఇతర సాంప్రదాయ ఇంటి చిట్కాలను పూయకూడదని, శుభ్రమైన, నూలు పీచులు లేని డ్రెస్సింగ్‌తో మాత్రమే దానిని వదులుగా కప్పాలని ఆయన సూచిస్తున్నారు. ఈ కాలిన గాయాల చికిత్సలో చల్లటి నీటితో కడగడం ఎందుకు అంత ముఖ్యమంటే, మనం ప్రమాద ప్రాంతం నుండి దూరంగా జరిగినప్పటికీ వేడి చర్మం లోపలి పొరల్లో అలాగే ఉండిపోయి నిమిషాల పాటు కణజాలాన్ని దెబ్బతీస్తూనే ఉంటుంది. చల్లటి నీరు ఆ వేడిని బయటకు లాగి లోతుగా గాయం కాకుండా నియంత్రిస్తుంది. ఇది నొప్పిని, వాపును తగ్గిస్తుంది. అయితే మరీ చల్లటి ఐస్ వాటర్ వాడితే రక్తనాళాలు కుంచించుకుపోయి చర్మానికి మరింత నష్టం జరగవచ్చు. ఆస్ట్రేలియన్ ఎమర్జెన్సీ కేర్ జర్నల్‌లో ప్రచురితమైన 2022 నాటి పరిశోధన ప్రకారం, మూడు గంటల్లోపు 20 నిమిషాల పాటు చల్లటి నీటిని ప్రవహింపజేయడం వల్ల స్కిన్ గ్రాఫ్ట్‌లు లేదా శస్త్రచికిత్స అవసరమయ్యే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని తేలింది. అదేవిధంగా నెయ్యి, నూనె, టూత్‌పేస్ట్ లేదా పసుపు, పిండి వంటి పదార్థాలను పూయడం వల్ల వేడి అక్కడే బందీ అయిపోయి ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది. బ్లిస్టర్స్ (పొక్కులు) ఏర్పడితే వాటిని బలవంతంగా పగలగొట్టకూడదు. ఎందుకంటే పొక్కు అనేది కొత్త చర్మాన్ని రక్షించే సహజమైన రక్షణ కవచం లాంటిది. ఇండియన్ జర్నల్ ఆఫ్ బర్న్స్ ప్రకారం, 2016 నుండి 2020 మధ్య దీపావళి సమయంలో గూహాటి ఆసుపత్రిలో చేరిన 195 మంది కాలిన గాయాల బాధితులలో 54.3 శాతం మంది టపాసుల వల్ల గాయపడినవారే కాగా, అందులో 46.2 శాతం మంది 19 సంవత్సరాల లోపు వారే ఉండటం గమనార్హం. ఇందులో అత్యధికంగా 54 శాతం మందికి కుడిచేయి కాలిపోయినట్లు వెల్లడైంది. ఇది కూడా చదవండి:సహజంగా, అందమైన కళ్ల కోసం, ఈ 800 ఏళ్ల నాటి ఆయుర్వేద మార్గం ట్రై చేయండి! గాయం అరచేతి కంటే పెద్దదిగా ఉన్నా, ముఖం, మెడ, చేతులు, కాళ్లు, జననేంద్రియాలపై లేదా కీళ్లపై తీవ్రంగా కాలిపోయినా, చర్మం తెలుపు లేదా నల్లగా కాలిపోయినా, పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు లేదా మధుమేహం ఉన్నవారికి గాయాలైనా వెంటనే 112 లేదా 108 కి కాల్ చేయాలి లేదా సమీప ఆసుపత్రికి వెళ్లాలి.  ముఖ్యంగా కంటికి టపాసుల నిప్పు రవ్వలు తగిలితే ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లను రుద్దకూడదు. శుభ్రమైన నీటితో సున్నితంగా కడిగి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పండుగ ఆనందాన్ని ఇస్తూనే, పిల్లలను సురక్షిత దూరంలో ఉంచుతూ తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా అవాంఛనీయ ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చు. మీకు నచ్చవచ్చు: నిపుణులు, హెచ్చరిస్తున్న డయాబెటిస్ తెచ్చే ,4 హానికరమైన ఆహారాలు!                    AI వల్ల మరో ప్రాణం గాల్లోకి.. వైద్యుల హెచ్చరికలను కాదని చాట్‌జీపీటీని నమ్మి మహిళ మృతి!     Diwali Burn First Aid, Firecracker Hand Burns, Fireworks Injury Treatment, First 5 Minutes Burn Care, Festival Safety Guide, Doctor Health Advice, Health Tips In Telugu.  
పండగలు, పార్టీలు లేదా ప్రత్యేక సందర్భాలలో విపరీతంగా తినడం, ఆల్కహాల్ సేవించడం చాలా సాధారణం. అయితే ఇలాంటి అతిగా తినే అలవాట్లు మరియు అత్యధికంగా ఆల్కహాల్ తీసుకోవడం కేవలం సాధారణ అజీర్ణం లేదా కడుపు ఉబ్బరానికే పరిమితం కాకుండా, కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరమైన  అక్యూట్ ప్యాంక్రియాటైటిస్  (Acute Pancreatitis) అనే తీవ్రమైన ఆరోగ్య సమస్యకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాంక్రియాస్ లేదా క్లోమం మన శరీరంలో జీర్ణక్రియకు మరియు ఇన్సులిన్ ఉత్పత్తికి అత్యంత కీలకమైన అవయవం. దీనిలో వాపు లేదా మంట ఏర్పడితే అది ప్రాణాల మీదికి వచ్చే ప్రమాదం ఉంది. అధిక మోతాదులో ఆల్కహాల్ సేవించడం అక్యూట్ ప్యాంక్రియాటైటిస్‌కు ప్రధాన కారణాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. సుదీర్ఘకాలం పాటు లేదా ఒకే రాత్రిలో విపరీతంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల క్లోమ కణాలు దెబ్బతింటాయి. ఇది ప్యాంక్రియాస్‌లో తీవ్రమైన మంటను రాజేస్తుంది. ముఖ్యంగా గతంలో ప్యాంక్రియాస్ సమస్యలతో బాధపడిన వారికి లేదా ఆల్కహాల్ అలవాటు ఉన్నవారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఆహార విషయానికి వస్తే, పార్టీ మెనూల్లో ఎక్కువగా కనిపించే సమోసాలు, కచోరీలు, పకోడీలు, మరియు నూనెలో వేయించిన రిచ్ గ్రేవీ వంటకాలు శరీరంలో కొవ్వు శాతాన్ని ఒక్కసారిగా పెంచుతాయి. కేవలం నూనె పదార్థాలు తిన్నంత మాత్రాన అందరికీ ప్యాంక్రియాటైటిస్ రాకపోయినా, ఈ తరహా హెవీ ఫుడ్స్‌ను అతిగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్రమైన భారం పడుతుంది. ఇది గాల్‌స్టోన్స్ (పిత్తాశయ రాళ్లు) సమస్య ఉన్నవారిలో తీవ్రమైన లక్షణాలను ప్రేరేపించి ప్యాంక్రియాస్‌కు ముప్పు తెస్తుంది. గాల్‌స్టోన్స్ లేదా పిత్తాశయ రాళ్లు ఉన్నవారిలో అవి ప్యాంక్రియాటిక్ నాళాన్ని అడ్డుకునే అవకాశం ఉంది. దీనివల్ల జీర్ణ ఎంజైములు సరిగ్గా ప్రవహించక, క్లోమంలోనే ఆగిపోయి తీవ్రమైన వాపును కలిగిస్తాయి. ఇలాంటి సమస్య ఉన్నవారు వేయించిన ఆహారాలు తిన్న వెంటనే తీవ్రమైన కడుపు నొప్పి బారిన పడే అవకాశం ఉంది. అలాగే శరీరంలో హై ట్రిగ్లిజరైడ్స్ స్థాయిలు ఎక్కువగా ఉండటం, కొన్ని రకాల మందులు వాడటం మరియు గతంలో ప్యాంక్రియాటైటిస్ బారిన పడిన చరిత్ర ఉండటం వంటి కారణాలు కూడా ఈ ముప్పును మరింత పెంచుతాయి. ఇది కూడా చదవండి:ఆరోగ్యకరమైన గుండె కోసం, ఉత్తమమైన వంట నూనెలు ఇవే! చాలా మంది అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ లక్షణాలను సాధారణ ఎసిడిటీ లేదా అజీర్ణం అనుకుని పొరపడుతుంటారు. కానీ దీని లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. పొట్ట పైభాగంలో తీవ్రమైన నొప్పి మొదలై అది వీపు వైపునకు పాకడం, నిరంతరం వికారం, వాంతులు, కడుపులో వాపు లేదా సున్నితత్వం, తిన్న తర్వాత నొప్పి మరింత ఎక్కువగా అనిపించడం దీని ప్రధాన లక్షణాలు. కొన్ని సందర్భాలలో జ్వరం మరియు గుండె వేగం పెరుగుదల కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుండి రక్షణ పొందడానికి జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆల్కహాల్ వినియోగాన్ని పూర్తిగా పరిమితం చేయడం లేదా మానుకోవడం మంచిది. పండగలు లేదా పార్టీలలో అతిగా తినకుండా మితంగా తీసుకోవడం, వేయించిన స్నాక్స్‌కు బదులుగా గ్రిల్ చేసిన, ఉడికించిన లేదా తేలికపాటి ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం మరియు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ద్వారా ప్యాంక్రియాస్ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువు తగ్గించే అమృతఫలం.. బేరి పండు ఆరోగ్య ప్రయోజనాలు! ఫుడ్ పాయిజనింగ్, రావడానికి అసలు కారణం ఇదే.. అన్నం నిల్వ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!     Alcohol And Pancreatitis, Heavy Food Effects On Pancreas, Pancreatic Inflammation Causes, Acute Pancreatitis Symptoms, Digestive Health Advice, Doctor Health Tips, Health Articles In Telugu.  
ఆరోగ్యానికి  శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే  సూత్రాలివి..!   నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిపోయి రకరకాల వ్యాయామాలు, డైట్లు చేయడం సర్వసాధారణమైంది. అయితే సరైన అవగాహన లేకుండా చేసే కొన్ని పద్ధతులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులు హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ప్రాణాలను బలిగొంటున్న సమస్య గుండె జబ్బులు.. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ రోజువారీ జీవితంలో చేసే చిన్న తప్పులే గుండె సమస్యలకు కూడా కారణం అవుతాయి. అవేంటో,  వైద్యులు వాటి గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. నీరు.. రోజూ ఎంత నీరు తాగాలి అనే విషయంలో చాలా మందిలో రకరకాల అపోహలు ఉన్నాయి. రోజుకు ఐదు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు తాగాలని కొందరు ప్రచారం చేస్తుంటారు. కానీ వైద్యపరంగా ఇది సరైన పద్ధతి కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అవసరానికి మించి విపరీతంగా నీరు తాగడం వల్ల శరీరంలో సోడియం , పొటాషియం స్థాయిల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల హైపోనేట్రిమియా వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంది. కేవలం ఒకటి రెండు లీటర్లకే నీటిని తాగడం  పరిమితం కాకుండా, ఎవరి శారీరక శ్రమ , వాతావరణ పరిస్థితులను బట్టి నీటి మోతాదు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం తాగే కేవలం మంచినీళ్లే కాకుండా, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సూప్స్, టీ, కాఫీ , ఇతర పానీయాలన్నీ కూడా శరీరానికి అందే ద్రవాల జాబితాలోనే లెక్కలోకి వస్తాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మన మూత్రం రంగు చక్కటి సూచికగా పనిచేస్తుంది. మూత్రం మరీ తెలుపుగా లేదా ముదురు పసుపు రంగులో కాకుండా, లేత పసుపు రంగులో ఉంటే శరీరం సరైన హైడ్రేషన్ స్థితిలో ఉన్నట్లు భావించవచ్చు. కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకే నీటి పరిమాణాన్ని పాటించాలి. ఆహారం.. ఇక ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, మనం రోజూ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ , ఇతర ఆహార పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉదయం పూట తినే చాకోస్ లేదా రెడీమేడ్ సీరిల్స్ పాలలో కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం అనుకుంటాం. కానీ వాటిలో కార్బోహైడ్రేట్లు, చక్కెర శాతం ఎక్కువగా ఉండి, శరీరానికి అవసరమైన ప్రొటీన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుండటం వల్ల అనారోగ్యకరమైన ఆహారం వైపు మనసు మళ్లుతుంది. దానికి బదులుగా ఉడికించిన గుడ్లు, మల్టిగ్రెయిన్ ఆహారాలు, ఇడ్లీ వంటి ప్రొటీన్తో కూడిన అల్పాహారం ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.  ఇది కూడా చదవండి మనసుపై ఒత్తిడి.. గుండెకు ప్రమాదం! అసలు నిజం ఇదే! అలాగే మనం ఇష్టపడి తినే బిర్యానీ, ఫ్రైస్ , బయట దొరికే టిఫిన్లు ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోతాయి. ఏ ఆహారాన్ని అయినా ఇంట్లో తక్కువ నూనెతో, సహజమైన పద్ధతిలో వండుకుంటే అది ఆరోగ్యకరమైనదే అవుతుంది. హోటళ్లలో లేదా బయట లభించే తినుబండారాలు త్వరగా తయారవ్వడం కోసం ఎక్కువగా నూనెను వాడతారు. వీటిని అప్పుడప్పుడు రుచి కోసం తీసుకోవడంలో తప్పు లేదు కానీ, రోజూ  అలవాటుగా మార్చుకోవడం మంచిది కాదు. అన్నం తినే విషయంలో కూడా వండే పద్ధతిని మార్చుకోవడం ద్వారా గ్లైసమిక్ ఇండెక్స్ ను తగ్గించవచ్చు. అన్నం వండేటప్పుడు గంజి వార్చడం మన పూర్వీకుల కాలం నుంచి ఉన్న పద్ధతి. దీని వల్ల అన్నంలో గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుందట. ఇది షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా సహాయపడుతుందట. వ్యాయామం.. ఫిట్నెస్ , మారథాన్ల పేరుతో విపరీతంగా శ్రమించడం, అలాగే రోజూ గంటల తరబడి ఒకే పొజిషన్ లో  కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగించి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు. కాబట్టి ఆఫీసుల్లో పని చేసేవారు లేదా సుదూర ప్రయాణాలు చేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి కాస్త నడవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఎవరి సలహాలనో గుడ్డిగా అనుసరించకుండా, మన శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుంటూ సరైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.   మీకు నచ్చవచ్చు   ఆహారం తినేటప్పుడు.. మీకు ఈ జబ్బు ఉందేమో చెక్ చేస్కోండి..!                                                                                                                                            *రూపశ్రీ.
  శరీరంలో కఫం పేరుకుపోవడం వల్ల చాలామంది నిత్య జీవితంలో ఎన్నో రకాల శ్వాసకోశ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మారుతున్న కాలం, వాతావరణంలో వచ్చే మార్పులు, వివిధ రకాల అలర్జీల కారణంగా ముక్కు దిబ్బడ, గొంతులో గరగర, ఛాతీలో కఫం గడ్డకట్టుకోవడం వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తుంటాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రకరకాల మందులు, యాంటీబయోటిక్స్ వాడుతుంటారు.  వీటి వల్ల తాత్కాలికంగా ఫలితం కనిపిస్తుంది కానీ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన ఇంట్లోనే దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో  తయారు చేసుకునే పానీయం  తాగడం వల్ల ఈ సమస్యను  శాశ్వతంగా తగ్గించుకోవచ్చు.  ఇంతకూ ఈ పానీయం ఏమిటి? దాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి?  ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కఫం.. మన శరీరంలో కఫం అనేది ఊపిరితిత్తులు, గొంతు, సైనస్ లేదా ముక్కు భాగాల్లో ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. ఇది ఎక్కడ పేరుకుపోయినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమే కాకుండా శరీరం ఎంతో అలసటకు గురవుతుంది. దీనిని నివారించడానికి వంటింట్లో లభించే నాలుగు ముఖ్యమైన పదార్థాలతో ఒక అద్భుతమైన పానీయం తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు..  తేనె.. తేనెలో అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గొంతులో ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. గొంతును ప్రశాంతంగా ఉంచుతూ, పేరుకుపోయిన గట్టి కఫాన్ని పల్చగా మార్చడానికి తేనె ఎంతగానో సహాయపడుతుంది.  అల్లం.. అల్లంలో జింజిరాల్స్ అనే శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇది ఒక సహజమైన డికంజస్టెంట్ లా పనిచేస్తుంది. గొంతులో , చాతిలో పేరుకుపోయిన మందపాటి కఫాన్ని కరిగించి, అది సులభంగా శరీరం నుంచి బయటకు వచ్చేలా చేయడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇది వాపులను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మిరియాలు.. మిరియాలు ముక్కు మార్గాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అక్కడ చిక్కుకున్న కఫాన్ని కరిగించి బయటకు పంపడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా, అల్లం , తేనెలోని పోషకాలు శరీరం త్వరగా గ్రహించేలా మిరియాలు సహాయపడతాయి. నిమ్మరసం.. నిమ్మరసంలో విటమిన్ సి  పుష్కలంగా  ఉండటం వల్ల ఇది శరీరానికి మంచి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. కఫానికి కారణమయ్యే అలర్జీలను అరికట్టి, గొంతు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా రక్షణ కల్పిస్తుంది. పై నాలుగు పదార్థాలను ఉపయోగించి ఈ కింది రెండు పద్ధతుల్లో దేనినైనా ఫాలో అవుతూ మంచి ఫలితం పొందవచ్చు.. మొదటి పద్దతి.. ఒక టీస్పూన్ తేనె తీసుకుని, అందులో తాజా అల్లం రసం లేదా అల్లం పొడి కలపాలి. ఆ తర్వాత చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి నేరుగా తీసుకోవాలి. ఇది గొంతులో కఫం ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం ఇస్తుంది. రెండవ పద్ధతి.. ఒక కప్పు నీటిని కొద్దిగా వేడి చేసి, అందులో అల్లం పొడి లేదా తురిమిన అల్లం, చిటికెడు మిరియాల పొడి, కొంచెం నిమ్మరసం వేయాలి. చివరగా ఒక టీస్పూన్ తేనె జోడించి బాగా కలపాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తేనె కలిపిన తర్వాత నీటిని మరిగించకూడదు. ఈ డ్రింక్ ను గోరువెచ్చగా ఉన్నప్పుడు నెమ్మదిగా తాగితే గొంతుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. పైన చెప్పుకున్న రెమిడీని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే తీసుకుంటే రాత్రంతా పేరుకుపోయిన కఫం కరిగిపోయి శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు తీసుకుంటే నిద్రలో కఫం అడ్డుపడకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ పద్ధతిని పాటిస్తే ముక్కు దిబ్బడ, గొంతు సమస్యలు పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది.                                     *రూపశ్రీ.