తెలంగాణ కాంగ్రెస్ లో వరుసగా అనూమ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ కేబినెట్ నుంచి కొండా సురేఖకు ఉద్వాసన తరువాత పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు, నేతల మధ్య విభేదాలను పరిగణనలోనికి తీసుకుని పార్టీ హైకమాండ్ కీలక మార్పులకు తెరలేపింది.   తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించిన హైకమాండ్  తెలంగాణ పీసీసీ,  జిల్లా కేడర్ మధ్య మరింత బలమైన సమన్వయాన్ని తీసుకొచ్చేందుకు  చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రవ్యవహారాల ఇన్ చార్జిగా మీనాక్షి నటరాజన్ కు ఉద్వాసన పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఆమె స్థానంలో  ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం, సీనియర్ నాయకుడు అయిన  భూపేష్ బగెల్‌ను నియమించనుందని తెలుస్తోంది.  ఇటీవలి కాలంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న  రాజకీయ పరిణామాలు  ప్రభుత్వానికీ పార్టీకి మధ్య సమన్వయం లోపం ఉందన్న విషయాన్ని తేటతెల్లం చేసిన నేపథ్యంలో  కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.   పార్టీలో ఎలాంటి అసంతృప్తి, అసమ్మతికి తావు లేకుండా  కఠినమైన, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనీ, అందుకు భూపేష్ బగెల్‌ సరైన వ్యక్తి అని అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఇప్పటివరకు తెలంగాణ బాధ్యతలు నిర్వర్తించిన మీనాక్షీ నటరాజన్ ను తెలంగాణ రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పించాలన్న నిర్ణయానికి పార్టీ హైకమాండ్ వచ్చిందని అంటున్నారు.  సంస్థాగతంగా పార్టీ  పటిష్ఠతకు ఢోకా లేకుండా  ఉండాలంటే  భూపేష్ బగెల్ వంటి  అగ్రనేత అవసరమని హైకమాండ్ భావిస్తోంది.   [Telangana Congress, Bhupesh Baghel, Meenakshi Natarajan, AICC In Charge, Rahul Gandhi, Congress Party, Telugu One]
తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు మాజీ మంత్రి కొండా సురేఖ అడుగులు ఎటు అన్న చర్చ ఓ రేంజ్ లో జరుగుతోంది. కేబినెట్ నుంచి తనను బర్త్ రఫ్ చేసిన తరువాత  మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన కొండా సురేఖ.. తాను కాంగ్రెస్ ను వీడేది లేదని స్పష్టంగా చెప్పినప్పటికీ రాజకీయ పరిశీలకులు మాత్రం ఆమె ఇంకెంత మాత్రం కాంగ్రెస్ లో కొనసాగే అవకాశాలు లేవనే అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే.. ఇప్పటికే ఆమె తన ముఖ్య అనుచరులు, మద్దతుదారులతో వరుస భేటీలు జరుపుతూ భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చిస్తున్నారు.  విశ్వసనీయ వర్గాల భోగట్టా మేరకు ఆమె ఇహనో, ఇప్పుడో పార్టీ మార్పు విషయంపై ఒక ప్రకటనచేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కుమార్తె సుస్మిత రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొండా కుటుంబం అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.  ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే, కొండా సురేఖ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే ఆమెకు బీజేపీనుంచి ఆహ్వానం అందిందని కూడా చెబుతున్నారు. కొండా సురేఖ బీజేపీ గూటికి వస్తే తమకు  అభ్యంతరం లేదని ఆ పార్టీ రాష్ట్ర నాయకుల నుంచి ఆమెకు స్పష్టమైన సంకేతాలు అందాయని చెబుతున్నారు.   అయితే కొండా సురేఖ మాత్రంరాష్ట్ర నాయకత్వం కంటే నేరుగా ఢిల్లీలోని జాతీయ హైకమాండ్ సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకోవాలని కొండా సురేఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను మాత్రమే కాకుండా భర్త కొండా మురళి, కుమార్తె సుష్మితతో కలిసి హస్తిన వేదికగా బీజేపీ అగ్రనేతల సమక్షంలో ఆమె కాషాయం జెండా పట్టాలని భావించడమే కాకుండా, తన చేరికకు కొన్ని షరతులు కూడా విధించినట్లు తెలుస్తోంది.   ఇక బీజేపీ కూడా కొండా రాకను స్వాగతించడానికి సిద్ధంగా ఉంది. ఇందుకు  కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేసిన తరువాత బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, సీనియర్ నాయకురాలు డీకే అరుణ తదితరులు రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.  ఒక బీసీ మహిళా మంత్రిని  బర్త్ రఫ్ చేయడం సరికాదని విరుచుకుపడడమే సంకేతమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [Konda Surekha Join BJP, Telangana politics, Congress party,  Konda couple, Daughter Sushmita, Telugu One]
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది. పెరుగుతున్న వయస్సు కారణంగా శరీరం విశ్రాంతి కోరుతోందనీ, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాననీ అయ్యన్న పాత్రుడు చెప్పారు. తన జన్మదినం సందర్భంగా నర్సీపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనీ విషయం చెప్పారు. నర్సీపట్నంలో నిర్వహించిన తన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని స్వయంగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు తెలియజేశారు.  మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న అయ్యన్నపాత్రుడికి నర్సీపట్నం నియోజకవర్గంతో విడదీయరాని అనుబంధాన్ని ఉంది. ప్రతి ఏటా తన పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గ ప్రజలు, అభిమానుల మధ్య జరుపుకునే ఆయన, ఈసారి తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక ప్రకటన కూడా నర్సీపట్నంలోనే, అదీ తన పుట్టిన రోజు నాడే చేయడం విశేషం.  తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ప్రజలు అందించిన మద్దతును ఈ సందర్భంగా ఆయన   గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన, తనకు రాజ్యాంగబద్ధంగా మిగిలి ఉన్న మిగతా మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అంకితం చేస్తానన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గ సమగ్ర ప్రగతికి ఈ సమయాన్ని పూర్తిగా వెచ్చిస్తానని తెలిపారు. సుదీర్ఘ ప్రజా జీవితం తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోవాలనే నిర్ణయాన్ని పార్టీ నేతలు, శ్రేణులు గౌరవిస్తున్నాయి. నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలు, అందించిన నాయకత్వం చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన మార్గదర్శకత్వం ఎప్పుడూ పార్టీకి అందుబాటులో ఉంటుందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.   ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలన్న అయ్యన్నపాత్రుడు తీసుకున్న నిర్ణయంతో  భవిష్యత్తులో నర్సీపట్నం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ బాధ్యతలను ఎవరు చేపడతారనే అంశంపై పార్టీ కేడర్‌లో చర్చ జరుగుతోంది. కాగా  రాజకీయాల నుంచి వైదొలగినప్పటకీ..  ప్రజలతో తన ఉన్న అనుబంధం ఎప్పటికీ చెక్కుచెదరదని అయ్యన్న ఈ సందర్భంగా చెప్పారు.    [Chintakayala Ayyanna Patrudu Announce retirement,  AP Assembly Speaker, Political Retirement, Narsipatnam News, Telugu Desam Party, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
  కళ్ళతోనే తన క్యారక్టర్ రూపురేఖలు మొత్తాన్ని ప్రెజెంట్ చేయగల భామ భాగ్యశ్రీ బోర్సే. నెంబర్ వన్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమనే మాటలు కూడా సినీ సర్కిల్స్ లో పరిచయం అవుతున్నాయి. లెనిన్ తో తొలి సూపర్ హిట్ అందుకున్న  ఈ ముద్దుగుమ్మ ఖాతాలోకి భారీ ఆఫర్ వచ్చి చేరింది. మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం ‘ఆపరేషన్ గంగ’లో భాగ్యశ్రీ బోర్సే  ఫిక్స్ అయినట్టుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు..తొలి మలయాళ డెబ్యూనే మోహన్‌లాల్ వంటి  సీనియర్ స్టార్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకోవడంతో భాగ్యశ్రీ కెరీర్‌కి   మరో కీలక మలుపుగా మారనుంది.అయితే సినిమాలో ఆమె పోషించబోయే పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. దీంతో మోహన్‌లాల్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది? ఆమె పాత్ర కథలో ఎంత కీలకంగా ఉండబోతోంది? అనే ఆసక్తి నెలకొంది.   Also Read: థియేటర్స్ లో ఉన్నప్పడే: ఇరుముడి ఓటిటి రిలీజ్ డేట్ ఇదే!  ‘ఆపరేషన్ గంగ’ కి విష్ణు మోహన్ దర్శకుడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి  సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ‘ధురంధర్’ వంటి భారీ చిత్రానికి సంగీతం అందించిన సస్వత్ సింగ్ సచ్ దేవ్ ‘ఆపరేషన్ గంగ’కు మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. మొత్తానికి.. ‘లెనిన్’తో సక్సెస్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సేకి  మోహన్‌లాల్‌తో కలిసి నటించే ఛాన్స్ రావడం ఆమె కెరీర్ కి మంచి బూస్టప్ అని చెప్పవచ్చు.     [Bhagya Shree Borse,  Mohanlal, Operation Ganga, Vishnu Mohan, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]
Karthi is returning as the dual-role spy in Sardar 2, directed by PS Mithran, and the actor believes the sequel takes the franchise considerably further than the original. The film is set for a worldwide theatrical release on September 10. Speaking about the sequel, Karthi said, “The concept of Sardar 2 will create ten times more impact than the first film.” Unlike the first Sardar, which dealt with water commercialisation, the sequel reportedly shifts its focus to a major crisis unfolding within India. Karthi feels this gives the film a different dimension from conventional spy thrillers that largely rely on international missions. The scale has also increased considerably, with the team reportedly constructing a life-sized Vande Bharat train set for one of the action sequences. Karthi described the production as a large-scale attempt to deliver an Indian spy thriller with ambitious action blocks, particularly in the flashback and climax. The actor also spoke about the physical demands of playing the older version of his character. “I genuinely enjoy action, but fighting like an elderly man brought its own unique challenges,” he said, explaining that the character relies more on experience and technique than physical strength. Another major addition is SJ Suryah as the antagonist. Karthi called his character “remarkably fresh and unpredictable” and revealed that Suryah has dubbed his own portions. Produced by Prince Pictures, Sardar 2 will be released in Telugu by Annapoorna Studios.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
చాలా రోజుల తర్వాత అచ్చ తెలుగు సినిమాని మురిసిపోయేలా చేసిన మూవీ ఇరుముడి. వయసు లింగ బేధం తేడా లేకుండా ట్రాక్టర్లు,ఎడ్ల బళ్ళలో సైతం థియేటర్స్ కి వెళ్ళి టికెట్స్ కోసం గొడవ పెట్టుకున్నారంటే ఇరుముడి ఏ స్థాయి విజయమో అర్ధం చేసుకోవచ్చు. 200 కోట్ల మార్కుని దాటి షికారు చేస్తున్న ఇరుముడి ఓటిటికి సంబంధించిన ఆసక్తికర చర్చ సినీ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో జరుగుతుంది.    ఓటిటి హక్కులని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ నెల 18న రావాల్సి ఉంది. కానీ థియేటర్లలో ఇప్పటికీ హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండటంతో, ఓటీటీ రిలీజ్‌ను మరికొన్ని వారాలు ఆలస్యం చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రొడ్యూసర్లు  నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యంతో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. 4 వారాల నుంచి 6 లేదా 8 వారాలకు పొడిగించే ఆలోచనలో ఉన్నట్లుగా నిర్మాతల నిర్మాణమని టాక్. అదే జరిగితే ఈ నెలలో  ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉండదు.  ఏది ఏమైనా రిలీజ్ డేట్ పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది.      Also Read: మారిపోయిన 'డీసీ' భామ జీవితం: హిట్ వస్తే ఎవరికైనా అదే పరిస్థితి!     [ Irumudi, Raviteja, Priya Bhavani Shankar, Nakshtra, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood ]  
  'డీసీ' మూవీ సాధించిన ఘన విజయం తెలిసిందే. తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా రికార్డు కలెక్షన్స్  సృష్టించి కంటెంట్ బాగుంటే మిగతా 'షో' ప్రాపర్టీస్ అక్కర్లేదని నిరూపించింది. ఇక ఈ చిత్రం ద్వారా లోకేష్ కనగరాజ్ కి ఎంత పేరు వచ్చిందో, వామికా గబ్బీకి  కూడా అంతే పేరు వచ్చింది. దీంతో ఈ భామ రాబోయే సినీ జర్నీ  ఒక రేంజ్ లో ఉండబోతుంది. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే కాక పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ తో దూసుకుపోతున్న  సూర్య  తన 47వ సినిమాని 'ఆవేశం' ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ తర్వాత 'జై భీమ్' చిత్ర దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో ఆయన 48వ సినిమా పట్టాలెక్కనుంది. ఇక దీని తరువాత, పవర్‌ఫుల్ అండ్ విభిన్నమైన యాక్షన్ చిత్రాల దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వంలో సూర్య తన 49వ (Suriya 49) చిత్రాన్ని చేయనున్నారు. సరిగ్గా ఈ హెచ్. వినోద్, సూర్య కలయికలో రూపుదిద్దుకోనున్న క్రేజీ ప్రాజెక్ట్‌లోనే వామికా గబ్బీ ప్రధాన కథానాయకిగా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది.   Also Read: యష్ ఫ్యాన్స్ హంగామా: టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ కి ఊహించని కలెక్షన్స్  చండీగఢ్‌కి చెందిన వామికా  దాదాపు 19 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది. ఈ 19 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, పంజాబీ వంటి వివిధ భాషల్లో కలిపి సుమారు 30కి పైగా చిత్రాల్లో నటించి తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే, అన్ని  సినిమాల్లో చేసినప్పటికీ రావలసిన స్థాయిలో  గుర్తింపు మాత్రం రాలేదు. ఇప్పుడు డిసి తన రూట్ మార్చేసింది.     [Wamiqa Gabbi, Dc, Suriya, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]
Lokesh Kanagaraj could be looking at an interesting change in his LCU plans after AA23. While Kaithi 2 has long been expected to be his next film in the Lokesh Cinematic Universe, there is now a possibility that the filmmaker could make Rolex with Suriya before returning to Karthi’s Dilli. The LCU began with Kaithi in 2019 and expanded massively with Vikram in 2022. Suriya’s brief appearance as Rolex in Vikram became one of the biggest talking points of the film, creating demand for a full-fledged story around the character. Leo subsequently expanded the universe further, connecting Vijay’s world with the larger LCU mythology. Lokesh has multiple LCU commitments, including Kaithi 2, Vikram 2 and Rolex. Although Kaithi 2 was previously indicated as his next project after AA23, the order could change depending on actor dates and the filmmaker’s plans. Interestingly, Lokesh is not expected to continue acting after AA23, meaning his focus could return entirely to direction. If Rolex moves ahead, another major question is whether it will become Suriya50. Reports have linked the two, but there is no official confirmation yet. If Rolex does come before Kaithi 2, it could give the LCU a major shift, taking the franchise deeper into the criminal empire introduced through Suriya’s character.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
    ఎంత పెద్ద స్టార్ అయినా కథ, కథనం బాగోకపోతే ప్లాప్ ని కౌగిలించుకోవాల్సిందే అని టాక్సిక్ మరోసారి నిరూపించింది. అభిమానులు, సినీ ప్రేమికుల జనాభా కంటే ప్రేక్షకుల జనాభా ముఖ్యమనే సత్యం కూడా టాక్సిక్ ద్వారా మరోసారి నిరూపితమైందని చెప్పుకోవచ్చు.    నిన్నటాక్సిక్  ఇంగ్లీష్ వెర్షన్ ఎంపిక చేసిన నగరాల్లో రిలీజయ్యింది. దాదాపు 17 నిమిషాల మేర నిడివి తగ్గించి, 2 గంటల 57 నిమిషాలతో మేకర్స్ రిలీజ్ చేసారు. అయితే, మేకర్స్ ఆశించిన ఊరట ఈ ఇంగ్లీష్ వెర్షన్ ద్వారా కూడా లభించలేదు. తొలిరోజు ట్రేడ్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా  కేవలం 450 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనివల్ల మొదటి రోజు  వెర్షన్ సాధించిన వసూళ్లు కేవలం 1.40 లక్షలకే పరిమితమై ట్రేడ్ వర్గాలకి షాక్‌కి  గురిచేసింది. ముఖ్యంగా ఉత్తరాది నగరాలైన గురుగ్రామ్, నోయిడాలలో అయితే ఒక్కో నగరంలో 25 కంటే తక్కువ టికెట్లు మాత్రమే తెగి, దారుణమైన ఆక్యుపెన్సీని నమోదు చేశాయి. ముంబై, బెంగళూరులో కొద్దిగా పరవాలేదనిపించినా, ఓవరాల్ డిమాండ్ మాత్రం చాలా నీరసంగా ఉంది.   Also Read: డెబ్యూ దర్శకులకి ఏమైంది: ఓల్డ్ స్టైల్ నారేషన్ తో ఎందుకు వస్తున్నారు! దీంతో టాక్సిక్ ఇంగ్లీష్ వెర్షన్ ఒక రేంజ్ లో ఇరగదీస్తుందని యష్ ఫ్యాన్స్ కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.  కానీ భాష మారవచ్చేమో గాని భావం, భావోద్వేగం మాత్రం ఒక్కటే కదా.     [Toxic, English Version Collections, Yash, Geetu Mohandas, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]
'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మూవీ 'ఎపిక్'. '90s' వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న ఆదిత్య హాసన్, ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. '90s' సిరీస్ ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసేలా ఒక క్లీన్ ఎంటర్టైనర్ లా తెరకెక్కింది. అలాంటి దర్శకుడి నుండి సినిమా వస్తుండటం, పైగా అది '90s' కథకి కొనసాగింపు కావడంతో 'ఎపిక్'పై మొదటినుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ ఆకట్టుకుంది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ చూసి మాత్రం అందరూ షాక్ అవుతున్నారు. 'ఎపిక్' మూవీ ఒక క్యూట్ లవ్ స్టోరీతో '90s' సిరీస్ తరహాలోనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంటుందని భావించారంతా. కానీ, ట్రైలర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. క్యూట్ లవ్ స్టోరీకి బదులుగా, ఒక బోల్డ్ లవ్ స్టోరీ చూడబోతున్నాం అన్నట్టుగా ట్రైలర్ లో చూపించారు. లండన్ బ్యాక్ డ్రాప్ అని ముందే తెలిసినప్పటికీ.. ఇలా బోల్డ్ గా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. దీంతో నెటిజెన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. "90s డైరెక్టర్ సినిమా కాబట్టి, మంచిగా ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చు అనుకున్నాం. కానీ, ఇది ఓన్లీ యూత్ ని టార్గెట్ చేసిన సినిమా అని ఇప్పుడే తెలిసింది" అంటూ కొందరు నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు.        [Epic Trailer, Anand Deverakonda, Vaishnavi Chaitanya, Aditya Hasan, Naga Vamsi, Telugu Film News, Telugu News]
  ఇండస్ట్రీలో దర్శకుడిగా మొదటి ఛాన్స్ రావాలంటే చాలా కష్టం. కానీ వచ్చాక దర్శకుడిగా  నిరూపించుకుంటే మాత్రం ఇక ఇండస్ట్రీలో తిరుగుండదు. మినిమమ్ పది నిర్మాతల  అడ్వాన్స్ లు ఆ దర్శకుడి దగ్గరకి చేరతాయి.ప్రేక్షకులు కూడా సదరు దర్శకుడి నుంచి సినిమా వస్తుందంటే చాలు థియేటర్స్ కి  క్యూ కడతారు.  కానీ ఇప్పుడు వస్తున్న కొత్త  దర్శకులు అవుట్ డేటెడ్ కంటెంట్ తో సినిమా తెరకెక్కిస్తు ప్రేక్షకులని ఇబ్బంది పెట్టడమే కాకుండా తమ కెరీర్ ని కూడా ఇబ్బందుల్లోకి తీసుకెళ్తున్నారు. ఒక కథని ఎంచుకునేటప్పుడు ఆ కథ ఎలాంటి మోడ్ లో ఉంది, ప్రస్తుత జనరేషన్ కి నచ్చుతుందా? ఒక వేళ పాత తరహా కంటెంట్ అయినా ఎలాంటి సీన్స్ , స్క్రీన్ ప్లే, బాడీ లాంగ్వేజ్, లొకేషన్స్ తో ప్రెజెంటేషన్ ఇవ్వాలనే కనీస అవగాహన కూడా లేకుండా పోయింది. అందుకే చాలా వరకు కథలు సెల్యులాయిడ్ పైకి వచ్చాక ఫెయిల్ అవుతున్నాయి.   Also Read: RC17 వైరల్ న్యూస్: రామ్ చరణ్, సుకుమార్ కోసం హాలీవుడ్ డిజైనర్!    కొంత మంది సినీ విశ్లేషకులు,అభిమానులలో వినిపిస్తున్న మాట కూడా ఏంటంటే  ఇప్పుడొస్తున్న చాలా మంది దర్శకులు  కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా తామే రాసుకోవడం వలన మంచి కంటెంట్ రాలేకపోతుందేమో,  ఒక వేళ ఆ అర్హతలు అన్ని దర్శకుడికి ఉన్నా కూడా నిమిష, నిమిషానికి మారుతున్న వరల్డ్ మూడ్ ని గమనిస్తూ అనుభవమున్న రచయితలతో డిస్కర్స్ చేయాలనీ వాళ్లంతా కోరుతున్నారు.       [Telugu Cinema, Director, Content, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]
Chandra Siddharth has carved a distinct identity for himself as a filmmaker with a unique sensibility through films such as ‘Aa Naluguru’, ‘Madhumasam’, ‘Andari Bandhuvaya’, ‘Idi Sangathi’, and ‘Aatagadharaa Siva’. His latest directorial venture is ‘Ee Paata Korinavaru Nemalipalem Nundi Rama, Jyotsna, Nandu, Murali, Kabir, Dhol Ravi Modalaguvaru’. The film carries the subtitle ‘A Forbidden Raga from a Forbidden Saga’. Produced by Chandra Siddarth himself under the Filmotsav banner, the film is based on a story by noted filmmaker and writer Madan. Harsha is making his debut as a lead actor, while AmmayraGoswami, Sujana Reddy, Inaya Sultana, Ravi Varma, Anirudh Srivastav , Ashokvardhan, Rekha Nirosha , Sunny , Giri and others play key roles. The makers are gearing up to release the film on September 18. Known for his powerful portrayal of human relationships and emotions in ‘Aa Naluguru’, Chandra Siddarth is now presenting another unconventional film, this time set against the backdrop of a Neuroscientific thriller. The film is described as the first-ever mystery musical. It explores the intriguing relationship between sound, music and the human brain, weaving elements such as sound therapy, brain mapping, memories and guilt into a gripping mystery narrative.   Speaking on the occasion, director-producer Chandra Siddharth said: “This is the longest title in the history of Indian cinema. My friend Madan and I had wanted to turn this story into a film. This was the last film Madan planned before his death. Earlier I had made ‘Aa Naluguru’ based on a story by Madan  “Coming to the story of this film, every night, exactly at 10:30 p.m., the same song is broadcast from a radio station. Rama, Jyotsna, Nandu, Murali, Kabir, Dhol Ravi and others from Nemalipalem keep requesting this song from the village called Nemalipaalem that no longer exists, hence the title ‘Ee Paata Korinavaru Nemalipalem Nundi Rama, Jyotsna, Nandu, Murali, Kabir, Dhol Ravi Modalaguvaru’ for the film.The protagonist Sagar’s obsession with this song leads him into the labyrinth of fragmented memories, guilt and a scientific experiment that had erased his very soul "This high-concept psychological thriller blends sound, neuroscience, memories, guilt and love. It is an experimental attempt designed to offer audiences a completely different cinematic experience. Music plays a very important role in the film, which features four songs. Jay Rex has composed the music. We are bringing the film to audiences on the 18th of this month.”   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, ‘ఇదీ సంగతి’, ‘ఆటగదరా శివా’ తదితర చిత్రాలతో విలక్షణమైన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు చంద్ర సిద్ధార్థ్. ఆయన తాజాగా రూపొందించిన చిత్రం "ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు". దీనికి ఉప శీర్షిక ‘ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా’. ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై ఆయనే సొంతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో ఈ సినిమా రూపొందింది. హర్ష హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో  అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, ఇనాయా సుల్తానా, రవివర్మ, అశోక్‌వర్ధన్, రేఖా నిరోషా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఆ నలుగురు’ చిత్రంతో మానవ సంబంధాలు, భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన చంద్ర సిద్ధార్థ్, ఈసారి ఆధునిక థ్రిల్లర్ నేపథ్యంతో మరో భిన్నమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇది మొట్ట మొదటి మిస్టరీ మ్యూజికల్ . సంగీతం, ధ్వని, మానవ మెదడు మధ్య ఉన్న సంబంధాన్ని కథలో కీలకంగా మలుస్తూ ఈ చిత్రం రూపొందింది. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, అపరాధ భావన వంటి అంశాలను మిస్టరీ కథనంతో మేళవించిన చిత్రమిది.  ఈ సందర్భంగా దర్శక నిర్మాత చంద్ర సిద్ధార్థ్ మాట్లాడుతూ, ‘‘భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్ ఇది. నా స్నేహితుడైన మదన్ తో ఈ కథను సినిమాగా చేద్దామనుకున్నాము. ఇది మదన్ చనిపోయే ముందు చివరిగా ప్లాన్ చేసిన సినిమా. నేను అప్పట్లో మదన్ కథతోనే ‘ఆ నలుగురు’ సినిమా తీశాను. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రతి రోజూ రాత్రి సరిగ్గా పదిన్నర గంటలకు ఓ రేడియో స్టేషన్ నుంచి ఒకే పాట ప్రసారమవుతూ వుంటుంది. నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు ఈ పాటను కోరుతూ వుంటారు. అందుకే ఈ సినిమాకి ‘నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ అనే టైటిల్ పెట్టాను. ధ్వని, న్యూరోసైన్స్, జ్ఞాపకాలు, అపరాధ భావన, ప్రేమ వంటి అంశాలను మేళవిస్తూ రూపొందిన ఈ హై-కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించడానికి ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నం ఇది. ఈ సినిమాలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం వుంది. ఇందులో నాలుగు పాటలున్నాయి. జే రెక్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈనెల 18న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’’ అన్నారు.       [Aa Naluguru Movie, Director Chandra Siddarth, Ee Paata Korinavaaru Movie, Telugu Movies 2026, Telugu Film News, Telugu News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సమాజంలో అత్యంత పవిత్రమైన, బాధ్యతాయుతమైన పాత్ర గురువుది. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి, జ్ఞానమనే వెలుగును నింపే మహోన్నత మూర్తి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులు జన్మనిస్తే, ఆ జన్మకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ప్రసాదించే శక్తి గురువుకు మాత్రమే ఉంది. కేవలం పుస్తకాల్లోని పాఠాలను మాత్రమే కాకుండా, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొవాలో నేర్పించే మార్గదర్శి ఉపాధ్యాయుడు. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ, మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ వేసుకోవాల్సిన ఆత్మపరిశీలన ప్రశ్న..  జ్ఞానం నేర్పే గురువుకు మనం నిజంగా ఏమిస్తున్నాం? అని. టీచర్స్ డే అంటే కేవలం గురువుకు శుభాక్షంకలు చెప్పడం, చిన్న బహుమతులు ఇవ్వడం కాదు.. టీచర్స్ డే రోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాల్సిన విషయాలు ఉన్నాయి. గురువుల నుండి జ్ఞానం పొందిన ప్రతి విద్యార్థి.. ఎంత వయసు అయిన  వారైనా సరే.. కొన్ని విషయాలు తెలుసుకోవాలి..   మనోభావాల రూపంలో ప్రతిఫలం.. ఒకప్పుడు గురుకులాశ్రమాల్లో విద్య పూర్తయిన తర్వాత శిష్యులు తమ శక్తిమేరకు గురుదక్షిణ సమర్పించుకునేవారు. గురువులు కూడా ఏనాడూ ధనాన్ని ఆశించకుండా సన్మార్గంలో నడిచే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడమే ధ్యేయంగా జీవించారు. మరి నేటి ఆధునిక కాలంలో మనం గురువులకు ఇస్తున్న ప్రతిఫలం ఏమిటి? కాలం మారే కొద్ది  విద్య వ్యాపారంగా మారిపోయిన నేటి సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం, వారికి లభిస్తున్న గౌరవం ఎటువైపు పయనిస్తున్నాయో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎదిగినా ఒదిగి ఉండటం లేదు.. చాలామంది విద్యాభ్యాసం పూర్తయి, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత తాము చదువుకున్న పాఠశాలలను, మార్గదర్శకత్వం వహించిన గురువులను మరిచిపోతున్నారు. కార్పొరేట్ విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులను కేవలం జీతం తీసుకునే ఉద్యోగులుగా మాత్రమే చూసే ధోరణి పెరుగుతోంది. తల్లిదండ్రులు కూడా ఫీజులు చెల్లిస్తున్నాం కదా అనే భావనతో ఉపాధ్యాయుల శ్రమను, వారి ఆవేదనను గుర్తించలేకపోతున్నారు. తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం తపించే ఉపాధ్యాయుడికి మనం తిరిగి ఇస్తున్నది కేవలం కొన్ని పూలమాలలు, షాళ్ళు లేదా ఒక రోజు ఇచ్చే తాత్కాలిక గౌరవం మాత్రమేనా? గురువు ఆశించే అసలైన గురుదక్షి.. ఒక గురువు తన శిష్యుడి నుంచి గిఫ్ట్ లు , ధనాన్ని ఏనాడూ ఆశించడు. ఒక ఉపాధ్యాయుడికి లభించే అతిపెద్ద బహుమతి తన విద్యార్థి ఉన్నత స్థానంలో నిలబడటమే. మనం గురువుకు ఇవ్వాల్సిన మొదటిది గౌరవం. ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా, ఎంతటి సంపదను ఆర్జించినా, తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయుడిని చూసినప్పుడు వినయంతో నమస్కరించడం, వారి సేవలను గుర్తుంచుకోవడం నిజమైన గౌరవం. గుర్తింపు... తరగతి గదిలో విద్యార్థి క్రమశిక్షణతో ఉంటూ, గురువు నేర్పిన విలువలను జీవితంలో పాటించినప్పుడు ఆ ఉపాధ్యాయుడి శ్రమకు సార్థకత లభిస్తుంది. సమాజంలో మంచి పౌరుడిగా ఎదిగి, పదిమందికి ఉపయోగపడే పనులు చేసినప్పుడు ఫలానా ఉపాధ్యాయుడి శిష్యుడు..  అని సమాజం మెచ్చుకుంటే, ఆ మాట గురువుకు ఇచ్చే అతిపెద్ద ఆనందం. కృతజ్ఞతా భావం.. కాలం మారినా, ఏళ్లు గడిచినా తమ జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులను తరచూ గుర్తుచేసుకోవడం, వీలైతే వారిని కలసి పలకరించడం ఉపాధ్యాయులకు ఎంతో మానసిక తృప్తినిస్తుంది. మార్పు అవసరం.. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మనం కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, గురువుల పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చుకోవాలి. ఉపాధ్యాయులను కేవలం సమాచారం అందించే యంత్రాలుగా చూడకుండా, ఒక తరాన్ని నిర్మించే శిల్పులుగా గుర్తించాలి. పాఠశాలల్లో , సమాజంలో వారికి తగిన గౌరవాన్ని, భద్రతను, అనుకూల వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. గురువు ఇచ్చిన జ్ఞానం అమూల్యమైనది. దానికి ఏ భౌతిక వస్తువూ సాటి రాదు. మనం గురువుకు తిరిగి ఇవ్వగలిగింది కేవలం హృదయపూర్వక గౌరవం, కృతజ్ఞత, వారు చూపిన సన్మార్గంలో నడవడం మాత్రమే. ఉపాధ్యాయులు నేర్పిన సద్గుణాలను, విలువలను మన జీవితంలో ఆచరిస్తూ, సమాజ శ్రేయస్సుకు తోడ్పడటమే మనం గురువులకు సమర్పించగల నిజమైన గురుదక్షిణ.                         *రూపశ్రీ.
మనలో చాలామంది నిద్ర తక్కువైతే ఆరోగ్యానికి హానికరం అని భావిస్తుంటారు. రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు అలసటగా అనిపించడం, పనిపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయని మనందరికీ తెలిసిందే. కానీ, ప్రతిరోజూ 8 నుంచి 10 గంటలకు మించి ఎక్కువసేపు నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేయకపోగా, అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సూచికగా మారుతుందని మీకు తెలుసా? ఇటీవల దాదాపు 5 లక్షల మంది వ్యక్తుల సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన ఒక కీలక పరిశోధనలో నిద్ర వ్యవధికి, మానవ ఆరోగ్యానికి ఉన్న అనుబంధం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ పరిశోధన అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ రాత్రి సమయంలో సుమారు 6.4 గంటల నుండి 7.8 గంటల మధ్య సరైన రీతిలో నిద్రపోయే వారిలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి సంబంధించిన సంకేతాలు, లక్షణాలు ఎక్కువగా కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే, దీని అర్థం ప్రతి ఒక్కరూ కచ్చితంగా 7 గంటలే నిద్రపోవాలని కాదు. ఒక వ్యక్తికి అవసరమయ్యే నిద్ర సమయం అనేది వారి వయసు, జన్యుపరమైన అంశాలు, అనుసరించే జీవనశైలి, చేసే శారీరక శ్రమ మరియు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కేవలం నిద్రపోయే గంటల సంఖ్యను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని నిద్ర సరిపోతుందో లేదో నిర్ణయించలేము. అయితే రోజువారీగా అతిగా నిద్రపోవడం అనేది మీ శరీరంలో లేదా మానసిక స్థితిలో ఏవైనా అంతర్గత సమస్యలు ఉన్నాయనడానికి ఒక స్పష్టమైన హెచ్చరిక కావచ్చు. డిప్రెషన్, స్లీప్ అప్నియా, శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే వాపులు వంటి ప్రమాదకర పరిస్థితులతో అతి నిద్రకు ప్రత్యక్ష సంబంధం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా, అల్జీమర్స్ లేదా పార్కిన్సన్స్ వంటి న్యూరోడిజెనరేటివ్ వ్యాధులు, ఇతర తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఒక వ్యక్తిలో నిద్రపోవాల్సిన వ్యవధిని అసాధారణంగా పెంచుతాయి. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎక్కువసేపు నిద్రపోవడం వల్లనే ఈ వ్యాధులు వస్తున్నాయని పరిశోధన చెప్పడం లేదు; ఇప్పటికే శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యల కారణంగానే వ్యక్తి ఎక్కువగా నిద్రపోయే అవకాశం ఉంటుంది.       oversleeping health risks telugu guide,healthy sleep duration research details.
చిన్న పిల్లలు ఏది తింటే ఆరోగ్యంగా ఉంటారు, ఏది తింటే అనారోగ్యం పాలవుతారు అనే విషయంలో ప్రతి తల్లిదండ్రులూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత వారికి ఇచ్చే ఆహారంలో చక్కెర, తీపి పదార్థాలు, ప్రాసెస్ చేసిన స్వీట్లు ఎంతవరకు సురక్షితం అనే చర్చ చాలాకాలంగా నడుస్తోంది. చిన్నతనంలోనే పిల్లలకు విపరీతంగా తీపి అలవాటు చేయడం వల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల వెలువడిన ఒక సంచలనాత్మక పరిశోధన ఈ అంశంపై మరింత స్పష్టతనిచ్చింది. జీవిత ప్రారంభ దశలో, ముఖ్యంగా రెండేళ్ల వయసు లోపు పిల్లలకు చక్కెర వినియోగాన్ని తగ్గించడం వల్ల వారు పెద్దయిన తర్వాత తీవ్రమైన క్యాన్సర్ వ్యాధుల బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ ఆసక్తికరమైన అంశాన్ని పరిశోధించడానికి శాస్త్రవేత్తలు బ్రిటన్‌లో 1953 నాటి చారిత్రక పరిణామాలను నిశితంగా పరిశీలించారు. ఆ కాలంలో రేషనింగ్ వ్యవస్థ కారణంగా బ్రిటన్‌లో చక్కెర అందుబాటుపై కఠినమైన నియంత్రణలు ఉండేవి. దీనివల్ల ఆ సమయంలో పుట్టిన పిల్లలకు చిన్నతనంలో చాలా తక్కువ మొత్తంలో చక్కెర లభించింది. ఈ పరిస్థితులను ప్రామాణికంగా తీసుకుని, పరిశోధకులు ఏకంగా 64,000 మందికి పైగా వ్యక్తుల దశాబ్దాల కాలపు ఆరోగ్య సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించారు. చిన్నతనంలో తక్కువ చక్కెర తిని పెరిగిన వారి ఆరోగ్య ఫలితాలను, సాధారణంగా చక్కెర తిన్నవారితో పోల్చి చూసినప్పుడు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నతనంలో పంచదార వినియోగాన్ని పరిమితంగా ఉంచిన వారిలో, దశాబ్దాల తర్వాత కొన్ని రకాల ప్రాణాంతక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం సుమారు 36 శాతం నుండి 69 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా కాలేయ క్యాన్సర్ విషయంలో ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా మరియు ఎక్కువగా కనిపించింది. దీనితో పాటు రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు కూడా వారిలో గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చిన్న వయసులో చక్కెర పరిమితి వల్ల శరీరంలో కలిగే మార్పులు దీర్ఘకాలికంగా రక్షణ కవచంలా పనిచేస్తాయని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.         kids sugar restriction health benefits,childhood sugar intake cancer study.
వెన్నునొప్పి తర్వాత మానవులలో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. వయస్సు పైబడటం వల్ల లేదా మోకాలిలోని కార్టిలేజ్ , సాఫ్ట్ టిష్యూలకు గాయాలవడం వల్ల ఈ నొప్పి ఏ వయస్సు వారికైనా రావచ్చు. దీర్ఘకాలం పాటు వేధించే ఈ మోకాళ్ల నొప్పి మనుషులను శారీరకంగా, ఆర్థికంగా , మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. అయితే ఈ నొప్పి రాగానే నేరుగా సర్జరీ అవసరం పడుతుందని భయపడాల్సిన పనిలేదు. శస్త్రచికిత్స కంటే ముందే అసలు ఈ మోకాళ్ల నొప్పి ఏ కారణం వల్ల వస్తుందో మరియు దానిని ఎలా అధిగమించవచ్చో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటి గురించి వివరంగా తెలుసుకుంటే.. మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణాలు, వాటి లక్షణాలు.. సాధారణంగా 55 నుండి 60 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో మోకాళ్ల నొప్పి రావడానికి ఆస్టియోఆర్థరైటిస్ ప్రధాన కారణం. ఇందులో మోకాలి జోళ్లలోని కార్టిలేజ్ అరిగిపోయి, బరువును మోసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల మోకాళ్లలో వాపు, తీవ్రమైన నొప్పి ఏర్పడి రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ రకమైన నొప్పి మోకాలి కింద లేదా ఇరువైపులా రావచ్చు. ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నవారికి ఉదయం పూట మోకాళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తాయి. మరొకవైపు, శారీరక శ్రమ మరియు వ్యాయామం ఎక్కువగా చేసే యువత లేదా క్రీడాకారులలో మోకాళ్ల నొప్పి గాయాల వల్ల వస్తుంది. ఎక్కువగా రన్నింగ్ లేదా వర్కౌట్లు చేయడం వల్ల ఐటీ బ్యాండ్ సిండ్రోమ్ రావచ్చు.  తొడ కండరాలు బలహీనంగా ఉండటం, మోకాలి నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల పాటెల్లోఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్ లేదా రన్నర్స్ నీ అనే సమస్య వస్తుంది. దీనివల్ల మోకాలిచిప్ప కింద నొప్పి అనిపిస్తుంది. మోకాళ్ల నొప్పులు హఠాత్తుగా ఎందుకు వస్తాయి? కొన్నిసార్లు మోకాళ్ల నొప్పి కింద పడటం, ప్రమాదాలు జరగడం, ఆటలు ఆడేటప్పుడు లేదా వంగి పనులు చేసేటప్పుడు అకస్మాత్తుగా రావచ్చు.  మోకాలికి అయ్యే గాయాల్లో మెనిస్కస్ చిరగడం చాలా సాధారణం. ఇది మోకాలిని స్థిరంగా ఉంచే ఒక అర్ధచంద్రాకార కార్టిలేజ్. కాళ్లు అనుకోకుండా మెలిక తిరిగినప్పుడు ఇది చిరిగిపోయి తీవ్రమైన నొప్పి, వాపుకు కారణమవుతుంది. మోకాలిని అనుసంధానించే లిగమెంట్లు అతిగా సాగడం లేదా చిరగడం వల్ల కూడా నొప్పి వస్తుంది. ప్రత్యేకించి ఎమ్‌సిఎల్ , ఏసిఎల్ అనే లిగమెంట్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థరైటిస్ నొప్పి నివారణ , సంరక్షణ మార్గాలు.. నొప్పి నెమ్మదిగా ప్రారంభమై పెరుగుతున్నట్లయితే ఫిజియోథెరపిస్ట్ లేదా వైద్యుడిని సంప్రదించాలి. నడక తీరులో లోపాలు, నడుము భాగం బలహీనంగా ఉండటం వల్ల కూడా మోకాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. ఇది నొప్పి నివారణ మందుల కంటే బాగా పనిచేస్తుంది. నొప్పి ఎక్కువగా ఉన్నవారు సైక్లింగ్, ఈత కొట్టడం లేదా ఎలిప్టికల్ మెషిన్ వాడటం వంటి తక్కువ ఒత్తిడి ఇచ్చే వ్యాయామాలు చేయాలి. మంచి సపోర్ట్ ఇచ్చే బూట్లు ధరించడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. వైద్య చికిత్సలు , జాగ్రత్తలు.. జీవనశైలి మార్పులు , సాధారణ మందులతో ఉపశమనం లభించనప్పుడు వైద్యులు స్టెరాయిడ్ ఇంజెక్షన్లను సూచిస్తారు. అయితే వీటిని పదే పదే వాడకూడదు. ప్రారంభ దశలోని ఆస్టియోఆర్థరైటిస్ రోగులకు హైలురోనిక్ యాసిడ్ లేదా ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్లు కొంతవరకు సహాయపడవచ్చు. ఏ చికిత్స పనిచేయనప్పుడు చివరి ఛాయిస్ గా మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. మోకాళ్ల గాయాల నివారణకు ప్రథమ చికిత్స .. వ్యాయామం లేదా పనులు చేసేటప్పుడు గాయం వల్ల నొప్పి వస్తే ఆ పనిని వెంటనే ఆపేయాలి. మోకాలి చుట్టూ మంచు గడ్డలతో ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. మెనిస్కస్ లేదా ఏసిఎల్ చిరిగిన సందర్భాలలో వైద్యుడి సలహా మేరకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మోకాలు పట్టు కోల్పోయినట్లు అనిపించినా, నిలబడటం లేదా మెట్లు ఎక్కడం కష్టంగా మారినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాలు.. వయస్సు లేదా జన్యుపరమైన అంశాలను మార్చలేము కానీ శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మోకాళ్లపై పడే భార తీవ్రతను తగ్గించవచ్చు. వ్యాయామం చేయడం వల్ల మోకాళ్లు పాడవుతాయనేది అపోహ మాత్రమే. శారీరక శ్రమ లేకపోతే కండరాలు బలహీనపడి ఆస్టియోఆర్థరైటిస్ ప్రమాదం మరింత పెరుగుతుంది. సరైన పౌష్టికాహారం తీసుకోవడం, కండరాలను బలంగా ఉంచుకోవడం , తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మోకాళ్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవడం  సాధ్యమవుతుంది.                *రూపశ్రీ.
బరువు తగ్గాలని అన్నం మానేశారు… అయినా బరువు తగ్గడం లేదా? రోజూ డైట్ చేసినా వెయిట్ పెరుగుతుందా? అయితే మీ బరువు పెరగడానికి కేవలం ఎక్కువగా తినడమే కారణమా? లేక థైరాయిడ్, PCOS, హార్మోన్ల మార్పులు, ఇన్ఫ్లమేషన్ వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయా? 100 కిలోల బరువు ఉన్నవారు ఒక్క నెలలోనే మొత్తం బరువు తగ్గడం సాధ్యమేనా? కొబ్బరి నూనె తాగడం, ఫ్యాట్ బర్నర్ ట్యాబ్లెట్లు వాడటం నిజంగా ఉపయోగపడతాయా? Mounjaro, Ozempic వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లు ఎంతవరకు సురక్షితం? Bariatric Surgery చేయించుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రవి కుమార్ చింత ఊబకాయం (Obesity) గురించి ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. బరువు పెరగడానికి అసలు కారణాలు ఏమిటి? ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే ఏం చేయాలి? డైట్ విషయంలో ఎలాంటి అపోహలకు దూరంగా ఉండాలి? వంటి విషయాలను తెలుసుకోవచ్చు. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? థైరాయిడ్ లేదా PCOS వల్ల బరువు పెరుగుతోందని అనుమానం ఉందా? అయితే ఈ వీడియో మీకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది. గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా చికిత్స లేదా బరువు తగ్గించే విధానాన్ని ఎంచుకునే ముందు వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  అల్లం అనేది మన ప్రాచీన వంటకాల్లోనూ, ఆయుర్వేదంలోనూ ఎంతో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక సహజమైన ఔషధం. అజీర్ణం గా ఉన్నప్పుడు, వాంతులు అవుతున్నప్పుడు, దగ్గు, జలుబు లాంటి సమస్యలు ఎదురైనప్పుడు అల్లాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇక వంటింట్లో కూరల్లోనూ, మసాలా తయారీలోనూ అల్లాన్ని వాడుతుంటారు. ఇలా కాకుండా  ప్రతిరోజూ ఒక చిన్న అల్లం ముక్కను నమిలి మింగడం అలవాటు చేసుకుంటే  ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయంపై ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అవేంటో తెలుసుకుంటే..  అల్లం ప్రభావం..  వరసగా రెండు నెలలు, అంటే అరవై రోజుల పాటు రోజూ క్రమం తప్పకుండా ఒక చిన్న అల్లం ముక్కను నమలడం వల్ల మన శరీరంలో శ్వాసకోశ వ్యవస్థ నుండి జీర్ణవ్యవస్థ వరకు అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయి. శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం , ఉపశమనం.. రోజు ఒక చిన్న అల్లం ముక్క నమలడం వల్ల గొంతులో ఏర్పడే అసౌకర్యం, మంట క్రమంగా తగ్గుతాయి. ఊపిరితిత్తులకు వెళ్లే గాలి మార్గాలను ఇది సడలించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. సుమారు ఆరు నుండి ఎనిమిది వారాల పాటు ఈ అలవాటును కొనసాగించడం వల్ల దగ్గు తీవ్రత గణనీయంగా తగ్గుతుంది.  గాలిలో దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల గొంతు , శ్వాసనాళాల్లో కలిగే మంటను అల్లం తగ్గిస్తుంది. అల్లంలోని సహజ సిద్ధమైన వేడి చేసే గుణం ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫాన్ని లేదా శ్లేష్మాన్ని పలచబడేలా చేస్తుంది. దీనివల్ల ఊపిరితిత్తుల నుండి కఫం సులువుగా బయటకు వచ్చేస్తుంది. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, రొంప, , చిన్న శ్వాస సమస్యల నుండి ఇది ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఆస్తమా లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు అల్లాన్ని  కేవలం  ఒక సహాయక పదార్థంగా మాత్రమే ఉపయోగించాలి తప్ప, వైద్యులు సూచించిన మందులకు ప్రత్యామ్నాయంగా తీసుకోకూడదు. జీర్ణవ్యవస్థ మెరుగుదల.. రోజువారీ ఆహారంలో అల్లాన్ని భాగం చేసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుండి మంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరికి మంచిది కాదు?  అల్లం నమలడం చాలా మంచిదే అయినప్పటికీ, కొందరి విషయంలో ఇది ప్రతికూల ప్రభావాలను చూపవచ్చు. అల్లాన్ని పరిమితికి మించి ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే నోటిలో మంట లేదా పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. సున్నితమైన జీర్ణాశయం ఉన్నవారికి లేదా కడుపులో మంట, ఆసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రిటిస్ ఉన్నవారికి రోజూ పచ్చి అల్లం నమలడం వల్ల కడుపులో అసౌకర్యం పెరగవచ్చు. రక్త ప్రసరణను పలచబరిచే మందులు  వాడేవారు కూడా అల్లాన్ని అధికంగా తీసుకోకూడదు, ఎందుకంటే అల్లానికి కూడా రక్తాన్ని పలచబరిచే స్వభావం కొంతవరకు ఉంటుంది. తీసుకోవాల్సిన పరిమాణం , జాగ్రత్తలు..  అల్లం ఆరోగ్యానికి మంచిదే అయినా తీసుకోవలసిన పరిమాణం చాలా ముఖ్యం. మన బొటనవేలి పరిమాణంలో ఉన్న ఒక చిన్న అల్లం ముక్క లేదా రెండు చిన్న పలచటి ముక్కలు సరిపోతాయి. ఒకవేళ పచ్చి అల్లం నమలడం వల్ల కడుపులో మంటగా అనిపిస్తే, దానిని నేరుగా నమలకుండా గోరువెచ్చని నీటిలో అల్లం రసం లేదా అల్లం ముక్కలు వేసి మరిగించి ఆ నీటిని తాగడం మంచిది. అల్లం అనేది శారీరక ఆరోగ్యానికి మేలు చేసే   ఒక మంచి ఆహార పదార్థం మాత్రమే గానీ, ఏ రోగానికీ పూర్తి స్థాయి చికిత్స లేదా నివారణ కాదు. తరచూ ఆయాసం రావడం, ఎడతెగని తీవ్రమైన దగ్గు ఉండటం, లేదా గుండెలో  నొప్పి వంటివి  ఉన్నట్లయితే, అల్లంపై మాత్రమే ఆధారపడకుండా వెంటనే  వైద్యులను కలిసి సరైన పరీక్షలు చేయించుకోవాలి.                             *రూపశ్రీ.