వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. జగన్ భద్రత కోసం మరో నలభై మంది ప్రైవేట్ సెక్యూరిటీ నియమించింది. ఇప్పటికే పదిమంది రిటైర్డ్ ఆర్మీని జగన్ పెట్టుకున్నారు. అలాగే జెడ్ ప్లస్ కేటగిరి లో 58 మంది సిబ్బంది తో రాష్ట్ర ప్రభుత్వం జగన్ కు భద్రత ఏర్పాటు చేస్తోంది. జగన్ సెక్యూరిటీలో మార్పులు ఎల్లుండి డోన్ పర్యటన నుంచి అందుబాటులోకి రానున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.  అయితే జగన్‌పై ఎవరైనా దాడి చేస్తారన్న నేపథ్యంలో కాకుండా.. వైసీపీ కార్యకర్తల దృష్ట్యా సెక్యూరిటీ పెంచినట్లు తెలుస్తొంది. అయితే జనగ్ పర్యటనల్లో వైసీపీ కార్యకర్తలు ఆయన దగ్గరకు ఎక్కువ సంఖ్యాలో రావడంతో.. కార్యకర్తల భద్రత దృష్ట్యా సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఈ సెక్యూరిటీ జగన్ పర్యటనల్లో ఎలాంటి వివాదాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటుందని వైసీపీ అభిప్రాయ పడుతుంది. మరోవైపు జగన్ పర్యటనల్లో టీడీపీ ప్రభుత్వం సరైనా శాంతిభద్రత కలిగించక పోవడం వల్లే సొంత సెక్యూరిటీని నియమించున్నామని వైసీపీ నాయకులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం జగన్‌కు సెక్యూరిటీ ఇవ్వడంలో ఫేల్ అవుతోందని విమర్శిస్తున్నారు. అయితే.. జగన్ ఇది వరకు చేసిన పర్యటనల్లో హెలిప్యాడ్ పై వైసీపీ కార్యకర్తలు పడి ధ్వంసం చేయడం, రెంటపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద వైసీపీ కార్యకర్త పడి చనిపోవడం వంటి అంశాల దృష్ట్యా జగన్ కు వైసీపీ అధిష్టానం ప్రైవేట్ సెక్యూరిటీ నియమించినట్లు తెలుస్తోంది.
  తెలంగాణ అంతర్జాతీయ స్పోర్ట్స్ చైర్మన్లు గా సంజీవ్ గోయంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంకా, యువర్ లైఫ్ సిఇఓ ఉపాసన కొణిదెల నియమితులయ్యారు. మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. తెలంగాణ లో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ, అభివృద్ధి తదితర అంశాలఫై దృష్టి సారిస్తారు.   సభ్యులుగా విటా డానీ (డానీ ఫౌండేషన్), మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సన్ నెట్ వర్క్స్ సిఇఓ కావ్య మారన్,  సి. శశిధర్ (విశ్వ సముద్ర), పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్), రవికాంత్ రెడ్డి (వాలీబాల్), బైచుంగ్ భూటియా (ఫుట్ బాల్), అభినవ్ బింద్రా (షూటింగ్), క్రీడల శాఖ అధికారులు బి. వెంకట పాపారావు,  ఇంజేటి శ్రీనివాస్ లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది.  తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ కో చైర్మన్ ఉపాసన కొణిదెల మాట్లాడుతూ ప్రపంచంలో తెలంగాణ క్రీడా శక్తిగా మార్చేందుకు కృషి చేస్తానని సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి చైర్ పర్సన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
  ఏపీలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చాని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ‘శ్రీ శక్తి’ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ ఇలా మొత్తం 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం 1,950 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు.  ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలకు ఎన్నో స్కీములు చెప్పామని, దానిలో ఉచిత బస్సు పథకాన్నికి మహిళలు మొగ్గు చూపారు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికయినా జీరో టికెటింగ్ విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, అల్ట్రా ఎక్స్ ప్రెస్‌లలో కూడా ఈ పథకం అమలులో ఉటుందని మంత్రి స్పష్టం చేశారు.  
ALSO ON TELUGUONE N E W S
మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)కోడలు, గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)సతీమణి 'ఉపాసన కొణిదెల'(upasana Konidela)గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. చాలా సంవత్సరాల నుంచి సామాజిక బాధ్యతతో పాటు, జంతు ప్రేమికురాలుగా పలు సేవా కార్యక్రమాలు  చేస్తు వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 'ఉపాసన' ని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ హబ్(Telangana Sports Hub)కి కో చైర్ పర్సన్ గా నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ విషయంపై చిరంజీవి స్పందిస్తు 'మా కోడలు ఉపాసన ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కి కో చైర్ పర్సన్.  గౌరవనీయమైన పదవిలో తనని నియమించడం చాలా సంతోషంగా ఉంది. గౌరవం కంటే బాధ్యతని మరింత పెంచిందని చెప్పాలి. డియర్ ఉపాసన మీకున్న నిబద్ధత, ఫ్యాషన్ తో క్రీడల్లో దాగి ఉన్న అపార ప్రతిభని గుర్తించి  ప్రోత్సహిస్తారని, ప్రతిభావంతులని అగ్ర స్థానంలో నిలబెట్టడానికి తగిన విధి విధానాలు రూపొందించడంలో నీ వంతు కృషి చేస్తావని ఆశిస్తున్నాను. నీ ప్రయాణంలో ఆ దేవుడు దీవెనలు తప్పకుండా ఉంటాయని ట్వీట్ చేసాడు. లండన్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్ మెంట్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసిన ఉపాసన, చాలా సంవత్సరాల నుంచి మహిళలు తమ సొంతంగా వ్యాపారం చేసుకొని నిలదొక్కుకునేలా సలహాలు ఇస్తు ఉంది. .తెలంగాణలోని కామారెడ్డి జిల్లా  దోమకొండ(Domakonda)ఉపాసన స్వస్థలం. తండ్రి అనిల్ కామినేని, శోభన సుదీర్ఘ కాలం నుంచి వ్యాపార రంగంలో రాణిస్తు వస్తున్నారు.  
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను లిక్కర్ స్కాం ఊపేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం మధ్య కుంభకోణానికి పాల్పడి, వేల కోట్లు దోచుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణ జరుగుతోంది. ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. మరికొందరు అరెస్ట్ అయ్యే అవకాశముంది. (AP liquor scam)   ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ముఖ్య అనుచరుడు వెంకటేష్ నాయుడు కీలకంగా మారాడు. కోట్ల విలువైన నోట్ల కట్టలతో వెంకటేష్ ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలాంటి సమయంలో అతనితో హీరోయిన్ తమన్నా ఉన్న ఫొటోలు దర్శనమివ్వడం కొత్త చర్చకు దారి తీసింది. (Tamannaah Bhatia)   వెంకటేష్ నాయుడుతో కలిసి ప్రైవేట్ జెట్ లో పయనిస్తున్న తమన్నా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వెంకటేష్, తమన్నాకు సంబంధం ఏంటి అనే చర్చ మొదలైంది. వీరు అనుకోకుండా కలిశారా? లేక ముందే పరిచయముందా? వంటి విషయాలు తెలియాల్సి ఉంది. మరి ఈ అంశంపై తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాలి.  
The spy game is back, bigger, bolder, and more explosive than ever. G2, the much-anticipated sequel to the acclaimed thriller Goodachari, is officially set for a worldwide theatrical release on May 1, 2026. Starring Adivi Sesh, G2 raises the stakes with an all-new mission and a global canvas. To mark the announcement, the makers have released several posters, each hinting at a different aspect of the film’s high-octane action. Directed by Vinay Kumar Sirigineedi in his directorial debut, the film builds on the success of its predecessor while expanding the scope to a truly international scale. Shot across six countries over 150 days, with 23 intricately designed sets, G2 is being mounted as a high-stakes, high-style thriller set to redefine genre standards in Indian cinema. Joining the franchise as Agent 116, Wamiqa Gabbi brings both emotional depth and fierce intensity to the story. The ensemble cast includes Emraan Hashmi, making his Telugu debut, along with Murali Sharma, Supriya Yarlagadda, and Madhu Shalini in pivotal roles. Produced by TG Vishwa Prasad and Abhishek Agarwal under the banners of People Media Factory, Abhishek Agarwal Arts, and AK Entertainments, G2 will be released in Telugu, Hindi, Tamil, Kannada, and Malayalam languages. With its powerful cast, global production values, and an ambitious vision, G2 is shaping up to be a defining action thriller of 2026.
2011 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా 'ప్యార్ కా పంచనామా'తో సినీ రంగ ప్రవేశం చేసిన హీరో 'కార్తీక్ ఆర్యన్'(Kartik Aaryan). ఆ తర్వాత అనతికాలంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, తనకంటు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. రీసెంట్ గా  'చందు ఛాంపియన్, భూల్ భూలయ్య పార్ట్ 3 ' వంటి విభిన్న చిత్రాలతో వరుస విజయాల్ని అందుకొని స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న 'ఆషీకీ పార్ట్ 3 ' చేస్తున్నాడు. శ్రీలీల(Sreeleela)హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.     ఆగస్టు 15న అమెరికాలోని హ్యూస్టన్‌లో జరగనున్న 'ఆజాదీ ఉత్సవ్’(Azadi Utsav)కార్యక్రమంలో కార్తీక్ ఆర్యన్ పాల్గొనబోతున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. మన దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జరుగుతున్న 'ఆజాదీ ఉత్సవ్' ని  'అగాస్ రెస్టారెంట్ అండ్ క్యాటరింగ్స్' అనే సంస్థ  నిర్వహించబోతుంది. ఈ సంస్థ యజమాని 'షౌకత్ మారేడియా' పాకిస్తానీ మూలాలు కలిగిన వ్యక్తి అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఫెడరేషన్ ఆఫ్ సినిమా వర్కర్స్ కాన్ఫెడరేషన్ ఈ విషయంపై స్పందిస్తు పాకిస్థాన్ కి సంబంధించిన వ్యక్తి  నిర్వహించే కార్యక్రమంలో కార్తీక్ పాల్గొనకూడదని, ఒకవేళ పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని  హెచ్చరికలు జారీ చేస్తు ఒక లేఖ కూడా జారీ చేసింది. బాలీవుడ్ ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్ కూడా స్పందిస్తు దేశ ప్రయోజనాల దృష్ట్యా కార్తీక్ ఆ కార్యక్రమంలో పాల్గొనడం సముచితం కాదని పేర్కొంది.  ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోని పర్యాటక ప్రాంతమైన 'పహల్గామ్'(Pahalgam)లోకి పాకిస్థాన్ కి చెందిన ఉగ్రవాదులు   అక్రమంగా ప్రవేశించి,మన దేశ పర్యాటకులని అత్యంత దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత పాకిస్థాన్ కి చెందిన  కళాకారులని, భారతీయ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఓటిటి వేదికగా కూడా పాకిస్థాన్ మూలాలు ఉన్న సినిమాల్ని సైతం  నిషేధించింది.    
  దాదాపు ఏడేళ్ల నుంచి ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ.. జూలై 31న 'కింగ్‌డమ్'తో ప్రేక్షకులను పలకరించాడు. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. బుకింగ్స్ బాగున్నాయి. దీంతో 'కింగ్‌డమ్' రూపంలో విజయ్ ఖాతాలో ఓ మంచి హిట్ పడినట్లేనని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (Kingdom)   ట్రేడ్ లెక్కల ప్రకారం.. రూ.52 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన కింగ్‌డమ్ మూవీ.. ఫస్ట్ వీకెండ్ లో అనగా మొదటి నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.36 కోట్ల షేర్ రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.17 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. మామూలుగా అయితే రెండో వీకెండ్ కల్లా ఈ మొత్తం రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, ఇప్పుడు 'కింగ్‌డమ్' ముందు పెద్ద టాస్క్ ఉంది.   'కింగ్‌డమ్'కి యునానిమస్ పాజిటివ్ టాక్ రాలేదు. దానికితోడు ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర 'మహావతార్ నరసింహ' హవా ఓ రేంజ్ లో ఉంది. ఈ సినిమా విడుదలై పదిరోజులు అయినప్పటికీ 'కింగ్‌డమ్' కంటే బుకింగ్స్ మెరుగ్గా ఉన్నాయి. ఏ సినిమా అయినా వీక్ డేస్ లో డ్రాప్ కనిపించడం సహజం. కానీ, 'మహావతార్ నరసింహ' దెబ్బకు 'కింగ్‌డమ్' డ్రాప్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. అదే ఇప్పుడు, బ్రేక్ ఈవెన్ కష్టమేనా? అనే చర్చకు దారితీసింది. మరి కింగ్‌డమ్, అనూహ్యంగా పుంజుకొని సెకండ్ వీకెండ్ కల్లా బ్రేక్ ఈవెన్ సాధించి సర్ ప్రైజ్ ఏమైనా చేస్తుందేమో చూడాలి.  
King Nagarjuna, promoting Coolie, at Hyderabad, made an interesting statement. He stated that director Lokesh Kanagaraj asked for a certain hefty amount as budget for the filming from Sun Pictures. On the last day of the shoot, he told Nagarjuna that the movie is completed with Rs.5 crores left in the bank, from production budget.  He commented that Lokesh could have asked for 10-15 crores or even 20 crores more but he tried to finish it in less amount than that. Well, his comments seem to be pointing at Pan-India film directors from Telugu Cinema. SS Rajamouli, while been notorious in increasing budgets, his films have better Return on Investment.  But looking at him, others are trying similar tactics but the delays in production and high salaries, huge amount of re-shoots have been costing producers more than they have agreed to spend. Sukumar's films until Rangasthalam, except for Arya, have been cost failures and Pushpa: The Rise had reported losses too.  Even Pushpa: The Rule went over budget and shot till last 5 days before release. Even there have been rumors about numerous amount of re-shoots, issues between Allu Arjun and director. Pushpa 2: The Rule did collect huge but the wastage and cost effectiveness have always been an issue with Sukumar.  Trivikram Srinivas, Koratala Siva have been hit or miss kind of directors, lately and even their films have been reportedly too costly and ineffective in controlling budgets. Saaho, Radhe Shyam have lost huge amounts and even Vishambhara has been dragging on for years.  Lokesh Kanagaraj, on the other hand, handled a multi-starrer like Coolie with different stars and cameos in planned time. Even Mani Ratnam, completed his high budget historical fiction, Ponniyin Selvan, within the planned time and budget, even with COVID pandemic hanging on their backs.  While Shankar had been notorious in over-spending, but he had been an inspiration in taking Indian Cinema to International level. Now, for recent times, it seems like Telugu directors and upcoming filmmakers need to take inspiration of Lokesh to control budgets and plan well ahead with confidnece in their content.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  గత కొంతకాలంగా డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు.. స్టార్స్ తో సంబంధం లేకుండా పలు సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. 'హనుమాన్', 'కాంతార' వంటి సినిమాలను వాటికి ఉదాహరణగా చెప్పవచ్చు. దీంతో స్టార్స్ సైతం డివోషనల్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ తప్పు చేశాడా? అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   'పుష్ప-2' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ మైథలాజికల్ ఫిల్మ్ చేయాల్సి ఉంది. కానీ, ఆ సినిమా చేయడం కంటే.. అట్లీ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ చేయడానికి బన్నీ మొగ్గుచూపాడు. దీంతో ఆ మైథలాజికల్ ఫిల్మ్ ని జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని నిర్ణయించుకున్నాడు త్రివిక్రమ్. ఇది 'గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి' కథతో తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ మిస్ చేసుకోవడంపై.. అప్పుడే ఆయన ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఇక ఇప్పుడు 'మహావతార్ నరసింహ' సినిమాతో.. వారు మరింత నిరాశ చెందుతున్నారు.   హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన యానిమేషన్ ఫిల్మ్ 'మహావతార్ నరసింహ' బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి.. రూ.200 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఒక యానిమేషన్ సినిమాకే ఈ రేంజ్ రెప్సన్స్ వస్తుందంటే.. ఇక స్టార్ నటించిన మైథలాజికల్ మూవీకి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.    పైగా, త్రివిక్రమ్ కి పురాణాలపై ఎంతో పట్టుంది. ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో అంతటి పట్టు ఎవరికీ లేదనే అభిప్రాయాలున్నాయి. తన రెగ్యులర్ సినిమాల్లో సైతం పురాణాలను ప్రస్తావిస్తుంటాడు త్రివిక్రమ్. అలాంటి దర్శకుడు.. కుమారస్వామి కథతో మైథలాజికల్ ఫిల్మ్ చేస్తున్నాడంటే.. కంటెంట్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సంచలనాలు సృష్టించే అవకాశాలున్నాయి.    ఏది ఏమైనా.. అల్లు అర్జున్ ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్ చేసే అవకాశాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి.. కానీ, త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో మైథలాజికల్ ఫిల్మ్ చేసే అవకాశం అరుదుగా వస్తుందని.. అలాంటి అవకాశాన్ని అల్లు అర్జున్ మిస్ చేసుకున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.  
సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)కింగ్ 'అక్కినేని నాగార్జున'(Akkineni Nagarjuna),హిట్ చిత్రాల దర్శకుడు 'లోకేష్ కనగరాజ్'(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'కూలీ'(Coolie). యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.  బాలీవుడ్ అగ్ర హీరో 'అమీర్ ఖాన్'(Aamir Khan)గెస్ట్  రోల్ లో కనిపిస్తుండగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర(Upendra)కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా తెలుగు రిలీజ్ కి సంబంధించి చిత్ర యూనిట్  మీడియా సమావేశాన్ని  నిర్వహించింది. ఈ వేడుకలో నాగార్జున, శృతిహాసన్(Shruthi Haasan),లోకేష్ కనగరాజ్ పాల్గొని 'కూలీకి సంబంధించిన పలు విషయాలని ప్రేక్షకులతో పంచుకున్నారు.    రజినీకాంత్ మాత్రం  తన సందేశాన్ని వీడియో రూపంలో పంచుకోవడం జరిగింది. సదరు వీడియోలో రజనీ మాట్లాడుతు ఇండస్ట్రీకి వచ్చి యాభై సంవత్సరాలు అవుతుంది. అలాంటి సమయంలో 'కూలీ' రిలీజ్ కాబోతుంది. తెలుగులో రాజమౌళి చేసిన సినిమాలన్నీ ఎలా అయితే  సూపర్ హిట్ గా నిలిచాయో, లోకేష్ కనగరాజ్ తమిళ్ లో  చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్. ఈ మూవీలో విలన్ క్యారక్టర్ చాలా పవర్ ఫుల్. విలన్ గా ఎవరు చేస్తారా అని అనుకున్నాను. కథ విన్నప్పుడు నేనే విలన్ గా చేయాలనీ అనుకున్నాను. అంత పవర్ ఫుల్ క్యారక్టర్. లోకేష్ వచ్చి నాగార్జున చేస్తున్నారని చెప్పగానే  షాక్ అయ్యాను. కింగ్ నాగార్జున విలన్ గా చేస్తుండటం పెద్ద సర్ ప్రైజ్.విలన్ గా అదరగొట్టేశాడు. నేను కూడా ఇలా చేయలేను అనిపించింది. భాషా మూవీలోని విలన్ ఆంటోని క్యారక్టర్ ఎలా అయితే  గుర్తిండిపోయిందో, కూలీలోని 'సైమన్' కూడా అలాగే గుర్తిండిపోతుంది.  డబ్బు కోసం విలన్ గా చెయ్యాల్సిన అవసరం నాగార్జునకి  లేదు. వెరైటీ క్యారెక్టర్స్ ని చెయ్యాలనుకొని విలన్ గా   చేసారు. ముప్పై మూడేళ్ళ  క్రితం నాగార్జునతో ఒక మూవీ చేశాను. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. ఆయన గ్లామర్, ఫిట్ నెస్ చూసి ఇలా ఎలా ఉండగలరు అని అడిగితే, వర్కౌట్స్ తో పాటు స్విమింగ్, మా నాన్న గారి జీన్స్, ఏదీ మనసులోకి తీసుకోకపోవడమని చెప్పారు. నాగార్జున గారు నేను కలిసి  పదిహేను రోజులు షూటింగ్ చేసాం. ఆయనతో గడిపిన రోజులను లైఫ్ లో మర్చిపోలేనని రజనీ సదరు వీడియోలో చెప్పడం జరిగింది. శ్రుతిహాసన్ హీరోయిన్ కాగా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించడం జరిగింది. పూజాహెగ్డే ప్రత్యేక సాంగ్ లో మెరిసింది.      
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇళ్లలో దోమల సంఖ్య  పెరగడం మొదలవుతుంది. అవి కుట్టడం వల్ల దురద, దద్దుర్లు వంటివి   కలిగించడమే కాకుండా డెంగ్యూ,  మలేరియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. సాధారణంగా  దోమలను తరిమికొట్టడానికి కాయిల్స్ లేదా లిక్విడ్స్  ఉపయోగిస్తారు. కానీ వాటిలో ఉపయోగించే రసాయనాల కారణంగా ఇవి అనారోగ్యానికి దారి తీస్తాయి.  వీటి మీద అవగాహన ఉన్న వారు రసాయనాలను వదిలి సహజమైన పద్దతిలో దోమలు పారద్రోలడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. పాత రోజుల్లో దోమలను తరిమికొట్టడానికి  వేప ఆకులను పొగబెట్టేవారు. కానీ ఈ కాలంలో ఈ  పొగ వల్ల కూడా  సమస్యలను ఎదుర్కొంటారు. అలా కాకుండా దోమలను తరిమికొట్టేందుకు  వేపను ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. వేపనీరు.. ఇది సులభమైన మార్గం.. . కొన్ని వేప ఆకులను తీసుకొని నీటిలో బాగా మరిగించాలి. నీటి రంగు మారి ఆకులు మృదువుగా మారినప్పుడు నీటిని చల్లబరిచిన తర్వాత ఫిల్టర్ చేయాలి.  ఇప్పుడు ఈ ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో నింపి ఇంటి మూలల్లో, కర్టెన్లలో,  దోమలు ఎక్కువగా కనిపించే ప్రదేశాలలో స్ప్రే చేయాలి. దోమలు దాని వాసన కారణంగా పారిపోతాయి. వేప ఆకులు.. వేప ఆకులను ఉంచడం వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా  సహజ అవరోధంగా పనిచేస్తుంది . తాజా వేప ఆకులను తీసుకొని వాటిని మెష్ చేసిన కిటికీలు, తలుపులు లేదా వెంటిలేషన్ ఉన్న ప్రదేశాలపై వేలాడదీయాలి లేదా ఉంచాలి. వేప వాసన దోమలు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది. కావాలంటే  వాటిని బాత్రూమ్ కిటికీపై కూడా ఉంచవచ్చు. వేప పేస్ట్.. వేప పేస్ట్ తయారు చేయడం వల్ల చర్మాన్ని దోమల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. తాజా వేప ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి.  కావాలంటే దానికి కొంచెం కొబ్బరి నూనె కూడా జోడించవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్‌ను పడుకునే ముందు చేతులు, కాళ్ళు,  మెడపై రాయాలి. దీని బలమైన వాసన దోమలను దగ్గరికి రానివ్వదు.   పొగ.. నేరుగా వేపాకు పొగ వేయడానికి ఇబ్బంది పడేవారు వేపాకును పొగలో ఉపయోగించడానికి సులభమైన చిట్కా ఉంది. అదే సాంబ్రాణి పొగ.. ప్రతి రోజూ సాయంత్రం కొన్ని బొగ్గులను కాల్చి అందులో సాంబ్రాణితో  పాటూ కాసింత వేపాకుల పొడిని కూడా వేస్తే ఆ పొగకు దోమలు పరార్ అవుతాయి.                            *రూపశ్రీ.  
ఒక మనిషి వ్యక్తిత్వం ఆ మనిషి జీవితంలో ఎదుగుదలను,   ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్కరూ తాము కరెక్టే అనుకుంటూ ఉంటారు. ఇలా కరెక్టే అనుకోవడం ఆ మనిషికి తన మీద తనకు నమ్మకం ఉండటం కావచ్చు. కానీ.. కొన్నిసార్లు ఇట్లాంటి నమ్మకాలు,  వ్యక్తిలో ఉండే కొన్ని గుణాలు వ్యక్తిని దెబ్బతీస్తాయి.  వాటిని సరిగా అర్థం చేసుకోలేని పక్షంలో అవి వ్యక్తిని పాతాళానికి తొక్కేస్తాయి కూడా.  ఆ అలవాట్లేంటో తెలుసుకుంటే.. ఆధిపత్యం.. ప్రతిసారీ  అభిప్రాయాన్ని చెప్పే అలవాటు ఉందా? వాదనలో ఎదుటి వ్యక్తి మాట వినకుండా నిర్ణయం తీసుకుంటారా? అలా అయితే తెలియకుండానే ఆధిపత్య వ్యక్తిత్వంలో భాగమయ్యే అవకాశం ఉంది.  ఇది క్రమంగా సంబంధాలలో దూరాన్ని సృష్టించవచ్చు. ప్రతి పరిస్థితిలోనూ నాయకత్వం వహించడం అవసరం కావచ్చు, కానీ అది అహం,  నియంత్రణగా మారినప్పుడు అది సంబంధాలకు ,  స్వంత వ్యక్తిత్వానికి హాని కలిగిస్తుంది. సంబంధంలో కనెక్షన్ ముఖ్యం, నియంత్రణ కాదు. కాబట్టి ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. సంభాషణలో అంతరాయం.. సంభాషణ మధ్యలో  ఎవరినైనా పదే పదే అంతరాయం కలిగిస్తే లేదా ఎల్లప్పుడూ మీ అభిప్రాయాన్ని ముందుగా తెలియజేస్తే, అది ఆధిపత్య ప్రవర్తన. ఇతర వ్యక్తులు ఈ రకమైన ప్రవర్తనను ఇష్టపడరు.  వారు మీతో మాట్లాడకుండా ఉంటారు. దీన్ని సరిచేసుకోవాలంటే..  ఇతరులు మాట్లాడటం ముగించిన తరువాత   సమాధానం ఇవ్వాలి.  మీరు మాట్లాడిన తరువాత వారి సమాధానం వినాలి. సొంత నిర్ణయాలు.. స్నేహం, సంబంధం లేదా ఆఫీసులలో  ప్రతిసారీ "ఏమి చేయాలో" ఎవరికి వారు  నిర్ణయించుకోకూడదు.  ఒక వేళ అలా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే  ఎదుటి వ్యక్తి ఆలోచనలకు స్థలం ఇవ్వడం లేదని అర్థం. ప్రతి విషయాన్ని ఇతరులకు ఒక ఆర్డర్ లాగా సొంతంగా నిర్ణయం తీసుకుని అధికారం చూపిస్తే అది చాలా తప్పు. దాన్ని సరిదిద్దుకోవాలి.  నలుగురు పాల్గొనే ఒక విషయంలో నలుగురి నిర్ణయాలు,  నలుగురి ఆలోచినలు, నలుగురి వ్యక్తీకరణలు కూడా ఉండాలి. వాదనలో గెలవాలనే తత్వం..  చర్చ సమయంలో ఎల్లప్పుడూ వాదనలో గెలవడానికి ప్రయత్నిస్తే లేదా వాదనలో గెలిచిన తర్వాత  అభిప్రాయాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే.. ఇది కూడా ఆధిపత్యానికి సంకేతం. వాదనలో గెలవడం కాదు, అర్థం చేసుకోవడం ముఖ్యం అని గుర్తుంచుకోవాలి. ప్రతిసారీ వాదనలో గెలవడానికి ప్రయత్నించకూడదు.  ఇతరులు ఏమి చెబుతారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. విషయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప.. నష్టం చేకూరినా సరే.. తన మాటే నెగ్గాలి అనే స్వభావం పనికిరాదు. అందరూ తనకు నచ్చినట్టు ఉండాలని అనుకోవడం.. ప్రతి ఒక్కరికీ ఒక ఆలోచన,  ఒక అభిప్రాయం,  కొన్ని ఇష్టాఇష్టాలు.. ఉంటాయి.  వాటికి తగినట్టే వారి ప్రవర్తన కూడా ఉంటుంది. కానీ ఇతరులను మార్చడానికి ప్రయత్నించేవారు లేదా వారి అభిప్రాయమే ఫైనల్ అని కోరుకునే వ్యక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని అర్థం.  మీ ఇష్టానుసారం ఇతరులను మార్చడానికి ప్రయత్నించే బదులు, వారి ఆలోచనలు, జీవనశైలి,  ప్రవర్తనను స్వీకరించడమే ఉత్తమమైన వ్యక్తిత్వం.  ఎదుటి వ్యక్తిని యాక్సెప్ట్ చేయడం వల్ల ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావు. అట్లాగే.. తన వ్యక్తిత్వ గౌరవాన్ని నిలబెట్టుకుంటూనే.. ఎదుటివారి వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించడం చేసినట్టు అవుతుంది.                               *రూపశ్రీ.
ఒక రిలేషన్ ఏర్పడటం పెద్ద సమస్య కాదు.. కానీ ఆ రిలేషన్ అన్ని సమస్యలను ఎదుర్కొని విజయవంతం కావడం నేటి కాలంలో చాలా పెద్ద సాహసమనే చెప్పాలి. ఎందుకంటే సంబంధాలు  ఏర్పడినంత తొందరగానే బ్రేకప్ అవుతున్నాయి. ముఖ్యంగా బార్యాభర్తల బంధం మన భారతదేశ ధర్మానికి ఒక ముఖ్యమైన మూల స్తంభం. అలాంటి మూల స్తంభం చాలా బలహీనం అయి, బీటలు వారుతోంది. ఈ కారణంగా నేటికాలంలో వివాహాలు చేసుకోవాలన్నా కూడా చాలామంది సంకోచిస్తున్నారు. ఒక రిలేషన్  విజయవంతం కావడానికి ప్రేమ, నమ్మకం, గౌరవంతో పాటు ఇద్దరి మధ్య  స్పష్టమైన సంభాషణ  అవసరం. సంతోషకరమైన సంబంధానికి పునాది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. సంబంధంలో నిజాయితీ, అర్థం చేసుకోవడం,  ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనవి. సంబంధం కొత్తదైనా లేదా పాతదైనా,  ఇవన్నీ  ప్రతి జంటకు ముఖ్యమైనవే. ఇది సంబంధాన్ని బలపరుస్తుంది,  సంబంధంలో సమస్యలు రాకుండా చేస్తుంది.  ప్రతి జంట సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలంటే ఏం చేయాలి అనేది రిలేషన్షిప్ నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.  వాటి గురించి తెలుసుకుంటే..  వినడం.. వినడం అనేది ఒక సాధారణమైన విషయమే  కానీ సంబంధంలో చాలా ముఖ్యమైనది.   ఇది ప్రతి ఒక్కరూ అది అబ్బాయి అయినా లేదా అమ్మాయి అయినా తెలుసుకోవాలి. భార్యాభర్తల రిలేషన్ లో  మాట్లాడటం,  అభిప్రాయాన్ని వ్యక్తపరచడంతో పాటు, వినడం కూడా చాలా ముఖ్యం. తరచుగా భార్యాభర్తలు ఒకరు చెప్పేది మరొకరు వింటారు.  కానీ కొందరి ఉద్దేశ్యం ఎలా ఉంటుందంటే కేవలం వినడం ఆ తరువాత ఆ విషయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం తనకు నచ్చినట్టే జరగాలని అనుకోవడం జరుగుతుంది.  ఇది సంబంధాన్ని చాలా దెబ్బ తీస్తుంది.ఆరోగ్యకరమైన రిలేషన్ ఉండాలంటే అవతలి వ్యక్తి చెప్పే మాటలను వినడమే కాదు.. వారికి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. స్పేస్.. భార్యాభర్తల బంధంలో ప్రేమదే అగ్రస్థానం. భాగస్వాములు అయ్యాక ఒకరికొకరు ఇచ్చే ప్రాధాన్యత,  ఒకరికి మరొకరు ఇచ్చే విలువ ఆ బంధాన్ని మరింత బలంగా మారుస్తుంది. కానీ ప్రేమ అంటే మనిషిని కట్టడి చేసినట్టు ఉండకూడదు.  ప్రతి విషయం తనకు తెలియాలి అనుకోకూడదు. కొంతమంది ప్రేమ ఎలా ఉంటుందంటే.. పెళ్లైంది కదా.. ఆ మనిషి నా సొంతం.. తనకు ఎలాంటి స్పేస్ కూడా ఉండకూడదు అని అనుకుంటారు. కానీ సంబంధంలో ప్రేమ ఎంత ముఖ్యమో.. వారికంటూ కాస్త స్పేస్.. వారికంటూ పర్సనల్ సమయం ఇవ్వడం కూడా ముఖ్యం.  స్పేస్ అనేది లేకపోతే బంధాన్ని గట్టిగా బిగించినట్టు ఉంటుంది. నిజానికి కొందరు ఇలా స్పేస్ ఇవ్వకుండా ఉండటం వల్ల అనుమాన పూరిత ప్రవర్తన అనుకునే అవకాశం కూడా ఉంటుంది. సారీ.. థ్యాంక్స్.. రిలేషన్ ను బలంగా మార్చేది ఏదైనా ఉందంటే అది తనకు ఏదైనా సహాయం చేసినప్పుడు కృతజ్ఞత చెప్పడం. అలాగే తన వైపు ఏదైనా తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం. పెళ్లి చేసుకున్నారు, భాగస్వామి అయ్యారు కాబట్టే కదా బాధ్యత కాబట్టి మనకోసం ఏదైనా చేశారు అనుకోవడం,  కనీసం థ్యాంక్స్ చెప్పకపోవడం.. ఏదైనా తప్పు జరిగినప్పుడు సారీ చెప్పకపోగా అయితే ఏంటి? అని రివర్స్ లో వాళ్ళ మీద అరవడం,  సమర్థించుకోవడం వంటివి చేయడం వల్ల ఒకరిమీద ఒకరికి ఆశించినంత ప్రేమ,  గౌరవం నిలబడవు. ఎప్పుడైతే ఇట్లా సందర్బానుసారంగా సారీలు,  థ్యాంక్సులు చెపుతూ ఉంటారో అప్పుడు ప్రేమ,  గౌరవం పెరుగుతాయి.  నిజమైన ప్రేమ పెరుగుతూ ఉంటుంది.                                 *రూపశ్రీ.
  జామకాయను పేదవాడి యాపిల్ అంటారు. యాపిల్ పండులో ఉండే పోషకాలకు సమానమైన పోషకాలు ఉండటం వల్ల,  యాపిల్ పండు కంటే తక్కువ ధరలో దొరకడం వల్ల జామకాయను పేదవాడి యాపిల్ అంటారు. జామపండు పోషకాల నిధి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే జామపండు మధ్యలో విత్తనాల భాగం అంటే చాలామందికి నచ్చదు.   ఈ విత్తనాల భాగాన్ని తొలగించి కండ భాగాన్ని తింటుంటారు.  అయితే జామపండులో నిజమైన బలం దాని మధ్యలో ఉంటుందట. పరిశోధకులు దాని విత్తనాలపై పరిశోధన చేసి ఇందులో చాలా  శక్తి ఉంటుందని స్పష్టం చేశారు.  దీని  గురించి తెలుసుకుంటే.. జామ గింజలు ఎందుకు పారేస్తారు? కిడ్నీలో రాళ్లు వస్తాయనే భయంతో చాలా మంది జామ గింజలను పారేస్తుంటారు. కానీ జామ విత్తనాల గురించి చేసిన పరిశోధనలు చాలా షాకింగ్ ఫలితాలను వెల్లడించాయి. ప్రయోజనాలు.. జామ గింజలు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. అంతే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రమాదకరమని నిరూపించే ALT,  AST ఎంజైమ్‌ల స్థాయిలు కూడా తగ్గుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది . జామ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి ఇవి పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు  వృద్ధాప్య సంకేతాలను నిరోధించడంలో సహాయపడతాయి. అంటే జామ పండ్లను బాగా తినేవారికి వృద్దాప్యం తొందరగా రాదు. జామ గింజల్లో కాల్షియం, జింక్, కాపర్ , ఫాస్పరస్ ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకలకు చాలా అవసరం. లేకపోతే బలహీనత మొదలవుతుంది. ఇది తీవ్రంగా మారితే  బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. . ఈ వ్యాధిలో ఎముకలు చాలా బలహీనంగా మారతాయి, సులభంగా విరిగిపోతాయి. జామపండు మొత్తం ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది రెండు రకాల ఫైబర్‌లను అందిస్తుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. సరైన జీర్ణక్రియ ఉంటే  ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, పైల్స్ మొదలైన సమస్యల ప్రమాదం దానికదే తగ్గుతుంది. ఈ లాభాలతో  పాటు శరీరానికి ప్రోటీన్ కూడా లభిస్తుంది. విత్తనాలను ఇలా కూడా.. జామ విత్తనాలను నేరుగా జామ పండుతో తినడం ఇష్టం లేకపోతే..  జామ విత్తనాలను పండు నుండి వేరు చేయాలి.  వీటిని ఎండబెట్టాలి.  తరువాత వీటిని దోరగా వేయించి నిల్వచేసుకోవాలి.  వీటిని అప్పుడప్పుడు తినవచ్చు. అంతే కాకుండా ఈ విత్తనాలను స్పైసీ పౌడర్ లా కూడా తయారుచేసుకుని తీసుకోవచ్చు.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  నేటి బిజీ జీవితంలో మానసిక ఒత్తిడి దాదాపు ప్రతి వ్యక్తి లైఫ్ లో  భాగంగా మారింది. పని ఒత్తిడి, సామాజిక అంచనాలు, సంబంధాల సమస్యలు,  భవిష్యత్తు గురించి అసంతృప్తి.. మొదలైనవన్నీ  మానసిక ఆరోగ్యంపై నిరంతరం ప్రభావం చూపుతున్నాయి. ఒత్తిడి మరియు ఆందోళన మీ మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా, నిద్ర లేకపోవడం, జీర్ణ సమస్యలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ,   అలసట వంటి  శారీరక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయి.  దినచర్యలో కొన్ని చిన్న,  సులభమైన మార్పులు చేయడం ద్వారా  ఒత్తిడి,  ఆందోళన నుండి బయటపడవచ్చని మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండి మెరుగైన జీవితాన్ని గడపడానికి సహాయపడే మూడు మార్పుల గురించి తెలుసుకుంటే.. వ్యాయామం, శారీరక శ్రమ.. ఒత్తిడిని తగ్గించడానికి మొదటి సులభమైన మార్పు క్రమం తప్పకుండా వ్యాయామం. ప్రతిరోజూ 20-30 నిమిషాలు వేగంగా నడవడం, యోగా లేదా స్ట్రెచింగ్  వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అనులోమ-విలోమ వంటి  ప్రాణాయామం,  ధ్యానం మనస్సును ప్రశాంతపరుస్తాయి. ఇంట్లో తేలికపాటి ఏరోబిక్స్ లేదా డాన్స్  కూడా ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. సమతుల ఆహారం,  హైడ్రేషన్.. సమతుల్య ఆహారాన్ని స్వీకరించడం వల్ల కూడా ఒత్తిడి, ఆందోళన కంట్రోల్ లో ఉంచవచ్చు. చేపలు, వాల్‌నట్‌లు,  అవిసె గింజలు వంటి ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. విటమిన్ బి,  మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు, ఆకుపచ్చ కూరగాయలు, అరటిపండ్లు,  బాదం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. చక్కెర,  కెఫిన్ అధికంగా తీసుకోవడం ఆందోళనను పెంచుతుంది. కాబట్టి వాటిని తీసుకోవడం పరిమితం చేయాలి. ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగడం వల్ల డీహైడ్రేషన్ నివారించవచ్చు.  ఇది ఒత్తిడిని నియంత్రిస్తుంది. మైండ్ఫుల్నెస్.. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడానికి మూడవ మార్పు  మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయడం,  బాగా నిద్రపోవడం. 5-10 నిమిషాల లోతైన శ్వాస పద్ధతులు వంటి మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. నీలి కాంతి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి, నిద్రవేళకు ముందు స్క్రీన్ సమయాన్ని (మొబైల్, టీవీ) తగ్గించాలి. ప్రతిరోజూ 7-8 గంటల గాఢ నిద్ర ఒత్తిడిని తగ్గిస్తుంది.  మెదడును రీఛార్జ్ చేస్తుంది. నిద్రవేళకు ముందు గోరువెచ్చని నీరు త్రాగడం లేదా పుస్తకం చదవడం నిద్రను మెరుగుపరుస్తుంది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..