Home

»

Latest News

పెద్దిలో అచ్చాయమ్మ క్యారక్టర్ పై స్పందించిన జాన్వీ: వామ్మో అవేం మాటలు!

Oct 29, 2026 2:54PM

 

నేను తన అంత అందంగా ఉంటానా అని అందం సైతం జాన్వీకపూర్ ని చూసి ఈర్ష్య పడుతూ ఉంటుందని అభిమానుల నమ్మకం. అందుకు తగ్గట్టే తన చరిష్మా కొనసాగిస్తూ వస్తున్న జాన్వీ ప్రీవియస్ చిత్రం పెద్దితో 'అచ్చాయమ్మా' గా మెప్పించిన విషయం తెలిసిందే.  అయితే ఆమె క్యారక్టర్ డిజైన్, కెమెరా యాంగిల్స్ పై చాలా దారుణమైన విమర్శలు, ట్రోల్స్  వచ్చాయి.  కానీ జాన్వీ ఎప్పుడు కూడా ఆ విషయంపై మాట్లాడలేదు.    


కానీ తాజాగా పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ 9వ ఎపిసోడ్‌లో లో జాన్వీ మాట్లాడుతు 'పెద్ది ఇష్యుపై ఎందుకు మాట్లాడలేదంటే పెద్ది కోసం ఎంతోమంది నూటికి నూరు శాతం కష్టపడి పనిచేశారు అయితే సమాజంపై, ముఖ్యంగా మహిళల గెటప్స్ మరియు నరేటివ్‌పై అలాంటి దృశ్యాలు ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయనేది నా  మనస్సాక్షిని తీవ్రంగా వేధిస్తోంది. ఆ  అవమాన భారాన్ని నేను జీవితాంతం నా మనసులో మోస్తూనే ఉంటాను. ఇకపై ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడకూడదని అనుకుంటున్నాను.చిత్ర పరిశ్రమలో దర్శకుడు చెప్పినట్టు చెయ్యాలనే వృత్తిపరమైన ఒత్తిడి ఉంటుంది.


ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్: పెళ్లి కొడుకు ఎవరో చెప్పేసిన సాయి పల్లవి: ఫ్యాన్స్ లో హుషారు!

 

 

దక్షిణాది చిత్ర పరిశ్రమలో పని చేసే విధానం గురించి ప్రస్తావిస్తూ, అక్కడ చాలా అరుదుగా మాత్రమే బౌండ్ స్క్రిప్ట్ ఉంటుందని, షూటింగ్ సమయంలో కెమెరా యాంగిల్స్ ఎలా వస్తాయనేది ముందుగా ఊహించడం కష్టం.భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చింది.

 

 

[Janhvi Kapoor Reacts To Peddi Controversy, Janhvi Kapoor About Peddi Movie, Peddi controversy, Ram Charan Peddi movie, Achiyamma character, Tollywood, Tollywood News, Telugu News, TeluguCinema]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com