ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేర్లు దువ్వాడ శ్రీనివాస్, దువ్వెల మాధురి. వీరిద్దరూ చిత్ర విచిత్ర విన్యాసాలతో నిత్యం వార్తల్లో ఉంటుంటారు. ఇప్పుడు తాజాగా దువ్వాడ మిస్సింగ్ అంటూ దివ్వెల మాధుడు చేస్తున్న హడావుడి మరో కొత్త డ్రామాయా అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.   శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో గత కొంతకాలంగా వ్యక్తిగత, రాజకీయ వివాదాలతో వార్తల్లో నిలిచిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వేల మాధురి ఎపిసోడ్ లో.. దువ్వాడ అదృశ్యం వార్త కలకలం రేపుతోంది.   వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై  కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో   నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.   అయితే ఆయన భారీ ర్యాలీగా బయలుదేరి మార్గమధ్యంలో  ఎలా మిస్సౌతారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  దువ్వాడ అనుచరులు, వైసీపీ  కార్యకర్తలు భారీ సంఖ్యలో కొత్తూరు పోలీసు స్టేషన్ కు చేరుకున్నా.. దువ్వాడ మాత్రం అక్కడకు రాలేదు.   దీంతో  దివ్వెల మాధురి   దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులే రహస్యంగా అదుపులోకి తీసుకుని ఉంటారంటూ ఆరోపణలు గుప్పించారు. ఎవడో ఊరూ పేరూ లేని వాడు కేసు పెడితే.. ఒక ఎమ్మెల్సీని పోలీసు స్టేషన్ కు పిలుస్తారా? అంటే మండిపడ్డారు. దువ్వాడకు ఏదైనా జరిగితే.. ఎవరినీ వదిలిపెట్టనంటూ పోలీసులపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.  కొత్తూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.    దివ్వెల మాధురి చేస్తున్న ఆరోపణలను కొత్తూరు పోలీసులు  తోసిపుచ్చారు. తాము దువ్వాడ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయలేదని, అసలు ఆయన పోలీస్ స్టేషన్‌ కే రాలేదని స్పష్టం చేశారు.  దువ్వాడే అరెస్టు భయంతో అజ్ణాతంలోకి వెళ్లి ఉంటారని పోలీసులు అంటున్నారు.  ఇక పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన దివ్వెల మాధురిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.  ఇక ఈ డ్రామాలో ట్విస్ట్ ఏమిటంటే.. పోలీసు స్టేషన్ కు బయలుదేరిన దువ్వాడ రూటు మార్చి.. ఒడిస్సావైపు వెళ్లడం. ఈ విషయాన్ని పోలీసులు ఆయన ఫోన్ సిగ్నల్స్ ద్వారా సాంకేతికంగా ధృవీకరించారు.  
కేంద్ర ఎన్నికల సంఘం   పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలే విమర్శించాయి.  ఎన్నికల నిర్వహణలో, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని  ధ్వజమెత్తాయి.ఈ మేరకు ప్రతిపక్ష  ఇండియా కూటమి పార్టీలు సంయుక్తంగా భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాయి. ఈ విషయంలో  సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఎన్నికల సంఘం నిర్ణయాలపై సమగ్ర న్యాయ సమీక్ష   నిర్వహించాలని ఆ లేఖలో డిమాండ్ చేశాయి.   దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని  పేర్కొన్నాయి. ఈ లేఖపై  ఇండియా కూటమికి చెందిన  23  పార్టీల నాయకులు సంతకాలు చేశారు.   ప్రతిపక్షాలన్నీ కలిసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా  హాట్ టాపిక్ గా మారింది. గతనెల  8న జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సీజేఐకి ఇండియా కూటమి పార్టీలు సంయుక్త లేఖ రాశాయి. ఈ లేఖపై ఇండియా కూటమి పార్టీల నేతలే కాకుండా, కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎంకే, ఆప్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు కూడా సంతకాలు చేశారు. అలాగే ఒక ఇండిపెండెంట్ ఎంపీ కూడా వీరిలో ఉన్నారు.   వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా తీవ్ర సవరణ' సర్  ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపించాయి. అధికార పార్టీకిలబ్ధి చేకూరేలా..   ఓటర్ల జాబితాను మేనిపులేట్ చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్, డెరెక్ ఒబ్రెయిన్ వంటి అగ్రనేతలు బ  విమర్శలు గుప్పించారు.  రాజ్యాంగ రక్షకుడిగా ఉన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగానైనా స్వీకరించి, ఈసీ పక్షపాత వైఖరిపై విచారణ జరపాలని ఇండియా కూటమి పార్టీలు ఆ లేఖలో కోరాయి. 
తమిళనాడు  ముఖ్యమంత్రి విజయ్ రాజకీయాలలో కొత్త ఒరవడి తీసుకువస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పార్టీ టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో విజయ్ పెరంబదూర్, తిరుచిరాపల్లి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల నుంచీ విజయం సాధించారు.   దీంతో  తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ తాజాగా తిరుచిరాపల్లిలో ఏర్పాటు చేసిన కృతజ్ణతా సభలో చేసిన ప్రకటన ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. తిరుచిరాపల్లి ఉప ఎన్నికలో టీవీకే తరఫున స్థానిక అభ్యర్థి మాత్రమే పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉంటారని ఆయన విస్పష్టంగా చెప్పారు.   పార్టీ అధినేత స్థానిక నేతకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పడంతో, గ్రౌండ్ లెవెల్‌లో టీవీకే క్యాడర్ మరియు స్థానిక కార్యకర్తలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.   విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమికి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే మద్దతు ఉండటంతో ప్రభుత్వం స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ బై-ఎలక్షన్ ద్వారా టీవీకే ప్రభావాన్ని దెబ్బతీయాలని డీఎంకే వ్యూహాలు రచిస్తోంది. ఆ వ్యూహాలకు చెక్ పెట్టే దిశగా విజయ్ ముందుకు సాగుతున్నారనడానికి లారెన్స్ కు టికెట్ నిరాకరించి, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే స్థానిక నేతకే పార్టీ టికెట్ ఇస్తానని ప్రకటించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ   విజయ్ అవినీతి రహిత పాలన,  సామాజిక న్యాయంపై ఇచ్చిన హామీలకు అనుగుణంగానే పాలన సాగిస్తున్నారన్న భావన రాజకీయవర్గాలలో సైతం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే.. తిరుచ్చిలో స్థానికునికే పార్టీ టికెట్ ప్రకటన ఈ ఉప ఎన్నికలో టీవీకే విజయాన్ని దాదాపు ఖరారు చేసేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu) కాంబినేషన్ లో వచ్చిన 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తదుపరి చిత్రాలకు సంబంధించిన ఒక సంచలన వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన కెరీర్‌ను ఎంతో పక్కా ప్రణాళికతో ప్లాన్ చేసుకుంటున్న చరణ్, రాబోయే సినిమాల విషయంలో సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబుతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని ఆయన మరోసారి నిరూపించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, వీరిద్దరి కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ లైన్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనుక అసలు కథ చూస్తే, రామ్ చరణ్ స్వయంగా టాలీవుడ్‌కు చెందిన ఒక అగ్ర నిర్మాతకు కీలకమైన సూచన చేసినట్లు సమాచారం. దర్శకుడు బుచ్చిబాబుకు ఒక భారీ అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి, ఆయన డేట్స్‌ను ఇప్పుడే లాక్ చేయాల్సిందిగా చరణ్ ఆ నిర్మాతను కోరారట. హీరో స్వయంగా రంగంలోకి దిగి చెప్పడంతో, ఆ టాప్ ప్రొడ్యూసర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బుచ్చిబాబుకు భారీ స్థాయిలో అడ్వాన్స్ అమౌంట్‌ను అందజేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు ఈ భారీ అడ్వాన్స్‌ను అందుకోవడంతో, రామ్ చరణ్‌తో ఆయన చేయబోయే తదుపరి సినిమా దాదాపు ఖరారైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సరికొత్త అప్‌డేట్‌తో మెగా అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే, రామ్ చరణ్ రాబోయే చిత్రాల లైనప్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చరణ్ తన 17వ చిత్రాన్ని (RC17) క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' చిత్రం ఎలాంటి రికార్డులను తిరగరాసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మళ్లీ సుకుమార్-రామ్ చరణ్ కలయికలో రాబోతున్న RC17 ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది. అయితే, ఈ సినిమా తర్వాత రాబోయే 18వ చిత్రం (RC18) ఎవరితో ఉంటుందనే సస్పెన్స్‌కు ఈ తాజా అప్‌డేట్‌తో తెరపడింది. సుకుమార్‌తో చేయబోయే RC17 సినిమా పూర్తయిన వెంటనే, రామ్ చరణ్ తన 18వ చిత్రాన్ని (RC18) మళ్లీ బుచ్చిబాబు దర్శకత్వంలోనే పట్టాలెక్కించబోతున్నారు. ఒకే సమయంలో ఒక స్టార్ డైరెక్టర్ (సుకుమార్), ఆయన శిష్యుడైన మరో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ (బుచ్చిబాబు) లతో వరుసగా సినిమాలు ప్లాన్ చేయడం టాలీవుడ్‌లో ఒక అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. చరణ్ నమ్మకాన్ని బుచ్చిబాబు తన మేకింగ్ స్టైల్‌తో నిలబెట్టుకోవడంతోనే ఈ రెండో అవకాశం దక్కిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. కథల ఎంపికలోనూ, టేకింగ్ విషయంలోనూ బుచ్చిబాబు చూపిస్తున్న ప్రతిభకు రామ్ చరణ్ ఫిదా అయ్యారని, అందుకే సుకుమార్ సినిమా తర్వాత వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారని అర్థమవుతోంది.  
రాజకీయ వేదికలపై పదునైన విమర్శలు, వ్యూహాత్మక ప్రసంగాలతో ఎప్పుడూ అత్యంత బిజీగా ఉండే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ఎవరూ ఊహించని సరికొత్త ఎంటర్‌టైనింగ్ లుక్‌లో మెరిసి అందరినీ ఫిదా చేశారు. నిత్యం ప్రజా సమస్యలు, ప్రెస్ మీట్లతో గంభీరంగా కనిపించే ఒక పవర్‌ఫుల్ లీడర్, ఒక్కసారిగా చిన్నారులతో కలిసి సందడి చేస్తే ఎలా ఉంటుందో ఈ ప్రత్యేక కార్యక్రమం నిరూపించింది. 'ది అండర్ 18 వరల్డ్' అనే చిన్నారుల గ్రూప్‌తో కేటీఆర్ సరదాగా ముచ్చటించిన ఒక ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా హల్‌చల్ చేస్తూ, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిట్‌చాట్ సెషన్‌లో పిల్లలు తమదైన శైలిలో అడిగిన కొన్ని గూగ్లీ లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేటీఆర్ సరదాగా తల పట్టుకోవడం, అమాయకంగా నవ్వడం అందరినీ ఎంతగానో నవ్విస్తోంది. అయితే, ఈ టాక్ షోలోనే అసలైన బిగ్ ట్విస్ట్ ఇస్తూ.. ఇంటర్వ్యూ లైవ్‌లో జరుగుతుండగానే రెబల్ స్టార్, గ్లోబల్ ఐకాన్ ప్రభాస్‌కు కేటీఆర్ నేరుగా ఫోన్ కాల్ చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేటీఆర్ ఫోన్ ఎత్తి ప్రభాస్‌తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం చూసి, అక్కడ షూటింగ్‌లో ఉన్న పిల్లలతో పాటు ఆడియన్స్ సైతం ఆనంద డోలికల్లో మునిగిపోయారు. డార్లింగ్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అలాంటిది లైవ్ షోలో ఆయన వాయిస్ వినబడటంతో షో ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయింది. మరోవైపు, ఈ సరదా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఒక చిన్నారి కేటీఆర్‌కు ఊహించని విధంగా ఒక ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసిరింది. దానికి కేటీఆర్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా, ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అన్నట్లుగా స్టేజ్ పైనే ఆ చిన్నారితో గట్టిగా పోటీ పడి మరీ పుష్-అప్స్ తీసి తన అద్భుతమైన ఫిట్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక పొలిటికల్ లీడర్‌లో ఈ స్థాయి స్పోర్టివ్ స్పిరిట్, ఫిట్‌నెస్ లెవెల్స్ ఉండటం చూసి యువత సైతం షాక్ అవుతున్నారు. సరిగ్గా ఇంటర్వ్యూ ఇలా ఎంతో రసవత్తరంగా, ఫన్నీగా సాగుతున్న సమయంలోనే షోలో అసలైన రియల్ లైఫ్ హైలైట్ సీన్ ఒకటి చోటుచేసుకుంది. టాక్ షో మధ్యలో కేటీఆర్ పర్సనల్ మొబైల్‌కు ఆయన భార్య కల్వకుంట్ల శైలిమ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. భార్య పేరు స్క్రీన్ మీద చూడగానే ఎంతటి పవర్‌ఫుల్ లీడరైనా ఒక్కసారిగా కంగారు పడటం సహజం కదా, కేటీఆర్ కూడా అలాగే కాస్త కంగారు పడుతూ.. 'నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన షోలో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తా' అంటూ అత్యంత వేగంగా ఫోన్ కట్ చేయడం ఈ ప్రోమోకే అసలైన ముక్తాయింపుగా, మేజర్ హైలైట్‌గా నిలిచింది. ఎంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడైనా, ఇంట్లో భార్య ఫోన్ వస్తే వచ్చే ఆ చిన్నపాటి ఆందోళన, గౌరవం కామనే కదా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల ఫన్నీ మీమ్స్, కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రాజకీయ నాయకుడిలోని సరికొత్త హుషారైన వినోదాత్మక కోణాన్ని, ఒక ఫ్యామిలీ మేన్‌ను ఆవిష్కరించిన ఈ ఫుల్ ఇంటర్వ్యూ వీడియో 100 శాతం డిజిటల్ ఆడియన్స్‌ను అలరించడానికి త్వరలోనే అధికారికంగా రిలీజ్ కానుంది.
సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) ప్రధాన పాత్రలో సరికొత్త థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న చిత్రం 'హ్యాంగ్‌మ్యాన్' (Hangman). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్స్ట్' (Sun NXT) విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే సమాజంలోని ఒక అత్యంత సున్నితమైన, వివాదాస్పదమైన మరియు బాధ్యతాయుతమైన వృత్తి నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని స్పష్టమవుతోంది. ఉరిశిక్షలు అమలు చేసే జైలు సిబ్బంది (హ్యాంగ్‌మ్యాన్) జీవితం, వారి మానసిక సంఘర్షణ, వారి కుటుంబాలు ఎదుర్కొనే సామాజిక ఇబ్బందులను ఈ చిత్రంలో చాలా సహజంగా, కాస్త రా అండ్ రస్టిక్ పంథాలో చూపించబోతున్నారు. ట్రైలర్ ప్రారంభంలోనే "మన పని మనిషిని బాధపెట్టడం కాదు.. చంపడం మాత్రమే" అంటూ సాగే డైలాగ్స్ ఈ సినిమా కథ ఎంత ఇంటెన్సివ్‌గా ఉండబోతుందో హింట్ ఇస్తాయి. తరతరాలుగా వస్తున్న ఈ కులవృత్తిని చేస్తూ, సమాజంలో కేవలం ఒక మురికి పని చేసే చేతులుగా సమాజం చూసే ఓ వ్యక్తి ఆవేదనను బ్రహ్మాజీ తన నటనతో అద్భుతంగా పండించారు. ఉరి తీసే ప్రక్రియలో భాగంగా కొలతలు తీసుకోవడం, ఒక్కో ఉరికి 25 వేల చొప్పున భారీ మొత్తంలో రూపాయలు ఇవ్వడం లాంటి సీన్లు ఇండస్ట్రీలో ఇప్పటివరకు రాని ఒక రా జైలు డ్రామాను కళ్ళకు కడుతున్నాయి. నీ సంవత్సరం జీతం కంటే ఎక్కువ డబ్బులు ఇస్తాం సంతకం చెయ్ అంటూ వచ్చే సన్నివేశాలు ఈ వృత్తి వెనుక ఉండే ఆర్థిక ఇబ్బందులను కూడా ఎత్తిచూపుతున్నాయి. మరోవైపు, రాజధానిలో 24 ఏళ్ల ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై మానవ మృగాలు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారనే న్యూస్ బులిటెన్ సీన్ ఈ కథను ఒక కీలకమైన సామాజిక సమస్యతో ముడిపెడుతుంది. తప్పు చేస్తే ఉరి శిక్ష పడుతుంది అంటే ఒక్కొక్కడికి భయం పుట్టాలి, అప్పుడే సమాజంలో ఇలాంటి దారుణాలు ఆగుతాయి అనే బలమైన సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇవ్వబోతున్నారు. సమాజంలో పెద్ద తప్పులు చేసే క్రిమినల్స్, వారు ఎంపీ కొడుకైనా, సీఎం కొడుకైనా సరే చట్టం ముందు సమానమేనని, అలాంటి వాళ్లను జైలు గదిలో ఉరి తీసే సీన్లు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. జైలు నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ డ్రామా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకోనుంది. ఈ వైవిధ్యభరితమైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ జూలై 3న నేరుగా 'సన్ నెక్స్ట్' ఓటీటీ వేదికగా డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ నటన, ఆయన లుక్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచిపోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సమాజంలో నేరస్థులకు పడే శిక్షలు, చట్టం యొక్క పవర్, హ్యాంగ్‌మ్యాన్ ఎదుర్కొనే నిద్రలేని రాత్రుల చుట్టూ తిరిగే ఈ భావోద్వేగభరిత కథాంశం ఓటీటీ ఆడియన్స్‌కు ఒక సరికొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.  
  ఇప్పుడు 'అ' అంటే అనిరుద్ అనే పరిస్థితి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో  అనిరుధ్ అంటే ఒక  బ్రాండ్‌గా మారిపోయిందని కూడా చెప్పవచ్చు. తనదైన స్టైల్ చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో పాటు, థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అందించడంలో  సిద్ధహస్తుడు. అందుకే ఇప్పుడు టాలీవుడ్‌కి  చెందిన టాప్ ప్రొడ్యూసర్లు, స్టార్ హీరోలు, దర్శకులు తమ సినిమాలకి  అనిరుధ్ మ్యూజిక్ మాత్రమే కావాలని పట్టుబడుతున్నారు. దీంతో ఇండస్ట్రీలో అనిరుధ్  జపం గట్టిగా వినిపిస్తోంది. దీంతో ఒకప్పుడు  15 కోట్ల రూపాయలుగా ఉన్న అనిరుధ్ రెమ్యునరేషన్, ఇప్పుడు ఏకంగా 25 కోట్ల రూపాయల భారీ మార్కుకి చేరుకుంది. ఇదంతా మన తెలుగు నిర్మాతల చలవే. ఈ స్థాయిలో పారితోషికం అందుకోవడం ద్వారా దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రికార్డు సృష్టించారు. సాధారణంగా ఈ స్థాయి రెమ్యూనరేషన్ చాలా మంది హీరోల పారితోషికంతో సమానమని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. అయినప్పటికీ, అనిరుధ్ పేరుతో వచ్చే క్రేజ్, సోషల్ మీడియాలో వచ్చే హైప్, సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్‌పై పడే సానుకూల ప్రభావం దృష్ట్యా నిర్మాతలు ఆయన అడిగినంత ఇచ్చేందుకు వెనకాడటం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'AA23' సినిమా కోసం అనిరుధ్‌ కి  25 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో రజనీకాంత్ 'కూలీ' సినిమాకు ఆయన తీసుకున్న  10 కోట్ల నుండి 12 కోట్ల పారితోషికంతో పోలిస్తే ఇది రెండింతలు ఎక్కువ కావడం విశేషం. also read: Peddi: పెద్ది ఓటిటి డేట్ పై షాకింగ్ అప్ డేట్.. ముమ్మాటికీ ఇది వీళ్ళ పనే! టాలీవుడ్‌లో అనిరుధ్ క్రేజ్ ఇక్కడితో ఆగడం లేదు. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్' కోసం అనిరుధ్ సుమారు రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన 'ఆయా షేర్' సాంగ్ సోషల్ మీడియాలో చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' కోసం రూ. 18 కోట్లు, దళపతి విజయ్ 'జన నాయగన్' కోసం రూ. 15 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీలో ఒక చిన్న టాక్ ఉంది.. అనిరుధ్ ట్యూన్స్ ఇవ్వడంలో కొంచెం లేట్ చేస్తాడని, రీ-రికార్డింగ్ సమయంలోనూ సమయానికి అవుట్‌పుట్ ఇవ్వడని అంటుంటారు. ఐనప్పటికీ, ఆయన ఇచ్చే అవుట్‌పుట్ థియేటర్లలో ప్రేక్షకులకు ఇచ్చే కిక్ వేరే లెవెల్‌లో ఉండటంతో దర్శకనిర్మాతలు అనిరుధ్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. రీసెంట్ గా అధికారకంగా స్టార్ట్ అయిన ఎన్టీఆర్, త్రివిక్రమ్  గాడ్ ఆఫ్ వార్ కి కూడా అనిరుద్ నే.  
ప్రేమ... అది ఎంతటి మధురమైన అనుభూతిని ఇస్తుందో, ఒక్కోసారి అంతకంటే పెద్ద రాక్షసిగా కూడా మారుస్తుంది. అది ఒక అందమైన భ్రమ, దాని లోతుల్లో దాగున్న మోసాన్ని అర్థం చేసుకుంటేనే ఆ నిజం బయటపడుతుంది. రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'టాక్సిక్' (Toxic) చిత్రం నుంచి తాజాగా విడుదలైన ‘లేడీస్ & లేడీస్’ (Ladies & Ladies) వీడియో ఇండస్ట్రీలో ఒక సరికొత్త సంచలనాన్ని సృష్టిస్తోంది. ఈ సినిమా కేవలం ఒక యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, పెద్దల కోసం రూపొందించిన ఒక అద్భుతమైన కథ (A Fairytale for Grown-Ups) అని మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రత్యేకమైన వీడియోలో సినిమాలోని నారీ శక్తిని పరిచయం చేసిన విధానం ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ కథానాయికలు నటిస్తుండటం విశేషం. లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి, మరియు కన్నడ క్వీన్ రుక్మిణీ వసంత్ వంటి పవర్‌ఫుల్ భామలు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘లేడీస్ & లేడీస్’ వీడియోలోని ప్రతి ఫ్రేమ్‌లోనూ ఈ నటీమణులు తమదైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇందులో ప్రతి పాత్ర ఎంతో పవర్‌ఫుల్ గా, విభిన్నమైన షేడ్స్ తో, రహస్యాలతో నిండి ఉన్నట్లు కనిపిస్తోంది. ఒక పక్క నయనతార గంభీరమైన లుక్, కియారా అద్వానీ భావోద్వేగ ప్రయాణం, తారా సుతారియా ఎనర్జీ, రుక్మిణీ వసంత్ యాక్షన్ ఇంటెన్సిటీ, హ్యుమా ఖురేషి నటన సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లాయి. ఈ ప్రచార చిత్రం ప్రారంభంలోనే మేకర్స్ ఇచ్చిన డిస్క్లైమర్ (Disclaimer) అందరి దృష్టిని ఆకర్షించింది. "పిల్లలు... దూరంగా ఉండండి. తల్లిదండ్రులు... మీ పిల్లలు దూరంగా ఉండేలా చూసుకోండి. తాతయ్యలు, అమ్మమ్మలు... మీ మనవళ్లు రాకుండా చూసుకోండి. ముత్తాతలు... మీ స్వంత రిస్క్‌పైనే చూడండి" అంటూ ఇచ్చిన ఈ బోల్డ్ వార్నింగ్ సినిమా ఎంత పవర్‌ఫుల్ గా మరియు అన్‌ఫిల్టర్డ్‌గా ఉండబోతుందో హింట్ ఇచ్చింది. ఒక మహిళ వాయిస్ ఓవర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుండటం, ప్రేమ మరియు ద్రోహం గురించిన డైలాగ్స్ సినిమాలోని అసలు కథను మరియు అందులోని డార్క్‌నెస్ ను పరిచయం చేశాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions), మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ 'టాక్సిక్' చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మరియు మలయాళ భాషల్లో గ్రాండ్‌గా డబ్ చేసి విడుదల చేయనున్నారు. రాకింగ్ స్టార్ యష్ కేవలం హీరోగానే కాకుండా ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. అన్ని హంగులతో ముస్తాబవుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా 2026 ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది.   
      మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో  'పెద్ది'(Peddi)బాక్సాఫీస్ వద్ద స్టిల్ 400 కోట్లకి పైగా కలెక్షన్స్ ని సాధిస్తూ తన విజయ  పరంపరని  కొనసాగిస్తోంది. దీంతో చరణ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా పెద్ది నిలిచాడు. దర్శకుడు బుచ్చిబాబు(Buchibabu)సానా అద్భుతమైన విజువల్స్ మరియు భావోద్వేగాలతో తెరకెక్కించిన ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా  లాస్ట్ మంత్  జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.  ఈ భారీ చిత్రం డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ అత్యంత భారీ మొత్తానికి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం నాలుగు వారాల థియేట్రికల్ విండో ముగించుకుని, 2026 జూలై 2 నుంచే ఓటీటీలో సందడి చేస్తుందని అందరూ భావించారు. అయితే, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌కి సంబంధించి వినిపిస్తున్న  తాజా వార్త ఓటిటి సినీ ప్రియులని తీవ్ర నిరాశకి  గురిచేస్తోంది.  విశ్వసనీయ సమాచారం ప్రకారం, 'పెద్ది' ఓటీటీ విడుదల మరో రెండు వారాల పాటు వాయిదా పడినట్లు తెలుస్తోంది. జూలై 2 కాకుండా, జూలై 16 నుంచి స్ట్రీమింగ్ చేయాలని ఫిక్స్ అయినట్టుగా  ప్రచారం సాగుతోంది. థియేటర్లలో ఈ సినిమా ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతుండటమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని ఇండస్ట్రీ వర్గాలు  అంటున్నాయి. నాలుగు వారాల తర్వాత కూడా ఈ చిత్రం థియేటర్లలో ప్రతిరోజూ దాదాపు 1 కోటికి పైగా వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది. కలెక్షన్ల పరంగా ఇంతటి దూకుడు ప్రదర్శిస్తుండటం వల్లే, ఓటీటీ రిలీజ్ ని పొడిగించారని అంటున్నారు. Also read: zombie reddy 2: జాంబీరెడ్డి 2 అప్ డేట్ వైరల్.. తేజ సజ్జతో జోడి కడుతున్న బాలీవుడ్ అగ్ర హీరో కూతురు!  అయితే  జూలై 16 పై నెట్‌ఫ్లిక్స్ గానీ, నిర్మాణ సంస్థ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ జూలై 16న విడుదల ఖరారైతే, సౌత్ భాషలైన తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళంలో ఒకేసారి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. అయితే హిందీ వెర్షన్ మాత్రం థియేట్రికల్ విండో నిబంధనల కారణంగా జూలై 30, 2026 నుంచి విడిగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.   
The upcoming action film Toxic: A Fairytale for Grown-Ups has released a new promotional video titled ‘Ladies & Ladies’, shifting the focus toward its female cast. While the project is primarily fronted by actor Yash, this latest teaser dedicates its runtime to highlighting the characters played by Nayanthara, Kiara Advani, Tara Sutaria, Rukmini Vasanth, and Huma Qureshi. Rather than relying on standard action sequences, the video uses a female voice-over to establish a dark, rebellious atmosphere. The brief glimpses of the actresses suggest they will occupy substantial, complex roles within the film's gritty setting, moving away from conventional supporting parts. To reinforce the mature rating implied by its title, the promo also features a tongue-in-cheek disclaimer strongly advising against viewership by children. Directed by Geetu Mohandas and produced by KVN Productions alongside Monster Mind Creations, the film is attempting to build a broader, character-driven universe. Shot simultaneously in Kannada and English, the project is slated for a theatrical release on August 26, 2026, with dubbed versions planned in Hindi, Telugu, Tamil, and Malayalam.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.    
    యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja)ఇప్పుడు కేవలం టాలీవుడ్ హీరో మాత్రమే కాదు, పాన్ ఇండియా హీరో.. పాన్ ఇండియా లెవల్లో హనుమాన్, మిరాయ్ సాధించిన విజయాలే ఒక ఉదాహరణ.  ఈ కోవలోనే తన కెరీర్‌లో ఫస్ట్ సోలో హిట్ గా నిలిచిన 'జాంబీ రెడ్డి' చిత్రానికి సీక్వెల్‌గా 'జాంబీ రెడ్డి 2'(zombie reddy 2)తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రేజీ సీక్వెల్‌కి సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె, గ్లామర్ బ్యూటీ షనయా కపూర్ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే షూటింగ్  ప్రారంభం కాగా, తేజ సజ్జ, షనయా కపూర్‌లపై కొన్ని కీలకమైన యాక్షన్, డ్రామా సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ గ్లామర్ టాలీవుడ్ జానపద మరియు రాయలసీమ బ్యాక్‌డ్రాప్ జాంబీ థ్రిల్లర్‌కి  తోడైతే స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.  విలక్షణ నటుడు ఎస్‌జే సూర్య ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటం విశేషం. Also read: Nbk 111: మాస్ కా బాప్ ఈజ్ బ్యాక్.. గర్జించనున్న నందమూరి సింహం! ఈసారి ఈ ప్రాజెక్ట్‌లో మరో ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు కేవలం కథను మాత్రమే అందిస్తున్నారు. ఈ వైల్డ్, డెడ్లీ జాంబీ యూనివర్స్‌ను భారీ స్క్రీన్‌పై ఆవిష్కరించేందుకు ప్రముఖ బాలీవుడ్ మరియు హిందీ ఓటీటీ దర్శకుడు సుపర్ణ్ వర్మ మెగాఫోన్ పడుతున్నారు. మొదటి భాగంలో రాయలసీమ ఫ్యాక్షన్ డ్రామాకు జాంబీ కాన్సెప్ట్‌ను జోడించి 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించగా, ఈసారి సీక్వెల్‌లో సన్నివేశాలు మరింత క్రూరంగా, హారర్ ఎలిమెంట్స్ 2 రెట్లు ఎక్కువగా ఉండేలా కథని  సిద్ధం చేశారు. తేజ సజ్జ ప్రస్తుతం 'మిరాయ్ 2' మరియు 'జాంబీ రెడ్డి 2' చిత్రాల షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఈ రెండు భారీ సీక్వెల్స్ 2027 ప్రథమార్ధంలో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్  హంగులతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.   
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. తోటి నటీనటుల సినిమాలకు ఎప్పుడూ అండగా నిలిచే మన డార్లింగ్, ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆల్ఫా' (Alpha) చిత్రబృందానికి అదిరిపోయే సపోర్ట్ అందించారు. ఆల్ఫా మూవీ ట్రైలర్‌ను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ, ఆలియా భట్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట ఒక సంచలనంగా మారింది. కేవలం అభిమానుల్లోనే కాకుండా మొత్తం సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ప్రభాస్ చూపించిన ఈ అప్యాయతకు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కూడా అంతే వేగంగా స్పందించారు. ప్రభాస్ పోస్ట్‌ను రీషేర్ చేస్తూ, “థ్యాంక్యూ సో మచ్ ప్రభాస్” అంటూ ఎంతో సంతోషంతో తన కృతజ్ఞతలను చాటుకున్నారు. సోషల్ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య జరిగిన ఈ స్వీట్ కన్వర్జేషన్ ఇప్పుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే, ఈ పోస్ట్ వెనుక ఒక పెద్ద సినిమాటిక్ ట్విస్ట్ ఉందంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా బాలీవుడ్ చిత్రాల ట్రైలర్లను ప్రభాస్ ప్రమోట్ చేయడం అరుదు. అలాంటిది ఆలియా సినిమా కోసం ఆయన ప్రత్యేకంగా స్పందించడం వెనుక ఒక బలమైన కారణం ఉందనే ప్రచారం జోరందుకుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక క్రేజీ రూమర్ తెగ హల్‌చల్ చేస్తోంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్ విజువల్ వండర్ 'కల్కి 2898 AD' సీక్వెల్‌ (Kalki 2) లో ఆలియా భట్ ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో జరిగిన రెండవ షెడ్యూల్‌లో ఆలియా భట్ దాదాపు 5 రోజుల పాటు సైలెంట్‌గా షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ సీక్వెల్‌లో ఆమె దీపికా పదుకొణె పాత్రను రీప్లేస్ చేయడం లేదని, కథను మలుపు తిప్పే ఒక సరికొత్త పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రభాస్ స్వయంగా ఆలియాకు సోషల్ మీడియాలో మద్దతు తెలపడంతో, ఈ 'కల్కి 2' రూమర్స్‌ నిజమేనంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. కాగా, ఆలియా భట్ నటిస్తున్న 'ఆల్ఫా' చిత్రం యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) స్పై యూనివర్స్ లో వస్తున్న మొట్టమొదటి ఫీమేల్ లీడ్ యాక్షన్ ఫిల్మ్ కావడం విశేషం. ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.   
  అల్లు అర్జున్(Allu Arjun).. ఇది పేరు కాదు బ్రాండ్ అనే రీతిలో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తనకి  ఆ బ్రాండ్ వచ్చేలా చేసిన సినిమా కోసం, ప్రేక్షకుల కోసం  అత్యాధునిక హంగులతో కూడిన మల్టి ప్లెక్స్ లని నిర్మిస్తున్నాడు. ఈ కోవలోనే హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో, కోకాపేటలో  'AAA' సినిమాస్ పేరుతో అందుబాటులోకి తెచ్చాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్(VIzag)లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మల్టి ప్లెక్స్ కి సరికొత్త ప్రణాళికల సిద్ధమైంది. దక్షిణాదిలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, దాదాపు 13 ఎకరాల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న వైజాగ్ 'ఇన్‌ఆర్బిట్ మాల్' లో ఈ సరికొత్త ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ ఏర్పాటు కానుంది. ఈ మల్టీప్లెక్స్‌కు సంబంధించిన భూమి పూజా కార్యక్రమం తాజాగా అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ పూజా కార్యక్రమంలో అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో పాటు ఏషియన్ సినిమాస్ భాగస్వాములైన నారంగ్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొని ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ పనులకి  ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ వేడుకకి విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్, ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ చైర్మన్ భరత్ భూషణ్, ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ సరాఫ్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, శ్రీమతి శ్యామల దీపక్‌తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై అల్లు అర్జున్ కుటుంబానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వైజాగ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్న ఈ సరికొత్త ప్రీమియం మల్టీప్లెక్స్‌లో మొత్తం ఎనిమిది అత్యాధునిక స్క్రీన్‌లని  ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని అందించడమే లక్ష్యంగా 4K ప్రొజెక్షన్ సిస్టమ్‌లు, సరికొత్త డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీతో ప్రతి స్క్రీన్‌ని  అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. భారీ స్క్రీన్‌లు, కంటికి మైమరపించే విజువల్ క్వాలిటీ, గుండెల్లో ప్రతిధ్వనించే శక్తివంతమైన ఆడియో సిస్టమ్‌తో ప్రతి ఒక్క మూవీ లవర్ ఇక్కడ సినిమా చూస్తే 'తగ్గేదేలే' అనేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, విలాసవంతమైన ఇంటీరియర్స్, అత్యంత సౌకర్యవంతమైన లగ్జరీ పుష్-బ్యాక్ మరియు రెక్లైనర్ సీటింగ్, నోరూరించే అత్యాధునిక ఫుడ్ కోర్ట్స్ వంటి ఆధునిక వసతులు ఈ మల్టీప్లెక్స్ సొంతం.    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది  మనుషులను దగ్గర చేస్తుంది. కానీ కొన్నిసార్లు  తెలియకుండానే అవతలి వ్యక్తికి అసౌకర్యం కలిగించే ప్రశ్నలు అడుగుతుంటారు. అడిగేవారి  ఉద్దేశాలు తప్పు కాకపోయినా, కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు ఇతరులకు నచ్చకపోవచ్చు , పైగా ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల ఎదుటివారు బాధపడతారు కూడా.  నేటికాలంలో  గతంలో కంటే తమ వ్యక్తిగత జీవితాల పట్ల చాలా మందికి ఎక్కువ శ్రద్ధ ఉంటోంది. అయితే  ప్రతి వ్యక్తికి వారి స్వంత హద్దులు , వ్యక్తిగత గోప్యత ఉంటాయి, వాటిని గౌరవించాలి. కొన్నిసార్లు, మనం కేవలం కుతూహలంతో ప్రశ్నలు అడుగుతాము, కానీ అవతలి వ్యక్తి దానిని తమ పర్సనల్  విషయాల్లోకి చొరబడినట్లుగా భావించే అవకాశం ఉంటుంది. ఇది సంబంధాలు చెడిపోయే అవకాశాన్ని పెంచుతుంది. ఎవరినీ అడగకూడని నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ఎవరినీ నొప్పించకుండా ఉండగలం. అవేంటంటే.. జీతం.. ఒకరి ఆదాయం లేదా జీతం గురించి అడగడం చాలా సున్నితమైన ప్రశ్నలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు.  ఈ ప్రశ్న ఎదుటి వ్యక్తికి అసౌకర్యాన్ని కలిగించవచ్చు.  ఇలాంటి ప్రశ్న వేయడం  వల్ల ఇతరులతో  తనను పోలుస్తున్నారని లేదా అంచనా వేస్తున్నారని ఎదుటివారికి  అనిపించవచ్చు. అందుకే ఎవరి సంపాదన గురించి ఎప్పుడూ అడగకూడదు. పెళ్ళెప్పుడు.. పెళ్లెప్పుడు అనే ప్రశ్నను భారతీయులు చాలా  తరచుగా అడుగుతుంటారు, కానీ ప్రతి వ్యక్తి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.  కొందరు తమ వృత్తిపై దృష్టి పెడుతుండగా, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు.  ఈ ప్రశ్నను పదేపదే అడగడం వల్ల ఎదుటి  వ్యక్తిపై అనవసరమైన ఒత్తిడి పడవచ్చు. వయసు.. వయస్సు అడగడం సాధారణంగా అనిపించినప్పటికీ, చాలా మంది దానిని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట  లేదా మొదటి సారి ఎవరితోనైనా కలిసినప్పుడు ఇలాంటి ప్రశ్న వేస్తే అది ఎదుటి వారిని   ఇబ్బందికి గురిచేస్తుంది. అవసరం ఉంటే తప్ప  వయస్సుకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవడమే మంచిది. పిల్లలు.. భారతదేశంలో పెళ్లైన చాలా మంది మహిళలు ఎదుర్కునే  ప్రశ్న ఇంకా పిల్లలు పుట్టలేదు ఎందుకు ఏమిటి అని.  ఇది  చాలా  భావోద్వేగపరమైన,  సున్నితమైనదిగా  ప్రశ్న. కొంతమందికి వారు మాట్లాడటానికి ఇష్టపడని వ్యక్తిగత నిర్ణయాలు, ఆరోగ్య కారణాలు లేదా కుటుంబ పరిస్థితులు ఉండవచ్చు. అందువల్ల, ఇలాంటి ప్రశ్నలు సంబంధాలలో దూరాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకే ఏ ఆడపిల్లను  ఎవరు ఈ ప్రశ్న అడగకూడదు.                                 *రూపశ్రీ.
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ చాలా ప్రత్యేకమైనది.  చాలామంది రిలేషన్లో ఉన్నప్పుడు తమ బాగస్వామిని చాలా ప్రేమిస్తుంటారు. కానీ ఏదైనా సందర్బం వస్తే నువ్వు నన్ను ప్రేమించడం లేదు అనే మాటను ఎదుర్కుంటూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే.. మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయకపోవడం వల్ల.  ప్రేమించడం గొప్ప కాదు.. కానీ ప్రేమను సరైన విదంగా వ్యక్తం చేయకపోవడం వల్లే అసలైన సమస్య వస్తుంది. ప్రేమను సరైన విధంగా వ్యక్తం చేస్తే ఆ బంధాలు ఎంతో పదిలంగా పదికాలల పాటు సంతోషంగా ఉంటాయి.  బంధాలను బలంగా మార్చుకోవడానికి ప్రేమను వ్యక్తం చేసే పద్దతులు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. మనసులో కాదు.. మాటల్లో చెప్పాలి.. ప్రేమను మనసులో దాచుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. కొంతమందికి ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలే మంచి ఆయుదం. “నాకు నీ పట్ల గర్వంగా ఉంది”, “నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి”, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” వంటి చిన్న వాక్యాలు కూడా ఎదుటి వారి హృదయాన్ని టచ్ చేస్తాయి.  భాగస్వామి  తమ ప్రేమను మాటల ద్వారా వ్యక్తపరుస్తుంటే, వారిని మెచ్చుకోవడం, వారి ప్రయత్నాలను అభినందించడం, ప్రేమ సందేశాలు పంపడం వంటివి ఆ బంధాన్ని బలపరుస్తాయి. ఇలాంటి వ్యక్తులు విమర్శలను కూడా మరింత లోతుగా తీసుకుంటారు, కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు పాజిటివ్  పదాలను ఎంచుకోవడం ముఖ్యం. సమయం.. కొంతమందికి ప్రేమను వెలిబుచ్చడానికి  అత్యంత విలువైనది వారి సమయం. వారికి ఖరీదైన బహుమతుల కంటే, ఎలాంటి ఆటంకం  లేకుండా వారితో సమయం గడపడమే ముఖ్యం. ఫోన్‌ను పక్కన పెట్టి మాట్లాడుకోవడం, కలిసి నడవడం, కాఫీ డేట్‌కు వెళ్లడం లేదా కేవలం కలిసి కూర్చుని ఆ రోజు జరిగిన సంఘటనలను షేర్ చేసుకోవడం వంటివి కొందరికి   చాలా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అలాంటి వారికి, లైప్ పార్ట్నర్ ఉనికే చాలా పెద్ద బహుమతి. స్పర్శ.. చాలా మంది కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం, నుదుటిపై ముద్దు పెట్టుకోవడం లేదా భుజంపై చేయి వేయడం వంటి టచింగ్  ద్వారా ప్రేమను అనుభూతి చెందుతారు. ఒకరినొకరు స్పృశించుకోవడం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు, భావోద్వేగ భద్రత , అనుబంధం కూడా ఇందులో భాగమే. అలాంటి వ్యక్తులు ప్రేమతో కూడిన టచింగ్ ను  పొందినప్పుడు, వారు తమ సంబంధంలో మరింత భద్రతగా, అనుబంధంగా , సంతోషంగా ఫీలవుతారు. మెమరీస్.. బహుమతులు ఇష్టపడేవారు బయటి విషయాలలోనే ప్రేమను చూస్తారని  చాలామంది తరచుగా అనుకుంటారు, కానీ ఈ నమ్మకం ఎప్పుడూ సరైనది కాదు. ఇది కూడా ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక మార్గం.  ఇందులో  బహుమతి ధర ముఖ్యం కాదు, దాని వెనుక ఉన్న భావనే ముఖ్యం. ఒక చిన్న పువ్వు, ఇష్టమైన చాక్లెట్, లేదా ప్రయాణం నుండి తెచ్చుకున్న ఒక చిన్న గిఫ్ట్  కూడా వారికి చాలా ప్రత్యేకంగా అనిపించవచ్చు. ఇది  వారి గురించి ఆలోచిస్తున్నారని, వారిని గుర్తుంచుకుంటున్నారని  వారికి తెలియజేస్తుంది. సహాయం.. కొంతమందికి, “నేను నీకు సహాయం చేస్తాను” అని చెప్పడం కంటే, “నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అని చెప్పడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.   భాగస్వామి సహాయానికి లేదా సపోర్ట్ ఇవ్వడానికి  విలువ ఇస్తే, వారికి చిన్న చిన్న పనులలో సహాయం చేయడం, వారి బాధ్యతలను తేలికపరచడం లేదా అవసరమైనప్పుడు సపోర్ట్  ఇవ్వడం వంటివి వారిని ఎంతగానో ప్రేమిస్తున్నారనే భావనకు గురి చేస్తాయి. వారికి మాటల కన్నా చేతలే గొప్పవి. కష్టసమయాలలో.. ప్రతి సంబంధం కేవలం సంతోషకరమైన క్షణాలపై మాత్రమే ఆధారపడి ఉండదు.  కష్ట సమయాల్లో ఒకరికొకరు మానసికంగా  అండగా ఉండటం కూడా అంతే ముఖ్యం. తమ మాటలను ఎలాంటి జడ్జ్ చేయకుండా  విన్నప్పుడు, వారి భావాలను అర్థం చేసుకున్నప్పుడు,  కష్ట సమయాల్లో వారికి అండగా నిలిచినప్పుడు, కొంతమంది తాము ప్రేమించబడ్డామని భావిస్తారు. అలాంటి వారికి ఏ బహుమతి లేదా ప్రేమను వ్యక్తపచడానికి స్పెషల్ గా వేరే ఏ పని చేయకపోయినా , ఎమోషనల్ సందర్భాలలో మద్దతుగా ఉండటమే ముఖ్యం అనిపిస్తుంది. ప్రేమను ఎలా గుర్తించాలి?  ఎక్కువ ప్రేమగా అనిపించే విషయాల పట్ల శ్రద్ధ వహించాలి.  భాగస్వామి తరచుగా ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారో గమనించాలి.   ఏది లోపించిందని అనిపిస్తుందో, ఏది మిమ్మల్ని బాధపెడుతుందో అది కూడా ఒక సంకేతం కావచ్చు.  నిష్కపటంగా మాట్లాడాలి , ఒకరి ఎమోషన్ సపోర్ట్ ను  మరొకరు అర్థం చేసుకోవాలి.                                 *రూపశ్రీ.
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు.  రిలేషన్ లో ఉండే ఈ పరిస్థితుల గురించి చెప్పేటప్పుడు ట్రామా బాండింగ్ అనే పదాన్ని లైఫ్ స్టైల్ నిపుణులు వాడుతూ ఉంటారు.  అయితే నేటి కాలంలో మాత్రం ఈ ట్రామా బాండింగ్ అనేది మానసిక భావనగా మారింది.  చాలామంది తమను మానసికంగా ప్రభావితం చేసే బంధాలలో చాలామంది ఉండిపోతారు. కానీ ఇలాంటి బంధాల నుండి బయటపడటం కష్టంగా ఉంటుంది. ఇది మనిషి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం,  ఏదైనా అర్థం చేసుకునే తత్వం మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. బంధాలలో వాస్తవాన్ని గుర్తించి,  సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాలంటే ట్రామా బాండింగ్ ను అర్థం చేసుకోవాలి.  అసలు ట్రామా బాండింగ్ అంటే ఏమిటి?  దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎలా ఏర్పడుతుంది? దీన్నుండి ఎలా బయటపడాలి లేదా దీనికి లోను కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?  తెలుసుకుంటే.. ట్రామా బాండింగ్.. ట్రామా బాండింగ్ అనేది ఒక మానసిక పరిస్థితి. దీనిలో ఒక వ్యక్తి, తమకు మానసిక ఒత్తిడి, బాధ లేదా స్థిమితంగా ఉండలేక పోవడం వంటివి  కలిగించే రిలేషన్ కు  ఎమోషన్ గా  అతుక్కుపోయి ఉంటారు. ఈ పరిస్థితిలో ప్రేమ, ఆప్యాయత, ఆపై ఆకస్మిక అవమానం లేదా ఎమోషన్ గా దెబ్బ తినడం  అనే ఒక చక్రం ఉంటుంది. ఇది ఆ వ్యక్తిని చిక్కుకుపోయినట్లుగా, గందరగోళంగా భావించేలా చేస్తుంది. క్రమంగా, వారు దానికి అలవాటుపడి, దాని నుండి బయట పడటం కష్టంగా మారుతుంది. ట్రామా బాండింగ్ ఎలా ఏర్పడుుతంది? ఎమోషనల్ బ్యాలెన్స్ సరిగా లేని  సంబంధాలలో సాధారణంగా ట్రామా బాండింగ్ ఏర్పడుతుంది. ఇది అనేక కారణాల వల్ల సంభవిస్తుంది. వాటిలో కొన్ని.. రిలేషన్ లో  పదేపదే పాజిటివ్, నెగిటివ్ ప్రవర్తన ఉంటుంది.  ఇవి మారుతూఉంటాయి.  కొన్నిసార్లు చాలా  ప్రేమ కనిపిస్తుంది,   మరికొన్నిసార్లు ఉన్నట్టుండి  దూరం  పెరిగినట్టు లేదా అగౌరవం జరిగినట్టు జరుగుతుంది. ఎమోషన్ పరంగా బాగా ఎక్కువై ఇతరుల మీద ఆదారపటం,  భయం, ఒంటరితనం, అభద్రతా భావంతో కూడిన వాతావరణం ఉంటుంది.  ఆత్మగౌరవం క్రమంగా బలహీనపడుతుంది.   భాగస్వామి ద్వారా భావోద్వేగ నియంత్రణ లేదా తారుమారు అవుతుంది. ట్రామా బాండింగ్ సిగ్నల్స్.. ట్రామా బాండింగ్ ను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.    సంబంధాన్ని వదిలిపెట్టలేకపోవడం,   మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తి దగ్గరికి వెళ్లడం లేదా వెళ్లాలని అనిపించడం. ప్రతి సమస్యకు తనను తాను నిందించుకోవడం,  ఎప్పుడూ ఒత్తిడి, ఆందోళన లేదా మానసికంగా అలసిపోయినట్లు అనిపించడం.  సంబంధంలో ఉన్నప్పటికీ అసంతృప్తిగా , సంతోషంగా లేకపోవడం.  ఇతరులు చెప్పేది పట్టించుకోకుండా, కేవలం ఆ సంబంధంలోనే లీనమై ఉండటం. ఎలా బయట పడాలి.. ట్రామా బాండింగ్‌ను అధిగమించడం అంత సులభం కాదు, కానీ సరైన చర్యలతో అది సాధ్యమేనని లైఫ్ స్టైల్ నిపుణులు అంటున్నారు.    మొదట, పరిస్థితిని అంగీకరించాలి. నమ్మకమైన స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడటం  మానసిక ఆరోగ్య నిపుణుడు లేదా కౌన్సిలర్ నుండి సహాయం కోరడం మంచిది.  ట్రామా బాండింగ్ లో చిక్కుకున్న  వ్యక్తికి క్రమంగా దూరమవ్వాలని.  ఆత్మగౌరవంతో,  ఆత్మవిశ్వాసంతో  పనిచేయాలి.  తమ కోసం తాము  సురక్షితమైన , సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలి. ట్రామా బాండింగ్ గుర్తించడం ఎందుకు ముఖ్యం.. ట్రామా బాండింగ్ అనేది ఒక తీవ్రమైన భావోద్వేగ పరిస్థితి, ఇది ఒక వ్యక్తి  మానసిక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం , జీవిత నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. దీనిని ముందుగానే గుర్తించి, తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా ఆ వ్యక్తి ఆరోగ్యకరమైన , సమతుల్యమైన జీవితం వైపు పయనించగలుగుతారు.                                  *రూపశ్రీ.
 నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది జిమ్ చేస్తుంటారు, మరికొందరు యోగా చేస్తుంటారు. గుండె ఆరోగ్యం కోసం కొత్తగా వ్యాయామం  మొదలు పెట్టాలని అనుకునేవారు జిమ్ చేయాలా, యోగా చేయాలా అని గందరగోళానికి గురవుతూ ఉంటారు.    కొంతమంది జిమ్‌లో వ్యాయామం చేయడానికి ఇష్టపడితే, మరికొందరు యోగానే ఉత్తమ పద్ధతిగా భావిస్తారు. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం జిమ్ లేదా యోగా..  ఈ రెండింటిలో  గుండె ఆరోగ్యానికి ఏది బాగుంటుంది?  తెలుసుకుంటే.. జిమ్ లేదా యోగా ఏది మంచిది? గుండెను కాపాడుకోవడానికి జిమ్ , యోగా రెండూ అవసరమైనవే. అయితే, అవి పనిచేసే పద్ధతులు భిన్నంగా ఉంటాయి. ఒకదానిని మించి మరొకటి ఎంచుకోవడం కంటే, రెండింటినీ  ఫిట్‌నెస్ లైఫ్ స్టైల్ లో  చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం వల్ల గుండెకు కలిగే ప్రయోజనాలు.. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్, రోయింగ్ , స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి జిమ్ వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా చేసే  వ్యాయామం గుండెను బలపరుస్తుంది , శరీరమంతటా రక్తాన్ని ప్రసరింపజేయడంలో సహాయపడుతుంది.  జిమ్ వర్కౌట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి , కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తాయి. అవి బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడతాయి.  తద్వారా గుండె జబ్బులు , పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవి స్టామినాను బాలెన్స్ ను  కూడా పెంచుతాయి. క్రమం తప్పకుండా  కార్డియో వ్యాయామాలు చేస్తే  గుండెను బలపరుస్తాయని , శరీరమంతటా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంప్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. యోగా ఎందుకు ముఖ్యం..? యోగా శరీర సౌలభ్యాన్ని మెరుగుపరచడం, సరైన శ్వాస, బాలెన్స్ ను  కాపాడుకోవడం , మానసిక ప్రశాంతతపై దృష్టి పెడుతుంది. కార్డియో వ్యాయామాల మాదిరిగానే  యోగా ఏరోబిక్ ఫిట్‌నెస్‌ను అందిస్తుంది.  అయితే యోగా  గుండె ఆరోగ్యానికి ఇంకా అనేక  విధాలుగా కూడా  ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. యోగా ఒత్తిడి , ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. యోగా  ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీర సౌలభ్యాన్ని , శరీరాకృతిని  మెరుగుపరుస్తుంది, శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది , మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. గుండె జబ్బులకు ఒత్తిడి ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. యోగా మనస్సును , నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కేవలం యోగాతో గుండె ఆరోగ్యం బాగుంటుందా? యోగా వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గుండె సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడానికి అవసరమైన ఏరోబిక్ వ్యాయామాన్ని కేవలం యోగా మాత్రమే శరీరానికి అందించలేదు.  ఈ విషయాన్ని ఆరోగ్య  నిపుణులే చెబుతున్నారు.  ఆరోగ్య  నిపుణుల ప్రకారం, ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి వారానికి  కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం, జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి మధ్యస్థం నుండి  తీవ్రత గల వ్యాయామం చేయాలి. మెరుగైన ఫిట్‌నెస్ , గుండె ఆరోగ్యం కోసం యోగాను ఇతర శారీరక కార్యకలాపాలతో కలిపి చేయడం మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి వ్యాయామం చేయాలి? జిమ్ , యోగాలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదని  గుండె ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు.  ఫిట్‌నెస్ దినచర్యలో రెండింటినీ చేర్చుకోవడం మంచిదట. ఒక బాలెన్స్డ్  ఫిట్‌నెస్ ప్రణాళికలో వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు, వారానికి కనీసం రెండు రోజులు స్ట్రెం్ ట్రైనింగ్,  కోలుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఉంటాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్ , శ్వాస వ్యాయామాలను కూడా చేర్చుకోవాలి. ఈ దినచర్య గుండె ఆరోగ్యాన్ని, కండరాల ఆరోగ్యాన్ని ,  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.                                       *రూపశ్రీ.
ప్రోటీన్ శరీరానికి అవసరమైన పదార్థం.  శరీరంలో కండరాల నిర్మాణానికి, శక్తికి,కణాల అభివృద్దికి,  ఎముకల నిర్మాణానికి ఇలా చాలా విషయాలకు ప్రోటీన్ అవసరం అవుతుంది.  శరీరానికి ప్రోటీన్ కోసం చాలా మంది గుడ్లు, పాలు, పాల పదార్థాలు అయిన పనీర్ వంటివి తీసుకుంటారు. ఇక మాంసాహారులు అయితే మాంసాన్ని తీసుకుంటారు. కానీ కాయ ధాన్యాలలో కూడా ప్రోటీన్ ఉంటుంది. వీటిని తరచుగా పప్పు ధాన్యాలు అని పిలుస్తూ ఉంటాం. వంటింట్లో ఎన్నో రకాల పప్పు దాన్యాలు ఉంటాయి. వీటిలో ఏ ధాన్యాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందనే విషయం చాలా మందికి తెలియదు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. సోయాబీన్.. సోయాబీన్లో అన్ని పప్పు ధాన్యాల కంటే అత్యధికంగా వంద గ్రాముల సోయాబీన్ కు 36–40 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. ఇందులో శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు (Essential Amino Acids) దాదాపు సమతుల్యంగా లభిస్తాయి. అందువల్ల దీనిని అత్యుత్తమ ప్లాంట్  ప్రోటీన్ ఆహారాల్లో ఒకటిగా పరిగణిస్తారు. సోయాబీన్‌తో తయారయ్యే పాలు, టోఫూ, సోయా నగెట్స్ వంటి ఆహారాలు కూడా మంచి ప్రోటీన్ వనరులే. మినుములు.. ప్రోటీన్ అత్యధికంగా ఉండే ధాన్యాలలో మినుములు రెండవ స్థానంలో ఉంటాయి.  ఈ మినుములు ఒక  కప్పు మినుములలో సుమారు 25 నుండి 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని చెబుతారు. ఇడ్లీ, దోశ వంటి పులియబెట్టిన ఆహారాల్లో మినప్పప్పు ఉపయోగించడం వల్ల జీర్ణక్రియకు కూడా మేలు జరుగుతుంది. పెసలు.. పెసలులో 23–24 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది. మొలకలు వచ్చిన పెసలు విటమిన్ సి, కొన్ని బి విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి కాబట్టి చిన్నపిల్లలు, వృద్ధులు కూడా తినవచ్చు. శనగలు.. శనగలులో ప్రోటీన్‌తో పాటు పీచు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువసేపు ఆకలి తగ్గి, బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. శనగలు ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలను కూడా అందిస్తాయి.   రాజ్మా.. రాజ్మాలో మంచి ప్రోటీన్, పీచు, పొటాషియం , ఐరన్  ఉంటాయి. అయితే వీటిని తప్పనిసరిగా బాగా నానబెట్టి, పూర్తిగా ఉడికించి మాత్రమే తినాలి. లేకపోతే జీర్ణవ్యవస్థకు చాలా ఇబ్బంది అవుతుంది. కందిపప్పు.. కందిపప్పు మన తెలుగు ఇళ్లలో ఎక్కువగా వాడే పప్పు. ఇందులో ప్రోటీన్‌తో పాటు ఫోలేట్, పొటాషియం, పీచు కూడా లభిస్తాయి. రోజువారీ ఆహారంలో దీనిని చేర్చడం మంచి అలవాటు. ఎలా తింటే ప్రయోజనం.. పప్పులను కేవలం ఒకటే తినడం కంటే వాటిని బియ్యం, జొన్న, రాగి లేదా గోధుమ వంటి ధాన్యాలతో కలిపి తినడం మంచిది. ఇలా తినడం వల్ల శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాల సమతుల్యత మెరుగుపడుతుంది. అంతేకాదు.. పప్పులను కూరగాయలతో కూడా కలిపి తింటే మంచి సమతుల్య ఆహారం తీసుకున్నట్టు అవుతుంది. అలాగే పప్పులను 6–8 గంటలు నానబెట్టి వండితే జీర్ణక్రియ సులభమవుతుంది. కొన్ని పప్పులను మొలకలు చేసి తింటే విటమిన్లు పెరగడంతో పాటు కొన్ని పోషకాల శోషణ కూడా మెరుగుపడుతుంది. రోజువారీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి? ఒక సాధారణ ఆరోగ్యవంతుడికి రోజుకు శరీర బరువు ప్రతి కిలోకు సుమారు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఉదాహరణకు 60 కిలోల బరువు ఉన్న వ్యక్తికి రోజుకు సుమారు 48 గ్రాముల ప్రోటీన్ అవసరమవుతుంది. ఎక్కువ శారీరక శ్రమ చేసే వారు, క్రీడాకారులు లేదా కండరాల పెరుగుదల లక్ష్యంగా పెట్టుకున్నవారికి అవసరం మరింత ఎక్కువగా అవసరం కావచ్చు.                             *రూపశ్రీ.
  ఏదైనా కొనడానికి వెళ్ళాలని అనుకుంటాం. కానీ తీరా అక్కడికి వెళ్లాకా ఏం తీసుకోవాలని వచ్చామో అదే మర్చిపోతుంటాం. ఇది చాలా మందికి జరుగుతూ ఉంటుంది.  కానీ ఎవరూ దీని గురించి పెద్దగా పట్టించుకోరు..  ఇది మాత్రమే కాదు..  రోజంతా  మనసు ఏదో మబ్బుపట్టినట్లుగా అనిపించడం వంటిది కూడా జరుగుతూ ఉంటుంది. చాలామంది దీన్ని పరధ్యానం అనో లేక జీవితంలో ఏదో కోల్పోయినట్టు అంత విరక్తిగా ఉండటం ఎందుకనో..  ఆరోగ్యం బాగాలేదేమో అనో.. ఇలా చాలా రకాలుగా సాకులు, కారణాలు చెప్పుకుని అప్పటికి సైలెంట్ అయిపోతూ ఉంటారు.  అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే.  ఒత్తిడి , ఆందోళన ఈ సమస్యలకు కారణం కావచ్చు. అయితే, ఎప్పుడో ఒకసారి అన్నట్టు కాకుండా.. పదే పదే ఎక్కువగా జరుగుతూ ఉంటే మాత్రం ఆలోచించాల్సిందే అంటున్నారు వైద్యులు. తరచుగా మతిమరుపు, ఏకాగ్రత లోపం , మానసిక అలసట వంటి సమస్యలు బ్రెయిన్ ఫాగ్ యొక్క సంకేతాలుగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి?  ఇది ఆరోగ్యానికి ఎంతవరకు ఇబ్బందిగా మారుతుంది? ఎవరికి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? వివరంగా తెలుసుకుంటే.. బ్రెయిన్ ఫాగ్.. బ్రెయిన్ ఫాగ్ ఒక వ్యాధి కానప్పటికీ, ఇది తాత్కాలికంగా ఆలోచించడం, గుర్తుంచుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం , ఏకాగ్రత వహించడం వంటి మెదడు సామర్థ్యాలను దెబ్బతీసే ఒక పరిస్థితి.  వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత చాలామంది తరచుగా కొద్దికాలం పాటు బ్రెయిన్ ఫాగ్‌ సమస్యను ఎదుర్కుంటారు. వైద్య నివేదికల ప్రకారం, దీర్ఘకాలిక మానసిక అలసట, గందరగోళం , అయోమయం వంటి సమస్యకు 'బ్రెయిన్ ఫాగ్' అనే పదాన్ని ఉపయోగిస్తారు. బ్రెయిన్ ఫాగ్ ఎందుకు వస్తుంది? తరచుగా ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం , శరీరంలో నీటి కొరత వంటి సమస్యల వల్ల ఇది వస్తుంది. చాలా సందర్భాలలో, విటమిన్ లోపం లేదా హార్మోన్ల మార్పులు వంటి అంతర్గత సమస్యల వల్ల కూడా బ్రెయిన్ ఫాగ్ ఏర్పడవచ్చు. థైరాయిడ్, రక్తహీనత, విటమిన్ బి12 లోపం, డిప్రెషన్ వంటి వాటిలో కూడా బ్రెయిన్ ఫాగ్ వంటి సమస్యలు కనిపిస్తాయి, కాబట్టి బ్రెయిన్ ఫాగ్ సమస్య ఉన్నట్టు అనిపిస్తే వైద్యులను సంప్రదించి సమస్య తెలుసుకోవడం ఎంతో మంచిది. బ్రెయిన్ ఫాగ్ ఎలా గుర్తించాలి? బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు వ్యక్తిని బట్టి మారవచ్చు, కానీ కొన్ని సంకేతాలు చాలా సాధారణంగా ఉంటాయి. చిన్న విషయాలు మర్చిపోవడం, ఇతరులతో మాట్లాడే సమయంలో సరైన పదాలు గుర్తుకు రాకపోవడం, పని చేస్తున్నప్పుడు తరచుగా పరధ్యానానికి గురికావడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటం అనేవి సర్వసాధారణమైన లక్షణాలు. కొంతమంది తాము ఇటీవల చదివిన విషయాలను గుర్తుంచుకోవడంలో ఇబ్బంది పడుతుండగా, మరికొందరు మీటింగ్స్ లేదా ఇతరులతో మాట్లాడే  సమయంలో విషయాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ లక్షణాలు కొన్ని వారాల పాటు కొనసాగి, రోజువారీ  జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే తప్పకుండా ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి. ఇవి కూడా తెలుసుకోవాలి.. మెదడు మొద్దుబారడం  అనేది ఎల్లప్పుడూ మర్చిపోవడానికి లేదా ఏకాగ్రత కోల్పోవడానికి సంకేతం కాదు. ఒత్తిడి లేదా ఒకేసారి అనేక పనులు చేయడం వల్ల అప్పుడప్పుడు మతిమరుపు రావడం సాధారణమే. అయితే, నిరంతరంగా ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది, మానసిక స్పష్టత లోపంతో పాటు, మతిమరుపు ఎక్కువగా  సంభవిస్తే, దానిని సీరియస్ గా తీసుకోవాలి. బ్రెయిన్ ఫాగ్ , డిమెన్షియా వంటి తీవ్రమైన సమస్యల  లక్షణాలు కూడా చాలా వరకు ఒకేలా ఉంటాయి, కాబట్టి వైద్యుడిని సంప్రదించి సరైన రోగ నిర్ధారణ చేయించుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల  ప్రకారం గర్భధారణ , మెనోపాజ్ సమయంలో జరిగే హార్మోన్ల మార్పులు మహిళల్లో బ్రెయిన్ ఫాగ్ వంటి లక్షణాలను కూడా కలుగజేస్తాయి. థైరాయిడ్ వ్యాధి, మధుమేహం, రక్తహీనత , ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.                                     *రూపశ్రీ.