Home

»

Latest News

చిరంజీవి, బాలకృష్ణ మధ్య ఉన్న తేడా ఇదే: శుభలేఖ సుధాకర్ వ్యాఖ్యలు వైరల్!

Oct 29, 2026 12:32PM

 

 

శుభలేఖ సుధాకర్: చిరంజీవి, డైరెక్టర్ విశ్వనాధ్ ల 'శుభలేఖ' మూవీతో తన పేరు ముందు శుభలేఖ చేరింది కానీ, తెలుగు సినిమా ఉన్నంత కాలం నాగార్జున, రామ్ గోపాల వర్మల శివ గుర్తుకొచ్చినప్పుడలా సుధాకర్ గుర్తుకొస్తూనే ఉంటారు. ప్రస్తుతం అడపాదడపా విభిన్నమైన క్యారెక్టర్స్ పోషిస్తూ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సబ్జెట్స్ కి పర్ఫెక్ట్ ఫిగర్ అనిపించుకుంటున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ , చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 

బాలకృష్ణ సెట్స్‌లో ఎంత కఠినంగా ఉంటారో, తెర వెనుక అంతకంటే ఎక్కువగా ఆప్యాయతని పంచుతారు. చిన్నపిల్లవాడి మనస్తత్వమున్న వ్యక్తి . దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం అలవాటు. సెట్స్  లో నటన తప్ప మరో ధ్యాస ఉండదు.  నా  జీవితంలో ఒక క్లిష్టమైన సమయంలో, అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్నప్పుడు బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరూ నాకు అండగా నిలిచారు. సుమారు 54 రోజుల పాటు రోజువారీగా  ఫోన్ చేసి తన యోగక్షేమాలని  అడిగి తెలుసుకునేవారు. అది నాకు ఎంతో మానసిక ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు  ఆ అనుబంధం జీవితాంతం నాతోనే ఉంది. బాలకృష్ణ గారు, విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన 'జననీ జన్మభూమి' మూవీ  షూటింగ్ సమయంలో నేను  కామెర్ల బారిన పడి, పసలపూడిలో స్థానిక ఆసుపత్రిలో చేరినప్పుడు, బాలకృష్ణ ప్రతిరోజూ ఉదయం షూటింగ్‌కు వెళ్లే ముందు, సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు పరామర్శించేవారు. 


ఇది కూడా చదవండి: శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీ జోనర్ ఇదే: ఆ ప్రాంతం యొక్క ఉద్యమం, ప్రేమ!

 


ఆ సంఘటన బాలకృష్ణలోని ఆప్యాయతను, స్నేహశీలి స్వభావాన్ని తెలియజేస్తుంది. ఆయనలో అప్పట్లో ఉన్న కన్సర్న్, బ్రదర్‌హుడ్ ఇప్పటికీ అలాగే ఉంది. బాలకృష్ణలో ఎనర్జీ లెవెల్స్ ఎప్పటికీ తగ్గకపోవడమే  ఆయన ప్రత్యేకత. ఇదే విషయం మెగాస్టార్ చిరంజీవి విషయంలో కూడా నిజం. వారిద్దరూ ఎప్పుడు అలాగే ఉండాలని అన్నారు. బాలకృష్ణ, చిరంజీవిల నుండి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం నెవర్ గివ్ అప్ ఆటిట్యూడ్  పని పట్ల  కసి, పట్టుదల, సానుకూల దృక్పథం ఎంతో స్ఫూర్తిదాయకం. వారిద్దరూ ఎప్పడు అలాగే ఉండాలని చెప్పుకొచ్చాడు.

 

 

[Subhalekha Sudhakar About chiranjeevi And Balakrishna,Subhalekha Sudhakar, Nandamuri Balakrishna, Balayya Babu, Tollywood news, Tollywood, Telugu News, TeluguCinema]
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com