Home

»

Latest News

శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీ జోనర్ ఇదే: ఆ ప్రాంతం యొక్క ఉద్యమం, ప్రేమ!

Oct 29, 2026 12:01PM

 

'ది ప్యారడైజ్' తో దర్శకుడిగా తన టేకింగ్ కి ఉన్న కెపాసిటీని తెలియచేసాడు శ్రీకాంత్ ఓదెల. రచయిత కూడా తనే కాబట్టి కథ, కథనంపై మరింత శ్రద్ద పెట్టి ఉంటే ప్యారడైజ్ ఫలితం ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండేది. ప్యారడైజ్ రిజల్ట్ పై ఇప్పటికి ట్రోల్ల్స్ కి గురువవుతున్న శ్రీకాంత్ ట్రోలర్స్ ని తన డై హర్డ్ ఫ్యాన్స్ గా మార్చుకోవాలనే దృఢసంకలంతో తన నెక్స్ట్ మూవీని ఒక వినూత్నమైన జోనర్ లో స్టార్ట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నట్టుగా టాక్.  

హృదయానికి హత్తుకునే ఒక స్వచ్ఛమైన, ఇంటెన్స్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు శ్రీకాంత్ ఓదెల సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా 2014 తెలంగాణ మలిదశ ఉద్యమం మరియు రాజకీయ పరిణామాల నేపద్యనికి  ఒక పీరియాడిక్ లవ్ డ్రామాని సిద్ధం చేస్తున్నారని సమాచారం. తన తొలి రెండు చిత్రాల మాదిరిగానే ఈ కథ కూడా తెలంగాణ గ్రామీణ మరియు నేల మూలాల నుంచి పుట్టుకొచ్చిన బలమైన భావోద్వేగాలతో సాగనుందని తెలుస్తోంది. భారీ యాక్షన్ జోనర్ నుంచి సడన్ గా లవ్ స్టోరీ వైపు శ్రీకాంత్ రూటు మార్చడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

 ఇది కూడా చదవండి: మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: RC 17 కోసం ఈ పాలరాతి ముద్దుగుమ్మకి లుక్ టెస్ట్!

 

మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ ఉంటుందని గతంలో అధికారికంగా అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే 'ది ప్యారడైజ్' ఫలితం మరియు ఆలస్యం కారణంగా ఈ మెగాస్టార్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడినట్లు, లేదంటే ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. నాని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరు ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై స్పష్టత లేదని, ప్రస్తుతానికి ఎటువంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ, ఒక అపజయం లేదా మిశ్రమ స్పందన తన కెరీర్‌కు ఎండ్ కార్డ్ కాదని నిరూపించేందుకు శ్రీకాంత్ ఓదెల తన బలమైన బలమైన కథా బలంతో మరోసారి  ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నా డు. మరి  ఈ కొత్త లవ్ స్టోరీతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో  చూడాలి.

 

[Srikanth Odela New Movie Deatils, Srikanth Odela, The Paradise movie, Nani director Srikanth, Megastar Chiranjeevi project, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com