యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు  పండుగ రోజు. దివంగత ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహావిష్కరణకు తొలిసారి నియోజకవర్గానికి ఆనందంగా ఉందని రాప్తాడు ఎమ్మెల్యే, మాజీమంత్రి పరిటాల సునీత అన్నారు. రాప్తాడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో సునీతమ్మ మాట్లాడుతూ... రాప్తాడు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చాలామందిని ఇబ్బంది పెట్టారు. కనీసం పెళ్లిళ్లకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్యకర్తలు బెదరకుండా ధైర్యంతో నిలబడ్డారు. ఎన్టీఆర్ పిలుపుమేరకు పరిటాల రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చారు. నాడు అన్న ఎన్టీఆర్ వద్దన్నా మంత్రి పదవి ఇచ్చి ఆదరించారు. చంద్రబాబు పిలుపుమేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను.  ఆనాడు కార్యకర్తలే నా వెన్నంటి నడిపించారు. చంద్రబాబు మూడుసార్లు టిక్కెట్ ఇచ్చి, ఒకసారి మంత్రినిచేసి మా కుటుంబాన్ని ఆదరించారు.  గత ప్రభుత్వంలో నాపై 22, శ్రీరామ్‌పై 34, కార్యకర్తలపై 20కి పైగా కేసులు పెట్టారు. ఆ కేసుల గురించి ఆలోచించాలని లోకేష్‌ను  కోరుతున్నా. రాప్తాడు నియోజకవర్గంలో అన్ని సామాజికవర్గాలు మాకు అండగా నిలబడ్డాయి. ప్రత్యర్థులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన తగరకుంట ప్రభాకర్  ఆరుగురి బిడ్డలను చంద్రబాబు చదివించి ప్రయోజకులను చేశారు. పరిటాల రవితోపాటు చనిపోయిన వారి పిల్లలను చదివించారు. వాడుకుని పక్కనపడేసే పార్టీ కాదు తెలుగుదేశం. రాప్తాడు నియోజకవర్గంలో 11మందికి కార్యకర్తల సంక్షేమనిధి అందించారు. యువనేత లోకేష్ కార్యకర్తలకు ధైర్యాన్నిస్తూ యువగళం పాదయాత్ర చేసి స్పూర్తినిచ్చారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వెనుక చంద్రబాబు, లోకేష్ రెక్కల కష్టం దాగిఉంది. అందువల్లే రాప్తాడులో దాదాపు 25వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో చిన్న సైకోను సాగనంపాలని ప్రజలు,కార్యకర్తలు నిర్ణయించుకొని, ఎన్నికల్లో నెరవేర్చుకున్నారు. రాప్తాడు నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించే రూ.800 కోట్ల అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు అందించినందుకు కృతజ్జతలు. రైతులకు త్వరగా పరిహారం అందించాలని కోరుతున్నా. రాప్తాడు మండలంలో జూనియర్ కాలేజి మంజూరు చేయండి. రామగిరిలో హాస్టల్ భవనం, ఆత్మకూరులో కాలేజి మంజూరు చేయండి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు వచ్చాకే స్కూళ్లు బాగుపడ్డాయి. చదువుకునే ప్రతిబిడ్డకు తల్లికి వందనం అందిస్తున్నారు. మీ ఆదేశాల మేరకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సునీత చెప్పారు.  స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించాలి..! హిందూపురం ఎంపి బికె పార్థసారధి మాట్లాడుతూ... దివంగత ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణకు యువనేత లోకేష్ రాప్తాడు రావడం ఆనందంగా ఉంది. ఆనాడు పరిటాల రవీంద్ర  దివంగతులయ్యాక వచ్చిన ఎన్నికల్లో పార్టీ కేడర్ వెన్నుచూపకుండా 15వేల మెజారిటీతో పార్టీని గెలిపించారు. 2019లో అధికారం కోల్పోయాక బెదిరించారు. రామగిరి పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశాం. ఎక్కడా భయపడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్నచిన్న విభేదాలను పక్కనబెట్టి ఏకపక్షంగా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి. 2019-24లో అభివృద్ధి జరగలేదు. చంద్రబాబు గారు హంద్రీనీవాను 3వేలకోట్లతో విస్తరించి కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు. యువనేత లోకేష్ యువగళంలో ఇచ్చిన 20లక్షల ఉద్యోగాల హామీమేరకు పరిశ్రమలు పెద్దఎత్తున ఎపికి వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి, పార్టీ బాగుంటేనే అందరం బాగుంటాం. మరో 20ఏళ్లు తెలుగుదేశం అధికారంలో ఉండాలని అన్నారు.  స్థానిక ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించండి :శ్రీరామ్ ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... మీ అందరి సహకారంతో లోకల్ బాడీలో అద్భుత విజయాన్ని సాధించబోతున్నాం.  పార్టీ కార్యకర్తలంతా గ్రామాల్లోకి వెళ్లి ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలి. యువగళం రథసారధి లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన పార్టీ కేడర్‌కు  అభినందనలు తెలిపారు.  పార్లమెంటు పార్టీ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ... కార్యకర్తల సంక్షేమం ధ్యేయం మొట్టమొదటిసారిగా కార్యకర్తల సంక్షేమనిధిని ఏర్పాటుచేసిన నాయకుడు లోకేష్. గత చీకటి పాలనను ఎదురొడ్డి యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రప్రజలకు అండగా నిలబడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ దుర్మార్గాలకు చరమగీతం పాడారు. ఒకవైపు రాష్ట్రాభివృద్ధి, మరోవైపు కార్యకర్తల సంక్షేమం కోసం శ్రమిస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయాలను కొనసాగిస్తున్న భవిష్యత్ నాయకుడు లోకేష్ అని కొనియాడారు.        [ Nara Lokesh, Paritala Sunitha, Rapthadu, TDP, Telugu Desam Party, Chandrababu Naidu, Paritala Ravindra, Paritala Sriram, BK Parthasarathi, TDP Cadre, Rapthadu TDP, Local Body Elections, Youth Gala, Upper Pennar Project, Telugu One, Telugu News  ]  
వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల మధ్య రాజకీయ, కుటుంబ వివాదాలు, విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి.  షర్మిల కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహం నేపథ్యంలో జగన్‌ను ఆమె కలిశారంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వారిరువురి మధ్యా సయోధ్య కుదిరిందనీ పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చాయి. అయితే వీటన్నిటినీ ఖండిస్తూ షర్మిల జగన్ తో తన విభేదాలు కొనసాగుతున్నాయని పరోక్షంగానైనా క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో తాను జగన్ ను కలిసిన మాట వాస్తవమేననీ, అయితే అది కేవలం తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందించడానికేనని విస్పష్టంగా చెప్పారు. తాను జగన్ తో భేటీకి ఎటువంటి రాజకీయ కోణం లేదని కుండబద్దలు కొట్టేశారు.  జగన్-షర్మిల మధ్య ఉన్న రాజకీయ విభేదాలు,  ఆస్తుల వివాదం కారణంగా  గత కొన్నేళ్లుగా ఏ సందర్భంలోనైనా ఒకే  సందర్భంలో ఇరువురరూ కనిపిస్తే.. రాజకీయ అర్థాలు వెతకడం మామూలైపోయింది. వారి తండ్రి వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భంగా ఇరువురూ ఇడుపుల పాయలో కలిస్తే.. ఇంకేముందు జగన్, షర్మిల మధ్య సయోధ్య అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడం రివాజుగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే షర్మిల తన కుమార్తె వివాహానికి జగన్ ను ఆహ్వానించడానికి వెళ్లడంతో మరోసారి ఆ ప్రాచారం ఉధృతమైంది.   ఈ నేపథ్యంలోనే షర్మిల క్లారిటీ ఇచ్చారు.   జగన్‌ను తాను గతంలో ఎప్పుడు కలిశారు, ఇప్పుడు ఎందుకు కలిశారన్న దానిపై ఆమె పూర్తి స్పష్టత ఇచ్చారు. గతంలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలో జగన్‌ను కలిశాననీ, ఆ తరువాత ఇదిగో ఇప్పుడు, తన కుమార్తె వివాహానికి ఆహ్వానించడానికి కలిశాననీ విస్పష్టంగా చెప్పారు.  తమ కుటుంబంలో శుభకార్యానికి జగన్ నుఆహ్వానించడాన్ని రాజకీయ పరిణామంగా చూడకూడదన్నది షర్మిల అన్నారు. , తన కుమార్తె పెళ్లికి అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానిస్తానని, ఆ క్రమంలోనే జగన్ నూ ఆహ్వానించాననీ పేర్కొన్న షర్మిల ఇందులో ప్రత్యేకం ఏమీ లేదన్నారు. షర్మిల తాజాగా ఇచ్చిన క్లారిటీలో  కుటుంబ శుభకార్యాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసినట్లైంది.  తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.   [YS Sharmila, Daughter Marriege, Invitation, YS Jagan Mohan Reddy, YS Anjili Reddy wedding, APCC Chief Sharmila, TeluguOne]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరారు. కాకినాడ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్‌ను కలిసిన వరుపుల సుబ్బారావు.. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాలకు చెందిన పలువురు వైసీపీ మాజీ కౌన్సిలర్లు కూడా జనసేనలో చేరారు. వైసీపీ విధానాలు తనకు నచ్చకపోవడంతోనే పార్టీని వీడినట్లు వరుపుల సుబ్బారావు తెలిపారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్నప్పటికీ తనకు తగిన గౌరవం దక్కలేదని అన్నారు. గతంలో వైఎస్ జగన్ తన వయసు ఎక్కువైందని వ్యాఖ్యానించేవారని సుబ్బారావు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ విధానాలు నచ్చడంతోనే జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే జనసేనలో చేరేందుకు తాను ఎలాంటి పదవి, ప్రత్యేక హామీ లేదా కమిట్‌మెంట్‌ కోరలేదని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. వరుపుల సుబ్బారావు గతంలో ప్రత్తిపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా కొనసాగారు. తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరడం కాకినాడ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాకినాడ జిల్లాలో వైసీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతున్న నేపథ్యంలో వరుపుల సుబ్బారావు రాజీనామా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు పెద్దాపురం ప్రాంతానికి చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా త్వరలో జనసేనలో చేరనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.     [ Big shock for YCP, Former MLA Varupula Subbarao, Deputy CM Pawan Kalyan, Kakinada District,   Peddapuram, Samarlakota, YS Jagan, YSRCP,  Telugu One, Telugu News ]
ALSO ON TELUGUONE N E W S
డింపుల్ హయతి.. కమర్షియల్ చిత్రాల్లో ఒక రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి అభిమానులని, ప్రేక్షకులని ఆకట్టుకోవడంలో స్పెషలిస్ట్.  ప్రీవియస్ చిత్రం రవితేజతో కలిసి చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి లో చూడచక్కని నటన ప్రదర్శించింది.ఇప్పుడు ఈ అమ్మడు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భరత నాట్యం చేసి అభిమానులని, భక్తులని ఆకట్టుకుంది. ఇది కూడా చదవండి: పుష్ప అంటే ఇంతేగా: సుకుమార్ కి జాతీయ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందన సాధారణంగా వెండితెరపై నటనతో, గ్లామర్‌తో అలరించే టాలీవుడ్ కథానాయికలను సినీ తెరపై చూస్తుంటాం. కానీ తిరుమల నాదనీరాజనం వేదికపై ఒక తెలుగు హీరోయిన్ పూర్తి సాంప్రదాయ దుస్తుల్లో, అద్భుతమైన భావాభినయంతో చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యానందాలకి లోనయ్యారు. తిరుమలలో బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో, సాయంత్రం నాదనీరాజనం మండపంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో డింపుల్ హయాతి స్వామివారి సేవలో భాగమయ్యారు. శ్రీనివాసుడి దివ్య సన్నిధిలో తనలోని సాంప్రదాయ నాట్య కళను ఆవిష్కరిస్తూ ఆమె చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను మంత్రముగ్ధులను చేసింది. దీంతో ఏడుకొండల పాదాల చెంత ప్రదర్శన ఇచ్చిన 'డింపుల్ హయతి' జన్మ ధన్యమయ్యిందని చెప్పవచ్చు.           
  పుష్ప పార్ట్ 1 , పార్ట్  2 సాధించిన విజయం యొక్క రీ సౌండ్ సినీ అభిమానులు ఉన్నంతకాలం వినపడుతూనే ఉంటుంది. అందుకు ప్రధాన కారకులు అల్లు అర్జున్, సుకుమార్ అనే విషయం తెలిసిందే. రీసెంట్ గా  భారతీయ చలనచిత్ర రంగాన అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక గుజరాత్‌లోని కెవాడియాలో నిర్వహించబడింది.  భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 'పుష్ప 2: ది రూల్' చిత్రానికి గాను  సుకుమార్  ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే' (Best Original Screenplay) కేటగిరీలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డుని  స్వీకరించారు. ఈ విజయంపై అల్లు అర్జున్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ "నా గురువు, నా దర్శకుడు సుకుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు! నేను ఈ క్షణం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. ఆయన సాధించిన ఈ అవార్డు నాకు నా సొంత అవార్డు వచ్చినంత సంతోషాన్ని, అనుభూతిని ఇస్తోంది. చివరికి మేమిద్దరం 'పుష్ప' ఫ్రాంచైజ్ ద్వారా జాతీయ అవార్డులు అందుకోవడం ఎంతో గర్వంగా, భావోద్వేగంగా ఉంది. నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌ రెడ్డికి నాని స్పెషల్ రిక్వెస్ట్: ఆ హీరో ప్యారడైజ్ చూడటానికి పర్మిషన్ ఇస్తారా!     అంతకుముందు 69వ జాతీయ అవార్డుల్లో 'పుష్ప: ది రైజ్' చిత్రానికిగానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుని, జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పుష్ప రెండో భాగంతో సుకుమార్ ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డు గెలుచుకోవడం ఈ చిత్ర యూనిట్‌కు మాత్రమే కాకుండా, సమస్త తెలుగు చిత్ర పరిశ్రమకి  దక్కిన గొప్ప గౌరవంగా భావించవచ్చు.    [Allu Arjun,  Allu Arjun About Sukumar National Award Win, Pushpa 2 Best Screenplay,  72nd National Film Awards, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
  నేచురల్ స్టార్ నాని రేంజ్ ఏంటో 'ది ప్యారడైజ్' ద్వారా స్పష్టంగా కనపడుతుంది. రిలీజ్ రేపే అయినా సినీ ప్రేమికుల్లో, అభిమానుల్లో వారం నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ లో జోష్ కనపడటమే అందుకు ఉదాహరణ. ఇక ఈ రోజు రాత్రి తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రీమియర్ షోలని మేకర్స్  ప్లాన్ చేశారు.  దీంతో హైదరాబాద్‌లో సినీ అభిమానుల నిలయంగా భావించే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఒక థియేటర్‌కు వెళ్లి ప్రీమియర్ షో చూడాలని నాని  నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్‌లో సినిమా చూడటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ హీరో నాని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక భావోద్వేగమైన బహిరంగ విజ్ఞప్తి చేశారు. "చిన్నప్పటి నుంచే సినిమాను ఎంతో ప్రేమించే ఒక సాధారణ అభిమానిగా, సినిమాని ప్రేక్షకుల మధ్య కూర్చొని ఆస్వాదించడంలోనే నాకు అసలైన సంతోషం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్ల వాతావరణం నాకు చాలా ప్రత్యేకమైనది.  ఇది కూడా చదవండి: హీరోకి ఎంత కష్టమొచ్చింది: అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడా!   ఎంతో శ్రమించి రూపొందించిన 'ది పారడైజ్' చిత్రాన్ని తాము ఎవరి కోసం తీశామో, ఆ ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి ప్రత్యక్ష స్పందనలు, విజిల్స్, చప్పట్లు అనుభవించడంలోనే ఒక నటుడిగా తనకు పూర్తీ సంతృప్తి లభిస్తుంది. గతంలో ఇటువంటి భారీ ప్రీమియర్ ప్రదర్శనల సమయంలో జరిగిన ఘోర ఘటనలని  దృష్టిలో ఉంచుకుని, భద్రతకే తమ తొలి ప్రాధాన్యత. ప్రభుత్వ భద్రతా మార్గదర్శకాలు, పోలీస్ ప్రోటోకాల్స్ అన్నింటినీ తమ బృందం 100% కచ్చితంగా పాటిస్తుందని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తో చూడాలి.      [Nani, The Paradise, Revanth Reddy, Srikanth Odela, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు వినగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆయన పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ. "కత్తులతో కాదురా.. కంటిచూపుతో చంపేస్తా", "చూడు ఒకవైపే చూడు.. రెండో వైపు చూడకు", "ఫ్లూటు జింక ముందు ఊదు... సింహం ముందు కాదు"... ఇలాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో బాలయ్యకు ఆయనే సాటి, ఆయనే పోటీ. అలాంటి బాలకృష్ణ ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ అందిస్తే ఆ హైప్ వేరే లెవెల్ లో ఉంటుంది. కానీ, ఎందుకనో బాలయ్య అలా వాయిస్ ఓవర్ అందించిన సందర్భాలు మాత్రం చాలా తక్కువే.  బాలకృష్ణ వాయిస్ ఓవర్ విషయానికొస్తే, మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది 2002లో వచ్చిన 'యువరత్న' సినిమా గురించి. తారకరత్న హీరోగా నటించిన ఈ సినిమాకు బాలకృష్ణ వాయిస్ ఓవర్ అందించారు. నిజానికి ఇది తారకరత్న హీరోగా నటించిన మొదటి సినిమా అయినప్పటికీ, రెండో సినిమాగా విడుదలైంది. తన నందమూరి కుటుంబం నుంచి వచ్చిన యువ హీరోని ప్రోత్సహించడం కోసం.. అప్పుడు అన్నయ్య హరికృష్ణతో కలిసి బాలకృష్ణ వాయిస్ అందించారు. ఆ సినిమా హరికృష్ణ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయ్యి, బాలయ్య వాయిస్ తో ఎండ్ అవుతుంది.  ఇక ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ బాలకృష్ణ ఒక సినిమా ట్రైలర్ కు వాయిస్ ఓవర్ అందించారు. అదే మలయాళ యాక్టర్ ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. ఈ ట్రైలర్‌కు బాలయ్య వాయిస్ ఓవర్ అందించడం ఒక ఎత్తైతే.. అసలు ఆ సినిమా టైటిల్ రావడమే బాలయ్య ఐకానిక్ డైలాగ్ నుండి కావడం మరొక విశేషం. "డోంట్ ట్రబుల్ ది ట్రబుల్..." అంటూ బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్ ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్కా మీడియా ప్రొడక్షన్, రాజమౌళి సమర్పణలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు బాలయ్య ఇచ్చిన వాయిస్ ఓవర్ ట్రైలర్‌కే ఓ రేంజ్ హైప్ తెచ్చిపెట్టింది. ఏది ఏమైనా తారకరత్న తర్వాత బాలకృష్ణతో వాయిస్ ఓవర్ చెప్పించుకున్న హీరోగా ఫహద్ ఫాజిల్ నిలిచాడు. ఇది కూడా చదవండి: సింహాద్రి 175 డేస్ రికార్డు.. ఎవరూ టచ్ చేయలేని రికార్డు సృష్టించిన ఎన్టీఆర్.! మీకు నచ్చవచ్చు: 'ప్రాణం ఖరీదు' వెనుక ఉన్న సీక్రెట్స్.. చిరంజీవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? తెలుగు సినిమాలో పౌరాణిక చిత్రాల ప్రయాణం.. ఎన్టీఆర్ నుంచి నేటి వారణాసి వరకు       [Balakrishna Voice Over Movies, NBK Voice Over Movies, Nandamuri Balakrishna, Dont Trouble The Trouble Trailer, Fahadh Fassil, SS Rajamouli, Taraka Ratna, Yuvarathna Movie, Telugu Film News, Telugu News]  
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ సినిమా విడుదల తేదీ మారింది. తొలుత ప్రకటించిన తేదీ కంటే వారం ఆలస్యంగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. నిజానికి అక్టోబర్ 9 కి ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా పడనుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. కానీ, మూవీ టీం మాత్రం ముందుగా ప్రకటించినట్టుగా అక్టోబర్ 2 నే వస్తామని చెప్పుకొచ్చింది. తీరా ఇప్పుడు రిలీజ్ డేట్ ఛేంజ్ చేస్తూ సర్ప్రైజ్ చేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ.. కామెడీ, ఎమోషన్, యాక్షన్ అంశాలతో టీజర్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి: సింహాద్రి 175 డేస్ రికార్డు.. ఎవరూ టచ్ చేయలేని రికార్డు సృష్టించిన ఎన్టీఆర్.! ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. మీకు నచ్చవచ్చు: 'ప్రాణం ఖరీదు' వెనుక ఉన్న సీక్రెట్స్.. చిరంజీవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? తెలుగు సినిమాలో పౌరాణిక చిత్రాల ప్రయాణం.. ఎన్టీఆర్ నుంచి నేటి వారణాసి వరకు       [Aadarsha Kutumbam On October 9th, Aadarsha Kutumbam Release Date Changed, Aadarsha Kutumbam Postponed, Aadarsha Kutumbam October 9 Release, Victory Venkatesh, Trivikram Srinivas, Telugu Film News, Telugu News]  
మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్‌కు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ‘పుష్ప’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఆయన.. ఇప్పుడు ఓ తెలుగు సినిమాలో హీరోగా అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. రాజమౌళి సమర్పణలో వస్తున్న ఈ సినిమాపై ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది. ఈ ట్రైలర్‌కి నందమూరి బాలక‌ృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ను చూస్తే ఈ సినిమా ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందినట్లు అర్థమవుతుంది. హైదరాబాద్ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో ఫహాద్ ఫాజిల్ మ్యాజిక్‌లు చేసే వ్యక్తిగా కనిపించనున్నారు. అనాథగా ఉన్న ఓ చిన్నారితో అతడికి పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ పాపతో హీరోకు ఎలాంటి అనుబంధం ఏర్పడింది? ఆమెకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు రావడంతో అతడి జీవితంలో ఎలాంటి సమస్యలు మొదలయ్యాయి? అనే అంశాలతో కథ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ట్రైలర్‌లో ఫహాద్ ఫాజిల్ పాత్రను సరదాగా, అదే సమయంలో కొన్ని ఆసక్తికరమైన మలుపులతో చూపించారు. ఓ వైపు మ్యాజిక్‌లు చేస్తూ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం కనిపిస్తుండగా.. మరోవైపు పాపకు వచ్చిన సూపర్ పవర్స్ కారణంగా కథలో అసలు సమస్య మొదలవుతుందని తెలుస్తోంది. ఫాంటసీ, కామెడీ, ఎమోషన్ అంశాలను కలిపి సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ సినిమాను ఎస్‌.ఎస్‌. రాజమౌళి సమర్పిస్తున్నారు. ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి తనయుడు ఎస్‌.ఎస్‌. కార్తికేయ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో సినిమాపై ప్రారంభం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఫహాద్ ఫాజిల్ విషయానికి వస్తే.. మలయాళ సినిమాలతో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘పుష్ప’లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇప్పుడు ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’తో నేరుగా తెలుగు సినిమాలో హీరోగా కనిపించనుండటం విశేషం. మొత్తంగా చూస్తే.. మ్యాజిక్ చేసే హీరో, అనాథ పాప, ఆమెకు వచ్చే ప్రత్యేక శక్తులు, వాటి కారణంగా ఎదురయ్యే సమస్యలు.. ఇలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ తెరకెక్కినట్లు ట్రైలర్ చెబుతోంది. మరి ఈ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.     [Fahadh Faasil, Dont Trouble The Trouble, Dont Trouble The Trouble Trailer, Fahadh Faasil Telugu Movie, Fahadh Faasil New Movie, SS Rajamouli, SS Karthikeya, Shobu Yarlagadda, Fahadh Faasil Fantasy Movie, Telugu Movie Trailer, Tollywood News, Malayalam Star Fahadh Faasil]
2003 జులై 9న విడుదలైన 'సింహాద్రి' సినిమా తెలుగు చిత్రసీమ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ ఎలాంటిదో ఇప్పటి తరానికి ఊహించడం కూడా కష్టమే. కేవలం 20 ఏళ్ల వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ తన నటవిశ్వరూపంతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అసలు ఈ సినిమా రికార్డుల విషయానికి వస్తే.. ఆ కాలంలో ఉన్న పెద్ద పెద్ద మాస్ సినిమాల రికార్డులన్నింటినీ 'సింహాద్రి' ఒక్కదెబ్బతో తుడిచిపెట్టేసింది. 150కి పైగా కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా, ఏకంగా 52 డైరెక్ట్ సెంటర్లలో 175 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. షిఫ్టులతో కలిపి చూస్తే 55 సెంటర్లలో ఈ చిత్రం 175 రోజుల వేడుకలు జరుపుకోవడం అప్పట్లో ఒక ఊహించని సంచలనం. ఇప్పుడు 175 రోజుల రికార్డు సంగతి అటుంచితే, అసలు 50 రోజులు ఆడటం కూడా వింతే. ఎంతటి గొప్ప సినిమా అయినా రెండు నుంచి నాలుగు వారాలకే పరిమితమవుతున్నాయి. ఈ లెక్కన 'సింహాద్రి' 175 రోజుల రికార్డు ఎప్పటికీ బ్రేక్ అవ్వకుండా, చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.  ఇది కూడా చదవండి: 'ప్రాణం ఖరీదు' వెనుక ఉన్న సీక్రెట్స్.. చిరంజీవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.? మీకు నచ్చవచ్చు: రాయిని ఆడది చేసిన రాముడివా.. 44 ఏళ్ళ క్రితం వచ్చిన ఆల్ టైమ్ క్లాసిక్ సాంగ్.! ఇండియాస్ రియల్ జేమ్స్ బాండ్.. RAW వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఇతనే.!       [Simhadri 175 Days Record, Simhadri 175 Days Centers, Simhadri Movie Records, Simhadri Industry Hit, Simhadri All Time Record, Rajamouli Simhadri Movie, Jr NTR Simhadri Movie, Telugu Film News, Telugu News]  
Victory Venkatesh and Trivikram Srinivas’ much-awaited entertainer Aadarsha Kutumbam - AK47 will now release worldwide on October 9, 2026. The makers have decided to postpone the release by a week to bring the film to audiences with the complete entertainment experience it deserves. The recently released teaser, which offers a glimpse into Venkatesh’s middle-class family world filled with fun, emotions and action, has received a strong response from audiences. Written and directed by Trivikram Srinivas, the film stars Venkatesh, Srinidhi Shetty, Nara Rohith, Nivetha Pethuraj, Rao Ramesh, Satya, Brahmaji, Vennela Kishore and others. Produced by S. Radha Krishna under Haarika & Hassine Creations, with Music by Thaman S, Aadarsha Kutumbam - AK47 is now set to arrive in theatres worldwide a week later and it is expected to create a grand sensation everywhere.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
టాలీవుడ్‌లో తనదైన కామెడీ, ఎంటర్‌టైనింగ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఓ అభిమాని ఊహించని విధంగా తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. దీంతో అనిల్ రావిపూడి అసహనం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో అనిల్ రావిపూడిని కలిసేందుకు ఓ అభిమాని వచ్చాడు. ఈ సందర్భంగా అతడు దర్శకుడి కాళ్లపై పడి నమస్కరించాడు. వెంటనే స్పందించిన అనిల్ రావిపూడి.. తన కాళ్లపై ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు. అభిమాని అలా చేయడాన్ని సున్నితంగా వారించారు. ఇది కూడా చదవండి: రోజుకు రూ.100 కోట్లు ఇచ్చినా రాను.. ఐశ్వర్యలక్ష్మి షాకింగ్ కామెంట్స్ అనంతరం తనకు అభిమానులంటే ఎంతో గౌరవం ఉందని అనిల్ రావిపూడి చెప్పినట్లు సమాచారం. తనను ఒక దర్శకుడిగా, మనిషిగా అభిమానించడం తనకు సంతోషమేనని.. అయితే ఇలా కాళ్లపై పడటం మాత్రం తనకు నచ్చదని స్పష్టం చేశారు. అభిమానులు తనను గౌరవిస్తే చాలని, ఇలాంటి విధానాల్లో అభిమానం చూపించాల్సిన అవసరం లేదని సూచించారు. ఈ సందర్భంగా తాను సాయిబాబా గుడి నిర్మిస్తున్నానని కూడా అనిల్ రావిపూడి చెప్పినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనిల్ రావిపూడి స్పందించిన తీరుపై నెటిజన్లు కూడా చర్చించుకుంటున్నారు. అభిమానులు తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యక్తం చేస్తుంటారు. అయితే అభిమాని తన కాళ్లపై పడటాన్ని అనిల్ రావిపూడి సున్నితంగా అడ్డుకోవడం ఈ వీడియోలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. మీకు నచ్చవచ్చు: నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి, పవన్‌కళ్యాణ్ తీసుకున్న సంచలన నిర్ణయం     [Anil Ravipudi, Anil Ravipudi Fan, Anil Ravipudi Viral Video, Anil Ravipudi Latest News, Anil Ravipudi Fan Event, Anil Ravipudi Reaction, Mana Shankara Vara Prasad Garu, Chiranjeevi, Chiranjeevi Anil Ravipudi, Tollywood News, Telugu Cinema News]
టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్న ఆమె.. ఇప్పుడు ‘మైసా’ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రష్మికపై దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని పెంచుతున్నాయి. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ రవీంద్ర పుల్లే సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా తన సినిమా ‘మైసా’ గురించి కూడా ప్రస్తావించారు. ఈ సినిమా ప్రయాణంపై నమ్మకం ఉంచి తమకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా రష్మిక మందన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ఇది కూడా చదవండి: రోజుకి 100 కోట్లు ఇచ్చినా రాను.. ఐశ్వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్. ‘మైసా’ సినిమాను నమ్మి తనతో ఎంతో విశ్వాసంగా రష్మిక ముందుకు సాగారని రవీంద్ర పుల్లే పేర్కొన్నారు. ఈ సినిమా కోసం ఆమె నిజాయితీ, అంకితభావంతో పనిచేశారని ప్రశంసించారు. రష్మికతో కలిసి పనిచేయడం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని, ఆమె ఈ ప్రయాణంలో ముఖ్యమైన భాగం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆమె చూపించిన నిబద్ధత తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని దర్శకుడు వెల్లడించారు. ఇక ‘మైసా’ విషయానికి వస్తే.. రష్మిక ఈ సినిమాలో ఇప్పటివరకు కనిపించని సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. గోండు గిరిజన మహిళ పాత్రలో ఆమె నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో రష్మిక యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నారు. ఆయుధాలు చేతబట్టి పోరాడే పవర్‌ఫుల్ పాత్రలో ఆమె కనిపించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ పాత్ర కోసం రష్మిక ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. యాక్షన్ సన్నివేశాల కోసం ఆమె తీవ్రంగా శ్రమించినట్లు సమాచారం. సినిమా షూటింగ్‌లో భాగంగా కీలకమైన యాక్షన్, అండర్‌వాటర్ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ‘మైసా’లో రష్మికతో పాటు పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. నవంబర్ 27, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మీకు నచ్చవచ్చు: నంది అవార్డులు పున:ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే ప్యారడైజ్ సినిమా చూశాక.. నా దగ్గరకి రావడానికి కూడా భయపడతారు       [Rashmika Mandanna, Rashmika Mandanna Maisa, Maisa Movie, Maisa Movie Telugu, Rashmika Maisa, Ravindra Pulle, Ravindra Pulle Comments, Maisa Director, Rashmika Dedication, Rashmika Action Movie, Maisa Teaser, Rashmika Mandanna Movies, Telugu Cinema, Tollywood News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తప్పక చేయాల్సిన ఆర్థిక ప్లానింగ్ .! ఒక స్త్రీ జీవితంలో తల్లి కావడం అనేది అత్యంత మధురమైన, భావోద్వేగపూరితమైన అనుభూతి. ఇంటికి చిన్నారి రాకతో కుటుంబంలో సంతోషాలు పదింతలు అవుతాయి. అయితే ఈ కొత్త ప్రయాణం కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు, అనేక బాధ్యతలను కూడా తీసుకొస్తుంది. బిడ్డ ఆరోగ్య సంరక్షణ, సరైన పెంపకం, నాణ్యమైన విద్య, వారి భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించడం వంటివన్నీ తల్లిదండ్రుల ముందు నిలిచే ప్రధాన బాధ్యతలు. ఈ క్రమంలో ముఖ్యంగా కొత్తగా తల్లి అయినవారు లేదా తల్లి కాబోతున్నవారు సరైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం చాలా అవసరం. సమయానికి తీసుకునే సరైన  నిర్ణయాలు పిల్లల భవిష్యత్తును బంగారు బాటగా మారుస్తాయి. ప్రతి కొత్త తల్లి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఆర్థిక సూత్రాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్.. ఆర్థిక ప్రణాళికలో వేసే మొదటి అడుగు ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం. జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించడం కష్టం. వైద్య అత్యవసర పరిస్థితులు వచ్చినా లేదా ఉద్యోగంలో ఊహించని మార్పులు ఎదురైనా కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండటానికి కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బును అత్యవసర నిధిగా పక్కన పెట్టాలి. దీనివల్ల ఇతరులపై ఆధారపడే పరిస్థితి రాదు.  దీంతోపాటు తల్లి, బిడ్డ ఇద్దరికీ తగిన ఆరోగ్య బీమా రక్షణ ఉండటం చాలా కీలకం. ఒకవేళ ఇప్పటికే ఆరోగ్య బీమా పాలసీ ఉంటే, అందులో కొత్తగా పుట్టిన బిడ్డ పేరును వీలైనంత త్వరగా చేర్పించడం మర్చిపోకూడదు. పొదుపు అలవాటు , పెట్టుబడులు.. సాధారణంగా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఖర్చు చేసే అలవాటు ఉంటే, తల్లి అయిన తర్వాత దానిని వెంటనే మార్చుకోవాలి. ఆదాయంలో కనీసం పాతిక శాతాన్ని పొదుపు చేయడం ఉత్తమమైన పద్ధతి. ఈ పొదుపు కేవలం బ్యాంకు ఖాతాలో ఉంచడమే కాకుండా, మంచి అవగాహనతో సరైన మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల చక్రవడ్డీ   లభిస్తుంది. కాలక్రమేణా ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మంచి రాబడి రావడానికి, ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఈ అలవాటు ఎంతగానో తోడ్పడుతుంది. ఖర్చుల నిర్వహణ , బడ్జెట్.. పాప లేదా బాబు పుట్టిన తర్వాత ఇంట్లో ఖర్చులు అనుకోకుండా పెరుగుతాయి. అందుకే ప్రతినెలా వచ్చే ఆదాయం, జరిగే ఖర్చులను ఒక క్రమపద్ధతిలో నమోదు చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు దుస్తులు, బొమ్మలు లేదా ఇతర అనవసర విషయాలపై ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంటే వాటిని గుర్తించి తగ్గించుకోవాలి. ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ కేటాయించుకుని అనవసరమైన ఖర్చులను అరికడితే, ఆ డబ్బు పొదుపుగా మారి భవిష్యత్తులో బిడ్డ అవసరాలకు ఉపయోగపడుతుంది. చిన్న చిన్న టార్గెట్స్.. భవిష్యత్తు అవసరాలను ఒకేసారి పెద్ద భారంగా భావించకుండా ఉండటానికి ఆర్థిక ప్రణాళికను చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకోవాలి. ఉదాహరణకు పిల్లలను స్కూల్ లో చేర్పించడం, సంవత్సరానికి సరిపడా  వైద్య ఖర్చులు, ప్రతి సంవత్సరం చేయాల్సిన పొదుపు వంటి వాటికి వేర్వేరుగా చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రణాళిక స్పష్టంగా ఉంటుంది, మనం ఎంతవరకు చేరుకున్నామో సులభంగా అర్థమవుతుంది. పెద్ద ఖర్చులను చిన్న భాగాలుగా విభజించి ప్రణాళిక వేసుకోవడం వల్ల ఒత్తిడి లేకుండా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి ఆలోచించడం.. ఆర్థిక ప్రణాళిక అనేది ఒక్కరి బాధ్యత మాత్రమే కాదు. తల్లిదండ్రులిద్దరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రతి నెల బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, పొదుపు చేయడం, పిల్లల చదువుల ఖర్చులు వంటి ప్రతి విషయంపై జీవిత భాగస్వామితో కలిసి చర్చించాలి. దీనివల్ల ఇద్దరికీ కుటుంబ బాధ్యతలపై స్పష్టత వస్తుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం తేలికవుతుంది. ఇద్దరూ కలిసి పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తే కుటుంబానికి బలమైన ఆర్థిక పునాది ఏర్పడి, బిడ్డ భవిష్యత్తుకు పూర్తి భద్రత లభిస్తుంది.                       *రూపశ్రీ.
నిద్ర పట్టడం లేదా బెడ్‌పై ఈ వస్తువులు అస్సలు పెట్టకండి! రోజంతా అలసిపోయినా రాత్రి పడుకున్న తర్వాత సరిగ్గా నిద్ర పట్టడం లేదా? తరచూ నిద్ర మధ్యలో మెలకువ రావడం, నిద్ర సరిగా లేకపోవడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. నిద్రలేమి వల్ల మరుసటి రోజు అలసట, చిరాకు, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మంచి నిద్ర కోసం మనం తీసుకునే ఆహారం, జీవనశైలి, నిద్రించే సమయం మాత్రమే కాకుండా పడకగదిలోని వాతావరణం కూడా ముఖ్యమని వాస్తు నిపుణుడు దంతూరి పండరినాథ్ గారు వివరిస్తున్నారు. ముఖ్యంగా బెడ్‌పై లేదా పడక దగ్గర ఎలాంటి వస్తువులు ఉంచకూడదు?అవి నిద్రకు ఎలా ఆటంకం కలిగిస్తాయి? నిద్రలేమికి కారణమయ్యే అంశాలు ఏమిటి? మంచి నిద్ర కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోవచ్చు. నిద్ర సరిగా పట్టకపోవడం, తరచూ నిద్రకు ఆటంకం కలగడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ వీడియోలోని సూచనలను తెలుసుకోండి. అలాగే నిద్ర సమస్యలు నిరంతరం కొనసాగితే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం కూడా ముఖ్యం. మంచి నిద్ర కోసం బెడ్‌పై ఉంచకూడని వస్తువులు, నిద్రలేమికి కారణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు  తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
మన వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయల్లో బంగాళాదుంప (ఆలూ) మొదటి వరుసలో ఉంటుంది. వేపుడు, కుర్మా, ఫ్రైస్ లేదా సమోసాలు.. వంటకం ఏదైనా సరే ఆలూ ఉంటే ఆ రుచే వేరు. అయితే ఇల్లాళ్లకు, వంట ప్రియులకు నిత్యం ఎదురయ్యే ఒక పెద్ద సమస్య ఏమిటంటే.. బంగాళాదుంపల పొట్టు తీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టగానే అవి కొద్ది నిమిషాల్లోనే నల్లగా లేదా గోధుమ రంగులోకి మారిపోతుంటాయి. అలా రంగు మారిన దుంపలను చూస్తే వంట చేయాలనే ఉత్సాహం తగ్గడమే కాకుండా, అవి పాడైపోయాయేమోననే అనుమానం కూడా వస్తుంది. సాధారణంగా ఉదయం పూట ఆఫీసులకు, పిల్లల స్కూల్ బాక్సులకు త్వరగా వంట పూర్తి చేయాలని ముందుగానే ఆలూ ముక్కలను కోసి పెట్టుకునే వారికి ఈ సమస్య మరింత చిరాకు కలిగిస్తుంది. అసలు బంగాళాదుంప ముక్కలు అంత వేగంగా ఎందుకు నల్లగా మారతాయి? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? మరియు అలా మారకుండా ఎల్లప్పుడూ తెల్లగా, ఫ్రెష్‌గా ఉంచడానికి ఉపయోగపడే కిచెన్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బంగాళాదుంపలు నల్లగా మారడానికి ప్రధాన కారణం  ఎంజైమాటిక్ బ్రౌనింగ్  (Enzymatic Browning) అనే సహజమైన రసాయన చర్య. బంగాళాదుంపల్లో పాలీఫెనాల్ ఆక్సిడేస్ (Polyphenol Oxidase) అనే ప్రత్యేకమైన ఎంజైమ్‌తో పాటు ఫినోలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. మనం దుంపను చాకుతో కోసినప్పుడు, దానిలోని కణాలు దెబ్బతిని లోపలి భాగం నేరుగా గాలిలోని ఆక్సిజన్‌తో స్పర్శలోకి వస్తుంది. ఈ ఆక్సిజన్, ఎంజైమ్‌లతో చర్య జరపడం వల్ల మెలనిన్ (Melanin) అనే నల్లటి వర్ణద్రవ్యం ఉత్పత్తి అవుతుంది. ఇదే ఆలూ ముక్కలు రంగు మారడానికి అసలు కారణం. ఈ మార్పు వల్ల రుచిలో పెద్దగా తేడా రాకపోయినా, చూడటానికి అస్సలు బాగుండవు. పైగా ఇలా గాలికి ఎక్కువసేపు ఉంచడం వల్ల అందులోని కొన్ని నీటిలో కరిగే పోషకాలు కూడా నశించే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి మన వంటింట్లోనే దొరికే కొన్ని సులువైన పదార్థాలతో అద్భుతమైన పరిష్కారాలు కనుగొనవచ్చు. మొదటిది మరియు అత్యంత ప్రభావవంతమైన పద్ధతి  చల్లని నీటి చిట్కా . బంగాళాదుంపలను కోసిన వెంటనే గాలి తగలకుండా ఐస్ వాటర్ లేదా చల్లని నీళ్లు ఉన్న గిన్నెలో మునిగేలా వేయాలి. నీరు ఆక్సిజన్‌కు, ఆలూ ముక్కలకు మధ్య ఒక కవచంలా పనిచేసి ఆక్సీకరణ ప్రక్రియను అడ్డుకుంటుంది. నీటిలో 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల ముక్కలలో ఉండే అదనపు స్టార్చ్ బయటకు వచ్చి, ఫ్రైస్ చేసినప్పుడు అవి మరింత క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఎక్కువ సమయం అంటే 4 నుంచి 5 గంటల పాటు నిల్వ ఉంచాలనుకుంటే, ఆ నీటిలో అర టీస్పూన్ నిమ్మరసం లేదా కొద్దిగా తెల్ల వెనిగర్ (White Vinegar) కలపాలి. నిమ్మరసంలోని విటమిన్ సి (ఆస్కార్బిక్ యాసిడ్) మరియు వెనిగర్‌లోని అసిడిటీ ఎంజైమ్‌ల పనితీరును పూర్తిగా నిరోధించి ముక్కలు గంటల తరబడి తెల్లగా మెరిసేలా చేస్తాయి. మరొక అద్భుతమైన మార్గం  ఉప్పు నీటి శుద్ధి . ఒక లీటర్ నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలిపి అందులో కోసిన బంగాళాదుంప ముక్కలను వేసి ఉంచడం వల్ల అవి రంగు మారవు. ఉప్పు నీరు ఎంజైమాటిక్ చర్యను మందగించేలా చేస్తుంది. అలాగే, వంటను మరుసటి రోజుకి ప్లాన్ చేసుకుంటుంటే, ముక్కలను నీటిలో వేసి గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే 24 గంటల పాటు అవి ఏమాత్రం రంగు మారకుండా తాజాగా ఉంటాయి. ఒకవేళ మీరు ముక్కలను నీటిలో వేయకూడదు అనుకుంటే, వాటిపై కొద్దిగా వంటనూనె (Cooking Oil) రాసి గాలి తగలకుండా ఉంచవచ్చు. ఈ చిన్న చిన్న కిచెన్ హాక్స్ పాటించడం వల్ల వంటగదిలో మీ సమయం ఆదా అవ్వడమే కాకుండా, బంగాళాదుంపలతో చేసే ప్రతి వంటకం ఎంతో రుచిగా, ఆకర్షణీయంగా మారుతుంది.     [ Potatoes, Potato Browning, Enzymatic Browning, Polyphenol Oxidase, Potato Storage, Kitchen Hacks, Prevent Potato Browning, Cold Water Soak, Lemon Juice, White Vinegar ]
వినాయక చవితి పూజలో వెలగపండు ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో  ప్రత్యేకంగా కనిపించే వెలగపండును కేవలం నైవేద్యానికే పరిమితం చేస్తుంటారు. చాలా ఇళ్లలో వెలగపండు నైవేధ్యంగా పెట్టాక వాటిని వినాయకుడితో పాటు నిమజ్జనం చేయడం లేదా పడేయడం లేదా వాటిని అలాగే వదిలేయడం చేస్తుంటారు. కానీ ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో వెలగ పండుకు  చాలా ప్రాధాన్యత ఉంది. పైకి గట్టి పెంకుతో సాధారణంగా కనిపించినప్పటికీ, లోపల ఉన్న గుజ్జు అమృతంతో సమానమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ పండు కలిగించే ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవేంటో తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థ.. వెలగపండులో   ఫైబర్ అధికంగా ఉంటుంది, అలాగే అందులో ఉండే  టానిన్లు జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం లేదా విరేచనాలతో బాధపడేవారికి ఈ పండు సహజమైన ఔషధంగా తోడ్పడుతుంది. కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాను నశింపజేసి ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తి  విటమిన్ సీ, విటమిన్ ఏ , వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు వెలగపండులో  పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, కణాల నాశనాన్ని అడ్డుకుంటాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా వెలగపండు పాత్ర ప్రశంసనీయం. క్రమంతప్పకుండా పరిమితంగా తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం.. కాలేయం, మూత్రపిండాల రక్షణకు వెలగపండు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో కాలేయానికి సహాయపడి, దాని పనితీరును సమర్థవంతంగా ఉంచుతుంది. అలాగే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడి మూత్రసంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. డయాబెటిస్ .. డయాబెటిస్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారికి వెలగపండు మంచి ఆహారం. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది. శరీరం శక్తి కోల్పోకుండా, తక్షణ శక్తిని అందించడంలో దీనిలోని పోషకాలు తోడ్పడతాయి. మహిళల ఆరోగ్యానికి.. మహిళల ఆరోగ్యానికి కూడా వెలగపండు చాలా మేలు చేస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, అలాగే పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తి పెరగడంలో వెలగపండు గుజ్జు సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచడానికి ఇందులోని యాంటీఆక్సిడెంట్లు దోహదపడతాయి. వెలగపండును గుజ్జు రూపంలో నేరుగా లేదా కొద్దిగా బెల్లం లేదా తేనె కలిపి తీసుకోవచ్చు.  వెలగపండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఏ ఆహారమైనా పరిమితికి మించి తీసుకుంటే సమస్యలు రావచ్చు. అతిగా తింటే కడుపునొప్పి లేదా జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, సరైన పరిమాణంలో తింటూ వెలగపండు నుంచి ఆరోగ్య లాభాలను పొందడం మంచిది.                   *రూపశ్రీ.  
రాత్రి వేళల్లో నిద్రపోయే ముందు ఫోన్ చూడటం, ఆ తర్వాత దానిని దిండు కింద లేదా తలకు దగ్గర్లో  పెట్టుకుని నిద్రపోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. పొద్దున్నే అలారం వినపడటం సులువవుతుందని కొందరు, అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే ఎత్తవచ్చని మరికొందరు ఇలా చేస్తుంటారు. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యంపై, నిద్ర నాణ్యతపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో తెలిస్తే ఖచ్చితంగా దిగ్భ్రాంతి చెందుతారు. ప్రశాంతమైన నిద్రను దూరం చేయడమే కాకుండా, శరీరానికి ప్రమాదకరమైన సమస్యలను కొనితెచ్చే ఈ అలవాటు గురించి ప్రతీ ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. దిండు కింద ఫోన్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రమాదాలు,  ఆరోగ్య సమస్యల గురించి వివరంగా తెలుసుకుంటే.. మన శరీరంలో నిద్రను నియంత్రించడానికి మెలాటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. రాత్రి వేళ చీకటి పడినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అయితే స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్ నుండి వచ్చే నీలి రంగు వెలుతురు (బ్లూ లైట్) మెలాటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఫోన్ దిండు కింద ఉన్నప్పుడు, తరచుగా వచ్చే నోటిఫికేషన్లు, రింగ్ టోన్లు లేదా లైట్లు మన గాఢ నిద్రకు భంగం కలిగిస్తాయి. దీనివల్ల పొద్దున్నే లేచినా అలసటగా అనిపించడం, రోజంతా నీరసంగా ఉండటం జరుగుతుంది. స్మార్ట్‌ఫోన్లు పనిచేస్తున్నప్పుడు , నెట్‌వర్క్ సిగ్నల్స్ కోసం వెతుకుతున్నప్పుడు   రేడియేషన్ బయటకు వస్తుంది. ప్రతిరోజూ రాత్రి పూట ఎనిమిది గంటల పాటు ఫోన్‌ను తలకు అతి సమీపంలో ఉంచుకోవడం వల్ల ఈ రేడియేషన్ ప్రభావం నేరుగా మెదడుపై పడే అవకాశం ఉంటుందని  పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా యాప్ నడుస్తున్నప్పుడు వేడి ఉత్పత్తి అవుతుంది. ఫోన్‌ను దిండు కింద పెట్టినప్పుడు ఆ వేడి బయటకు వెళ్ళడానికి దారి ఉండదు. దిండు, పరుపు వేడిని పట్టి ఉంచుతాయి. దీనివల్ల ఫోన్ తీవ్రంగా వేడెక్కి బ్యాటరీ పేలిపోవడం లేదా పరుపుకు నిప్పు అంటుకోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిద్రలేమి వల్ల కేవలం ఉదయం అలసట మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో అధిక రక్తపోటు, మధుమేహం, బరువు పెరగడం , గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మరుసటి రోజు జ్ఞాపకశక్తి, పనిలో సామర్థ్యం తగ్గుతాయి. ఈ  అలవాటు నుంచి బయటపడటానికి కొన్ని సులువైన మార్గాలు: నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను  మంచానికి కనీసం ఐదు నుంచి ఆరు అడుగుల దూరంలో ఉంచడం మంచిది. అలారం కోసం ఫోన్ వాడేవారైతే, దానికి బదులుగా ఒక సాధారణ టేబుల్ క్లాక్ లేదా అలారం గడియారాన్ని ఉపయోగించడం అలవాటు చేసుకోండి. నిద్రపోవడానికి అరగంట ముందే ఫోన్‌ను పక్కన పెట్టేసి, వైఫై లేదా మొబైల్ డేటాను ఆపివేయడం మంచిది. ఈ చిన్న మార్పులు చేసుకోవడం వల్ల  ఇలా చేస్తే నిద్ర నాణ్యత పెరగడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఎవరిని వారు  కాపాడుకోవచ్చు.                     *రూపశ్రీ.
రాత్రి వేళల్లో నిద్రపోయే ముందు ఫోన్ చూడటం, ఆ తర్వాత దానిని దిండు కింద లేదా తలకు దగ్గర్లో  పెట్టుకుని నిద్రపోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. పొద్దున్నే అలారం వినపడటం సులువవుతుందని కొందరు, అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే ఎత్తవచ్చని మరికొందరు ఇలా చేస్తుంటారు. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యంపై, నిద్ర నాణ్యతపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో తెలిస్తే ఖచ్చితంగా దిగ్భ్రాంతి చెందుతారు. ప్రశాంతమైన నిద్రను దూరం చేయడమే కాకుండా, శరీరానికి ప్రమాదకరమైన సమస్యలను కొనితెచ్చే ఈ అలవాటు గురించి ప్రతీ ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. దిండు కింద ఫోన్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రమాదాలు,  ఆరోగ్య సమస్యల గురించి వివరంగా తెలుసుకుంటే.. మన శరీరంలో నిద్రను నియంత్రించడానికి మెలాటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. రాత్రి వేళ చీకటి పడినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అయితే స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్ నుండి వచ్చే నీలి రంగు వెలుతురు (బ్లూ లైట్) మెలాటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఫోన్ దిండు కింద ఉన్నప్పుడు, తరచుగా వచ్చే నోటిఫికేషన్లు, రింగ్ టోన్లు లేదా లైట్లు మన గాఢ నిద్రకు భంగం కలిగిస్తాయి. దీనివల్ల పొద్దున్నే లేచినా అలసటగా అనిపించడం, రోజంతా నీరసంగా ఉండటం జరుగుతుంది. స్మార్ట్‌ఫోన్లు పనిచేస్తున్నప్పుడు , నెట్‌వర్క్ సిగ్నల్స్ కోసం వెతుకుతున్నప్పుడు   రేడియేషన్ బయటకు వస్తుంది. ప్రతిరోజూ రాత్రి పూట ఎనిమిది గంటల పాటు ఫోన్‌ను తలకు అతి సమీపంలో ఉంచుకోవడం వల్ల ఈ రేడియేషన్ ప్రభావం నేరుగా మెదడుపై పడే అవకాశం ఉంటుందని  పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా యాప్ నడుస్తున్నప్పుడు వేడి ఉత్పత్తి అవుతుంది. ఫోన్‌ను దిండు కింద పెట్టినప్పుడు ఆ వేడి బయటకు వెళ్ళడానికి దారి ఉండదు. దిండు, పరుపు వేడిని పట్టి ఉంచుతాయి. దీనివల్ల ఫోన్ తీవ్రంగా వేడెక్కి బ్యాటరీ పేలిపోవడం లేదా పరుపుకు నిప్పు అంటుకోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిద్రలేమి వల్ల కేవలం ఉదయం అలసట మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో అధిక రక్తపోటు, మధుమేహం, బరువు పెరగడం , గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మరుసటి రోజు జ్ఞాపకశక్తి, పనిలో సామర్థ్యం తగ్గుతాయి. ఈ  అలవాటు నుంచి బయటపడటానికి కొన్ని సులువైన మార్గాలు: నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను  మంచానికి కనీసం ఐదు నుంచి ఆరు అడుగుల దూరంలో ఉంచడం మంచిది. అలారం కోసం ఫోన్ వాడేవారైతే, దానికి బదులుగా ఒక సాధారణ టేబుల్ క్లాక్ లేదా అలారం గడియారాన్ని ఉపయోగించడం అలవాటు చేసుకోండి. నిద్రపోవడానికి అరగంట ముందే ఫోన్‌ను పక్కన పెట్టేసి, వైఫై లేదా మొబైల్ డేటాను ఆపివేయడం మంచిది. ఈ చిన్న మార్పులు చేసుకోవడం వల్ల  ఇలా చేస్తే నిద్ర నాణ్యత పెరగడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఎవరిని వారు  కాపాడుకోవచ్చు.                     *రూపశ్రీ.