సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు. ఇండయా కూటమి నేతలు తన సమస్యలను పిషిషన్ రూపంలో కోర్టు ముందుండాలని ఆయన పేర్కొన్నారు. దీంతో  నేడు  ఇండియా కూటమి నేతల చలో సుప్రీం కోర్టు మార్చ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   కాగా సీజేఐ ఇండియా కూటమి నేతల భేటీని తిరస్కరించడానికి వారు.. ఇప్పటికే   విచారణలో ఉన్న అంశాలపై తనతో చర్చించాలని భావిస్తుండటమే కారణమని తెలుస్తోంది.  ఈ నేపథ్యంలోనే వారి అభ్యర్థనను సీజేఐ సూర్యకాంత్ తిరస్కరించారనీ, పిటిషన్లను విచారించి తీర్పులు ఇవ్వడమే న్యాయస్థానాల విధి అని ఆయన పేర్కొన్నారనీ తెలుస్తోంది.   ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు కట్టుబడి ఉందని, న్యాయస్థానం తలుపులు అందరికీ ఎల్లవేళలా తెరిచే ఉంటాయనీ సీజేఐ పేర్కొన్నట్లు సమాచారం.  ఎస్‌ఐఆర్‌లో అక్రమాలు జరిగాయని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌  జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ అంశంపై సోమవారం (అక్టోబర్ 12) చలో సుప్రీంకోర్టు   మార్చ్‌ చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిరసన ఏ ఒక్క రాజకీయ పార్టీకి పరిమితం కాదని, భారతీయులందరిదీనని కాంగ్రస్ అగ్రనేత, లోక్‌సభలో  ప్రధాన ప్రతిపక్ష నేత  రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణలపై ఇండియా కూటమి ఇప్పటికే  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. సీఈసీ రాజీనామా, 2023 చట్టం రద్దు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ నిలిపివేత, తొలగించినట్లు ఆరోపిస్తున్న 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్ల పునరుద్ధరణ కోరుతూ ఆ వినతి పత్రం సమర్పించింది.    [CJI Surya Kant Reject, INDIA Bloc Plea, Rahul Gandhi, Mallikarjun Kharge, Supreme Court, , Vote Theft Allegations, Election Commission, SIR, Telugu One]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం శనివారం (అక్టోబర్ 10) జరిగింది. కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడమే లక్ష్యంగా జరిగిన ఆ కేబినెట్ భేటీకి జనసేన మంత్రులు ముగ్గురు గైర్హాజర్ కావడం పొలిటికల్ గా సంచలనంగా మారింది. స్థానిక ఎన్నికల వేళ సీట్ల సర్దుపాట్లే ఇందుకు కారణమన్న ప్రచారం జోరుగా సాగింది. మొత్తం మీద కేబినెట్ భేటీకి జనసేన మంత్రుల సామూహిక గైర్హాజర్ హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రరాజకీయ సమీకరణాల్లో మార్పు అంటూ రాజకీయవర్గాలలో ఊహాగాన సభలు కూడా జరిగాయి.  రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ గైర్హాజర్ పై పలు రకాల విశ్లేషణలు వెల్లువెత్తాయి. అయితే జనసేన మంత్రుల గైర్హాజరీ వెనుక రాజకీయ వివాదం కానీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి కానీ లేదని ఆ తరువాత స్పష్టమైంది. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం జనసేన మంత్రుల గైర్హాజర్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది.   మహాలయ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని పితృదేవతలకు సంప్రదాయబద్ధంగా నిర్వహించాల్సిన   తర్పణాల విధుల్లో ఉదయం నుంచి ఆయన నిమగ్నమై ఉండటం వలనే మంత్రివర్గ సమావేశానికి జనసేన మంత్రులు హాజరుకాలేకపోయారని జనసేన వివరించింది.   ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, నామినేటెడ్ పదవుల భర్తీ తదితర అంశాలపై కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయ చర్చలు జరుగుతున్న తరుణంలో, కేబినెట్ భేటీకి జనసేన మంత్రుల గైర్హాజర్ పలు సందేహాలకు తావిచ్చింది. జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలన్న చర్చ మొదలైంది. అయితే జనసేనాని కార్యాలయం ఓ ప్రకటన ద్వారా క్లారిటీ ఇవ్వడంతో ఆ  చర్చకు ఫుల్ స్టాప్ పడింది.  [Janasena Ministers Abscent Cabinet Meeting, AP Cabinet Meeting, Pawan Kalyan, Chandrababu Naidu, Differences, Rumours,TeluguOne News]
ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకం   కీలక మైలురాయిని అధిగమించింది. గోదావరి నదిలో వరదల సమయంలో సముద్రంలోకి వృథాగా పోయే అదనపు జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు  500 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణానదిలోకి తరలించారు. 2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది. 1,651 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పథకం ద్వారా కృష్ణా డెల్టాలో  దాదాపు 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరింది.   అంతే కాకుండా పట్టిసీమ  రాయలసీమకు నీటిని తరలించే పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవా వంటి ప్రాజెక్టులకు అవసరమైన నీటి నిర్వహణలో తోడ్పడుతున్నది.  పట్టిసీమ ద్వారా 500 టీఎంసీల నీటి తరలింపు మైలురాయిని చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణా డెల్టా రైతులు, నీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి అభినందించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపే గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించేందుకు పట్టిసీమను వినియోగంలోకి తీసుకురావడం వల్ల రైతులకు ప్రయోజనం కలిగిందని వారు పేర్కొన్నారు.  పట్టిసీమ  500 టీఎంసీల గోదావరి జలాలను మళ్లించడానికే కాకుండా, వేల కోట్ల రూపాయల సంపద సృష్టికి కూడా దోహదపడిందని వారు ఈ సందర్భంగా చెప్పారు.   వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణాడెల్టాకు పట్టిసీమ వరప్రదాయినిగా నిలిచిందన్నంటుననారు.  మొత్తంగా.. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 500 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించడం ఆంధ్రప్రదేశ్ సాగునీటి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయంగా రైతులు ప్రస్తుతిస్తున్నారు.  ఇదే సందర్భంగా పట్టిసీమను పనికిరాని ప్రాజెక్టుగా అభివర్ణించి, విమర్శలు గుప్పించిన జగన్ పై విమర్శల వర్షం వెల్లువెత్తుతోంది. పట్టిసీమ 500 టీఎంసీల జలాల తరలింపు మైలు రాయిని దాటిన వేల.. నాడు పనికి మాలిన ప్రాజెక్టుగా అభివర్ణించిన జగన్ వంటి పొలిటికల్ సైంటిస్టులు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు.  [Pattiseema Project Reach Milestone, Godavari Waters, Krishna Basin, 500 TMC, Interlinking Godavari and Krishna Rivers, Andhra Pradesh Irrigation Project, Krishna Delta Farmers, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘రంగస్థలం’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సుకుమార్ సినిమాలకు ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో.. ఈసారి అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తోంది. సుకుమార్ సినిమా అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేర్లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. ‘ఆర్య’ నుంచి మొదలైన వీరి ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. ముఖ్యంగా ‘రంగస్థలం’లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. ‘పుష్ప’ సిరీస్‌తో ఈ కాంబో పాన్ ఇండియా ప్రేక్షకులకు కూడా మరింత చేరువైంది. సుకుమార్ విజన్‌కు తగ్గట్టుగా దేవిశ్రీ సంగీతం అందించడం, ఆ పాటలను దర్శకుడు తెరపై మరో స్థాయిలో చూపించడం ఈ కాంబినేషన్ ప్రత్యేకత. అలాంటి కాంబోలో ఇప్పుడు మార్పు రాబోతుండటం ఆసక్తికరంగా మారింది. 'RC17' కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రంగంలోకి దిగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అనిరుధ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు అనిరుధ్ ఇచ్చే బీజీఎం సినిమాలకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. సుకుమార్ తన తదుపరి సినిమాను మరింత భారీ స్థాయిలో రూపొందించాలని చూస్తున్న నేపథ్యంలో.. కొత్త తరహా సౌండ్‌తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే ఆలోచనతో అనిరుధ్ పేరు పరిశీలనలోకి వచ్చిందా? అనే చర్చ జరుగుతోంది.  మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, ముఖ్యంగా 'ఎల్లమ్మ' సినిమాలో హీరోగా నటిస్తుండటం కూడా ఈ మార్పుకి కారణమై ఉండొచ్చు అంటున్నారు. ఇది కూడా చదవండి: చివరి నిమిషంలో షాక్.. 'జైలర్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణమేంటి.?       [Anirudh For RC17, RC17 Music Director, Ram Charan Sukumar Movie, RC17 Movie, Ram Charan, Sukumar, Anirudh Ravichander, Devi Sri Prasad, Telugu Film News]  
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు చేపడుతున్న రహదారి విస్తరణ పనులకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనవంతు సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్‌) పార్కు పరిసరాల్లో రోడ్ల విస్తరణ కోసం తన నివాసానికి చెందిన 862.77 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించేందుకు ఆయన అంగీకరించారు. ఈ నిర్ణయంతో దశాబ్దాలుగా తన కుటుంబానికి అనుబంధం ఉన్న ఇంటిలో కొంత భాగాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేబీఆర్ పార్కు చుట్టూ జీహెచ్‌ఎంసీ ప్రయోగాత్మకంగా అమలు చేసిన వన్‌వే ట్రాఫిక్ విధానం విజయవంతం కావడంతో దానిని శాశ్వతంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రోడ్డు నంబర్‌ 45 జంక్షన్‌ సహా కొన్ని ప్రాంతాల్లో రహదారులను విస్తరించి వాహనాల రాకపోకలకు ఉన్న అడ్డంకులను తొలగించనున్నారు. ఈ పనులు పూర్తయితే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ నుంచి దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, నాలెడ్జ్‌ సిటీ వైపు వెళ్లే వాహనదారులకు ప్రయాణం మరింత సులభమయ్యే అవకాశం ఉంది. బాలకృష్ణ స్థలం ఇవ్వడానికి అంగీకరించిన ఇల్లు నందమూరి కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. దివంగత నందమూరి తారక రామారావు 1982లో బాలకృష్ణ కోసం ఈ ఇంటిని నిర్మించి ఇచ్చారు. అప్పటి నుంచి ఆ కుటుంబానికి ఎన్నో జ్ఞాపకాలకు వేదికగా నిలిచింది. ఎన్టీఆర్‌ తన అభిమానులను కూడా ఈ ఇంట్లోనే కలిసేవారని సమాచారం. అయితే రోడ్డు విస్తరణ పనుల వల్ల ప్రస్తుతం ఉన్న భవనంలో సగానికి పైగా భాగం ప్రభావితమవుతుండటంతో బాలకృష్ణ మరో ప్రాంతానికి నివాసం మార్చుకోవాల్సి రానుంది. బాలకృష్ణతో పాటు శబ్దాలయ స్టూడియో, భవ్య కన్‌స్ట్రక్షన్స్‌ కూడా రోడ్డు విస్తరణ కోసం తమ స్థలాలను ఇచ్చేందుకు అంగీకరించాయి. శబ్దాలయ స్టూడియో 608 చదరపు గజాలు, భవ్య కన్‌స్ట్రక్షన్స్‌ 341.33 చదరపు గజాల స్థలాన్ని అందించనున్నాయి. ఈ యజమానులు నగదు పరిహారానికి బదులుగా బదిలీ అభివృద్ధి హక్కుల (టీడీఆర్‌) విధానాన్ని ఎంచుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి. కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించే విస్తృత ప్రణాళికలో ఈ నిర్ణయాలు కీలకంగా మారాయి.     [Nandamuri Balakrishna, Balakrishna Hyderabad House, NTR Ancestral House, KBR Park Road Widening, Hyderabad Traffic Updates, Balakrishna Latest News, NTR Balakrishna House, GHMC Road Expansion, Jubilee Hills Traffic, Hyderabad Elevated Corridor]
Medha Meka, the the daughter of actors Srikanth and Ooha, is making her acting debut alongside, Jai Jasti in a new romantic comedy, tentatively titled #MythriInLove. Produced by Mythri Movie Makers, the project was officially launched today with a formal pooja ceremony. Billed as a new-age drama, the film focuses on the everyday dynamics of a modern relationship. Rather than relying on a heavy commercial template, the narrative aims to blend lighthearted romance with family-oriented themes. A first-look poster released by the team features a simple embrace between the lead pair, establishing the breezy tone of the subject. Transitioning into his role as a protagonist, Jai previously worked in the direction department for films like Gaali Sampath and F3. The movie marks the feature debut of director Prithvi Vanam, who gained attention for his web series 30 Weds 21. Director Mahesh Babu P is also on board as the project's creator to oversee the creative execution. Mythri Movie Makers is backing this medium-budget venture alongside their larger projects. With Sai Harsha composing the music, the movie has officially commenced the regular shooting schedule. The production house is expected to announce the finalized title and further casting details in the coming weeks. The movie has been formally launched by Ganta Srinivasa Rao and Nandini Reddy.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 15న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాపై అంచనాలు పెంచేందుకు భారీ ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా అక్టోబర్ 12న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో ఈ వేడుక రద్దయినట్లు ప్రకటన రావడంతో అభిమానుల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఈవెంట్ రద్దు వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ‘జైలర్ 2’ తమిళ్ ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఇప్పటికే కొత్త పంథాను ఎంచుకున్నారు. సాధారణంగా రజనీకాంత్ సినిమాలకు భారీ స్థాయిలో ఆడియో లాంచ్ నిర్వహించడం ఆనవాయితీ. కానీ ఈసారి అలాంటి వేడుకను నిర్వహించకుండా.. ‘జైలర్ 2 సూపర్ షో’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని సన్ నెక్స్ట్ ఓటీటీలో విడుదల చేశారు. అయితే హైదరాబాద్‌లో జరగాల్సిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుకు కూడా ఇదే ప్రచార వ్యూహం కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియాల్సి ఉంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీక్వెల్‌లో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నారు. తొలి భాగం విజయంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖ నటులు కూడా ఈ చిత్రంలో భాగమయ్యారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇది కూడా చదవండి: 'జైల‌ర్‌2'కి పోటీగా 'ర‌ణ‌బాలి'.. ర‌జినీకాంత్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ 'హ్యాట్రిక్' కొడ‌తాడా.?       [Jailer 2 Event Cancelled, Jailer 2 Pre Release Event, Jailer 2 Telugu Release, Sithara Entertainments, Naga Vamsi, Rajinikanth, Nelson Dilipkumar, Anirudh Ravichander, Telugu News]  
దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన సినిమాలతో భారతీయ చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన.. ఇప్పుడు మహేశ్‌బాబుతో ‘వారణాసి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతాలను ఇప్పటివరకు సినిమాల్లో చూపించిన తీరుపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజమౌళి.. రామాయణం, మహాభారతం ఆధారంగా తెరకెక్కిన సినిమాలను గతంలో చాలానే చూశానని తెలిపారు. వాటిలో తనకు నచ్చిన సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఆ ఇతిహాసాల్లోని గొప్పదనం, వైభవం మాత్రం పూర్తిస్థాయిలో వెండితెరపై కనిపించలేదని అభిప్రాయపడ్డారు. మూల ఇతిహాసాల్లో ఉన్న భారీతనాన్ని, అద్భుతమైన ప్రపంచాన్ని సినిమాల్లో మరింత గొప్పగా ఆవిష్కరించడానికి అవకాశం ఉందని తాను భావించినట్లు చెప్పారు. ఈ అసంతృప్తే తనను మరింత పెద్ద స్థాయిలో సినిమా చేయాలనే సవాల్‌ వైపు నడిపించిందని రాజమౌళి వెల్లడించారు. ప్రస్తుతం మహేశ్‌బాబుతో రూపొందిస్తున్న ‘వారణాసి’ తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రమని పేర్కొన్నారు. భారతీయ ఇతిహాసాల్లోని భావోద్వేగాలు, గొప్పదనం, వైభవాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందేలా తెరపై చూపించాలనే లక్ష్యంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యల సారాంశం. ఇదిలా ఉంటే.. ‘వారణాసి’లో రామాయణం స్ఫూర్తితో రూపొందించిన కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో మహేశ్‌బాబు ‘రుద్ర’ పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా జోనస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాల ప్రయాణం, సాహసాలతో కూడిన కథాంశంతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంగా.. రామాయణం వంటి ఇతిహాసాలను మరింత వైభవంగా వెండితెరపై చూపించాలనే తన ఆకాంక్షను రాజమౌళి స్పష్టంగా వెల్లడించారు. మరి ‘వారణాసి’తో ఆయన ప్రేక్షకులకు ఎలాంటి కొత్త అనుభూతిని అందిస్తారు? భారతీయ ఇతిహాసాల స్ఫూర్తిని తనదైన శైలిలో ఎలా ఆవిష్కరిస్తారు? అనేది సినిమా విడుదలయ్యాకే తెలియనుంది.       [SS Rajamouli, Rajamouli Ramayana Comments, Varanasi Movie, Mahesh Babu Varanasi, Rajamouli Latest News, Indian Epics, Ramayana Movie Adaptation, Mahesh Babu New Movie, Priyanka Chopra Varanasi, Prithviraj Sukumaran, Varanasi Release Date 2027]
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్య మరో ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరుకు రంగం సిద్ధమైంది. చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో, ఒక యంగ్ హీరో చిత్రాలు ఒకే సమయంలో ముఖాముఖి తలపడటం సహజమే అయినా, వీరిద్దరి ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఒక ఆశ్చర్యకరమైన సెంటిమెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో రెండు పర్యాయాలు ఒకే నెలలో విడుదలైన సందర్భాల్లో రజనీ చిత్రాలపై విజయ్ దేవరకొండ సినిమాలు బాక్సాఫీస్ వద్ద స్పష్టమైన పైచేయి సాధించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి దసరా బరిలో వీరిద్దరి చిత్రాలు ఒక్క రోజు తేడాతో థియేటర్లలోకి వస్తుండటం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. 2016 జూలైలో వీరి మధ్య బాక్సాఫీస్ పోరుకు బీజం పడింది. ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్‌తో జూలై 22న రజనీకాంత్ నటించిన భారీ చిత్రం 'కబాలి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అంచనాల్ని అందుకోలేకపోవడం, పైగా మిక్స్‌డ్ రివ్యూల కారణంగా ఆ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేక పరాజయం పాలైంది. సరిగ్గా వారం రోజుల వ్యవధిలోనే జూలై 29న ఎలాంటి ఆర్భాటం లేకుండా విజయ్ దేవరకొండ 'పెళ్ళి చూపులు' సినిమా విడుదలైంది. అప్పటికి విజయ్‌కి కనీసం ఫ్యాన్‌బేస్ లేకపోవడం పక్కనపెడితే తన మొహం కూడా చాలామంది సినీ ప్రియులకు తెలియదు. అయితే సరికొత్త కంటెంట్‌తో యువతను విశేషంగా ఆకట్టుకున్న ఆ చిత్రం కల్ట్ క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, విజయ్ దేవరకొండను ఒక్కరాత్రిలో స్టార్‌ని చేసేసింది. మళ్లీ రెండేళ్ల తర్వాత నవంబర్ 2018లో ఇదే తరహా సన్నివేశం ఎదురైంది. భారీ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్‌గా దాదాపు రూ. 500 కోట్ల వ్యయంతో శంకర్ తెరకెక్కించిన రజనీకాంత్ '2.0' (రోబో 2) నవంబర్ 29న గ్రాండ్‌గా విడుదలైంది. బడ్జెట్ భారీగా ఉండటంతో తెలుగు నాట ఆ చిత్రం కేవలం యావరేజ్ ఫలితానికే పరిమితమైంది. అంతకుముందే పైరసీ సమస్యలను దాటుకుని నవంబర్ 17న విడుదలైన విజయ్ దేవరకొండ చిత్రం 'టాక్సీవాలా' అనూహ్య వసూళ్లను సాధించి సూపర్ హిట్ ఖాతాలో చేరింది. ఇలా రెండోసారి కూడా రజనీకాంత్‌పై విజయ్ దేవరకొండ పైచేయి సాధించారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల విరామం తర్వాత దసరా పండుగ వేళ ఈ ఇద్దరు హీరోలు మళ్లీ నేరుగా ఢీకొంటున్నారు.  రజనీకాంత్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'జైలర్ 2' అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రానుండగా, మరుసటి రోజే అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ, రష్మిక మందానా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రణబాలి' విడుదల కానుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో 'జైలర్ 2' చిత్రానికి టికెట్లపై రూ. 50 నుంచి రూ. 75 వరకు ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు లభించడంపై నెటిజన్లు, ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాకు అంతటి భారం మోపడం పట్ల విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ 'రణబాలి' చిత్రాన్ని ఎలాంటి టికెట్ ధరల పెంపు లేకుండా సాధారణ రేట్లకే ప్రజలకు అందిస్తోంది. దీనికి తోడు రాయలసీమ యోధుడి చారిత్రక కథ కావడం, విజయ్-రష్మిక కాంబోపై ఉన్న క్రేజ్ చిత్రానికి భారీ హైప్ తీసుకొచ్చాయి. గత రెండు రికార్డులను, ప్రస్తుత టికెట్ రేట్ల అనుకూలతను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ దసరా సీజన్‌లోనూ రజనీకాంత్‌పై విజయ్ దేవరకొండ ముచ్చటగా మూడోసారి పైచేయి సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.     [Vijay Deverakonda, Ranabaali Movie, Rajinikanth Jailer 2, Ranabaali vs Jailer 2, Ranabaali Box Office, Jailer 2 Release Date, Vijay Deverakonda Upcoming Movie]
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన పలు చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. అలాంటి సినిమాల్లో ‘బాషా’, ‘పేట’ కూడా ఉన్నాయి. ఈ చిత్రాలకు సీక్వెల్స్ చేసే ఆలోచనలు వచ్చినప్పటికీ రజనీకాంత్ మాత్రం వాటికి అంగీకరించలేదు. కానీ ‘జైలర్’ రెండో భాగం ‘జైలర్ 2’కు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి కారణమేంటో తాజాగా ఆయన వెల్లడించారు.  సాధారణంగా సీక్వెల్స్‌పై తనకు పెద్దగా ఆసక్తి ఉండదని రజనీకాంత్ తెలిపారు. మొదటి భాగంలోని కథకు కొన్ని కొత్త అంశాలను జోడించి మరో సినిమా తీయడం తనకు నచ్చదని చెప్పారు. గతంలో ‘బాషా 2’ కోసం ప్రతిపాదనలు వచ్చినా అంగీకరించలేదని, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ‘పేట 2’ ఆలోచనతో తనను సంప్రదించినప్పటికీ ముందుకు వెళ్లలేదని గుర్తుచేసుకున్నారు. అయితే ‘జైలర్’ విషయంలో మాత్రం కథలోనే రెండో భాగానికి సరైన పునాది కనిపించిందని వివరించారు.  ‘జైలర్’ ఓటీటీలో విడుదలైన తర్వాత మరోసారి సినిమా చూశానని రజనీ చెప్పారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వర్మ అనే పాత్ర తన వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని ముత్తువేల్ పాండియన్‌ను హెచ్చరించే సన్నివేశం తనను ఆలోచింపజేసిందన్నారు. అంతేకాదు.. సినిమాలో చూపించిన వేల కోట్ల విలువైన మూడు కంటైనర్లు, నాగ్‌పూర్ జైలులో ముత్తువేల్ పాండియన్‌కు ఉన్న పలుకుబడి వంటి అంశాలు కథను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించాయని తెలిపారు. దీంతో సీక్వెల్‌కు బలమైన కథ ఉందని భావించి, తానే దర్శకుడు నెల్సన్‌కు ఫోన్ చేసి ‘జైలర్ 2’ చేయడానికి అంగీకరించినట్లు వెల్లడించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’లో రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు తదితరులతో పాటు ఎస్.జే. సూర్య, మిథున్ చక్రవర్తి, విద్యాబాలన్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగంలో చూపించిన కథా ప్రపంచాన్ని రెండో భాగంలో నెల్సన్ ఎలా విస్తరించారో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.      [Rajinikanth, Jailer 2, Baasha 2, Petta 2, Rajinikanth Sequel Movies, Nelson Dilipkumar, Jailer 2 Story, Rajinikanth Latest News, Tiger Muthuvel Pandian]
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడంతో ఆయనపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో కొంతకాలంగా కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాని వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, వైష్ణవ్ తేజ్ ఒకేసారి మూడు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. నూతన దర్శకుడు మహేష్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ఇదే కాకుండా దర్శకుడు వి.ఐ. ఆనంద్‌తోనూ వైష్ణవ్ తేజ్ సినిమా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘గీత గోవిందం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన పరశురామ్‌తో కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించవచ్చని ప్రచారం సాగుతోంది. ఈ మూడు సినిమాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటనలు రాకపోవడంతో వీటికి సంబంధించిన వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. ‘ఉప్పెన’తో వచ్చిన విజయాన్ని ఆ తర్వాతి సినిమాలతో కొనసాగించలేకపోయిన వైష్ణవ్ తేజ్.. ఈసారి కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి మూడు ప్రాజెక్టులు పట్టాలెక్కితే ఆయన కెరీర్‌కు కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు? వైష్ణవ్ తేజ్ మళ్లీ విజయాల బాట పడతారా? అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.       [Vaishnav Tej, Vaishnav Tej Comeback, Vaishnav Tej New Movies, Vaishnav Tej Upcoming Projects, Panja Vaisshnav Tej, Mahesh Director, VI Anand, Parasuram, AK Entertainments, Sri Venkateswara Creations]
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ‘ఇరుముడి’తో విజయాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తన 78వ సినిమా చేస్తున్నారు. ‘RT-78’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి తాజాగా ‘తులాభారం’ అనే పేరును ఖరారు చేశారు. హైదరాబాద్‌లో సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, టైటిల్‌ను పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రత్యేక గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ టైటిల్ గ్లింప్స్‌లో సినిమా పేరును నిర్ణయించే క్రమాన్ని సరదాగా చూపించారు. రవితేజ ‘లైట్స్ ఆన్’ అంటూ సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వగా, తరుణ్ భాస్కర్ ఇది పొలిటికల్ డ్రామా కాబట్టి ‘రాజ్‌నీతి’ అని పేరు పెడదామని సూచిస్తారు. అయితే, రవితేజ తనదైన శైలిలో స్పందించడంతో అక్కడి నుంచి టైటిల్ చర్చ మరింత వినోదాత్మకంగా సాగుతుంది. ఇది భార్య కోసం తపించే భర్త కథ అని, లవ్ స్టోరీ అని చెప్పడంతో ప్రియాంక మోహన్, జేడీ చక్రవర్తి, అనస్వర రాజన్ తదితరులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. చివరికి అన్ని అంశాలను సమతూకం చేస్తూ ‘తులాభారం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు గ్లింప్స్‌లో చూపించారు. ఇక ఈ చిత్రంలో ప్రియాంక మోహన్, అనస్వర రాజన్ కథానాయికలుగా నటిస్తుండగా, జేడీ చక్రవర్తి, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిల్ కరెల్లా, ఇతర నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీని రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా పూజా కార్యక్రమానికి యువ హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. విభిన్నమైన కథాంశాలు, కామెడీ, ఎమోషన్స్‌ను కలిపి సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా వివేక్ ఆత్రేయకు గుర్తింపు ఉంది. మరోవైపు మాస్ ఇమేజ్ ఉన్న రవితేజతో ఆయన జతకట్టడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. టైటిల్ గ్లింప్స్‌తోనే కథలోని విభిన్న కోణాలను సరదాగా పరిచయం చేసిన మేకర్స్.. మున్ముందు విడుదల చేసే అప్డేట్స్‌తో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతారేమో చూడాలి.     [Ravi Teja, Thulabharam Movie, RT78 Movie, Ravi Teja 78th Film, Vivek Athreya, Priyanka Mohan, Anaswara Rajan, JD Chakravarthy, Thulabharam Title Glimpse]
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘రణబాలి’. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. అయితే సినిమా రిలీజ్‌కు కొద్ది రోజుల ముందు డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించి ఓ కీలక అప్డేట్ బయటకు వచ్చింది. విదేశాల్లో అక్టోబర్ 16న ‘రణబాలి’ తెలుగు వెర్షన్ మాత్రమే విడుదల కానుంది. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్లు మాత్రం అదే రోజు అందుబాటులో ఉండవు. డబ్బింగ్ కంటెంట్ సిద్ధం చేయడంలో ఆలస్యం కావడంతో ఈ వెర్షన్ల విడుదలను అక్టోబర్ 23కు వాయిదా వేసినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు. దీంతో ఇతర భాషల్లో విజయ్ దేవరకొండ సినిమాను చూడాలనుకునే అభిమానులు మరో వారం రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు, విదేశాల్లో ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రీ-సేల్స్‌కు కూడా స్పందన వస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్–అతుల్ సంగీతం అందించారు. ‘టాక్సీవాలా’తో ఆకట్టుకున్న విజయ్–రాహుల్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డబ్బింగ్ వెర్షన్ల విడుదల వాయిదా పడినప్పటికీ, తెలుగు వెర్షన్ మాత్రం ప్రకటించిన తేదీకి విదేశాల్లో విడుదల కానుంది. అక్టోబర్ 16న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రణబాలి’ ఇతర భాషల వెర్షన్లు అక్టోబర్ 23 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ విడుదల తేదీల మార్పు సినిమా ఓవర్సీస్ వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనలో చాలామందికి ఎండలో కొద్దిసేపు గడపడం ఆరోగ్యానికి మంచిదని తెలుసు. అయితే ఏ సమయంలో ఎండలో ఉండాలి? ఉదయం సూర్యరశ్మి వల్ల విటమిన్ డి లభిస్తుందా లేక మధ్యాహ్నం ఎండలోకి వెళ్తేనే శరీరానికి ఎక్కువ విటమిన్ డి అందుతుందా అనే సందేహాలు సర్వసాధారణం. సూర్యరశ్మి పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, సరైన సమయంలో బయటకు వెళ్లకపోవడం మరియు శరీరానికి ఎంత మేరకు సూర్యరశ్మి తగులుతుందనే అంశాలను పట్టించుకోకపోవడం వల్ల కొందరిలో విటమిన్ డి లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ సూర్యరశ్మి సమయం, దాని వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాల మధ్య ఉన్న స్పష్టమైన తేడాను వివరించారు. ఉదయం వేళ లభించే సూర్యరశ్మి శరీరంలోని సహజ జీవ గడియారాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు ప్రశాంతమైన నిద్రకు తోడ్పడటానికి ఉపయోగపడితే, విటమిన్ డి ఉత్పత్తికి మాత్రం మధ్యాహ్నం సమయంలో లభించే ప్రత్యేకమైన UVB కిరణాలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంటే మంచి నిద్ర కోసం ఎండలోకి వెళ్లే సమయం మరియు విటమిన్ డి కోసం ఎంచుకోవాల్సిన సమయం పూర్తిగా వేర్వేరుగా ఉంటాయి. మంచి నిద్ర మరియు జీవ గడియారం యొక్క క్రమబద్ధీకరణ కోసం ఉదయం 6.30 నుంచి 8.30 గంటల మధ్య ఎండలో ఉండటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో సూర్యరశ్మి శరీరంలోని సర్కేడియన్ రిథమ్‌ (Circadian Rhythm) అని పిలిచే సహజ జీవ గడియారాన్ని సరిగ్గా పనిచేసేలా చేస్తుంది. ఈ జీవ గడియారం మనకు ఎప్పుడు మెలకువగా ఉండాలి, ఎప్పుడు నిద్రపోవాలి అనే అంశాలతో పాటు శరీరంలోని అనేక దైనందిన ప్రక్రియలను అద్భుతంగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఉదయం 6.30 నుంచి 8.30 గంటల మధ్య సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు సహజ వెలుతురులో గడపాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆరోగ్యకరమైన అలవాటు చక్కటి నిద్రకు, మానసిక స్థితి మెరుగుపడటానికి, పగటిపూట పూర్తి చురుకుదనానికి అలాగే జీవక్రియల సక్రమ క్రమబద్ధీకరణకు ఎంతో తోడ్పడుతుంది. రోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్లేటప్పుడు లేదా బయట కాసేపు గడిపేటప్పుడు ఈ సహజ సూర్యరశ్మిని సులభంగా పొందవచ్చు. అయితే, ఉదయాన్నే ఎండలో ఉండటం వల్ల విటమిన్ డి పెద్ద మొత్తంలో లభిస్తుందని భావించకూడదు, ఎందుకంటే ఆ సమయంలో UVB కిరణాల తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. మరోవైపు, శరీరంలో విటమిన్ డి సమృద్ధిగా తయారవడానికి చర్మంపై UVB కిరణాలు నేరుగా పడటం చాలా ముఖ్యం. సూర్యుడు ఆకాశంలో తగినంత ఎత్తులో ఉన్నప్పుడు ఈ కిరణాలు అత్యధికంగా అందుబాటులో ఉంటాయి. అందుకే విటమిన్ డి ఉత్పత్తి కోసం ఉదయం కంటే మధ్యాహ్నం సమయం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. డాక్టర్ సుధీర్ కుమార్ సూచన ప్రకారం, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య సుమారు 15 నుంచి 30 నిమిషాల పాటు సూర్యరశ్మిని పొందడం వల్ల ఆశించిన ఫలితాలు ఉంటాయి. వారానికి కనీసం మూడు నుంచి నాలుగు రోజులు ఈ విధంగా మధ్యాహ్నపు ఎండలో గడపడం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా, మన శరీర చర్మంలో సుమారు 20 నుంచి 30 శాతం మేర సూర్యరశ్మికి గురికావడం కూడా విటమిన్ డి ఉత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన సూచనగా నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, అందరికీ ఒకే రకమైన సమయం సరిపోతుందని చెప్పలేం; చర్మం రంగు, ధరించే దుస్తులు, వాతావరణ పరిస్థితులు, కాలాలు, భౌగోళిక ప్రాంతం మరియు UV కిరణాల తీవ్రతను బట్టి శరీరంలో తయారయ్యే విటమిన్ డి పరిమాణంలో మార్పులుంటాయి. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ఎక్కువసేపు బయట ఉండటం వల్ల చర్మం కాలిపోవడం వంటి వేడి సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున, విటమిన్ డి కోసం ఎప్పుడూ అతిగా ఎండలో గడపకూడదని గుర్తుంచుకోవాలి.     Vitamin D Deficiency, Midday Sun Exposure, UVB Rays, Sunlight Timing, Bone Health, Indian Skin Tone, Melanin and Vitamin D, Sunlight Benefits, Sun Safety, Vitamin D Supplements.
ప్రస్తుత కాలంలో గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక గుండె సంబంధిత సమస్యలు చాలా మందిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. వయసు పెరగడం, వంశపారంపర్య కారణాలు మరియు ఇప్పటికే గుండె సమస్యలు ఉండటంతో పాటు, మన ఆధునిక రోజువారీ జీవనశైలి కూడా గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. భారత్‌లో గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో వైద్య సహాయం అందకపోవడం, ప్రాథమిక ప్రాణరక్షణపై అవగాహన తక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగించే విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు, అమెరికా వంటి దేశాల్లో కార్డియాక్ అరెస్ట్‌ నుంచి బయటపడే అవకాశాలు సుమారు 15 నుంచి 20 శాతం వరకు ఉండగా, భారత్‌లో మాత్రం అవి 10 శాతం కంటే తక్కువగా ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, హార్వర్డ్ హెల్త్ నిపుణుల సూచనల ప్రకారం.. కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు, సరైన ఆహారం, తగిన వ్యాయామం మరియు నిద్ర వంటి మూడు కీలక అలవాట్లను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా గుండెపోటు, స్ట్రోక్ ముప్పును ఏకంగా 80 శాతం వరకు తగ్గించుకోవచ్చని తేలింది. మొదటిగా, మన ఆహారపు అలవాట్లలో సమూలమైన మార్పులు చేసుకోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత ముఖ్యం. మొక్కల ఆధారిత ఆహారం లేదా మెడిటరేనియన్ డైట్ విధానాన్ని అనుసరించడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ డైట్‌లో తృణధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, డ్రై నట్స్‌ మరియు ఆరోగ్యకరమైన నూనెలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను వీలైనంత వరకు పరిమితం చేయడం చాలా అవసరం. ఒకవేళ మద్యం సేవించే అలవాటు ఉంటే దాని పరిమాణంపై కూడా తీవ్రమైన శ్రద్ధ పెట్టాలి. వారానికి 100 గ్రాముల కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు మరియు అకాల మరణాల ముప్పు పెరుగుతుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమతుల్యమైన మరియు పౌష్టికాహారాన్ని ఎంచుకోవడం చాలా మంచిది. రెండవదిగా, శారీరక చురుకుదనం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గుండెను పదిలంగా ఉంచుతుంది. శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకే చోట కూర్చుని ఉండటం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాల పాటు మితమైన తీవ్రతతో కూడిన ఏరోబిక్ వ్యాయామం చేయాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అంటే వారంలో కనీసం ఐదు రోజులు రోజుకు 30 నిమిషాల చొప్పున వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వేగంగా నడవడం, ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేయడం, ఈత కొట్టడం లేదా సైక్లింగ్ చేయడం వంటి వాటిని ఎంచుకోవచ్చు. కేవలం వ్యాయామ సమయమే కాకుండా, రోజంతా చురుగ్గా ఉండటం ముఖ్యం. ఎక్కువసేపు కూర్చునేవారు ప్రతి గంటకు ఐదు నిమిషాల పాటు నడవడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారా రోజువారీ శారీరక చురుకుదనాన్ని పెంచుకోవచ్చు. చివరిగా, ఆహారం మరియు వ్యాయామంతో పాటు నిద్ర కూడా గుండె ఆరోగ్యానికి సమానంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. పెద్దలు ప్రతిరోజూ రాత్రి పూట కనీసం ఏడు గంటల గాఢమైన నిద్ర పొందాలని నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఒత్తిడి స్థాయిలు విపరీతంగా పెరగడం, వాపు సంబంధిత ప్రక్రియలు ప్రభావితం కావడం మరియు అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ నేరుగా గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. అందువల్ల ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రకు తగినంత సమయం కేటాయించడం చాలా ముఖ్యం. అంతేగాక, గుండె సమస్యలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సొంతంగా ఆస్పిరిన్ మాత్రలను వేసుకోవడం చాలా ప్రమాదకరమని, వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.     Heart Attack Prevention, Lower Heart Attack Risk, Heart Health Habits, Cardiovascular Health, Preventive Cardiology, Daily Exercise, Healthy Diet, Quality Sleep, Harvard Health Tips, Lifestyle Medicine.
ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో మన శరీర ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పూర్తిగా మన ప్రేగులలో ఉండే సూక్ష్మజీవుల (గుట్ బాక్టీరియా) సమతుల్యతపై ఆధారపడి ఉంటున్నాయని అనేక శాస్త్రీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మానవ శరీరంలోని ప్రేగులలో సుమారు 1000 రకాల సూక్ష్మజీవులు లేదా బాక్టీరియాలు నివసిస్తుంటాయి. వీటిలో మంచి బాక్టీరియా మరియు చెడ్డ బాక్టీరియా అనే రెండు ప్రధాన రకాలుంటాయి. ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యత ఉన్నప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడు. ఒకవేళ ఈ సమతుల్యత దెబ్బతింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదల, గుండె జబ్బులు, మధుమేహం (షుగర్), ఊబకాయం, నిరంతరం మానసిక ఒత్తిడి మరియు తీవ్రమైన ఆందోళన వంటి అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే శిశువు ప్రేగులలోని బాక్టీరియా వృద్ధి ప్రక్రియ ప్రారంభమవుతుంది. గర్భవతిగా ఉన్న సమయంలో ఫైబర్, ప్రోటీన్లు మరియు తగిన పోషకాలు లేని వేయించిన పదార్థాలు, పులుసులు, పచ్చళ్ళు వంటి ఆహారాన్ని తీసుకుంటే, పుట్టకముందే బిడ్డలో చెడ్డ బాక్టీరియా పెరిగి మంచి బాక్టీరియా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, బిడ్డకు ఆరు నెలల నుండి ఒక ఏడాది వయసు వచ్చే వరకు తప్పనిసరిగా తల్లిపాలు ఇవ్వడం వల్ల మంచి బాక్టీరియా బాగా వృద్ధి చెంది చెడ్డ బాక్టీరియా అదుపులో ఉంటుంది. ఈ ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు శరీరానికి రోజంతా శక్తిని అందించడంలో పీచు పదార్థాల పాత్ర చాలా కీలకం. సరిగా అరగని మరియు కరగని పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు మన ప్రేగులలోని మంచి బాక్టీరియాకు అద్భుతమైన ఆహారంగా పనిచేస్తాయి. ముఖ్యంగా సాయంత్రం పూట గుప్పెడు కందిపప్పు వంటి పప్పుధాన్యాలను పొట్టు తీయకుండా తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కందిపప్పుతో పాటు పెసరపప్పు, శనగపప్పు, మినప్పప్పు వంటి వాటిని తొక్క తొలగించకుండా వినియోగించడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే, పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన పిండితో చేసిన అట్లు మరియు ఇడ్లీలలో మంచి బాక్టీరియా పుష్కలంగా వృద్ధి చెందుతుంది. పాలిష్ పట్టని ముడి బియ్యం, వివిధ రకాల మిల్లెట్లు, వాటితో తయారు చేసిన రవ్వలు, మల్టీగ్రెయిన్ పుల్కా వంటివి అధిక పీచును అందించి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజువారీ ఆహారంలో వాల్‌నట్స్, బాదం, పిస్తా, గుమ్మడి గింజలు మరియు పొద్దుతిరుగుడు గింజలు వంటి విత్తనాలను చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, పీచు లభించి మంచి బ్యాక్టీరియా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీనికి విరుద్ధంగా తెల్లటి బియ్యం, మైదా పిండి, తెల్లటి రవ్వ మరియు పంచదార వంటివి పీచు పదార్థాలు లేకుండా నేరుగా చక్కెరగా మారి చెడ్డ బాక్టీరియాను గణనీయంగా పెంచుతాయి. రసాయనాలు, కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు మరియు ప్రిజర్వేటివ్స్ కలిపిన ప్యాక్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ప్రేగు వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి, సహజసిద్ధమైన పీచు పదార్థాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని అలవరుచుకోవడం ద్వారా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారి నుండి సులభంగా రక్షణ పొందవచ్చు.     Toor Dal Benefits, Kandipappu Health Benefits, Gut Microbiome, Good Gut Bacteria, Digestive Health, Plant Protein, Sustained Energy, Nutrition & Diet, Prebiotics, Indian Pulses.  
ఈ రోజుల్లో బరువు తగ్గడానికో లేదా ఆరోగ్యం కోసమో చాలామంది ఉపవాసాలు చేస్తుంటారు. అయితే, సరైన అవగాహన లేకుండా ఉపవాసం చేస్తే వయసు త్వరగా మళ్లినట్లు కనిపిస్తారని, వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అసలు ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో  చాలా మందికి తెలియదు. ఉపవాసం సరైన విధానంలో చేస్తేనే అది శరీరానికి మేలు చేస్తుంది. ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం తప్పుగా చేస్తే జరిగేది ఏంటి?  వివరంగా తెలుసుకుంటే.. ఉపవాసం చేస్తే వృద్ధాప్యం రావడానికి  కారణాలు..   పోషకాహార లోపం.. ఉపవాసం ఉండే సమయంలో లేదా ఉపవాసం పూర్తయిన తర్వాత శరీరానికి కావలసినంత విటమిన్లు, మినరల్స్ , ప్రోటీన్లు తీసుకోకపోతే చర్మం తన మెరుపును కోల్పోతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు వచ్చి చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు. కండరాల క్షీణత.. సరైన ప్రోటీన్ ఆహారం తీసుకోకుండా ఎక్కువ సమయం ఆకలితో అలమటిస్తే, శరీరం కొవ్వుతో పాటు కండరాల కణజాలాన్ని కరిగించడం ప్రారంభిస్తుంది. కండరాలు తగ్గడం వల్ల శరీరం , ముఖం వేలాడబడినట్లు అయి, వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి. డీహైడ్రేషన్.. ఉపవాసం సమయంలో చాలామంది నీళ్లు తాగడం తగ్గించేస్తారు. శరీరంలో నీటి శాతం తగ్గితే చర్మం పొడిబారిపోయి, మెరుపు తగ్గిపోతుంది. ఇది కూడా త్వరగా ముసలితనం రావడానికి ఒక ప్రధాన కారణం. తీవ్రమైన ఒత్తిడి.. పద్ధతి లేకుండా కఠినమైన ఉపవాసాలు చేయడం వల్ల శరీరంలో కోర్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. ఈ హార్మోన్ అధికమైతే చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజెన్ అనే ప్రోటీన్ దెబ్బతింటుంది. ఉపవాసం సరిగ్గా చేయాలంటే ఏం చేయాలి? ఉపవాసం అనేది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి చర్మాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి కానీ దెబ్బతీయకూడదు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.. ఉపవాసం ఉన్న సమయంలో , మిగతా సమయంలో తగినంత నీరు, నిమ్మరసం లేదా కొబ్బరిబోండాలు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఉపవాసం విరమించేటప్పుడు నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ కాకుండా పండ్లు, ఆకుకూరలు, ప్రోటీన్ ఉన్న మంచి పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఒకేసారి కఠినమైన ఉపవాసాలు ప్రారంభించకుండా, చిన్నగా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణుల లేదా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే ఉపవాసాలు చేయడం శ్రేయస్కరం. సరైన పద్ధతిలో చేసే ఉపవాసం యవ్వనాన్ని అందిస్తుంది. కానీ అవగాహన లేని ఉపవాసం వృద్ధాప్యానికి దారితీస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన పద్ధతులను పాటిస్తూ ఉపవాసం ఉండటమే శ్రేయస్కరం.                         • రూపశ్రీ.
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా..ఈ తప్పే కారణం కావచ్చు! బరువు తగ్గడం అనేది ఒక ప్రయాణం. ఈ క్రమంలో చాలామంది వేగంగా ఫలితాలు సాధించాలనే తొందరలో కొన్ని తీవ్రమైన పొరపాట్లు చేస్తుంటారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పడే శ్రమ, సరైన పద్ధతిలో లేకపోతే ఆరోగ్యానికి మేలు జరగకపోగా తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వెయిట్ లాస్ జర్నీలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని చెప్పే ప్రధానమైన తప్పులు, వాటి వల్ల కలిగే నష్టాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే.. ఆహారాన్ని పూర్తిగా తగ్గించడం లేదా స్కిప్ చేయడం.. బరువు తగ్గే క్రమంలో చాలామంది చేసే అతి పెద్ద పొరపాటు. త్వరగా బరువు తగ్గవచ్చనే అపోహతో ఉదయం పూట టిఫిన్ లేదా రాత్రి భోజనాన్ని మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందదు. దాంతో తీవ్రమైన అలసట, నీరసం ఏర్పడతాయి. అంతేకాకుండా, తర్వాత పూట అతిగా తినే ప్రమాదం పెరుగుతుంది. ఇది బరువు తగ్గించడానికి బదులు మరింత పెరగడానికి కారణమవుతుంది. ఎనర్జీ, కేలరీల ప్రాధాన్యతను విస్మరించడం.. కేలరీలను తగ్గించుకోవాలనే ఆలోచనలో శరీర జీవక్రియలకు అవసరమైన కనీస శక్తిని కూడా ఇవ్వకపోవడం సరైనది కాదు. రోజువారీ పనులు చేసుకోవడానికి, ఉత్సాహంగా ఉండటానికి సరైన పరిమాణంలో క్యాలరీలు అవసరం. అతి తక్కువ కేలరీల ఆహారం తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు మందగిస్తుంది. ఫలితంగా శరీరం కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. పోషకాహార లోపం..  బరువు తగ్గే ప్రక్రియలో ఎదురయ్యే ప్రధాన సమస్య. కేవలం కేలరీల లెక్కింపు పైనే దృష్టి పెట్టి, తింటున్న ఆహారంలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్, ఫైబర్ ఉన్నాయో లేదో గమనించకపోవడం పెద్ద తప్పు. కార్బోహైడ్రేట్లు లేదా కొవ్వులను పూర్తిగా పక్కన పెట్టేయడం వల్ల శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందవు. దీనివల్ల జుట్టు రాలడం, చర్మం నిస్తేజంగా మారడం, ఎముకలు బలహీనపడటం , రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నీరు తగినంత తీసుకోకపోవడం.. నీరు తగినంత తీసుకోకపోవడం  శరీరంలో కొవ్వును కరిగించే వ్యవస్థను దెబ్బతీస్తుంది. చాలామంది దప్పికను, ఆకలిని సరిగా గుర్తుపట్టలేక దప్పికైనప్పుడు కూడా ఏదో ఒకటి తింటూ ఉంటారు. ప్రతిరోజూ శరీరానికి అవసరమైన స్థాయిలో నీరు తాగడం వల్ల టాక్సిన్లు బయటకు పోవడమే కాకుండా, జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. వ్యాయామం.. వ్యాయామం విషయంలో కూడా తీవ్రమైన తేడాలు కనిపిస్తుంటాయి. కొందరు అసలు వ్యాయామమే చేయకుండా కేవలం డైటింగ్ పై ఆధారపడితే, మరికొందరు మితిమీరిన వ్యాయామాలు చేస్తుంటారు. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకుండా నిరంతరం కష్టపెట్టడం వల్ల కండరాల బలహీన పడతాయి,  గాయాలు అయ్యే అవకాశం ఉంది. నిద్ర.. బరువు తగ్గే ప్రయాణంలో నిద్ర పాత్ర చాలా కీలకమైనది. సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని ఆకలిని పెంచే హార్మోన్లు విడుదలవుతాయి. మానసిక ఒత్తిడి.. మానసిక ఒత్తిడి కూడా బరువు తగ్గే ప్రక్రియకు పెద్ద అడ్డంకి. ఒత్తిడి వల్ల కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలై పొత్తికడుపు భాగంలో కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. ప్రతిరోజూ బరువు చూసుకుంటూ తీవ్ర ఆందోళనకు గురికావడం వల్ల కూడా ఎలాంటి పాజిటివ్ ఫలితాలు రావు. బరువు తగ్గడం అనేది చాలా చిన్న  ప్రక్రియ కాదు, అదొక ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పు. ఎనర్జీ , పోషకాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, సమతుల్యాహారాన్ని సరిపడా పరిమాణంలో తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, మంచి నీరు బాగా తాగడం వంటి అలవాటు పాటించడం ద్వారా మాత్రమే పూర్తిగా బరువు తగ్గడం లో   ఆరోగ్యకరమైన ఫలితాలను పొందవచ్చు.                          *రూపశ్రీ.
నేటి ఆధునిక జీవనశైలిలో మనిషి అలవాట్ల నుండి ఆహారం వరకు అన్నీ మారిపోయాయి.  ఉదయాన్నే ఆఫీసులకు పరిగెత్తే హడావుడిలోనో లేదా సాయంత్రం వేళల్లో కాస్త  ఆకలి వేసినా సరే.. ఇంట్లో వండుకోవడం లేదా బయట వండినవి తినడానికి బదులుగా..   ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపైన డిపెండ్ అవుతున్నారు. సూపర్ మార్కెట్ షెల్ఫుల్లో ఆకర్షణీయమైన రంగురంగుల ప్యాకెట్లలో మెరిసిపోయే చిప్స్, ఇన్స్టెంట్ నూడుల్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, రెడీ టూ ఈట్ వంటకాలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరి జీవితాల్లోనూ భాగమైపోయాయి. వీటిని ప్యాకెట్ విప్పడం, వెంటనే తినేయడం చాలా సులభం. రుచి కూడా నాలుకను బాగా ఆకట్టుకుంటుంది. అయితే, ఈ సౌకర్యం వెనుక మన ఆరోగ్యాన్ని క్షీణింపజేసే పెను ప్రమాదం దాగి ఉందన్న విషయం  చాలామంది గమనించడం లేదు. ఆరోగ్య నిపుణులు, వైద్య ప్రపంచం ఇప్పుడు ఈ ఆహారాల పట్ల చాలా ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ ప్యాకింగ్ ఆహారాలు  శరీరంలోకి వెళ్లిన తర్వాత ఎలాంటి దుష్ప్రభావాలు చూపుతాయో వివరంగా తెలుసుకుంటే.. ప్యాక్ ఫుడ్ లేదా ప్రాసేస్ ఫుడ్.. ప్యాక్ చేసిన లేదా ఫ్యాక్టరీలలో ప్రాసెస్ చేసిన ఆహారాలను  ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని పిలుస్తారు. వీటిని తయారుచేసే విధానంలో రుచి, రంగు, వాసన ఎక్కువ కాలం నిలిచి ఉండటానికి అనేక రకాల రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు , అడిటివ్‌లను కలుపుతారు. ఈ తరహా ఆహారాలలో కేలరీలు, ఉప్పు, చక్కెర, హానికరమైన క్రొవ్వు పదార్థాలు చాలా అధిక పరిమాణంలో ఉంటాయి. విచారకరమైన విషయమేమిటంటే, శరీరానికి అత్యంత అవసరమైన పీచు పదార్థం , విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు వీటిలో దాదాపు శూన్యం. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు శరీరంలోకి చేరడం వల్ల జీర్ణవ్యవస్థపై విపరీతమైన భారం పడుతుంది. పోషకాలు లేని ఈ ఖాళీ కేలరీలు అనారోగ్యానికి మూలకారకాలుగా మారుతాయి. ప్యాకేజ్ లేదా ప్రాసెస్ ఫుడ్స్ తినడం వల్ల జరిగేది ఏంటి ? ఈ ప్రాసెస్డ్ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎదురయ్యే ప్రధాన సమస్య విపరీతమైన బరువు పెరగడం. చిన్న వయస్సులోనే పిల్లలు, యవ్వనంలో ఉన్నవారు ఊబకాయం బారిన పడటానికి ఈ అలవాటే ప్రధాన కారణమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి శరీరంలోకి చేరిన తర్వాత తొందరగా  కొవ్వుగా మారి పేరుకుపోతాయి. అలాగే, వీటిలో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచేస్తాయి. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి, కాలక్రమేణా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఇక్కడితోనే ఆగకుండా, ప్యాకెట్ ఆహారాలలో అధికంగా ఉండే సోడియం అంటే ఉప్పు , సంతృప్త కొవ్వుల వల్ల రక్తపోటు హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు, కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తుంది. జీర్ణవ్యవస్థ.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందడానికి పీచు పదార్థం చాలా ముఖ్యం. కానీ ప్యాక్ చేసిన ఆహారాలలో ఈ ఫైబర్ కంటెంట్ బొత్తిగా ఉండదు. ఫలితంగా దీర్ఘకాలిక మలబద్ధకం, పేగుల వ్యాధులు , జీర్ణక్రియ లోపాలు ఎదురవుతాయి. తీవ్రమైన సందర్భాల్లో ఇటువంటి ఆహార అలవాట్లు వివిధ రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా పెంచుతాయని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ప్యాకెట్లపై కనిపించే ఆకర్షణీయమైన అడ్వర్టైజ్మెంట్లు ప్రజలను   బలహీనులను చేస్తాయి. అందుకే వాటి వైపు చాలా ఆకర్షితులు అవుతారు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవడానికి కొంత ముందస్తు జాగ్రత్త వహించడం తప్పనిసరి. ఏదైనా ప్యాక్ చేసిన ఆహారాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఆ ప్యాకెట్ వెనుక ఉన్న న్యూట్రిషన్ లేబుల్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. అందులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వుల పరిమాణం ఎంత ఉందో తెలుసుకోవాలి. ఎప్పుడూ  బయట దొరికే ప్రాసెస్డ్ స్నాక్స్ స్థానంలో తాజా పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్  వంటి సహజమైన ఆహారాన్ని మన దినచర్యలో భాగం చేసుకోవాలి. మన శరీరం మనం తినే ఆహారంతోనే నిర్మితమవుతుంది కాబట్టి, నోటికి ఇచ్చే తాత్కాలిక రుచి కంటే శరీరానికి ఇచ్చే శాశ్వత ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వడం శ్రేయస్కరం.                                                                                                                                                                                                                                                                                                            *రూపశ్రీ.