తెలంగాణ రాజకీయాలలో కవిత వ్యాఖ్యలు మరో సారి తీవ్ర దుమారం రేపాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేర సొంత పార్టీ ఏర్పాటు చేసిన కవిత.. అప్పటి నుంచీ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.  పలు ఇంటర్వ్యూలలో కవిత.. బీఆర్ఎస్ లో తనపై జరిగిన రాజకీయ కుట్రలను, ఎదుర్కొన్న అవమానాలను ఎలంటి శషబిషలూ లేకుండా కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతూ వస్తున్నారు.  తాజాగా మరో సారి ఆమె బీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. ఈ సారి ఆమె నేరుగా తన సోదరుడు కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.  కేటీఆర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో  కవితను తాము పార్టీ నుంచి పంపించలేదనీ..  ఆమెకు అనేక రాజకీయ అవకాశాలు కల్పించినప్పటికీ సొంత నిర్ణయాలతో దూరమయ్యారని పేర్కొన్న వ్యాఖ్యలకు కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు. ఏ వివరణ కోరకుండానే సస్పెన్షన్ వేటు వేయడం వెనుక సొంత పార్టీలోనే కొందరు కుట్రపన్నారన్నారు. ఈ  పరిణామాలు తనను మానసిక వేదనకు గురిచేశాయని,  తన కన్నతండ్రి  కేసీఆర్‌ను కూడా కలవనీయకుండా కొందరు  డ్డుకున్నారని కవిత ఈ సందర్భంగా చెప్పారు. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కోల్పోయిందని విమర్శించిన కవిత, కేసీఆర్ కుమార్తెగా ఉన్న తనకు పార్టీలో ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, ఇక సాధారణ కార్యకర్తల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త వేదికను ఏర్పాటు చేసి ప్రజల కోసం పోరాట బాట పట్టినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి అడుగుపెట్టే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. అదలా ఉండగా.. కల్వకుంట్ల కవిత విమర్శలు, ఆపోపణలపై బీఆర్ఎస్ అధినాయకత్వం సరైన రీతిలో స్పందించలేకపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, కవిత లేవనెత్తిన సాంకేతిక, వ్యక్తిగత అనుభవాలకు సమాధానం ఇవ్వలేకపోయారు.   Kalvakuntla Kavitha, KCR KTR BRS Dispute, Telangana Rakshana Sena, Telangana Politics, BRS Internal Conflicts
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ  జాతికి క్షమాపణ చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఇందిరా భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా వందేమాతర గేయాలాపన సందర్భంగా సోనియా వ్యవహరించిన తీరును తప్పపట్టిన అమిత్ షా, ఆమె 140 కోట్ల మంది భారతీయులకు క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.    మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ వర్ధంతిని పురస్కరించుకుని రాజస్థాన్‌ చిత్తోర్‌గఢ్‌లో  సోమవారం (ఆగస్టు 17) ఏర్పాటు చేసిన  అటల్ గౌరవ్ స్మృతి సమారోహ్ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా . ఈ సందర్భంగా వాజ్‌పేయీ  విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగ సభలో  ప్రసంగించారు.   ఈ సందర్భంగా ఆయన సోనియా గాంధీని ఉద్దేశించి..వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.   Amit Shah, Sonia Gandhi, Vande Mataram Row, Amit Shah Demands Apology, AICC Vande Mataram, BJP vs Congress
పార్లమెంటులోనైనా, అసెంబ్లీలోనైనా ప్రతిపక్ష పార్టీ హోదా, ప్రతిపక్ష నేత హోదా అనేది అడుక్కుంటేనో, దబాయిస్తేనొ రాదు. ఆ హోదా కావాలంటే సభలో మొత్తం స్థానాలలో కనీసం పది శాతం స్థానాలు ఉండాలి. అంటే జనం మీకు ఆ అర్హత ఉందని ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలలో పార్టీని గెలిపించాలి. ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.   నింబంధనల ప్రకారం విపక్ష నేతగా తనకు లేని, రాని హోదాను కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. అది పక్కన పెడితే.. విపక్ష హోదా ఇచ్చే వరకూ తాను కానీ, తన పార్టీ సభ్యులు కానీ అసెంబ్లీలో అడుగుపెట్టబోమంటూ శపథం చేశారు. ఇది చెరువుమీద కోపం వచ్చి ఏదో చేసినట్లుగా ఉందంటూ నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు. అది వేరే సంగతి. రాని హోదా కోసం అసెంబ్లీకి గైర్హాజరైతే నష్టం వైసీపీకే . సభకు గైర్హాజర్ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఉన్న అవకాశాన్ని ఆ పార్టీ కోల్పోతోంది.   ఇక పోతే ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి ఇంకో అడుగు ముందుకు వేసి దమ్ముంటే జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.  ఈ సవాల్ విసిరి ఆయన మరో సారి రాజకీయ జోకర్ గా నవ్వుల పాలయ్యారు. ముందే చెప్పినట్లు ప్రతిపక్ష నేత హోదా అయినా, ప్రతిపక్ష పార్టీ హోదా అయినా అడుక్కుంటేనో, దబాయిస్తేనే రాదు. ఆ హోదా ప్రజలు ఇవ్వాలి. కానీ వైసీపీని ప్రజలు గత ఎన్నికలలో పూర్తిగా తిరస్కరించారు. విపక్ష స్థాయి కూడా లేదని పక్కన కూర్చోపెట్టారు. అలా కాకుండా సవాళ్లు విసిరో, బతిమలాడుకునో ప్రతిపక్ష హోదాయో మరోటో దక్కించుకునే అవకాశమే ఉంటే.. రాహుల్ గాంధీ దమ్ముంటే నాకు ప్రధాని హోదా ఇవ్వండి అంటూ మోడీకి సవాల్ విసిరి ఆ పదవిని దక్కించేసుకోవచ్చు కదా? అంబటికి అర్ధంకానిదీ, అర్ధం చేసుకోవలసిందీ ఏమిటంటే..  ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి ఏ హోదా అన్నది నిర్ణయించేది ప్రజలు, వారి తీర్పును కాదని ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. అలాగని ప్రతిపక్షంలోనూ కూర్చోలేదు. ప్రజలు ఏం నిర్ణయించాలో అది శిరసావహించడమే రాజకీయపార్టీలైనా, నాయకులైనా చేయాలి. పదవులు, హోదాలూ సవాళ్లతోనో, దేబిరింపులతోనో రావు. సవాళ్లు చేసినంత మాత్రాన, బతిమలాడుకున్నంత మాత్రానా రాజ్యాంగ నిబంధనలు మారవు.  ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి ఏ హోదా ఇవ్వాలనేది ఎదుటి ప్రత్యర్థి ప్రభుత్వం నిర్ణయించదు.. ఓట్లేసే ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజా తీర్పు ఆధారంగానే చట్టసభల్లో స్థానాలు, పదవులు నిర్ణయమవుతాయి తప్ప, వీధి పోరాటాల సవాళ్లతో రాజ్యాంగ నిబంధనలు మారవు. Ambati Rambabu,  Opposition Leader Status, hallange, YS Jagan,  YCP, Andhra Pradesh Assembly, TeluguOne 
ALSO ON TELUGUONE N E W S
Christopher Nolan’s The Odyssey continues its remarkable theatrical run, emerging as one of the biggest Hollywood successes of 2026. The Matt Damon-led epic has now crossed the $1.29 billion mark worldwide, adding another major milestone to what has already been an extraordinary box-office journey. The film has maintained strong momentum even in its fifth weekend. The Odyssey added around $23.2 million in North America during its fifth weekend, pushing its domestic haul past the $500 million mark. The performance is particularly significant for a film positioned as a large-scale historical epic rather than a conventional franchise blockbuster. India has also turned out to be a major market for the film. The Odyssey has crossed the ₹150 crore net mark in India, with its gross moving close to ₹180 crore. The film has already become Christopher Nolan’s highest-grossing film in India, surpassing the filmmaker’s previous benchmarks and showing the growing appetite for Nolan’s cinema among Indian audiences. The biggest advantage for The Odyssey has been its theatrical positioning. Nolan has once again created a film that audiences want to experience on the biggest possible screen, with IMAX and premium formats playing an important role in its box-office performance. The scale of the production, combined with Nolan’s reputation for spectacle, has helped the film sustain its run beyond the initial opening. The movie opened in China this weekend and collected huge US$38 Million which propelled its collection further. The movie is just 50-60 Million away from current highest R-rated grosser Deadpool vs Wolverine and soon, Nolan's movie is going to take its place. It would be an absolute showcase of power and pedigree that a Nolan blockbuster holds not just in quality but box office collections wise too.    Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  అభిమానులు, ప్రేక్షకులు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'రాకా' కోసం ఎంతో రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబయ్‌లో షూటింగ్ జరుపుకుంటుండగా  భారతీయ సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా అతిపెద్ద కాస్టింగ్‌తో రాకా తెరకెక్కబోతుందనే  ప్రచారం ఇండియన్ సినీ సర్కిల్స్ లో చాలా కాన్ఫిడెన్స్ గానే చక్కర్లు కొడుతుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో గ్లామరస్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు సమాచారం. ఒక శక్తివంతమైన గిరిజన రాణి (Tribal Queen ) గా  కనిపించబోతున్నట్లు కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం పేరుకే గ్లామర్ కోసమో లేదా చిన్న అతిథి పాత్ర కోసమో కాకుండా, మొత్తం కథను సరికొత్త మలుపు తిప్పే అత్యంత కీలకమైన డ్రామాతో కూడిన రోల్ అని .ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్, మోడరన్ పాత్రల్లోనే అలరించిన జాన్వీ కపూర్, 'రాకా' సినిమాలో మునుపెన్నడూ చూడని 'రా అండ్ రస్టిక్' (Raw & Rustic) లుక్‌లో కనిపించి అందరినీ మెప్పించనుందట. అడవి నేపథ్యంలో జరిగే సన్నివేశాల్లో ఆమె ఊరమాస్ నటనతో మెస్మరైజ్ చేయడం  ఖాయం అని కూడా అంటున్నారు. Also Read: జ్ఞాపకశక్తి కోల్పోయిన ప్రముఖ #హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్ మరి ఈ న్యూస్ నిజమైతే జాన్వీ కపూర్ పెద్ది తర్వాత తెలుగు సిల్వర్ స్క్రీన్ పై కనిపించే మూవీ రాకా నే అవుతుంది. అదే విధంగా తన కెరీర్ కి మంచి బూస్టప్ ఖాయం. దీపికా పదుకునే ఆల్రెడీ రాకా లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. దీపికాతో పాటు మొత్తం ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం జరుగుతుండగా రష్మిక పేరు కూడా వినిపిస్తుంది. Raaka, Allu Arjun, Janhvi Kapoor, Deepika Padukone   ,
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, సాంగ్స్‌తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ‘ఇరుముడి’లోని భక్తి భావానికి మరింత ఎనర్జీని జోడిస్తూ మేకర్స్ మోస్ట్ అవైటెడ్ ‘మల్లెపూల పల్లకి’ పాటను విడుదల చేశారు. గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో లాంచ్ చేసిన ఈ పాట.. అందరికీ సుపరిచితమైన అయ్యప్ప భక్తి గీతానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. అయ్యప్ప భక్తుల్లో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉన్న ఒరిజినల్ ‘మల్లెపూల పల్లకి’ పాటలోని భక్తి భావాన్ని అలాగే ఉంచుతూ.. ‘ఇరుముడి’ కోసం సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ దీనికి కొత్త మ్యూజికల్ టచ్ ఇచ్చారు. గ్రాండ్ ఆర్కెస్ట్రేషన్, పవర్‌ఫుల్ రిథమ్స్‌తో పాటను మరింత ఎనర్జిటిక్‌గా తీర్చిదిద్దారు. పాట మొదలైన వెంటనే దాని పవర్‌ఫుల్ బీట్స్, డప్పు రిథమ్స్ ఆకట్టుకుంటాయి. సాంప్రదాయ భక్తి భావాన్ని, రవితేజ సినిమాల్లో ఉండే మాస్ ఎనర్జీని అద్భుతంగా కలిపారు. ఒరిజినల్ పాటకు తన ప్రత్యేకమైన గొంతుతో గుర్తింపు తెచ్చుకున్న డప్పు శ్రీను మరోసారి తన వాయిస్‌తో పాటకు రా, డివోషనల్ ఫీల్ తీసుకొచ్చారు. అయ్యప్ప స్వామి భక్తుడి గెటప్‌లో కనిపించిన రవితేజ, తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ప్రతి బీట్‌కు తగ్గట్టుగా వేసిన ఆయన డ్యాన్స్ మూవ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ పాటకు పక్కా మాస్ అప్పీల్‌ను తీసుకొచ్చాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా పాటకు మరింత బలం చేకూర్చింది. పెద్ద సంఖ్యలో భక్తులు, సింక్రనైజ్డ్ డ్యాన్స్ మూవ్స్, గ్రాండ్ విజువల్స్‌తో పాటను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. జీవీ ప్రకాష్ కుమార్ ఎనర్జిటిక్ అరేంజ్‌మెంట్, డప్పు శ్రీను పవర్‌ఫుల్ వోకల్స్, రవితేజ మాస్ ఎనర్జీ, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ.. ఈ నాలుగు కలిసి ‘మల్లెపూల పల్లకి’ పాటకు గూస్‌బంప్స్ తెప్పించే అనుభూతిని అందిస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో భక్తి సన్నివేశాలకు ఈ పాట మరింత హై ఇంపాక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒరిజినల్ సింగర్ డప్పు శ్రీను పాడినప్పటికీ.. ఎందుకనో ఆ ఒరిజినల్ సాంగ్ వైబ్ రావడంలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం.. మొదటిసారి విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ, వింటున్న కొద్దీ ఒరిజినల్ సాంగ్ విన్న వైబ్ కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.      Mallepoola Pallaki Song, Irumudi Movie, Ravi Teja, Dappu Srinu, Mallepula Pallaki  
    స్టార్ హీరో సూర్య, మమిత భైజు, రాధిక, వెంకీ అట్లూరి, సితార ఎంటర్ టైన్ మెంట్ కాంబోలో వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ వరల్డ్ వైడ్ గా వీరవిహారం చేస్తుంది.  శనివారం, ఆదివారం రోజు అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్స్ తో దర్శనమిచ్చాయి. బ్లాక్ లో  టికెట్స్ అమ్మే వాళ్ళు సైతం ఈ సారి అమ్మేది లేంటూ వాళ్ళు కూడా ఫ్యామిలీతో విశ్వనాధ్ అండ్ సన్స్ ని చూస్తున్నారు. దీన్ని బట్టి విశ్వనాధ్ సునామిని అర్ధం చేసుకోవచ్చు. మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 110 22 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నిన్న సాయంత్రమే 100 కోట్ల క్లబ్ లోకి చేరినట్టుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధికారకంగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది..తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా  34 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం, రెండవ రోజు శనివారం రెట్టింపు చేసుకుని ఏకంగా . 74.47 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. ఇంటర్నేషనల్ వైడ్‌గా 31 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించడమే కాకుండా, యూఎస్ (US) బాక్సాఫీస్ వద్ద అతివేగంగా 1 మిలియన్ డాలర్ మార్కును దాటి సూర్య కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది.  ఈ ఘన విజయానికి సూర్య ప్రదర్శించిన  వన్ మ్యాన్ షో పెర్ ఫార్మెన్స్.  బడా మిలినీర్ సంజయ్ విశ్వనాధ్ గా సూర్య సినిమా ఫస్ట్ నుంచి చివరి దాకా ఒకే మోడ్ లో నటించాడు. అసలు అలాంటి పెర్ఫార్మ్ చెయ్యాలంటే కత్తి మీద సామే. ఒక రకంగా నటనకే నటన నేర్పాడని  చెప్పవచ్చు . 'మాడి' గా  మమితా బైజు, సంజయ్ విశ్వనాధ్ తల్లిగా  రాధికా శరత్‌కుమార్ పెర్ఫార్మ్ కూడా ఒక రేంజ్ లో ఉంది. జి. వి. ప్రకాష్ కుమార్ అందించిన హృదయానికి హత్తుకునే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి సీన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. నాలుగుపదుల వయసు దాటిన  బడా మిలినియర్ సంజయ్ విశ్వనాధ్ కి, అతని కొడుక్కి, అబ్రాయిడ్ దేశంలో మెడిసిన్ చదివే మాగికి మధ్య జరిగిన కథనే విశ్వనాధ్ అండ్ సన్స్. viswanath And Sons, Suriya, mamitha Bhaiju, Radhika, Venki ATluri    
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా విభిన్న పాత్రలతో మెప్పిస్తున్న విలక్షణ నటుడు శివాజీ ఇటీవల ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన చేసిన ఒక ఊహించని సాయం తన జీవితాన్నే మార్చేసిందని తెలిపారు. తన కెరీర్ ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ హిట్ ‘మాస్టర్’ సినిమాలో నటించే సువర్ణావకాశం వచ్చిందని శివాజీ చెప్పారు. అయితే ఆ సమయంలో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిపారు. ఆ విషయం చిరంజీవి దృష్టికి వెళ్లగానే, ఆయన తనను దగ్గరకు పిలిచి రూ. 10 వేల నోట్ల కట్టను చేతిలో పెట్టి ఆదుకున్నారని వెల్లడించారు. ఆ రోజు చిరంజీవి చేసిన సాయం తన మనసును ఎంతో కదిలించిందని, ఆ సంఘటనే తనలో సేవాభావాన్ని పెంచిందని శివాజీ పేర్కొన్నారు. నేటికీ తాను ఎవరికైనా సహాయం చేయగలుగుతు న్నానంటే దానికి మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తే కారణమని కొనియాడారు. ఇదే క్రమంలో భవిష్యత్తులో చిరంజీవి సినిమాలో ఆయనకు విలన్‌గా నటించడమే తన జీవితంలో అతిపెద్ద కల అని శివాజీ తన మనసులోని మాటను బయటపెట్టారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి హైదరాబాద్ వచ్చిన శివాజీ, ఎడిటర్, యాంకర్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు విభాగాల్లో పనిచేశారు. 'శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి' చిత్రంతో గుర్తింపు పొంది, ఆ తర్వాత 'మిస్సమ్మ', 'తాజ్‌మహల్' వంటి విజయవంతమైన చిత్రాల్లో కథానాయకుడిగా అలరించారు. నటుడిగానే కాకుండా పలు చిత్రాలకు డబ్బింగ్ చెప్పి ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన పిల్లల కోరిక మేరకే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని శివాజీ స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన ‘#90's’ వెబ్ సిరీస్ తో పాటు ‘కోర్టు’ చిత్రంలో ఆయన పోషించిన క్రూరమైన ‘మంగపతి’ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతున్నాయి. కష్టాల్లో ఉన్న చిన్న నటుడిని పిలిచి సహాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి పెద్ద మనసును నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లోనూ వైవిధ్యమైన పాత్రలతో బిజీగా ఉన్న శివాజీ, భూమికతో కలిసి 'ప్రేమకు నమస్కారం' అనే చిత్రంలో నటిస్తున్నారు. భవిష్యత్తులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆయనకు విలన్‌గా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
'అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ప్రధాన పాత్రధారులు MC హరి, మనోజ్, శశిధర్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. వారు చెప్పిన సంగతులివే.. ‘అమీర్ లోగ్’ ఎంతో నేచురల్‌గా ఉంటుంది. సినిమాని చూసినట్టుగా ఉండదు. హైదరబాద్ బస్తీలోకి వెళ్లినట్టుగా, ఆ బస్తీల్లో జీవిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మా డైరెక్టర్ గారి అత్తగారి ఇల్లు, ఆ బస్తీలోనే షూటింగ్ చేశాం. అక్కడి వాళ్లంతా మా అందరినీ ఎంతో కేరింగ్‌గా చూసుకున్నారు. సింక్ సౌండ్‌లో ఈ మూవీని చేశాం. అందుకే ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా షూటింగ్ ఆపేవాళ్లం. పైనా విమానం వెళ్లినా, ఏసీ సౌండ్ వచ్చినా కూడా ఆపేవాళ్లం. రోడ్ల మీద తీసిన సీన్లకు మాత్రమే డబ్బింగ్ చెప్పాం. అది కూడా దాదాపు ఐదు శాతం మాత్రమే ఉంటుంది. మేం బస్తీల్లోనే పెరిగాం. తెలంగాణ యాస, బస్తీ లైఫ్ కథ అవ్వడంతో మాకు చాలా సులభంగా మారింది. మా పాత్రలు రియల్ లైఫ్ కారెక్టర్స్‌కి దగ్గరగా అనిపించాయి. రమణ అన్న ఎంతో నేచురల్‌గా, ఎంతో సింపుల్‌గా సినిమాని తీశారు. ‘అమీర్ లోగ్’ చిత్రంలో బిర్యానీ అనేదే మెయిన్ పాయింట్. ఆ బిర్యానీ చుట్టూనే మా పాత్రలు తిరుగుతాయి. అది ఏంటి అన్నది సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్‌ని చూస్తే బిర్యానీ వాసన వస్తుంది. సెకండాఫ్‌లో బిర్యానీ టేస్ట్ తెలుస్తుంది. క్లైమాక్స్‌కి కడుపు నిండినట్టు అనిపిస్తుంది. షూటింగ్‌లోనే ఓ క్లౌడ్ కిచెన్ ప్రారంభించాం. అక్కడ వండిన వంటలే అందరం తిన్నాం. మాకు సీన్స్ లేకపోతే కిచెన్‌కి వెళ్లి పని చేసేవాళ్లం. మాకు వంట వండటం కూడా అలవాటు అయింది. తెరపై మేం ముగ్గురం ఎక్కువగా కనిపించినా.. మా సినిమాలో మహిళా పాత్రలే కీలకంగా ఉంటాయి. అమ్మానాన్నలు, అక్క, అన్న, వదిన, పక్కింటి పాత్రలు ఇలా అన్ని కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా, అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది. మా సినిమా అంతా కూడీ ఫీమేల్ సెంట్రిక్‌గా ఉంటుంది. ‘అమీర్ లోగ్’ అవుట్ పుట్ చూశారు కాబట్టే మా దర్శకుడు రమణన్న గారు అంత కూల్‌గా ఉంటున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా తీయగలిగారు. సినిమా చూశాక మా అందరికీ ఎంతో కాన్ఫిడెంట్ వచ్చింది. మంచి ప్రొడక్ట్ మా చేతుల్లో ఉంది. దాన్ని ఇలా ప్రమోట్ చేసుకుంటున్నాం. రానాగారి టీం మా సినిమాని చూసింది. హైదరాబాద్‌లో ముందు ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత అన్ని ఏరియాల్లో కవర్ చేయండని రానా గారు చెప్పారు. త్వరలోనే ఆయన కూడా సినిమాని చూస్తారు. మా సినిమాలోని ఎమోషన్‌ను స్మరణ్ మ్యూజిక్ మరో స్థాయికి తీసుకు వెళ్లింది. ఆయన పాటలే ఈ చిత్రానికి ప్రాణం. ఆయన ఇచ్చిన మ్యూజిక్, ఆర్ఆర్‌తో సినిమా నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లింది.  రెగ్యులర్ తెలుగు సినిమాల్లో ఉండేలా కాకుండా ఇందులో హిందీ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ, హైదరాబాద్ అంటే తెలీకుండానే కొన్ని పదాల్లో హిందీ, ఉర్దూ వచ్చేస్తుంది. మరీ హై లెవెల్లో కాకుండా సాధారణ జనాలకు అర్థమయ్యేలానే భాషను వాడాం. ఇక్కడి భాషకి, యాసకి అడ్రెస్‌లా మా ‘అమీర్ లోగ్’ సినిమా ఉంటుంది. భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది.
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్-ఇండియా రేంజ్‌లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న రాకింగ్ స్టార్ యశ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గతంలో చేసిన ఓ వివాదాస్పద కామెంట్‌పై తాజాగా నోరు విప్పారు. గతంలో రష్మిక తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఓ జాతీయ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ యశ్ తనదైన శైలిలో మెచ్యూర్డ్‌గా బదులిచ్చారు. 2017లో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన సమయంలో రష్మిక ఒక టీవీ షో ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో కన్నడ ఇండస్ట్రీలో ‘మిస్టర్ షో ఆఫ్’ ఎవరు అనే ప్రశ్నకు యశ్ పేరు చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో యశ్ అభిమానులు రష్మికపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేశారు. దీంతో పరిస్థితి తీవ్రతను గ్రహించిన రష్మిక బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై సుదీర్ఘ కాలం తర్వాత స్పందించిన యశ్, "ఆమె ఏ ఉద్దేశంతో అలా మాట్లాడిందో నాకు తెలియదు. అప్పట్లో రష్మిక ఇండస్ట్రీకి చాలా కొత్త. కొన్ని టీవీ షోలలో యాంకర్లు ఆప్షన్లు ఇచ్చి ఏదో ఒకటి ఎంచుకోమంటారు, ఆ క్రమంలోనే ఆమె అలా చెప్పి ఉండవచ్చు. అయినా ఎవరి అభిప్రాయం వారిది, ఒకరి ఆలోచన లేదా దృష్టికోణం నా నిజమైన వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ మార్చలేదు" అని చాలా కూల్‌గా తేల్చి చెప్పారు. అంతేకాకుండా తన అభిమానులను ఉద్దేశించి యశ్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. "ఇతర నటీనటులను గౌరవించకుండా వారిపై వ్యక్తిగత దాడులు చేసేవారు, అభ్యంతరకరంగా మాట్లాడేవారు నా అభిమానులు కానే కారు" అని యశ్ తేల్చి చెప్పారు. తోటి కళాకారుల అభిప్రాయాలను గౌరవించాలని ఆయన తన ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం యశ్ చేసిన ఈ సంచలన కామెంట్స్ సోషల్ మీడియాలో నెటిజన్లు, మూవీ లవర్స్ మధ్య తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. వివాదాలకు దూరంగా ఉంటూ, పక్కటింటి హీరోలా స్పందించిన యశ్ మెచ్యూరిటీకి అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న యశ్ ‘టాక్సిక్’ చిత్రం ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు నితీష్ తివారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణ’లో యశ్ రావణుడి పాత్రలో మెరవనుండటంతో అభిమానులు ఈ ప్రాజెక్టుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Sony Pictures Networks India today announced Celebrity MasterChef Tamil, with Samantha Ruth Prabhu set to headline the globally celebrated culinary format for Tamil audiences on Sony VIZHA and Sony LIV. Bringing together the irresistible worlds of celebrity, food and competition, Celebrity MasterChef Tamil will see some of Tamil entertainment’s most recognisable faces step away from the sets and into the kitchen, as they take on demanding culinary challenges, unexpected twists and the pressure of creating dishes that win both the challenge and the audience. Produced by Banijay Asia, Celebrity MasterChef Tamil draws on the global legacy of the MasterChef format while creating an experience that is unmistakably Tamil with local flavours, familiar personalities, and the unique chemistry of Tamil celebrity culture at its heart. The show will be a key entertainment offering on Sony VIZHA, extending across Sony LIV and digital platforms with exclusive short-form content that takes audiences beyond the main episodes and closer to the celebrities, their culinary journeys, challenges and memorable moments in the kitchen. Speaking about the show, Samantha Ruth Prabhu said, _“I’m incredibly excited to finally share this with everyone. Celebrity MasterChef Tamil is unlike anything I’ve done before, and that’s exactly what made it impossible to say no. Food has a wonderful way of bringing people together, creating memories, and revealing a side of you that the cameras don’t usually get to see. What I’m most excited about is watching some of our favourite Tamil celebrities’ step into the kitchen, take risks, make mistakes, surprise themselves, and compete with a lot more passion than you’d expect! I wish I could tell you who’s cooking, but where’s the fun in that? I can’t wait for everyone to experience what we’re cooking up with Sony Vizha.”_ With Samantha at the helm and some of Tamil entertainment’s most recognisable faces stepping into the kitchen, Celebrity MasterChef Tamil promises a fresh and celebratory take on celebrity cooking, bringing together food, fame, competition and the warmth of Tamil culture in one entertaining experience.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.    https://www.instagram.com/reel/DcDmz_VJGad
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                  *రూపశ్రీ.  
ఒక దేశం స్వేచ్ఛా కాంక్షతో.. పోరాటం చేసి సాధించుకున్న విజయమే స్వాతంత్ర్యం.. భారతదేశం 80 ఏళ్ళ కిందట బ్రిటీష్ వారి బానిసత్వం నుండి విముక్తి కోసం పోరాటం చేసింది,  స్వేచ్ఛను సంపాదించుకుంది.  ఈ సందర్బంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం  జరుపుకుంటారు. 1947లో బ్రిటిష్ వలస పాలన నుండి దేశానికి లభించిన విముక్తికి గుర్తుగా దేశమంతా జరుపుకునే పండుగే  స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన లెక్కలేనంత మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు, అవిశ్రాంత కృషికి ఈ రోజు ఒక నివాళి. స్వాతంత్ర పోరాటం ముగిసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఒక శకం ముగిసి,  కొత్త శకం ప్రారంభమైందని చెప్పవచ్చు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి చేసిన కృషి,  జరిగిన సంఘటనలు, త్యాగాల గురించి వివరంగా తెలుసుకుంటే.. పోరాటం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం దాదాపు రెండు శతాబ్దాల పాటు సాగిన ఒక సుదీర్ఘమైన, కఠిన ప్రయాణం. ఇది 1857 తిరుగుబాటుతో ప్రారంభమైంది.  దీనిని మొదటి స్వాతంత్ర్య యుద్ధం అని కూడా పిలుస్తారు, ఇందులో భారతీయ సైనికులు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ సంఘటన జాతీయ చైతన్యాన్ని రగిలించింది, ఇది చివరికి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి దారితీసింది. 20వ శతాబ్దం ప్రారంభంలో గాంధీజి వంటి ప్రముఖ నాయకులు ఉద్భవించారు. ఆయన సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాల ద్వారా అహింసాయుత ప్రతిఘటనను సమర్థించారు. ఈ ఉద్యమాలు బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం కోరడానికి లక్షలాది మంది భారతీయులను ఉత్తేజపరిచాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీని భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు .   ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం.. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి, స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ తన చారిత్రాత్మక "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (విధితో వాగ్వాదం) ప్రసంగాన్ని అందించారు. సుబాష్ చంద్రబోస్.. ఆజాద్ హింద్ సేన.. సుభాష్ చంద్ర బోస్, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అహింసా ఉద్యమం వల్ల నెమ్మదిగా ఉన్న పోరాటానికి  నిరాశ చెందిన బోస్, స్వాతంత్ర్యం సాధించడానికి మరింత దూకుడు మార్గాలను అన్వేషించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జపాన్ సహాయంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. దీన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ అంటారు. భారతీయ సైనికులు , ప్రవాసులతో కూడిన ఆజాద్ హింద్ సేన, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడింది. భారతదేశానికి విముక్తి కల్పించడంలో సైన్యం విజయం సాధించనప్పటికీ, బోస్ చేసిన ప్రయత్నాలు చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి . భారత స్వాతంత్ర్య ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. స్వాతంత్ర్యం కోసం బోస్ చేసిన కృషి  వర్ణించలేనిది. గోవా, హైదరాబాద్ విమోచనం.. 1947 స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత కూడా కొన్ని ప్రాంతాలు విదేశీ లేదా రాచరిక పాలనలో ఉన్నాయి. పోర్చుగీసు వలస ప్రాంతమైన గోవా, “ఆపరేషన్ విజయ్” అనే సైనిక తిరుగుబాటు తర్వాత 1961లో విముక్తి పొందింది. భారత సాయుధ దళాలు గోవాను భారత యూనియన్‌లో విజయవంతంగా విలీనం చేసి, 451 సంవత్సరాల పోర్చుగీసు పాలనకు ముగింపు పలికాయి. హైదరాబాద్ నిజాం మొదట్లో స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నారు, కానీ చివరికి 1948లో “ఆపరేషన్ పోలో” అనే సైనిక తిరుగుబాటు ద్వారా భారతదేశంలో విలీనం చేయబడింది. ఇది కొత్తగా ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో ఆ సంస్థానం యొక్క ఏకీకరణను నిర్ధారించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్.. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్, విచ్ఛిన్నమైన సంస్థానాలను భారత యూనియన్‌గా ఏకీకృతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా మరియు హోం మంత్రిగా, ఈ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యేలా చూడటానికి పటేల్ దౌత్యపరమైన , కొన్నిసార్లు బలప్రయోగ చర్యలను కూడా ఉపయోగించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో ఆయన చేసిన కృషి, ఆయనకు అపారమైన గౌరవాన్ని , భారత చరిత్రలో ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించిపెట్టింది. బలమైన, ఐక్య భారతదేశానికి పునాది వేయడంలో పటేల్ దార్శనికత, నాయకత్వం కీలక పాత్ర పోషించాయి. దేశానికి ఆయన చేసిన సేవలకు నిదర్శనంగా నిలుస్తూ, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' విగ్రహం ఆయన వారసత్వాన్ని శాశ్వతంగా నిలిపింది.                                                                                                                                                   *రూపశ్రీ.
మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి.  తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి.  అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది.  కొందరు నిదానంగా తింటారు.  మరికొందరు చాలా వేగంగా తింటారు.  అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు.  కుటుంబ సభ్యులు అయినా,  స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు.  వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్  చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం  కాకుండా ఆ తరువాత  సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట.   స్ట్రాంగ్ ప్రాక్టీస్  ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం  కంటే తినడాన్ని కూడా ఒక  పనిగా భావిస్తారని అంటున్నారు.  తినే వేగాన్ని బట్టి వ్యక్తిత్వం లక్షణాలను,  తినే వేగానికి,  వ్యక్తిత్వానికి మధ్య గల సంబంధాలను వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు కనుక్కున్నారు. వేగంగా తినేవారు తరచుగా వేచి ఉండటానికి ఇష్టపడరు. ఇది క్యూలలో నిలబడినా, నెమ్మదిగా మీటింగ్స్  లో ఉన్నా లేదా ఆహారం వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వచ్చినా.. ఇలా అన్ని సందర్బాలలో వారు అన్ని వేగంగానే జరగాలని కోరుకుంటారట.  అన్ని విషయాలలోనూ సహజంగా వేగాన్ని వీరు ఇష్టపడతారట. ఈ ధోరణి భోజన చేయడం వరకు తీసుకువెళుతుందట.  చాలామందిలో తినే స్వభావం మానసిక , పర్యావరణ కారకాల ద్వారా ఏర్పడతాయని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు.   వేగంగా తినే వ్యక్తులలో ఇతర పనులను కూడా వేగంగా పూర్తీ చేసే సామర్థ్యం ఉంటుందట. వర్తమానంతో పూర్తీగా నిమగ్నమవడానికి బదులుగా  తరువాత ఏమి జరుగుతుందో  అనే విషయం పై దృష్టి పెట్టేలా చేస్తుందట.  ఈ కారణంగా వీరికి భవిష్యత్తు గురించి స్పష్టమైన అంచనాలు, ప్రణాళికలు కూడా ఉంటాయట. అలాగని వేగంగా తినడాన్ని సమర్థించడం లేదు. ఎందుకంటే.. వేగంగా తినడం అనేది ఆహారం సరిగా నమలకపోవడం, తినే ఆహారం మీద దృష్టి పెట్టలేకపోవడం,  ఆహారం అతిగా తినడం.. ఇలా చాలా సమస్యలకు కారణం అవుతుంది.                                                                                                                                                   *రూపశ్రీ.  
గుడ్లు పోషకాహారం యొక్క పవర్హౌస్.  ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, అవసరమైన విటమిన్లు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గుడ్డు తినడం చాలామంచిదని చెబుతూ ఉంటారు.  అయితే  రోజూ రెండు ఉడికించిన గుడ్లు తినడం  మంచిదేనా? ఫిట్‌నెస్ ట్రైనింగ్ లో ఉన్నవారు,  పోషకాహార లోపంతో ఉన్నవారు ప్రతిరోజూ గుడ్డు తినాలని చెబుతుంటారు.  రోజుకు రెండు ఉడికించిన గుడ్లు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇది శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. ఎముకలను బలోపేతం చేస్తుంది.. గుడ్లలో విటమిన్ డి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎముక సాంద్రతను మెరుగుపరచడంలో , బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే ఎముకల బలానికి కావలసినంత కాల్షియం,  విటమిన్-డి పొందవచ్చు. మెదడు ఆరోగ్యానికి.. గుడ్లలో కోలిన్ ఉంటుంది, ఇది మెదడు పనితీరు,  జ్ఞాపకశక్తికి చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజు రెండు ఉడికించిన గుడ్లు తింటూ ఉంటే.. అది మెదడు  చురుగ్గా ఉండటానికి,  మెదడు  ఆరోగ్యానికి తోడ్పడుతుంది ,  అలాగే నరాల పనితీరును  కూడా మెరుగ్గా ఉంచుతుంది. కంటి ఆరోగ్యానికి.. గుడ్లలో ల్యూటిన్ , జీక్సాంథిన్ ఉంటాయి. ఇవి వయస్సు సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ నుండి కళ్ళను రక్షించే యాంటీఆక్సిడెంట్లు.  మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి.. గుడ్లలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, సమతుల్య ఆహారంతో పాటు మితంగా గుడ్లు తినడం వల్ల మంచి HDL కొలెస్ట్రాల్ పెరిగి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్ కు మంచిది.. రెండు ఉడికించిన గుడ్లు సుమారు 12 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, మరమ్మత్తు , కడుపు నిండిన ఫీలింగ్ ఇవవ్డంలో సహాయపడతాయి. ఫిట్‌నెస్ ప్రియులకు , లీన్ కండరాలను కాపాడుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. బరువు నిర్వహణకు.. గుడ్లలో అధిక ప్రోటీన్ , తక్కువ కేలరీలు ఉంటాయి.  దీని కారణంగా ఉడికించిన గుడ్లు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి , శరీరానికి కావలసిన పోషకాలు కూడా మెరుగ్గా అందిస్తాయి. ఇవి అతిగా తినడాన్ని,  వెంటనే ఆకలి కావడాన్ని అరికట్టడానికి , బరువు నిర్వహణకు సహాయపడతాయి.                                                                                                                                                   *రూపశ్రీ.
కాళ్లు, చేతులు తిమ్మిరిగా అనిపించడం, జలదరింపు రావడం చాలామందికి అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం లేదా నరాలపై ఒత్తిడి పడటం వల్ల తాత్కాలికంగా తిమ్మిర్లు రావచ్చు. అయితే పదేపదే తిమ్మిర్లు రావడం, ఎక్కువసేపు తగ్గకపోవడం లేదా శరీరంలో ఒక వైపు మాత్రమే అకస్మాత్తుగా తిమ్మిరి రావడం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడానికి నరాలకు సంబంధించిన సమస్యలు ఒక కారణం కావచ్చు. నరాలు దెబ్బతిన్నప్పుడు తిమ్మిరితో పాటు మంట, జలదరింపు, సూదులు గుచ్చినట్టుగా అనిపించడం, నొప్పి లేదా చేతులు, కాళ్లలో బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే శరీరంలో ఒక వైపు అకస్మాత్తుగా చేయి లేదా కాలు తిమ్మిరిగా మారడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలను మాత్రం ప్రత్యేకంగా గమనించాలి. ముఖ్యంగా వీటితో పాటు ముఖం ఒక వైపు వంగడం, మాట స్పష్టంగా రాకపోవడం, నడవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అవి బ్రెయిన్ స్ట్రోక్‌కు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు కావచ్చు. ఇలాంటి సమయంలో ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే సాధారణంగా వచ్చే తిమ్మిరికి, నరాల దెబ్బతినడం లేదా స్ట్రోక్‌కు సంబంధించిన తిమ్మిరికి తేడా ఏమిటి? ఏ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? శరీరంలో ఒక వైపు మాత్రమే తిమ్మిరి ఎందుకు వస్తుంది? ఈ విషయాలపై Dr. Anirudh Deshmukh ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. సాధారణ తిమ్మిరి ఎప్పుడు ఆందోళన చెందాల్సిన సమస్యగా మారుతుంది? నరాల సమస్యకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి? స్ట్రోక్‌ను సూచించే సంకేతాలు ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. అకస్మాత్తుగా ఒక వైపు తిమ్మిరి, బలహీనత లేదా స్ట్రోక్‌ను సూచించే ఇతర లక్షణాలు కనిపిస్తే స్వయంగా చికిత్స చేసుకోకుండా వెంటనే వైద్య సహాయం పొందండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)