వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..! రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం పార్టీ సంస్థాగత యంత్రాంగంలో భారీ మార్పులు చేపట్టింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధికారికంగా జాబితాను ప్రకటించారు. ప్రాంతీయ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల సమీకరణాలు, పార్టీ భవిష్యత్ వ్యూహాలను పరిగణనలోకి తీసుకుని కీలక నేతలకు ఆయా రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమన్వయం, ఎన్నికల వ్యూహాల అమలులో కొత్త ఇన్‌చార్జ్‌లు కీలకంగా వ్యవహరించనున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల వారీగా పార్టీ పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రముఖ నాయకురాలు స్మృతి ఇరానీకి కీలకమైన బాధ్యతలు అప్పగించారు.  ఆమెకు హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జి బాధ్యతలను కేటాయించారు. గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న స్మృతి ఇరానీకి రెండు ముఖ్యమైన రాష్ట్రాల బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో ఆమె ప్రాధాన్యత మరింత పెరిగినట్లయింది. మరోవైపు, పార్టీలో కీలక వ్యూహకర్తగా పేరుగాంచిన సునీల్ బన్సల్‌కు తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఇన్‌ఛార్జి బాధ్యతలు కేటాయించారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జాతీయ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్: అర్వింద్ భదౌరియా ఇంచార్జ్‌గా, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ సహ-ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారు.ఒడిశా: దగ్గుబాటి పురందేశ్వరి ఇంచార్జ్‌గా, డాక్టర్ స్వదేశ్ సింగ్ సహ-ఇంచార్జ్‌గా నియమితులయ్యారు. తమిళనాడు: రామ్ మాధవ్ ఇంచార్జ్‌గా ఎంపికవ్వగా, కో-ఇంచార్జ్‌లుగా డీకే అరుణ, నిర్మల్ కుమార్ సురాణా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదే క్రమంలో మరికొద్ది మంది సీనియర్ నాయకులకు కూడా ముఖ్యమైన రాష్ట్రాల బాధ్యతలు దక్కాయి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న రామ్ మాధవ్‌కు తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల బాధ్యతలను కేటాయించారు. అలాగే, వినోద్ తావ్డేను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా, వినయ్ సహస్రబుద్ధేను ఢిల్లీ ఇన్‌ఛార్జిగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఇన్‌ఛార్జీలు, సహ-ఇన్‌ఛార్జీల పూర్తి జాబితాను బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు, రాబోయే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ తాజా మార్పులు ఎంతగానో ఉపయోగపడతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.       [ BJP state in charges, Smriti Irani, Sunil Bansal, Telangana BJP, Ram Madhav, BJP news updates, Arvind Bhadauria, Daggubati Purandeswari, DK Aruna,Ram Madhav, Nitin Nabeen ]  
ఏపీ స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు.  రాష్ట్ర రాజకీయాలలో స్థానిక ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.  ఎన్నికలు వాయిదా పడతాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదనీ..  ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు అక్కర్లేదని  తేల్చిచెప్పారు. మంత్రులు,  పార్టీ కీలక నేతల ఉన్నతస్థాయి భేటీలో నారా లోకేశ్  స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేయాలని, అందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. , క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను స్థానిక సమరానికి పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.  గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి   స్థానిక ఎన్నికలు  కీలకమన్న నారా లోకేష్.. గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా,  పారదర్శకమైన పాలనను అందిస్తూ ప్రజల మధ్యే ఉంటున్న కూటమి శ్రేణులు ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. కేవలం విజయం సాధించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థుల విజయం కోసం నాయకులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు.    [Nara Lokesh, AP local body elections, Panchayat elections,  Andhra Pradesh, TDP alliance clean sweep, AP politics,Telugu One]
దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత తెలుగుదేశం గూటికి చేరనున్నారా? జగన్ కు పెట్టని కోట లాంటి కడపలో వైసీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే.. వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ సునీతను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి.. స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దింపేందుకు  నిర్ణయించుకున్నారా? ఈ మేరకు లోకేష్ చేసిన ప్రతిపాదనకు వైఎస్ సునీత ఓకే చెప్పారా? ఈ ప్రశ్నలకు పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.    మంత్రి నారా లోకేష్  స్వయంగా ఈ  ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.  వైఎస్ కుటుంబానికి, వైసీపీకి తిరుగులేని పట్టు,  బలం,  ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోనే ఆ పార్టీని గట్టి దెబ్బకొట్టాలన్న వ్యూహంతోనే లోకేష్ ఈ ప్రతిపాదన చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి పీక్స్ చేరుతున్న తరుణంలో లోకేష్ చేసినట్లుగా చెబుతున్న ఈ ప్రతిపాదనకు  రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అధికారికంగా ఈ ప్రతిపాదనకు సంబంధించిన సమాచారం ఏదీ బయటకు రాకపోయినా.. పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం వైఎస్ సునీత సైకిలెక్కి జగన్ కు సవాల్ విసరడం దాదాపు ఖాయమైందనే అంటున్నారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతం తర్వాత వైఎస్ సునీత న్యాయం కోసం పోరాటం చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి మరణానికి కారణమైన వారిపై రాజకీయంగా, న్యాయపరంగా ఆమె చేసిన పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెకు రాజకీయ ఆశ్రయం కల్పించడం ద్వారా ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టవచ్చని నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ  భావిస్తున్నాయి.  మరోవైపు, వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావించే పులివెందుల ప్రాంతంలో ఇలాంటి పరిణామాలు జరిగితే స్థానిక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. సొంత కుటుంబ సభ్యురాలే ప్రత్యర్థి పార్టీ మద్దతుతో బరిలోకి దిగితే అది రాజకీయంగా జగన్ కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందంటున్నారు. ఏది ఏమైనా సునీత తెలుగుదేశం గూటికి చేరతారా అన్న విషయం ఆమె నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ ఖరారైనట్లు కాదని పరిశీలకులు అంటున్నారు.  [YS Sunitha, Nara Lokesh, Lingala ZPTC, Kadapa politics, TDP offer, Telugu Desham Party, Kadapa, ZP Chair Person, AP Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
  భగవంతునికి, భక్తునికి అనుసంధానమైనది అదేదో సువాసనని ఇచ్చే అగరబత్తి అన్నట్టుగా.. సినిమాకి, సినిమా ప్రేమికుడికి మధ్య అనుసంధానకర్త దర్శకుడు. అంటే సినీ సువాసనని ప్రేక్షకులని అందించడం కేవలం అతని చేతుల్లోనే ఉంది. అలాంటి  దర్శకులకి  ‘సెకండ్ మూవీ సెంటిమెంట్’ అనేది చాలా కాలంగా ఒక పెద్ద శాపంగా  వేధిస్తోంది.  మొదటి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి, రికార్డు స్థాయి హిట్ కొట్టిన కొత్త దర్శకులు తమ రెండో చిత్రానికి వచ్చేసరికి తడబడటం టాలీవుడ్‌లో తరచూ చూస్తూనే ఉన్నాం.  వినాయక్, రాజమౌళి, బోయపాటి శ్రీను, కొరటాల, అనిల్ రావిపూడి తప్ప  చాలామంది టాలెంట్ ఉన్న దర్శకులు ఈ రెండో సినిమా పరీక్షలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేక తీవ్ర నిరాశ పరిచారు. ఇప్పుడు సరిగ్గా ఇదే సెంటిమెంట్ ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో అరంగేట్రం చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల విషయంలోనూ రిపీట్ అవుతోందా అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో ముమ్మరంగా సాగుతోంది. natural star నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరెకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది పారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి మిశ్రమ స్పందనను మూటగట్టుకుంటోంది.     ఇది కూడా చదవండి: షాకింగ్: ఫరియా అబ్దుల్లా ఇల్లు కాస్ట్ ఎంతో తెలుసా! విడుదలకి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఏకంగా 55 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి నాని కెరీర్‌లోనే ఆల్‌టైమ్ హయ్యెస్ట్ రికార్డును నమోదు చేసింది. అంతేకాక కేవలం డే-1 ప్రీ-సేల్స్ ద్వారానే ఇండియాలో ₹40.86 కోట్ల అడ్వాన్స్ వసూళ్లు సాధించి అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. 1980ల నాటి సికింద్రాబాద్‌లోని పారడైజ్ బ్యాక్‌డ్రాప్‌లో, గుర్తింపు లేని అణచివేతకు గురైన ఒక తెగ హక్కుల కోసం పోరాడే 'జడల్' పాత్రలో నాని ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులచేత జైజైలు కొట్టిస్తోంది. మొదటి సగం నిండా రక్తపాతం, రా అండ్ రస్టిక్ యాక్షన్ సీన్స్,  మరియు అనిరుధ్ అందించిన థ్రిల్లింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను షేక్ చేశాయి. అయితే ఇంటర్వెల్ తర్వాతే కథలో అసలైన సవాలు మొదలైంది. సెకండ్ హాఫ్‌లో బలహీనమైన స్క్రీన్‌ప్లే, స్లోగా సాగే కథనం, మరియు డెప్త్ లేని మదర్-సన్ ఎమోషన్ వల్ల ప్రేక్షకులు కొంత అసంతృప్తికి లోనవుతున్నారు. శ్రీకాంత్ ఓదెల విజన్ చాలా గ్రాండ్‌గా ఉన్నప్పటికీ, ఎడిటింగ్ లోపాలు మరియు అతిగా అనిపించే వైలెన్స్ వల్ల సినిమా ఫ్లో దెబ్బతిన్నదని విమర్శలు వస్తున్నాయి. [Srikanth Odela Second Movie Sentiment In The Paradise, The Paradise Movie Review, Srikanth Odela, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
Upasana Kamineni Konidela has taken on the responsibility as Director – Projects, She will work with Apollo’s leadership, clinical teams and project partners on the planning and delivery of hospital projects across India. Her priorities will include new facilities, expansions and upgrades to existing hospitals, and consistent design standards across patient spaces. Working with project teams, she will focus on clear signage and wayfinding, easier navigation, efficient clinical spaces and a more comfortable experience for patients and their families. She will also support stronger project processes, reporting and coordination from design through opening. Apollo’s current expansion plan has an estimated total project cost of approximately ₹8600crore, including approximately ₹1,565 crore of listed brownfield expansion projects at existing facilities. The programme covers a combination of stronger capacity in established markets and new facilities in growing urban centres. Published plans identify projects across Hyderabad, Delhi NCR, Chennai, Mumbai and Bengaluru, alongside Lucknow, Varanasi, Indore, Guwahati and Ranchi, among other locations. The particular projects and budgets within Upasana’s mandate will be confirmed by Apollo. The work is intended to make advanced care easier to reach and easier to use. In each neighbourhood, a hospital can support patients well beyond a single visit, while creating opportunities for doctors, nurses and other skilled workers and the families who depend on them. Apollo will continue to connect hospital care with prevention and early diagnosis, helping more people take charge of their health. Its ambition is to pair accessible, affordable care with clinical excellence that also makes India a trusted destination for patients from around the world. Upasana Kamineni Konidela said: “My grandfather, Dr. Prathap C. Reddy, built Apollo on the belief that world-class healthcare should be within reach of people in India. My responsibility is to carry that belief into the hospitals we build and the facilities we improve. “Good hospital design has a human purpose. Patients should find their way without confusion; families should feel supported; and our doctors and care teams should have spaces that help them deliver excellent care. As Apollo grows, I want every project to serve its neighbourhood, create meaningful opportunities for the people who work with us, and help more people take their health into their own hands. We have an opportunity to show the world what thoughtful design, compassionate care and Indian clinical excellence can achieve together." Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    తనదైన శైలిలో విభిన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది 'ఫరియా అబ్దుల్లా'. సినిమాలే కాదు అభిమానులు, సోషల్ మీడియా ప్రేమికుల్లో జోష్ నింపుతు ప్రైవేట్ ఫంక్షన్స్ కి కూడా హాజరవుతూ ఉండటంలో కూడా ఫరియా స్పెషలిస్ట్.   ప్రస్తుతం సందీప్ కిషన్, జాసన్ సంజయ్ కాంబోలో తెరకెక్కుతున్న 'సిగ్మా'తో బిజీగా ఉంది. అక్టోబర్ 2 న రిలీజ్ కానుండటంతో ప్రచార కార్యక్రమాలు ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. రీసెంట్ గా  ఫరియా అబ్దుల్లా కొత్త ఇల్లు కొనుగోలు చేసిందంటూ సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ గత కొన్ని రోజులుగా న్యూస్ ఒకటి హల్‌చల్ చేస్తుంది.కానీ అసలు నిజం ఏంటంటే ఒక విలేకరి ఫరియా అబ్దుల్లా సక్సెస్ రేషియో గురించి కాస్త కఠినమైన ప్రశ్న అడగగా, సందీప్ కిషన్ వెంటనే జోక్యం చేసుకుని 'ఫరియా కేవలం 25 ఏళ్ల చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప మైలురాళ్లను సాధించింది. ఇప్పటికే ఎన్నో మంచి చిత్రాల్లో నటించి, అవార్డులు అందుకోవడమే కాకుండా, స్వశక్తితో సొంతంగా ఇల్లు, కారు కొనుగోలు చేసి తన తల్లిదండ్రులను చాలా సంతోషంగా చూసుకుంటోందని సందీప్ వెల్లడించారు. అయితే తాజాగా ఈ విషయంపై ఫరియా స్పందిస్తూ 'సందీప్ కిషన్ ఈ ఈవెంట్‌లో నన్ను సమర్థిస్తూ మాట్లాడిన విధానంపై చాలా ఆనందం వేసింది. ఇది కూడా చదవండి: శ్రీకాంత్ ఓదెల, చిరంజీవి సినిమా ఉంటుందా:ఇదే ఏకైక మార్గం!      కానీ, నేనింకా కొత్త ఇల్లు కొనలేదు. సందీప్ కిషన్ ప్రెస్ మీట్‌లో ఆ మాట చెప్పిన తర్వాతే నాకు  కూడా నిజంగానే ఒక కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనే బలమైన కోరిక కలిగింది. సందీప్ ఇచ్చిన ఆ కాంప్లిమెంట్ నాలో ఒక  కొత్త ఉత్సాహాన్ని నింపింది. త్వరలోనే సొంతంగా మంచి ఇల్లు కొని అతని మాటను నిజం చేస్తానని ఫరియా స్పష్టం చేశారు.  
'దసరా'తో హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం 'ది ప్యారడైజ్' తో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. సినిమాకి అయితే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ టాక్ వస్తుంది. మరి ఈ నేపథ్యంలో శ్రీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.  ఇది కూడా చదవండి: బాక్సాఫీస్ రచ్చ: నెగిటివ్ టాక్‌లోను గంటకి ఎన్ని వేల టిక్కెట్లు బుక్ అవుతున్నాయో తెలుసా! శ్రీకాంత్  నెక్స్ట్ ప్రాజెక్ట్  మెగాస్టార్ చిరంజీవితో ఉంటుందనే ప్రకటన వచ్చింది. నానినే  నిర్మించబోతున్నాడు. మరి ఇప్పుడు  పారడైజ్ తో ప్లాప్ ని చాలా పకడ్బందీగా శ్రీకాంత్ అందుకోవడంతో చిరంజీవి సినిమా ఉంటుందా లేదా అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మనకి అవకాశాన్ని ఇచ్చే  ఆత్మీయ బంధువు, గురువు, బానిస.       [Srikanth Odela Next Movie With Chiranjeevi, Srikanth Odela next movie, Chiranjeevi Srikanth Odela, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]     
సినిమాల్లో యాక్షన్ హీరోలు చాలామందే ఉంటారు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ తమ ఫిట్‌నెస్‌ను మరింత కాపాడుకుంటూ ఇప్పటికీ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆకట్టుకుంటున్న హీరోలు మాత్రం చాలా తక్కువ. అలాంటి వారిలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఒకరు. 64 ఏళ్ల వయసులోనూ ఆయన ఫిట్‌నెస్ చూస్తే ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా కనిపిస్తారు. తాజాగా అర్జున్ చేసిన ఓ కరాటే స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.  ఈ వీడియోలో అర్జున్ సర్జా అలవోకగా గాల్లోకి కాలు ఎత్తి కరాటే కిక్‌తో బాటిల్ మూతను ఎగరగొట్టారు. 64 ఏళ్ల వయసులోనూ ఆయన చూపించిన ఫ్లెక్సిబిలిటీ, బాడీ బ్యాలెన్స్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఈ వయసులో శరీరాన్ని ఇంత ఫిట్‌గా ఉంచడం అంత సులభం కాదు. కానీ అర్జున్ మాత్రం తన ఫిట్‌నెస్ విషయంలో చాలా క్రమశిక్షణతో ఉంటారు. అర్జున్‌కు చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉంది. కరాటేతో పాటు కిక్ బాక్సింగ్ వంటి వ్యాయామాలను ఆయన ఇప్పటికీ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తుంటారు. కేవలం మార్షల్ ఆర్ట్స్ మాత్రమే కాకుండా యోగా, స్ట్రెచింగ్, శారీరక వ్యాయామాలకు కూడా ఆయన తన రోజువారీ జీవితంలో ప్రాధాన్యత ఇస్తారు. దీనికి తోడు సమతుల్యమైన ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తుంటారు. అందుకే వయసు 60 దాటినా ఆయన శరీర దారుఢ్యంలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. ఇక అర్జున్ సర్జా సినీ కెరీర్ విషయానికి వస్తే.. 1980లలో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆయన దక్షిణాది భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘మా పల్లెలో గోపాలుడు’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన అర్జున్.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. ‘జెంటిల్‌మెన్’, ‘ఒకే ఒక్కడు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘పుట్టింటికి రా చెల్లి’ వంటి సినిమాలు ఆయనకు తెలుగులో మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా యాక్షన్ హీరోగా ఆయనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. నటుడిగానే కాకుండా అర్జున్ దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ‘సేవగన్’ సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన ఆ తర్వాత ‘జై హింద్’, ‘కర్ణ’, ‘ఎజుమలై’, ‘పరశురామ్’, ‘జై హింద్ 2’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 160కి పైగా సినిమాల్లో నటించిన ఆయన.. పలు చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించారు. ఇక తన కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ను కూడా కథానాయికగా పరిచయం చేసి ఆమె కెరీర్‌కు అండగా నిలుస్తున్నారు. ఒకవైపు సినిమాల్లో యాక్షన్ కింగ్‌గా కొనసాగుతూనే.. మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ ఫిట్‌నెస్‌కు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే 64 ఏళ్ల వయసులో ఆయన చేసిన ఈ చిన్న కరాటే స్టంట్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.       [Arjun Sarja, Arjun Sarja Fitness, Arjun Sarja Viral Video, Arjun Sarja Karate, Action King Arjun, Arjun Sarja Age 64, Arjun Sarja Stunt, Arjun Sarja Fitness Video, Arjun Sarja Movies, Arjun Sarja Telugu Movies, Arjun Sarja Karate Video, South Indian Actor Arjun Sarja, Arjun Sarja Workout, Arjun Sarja Martial Arts, Arjun Sarja Latest News] https://x.com/Kamalabimaani1/status/2102581854356598932
నాని వన్ మాన్ షో ప్యారడైజ్ మూవీ థియేటర్స్ లోకి రావడం, నెగిటివ్ టాక్ తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తు ఉండటం జరిగిపోతు ఉంది. కానీ కొన్ని సినిమాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ లేదా కలెక్షన్లు రాబట్టడానికి  కష్టపడాల్సి వస్తుంది. కానీ 'ప్యారడైజ్’  విషయంలో మాత్రం సరికొత్త చరిత్ర పునరావృతమవుతోంది.  సోషల్ మీడియాలోను  విమర్శకుల నుంచి కొంతవరకు నెగిటివ్ టాక్ వస్తున్నప్పటికీ, ప్రేక్షకులు మాత్రం థియేటర్లకు క్యూ కడుతున్నారు. దానికి సజీవ సాక్ష్యమే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో నమోదవుతున్న అసాధారణ గణాంకాలు. బుక్ మై షో (BookMyShow) వంటి ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్స్‌లో గంటకు దాదాపు 25,000 కి పైగా టిక్కెట్లు అమ్ముడవుతుండటం ట్రేడ్ వర్గాలను, చిత్ర పరిశ్రమను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది! ఒక వైపు టాక్ తేడాగా ఉందని వార్తలు వస్తున్నా, గంటకు 25 వేల ప్రాతిపదికన ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేయడం నానికున్న మాస్ క్రేజ్‌కు, అపరిమితమైన స్టార్ పవర్‌కు అద్దం పడుతోంది. సినిమా ప్రీ-రిలీజ్ హైప్, అనిరుధ్ అందించిన మాసివ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నాని నటనలోని రా అండ్ రస్టిక్ ఇంటెన్సిటీ ప్రేక్షకులను థియేటర్ వైపు పరుగులు తీయిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద కేవలం గత కొన్ని గంటల్లోనే లక్షలాది టిక్కెట్లు అమ్ముడై అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కిపోతుండటం సినిమా కలెక్షన్లకు బిగ్ బూస్ట్‌గా మారింది. ఇది కూడా చదవండి: హీరోయిన్ అంటే లెక్క లేదా: కయదు లోహర్ కి అన్యాయం జరిగిందా!     మామూలుగా నెగిటివ్ లేదా డివైడ్ టాక్ వస్తే బుకింగ్స్ ఒక్కసారిగా పడిపోవడం సహజం. కానీ ‘ది ప్యారడైజ్’ విషయంలో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.  తొలి రోజు కూడా పూర్తి కాకుండానే 60 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది.    [The Paradise, Nani, The Paradise Movie 25k Tickets Per Hour, Natural Star Nani, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]    
ఇండియ‌న్ సినిమాలు ఎప్పుడూ బ్రైట్‌గానే ఉంటాయి. అంతేకాదు.. హీరో, హీరోయిన్‌తోపాటు మిగ‌తా ఆర్టిస్టులు కూడా ఎంతో బ్రైట్‌గా క‌నిపిస్తుంటారు. అయితే రాను రాను డైరెక్ట‌ర్ల ఆలోచ‌న‌ల్లో మార్పులు వ‌చ్చాయి. కొంత‌కాలం నేచుర‌ల్‌గా ఉండేందుకు లైటింగ్ ఎఫెక్ట్‌ను త‌గ్గించి న‌టీన‌టులు స‌హ‌జంగా క‌నిపించాల‌ని ప్ర‌య‌త్నించారు. ఈమ‌ధ్య‌కాలంలో మ‌రి కాస్త ముందుకు వెళ్లి సినిమాలోని ప్ర‌తి క్యారెక్ట‌ర్ ర‌గ్‌డ్‌గా క‌నిపించాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఏదైనా కొత్త‌లో అంతా బాగానే అనిపిస్తుంది. ప్ర‌తి సినిమాలోనూ అదే ప‌ద్ధ‌తి అవ‌లంబించ‌డం వ‌ల్ల మొనాట‌నీ వ‌చ్చేస్తుంది. ఆడియ‌న్స్ కూడా రొటీన్ ఫీల్ అవుతారు. ప్ర‌స్తుతం మ‌న సినిమాల ప‌రిస్థితి అదే.  య‌శ్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ‘కేజీఎఫ్’ వచ్చినప్పుడు ఆ ప్రపంచం ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపించింది. బానిసలుగా బతికే ప్రజలు.. వాళ్లపై పెత్తనం చేసే ఓ శక్తివంతమైన వ్యవస్థ.. ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టి క్రమంగా ఎదిగే హీరో.. మధ్యలో తల్లి సెంటిమెంట్.. వీటన్నింటినీ దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ మాస్ ఎలివేషన్స్‌తో చూపించారు. ఈ ఫార్ములా ‘కేజీఎఫ్’కి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత ఇదే తరహా టెంప్లేట్‌తో చాలా సినిమాలు రావడంతో ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆ పోలికలు కనిపిస్తున్నాయనే చర్చ మొదలైంది. తాజాగా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ ఇదే మాట వినిపిస్తోంది. సినిమాలో ఓ పేద కమ్యూనిటీ ఉంటుంది. వాళ్లపై శికంజా మాలిక్ ఆధిపత్యం కొనసాగుతుంటుంది. అతడి కొడుకు కూడా అక్కడి ప్రజలపై తన పెత్తనం చూపిస్తుంటాడు. ఈ పరిస్థితుల్లో ఆ ప్రపంచం నుంచి జడల్ అనే యువకుడు ఎలా ఎదిగాడు? తన తల్లి సమ్మక్కతో అతడికి ఉన్న బంధం ఏంటి? అనే అంశాలతో కథ సాగుతుంది. ఈ బేసిక్ సెటప్‌ను చూస్తే ‘కేజీఎఫ్’ ఛాయలు కనిపిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. దానికి డార్క్ విజువల్స్, భారీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మాస్ ఎలివేషన్స్, యాక్షన్, వయలెన్స్ కూడా తోడవడంతో ఆ పోలిక మరింత బలపడుతోందనే టాక్ ఉంది. అయితే ‘ది ప్యారడైజ్’ ఒక్కటే ఈ తరహా పోలికలు ఎదుర్కొంటున్న సినిమా కాదు. ‘కబ్జా’ విడుదలైన సమయంలోనూ ‘కేజీఎఫ్’తో పోలికలు వచ్చాయి. డార్క్ కలర్ టోన్, అండర్‌వరల్డ్ నేపథ్యం, హీరో ఎదుగుదల, మదర్ సెంటిమెంట్ వంటి అంశాలు అక్కడ కూడా చర్చకు వచ్చాయి. ‘సలార్’ కథ వేరే అయినప్పటికీ.. పవర్‌ఫుల్ గ్రూపులు, భారీ విలన్లు, హీరో చుట్టూ భారీ ఎలివేషన్స్‌తో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించడం వంటి అంశాలు ‘కేజీఎఫ్’ తర్వాతి మాస్ సినిమాల ప్రభావాన్ని గుర్తు చేశాయి. ఇక ‘కింగ్‌డమ్’ విషయంలోనూ కొన్ని పోలికలు కనిపించాయి. అక్కడ ఓ దీవిలో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రజలు, వాళ్లను నియంత్రించే శక్తివంతమైన వర్గం, చివరికి ఆ ప్రజల కోసం హీరో నిలబడటం వంటి అంశాలు ఉన్నాయి. అక్కడ తల్లి సెంటిమెంట్ స్థానంలో అన్నదమ్ముల అనుబంధం కనిపిస్తుంది. ‘దేవర’లోనూ సముద్రం, గ్రామీణ నేపథ్యం, భయం, అధికారం, హీరో చుట్టూ నిర్మించిన భారీ మాస్ సెటప్ వంటి అంశాలు ప్రేక్షకులకు ఇలాంటి అనుభూతినే కలిగించాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఒక సినిమా మరో సినిమాను కాపీ చేసిందని చెప్పడం కంటే.. భారీ మాస్ సినిమాల కథనంలో ఒకే తరహా ఫార్ములా ఎక్కువగా కనిపిస్తోందన్నది అసలు చర్చ. డార్క్ ప్రపంచం.. అక్కడ కష్టాల్లో ఉన్న ప్రజలు.. వాళ్లపై పెత్తనం చేసే విలన్.. చివరికి వాళ్లకు అండగా నిలిచే హీరో.. మధ్యలో తల్లి లేదా అన్నదమ్ముల సెంటిమెంట్.. భారీ బీజీఎం.. స్లో మోషన్ ఎలివేషన్స్.. యాక్షన్ సీన్స్.. ఇలా కొన్ని అంశాలు వరుసగా సినిమాల్లో కనిపిస్తున్నాయి. దీంతో కథలు వేరైనా చూసే అనుభూతి మాత్రం ఒకేలా అనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ది ప్యారడైజ్’ విషయంలో మాత్రం శ్రీకాంత్ ఓదెల తనదైన తెలంగాణ నేపథ్యాన్ని, జడల్ పాత్రను, కొన్ని ప్రత్యేకమైన పాత్రలను చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా సినిమా మొదటి 30 నిమిషాలు, ఇంటర్వెల్ ఎపిసోడ్, జడల్ చిన్ననాటి సన్నివేశాలు, అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు మంచి స్పందన వచ్చింది. అయితే ద్వితీయార్థంలో వయలెన్స్, మాస్ ఎలివేషన్స్ ఎక్కువ కావడంతో కథ కాస్త వెనక్కి వెళ్లిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ‘కేజీఎఫ్’ తర్వాత వచ్చిన మాస్ సినిమాలు ప్రేక్షకులకు భారీ అనుభూతిని ఇవ్వడానికి ఒకే తరహా అంశాల వైపు ఎక్కువగా వెళ్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇకపై రాబోయే భారీ చిత్రాలు ఈ ఫార్ములాకు మరో రూపం ఇస్తాయా? లేక పూర్తిగా కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పిస్తాయా? అనేది చూడాలి.       [The Paradise, Nani The Paradise, The Paradise Movie, Nani, Srikanth Odela, KGF, KGF Template, The Paradise KGF Comparison, Telugu Cinema, Nani Movies, Srikanth Odela Movies, The Paradise Review, Anirudh Ravichander, Mohan Babu, Telugu Mass Movies, KGF Effect, The Paradise Mass Movie]
    నిన్న ప్రీమియర్స్ నుంచే థియేటర్స్ లోకి వచ్చిన  నేచురల్ స్టార్ నాని వన్ మాన్ షో 'ది ప్యారడైజ్' కి హీరోయిన్ అంటే అంత ఎగతాళిగా ఉందా అనే విమర్శలు మూవీ చూసిన ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతున్నాయి.  పోస్టర్లు, ప్రచార చిత్రాలలో కయదు లోహార్‌ ని ఒక రేంజ్ లోనే ప్రమోట్ చేసిన చిత్ర బృందం, మూవీలో మాత్రం  చాలా పరిమితమైన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రమే ఇచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు చనిపోయిన తండ్రి చేసిన అప్పు తీర్చి తన తండ్రి పరువు కాపాడాలనుకునే యువతి, బి గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ లో ఒంటితో వ్యాపారం చేసి ఆ డబ్బుతో తండ్రి అప్పు తీరిస్తే, తన తండ్రి ఆత్మ సంతోషపడుతుందా! ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబ నేపథ్యంలో ఆమె క్యారెక్టర్‌ని  చూపించినప్పటికీ, దానిని కేవలం కథా గమనానికి అదనపు అంశంగా మాత్రమే ఉంచారు తప్ప, సరైన భావోద్వేగ ముగింపు ఇవ్వలేదు. చిత్రం మొదటి భాగంలో కొద్దిసేపు కనిపించే ఆమె క్యారక్టర్ సెకండ్ హాఫ్ లో  అసలు ప్రాధాన్యతే లేనట్లుగా మారిపోతుంది. ప్రతిభావంతురాలైన నటి అయినప్పటికీ, కయాదు లోహార్‌ని కేవలం గ్లామర్ అట్రాక్షన్ కోసం లేదా పోస్టర్ ప్రమోషన్ల కోసమే వాడుకున్నారనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతోంది. ఇది కూడా చదవండి: రికార్డు కలెక్షన్స్: ప్రీమియర్స్ తో కలుపుకొని ఎంతంటే !   పైగా క్యారక్టర్ కి ఇంపార్టెంట్ కూడా ఇవ్వలేదు.విడుదలకి ముందు జరిగిన మీడియా సమావేశాల్లో కయదు మాట్లాడుతూ, తన క్యారక్టర్ ఎంతో కీలకమని, ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉంటాయని చెప్పుకొచ్చింది. కానీ తీరా థియేటర్లలో చూస్తే, 2 గంటల 54 నిమిషాల నిడివి ఉన్న ఈ సుదీర్ఘ చిత్రంలో ఆమె రోల్  కేవలం కొన్ని నిమిషాలకే పరిమితం. సినిమా యొక్క అసలు కథ అంతా కథానాయకుడి ప్రతీకారం, తల్లి-కొడుకుల సెంటిమెంట్, విలనిజం చుట్టూనే తిరుగుతుంది. కథను ముందుకు నడిపించడంలో లేదా క్లైమాక్స్ మలుపులలో ఆమె పాత్రకు ఎలాంటి ప్రభావవంతమైన ప్రాధాన్యత లభించకపోవడం గమనార్హం.  హీరోయిన్ అంటే కేవలం రెండు పాటలు, కొన్ని రొమాంటిక్ సీన్లకే పరిమితం కాకుండా, కథలో కీలక పాత్ర పోషించే విధంగా క్యారెక్టర్లను డిజైన్ చేయాలని అభిమానులు, నెటిజన్లు కోరుకుంటున్నారు. ఏది ఏమైనా కయదుకి నానితో ఒక డ్యూయట్ సాంగ్ కూడా లేదు.      [Kayadu Lohar Role In The Paradise Movie, The Paradise Collections, The Paradise Movie Review Telugu, Nani, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]  
‘ది ప్యారడైజ్’ సినిమాకు పెద్దగా ప్రమోషన్ ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేకుండానే.. తెలంగాణ రాజకీయ సోషల్ మీడియా ఈ సినిమాను విపరీతంగా వైరల్ చేసిందనే చర్చ మొదలైంది. రిలీజ్‌కు ముందు తెలంగాణలో అధికార కాంగ్రెస్‌కు చెందిన సోషల్ మీడియా వర్గాల నుంచి సినిమాకు అనుకూలంగా పోస్టులు కనిపించగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్గాల నుంచి నానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో సినిమా విడుదలకు ముందే ‘ప్యారడైజ్’ చుట్టూ రాజకీయ రంగు కనిపించింది. అయితే సినిమా రిలీజ్ తర్వాత మాత్రం సోషల్ మీడియాలో సీన్ పూర్తి మారినట్టుగా కనిపిస్తోంది. సినిమాలో ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకర్ అనే పాత్ర మాజీ సీఎం కేసీఆర్‌ను పోలి ఉందనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. పైగా, "చావు నోట్లో తలపెట్టయినా మీకు గుర్తింపు తీసుకొస్తా" అనే డైలాగ్ కేసీఆర్ ఐకానిక్ స్పీచ్ ను గుర్తుచేస్తోంది. ఆ పాత్రలోని కొన్ని అంశాలు కేసీఆర్ గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో సినిమా విడుదల తర్వాత కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి 'ప్యారడైజ్'కు మద్దతు కరువైంది. కొన్ని నెగెటివ్ పోస్ట్ లు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా వర్గాలు మాత్రం సినిమాలోని ఆ పాత్రను తమకు అనుకూలంగా తీసుకుని పోస్టులు పెడుతున్నాయి. ముఖ్యంగా ‘That is KCR’ అంటూ సినిమాకు మరింత ప్రచారం కల్పించేలా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇది కూడా చదవండి: టాప్‌లో నాని.. సూపర్ స్టార్ రికార్డును సమం చేసిన న్యాచురల్ స్టార్.! ఒకవైపు కాంగ్రెస్ వర్గాల పోస్టులు.. మరోవైపు బీఆర్ఎస్ అనుకూల పోస్టులు.. మధ్యలో ‘ది ప్యారడైజ్’. ఇలా సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా ఈ మూవీ రాజకీయ చర్చలోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా.. ‘ది ప్యారడైజ్’కు రాజకీయ సోషల్ మీడియా ద్వారా వచ్చిన ప్రచారం మాత్రం సినిమాకు అదనపు బజ్ తీసుకొచ్చిందనే చెప్పాలి. సినిమా యూనిట్ ప్రమోషన్ కోసం ఎంత ఖర్చు చేసిందన్నది పక్కన పెడితే.. రాజకీయ పోస్టుల రూపంలో వచ్చిన ప్రచారం మాత్రం ఉచితంగానే వైరల్ అయిపోయింది. మరి ఈ రాజకీయ చర్చ ‘ప్యారడైజ్’ సినిమాకు బాక్సాఫీస్ పరంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. మీకు నచ్చవచ్చు: సింహాద్రి 175 డేస్ రికార్డు.. ఎవరూ టచ్ చేయలేని రికార్డు సృష్టించిన ఎన్టీఆర్.! ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి సాంగ్.. 33 ఏళ్ళయినా అదే మ్యాజిక్.!       [Paradise Movie Political Heat, Paradise KCR Role, The Paradise Movie Review, Nani Paradise Review, Paradise Public Talk, The Paradise Review, Natural Star Nani, Telugu Film News, Telugu News]  
  అందరు అనుకున్నట్టుగానే బంగాళాఖాతంలో పడిన 'ది ప్యారడైజ్' అనే వాయుగుండం తన ప్రతాపాన్ని చూపిస్తూ రికార్డు కలెక్షన్స్ ల తుఫాన్ ని సృష్టిస్తుంది. స్టిల్ ఇప్పుడు టైం ఎంత అయ్యింది. మహా అయితే 12 :30 PM . ఈ టైంకే ప్యారడైజ్ రికార్డు కలెక్షన్స్ తో రఫ్ఫాడిస్తుంది. Also Read: The Paradise: నాని మాస్ జాతరలో ప్లస్ లు, మైనస్ లు ఇవే! అక్షరాలా నిన్న ప్రీమియర్స్ తో కలుపుకొని  వరల్డ్ వైడ్ గా 60 కోట్ల రూపాయల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా రాబట్టింది. ఈ మేరకు మేకర్స్ అధికారంగా ప్రకటించారు. మరి ముందు ముందు ఎంత మేర రాబడుతుందో చూడాలి. బుక్ మై షో తో పాటు అన్ని రకాల యాప్స్ లో నో టికెట్స్.      [Nani, The Paradise Movie Premiers Collections, The Paradise Collections, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
బంధం నుండి విడిపోయినా సరే జ్ఞాపకాల నుండి బయటపడలేకున్నారా.. ఇలా చేయండి.. ఒక బంధం ముగిసిన తర్వాత ఆ మనిషి మన జీవితం నుండి దూరమవ్వడం పెద్ద విషయం కాదు, కానీ వారితో పెనవేసుకున్న జ్ఞాపకాల నుండి బయటపడటం మాత్రం చాలామందికి ఒక పెద్ద సవాలుగా మారుతుంది. పగటిపూట పనుల్లో మునిగిపోయినా, రాత్రి వేళల్లో ఆ ఆలోచనలు మళ్లీ మళ్లీ దాడి చేస్తూ మనసును తీవ్రంగా బాధిస్తుంటాయి. గతంలో గడిపిన తీపి గుర్తులు, ఎదుర్కొన్న చేదు అనుభవాలు వెంటాడుతూ, వర్తమానం మీద దృష్టి పెట్టనీయకుండా చేస్తాయి. ఈ బాధ నుండి బయటపడటం సాధ్యం కాదేమో అనిపించవచ్చు. కానీ, మన ఆలోచనా విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటూ, సరైన పద్ధతులు పాటిస్తే ఎంతటి లోతైన జ్ఞాపకాల నుండి అయినా సులభంగా బయటపడి, జీవితంలో ముందుకు సాగవచ్చు. అందుకు ఉపయోగపడే కొన్ని విలువైన సూచనలు తెలుసుకుంటే.. యాక్సెప్ట్ చేయడం.. భావోద్వేగాలను అణచివేయకుండా స్వీకరించాలి. బంధం ముగిసినప్పుడు బాధపడటం, ఏడవడం లేదా కోపం రావడం చాలా సహజం.  మనసులోని భావాలను బలవంతంగా తొక్కిపెట్టడానికి ప్రయత్నించకూడదు. బాధను అణచివేసే కొద్దీ అది జ్ఞాపకాల రూపంలో మరింత ఎక్కువగా వేధిస్తుంది. కాబట్టి భావోద్వేగాలను అంగీకరించాలి. ఏడవాలనిపిస్తే ఏడ్చేయండి.  బాధను స్వీకరించడమే దాన్ని జయించడానికి మొదటి అడుగు. గత జ్ఞాపకాలకు దూరం.. గత జ్ఞాపకాలను గుర్తుచేసే వాటికి దూరంగా ఉండాలి.  వారితో ఉన్న పాత ఫోటోలు, చాటింగ్‌లు, ఇచ్చిన కానుకలు లేదా మీరు కలిసి తిరిగిన ప్రదేశాలు మీ జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ మేల్కొలుపుతాయి. కాబట్టి వాటిని మీ కంటికి కనిపించకుండా దాచిపెట్టండి లేదా పూర్తిగా తొలగించండి. సోషల్ మీడియాలో వారి అకౌంట్స్ చూడటం లేదా వారి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించడం  ఆపేయాలి. ఇది మనసుకు త్వరగా ప్రశాంతతను ఇస్తుంది. దినచర్యను మార్చుకోవడం .. ఖాళీగా ఉన్నప్పుడే పాత ఆలోచనలు ఎక్కువగా మనసులోకి వస్తాయి. అందుకే మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకోండి. కొత్త అలవాట్లను ప్రారంభించండి. కొత్త పుస్తకాలు చదవడం, నచ్చిన సంగీతం వినడం, వ్యాయామం చేయడం లేదా ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవడం లాంటివి చేయాలి. దినచర్యలో మార్పులు రావడం వల్ల మీ దృష్టి పాత విషయాల నుండి కొత్త విషయాల వైపు మళ్లుతుంది. ఆత్మీయులతో సమయాన్ని గడపడం .. బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు, కానీ అది జ్ఞాపకాలను మరింత పెంచుతుంది. మీకు బాగా దగ్గరైన స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. మీ మనసులోని బాధను నమ్మకమైన వారితో పంచుకోవాలి. వారు ఇచ్చే ధైర్యం, చూపించే ప్రేమ మీ మనసుకు పెద్ద ఊరటను ఇస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్వీయ సంరక్షణ.. శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే భావోద్వేగాలను తట్టుకునే శక్తి వస్తుంది. సరైన వేళకు పౌష్టికాహారం తీసుకోవాలి, తగినంత నిద్రపోవాలి. ప్రతిరోజూ ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. సెల్ఫ్ లవ్.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ప్రారంభించాలి. జీవితంలో మీ లక్ష్యాలు ఏంటి, మీ భవిష్యత్తును ఎలా మలచుకోవాలి అనే దానిపై దృష్టి పెట్టాలి. అనుభవాలు, గుణపాఠాలు.. గతాన్ని పాఠంగా భావించి ముందుకు సాగాలి.  జరిగిన దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఆ బంధం ఎందుకు తెగిపోయింది, తప్పు ఎవరిది అని నిరంతరం ఆలోచించడం వల్ల సమయం, ప్రశాంతత మాత్రమే వృథా అవుతాయి. జరిగిన ఘటనను ఒక అనుభవంగా, జీవితంలో ఒక పాఠంగా స్వీకరించాలి. ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి నాంది అని గుర్తుంచుకోవాలి. సమయం.. బాధ నుండి ఒక్క రోజులోనే బయటపడటం ఎవరికీ సాధ్యం కాదు. దానికి కొంత సమయం పడుతుంది. మీ మనసును నయం చేసుకోవడానికి మీకు మీరు కొంత సమయాన్ని ఇవ్వాలి. రోజులు గడిచే కొద్దీ జ్ఞాపకాల తీవ్రత తగ్గుతుంది. ఓర్పుతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకునే దిశగా అడుగులు వేయాలి                   *రూపశ్రీ.
మన శరీరంలో ఎముకలు బలంగా ఉండటానికి మరియు శారీరక ఎదుగుదలకు క్యాల్షియం, విటమిన్ డి ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో మనందరికీ తెలిసిందే. ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు, ఎండలో తిరగకపోవడం మరియు మారుతున్న జీవనశైలి కారణంగా మెజారిటీ ప్రజలు విటమిన్ డి మరియు క్యాల్షియం లోపంతో బాధపడుతున్నారు. వైద్య ఆరోగ్య నివేదికల ప్రకారం, భారతదేశంలో దాదాపు 70% నుండి 90% మంది ప్రజలు విటమిన్ డి లోపంతో సతమతమవుతుంటే, సుమారు 50% పైగా ప్రజలు రోజువారీ శరీరానికి అవసరమైన క్యాల్షియం మోతాదును పొందలేకపోతున్నారు. ఈ క్రమంలో చాలామంది వైద్యులను సంప్రదించినప్పుడు లేదా సొంతంగా మెడికల్ షాపుల్లో సప్లిమెంట్లు కొనుగోలు చేసినప్పుడు విటమిన్ డి మరియు క్యాల్షియం బిళ్ళలను ఒకేసారి కలిపి వాడుతుంటారు. అయితే, ఈ రెండింటినీ ఎల్లప్పుడూ కలిసే తీసుకోవాలా లేదా విడివిడిగా తీసుకోవడం మంచిదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ అంశంపై ప్రముఖ ఆరోగ్య నిపుణులు మరియు వైద్యులు విప్లవాత్మకమైన విషయాలను వెల్లడించారు. మానవ శరీర జీవక్రియలో విటమిన్ డి మరియు క్యాల్షియం మధ్య ఒక అద్భుతమైన భాగస్వామ్యం ఉంది. మనం ఆహారం లేదా సప్లిమెంట్ల ద్వారా తీసుకునే క్యాల్షియాన్ని మన ప్రేగులు సరిగ్గా గ్రహించాలంటే (Absorption) శరీరంలో తగినంత విటమిన్ డి ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ శరీరంలో విటమిన్ డి లోపిస్తే, మనం ఎంత క్యాల్షియం తీసుకున్నప్పటికీ అందులో కేవలం 10% నుండి 15% మాత్రమే శరీరం పీల్చుకోగలుగుతుంది. అదే విటమిన్ డి సరైన మోతాదులో ఉంటే క్యాల్షియం గ్రహణ సామర్థ్యం ఏకంగా 30% నుండి 40% వరకు పెరుగుతుంది. అందుకే ఎముకల సాంద్రతను పెంచడానికి, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల బలహీనత వ్యాధులను నివారించడానికి వైద్యులు ఈ రెండింటి కాంబినేషన్‌ను ఎక్కువగా రికమండ్ చేస్తుంటారు. అయితే ప్రతి ఒక్కరూ ఈ రెండు సప్లిమెంట్లను నిరంతరం కలిపే తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి శరీరంలో విటమిన్ డి స్థాయిలు తీవ్రంగా తగ్గి (లేబొరేటరీ పరీక్షల్లో 20 ng/mL కంటే తక్కువగా ఉన్నప్పుడు), క్యాల్షియం స్థాయిలు సాధారణంగా ఉంటే, వారికి కేవలం విటమిన్ డి సప్లిమెంట్లు (వారం ఒకసారి ఇచ్చే 60,000 IU డోస్) మాత్రమే సరిపోతాయి. అలాగే, ఆహారం ద్వారా తగినంత క్యాల్షియం పొందుతున్న వారికి ప్రత్యేకంగా క్యాల్షియం టాబ్లెట్లు అవసరం లేదు. మోతాదుకు మించి క్యాల్షియం సప్లిమెంట్లను విచక్షణారహితంగా తీసుకోవడం వల్ల రక్తంలో క్యాల్షియం పెరిగి కిడ్నీలలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే ప్రమాదం 20% వరకు పెరుగుతుంది. అంతేకాకుండా, అధిక క్యాల్షియం రక్తనాళాల్లో పేరుకుపోయి గుండె జబ్బుల ముప్పును పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సప్లిమెంట్లు తీసుకునే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించడం ఎంతో ఆవశ్యకం. విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే (Fat soluble) విటమిన్, కాబట్టి దీనిని కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉండే ఆహారంతో (ఉదాహరణకు పాలు లేదా పెరుగు) తీసుకుంటే శరీరం వేగంగా గ్రహిస్తుంది. క్యాల్షియం టాబ్లెట్లను భోజనం చేసిన తర్వాత తీసుకోవడం మంచిది. ముఖ్యంగా, ఒకేసారి 500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ క్యాల్షియాన్ని శరీరం గ్రహించలేదు కాబట్టి, ఎక్కువ డోస్ ఉంటే రోజులో రెండు సార్లుగా విభజించి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. థైరాయిడ్ లేదా ఐరన్ సప్లిమెంట్లు వాడేవారు క్యాల్షియం టాబ్లెట్లకు కనీసం 2 నుండి 4 గంటల సమయం వ్యవధి ఇవ్వాలి. కాబట్టి సొంత వైద్యం మానుకుని, రక్త పరీక్షల ద్వారా మీ శరీరంలో ఏ పోషకం లోపించిందో తెలుసుకుని, డాక్టర్ సలహా మేరకే సరైన డోసేజ్ వాడటం ఆరోగ్యానికి అత్యంత సురక్షితం.     [ Vitamin D, Calcium, Calcium Supplements, Vitamin D Deficiency, Calcium Deficiency, Bone Health, Osteoporosis, Calcium Absorption, Kidney Stones, Nutritional Supplements ]
దక్షిణ భారతదేశపు పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకువచ్చే అత్యంత ప్రసిద్ధమైన, ఆరోగ్యకరమైన ఉపాహారం నోరూరించే వేడివేడి ఇడ్లీ. తెల్లగా, మల్లెపూవులా మెత్తగా ఉండే ఇడ్లీలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆహారప్రియుల హృదయాలను కొల్లగొట్టాయి. అత్యుత్తమమైన, సులభంగా అరిగే పౌష్టికాహారంగా పేరుగాంచిన ఈ ఇడ్లీలకు ఒక ప్రత్యేకమైన రాజధాని నగరం ఉందంటే మీరు నమ్ముతారా? అవును, దక్షిణ భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు రకరకాల ఇడ్లీలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, తమిళనాడులోని చారిత్రాత్మక మరియు ఆధ్యాత్మిక నగరమైన మధురై (Madurai) నగరానికి  వరల్డ్ ఇడ్లీ క్యాపిటల్  లేదా ప్రపంచ ఇడ్లీ రాజధాని అనే ఘనమైన కీర్తి లభించింది. వీధి చివర ఉండే చిన్న చిన్న టిఫిన్ బండ్ల నుండి ఐదు నక్షత్రాల హోటళ్ల వరకు, మధురై నగరం అందించే ఇడ్లీల రుచి అత్యంత ప్రత్యేకమైనది మరియు మరెక్కడా లభించనిది. మధురై నగరానికి ఇడ్లీలతో ఉన్న అనుబంధం కేవలం ఒక ఆహార అలవాటు మాత్రమే కాదు, అదొక గొప్ప సంస్కృతి మరియు జీవనశైలి. ఈ నగరంలో దాదాపు 24 గంటల పాటు నిరంతరాయంగా వేడివేడి ఇడ్లీలు లభిస్తూనే ఉంటాయి. మధురైలోని ఐకానిక్ ఇడ్లీ బ్రాండ్  మురుగన్ ఇడ్లీ షాప్  (Murugan Idli Shop) ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ నగరంలో ప్రసిద్ధి చెందిన ప్రతి టిఫిన్ సెంటర్ రోజుకు వేలాది సంఖ్యలో ఇడ్లీలను విక్రయిస్తుంది. సాధారణంగా ఒక సగటు మధురై నివాసి తన రోజువారీ ఆహారంలో కనీసం 3 నుండి 4 ఇడ్లీలను భాగం చేసుకుంటారని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ లభించే ఇడ్లీ ప్రత్యేకత ఏమిటంటే, వాటి మెత్తదనం మరియు వాటితో పాటు వడ్డించే రకరకాల పచ్చళ్లు. ఒక్కో ప్లేట్ ఇడ్లీతో పాటు కనీసం 4 రకాల విభిన్నమైన చట్నీలు (తేంగై చట్నీ, కార చట్నీ, కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ) మరియు ఘుమఘుమలాడే సాంబార్ అందించడం మధురై సంప్రదాయం. ఆహార పరిశోధకులు మరియు నిపుణుల విశ్లేషణ ప్రకారం, మధురై ఇడ్లీలు అంత మెత్తగా ఉండటానికి అక్కడ వాడే నీటిలోని ఖనిజ లవణాలు మరియు బియ్యం, మినపప్పుల కచ్చితమైన నిష్పత్తి ప్రధాన కారణం. సాధారణంగా 4.1 నిష్పత్తిలో బియ్యం, మినపప్పులను నానబెట్టి, పిండిని కనీసం 8 నుండి 12 గంటల పాటు సహజ సిద్ధంగా పులియబెట్టడం (Fermentation) వల్ల ఇడ్లీలు ఎంతో సాఫ్ట్‌గా వస్తాయి. పోషకాహార నిపుణుల ప్రకారం, ఆవిరిపై ఉడికించే ఒక సాధారణ ఇడ్లీలో కేవలం 39 నుండి 40 క్యాలరీల శక్తి మాత్రమే ఉంటుంది. ఇందులో 0 గ్రాముల సంతృప్త కొవ్వు (Saturated Fat) మరియు 0 గ్రాముల కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఇడ్లీలను టిఫిన్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన 2 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు అవసరమైన అమినో యాసిడ్లు అందుతాయి. మధురైలో ఇడ్లీల హడావుడి ఎంతలా ఉంటుందంటే, ప్రతిరోజూ తెల్లవారుజామున 4.00 గంటలకే హోటళ్లు మరియు టిఫిన్ సెంటర్లు ప్రారంభమై అర్ధరాత్రి 2.00 గంటల వరకు నిరంతరాయంగా సాగుతాయి. కేవలం మధురై నగరంలోనే రోజుకు సుమారు 500 కంటే ఎక్కువ ప్రధాన ఇడ్లీ తయారీ కేంద్రాలు మరియు వేలాది చిన్న వ్యాపారాలు నడుస్తున్నాయి. ఏటా మార్చి 30న జరుపుకునే  ప్రపంచ ఇడ్లీ దినోత్సవం  (World Idli Day) సందర్భంలో మధురై నగరంలో ప్రత్యేకంగా వందల రకాల ఇడ్లీ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇక్కడి ప్రసిద్ధ మల్లి పూవు ఇడ్లీ (Malli Poo Idli), కరివేపిలై ఇడ్లీ, మరియు పొడి ఇడ్లీలను రుచి చూడటానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశీ, విదేశీ పర్యాటకులు మధురైకి తరలివస్తుంటారు. నాణ్యత, రుచి, పౌష్టికత మరియు నిరంతర లభ్యత విషయంలో ప్రపంచంలోని ఏ నగరం కూడా మధురైకి సాటిరాదని, అందుకే ఈ నగరం ప్రపంచ ఇడ్లీ రాజధానిగా నిలిచిందని ఆహార ప్రియులు ముక్తకంఠంతో కొనియాడతారు.     [ Madurai, World Idli Capital, Idli, Murugan Idli Shop, South Indian Breakfast, Tamil Nadu, Idli Varieties, Fermented Foods, World Idli Day, South Indian Cuisine ]   
ఎండు ద్రాక్షలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మార్కెట్‌లో మనకు రకరకాల ఎండు ద్రాక్షలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పచ్చగా లేదా బంగారు రంగులో ఉండే ఎండు ద్రాక్షలు, అలాగే నల్లటి ఎండు ద్రాక్షలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ రెండింటిలో ఏది తినాలి, దేని వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి అనే విషయంలో చాలామందికి సందేహాలు వస్తుంటాయి. నిజానికి రెండిట్లోనూ ఎన్నో రకాల పోషకాలు నిండి ఉన్నాయి. కానీ తయారు చేసే విధానం, వాడే ద్రాక్ష రకం ఆధారంగా వీటి రంగుతో పాటు వాటిలోని గుణాలు, అందించే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే.. పచ్చ లేదా బంగారు రంగు ఎండు ద్రాక్ష.. పచ్చటి లేదా బంగారు రంగు ఎండు ద్రాక్షలను సాధారణంగా ఆకుపచ్చ ద్రాక్ష పండ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని త్వరగా ఎండబెట్టడానికి, వాటి రంగు మారకుండా ఉండటానికి ప్రత్యేకమైన పద్ధతులను ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్ సి, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో చాలా బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. తియ్యటి రుచితో ఉండే ఇవి పిల్లలకు, పెద్దలకు ఎంతో మంచి ఆహారం. నలుపు ఎండు ద్రాక్ష.. నల్లటి ఎండు ద్రాక్షలను నల్లటి ద్రాక్ష పండ్ల నుంచి సహజ సిద్ధంగా ఎండబెట్టడం ద్వారా తయారు చేస్తారు. సహజంగా ఎండడం వల్ల వీటి రంగు నల్లగా మారుతుంది. వీటికి నల్లటి రంగును ఇచ్చే ఆంథోసైనిన్ అనే ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్ వీటిలో సమృద్ధిగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి నల్ల ఎండు ద్రాక్షలు ఎంతగానో దోహదపడతాయి. వీటిలో ఉండే కాల్షియం, బోరాన్ వంటి ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. జుట్టు రాలడం తగ్గడం, చర్మం పై ముడతలు త్వరగా రాకుండా చూడటం, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి ప్రత్యేక ప్రయోజనాలు నల్లటి ఎండు ద్రాక్షల ద్వారా లభిస్తాయి. ఈ రెండింటిలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది? రెంటికీ వాటి ప్రత్యేక స్థానం ఉంది.  తక్షణ శక్తి కావాలన్నా,  మంచి జీర్ణక్రియ, సులువైన ఐరన్ పోషణ కావాలంటే పచ్చటి ఎండు ద్రాక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ గుండె ఆరోగ్యం, అధిక రక్తపోటు నియంత్రణ, ఎముకల బలం, జుట్టు , చర్మ సంరక్షణ వంటి విషయాల్లో నల్లటి ఎండు ద్రాక్షలు కాస్త ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తాయి. నల్లటి ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు కాస్త ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడటంలో ఇవి ముందంజలో ఉంటాయి. కాబట్టి రెండింటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన అవసరం లేదు.  శరీర అవసరాలను బట్టి రెండింటినీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఉదయాన్నే నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్షలను తింటే వాటిలోని పోషకాలు శరీరానికి మరింత త్వరగా అందుతాయి. నానబెట్టిన నీటిని తాగడం వల్ల కూడా శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. పరిమితికి లోబడి ప్రతిరోజూ వీటిని తీసుకోవడం వల్ల పూర్తి ఆరోగ్యం  సొంతమవుతుంది.                      *రూపశ్రీ.
మెడలో గడ్డ లేదా వాపు కనిపించగానే చాలామందికి క్యాన్సర్‌ గురించి భయం మొదలవుతుంది. కానీ మెడలో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్‌ కావాల్సిన అవసరం లేదు. థైరాయిడ్‌ సమస్యలు, లింఫ్‌ నోడ్స్‌ వాపు, ఇన్ఫెక్షన్లు తదితర కారణాల వల్ల కూడా మెడలో గడ్డలు ఏర్పడవచ్చు. మెడలో గడ్డలు ఎందుకు వస్తాయి? థైరాయిడ్‌ వాపు ఎలా ఉంటుంది? లింఫ్‌ నోడ్స్‌ ఎందుకు పెరుగుతాయి? మెడలో గడ్డ కనిపిస్తే ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి? సమస్యను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు అవసరం? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ ENT, హెడ్ & నెక్ సర్జన్ డాక్టర్ అశోక్ పృథ్వీరాజ్ మొగంటి ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. మెడలో గడ్డను నిర్లక్ష్యం చేయకుండా, దాని కారణాన్ని వైద్యుల సలహాతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మెడలో గడ్డలు, థైరాయిడ్‌ సమస్యలు, లింఫ్‌ నోడ్స్‌ వాపు మరియు అవసరమైన వైద్య పరీక్షల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. గమనిక: మెడలో గడ్డ లేదా వాపు ఉంటే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
వినాయక చవితి పూజలో వెలగపండు ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో  ప్రత్యేకంగా కనిపించే వెలగపండును కేవలం నైవేద్యానికే పరిమితం చేస్తుంటారు. చాలా ఇళ్లలో వెలగపండు నైవేధ్యంగా పెట్టాక వాటిని వినాయకుడితో పాటు నిమజ్జనం చేయడం లేదా పడేయడం లేదా వాటిని అలాగే వదిలేయడం చేస్తుంటారు. కానీ ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో వెలగ పండుకు  చాలా ప్రాధాన్యత ఉంది. పైకి గట్టి పెంకుతో సాధారణంగా కనిపించినప్పటికీ, లోపల ఉన్న గుజ్జు అమృతంతో సమానమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ పండు కలిగించే ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవేంటో తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థ.. వెలగపండులో   ఫైబర్ అధికంగా ఉంటుంది, అలాగే అందులో ఉండే  టానిన్లు జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం లేదా విరేచనాలతో బాధపడేవారికి ఈ పండు సహజమైన ఔషధంగా తోడ్పడుతుంది. కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాను నశింపజేసి ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తి  విటమిన్ సీ, విటమిన్ ఏ , వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు వెలగపండులో  పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, కణాల నాశనాన్ని అడ్డుకుంటాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా వెలగపండు పాత్ర ప్రశంసనీయం. క్రమంతప్పకుండా పరిమితంగా తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం.. కాలేయం, మూత్రపిండాల రక్షణకు వెలగపండు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో కాలేయానికి సహాయపడి, దాని పనితీరును సమర్థవంతంగా ఉంచుతుంది. అలాగే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడి మూత్రసంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. డయాబెటిస్ .. డయాబెటిస్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారికి వెలగపండు మంచి ఆహారం. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది. శరీరం శక్తి కోల్పోకుండా, తక్షణ శక్తిని అందించడంలో దీనిలోని పోషకాలు తోడ్పడతాయి. మహిళల ఆరోగ్యానికి.. మహిళల ఆరోగ్యానికి కూడా వెలగపండు చాలా మేలు చేస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, అలాగే పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తి పెరగడంలో వెలగపండు గుజ్జు సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచడానికి ఇందులోని యాంటీఆక్సిడెంట్లు దోహదపడతాయి. వెలగపండును గుజ్జు రూపంలో నేరుగా లేదా కొద్దిగా బెల్లం లేదా తేనె కలిపి తీసుకోవచ్చు.  వెలగపండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఏ ఆహారమైనా పరిమితికి మించి తీసుకుంటే సమస్యలు రావచ్చు. అతిగా తింటే కడుపునొప్పి లేదా జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, సరైన పరిమాణంలో తింటూ వెలగపండు నుంచి ఆరోగ్య లాభాలను పొందడం మంచిది.                   *రూపశ్రీ.