డిజిటల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా వ్యవహరించి, ప్రజల మనోభావాలను దెబ్బతీసే వారిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు వారిలో పశ్చాత్తాపం కలిగేలా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన వివాదాస్పద యూట్యూబర్ బాచలకురి జోసెఫ్, అలియాస్  ప్రశ్న రావణ్ తాను సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.  మతపరమైన మనోభావాలను గాయపరచడం, దేవుళ్లను దూషించడం,  రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు.    వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఏపీ పోలీసులు ప్రశ్న రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వ్యాఖ్యల తీవ్రతను బట్టి అధికారులు ఈ కేసులో కఠినమైన చట్టాలను ప్రయోగించారు. ముఖ్యంగా దేశ భద్రతకు, శాంతిభద్రతలకు భంగం కలిగించే అంశాల కింద ఉపా  చట్టంతో పాటు దేశద్రోహ సెక్షన్లను కూడా అతడిపై నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు అనుకున్న అతడికి, చట్టం చేతికి చిక్కిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏమిటో స్పష్టంగా అర్థమయ్యాయి. పోలీస్ కస్టడీలో భాగంగా అధికారులు జరిపిన  విచారణలో ప్రశ్న రావణ్ కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. తాను గతంలో చేసిన తప్పులకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నట్లు అతడు అంగీకరించినట్లు తెలుస్తోంది. అనేక సున్నితమైన అంశాలపై తాను అనవసరంగా అతిగా స్పందించానని, దానివల్ల అనూహ్య సమస్యలను కొనితెచ్చుకున్నానని విచారణాధికారుల ఎదుట అతడు వాపోయినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఇలాంటి వివాదాస్పద ధోరణులకు దూరంగా ఉండాల్సిందని, ఈ పరిణామాలు తన జీవితంలో పెద్ద గుణపాఠం నేర్పాయని ప్రశ్నరావణ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేవుళ్లపై   అభ్యంతకరమైన వీడియోలపై పోలీసుల ప్రశ్నలకు.. అతడు చేశానంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలా విషయాల జోలికి వెళ్లకుండా ఉండాల్సిందని ప్రశ్న రావణ్ కన్ఫెస్ అయినట్లు సమాచారం.   అయితే..  ఈ విచారణలో భాగంగా అధికారులు అతడి ఆర్థిక లావాదేవీలు, యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చిన సంపాదనపై కూపీ లాగారు. ఛానెల్ ఆదాయం,  బ్యాంకు లావాదేవీల గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలలో చాలా వాటికి అతడు సరైన సమాదానం ఇవ్వలేదని తెలుస్తోంది.    [Prashna Ravan, Bachalakuri Joseph, AP Police UAPA Cases, YouTube controversial videos,Social Media Misuse, Confess]
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఎదుర్కొనే దమ్ము కాంగ్రెస్‌కు లేదని అన్నారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయిం చిందని ఆరోపించారు. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ను రాజకీయ నిమజ్జనం చేయడం తథ్యమని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఫాంహౌజ్ వ్యవహారంపై కూడా బండి సంజయ్ స్పందించారు. ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం మీకెక్కడిదని నిలదీశారు. ఫాంహౌజ్‌లో ప్రభుత్వ భూములు ఉంటే వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా అని ప్రశ్నించిన ఆయన.. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే చర్యలు తీసుకో వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు. భూదోపిడీ జరిగితే ఆధారాలతో సహా బయటపెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. భూముల స్వాధీ నంతోపాటు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఫాంహౌజ్‌ను సందర్శిస్తే అర్థం చేసుకోవచ్చని, కానీ అధికార పార్టీ ఫాంహౌజ్‌ ను సందర్శించడం విడ్డూ రంగా ఉందని వ్యాఖ్యానిం చారు.రాష్ట్రంలో 22ఏ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని బండి సంజయ్ అన్నారు. ప్రజల సమస్య లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తా మని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమకు పోటీ కానేకాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. రాజకీయంగా కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మరోవైపు గణేశ్ నవరాత్రి ఉత్సవా లను ప్రశాంతంగా నిర్వహించుకుందామని బండి సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు. భక్తిశ్ర ద్ధలతో ఉత్సవాలను జరుపుకోవడంతో పాటు శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అందరూ సహకరించాలని కోరారు.     [ Bandi Sanjay Kumar, Congress party, Supreme Court, BJP, BRS, Danam Nagender, Khairatabad by-election, CM Revanth reddy ]
చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అన్న నానుడి ఇప్పుడు జగన్ కు సరిగ్గా అతికినట్లుగా సరిపోతుంది. గతంలో తనకు అండగా నిలబడి, తన కోసం కష్టపడి పని చేసిన సన్నిహితులను దూరం చేసుకోవడం జగన్ కు ఉన్న అలవాటు. అలా జగన్ దూరం చేసుకున్న వాళ్ల జాబితాలో సొంత  తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా కొండవీటి చాంతాడంత పొడవుకు మించి ఉ:టుంది.   ఈ నేపథ్యంలోనే..   2029లో జరగనున్నఏపీ సెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భవిష్యత్ ఏమిటి? ఎలా ఉంటుంది? అన్న చర్చ మొదలైంది. ఒకప్పుడు జగన్ కోసం నిలబడి, 2019 ఎన్నికలలో ఆయన విజయం కోసం నిర్విరామంగా కృషి చేసిన సొంత సోదరి షర్మిల, వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచీ కూడా జగన్ కు కుడి భుజం, ఎడమ భుజం కూడా తానే అన్నట్లుగా వ్యవహరించిన విజయ సాయిలే 2029 ఎన్నికలలో జగన్ విజయానికి స్పీడ్ బ్రేకర్ లుగా నిలుస్తారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే 2024 ఎన్నికలలో జగన్  తనకు గట్టి పట్టున్న రాయలసీమలో ప్రతికూల ఫలితాలు రావడానికి ఆ ప్రాంతంలో జగన్ అంత కాకపోయినా, ఆయనతో సమానమైన పట్టు ఉన్న షర్మిల కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి పెట్టని కోట లాంటి కడప జిల్లాలో వైసీపీకి గత ఎన్నికలలో సీట్లు గణనీయంగా తగ్గడానికి వైఎస్ షర్మిల జగన్ కు వ్యతిరేకంగా చేసిన ప్రచారమేననడంలో ఎలాంటి సందేహాలకూ తావు లేదు.  ఎందుకంటే వైఎస్ బిడ్డగా.. షర్మిలకు కూడా కడప ఖిల్లాపై గట్టి పట్టు ఉంది.  ఇక ఇప్పుడు విజయసాయి సొంత పార్టీ ప్రకటన చేసిన క్షణం నుంచీ జగన్ పై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. నిజమైన సీమ పౌరుషం ఏమిటో తన పార్టీ ముందుముదు రుజువు చేస్తుందంటూ.. జగన్ ఇలాకాలో ఆయనను బలహీనుడిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  అంతే కాకుండా జగన్ క్రైస్తవుడని పేర్కొంటూ.. తాను రాజకీయ పార్టీ పెట్టి జనంలోకి వస్తున్నది రెడ్డి సామాజికవర్గం కోసం పోరాడటమేనని చెబుతున్నారు.  నిజానికి విజయసాయి రెడ్డి స్వస్థలంనెల్లూరు జిల్లా ప్రాంతమే అయినా.. వైఎస్ రాజశేఖరెడ్డి నుంచి వైఎస్ జగన్ వరకూ ఆ కుటుంబంతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా విజయసాయికి రాయలసీమలోనూ సత్సంబంధాలు ఉన్నాయి.  ఈ పరిణామాలు జగన్ కు సీమపై ఇప్పటికే సడలిన పట్లు.. వచ్చే ఎన్నికల నాటికి మరింత సడలుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ప్రస్తతం జగన్ పరిస్ధితి చేయి (కాంగ్రెస్ )దగ్గరకెడితే చేతి దెబ్బ అన్నట్లుగా తయారైంది. ఇటు షర్మిల, అటు విజయసాయిరెడ్డి కూడా జగన్ కు గట్టి పట్టున్న సీమ, మరీ ముఖ్యంగా కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో  జగన్ కు కచ్చితంగా రాజకీయంగా భారీ నష్టం వాటిల్లుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [YS Sharmila, Vijaya Sai Reddy, YS Jagan Mohan Reddy, Dangerbells,  YCP, Andhra Pradesh Politics, 2029 Elections, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమాలకు గుర్తింపు లభిస్తున్న వేళ.. మరో చిన్న సినిమా ఆస్కార్‌ బరిలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా విషయంలో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఇప్పటివరకు ఇది ఇండియాలో విడుదల కాలేదు. అయినప్పటికీ 2027 ఆస్కార్‌ అవార్డుల కోసం అర్హత సాధించడం విశేషంగా మారింది. ఆ సినిమా పేరు ‘అంగ్‌’. ఇటీవల జరిగిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రం ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. అక్కడ జరిగిన Platform విభాగంలో ప్రదర్శితమైన ‘అంగ్‌’.. ప్రతిష్టాత్మకమైన Platform Prizeను సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా అంతర్జాతీయంగా మరింత మంది దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే.. ఆస్కార్‌ అవార్డులకు సంబంధించిన అర్హత నిబంధనల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలోనే ‘అంగ్‌’కు 2027 ఆస్కార్‌ పోటీలో నిలిచే అవకాశం లభించినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక సినిమా ఆస్కార్‌ బరిలోకి రావాలంటే పలు అర్హతలను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సాధించిన గుర్తింపు, సినిమా ప్రదర్శనకు సంబంధించిన నిబంధనలు వంటి అంశాలు ఇందులో కీలకంగా ఉంటాయి. ‘అంగ్‌’ విషయంలో టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో దక్కిన పురస్కారం కీలకంగా మారింది. ఒక చిన్న సినిమా అంతర్జాతీయ వేదికపై అవార్డు గెలుచుకోవడం.. ఆ తర్వాత ఆస్కార్‌ బరిలోకి వెళ్లే అవకాశం పొందడం సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా ఇండియాలో ఇంకా విడుదల కాని సినిమా ఆస్కార్‌ రేసులో ఉండటం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సాధారణంగా మన దేశంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల గురించే ఆస్కార్‌ విషయంలో ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. కానీ ‘అంగ్‌’ మాత్రం దేశీయ ప్రేక్షకులకు అందుబాటులోకి రాకముందే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో లభించిన గుర్తింపుతో ఈ సినిమా అంతర్జాతీయ సినీ వర్గాల్లో తన ఉనికిని చాటుకుంది. ఇప్పుడు 2027 ఆస్కార్‌ అవార్డుల కోసం అర్హత సాధించడంతో ఈ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఆస్కార్‌ బరిలోకి అర్హత సాధించడం, తుది నామినేషన్‌ పొందడం రెండూ వేర్వేరు దశలు. ప్రస్తుతం ‘అంగ్‌’కు లభించిన అవకాశం ఆస్కార్‌ ప్రక్రియలో ముందడుగు మాత్రమే. తదుపరి దశల్లో సినిమా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇలా ఇండియాలో విడుదల కాకుండానే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు గెలుచుకుని.. కొత్త ఆస్కార్‌ నిబంధనల నేపథ్యంలో 2027 అకాడమీ అవార్డుల రేసులోకి వచ్చిన ‘అంగ్‌’ ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.     [Angh Movie, Angh Oscars 2027, Angh Film, Oscars 2027, Academy Awards 2027, Angh Toronto Film Festival, Toronto International Film Festival, Angh Platform Prize, Indian Film Oscars, Oscars New Rules 2027, Indian Cinema, Telugu Cinema News, Oscars News, Angh Movie India Release]
స్టార్ హీరో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. హీరో గత సినిమాలు, అతని ఇమేజ్, దర్శకుడి ట్రాక్ రికార్డ్, భారీ బడ్జెట్.. ఇవన్నీ కలిపి సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ముఖ్యంగా తమ అభిమాన హీరో నుంచి మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, డ్యాన్స్‌లు, కమర్షియల్ అంశాలను ప్రేక్షకులు ఆశిస్తుంటారు. అయితే ఈ అంచనాల మధ్య మంచి కథను ఎంచుకున్నా.. దాన్ని తెరపై సరిగ్గా ఆవిష్కరించలేకపోతే సినిమా అనుకున్న స్థాయిలో ఫలితం అందుకోలేకపోతోంది. సాధారణంగా స్టార్ హీరోలు కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. తమ ఇమేజ్‌కు సరిపోయే రొటీన్ కథలతో పాటు.. కొత్తగా ఏదైనా చెప్పే కథల వైపు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. కథలో వైవిధ్యం ఉంటేనే సినిమాకు ఓకే చెప్పే సందర్భాలు ఉంటాయి. అయితే మంచి కాన్సెప్ట్ చేతికి వచ్చినంత మాత్రాన సినిమా విజయవంతం కాదు. ఆ కథను దర్శకుడు ఎలా తెరపైకి తీసుకొచ్చాడు? స్క్రీన్‌ప్లే ఎలా ఉంది? సన్నివేశాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయి? అనే అంశాలు కూడా కీలకంగా మారుతున్నాయి. ఇక్కడే ఎగ్జిక్యూషన్ అనే అంశం తెరపైకి వస్తోంది. కథలో మంచి పాయింట్ ఉన్నప్పటికీ.. దాన్ని సాగదీయడం, అవసరం లేని సన్నివేశాలు జోడించడం, కథనంలో వేగం లేకపోవడం వంటి కారణాలతో మంచి కాన్సెప్ట్ కూడా ప్రేక్షకులకు రొటీన్‌గా అనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టార్ హీరో సినిమాలపై అంచనాలు ఎక్కువగా ఉండటంతో చిన్న లోపం కూడా పెద్దదిగా కనిపించే పరిస్థితి ఉంటుంది. మరోవైపు సినిమా ఎంత మంచి కథతో తెరకెక్కినా.. ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇవ్వడం కూడా ఇప్పుడు చాలా ముఖ్యంగా మారింది. ఒకప్పుడు స్టార్ హీరో పేరు, భారీ కాంబినేషన్ ఉంటే చాలు థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రేక్షకులకు అన్ని భాషల సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ వివిధ రకాల కంటెంట్‌ను చూస్తున్నారు. దీంతో కథలో కొత్తదనం, స్క్రీన్‌ప్లేలో ఆసక్తి, సన్నివేశాల చిత్రీకరణ వంటి అంశాలను మరింత నిశితంగా గమనిస్తున్నారు. అందుకే కథ బాగుందని మాత్రమే సినిమాను విజయవంతం చేయడం సాధ్యం కాదు. దర్శకుడు, రచయిత, నటీనటులు, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సంగీతం, నిర్మాణ విలువలు.. ఇలా ప్రతి విభాగం కలిసి పనిచేసినప్పుడే ఆ కథ తెరపై బలంగా కనిపిస్తుంది. ఒక మంచి కథను బలమైన ఎగ్జిక్యూషన్‌తో ప్రేక్షకులకు అందిస్తే ఫలితం కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రొటీన్ ఫార్ములాలోకి వెళ్లిపోయిన సినిమాలు మాత్రం స్టార్ హీరో ఉన్నప్పటికీ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన పొందడం కష్టంగా మారుతోంది. కొత్త కథను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో.. దానికి తగ్గట్టుగా కొత్త తరహా ట్రీట్‌మెంట్ ఇవ్వడం కూడా అంతే ముఖ్యంగా మారింది. మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హీరో క్రేజ్ సినిమాపై ప్రారంభ ఆసక్తిని పెంచగలిగినా.. ప్రేక్షకుడిని చివరి వరకు థియేటర్‌లో కూర్చోబెట్టేది మాత్రం కంటెంట్, కథనం, ఎగ్జిక్యూషన్ అనే అంశాలే. అందుకే కథ ఎంపికతో పాటు దాన్ని తెరపై ఆవిష్కరించే విధానంపై కూడా దర్శకులు, రచయితలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.       [Star Hero Movies, Telugu Cinema, Tollywood, Star Hero Films, Movie Execution, Good Story Bad Execution, Telugu Movies, Star Hero Movie Failures, Movie Screenplay, Movie Story Execution, Indian Cinema, Content Driven Cinema, Tollywood Movies, Telugu Film Industry]
  తెలుగు సినిమాతో పాటు తెలుగు ప్రేక్షకులు 'మా దగ్గర 'ఇరుముడి' సినిమా ఉందనే గర్వంతో ఉన్నారు. కలెక్షన్స్ కూడా ఆ గర్వాన్ని శూచాతప్పకుండా ఆచరిస్తూ రీసెంట్ గా  250 కోట్ల గ్రాస్ అందుకొని టాక్ ది డే ని కంటిన్యూ చేస్తుంది.  అయితే ఈ అఖండ విజయం తర్వాత సినీ ప్రియుల్లో, మాస్ మహారాజా అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. అదేమిటంటే.. ‘ఇరుముడి’కి సీక్వెల్  ఉంటుందా? కథను ముగించిన తీరు, పాత్రల ఎమోషన్ చూసిన వారు పార్ట్ 2 వస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలో ‘ఇరుముడి 2’ గురించి అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా రామ్ చరణ్ లేదా మరో స్టార్ హీరోతో దర్శకుడు శివ నిర్వాణ పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారంటూ ప్రచారం ముమ్మరంగా సాగింది.   ఈ వార్తలపై స్పందించిన దర్శకుడు శివ నిర్వాణ సీక్వెల్‌పై తన ఆలోచనను స్పష్టం చేశారు. ‘ఇరుముడి’ కథ అనేది ఒక తండ్రి, కూతురు, అలాగే అయ్యప్ప స్వామిపై ఉన్న నిశ్చలమైన భక్తి చుట్టూ తిరిగే ఒక పరిపూర్ణమైన ఎమోషనల్ జర్నీ. ఈ కథకు సహజ సిద్ధమైన ముగింపు లభించిందని, కేవలం విజయం సాధించినంత మాత్రాన బలవంతంగా సీక్వెల్స్ చేయడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని ఆయన వెల్లడించారు. ఒక కథకి ఆత్మ ఉంటేనే అది ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, ‘ఇరుముడి’ ఆత్మ ఆ సినిమా ముగింపుతోనే పూర్తయిందని తెలిపారు.కాబట్టి ప్రస్తుతానికి ‘ఇరుముడి పార్ట్ 2’ ప్రతిపాదన ఏదీ లేదని సమాచారం.  మొత్తం చదవండి: కమెడియన్ తో 12 th ఫెయిల్ హీరోయిన్ మేధా శంకర్ పెళ్లి: డేట్ ఇదే!   సీక్వెల్ ఊహాగానాలకు ముగింపు పలికిన శివ నిర్వాణ, తన తదుపరి ప్రాజెక్ట్‌ల కోసం కొత్త కథలపై దృష్టి సారిస్తున్నాడు. ఇరుముడి ప్రస్తుతం ఓటీటీ వేదికగా నెట్‌ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రికార్డ్స్ సృష్టించే పనిలో బిజీ.   మీకు నచ్చవచ్చు మల్లెపూల పల్లకి బంగారు పల్లకి: 'ఇరుముడి' సినిమాలోని ఈ పాట అర్థం తెలుసా.? నాగార్జున మాస్ లుక్‌కు తోడైన మీనా గ్లామర్.. ఈ పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీన్!     [Irumudi Part 2 , Irumudi Movie Sequel, Ravi Teja, Shiva Nirvana, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]    
ట్యాలెంటెడ్ టాలీవుడ్ యంగ్ హీరోల్లో కార్తికేయ గుమ్మకొండ ఒకరు. 'ఆర్ఎక్స్ 100'లో ఆయన నటనకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. హీరోగా మాత్రమే కాదు.. విలన్ గానూ ప్రేక్షకుల మదిలో ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. తనలో స్టైలిష్ విలన్ ఉన్నాడని 'నానీస్ గ్యాంగ్ లీడర్‌'తో చూపించారు. కోలీవుడ్ స్టార్ అజిత్ 'వలిమై'లో తనదైన విలనిజంతో తమిళ ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. అయితే ఆయన నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు దాటుతోంది. ఇప్పుడు కార్తికేయ గుమ్మకొండ మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. హీరోగా రెండేళ్ళ విరామం తర్వాత కార్తికేయ గుమ్మకొండ చేస్తున్న సినిమా 'కమ్‌బ్యాక్'. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే.. 'కమ్‌బ్యాక్‌'తో కార్తికేయ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమాను ఆయన పుట్టినరోజు సందర్భంగా నేడు(సెప్టెంబర్ 21న) అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఓ స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు ఆయన సతీమణి లోహితా రెడ్డి నిర్మాత. 'బాక్సింగ్ వరల్డ్‌లో తన పేరు వినిపించి మూడేళ్ళు అవుతోంది. నేనింకా ప్రొఫెషన్ మారిపోయి ఉంటాడేమో అనుకున్నాను. మూడేళ్ళు అవుతుందని నీకు గుర్తు అన్నా ఉంది. అది నాకు కూడా లేదు. అయినా ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు? యా... దట్స్ ట్రూ (అది నిజమే). ఇట్ ఫీల్స్ లైక్ సూసైడ్ మిషన్ (ఓ విధంగా అది ఆత్మహత్య చేసుకోవడమే). మూడేళ్ళ నుంచి ఏమైపోయాడో తెలియలేదు. ఇన్ని రోజులు ఏం చేస్తున్నాడు?' అని వాయిస్ ఓవర్ వినిపిస్తున్న సమయంలో తెరపై టెక్నీషియన్ల పేర్లు పరిచయం చేశారు. ఆ తర్వాత స్కిప్పింగ్, బాక్సింగ్ చేస్తున్న హీరోని చూపించారు. కార్తికేయ ఎప్పటిలా ఫిట్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించారు. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం చాలా బావుంది. ఆ తర్వాత 'కమ్‌బ్యాక్' టైటిల్ ప్రకటించారు. ఇందులో హీరో బాక్సర్ రోల్ చేస్తున్నారని గ్లింప్స్ ద్వారా చెప్పారు. ఇది కూడా చదవండి: విడాకులు.. సంచలనంగా మారిన కాజల్ అగర్వాల్ కామెంట్స్.! మీకు నచ్చవచ్చు:  ఏ పువ్వు ఏ తేటిదన్నది.. 'ఆకాశం ఏనాటిదో' పాటలో ఆ లైన్లకు అర్థం తెలుసా.? కొమ్మ కొమ్మకో సన్నాయి.. 47 ఏళ్ళ క్రితం వేటూరి ఎంత గొప్ప పాట రాశారు.!       [Kartikeya Gummakonda Turns Director, Kartikeya Comeback Movie, Kartikeya Gummakonda, Comeback Movie, Hero Kartikeya, Director Kartikeya, Telugu Film News, Telugu News]  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'రాకా' విడుదలకు ముందే హిస్టరీ క్రియేట్ చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరూ సాధించని ఒక అసాధ్యమైన గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను ఈ సినిమా సొంతం చేసుకుంది. సాధారణంగా ఒక సినిమా సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం... ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ 'రాకా' విషయంలో మాత్రం అది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు అట్లీ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ సినిమా సాంకేతిక పరంగా ఒక సరికొత్త రికార్డును సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. రియల్-టైమ్‌లో అత్యధిక సంఖ్యలో పెర్‌ఫార్మర్స్‌ను మోషన్ క్యాప్చర్ చేయడం ద్వారా 'రాకా' చిత్రం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. ఏకంగా 37 మంది పెర్‌ఫార్మర్లను ఒకేసారి సింగిల్ షాట్‌లో, రియల్-టైమ్‌లో మోషన్ కామ్‌తో క్యాప్చర్ చేసి ఈ ప్రపంచ రికార్డ్‌ను సాధించారు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, టెక్నాలజీని వాడుతున్నారని ప్రచారం జరిగినప్పటికీ, ఇలాంటి ప్రయోగం ఇండియన్ సినిమాలో జరగడం ఇదే తొలిసారి. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు స్వయంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీలకు వేదికపై ఈ అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్‌ను అందజేశారు. సన్ పిక్చర్స్ తమ అధికారిక సోషల్ మీడియా ద్వారా ఈ మైలురాయిని "HISTORY MADE 🏆 A global triumph that takes Indian cinema to the world stage!" అని అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియా ఊగిపోయింది. ఇది కూడా చదవండి:  మెగా కాంబో.. బుచ్చిబాబుతో చిరంజీవి సినిమా.. అసలు ట్విస్ట్ ఇదే.! ఈ గ్రాండ్ అచీవ్‌మెంట్‌తో 'రాకా' సినిమాపై ఉన్న అంచనాలు వేరే లెవెల్‌కి వెళ్ళిపోయాయి. అవతార్ వంటి సినిమాల్లో చూసిన హై-ఎండ్ టెక్నాలజీని ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ మీద అల్లు అర్జున్ నటించిన సినిమాలో చూడబోతున్నాం. విడుదల కాకముందే వరల్డ్ రికార్డ్‌తో గ్లోబల్ ట్రెండ్ అవుతున్న ఈ సినిమా, థియేటర్లలోకి వచ్చాక ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి. మీకు నచ్చవచ్చు:  ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి.. రాజశేఖర్ వింటేజ్ సాంగ్.. 33 ఏళ్ళయినా అదే మ్యాజిక్.! నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా.. 28 ఏళ్ళయినా ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపించే లవ్ సాంగ్.!       [Raaka Movie Guinness World Record, Raaka Motion Capture Record, Raaka Guinness Record, Allu Arjun Raaka Record, Icon Star Allu Arjun, Director Atlee, Telugu Film News, Telugu News]  
  '12 th ఫెయిల్' మూవీతో యూత్ హార్ట్స్ పై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న బ్యూటీ' మేధా శంకర్' వివాహం చేసుకోబోతున్నారంటూ నెట్టింట ఒక వార్త కొన్ని రోజులుగా హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా  కామెడీ నటుడుతో  డిసెంబర్ లో  పెళ్లి ఘనంగా జరగనుందని, ఇప్పటికే బయో డ్రామా తరహాలో దాదాపు 2 నెలల క్రితమే ముంబైలోని బంద్రాలో సీక్రెట్‌గా పెళ్లి చేసేసుకున్నారని రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. దీని వెనుక అసలు నిజానిజాలు ఏమిటి, ఈ ప్రచారానికి చెక్ పెడుతూ వీరిద్దరూ ఎలా స్పందించారో ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం. ఈ వార్తలన్నింటికీ పునాది పడింది ప్రముఖ సోషల్ మీడియా వేదిక రెడ్డిట్ (Reddit) లో వచ్చిన ఒక అజ్ఞాత పోస్ట్ ద్వారా. సమయ్ రైనా కుటుంబానికి అత్యంత దగ్గరి వ్యక్తినని చెప్పుకున్న ఒక నెటిజన్, సమయ్ తల్లితో మాట్లాడానని  డిసెంబర్ నాటికి వీరిద్దరి వివాహం నిశ్చయమైందని రాసుకొచ్చాడు. దానికితోడు, దాదాపు 2 నెలల క్రితమే వీరు రాత్రికి రాత్రే రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ మరికొన్ని పోస్టులు సోషల్ మీడియాలో కలకలం సృష్టించాయి. సమయ్ రైనా హోస్ట్ చేసిన 'ఇండియాస్ గాట్ లేటెంట్ సీజన్ 2' వేదికపై మేధా శంకర్ ప్రత్యేక ప్యానెలిస్ట్‌గా రావడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఆ షోలోని ఒక సెగ్మెంట్‌లో ప్యానెల్‌లోని వారిలో ఎవరు మీకు అత్యంత సన్నిహితులు అని అడగ్గా, సమయ్ ఏమాత్రం సంకోచించకుండా "మేధా శంకర్ నా హృదయానికి చాలా దగ్గర" అని చెప్పడం గమనార్హం. అంతేకాకుండా, గతంలో అంటే జూన్ 2026లో ముంబైలోని 'ఆనందం' ప్రీమియర్ ఈవెంట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడం, ఆ తర్వాత మీడియా కెమెరాలను చూడగానే వేర్వేరు దిశల్లోకి వెళ్లిపోవడం కూడా అభిమానుల్లో పలు అనుమానాలకు తావిచ్చింది. అంతకుముందు ఆగస్టు 1, 1997న ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జన్మించి, 2019లో 'బీచమ్ హౌస్'తో ఆరంగేట్రం చేసి '12త్ ఫెయిల్'తో ఘనవిజయం సాధించిన మేధా శంకర్‌తో సమయ్ రైనా రిలేషన్‌షిప్‌లో ఉన్నారనే టాక్ గత కొద్ది నెలలుగా నడుస్తోంది. గతంలో సమయ్ తనతో షెరాన్ వర్మతో ఉన్న రూమర్లను వెంటనే ఖండించినప్పటికీ, మేధాతో ఉన్న వార్తలపై మౌనంగా ఉండటంతో నెటిజన్లు వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారని భావించారు. ఇది కూడా చదవండి: 'నరసింహ నాయుడు' బాక్సాఫీస్ సునామీ తెలుసా: 105 టాటా సుమోలు ఎందుకు పంచారు!   అయితే, ఈ వైరల్ పెళ్లి వార్తలకు సమయ్ రైనా తనదైన శైలిలో ఫన్నీగా పుల్‌స్టాప్ పెట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "డిసెంబర్‌లో సమయ్ రైనా - మేధా శంకర్ పెళ్లి?" అని ఉన్న పోస్ట్‌ను షేర్ చేస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో లతా మంగేష్కర్ పాడిన 'ఝూఠ్ బోలే కౌవా కాటే' అనే ప్రసిద్ధ పాటను జోడించారు. అంతేకాకుండా సరదాగా స్పందిస్తూ "అయ్యో మేధా శంకర్, డిసెంబర్ నెలలో నా ఆల్ ఇండియా కామిడీ టూర్ ప్లాన్ అయి ఉంది, కాబట్టి క్షమించు.. మన పెళ్లిని వాయిదా వేసుకోవాల్సిందే" అని చమత్కరించారు. దీనికి మేధా శంకర్ కూడా నవ్వుతున్న ఇమోజీలతో స్పందిస్తూ, "ఈ ఆధారాలు లేని పెళ్లి పుకార్లను చూసి నవ్వుకుంటున్నాను" అంటూ వేరొక మీమ్‌ను షేర్ చేసి ప్రచారంలో ఉన్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పారు. దీంతో వీరి పెళ్లి వార్తలు కేవలం ఇంటర్నెట్ సృష్టించిన పుకార్లేనని స్పష్టమైంది.   మీకు నచ్చవచ్చు:  పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు: పెళ్ళి పాటను ఇలా రాయడం ఆత్రేయకే సాధ్యం ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే: ఎన్టీఆర్, బాలయ్య కాంబోలో వచ్చిన ఎవర్‍గ్రీన్ సాంగ్.!   [Medha Shankar, Medha Shankar Wedding Rumors Clarity, Samay Raina marriage rumors, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]          
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ వస్తుందని గతంలో నాని చెప్పిన మాటలు నిజమయ్యాయి. ‘ది ప్యారడైజ్‌’ సినిమా దాదాపు మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్ వివరాల ప్రకారం ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 54 నిమిషాల 4 సెకన్లుగా ఖరారు చేశారు. సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు పలు మార్పులు, కట్స్ సూచించినట్టు తెలుస్తోంది. మొత్తంగా 21 చోట్ల మార్పులు చేయాలని సీబీఎఫ్‌సీ సూచించినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: 80 మంది హీరోయిన్లతో ఎఎన్నార్ నటించినా.. సావిత్రి విషయంలో అన్నపూర్ణ అలా ఎందుకన్నారు? ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. ‘ది ప్యారడైజ్‌’ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ రావచ్చని ముందే ఊహించినట్లు చెప్పారు. ఈ సినిమా పిల్లలు, కుటుంబ ప్రేక్షకుల కోసం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే అన్ని రకాల జానర్లలో సినిమాలు చేయాలన్నదే తన ఉద్దేశమని, భవిష్యత్తులో కుటుంబ కథా చిత్రాల్లోనూ నటిస్తానని నాని తెలిపారు. తాజాగా సెన్సార్ పూర్తయిన విషయాన్ని చిత్రబృందం ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. సినిమాలో భావోద్వేగాలు అందరికీ నచ్చేలా ఉన్నప్పటికీ.. హింస, క్రూరత్వంతో కూడిన సన్నివేశాలు మాత్రం పెద్దలకు మాత్రమే అనే విషయాన్ని ఆ పోస్టర్ ద్వారా తెలియజేశారు. దీంతో సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ‘ది ప్యారడైజ్‌’లో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటుడు మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్‌’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ‘ఏ’ సర్టిఫికెట్ రావడంతో సినిమాలోని యాక్షన్, హింసాత్మక సన్నివేశాలపై మరింత ఆసక్తి నెలకొంది. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మీకు నచ్చుతుంది: ఫోటో రచ్చ.. సిస్టమ్‌పై నీతులు చెప్పి, ఇప్పుడిలాంటి లా?ఫోటో శంకర్ కాంబినేషన్‌లో రెండు సినిమాలు, నో చెప్పిన మహేష్.. రీజన్ ఏంటి?      [The Paradise Movie, The Paradise Nani, Nani The Paradise, The Paradise A Certificate, The Paradise Censor Certificate, Nani Movies, Srikanth Odela, The Paradise Release Date, Anirudh Ravichander, Mohan Babu, The Paradise Telugu Movie, Nani Upcoming Movie]
Nani spent eight hours meeting fans at a special meet-and-greet event for The Paradise, staying from 9 AM to 5 PM to pose for photographs and sign autographs. Fans travelled from across the Telugu states and other parts of the country to meet the actor, who continued interacting with them despite his packed promotional schedule. The actor has been balancing the film’s promotions with its final post-production work. After travelling to Chennai, Bengaluru and Kochi to promote the action drama, Nani also visited music composer Anirudh Ravichander’s studio with director Srikanth Odela to check the final mixing. He has been closely involved in the finishing work as the team prepares to lock the film’s final version. Nani is now gearing up for the film’s pre-release event. Producer Sudhakar Cherukuri has been supporting the team as it manages the final work and promotional campaign ahead of the release. The Paradise, directed by Srikanth Odela is scheduled to release on September 24. Advance bookings in Nizam and overseas have reportedly been strong, with Andhra Pradesh bookings yet to open. The film is aiming for a career-best opening for Nani. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఏమో ఏమో ఇది’. యువతను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ శీతాకాలంలో ప్రేక్షకులకు ఓ సరికొత్త ప్రేమానుభూతిని అందించేందుకు సినిమా సిద్ధమవుతోంది. ‘HIT’ ఫ్రాంచైజీతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న రచయిత, దర్శకుడు శైలేష్ కొలను తొలిసారి ఓ ఆహ్లాదకరమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తనదైన థ్రిల్లర్ కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ‘ఏమో ఏమో ఇది’తో పూర్తిగా భిన్నమైన కథా ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు. రోషన్ మేక, ప్రీతి ముకుందన్‌ల ఫ్రెష్ పెయిర్ ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ‘ది ఫస్ట్ బ్రీజ్ ఆఫ్ ' ఏమో ఏమో ఇది’ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ వీడియో సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయడంతో పాటు, చిత్రంలోని ప్రేమకథ ఎలా ఉండబోతోందనే ఆసక్తిని పెంచింది. ఇది కూడా చదవండి: విడాకులు.. సంచలనంగా మారిన కాజల్ అగర్వాల్ కామెంట్స్.! సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఎస్., సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీకు నచ్చవచ్చు: ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు.. అమ్మాయి అందాన్ని ప్రకృతితో పోలుస్తూ వేటూరి చేసిన మ్యాజిక్.! ఘాటైన ప్రేమ ఘటన.. బాలయ్య, రోజా ఎవర్‌గ్రీన్‌ రొమాంటిక్ సాంగ్.!   https://x.com/SitharaEnts/status/2101983803829068087       [Emo Emo Idi Release Date, Emo Emo Idi Movie, Sailesh Kolanu, Roshan Meka, Preity Mukhundhan, Telugu Movies 2026, Telugu Film News, Telugu News]  
  తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు విజయాన్ని సాధిస్తే, మరికొన్ని సినిమాలు కొత్త చరిత్రని సృష్టిస్తాయి. ఆ చరిత్రకి ఆద్యుడు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ అయితే.. ఆ  రికార్డుకే ఒక అందం, తలబిరుసు వస్తుంది. సరిగ్గా 2001 జనవరి 11న సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య వన్ మాన్ షో 'నరసింహ నాయుడు' చిత్రానిది అదే పరిస్థితి. మాస్ పల్స్, మీటర్స్ తెలిసిన  బి. గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్, టాలీవుడ్ రికార్డుల లెక్కలన్నింటినీ సిగ్గుతో తలవంచుకునేలా చేసింది  బాలయ్య అభినయం, పరుచూరి బ్రదర్స్   రాసిన పవర్ ఫుల్ డైలాగులు, మణిశర్మ అందించిన ఊరమాస్ సంగీతం థియేటర్లలో అభిమానులతో ఈలలు, కేకలు వేయించాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన గణాంకాలు మరియు అసాధారణ మైలురాళ్ళు నేటికీ సినీప్రియలకు ఒక అద్భుతమైన జ్ఞాపకం.  72 సంవత్సరాల సుదీర్ఘ తెలుగు సినీ చరిత్రలోనే తొలిసారిగా సరికొత్త రికార్డు నెలకొల్పుతూ, 'నరసింహ నాయుడు' ఏకంగా 105 కేంద్రాలలో నేరుగా 100 రోజుల వేడుకను జరుపుకొని ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది.  అంతకుముందు ఏ తెలుగు సినిమా కూడా సాధించని రీతిలో 100 రోజులు వందకు పైగా సెంటర్లలో నడవడం అప్పట్లో ఒక సంచలనం.  ఈ రికార్డు చెప్పుకుంటూ మురిసిపోని బాలయ్య అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా, ఈ బ్లాక్ బస్టర్ మూవీ 18 కేంద్రాలలో విజయవంతంగా 175 రోజులు ప్రదర్శించబడి పూనకాలు తెప్పించింది. విడుదలైన రోజు నుండి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, ఆ కాలంలోనే  30 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ నివ్వెరపాటుకి గురి చేసింది.    బాలయ్య  కనబరిచిన విశ్వరూపం, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సీన్ మరియు తొడగొట్టి చెప్పే పవర్ ఫుల్ సంభాషణలు మాస్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్లేస్ నువ్వు చెప్పినా సరే,నన్ను చెప్పమని చెప్పినా సరే కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా',  అని బాలయ్య చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ప్రతీ ఒక్కరి నోట నానుతూనే ఉంటాయి. ప్రతి మాట ఒక తపాసులా పేలింది. సంక్రాంతి బరిలో భారీ పోటీ ఉన్నప్పటికీ, నరసింహ నాయుడు ప్రభంజనం ముందు ఏ సినిమా నిలవలేకపోయింది.   Also Read: ఫోటో రచ్చ: సిస్టమ్‌పై నీతులు చెప్పి ఇప్పుడిలాంటి ఫోటోలా!    నరసింహ నాయుడు విజయంతో వరుసగా దాదాపు 5 సంవత్సరాల పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫ్యాక్షన్ కథాంశంతో కూడిన భారీ సినిమాలు వెల్లువలా వచ్చాయి. సీమ మాస్ పవర్ ను వెండితెరపై ఎలా చూపించాలో  బి. గోపాల్ నిరూపించాడు. 'లక్స్ పాపా', 'చిలకపచ్చ కోక' వంటి పాటలు కుర్రకారును ఊపేస్తే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో పూనకాలు తెప్పించింది. ఈ విధంగా  బాలయ్య బాబు నట విశ్వరూపానికి, నట డిక్షనరీకి, బాక్సాఫీస్ స్టామినాకి  'నరసింహ నాయుడు' ఒక శాశ్వతమైన నిదర్శనంగా నిలిచిపోయింది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే నిర్మాత మేడికొండ వెంకట మురళీకృష్ణ వంద రోజుల ఫంక్షన్ అప్పుడు 105 కేంద్రాలలో వంద రోజులు ఆడిన దానికి గుర్తుగా థియేటర్ యాజమాన్యానికి 105 టాటా సుమోలు పంచడం జరిగింది. చిన్నికృష్ణ కథని అందించాడు.    మీకు నచ్చవచ్చు: కుర్ర‌కారును ఉర్రూత‌లూగించిన 30 ఏళ్ల పాట‌.. ఎర్రాని కుర్ర‌దాన్ని గోపాల‌..   [Narasimha Naidu, Narasimha Naidu Box Office Records, Balakrishna,  B Gopal, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనలో చాలామందికి ఉదయం నిద్రలేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడం ఎంతో కాలంగా వస్తున్న అలవాటు. ఉదయపు అలసటను పారద్రోలి రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఈ కేఫీన్ పానీయాలు తోడ్పడతాయని భావిస్తాం. అయితే, మన ఆరోగ్యం మరియు శరీర సౌష్ఠవం అనేది మనం ఉదయాన్నే పరగడుపున తీసుకునే మొదటి ఆహారం లేదా పానీయం పైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల ఆమ్లత్వం, జీర్ణకోశ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అందుకే, ఈ అలవాటుకు స్వస్తి చెప్పి, ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించే మునగాకు మరియు ఉసిరికాయలతో చేసిన సహజసిద్ధమైన హెల్త్ షాట్‌ను మన నిత్య జీవితంలో భాగం చేసుకుంటే శరీరంలో ఊహించని అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. ఈ అద్భుతమైన ఆరోగ్యకరమైన పానీయాన్ని ఇంట్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. దీని తయారీకి 2 ఉసిరికాయలు, 1 స్పూన్ లేత మునగాకు లేదా మునగాకు పొడి, కొద్దిగా కరివేపాకు, చిన్న అల్లం ముక్క, 1/4 స్పూను జీలకర్ర, 6 మిరియాలు, చిటికెడు పసుపు మరియు రుచికి సరిపడా గులాబీ ఉప్పు (పింక్ సాల్ట్) అవసరమవుతాయి. తయారీ విధానం చూస్తే, ఒక మిక్సీ జార్‌లో కొద్దిగా నీరు పోసి ఉసిరికాయ ముక్కలు, మునగాకు, కరివేపాకు, అల్లం, జీలకర్ర, మిరియాలు మరియు పసుపు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని శుభ్రమైన వస్త్రం లేదా వడకట్టే జల్లెడ సహాయంతో పిండి వడకట్టుకోవాలి. వచ్చే చిక్కటి రసంలో చిటికెడు గులాబీ ఉప్పు కలుపుకుంటే మన శరీరానికి అమృతం లాంటి పోషకమైన మునగాకు ఉసిరి షాట్ సిద్ధమవుతుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున కేవలం 30 ml చొప్పున ఈ హెల్త్ షాట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో అనూహ్య ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఉసిరికాయలో పుష్కలంగా ఉండే విటమిన్ సీ మరియు మునగాకులోని ఐరన్, కాల్షియం, జింక్, అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను అనూహ్యంగా బలోపేతం చేస్తాయి. ఇది వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల సంభవించే ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా బలమైన కవచంలా రక్షణగా నిలుస్తుంది. ఈ పానీయం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని పెంచడంలో కూడా మేటిగా పనిచేస్తుంది. ఉసిరిలోని అధిక విటమిన్ సీ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచి, ముడతలు, మచ్చలను నివారించి చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. అదేవిధంగా, మునగాకులోని పోషకాలు జుట్టు కుదుళ్లను లోపలి నుండి దృఢపరిచి, చుండ్రు మరియు జుట్టు రాలడం వంటి సమస్యలను అరికడతాయి. ఉదయాన్నే పరగడుపున ఈ పానీయం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుద్ధి అయ్యి, కాలేయం మరియు పేగుల్లో పేరుకుపోయిన విషపదార్థాలు బయటకు పోయి శరీరం సహజంగా డీటాక్స్ అవుతుంది. దీనివల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా, మునగాకు, ఉసిరి మరియు కరివేపాకు కలయిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తూ, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రతిరోజు ఉదయం 30 ml ఈ పానీయాన్ని తాగితే నీరసం మాయమై, రోజంతా శరీరం అపరిమితమైన శక్తితో, ఉత్సాహంగా ఉంటుంది.     [ Moringa Leaves, Amla, Amla Benefits, Health Shot, Vitamin C, Antioxidants, Immunity, Digestive Health, Hair Health, Blood Sugar ]
సాధారణంగా వచ్చే తలనొప్పికి, మైగ్రేన్ అని పిలిచే తీవ్రమైన నరాల సమస్యకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక సాధారణ తలనొప్పి కొన్ని గంటల విశ్రాంతి తర్వాత లేదా స్వల్ప చికిత్సతో తగ్గుముఖం పడుతుంది. కానీ మైగ్రేన్ అలా కాదు, ఇది బాధితులను రోజులకు తరబడి తీవ్రంగా పీడిస్తుంది. తల ఒకవైపు భాగంలో లేదా నొసటి నుండి మెడ వెనుక భాగం వరకు విపరీతమైన నరాల గుంజుడు, తీవ్రమైన ఒత్తిడి, సూదులతో గుచ్చినట్లు ఉండే భరించలేని నొప్పి మైగ్రేన్ యొక్క ప్రధాన లక్షణం. ఈ తీవ్రమైన నొప్పుల సమయంలో చిన్నపాటి శబ్దం లేదా స్వల్ప వెలుతురు పడినా సరే విపరీతమైన చికాకు, మానసిక అసహనం కలుగుతాయి. అంతేకాకుండా, చాలా మందిలో ఈ సమస్య వల్ల వికారం, వాంతులు కూడా అవుతాయి. ఇలాంటి దీర్ఘకాలిక సమస్య నుండి ఉపశమనం పొందడానికి, మన వంటింట్లోనే దొరికే సహజసిద్ధమైన దినుసులతో అద్భుతమైన మూలికా పానీయం (Herbal Drink) తయారుచేసుకోవచ్చు. ఈ శక్తివంతమైన పానీయం తయారుచేసుకోవడానికి మనకు ప్రధానంగా ఐదు పదార్థాలు అవసరమవుతాయి. అవి 1 ఇంచ్ పొడవు ఉన్న అల్లం ముక్క, 10 నల్ల మిరియాలు, 1/2 స్పూను పసుపు, 1 నిమ్మకాయ మరియు 300 ml పరిశుభ్రమైన నీరు. తయారీ విధానం చాలా సులభం. మొదట ఒక పాత్రలో 300 ml నీటిని పోసి పొయ్యిపై ఉంచి బాగా మరగనివ్వాలి. నీరు బాగా మరిగేటప్పుడు, అందులో కచ్చాపచ్చాగా దంచిన 10 మిరియాలు, పొట్టు తీసి సన్నగా దంచిన 1 ఇంచ్ అల్లం ముక్కలను వేయాలి. వీటిలోని మూలికా గుణాలు నీటిలోకి దిగి పచ్చివాసన పోయేంత వరకు కొన్ని నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు వేసి, వెంటనే స్టవ్ ఆపివేయాలి. పసుపును నీటిలో ఎక్కువ సేపు మరిగించకూడదు, అలా చేస్తే అందులోని సహజసిద్ధమైన విలువలు తగ్గిపోతాయి. ఈ మిశ్రమం కాస్త చల్లారి గోరువెచ్చగా అయిన తర్వాత వడకట్టుకోవాలి. చివరగా అందులో 1 నిమ్మకాయ రసం పిండుకుంటే అద్భుతమైన ఆరోగ్యకరమైన మూలికా టీ సిద్ధమవుతుంది. ఈ హెర్బల్ డ్రింక్‌ను ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో వేడివేడిగా తాగడం వల్ల మన నరాల వ్యవస్థ ఉత్తేజితమై మైగ్రేన్ నొప్పి నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. మైగ్రేన్ తీవ్రమైన నొప్పి ఉన్న సమయంలోనే కాకుండా, నొప్పి లేనప్పుడు కూడా దీనిని ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా ప్రతిరోజూ సాయంత్రం ఈ పానీయం తాగడం వల్ల మైగ్రేన్ దాడులు మళ్లీ మళ్లీ రాకుండా అదుపు చేయవచ్చు. మెరుగైన మరియు శాశ్వత ఫలితాల కోసం దీనిని కనీసం 30 రోజుల పాటు నిరంతరాయంగా తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పానీయంలో ఉపయోగించే ప్రతి పదార్థం మైగ్రేన్ నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. పసుపులో లభించే  కర్కుమిన్  (Curcumin), అల్లంలో ఉండే  జింజరోల్  (Gingerol) వంటి శక్తివంతమైన యాంటీ ఇంఫ్లమేటరీ (Anti inflammatory) కాంపౌండ్లు మెదడులోని రక్తనాళాలు, నరాల వాపును సమర్థవంతంగా తగ్గిస్తాయి. మిరియాలలో ఉండే  పైపెరిన్  (Piperine) మరియు అల్లం కలయిక శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేసి తలనొప్పి తీవ్రతను తగ్గిస్తాయి. ఈ డ్రింక్ తాగడం వల్ల మైగ్రేన్ సమయంలో వచ్చే వికారం తగ్గడమే కాకుండా జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. నిమ్మలోని విటమిన్ సీ శరీరాన్ని డీటాక్స్ చేసి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ మూలికా పానీయం నరాల వ్యవస్థను బలపరిచి, మైగ్రేన్ నుండి శాశ్వత ఉపశమనాన్ని అందించే ఒక గొప్ప సహజ ఔషధం.     [ Migraine, Migraine Symptoms, Herbal Drink, Ginger, Black Pepper, Turmeric, Curcumin, Gingerol, Piperine, Natural Remedies ]
మన వంటింట్లో సులభంగా లభించే మూలికా దినుసులలో పుదీనాకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. వంటకాలకు అద్భుతమైన సువాసన, రుచిని అందించడమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించడంలో పుదీనా కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక శైలి మరియు ఆహార అలవాట్ల వల్ల ఉత్పన్నమయ్యే అనేక ఆరోగ్య సమస్యలకు పుదీనా రసం ఒక గొప్ప సహజసిద్ధమైన పరిష్కారంగా నిలుస్తుంది. రోజువారీ ఆహారంలో భాగంగా రోజుకు ఒక్క గ్లాస్ పుదీనా రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే 5 ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు మరియు దానిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడం. పుదీనాలో ఉన్న  మెంథాల్  అనే ముఖ్యమైన సమ్మేళనం జీర్ణ ఎంజైమ్‌లను వేగంగా ఉత్తేజపరుస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే పుదీనా రసం తాగడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. శరీరంలో తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవడానికి ఇది సహాయపడుతుంది. రెండవది, శరీర రోగనిరోధక శక్తిని పెంచడం. కేవలం 2 టేబుల్ స్పూన్ల పుదీనా ఆకులలో దాదాపు 1.5 మిల్లీగ్రాముల విటమిన్ సీ, 0.4 గ్రాముల ప్రోటీన్, 0.9 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.8 గ్రాముల ఫైబర్, 22.4 మిల్లీగ్రాముల కాల్సియం, 6.8 మిల్లీగ్రాముల భాస్వరం మరియు 51.5 మిల్లీగ్రాముల పొటాషియం వంటి అత్యవసర పోషకాలు ఉంటాయి. పుదీనాలో సమృద్ధిగా లభించే విటమిన్ సీ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో కణాల క్షీణతను అరికట్టి, రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. మూడవది, చర్మ సౌందర్యాన్ని పెంపొందించడం. పుదీనాలో సహజసిద్ధమైన శోథ నిరోధక (Anti inflammatory) మరియు బాక్టీరియా నిరోధక గుణాలు సమృద్ధిగా ఉంటాయి. పుదీనాలో ఉండే అధిక శాతపు శాలిసిలిక్ యాసిడ్ మరియు విటమిన్ ఏ చర్మంలో నూనె ఉత్పత్తిని నియంత్రించి మొటిమలు, మచ్చలు మరియు నల్లమచ్చలను (Blackheads) సమర్థవంతంగా నివారిస్తాయి. ఇది చర్మాన్ని నిర్విషీకరణ (Detox) చేసి, ముఖానికి సహజ కాంతిని అందిస్తుంది. నాల్గవది, నోటి ఆరోగ్యం మరియు శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరచడం. పుదీనాలోని యాంటీబాక్టీరియల్ గుణాలు నోటిలోని హానికర బాక్టీరియాను నశింపజేసి దుర్వాసనను అరికడతాయి. అలాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తూ శ్వాసక్రియను సులభతరం చేస్తాయి. ఐదవది, మనస్సును ప్రశాంతంగా ఉంచడం మరియు ఒత్తిడి తగ్గించడం. పుదీనాలోని సహజ సువాసన మరియు కూలింగ్ గుణాలు శరీరాన్ని రిఫ్రెష్ చేయడమే కాకుండా నాడీ వ్యవస్థను ప్రశాంత పరిచి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పుదీనా రసాన్ని ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక గుప్పెడు తాజా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి బ్లెండర్‌లో వేయాలి. దానికి ఒక గ్లాసు నీరు, కొద్దిగా అల్లం ముక్క, రెండు స్పూన్ల నిమ్మరసం, తగినంత తేనె లేదా సైంధవ లవణం (Black salt) చేర్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి, అవసరమైతే కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకుని ఫ్రెష్‌గా సేవించవచ్చు. కేవలం 5 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ డ్రింక్ రోజంతా శరీరాన్ని ఉత్సాహంగా, హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి, ప్రతిరోజూ ఉదయం కాఫీ లేదా టీలకు బదులుగా ఈ పోషకాల గని అయిన పుదీనా రసాన్ని మీ ఆహార అలవాట్లలో భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుదాం.     [ Mint Juice, Mint Leaves, Digestive Health, Vitamin C, Antioxidants, Skin Health, Oral Health, Respiratory Health, Stress Relief, Healthy Drinks ]
మెడలో గడ్డ లేదా వాపు కనిపించగానే చాలామందికి క్యాన్సర్‌ గురించి భయం మొదలవుతుంది. కానీ మెడలో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్‌ కావాల్సిన అవసరం లేదు. థైరాయిడ్‌ సమస్యలు, లింఫ్‌ నోడ్స్‌ వాపు, ఇన్ఫెక్షన్లు తదితర కారణాల వల్ల కూడా మెడలో గడ్డలు ఏర్పడవచ్చు. మెడలో గడ్డలు ఎందుకు వస్తాయి? థైరాయిడ్‌ వాపు ఎలా ఉంటుంది? లింఫ్‌ నోడ్స్‌ ఎందుకు పెరుగుతాయి? మెడలో గడ్డ కనిపిస్తే ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి? సమస్యను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు అవసరం? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ ENT, హెడ్ & నెక్ సర్జన్ డాక్టర్ అశోక్ పృథ్వీరాజ్ మొగంటి ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. మెడలో గడ్డను నిర్లక్ష్యం చేయకుండా, దాని కారణాన్ని వైద్యుల సలహాతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మెడలో గడ్డలు, థైరాయిడ్‌ సమస్యలు, లింఫ్‌ నోడ్స్‌ వాపు మరియు అవసరమైన వైద్య పరీక్షల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. గమనిక: మెడలో గడ్డ లేదా వాపు ఉంటే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఎర్ర గోంగూర.. కేవలం తెలుగు రాష్ట్రాల రుచుల్లోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదిచుకుంది. ఆకుకూరల్లో గోంగూరకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తెల్ల గోంగూరతో పోలిస్తే ఎర్ర గోంగూరలో ఆరోగ్య గుణాలు, పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది దీని పులుపుదనం వల్ల లేదా పులుపు ఎక్కువైతే ఏమన్నా సమస్యలు వస్తాయేమోనని కాస్త దూరంగా ఉంటారు. కానీ, ఎర్ర గోంగూర రోజూ లేదా వారానికి రెండు మూడు సార్లు తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఉంటాయని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు. అసలు ఎర్ర గోంగూరలో  ఉండే పోషకాలు ఏమిటి? ఎర్ర గోంగూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకుంటే ఎర్ర గోంగూరను అస్సలు వదిలిపెట్టరు.  ఎర్ర గోంగూర గురించి వివరంగా తెలుసుకుంటే.. ఎర్ర గోంగూర అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రక్తహీనతకు చెక్ పెడుతుంది:  నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్తహీనత. ఎర్ర గోంగూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో ఎర్ర గోంగూర ఒక సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది:  వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు సహజంగా వస్తుంటాయి. ఎర్ర గోంగూరలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఎముకలను దృఢంగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. చిన్నపిల్లల పెరుగుదలకు, ఎముకల ఎదగడానికి ఇది చాలా మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:  ఎర్ర గోంగూరలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును వేగవంతం చేసి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తిన్న ఆహారం త్వరగా అరగడానికి, పేగుల్లో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:  ఈ ఆకుకూరలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినందిస్తుంది. కంటి చూపు పెరిగేందుకు దోహదం చేస్తుంది:  ఎర్ర గోంగూరలో విటమిన్ ఏ తగినంత ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రేచీకటి, కళ్ళు పొడిబారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తూ, దృష్టి లోపాలు రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి రక్షణ:  ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నిరోధించడంలో ఎర్ర గోంగూర  కీలకంగా పనిచేస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు:  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, ముడతలు పడకుండా చూడటానికి ఇది దోహదపడుతుంది. అలాగే తలకు అవసరమైన పోషకాలను అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి:  ఎర్ర గోంగూరలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, పీచు పదార్థం ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీంతో అతిగా తినే అలవాటు తగ్గి సులభంగా బరువు తగ్గొచ్చు. ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న ఎర్ర గోంగూరను  దైనందిన ఆహారంలో పప్పు రూపంలోనో, పచ్చడి రూపంలోనో లేదా ఇతర కూరల్లో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.                       *రూపశ్రీ.  
మన చుట్టూ ఎక్కడ చూసినా కనిపించే కొన్ని మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అలాంటి మొక్కల్లో కుప్పింటాకుకూడా ఒకటి. దీనినిపిప్పింటాకు, మురిపిండి, హరిత మంజరివంటి పేర్లతో కూడా పిలుస్తారు.  శాస్త్రీయంగా దీనిని Acalypha indica అంటారు. కుప్పింటాకును మన సంప్రదాయ వైద్య విధానాల్లో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగాపిప్పి పన్ను నొప్పి, పంటి సమస్యలు, గజ్జి, దురద, తామర వంటి చర్మ సమస్యలకు సంప్రదాయంగా ఉపయోగించే విధానాల గురించి ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ వివరిస్తున్నారు. కుప్పింటాకు మొక్కలోని ఆకులు, వేర్లు తదితర భాగాలను వివిధ సంప్రదాయ పద్ధతుల్లో ఉపయోగించినట్లు సమాచారం ఉంది. అయితే ఏ ఆరోగ్య సమస్యకైనా స్వయంగా చికిత్స చేసుకోవడం కాకుండా, సరైన వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కుప్పింటాకు మొక్కను ఎలా గుర్తించాలి? పిప్పి పన్ను నొప్పి, చర్మ సమస్యల వంటి వాటికి దీనిని సంప్రదాయంగా ఎలా ఉపయోగిస్తారు? ఈ ఆకు వల్ల చెప్పుకునే ఇతర ప్రయోజనాలు ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)