తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌ వేదికగా తలపెట్టిన భారీ బహిరంగ సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. తెలంగాణలో జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా  తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం పేరిట ఈ భారీ సభను ఏర్పాటు చేశారు. మంగళవారం (జూన్ 2) మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలని జనసేన శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే, రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతుండటం, అదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ,  ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పోలీసుల నిర్ణయంతో ఏమాత్రం వెనక్కి తగ్గని జనసేనాని పవన్ కళ్యాణ్, తక్షణమే ప్రత్యామ్నాయ వ్యూహానికి తెరలేపారు. సభకు బ్రేక్ పడినా, తన గళాన్ని వినిపించేందుకు   సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే అత్యవసరంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణలో జనసేన భవిష్యత్ యాక్షన్ ప్లాన్, పార్టీ పటిష్టతకు తీసుకోబోయే   కీలక నిర్ణయాలను ఆయన నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. పోలీసులు సభను అడ్డుకున్నా, ప్రెస్ మీట్ ద్వారా తన పొలిటికల్ ఎజెండాను బలంగా చాటాలని పవన్ భావిస్తున్నారు. మరోవైపు, పోలీసుల నిరాకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన లీగల్ టీమ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. రేపు మధ్యాహ్నం లోగా కోర్టు నుంచి అనుకూల తీర్పు వస్తుందని పార్టీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. కోర్టు తీర్పుపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో యువత టార్గెట్‌గా, దాదాపు 50 శాతం కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ను యాక్టివ్ చేయాలనేది పవన్ ప్రధాన ఉద్దేశం. కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా, తెలంగాణలోనూ జనసేన సత్తా చాటాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా జరగాల్సిన సభకు బ్రేక్ పడటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి   కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో  అనూహ్య పరిణామం సంభవించింది. నిన్న మొన్నటివరకు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అస్థిత్వం కోసం  పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే..  పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు   భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత..  భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు  ఏర్పాటు చేసిన   కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు   గైర్హాజరు  అయ్యారు.  ఈ పరిణామం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తిని,  ముఠా రాజకీయాలనుబహిర్గతం చేసింది. ముఖ్యంగా మమతా బెనర్జీ వారసుడిగా చలామణి అవుతున్న అభిషేక్ బెనర్జీ ఒంటెద్దు పోకడలపై పార్టీ సీనియర్లలో  ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇటీవలే ఎన్నికల ఫలితాల అనంతరం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కంటికి  గాయమై ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా హుగ్లీలో మరో కీలక నేత కల్యాణ్ బెనర్జీపై కూడా దాడి జరిగింది. ఈ దాడుల నేపథ్యంలో పార్టీ నేతల్లో ధైర్యం నింపేందుకు దీదీ ఏర్పాటు చేసిన సమావేశానికి మెజారిటీ ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని దిగ్భ్రాంతికి గురి చేసింది.    తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా బెంగాల్ రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.   వీరంతా మమతా బెనర్జీ,  అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..  సరికొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చర్చ నడుస్తోంది.  ఈ తాజా సంక్షోభంపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకులపై దాడులు జరుగుతుంటే ఆసుపత్రులు కూడా చికిత్స అందించవద్దంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని, బెంగాల్‌  ప్రస్తుతం   నియంతృత్వ ధోరణి నడుస్తోందని ఆరోపించారు.  కాగా 80 మందిలో 60 మంది ఎమ్మెల్యేలు కీలక సమావేశానికి గైర్హాజర్ కావడం చూస్తుంటే.. టీఎంసీలో  మమతా బెనర్జీ పట్టు   సడలినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని అటు సొంత సామాజికవర్గం, ఇటు రాజకీయ ప్రత్యర్థుల నుంచి ముప్పేట దాడి మొదలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు సరికొత్త వివాదాలు చుట్టుముడుతున్నాయి. అటు తెలంగాణలో భూముల వ్యవహారాలు, ఇటు ఆంధ్రాలో కాపు సామాజికవర్గ నేతల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు జనసేనానిని రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై  సీనియర్ రాజకీయ విశ్లేషకుడు  భరద్వాజ తో  తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.   పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.  ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పవన్ కళ్యాణ్ ఏం చేశారంటూ దాసరి రాము వంటి నేతలు టోన్ పెంచి విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ పవన్ ఓడిపోవడానికి ఆ సామాజికవర్గమే బాధ్యత వహించాలంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రత్యర్థులు ఆయుధంగా మలుచుకుంటున్నారు. జనసేన కేవలం ఒక కులానికి పరిమితమైన పార్టీ కాదని పవన్ స్పష్టం చేస్తున్నప్పటికీ, ఆయనను టార్గెట్ చేయడం ఆపడం లేదు. మరోవైపు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి  కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు కూడా పవన్‌పై విమర్శల దాడిని ముమ్మరం చేశారు. వంగవీటి మోహన రంగా హత్యోదంతాన్ని మళ్లీ తెరపైకి తెస్తూ, ఆనాటి రాజకీయ పరిస్థితులను ప్రస్తుత కూటమితో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రంగా అభిమానులు, కాపు సామాజికవర్గం విస్తృతంగా ఉన్న ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ బలాన్ని తగ్గించడమే ఈ విమర్శల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అందుకే రంగా హత్యను తెరపైకి తీసుకువచ్చి.. ఆ హత్యకు కారకులతో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉన్నారంటూ విమర్శిస్తున్నారు. ఈ వ్యూహాత్మక ఒత్తిడి ద్వారా పవన్ కళ్యాణ్ చేత ఏదైనా భావోద్వేగ ప్రకటన చేయించాలని ప్రత్యర్థులు భావిస్తున్నారు. ఆ ప్రకటన గనుక కూటమి ప్రభుత్వ ఐక్యతకు భంగం కలిగించేలా ఉంటే..  దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది శత్రు పక్షాల ప్లాన్. ఈ ముప్పేట దాడిని తిప్పికొట్టేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్యాడర్ మద్దతును కూడగడుతున్నారు. ఇందులో భాగంగానే రాజమండ్రి, విజయవాడ, మంగళగిరి పార్టీ కార్యాలయాల్లో వరుసగా కీలక సమావేశాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ ప్రెజర్‌ను పవన్ కళ్యాణ్ ఎంత నిగ్రహంతో, శాంతియుతంగా హ్యాండిల్ చేస్తారనేది అత్యంత కీలకంగా మారింది. ఆయన భావోద్వేగానికి లోనై కూటమికి ఇబ్బంది కలిగిస్తారా? లేక చాకచక్యంగా ఈ వ్యూహాల నుంచి బయటపడి తన రాజకీయ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా? అనేది వేచి చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) చిత్రం థియేటర్లలోకి రాకముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గ్లోబల్ వైడ్‌గా భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా నార్త్ అమెరికా (North America) మార్కెట్లో అప్పుడే కలెక్షన్ల వేట మొదలుపెట్టింది.  'పెద్ది' నార్త్ అమెరికా ప్రీమియర్ షోల ప్రీ-సేల్స్ ఇప్పటికే రికార్డు స్థాయిలో $900K (9 లక్షల డాలర్లు) మార్కును విజయవంతంగా దాటేసింది. ఈ అద్భుతమైన నంబర్స్ చూస్తుంటే ఓవర్సీస్ మార్కెట్లో రామ్ చరణ్‌కు ఉన్న తిరుగులేని బాక్సాఫీస్ స్టామినా మరోసారి స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఒక రికార్డుని అందుకోవడానికి కేవలం అడుగు దూరంలో నిలిచింది. ఈ ఏడాది నార్త్ అమెరికాలో అత్యంత భారీ ప్రీమియర్ ప్రీ-సేల్స్ సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించాలంటే 'పెద్ది' చిత్రానికి చివరి గంటల్లో మరో $200K+ (2 లక్షల డాలర్లకు పైగా) కలెక్షన్లు అవసరమవుతాయి.  ప్రస్తుతం ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, యూఎస్ఏ మరియు కెనడా వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే ఫైనల్ అవర్స్‌లో ఈ టార్గెట్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మెగా అభిమానులు థియేటర్ల వద్ద క్రియేట్ చేస్తున్న హంగామా ఈ బుకింగ్స్ రేంజ్‌ను నిమిష నిమిషానికి అమాంతం పెంచేస్తోంది. ప్రస్తుతానికి ఈ ఏడాది హయ్యెస్ట్ ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ రికార్డు రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'ది రాజా సాబ్' (The Raja Saab) పేరిట ఉంది. 'ది రాజా సాబ్' చిత్రం ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా $1.1 మిలియన్ల (1.1 Million) వసూళ్లను సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం మరో రెండు లక్షల డాలర్లను ఖాతాలో వేసుకుంటే, 'ది రాజా సాబ్' క్రియేట్ చేసిన ఈ రికార్డును బద్దలు కొట్టి, 2026 సంవత్సరానికి గాను బిగ్గెస్ట్ ప్రీమియర్ ప్రీ-సేల్స్ నమోదు చేసిన నెంబర్ వన్ చిత్రంగా నిలుస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ఓవర్సీస్ ప్రేక్షకులలో ఈ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పవర్‌ఫుల్ మేకోవర్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ ప్రీమియర్ షోల ముగింపు సమయానికి 'పెద్ది' చిత్రం ఆ మ్యాజికల్ $1.1 మిలియన్ల మార్కును దాటి బాక్సాఫీస్ సామ్రాజ్యాన్ని ఎలా రూల్ చేయబోతోందో చూడాలి!  
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులలో కూడా ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. జూన్ 4న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ, మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పవర్‌ఫుల్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతోందో చెబుతూ తేజ్ రాసుకొచ్చిన మాటలు మెగా అభిమానులలో పూనకాలు తెప్పిస్తున్నాయి. భారతదేశం అంతటా ఈ చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాయి ధరమ్ తేజ్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. "పెద్ది పెద్ది పెద్ది.. ఈ పేరు భారతదేశం అంతటా రీసౌండ్ కాబోతోంది" అంటూ తన ట్వీట్ ని ఎంతో పవర్ ఫుల్ గా ప్రారంభించారు. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక గొప్ప వరంగా మారాలని, అలాగే ఈ వేసవి కాలాన్ని ప్రేక్షకులకు మరింత వినోదాత్మకంగా మార్చాలని తాను ఆశిస్తున్నట్లు తేజ్ పేర్కొన్నారు.  అలాగే రామ్ చరణ్‌ను ట్యాగ్ చేస్తూ.. "చరణ్.. ఇంతటి అర్ధవంతమైన మరియు బలమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నువ్వు పడిన అపారమైన శ్రమ, నీ అంకితభావం ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంటుంది" అని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఈ వైవిధ్యభరితమైన కథను ఎంచుకోవడంలో రామ్ చరణ్ చూపించిన ధైర్యాన్ని (Guts) సాయి ధరమ్ తేజ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సినిమా కోసం చరణ్ తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం పడిన కష్టం, అలాగే అందరిపై ఆయన చూపించే ఆప్యాయత అన్నీ కలిసి జూన్ 4న థియేటర్లలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయని తేజ్ స్పష్టం చేశారు. జూన్ 4న వెండితెరపై రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూడటానికి తాను ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.  ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సృష్టించిన ఈ అద్భుతమైన ప్రపంచం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని, ఒక కొత్త తరహా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని తేజ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. అలాగే పెద్ది సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ సాయి ధరమ్ తేజ్ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.   https://x.com/IamSaiDharamTej/status/2061687215965851820
  ఫస్ట్ మూవీ ఉప్పెనతో ప్రేక్షుకులని తన వశం చేసుకున్న భామ కృతిశెట్టి(Krithi Shetty). పెర్ఫార్మ్ పరంగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత బంగార్రాజు తప్ప వరుస పరాజయాలని చవి చూస్తూ వస్తుంది. ప్రీవియస్ మూవీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా అదే పరిస్థితి. సదరు పరాజయలపై కొంత మంది  హీరోయిన్స్ ని బాద్యులుగా చేస్తూ .  'ఐరన్ లెగ్' అనే టాగ్ లైన్ ని ఇస్తుంటారు.  ఈ అంశంపై రీసెంట్ గా కృతి శెట్టి మాట్లాడుతు మూవీ డిజాస్టర్ కి హీరోయిన్ ఒక్కరినే బాధ్యురాలీని చేయడం అత్యంత దారుణం, అన్యాయం. సాధారణంగా ఒక కమర్షియల్ సినిమాలో లేదా పెద్ద చిత్రాలలో హీరోయిన్‌కి ఉండే ప్రాధాన్యత ఎంత అనేది అందరికీ తెలిసిందే. చాలా వరకు సినిమాలలో హీరోయిన్‌కు ఉండేది చాలా పరిమితమైన లేదా చిన్న క్యారక్టర్ మాత్రమే. కేవలం కొన్ని పాటలు, కొన్ని సన్నివేశాలకే వారు పరిమితం అవుతుంటారు. ఒక ప్రాజెక్ట్‌ని ఎలా తీర్చిదిద్దాలి, అసలు కథను ఏ విధంగా ముందుకు నడిపించాలి అనే కీలకమైన విషయాల్లో హీరోయిన్లకి  కనీసం మాట్లాడే హక్కు కానీ, నిర్ణయాలు తీసుకునే అధికారం కానీ ఉండదు. కేవలం తమ పరిధిలో ఉన్న క్యారక్టర్ కి   నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి మాత్రమే కష్టపడుతుంటాం. అలాంటప్పుడు, మొత్తం సినిమా రిజల్ట్‌ని వారి ఖాతాలో వేస్తూ, కేవలం వారి వల్లే సినిమా ఫ్లాప్ అయిందంటూ 'ఐరన్ లెగ్' అనే ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం. ఈ రకమైన నెగిటివిటీ నటీనటులపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. Also read: Peddi: పెద్ది ప్రధాన హైలెట్స్ ఇవే.. కానీ ఆ ఒక్కటి తప్ప  చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫార్ములా అనేది ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. అసలు ఒక 100% విజయవంతమైన సినిమాని ఎలా తీయాలో ఇండస్ట్రీలో ఎవరికీ ముందే తెలియదు  ఒకవేళ ముందే తెలిస్తే అసలు ఫ్లాప్ సినిమాలే రావు. ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతోనే ఎంతో కష్టపడతారని చెప్పుకొచ్చింది.   
టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీల్లో తనదైన నటన, క్యూట్ లుక్స్‌తో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. దక్షిణ కొరియా పర్యాటక రంగాన్ని భారతదేశంలో మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు గాను కొరియా టూరిజం ఆర్గనైజేషన్ (KTO) ఆమెను గౌరవ రాయబారిగా (Honorary Ambassador) నియమించింది. ఒక భారతీయ నటి అంతర్జాతీయ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం మెగా అభిమానులతో పాటు సినీ ప్రియులందరికీ ఎంతో గర్వకారణంగా మారింది. ఈ ప్రతిష్టాత్మక ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియా వ్యాప్తంగా ప్రియాంక మోహన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రత్యేక గౌరవంపై ప్రియాంక మోహన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. కొరియా టూరిజం గౌరవ అంబాసిడర్‌గా నియమితురాలిని కావడం నిజంగా తనకు ఎంతో ప్రత్యేకమైన విషయమని, ఈ బాధ్యతను దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె ఎమోషనల్ అయ్యింది. దక్షిణ కొరియా దేశానికి ఉన్న గొప్ప సంస్కృతి, అద్భుతమైన సంప్రదాయాలు, ఆకట్టుకునే జీవనశైలి మరియు అక్కడి పర్యాటక ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తున్నాయని కొనియాడింది. భారతదేశంలోని పర్యాటకులకు దక్షిణ కొరియా అందాలను పరిచయం చేయడానికి, ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ నియామకంలో భాగంగా ప్రియాంక మోహన్ దక్షిణ కొరియాలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించనుంది. అక్కడ షూట్ చేసే ప్రత్యేక ప్రమోషనల్ వీడియోలు, ట్రావెల్ వ్లాగ్స్ ద్వారా కొరియా అందాలను భారతీయ ప్రేక్షకులకు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వేదికగా చూపించబోతోంది.  కొరియన్ డ్రామాలు (K-Dramas), కొరియన్ పాప్ మ్యూజిక్ (K-Pop) మరియు కొరియన్ ఫుడ్‌కు భారతదేశంలో, ముఖ్యంగా యువతలో గత కొన్నేళ్లుగా విపరీతమైన క్రేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రేజ్‌ను మరింతగా ఉపయోగించుకుంటూ, భారతీయ పర్యాటకులు దక్షిణ కొరియాను తమ తదుపరి ట్రావెల్ డెస్టినేషన్‌గా ఎంచుకునేలా చేయడంలో ప్రియాంక మోహన్ కీలక పాత్ర పోషించనుంది. కాగా, ఇటీవల ప్రియాంకా నటించిన 'మేడిన్ కొరియా' సినిమా కూడా దక్షిణ కొరియా నేపథ్యంతో తెరకెక్కిన విషయం తెలిసిందే.    https://www.instagram.com/p/DZC0GgUk-p4/
Priyanka Mohan attained stardom with her performance in Doctor alongside Sivakarthikeyan, despite making her debut in Telugu cinema earlier. Now, her OTT hit Made in Korea has expanded her reach to an entirely new level, earning her an international honour. The actress has been appointed as the Honorary Ambassador for Korea Tourism by the Korea Tourism Organization (KTO). The recognition comes on the back of Made in Korea, the Indo-Korean project that significantly strengthened Priyanka’s connection with South Korea and introduced her to a wider international audience. More than just another release, the film sparked conversations around cultural exchange and brought Korean locations, aesthetics and storytelling closer to Indian viewers. The impact of the project appears to have created a ripple effect. Priyanka increasingly became associated with India–Korea cultural conversations and even attended the state banquet hosted at Rashtrapati Bhavan during the South Korean President’s visit to India — signalling that her association had moved beyond cinema. That growing connect has now translated into official recognition. Announcing the honour, Priyanka called it “truly very special” and thanked the Korean government and KTO for the opportunity. She also expressed excitement about helping bring Korean culture closer to Indian audiences. From leading an Indo-Korean story to becoming a face for Korean tourism, Priyanka Mohan’s journey has taken a remarkable turn. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న విజయవాడలో కనివిని ఎరుగని రీతిలో అత్యంత అట్టహాసంగా జరిగింది. నగరంలో ఉన్న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అత్యంత వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ భారీ వేడుకకు దాదాపు 30,000 మందికి పైగా అభిమానులు మరియు ప్రేక్షకులు తరలిరావడంతో విజయవాడ నగరం మొత్తం మెగా నామస్మరణతో మార్మోగిపోయింది.  కొంత  మంది ఫ్యాన్స్ స్టేడియం వద్ద ఉన్న పెద్ద పెద్ద చెట్లు ఎక్కడంతో చిత్ర యూనిట్ తో పాటు పోలీసులు కంగారు పడ్డారు. కానీ ఆ తర్వాత కిందకి దించారు. ఆ ఒక్క విషయం తప్ప గ్రాండ్ గా జరిగిన పెద్ది వేడుకలో ప్రధాన హైలెట్స్ గా నిలిచిన వాటిని చూద్దాం. 1 . 50000 మందికి పైగా వచ్చినట్టుగా అన్ని బ్యారక్ లు ఫుల్ కావడం  2 . రామ్ చరణ్ స్టైలిస్ట్ లుక్  అండ్ స్పీచ్  3 . జగపతిబాబు స్పీచ్ మరియు తనది విజయవాడే అని గుర్తు చెయ్యడం  4 . చిరంజీవి పొజిషన్ కి చరణ్ వస్తాడని మైత్రి నిర్మాత నవీన్ చెప్పడం  5 . జగదేక వీరుడు అతిలోకసుందరిలోని చిరంజీవి, శ్రీదేవి మానవ డైలాగ్ ని జాన్వీ కపూర్ చెప్పడం  6 . పెద్ది సాంగ్స్ వినిపించిన ఏఆర్ రెహమాన్ ఆర్కెస్ట్రా  7 .చరణ్ లేనిదే పెద్ది లేదని నిర్మాత వెంకట సతీష్ చెప్పడం  8 .మరిన్ని ఫంక్షన్స్  విజయవాడలో జరపాలని మాట్లాడిన ఎంపి కేశినేని నాని స్పీచ్  9  చరణ్ గురించి బుచ్చిబాబు చెప్పిన స్పీచ్  10 .రామ్ బుజ్జి గా చేస్తున్న దివ్యేన్దు శర్మ గురించి వినిపించిన ప్రతి సారి ప్రేక్షకుల నుంచి వినిపించిన అద్భుతమైన రెస్పాన్స్  Also read: Gunasekhar: త్రివిక్రమ్ పై గుణశేఖర్ వ్యాఖ్యలు వైరల్.. నా పాయింట్ సక్సెస్ అయినందుకు హ్యాపీ   ఇక జూన్ 4 రిలీజ్ డేట్ అయినా 3 నుంచే ప్రీమియర్స్ పడటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది సందడి వాతావరణం నెలకొని ఉంది. ఏప్రిల్, మే నెలల్లో సరైన పెద్ద సినిమాలు లేక వెలవెలబోయిన థియేటర్లకి 'పెద్ది'సరికొత్త ఊపిరి పోస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.  
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' (Peddi) పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా జరిగిన చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమా కథాంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు సినిమా ఎలా ఉండబోతుందో రివీల్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకలో బుచ్చిబాబు మాట్లాడుతూ.. "పెద్ది సినిమా చూడ్డానికి మీకు పక్కా కమర్షియల్ ఫిల్మ్‌లా అనిపించవచ్చు. కానీ, ఇది కేవలం కమర్షియల్ సినిమా మాత్రమే కాదు. హై కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే, గుండెలను పిండేసే ఒక అద్భుతమైన ఎమోషనల్ డ్రామా ఇది" అని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ చిత్రం ఒక క్రీడాకారుడి జీవితం చుట్టూ తిరుగుతుందని చెప్పారు. "ఇది ఒక ఆటగాడి ప్రయాణం. సాధారణంగా ఆట అంటే కేవలం ఒక ఆకతాయితనం అనుకుంటారు. కానీ ఆ ఆట ఒక మనిషి జీవితంలోకి ఎలాంటి మార్పులు తెస్తుంది? అతనికి సమాజంలో ఎలాంటి గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది? అలాగే అతని చుట్టూ ఉన్న మనుషుల ఆలోచనలను ఎలా మారుస్తుంది? అనే పాయింట్ చుట్టూ ఈ కథ సాగుతుంది" అని దర్శకుడు పేర్కొన్నారు. డైరెక్టర్ లీక్ చేసిన ఈ స్టోరీ లైన్ విన్న తర్వాత మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. రామ్ చరణ్ కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని, కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా చరణ్‌లోని అసలైన నటుడిని ఈ సినిమా బయటకు తీస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 'ఉప్పెన' చిత్రంతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు, ఈసారి రామ్ చరణ్‌తో ఒక స్పోర్ట్స్ బేస్డ్ ఎమోషనల్ డ్రామాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఆడించడం విశేషం.   
Nagabhandham, the upcoming mythological fantasy film directed and produced by Abhishek Nama, has completed its OTT and satellite business ahead of release. According to the makers, the film’s OTT rights have been acquired by Amazon Prime Video. Telugu satellite rights have gone to MAA TV, while ZEE TV has secured satellite rights for Hindi, Tamil, Malayalam and Kannada languages. The development has drawn attention within trade circles as the OTT and satellite market has remained selective in recent months, with several films taking longer to close post-theatrical deals. In that context, Nagabhandham managing to complete its non-theatrical business ahead of release has become a talking point. Starring Virat Karrna in the lead role, the film has been promoted as a large-scale visual spectacle with elements of mythology, spirituality and fantasy. The promotional material released so far has generated curiosity among audiences. Backed by NIK Studios, the project is being positioned as Abhishek Nama’s ambitious venture and features a large ensemble cast. Nagabhandham is scheduled to release worldwide on 3rd July. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  కథకి తగ్గ టేకింగ్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసే దర్శకుడు గుణశేఖర్(Gunasekhar). పౌరాణిక, చారిత్రక చిత్రాల దర్శకుడిగా కూడా  గుణశేఖర్‌కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన కలల ప్రాజెక్టులలో 'హిరణ్యకశ్యప' ఒకటి. రానా దగ్గుబాటి(Rana Daggubati)టైటిల్ రోల్ లో తెరకెక్కించేందుకు ఏడుసంవత్సరాల పాటు సుదీర్ఘంగా శ్రమించారు. ప్రతి సన్నివేశాన్ని త్రీడీ  ఫార్మాట్‌లో ఊహిస్తూ ఎంతో కష్టపడి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఆ సమయంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్, డిస్నీ వంటి అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు  ఈ ప్రాజెక్ట్ వైపు మొగ్గు చూపాయి. 300 కోట్ల భారీ బడ్జెట్ అవుతుందని అంచనా వేయడంతో, ఆ తర్వాత వచ్చిన కరోనా మహమ్మారి పరిస్థితులు, స్టూడియో అంతర్గత మార్పుల వల్ల ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అయితే రానా,త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఈ చిత్రం పట్టాలెక్కబోతోందనే వార్తలు టాలీవుడ్‌లో ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి. దీంతో సదరు సబ్జెట్ ని గుణశేఖర్ పక్కన పెట్టబడ్డారనే ప్రచారం జోరందుకుంది. దీనిపై గతంలో గుణశేఖర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తినివ్యక్తం చేశారు. దేవుడిని కేంద్రంగా పెట్టుకుని సినిమా చేసేటప్పుడు నైతికత ముఖ్యమని పరోక్షంగా కౌంటర్లు ఇచ్చారు. దీంతో ఈ వివాదం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రోజు జూన్ 2న తన పుట్టినరోజును పురస్కరించుకుని గుణశేఖర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఆయన మాట్లాడుతు 'హిరణ్యకశ్యపని త్రివిక్రమ్ గారే పూర్తిగా హ్యాండిల్ చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది. దాంతో నేరుగా నేనే ఒకరోజు త్రివిక్రమ్ గారికి ఫోన్ చేశాను. ఆయన నాతో నేను ఈ ప్రాజెక్ట్‌లో కేవలం రచన పరంగా, డైలాగ్స్ రాసేందుకు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యాను. అంతే తప్ప ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలతో నాకు ఎలాంటి సంబంధం లేదని ఎంతో హుందాగా ఆన్సర్  ఇచ్చారని గుణశేఖర్ స్పష్టం చేశారు. నేను అనుకున్న నేపధ్యంతోనే వచ్చిన 'మహాఅవతార్ నరసింహ'(Mahavathar Narasimha)బాక్సాఫీస్ వద్ద దాదాపు  300  కోట్లపైన కలెక్షన్లు రాబట్టడం చాలా ఆనందంగా ఉంది. నా ప్రీవియస్ మూవీ  'యుఫోరియా'సక్సెస్ ఇచ్చిన నమ్మకంతో, భవిష్యత్తులో వేరే నిర్మాతలతో కలిసి మరిన్ని వైవిధ్యమైన సినిమాలు చేస్తానని గుణశేఖర్ చెప్పుకొచ్చాడు.  
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రతిష్టాత్మక 173వ చిత్రం (Thalaivar 173) చుట్టూ తిరుగుతున్న దర్శకుల మార్పుల సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడినట్లు కనిపిస్తోంది. ప్రముఖ స్టార్ హీరో లోకనాయకుడు కమల్ హాసన్‌(Kamal Haasan)కు చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక అదిరిపోయే బర్త్‌డే గ్లింప్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.  ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు హ్యాండిల్ చేయబోతున్నారంటూ నెట్టింట గత కొన్ని వారాలుగా జరుగుతున్న ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ, ఆ నిర్మాణ సంస్థ వదిలిన హై-ఎనర్జీ ప్రోమో మెగా అప్‌డేట్‌కు స్పష్టమైన సంకేతంగా నిలిచింది. 'హ్యాపీ బర్త్‌డే అశ్వత్ మారిముత్తు' అంటూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'ఓ మై కడవులే', 'డ్రాగన్' వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తుకు ఈ బర్త్‌డే గ్లింప్స్ ద్వారా RKFI సంస్థ ఘనమైన శుభాకాంక్షలు తెలిపింది. ఈ స్పెషల్ ట్రిబ్యూట్ వీడియోను చూసిన సూపర్ స్టార్ అభిమానులు, ఇది కేవలం పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రమే కాదని, తలైవర్ 173 ప్రాజెక్ట్‌కు ఆయనే దర్శకుడంటూ అఫీషియల్‌గా ఇచ్చిన హింట్ అని బలంగా నమ్ముతున్నారు.  గతంలో ఈ ప్రాజెక్ట్‌ను ముందుగా సీనియర్ దర్శకుడు సుందర్ సి టేకాఫ్ చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత 'డాన్' చిత్ర దర్శకుడు సిబి చక్రవర్తి చేతుల్లోకి ఈ భారీ సినిమా వెళ్లినట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే అనూహ్యంగా సిబి చక్రవర్తి కూడా ఈ మెగా ప్రాజెక్ట్ నుండి వైదొలగడంతో ఈ 173వ చిత్రానికి కొత్త కెప్టెన్ ఎవరు అనే సందిగ్ధత నెలకొంది. ఇలాంటి ఉత్కంఠభరితమైన పరిస్థితుల మధ్య, అశ్వత్ మారిముత్తు పేరు తెరపైకి రావడం, దానికి తగ్గట్టుగానే నిర్మాణ సంస్థ నుండి అఫీషియల్ విజువల్ ట్రిబ్యూట్ రావడం కోలీవుడ్‌లో కొత్త జోష్ నింపింది. ఈ ప్రత్యేక వీడియోపై దర్శకుడు అశ్వత్ స్పందిస్తూ సదరు నిర్మాణ సంస్థకు ఫైర్ ఎమోజీలతో తన కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం.    https://x.com/RKFI/status/2061662942643524001
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం.  ఇలాంటి పరిస్థితిలో అతిగా మాట్లాడం లేదా ఎక్కువ మాట్లాడటం కూడా భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేస్తుందని అంటున్నారు రెలేషన్షిప్ నిపుణులు. జరిగే ప్రతి విషయాన్ని తమ భాగస్వామితో పంచుకోవడం, ప్రతి విషయాన్ని చర్చించడం, అన్ని విషయాలు తమకు తెలిసి జరగాలి అనుకోవడం, ప్రతి చిన్న విషయం గురించి మాట్లాడటం.. ఇలా ప్రతిదీ భాగస్వామితో మాట్లాడం వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అవుతుంది అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఇది తెలుసుకోవాలి.. ఒక సంబంధాన్ని బలపరచడంలో  ముఖ్యమైనది ఎక్కువ మాట్లాడటం కాదు.. ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మాటలలో నిజాయితీ,  మాట్లాడే విషయం పట్ల అవగాహన,  దాని ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనవి.  ఏదో ఒకటి మాట్లాడాలి అని  కబుర్లు చెప్పుకోవడంలో బంధం బలపడటం అనేది జరగదు. ఇద్దరి ఆలోచనలు, ప్రవర్తనలు, ఇద్దరూ ఏదైనా విషయం గురించి మాట్లాడటం.. ఇలాంటి సందర్బాలు చాలా కొన్నే ఉన్నా అది బంధాన్ని బలపరుస్తుంది.  ఏదో ఒకటి మాట్లాడాలనే కారణంతో అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటే.. భాగస్వామి విసుగు చెంది  ఇలా కబుర్లు చెప్పడం అనే మంచి సమయానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సమయం ముఖ్యమే..  భార్యాభర్తలు రోజులో కొంత సమయం గడపడం చాలా కీలకమని నిపుణులే చెబుతున్నారు. ఇద్దరు కలిసి కొంత సమయం గడిపినప్పుడు, వారి మధ్య ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి, సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎప్పుడూ ఒకరితో మరొకరు అప్యాయత, అనురాగం,  ఇద్దరి మధ్య బంధం బలపడే  అవకాశం ఉంటుంది. చిన్న విషయాలు ఎందుకు మాట్లాడకూడదు.. కొందరు భాగస్వాములు చిన్న చిన్న విషయాలను కూడా చెబుతూ ఉంటారు. ఏ విషయాన్ని దాచుకోవడం లేదని, తాము బంధంలో ఎంతో నిజాయితీగా ఉంటున్నామని కూడా అంటుంటారు. కానీ ఇది చాలా పొరపాటు.  ప్రాముఖ్యత లేని విషయాల గురించి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య ఆసక్తి తగ్గి, అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇద్దరు కలిసి గడిపే సమయం నాణ్యంగా మార్చుకోవాలి. అంచనాలకు పోవద్దు.. టీవి, సినిమా, సీరియల్, చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు భార్యాభర్తల బందాలలో కొన్ని సంఘటనలు, సందర్భాలు చాలా సంతోషంగా, ఎంతో అపురూపంగా గడుపుతూ ఉంటారు.  ఇలాంటి బంధాలను చూసి తాము అలా ఉండాలని అనుకుంటారు చాలామంది. కానీ ఇలాంటి అంచనాలు పెట్టుకోవడం వల్ల చాలా అసంతృప్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కాస్తా భాగస్వామి విషయంలో ఒకరంటే ఒకరి పట్ల ఇష్టం,  ఆసక్తి తగ్గి,  చిరాకు, కోపం పెరిగేలా చేస్తుంది. మనిషిని బట్టే.. కొందరు ఎక్కువ మాట్లాడేవారు ఉంటారు. మరికొందరు తక్కువ మాట్లాడేవారు ఉంటారు. కాబట్టి మనిషిని బట్టి ముందుకెళ్లాలి.  బాగా మాట్లాడేవారితో ఏం మాట్లాడినా సరదాగా తీసుకుంటారు. కానీ ఎక్కువ మాట్లాడని వ్యక్తులు చిన్న చిన్న విషయాలకు చాలా చిరాగ్గా ఫీలవుతారు.  కాబట్టి మనిషిని బట్టి సాగితేనే బంధాలు బాగుంటాయి.                                    *రూపశ్రీ.
అపజయాలు ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అపజయాలు లేకపోతే అసలు విజయానికి విలువ, విజయాలు అనుభూతి చెందలేదు. కానీ ప్రతి ఒక్కరూ అపజయం అనేది తమకు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. అయితే అపజయాల విషయంలో మనిషి వైఖరి ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  "ఒక వ్యక్తి వెయ్యిమార్లు విఫలుడైనా ఉన్నతమైన ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. అబద్ధాలు చెప్పడం రాని గోడలా ఉండడం కన్నా, తప్పు చేస్తూ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉత్తమం" అని అనేవారు స్వామి వివేకానంద. అబ్రహమ్ లింకన్ తమ దేశ పార్లమెంటు సభ్యుడవ్వాలనుకున్నాడు. అయితే అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. వ్యాపారంలో భాగస్వామి అతణ్ణి మోసం చేశాడు. వ్యాపారం కోసం చేసిన అప్పుల బారినుంచి బయటపడడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. అతను వివాహం చేసుకున్న కొద్దికాలానికే మొదటి భార్య మరణించింది. గయ్యాళి అయిన రెండవ భార్య అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా అతడు తన లక్ష్యసాధనకై శక్తినంతా ఉపయోగిస్తూ, చేస్తున్న ప్రయత్నాలను మానలేదు. చివరకు అతను ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడై, చరిత్రపుటల్లోకి ఎక్కాడు. వ్యక్తిగత సమస్యలకు జడవకుండా, ఉన్నత ఆదర్శాన్ని విడవకుండా ప్రయత్నించిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలరు. మనిషి వ్యక్తిగత, సామాజిక, మానసిక రంగాలలో తప్పకుండా అభివృద్ధి సాధించాలి. అలా సాధించినప్పుడు మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ విషయం లోతు ఎంత అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఏమీ తెలియకుండా బెల్లం కొట్టిన రాయి చందాన మనిషి ప్రవర్తన కూడా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియని ముర్ఖుడిలా ఉండిపోతారు. ఇలా ఉంటే అపజయాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఏమీ నేర్చుకోలేరు. అపజయాల గురించి అసలు ఆలోచించలేరు. కేవలం అపజయాల కారణంగా తాము ఎదగలేక పోయామనే అసంతృప్తి మాత్రమే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపజయాలను అనుభవాలుగా చూసినప్పుడే మనిషి సరైన ఆలోచనా మార్గంలో ఉండగలుగుతారు.                                  *నిశ్శబ్ద.
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే విడిపోతున్నారు, ఇదే విడ్డూరం అనుకుంటే.. పెళ్లై ఏళ్ల తరబడి కాపురాలు చేసిన వారు కూడా విడాకులు తీసుకుంటున్నారు. వివాహం అనేది ఎంత సంతోషకరమైన విషయమో.. విడిపోవాలని నిర్ణయించుకోవడం,  విడాకులు తీసుకోవడం అంతకంటే బాధాకరమైన విషయం. ఒకరికి ఒకరు అనుకుని, జీవితాంతం కలిసి ఉండాలనుకుని భార్యాభర్తలుగా మారిన ఇద్దరు వ్యక్తులు విడిపోవాలని అనుకునే ముందు కొన్ని ప్రశ్నలు తమకు తాము వేసుకోవాలని అంటున్నారు  అవేంటో తెలుసుకుంటే.. విడిపోవడం.. చాలామంది భార్యాభర్తలు విడిపోవడం అంటే  కేవలం ఒక భావోద్వేగ ప్రతిచర్యగా కొట్టిపారేస్తుంటారు. కేవలం వారే కాదు.. చుట్టూ ఉన్న వ్యక్తులు, కుటుంబ సభ్యులు కూడా అలాగే అనుకుంటారు. కానీ విడిపోవడాన్ని కొద్దిపాటి అవగాహనతో, స్పష్టతతో ఆలోచించటం వల్ల విడిపోయిన తర్వాత పశ్చాత్తాపం పడకుండా  చూసుకోవచ్చు.  కొన్నిసార్లు కష్టంగా అనిపించినా, విడిపోవడం అనుకునే ఆలోచన ఆపుకోవడం అనేది సరైన నిర్ణయం అవుతుంది. అసలు సమస్య.. విడిపోవాలని అనుకునే నిర్ణయం కేవలం అలసట వల్ల లేక విసిగిపోవడం వల్ల లేక మరేదైనా తాత్కాలిక భావోద్వేగం వల్ల వచ్చిన ఆలోచనా లేదా నిజమైన సమస్యా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు లేదా గృహ సమస్యలు  సంబంధంపై ఒత్తిడిని కలిగించవచ్చు. కానీ  ఆలోచనలు, లక్ష్యాలు , పద్ధతులు భిన్నంగా ఉంటే, అది అంతకంటే లోతైన అగాధం అని అర్థం. ప్రేమ.. ప్రేమ అనేది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు, అది మెదడులోని ఒక రసాయన అనుసంధానం కూడా. ఒక బంధం ముగిసినప్పుడు, ఏదో ఒక అలవాటును తెంచుకుంటున్నట్లుగా శరీరం ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల, హఠాత్తుగా ఫోన్ చేయాలనే లేదా తిరిగి వెళ్లాలనే కోరిక కలగవచ్చు, కానీ వాస్తవానికి అది కేవలం ఒక శారీరక ప్రతిచర్య మాత్రమే. కాబట్టి లేని ప్రేమను ఉందని అనుకోవడం కూడా భ్రమే...  ఉన్న ప్రేమను చంపేసుకోవడం కూడా తప్పే.. పరిస్థితి.. విడిపోవాలని ఆలోచన ఏదైనా గొడవ లేదా సంఘర్షణ వంటివి జరగడం వల్ల వస్తాయి.  అలాంటివి జరిగినప్పుడు మిమ్మల్ని మీరు అప్పటికే విడిపోయామని  ఊహించుకోండి అంతా ముగిసిపోయిందని, మీరు ఒంటరిగా కూర్చున్నారని ఊహించుకోండి. మీకు లోపల విచారం లేకుండా ఏదో బరువు దిగిపోయినట్టు, జీవితం ఇక సాఫీగా ఉంటుందని.. ఇలా  తేలికైన భావన కలిగితే, ఆ బంధం అప్పటికే ముగిసిపోయిందనడానికి సంకేతం. అలా కాకుండా విడిపోయామని ఊహించుకున్నప్పుడు జీవితం అర్థం లేకుండా ఏదో కోల్పోయినట్టుగా,  భాగస్వామి ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తే అప్పుడు విడాకుల ఆలోచన తప్పని అర్థం. మనసే కాదు.. ఒక సంబంధాన్ని ముగించడం అనేది కేవలం మనసుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, దానిలో జీవితంలోని అనేక అంశాలను వదులుకోవడం కూడా ఉంటుంది. డబ్బు, స్నేహితులు, రోజువారీ అలవాట్లు అన్నీ మారిపోతాయి. తరచుగా, ఈ భయం ప్రజలను తిరిగి అదే సంబంధంలోకి వెళ్ళేలా చేస్తుంది. స్పష్టత.. అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే,  చెప్పాలనుకున్న విషయాన్న భాగస్వామికి  సరిగ్గా తెలియజేశారా? తమ  అవసరాలను, ఆందోళనలను భాగస్వామికి స్పష్టంగా తెలియజేయకపోతే, 'ఒకవేళ అలా జరిగి ఉంటే?' అనే సందేహాలు మిగిలిపోతాయి. అందువల్ల, ఒక నిర్ణయం తీసుకునే ముందు మీతో మీరు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం.                          *రూపశ్రీ.
       ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు.  మరికొందరు దీన్ని కేవలం అలసట లేదా నీరసం అని కొట్టిపారేస్తుంటారు.  అయితే ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటు. . ఇది  శరీరంలో ఒక నిర్దిష్ట వ్యాధికి తొలి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు, దీనిని వైద్యపరంగా ప్లాంటార్ ఫాసైటిస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి గురించి , దానిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు  తీసుకోవాలో తెలుసుకుంటే.. ఉదయం పూట చీలమండలు ఎందుకు నొప్పిస్తాయి? పాదం అరికాలి భాగం మడమ ఎముక నుండి కాలివేళ్ల వరకు ఉంటుంది. ఇది ప్లాంటార్ ఫాసియా అనే మందపాటి, బలమైన కణజాలపు పొరతో కప్పబడి ఉంటుంది. మనం నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు ఈ పొర మన పాదాలను కుదుపుల నుండి కాపాడుతుంది. ఈ కండర పట్టీపై ఎక్కువ  ఒత్తిడి పడినప్పుడు, అది చిన్న చిన్న చిరుగులకు , వాపుకు కారణమవుతుంది. రాత్రిపూట మన పాదాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఈ కణజాలం సంకోచిస్తుంది. ఉదయం నిద్రలేచి నేలపై మొదటి అడుగు వేయగానే, సంకోచించిన ఈ కణజాలం అకస్మాత్తుగా మళ్లీ సాగి, తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంది. కారణాలు.. శరీరంలో పెరిగిన కొవ్వు మడమలపై నేరుగా అధికంగా ఒత్తిడిని కలుగజేస్తుంది.  చాలా పలుచగా ఉండే లేదా ఆర్చ్ సపోర్ట్ లేని చెప్పులు, బూట్లు ధరించడం వల్ల కూడా అరికాళ్ళు దెబ్బతింటాయి.  పనిలో భాగంగా  గంటల తరబడి చాలాసేపు నిలబడవలసి వస్తే.. అలాంటి వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు.  శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం, ఎముకలు బలహీనపడటం లేదా విటమిన్ డి లోపం కూడా మడమ నొప్పిని పెంచుతాయి. ఇంటి చిట్కాలు..  మడమకు రోజుకు రెండు నుండి మూడు సార్లు 15 నిమిషాల పాటు ఐస్ పెట్టాలి. దీనివల్ల వాపు తగ్గుతుంది. మంచం దిగే ముందు కాళ్లు ఉన్నట్టుండి చాపకుండా  కాళ్లను , కాలివేళ్లను ముందుకు వెనుకకు సాగదీయాలి. ఎల్లప్పుడూ మందపాటి కుషన్ ఉన్న సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించాలి. ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి. నొప్పి కొన్ని రోజుల పాటు కొనసాగితే , నడవడంలో మరింత ఇబ్బంది ఉంటే వెంటనే ఎముకల వైద్యుడిని సంప్రదించాలి.                              *రూపశ్రీ.
  మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం, సూదుల నొప్పిని భరించడం ఎంత నరకంలా ఉంటుందో ఆ బాధను అనుభవించే వారికే తెలుస్తుంది. మీరు లేదా మీ ప్రియమైన వారు ఈ పరిస్థితుల్లో ఉన్నారా? కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని డాక్టర్లు చెప్పారా? అయితే ఆందోళన చెందకండి. ప్రకృతి ప్రసాదించిన ఔషధాలతో, ఆహారపు అలవాట్లలో మార్పులతో మీ కిడ్నీలను మళ్ళీ ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. పూర్తి వివరాల కోసం Dr. Srinivas Gupta గారు ఈ VIDEO లో వివరించారు. కిడ్నీల ఆరోగ్యం కోసం ప్రకృతి చిట్కాలు మన ఇంటి పరిసరాల్లో దొరికే మొక్కలే మనకు గొప్ప డాక్టర్లు. వందల ఏళ్లుగా ఆయుర్వేదంలో వాడబడుతున్న చిట్కాలు కిడ్నీ సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను చూపుతున్నాయి. వేపాకు మరియు రావి ఆకు కషాయం: ఐదు వేపాకులు మరియు మూడు రావి ఆకులను తీసుకుని, 100 ml నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు 50 ml అయ్యే వరకు మరిగించి, ఆ కషాయాన్ని తీసుకోవడం వల్ల క్రియాటినిన్ (Creatinine) మరియు యూరియా స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని వేల మంది పేషెంట్లలో గమనించడం జరిగింది.   మొక్కజొన్న పొత్తు జుట్టు (Corn Silk): మనం సాధారణంగా పడేసే మొక్కజొన్న పొత్తు జుట్టు కిడ్నీలకు ఒక వరం. దీనిని నీటిలో మరిగించి టీ లాగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా క్రియాటినిన్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి పసుపు టీ: పచ్చి పసుపు, అల్లం మరియు కరివేపాకులను నలిపి నీటిలో మరిగించి ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఆహారమే అతిపెద్ద మందు కిడ్నీ పేషెంట్లు రైస్ లేదా గోధుమ రొట్టెలకు బదులుగా బార్లీ (Barley) ని వాడటం శ్రేయస్కరం. బార్లీ ఒక నేచురల్ డయూరెటిక్ (diuretic) లాగా పనిచేసి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. కూరగాయల ఎంపిక: మీ మధ్యాహ్న భోజనంలో పొట్లకాయ (సొరకాయ) మరియు రాత్రి భోజనంలో బీరకాయను ఎక్కువగా చేర్చుకోవాలి. ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం చాలా ముఖ్యం. గ్రీన్ జ్యూసెస్: కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మరియు గ్రీన్ ఆపిల్‌తో చేసిన జ్యూస్ శరీరంలోని విషతుల్యాలను తొలగించడానికి (Detox) సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్: రక్తపోటును (BP) నియంత్రించడంలో మరియు కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక అమృతంలా పనిచేస్తుంది. ఆధునిక చికిత్స మరియు జీవనశైలి మార్పులు కేవలం ఆహారం మాత్రమే కాకుండా, ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లలో అందించే కిడ్నీ ప్యాక్, కిడ్నీ మసాజ్ మరియు కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ వంటి బాహ్య చికిత్సలు కిడ్నీలను మళ్ళీ ఉత్తేజితం చేస్తాయి. అలాగే, చెప్పులు లేకుండా నేల మీద నడవడం (Earthing) వల్ల శరీరం ఉత్తేజితమై ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందస్తు హెచ్చరికలు: యూరిన్ వెళ్ళినప్పుడు బాగా నురుగు వస్తుంటే, అది ప్రోటీన్ లీక్ అవుతున్నట్లు ప్రాథమిక సూచన. దీనిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న 1: క్రియాటినిన్ స్థాయిలను సహజంగా తగ్గించవచ్చా?  సమాధానం: అవును, వేపాకు మరియు రావి ఆకు కషాయం తీసుకోవడం, బార్లీ ఆహారంలో చేర్చుకోవడం మరియు కిడ్నీలకు సంబంధించిన ప్రత్యేక వ్యాయామాలు చేయడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలను తగ్గించవచ్చు. ప్రశ్న 2: డయాలసిస్ స్టేజ్ లో ఉన్నవారు కూడా ఈ చికిత్సలు ఫాలో అవ్వచ్చా?   సమాధానం: తప్పకుండా. ఫోర్త్ లేదా ఫిఫ్త్ స్టేజ్ లో ఉన్నవారు కూడా సరైన డైట్ మరియు నాచురల్ ట్రీట్మెంట్స్ ద్వారా తమ క్రియాటినిన్ స్థాయిలను తగ్గించుకుని సాధారణ స్థితికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రశ్న 3: కిడ్నీ పేషెంట్లు ఎలాంటి కూరగాయలు తినాలి?  సమాధానం: సొరకాయ మరియు బీరకాయ కిడ్నీలకు చాలా మంచివి. కూరగాయలను వాడే ముందు వాటిని బాయిల్ చేసి ఆ నీటిని పారబోయడం వల్ల పొటాషియం స్థాయిలు తగ్గుతాయి, ఇది కిడ్నీ పేషెంట్లకు ముఖ్యం.  కిడ్నీ సమస్య అనగానే భయపడిపోయి డయాలసిస్ లేదా ట్రాన్స్‌ప్లాంట్ వైపు వెళ్ళే ముందు, ఒకసారి మన ప్రకృతి అందించే చికిత్సలను నమ్మండి. క్రమశిక్షణతో కూడిన ఆహారం మరియు సరైన వ్యాయామంతో కిడ్నీలను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చుకోవడం అసాధ్యమేమీ కాదు.   మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్స్ : INDIA : + 917070999313  USA : +1(732)947-4166   మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు కిడ్నీ వ్యాధులపై పూర్తి అవగాహన కోసం మా యూట్యూబ్ ఛానెల్‌ TeluguOne Health ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి!  మీ ఆరోగ్యం - మీ చేతుల్లోనే!
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు (Bad Gums) నిర్లక్ష్యం చేస్తే అవి మన శరీరంలోని ఇతర భాగాలపై కూడా తీవ్ర प्रभावం చూపుతాయి. ఈ ముఖ్యమైన విషయంపై ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ సుధీర్ చౌదరి (Dentist, MDS) గారు అందించిన పూర్తి సమాచారం సరళమైన తెలుగులో ఈ వీడియో మీ కోసం... చిగుళ్ల సమస్యలకు ప్రధాన కారణాలు (Causes of Gum Diseases): ప్లేక్ మరియు టార్టార్ (Plaque & Tartar): మనం తినే ఆహార అవశేషాలు, నోటిలోని బ్యాక్టీరియా కలిసి పంటిపై ఒక జిగట పొరలా (Plaque) ఏర్పడతాయి. దీనిని సకాలంలో బ్రషింగ్ ద్వారా శుభ్రం చేయకపోతే అది గట్టిపడి టార్టార్‌గా మారుతుంది. ఇది చిగుళ్ల ఇన్ఫెక్షన్‌కు ప్రధాన కారణం. తప్పుడు బ్రషింగ్ విధానం: రోజుకు రెండు సార్లు బ్రష్ చేయకపోవడం లేదా చాలా గట్టిగా పళ్ళను తోమడం వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. పోషకాహార లోపం: శరీరంలో ముఖ్యంగా విటమిన్ సి (Vitamin C) మరియు కాల్షియం లోపం వల్ల చిగుళ్లు బలహీనపడతాయి. ఇతర ఆరోగ్య సమస్యలు: మధుమేహం (Diabetes) ఉన్నవారిలో, ధూమపానం (Smoking) అలవాటు ఉన్నవారిలో మరియు గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల చిగుళ్ల ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తాయి. చిగుళ్ల ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణాలు (Symptoms of Gum Infection): బ్రష్ చేస్తున్నప్పుడు లేదా గట్టి పదార్థాలు (ఆపిల్ వంటివి) తింటున్నప్పుడు చిగుళ్ల నుండి రక్తం కారడం (Bleeding Gums). చిగుళ్లు ఎర్రగా మారడం, వాపు రావడం మరియు ముట్టుకుంటే నొప్పిగా ఉండటం. నోటి నుండి విపరీతమైన దుర్వాసన రావడం (Bad Breath). పళ్ళు కదలడం లేదా పళ్ళ మధ్య ఖాళీలు (Gaps) ఏర్పడటం. చిగుళ్లు పంటి పైభాగం నుండి కిందికి జారిపోవడం (Gum Recession). చిగుళ్ల సమస్యలు ఇతర ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి? (Impact on Overall Health): చిగుళ్ల ఇన్ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేస్తే, ఆ బ్యాక్టీరియా రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రవహిస్తుంది. ఇది గుండె జబ్బులు (Heart Diseases), డయాబెటిస్ నియంత్రణ తప్పడం మరియు గర్భిణీ స్త్రీలలో ముందస్తు ప్రసవాల (Premature Delivery) వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నివారణ మరియు చికిత్స మార్గాలు (Prevention & Treatment): డెంటల్ స్కేలింగ్ (Scaling): ప్రతి ఆరు నెలలకు ఒకసారి డెంటిస్ట్‌ను సంప్రదించి పళ్ళను, చిగుళ్లను ప్రొఫెషనల్‌గా క్లీన్ (Scaling) చేయించుకోవాలి. దీనివల్ల పంటిపై పేరుకుపోయిన గట్టి టార్టార్ తొలగిపోతుంది. సరైన బ్రషింగ్ మరియు ఫ్లాసింగ్: మృదువైన (Soft) బ్రష్ ఉపయోగించి, రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి డెంటల్ ఫ్లాస్ (Floss) ఉపయోగించాలి. ఆరోగ్యకరమైన ఆహారం: విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, జామ వంటి పండ్లు మరియు ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. గమనిక : చిగుళ్ల నుండి రక్తం రావడం అనేది సాధారణ సమస్య కాదు, అది ఒక హెచ్చరిక. కాబట్టి పంటి సమస్యలు రాకముందే జాగ్రత్త పడటం ఎంతో మేలు.    మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health  సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!