
సాయిపల్లవి ప్రస్తుతం అభిమానులు, ప్రేక్షకుల మనసులో 'సీతమ్మ' వారుగా తన ప్రతిమని నింపుకొని ఉంది. అదే టైంలో సీతమ్మ వారుగా రామాయణ ద్వారా ఎలా మెస్మరైజ్ చేస్తుందనే క్యూరియాసిటీతో నవంబర్ 5 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. అలాంటి ఈ టైంలో గుడ్ న్యూస్ చెప్పేసింది
రామాయణ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతు
ఒకరి జీవితంలోకి భాగస్వామిగా అడుగుపెట్టే వ్యక్తికి ముందుగా ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన అర్హత మంచి మనసు. కేవలం తన గురించి మాత్రమే ఆలోచించే స్వార్థపూరిత మనస్తత్వం గలవారు నాకు అసలు నచ్చరు. ఎదుటివారి భావాలను అర్థం చేసుకునే గుణం, పరిపక్వత చాలా అవసరం. ముఖ్యంగా మనుషులు కొన్ని పరిస్థితుల్లో తప్పులు చేయడం సహజం. అయితే ఆ తప్పులని ఇతరులపై నెట్టేయకుండా తామే స్వయంగా ఒప్పుకుని సరిదిద్దుకునే పరిణతి భాగస్వామికి ఉండాలి. జీవితంలో ఏ స్థానంలో ఉన్నాననే స్పష్టమైన అవగాహన, ఆత్మపరిశీలన చేసుకునే గుణం ఉన్నవారంటే నాకు ఎంతో గౌరవం.
ఇది కూడా చదవండి: చిరంజీవి, అమల సూపర్ హిట్ సాంగ్: 36 ఏళ్లైనా తగ్గని క్రేజ్..ఇప్పటికీ యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్!

నాకు కాబోయే భర్తపై భారీ కోరికలు పెద్ద జాబితా ఏమీ లేదు. ఎలాంటి కఠినమైన నిబంధనలు పెట్టను. కాకపోతే ప్రాథమికంగా ఆయనొక మంచి మనిషై ఉండాలి.వీటితో పాటు సరదాగా మాట్లాడుతు వంట చేయడం కూడా వస్తే అది మరింత గొప్ప విషయమని చెప్పుకొచ్చింది.
[Sai Pallavi About His Life Partner, Sai Pallavi latest Interview, Sai Pallavi partner qualities, Sai Pallavi marriage views, Ramayana, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]






