అమరావతి రైతులు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారన్న వార్త సంచలనం సృష్టించింది. నిన్నమొన్నటి వరకు జగన్ ను, ఆయన మూడు రాజధానుల సిద్ధాంతాన్నీ తీవ్రాతి తీవ్రంగా వ్యతిరేకించిన వారే  నేడు తమ సమస్యల పరిష్కారం కోసం అదే గడప తొక్కడం ఏంటన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. వైసీపీ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన వేలాది మంది రైతులు సుదీర్ఘ కాలం పాటు రోడ్లెక్కి నిరసనలు ప్రదర్శించారు. జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.   తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం (జూన్ 2) జగన్- అమరావతి రైతుల భేటీ జరిగింది. అయితే..  గతంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా   సుదీర్ఘ  పోరాటాలు, పాదయాత్రలు చేసిన పాత అమరావతి రైతుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ భేటీలో లేరు. వీరంతా  ‘కొత్త రైతులు’   ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి విస్తరణ కోసం రెండో విడత భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నూతనంగా భూములు కోల్పోతున్న కొందరు రైతులకు ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు అందుకున్న రైతుల్లో కొందరు  తమకు  అన్యాయం జరుగుతోందంటూ  జగన్ వద్దకు వచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ లోపలా, వెలుపలా గళం విప్పాలని.. తమ పక్షాన నిలబడి కూటమి ప్రభుత్వంపై పోరాడాలని వారు జగన్ ను కోరారు.  వీరిలో అత్యధికులు నాడు భూ సమీకరణను వ్యతిరేకించిన వారే కావడం గమనార్హం. మొత్తం మీద కొత్త రైతులకు అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. 
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఇటీవల జరిగిన  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రిగ కజగం (టీవీకే) రెండు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఉన్న ద్రావిడ పార్టీలను చిత్తు చేసి ఏకంగా అధికార పీఠాన్ని దక్కించుకుంది.   ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టడంతో తమిళ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. అక్కడ జరుగుతున్న ప్రతి చిన్న రాజకీయ పరిణామం దేశ వ్యాప్తంగా  ఆసక్తికర చర్చకు తెరలేపుతోంది. తాజాగా అప్పు డే రాబోయే 2031 అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలపై పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.  ఐదేళ్ల తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు విజయ్ వర్సెస్ అన్నామలై గా మారతాయంటూ విశ్లేషకులు పెద్ద చర్చకు తెరలేపారు.   అయితే వాదనలు, చర్చ,  క్షేత్రస్థాయిలో ఎంతవరకు కార్యరూపం దాలుస్తాయనే దానిపై రాజకీయ వర్గాల్లో  భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నూతన సీఎం విజయ్ ఎన్నికలకు సరిగ్గా రెండేళ్ల ముందుగానే తన రాజకీయ పార్టీని ప్రకటించి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా.. ఆరెండేళ్లూ..  నిరంతరం ప్రజల్లోనే తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను,   ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్   సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన  రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.    మరోవైపు బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన భవిష్యత్తు రాజకీయ చిత్రంపై ఇప్పటికీ స్పష్టత కొరవడింది.  ఒకప్పుడు కర్ణాటక క్యాడర్ లో సమర్థుడైన ఐపీఎస్ అధికారిగా సేవలందించిన అన్నామలై.. తన సివిల్ సర్వెంట్ పదవికి రాజీనామా చేసి మరీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. కమలం పార్టీలో చేరిన వెంటనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో దూకుడు నిర్ణయాలతో ఆకట్టుకున్నారు. గతంలో డిఎంకె ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఒక నిరసనలో బహిరంగంగా తనను తాను కొరడాతో కొట్టుకుని దేశవ్యాప్తంగా అందరి దృష్టి  ఆకర్షించారు. అయితే ప్రస్తుతం ఆయన బీజేపీని వీడడంతో ఆయన రాజకీయ పయనం ఎటు వైపు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ అన్నామలై  సొంతంగా ముందుకు సాగినా విజయ్ స్థాయిలో ప్రజాదరణను, ఓట్లను సాధించడం దాదాపు అసాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఒక జాతీయ పార్టీలో పనిచేసి, దానిని వీడి తన రాజకీయ అపరిపక్వతను ఆయనంతట ఆయనే స్వయంగా  బయటపెట్టుకున్నారంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ వెనుక కోట్లాది మంది అభిమానులు, బలమైన కేడర్ ఉండి  ఓట్లు వేసి గెలిపించారు. కానీ..  అన్నామలైకి ఆ స్థాయిలో ఓట్లు వేసి గెలిపించే  ఓటు బ్యాంక్  లేదని అంటున్నారు.  
కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన, తిరుగులేని  ట్రబుల్‌షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్  కర్నాటక సీఎంగా బుధవారం (జూన్ 2) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కర్నాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎన్నో  ఒడుదొడుకులు, సుదీర్ఘ నిరీక్షణల అనంతరం డీకే కర్ణాటక రాష్ట్ర  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.  ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, పార్టీని సంక్షోభాల నుంచి ఒంటిచేత్తో  బయటపడేసిన  64 ఏళ్ల ఈ సీనియర్ నాయకుడి కల ఎట్టకేలకు సాకారమైంది. డీకేకి సీఎం పదవి దక్కడంతో   కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. కర్ణాటక శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన శివకుమార్, ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని  ప్రకటించారు. నెహ్రూ-గాంధీ కుటుంబం తనపై ఉంచిన అపారమైన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రైతులు, మహిళలు, యువత భాగస్వామ్యంతో రాష్ట్రంలో  నవ యుగం' సృష్టిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి బెంగళూరులోని లోక్‌భవన్‌ గ్లాస్ హౌస్ ముస్తాబైంది. బుధవారం సాయంత్రం  రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. డీకే శివకుమార్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ వేడుకలో జ్యోతిష్యుల సలహాలు, సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లోని ప్రధాన వేదికను పడమర ముఖం నుంచి తూర్పు ముఖంగా మార్చారు. డీకే శివకుమార్‌తో పాటు తొలి విడత   13 మంది కీలక నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుల, ప్రాంతీయ సమీకరణాలను సమతూకం చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఈ మంత్రివర్గాన్ని కూర్చింది. ఇందులో భాగంగా సీనియర్ దళిత నాయకుడు జి.పరమేశ్వర రాష్ట్ర ఏకైక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనుండగా, మరో సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.  తొలి విడతలో ప్రమాణం చేయబోయే 13 మంది మంత్రుల   జాబితాలో మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యాతీంద్రతో పాటు, కేహెచ్ మునియప్ప, యూటీ ఖాదర్, కేజే జార్జ్, కృష్ణ బైరేగౌడ, ఎంబీ పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, దినేష్ గుండూరావు, బైరతి సురేష్, ఈశ్వర్ ఖండ్రే వంటి బలమైన నేతలకు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు, ఇప్పటివరకు రాష్ట్రాన్ని నడిపించి, అధికార మార్పిడి సజావుగా సాగేలా సహకరించిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  (సీడబ్ల్యుసీ) సభ్యుడిగా సిద్ధరామయ్యను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా డీకే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఉన్న ఇండియా కూటమికి చెందిన పలువురు ముఖ్యమంత్రులు, కర్ణాటకలోని వివిధ ప్రముఖ మఠాల అధిపతులు తరలివస్తున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) గత కొన్నేళ్లుగా ఎక్కువగా యాక్షన్ ప్యాక్డ్, పక్కా కమర్షియల్ మాస్ సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ వస్తున్నారు. అయితే ఈసారి ఆయన రూట్ మార్చారు. మునుపెన్నడూ చూడని ఒక విలక్షణమైన, హృదయాలకు హత్తుకునే సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.  'నిన్ను కోరి', 'మజిలీ' వంటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలను వెండితెరపై ఆవిష్కరించి క్లాస్ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న తాజా క్రేజీ చిత్రం 'ఇరుముడి' (Irumudi). మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదలై విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త గ్లింప్స్ రవితేజను ఒక ఎమోషనల్ ఫాదర్‌గా సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తోంది. (Irumudi Glimpse) 'హార్ట్ ఆఫ్ ఇరుముడి' పేరుతో విడుదలైన ఈ ప్రత్యేకమైన గ్లింప్స్, ఈ సినిమా కేవలం ఒక రెగ్యులర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదని, దీని వెనుక అంతకు మించిన ఒక బలమైన ఎమోషనల్ డ్రామా దాగి ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.  రవితేజను ఆయన రెగ్యులర్ హై-ఎనర్జీ జోన్ లో కాకుండా, చాలా క్లాస్‌గా, సెటిల్డ్‌గా ప్రెసెంట్ చేయడం విశేషం. ఎలివేషన్ డైలాగులు లేకుండా కేవలం హావభావాలు, భావోద్వేగాలతోనే ఈ గ్లింప్స్ సాగింది. ఒక తండ్రి-కూతురి మధ్య ఉండే సున్నితమైన అనుబంధం, కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత మరియు పశ్చాత్తాపం వంటి బలమైన ఎలిమెంట్స్ చుట్టూ ఈ కథను దర్శకుడు శివ నిర్వాణ ఎంతో అద్భుతంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.  ఈ చిత్రంలో రవితేజ కూతురిగా చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ పోస్టర్‌లో రవితేజ తన చిన్నారి కూతురితో కలిసి ఒక ఎత్తైన రాతి కొండపై కూర్చుని, సుదూర తీరాలను చూస్తూ ఉన్న దృశ్యం ప్రేక్షకులలో ఎంతో ఉత్సుకతను పెంచింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వచ్చిన గ్లింప్స్ కూడా రవితేజలోని వింటేజ్ నటుడిని బయటకు తీసి, ఒక సిన్సియర్ తండ్రిగా ఆయన రూపాంతరాన్ని అద్భుతంగా చూపించింది. గ్లింప్స్ ప్రారంభంలో తండ్రీకూతుళ్ల బాండింగ్ ను అద్భుతంగా ఆవిష్కరించారు. మధ్యలో రవితేజలోని వయలెంట్ యాంగిల్ ను కూడా చూపించారు. ఇక చివరిలో "మందు మానేయ్ నాన్న" అని కూతురు అడగటంతో, రవితేజ అయ్యప్ప దీక్ష చేపట్టడం హృదయాలను హత్తుకునేలా ఉంది. అయ్యప్ప స్వామి ఆధ్యాత్మిక నేపథ్యంతో పాటు ఫాదర్ సెంటిమెంట్ కలగలిసిన ఈ 'ఇరుముడి' రవితేజ కెరీర్‌లోనే ఒక మైల్‌స్టోన్ మూవీగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  
పెద్ది(Peddi)తో దర్శకుడు బుచ్చిబాబు మరో సారి తన సత్తా చాటడానికి సిద్దమయ్యాడు. తన మొదటి మూవీ ఉప్పెన అత్యంత సెన్సిటివ్ సబ్జెట్ తో తెరకెక్కింది. కానీ  బుచ్చిబాబు చాలా తెలివిగా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఉప్పెన ని  చూస్తున్నంత సేపు తొలి చిత్రమని ఎవరు అనుకోరు. అంతలా తన టేకింగ్ తో మెస్మరైజ్ చేసాడు. కానీ  టాలీవుడ్‌లో ఎప్పటినుంచో ఒక బలమైన సెంటిమెంట్ ఇండస్ట్రీ వర్గాలని, ప్రేక్షకులని  భయపెడుతూనే ఉంది. మొదటి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసి, బ్లాక్‌బస్టర్ హిట్‌ కొట్టిన దర్శకులకి తమ రెండవ సినిమా దగ్గరకి వచ్చేసరికి ఫ్లాప్ ని అందుకుంటారనే నమ్మకం ఉంది. ఈ సెకండ్ మూవీ సెంటిమెంట్ ఎంతో మంది టాలెంటెడ్ దర్శకుల కెరీర్‌పై ప్రభావం చూపించింది. ఇప్పుడు సరిగ్గా ఇదే సెంటిమెంట్ ముంగిట నిలబడ్డారు  బుచ్చిబాబు. ఉప్పెనతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన బుచ్చిబాబు, ఇప్పుడు తన రెండవ చిత్రానికి సంబంధించి ట్రేడ్ సర్కిల్ లో వినపడే సెంటిమెంట్‌ని బద్దలు కొడతారా లేదా అన్నది సినీ వర్గాల్లో  హాట్ టాపిక్‌గా మారింది. గతంలో రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులు సైతం తమ రెండవ సినిమాతో విజయం సాధించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అయితే, చాలా మంది కొత్త దర్శకులు మొదటి సినిమాతో ఉన్నపళంగా స్టార్ స్టేటస్ తెచ్చుకుని, రెండవ సినిమా విషయంలో కథపై పట్టు కోల్పోయి బోల్తా పడిన దాఖలాలు 80 శాతానికి పైగా ఉన్నాయి. కానీ బుచ్చిబాబు మాత్రం ఈ సెంటిమెంట్‌ని  ఏమాత్రం లెక్కచేయకుండా, ఏకంగా  350 కోట్ల భారీ బడ్జెట్‌తో  చరణ్‌ని  డైరెక్ట్ చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. పైగా పెద్ది కోసం ఐదు సంవత్సరాలు వెయిట్ చేసాడు.  ట్రైలర్ తో పాటు ప్రచార చిత్రాలైతే ఒక రేంజ్ లో ఉన్నాయి. Also read: Peddi: పెద్ది ఫస్ట్ డే కొట్టబోయే కలెక్షన్స్ ఇవేనా! ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరణ్ తో పాటు, మిగతా నటీనటులు, నిర్మాతలు బుచ్చిబాబు గురించి చెప్పిన దాన్ని బట్టి చూస్తే రెండవ సినిమా గండాన్ని దాటతాడనే అనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడనున్నాయి. ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం, 'పెద్ది' మొదటి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని వరల్డ్  బాక్సాఫీస్ వద్ద సుమారు 100 కోట్ల గ్రాస్ ని రాబట్టే అవకాశం ఉందని చెప్తున్నారు.   
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడానికి సర్వం సిద్ధమైంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలోకి రాబోతోంది. రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో మరియు అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న సినిమా కావడంతో మెగా అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచం ఈ సినిమా రిలీజ్ కోసం వేల కళ్లతో ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు అందిన ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ మరియు థియేట్రికల్ రన్ అంకెలు ఇండస్ట్రీ వర్గాల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడానికి సిద్ధమైన 'పెద్ది' చిత్రం వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ పరంగా భారీ వాల్యూను సొంతం చేసుకుంది. ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ దాదాపు రూ. 220 కోట్లకు క్లోజ్ అయింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఈ చిత్రం ఏకంగా రూ. 135 కోట్లకు పైగా భారీ థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుంది. చరణ్ మాస్ ఇమేజ్, బుచ్చిబాబు కంటెంట్ పై ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రం కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ భారీ బిజినెస్ టార్గెట్‌ను అందుకోవడానికి మేకర్స్ 'పెద్ది' చిత్రాన్ని గ్లోబల్ వైడ్‌గా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 1500 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా స్క్రీన్స్ కౌంట్ 2700 కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4000 స్క్రీన్స్ లో విడుదలకు ప్లాన్ చేశారని సమాచారం. చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో టికెట్ ధరల పెంపునకు కూడా ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున టికెట్ ధరలను పెంచుతూ, రోజుకు ఐదు ప్రదర్శనలు (5 Shows) వేసుకోవడానికి 10 రోజుల పాటు అనుమతులు లభించాయి. జూన్ 3 రాత్రి 8 గంటల నుంచే రూ. 600 టికెట్ ధరతో ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.   
After spending the last few years largely in action-heavy commercial space, Ravi Teja is taking a different route with Irumudi. The first glimpse of the film positions it as an emotional drama built around a father-daughter relationship, with director Shiva Nirvana leaning into themes of family, redemption and spirituality. The glimpse introduces Ravi Teja and Baby Nakshathra living a quiet life in a secluded setting near a waterfall. Rather than presenting the actor in his usual high-energy zone, the glimpse opts for a restrained approach, focusing more on interactions and mood than dialogue or elevation moments. One of the key ideas revealed in the teaser is Ravi Teja’s character struggling with alcoholism before choosing to take Ayyappa Deeksha following his daughter’s request. The glimpse doesn’t explain the larger context but hints that this decision could become the emotional turning point of the story. Visually, the film carries a softer tone compared to Ravi Teja’s recent outings. GV Prakash Kumar’s background score complements that atmosphere without overpowering the emotions being conveyed. Mythri Movie Makers production values are impressive and Priya Bhavani Shankar is playing leading lady role.  While the glimpse doesn’t reveal much about the conflict, it succeeds in communicating the film’s intent — a character-driven drama that places emotional connection ahead of spectacle and leaves curiosity about what lies beneath the protagonist’s past. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'(Peddi)గా వరల్డ్ వైడ్ థియేటర్స్ లో ల్యాండ్ కానున్నాడు. దీంతో మెగా అభిమానుల్లో, మూవీ లవర్స్ లో సందడి వాతావరణం నెలకొని ఉంది. ఫస్ట్ డేకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ యుఎస్ నుంచి ఉత్తరాంధ్ర వరకు భారీ ఎత్తున జరగడంతో తొలి రోజు పెద్ది సాధించే కలెక్షన్స్ పై ఫ్యాన్స్ తో పాటు సినీ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం, 'పెద్ది' చిత్రం మొదటి రోజు ప్రీమియర్స్ తో కలుపుకొని వరల్డ్  బాక్సాఫీస్ వద్ద సుమారు 100 కోట్ల గ్రాస్ ని రాబట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ చూపిస్తున్నాయి.ఓవర్సీస్ మార్కెట్లలో 'పెద్ది' అడ్వాన్స్ బుకింగ్స్ వన్ మిలియన్ కి చేరింది. ఇండియా వైడ్ గా లెక్కలు రావాల్సి ఉంది. పైగా ఈ రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. ఈ లెక్కన 100 కోట్లు సాధించే అవకాశం ఉందని టాక్  పాజిటివ్‌గా వస్తే, లాంగ్ రన్‌లో సరికొత్త రికార్డులని  అధిగమించడం ఖాయమని అంటున్నారు. Also read: Michael jackson: మైఖేల్ జాక్సన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. 7000 కోట్లు  మొన్న విజయవాడ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు బుచ్చిబాబు తో పాటు మిగతా నటీనటులు,నిర్మాతలు చెప్పిన దాన్ని బట్టి పెద్ది పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. రెహ్మాన్ మ్యూజిక్ నుంచి వచ్చిన సాంగ్స్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.  
Popular choreographer and dancer Pandu, known to Telugu audiences through the dance reality show Dhee, met with a road accident near Visakhapatnam and sustained serious injuries. The incident took place near Anandapuram on Wednesday while he was returning after attending an event at Tagarapuvalasa. According to reports, one of Pandu’s team members felt unwell during the journey, prompting the vehicle to stop on the roadside. Pandu reportedly stepped out of the car at that moment. A speeding vehicle coming from behind lost control and rammed into the parked vehicles, hitting Pandu in the process. The impact left Pandu with severe injuries to both legs. He was immediately shifted to a nearby private hospital, where he is currently undergoing treatment. Sources say his team and locals acted quickly to provide emergency assistance. Police have registered a case and started an investigation into the accident. Fans and well-wishers from the entertainment industry are hoping for his speedy recovery. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ కాప్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్' (Spirit). టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు యావత్ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.  ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ సెట్స్ నుంచి ప్రభాస్‌కు సంబంధించిన ఒక అఫీషియల్ లుక్ తరహా పిక్ ఇంటర్నెట్‌లో లీక్ అయి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ లీక్డ్ ఫోటోలో ప్రభాస్ ఎంతో స్టైలిష్‌గా, ముఖంపై చిరునవ్వుతో కనిపించి అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఐకానిక్ విమల్ థియేటర్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్ జరిగింది. ఈ షూటింగ్ గ్యాప్‌లో ప్రభాస్ తన పర్సనల్ స్టైలిస్ట్‌తో దిగిన సెల్ఫీ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ లీక్డ్ పిక్‌లో ప్రభాస్ బ్లాక్ డ్రెస్ ధరించి, బ్లూ కలర్ సన్‌గ్లాసెస్ పెట్టుకుని, నుదుటన తిలకంతో ఎంతో రాయల్‌గా కనిపిస్తున్నారు. ఆయన వింటేజ్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా, ఎక్కడా బ్రేక్స్ తీసుకోకుండా దర్శకుడు సందీప్ రెడ్డి తన మార్క్ ఎఫిషియంట్ ప్లానింగ్‌తో అత్యంత వేగంగా ఈ మూవీ షూటింగ్‌ను ముందుకు నడిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో సినిమాలోని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను భారీ ఎత్తున చిత్రీకరించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.  గతంలో 2026 నూతన సంవత్సర కానుకగా గాయాలతో ఉన్న ప్రభాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసి మేకర్స్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఫస్ట్ లుక్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తర్వాత, ఇప్పుడు వస్తున్న ప్రతి చిన్న అప్‌డేట్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది. ఈ హై-ఇంటెన్స్ కాప్ డ్రామాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో విలన్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌ కనిపించనున్నారు. భారీ తారాగణం, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027 మార్చి 5న విడుదల చేయడానికి చిత్రయూనిట్ డేట్‌ను లాక్ చేసింది. ప్రభాస్‌ను ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సిల్వర్ స్క్రీన్‌పై చూడటానికి అభిమానులు వేల కళ్లతో ఎదురుచూస్తున్నారు.  
  ప్రపంచ పాప్ పితామహుడు, కోట్లాది మంది అభిమానులు చేత కాలకృత్యాలు మాన్పించి తన పాటలని, డాన్స్ లని మాత్రమే చూసేలా చేసిన 'కింగ్ ఆఫ్ పాప్' మైఖేల్ జాక్సన్(Michael jackson). ఆ లెజండ్రీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ మూవీ 'మైఖేల్'(Michael). ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై వరల్డ్  బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని  సృష్టించింది. ప్రారంభంలో మిశ్రమ రివ్యూలు వచ్చినప్పటికీ  ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. దాంతో ఈ మ్యూజికల్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 850 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు  7,100 కోట్లు) భారీ వసూళ్లని  సాధించి, గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మన దగ్గర  కూడా అదే రోజు ఇంగ్లీష్ వెర్షన్‌లోనే రిలీజై 50 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలని  ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ గ్లోబల్ వండర్, ఇప్పుడు భారతీయ డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. రాబోయే వారం నుంచే ఈ చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. జూన్ 9,  నుండి ప్రముఖ ప్లాట్‌ఫారమ్ 'బుక్ మై షో స్ట్రీమ్' (BookMyShow Stream) లో డిజిటల్ ప్రీమియర్ కాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంగ్లీష్‌తో పాటు హిందీ లాంగ్వేజ్ లో  కూడా అందుబాటులో  ఉండనుంది. మొదటగా రెంటల్,కొనుగోలు విధానంలో అందుబాటులోకి రానుంది. అదే రోజున అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ వంటి ఇతర ప్రముఖ అంతర్జాతీయ వేదికల్లో కూడా రెంటల్ ప్రాతిపదికన విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బయోపిక్‌లో  ప్రధాన ఆకర్షణగా నిలిచిన అంశం ఏమిటంటే, మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన సొంత మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడం. మైఖేల్ జాక్సన్ యొక్క ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, స్టేజ్ ప్రెజెన్స్, ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఐకానిక్ డ్యాన్స్ స్టెప్స్ ,సిగ్నేచర్ మూమెంట్స్‌ని  జాఫర్ అద్భుతంగా పండించి ప్రేక్షకులని  ఆశ్చర్యపరిచారు. తెరపై ఆయనను చూసిన ఫ్యాన్స్, చాలా సందర్భాల్లో నిజంగానే మైఖేల్ జాక్సన్‌ని  మళ్లీ చూస్తున్నామనే ఎమోషనల్ ఫీలింగ్‌ పొందారు. 1960ల కాలంలో 'జాక్సన్ 5' బ్యాండ్‌తో మొదలైన మైఖేల్ ప్రస్థానం నుంచి, 1980ల చివర్లో 'బ్యాడ్ వరల్డ్ టూర్' ద్వారా సాధించిన గ్లోబల్ సక్సెస్ వరకు జరిగిన ప్రయాణాన్ని అద్భుతంగా చూపించారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించగా నియా లాంగ్, జూలియానో వాల్డి, కోల్మన్ డొమింగో, మైల్స్ టెల్లర్ వంటి నటీనటులు కీ రోల్స్   పోషించారు. థియేటర్లలో ఈ విజువల్ వండర్‌ని  మిస్ అయిన ఇండియన్ ఆడియన్స్‌ ఓ టిటిలో చూసి మైకేల్ జాక్సన్ ఇచ్చే మజాని పొందవచ్చు.     
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం పీక్స్‌లో ఉన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక పవర్‌ఫుల్ పెహల్వాన్ పాత్రలో నటిస్తుండటంతో, సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేశారు. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన నిజాలను వెల్లడించారు.  సినిమాలోని ఒక అత్యంత కీలకమైన కుస్తీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న తరుణంలో రామ్ చరణ్ కంటికి ఊహించని విధంగా తీవ్రమైన గాయమైంది. దెబ్బ తగిలిన వెంటనే రామ్ చరణ్ కంటి నుండి రక్తం కారిపోయింది. అదంతా లైవ్‌లో షూటింగ్ కెమెరాలోనే రికార్డ్ అయిపోయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కళ్లముందే రక్తంతో తడిసిపోవడం చూసి దర్శకుడు బుచ్చిబాబుకు ఒక్కసారిగా చేతులు, కాళ్లు ఆడలేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానించే ఒక అగ్ర హీరో తన సెట్స్‌లో ఇలా రక్తగాయంతో పడిపోవడంతో బుచ్చిబాబు విపరీతమైన భయాందోళనలకు గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ విషయం తెలిస్తే అసలు ఏం జరుగుతుందో, సరిగ్గా చూసుకోలేదని తనను ఎంత గట్టిగా మందలిస్తారో అని బుచ్చిబాబు లొకేషన్‌లోనే వణికిపోయారు. అనుకున్నట్టుగానే చరణ్‌కు గాయం అయిన కొద్దిసేపటికే మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి బుచ్చిబాబుకు నేరుగా ఫోన్ కాల్ వచ్చింది. ఆ క్షణంలో తనకు గుండె ఆగినంత పనైందని, తీవ్రమైన టెన్షన్‌తో ఫోన్ లిఫ్ట్ చేశానని బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. అయితే ఫోన్ ఎత్తిన బుచ్చిబాబుకు మెగాస్టార్ చిరంజీవి గారు ఊహించని షాక్ ఇచ్చారు. ఆయన బుచ్చిబాబుపై ఏమాత్రం కోపం వ్యక్తం చేయకుండా, అస్సలు మందలించకుండా ఎంతో ప్రశాంతంగా మాట్లాడారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందో కూల్‌గా అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి గారు ఫోన్ లో మాట్లాడుతూ.. "కంగారు పడకు బుచ్చి, సినిమా అంటే ఇలాంటివి జరుగుతుంటాయి" అని ధైర్యం చెప్పారు. అంతేకాకుండా, చరణ్‌కు గాయం జరిగిన వివరాలను ప్రశాంతంగా అడిగి, ఆ యాక్సిడెంట్ వీడియో క్లిప్‌ను తనకు పంపించమని కోరారు. మెగాస్టార్ చూపించిన ఆ అపారమైన మెచ్యూరిటీ, దర్శకుడిని అర్థం చేసుకున్న తీరు చూసి బుచ్చిబాబు మైండ్ బ్లాక్ అయింది. ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లకు లైఫ్ ఇచ్చిన చిరంజీవి గారి గొప్పతనం ఆ రోజే తనకు పూర్తిగా అర్థమైందని బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు. ఈ చిత్రంలో చరణ్ కంటికి నాలుగు కుట్లు పడినా సరే విరామం తీసుకోకుండా 25 నుంచి 30 రోజుల పాటు సాగిన ఆ కుస్తీ షెడ్యూల్‌ను పూర్తి చేయడం విశేషం. సుమారు 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ 'పెద్ది' చిత్రం కోసం చరణ్ ఎన్నో గాయాలను భరించారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం బాక్సాఫీస్ రిజల్ట్ రూపంలో దక్కుతుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.   
బుల్లితెర ప్రేక్షకుల‌కు, సోషల్ మీడియా యూజర్లకు కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తనదైన క్లాస్, మాస్ స్టెప్పులతో ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న డ్యాన్స్ మాస్టర్ పండు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  (Dance Master Pandu) విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం సమీపంలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా, టెలివిజన్ ఇండస్ట్రీ వర్గాలను మరియు ఆయన అభిమానులను ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. (Pandu Master Accident) అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాల్లోకి వెళితే.. డ్యాన్స్ మాస్టర్ పండు మంగళవారం నాడు విశాఖపట్నం జిల్లా తగరపువలస సమీపంలో జరిగిన ఒక స్థానిక జాతర డ్యాన్స్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ ఈవెంట్ తర్వాత పండు మాస్టర్ తన డ్యాన్స్ బృందంతో కలిసి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. వారంతా కారులో వైజాగ్ నుండి తిరిగి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో వారి వాహనం ఆనందపురం సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఒక తోటి డ్యాన్సర్‌కు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థత ఏర్పడి, వాంతులు అయ్యాయి. దీంతో కారును రోడ్డు పక్కన నిలిపారు. అయితే దురదృష్టవశాత్తూ అదే సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా కోళ్ల లోడుతో వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి, రోడ్డు పక్కన ఆగి ఉన్న వీరి కారును బలంగా ఢీకొట్టింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ఈ భయంకరమైన ప్రమాదం చోటుచేసుకుంది. ఆ బొలెరో వాహనం వేగంగా వచ్చి కారును ఢీకొట్టడంతో జరిగిన ఇంపాక్ట్‌కు కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న డ్యాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా అతని రెండు కాళ్లకు చాలా బలమైన గాయాలు కావడంతో ఆయన కదలలేని స్థితికి చేరుకున్నారు.  ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు, తోటి సిబ్బంది.. పండు మాస్టర్‌ను విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల బృందం ఆయనకు అత్యవసర వైద్య సేవలను అందించడం ప్రారంభించింది.  ప్రస్తుతానికి ఆసుపత్రి వర్గాల నుండి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. పండు మాస్టర్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది. అయితే కాళ్లకు తగిలిన తీవ్ర గాయాల కారణంగా ఆయన కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.  రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో డ్యాన్సర్‌గా ఎంతో భవిష్యత్తు ఉన్న పండు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా  అమ్మాయి అయినా  కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత  మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు. అబ్బాయిలు ఆలస్యంగా వివాహం చేసుకోవడం పెద్దగా సమస్య కాదు, కానీ పెద్ద వయసులో అమ్మాయిలకు మంచి సంబందాలు రావడం లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం.  అమ్మాయిలకు వివాహానికి సరైన వయస్సు ఏమిటి అనే  విషయంపై సరైన స్పష్టత ఎక్కడా లేదు. అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా మొదట తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని, ఆ తర్వాత వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ 30ఏళ్ల  తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు పెద్ద సవాల్ ఎదురవుతోంది. దీనిగురించి రెలేషన్షపి నిపుణులు చెబుతున్న విషయాలు ఏంటో తెలుసుకుంటే.. కెరీర్ అడ్డంకి.. గతంలో ఆడపిల్లల చదువు, కెరీర్ కు ఇంత ప్రాముఖ్యత లేదు.  టెంత్,  ఇంటర్,  డిగ్ర లాంటివి పూర్తవ్వగానే ఆడపిల్లలకు పెళ్ళి చేసేవారు. పెళ్లి తర్వాత మహిళలు కూడా ఇంటిని,  భర్త,  పిల్లలు, అత్తమామలను చూసుకుంటూ ఉండే వారు. కానీ నేటికాలంలో అలా లేదు.. తల్లిదండ్రులు ఆడపిల్లలను కూడా కొడుకులతో సమానంగా చదివిస్తున్నారు. ఆడపిల్లలు తమ కెరీర్ ను అద్బుతంగా మలుచుకోవడంలో సపోర్ట్ చేస్తున్నారు. దీని వల్ల ఆడపిల్లలు కూడా తమ కెరీర్ ను బిల్డ్ చేసుకుని సెటిల్ కావడానికి సమయం పడుతోంది.  అది కాస్తా 30 ఏళ్ల వరకు వివాహానికి దూరం ఉండేలా చేస్తోంది. ఇదే తల్లిదండ్రులకు పెద్ద సవాల్ గా మారుతోంది.  ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించిన కూతురికి పెళ్లి చేయడం చాలా కష్టతరంగా మారింది. అబ్బాయిలకు కాస్త బెటర్.. అమ్మాయిల మాదిరిగానే పెద్ద వయసు అబ్బాయిలకు  కూడా వివాహం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే అబ్బాయి బాగా సంపాదిస్తే చిన్న వయసు అమ్మాయిల నుండి సంబంధాలు వస్తుంటాయి.  తల్లిదండ్రులు  తమ కూతురికి  ఆర్థిక భద్రత కల్పించే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. అయితే అమ్మాయిల విషయంలో అలా కాదు. ఒక అమ్మాయి ఎంత సంపాదించినా, ఆమె పెద్దది అయితే మంచి జత దొరకడం కష్టంగా ఉంటుంది. అబ్బాయిలు ఆశించడమే పెద్ద సమస్య.. కాలం ఎంత మారినా అది మగవారి ఆలోచనలు మార్చలేకపోతోంది.  మగవాళ్లకు తమ భార్యల పట్ల ఉన్న అవగాహన పెద్దగా మారలేదు. చాలా మంది మగవాళ్లు ఎక్కువగా ఆశిస్తున్నారనే మాట చాలా నిజం.  భార్య అటు ఉద్యోగం చేసి సంపాదించాలి,  అలాగే ఇటు ఇంటికి రాగానే ఇంటి పనులు అన్నీ ఆమె చేసి భర్తకు సేవలు చేస్తూ పిల్లలను కూడా చూసుకోవాలని కోరుకుంటారు.  చాలా సార్లు తమ తల్లితో భార్యను పోలుస్తారు,  వస్త్రధారణ నుండి అమ్మాయి పరిచయాల వరకు, స్నేహితులు, వ్యక్తిగత స్పేస్ వంటి విషయాలలో కూడా ఆబ్బాయిలు అమ్మాయిలను చికాకు పెడతారు. ఇలాంటివి అమ్మాయిలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఇవి కాస్తా వైవాహిక జీవితంలో అడ్డంకులకు కారణం అవుతున్నాయి. అమ్మాయిల వయసు పెరిగితే ఇదే సమస్య.. 30ఏళ్ళ తర్వాత అమ్మాయిలకు వివాహం విషయంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్య అమ్మాయి సంతానోత్పత్తి ఆమె వయస్సుతో ముడి పడి  ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ అమ్మాయి సంతానోత్పత్తి తగ్గుతుంది. అమ్మాయి పెద్దదైతే ఆ జంట పిల్లల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ఇది వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించకుండా చేస్తుంది. నేటి కాలంలో అమ్మాయిలు ఆర్థిక విషయం నుండి చాలా వరకు స్వతంత్రత కలిగి ఉన్నారు.  తన సొంత ఆలోచన ఉంటుంది. ఆమె తన భర్త లేదా కుటుంబం చెప్పే ప్రతిదానితో ఏకీభవించలేదు. ఆమె తన సొంత ఆలోచనకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే భార్యభర్తల మధ్య సమస్యలు సృష్టిస్తోంది. సరైన వయసు.. మేజర్ అయితే చాలు అమ్మాయిలు, అబ్బాయిలు వివాహానికి అర్హత పొందుతారు. కానీ వివాహానికి  సరైన వయసు అనేది వ్యక్తిగతంగా ఉంటుంది.  అమ్మాయిలు కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం వివాహానికి ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ చాలా మంది మహిళలు తమ కెరీర్ ను తొందరగా సెటిల్ చేసుకుని సరైన జోడి వెతుక్కుని హాయిగా సెటిల్ అవుతున్నారు.  అంటే.. వివాహం విషయంలో అబ్బాయిల  ఆలోచన కూడా ముఖ్యం.  వారు కూడా మారితేనే భార్యాభర్తల వైవాహిక జీవితం బాగుంటుంది.                           *రూపశ్రీ.  
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం.  ఇలాంటి పరిస్థితిలో అతిగా మాట్లాడం లేదా ఎక్కువ మాట్లాడటం కూడా భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేస్తుందని అంటున్నారు రెలేషన్షిప్ నిపుణులు. జరిగే ప్రతి విషయాన్ని తమ భాగస్వామితో పంచుకోవడం, ప్రతి విషయాన్ని చర్చించడం, అన్ని విషయాలు తమకు తెలిసి జరగాలి అనుకోవడం, ప్రతి చిన్న విషయం గురించి మాట్లాడటం.. ఇలా ప్రతిదీ భాగస్వామితో మాట్లాడం వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అవుతుంది అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఇది తెలుసుకోవాలి.. ఒక సంబంధాన్ని బలపరచడంలో  ముఖ్యమైనది ఎక్కువ మాట్లాడటం కాదు.. ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మాటలలో నిజాయితీ,  మాట్లాడే విషయం పట్ల అవగాహన,  దాని ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనవి.  ఏదో ఒకటి మాట్లాడాలి అని  కబుర్లు చెప్పుకోవడంలో బంధం బలపడటం అనేది జరగదు. ఇద్దరి ఆలోచనలు, ప్రవర్తనలు, ఇద్దరూ ఏదైనా విషయం గురించి మాట్లాడటం.. ఇలాంటి సందర్బాలు చాలా కొన్నే ఉన్నా అది బంధాన్ని బలపరుస్తుంది.  ఏదో ఒకటి మాట్లాడాలనే కారణంతో అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటే.. భాగస్వామి విసుగు చెంది  ఇలా కబుర్లు చెప్పడం అనే మంచి సమయానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సమయం ముఖ్యమే..  భార్యాభర్తలు రోజులో కొంత సమయం గడపడం చాలా కీలకమని నిపుణులే చెబుతున్నారు. ఇద్దరు కలిసి కొంత సమయం గడిపినప్పుడు, వారి మధ్య ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి, సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎప్పుడూ ఒకరితో మరొకరు అప్యాయత, అనురాగం,  ఇద్దరి మధ్య బంధం బలపడే  అవకాశం ఉంటుంది. చిన్న విషయాలు ఎందుకు మాట్లాడకూడదు.. కొందరు భాగస్వాములు చిన్న చిన్న విషయాలను కూడా చెబుతూ ఉంటారు. ఏ విషయాన్ని దాచుకోవడం లేదని, తాము బంధంలో ఎంతో నిజాయితీగా ఉంటున్నామని కూడా అంటుంటారు. కానీ ఇది చాలా పొరపాటు.  ప్రాముఖ్యత లేని విషయాల గురించి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య ఆసక్తి తగ్గి, అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇద్దరు కలిసి గడిపే సమయం నాణ్యంగా మార్చుకోవాలి. అంచనాలకు పోవద్దు.. టీవి, సినిమా, సీరియల్, చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు భార్యాభర్తల బందాలలో కొన్ని సంఘటనలు, సందర్భాలు చాలా సంతోషంగా, ఎంతో అపురూపంగా గడుపుతూ ఉంటారు.  ఇలాంటి బంధాలను చూసి తాము అలా ఉండాలని అనుకుంటారు చాలామంది. కానీ ఇలాంటి అంచనాలు పెట్టుకోవడం వల్ల చాలా అసంతృప్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కాస్తా భాగస్వామి విషయంలో ఒకరంటే ఒకరి పట్ల ఇష్టం,  ఆసక్తి తగ్గి,  చిరాకు, కోపం పెరిగేలా చేస్తుంది. మనిషిని బట్టే.. కొందరు ఎక్కువ మాట్లాడేవారు ఉంటారు. మరికొందరు తక్కువ మాట్లాడేవారు ఉంటారు. కాబట్టి మనిషిని బట్టి ముందుకెళ్లాలి.  బాగా మాట్లాడేవారితో ఏం మాట్లాడినా సరదాగా తీసుకుంటారు. కానీ ఎక్కువ మాట్లాడని వ్యక్తులు చిన్న చిన్న విషయాలకు చాలా చిరాగ్గా ఫీలవుతారు.  కాబట్టి మనిషిని బట్టి సాగితేనే బంధాలు బాగుంటాయి.                                    *రూపశ్రీ.
అపజయాలు ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అపజయాలు లేకపోతే అసలు విజయానికి విలువ, విజయాలు అనుభూతి చెందలేదు. కానీ ప్రతి ఒక్కరూ అపజయం అనేది తమకు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. అయితే అపజయాల విషయంలో మనిషి వైఖరి ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  "ఒక వ్యక్తి వెయ్యిమార్లు విఫలుడైనా ఉన్నతమైన ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. అబద్ధాలు చెప్పడం రాని గోడలా ఉండడం కన్నా, తప్పు చేస్తూ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉత్తమం" అని అనేవారు స్వామి వివేకానంద. అబ్రహమ్ లింకన్ తమ దేశ పార్లమెంటు సభ్యుడవ్వాలనుకున్నాడు. అయితే అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. వ్యాపారంలో భాగస్వామి అతణ్ణి మోసం చేశాడు. వ్యాపారం కోసం చేసిన అప్పుల బారినుంచి బయటపడడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. అతను వివాహం చేసుకున్న కొద్దికాలానికే మొదటి భార్య మరణించింది. గయ్యాళి అయిన రెండవ భార్య అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా అతడు తన లక్ష్యసాధనకై శక్తినంతా ఉపయోగిస్తూ, చేస్తున్న ప్రయత్నాలను మానలేదు. చివరకు అతను ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడై, చరిత్రపుటల్లోకి ఎక్కాడు. వ్యక్తిగత సమస్యలకు జడవకుండా, ఉన్నత ఆదర్శాన్ని విడవకుండా ప్రయత్నించిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలరు. మనిషి వ్యక్తిగత, సామాజిక, మానసిక రంగాలలో తప్పకుండా అభివృద్ధి సాధించాలి. అలా సాధించినప్పుడు మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ విషయం లోతు ఎంత అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఏమీ తెలియకుండా బెల్లం కొట్టిన రాయి చందాన మనిషి ప్రవర్తన కూడా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియని ముర్ఖుడిలా ఉండిపోతారు. ఇలా ఉంటే అపజయాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఏమీ నేర్చుకోలేరు. అపజయాల గురించి అసలు ఆలోచించలేరు. కేవలం అపజయాల కారణంగా తాము ఎదగలేక పోయామనే అసంతృప్తి మాత్రమే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపజయాలను అనుభవాలుగా చూసినప్పుడే మనిషి సరైన ఆలోచనా మార్గంలో ఉండగలుగుతారు.                                  *నిశ్శబ్ద.
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం, చెడు  ఆహారపు అలవాట్లు శరీర రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. ఈ కారణంగానే పదే పదే   జలుబు, అలసట, ఇన్ఫెక్షన్లు , నీరసం వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి చాలామంది  విటమిన్ సి , విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు  తీసుకుంటూ ఉంటారు. ఇవి రెండూ రోగనిరోధక శక్తికి చాలా కీలకమైనవే. అయితే రోగనిరోధక శక్తిని బలంగా మార్చడానికి విటమిన్-సి, విటమిన్-డి.. ఈ రెండు విటమిన్లలో ఏది ముఖ్యమైనది?  వివరంగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి ఎందుకు అవసరం.. రోగనిరోధక వ్యవస్థ శరీరానికి రక్షణ కవచం వంటిది. ఇది శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర హానికరమైన పదార్థాలను గుర్తించి, నిర్మూలిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు లోపిస్తే, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. వైద్య నివేదికల ప్రకారం విటమిన్ సి శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది , యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగనిరోధక కణాలను ఉత్తేజపరచడంలో , వాపును నియంత్రించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం ఉన్నవారికి ఇన్ఫెక్షన్లు , శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కేవలం సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మాత్రమే రోగనిరోధక శక్తి బలపడదని, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం, సరైన పోషకాహారం కూడా చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ సి , డి రెండూ అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ రెండింటికీ వేర్వేరు విధులు ఉన్నాయి, కాబట్టి వీటిలో దేని లోపమైనా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందట. విటమిన్-సి.. విటమిన్ సి ఆరోగ్యానికి అత్యవసరం, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు.   ఇది శరీరంలో నిల్వ ఉండని, నీటిలో కరిగే విటమిన్, కాబట్టి ఇది ప్రతిరోజూ అవసరం. విటమిన్ సి శరీరంలోని తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది, దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో మరింత మెరుగ్గా పోరాడగలుగుతుంది.  విటమిన్ సి ఒక సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. తగినంత మోతాదులో విటమిన్ సి తీసుకోవడం వల్ల జలుబు కాలవ్యవధిని కొంత మేరకు తగ్గించవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి. విటమిన్-డి.. సూర్యరశ్మికి గురికావడం వల్ల విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి ఎముకలకు మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తికి కూడా అవసరం విటమిన్ డి శరీరంలోని టి-కణాలను , ఇతర రోగనిరోధక కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.  ఈ కణాలు వైరస్‌లు , బ్యాక్టీరియాలతో పోరాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ డి వాపును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది, తద్వారా శరీర రోగనిరోధక ప్రతిస్పందనను  బాలెన్స్ విటమిన్ డి లోపం ఉన్నవారికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ , ఇతర అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతూ, తక్కువ సూర్యరశ్మిని పొందే వ్యక్తులలో ఈ లోపం సర్వసాధారణం. పోషకాలను ఎలా పొందాలి? శరీరానికి అవసరమైన విటమిన్ సి , డి అందాలంటే, సరైన ఆహారం , జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం.   సిట్రస్ పండ్లు విటమిన్ సి కి మంచి వనరులు. నారింజ, ఉసిరి, నిమ్మకాయలు, జామకాయలు, క్యాప్సికమ్ , స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి కోసం, గుడ్డు పచ్చసొన, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు, పుట్టగొడుగులు , పాల ఉత్పత్తులను తినడం మంచిది.                             *రూపశ్రీ.
       ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు.  మరికొందరు దీన్ని కేవలం అలసట లేదా నీరసం అని కొట్టిపారేస్తుంటారు.  అయితే ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటు. . ఇది  శరీరంలో ఒక నిర్దిష్ట వ్యాధికి తొలి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు, దీనిని వైద్యపరంగా ప్లాంటార్ ఫాసైటిస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి గురించి , దానిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు  తీసుకోవాలో తెలుసుకుంటే.. ఉదయం పూట చీలమండలు ఎందుకు నొప్పిస్తాయి? పాదం అరికాలి భాగం మడమ ఎముక నుండి కాలివేళ్ల వరకు ఉంటుంది. ఇది ప్లాంటార్ ఫాసియా అనే మందపాటి, బలమైన కణజాలపు పొరతో కప్పబడి ఉంటుంది. మనం నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు ఈ పొర మన పాదాలను కుదుపుల నుండి కాపాడుతుంది. ఈ కండర పట్టీపై ఎక్కువ  ఒత్తిడి పడినప్పుడు, అది చిన్న చిన్న చిరుగులకు , వాపుకు కారణమవుతుంది. రాత్రిపూట మన పాదాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఈ కణజాలం సంకోచిస్తుంది. ఉదయం నిద్రలేచి నేలపై మొదటి అడుగు వేయగానే, సంకోచించిన ఈ కణజాలం అకస్మాత్తుగా మళ్లీ సాగి, తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంది. కారణాలు.. శరీరంలో పెరిగిన కొవ్వు మడమలపై నేరుగా అధికంగా ఒత్తిడిని కలుగజేస్తుంది.  చాలా పలుచగా ఉండే లేదా ఆర్చ్ సపోర్ట్ లేని చెప్పులు, బూట్లు ధరించడం వల్ల కూడా అరికాళ్ళు దెబ్బతింటాయి.  పనిలో భాగంగా  గంటల తరబడి చాలాసేపు నిలబడవలసి వస్తే.. అలాంటి వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు.  శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం, ఎముకలు బలహీనపడటం లేదా విటమిన్ డి లోపం కూడా మడమ నొప్పిని పెంచుతాయి. ఇంటి చిట్కాలు..  మడమకు రోజుకు రెండు నుండి మూడు సార్లు 15 నిమిషాల పాటు ఐస్ పెట్టాలి. దీనివల్ల వాపు తగ్గుతుంది. మంచం దిగే ముందు కాళ్లు ఉన్నట్టుండి చాపకుండా  కాళ్లను , కాలివేళ్లను ముందుకు వెనుకకు సాగదీయాలి. ఎల్లప్పుడూ మందపాటి కుషన్ ఉన్న సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించాలి. ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి. నొప్పి కొన్ని రోజుల పాటు కొనసాగితే , నడవడంలో మరింత ఇబ్బంది ఉంటే వెంటనే ఎముకల వైద్యుడిని సంప్రదించాలి.                              *రూపశ్రీ.
  మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం, సూదుల నొప్పిని భరించడం ఎంత నరకంలా ఉంటుందో ఆ బాధను అనుభవించే వారికే తెలుస్తుంది. మీరు లేదా మీ ప్రియమైన వారు ఈ పరిస్థితుల్లో ఉన్నారా? కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని డాక్టర్లు చెప్పారా? అయితే ఆందోళన చెందకండి. ప్రకృతి ప్రసాదించిన ఔషధాలతో, ఆహారపు అలవాట్లలో మార్పులతో మీ కిడ్నీలను మళ్ళీ ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. పూర్తి వివరాల కోసం Dr. Srinivas Gupta గారు ఈ VIDEO లో వివరించారు. కిడ్నీల ఆరోగ్యం కోసం ప్రకృతి చిట్కాలు మన ఇంటి పరిసరాల్లో దొరికే మొక్కలే మనకు గొప్ప డాక్టర్లు. వందల ఏళ్లుగా ఆయుర్వేదంలో వాడబడుతున్న చిట్కాలు కిడ్నీ సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను చూపుతున్నాయి. వేపాకు మరియు రావి ఆకు కషాయం: ఐదు వేపాకులు మరియు మూడు రావి ఆకులను తీసుకుని, 100 ml నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు 50 ml అయ్యే వరకు మరిగించి, ఆ కషాయాన్ని తీసుకోవడం వల్ల క్రియాటినిన్ (Creatinine) మరియు యూరియా స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని వేల మంది పేషెంట్లలో గమనించడం జరిగింది.   మొక్కజొన్న పొత్తు జుట్టు (Corn Silk): మనం సాధారణంగా పడేసే మొక్కజొన్న పొత్తు జుట్టు కిడ్నీలకు ఒక వరం. దీనిని నీటిలో మరిగించి టీ లాగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా క్రియాటినిన్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి పసుపు టీ: పచ్చి పసుపు, అల్లం మరియు కరివేపాకులను నలిపి నీటిలో మరిగించి ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఆహారమే అతిపెద్ద మందు కిడ్నీ పేషెంట్లు రైస్ లేదా గోధుమ రొట్టెలకు బదులుగా బార్లీ (Barley) ని వాడటం శ్రేయస్కరం. బార్లీ ఒక నేచురల్ డయూరెటిక్ (diuretic) లాగా పనిచేసి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. కూరగాయల ఎంపిక: మీ మధ్యాహ్న భోజనంలో పొట్లకాయ (సొరకాయ) మరియు రాత్రి భోజనంలో బీరకాయను ఎక్కువగా చేర్చుకోవాలి. ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం చాలా ముఖ్యం. గ్రీన్ జ్యూసెస్: కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మరియు గ్రీన్ ఆపిల్‌తో చేసిన జ్యూస్ శరీరంలోని విషతుల్యాలను తొలగించడానికి (Detox) సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్: రక్తపోటును (BP) నియంత్రించడంలో మరియు కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక అమృతంలా పనిచేస్తుంది. ఆధునిక చికిత్స మరియు జీవనశైలి మార్పులు కేవలం ఆహారం మాత్రమే కాకుండా, ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లలో అందించే కిడ్నీ ప్యాక్, కిడ్నీ మసాజ్ మరియు కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ వంటి బాహ్య చికిత్సలు కిడ్నీలను మళ్ళీ ఉత్తేజితం చేస్తాయి. అలాగే, చెప్పులు లేకుండా నేల మీద నడవడం (Earthing) వల్ల శరీరం ఉత్తేజితమై ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందస్తు హెచ్చరికలు: యూరిన్ వెళ్ళినప్పుడు బాగా నురుగు వస్తుంటే, అది ప్రోటీన్ లీక్ అవుతున్నట్లు ప్రాథమిక సూచన. దీనిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న 1: క్రియాటినిన్ స్థాయిలను సహజంగా తగ్గించవచ్చా?  సమాధానం: అవును, వేపాకు మరియు రావి ఆకు కషాయం తీసుకోవడం, బార్లీ ఆహారంలో చేర్చుకోవడం మరియు కిడ్నీలకు సంబంధించిన ప్రత్యేక వ్యాయామాలు చేయడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలను తగ్గించవచ్చు. ప్రశ్న 2: డయాలసిస్ స్టేజ్ లో ఉన్నవారు కూడా ఈ చికిత్సలు ఫాలో అవ్వచ్చా?   సమాధానం: తప్పకుండా. ఫోర్త్ లేదా ఫిఫ్త్ స్టేజ్ లో ఉన్నవారు కూడా సరైన డైట్ మరియు నాచురల్ ట్రీట్మెంట్స్ ద్వారా తమ క్రియాటినిన్ స్థాయిలను తగ్గించుకుని సాధారణ స్థితికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రశ్న 3: కిడ్నీ పేషెంట్లు ఎలాంటి కూరగాయలు తినాలి?  సమాధానం: సొరకాయ మరియు బీరకాయ కిడ్నీలకు చాలా మంచివి. కూరగాయలను వాడే ముందు వాటిని బాయిల్ చేసి ఆ నీటిని పారబోయడం వల్ల పొటాషియం స్థాయిలు తగ్గుతాయి, ఇది కిడ్నీ పేషెంట్లకు ముఖ్యం.  కిడ్నీ సమస్య అనగానే భయపడిపోయి డయాలసిస్ లేదా ట్రాన్స్‌ప్లాంట్ వైపు వెళ్ళే ముందు, ఒకసారి మన ప్రకృతి అందించే చికిత్సలను నమ్మండి. క్రమశిక్షణతో కూడిన ఆహారం మరియు సరైన వ్యాయామంతో కిడ్నీలను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చుకోవడం అసాధ్యమేమీ కాదు.   మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్స్ : INDIA : + 917070999313  USA : +1(732)947-4166   మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు కిడ్నీ వ్యాధులపై పూర్తి అవగాహన కోసం మా యూట్యూబ్ ఛానెల్‌ TeluguOne Health ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి!  మీ ఆరోగ్యం - మీ చేతుల్లోనే!