15 షిప్ మెంట్ల మామిడి పండ్ల ధ్వంసం! భారత్, అమెరికా మధ్య దాదాపు కోల్డ్ వార్ లాంటి పరిస్థితి నెలకొందా అంటే వరుసగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే అనాల్సి వస్తున్నది. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరు భారత్ కు ఒకింత ఇబ్బందికరంగా పరిణమించిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకుర ఇరు దేశాలనూ ఒప్పించింది తానేనని ట్రంప్ ప్రకటించడం, భారత్ దానిని ఖండించడం తెలిసిందే. భారత్ పాకిస్ధాన్ వ్యవహారాలలో మూడో దేశం ప్రమేయం లేదనీ, ఇరు దేశాల సైన్యాధ్యక్షుల మధ్య చర్చల్లోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ విస్పష్టంగా తేల్చేసింది. అలాగే, ఆ తరువాత భారత్ అమెరికాకు వంద శాతం సుంకాల మినహాయింపు హామీ ఇచ్చిందని అమెరికా ఏకపక్షంగా చేసిన ప్రకటననూ ఇండియా నిర్ద్వంద్వంగా ఖండించింది.  దీంతో అమెరికా పెద్దరికం చిన్నబోయింది. అమెరికా ఒత్తిడిని భారత్ ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదని ప్రపంచ దేశాలకు విస్పష్టంగా తెలిసియింది. ఈ నేపథ్యంలోనే అమెరికా భారత్ పట్ల ఒకింత కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని అంటున్నారు. అమెరికా వ్యవహార శైలి కారణంగా ఇరు దేశాల మధ్యా బంధాలు దెబ్బతింటున్న పరిస్థితులు కానవస్తున్నాయి.   తాజాగా  భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయిన 15 మామిడి పండ్ల షిప్ మెంట్ లను దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల్లో అధికారులు నిలిపివేశారు.  సరైన పత్రాలు లేవనే కారణం చూపుతూ వాటిని దేశంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. వీటి విలువ 5 లక్షల అమెరికా డాలర్లు.  భారతీయ కరెన్సీలోదాదాపు  రూ.42,694,000లు. దీంతో వీటిని తిరిగి భారత్ కు తీసుకెళ్లిపోవడం లేదా అక్కడే ధ్వంసం చేయడం తప్ప మరో అవకావం లేని  పరిస్దితి ఎగుమతి చేసిన మామిడి రైతులకు ఎదురైంది. దీంతో తిరిగి ఇంత సరుకు భారత్ కు రవాణా ఛార్జీలు భరించి తీసుకెళ్లే పరిస్దితి లేక అక్కడే ధ్వంసం చేసేస్తున్నారు.  భారత్ నుంచి వచ్చిన మామిడి పండ్లను లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, అట్లాంటా సహా పలు ఎయిర్ పోర్టుల్లో అమెరికా అధికారులు ఏకకాలంలో అడ్డుకోవడం వెనుక అమెరికా ప్రభుత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలే కారణమని అంటున్నారు. దీంతో అమెరికాకు మామిడి పండ్లను ఎగుమతి చేసిన  భారతీయ రైతులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఘటనతో మరోసారి అమెరికాకు మామిడి పండ్లు పంపేందుకు రైతులు సాహసించలేని పరిస్దితి ఏర్పడింది. వాస్తవానికి భారత్ కు అతిపెద్ద మామిడిపండ్ల ఎగుమతిదారు   అమెరికాయే. ఇప్పుడు అమెరికా చర్య కారణంగా రైతులకే కాకుండా, భారత ప్రభుత్వానికి కూడా గట్టి షాక్ తగిలిందనే భావించాల్సి ఉంటుంది.   కాల్పుల విరమణపైనా, ఆ తర్వాత సుంకాలపైనా ట్రంప్ ప్రకటనల్ని భారత్ ప్రభుత్వం ఖండించిన నేపథ్యంలో ఈ మామిడి పండ్ల తిరస్కరణ వ్యవహారం ఇరు దేశాల్లోనూ చర్చనీయాంశమైంది. అయితే దీనిపై అటు అమెరికా కానీ, ఇటు ఇండియా కానీ ఇంత వరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. 
పాకిస్తాన్ కు భారత్ మరో షాక్  త్వరలో జరగాల్సిన ఆసియా కప్‌ నుంచి తప్పుకునేందుకు బీసీసీఐ నిర్ణయం? భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న  పాక్‌కు మరో షాక్ తప్పేటట్టు లేదు. త్వరలో జరగాల్సిన ఆసియా కప్‌ నుంచి వైదొలగేందుకు బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, భారత్‌లో పాక్‌పై ఆగ్రహం కట్టలు తెంచుకున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు జరగట్లేదు. ఇకపై ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో కూడా పాక్‌తో తలపడొద్దని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాక్‌ను ఏకాకిని చేసే వ్యూహంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈసారి ఆసియా కప్ భారత్‌లో జరగాల్సి ఉంది. ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణ భారత్, పాక్ మ్యాచ్‌లే. ఈ మ్యాచ్‌ లు జరిగే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. దీంతో, ఆసియా కప్ లాభదాయకతపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆసియా బోర్డుకు పీసీబీ చైర్మన్ మోహ్‌సీన్ నఖ్వీ నేతృత్వం వహిస్తున్నారు. బీసీసీఐ మాజీ సెక్రెటరీ జైషా ఐసీసీ బాధ్యతలు తీసుకున్నాక ఆసియా క్రికెట్ కౌన్సిల్ బాధ్యతలను మోహ్‌సీన్ చేపట్టారు. ఇక భారత్ నిర్ణయంతో పాక్‌‌కు ఆర్థికంగా గట్టి షాక్ తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ లో తలెత్తిన సంక్షోభం సర్దు మణిగిందా? అంటే గులాబీ పార్టీ నేతలు అవుననే అంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు  కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య తలెత్తిన వారసత్వ లేదా నాయకత్వ వివాదం ప్రస్తుతానికి సర్డుమణిగినట్లే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముందుతరం నేతలు. అవును  రెండు రోజుల క్రితం కేటీఆర్  స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్లి రెండు గంటలకు పైగా చర్చలు జరపడం, ఆ వెంటనే శనివారం హరీష్ రావు నివాసంలో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్ల గురించి, ఉద్యోగ సంఘాల మాజీ నాయకులతో కేటీఆర్, హరీష్ రావు చర్చించి.. డిమాండ్ల సాధనకు సంయుక్త కార్యాచరణ ప్రకటించడం వారిరువురి మధ్యా వివాదం సర్డుమణిగింది అనేందుకు ఒక సంకేతంగా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కాలంలో  ముఖ్యంగా గులాబీ పార్టీ రజతోత్సవ వేడుకలకు ముందు తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగతున్న నేపధ్యంలో ఇద్దరు కలిసి కూర్చుని..  ఉద్యోగుల సమస్యలపై చర్చించి ఉమ్మడి ప్రకటన చేయడం పార్టీ క్యాడర్  కు మంచి సంకేతం పంపుతుందని అంటున్నారు.   నిజానికి ఇటీవల కాలంలో గులాబీ పార్టీలో, ముఖ్యంగా పార్టీ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) కుటుంబంలో అంతర్గత కుమ్ములాటల గురించి పార్టీలో, ప్రజల్లో,  మీడియాలో   పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా  కేటీఆర్ , హరీష్ రావుల మధ్య విబేధాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో వంక కేసీఆర్  కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఈ చర్చల్లో ప్రముఖంగానే వినిపిస్తోంది. ఈ నేపద్యంలోనే బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట సాగుతోందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, పార్టీ రజతోత్సవ వేడుకల తర్వాత హరీష్, కేటీఆర్ మధ్య దూరం పెరిగడమే కాకుండా.. హరీశ్ రావు కారు దిగి సొంత పార్టీ పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, హరీష్ రావు ఈ వార్తలను ఒకటికి పదిసార్లు ఖండించారు. అంతే కాకుండా ఇంకో అడుగు ముందుకేసి, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా, తనకు అభ్యంతరం లేదని  మీడియా ముఖంగానే స్పష్టం చేశారు. అలాగే..  గత పాతికేళ్ల ప్రస్థానంలో ఏనాడు కేసీఆర్ గీసిన గీత దాటలేదని, ఇక ముందు కూడా  కేసీఆర్ మాటే తనకు వేదవాక్కని హరీష్ స్పష్టం చేశారు. నిజానికి, హరీష్ రావు మొదటి నుంచి కూడా కేసీఆర్  తో ఏ విషయంలోనూ విభేదించలేదు. ఇష్టం ఉన్నా లేకున్నా  కేసీఆర్  మాట జవదాటలేదు. ఈ విషయంలో మరో అభిప్రాయం లేదని అంటారు.  ముఖ్యంగా ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన చెవులు వాడి అన్నట్లుగా,  పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్  ప్రాధాన్యత రోజుర్జుకు పెరుగుతూ వచ్చిన  సమయంలోనూ హరీష్ రావు పెదవి విప్పలేదు. ప్రశ్నించలేదు.  కేసీఆర్   మాట జవ దాటలేదు.  కాబట్టి.. ఇప్పుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా హరీష్ రావు  ఎదురు తిరిగక పోవచ్చని అంటారు.   అయినా అనుమానాలు అయితే అలాగే ఉన్నాయి. అందుకు బలం చేకూర్చేలా ప్రత్యర్ధుల ప్రచారం ఉంది. ముఖ్యంగా కేసీఆర్  క్రియాశీల రాజకీయాలకు దూరంగా జరుగుతున్న నేపద్యంలో.. భవిష్యత్  బంధాలు ఎలా ఉంటాయి  అనే విషయంలో సహజంగానే  హరీష్ రావు వర్గంలో అనుమానాలు ఉన్నట్లు చెపుతున్నారు. నిజానికి  పార్టీ కేసీఆర్ కనుసన్నల్లో ఉన్నంత వరకు కుటుంబంలో చిన్నా పెద్ద  పొరపొచ్చాలు ఎన్ని వచ్చినా, కేసీఆర్ పెద్దరికంతో ఏదో విధంగా సర్డుబాటు చేస్తూ వచ్చారు.  కానీ, పగ్గాలు పూర్తిగా కేటీఆర్ చేతికి వెళ్ళిన తర్వాత తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన హరీష్ అనుచరుల్లో వ్యక్త మావుతోందని అంటున్నారు. అందుకే, కేసీఆర్ చొరవ తీసుకుని, నష్ట నివారణకు నడుం బిగించినట్లు చెపుతున్నారు. ముఖ్యంగా పార్టీ నాయకులు, క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళితే, భవిష్యత్ లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందని కేసీఆర్  ఇటు హరీష్ రావు ను, అటు కేటీఆర్ ను  కన్విన్స్ చేసినట్లు చెపుతున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు మామ మాట జవదాటను,  కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా అభ్యంతరం చెప్పను అని మీడియా ముఖంగా, ప్రకటించారని చెపుతున్నారు.  అలాగే, కేటీఆర్ ను హరీష్ వద్దకు కేసీఆరే పంపారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  ఇద్దరి మధ్య సుదీర్ఘంగా రెండు గంటల పాటు జరిగిన భేటీలో  చాలా విషయాలు ఖుల్లం ఖుల్లా చర్చకు వచ్చినట్లు చెపుతున్నారు. ముఖ్యంగా.. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ ముఖ్యనాయకుల మధ్య విబేధాలు లేక పోవడమే కాదు, విబేధాలు లేవన్న సందేశం ప్రజల్లోకి, పార్టీ క్యాడర్ లోకి బలంగా తీసుకు పోవడం కూడా ముఖ్యమని ఇద్దరు నాయకులు అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే, ఇక పై ప్రతి విషయంలో ఇద్దరిదీ ఒకే మాట, ఒకే బాట అన్నట్లు ముందుకు సాగాలని నిర్ణయించారని, అందులో భాగంగానే  ముందు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిమాండ్స్  పై దృష్టిని కేంద్రీకరించారని చెపుతున్నారు. అయితే  ముందు ముందు ఏమి జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, కవిత  సంగతేంటి? ఓవరాల్ పిక్చర్ ఎలా ఉంటుంది అనేది చూడవలసిందే  అంటున్నారు.
ALSO ON TELUGUONE N E W S
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని థియేటర్‌ ఓనర్స్‌ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ థియేటర్స్‌లో సినిమాలు ప్రదర్శించడం వల్ల నిర్మాతలే ఎక్కువ లాభపడుతున్నారని, తాము నష్టపోతున్నామని థియేటర్స్‌ యాజమాన్యాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఉన్న రెంటల్‌ సిస్టమ్‌ వల్ల థియేటర్లు రన్‌ చేయలేని పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు. గతంలో మాదిరిగా పర్సెంటేజీ సిస్టమ్‌ తీసుకొస్తే థియేటర్లు బ్రతుకుతాయి అంటున్నారు. ఈ విషయంలో తమ డిమాండ్స్‌ నెరవేరే వరకు థియేటర్లను మూసెయ్యాలని థియేటర్స్‌ ఓనర్స్‌ భావిస్తున్నారు. జూన్‌ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లను మూసి వేస్తున్నారు. దీంతో నిర్మాతలతోపాటు ప్రేక్షకులు కూడా ఆందోళన చెందుతున్నారు.  వచ్చే నెలలో చాలా భారీ సినిమాలు రిలీజ్‌లు ఉన్నాయి. ఈ సమయంలో థియేటర్‌ ఓనర్స్‌ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆయా చిత్రాల నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. పర్సెంటేజీలో టికెట్స్‌ని సేల్‌ చెయ్యడం వల్ల ఎగ్జిబిటర్స్‌, నిర్మాతల షేరింగ్‌ బాగుంటుంది అన్నది వారి అభిప్రాయం. గతంలో సినిమాలను ఈ పద్ధతిలోనే రిలీజ్‌ చేసేవారు. అప్పుడు థియేటర్లు బాగా రన్‌ అయ్యేవి. రెంటల్‌ సిస్టమ్‌ వచ్చిన తర్వాత థియేటర్లను రన్‌ చేయలేక చాలా మూతపడ్డాయి. ఇక ముందు కూడా లెక్కకు మించిన థియేటర్లు క్లోజ్‌ చేసే పరిస్థితి ఉందని, అందుకే పర్సెంటేజీ సిస్టమ్‌ని అమలులోకి తీసుకు రావాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. 
TeluguOne, the first online portal in Telugu language, has completed 25 years and marked this historic occasion with celebrations that touched the roof. With celebrated guests like Honorable AP CM Shri. Nara Chandrababu Naidu, Indian spiritual Guru Chinna Jeeyar Swami, AP Deputy Speaker Raghu Ramakrishnaraju, AP Minister Tummala Nageswara Rao, Ex-Rajya Sabha MP Kumbampati Rammohan, Retired Chief Justice N.V. Ramana, Deepa Venkat, the occasion became even more special and prominent in Telugu Website history.  At the event, TeluguOne announced "Spoorthi Awards", celebrating and honoring the spirit of various Telugu native individuals, whose incredible penchant to attain remarkable achievements imparted pride in Telugu people as a community at global level.  The recipents of this first ever Spoorthi awards are Sahasravadhani Medasani Mohan, general practitioner Dr. Pamulaparthi Rama Rao, Telugu Media Academy Chairman Kalmekolanu Srinivasa Reddy, renowned lyricist and Oscar award winner Chandra Bose, retired IAS officer Dr. P.V. Ramesh, agricultural expert Mullaguru Anantharamudu, founder of Neelofer Cafe Anumula Baburao, founder of CSB and IAS Academy Mallavarapu Balalatha, managing trustee of Swarna Bharat Trust Deepa Venkat.    Several distinguished guests like Murali Mohan, Tanikella Bharani, Poonam Kaur, lyricist Suddala Ashok Teja have attended the event making it a memorable evening. Further, TeluguOne has awarded "Influencer Awards" honoring those Telugu social media sensations who are making waves everywhere.  AP CM Nara Chandrababu Naidu specially appreciated TeluguOne chairman & MD Ravi Shankar Kantamaneni for taking early advantage of internet revolution and establishing such a big organisation with numerous YouTube Channels, Global Radio Station TORI and many more. He even appreciated his philanthropic activities by establishing TeluguOne Foundation.    With high enthusiasm and energy, TeluguOne employees have participated in the event and took an oath to carry forward this successful journey further more reaching golden jubilee, diamond jubilee and 100 years milestones. 
చిన్న వయసు నుంచే సినిమాల్లో నటిస్తూ.. అందర్నీ నవ్విస్తూ ఇప్పుడు హీరోగా ఎదిగిన మాస్టర్‌ భరత్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది. భరత్‌ తల్లి కమలాసిని మే 18 ఆదివారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కమలాసిని మరణ వార్త తెలుసుకున్న భరత్‌ కుటుంబ సభ్యులు చెన్నయ్‌లోని వారి నివాసానికి చేరుకున్నారు. అలాగే కొందరు సినీ ప్రముఖులు కూడా భరత్‌ నివాసానికి వెళ్లి కమలాసిని భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న కొందరు సినీ ప్రముఖులు భరత్‌కి ఫోన్‌ చేసి ధైర్యం చెబుతూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. భరత్‌ తెలుగులోనే కాదు, తమిళ సినిమాల్లో కూడా నటించాడు. దీంతో కోలీవుడ్‌ ప్రముఖులు కూడా అతని తల్లి మృతి పట్ల సానుభూతిని తెలియజేస్తున్నారు. కొందరు ఇంటికి వెళ్లి భరత్‌ను పరామర్శిస్తున్నారు. 9 ఏళ్ళ వయసులో చిరంజీవి సినిమా ‘అంజి’ ద్వారా బాలనటుడిగా పరిచయమైన భరత్‌ చాలా తక్కువ సమయంలో ప్రేక్షకుల్ని తన కామెడీతో, పంచ్‌ డైలాగులతో ఆకట్టుకొని బిజీ ఆర్టిస్టు అయిపోయాడు. బాలనటుడిగా సుమారు 80 సినిమాల్లో నటించాడు. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన వెంకీ, రెడీ, ఢీ, కింగ్‌ వంటి సినిమాలు అతనికి చాలా మంచిపేరు తెచ్చాయి. కమెడియన్స్‌ ఎంత మంది వున్నా తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్‌ని క్రియేట్‌ చేసుకొని డైలాగ్‌ డెలివరీలోగానీ, బాడీ లాంగ్వేజ్‌లోగానీ డిఫరెన్స్‌ చూపిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే అందరు బాలనటులకు వచ్చే సమస్యే భరత్‌కీ వచ్చింది. ఒక వయసు వచ్చేసరికి బాలనటుడికి ఎక్కువ, హీరోకి తక్కువ అనిపిస్తారు. దాంతో సినిమా అవకాశాలు కూడా తగ్గుతాయి. భరత్‌కి కూడా అదే పరిస్థితి రావడంతో కొన్నాళ్లు గ్యాప్‌ తీసుకొని కాస్త స్లిమ్‌గా మారి రీ ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. ఇటీవల గోపీచంద్‌ హీరోగా వచ్చిన విశ్వం చిత్రంలో కనిపించాడు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో భరత్‌కి ఎంతో మంది శ్రేయోభిలాషులు ఉన్నారు. దీంతో అతని తల్లి మరణం పట్ల ప్రతి ఒక్కరూ షాక్‌ అయ్యారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. 
Setting the stage for an exciting new cinematic experience, #Suriya46 ~ Sithara Entertainments’ Production No. 33 was officially launched with a grand pooja ceremony in Hyderabad, marking the beginning of a highly ambitious bilingual project. With Suriya at the helm, this collaboration with Venky Atluri has already sparked anticipation across the Tamil and Telugu film industries. Director Venky Atluri has swiftly carved a reputation as one of the most compelling storytellers, seamlessly blending emotional depth with commercial appeal. His recent back-to-back successes - Sir/Vaathi and Lucky Baskhar have cemented his status not just as a filmmaker with an eye for blockbusters but as someone who consistently delivers stories that resonate with audiences on multiple levels. With his signature storytelling, Venky Atluri now joins hands with Suriya, amplifying expectations for a project that promises to be nothing short of extraordinary. Suriya is no stranger to Telugu audiences, having built a strong fanbase since the unforgettable Ghajini, a film that cemented his place in Telugu cinema. Over the years, his choice of roles has reflected depth and variety, consistently pushing creative boundaries. With Sithara Entertainments Production No. 33, his 46th film, he returns to a full-fledged bilingual format, ensuring a seamless cinematic experience for both Tamil and Telugu audiences.   Mamitha Baiju, the Premalu sensation, joins as the female lead, Raveena Tandon makes her much awaited return to Telugu cinema, while Radhika Sarathkumar plays a crucial role. GV Prakash Kumar, known for his work in Vaathi/Sir, Lucky Baskhar reunites with Venky Atluri for another musical sensation. The film’s technical team includes Nimish Ravi for cinematography, National Award-winner Navin Nooli for editing, and Banglan for production design. It is produced by S. Naga Vamsi and Sai Soujanya, known for their successful projects and commitment to quality filmmaking. The regular shoot begins by May end, with the film aiming for a Summer 2026 release.
మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని మన పెద్దలు చెప్తుంటారు. దానికి తగిన కృషి, పట్టుదల, దీక్ష, నిరంతర శ్రమ అవసరం. ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకొని నిజాయితీగా ప్రయత్నిస్తే అది సాధ్యమేనని నిరూపించారు తెలుగువన్‌ అధినేత కంఠంనేని రవిశంకర్‌. పాతికేళ్ళ క్రితం ఇంటర్నెట్‌ అనే వ్యవస్థ గురించి ప్రజల్లో సరైన అవగాహన లేని సమయంలోనే తెలుగువన్‌ పేరుతో తెలుగులో తొలి పోర్టల్‌ను ప్రారంభించి భవిష్యత్తులో తాను సాధించబోయే విజయాలకు బీజం వేశారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు డిజిటల్‌ రంగంలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. యూట్యూబ్‌కి కనెక్ట్‌ అయిన తొలి ఛానల్‌గా తెలుగు వన్‌ను నిలబెట్టారు. అంతేకాదు, పాతికేళ్ళు పూర్తి చేసుకున్న ఏకైక యూ ట్యూబ్‌ ఛానల్‌గా తెలుగువన్‌ అవతరించింది. ప్రస్తుతం తెలుగువన్‌ నీడలో దాదాపు 400 ఛానల్స్‌ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నిర్విఘ్నంగా తన జైత్రయాత్రను కొనసాగిస్తూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది తెలుగువన్‌. ఈ అపురూప క్షణాలను ప్రముఖులతో, ప్రజలతో పంచుకోవాలన్న ఉద్దేశంతో మే 18న హైదరాబాద్‌లో తెలుగువన్‌ రజతోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అలాగే ఏపీ డ్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, తెలంగాణ వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు,  రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్‌, పరమహంస పరివ్రాజకులు, జగదాచార్యులు శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి మహా విశిష్ట అతిథిగా హాజరై తెలుగువన్‌ టీమ్‌ని ఆశీర్వదించారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నూతలపాటి వెంకటరమణ, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కుమార్తె, స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించి మాజీ ఎం.పి. మురళీమోహన్‌, ఆర్‌.నారాయణమూర్తి, సినీ రచయిత తనికెళ్ల భరణి, సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్‌, హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ హాజరయ్యారు.  వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సాధించడమే కాకుండా, ప్రజల్లో స్ఫూర్తిని నింపిన పది మంది ప్రముఖులను తెలుగు వన్‌ స్ఫూర్తి పురస్కారాలతో ఘనంగా సత్కరించింది తెలుగువన్‌. సహస్రావధాని మేడసాని మోహన్‌, ప్రజావైద్యులు డాక్టర్‌ పాములపర్తి రామారావు, తెలుగు మీడియా అకాడమీ చైర్మన్‌ కల్మెకొలను శ్రీనివాసరెడ్డి, ప్రముఖ గేయ రచయిత, ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత చంద్రబోస్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఉన్నతాధికారి డాక్టర్‌ పి.వి.రమేష్‌, వ్యవసాయ నిపుణుడు ముళ్లగూరు అనంతరాముడు, నీలోఫర్‌ కేఫ్‌ వ్యవస్థాపకుడు అనుముల బాబూరావు, సీఎస్‌బీ, ఐఏఎస్‌ అకాడమీ వ్యవస్థాపకురాలు మల్లవరపు బాలలత,  స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ దీపా వెంకట్‌.. తెలుగు వన్‌ స్ఫూర్తి పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం యూట్యూబ్‌ అనేది జనానికి ఎంత దగ్గరైందో అందరికీ తెలిసిందే. తమ వీడియోలతో జనంలోకి వేగంగా దూసుకెళ్తున్న కొందరు యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను తెలుగువన్‌ సత్కరించింది. ప్రారంభం నుంచీ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాస భరితంగా సాగిన ఈ వేడుకలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, మిమిక్రీ కళాకారులు చేసిన ప్రత్యేక అంశాలు,  ఫన్‌ బకెట్‌ చేసిన స్కిట్‌, తెలుగువన్‌ సిబ్బంది ప్రదర్శించిన స్కిట్‌ అందర్నీ ఆకట్టుకున్నాయి.
విశ్వకథానాయకుడు కమల్ హాసన్(Kamal Haasan)గ్రేటెస్ట్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam)కాంబోలో తెరకెక్కిన మూవీ 'థగ్ లైఫ్'(Thug Life).గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ మూవీపై కమల్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 5 న పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది. శింబు(SImbu) త్రిష(Trisha)అభిరామి, ఐశ్వర్య లేక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తమిళ, తెలుగు భాషలతో సహా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూస్తుంటే కమల్, మణిరత్నం ఈ చిత్రం ద్వారా తమ విశ్వరూపాన్ని చూపించబోతున్నారని అర్ధమవుతుంది. కమల్ భిన్నమైన గెటప్ లతో గ్యాంగ్ స్టర్ కి నాయకుడుగా కనిపిస్తున్నాడు. అనాధ అయిన శింబుని కమల్ తన కొడుకుగా చెప్పడం, ఆ తర్వాత ఇద్దరు శత్రువులు మారడం కూడా చూపించడంతో ప్రేక్షకుల్లో మూవీ పై మరింత క్యూరియాసిటీ పెరిగిందని చెప్పవచ్చు. విజువల్ గాను ఐ ఫీస్ట్ కలిగించనుందని కూడా ట్రైలర్ ద్వారా అర్ధమవుతుంది.  ఏ ఆర్ రెహ్మాన్  సంగీత సారధ్యంలో  తెరకెక్కుతున్న ఈ మూవీని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించారు. తెలుగులో ప్రముఖ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తన శ్రేష్ఠ్ మూవీస్ పై రిలీజ్ కానుంది.          
Kamal Haasan and Mani Ratnam have given a cult classic for Indian Cinema, Nayakan, that will always be the pride jewel in its crown. Now, they are back together with Thug Life, a tale of gangsters. Simbu is playing another lead role in the film with Trisha Krishnan, Ashok Selvan, Aishwarya Lekshmi in other prominent roles.  The movie trailer is released today and the trailer promises a gritty tale of gangsters. As they say, "You reap what you sow", the trailer seems to showcase how if you make someone too powerful how it can corrupt them from the inside even if you try to showcase humanity and love.    Kamal Haasan and Simbu's performances seem to be the highlight of this film. Also, the performer Kamal Haasan seems to be in full form in the trailer itself. The technical detailing and the exciting conflict between the main characters seem to be the most interesting part of the film.  AR Rahman's score and technical brilliance make it worth of watch. The movie is releasing on 5th June all over and in Telugu, Nithiin's Shresth Movies is releasing it. We have to wait and see, how well would Mani Ratnam handle another chapter in a gangster's live differently from Nayakan.
  జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్' అనే మల్టీస్టారర్ చేశాడు రామ్ చరణ్ (Ram Charan). అలాగే 'ఆచార్య'లో తన తండ్రి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పడు చరణ్ మరో మల్టీస్టారర్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈసారి వెంకటేష్ (Venkatesh)తో తెరను పంచుకోబోతున్నాడట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.   అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ మైథలాజికల్ టచ్ ఉన్న భారీ సినిమా చేయాల్సి ఉంది. అయితే బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. దీంతో ఈ గ్యాప్ లో ఓ మూవీ చేయాలని త్రివిక్రమ్ చూస్తున్నాడు. అది కూడా వెంకటేష్ తో ఆ సినిమా ఉంటుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల అనూహ్యంగా రామ్ చరణ్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో వెంకటేష్, రామ్ చరణ్ లలో ఎవరితో త్రివిక్రమ్ సినిమా ఉంటుందనే చర్చ మొదలైంది. ఇలాంటి సమయంలో మరో ఆశ్చర్యకర న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే వెంకటేష్, రామ్ చరణ్ లతో త్రివిక్రమ్ మల్టీస్టారర్ ని ప్లాన్ చేస్తున్నాడట. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టాక్. అదే నిజమైతే ఇది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో సందేహం.   వెంకటేష్ ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు చరణ్ తో తెరను పంచుబోతున్నట్లు వినిపిస్తున్న వార్త ఆసక్తికరంగా మారింది. ఈ ఏడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో రీజినల్ ఇండస్ట్రీ హిట్ ని అందుకొని వెంకీ మామ ఫుల్ జోష్ లో ఉన్నాడు. మరోవైపు చరణ్ కూడా 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. అలాంటిది ఈ ఇద్దరి కలయికలో మల్టీస్టారర్, దానికి త్రివిక్రమ్ డైరెక్టర్ అంటే అంచనాలు ఆకాశాన్నంటుతాయి అనడంలో సందేహం లేదు.  
విజయదేవరకొండ(Vijay Devarakonda)ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ'కింగ్ డమ్'(Kingdom)తో బిజీగా ఉన్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri)దర్సకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న'కింగ్ డమ్' జులై 4 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా చేస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, విజయ్ దేవరకొండ లుక్ తో మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఫిలింఫేర్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ జీవిత బాగస్వామికి కావాల్సిన లక్షణాలు రష్మిక(Rashmika Mandanna)లో ఉన్నాయా అనే ప్రశ్న విజయ్ దేవరకొండ కి ఎదురయ్యింది. ఈ విషయంపై విజయ్ దేవరకొండ మాట్లాడుతు రష్మిక తో ఇంకా ఎన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. ఆమె ఎంతో మంచి వ్యక్తి తో పాటు చాలా అందమైన నటి. ప్రస్తుతం జీవిత భాగస్వామి గురించి ఏం ఆలోచించడం లేదు. కానీ ఏదో ఒక రోజు తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. మంచి మనసున్న అమ్మాయి ఎవరైనా పర్లేదు. సినిమాల పరంగాను  లైగర్ పరాజయం తర్వాత నాలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పుకొచ్చాడు. రష్మిక, విజయ్ దేవరకొండ లవ్ లో ఉన్నారనే వార్తలు చాలా కాలం నుంచి వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ చెప్పిన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్మిక, విజయదేవరకొండ గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించి హిట్ ఫెయిర్ గా ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.    
  Yamadonga starring Junior NTR, Mohan Babu, Priyamani and Mamatha Mohandas, the iconic 2007 Socio fantasy blockbuster is getting re-released on 18th May to celebrate the birthday of Man of the Masses Junior NTR. This epic socio fantasy film, directed by none other than visionary filmmaker S.S. Rajamouli, created waves upon its original release and continues to enjoy a massive fan following.   As part of this special celebration, Yamadonga has undergone a stunning restoration scanned in 8K and compressed to 4K, delivering a spectacular visual experience like never before. Fans can now witness this cinematic marvel in pristine quality, bringing the grandeur of the original to life with a modern touch.   The excitement surrounding the re-release has taken social media by storm. Adding to the buzz, the film’s leading ladies Priyamani and Mamta Mohandas recently shared their thoughts and memories from the shoot, through heartfelt tweets and engaging video messages, reigniting nostalgia among fans.   With a worldwide release on the cards, expectations are soaring high. Yamadonga is all set to captivate audiences once again with its timeless story, spectacular performances, and unforgettable music by Oscar award winner MM Keeraavani.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  ఈ కాలంలో అమ్మాయిలు బాగా అప్డేట్ అయ్యారు. వాళ్ళు ప్రతి విషయంలో ప్లానింగ్ గా ఉంటారు. ముఖ్యంగా చదువు, ఉద్యోగం, భాగస్వామి, ఫ్యూచర్ ప్లాన్స్ ఇలా వ్యక్తిగత విషయాలలో ఏ మాత్రం తగ్గకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. భారతీయ జనాభాలో అమ్మాయిలు, అబ్బాయిలా సగటు నిష్పత్తి చూస్తే అమ్మాయిల శాతం తక్కువగా, అబ్బాయిల శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగా పెళ్లి కావాల్సిన అబ్బాయిలకు అమ్మాయిలను వెతకడం కాస్త కష్టమవుతోంది. మొదటే అమ్మాయిల కొరత అంటూ ఉంటే, ఇంకా అమ్మాయిల గట్టి నిర్ణయాల వల్ల అబ్బాయిలు, అబ్బాయిలు తల్లిదండ్రులు కిందామీదా అయిపోతున్నారు పెళ్లి విషయంలో. వాటికి తగ్గట్టు ఈకాలంలో ఆడపిల్లలు తల్లిదండ్రుల్ని బాగా చేసుకుంటున్నారని బుద్ధి సగటు తల్లిదండ్రులకు కలిగినప్పటి నుండి అడపిల్లల్ని కూడా ఏమాత్రం తక్కువలేకుండా చదివించడం చేస్తున్నారు. అందుకే అబ్బాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు వేటలో ఉన్నారు అమ్మాయిల కోసం. వధువు కావలెను అనే బోర్డ్ పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. వధువులు ఓకే చెప్పడానికి అబ్బాయిలలో కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవేంటి మరి?? చదువు! సాధారణంగా ఈ కాలంలో విద్యావంతురాళ్లు అయిన అమ్మాయిలే ఎక్కువ. కనీసం గ్రాడ్యుయేట్ అయినా పూర్తి చేసినవాళ్ళు ఉంటారు. ప్రభుత్వ పథకాలు, రీయింబర్స్మెంట్స్ పుణ్యమా అని అమ్మాయిలు కూడా ఇంజనీరింగ్, పీ.జీ, పీ.హెచ్.డి పట్టాలు చక్కగా అందుకుంటున్నారు. ప్రతి అమ్మాయి తనకంటే విద్యాధికుడిని భర్తగా కోరుకుంటుంది. అంటే అమ్మాయి కంటే అబ్బాయి మరింత విద్యాధికుడు అయి ఉండాలి.  ఉద్యోగం! ప్రభుత్వ ఉద్యోగస్తుడిని చేసుకుంటాను అని గిరి గీసుకుని కూర్చునే అమ్మాయిలు ప్రస్తుతమైతే లేరు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు అయితే అటువైపు ఆలోచన చేస్తారు. ఈ కాలంలో మంచి విద్యార్హతకు ప్రయివేటు సంస్థలలో చాలా మంచి అవకాశాలే ఉంటున్నాయి. కాబట్టి సంపాదన బాగా ఉంటే ఉద్యోగానికి వంక పెట్టడం అమ్మాయిలు చెయ్యరు.  ఆర్థిక విషయాలు! చాలామంది అంటూ ఉంటారు మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలు అయిపోతున్నాయి అని. నిజం చెప్పాలంటే ఈ కాలంలో డబ్బు లేకుండా బతికే మహానుభావుడు ఎవరూ ఉండరు. డబ్బు విషయంలో జాగ్రత్త ఉండేవాడికే జీవితంలో కాసింత ఆర్థిక లోటు లేకుండా సమస్యలను డీల్ చేయగలిగే సత్తా ఉంటుంది. ఎందుకంటే 99% సమస్యలు అన్నీ ఆర్థికంగా ఎదురవుతున్నవే ఉంటున్నాయి ఈ కాలంలో. అందుకే ఆర్థిక విషయాలలో సరైన ప్లానింగ్ ఉన్నవాళ్లకు అమ్మాయిలు  పెద్ద పీట వేస్తుంటారు. ప్రైవేట్ అండ్ పర్సనల్ స్పేస్! ప్రతి వ్యక్తికి కాసింత స్పేస్ అవసరం. భార్యాభర్తల మధ్య దాచాల్సిన పర్సనల్స్ ఏమి ఉంటాయి. భర్తకు తెలియకుండా బయట పనులు ఏమి ఉంటాయి అనేది కొందరి వాదన. అయితే గూడాఛారిలాగా ప్రతి విషయం మీద నిఘా పెడుతూ ఉంటే మాత్రం ఏ అమ్మాయి కూడా భరించలేదు. ప్రతి విషయాన్ని ఇంట్లో అత్తకు, మామకు, భర్తకు చెప్పి తీరాలి అనే డిమాండ్స్ కు అమ్మాయిలు చాలా వ్యతిరేకం. కాసింత స్వేచ్ఛను గనుక అమ్మాయిలకు ఇవ్వగలిగితే వాళ్ళు చేసే ప్రతి పనిని తమకు తామే ఇంట్లో వాళ్లకు చెబుతారు. ఇక్కడ ఒక చిన్న ఇగో అండ్ డామినేషన్ లైన్ ఉంటుంది దాన్ని చెరుపుకోవడం లేదా ఆ చిన్న గీతను పెంచి పెంచి పెద్ద గోడలాగా మార్చడం ఆ కుటుంబంలో అందరి ప్రవర్తన మీదా ఆధారపడి ఉంటుంది. ప్రాధాన్యతలు! అమ్మాయిల ప్రాధాన్యతలు ఎప్పుడూ ఫ్యూచర్ ప్లాన్స్ మీదనే ఉంటాయి. అలాగని ప్రస్థుతాన్ని అసలు విస్మరించేవాళ్లేమి కాదు. భర్త తన తల్లిదండ్రులకు ఎంత ఇంపార్టెన్స్ అయినా ఇవ్వచ్చు, కానీ భార్యకు అంతకంటే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇంకా సమస్యలను నలుగురి ముందు చెప్పి, చుట్టాలు పక్కాల మధ్య పంచాయితీలు పెట్టించి బాపతు అబ్బాయిలకు, భార్యాభర్తల వ్యక్తిగత విషయాలలో వేరే ఎవరో జోక్యం చేసుకోవడం వంటి వాటికి అమ్మాయిలు విరుద్ధం మరి. వీటన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సిన విషయం అబ్బాయిలు ఏ పనిని అయినా సొంతంగా చేయడం, సొంత నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం కలిగి ఉండాలి. ప్రతి విషయానికి ఇతరుల నిర్ణయాల మీద డిపెండ్ అయ్యేవాడు అయితే అసలు భరించలేరు.  అమ్మాయిలు ఒకే చెప్పాలంటే కొంచం చూసుకోండి మరి!!                                 ◆వెంకటేష్ పువ్వాడ.    
   ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం. చాలా మంది కొన్ని రోజుల రిలేషన్ లో ఉన్న  తర్వాత విసుగు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చేసే కొన్ని తప్పుల వల్ల ఇద్దరి మధ్య  సంబంధం బలహీనపడుతుంది. ఈ తప్పుల వల్ల  రిలేషన్  లోతును,  దాని బాధ్యతలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రేమ అయినా, పెళ్లి అయినా, స్నేహం అయినా.. ఇలా ఏ రిలేషన్ అయినా సరే.. కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.  ఆ నియమాలను తెలుసుకోకపోతే ఎంత మందితో కొత్తగా రిలేషన్ మొదలుపెట్టినా సరే.. అది తొందరగా బ్రేకప్ అవుతుంది.  ముఖ్యంగా ప్రేమికులు, భార్యాభర్తలు వారి రిలేషన్ లో ఈ క్రింది విషయాలను తప్పనిసరిగా తెలుసుకుని ఆచరించాలి. నమ్మకం.. సంబంధంలో నమ్మకం లేకపోతే దాని పునాది బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో  భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకూడదు. ఇద్దరి  మధ్య ఏదైనా అపార్థం ఉంటే ఇద్దరూ కలిసి కూర్చుని దాని గురించి మాట్లాడి, అపార్థాన్ని తొలగించుకోవాలి. ఏ సంబంధంలోనైనా ఓపెన్ గా మాట్లాడటం,  సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఇద్దరి మధ్య  సమన్వయం కూడా పెరుగుతుంది. స్వేచ్ఛ.. ప్రతి సంబంధంలో ఎదుటి వ్యక్తికి స్పేస్  ఇవ్వడం చాలా ముఖ్యం. చాలా మంది తమ హక్కులను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు, ఎదుటి వారి స్వేచ్ఛను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా సంబంధం బలహీనపడటం ప్రారంభమవుతుంది. అందుకే భార్యాభర్తలు తమ భాగస్వాములకు  స్పేస్ ఇవ్వాలి. వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు వారికి ఉందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది చేయకపోతే భాగస్వామి సంబంధంలో ఊపిరాడకుండా పోవడం ప్రారంభిస్తాడు. దీని వల్ల బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. కమ్యూనికేషన్.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు  సంభాషించకపోతే, సంభాషణలో పారదర్శకత ఉండదు. మాట్లాడకపోవడం వల్ల ఇద్దరి మధ్య  అపార్థాలు ఏర్పడతాయి. దీని కారణంగా సంబంధం  పునాది బలహీనపడటం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడాలి. శ్రద్ద.. చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఏం తింటావని అడగడం, జాగ్రత్తగా ఉండమని చెప్పడం, నచ్చిన చోటకు వెళ్లడం, గొడవను పెద్దవి చేసుకోకుండా ఒకరి బాధను మరొకరు పంచుకోవడం వంటివి చేస్తుంటే భాగస్వామికి  ఖచ్చితంగా నచ్చుతుంది. వారు ఎల్లప్పుడూ బంధంలో ఉండాలని అనుకుంటారు.  ఏవైనా గొడవలు జరిగినా వాటిని పరిష్కరించుకుని బంధం నిలబెట్టుకోవాలి అనుకుంటారు. పోలిక.. భార్యాభర్తలు ఇద్దరూ ఎవరూ ఎవరిని ఇతరులతో పోల్చకూడదు.  బయట సంబంధంలో ఉన్నవారిని,  ఇతరులను చూసి వాళ్లు బాగున్నారు, వాళ్లు మంచివారు,  నువ్వు చెడ్డ.. ఇలాంటి కోణంలో ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇలా పోలిస్తే అది వారి మనసును బాధపెడుతుంది.  తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చిన్న చూపు చూస్తున్నారని భావిస్తారు.  దీనివల్ల బంధంలో అప్యాయత తగ్గుతుంది.                                                   *రూపశ్రీ.  
  నేటి కాలంలో విడాకుల కేసులు పెరిగినప్పటికీ, విడాకుల కొత్త పోకడలు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఈ కొత్త విడాకుల నిబంధనలలో గ్రే విడాకులు, స్లీవ్ విడాకులు, సిల్వర్ విడాకులు మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజుల్లో  నిశ్శబ్ద విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి. సైలెంట్ డైవోర్స్ అంటే నిశ్శబ్ద విడాకులు. ఈ రకమైన విడాకులలో చాలా సార్లు దంపతులకు తమ సంబంధం నిశ్శబ్ద విడాకుల వైపు కదులుతోందని లేదా వారు ఇప్పటికే సైలెంట్ డైవర్స్   తీసుకున్నారని వారి కూడా  తెలియదు. తమ మధ్య సైలెంట్ గా విడాకులు  జరిగాయని ఆ జంట గ్రహించినప్పుడు వారు చట్టబద్ధంగా విడిపోతారు. ఇది విడాకుల చట్టపరమైన ప్రక్రియకు ముందు దశ కావచ్చని ఫ్యామిలీ కౌన్సిలర్లు అంటున్నారు. సైలెంట్ డైవర్స్ అంటే.. సైలెంట్ డైవర్స్  అంటే భార్యాభర్తలు చట్టబద్ధంగా కలిసి ఉండే వైవాహిక పరిస్థితి. అంటే విడాకులు తీసుకోలేదు కానీ భావోద్వేగ, మానసిక,  కమ్యూనికేషన్ స్థాయిలో ఒకరి నుండి ఒకరు పూర్తిగా విడిపోతారు. ఇద్దరూ ఒకే ఇంట్లో  నివసిస్తుంటారు కానీ వారి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదా సంభాషణ ఉండదు. వారి మధ్య భౌతిక దూరం కూడా ఉండవచ్చు. ఇది బంధం నిశ్శబ్దంగా అదృశ్యమవడాన్ని సూచిస్తుంది. సైలెంట్ డైవోర్స్ లో ఇద్దరి మధ్య సంబంధం సజీవంగా ఉంటుంది.  కానీ బంధంలో ఆత్మ,  జంట మధ్య పరస్పర అనుబంధం చనిపోతుంది. సైలెంట్ డైవర్స్ సిగ్నల్స్ ఇవే.. భార్యాభర్తల మధ్య బంధం సైలెంట్ డైవోర్స్ వైపు వెళుతోందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి.  వాటి ద్వారా దీన్ని గుర్తించి జాగ్రత్త వడవచ్చు. సంభాషణ ఉండదు.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు సాధారణ విషయాలే కాదు.. ఒకరితో ఒకరు ముఖ్యమైన విషయాల గురించి కూడా మాట్లాడుకోరు. వారి మధ్య దాదాపుగా కమ్యూనికేషన్ ఉండదు. రోజువారీ విషయాలు కేవలం లాంఛనాలుగా జరుగుతూ ఉంటాయి. ఎమోషనల్ డిస్టెన్స్.. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు పట్టించుకోరు. ఇద్దరి మధ్య ఎమోషన్ డిస్టెన్స్ ఏర్పడుతుంది. ఒకరి సుఖదుఃఖాలను ఒకరు పంచుకోరు.  ఒకరి సమస్యలను లేదా ఆలోచనలను ఒకరు పట్టించుకోరు. శారీరక దూరం.. సైలెంట్ డైవర్స్ దిశగా వేళ్లే భార్యాభర్తల బంధంలో  వారి శారీరక  సంబంధాన్ని కోల్పోతారు. కలిసి కూర్చోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, కౌగిలించుకోవడం,  కలిసి పడుకోవడం వంటివి దూరం అవుతాయి.   గదిని పంచుకోవచ్చు కానీ రూమ్‌మేట్ లాగా ఎవరికి వారు ఉంటారు. సమయం ఇవ్వకపోవడం.. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం ఇవ్వనప్పుడు సమయాన్ని కలిసి  గడపాలని అనుకోరు . కలిసి తినాలనే కోరిక, బయటకు వెళ్లాలనే కోరిక లేదా సెలవు దినాల్లో కలిసి సమయం గడపాలనే కోరిక తగ్గినప్పుడు వారు సైలెంట్ డైవోర్స్ వైపు  ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఆసక్తి.. సాధారణంగా భార్యాభర్తలు  ఒకరి జీవితం గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటారు. వారు గొడవ పడినా, తమ భాగస్వామి రోజు ఎలా గడిచిందో, ఏం చేశారో, తమ స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసుకోవడంలో   ఆసక్తి కలిగి ఉంటారు. కానీ వారి మధ్య అలాంటి సాధారణ విషయాలు కూడా  అదృశ్యమైనప్పుడు, వారి మధ్య సైలెంట్ డైవర్స్ పరిస్థితి ఏర్పడుతుంది. గొడవలు.. కొన్నిసార్లు వాదనలు లేదా విభేదాలు లేకపోవడం మంచిదని అనిపించవచ్చు. కానీ వాటి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదని కూడా ఇది సూచిస్తుంది. వారికి ఒకరి నుండి ఒకరు ఎటువంటి ఆశలు ఉండవు. కాబట్టి వారు ఒకరితో ఒకరు గొడవ పడటానికి కూడా ఇష్టపడరు. సైలెంట్ డైవోర్స్ గురించి కొన్ని నిజాలు.. భార్యాభర్తలు చాలా మంది తమ పిల్లలను పెంచడానికి మాత్రమే కలిసి ఉంటారు. వారు భార్యాభర్తలుగా తమ సంబంధంలో సంతోషంగా లేరు కానీ తమ పిల్లల కోసం చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా ఉంటారు విడాకులు సమాజంలో అవమానానికి కారణమవుతున్నాయి. సామాజిక కళంకం, కుటుంబ ఒత్తిడి,  విమర్శల భయాన్ని నివారించడానికి, జంటలు విడాకులు తీసుకోరు,  అందుకే ఇద్దరి మధ్య సైలెంట్ వాతావరణం ఏర్పడుతుంది. దీన్నే సైలెంట్ డైవోర్స్ అంటారు. భర్తలు డైవోర్స్ వల్ల ఆర్థికంగా లాస్ అవుతారు. దీని వల్ల విడాకులు ఇవ్వకుండా  ఆర్థిక లక్ష్యాల  కోసం రాజీగా  సైలెంట్ డైవోర్స్ ఎంచుకుంటారు. బంధంలో ప్రేమ, గౌరవం,  అవగాహన కాలక్రమేణా ముగిసినప్పుడు ప్రజలు బాధ్యతల కోసం మాత్రమే కలిసి ఉంటారు.                                         *రూపశ్రీ.  
శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. అయితే ఈ పోషకాల విషయానికి వస్తే, చాలా మందికి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ లేదా ఫైబర్ గురించి మాత్రమే తెలుసు. ఇవన్నీ శరీరానికి చాలా అవసరం. కానీ వీటికంటే ప్రభావవంతమైనది, శరీరానికి తప్పనిసరిగా కావాల్సినది మరొకటి  ఉంది, ఇది శరీరం  మెరుగైన పనితీరుకు అవసరం. ఇది లోపిస్తే శరీరం అంతా నీరసంగానూ, ఏ చిన్న పనిచేసినా అలసటగానూ అనిపిస్తుంది. ఎన్ని పోషకాలు తీసుకున్నా, ఎంత బలవర్థకమైన ఆహారం తీసుకున్నా ఈ ఒక్కటి తక్కువై శరీరం నిలదొక్కుకోలేదు. అంతటి శక్తివంతమైన   పదార్థం  మెగ్నీషియం. మెగ్నీషియం కేవలం శారీరక బలానికే కాదు అనేక మానసిక భావోద్వేగాలకు కూడా  ఇది ఎంతో  అవసరం. ఇది  శరీరంలో కండరాలను నిర్మించడానికి  నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపం  ఏర్పడితే  కండరాల తిమ్మిరి, నరాల  బలహీనత, కండరాలు మెలితిప్పినట్లు, శరీరంలోని వివిధ ప్రాంతాల్లో  తిమ్మిరి లేదా జలదరింపు వంటి అనేక లక్షణాలను కనిపిస్తాయి. శరీరంలో మెగ్నీషియం లోపం ఎన్నో కారణాల వల్ల ఏర్పడుతుంది.  విటమిన్ డి లోపం  వల్ల మెగ్నీషియం లోపిస్తుంది, యాంటాసిడ్‌ల మితిమీరిన వినియోగం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, తీవ్రమైన విరేచనాలు, ఆహారంలో తక్కువ మెగ్నీషియం గల ఆహారాలను చేర్చకపోవడం వంటి అనేక కారణాల వల్ల శరీరంలో ఈ ముఖ్యమైన మూలకం లోపం ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా, గర్భధారణ సమయంలో మెగ్నీషియం లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. మెగ్నీషియం లోపాన్ని నివారించడానికి  ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ఈ కింది ఆహారాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  బాదంపప్పులో మెగ్నీషియం ఉంటుంది.  10గ్రాముల బాదం పప్పులో  రోజువారీ శరీరానికి కావలసిన  మెగ్నీషియంలో 20% (76 mg) లభిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి,  మెగ్నీషియం శరీరానికి అందడానికి  ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులను తినడం మంచి మార్గం. గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది  తమ ఆహారం ద్వారా మెగ్నీషియం  తగినంతగా పొందలేరు. ప్రతి 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 262 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటూ ఉంటే ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు. అరటిపండ్లు  ఎముకలను బలపరిచే పొటాషియం అధికంగా ఉండే పండు. ఒక మధ్యస్థ అరటిపండు 10.3 mg విటమిన్ సి,  32 mg మెగ్నీషియంను  అందిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. పాలకూర అందరికీ అందుబాటులో ఉంటే ఆకుకూర. పాలకూరలో మెగ్నీషియం మాత్రమే కాదు ఐరన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కాబట్టి ఐరన్, మెగ్నీషియం లోపంతో ఇబ్బంది పడేవారు పాలకూరను తప్పనిసరిగా తీసుకోవాలి.   జీడిపప్పులో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా జీడిపప్పులో ఉంటాయి. ప్రతిరోజూ కాసింత జీడిపప్పు తీసుకోవడం వల్ల ఇది మెగ్నీషియంతో పాటు, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా పొందవచ్చు.  ఇవి కాకుండా, వోట్మీల్, బ్రౌన్ రైస్, వేరుశెనగ నూనె, చియా గింజలు,  బీన్స్‌లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  బంగాళదుంప చాలా మందికి ఇష్టమైన దుంప కూరగాయ.  పేరుకు ఇది కూరగాయ కానీ ఇది  అన్ని రకాలుగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. కూరల్లో అయినా, బజ్జీలలో అయినా, వేపుళ్లలో అయినా,  చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి నోరూరించే తినుబండారాలలో అయినా బంగాళదుంప చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఏ కూర చేస్తున్నా సరే..అందులో బంగాళదుంప ముక్కలు జోడిస్తే కూరలకు రుచి రెట్టింపు అవుతుంది. ఎంతో రుచిగా ఉండే బంగాళదుంపను తినడానికి చాలా మంది చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే బంగాళదుంపలను ఎడా పెడా తింటే మాత్రం కొంపలు ముంచుతుందట.  ఇంతకీ బంగాళదుంపలు ఆరోగ్యానికి చేసే చేటు ఏంటో తెలుసుకుంటే.. ఊబకాయం.. బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారట.  బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.  ఇవి అదనపు కేలరీలుగా పొట్టలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. దీని కారణంగా బరువు ఈజీగా పెరుగుతారు. రక్తపోటు.. రక్తపోటు లేదా బీపీ ఇప్పట్లో చాలామందికి వస్తున్న సమస్య.  చిన్న వయసులోనే బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఉంటున్నారు.  ఇలాంటి వారు బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోకూడదట.  బంగాళదుంపలు  బీపీ సమస్యను మరింత పెంచుతాయట. ఆర్థరైటిస్.. ఆర్థరైటిస్ సమస్య చలికాలంలో చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సాధారణ రోజులలో కూడా ఆర్థరైటిస్ సమస్య కారణంగా  ఎముకలు, కీళ్ల సమస్యలు పెరుగుతాయి.  బంగాళదుంపలు తింటే ఆర్థరైటిస్ సమస్య మరింత తీవ్రం అవుతుంది.  ఇందులో కార్బోహైడ్రేట్లు ఆర్థరైటిస్ నొప్పిని పెంచుతాయి. జీర్ణసమస్యలు.. బంగాళదుంపలలో పిండి పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది గ్యాస్, ఉబ్బరం,  మలబద్దకం వంటి సమస్యలు సృష్టిస్తుంది.  బంగాళదుంపను అతిగా తింటే పై సమస్యలు అధికం అవుతాయి. మధుమేహం.. మధుమేహం ఉన్నవారికి నిషేధించిన ఆహారాలలో బంగాళదుంప కూడా ఒకటి.  బంగాళదుంపలు తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య మరింత పెరుగుతుంది.  బంగాళదుంపలలో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి. కంటి సమస్యలు.. బంగాళదుంపలలో సోలనిన్ అనే రసాయనం ఉంటుంది.  ఇది కంటి సమస్యలను కలిగిస్తుంది.  బంగాళదుంపలను ఎక్కువగా తీసుకునేవారు తొందరగా కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  పసుపు,  తేనె భారతీయ వంటగదిలో రెండు ప్రధాన పదార్థాలు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. పసుపులో  కుర్కుమిన్ ఉంటుంది, అలాగే తేనెలో  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పసుపును శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇది కీళ్ల నొప్పులు , చర్మ వ్యాధులు,  జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది . సహజ తీపి, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన తేనె గొంతు నొప్పి, దగ్గు,  గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. పసుపు మరియు తేనె కలయిక ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దానిని తీసుకునే ముందు సరైన మోతాదు,  దాని దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. దీని గురించి తెలుసుకుంటే.. వాపును తగ్గించడంలో సహాయపడతాయి.. పసుపులో ఉండే కర్కుమిన్,  తేనెలోని యాంటీఆక్సిడెంట్లు కలిసి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కలయిక కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్,  ఇతర శోథ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. రోగనిరోధక శక్తి.. పసుపు,  తేనె రెండూ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ కలయిక ముఖ్యంగా సీజన్ మారే సమయంలో  ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియ.. పసుపు,  తేనె మిశ్రమం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం,  ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే అధిక వినియోగాన్ని నివారించాలి. చర్మ ఆరోగ్యం.. మొటిమలు, మచ్చలు,  మంట వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి పసుపు,  తేనెను ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా తీసుకోవాలి..? పసుపు,  తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి, టీగా లేదా పాలతో కలిపి వివిధ రకాలుగా తీసుకోవచ్చు. అయితే, దాని పరిమాణం,  తీసుకునే సమయం వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి ఉండాలి. గర్భిణీ స్త్రీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు,  ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...