Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీజేఐకి ఇండియా కూటమి పార్టీల బహిరంగ లేఖ
posted on: Jul 1, 2026 12:42PM

కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలే విమర్శించాయి. ఎన్నికల నిర్వహణలో, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని ధ్వజమెత్తాయి.ఈ మేరకు ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు సంయుక్తంగా భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఎన్నికల సంఘం నిర్ణయాలపై సమగ్ర న్యాయ సమీక్ష నిర్వహించాలని ఆ లేఖలో డిమాండ్ చేశాయి. దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
ప్రతిపక్షాలన్నీ కలిసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గతనెల 8న జరిగిన ఇండియా కూటమి కీలక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సీజేఐకి ఇండియా కూటమి పార్టీలు సంయుక్త లేఖ రాశాయి. ఈ లేఖపై ఇండియా కూటమి పార్టీల నేతలే కాకుండా, కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎంకే, ఆప్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు కూడా సంతకాలు చేశారు. అలాగే ఒక ఇండిపెండెంట్ ఎంపీ కూడా వీరిలో ఉన్నారు.
వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా తీవ్ర సవరణ' సర్ ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపించాయి. అధికార పార్టీకిలబ్ధి చేకూరేలా.. ఓటర్ల జాబితాను మేనిపులేట్ చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్, డెరెక్ ఒబ్రెయిన్ వంటి అగ్రనేతలు బ విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ రక్షకుడిగా ఉన్న సుప్రీంకోర్టు ఈ వ్యవహారాన్ని సుమోటోగానైనా స్వీకరించి, ఈసీ పక్షపాత వైఖరిపై విచారణ జరపాలని ఇండియా కూటమి పార్టీలు ఆ లేఖలో కోరాయి.



.webp)


