దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి  అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది. కేంద్రంలోని అధికార ఎన్డీఏ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యాచరణను మరింత బలోపేతం చేసేందుకు విపక్షాలు సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నాయి. న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన తాజా సమావేశంలో ఇండియా బ్లాక్ నేతలు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజల సమస్యలపై నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు గాను ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం కావాలని కూటమి ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ క్రమంలోనే తమ తదుపరి కీలక భేటీని 2026, ఆగస్టు 8వ తేదీన నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి రాజకీయ వర్గాల్లో వేడి పుట్టించారు. ఈ చారిత్రాత్మక సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 25 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరై తమ గళాన్ని వినిపించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సాగిన ఈ సుదీర్ఘ చర్చల్లో దేశాన్ని వేధిస్తున్న ఐదు అత్యంత కీలకమైన అంశాలపై కూటమి నేతలు ఒకే తాటిపైకి వచ్చారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR) ప్రక్రియలో జరుగుతున్న వ్యూహాత్మక లోపాలు, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఓటర్ల హక్కుల ఉల్లంఘనపై ఇండియా కూటమి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) కి నేరుగా ఒక సమగ్రమైన లేఖ రాయాలని 25 పార్టీల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ అధికారిక లేఖను అత్యంత త్వరలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించనున్నారు. దేశంలోని విద్యావ్యవస్థను అతలాకుతలం చేస్తున్న నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్‌లు, అలాగే సీబీఎస్ఈ (CBSE) మూల్యంకనంలో వెలుగుచూసిన ఘోరమైన అవకతవకలపై విపక్షాలు నిప్పులు చెరిగాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఇండియా కూటమి అత్యున్నత వేదిక నుండి డిమాండ్ చేసింది.  దీనితో పాటు దేశంలో పెరుగుతున్న బంధుప్రీతి పెట్టుబడిదారీ విధానం, బీజేపీయేతర లేదా ఎన్డీఏయేతర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలపై కేంద్రం చేస్తున్న దాడులు, సమాజంలో అణగారిన వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాలు, మరియు మోదీ ప్రభుత్వ ప్రస్తుత విదేశాంగ విధానంలో లోపాలను ఎండగట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది. ఈ ఐదు ప్రధాన అంశాలపై దేశవ్యాప్తంగా ఐక్యంగా ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించారు.  అయితే, ఈ కీలక భేటీకి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), డీఎంకే (DMK) దూరంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న డీఎంకే ఈ భేటీకి డుమ్మా కొట్టగా, ఆప్ వ్యూహాత్మకంగా దూరంగా నిలిచింది. అయినప్పటికీ, మిగిలిన భాగస్వామ్య పక్షాలు ఆగస్టు 8 భేటీ కోసం ఇప్పటి నుంచే సమరశంఖం పూరిస్తున్నాయి.  
  రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు. సోమవారం అమరావతి అసెంబ్లీ భవనంలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. వనితా రాణికి అందచేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు.రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ రెండు సెట్ ల నామినేషన్ లను సమర్పించారు. ప్రతిపాదకులుగా చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీ నారాయణ,పంతం వెంకటేశ్వరరావు(నానాజి), తంగిరాల సౌమ్య సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ రెండు సెట్ ల నామినేషన్ లను సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి అచ్చెన్నాయుడు,ఎమ్మెల్యేలు బి.రామాంజనేయులు,కొలిశెట్టి శ్రీనివాస్, శ్రీరాం తాతయ్యలు సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్ రెండు సెట్లు నామినేషన్లు సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి కొలుసు పార్థసారథి,ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్,సుందరపు విజయ్ కుమార్,బోడే ప్రసాద్ లు సంతకాలు చేశారు.  ఈకార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం. అఖిల్ కుమార్, పి.విజయ కుమారి తోపాటు కూటమి నేతలు జ్యోతుల వెంకట అప్పారావు(నెహ్రూ),వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)వరుపుల సత్య ప్రభ,బండారు సత్యానంద రావు పాల్గొన్నారు. ఇంకా 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తదతర నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువయ్యేలా సరికొత్త  కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుంది. వైసీసీ హయాంలో జగన్  ప్రజలకు అందుబాటులో ఉండకుండా, కేవలం  కోటరీకే పరిమితమై దెబ్బ తిన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు ప్రజలతో మమేకమైన జగన్.. అధికార పగ్గాలు చేపట్టగానే, ప్రజలకు చేరువయ్యే అన్ని మార్గాలనూ మూసేసుకున్నారు. కేవలం తన కోటరీ  మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది.  ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.   ఈ ప్రజాబాటలో  భాగంగా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ  సంయుక్తంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లనున్నాయి. జూన్ 9న సంక్షేమ పథకాలపై కేంద్రీకరిస్తూ భారీ ఎత్తున తొలి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. లబ్ధిదారులకు పథకాలు అందుతున్న తీరు, అందులో మార్పుల వంటి పలు అంశాలపై  ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత జూన్ 12న అమరావతి వేదికగా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పాలనాపరమైన ఇబ్బందులు, ప్రజల సమస్యలపై వినతులను స్వీకరిస్తారు. ఇక జూన్ 15న విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనపై స్థానిక ప్రజలు, మేధావుల నుండి నేరుగా సూచనలు, సలహాలు సేకరించనున్నారు.  వైసీపీ హయాంలో సీఎంగా ఉన్న జగన్  ప్రజలతో నేరుగా  కలిసే అవకాశాలకు తాళం వేసేశారు.   ప్రజల నుండి క్షేత్రస్థాయి ఫీడ్‌బ్యాక్ తీసుకోకపోవడంతోనే  2024 ఎన్నికల్లో వైసీపీ  కేవలం 11 స్థానాలకే  పరిమితమైందన్నది పరిశీలకుల విశ్లేషణ. ఆ రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన ఎన్డీఏ కూటమి, అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ  ప్రజలతో మమేకం అయ్యే వ్యూహాలనే అనుసరిస్తున్నది. తాజాగా చేపట్టిన ప్రజాబాట. ద్వారా సామాన్య ప్రజలు తమ ప్రాంత ప్రతినిధులను, ప్రభుత్వాన్ని నేరుగా కలిసి అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ప్రభుత్వం భవిష్యత్తులో తన పరిపాలనను మరింత మెరుగుపరుచుకుంటూ, ప్రజామోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుందని తెలుగుదేశం కూటమి సర్కరా్  భావిస్తోంది.  
ALSO ON TELUGUONE N E W S
సీనియర్ మరియు వింటేజ్ హీరోలను తన సినిమాల్లో పవర్‌ఫుల్ పాత్రల ద్వారా మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావడంలో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రూటే వేరు. గతంలో డైరెక్టర్ బోయిపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'లెజెండ్' సినిమాతో జగపతి బాబును విలన్‌గా మార్చి ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌కు ఒక అద్భుతమైన పునాది వేశారు బాలకృష్ణ. ఆ తర్వాత అదే బాటలో 'అఖండ' సినిమా ద్వారా ఫ్యామిలీ హీరో శ్రీకాంత్‌ను క్రూరమైన విలన్‌గా పరిచయం చేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ఇప్పుడు ఇదే సక్సెస్ ఫార్ములాను మరోసారి రిపీట్ చేస్తూ టాలీవుడ్‌లో ఒక సంచలన వార్త విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. బాలకృష్ణ, కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్, విలక్షణ నటుడు రాజశేఖర్ (Rajasekhar) విలన్‌గా నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలి కాలంలో హీరోగా కంటే క్యారెక్టర్ రోల్స్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ రాజశేఖర్ పరిశ్రమకు కొన్ని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. శర్వానంద్, నితిన్ సినిమాల్లో ఆయన చేసిన వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ముఖ్యంగా శర్వానంద్ 'బైకర్' సినిమాలో ఆయన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో కొరటాల శివ, బాలకృష్ణ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో రాజశేఖర్‌ను ఒక అత్యంత పవర్‌ఫుల్ మరియు స్టైలిష్ విలన్‌గా ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ సినిమాల్లో విలన్ పాత్రలు కేవలం శారీరక బలానికి మాత్రమే పరిమితం కాకుండా, హీరోతో సమానంగా మైండ్ గేమ్ ఆడే విధంగా చాలా పాలిష్‌డ్‌గా మరియు కార్పొరేట్ తరహాలో ఉంటాయనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఈ సినిమా కథాంశం కూడా అత్యంత ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. అధికారంలో ఉన్న ఒక ఉన్నత వ్యక్తి సమాజంలోని ఒక పెద్ద ఈవిల్ ఫోర్స్‌పై ప్రజలతో కలిసి ఎలాంటి పోరాటం చేశాడు అనే కోణంలో కొరటాల శివ ఈ లైన్‌ను సిద్ధం చేశారు. సమాజం మొత్తం సఫర్ అవుతున్న తరుణంలో, అధికారంలో ఉన్నవాళ్లు మరియు లేనివాళ్లు అంతా కలిసి ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి ఎదుర్కోవాల్సిన ఆ దుష్టశక్తి వెనుక ఉండే ప్రధాన సూత్రధారిగా రాజశేఖర్ పాత్ర ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ పాత్ర కోసం రాజశేఖర్ గెటప్, డైలాగ్ డెలివరీ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ పూర్తిగా సరికొత్తగా, విచిత్రంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కేవలం మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో మాత్రమే కాకుండా మైండ్ గేమ్ చుట్టూ తిరిగే కథ కావడంతో, బాలయ్య రౌద్రానికి మరియు రాజశేఖర్ ఇంటెలిజెంట్ విలనిజానికి మధ్య జరిగే ఘర్షణ థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వార్త గనుక నిజమైతే, రాజశేఖర్ కెరీర్‌కు ఇదొక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్‌గా నిలవడం ఖాయం.  
Strong industry buzz suggests that Karthi has stepped away from the ongoing project with director Kalyan Shankar after the completion of the first schedule. While there is no official confirmation yet, conversations within film circles indicate that Karthi was reportedly not satisfied with the filmed output and felt the screenplay required substantial reworking before moving ahead. However, insiders insist that this is not being viewed as a fallout between Karthi and the production house. The decision is said to have emerged from creative discussions, with the feeling that making changes now would be easier than correcting the film at a later stage. Following this development, Sithara Entertainments' producer Naga Vamshi is reportedly exploring multiple options. One version of the buzz suggests that the team may retain the basic idea and rework the screenplay extensively. Another version indicates that the banner could consider bringing in a new director while keeping the project alive. Despite the setback, industry talk suggests Karthi has assured Sithara Entertainments that he is open to collaborating with them on another project in the future, signalling that the professional relationship remains unaffected. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'NBK 111'. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సక్సెస్‌ఫుల్ కాంబో రిపీట్ అవుతుండటంతో టాలీవుడ్ వర్గాలతో పాటు నందమూరి అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న 'NBK 111' ఫస్ట్ టీజర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో 'NBK 111' టీజర్ మ్యూజిక్ వర్క్ ఈరోజు పూర్తవుతుందని సంగీత దర్శకుడు తమన్ (Thaman) చెప్పారు. అంతేకాదు ఈ టీజర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి తమన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియా వేదికగా సైతం తమన్ స్పందిస్తూ 'NBK111 బ్లాస్ట్.. గోపీచంద్ మలినేని వర్క్ పీక్స్" అన్నట్టుగా ట్వీట్ చేశారు. దానికి దర్శకుడు గోపీచంద్ మలినేని బదులిస్తూ, తమన్ సృష్టించబోయే సంగీత విధ్వంసం కోసం తాను కూడా వెయిట్ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. దీనిపై ప్రెస్ మీట్ లో తమన్ రియాక్ట్ అవుతూ, తాను జీవితంలో ఎప్పుడూ ఫేక్‌గా ఉండలేదని, సినిమా అవుట్‌పుట్ అదిరిపోతేనే అంత కాన్ఫిడెంట్‌గా చెప్తానని అన్నారు. "మామూలుగా లేదు టీజర్. వేరే లెవెల్‌లో తీశారు. బాలయ్య గారిని మీరందరూ వేరే లెవెల్ లో చూస్తారు." అని తమన్ హామీ ఇచ్చారు.    
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది పారడైజ్’. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘దసరా’ సంచలన విజయం సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్టుపై ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో కొండంత అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఒక బ్యాడ్ న్యూస్ వినబడుతోంది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ విడుదల మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మొదట మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. ఆగస్ట్ 21న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించాారు. కానీ, అదే డేట్‌కి మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ మూవీ రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఒకే రోజు ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు వస్తే థియేటర్ల కొరతతో పాటు కలెక్షన్లపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉండటంతో, నాని సినిమాను ఆగస్టు రేసు నుండి తప్పించి ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఆశించిన స్థాయిలో వేగంగా సాగకపోవడం కూడా వాయిదాకు మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపు వంద రోజులకు పైగా చిత్రీకరణ జరిపినప్పటికీ, ఇంకా ఒక కీలకమైన మేజర్ షెడ్యూల్ బాకీ ఉందట. ఈ చిత్రంలో భారీ విజువల్స్, యాక్షన్ సీక్వెన్సులు ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సైతం చాలా సమయం పట్టేలా ఉంది. అందుకే ఆగస్టు నాటికి ఫైనల్ అవుట్‌పుట్ సిద్ధం కావడం కష్టమని భావించి మేకర్స్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. నాని కెరీర్‌లోనే సుమారు రూ. 160 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన మునుపెన్నడూ లేని సరికొత్త మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. సికింద్రాబాద్ బస్తీల బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథలో నాని రెండు జడల హెయిర్‌స్టైల్‌తో ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా రగ్గడ్ అవతారంలో మెరవనున్నారు. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ‘శికంజా మాలిక్’ అనే పవర్‌ఫుల్ విలన్ రోల్ చేస్తుండటం విశేషం. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘ఆయా షేర్’ అనే ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగుతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వాయిదా వార్తలపై నాని అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నప్పటికీ, క్వాలిటీ కోసం సమయం తీసుకోవడం మంచిదేనని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ రిలీజ్ పోస్ట్‌పోన్‌మెంట్ గురించిన అధికారిక ప్రకటన చిత్ర యూనిట్ నుండి ఎప్పుడు వస్తుందో చూడాలి.
  సోషల్ మీడియాయుగంలో యూ ట్యూబర్స్ తమకి  సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని, లగ్జరీ లైఫ్‌స్టైల్‌ని అందరికీ తెలియచేయడం ఈ రోజుల్లో ఒక ట్రెండ్‌గా మారిపోయింది. కానీ, అదే అలవాటు మహిళా యూట్యూబర్‌కి  కోలుకోలేని దెబ్బ కొట్టింది. తనకున్న ఆస్తులు, హోమ్ టూర్ పేరుతో ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలని  వీడియోల్లో తెగ చూపించేసరికి, చివరికి దొంగల కన్ను ఆమెపై పడింది.  పక్కా స్కెచ్ వేసి మరీ అర్ధరాత్రి వేళ ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు దాదాపు  7 లక్షల నుండి 10 లక్షల విలువైన సొత్తుని  దోచుకెళ్లారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో వెలుగుచూసింది. సోషల్ మీడియాలో వీడియోల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో హెచ్చరిస్తూ జరిగిన ఈ కథనం ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్‌కు చెందిన రచనా గుర్జర్ అనే మహిళా యూట్యూబర్ గ్రామాల్లో ఉంటూనే తన లగ్జరీ లైఫ్ స్టయిల్, రోజువారీ జీవితానికి సంబంధించిన వీడియోలను తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఆమె చేసిన ఒక హోమ్ టూర్ వీడియో, తన వద్ద ఉన్న నగలని  ప్రదర్శిస్తూ చేసిన వీడియోలు కాస్తా దొంగల దృష్టిలో పడ్డాయి. ఆ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించిన దుండగులు, ఆమె ఇల్లే లక్ష్యంగా పక్కా ప్లాన్ రూపొందించుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చాలా ప్లాన్‌గా రంగంలోకి దిగిన దొంగలు, మొదట ఇంటి చుట్టూ ఉన్న రక్షణ కంచెని కట్ చేసి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత రచనా గుర్జర్, ఆమె భర్త పడుకున్న గదికి బయట నుంచి తాళం వేశారు. తాము దొరికిపోకుండా ఉండేందుకు ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలని  పైకి తిప్పేసి, ముఖాలు రికార్డ్ కాకుండా జాగ్రత్తపడ్డారు. అలా ఇంట్లోకి చొరబడిన దొంగలు అల్మారాల తాళాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. దాదాపు 1,91,000 నగదుతో పాటు, పెద్ద మొత్తంలో బంగారు నగలు, వెండి ఆభరణాలు, విలువైన గ్యాడ్జెట్లని  దోచుకున్నారు. విచిత్రం ఏంటంటే  ఇంట్లో ఫ్రిజ్‌లో ఉన్న 'రెడ్ బుల్' ఎనర్జీ డ్రింక్ బాటిళ్లని  కూడా దొంగలు వదలకుండా తాగుతూ పట్టుకెళ్లిపోయారు. Also read: Thaman: తమన్ షాకింగ్ కామెంట్స్.. దేవిశ్రీప్రసాద్ 'ఎల్లమ్మ' కథ లీక్ చేశారా? తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో దాహం వేసి రచనా గుర్జర్ నిద్ర లేచింది. రూమ్ తలుపు తీద్దామంటే బయట నుంచి లాక్ చేసి ఉండటంతో అనుమానం వచ్చింది. దీంతో  గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు తెరిచారు. అప్పుడు గానీ ఇంట్లో జరిగిన భారీ చోరీ వెలుగులోకి రాలేదు. దొంగిలించిన ఆస్తుల విలువ మొత్తం  7 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు ఉంటుందని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలని  పరిశీలిస్తున్నారు. సోషల్ మీడియాలో మన పర్సనల్ విషయాలు, ఆస్తుల వివరాలని  మితిమీరి షేర్ చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.  
  రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్(Devi sri prasad) హీరోగా ఎల్లమ్మ(Yellamma)అనే చిత్రంతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బలగం ఫేమ్ వేణు దర్శకుడు కావడం దేవి శ్రీప్రసాద్ కి సంబంధించిన లుక్ తో ఎల్లమ్మ రాక కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా మరో రాక్ స్టార్ తమన్ ఎల్లమ్మ గురించి చేసిన వ్యాఖ్యలు ఎల్లమ్మ పై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ మాట్లాడుతు ఎల్లమ్మ  కథ నాకు మొదటి నుంచి పూర్తిగా తెలుసు. కథ విన్నప్పుడే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ తరహా కథాంశాలు టాలీవుడ్‌లో చాలా అరుదుగా వస్తాయి. ఒక వైపు టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీగా ఉంటూనే, నటుడిగా మారడం కోసం దేవిశ్రీ 100 శాతం ప్రాణం పెట్టి పనిచేస్తున్నా రు. ఆయన పడుతున్న కష్టం, చూపిస్తున్న డెడికేషన్ కచ్చితంగా వెండితెరపై భారీ స్థాయిలో ప్రతిబింబిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ యాక్టింగ్ కెరీర్‌కి  ఎల్లమ్మ ఒక మైలురాయిగా నిలుస్తుంది.  దేవిశ్రీ ప్రసాద్ 'పర్షి' అనే డప్పు కళాకారుడి క్యారక్టర్ లో  ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. Also read: Peddi: పెద్దికి ఊహించని షాక్.. అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కులసంఘాల డిమాండ్  'ఎల్లమ్మ'కి నేనే మ్యూజిక్ ని అందిస్తున్నాను. సినిమాలోని కొన్ని ప్రత్యేకమైన పాటల కోసం నన్ను అడిగారు. దేవిశ్రీ ప్రసాద్ కోసం  తప్పకుండా అద్భుతమైన ట్యూన్స్ ఇస్తానని ఒప్పుకున్నట్లు తమన్ స్పష్టం చేశారు. ఒక హీరోగా మారుతున్న తోటి మ్యూజిక్ డైరెక్టర్ చిత్రానికి మరొక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించడం అనేది టాలీవుడ్ చరిత్రలోనే ఒక అరుదైన మరియు బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పాలి. ఈ క్రేజీ కాంబినేషన్ మరియు తమన్ ఇచ్చిన పాజిటివ్ స్టేట్‌మెంట్స్ చూస్తుంటే 'ఎల్లమ్మ' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.   
టాలీవుడ్ లో క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన విక్టరీ వెంకటేష్ (Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్గ్రీన్ సినిమాలకు రచయితగా అద్భుతమైన సంభాషణలు అందించిన త్రివిక్రమ్, తొలిసారిగా వెంకటేష్ హీరోగా నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ కెరీర్‌లో 77వ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ క్రేజీ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ (AK47) అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీగా మారిన ఈ చిత్రం విడుదలపై ఒక న్యూస్ వినిపిస్తోంది. రాబోయే దసరా పండుగను టార్గెట్ చేస్తూ 2026 అక్టోబర్ 16న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. (Aadarsha Kutumbam House No 47) హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) దాదాపు భారీ బడ్జెట్‌తో ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైటిల్ వినడానికి పక్కా ఫ్యామిలీ డ్రామాలా అనిపించినప్పటికీ, ఇందులో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు మరియు మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇటీవల చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. మొదట ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ను ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లోనే వెంకటేష్ ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా, చేతిలో ఆఫీస్ బ్యాగ్ పట్టుకుని రోడ్డు మధ్యలో నవ్వుతూ కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ‘మల్లీశ్వరి’ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ వస్తున్న ఈ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సుమారు 100 కోట్ల బడ్జెట్ కావడం, దసరా లాంటి పెద్ద హాలిడే సీజన్ కలిసి రానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.   
  -పెద్దికి వరుస షాక్ లు  -తాజాగా షాక్ ఇచ్చిన కులసంఘాలు  -అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్  -సెన్సార్ అధికారులపై కూడా కేసు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan),బుచ్చిబాబు(Buchibabu)కాంబోలో తెరకెక్కిన 'పెద్ది'(Peddi)బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 292.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి 300 కోట్ల క్లబ్‌కి చేరువవుతోంది. ఒకవైపు వసూళ్ల వర్షం కురుస్తున్నప్పటికీ, పెద్ది  చుట్టూ వివాదాలు మాత్రం ముసురుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే కథానాయిక జాన్వీ కపూర్ క్యారక్టర్ ని  గ్లామరైజ్ చేయడంపై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతుంది. తాజాగా పెద్ది మరో అతిపెద్ద వివాదంలో చిక్కుకుంది. గిరిజన సంస్కృతిని, భావోద్వేగాలని  కించపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ గిరిజన సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదం ఇప్పుడు కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా అధికారికంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. సినిమాలోని వివాదాస్పద అంశాలపై గిరిజన సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'పెద్ది' చిత్రబృందంతో పాటు కేంద్ర సెన్సార్ బోర్డు అధికారులపై కూడా పోలీసులకి  ఫిర్యాదు చేశారు. సినిమాలో తమ ఆచారాలను, సంప్రదాయాలని తప్పుగా చూపించడమే కాకుండా, గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కొన్ని సంభాషణలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి ఈ చిత్రానికి క్లియరెన్స్ ఇచ్చిన సెన్సార్ బోర్డు అధికారులదే ఇందులో ప్రధాన తప్పు అని, అందుకే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ తో పాటు సెన్సార్ అధికారులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. also read: Vrusha karma: వృషకర్మని భారీ మొత్తానికి దక్కించుకున్న అగ్ర సంస్థ.. చైతు కెరీర్ లోనే హయ్యస్ట్ జాన్వీ కపూర్ విషయంలో దర్శకుడు బుచ్చిబాబు ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే క్షమించాలని సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. సదరు వివాదాస్పద సన్నివేశాలని  సవరిస్తున్నట్లు కూడా  ప్రకటించాడు. ఇప్పుడు గిరిజన సంస్కృతికి సంబంధించిన అంశం కావడంతో ఈ వివాదం అంత తేలికగా సర్దుమణిగేలా కనిపించడం లేదు.  
Varun Tej’s upcoming entertainer Korean Kanakaraju is steadily building strong momentum even before release. Directed by Merlapaka Gandhi and produced by UV Creations, the film is currently progressing rapidly through post-production and promises a quirky Indo-Korean horror comedy setup. The project has already generated curiosity thanks to its unusual cross-cultural backdrop and the response to its promotional material. Adding to the excitement, S. Thaman’s musical single Kamsahamnida has turned into a chartbuster and helped the film gain visibility among audiences. In a significant development, reports suggest that the makers have closed major non-theatrical deals despite the current slowdown in the market. The business reflects growing confidence in the film’s content and Varun Tej’s ability to pull audiences. Industry reports now suggest that Korean Kanakaraju is being lined up for an August 7 release, with plans underway for an extensive promotional campaign. Inside buzz states that Varun Tej’s character is expected to be one of the biggest highlights of the film, while director is said to have designed a horror comedy that stands apart from his earlier works. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Some collaborations in cinema go beyond credits and become stories of admiration, gratitude and creative trust. That seems to be the case with Singeetham and Nag Ashwin. Speaking at the Celebration of Sing Geetham event, veteran filmmaker Singeetham turned emotional and said the film’s entire credit should go to Nag Ashwin. While the original idea belonged to him, he openly admitted that bringing it to life would not have been possible without Ashwin’s support and involvement. He chose not to take full ownership of the final outcome, instead celebrating the younger filmmaker’s contribution. Nag Ashwin, in return, made it clear that he only helped a legend realize yet another innovative vision. He expressed happiness at being able to assist Singeetham and watch him deliver a film that carries his signature imagination. Their bond did not begin here. Nag Ashwin first approached Singeetham during Mahanati, seeking insights and research related to Savitri’s life. That association grew stronger over time, with Ashwin also taking the legendary director’s suggestions while shaping Kalki 2898 AD. Now, with Sing Geetham, Nag Ashwin seems to have returned that guidance in the best way possible—not through words, but by standing beside his mentor and helping his idea reach the screen. The movie is releasing on 11th June.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
ప్రతి వ్యక్తికి నేటికాలంలో ఇల్లు, ఆఫీసు అంటూ రెండు ప్రదేశాలు ముఖ్యంగా మారాయి.  ఒకటి కుటుంబ సభ్యులతో కలసి ఉండేది అయితే రెండవది కుటుంబ సభ్యులను పోషించడానికి మరొక ప్రదేశంలో విభిన్న వ్యక్తులతో కలిసి పనిచేసే స్థలం. చాలామంది ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కుంటున్నామని చెబుతూ ఉంటారు. ఆఫీసులో గనుక పని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు, చిట్కాలతో ఒత్తిడి నుండి బయట పడవచ్చు. ఇవి నేరుగా ఆఫీసుకు వెళ్లి పని చేసే వారికి అయినా,  లేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి అయినా చాలా చక్కగా పని చేస్తాయి.  అవేంటో తెలుసుకుంటే.. పనుల జాబితా.. ఈ చిట్కా ఖచ్చితంగా  సహాయపడుతుంది. ఉదయాన్నే డైరీలో రోజు పనులను రాసుకోవాలి. పైన తేలికైన పనులను,  దిగువన ఎక్కువ సమయం,  శ్రద్ధ అవసరమయ్యే పనులను లిస్ట్  చేయాలి. ఇది  మనస్సు గందరగోళం లేకుండా క్లారిటీగా  ఉంచడానికి సహాయపడుతుంది.  రోజులో ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి.. వాటిని ఎప్పుడు చేయాలో అనుకుంటూ  అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది. బ్రేక్ ముఖ్యం..  ఎంత పని ఉన్నా సరే.. గంటల తరబడి కూర్చుని పని చేయడం తప్పు. ప్రతి 25-30 నిమిషాల పని తర్వాత 5 నిమిషాల విరామం తీసుకోవాలి. నీరు త్రాగడం,  కళ్ళు మూసుకోవడం  లేదా కొద్దిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం.. ఇవన్నీ  మనసు అలసిపోకుండా  విశ్రాంతిని ఇస్తాయి.   ఒత్తిడిని తగ్గిస్తాయి. నో చెప్పడం నేర్చుకోండి.. ఇది అతి ముఖ్యమైన చిట్కా ఏమిటంటే.. ప్రతి పనినీ, మీటింగ్‌నీ లేదా పనిని.. ఇట్లా ఏదైనా సరే.. ఆఫీసులో  అదనపు బాధ్యతను ఎప్పుడూ తీసుకోకూడదు. చాలా మంది కాస్త మంచిగా మాట్లాడుతూ,  కాస్త పొగుడుతూ ఏదైనా పని చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు.  అలాంటి సందర్భాలలో  మర్యాదగా తిరస్కరించాలి.  ఇది  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అదనపు పని భారం ఒత్తిడికి దారి తీస్తుంది.  ప్రతి ఒక్కరూ నో చెప్పడం నేర్చుకోవాలి. ఇది ఎంతో సహాయపడుతుంది. శారీరక శ్రమ..  పనిలో బిజీగా ఉన్నప్పటికీ, ప్రతిరోజూ 15-30 నిమిషాలు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది సహజ ఒత్తిడిని తగ్గించే మార్గం.  ఒత్తిడి హార్మోన్లు వ్యాయామం వల్ల తగ్గుతాయి. వ్యాయమం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది  ఫిట్‌గా ఉంచుతుంది. డెస్క్ దగ్గరే కూర్చుని చేయగల యోగా భంగిమలు కొన్ని ఉంటాయి.  అలాంటివి చేసినా బాగుంటుంది.                          *రూపశ్రీ.
ఆదివారం అనే మాట వినగానే మన ముఖాల్లో సంతోషకరమైన చిరునవ్వు వస్తుంది. ఇది కుటుంబంతో సమయం గడపడానికి,  పని నుండి విరామం తీసుకోవడానికి కేటాయించబడిన రోజుగా పరిగణిస్తారు. చిన్నప్పుడు పిల్లలు ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురుచూసేవారు.. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దలు కూడా ఆదివారం కోసం ఎదురుచూడటం సాధారణమైపోయింది.  భారతదేశంలో ప్రభుత్వ కార్యాలయాలకు  ఆదివారం వారపు సెలవుదినంగా ఉంటుంది. కానీ ఆదివారం అనేది మొదటి నుండి సెలవు దినంగా ఉన్నది కాదని,  ఆదివారం సెలవు దినం కావడం వెనుక చాలా ఆసక్తికరమైన సంఘటన ఉంది. దాని గురించి తెలుసుకుంటే.. కార్మిక హక్కులు.. బ్రిటిష్ పాలన కాలంలో  ఆదివారంను వారపు సెలవు దినంగా ఎంచుకున్నారు. దీని  వెనుక ఒక  కథ ఉంది. ఆదివారం సెలవు వెనుక కథ.. ప్రస్తుత కాలం ఆదివారంతో చేసే ఎంజాయ్మెంట్ ఎప్పుడూ ఉండేది కాదు.  ఎందుకంటే  బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని వస్త్ర మిల్లులలో, ముఖ్యంగా ముంబైలోని కార్మికుల పరిస్థితులు దారుణంగా ఉండేవి. వారు వారానికి ఏడు రోజులు విరామం లేకుండా పని చేయాల్సి వచ్చింది. వారం మొత్తం ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్యం చాలా దెబ్బతినేది. ఈ క్లిష్ట సమయంలో నారాయణ్ మేఘాజీ లోఖండే వారి హీరో అయ్యాడు. 7ఏళ్ల పోరాటం.. కార్మికుల దుస్థితిని చూసి లోఖండే వారి హక్కుల కోసం గొంతు విప్పాడు. 1881,  1884 మధ్య ఎన్నో నిరసనలు నిర్వహించి బ్రిటిష్ పరిపాలకులకు చాలా సందేశాలను పంపాడు. అతని విజ్ఞప్తిపై వేలాది మంది కార్మికులు ఏకమయ్యారు. కానీ అది చిన్న పోరాటం కాదు. ఈ ఉద్యమం ఏడు సంవత్సరాలు కొనసాగింది. చివరికి కార్మికుల సంఘీభావం,  లోఖండే ప్రయత్నాలకు బ్రిటిష్ ప్రభుత్వం లొంగిపోయింది.   జూన్ 10, 1890న, భారతదేశంలో  ఆదివారం అధికారికంగా వారపు సెలవు దినంగా ప్రకటించబడింది. ఆదివారం సెలవు వెనుక అసలు కారణం.. ఆదివారం సెలవు దినంగా ఎంచుకోవడం వెనుక మతపరమైన,  ఆచరణాత్మక కారణాలు రెండూ ఉన్నాయి. ఆ సమయంలోభారతదేశాన్ని క్రైస్తవ మతాన్ని ఆచరించే బ్రిటిష్ వారు పరిపాలించారు. వారికి ఆదివారం చర్చికి వెళ్లడానికి సరైన రోజు. అందువల్ల ఆదివారం సెలవు దినంగా ఎంచుకున్నారు. భారతీయ సంస్కృతి,  హిందూ మతంతో అనుసంధానిస్తూ ఆదివారం సూర్యభగవానుడికి,  కొన్ని ప్రాంతాలలో ఖండోబాకు అంకితం చేయబడిందని ఒక వాదన ముందుకు వచ్చింది. బ్రిటిష్ వారిలాగే భారతీయ కార్మికులు కూడా విశ్రాంతి,  పూజ కోసం ఒక రోజును కలిగి ఉండాలి. 1700 సంవత్సరాల చరిత్ర.. ఆదివారాన్ని విశ్రాంతి దినంగా చేయడం అనేది  భారతదేశంలో పుట్టినది కాదు. దీని చరిత్ర చాలా కాలం నాటిది. 321 ADలో, రోమన్ చక్రవర్తి కాన్‌స్టాంటైన్ ది గ్రేట్ మొదట ఆదివారాన్ని రోమన్ సామ్రాజ్యం అంతటా విశ్రాంతి దినంగా ప్రకటించాడు. క్రమంగా ఈ సంప్రదాయం యూరప్,  తరువాత బ్రిటన్ పరిపాలనా వ్యవస్థలో భాగమైంది.  వారు దానిని భారతదేశానికి తీసుకువచ్చారు. అంతే తప్ప భారతీయులకు ప్రత్యేకంగా ఈ ఆదివారం సెలవు వెనుక ఎలాంటి ప్రాధాన్యత లేదు.                                        *రూపశ్రీ.
 భారతదేశ  పరిమళం ఇప్పుడు సప్త సముద్రాల ఆవలి దేశాల వాతావరణంతో మేళవిస్తోంది. ఆ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు మనకంటే పూర్తిగా భిన్నమైనవి. మనం మన పెరటి మొక్కగా అంతకంటే ఎక్కువ ఇంటి దేవతగా  భావించి, ప్రతి ఉదయం, సాయంత్రం నీళ్ళు పోసి పూజించే  తులసి, ఇప్పుడు ప్రపంచంలోని ప్రధాన ముస్లిం దేశాల మొదటి ఎంపికగా మారింది. ఈ మాట తెలియగానే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది.  కానీ  ఇటీవలి డేటా , వాణిజ్య నివేదికలు ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని వెల్లడించాయి. బంగ్లాదేశ్, మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో భారతీయ తులసికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇది కేవలం వాణిజ్యానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, భారతీయులుగా తెలుసుకోవాల్సిన విషయం. తులసిని కేవలం మొక్కగా బావించే ఎంతోమంది విదేశీయులు కూడా తులసికి ఎందుకంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. విదేశాలలో తులసి.. సనాతన ధర్మంలో, తులసిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, "సాక్షాత్తు లక్ష్మీదేవి" స్వరూపంగా భావిస్తారు. పెరట్లో తులసి ఉన్న ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించలేదని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ నేడు, ఈ నమ్మకం అన్ని హద్దులను దాటింది. ఇటీవలి నివేదికల ప్రకారం, తులసి,  దాని సారాలు భారతదేశం నుండి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ , మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ఈ దేశాలు దీనిని కేవలం ఒక మొక్కగా మాత్రమే కాకుండా, ఒక "దివ్య ఔషధం"గా స్వీకరిస్తున్నాయి. విదేశాలలో తులసికి ఆదరణ.. విదేశాలలో తులసి ఆదరణ  వెనుక విజ్ఞానం  ఆధ్యాత్మికతల కలయికను ప్రతిబింబించే అనేక లోతైన , తార్కిక కారణాలు ఉన్నాయి. నయంకాని వ్యాధులకు సర్వరోగ నివారిణిగా తులసి పనిచేస్తుంది. ఈ దేశాలలో ఆయుర్వేదంపై నమ్మకం పెరిగింది. అక్కడి శాస్త్రవేత్తలు కూడా క్యాన్సర్, మధుమేహం , శ్వాసకోశ వ్యాధుల చికిత్సలో తులసి ప్రభావవంతంగా పనిచేస్తుందని గుర్తించి దాన్ని వైద్యంలో భాగం చేస్తున్నారట. హలాల్ గుర్తించిన మూలిక.. మలేషియా , ఇండోనేషియా వంటి దేశాలలో, "హలాల్" ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి ఉత్పత్తులు సహజమైనవి , స్వచ్ఛమైనవి, వీటిలో నిషేధిత రసాయనాలు ఏవీ ఉండవు. ఈ కారణంగానే అక్కడి ముస్లిం సమాజంలో వీటికి ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. తులసి టీ.. భారతీయ "తులసి టీ" కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రజలు కెఫిన్‌ను వదిలిపెట్టి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి , రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తులసి సారాన్ని ఆశ్రయిస్తున్నారు. తులసితో టీ తయారు చేసుకుని తాగుతున్నారు. మతపరమైన దృక్కోణం నుండి చూస్తే ప్రతి భారతీయుడు దీన్ని  గర్వంగా భావించాలి. మనం విష్ణువుకు ఎంతో ప్రతీకరమైనదిగా  పిలుచుకునే మొక్క పరిమళం ఇప్పుడు విభిన్నమైన ప్రార్థనా పద్ధతులున్న ఇళ్లకు చేరుతోంది. సనాతన సంస్కృతి పూజించే ప్రకృతిలోని ప్రతి అంశం మానవులకు ఎంతో మేలు చేసేది, ఆరోగ్యం చేకూర్చేది అనేటువంటి దానికి ఇదొక నిదర్శనం.   ప్రపంచ మార్కెట్లో తులసికి ప్రాధాన్యత.. భవిష్యత్తులో తులసి ప్రపంచ మూలికా మార్కెట్‌కు బిలియన్ల డాలర్ల మేర దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. గత మూడేళ్లలో గల్ఫ్ దేశాలకు తులసి ఎగుమతులు 30-40% పెరిగాయట. దుబాయ్ , సౌదీ అరేబియాలోని విలాసవంతమైన స్పా మరియు బ్యూటీ పార్లర్లలో ఇప్పుడు తులసి ఆధారిత ఫేస్ మాస్క్‌లు , నూనెలను ప్రీమియం ట్రీట్మెంట్ లో భాగంగా గా అందిస్తున్నారట. భారతీయులకు ఎంతో పవిత్రమైన,  ఆయుర్వేదంలో ఎన్నో ఔషద గుణాలు ఉన్నట్టు పేర్కొన్న తులసిని భారతీయులు చిన్నతనం చేయకుండా ఉపయోగించుకోవాలి.                                      *రూపశ్రీ.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి చాలామంది ఆశ్రయించేది "మల్టీవిటమిన్ టాబ్లెట్లు" (Multivitamin Tablets). అయితే, ఈ టాబ్లెట్లను ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? ఎక్కువగా వాడితే ఎలాంటి నష్టాలు జరుగుతాయి? అనే విషయాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ లక్ష్మి కోన గారు అందించిన పూర్తి వివరాలు ఈ VIDEO ద్వారా తెలుసుకుందాం. మల్టీవిటమిన్ టాబ్లెట్ల ఉపయోగాలు (Uses of Multivitamins) మన శరీరంలో వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, రోగనిరోధక శక్తి బలంగా ఉండటానికి విటమిన్లు ఎంతగానో తోడ్పడతాయి. మల్టీవిటమిన్ల వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు: పోషకాహార లోపాన్ని భర్తీ చేయడం: మనం తినే ఆహారంలో లోపించిన ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్‌ను ఇవి శరీరానికి అందిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల (Immunity Boost): విటమిన్ C, D, మరియు జింక్ వంటి పోషకాలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. శక్తిని అందించడం (Energy Levels): విటమిన్ B-కాంప్లెక్స్ శరీరంలో ఆహారాన్ని శక్తి గా మార్చడంలో సహాయపడుతుంది, దీనివల్ల అలసట, నీరసం తగ్గుతాయి. చర్మం, జుట్టు ఆరోగ్యం: విటమిన్ E, బయోటిన్ వంటివి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఎముకల బలం: క్యాల్షియం మరియు విటమిన్ D కలిసిన మల్టీవిటమిన్లు ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి. సరైన డోసేజ్ మరియు వేసుకునే విధానం (Correct Dosage & Guidelines) మల్టీవిటమిన్లను ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్ని పడితే అన్ని వేసుకోకూడదు. వాటికంటూ ఒక పద్ధతి ఉంటుంది: మల్టీవిటమిన్ టాబ్లెట్లను సాధారణంగా ఉదయం లేదా मధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవడం మంచిది. పరగడుపున (ఖాళీ కడుపుతో) వేసుకుంటే కొంతమందిలో కడుపులో మంట లేదా వికారం కలగవచ్చు. కొన్ని విటమిన్లు (A, D, E, K) కొవ్వులో కరిగేవి (Fat-soluble vitamins). కాబట్టి, కొద్దిగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకున్న తర్వాత వీటిని వేసుకుంటే శరీరం బాగా గ్రహిస్తుంది. ఎల్లప్పుడూ డాక్టర్ సూచించిన డోస్ మాత్రమే వాడాలి. సొంత నిర్ణయాలతో రోజుకు ఒకటి కంటే ఎక్కువ టాబ్లెట్లు వేసుకోకూడదు. జాగ్రత్త: మితిమీరిన విటమిన్ల వాడకం  చాలామంది మల్టీవిటమిన్లు ఆరోగ్యానికి మంచిదే కదా అని విపరీతంగా వాడుతుంటారు. కానీ, డాక్టర్ లక్ష్మి కోన గారి ప్రకారం, విటమిన్లు ఎక్కువైతే "విటమిన్ టాక్సిసిటీ" (Vitamin Toxicity / Hypervitaminosis) అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా విటమిన్ A, D, E, K లు శరీరంలో పేరుకుపోయి కాలేయం (Liver) మరియు మూత్రపిండాల (Kidneys) పై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, విటమిన్ D ఎక్కువైతే శరీరంలో క్యాల్షియం పెరిగిపోయి కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విటమిన్ A ఎక్కువైతే తలనొప్పి, వాంతులు మరియు కాలేయ సమస్యలు రావచ్చు. దుష్ప్రభావాలు (Side Effects) సాధారణంగా పరిమితికి లోబడి వాడినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ కొంతమందిలో క్రింది లక్షణాలు కనిపించవచ్చు: కడుపులో అశాంతి, వికారం లేదా వాంతులు. మలబద్ధకం (Constipation) లేదా విరేచనాలు (Diarrhea) - ముఖ్యంగా ఐరన్ (Iron) ఎక్కువగా ఉన్న మల్టీవిటమిన్ల వల్ల మలం నల్లగా రావడం మరియు మలబద్ధకం జరుగుతుంది. నోటిలో వింత రుచి (Metallic Taste). ఇతర మందులతో పరస్పర చర్యలు (Drug Interactions) మీరు ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యల కోసం మందులు వాడుతుంటే, మల్టీవిటమిన్లు వేసుకునే ముందు జాగ్రత్త వహించాలి: యాంటీబయాటిక్స్: మల్టీవిటమిన్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి మినరల్స్ కొన్ని రకాల యాంటీబయాటిక్స్ (ఉదాహరణకు Tetracyclines) శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. కాబట్టి వీటి మధ్య కనీసం 2 గంటల వ్యవధి ఉండాలి. బ్లడ్ థిన్నర్స్ (రక్తాన్ని పలచబరిచే మందులు): విటమిన్ K రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు రక్తాన్ని పలచబరిచే మందులు (Warfarin వంటివి) వాడుతుంటే, విటమిన్ K ఉన్న మల్టీవిటమిన్లు వాటి పనితీరును దెబ్బతీస్తాయి. చివరిగా:-  మల్టీవిటమిన్ టాబ్లెట్లు అనేవి సమతుల్య ఆహారానికి ప్రత్యామ్నాయం కావు.. సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరల ద్వారా వచ్చే పోషకాలే శరీరానికి అత్యంత శ్రేష్ఠమైనవి.  మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం,  శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండె సమస్యలు వచ్చే వారిలో మొదట్లోనే చిన్న చిన్న లక్షణాలుగా కనిపిస్తాయి. కానీ చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ లక్షణాలను ముందుగానే గుర్తించడం వల్ల తీవ్రమైన గుండె జబ్బులను , గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితులను నివారించవచ్చు. శరీరంలో ఏ లక్షణాలు గుండె జబ్బులను సూచిస్తాయో.. ఆ లక్షణాలు మీకు ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేస్కోండి.. ఛాతీ నొప్పి.. ఛాతీ నొప్పి, బిగుతుగా అనిపించడం, బరువుగా ఉండటం లేదా ఒత్తిడి వంటివి గుండె జబ్బు  అత్యంత సాధారణ లక్షణాలు. ఈ నొప్పి కొన్ని నిమిషాల పాటు ఉండవచ్చు లేదా పదేపదే రావచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి భుజం, మెడ, వీపు లేదా చేతికి కూడా వ్యాపించవచ్చు. ఇలా పదేపదే జరుగుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఊపిరి ఆడకపోవడం.. మెట్లు ఎక్కేటప్పుడు  విపరీతమైన అలసటగా లేదా ఆయాసంగా అనిపిస్తే, అది గుండె బలహీనతకు సంకేతం కావచ్చు. గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అలసట, బలహీనత.. విశ్రాంతి తీసుకున్నప్పటికీ నిరంతరం అలసటగా అనిపిస్తుంటే, దానిని సాధారణ బలహీనతగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు.  గుండె పనితీరు తగ్గినప్పుడు, శరీర భాగాలకు తగినంత ఆక్సిజన్ అందదు, దీనివల్ల అలసట , నీరసం ఏర్పడుతుంది. హృదయ స్పందన.. గుండె కొట్టుకునే వేగంలో ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదల గుండె సమస్యకు సంకేతం కావచ్చు.  ఈ పరిస్థితి పదేపదే ఏర్పడుతుంటే వైద్య పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.                                        *రూపశ్రీ.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని కలచివేస్తున్నాయి. ఆసుపత్రికి వెళ్తే స్టెంట్ వేయాలని లేదా డయాలసిస్ చేయాలని చెప్పినప్పుడు ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. కానీ, ప్రకృతి ప్రసాదించిన ఆహార నియమాలతో, ఆపరేషన్లు లేకుండానే గుండె బ్లాకులను తొలగించుకోవచ్చని మరియు కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని డాక్టర్ శ్రీనివాస్ గుప్త గారు ఈ VIDEO లో వివరించారు. మనం ఈ మార్పును ఎందుకు ఎంచుకోవాలి? (Why Should We?) సాధారణంగా గుండెలో బ్లాక్స్ ఉన్నాయని తెలిస్తే వెంటనే సర్జరీ వైపు మొగ్గు చూపుతాము. అయితే, సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా శరీరానికి ఎటువంటి హాని కలగకుండా ఆరోగ్యాన్ని తిరిగి పొందవచ్చు. సర్జరీ భయం లేకుండా: స్టెంట్ లేదా బైపాస్ సర్జరీల అవసరం లేకుండానే 20% నుండి 40% వరకు బ్లాకులను సహజంగా తగ్గించుకోవచ్చు. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఎటువంటి ఇంజెక్షన్లు లేదా కెమికల్ మెడిసిన్స్ లేకుండా కేవలం కూరగాయల రసాలు మరియు ఆయుర్వేద పద్ధతులతో చికిత్స పొందవచ్చు. సమగ్ర ఆరోగ్యం: ఇది కేవలం గుండెకే కాదు, షుగర్, బీపీ, మరియు కిడ్నీ సమస్యలను కూడా ఒకేసారి అదుపులోకి తెస్తుంది. ఏమి చేయకూడదు? (What Not to Do?) ఆరోగ్యంగా ఉండాలంటే మందుల కన్నా ముందు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం ముఖ్యం: నూనె వాడకం: నూనెతో వేయించిన పదార్థాలను (Oil-fried foods) పూర్తిగా పక్కన పెట్టాలి. ప్రిజర్వేటివ్స్ మరియు సాల్ట్: బ్రెడ్, నూడిల్స్, బేకరీ ఫుడ్స్ వంటి వాటిలో ఉప్పు మరియు ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి బీపీని మరియు కిడ్నీ సమస్యలను పెంచుతాయి. తెల్ల అన్నం మరియు గోధుమలు: కనీసం మూడు నెలల పాటు వైట్ రైస్ మరియు గోధుమలను దూరం పెట్టి, సిరిధాన్యాలు లేదా బార్లీ రొట్టెలు తీసుకోవాలి. పొగత్రాగడం: గుండె సమస్యలకు ప్రధాన కారణమైన స్మోకింగ్ వంటి అలవాట్లను తక్షణమే మానేయాలి. ఆరోగ్యాన్ని తిరిగి పొందే మార్గం (How to do?) డాక్టర్ శ్రీనివాస్ గుప్త గారు సూచించిన ఈ చిట్కాలను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి: 9 వారాల జ్యూస్ థెరపీ: మొదటి వారం: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ (200 ml). రెండో వారం: సొరకాయ జ్యూస్. మూడో వారం: కీరా (కుకుంబర్) జ్యూస్. ఈ విధంగా ఈ మూడు వారాల చక్రం 9 వారాల పాటు (మొత్తం 3 సార్లు) కొనసాగించాలి. ఆహార నియమాలు (Plate 1 & Plate 2): మొదటి ప్లేట్‌లో కేవలం పండ్లు (బ్లూబెర్రీస్, ఆపిల్, జామకాయ) మరియు మొలకలు తీసుకోవాలి. రెండవ ప్లేట్‌లో నూనె లేకుండా వండిన కూరలు, బార్లీ లేదా రాగి రొట్టెలు తీసుకోవాలి. కిడ్నీ మరియు బీపీ కోసం సహజ టీలు: కొలెస్ట్రాల్ తగ్గడానికి దాల్చిన చెక్క నీళ్లు తాగాలి. బీపీ అదుపులో ఉండటానికి కరివేపాకు డికాక్షన్ తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు 5 వేపాకులు, 3 రావి ఆకులను నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలు తగ్గుతాయి. జీవనశైలి మార్పులు: సాయంత్రం 7 గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలి. ప్రతిరోజూ చెప్పులు లేకుండా నడవాలి (Barefoot walking), దీనివల్ల పాదాలలోని ఆక్యుప్రెషర్ పాయింట్లు స్టిమ్యులేట్ అవుతాయి. సాధారణ సందేహాలు (Q&A) ప్ర: డయాలసిస్ ఆపడం సాధ్యమేనా?  జ: అవును, సహజ ఆహారం మరియు వేపాకు, రావి ఆకుల కషాయం వంటి నాచురల్ ట్రీట్‌మెంట్ ద్వారా క్రియాటినిన్ తగ్గించి డయాలసిస్ అవసరం లేకుండా చేయవచ్చని డాక్టర్ గారు అబ్సర్వ్ చేశారు. ప్ర: ఆయిల్ లేకుండా వంటలు రుచిగా ఉంటాయా?  జ: ఖచ్చితంగా! ఇడ్లీ కుక్కర్‌లో స్టీమ్ చేసిన మిర్చి బజ్జీలు లేదా బొండాలు వంటి వాటిని నూనె లేకుండానే ఎంతో రుచిగా చేసుకోవచ్చు. ప్ర: హార్ట్ హెల్త్‌ను ఎలా చెక్ చేసుకోవాలి?  జ: 40 ఏళ్లు దాటిన వారు కనీసం 4-5 ఏళ్లకు ఒకసారి 'సిటీ కరోనరీ యాంజియోగ్రామ్' (CT Coronary Angiogram) చేయించుకోవాలి. AI సాయంతో కేవలం 2 నిమిషాల్లోనే రిపోర్ట్ వస్తుంది.   మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్స్ : INDIA : + 917070999313  USA : +1(732)947-4166     మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!