తనకంటే ఎంతో సీనియర్ అయిన కోనేరు హంపిని ఓడించి ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌ విజేతగా దివ్య దేశ్‌ముఖ్‌ నిలిచింది. తాజాగా (28-7-25) జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కోనేరు హంపిపై దివ్య దేశ్‌ముఖ్‌ విజయం సాధించింది. ఈ విజయంతో 19 ఏళ్ల దివ్య భారతదేశానికి చెందిన ఎనభై ఎనిమిదో గ్రాండ్ మాస్టర్‌గా అవతరించింది. దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జరిగిన తొలి ర్యాపిడ్ ట్రై బ్రేకర్ డ్రాగా ముగిసింది.  అయితే ఆ తర్వాత రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో కోనేరు హంపిపై దివ్య గెలుపొందింది. 2025 ఫిడే మహిళల ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా దివ్య నిలిచింది. చివరకు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో దివ్యకు 1.5 పాయింట్లు లభించగా, కోనేరు హంపికి 0.5 పాయింట్లు వచ్చాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దివ్యకు హంపీ గట్టి పోటీనిచ్చింది. దీంతో ఫలితం ట్రైబ్రేకర్‌కు చేరింది. సోమవారం దూకుడుగా ఆడిన దివ్య టోర్నీ విజేతగా నిలిచి గ్రాండ్ మాస్టర్ హోదాను దక్కించుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ సీనియర్ విభాగంలో చాలా తక్కువ టోర్నీలు మాత్రమే ఆడింది. కోనేరు హంపితో పోల్చుకుంటే దివ్య అనుభవం చాలా తక్కువ. ఈ టోర్నీకి ముందు ఆమెకు గ్రాండ్ మాస్టర్ హోదా కూడా లేదు. 2021లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాను పొందిన దివ్య.. 2023లో ఆసియా ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. అలాగే ఒలింపియాడ్‌లో మూడు స్వర్ణ పతకాలను కూడా అందుకుంది. తాజా ప్రపంచకప్‌లో తనకంటే మెరుగైన రేటింగ్ ఉన్న ద్రోణవల్లి హారిక, జు జినర్ వంటి ప్రతిభావంతులను ఓడించి అందర్నీ ఆకట్టుకుంది.
  హైదరాబాద్‌ నగరంలో చిరుత సంచారం కలకలం రేపింది. గోల్కొండ ప్రాంతంలో  ఇబ్రహీంబాగ్‌ మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతున్న చిరుత దృశ్యాలు  సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తారామతి వెనుకభాగం మీదుగా మూసీనది వైపు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గోల్కొండ పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.   ఇటీవల మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో  చిరుత సంచరిస్తోంది. గ్రేహౌండ్స్‌ ప్రాంతంలో 4 బోన్లు, ట్రాప్‌ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు.  బోన్లకు చిక్కకుండా  తప్పించుకుని తిరుగుతోంది. ఈ క్రమంలోనే ఇబ్రహీంబాగ్‌ మిలిటరీ ప్రాంతంలో చిరుత రోడ్డుదాటినట్లు సమాచారం. ప్రస్తుతం చిరుత కోసం ఫారెస్ట్ అధికారులతో కలిసి పోలీసులు గాలిస్తున్నారు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు. కాగా, ఇటీవలే నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల విలేజ్ వ్యాస్ నగర్‌ క్యాంపస్‌లో చిరుత సంచారం వార్త కలకలం రేపిన విషయం తెలిసిందే.చిరుత సంచరించడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది.   
  అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ కింద మూడు విడతల్లో రైతులకు రూ.20వేల ఆర్థికసాయం అందజేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.  శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ  కార్యాలయంలో శాసన సభ్యురాలు గౌతు శిరీషతో కలిసి స్థానిక నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. తొలి విడత కింద త్వరలోనే రైతుల ఖాతాల్లో రూ.7వేలు జమ చేస్తామని మంత్రి వెల్లడించారు.  ప్రతి ఆటో డ్రైవర్‌కు త్వరలో రూ.10వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. గతంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన చాలా సంస్థలు తిరిగి వస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని.. కులమతాలు, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మంత్రి కొల్లు మండిపడ్డారు. 
ALSO ON TELUGUONE N E W S
భారతీయ సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని పేరు 'సంజయ్ దత్'(Sanjay Dutt). ప్రస్తుతం 'గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ బాలకృష్ణ(Balakrishna),బోయపాటి శ్రీను(Boypati Srinu)కాంబోలో తెరకెక్కుతున్న 'అఖండ 2'(Akhanda 2)తో పాటు, పాన్ ఇండియా రెబల్ స్టార్ 'ప్రభాస్'(Prabhas)అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja Saab)లో కీలక పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో భూట్నీ, హౌస్ ఫుల్ 5 వంటి చిత్రాలతో అలరించడం జరిగింది. సంజయ్ దత్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు '2018 లో 'నిషా పాటిల్'(Nisha Paatil)అనే లేడీ అభిమాని  డెబ్భై రెండు కోట్ల రూపాయిల విలువైన ఆస్తిని నా పేరుపై రాసింది. మొదట ఈ విషయం తెలిసినప్పుడు ఎంతో షాక్ కి గురయ్యాను. వెంటనే లాయర్లుని సంప్రదించి నాపేరుపై రాసిన ఆస్తిని  నిషా పాటిల్ కుటుంబానికి వచ్చేలా చేశాను. ఆమె నాపై చూపిన ప్రేమ, విశ్వాసం చాలా గొప్పది. కానీ  ఆస్థిపై ఆమె కుటుంబ సభ్యులకే హక్కు ఉందని చెప్పుకొచ్చాడు. ముంబై లోని మలబార్ హిల్స్ లో నివసించే 62 సంవత్సరాల 'నిషా పాటిల్ కి సంజయ్ దత్ అంటే ఎంతో అభిమానం. అనారోగ్యం బారిన పడటంతో, తన తదనంతరం డెబ్భై రెండు కోట్ల విలువైన ఆస్థి సంజయ దత్ కి చెందాలని ఏకంగా బ్యాంకుకి వీలునామా రాసింది. ఆమె మరణించిన తర్వాతే వీలునామా విషయం బయటపడింది.  బాలీవుడ్ ప్రముఖ హీరో, 'సునీల్ దత్'(Sunil Dutt)నట వారసుడిగా 1981 లో సినీ రంగ ప్రవేశం చేసిన 'సంజయ్ దత్' అనతికాలంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. రొమాంటిక్ అండ్ యాక్షన్ హీరో అనే టాగ్ లైన్ పొందిన సంజయ్ దత్,1993 వ సంవత్సరంలో అక్రమ ఆయుధాన్ని కలిగి ఉన్నాడన్న కేసులో 'టాడా' చట్టం కింద ఐదు సంవత్సరాలు జైలుశిక్ష కూడా అనుభవించాడు. తల్లి 'నర్గిస్'(Nargis dutt)పేరెన్నికగన్న నటి.        
Nabha Natesh, the young glamorous actress has been posting alluring glamour pics on Instagram. She has been tempting her followers with her images that highlight her curves in this photoshoot. She appeared recently, in Darling and did Maestro, few years back. Currently, she is posting different pics on social media heating it up. In these captivating images, Nabha demonstrates a mastery of subtle elegance. Her poses, whether a coy glance or a direct, confident gaze, are imbued with an inherent grace that speaks volumes. The strategic lighting in the shoot further enhances her features, casting a gentle glow that emphasizes her expressive eyes and sculpted cheekbones. Her hair, styled in soft waves, adds to the overall romantic and glamorous aesthetic.   Nabha Natesh effortlessly transitions from playful to poised, always maintaining an air of captivating glamour. These latest visuals reaffirm her status as a true fashionista and a rising star who understands how to command attention with an understated yet powerful presence. She truly serves a dose of glamour that leaves a lasting impression. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నట వారసుడుగా ఇండస్ట్రీకి వచ్చిన దుల్కర్‌ సల్మాన్‌.. నటుడిగానే కాకుండా సింగర్‌గా కూడా తన ప్రతిభ కనబరిచారు. 2012లో మలయాళ చిత్రం ‘సెకండ్‌ షో’ ద్వారా చిత్ర రంగ ప్రవేశం చేసిన దుల్కర్‌.. మలయాళ, తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో వైవిధ్యమైన సినిమాలు చేశారు. తన ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకునే దుల్కర్‌.. ‘కాంత’ అనే మరో డిఫరెంట్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జూలై 28 దుల్కర్‌ సల్మాన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.  ‘కాంత’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రానా దగ్గుబాటితో కలిసి నిర్మిస్తున్నారు దుల్కర్‌ సల్మాన్‌. 1930వ దశకంలో తమిళ రంగంలో సూపర్‌స్టార్‌గా వెలుగొందిన ఎం.కె.త్యాగరాజ భాగవతార్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని తెలుస్తోంది. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హై ఎమోషన్స్‌ ఉన్నట్టుగా టీజర్‌ చూస్తే తెలుస్తుంది. ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోయే దుల్కర్‌.. త్యాగరాజ భాగవతార్‌ పాత్రలోనూ ఒదిగిపోయారని అర్థమవుతోంది. ఈ సినిమాలో డైరెక్టర్‌గా సముద్రఖని ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరో, డైరెక్టర్‌ మధ్య వచ్చే ఇగో క్లాషెస్‌ ప్రధానంగా ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది.  ప్రతి చిన్న విషయానికి హీరో, డైరెక్టర్‌ విభేదించడం.. తద్వారా ఇద్దరూ ఆనందం పొందడాన్ని ఎంతో ఆసక్తికరంగా చూపించారు. పాత రోజుల్లో సినిమాల నిర్మాణం ఎలా జరిగేది, అప్పటి వాతావరణం ఎలా ఉండేది అనే అంశాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. దుల్కర్‌ సల్మాన్‌, సముద్రఖని పోటీపడి నటించారు. ముఖ్యంగా దుల్కర్‌ గెటప్‌ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. అయితే ఈ టీజర్‌లో కనిపించిన ఒకే ఒక బ్యాక్‌డ్రాప్‌.. డబ్బింగ్‌. సముద్రఖని చెప్పిన డైలాగ్స్‌లో కథానాయకుడు, కథానాయకి అనడానికి బదులుగా.. ఖథానాయకుడు, ఖథానాయకి అని ఒత్తి మరీ పలకడం చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. మరి దీన్ని తర్వాతైనా సరిచేస్తారో లేక అలాగే ఉంచేస్తారో చూడాలి. మొత్తానికి ‘కాంత’ టీజర్‌ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. సెప్టెంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా దుల్కర్‌ సల్మాన్‌ సినిమాల్లో మరో మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో, తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ 'అరేబియా కడలి'(Arabia Kadali)ని ఆగస్టు 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. భావోద్వేగాలతో నిండిన ఈ సర్వైవల్ డ్రామాకి ప్రముఖ దర్శకులు క్రిష్(Krish)జాగర్లమూడి, చింతకింది శ్రీనివాసరావు క్రియేటివ్ ప్రొడ్యూసర్లగా వ్యవహరించారు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై వై. రాజీవ్ రెడ్డి  సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ అద్భుతమైన సిరీస్‌ కి  దర్శకత్వం వహించింది వి.వి. సూర్య కుమార్(VV Surya Kumar). అరేబియా కడలిలో ప్రముఖ నటులు 'సత్యదేవ్',(Satyadev)ఆనంది(Anandhi)హీరో హీరోయిన్లు గా చెయ్యగా నాజర్, రఘు బాబు, దలీప్ తాహిల్, పూనమ్ బజ్వా, ప్రభావతి, హర్ష్ రోషన్, ప్రత్యూష సాధు, కోట జయరాం, వంశీ కృష్ణ, భరత్ భాటియా, చంద్ర ప్రతాప్ ఠాకూర్, డానిష్ భట్, రవి వర్మ, అమిత్ తివారి, నిహార్ పాండ్యా మరియు ఆలొక్ జైన్ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో భారతదేశంతో పాటు 240కి పైగా దేశాలు మరియు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఆగస్టు 8న విడుదల కానుంది. ఈ కల్పిత కథానికలో ప్రత్యర్థి గ్రామాల నుండి వచ్చిన మత్స్యకారులు అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి, ఓ విదేశీ ప్రాంతంలో బందీలుగా మారిన విషాదకర సంఘటనను హృదయానికి తాకేలా అరేబియా కడలి చిత్రీకరించారు. ఈ కథలో రెండు ప్రధాన ప్రయాణాలు ఉంటాయి. 'బదిరి' మరియు అతని సహచర మత్స్యకారుల సముద్రపు ప్రమాదాలు, బందీ జీవితం; వ్యవస్థని ఎదిరించే ధైర్యవంతమైన మహిళగా 'గంగ' ఎదుగుదల. ఈ ప్రయాణాల్లో వారు అనుకోని స్నేహాలు ఏర్పరచుకుంటారు, కొత్త సంబంధాలు నిర్మించుకుంటారు, శక్తివంతమైన శత్రువులని  ఎదుర్కొంటారు. అరేబియా కడలి అనేది సహనానికి, విపత్తులో పుట్టిన సోదరతత్వానికి, స్వేచ్ఛ కోసం జరిగే పోరాటానికి అంకితమైన ఆకట్టుకునే కథ. సరిహద్దులతో విభజించబడిన ప్రపంచంలో, ఈ అరేబియా కడలి సిరీస్ మానవత్వం సహజమని గుర్తుచేస్తుంది. 'అరేబియా కడలి అనేది అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకున్న సాధారణ వ్యక్తుల ధైర్యాన్ని, సహనాన్ని ప్రశంసించే తెలుగు డ్రామా అని ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, హెడ్ ఆఫ్ ఒరిజినల్స్ నిఖిల్ మాధోక్ తెలిపారు. ఈ సిరీస్ అనేక మానవీయ భావాలను, అవిశ్వాసం, ఐక్యత, గర్వం, బతకాలన్న తపన ప్రభావవంతంగా ప్రతిబింబిస్తుంది. సత్యదేవ్, ఆనంది అద్భుతమైన నటనతో పాటు, ప్రతిభావంతులైన నటవర్గం, అద్భుతమైన సృజనాత్మక బృందం ఈ సిరీస్‌ ని  ప్రత్యేకంగా నిలబెడతాయి. అరేబియా కడలి మా తెలుగు ఒరిజినల్స్ శ్రేణిలో ఒక శక్తివంతమైన సిరీస్. ఆగస్టు 8న ఈ ప్రభావవంతమైన కథను మా వినియోగదారులకు అందించేందుకు మేము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం అని కూడా అన్నారు. నిర్మాత వై. రాజీవ్ రెడ్డి మాట్లాడుతు 'అరేబియా కడలి మా కోసం కేవలం మరో సిరీస్ మాత్రమే కాదు. ఇది ధైర్యం మరియు సంకల్పంతో నిండిన హృదయాన్ని హత్తుకునే కథ. ఈ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే, నిజమైన కథనాన్ని, సత్యదేవ్ మరియు ఆనంది అద్భుతమైన నటనను, మరియు భావోద్వేగాలను ప్రతిబింబించే దృశ్యకళను సమపాళ్లలో సమన్వయం చేయడమే. ప్రైమ్ వీడియోతో కలిసి, ఈ కథను దీనికి తగిన స్థాయిలో జీవం పోయగలిగాం. అరేబియా కడలిలో ఉన్న భావోద్వేగాల లోతు, మానవత్వంతో నిండిన కథన శైలి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకుతుందని మేము నమ్ముతున్నాం అని అన్నారు.     
నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram)హీరోగా 2003 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అభిమన్యు' ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కన్నడ హీరోయిన్ 'రమ్య'(Ramya). పునీత్ రాజ్ కుమార్, కేజిఎఫ్ 'యష్',  అర్జున్, సుదీప్, ఉపేంద్ర, ప్రేమ్, వంటి పలువురు హీరోల సరసన అనేక చిత్రాల్లో నటించిన రమ్య కన్నడ చిత్ర సీమలో తనకంటు ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకుంది. రీసెంట్ గా 'రమ్య ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతు 'ఇనిస్టా(Inista)వేదికగా 'రేణుకా స్వామి'(Renuka Swami)హత్యకి సంబంధించి ఇటీవల ఒక  పోస్ట్ చేశాను. దీంతో సోషల్ మీడియా వేదికగా దర్శన్ అభిమానులు నానా దుర్భాషలాడుతు రేణుకా స్వామి బదులు నిన్ను చంపాల్సింది. ఇంకోసారి మా హీరో జోలికి వస్తే  అత్యాచారం చేస్తామంటూ, అసభ్యకర మెసేజ్ లు  చేస్తున్నారు. నా కుటుంబ సభ్యులని కూడా తిడుతున్నారు. ఈ బెదిరింపులపై  మా లాయర్ తో మాట్లాడాను. అభిమానులు చేసిన   మెసేజెస్ ల స్క్రీన్ షాట్స్ తో పోలీస్ కేసు నమోదు చెయ్యబోతున్నానని రమ్య తెలిపింది దర్శన్(Darshan)గత ఏడాది తన అభిమాని 'రేణుక స్వామి'ని అత్యంత దారుణంగా చంపిన విషయం తెలిసిందే. కోర్టు కూడా ఈ విషయాన్నీ ధ్రువీకరించింది. ఈ విషయంపై రమ్య కొన్ని రోజుల క్రితం మాట్లాడుతు లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్న దర్శన్ తన ప్రియురాల్ని బూతులు తిట్టాడని తన అభిమానినే చంపించి పెద్ద తప్పు చేసాడు. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే వాళ్ళ అకౌంట్ బ్లాక్ చెయ్యాలి. అంతే గాని చంపడం దారుణమని మాట్లాడటం జరిగింది. దర్శన్, రమ్య కలిసి 2006 లో 'దత్తా' అనే సినిమాలో జంటగా నటించారు. రాజకీయాల్లోను చురుగ్గా ఉన్న రమ్య 2013 నుంచి 2014 వరకు 'మాండ్య'(Mandya)పార్లమెంట్ స్థానం నుంచి 'ఏంపి'గా ప్రాతినిధ్యం వహించింది. రమ్య అసలు పేరు 'దివ్య స్పందన'.      
సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ అనేది సర్వసాధారణం. అతిగా ప్రవర్తించినవారిపై, తమకు నచ్చినవారిపై తరచూ ట్రోలింగ్‌ జరుగుతుంటుంది. ఈ వ్యవహారంపై హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. దేశంలోని పనీపాటా లేని వారు ఎక్కువైపోయారని, వారికి ఇది తప్ప మరో పని లేదని తన పోస్ట్‌లో ట్రోలర్స్‌ని ఉద్దేశించి కామెంట్‌ చేశారు. ఇతరుల వ్యక్తిగత జీవితాలపై అనవసరమైన కామెంట్స్‌ చేస్తూ టైమ్‌ పాస్‌ చేస్తుంటారని ఘాటుగా స్పందించారు. సోషల్‌ మీడియా అనేది చాలా ఉపయోగకరమైందని, దాన్ని ఇలా దుర్వినియోగం చేయడం ఎంతో బాధాకరమన్నారు.  తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన రకుల్‌.. ఆమధ్య జాకీ భగ్నానీని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం తమిళ్‌లో ఒక సినిమా, హిందీలో ఒక సినిమా చేస్తున్న రకుల్‌కి తెలుగులో ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. అయినా సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్‌ మీడియాలో ఏదైనా డిస్కషన్‌ వచ్చినా, ట్రోలింగ్‌ జరుగుతున్నా వాటిపై తన ఒపీనియన్‌ చెప్తుంటుంది. తాజాగా సెలబ్రిటీలను ట్రోల్‌ చేస్తున్న విషయం గురించి ఘాటుగా స్పందించి మరోసారి వార్తల్లోకి వచ్చింది రకుల్‌. ఆమధ్య అవ్‌నీత్‌ కౌర్‌ పోస్టుకి విరాట్‌ కోహ్లి లైక్‌ కొట్టడంపై జరిగిన రచ్చకి సంబంధించి రకుల్‌ స్పందించింది. విరాట్‌ లైక్‌ కొట్టిన తర్వాత అవ్‌నీత్‌ ఇన్‌స్టా ఎకౌంట్‌లో 2 మిలియన్ల ఫాలోవర్స్‌ పెరిగారు. దీన్ని బట్టి మనదేశంలో సోషల్‌ మీడియాను ఫాలో అవుతూ ఎంత మంది టైమ్‌ వేస్ట్‌ చేసుకుంటున్నారో అర్థమవుతుంది అంటూ నెటిజన్లను టార్గెట్‌ చేస్తూ కామెంట్‌ చేసింది. 
Hari Hara Veera Mallu film had been in production from past five years due to COVID pandemic and Pawan Kalyan's political commitments. Krish Jagarlamudi, who initially directed the film, opted out due to some undisclosed reasons. Jyothi Krishna, son of producer AM Rathnam and director, took over the film to finish it.  Upon release, the movie failed to live up to expectations of the audiences. While it took a big opening on the first day, the word of mouth has been heavily negative from the first day first show. Mainly, VFX shots have been criticised heavily and hence, the makers have decided to trim few portions.  As per the reports, the makers have trimmed down 20 minutes from the final cut in second half. VFX Heavy scenes like Pawan Kalyan travelling with his gang and crossing a lean avalanche, pre-climax portions and other scenes. This trimmed version will play in theatres from Monday and they are expecting this to salvage it.  Industry insiders are speculating about the trimming of the film, post release. They are stating that AM Rathnam is desperate for the film to perform well at the box office. On the other hand, even Pawan Kalyan asked makers to take care of the negative reactions and work accordingly, it seems.  While the makers are thinking in this manner, fans are heavily disappointed with the film. Some of them have asked Pawan Kalyan to only concentrate on politics, if cannot really work in films or disinterested. All hopes of fans are OG but makers are desperate to make HHVM work at box office, in some manner.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
రెండు మూడు సినిమాలతోనే స్టార్‌ హీరో ఇమేజ్‌ సంపాదించుకున్న విజయ్‌ దేవరకొండ.. గత కొంతకాలంగా వరస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఎన్నిరకాల ప్రయత్నాలు చేసినా హిట్‌ అనేది అతని దరి చేరడం లేదు. ఇప్పుడు విజయ్‌ దేవరకొండ ముందున్న ఒకే ఒక్క ఆశాకిరణం ‘కింగ్డమ్‌’. ఈ సినిమాపై బోలెడన్న ఆశలు పెట్టుకున్నాడు. అలాగే అతని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. జూలై 31న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పాన్‌ ఇండియా మూవీతో విజయ్‌ దేవరకొండ బ్లాక్‌బస్టర్‌ కొట్టడం ఖాయమన్న అభిప్రాయం ఎంతో మందిలో ఉంది.  విజయ్‌ దేవరకొండకు సరిగ్గా రెండు వారాల టైమ్‌ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత టైమ్‌ ఒక సినిమాకి రావడం చాలా అరుదు. దాదాపు 15 రోజులు ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టగలిగితే విజయ్‌ దేవరకొండ గట్టెక్కినట్టే. ఆగస్ట్‌ 14న సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ‘కూలీ’, ఎన్టీఆర్‌, హృతిక్‌రోషన్‌ల ‘వార్‌2’ విడుదల కాబోతున్నాయి. కాబట్టి ‘కింగ్డమ్‌’ని చూసేందుకు ప్రేక్షకుల్ని ఎలర్ట్‌ చెయ్యగలిగితే విజయ్‌ దేవరకొండ బ్లాక్‌బస్టర్‌ కొట్టడం ఖాయం. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అయింది. సినిమాలో ఏదో సమ్‌థింగ్‌ ఉందనే భావన ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉంది. ట్రైలర్‌ చూస్తుంటే విజయ్‌ దేవరకొండ ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. ఆ కారణంగా థియేటర్లకి ప్రేక్షకులు తరలివచ్చే అవకాశం చాలా ఉంది.  ‘కింగ్డమ్‌’ సినిమా ముందు చాలా ఛాలెంజెస్‌ ఉన్నాయి. కలెక్షన్ల పరంగా 100 కోట్ల భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు ‘కింగ్డమ్‌’ నిర్మాతలు. అది సాధించేందుకు ప్రమోషన్లపరంగా రకరకరాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాకి జరిగిన బిజినెస్‌ గురించి చెప్పాలంటే.. ఓవర్సీస్‌లో ఒకటిన్నర మిలియన్‌ వరకు బిజినెస్‌ జరిగిందని తెలుస్తోంది. అలాగే ఆంధ్ర 15 కోట్లు, సీడెడ్‌ 6 కోట్లు, నైజాం 15 కోట్లు, ఇతర రాష్ట్రాలు 4 కోట్లు, ఇతర భాషల్లో డబ్బింగ్‌ ద్వారా 4 కోట్ల వరకు బిజినెస్‌ చేసినట్టు సమాచారం. సినిమాకి బ్లాక్‌బస్టర్‌ అనే టాక్‌ వస్తేనే తప్ప బ్రేక్‌ ఈవెన్‌ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సినిమాపై ఉన్న బజ్‌ చూస్తుంటే ఆ లక్ష్యాన్ని ఛేదించే ఛాన్స్‌ ఉంది.  ఇక టికెట్స్‌ రేట్ల పెంపు, ప్రీమియర్స్‌ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 రోజుల పాటు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. అలాగే ప్రీమియర్స్‌కి కూడా పర్మిషన్‌ ఇచ్చింది. అయితే ప్రీమియర్స్‌ వేసే ఆలోచన ‘కింగ్డమ్‌’ మేకర్స్‌కి లేదని తెలుస్తోంది. అలా వేయడం వల్ల సినిమా టాక్‌ ముందు రోజే స్ప్రెడ్‌ అయిపోతోందని, దానివల్ల సినిమాకి నష్టం జరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అందుకే రిలీజ్‌ రోజు మొదటి షోకి వచ్చే టాక్‌ సినిమాకి బాగా హెల్ప్‌ అవుతుందని నమ్ముతున్నారు. మరి ఈ సినిమాతోనైనా విజయ్‌ దేవరకొండ భారీ విజయాన్ని అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. 
Divya Spandana, the actor turned poltician, has seen huge success in Kannada Industry and she even became a Member of Parliament from Karnataka. The actress has recently accused harassment against fans of actor Darshan. After coming out on bail, Darshan has been busy completing his film, Devil. The actor has been accused of murdering and torturing his fan for indecent comments against Pavitra Gowda. Now, Divya aka Ramya, has stated that she will complaint against Darshan's fans as they have been harassing and abusing her online and offline as well.  Divya took a stance against Darshan and hence, fans of the actor started abusing her. Well, the harassment complaint will be a strong move from her, and after Renuka Swamy Murder case, Darshan seems to be further digged into a big hole with these cases.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)తన కెరీర్ లో ఫస్ట్ టైం 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu)ద్వారా చారిత్రాత్మక జోనర్ తో కూడిన కథలో పోరాటయోధుడిగా చేసిన విషయం తెలిసిందే. గుంటూరు(Guntur)జిల్లా తెనాలి(Tenali)కి దగ్గరలో కృష్ణానది తీరాన ఉన్న కొల్లూరు(Kolluru)గనుల్లో లభించిన కోహినూర్ వజ్రం(KOhinoor Daimond)తో పాటు సనాతన దర్మం యొక్క గొప్ప తనాన్ని వీరమల్లులో చెప్పడం జరిగింది. ఇక ఈ మూవీకి సంబంధించి కొన్ని సన్నివేశాల్లో 'విఎఫ్ఎక్స్'(Vfx)వర్క్ సరిగా లేదనే అభిప్రాయాన్ని సోషల్ మీడియా వ్యాప్తంగా పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ప్రదర్శితమవుతున్న వీరమల్లులో వీరమల్లు, అతడి అనుచరులు కొండ అంచున గుర్రాలపై స్వారీ చేస్తుంటే పెద్ద పెద్ద కొండ రాళ్ళు కిందపడుతుంటాయి. ఈ సన్నివేశాన్ని కుదించడం జరిగింది. వీరమల్లు జెండా పాతే సన్నివేశాన్ని పూర్తిగా  తొలగించారు. బాణాలని సంధించే యాక్షన్ ఎపిసోడ్ లో కూడా కుదించడంతో, క్లైమాక్స్ నిడివి  తగ్గింది. ఇలా మొత్తంగా పది నుంచి పదిహేను నిమిషాల విఎఫ్ఎక్స్ ఫుటేజ్ ని తొలగించారు.  వీరమల్లు రీసెంట్ గా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. దీంతో పవన్ తన కెరీర్ లోనే ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ లోకి చేరినట్టయింది. అగ్ర నిర్మాత 'ఏఎం రత్నం'(Am Rathnam)నిర్మించిన వీరమల్లుకి  'క్రిష్'(krisha),జ్యోతికృష్ణ'(Jyothi Krishna)సంయుక్తంగా దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్(Nidhhi Agerwal)హీరోయిన్ గా చెయ్యగా, బాబీ డియోల్, నాజర్, సునీల్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి(Keeravani)సంగీతాన్ని అందించాడు.      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  రాగి,  ఇత్తడి పాత్రలు ఇంటికి సాంప్రదాయ టచ్ ను  ఇస్తాయి. వీటి కారణంగా ఇల్లు అందంగా కనిపిస్తుంది. ఈ పాత్రలను ప్రతిరోజూ ఉపయోగించవచ్చు లేదా ఉపయోగించకపోవచ్చు, కానీ చాలా తొందరగా   అవి  మెరుపును కోల్పోతాయి. అయితే వీటిని మళ్లీ కొత్త వాటిలా మెరిపించడం కాస్త కష్టంతో కూడుకున్న పని.  వీటిని తోమలేక చాలా మంది ఇలాంటి పాత్రలను దూరంగా పెట్టేస్తుంటారు. అయితే  పండుగలు, ప్రత్యేక రోజుల్లో రాగి, ఇత్తడి పాత్రలు అవసరం అవుతాయి.  ఈ  రాగి పాత్రలు లేదా ఇత్తడి పాత్రలను కొత్త వాటిలా కేవలం సెకెన్ల వ్యవధిలో మెరిపించగల మ్యాజిక్ లిక్విడ్ ఉంది. సంతోషించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ లిక్విడ్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.  ఇంతకీ ఈ మ్యాజిక్ లిక్విడ్ ను తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి? దీన్నెలా తయారు చేయాలి? ఎలా ఉపయోగించాలి?  తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. 2 టీస్పూన్లు ఉప్పు 2 టీస్పూన్లు నిమ్మరసం 1 టీస్పూన్ డిష్ వాషింగ్ లిక్విడ్ 1 టీస్పూన్ బేకింగ్ సోడా 2 టీస్పూన్లు వైట్ వెనిగర్ తయారీ విధానం.. ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. అది పెద్దదిగా ఉండాలి.   ముందుగా గిన్నెలో ఉప్పు వేసి, ఆపై నిమ్మరసం కలపాలి. డిష్ వాషింగ్ లిక్విడ్ కలిపిన తర్వాత, బేకింగ్ సోడాను కూడా జోడించాలి. చివరగా వైట్  వెనిగర్ జోడించాలి.  ఇలా చేస్తే  రాగి-ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి ద్రావణం సిద్ధమైనట్టే.. ఈ తప్పు చేయొద్దు.. ద్రావణాన్ని తయారు చేస్తున్నప్పుడు వెనిగర్  ఎక్కువగా ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  ద్రావణంలో ఎక్కువ వెనిగర్ కలిపితే పాత్రలు శుభ్రం అవుతాయి, కానీ ఎండిన తర్వాత, వాటిపై నల్ల మచ్చలు లేదా గుర్తులు కనిపించవచ్చు. కాబట్టి పాత్రలు మచ్చలు లేకుండా,  మెరుస్తూ ఉండాలంటే  పరిమిత మొత్తంలో వైట్ వెనిగర్  వాడాలి. ఉపయోగించే విధానం.. రాగి,  ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి ద్రావణాన్ని పాత్రపై పూసి పాత్ర మొత్తం అప్లై అయ్యేలా చూడాలి. ఈ ద్రావణం తొలగించిన వెంటనే పాత్ర శుభ్రంగా కనిపిస్తుంది. ఇలా కాకపోతే.. తయారు చేసుకున్న ద్రావణాన్ని ఒక పెద్ద పాత్రలో వేయాలి. ఇందులో పాత్రలను ముంచి తీసినా పాత్రలు మెరిసిపోతాయి. ఆ తర్వాత నీటితో కడిగి పొడిగుడ్డతో తుడుచుకుంటే సరిపోతుంది.                                     *రూపశ్రీ.
ప్రతి సంవత్సరం జూలై 26న మనం కార్గిల్ విజయ్ దివస్ ని ఘనంగా జరుపుకుంటాం. నిజానికి కార్గిల్ విజయ్ దివస్ ను ఒక పండుగలా జరుపుకుంటు ఉంటాం.  అయితే ఇది కేవలం ఒక పండుగ కాదు.. మన భారత సైనికుల  దేశభక్తికి, సాహసానికి, త్యాగానికి గుర్తుగా నిలిచే ఒక మహత్తరమైన రోజు. విజయ్ దివస్.. ఆవిర్భావం.. 1999లో భారత దేశానికి సంబంధించిన జమ్మూ మరియు కాశ్మీర్ ప్రాంతంలోని కార్గిల్ లోయలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సైనికులు,  ముష్కరులు, భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారు. వారిని వెనక్కు తోసి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో భారత సైన్యం అసాధారణమైన ధైర్యాన్ని, ఓర్పును ప్రదర్శించింది. ఈ యుద్ధాన్ని మనం కార్గిల్ యుద్ధం గా గుర్తించాము. సుమారు 60 రోజుల పాటు సాగిన ఈ యుద్ధం 1999 జూలై 26న భారత విజయం సాధించడంతో ముగిసింది. అందుకే ఆ రోజును “విజయ్ దివస్”గా ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో జరుపుకుంటున్నాం. కార్గిల్ యుద్దం.. ఒక సాహస గాథ.. కార్గిల్  యుద్ధంలో భారత సైనికులు ఎంతో కష్టసాధ్యమైన పర్వత ప్రాంతాల్లో పోరాడారు. కొండలపై దాక్కున్న శత్రువును తలకిందులు చేసి తామే పైచేయి సాధించడం అంటే సాహసానికి పరాకాష్ట.  ఈ యుద్ధంలో కెప్టెన్ విక్రమ్ బత్రా, లెఫ్టినెంట్ అనోజ్ థాపా, గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్, నాయిక్ సాయి సానూ లాల్, వంటి ఎందరో వీరులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు. ఎందుకు జరుపుకోవాలి? కార్గిల్ విజయ్ దివస్‌ను మనం జరుపుకోవడానికి ముఖ్య కారణాలు ఇవే: దేశాన్ని రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరులకు నివాళులు అర్పించటం యువతలో దేశభక్తిని ప్రేరేపించటం సైనికుల ధైర్యాన్ని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుని గర్వించటం మనం ఏమి చేయగలం.. మౌనంగా రెండు నిమిషాలు నిలబడి వీరులకు నివాళులర్పించవచ్చు.  పిల్లలకి, స్నేహితులకు కార్గిల్ విజయ్ దివస్ గురించి వివరంగా చెప్పి వారిలో చైతన్యం కలిగించవచ్చు. దేశ భద్రతలో భాగమైన సైనికుల సేవలకు కృతజ్ఞతలు తెలపచ్చు. కార్గిల్ విజయ్ దివస్  అందరికీ ఇచ్చే సందేశం..  స్వేచ్ఛ విలువైనదని, అది ఎప్పటికీ తీసుకోలేనిదాని ఆ రోజు దేశ ప్రజలకు చెప్పకనే చెబుతుంది. మన దేశ సైనికుల ధైర్యం, పట్టుదల కారణంగానే మనం నేడు సురక్షితంగా జీవిస్తున్నాము. ఈరోజు వారిని గుర్తుంచుకోవడం మనందరి బాధ్యత.                                         *రూపశ్రీ.
  ప్రపంచంలో పిల్లల్ని పెంచడం అంత నైపుణ్యమైన పని మరొకటి ఉండదేమో! ఒక పక్క వారి ఆలనాపాలనా చూసుకుంటూ... మరో పక్క వారి వ్యక్తిత్వాన్ని గమనిస్తూ సాగే ఈ ప్రయాణం ఏమంత సులువైంది కాదు. అలాంటి సమయంలో పిల్లలు అబద్ధం చెబుతున్నారని తేలిందనుకోండి... అంతే! తల్లిదండ్రుల ప్రతిస్పందన అసాధారణంగా ఉంటుంది. తమ పెంపకంలో ఏదో లోటు జరిగిపోయిందనో, పిల్లలు సరిగా ఎదగడం లేదనో తెగ బాధపడిపోతారు. శాశ్వతంగా పిల్లల పట్ల అనుమానపు దృక్పథాన్ని అలవర్చుకుంటారు. కానీ అంత అంతర్మధనం అవసరం లేదంటున్నారు నిపుణులు. ఈ విషయంలో వారేం చెబుతున్నారంటే... విశ్వాసం పెరిగితే నిజం చెబితే తల్లిదండ్రుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో అన్న భయమే చాలా అబద్ధాలకి కారణం అవుతుంది. ఈ భయాన్ని పోగొట్టాలంటే మనపట్ల వారికి తగిన నమ్మకాన్ని కలిగించాల్సిందే! మనతో వారు ఎలాంటి సమస్యని అయినా చెప్పుకోవచ్చుననీ... దానికి తగిన పరిష్కారం, సాంత్వన లభిస్తాయనీ నమ్మకం కలిగిన రోజున అబద్ధం చెప్పాల్సిన అవసరమే రాదు. కారణాన్ని గ్రహించండి ప్రతీ అబద్ధం వెనుకా ఏదో ఒక కారణం ఉండవచ్చు. దాన్ని గ్రహించే ప్రయత్నం చేయమంటున్నారు. పిల్లలు సిగ్గుతోనో, భయంతోనో, అలవాటుగానో, ఎవరూ తెలుసుకోలేరనే ధీమాతోనో అబద్ధం చెప్పి ఉండవచ్చు. కారణం ఏమిటని కనుక గ్రహిస్తే వారి ఎదుగుదల గురించి విలువైన విషయాలు తెలుస్తాయి. మున్ముందు వారితో ఎలా మెలగాలో సూచన వినిపిస్తుంది. వయసుని బట్టి అబద్ధం ‘మా ఇంట్లో రివాల్వర్ ఉంది!’ అని ఓ పసిపిల్లవాడు అబద్ధం చెప్పాడే అనుకోండి. అది కేవలం గొప్ప కోసం చెప్పిన విషయం కావచ్చు. ‘మా కుక్క మాట్లాడుతుంది!’ అని ఓ 18 ఏళ్ల కుర్రవాడు చెబితే అతను సరదా కోసం చెప్పిన సంగతి కావచ్చు. పిల్లల వయసుని బట్టి వారు చెప్పే సందర్భాన్ని బట్టి ఒక విషయం అబద్ధమా కాదా అని తేల్చుకోవాల్సిందే కానీ ప్రతి విషయానికీ చిందులు వేయడం తగదు. విలువలు తెలిస్తే సరి నిజాయితీగా ఉండటం, చేసిన పనికి బాధ్యతని స్వీకరించడం, ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండటం... వంటి విలువలు పిల్లలకి తెలిస్తే వారి వ్యక్తిత్వం దృఢపడుతుంది. అబద్ధాలు చెప్పడం, పుకార్లు సృష్టించడంలాంటి పనులకు పాల్పడరు. మన ప్రవర్తన, వ్యక్తిత్వం ద్వారానే పిల్లలకి ఇలాంటి విలువలు తెలుస్తాయి. మనమే వారి ముందు అబద్ధాలు చెబుతూ ఉంటే వారి ప్రవర్తన మరో రకంగా ఎలా ఉంటుంది? సమయం కేటాయించాలి పిల్లలు ఏం చెప్పినా ఓపికగా వినేందుకు సిద్ధంగా ఉండాలి. వారితో గడిపేందుకు, వాళ్లు చెప్పే విషయాలు వినేందుకు తగిన సమయాన్ని కేటాయించాలి. వారి మాటల్ని ఏవో పిల్ల మాటలుగా సరిపెట్టేయకుండా... ఓపికగా వారి ప్రశ్నలకు తిరిగి జవాబు చెప్పాలి. అప్పుడే వారికి మనం విలువనిస్తున్న విషయం అర్థమవుతుంది. తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకునేందుకు తగిన స్వేచ్ఛ లభిస్తుంది. అన్నింటికీ మించి అబద్ధం చెప్పడం సహజమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అబద్ధం చెప్పకుండా ఏ మనిషీ ఎదగడు. అది తప్పని తెలుసుకోకపోవడమే అసలు సమస్య! పై జాగ్రత్తలు పాటిస్తే ఆ సమస్య రానే రాదని భరోసా ఇస్తున్నారు నిపుణులు. - నిర్జర.
  నేటి బిజీ జీవితంలో ఒత్తిడి, ఆందోళన,   రోజువారీ అలవాట్లు సక్రమంగా లేకపోవడం వంటివి  శరీరం,  మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. అటువంటి పరిస్థితిలో  యోగా,  ప్రాణాయామంతో  రోజును ప్రారంభిస్తే, మనం ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండగలం. ప్రాణాయామంలో 'ఉజ్జయి ప్రాణాయామం' చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది మనసును చురుగ్గా ఉంచుతూ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. అయితే అసలు ఈ ప్రాణాయామానికి ఉజ్జయిని ప్రాణాయామం అని పేరు ఎలా వచ్చింది? దీని వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుంటే.. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఉజ్జయి ప్రాణాయామంలో 'ఉజ్జయి' అంటే 'విజయవంతుడు' లేదా 'విజయం సాధించేవాడు' అని అర్థం. ఈ పదం 'ఉద్' మరియు 'జి' అనే సంస్కృత పదాలతో రూపొందించబడింది. ఇక్కడ 'ఉద్' అంటే లేవడం లేదా బంధనం నుండి విముక్తి పొందడం, అలాగే 'జి' అంటే విజయం సాధించడం. ఇక 'ప్రాణాయామం' అంటే 'నియంత్రిత శ్వాస సాధన'. ఈ ప్రాణాయామం మనలో విశ్వాసాన్ని,  బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి దీనిని 'విజయవంతమైన శ్వాస' అని కూడా పిలుస్తారు. మెదడుకు మంచిది.. ఉజ్జయి ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు గొంతు నుండి మృదువైన శబ్దంతో నెమ్మదిగా శ్వాస తీసుకున్నప్పుడు  దృష్టి స్వయంచాలకంగా శ్వాసపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తుంది. ఇది మనస్సు అటు ఇటు కదిలిపోకుండా, చలించకుండా  ఉంచుతుంది.   ఆలోచించే,  అర్థం చేసుకునే శక్తిని పెంచుతుంది. అంతేకాదు.. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.  గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు ఉంటే ఉజ్జయి ప్రాణాయామం చాలా బాగా  సహాయపడుతుంది.  లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు, ఉదర అవయవాలపై కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని వల్ల  కడుపు తేలికగా అనిపిస్తుంది. గుండె ఆరోగ్యం.. ఉజ్జయి ప్రాణాయామం గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు శ్వాస వేగం తగ్గుతుంది. దీని కారణంగా గుండెపై ఎక్కువ ఒత్తిడి ఉండదు. ఇది హృదయ స్పందనను సాధారణంగా ఉంచుతుంది,  రక్తపోటును స్థిరీకరిస్తుంది. అధిక రక్తపోటు లేదా ఒత్తిడి ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ   గుండె జబ్బు ఉంటే ఈ వ్యాయామం చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఊపిరితిత్తులు.. సాధారణంగా ప్రాణాయామం అంటే ఊపిరితిత్తులను బలంగా మారుస్తుంది.  ఇది గొంతు,  ఊపిరితిత్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాణాయామం గొంతులో చిక్కుకున్న శ్లేష్మాన్ని తొలగిస్తుంది. నెమ్మదిగా పీల్చడం,  నిశ్వాసించడం ఊపిరితిత్తులను బలపరుస్తుంది,  శ్వాసను సులభతరం చేస్తుంది. ఇది అలెర్జీలు, జలుబు,  శ్వాస సమస్యలకు సహాయపడుతుంది. దీనితో పాటు, ఉజ్జయి ప్రాణాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది,  మంచి నిద్రను ఇస్తుంది.  ఎందుకంటే దీనిని సాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.  అలసట కూడా తొలగిపోతుంది, దీని కారణంగా రాత్రి త్వరగా నిద్ర వస్తుంది.  ఉదయం ఉత్సాహంగా నిద్రలేవచ్చు. శక్తినిచ్చే ఆసనం.. ఈ ప్రాణాయామం శరీరం లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది,  శక్తిని పెంచుతుంది.  రోజంతా అలసిపోయినట్లు లేదా సోమరితనంగా అనిపిస్తే ఈ ప్రాణాయామం శరీరాన్ని చురుగ్గా మారుస్తుంది. అందుకే దీనిని 'విజయవంతమైన శ్వాస' అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఆత్మవిశ్వాసం,  అంతర్గత బలాన్ని పెంచుతుంది. ఈ ప్రాణాయామం ఎలా చేయాలి? ఉజ్జయి ప్రాణాయామం చేయడానికి, ముందుగా ప్రశాంతమైన,  సౌకర్యవంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. కళ్ళు మూసుకుని శరీరమంతా రిలాక్స్ గా వదులుగా  ఉంచాలి. ఇప్పుడు ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి.  గొంతు నుండి తేలికపాటి 'ఘర్' శబ్దాన్ని కూడా చేయాలి. అది చాలా నెమ్మదిగా ఉండాలి. తరువాత ముక్కు నుండి నెమ్మదిగా గాలిని అదే విధంగా వదలండి. ఈ మొత్తం సాధన సమయంలో పూర్తి దృష్టి  శ్వాసపై ఉండాలి. తద్వారా మనస్సు చలించకుండా ప్రాణాయామం మీదే దృష్టి నిలుపవచ్చు. ప్రారంభంలో దీన్ని ఐదు నిమిషాలు చేయాలి. సాధన బలంగా మారినప్పుడు క్రమంగా సమయాన్ని పెంచుకోవచ్చు.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
మన మెడలోని థైరాయిడ్ గ్రంథి ఒక చిన్న అవయవం.  కానీ ఇది చాలా ముఖ్యమైన అవయవం. ఇది మన శరీర జీవక్రియ, శక్తి స్థాయిలు,  శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయనప్పుడు చాలా సమస్యలు మొదలవుతాయి.  ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయ్యే హైపోథైరాయిడిజంలో సమస్యలు ఎక్కువ.  మందులతో పాటు, థైరాయిడ్ రోగులకు సరైన ఆహారం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా ఆరోగ్యకరమైనవి అనుకునే కొన్ని  కూరగాయలు థైరాయిడ్ సమస్యలను పెంచుతాయి. థైరాయిడ్ రోగులు ఏ కూరగాయలను తినకూడదు ? తెలుసుకుంటే.. క్యాబైజీ కుటుంబానికి చెందిన కూరగాయలు.. థైరాయిడ్ రోగులు కొన్ని కూరగాయల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీటిని గోయిట్రోజెనిక్ అంటారు. ఇవి థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని అడ్డుకునే సమ్మేళనాలు. థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయడానికి అయోడిన్ చాలా ముఖ్యమైనది. ఇందులో ప్రధానంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ,  బ్రస్సెల్స్ మొలకలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలు ఉంటాయి. ఈ కూరగాయలలో గ్లూకోసినోలేట్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలోని థైరాయిడ్ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి. పచ్చగా వద్దు.. పైన చెప్పుకున్న  కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, థైరాయిడ్ రోగులు వాటిని పచ్చిగా తినకూడదు. పచ్చిగా ఉన్నప్పుడు వాటికి అధిక గైట్రోజెనిక్ లక్షణాలు ఉంటాయి.  వాటిని ఉడికించి తినేటప్పుడు ఈ సమ్మేళనాల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి  థైరాయిడ్  ఉన్నవారు ఈ కూరగాయలను తినాలనుకుంటే, వాటిని ఎల్లప్పుడూ బాగా ఉడికించి,  పరిమిత పరిమాణంలో తినాలి.  వాటిని రసం రూపంలో లేదా పెద్ద పరిమాణంలో పచ్చిగా తీసుకోవడం మానుకోవాలి.  ఎందుకంటే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. నిపుణుల సలహా.. పైన పేర్కొన్న కూరగాయలతో పాటు, సోయా ఉత్పత్తులు కూడా గైట్రోజెనిక్ కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. కాబట్టి థైరాయిడ్ రోగులు వాటిని మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా  ప్రాసెస్ చేసిన ఆహారాలు,  గ్లూటెన్ వినియోగం కూడా కొంతమంది థైరాయిడ్ రోగులకు, ముఖ్యంగా హషిమోటోస్ థైరాయిడిటిస్ ఉన్నవారికి సమస్యాత్మకంగా ఉంటుంది. ఆహారం మాత్రమే థైరాయిడ్‌ను నయం చేయదని, అది మందులతో పాటు మాత్రమే సహాయపడుతుందని అర్థం చేసుకోవడం ముఖ్యం.  థైరాయిడ్ ఉన్నవారు ఎల్లప్పుడు వైద్యుడిని లేదా డైటీషియన్ ను కలిసిన తరువాత మాత్రమే ఆహారం తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకోవడం మంచిది.  ఏదైనా కూరగాయలను పూర్తిగా ఆపడం లేదా  స్వంతంగా ఏదైనా పెద్ద ఆహార మార్పులు చేయడం చేయకూడదు. ఎందుకంటే ఇది ఇతర పోషకాల లోపానికి దారితీస్తుంది.                                 *రూపశ్రీ.  
  భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఉదయాన్నే పనులు చురుగ్గా మొదలుపెట్టాలన్నా, సాయంత్రం అలసట నుండి బయటపడాలన్నా టీ ఉండాల్సిందే.. అయితే రోజూ తాగే టీలో పాలు కలపడకుండా అందులో కాస్త నిమ్మరసం జోడిస్తే చాలా షాకింగ్ రిజల్ట్ ఉంటాయని అంటున్నారు వైద్యులు,  ఆహార నిపుణులు. దీన్నే లెమన్ టీ అంటారు.  రోజూ ఒక కప్పు లెమన్ టీ తాగడం మొదలుపెడితే  ఒకటి,  రెండు కాదు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. ఇంతకూ లెమన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి..  హైడ్రేషన్.. లెమన్ టీ  అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది  రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. నిమ్మకాయ విటమిన్ సి కి అద్భుతమైన మూలం. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి,  శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి అవసరం. లెమన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు,  ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల నుండి  రక్షించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, లెమన్ టీ సహజ నిర్విషీకరణ కారకంగా పనిచేస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో, కాలేయం,  మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో,  శరీరాన్ని లోపలి నుండి శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ, బరువు.. ఎక్కువగా  జీర్ణ సమస్యలు ఎదుర్కునేవారు లెమన్ టీ తీసుకుంటే చాలా మంచిది. లెమన్  టీ జీర్ణ సమస్యలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే ఆమ్ల లక్షణాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఆహారాన్ని జీర్ణం చేయడాన్ని సులభతరం చేస్తాయి. ఇది ఉబ్బరం, గ్యాస్,  అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కేవలం జీర్ణ సమస్యలకు మాత్రమే కాదు.. లెమన్ టీ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.  నిమ్మకాయ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని లెమన్ టీ తాగడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును కాల్చే ప్రక్రియ వేగవంతం అవుతుంది.  కడుపు నిండిన  ఫీలింగ్ ఇస్తుంది. దీని వల్ల  అనవసరమైన ఆకలిని కూడా నియంత్రించవచ్చు. చర్మం.. లెమన్  టీ  అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని అకాల వృద్ధాప్యం,  ముడతలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం క్లియర్ గా , ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా కనిపిస్తుంది. మొటిమలు, మచ్చలు..  మొటిమలు,  మచ్చలను తగ్గించడంలో కూడా లెమన్ టీ సహాయపడుతుంది.   ఒత్తిడి,  ఆందోళనను తగ్గించడంలో సహాయపడే  ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నిమ్మకాయ వాసన,  వేడిగా ఉండే లెమన్  టీ శరీరానికి రిలాక్స్ ఇస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం.. లెమన్ టీలో లభించే పాలీఫెనాల్స్,  యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి  మేలు చేస్తాయి. అవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తపోటును నియంత్రించడంలో,  చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బులు,  స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు.. నిమ్మకాయలో నోటి ఆరోగ్యానికి ప్రయోజనకరమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం ద్వారా దుర్వాసనను తగ్గించడానికి,  చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే రోజుకు 2 నుండి 3 కప్పుల కంటే ఎక్కువ లెమన్ టీ తాగకూడదు.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..