ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి సాధించాలంటే వైపీపీ ఓటు బ్యాంకు భారీగా తగ్గాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు.  రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన జరిగి, సుపరిపాలన మరింత బలోపేతం కావాలంటే ఆ పార్టీ ప్రాభవం పూర్తిగా క్షీణించాల్సిన అవసరం ఉందన్నారు.   స్థానిక  ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన,  బీజేపీ శ్రేణులకు ఆయన టెలీకాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు.  స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.  రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతున్నాయన్న ఆయన, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టారు. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనుసరించిన విధానాల వల్లే రాష్ట్ర అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందనీ, వాటిని కూటమి ప్రభుత్వం అధిగమిస్తూ ముందుకు సాగుతోందనీ అన్నారు.   వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వంటి అనేక అంశాలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్న ఆయన సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.   ఈ సందర్భంగా కూటమి పార్టీల మధ్య సమన్వయంపై విస్పష్ట మార్గదర్శకాలు జారీ చేశారు.  చిన్నచిన్న అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి, రాష్ట్ర భవిష్యత్తు కోసం మూడు పార్టీల శ్రేణులూ ఏకతాటిపై నిలవాలని పిలుపునిచ్చారు. అనధికారికంగా లేదా రెబల్స్‌గా పోటీ చేసే ధోరణులను ఇసుమంతైనా సహించేది లేదని విస్పష్టంగా హెచ్చరించారు.  కూటమి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలన్నారు.   ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న వర్షాకాల విపత్తులు, సహాయక చర్యలపై కూడా ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావం ఉన్న జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండేలా చూస్తూనే, మరోవైపు ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించాలని నాయకులకు సూచించారు.   [Chandrababu Fires YCP, Teleconference, Y CP Vote Bank, Local Body Elections, AP NDA Alliance, Telugu One]
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.! కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన లెజిస్లేటివ్ కౌన్సిల్ (MLC) ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బతీశాయి. ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి జరిగిన అత్యంత కీలకమైన ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) కూటమి అఖండ విజయాన్ని సాధించింది. బీజేపీ  జేడీఎస్ (JD-S) కూటమి పోటీ చేసిన మొత్తం 4 స్థానాల్లోనూ (4/4) ఘన విజయం సాధించి క్లీన్ స్వీప్ నమోదు చేశాయి. ఈ అనూహ్య పరిణామం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు తీవ్ర ఎదురుదెబ్బగా మారింది. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే భారతీయ జనతా పార్టీ (BJP) సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని, ముఖ్యంగా డీకే శివకుమార్‌ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో సెటైర్లు పేల్చింది. "డీకే.. ఇట్స్ డన్, బ్రో!" (DK, it's done, bro!) అనే క్యాప్షన్‌తో బీజేపీ అధికారిక ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కంచుకోటలుగా భావించిన స్థానాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.    ఈ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కూటమి సాధించిన 4-0 చారిత్రాత్మక విజయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప హర్షం వ్యక్తం చేశారు. విజయం సాధించిన నలుగురు అభ్యర్థులకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. శాసనమండలి ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని విజ్ఞులైన ఓటర్లు, పట్టభద్రులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనడానికి స్పష్టమైన సంకేతమని ఆయన అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ అభివృద్ధి రాజకీయాలకు ఈ తీర్పు అద్దం పడుతోందని యడియూరప్ప పేర్కొన్నారు. మరోవైపు, జేడీఎస్ యూత్ ప్రెసిడెంట్ నిఖిల్ కుమార్ మాట్లాడుతూ.. రాబోయే భవిష్యత్తు ఎన్నికలకు ఈ అపూర్వ విజయం ఒక బలమైన ముందస్తు సూచిక అని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చి తమ ప్రభావాన్ని చూపుతున్న కాంగ్రెస్ పార్టీకి, స్థానిక సంస్థలు  పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎదురైన ఈ పరాభవం రాష్ట్ర రాజకీయ సమీకరణాలను వేగంగా మారుస్తోంది. డీకే శివకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనూ కూటమి అభ్యర్థులు జోరు చూపడం కాంగ్రెస్ శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. మొత్తానికి, తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త హీట్‌ను రాజేయగా, రాబోయే రోజుల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పోరు మరింత ముదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.       [ Karnataka MLC elections, DK Shivakumar, BJP jabs Congress, NDA clean sweep, Karnataka politics, B.S. Yediyurappa, BJP JDS Alliance, Congress Party Karnataka, Shashil G Namoshi, Telugu News, Telugu One ]  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం కూటమి, ప్రత్యర్థి పార్టీ వైసీపీల మధ్య మాటల యుద్ధం పీక్స్ కు చేరింది. స్థానిక సమరం వేళ జగన్ వ్యాఖ్యలకు జనసేనానిని, ఉపముఖ్యమంత్రి పవన్ ఇచ్చిన కౌంటర్ పొలిటికల్ డిబేట్ కు దారి తీసింది.  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి  జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.   తెలుగుదేశం కూటమి పార్టీల అగ్రనేతలు మంగళవారం (అక్బోబర్ 27) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్  ఇటీవల  పులివెందులలో జగన్ మీడియా సమవేశంలో  త్వరలో  జగన్ 2.0 లొ  తామేంటో నిరూపిస్తామని హెచ్చరించారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, పవన్ కల్యాణ్  మీరు కేవలం  2.0 చూపిస్తే మే 10X రెట్లు) ప్రతిస్పందన చూపిస్తామని రిటార్డ్ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా గతంలోనూ ఇలా వ్యవహరించినందుకే 2019 ఎన్నికలలో జగన్ కు జనం గుణపాఠం చెప్పారన్నారు బెదిరింపులకు భయపడి వెనకడుగు వేసే వాళ్లెవరూ లేరన్న ఆయన.. బలహీనులే ఇలాంటి బెదిరింపు ధోరణులు ప్రదర్శిస్తారని   ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా వ్యవహరించడం మానుకుని, వైకాపా నాయకులు ఇకనైనా జనజీవన స్రవంతిలోకి రావాలని జనసేనాని పిలుపునిచ్చారు. రానున్న రోజులలో కూటమి పార్టీలూ  విడిపోతాయనీ..  రానున్న ఎన్నికల్లో తమకు మళ్లీ అవకాశం దక్కుతుందనే అంచనాలతోనే వైఎస్ జగన్ తరచూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ఆ ఆశలకు గండి కొట్టేలా పవన్ కల్యాణ్ ఇప్పుడు 10x అన్నారని చెబుతున్నారు.   కూటమి పార్టీల మధ్య సంపూర్ణ సమన్వయం ఉందన్న జనసేనాని మరో  పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు  తెలుగుదేశం కూటమి ఐక్యంగా ముందుకు సాగుతుందని 10x వ్యాఖ్యతో కుండబద్దలు కొట్టారు.    [Pawan Kalyan Strong Counter  to Jagan, AP Politics,  Jagan 2.0 Comments, Janasena Pawan Kalyan, 10x Counter,  TeluguOne] 
ALSO ON TELUGUONE N E W S
Director Harish Shankar has praised the making of Rudravanam PS, calling its cinematography, editing and performances impressive. Speaking at the grand pre-release event of the seven-episode Telugu crime thriller, he expressed confidence in director Sasidhar Munnangi's work. The series premieres on ZEE5 Telugu on October 30. Starring Naresh Agastya as SI Sivakumar, Rudravanam PS follows an investigation that begins with a headless corpse and a missing man, leading to a web of secrets and suspicion. Written by Taj Syed, the series features an ensemble cast including Banerjee, Raja Ravindra and Shravani Reddy. Harish Shankar revealed that producer Vivek Kuchibhotla showed him the content on a laptop, and he was impressed by the photography, editing and performances. He praised Shashi's craftsmanship and noted that the cinematography had the quality of a big-screen production. He also appreciated the young technical team, particularly the cinematographer, who is just 32 years old. Speaking about opportunities in the OTT space, Harish said aspiring filmmakers no longer need to depend solely on cinema to learn their craft. Platforms such as YouTube, OTT and satellite television offer avenues to showcase talent, and good content can reach audiences regardless of its format. The event also saw the cast and crew share their experiences. Naresh Agastya spoke about his long association with ZEE and praised the team's efforts, while senior actor Banerjee expressed confidence in the series after watching its first two episodes. Directed by Sasidhar Munnangi and produced by Ramesh Puppala, Vivek Kuchibhotla and Dr. Suryakanthi, the series is set to be a big hit.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Vishwak Sen is gearing up to bring a raw slasher action experience to Indian cinema with Cult, which has generated considerable anticipation through its teasers, trailers and songs. The film has now completed its censor formalities, securing an 'A' certificate with several cuts and mutes, while its runtime has been locked at 2 hours and 30 minutes. Known for his directorial work on Falaknuma Das, Vishwak is attempting a genre rarely explored in Indian cinema. The extensive censor cuts and mutes reportedly reflect the film's unfiltered depiction of violence. The makers are positioning Cult as a visceral actioner that draws audiences into the characters' situations rather than holding back on the brutality. Vishwak has previously acknowledged that some of his films did not meet expectations, and he has taken particular care with the writing and action design for this project, collaborating with Tharun Bhascker on the writing. The filmmaker's focus on staging raw, intense action is central to the film's promise of delivering a different theatrical experience. Ravi Basrur's background score is another key element, with the music expected to intensify the impact of the action sequences. Produced by Sandeep Kakarala on a lavish scale, Cult is scheduled to release on October 30. With its adult certification, tightly locked runtime and uncompromising approach to violence, the film aims to offer action lovers an experience unlike Vishwak Sen's previous outings. Due to Arnab Cyclone, the movie team canceled pre-release event.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
బుల్లితెరపై ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడమ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి పూర్వాజ్‌.. ఇప్పుడు ‘కిల్లర్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఆమె విభిన్నమైన పాత్రలో కనిపించడంతో పాటు బోల్డ్‌ సన్నివేశాల్లోనూ నటించారు. ఈ చిత్రానికి ఆమె భర్త పూర్వాజ్‌ దర్శకత్వం వహించడం మరో ఆసక్తికర అంశం. ఈ నేపథ్యంలో తన భర్త దర్శకత్వంలో బోల్డ్‌ సీన్లలో నటించడం గురించి జ్యోతి పూర్వాజ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘కిల్లర్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిని.. భర్తే దర్శకుడిగా ఉన్నప్పుడు బోల్డ్‌ సీన్లలో ఎలా నటించారని ప్రశ్నించారు. దీనికి ఆమె తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఒక నటిగా సెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత తన దృష్టి పాత్రపైనే ఉంటుందని, కెమెరా ముందు ఉన్నప్పుడు తనను తాను నటిగానే భావిస్తానని వివరించారు. ఆ సమయంలో వ్యక్తిగత సంబంధాల గురించి కాకుండా, తాను పోషిస్తున్న పాత్ర ఎలా ఉండాలి? ఆ సన్నివేశాన్ని ఎలా పండించాలి? అనే విషయాలపైనే దృష్టి పెడతానని ఆమె చెప్పుకొచ్చారు. ఒక సన్నివేశంలో పాత్ర భావోద్వేగాలను సహజంగా చూపించడానికి తాను ఎంతో కష్టపడతానని జ్యోతి తెలిపారు. పాత్రకు అవసరమైన హావభావాలు తెరపై కనిపించాలంటే ఆ పాత్రలో పూర్తిగా లీనమవ్వాల్సి ఉంటుందని వివరించారు. కెమెరా ముందు నటిస్తున్నప్పుడు పాత్రకు తగినట్టుగా తనను తాను మార్చుకోవడం నటిగా తన బాధ్యత అని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే బోల్డ్‌ సన్నివేశాల్లో నటించేటప్పుడు కూడా వ్యక్తిగత విషయాల కంటే పాత్రకే ప్రాధాన్యం ఇస్తాననే విషయాన్ని ఆమె మాటలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా భార్యాభర్తల్లో ఒకరు నటుడు, మరొకరు దర్శకుడు అయినప్పుడు ఇలాంటి సన్నివేశాల చిత్రీకరణ ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ముఖ్యంగా నిజజీవితంలో భర్త అయిన వ్యక్తి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో భార్య బోల్డ్‌ సీన్లలో నటించడం గురించి రకరకాల ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అయితే జ్యోతి పూర్వాజ్‌ మాత్రం నటిగా తన బాధ్యతను, పాత్రకు అవసరమైన నటనను దృష్టిలో పెట్టుకుంటానని చెప్పడం ద్వారా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘కిల్లర్‌’లో ఆమె నటన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో సినిమా విడుదల తర్వాత తెలియనుంది.     [Jyothi Poorvaj, Jyothi Poorvaj Bold Scenes, Killer Movie, Poorvaj Director, Jyothi Poorvaj Interview, Guppedantha Manasu Actress, Jyothi Poorvaj Latest News]
మహానటితో పాటు పలు చిత్రాలతో అభిమానులు, ప్రేక్షకుల హృదయాల్లో చాలా బలంగా నాటుకు పోయిన భామ కీర్తి సురేష్. మహానటితో అయితే సావిత్రిగారిని దింపి పడేసింది.ఒక కంట్లో కన్నీరు, మరో కంట్లో అలకతో కూడిన దుఃఖం మాత్రమే కనపడే సన్నివేశం ఒక్కటి చాలు తాను ఎంత పెద్ద నటినో చెప్పడానికి.  అలాంటి కీర్తి సురేష్ మహానటి తర్వాత చేతిలో డబ్బులేక ఇబ్బందులు పడింది. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం. మహానటి తర్వాత ఆరునెలల పాటు సినిమాలు లే క ఖాళీగా ఉంది. దాంతో ఫైనాన్షియల్ పొజిషన్ తలకిందులు అయ్యింది. ఏంటి మీరింకా నమ్మడం లేదా! మహానటి తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఆరునెలల గ్యాప్ లో డబ్బుని ఎలా దాచుకోవాలో, ఎలా ప్లానింగ్ చేసుకోవాలో తెలిసిందని కీర్తి  సురేష్ నే స్వయంగా తన నోటితో తాను చెప్పింది. ఇది కూడా చదవండి: అమృతాన్నికురిపిస్తున్నఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్: ఎవరో గుర్తుపట్టారా!   కీర్తి ఈ నెల 30 న 'అక్క' అనే వెబ్ సిరీస్ తో నెట్ ఫ్లిక్స్ వేదికగా గుడ్ మార్నింగ్ చెప్పనుంది. జనవరి 12 విడుదల, రౌడీ జనార్ధన వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె లిస్ట్ లో ఉన్నాయి.   [Keerthy Suresh About Financial Struggles, Keerthy Suresh, Mahanati movie, Keerthy Suresh financial struggles, Keerthy Suresh news, Tollywood updates, South Indian actress, Telugu Cinema News, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]  
  'బుజ్జి పెళ్లి కొడుక్కి(పెళ్లి కూతురు)  రాజయోగమురా' అని ఈ పక్కన ఉన్న పిక్ కి ఆన్సర్ చెప్పిన వాళ్ళు  గంతులేస్తూ మరి పాడుకుంటారు. మరి కనిపెట్టనోళ్లు... మ్యాటర్ చదివాకా డాన్స్ చేస్తారు.. సో దీన్ని బట్టి అర్ధమయ్యేది ఏంటంటే సాంగ్ మాత్రం కంటిన్యూ.   'సీమటపాకాయ్', 'అవును' వంటి విభిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఆ తర్వాత 'శ్రీ మహాలక్ష్మి', 'నువ్వలా నేనిలా', 'రాజుగారి గది', 'అఖండ 2' వంటి పలు భారీ చిత్రాలతో పాటు అగ్ర హీరోల సినిమాలలో ప్రత్యేక గీతాలతో ప్రేక్షకులని ఉర్రూతలూగించింది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ తన సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్న ఈ నటి 'గుంటూరు కారం' చిత్రంలోనూ మెరిశారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ప్రముఖ రియాలిటీ డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరిస్తున్నారు.   ఈ అందాల తార చిన్నతనంలో క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. తన అద్భుతమైన ప్రతిభతో మలయాళంలో ప్రసిద్ధమైన 'సూపర్ డ్యాన్సర్' రియాలిటీ పోటీలో పాల్గొని తొలిసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఇంతకీ ఎవరో అర్థమైంది కదు పూర్ణ. ఇది కూడా చదవండి: నెక్స్ట్ ఆ లెజండ్రీ బయోపిక్ లో ఆనంది: గరివిడి లక్ష్మితో చితక్కొటేసిందిగా!      రీసెంట్ గా జైలర్ 2 లో కూడా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. జైలర్ 2 అని చెప్తే వెంటనే చెప్పేస్తారని  చెప్పలేదులే. అయినా కూడా సినీ ప్రేమికులు ముందుగానే ఊహించేసి న్యూస్ మధ్యలోనే చిన్న బ్రేక్ ఇచ్చి  బుజ్జి పెళ్లి కొడుక్కి(పెళ్లి కూతురు)  రాజయోగమురా అని డాన్స్ చేసే ఉంటారు.   [Poorna Childhood Photo Viral, poorna childhood photo, tollywood actress childhood pic, shamna kasim viral photo, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]
మన దేశం నుంచి ఆస్కార్‌కు అధికారికంగా ఎంపికైన సినిమా తెలుగులోకి వస్తుంటే సహజంగానే ఆసక్తి ఉంటుంది. అందులోనూ సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన సినిమా కావడంతో అంచనాలు మరింత పెరుగుతాయి. అదే మరాఠీ సినిమా ‘గోంధళ్’ (Gondhal). తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై చర్చ మొదలైంది. సంతోష్ దవఖర్ స్వయంగా కథ రాసి, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించిన సినిమా ‘గోంధళ్’. 2027లో జరిగే 99వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా ఈ సినిమా ఎంపికైంది. సెప్టెంబర్ 18న ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. మొత్తం 33 సినిమాల నుంచి ‘గోంధళ్’ను ఎంపిక చేశారు. గతేడాది నవంబర్‌లో మరాఠీ భాషలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ గుర్తింపు తెచ్చుకుంది. దర్శకుడు సంతోష్ దవఖర్‌కు గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడిగా సిల్వర్ పీకాక్ అవార్డు లభించింది. ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. మహారాష్ట్రలోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. సుమన్ అనే యువతి అసంతృప్తికరమైన వైవాహిక జీవితంలో చిక్కుకుపోతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు తన ప్రియుడు సర్జేరావ్‌కు సంప్రదాయ గోంధళ్ ఆచారంపై ఉన్న అమితమైన నమ్మకాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. కొత్తగా పెళ్లైన జంట కోసం రాత్రంతా నిర్వహించే సంప్రదాయ గోంధళ్ కార్యక్రమం చుట్టూ కథ తిరుగుతుంది. అయితే ఆ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. వ్యక్తిగత కోరికలు, కుటుంబ బాధ్యతలు, రహస్యాలు, మోసాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఆ రాత్రి ఏం జరిగింది? అసలు సుమన్ ఏం చేయాలనుకుంది? అనేది సినిమాలో చూడాలి. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సస్పెన్స్, మిస్టరీ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామీణ వాతావరణం, సంప్రదాయ ఆచారాలు, పాత్రల మధ్య సంఘర్షణలు కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా సినిమాలోని చిక్కుముడులు, ఊహించని మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ ఇళయరాజా సంగీతం. కథలోని భావోద్వేగాలకు, సస్పెన్స్‌కు తగ్గట్టుగా ఆయన అందించిన సంగీతం ట్రైలర్‌లో ప్రత్యేకంగా నిలుస్తోంది. ‘గోంధల్’ సినిమాలో కిషోర్ కదమ్, ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్ సోహోని, నిషాద్ భోయిర్, అనుజ్ ప్రభు కీలక పాత్రల్లో నటించారు. అమలేందు చౌధరి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాను నవంబర్ 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. మరాఠీతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇది కూడా చదవండి: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. ఓటీటీలోకి రాజమౌళి మూవీ.!       [Gondhal Telugu Trailer, Indias Oscar Entry 2027, Gondhal Telugu Release Date, Gondhal Trailer Telugu, Gondhal Movie Story, Santosh Davakhar, Ilaiyaraaja, Hombale Films, Telugu Film News]  
వరంగల్ అమ్మాయి ఆనంది ఉత్తరాంధ్ర లెజండ్రీ కళాకారిణి 'గరివిడి లక్ష్మి' తో తన సత్తా చాటిన విషయం తెలిసిందే. దీంతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించింది. ఆనంది కోసమే  'గరివిడి లక్ష్మి 'ని రెండు సార్లు చూసిన వాళ్ళు సైతం ఉన్నారు. ఇంచు కూడా పిన్ టూ పిన్ తగ్గకుండా  ఒరిజినల్ గరివిడి లక్ష్మిని కళ్ళ ముందు ఉంచింది. నటించడం కాదు జీవించడం అంటే ఏంటో మరోసారి సెల్యులాయిడ్ కి, ప్రేక్షకులకి రుచి చూపించింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా ఆనంది తదుపరి ప్రాజెక్టులపై అందరి దృష్టి నెలకొంది. క్యారక్టర్ లో  ఉండే విభిన్నత, కథలోని బలాన్ని బట్టి సినిమాలు ఎంచుకునే ఆనంది, మళ్లీ ప్రయోగాత్మకమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల వైపే మొగ్గు చూపుతారనే  మాటలు వినిపిస్తున్నాయి.ఇంకో లెజండ్రీ మణి బయోపిక్ లో కూడా చేస్తుందని, త్వరలోనే ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు.  ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం పరిస్థితి ఏంటి: హిట్ కొడుతున్నారా..అది జరిగితే మాత్రం!    ఆనంది సుదీర్ఘ కాలం నుంచి తమిళ నాట తన హవా చాటుతూ ఉంది. దీంతో ఆనంది మా అమ్మాయి అని తమిళ ప్రేక్షకులు ముక్త కంఠంతో చెప్పే పరిస్థితి. అక్కడి హిట్ లిస్ట్ చాలా పెద్దదే.     [Anandhi Next Project Details, Anandhi next project, Garividi Lakshmi movie, Anandhi upcoming movies, Garividi Lakshmi box office, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]
ఓటీటీలో హారర్‌ థ్రిల్లర్‌ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఒడియా భాషలో రూపొందిన ‘దహాన్’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఆహా వేదికగా అందుబాటులోకి వచ్చింది. అనుపమ్‌ పట్నాయక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బర్షా నాయక్‌, ఔరోసికా మిశ్రా, సమ్రాట్‌ మహాపాత్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ హారర్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను ఎంతవరకు భయపెట్టింది? కథలో కొత్తదనం ఉందా? అనేది చూద్దాం. అడవికి సమీపంలో ఉన్న ఓ పాత బంగ్లా ఈ కథకు ప్రధాన నేపథ్యం. ఒకప్పుడు జమీందారుకు చెందిన ఈ బంగ్లాలో ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత అది నిరుపయోగంగా మారుతుంది. కొంతకాలానికి ఆయన వారసురాలు ఆనందిత తన తమ్ముడు సమర్‌, చెల్లెలు మనూతో కలిసి అక్కడికి వస్తుంది. ఆస్తులను అమ్మేసి ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలనేది ఆమె ఆలోచన. అయితే, బంగ్లాలోని అవుట్‌హౌస్‌లో ఉన్న ఓ చెక్కపెట్టెను మనూ తెరవడంతో పరిస్థితులు మారిపోతాయి. ఆ తర్వాత ఆమె ప్రవర్తనలో వింత మార్పులు కనిపిస్తాయి. ఆ పెట్టెకు, తమ పూర్వీకులకు ఉన్న సంబంధం ఏమిటి? మనూను ఆ ప్రేతాత్మ బారి నుంచి ఆనందిత కాపాడగలిగిందా? అనేది మిగతా కథ. సాధారణంగా ఇలాంటి హారర్‌ కథలు మొదలవడానికి కొంత సమయం తీసుకుంటాయి. ‘దహాన్‌’ కూడా తొలి అరగంట నిదానంగా సాగుతుంది. ఆ తర్వాత పెట్టెలో ఏముంది? అందులోని వస్తువుల వెనుక రహస్యం ఏమిటి? ప్రేతాత్మకు ఆనందిత కుటుంబంతో ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతాయి. ఇంటర్వెల్‌ తర్వాత కథనం వేగం పుంజుకోవడం, ఆనందిత పెట్టెను వదిలించుకోవడానికి ప్రయత్నించడం, మనూ దానిని కాపాడుతూ ఉండటం ఉత్కంఠను పెంచుతాయి. చర్చి ఫాదర్‌ పాత్ర ప్రవేశించిన తర్వాత కథ క్లైమాక్స్‌ వైపు సాగుతుంది. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు కొంతమేర భయపెడతాయి. అయితే, ప్రేతాత్మలకు సంబంధించిన కథల్లో ఇప్పటికే చూసిన సన్నివేశాలు ఇందులోనూ కనిపించడం ప్రధాన లోపం. ఆత్మ ఆవహించినప్పుడు పాత్రలు ప్రవర్తించే తీరు, ప్రేక్షకులను భయపెట్టడానికి ఉపయోగించిన పద్ధతులు కొత్తగా అనిపించవు. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ కొంత భిన్నంగా ఉన్నప్పటికీ, కథలో మరింత కొత్తదనం ఉంటే బాగుండేది. కెమెరా పనితనం, నేపథ్య సంగీతం, ఎడిటింగ్‌ ఫర్వాలేదనిపిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే, హారర్‌ సినిమాలను ఇష్టపడేవారు ఒకసారి ప్రయత్నించవచ్చు.      [Dahaan Movie Review, Dahaan Telugu Review, Dahaan OTT Release, Dahaan Aha Movie, Odia Horror Thriller, Dahaan Movie Cast, Anupam Patnaik]
నవ్విన నాప చేనే పండుతుందనే నానుడి ప్రస్తుత ఏఐ యుగంలో  ఆదర్శ కుటుంబం ద్వారా తన ఉనికిని చాలా బలంగా చాటేలా ఉంది. నిజానికి కొన్ని రోజుల ముందు వరకు ఆదర్శ కుటుంబంపై అంచనాలు లేవు. మేకర్స్ కి కూడా ఈ విషయం తెలియంది కాదు. కానీ ప్రమోషన్స్ తో అంచనాలకి మించిన అంచనాలని పెంచుకుంది. దీంతో సినిమా ఫలితంపై అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి సినిమా ఏం చెప్పాలనుకుంటుందో ఒకసారి చూద్దాం.   ముఖ్యంగా నేటి తరం కుటుంబాల్లో మాయమవుతున్న అనుబంధాలు, మనుషుల మధ్య పెరిగిన దూరాలు, ఆత్మీయతల విలువని గుర్తుచేసే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోందనే వార్త ఫ్యామిలీ ఆడియన్స్‌ని  విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్లింప్స్, పోస్టర్లు సోషల్ మీడియాలో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్నాయి. మొదటి రోజే యూట్యూబ్‌లో 10 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలవడం ఈ కాంబోకు ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. గతంలో వెంకటేష్ నటించిన కుటుంబ కథా చిత్రాలకి త్రివిక్రమ్ అందించిన మాటల విందుకి ట్రేడ్ వర్గాల్లో భారీ స్పందన ఉండేది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామా చేస్తున్నారు. దీంతో మరో సారి ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందని, హిట్ పక్కా అనే మాటలు సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.   ప్రీ-రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ హక్కుల రూపంలోనే దాదాపు  80 కోట్ల మేర జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. నాన్-థియేట్రికల్ రైట్స్, డిజిటల్ ఓటీటీ హక్కులు ఏకంగా  50 కోట్లకు అమ్ముడుపోవడం ఈ ప్రాజెక్ట్ విలువని  చాటిచెబుతోంది. ఇది కూడా చదవండి: అమెరికాలో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే: హీరో ఎవరంటే!     సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే కుటుంబ ప్రేక్షకుల నుంచి ఏకంగా 95% సానుకూల రేటింగ్ మరియు సానుకూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా థియేటర్లకు కుటుంబ సమేతంగా వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఈ సినిమాతో మరోసారి భారీగా పెరిగే అవకాశం ఉందని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు.  వెంకటేష్, శ్రీనిధి శెట్టి నటన, త్రివిక్రమ్ రాసిన పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మరి 30 న అసలు విషయం తెలిసిపోనుంది.   [Adarsha Kutumbam censor Report, Adarsha Kutumbam Public Talk, Venkatesh Trivikram Movie, Adarsha Kutumbam Update, Venkatesh New Telugu Movie, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]
Director Adhik Ravichandran has made it clear that he does not want to repeat the Good Bad Ugly formula in his next film with Ajith Kumar, Daredevil. In a recent interview, he said the earlier film's approach was a one-time experience and would not work again if repeated. He stressed that Daredevil would be a completely different film, designed as a commercial entertainer with all emotions in the right balance.  Adhik revealed that Daredevil was actually the story he had initially planned to make with Ajith. However, due to time and budget constraints, the team developed a different proposition, which eventually became Good Bad Ugly. He described that film as a fan tribute to Ajith, but said the upcoming project would not follow the same template. The director wants Daredevil to appeal to a wider audience rather than rely on the fan-service approach of their previous collaboration. Adhik also confirmed that Sreeleela is part of the film, dismissing speculation around Kayadu Lohar's involvement. He praised producer Shalini Ajith's understanding of narrative, story and screenplay, admitting that he was surprised by how eloquently she expressed her views on these aspects. The film's shoot will begin at 8:05 AM on November 12 at Ramoji Film City in Hyderabad, after the Diwali break. The Indian portions will be shot continuously on specially built sets, with additional schedules planned abroad. Daredevil also stars Prabhu, Parthiban and Sunil, with music by Anirudh Ravichander. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మన ఇంట్లో వంటగది ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ, ఒక్క కిచెన్ సింక్ సరిగా లేకపోతే ఇల్లు మొత్తం మురికిగా ఉన్న భావన కలుగుతుంది. ఉదయం మిగిలిపోయిన టీ నుంచి రాత్రి భోజనం గిన్నెల వరకు, రోజంతా లెక్కలేనంత నీళ్లు, వ్యర్థాలు సింక్ నుంచే వెళ్తాయి. చాలా మంది మిగిలిపోయిన నూనె, టీ ఆకులు, పిండి, బియ్యం లేదా చిన్న చిన్న ఆహారపు ముక్కలను సులభంగా పోతుందని సింక్‌లో పడేస్తుంటారు. ఆ సమయంలో నీటితో పాటు అన్నీ కొట్టుకుపోయినట్లు అనిపించినా, పైపులలో వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసన మరియు సింక్‌లు మూసుకుపోయే తీవ్ర సమస్యలకు దారితీస్తాయి. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి మరియు సింక్‌ను ఎల్లప్పుడూ మెరిపించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా పాత్రలను సరిగా శుభ్రం చేయకుండా నేరుగా సింక్‌లో కడగడం వల్ల ప్లేట్లు, ప్యాన్‌లపై మిగిలిపోయిన నూనె, నెయ్యి, మసాలాలు పైపుల లోపల అడ్డుపడతాయి. పిండి కలిపిన తర్వాత మిగిలిపోయిన పిండిని లేదా బియ్యం కడిగిన నీటిని సింక్‌లో పోయడం వల్ల పైపుల లోపల మలినాలు గట్టిగా పేరుకుపోతాయి. పనికిరాని నూనె లేదా నెయ్యిని పొరపాటున కూడా సింక్‌లో పోయకుండా, ఒక సీసాలో లేదా పాత్రలో పోసి చెత్తలో పారవేయాలి. అలాగే టీ ఆకులు, కాఫీ పొడిని కంపోస్ట్ లేదా తడి వ్యర్థాలలో వేయాలి తప్ప సింక్‌లో ఫ్లష్ చేయకూడదు. బియ్యం, పాస్తా, నూడుల్స్, గుడ్డు పెంకులు, పండ్లు మరియు కూరగాయల తొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ సింక్‌లో వేయకుండా తడి వ్యర్థాలతో పాటు పారవేయడం చాలా ముఖ్యం. ఇంకా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, టాయిలెట్ సీట్ల కంటే కిచెన్ స్క్రబర్‌లలో ఎక్కువ క్రిములు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రబర్లు తడిగా ఉన్నప్పుడు బ్యాక్టీరియా వేగంగా పెరిగిపోతుంది. కాబట్టి స్క్రబర్లను ఎప్పుడూ పొడిగా ఉంచడం మరియు ప్రతి మూడు వారాలకు ఒకసారి వాటిని కొత్తవాటితో మార్చడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తే మీ వంటగది సింక్ ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, మెరిసిపోతూ ఉంటుంది.     Kitchen Sink Cleaning Mistakes, How To Make Kitchen Sink Shine, Stainless Steel Sink Care, Remove Sink Stains, Kitchen Cleaning Hacks, Odor Free Kitchen Sink, Home Maintenance Tips.
దీపావళి పండుగ అనగానే ప్రతి ఇంట్లోనూ సందడి నెలకొంటుంది. దీప కాంతుల మధ్య రకరకాల పిండి వంటలు, నోరూరించే మిఠాయిలు, నూనెలో వేయించిన కారాలు, సమోసాలు, కచోరీలు వంటి వాటితో ఇళ్లన్నీ కళకళలాడుతుంటాయి. అయితే పండుగ ఆనందాన్ని ఆస్వాదిస్తూనే మన ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. పండుగ రోజుల్లో విపరీతంగా నూనె పదార్థాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ దీపావళికి జిడ్డు పదార్థాలకు దూరంగా ఉంటూ, కేవలం 5 నిమిషాల్లో ఎంతో రుచికరమైన, కరకరలాడే ఆరోగ్యకరమైన స్నాక్‌ను తయారు చేసుకునే అద్భుతమైన అవకాశం ఫుడ్ ప్రియుల కోసం అందుబాటులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఎంతో ప్రసిద్ధి చెందిన కంటెంట్ క్రియేటర్ పల్లవి చిబ్బర్ పరిచయం చేసిన నూనె లేని, అధిక ప్రోటీన్లు కలిగిన స్ప్రౌట్స్ కెనాప్స్ చాట్ ప్రస్తుతం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేకమైన రెసిపీ తయారీ విధానం చాలా సులభం. ఎలాంటి నూనె లేదా డీప్ ఫ్రై అవసరం లేకుండా కేవలం 5 నిమిషాల్లో ఈ హెల్తీ చాట్‌ను ఎవరైనా ఇళ్లలోనే సిద్ధం చేసుకోవచ్చు. దీనికోసం మార్కెట్లో లభించే టార్టిల్లా వ్రాప్స్‌ను తీసుకొని చిన్న రౌండ్ సర్కిల్స్‌గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని మఫిన్ మోల్డ్స్‌లో ఉంచి, సుమారు 10 నిమిషాల పాటు క్రిస్పీగా మారే వరకు బేక్ చేయాలి. ఇలా చేయడం వల్ల నూనె చుక్క కూడా లేకుండా అద్భుతమైన కరకరలాడే కప్‌లు సిద్ధమవుతాయి. పండుగ రోజుల్లో అధిక బరువు లేదా కొలెస్ట్రాల్ గురించి ఆందోళన చెందకుండా ఈ జీరో ఆయిల్ స్నాక్‌ను ఆస్వాదించవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికించిన మొలకెత్తిన గింజలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, చాట్ మసాలా, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ స్ప్రౌట్స్ మిశ్రమం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి కావలసిన అధిక ప్రోటీన్లను, పోషకాలను ఇది అందిస్తుంది. ముందుగా సిద్ధం చేసుకున్న కెనాప్ కప్‌లలో ఈ స్ప్రౌట్స్‌ మిశ్రమాన్ని స్పూన్ సహాయంతో అందంగా నింపాలి. ఆపై దానిపై కొత్తిమీర చట్నీ, చింతపండు చట్నీ వేసి, అద్భుతమైన లుక్ మరియు రుచి కోసం తాజా దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకోవాలి. పుదీనా, చింతపండు చట్నీల కలయిక ఈ చాట్‌కు మరింత వన్నె తెస్తుంది. ఈ స్నాక్‌ను అతిథులకు వెంటనే సర్వ్ చేస్తుంటే పెరుగును ఉపయోగించడం మంచిది. ఒకవేళ ముందుగానే ఈ స్నాక్‌ను సిద్ధం చేసి పెట్టుకోవాలనుకుంటే మాత్రం పెరుగు వేయకుండా పొడిగా ఉంచుకోవాలి, లేదంటే కెనాప్స్ మెత్తబడిపోయి క్రిస్పీనెస్ కోల్పోతాయి. నూనె చుక్క లేకుండా ప్రొటీన్లు నిండిన ఈ టేస్టీ చాట్‌తో ఈసారి మీ దీపావళి వేడుకలను మరింత ఆరోగ్యకరంగా మరియు ఆనందంగా మార్చుకోండి. కుటుంబ సభ్యులందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ సరికొత్త నో ఆయిల్ స్నాక్ మీ పండుగ అనుభూతిని రెట్టింపు చేస్తుంది.     Oil Free Sprouts Canapes, Healthy Diwali Snacks, High Protein Chaat Recipe, Zero Oil Festival Recipes, Sprouts Chaat Ideas, Guilt Free Diwali Food, Healthy Weight Loss Snacks.
మనలో చాలామందికి కడుపులో గందరగోళం లేదా విరేచనాలు (Diarrhea) అయినప్పుడు పెద్దలు చెప్పే కొన్ని ఇంటి చిట్కాలు పాటించడం సర్వసాధారణం. అందులోనూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలో ఉన్న ఒక విచిత్రమైన చిట్కా ఏంటంటే.. కొద్దిగా పొడి టీ ఆకులను (Dry Tea Leaves) నీటితో కలిపి మింగితే చాలు, కేవలం 10 నిమిషాల్లోనే లూజ్ మోషన్స్ అణగిపోతాయని కొందరు గట్టిగా నమ్ముతుంటారు. ఇలాంటి దేశీయ లేదా ఇన్‌స్టాంట్ ట్రిక్స్ ఎంతవరకు నిజం? ఇది ఆరోగ్యానికి సురక్షితమేనా? అనే అంశంపై ప్రముఖ వైద్య నిపుణులు ఇస్తున్న సలహాలు ఏంటో ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. వైద్య నిపుణుల స్పష్టమైన అభిప్రాయం ప్రకారం, పొడి టీ ఆకులను నేరుగా తినడం లేదా మింగడం అనేది విరేచనాలను నివారించడానికి ఎలాంటి శాస్త్రీయంగా నిరూపితమైన చికిత్స కాదు. సాధారణంగా టీ ఆకులలో 'టానిన్' (Tannin) అనే మూలకం ఉంటుంది. ఇది కొంతవరకు సంకోచ గుణాలను (Astringent properties) కలిగి ఉండటం వల్ల తాత్కాలికంగా పొట్టపై ప్రభావం చూపవచ్చు. అయితే దీనిని పూర్తి స్థాయి నమ్మకమైన వైద్య పరిష్కారంగా అసలు పరిగణించలేమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. లూజ్ మోషన్స్ లేదా విరేచనాలు అయినప్పుడు కేవలం మల విసర్జనను తాత్కాలికంగా ఆపడం ఒక్కటే ముఖ్యం కాదని నిపుణులు గుర్తుచేస్తున్నారు. దానికంటే అత్యంత ప్రాముఖ్యమైనది శరీరంలో నీరు, లవణాలు (Electrolytes) కోల్పోకుండా కాపాడుకోవడం. ఎందుకంటే విరేచనాల వల్ల శరీరం తీవ్రమైన నీటి నిల్వలను, సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కోల్పోతుంది. దీనిని నివారించడానికి ఓఆర్ఎస్ (ORS - Oral Rehydration Solution) ద్రావణం తాగడమే ఏకైక అత్యుత్తమ మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు వైద్యులు ఎప్పుడూ సిఫార్సు చేస్తుంటారు. మరి పొడి టీ ఆకులు నేరుగా తీసుకోవడం వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా అంటే.. ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి. టీలో కెఫీన్ (Caffeine) ఉండటం వల్ల ఇది కొన్ని సందర్భాలలో మూత్రవిసర్జనను పెంచి శరీరాన్ని మరింత తీవ్రమైన నిర్జలీకరణానికి (Dehydration) గురిచేసే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, సున్నితమైన కడుపు తత్వం ఉన్నవారిలో లేదా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారిలో ఇలాంటి ప్రయోగాలు సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి నిరూపితం కాని చిట్కాలను గుడ్డిగా నమ్మి ఓఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా టీ ఆకులను వాడే పొరపాటు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్ధులలో డీహైడ్రేషన్ ముప్పు అత్యంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా శ్రేయస్కరం.     Dry Tea Leaves For Diarrhea, Curing Loose Motions With Tea, Home Remedies For Diarrhea Myths, Chewing Tea Leaves Side Effects, Stomach Infection Remedies, Expert Health Facts, Digestive Care Tips.
    ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలియగానే మహిళలు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తల్లి ఆరోగ్యంతో పాటు కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదలకు కూడా సరైన పోషకాహారం ఎంతో ముఖ్యం. అయితే గర్భం దాల్చిన మొదటి రోజుల నుంచి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలి? బయట ఆహారం తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? గర్భిణులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఈ ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే ఏ 5 ఆహారాలకు దూరంగా ఉండాలి? గర్భధారణ సమయంలో ప్రతి ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. కొన్ని ఆహారాలు కలుషితం కావడం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరగవచ్చు. సరిగా ఉడకని ఆహారాలు, పరిశుభ్రత పాటించకుండా తయారు చేసిన పదార్థాలు, బయట లభించే ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? గర్భిణులు నివారించాల్సిన ఆహార పదార్థాలు ఏవి? ఈ అంశాలపై డాక్టర్ హరిత వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. గర్భిణులు బయట ఆహారం ఎందుకు తగ్గించాలి? ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారం తయారీలో పరిశుభ్రత, పదార్థాల నాణ్యత, సరైన నిల్వ పద్ధతులు చాలా ముఖ్యం. బయట ఆహారం తీసుకునేటప్పుడు ఆహారం తాజాగా ఉందా, సరిగ్గా ఉడికించారా, పరిశుభ్రంగా తయారు చేశారా అనే విషయాలను గమనించాలి. తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని ఎంచుకోవడం ఎందుకు అవసరమో ఈ వీడియోలో వివరించారు. ప్రసవం తర్వాత బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రసవం తర్వాత తల్లి శరీరానికి కోలుకోవడానికి, బిడ్డకు పాలివ్వడానికి తగినంత శక్తి, పోషకాలు అవసరం. ఈ సమయంలో ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం, విటమిన్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు అందించే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను ఎలా ఎంచుకోవాలి? రోజువారీ ఆహారంలో ఎలాంటి పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి? బాలింతలు తెలుసుకోవాల్సిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. తల్లిపాలు పెరగడానికి ఎలాంటి ఆహారం ఉపయోగపడుతుంది? బిడ్డకు తగినంత తల్లిపాలు అందడం తల్లి, శిశువు ఇద్దరి ఆరోగ్యానికి ముఖ్యమైనది. పాలిచ్చే తల్లులు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తగినంత ద్రవాలు తీసుకోవడం, విశ్రాంతి పొందడం అవసరం. పాలిచ్చే సమయంలో తీసుకోవాల్సిన పోషకాహారం, ఆహారపు అలవాట్ల గురించి డాక్టర్ హరిత అందించే సూచనలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బిడ్డ ఎదుగుదలకు సరైన పోషకాహారం ఎందుకు ముఖ్యం? శిశువు ఎదుగుదలలో సరైన సమయంలో తగిన ఆహారాన్ని పరిచయం చేయడం ఎంతో ముఖ్యం. వయస్సుకు తగిన అనుబంధ ఆహారం, బేబీ ఫుడ్ ఎంపిక, అవసరమైన పోషకాలు, పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు తల్లిదండ్రులు చేసే సాధారణ తప్పులు వంటి అంశాలపై కూడా ఈ వీడియోలో ప్రస్తావించిన విషయాలను తెలుసుకోవచ్చు. గర్భధారణ నుంచి ప్రసవం తర్వాతి దశ వరకు తల్లి పోషకాహారం, తల్లిపాలు, శిశువు ఆహారపు అలవాట్ల గురించి అవగాహన పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం, నివారించాల్సిన పదార్థాలు, బాలింతల పోషకాహారం గురించి మరిన్ని వివరాల కోసం డాక్టర్ హరిత వివరణను పూర్తిగా చూడండి. గమనిక: గర్భధారణ సమయంలో మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఆహార నియమాలను పాటించడానికి మీ వైద్యుడి సూచనలు తీసుకోండి.
గర్భం దాల్చాలని ప్రయత్నించే మహిళల శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. కేవలం ఆహారం తీసుకోవడం, డాక్టర్ చెప్పిన విటమిన్లు వేసుకోవడం మాత్రమే కాకుండా, రోజువారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం వల్ల గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయి. గర్బం దాల్చాలని అనుకునే  చాలా మంది మహిళలకు తెలియని కొన్ని ముఖ్యమైన , లోతైన విషయాలను వివరంగా  తెలుసుకుంటే.. సర్కాడియన్ రిథమ్  బాలెన్స్.. శరీరంలో సర్కాడియన్ రిథమ్ ను అంతర్గత గడియారం అని అంటారు. ఇది బాలెన్స్డ్ గా ఉండటం  చాలా ముఖ్యం. రాత్రి వేళల్లో ఆలస్యంగా పడుకోవడం లేదా షిఫ్ట్ డ్యూటీల వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా ప్రొలాక్టిన్ , మెలటోనిన్ హార్మోన్లు అండం విడుదల కావడాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వారు రాత్రి పూట కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల గాఢమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. పడుకునే గదిలో లైట్లు పూర్తిగా ఆరిపోయేలా లేదా డిమ్ గా ఉంచుకోవడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుంది. ప్లాస్టిక్ కు దూరం..  రోజూ వాడే ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిల్స్, నాన్-స్టిక్ పాన్ల వాడకం వల్ల శరీరంలోకి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అనే రసాయనాలు ప్రవేశిస్తాయి. ఇవి హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి అండం నాణ్యతను తగ్గిస్తాయి. దీనికి బదులుగా గాజు లేదా స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలను వాడడం చాలా మంచిది. ప్లాస్టిక్ డబ్బాలలో వేడి వేడి ఆహారాన్ని నిల్వ చేయడం పూర్తిగా మానేయాలి. ప్యాక్డ్, జంక్ ఫుడ్.. శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్ లేదా అంతర్గత మంట కూడా సంతానోత్పత్తిని అడ్డుకుంటుంది. ప్యాకెట్లలో లభించే జంక్ ఫుడ్, మైదా ఉత్పత్తులు, పంచదార ఎక్కువగా ఉండే పదార్థాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను పెంచుతాయి. దీనికి బదులుగా యాంటీ ఆక్సిడెంటల్ గుణాలు ఎక్కువగా ఉండే నల్ల ద్రాక్ష, దానిమ్మ, బ్లూ బెర్రీస్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి అండం నాణ్యతను పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కార్టిసాల్ హార్మోన్.. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ప్రెగ్నెన్సీకి సహకరించే ఇతర హార్మోన్లను అణచివేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కేవలం యోగా ఒక్కటే కాకుండా, ప్రకృతితో గడపడం, సూర్యరశ్మిలో కాసేపు నడవడం వంటివి చేయాలి. ఉదయం పూట ఎండలో పదిహేను నిమిషాలు గడపడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి అందుతుంది, ఇది హార్మోన్ల సమతుల్యతకు ఎంతో అవసరం. పెల్విక్ ఆరోగ్యం.. పెల్విక్ ఫ్లోర్ కండరాల ఆరోగ్యం  గురించి చాలా మంది పట్టించుకోరు. గర్భాశయానికి రక్త సరఫరా సక్రమంగా జరగాలంటే ఈ కండరాలు ఆరోగ్యంగా ఉండాలి. రోజూ తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల పొత్తికడుపు భాగానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. కాఫీ, టీ.. కాఫీ, టీల వాడకాన్ని కొద్దిగా తగ్గించడం మంచిది. రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల అండం విడుదలయ్యే వేగం మందగించే అవకాశం ఉంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తూ, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే గర్భధారణ మార్గం చాలా సులభం అవుతుంది. ప్రతి మహిళ శరీరం భిన్నంగా ఉంటుంది కాబట్టి,  ఆరోగ్య పరిస్థితికి తగినట్లుగా నిపుణుల సలహా తీసుకోవడం కూడా ఎంతో మంచిది.                                                                                                                       *రూపశ్రీ.
మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం, నిద్రలేమి వంటి సమస్యలు మన రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కొందరిలో నిరంతర ఆందోళన, బాధ, నిరాశ కారణంగా పనిపై ఆసక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, నిద్ర సరిగా పట్టకపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. దీర్ఘకాలిక ఒత్తిడి శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపవచ్చు. అసలు మానసిక ఒత్తిడికి, శరీర ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏమిటి? డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కోవడానికి సైకోథెరపీ ఎలా సహాయపడుతుంది? ఈ వీడియోలో డాక్టర్ శారదా దేవి గారు మానసిక ఆరోగ్యం, మానసిక ఒత్తిడి, భావోద్వేగ సమస్యలు, సైకోథెరపీ ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. మందులు మాత్రమే కాకుండా, మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్సలో సైకోథెరపీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది? ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? మనసు, శరీరం మధ్య సంబంధం ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. సైకోథెరపీ అంటే ఏమిటి? మానసిక సమస్యలను అర్థం చేసుకోవడానికి, ఆలోచనలు మరియు భావోద్వేగాలను ఆరోగ్యకరంగా నిర్వహించుకోవడానికి సహాయపడే చికిత్సా విధానాల్లో సైకోథెరపీ ఒకటి. మానసిక ఆరోగ్య నిపుణుడితో మాట్లాడటం ద్వారా సమస్యలకు కారణమయ్యే ఆలోచనా విధానాలను గుర్తించడం, ఒత్తిడిని ఎదుర్కొనే పద్ధతులను నేర్చుకోవడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం వంటి అంశాల్లో సహాయం పొందవచ్చు. సైకోథెరపీ ఎవరికి, ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది? చికిత్స ద్వారా మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు? అనే విషయాలను ఈ వీడియో వివరిస్తుంది. డిప్రెషన్, ఆందోళన, భయం ఎందుకు కలుగుతాయి? నిరంతర ఆందోళన, భయం, నిరాశ, భావోద్వేగ ఒత్తిడి వంటి సమస్యలు వ్యక్తి ఆలోచనలను, ప్రవర్తనను, రోజువారీ పనులను ప్రభావితం చేయవచ్చు. డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను సాధారణ బాధ లేదా తాత్కాలిక ఒత్తిడితో సమానంగా చూడకూడదు. వీటి వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. సమస్యలను గుర్తించడం, అవసరమైనప్పుడు నిపుణుల సహాయం తీసుకోవడం ఎందుకు ముఖ్యమో డాక్టర్ శారదా దేవి గారు వివరిస్తారు. మానసిక ఒత్తిడికి, శారీరక ఆరోగ్యానికి సంబంధం ఏమిటి? మనసుపై ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో కూడా కొన్ని మార్పులు సంభవించవచ్చు. దీర్ఘకాలిక ఒత్తిడి నిద్ర, రోగనిరోధక వ్యవస్థ, రక్తపోటు వంటి ఆరోగ్య అంశాలపై ప్రభావం చూపవచ్చు. అయితే అధిక రక్తపోటు (BP)కు అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి ఒక్కటే దానికి కారణమని భావించకూడదు. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టవచ్చు. నిద్రలేమి ఎందుకు వస్తుంది? నిద్ర ఎందుకు ముఖ్యం? తగినంత నిద్ర లేకపోవడం వల్ల అలసట, చిరాకు, ఏకాగ్రత లోపం, భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు నిద్రను దెబ్బతీయవచ్చు. ఈ విధంగా మానసిక ఆరోగ్యం, నిద్ర ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి. నిద్రలేమిని నిర్లక్ష్యం చేయకుండా, దాని కారణాలను గుర్తించి తగిన సహాయం పొందడం అవసరం. సైకోసిస్, స్కిజోఫ్రెనియా వంటి సమస్యల గురించి తెలుసుకోండి మానసిక ఆరోగ్య సమస్యలు ఒకే రకంగా ఉండవు. డిప్రెషన్, ఆందోళన, సైకోసిస్, స్కిజోఫ్రెనియా వంటి పరిస్థితుల లక్షణాలు, వాటికి అవసరమైన చికిత్సలు వేర్వేరుగా ఉంటాయి. వీటి గురించి సరైన అవగాహన పెంపొందించుకోవడం, అపోహలకు దూరంగా ఉండటం, బాధితులను గౌరవంగా చూడటం ఎంతో ముఖ్యం. అవసరమైనప్పుడు మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం సరైన మార్గం. శారీరక, భావోద్వేగ, సామాజిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి? కుటుంబ సమస్యలు, పని ఒత్తిడి, సంబంధాల్లో ఇబ్బందులు, జీవితంలో ఎదురయ్యే మార్పులు మన మానసిక స్థితిని ప్రభావితం చేయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని గుర్తించడం, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం, విశ్రాంతికి సమయం కేటాయించడం, అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోవడం ఉపయోగపడుతుంది. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకోవాలనుకునేవారికి ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. డాక్టర్ శారదా దేవి గారి వివరణ ద్వారా సైకోథెరపీ ప్రాముఖ్యత, మనసు-శరీరం మధ్య సంబంధం, ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలు, నిద్ర ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి. గమనిక: ఈ వీడియో అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిర్ధారణకు లేదా వ్యక్తిగత చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి లేదా అధిక రక్తపోటు సమస్యలు కొనసాగితే వైద్య నిపుణులను సంప్రదించండి. వైద్యుల సలహా లేకుండా సూచించిన మందులను ఆపవద్దు.