ఏపీలో  స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న రాజకీయ ఘర్షణలు, ఉద్రిక్త వాతావరణం హాట్ టాపిక్ గా మారాయి.  ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు వంటి ప్రాంతాలలో  పార్టీల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచే నామినేషన్ల దాఖలు, అభ్యర్థుల బెదిరింపులు, భౌతిక దాడుల వంటి సంఘటనలు చోటుచేసుకోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నార్ధకంగా మార్చాయి. ఒకవైపు అధికార కూటమి, మరోవైపు వైసీపీ ఈ హింసాత్మక ఘటనలపై పరస్పర విమర్శలతో మాటల యుద్ధానికి దిగాయి.  ఈ పరిణామాల నేపథ్యంలో, ఎన్నికల సమయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని దుయ్యబడుతోంది. అయితే అధికార  యంత్రాంగం మాత్రం శాంతిభద్రతలను కాపాడటానికే తాము కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.   వైసీపీ ఓటమి భయంతోనే  ఉద్దేశపూర్వకంగా హింసను ప్రేరేపిస్తున్నదనీ, ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడమే లక్ష్యంగా కుట్రలు పన్నుతున్నదనీ అధికార తెలుగుదేశం కూటమి విమర్శిస్తున్నది.   నామినేషన్ పత్రాలను చించివేయడం, ఎన్నికల అధికారులపై దాడులకు పాల్పడడం వంటి ఘటనలు ప్రజాస్వామ్య వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ధ్వజమెత్తుతోంది.  రాయలసీమ వంటి ప్రాంతాలలో ఎన్నికల హింసకు, అక్కడ వేళ్లూనుకున్న ఫ్యాక్షన్ రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. పార్టీలకతీతంగా కొన్ని ప్రాంతాలలో సాగే ఈ ఆధిపత్య పోరు, ఎన్నికల సమయానికి మరింత హింసాత్మకంగా మారడం కద్దు. ఇప్పుడూ అదే జరుగుతోంది. స్థానిక సంస్థల మీద పట్టు సాధించడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక వనరులు, కాంట్రాక్టులు, స్థానిక భూభాగాలపై ఆధిపత్యం దక్కుతుందన్న ఉద్దేశమే ఈ ఘర్షణలకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే నామినేషన్ల కేంద్రాల వద్ద పేపర్లు లాక్కోవడం, అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలు పునరావృతమవుతున్నాయి. గ్రామాల్లో బలమైన పట్టున్న నాయకులు తమ వర్గాల ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నికలను ఒక యుద్ధ రంగంగా మారుస్తున్నారు. ఈ తరహా రాజకీయ సంస్కృతి స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తోందని, సామాన్య ప్రజలు భయంతో ఓటు హక్కును వినియోగించుకోలేని దుస్థితికి దారితీస్తోందని ప్రజాస్వామ్య వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు కేవలం ఒక పార్టీకి లేదా ప్రభుత్వానికి సంబంధించినవి కావు; ఇవి మొత్తం రాష్ట్ర ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎదురవుతున్న పరీక్ష. శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుల నిష్పక్షపాత వైఖరి, ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి వంటి అంశాలపై మరింత పకడ్బందీ విధానాలు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది. [Andhra Pradesh Local Elections, Political Clashes, Rayalaseema Factionalism, Election Related Unrest, Telugu One]
వైసీపీ అధినేత జగన్ పొలిటికల్ పాలసీలను ఏపీ సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు.  స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు, ప్రజాస్వామ్య వ్యవస్థను పక్కనబెట్టి అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యంగా వైసీపీ అధినేత  హిట్ అండ్ రన్ తరహా రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్  బాధ్యతారహితంగా, ఒక క్రిమినల్ లిటిగెంట్‌లా వ్యవహరిస్తున్నారన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..  గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.   ఈ సందర్భంగా వైసీపీ హయాంలో సాగిన దౌర్జన్యాలు, అబద్ధాలు, అరాచకాలను వివరిస్తూ.. అదే హింస... అవే అబద్ధాలు... అవే అరాచకాలు  అనే శీర్షికతో రూపొందించిన  బుక్‌లెట్  చంద్రబాబు ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకమైన, పవిత్రమైన ఎన్నికల నిర్వహణ ప్రాధాన్యతను   నొక్కిచెప్పిన ఆయన దేశంలో రాజ్యాంగబద్ధంగా స్వయంప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థ పనిచేస్తోందని, కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమం,  సుపరిపాలన ద్వారా మాత్రమే నిజమైన పారదర్శక పాలన సాధ్యమవుతుందని, విపక్షాల అరాచక రాజకీయాలను ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారనిఅన్నారు.   గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను పూర్తిగా అపహాస్యం చేశారన్న చంద్రబాబు స్వయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్  హోదాలో ఉన్న అధికారి కూడా తనకు ప్రాణభయం ఉందంటూ ఫిర్యాదు చేయాల్సిన దుస్థితి అప్పట్లో దాపురించిందని గుర్తుచేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు విపక్షాల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరించడం, దాడులు చేయడం, నామినేషన్ పత్రాలను చింపివేయడం వంటి అరాచకాలకు వైసీపీ శ్రేణులు పాల్పడిందని చెప్పారు.  జగన్ అరాచక పాలనను భరించలేక జనం 2024 ఎన్నికల్లో  తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చరిత్రాత్మక మద్దతు ఇచ్చారని చంద్రబాబు చెప్పారు.   తమపై ప్రజలు ఉంచిన అపారమైన నమ్మకానికి ఆ విజయం ప్రతీక అన్న ఆయన.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తమ ప్రభుత్వం అనునిత్యం శ్రమిస్తోందని వివరించారు. ప్రజల మద్దతు కోల్పోయిన వైసీపీ ఇంకా   పాత పద్ధతుల్లోనే వ్యవహరిస్తోందన్న చందరబాబు,  అభివృద్ధిని అడ్డుకోవడం, రాష్ట్రాన్ని అస్థిరపరచడం, అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడం వంటి పద్ధతులనే వారు ఇప్పటికీ నమ్ముకున్నారన్నారు.   స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎలాంటి హింసాత్మక ఘటనలనైనా కఠినంగా అణచివేస్తామని హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయాలని చూస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టారు.    [CBN Say Jagan Criminal Litigant,   YCP Violence, Local Body Elections, Andhra Pradesh Politics, Telugu One]
బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లో వైఎస్ షర్మిల కుమార్తె వివాహం నిర్వహించడంపై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఇప్పుడు వైఎస్ కుటుంబంలో  విభేదాలు, వైరుద్ధ్యాలు, వైషమ్యాలను మరోసారి రచ్చకెక్కించాయి. సెక్యూరిటీ, వ్యక్తిగత భద్రత, ప్రాణహాని నెపంతో బెంగళూరు నివాసాన్ని వివాహానికి ఇవ్వలేనంటూ జగన్ రాసిన లేఖపై షర్మిల కుటుంబ సభ్యులు, వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహుతులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  జగన్ లేఖకు బదులుగా ఆయనకు పలు ప్రశ్నలు, సవాళ్లతో కూడిన లేఖ రాశారు.    గత కొంత కాలంగా వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో ఆస్తుల పంపిణీ, రాజకీయ విభేదాల చుట్టూ వివాదాలు నడుస్తున్నసంగతి విదితమే ఈ క్రమంలోనే షర్మిల కుమార్తె అంజలి వివాహాన్ని బెంగళూరులోని వైఎస్ కుటుంబ నివాసంలో జరిపేందుకు సిద్ధమవ్వగా, భద్రతా కారణాలను ఉటంకిస్తూ,   జగన్  యలహంక ప్యాలెస్ ను షర్మిల కుమార్తె వివాహ వేడుకకు వేదిక కావడానికి నిరాకరించారు. ఇదు కుటుంబ పరంగా విభేదాలు మరింత పెచ్చరిల్లేందుకు దోహదం చేయడమే కాకుండా, రాజకీయంగా కూడా హాట్ టాపిక్ గా మారింది.  వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.  గతంలో లేని భయం ఇప్పుడేందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటు బాంబులు, కత్తుల సంస్కృతితో తీవ్ర ప్రాణాభయం ఉన్నప్పటికీ, కుటుంబంలోని పిల్లల పెళ్లిళ్లను ఎప్పుడూ ఆపలేదనీ, ఘనంగా నిర్వహించారనీ గుర్తు చేశారు. అంతే కాదు.. వైఎస్ రాజశేఖరరెడ్డి శత్రువులను కూడా వివాహాది శుభకార్యాలకు ఆహ్వానించారని ఆ లేఖలో జగన్ కు  గుర్తు చేశారు.   వైఎస్ సోదరుల పిల్లలు, తోడబుట్టిన చెల్లెలు విమలమ్మ పిల్లల పెళ్లిళ్లు వైఎస్ ఇళ్లలోనే జరిగాయని ఆ లేఖలో పేర్కొన్నారు. జార్జ్ రెడ్డి, అనిల్ రెడ్డి పెళ్లి, విమలమ్మ కొడుకు యువరాజ్, కుమార్తె దివ్య పెళ్లిళ్లు, రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు రఘుదీప్ పెళ్లి, అలాగే సుధీకర్ రెడ్డి కుమార్తె విరోనికా రెడ్డి వివాహాలు వైఎస్ నివాసాల్లోనే ఘనంగా జరిగాయని  ఉదాహరించారు. వైఎస్ ఎన్నడూ జగన్ లా పెళ్లిళ్లను, కుటుంబ వేడుకలను అడ్డుపెట్టుకుని ప్రాణహాని ఉందంటూ   దాక్కోలేదని పేర్కొంటూ.. మేనకోడలి పెళ్లి వల్ల  ప్రాణహాని ఉందన్న భయం ఉంటే జగన్ ఆ పది రోజులూ బెంగళూరు ప్యాలెస్ వైపు రాకుండా వేరే  దేశానికో లేదా   ప్రాంతానికో వెళ్లిపోవచ్చునంటూ హితవు పలికారు.  యలహంక ప్యాలెస్‌లోని ఇరు భవనాలు, వాటి చుట్టూ ఉన్న కాంపౌండ్ గోడలు వేరని గూగుల్ మ్యాప్స్ ద్వారా చూసినా ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుందని, అలాంటప్పుడు భద్రతా సమస్య ఎక్కడి నుంచి వస్తుందని ఆ లేఖలో షర్మిల కుటుంబం నిలదీసింది. షర్మిలకు కాబోయే వియ్యంకులు ఇప్పటికేబెంగళూరులోని షర్మిల రెసిడెన్సీ వేదిక అంటూ ఆహ్వానపత్రాలు ముద్రించి బంధువులకు పంచిన విషయం తెలిసి కూడా జగన్ ఇలా వివాహ వేదికను వద్దనడం తమ పరువు తీయాలన్న ఉద్దేశంతోనేనని దుయ్యబట్టారు.  రెండు వైపులా కేవలం అత్యంత ముఖ్యమైన వందలాది మంది బంధువుల సమక్షంలో ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఇలాంటి కుట్రలతో అడ్డుకోవడం ఏంటంటూ నిలదీశారు. మేనకోడలి పెళ్లికి రావడం, శుభకార్యంలో పాల్గొనడం ఇష్టం లేక సెక్యూరిటీ సాకు చూపిస్తూ, ప్యాలెస్ షర్మిలది కాదు, అదేమీ ఫంక్షన్ హాలు కాదు అంటూ  అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు.   పక్కనే ఉండి కూడా మేనకోడలి పెళ్లికి హాజరు కాలేదనే చెడు ముద్ర సమాజంలో పడకుండా ఉండేందుకే, ముందుగానే ఇలాంటి వివాదాలు సృష్టించి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.  వైఎస్ కుటుంబంలో గత కొంతకాలంగా ఆస్తులు, రాజకీయాల పరంగా వస్తున్న విభేదాలు ఇప్పుడు నివాసాలు, శుభకార్యాల వేదికల వరకు పాకడం తెలుగు రాష్ట్రాల్లో  చర్చనీయాంశమైంది. మేనకోడలి పెళ్లి విషయంలోనూ అన్నా చెల్లెళ్ల  మధ్య ఈ స్థాయిలో మాటల యుద్ధం నడవడం పట్ల  వైఎస్సార్ అభిమానులు , కుటుంబ శ్రేయోభిలాషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  [Jagan, YS Sharmila Strong Counter, Jagan, Yelahanka Palace, Life Thret, Letter, Sharmila Daughter Marriage,  YS Rajasekhara Reddy Family, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
'తండేల్'తో హిట్ మోడ్ లోకి వచ్చిన యువసామ్రాట్ నాగ చైతన్య తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నా హవా  ఉంటుందని అంటూ విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' తో వస్తున్న విషయం తెలిసిందే. నాగచైతన్య చెప్తున్నది నిజమే అన్నట్టుగా సాక్ష్యాధారాలతో సహా వృష కర్మ భారీ బిజినెస్ డీల్ పూర్తి చేసుకుంది.  ఏపీ, తెలంగాణ, కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ను ఫ్యాన్సీ ధరకి దిల్ రాజు  సొంతం చేసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్‌తో దిల్ రాజు నమ్మకాన్ని, ప్రేక్షకులని ఆకట్టుకునే కంటెంట్‌పై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది. నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న వృష కర్మ, ఆయన కెరీర్‌లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్‌ కూడా సాధించింది. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారడంతో ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోను ‘వృషకర్మ’పై పాజిటివ్ బజ్ నెలకొంది. ఇది కూడా చదవండి: సిగ్మా ఓటిటి డేట్ ఇదే: అక్టోబర్ 2 న థియేటర్స్ లోకి వచ్చింది!     నాగచైతన్య సరసన గోల్డెన్ లెగ్ భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేస్తుండగా స్పర్శ్ శ్రీవాస్తవ ప్రతినాయకుడి రోల్ లో కనిపించనున్నారు. రగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అజనీష్ బి. లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్, నవీన్ నూలి ఎడిటింగ్ . త్వరలోనే భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 4 వరల్డ్ వైడ్  రిలీజ్‌ కాగా  ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు సమర్పిస్తున్నారు.   [vrushakarma Bags A Big Deal As Dil Raju Acquires Telugu States, vrushakarma Release date, vrushakarma movie releae date, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 30న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈరోజు(అక్టోబర్ 27) సాయంత్రం జరగనున్న ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్‌గా వస్తాడనే ప్రచారం జరుగుతోంది.  ఎన్టీఆర్, త్రివిక్రమ్ మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే, నెక్స్ట్ ‘గాడ్ ఆఫ్ వార్’ అనే భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. మరోవైపు వెంకటేశ్‌తోనూ ఎన్టీఆర్‌కు అనుబంధం ఉంది. గతంలో వెంకటేశ్ నటించిన ‘చింతకాయల రవి’ సినిమాలో ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనిపించారు. ఈ అనుబంధాల నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం’ ఈవెంట్‌కు ఎన్టీఆర్ వస్తాడనే టాక్ మొదలైంది. అయితే ఆయన రాక ఇంకా ఖరారు కాలేదు. ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విడుదల తేదీ ఇప్పటికే రెండుసార్లు మారింది. తొలుత అక్టోబర్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేయగా, ఆ తర్వాత అక్టోబర్ 9కి మార్చారు. చివరికి అక్టోబర్ 30న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ నిజంగానే వస్తాడా? ఒకవేళ వస్తే త్రివిక్రమ్‌తో తన తదుపరి సినిమా గురించి ఏమైనా ఆసక్తికరమైన విషయం చెబుతాడా? అనేది చూడాలి. ఇది కూడా చదవండి: టాలీవుడ్ స్టార్ AI సిక్స్ ప్యాక్.. బడా డైరెక్టర్‌కి చుక్కలు చూపిస్తున్న హీరో.!       [Jr NTR To Attend Aadarsha Kutumbam Event, Aadarsha Kutumbam Pre Release Event, Aadarsha Kutumbam Movie, Venkatesh, Trivikram Srinivas, Jr NTR, God of War, Telugu Film News]  
సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా హీరోలు తమ శరీరాకృతిని మార్చుకోవడం సహజం. ముఖ్యంగా భారీ యాక్షన్‌ సినిమాల కోసం సిక్స్ ప్యాక్‌తో కనిపించేందుకు ప్రత్యేకంగా కసరత్తులు చేస్తుంటారు. అయితే ఓ భారీ పాన్ ఇండియా మూవీ విషయంలో మాత్రం సిక్స్ ప్యాక్ అంశం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో నటిస్తున్న స్టార్‌ను సిక్స్ ప్యాక్‌తో కనిపించాలని దర్శకుడు కోరారట. అందుకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే ఆ హీరో అనుకున్న స్థాయిలో సిక్స్ ప్యాక్ సాధించలేకపోయారని, అంతేకాకుండా ఈ విషయంలో ఆయనకు పెద్దగా ఆసక్తి కూడా లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో AI, VFX సాంకేతికతను ఉపయోగించి హీరోకి సిక్స్ ప్యాక్ ఉన్నట్లుగా చూపించాలనే ఆలోచనకు డైరెక్టర్ వచ్చినట్లు టాక్.  నిజానికి ఈ పద్ధతిని అనుసరించడం దర్శకుడికి ఏమాత్రం ఇష్టం లేద, సహజంగా హీరో శారీరకంగా సిద్ధమై తెరపై కనిపిస్తే వచ్చే ప్రభావం వేరుగా ఉంటుందని ఆయన భావిస్తున్నారట. కానీ షూటింగ్ ఆలస్యమయ్యే పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు మరో మార్గం లేక ఈ దారిని ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది కూడా చదవండి: ప్రభాస్‌తో సినిమా.. ఆ యాంగిల్‌నే చూపిస్తానంటున్న త్రివిక్రమ్.!       [Tollywood Star, AI Six Pack, Six Pack VFX, Telugu Hero, Body Transformation, Tollywood Hero, Telugu Film News, Telugu Movie News]  
సందీప్ కిషన్ ,ఫరియా అబ్దుల్లా జంటగా ఇళయ దళపతి  విజయ్ కుమారుడు జేసన్ సంజయ్  దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సిగ్మా. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2న  విడుదలైన ఈ చిత్రంమాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది. తమన్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు అక్టోబర్ 30 నుంచి అంటే ఎల్లుండి నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కేవలం ఒక్క భాషలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి మొత్తం 5 ప్రముఖ భాషల్లో డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం.   మరి  థియేటర్లలో ఈ యాక్షన్ విజువల్ వండర్‌ మిస్ అయిన ప్రేక్షకులు, ఇంటి వద్దే కుటుంబంతో కలిసి ఈ హై వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయవచ్చు. లైకా బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించాడు.      [Sigma Ott Release Date, Sigma In Netflix, Sigma OTT release, Sundeep Kishan Sigma movie, Jason Sanjay directorial debut, Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollywood News]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌.. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. అయితే తాజాగా త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు ఈ కాంబినేషన్‌పై మరోసారి ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రివిక్రమ్‌.. ప్రభాస్‌ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్‌లో మంచి కామెడీ సెన్స్ ఉందని, ఇప్పటివరకు ఏ దర్శకుడు కూడా దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేదని అభిప్రాయపడ్డారు. గతంలో ‘బుజ్జిగాడు’ వంటి సినిమాల్లో ప్రభాస్‌ చూపించిన కామెడీ టైమింగ్‌ను కూడా ఆయన గుర్తుచేశారు. ఒకవేళ ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం వస్తే.. అదిరిపోయే యాక్షన్‌, బలమైన ఎమోషన్స్‌తో పాటు ఆయనలోని కామెడీ యాంగిల్ ని కూడా కలిపి ఓ ప్రత్యేకమైన సినిమా రూపొందిస్తానని త్రివిక్రమ్‌ చెప్పారు. దీంతో ప్రభాస్‌ను త్రివిక్రమ్ తనదైన శైలిలో ఎలా చూపిస్తారనే చర్చ మొదలైంది. ‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్‌’, ‘మిస్టర్ పర్ఫెక్ట్‌’ వంటి సినిమాల్లో ప్రభాస్‌ కామెడీ టైమింగ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ‘బాహుబలి’ తర్వాత ఆయన ఎక్కువగా భారీ యాక్షన్‌, పీరియడ్‌, పాన్ ఇండియా కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీంతో ప్రభాస్‌లోని పాత కామెడీ యాంగిల్‌ను మళ్లీ చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. త్రివిక్రమ్‌ సినిమాల్లో పంచ్ డైలాగ్స్, కుటుంబ భావోద్వేగాలు, వినోదానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి దర్శకుడు ప్రభాస్‌లోని కామెడీ టైమింగ్‌ను దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేస్తే.. అది అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్‌ ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్‌’, ‘కల్కి 2’ వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌తో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాని రూపొందించారు. ఇది అక్టోబర్ 30న విడుదల కానుంది. అనంతరం ఎన్టీఆర్‌తో తెరకెక్కించనున్న భారీ మైథలాజికల్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నారు. అందువల్ల ప్రభాస్‌–త్రివిక్రమ్‌ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కుతుందని చెప్పడానికి ఆధారాలు లేవు. త్రివిక్రమ్‌ వ్యాఖ్యలు కూడా ఈ కాంబినేషన్‌ ఖరారైందని చెప్పడం లేదు. కానీ ప్రభాస్‌లోని కామెడీ యాంగిల్‌ను ఉపయోగించుకోవాలనే ఆయన ఆలోచన మాత్రం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. మరి భవిష్యత్తులో ఈ క్రేజీ కాంబినేషన్‌ నిజమవుతుందా? వేచి చూడాలి. ఇది కూడా చదవండి: కొమ్మూరి సాంబశివరావు.. ఇందిరా గాంధీ హత్యను ముందే ఊహించిన రచయిత.!       [Prabhas Trivikram Movie, Rebel Star Prabhas, Fauzi Movie, Trivikram Srinivas, Aadarsha Kutumbam Movie, NTR Trivikram Movie, God OF War Movie, Telugu Film News]  
The team representing Vijay Deverakonda and Rashmika Mandanna, popularly known as Virosh, has lodged a formal complaint with Hyderabad Cyber Crime authorities over allegedly false and misleading content targeting the couple online.  The complaint seeks an impartial investigation into fabricated narratives, manipulated screenshots, impersonation and targeted harassment circulating across social media platforms. The team has submitted relevant links and supporting evidence to the authorities, urging them to investigate the alleged misuse of digital platforms.  In its statement, the team drew a distinction between genuine criticism and the deliberate presentation of fabricated or misleading claims as facts. It also called for an investigation into any coordinated or paid campaigns, if supported by evidence. The complaint comes amid online backlash following Vijay and Rashmika’s appearance on Koffee With Karan, where their conversation about their relationship and marriage triggered criticism and speculation.  The team clarified that its action was not intended to curb freedom of speech or genuine opinions, but to seek accountability for potentially unlawful content. It added that appropriate legal remedies would be pursued wherever warranted and urged social media users to avoid spreading unverified claims. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Naga Chaitanya’s epic thriller Vrushakarma, directed by Karthik Dandu, has secured a major distribution boost with Dil Raju’s SVC acquiring the film’s theatrical distribution rights for Andhra Pradesh, Telangana and Karnataka. Apparently, the producer paid a huge price for this big budget film - highest ever in Chay's career. The association comes amid growing anticipation for the film, with the recent press visit to its meticulously designed cave set offering a glimpse into the scale and detailing behind the ambitious project. Even non-theatrical rights have fetched high amounts recovering major amounts for the producers, say reports.    Naga Chaitanya has expressed strong confidence in Karthik Dandu’s script and execution, with the film being mounted on an epic scale by BVSN Prasad and Sukumar Writings. Dil Raju’s association adds further weight to the film’s theatrical prospects, given SVC’s established presence in the Telugu market. Vrushakarma stars Meenakshi Chaudhary as the leading lady, with Sparsh Srivastav in a prominent role. The film is scheduled for a worldwide theatrical release on December 4. Naga Chaitanya is super confident about the film and releasing on Pushpa 2 date, makers are also expecting the same magic at box office.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు.. రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునే వెసులుబాటు కూడా కల్పించింది. అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఈ మొత్తాల్లో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది. పెంచిన ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. అలాగే రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో విడుదలైన తొలి పది రోజులు పెంచిన టికెట్ ధరలతో పాటు అదనపు షోల ద్వారా సినిమా భారీ వసూళ్లకు అవకాశం ఏర్పడింది. వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: షాకిచ్చిన పవన్ కళ్యాణ్ సతీమణి.. ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేట్ అసలు కారణం ఇదేనా.?     [Aadarsha Kutumbam AP Ticket Price Hike, Aadarsha Kutumbam Ticket Prices, Aadarsha Kutumbam Movie, Aadarsha Kutumbam Release Date, Venkatesh, Trivikram Srinivas, Srinidhi Shetty, Telugu Film News]  
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియాకు దూరమయ్యారు. కొన్ని నెలల క్రితమే ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టి, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలు, విశేషాలను అభిమానులతో పంచుకున్న ఆమె.. ఇప్పుడు అకస్మాత్తుగా తన ఖాతాను డీయాక్టివేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అసలు అన్నా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలే కారణమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ చాలాకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నప్పటికీ.. అన్నా కొణిదెల మాత్రం వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రైవేట్‌గానే ఉంచేవారు. అయితే 2026 మార్చిలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పవన్ తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. అన్నా సోషల్ మీడియాలోకి రావడంపై మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కుటుంబానికి సంబంధించిన ఫొటోలు, వ్యక్తిగత విశేషాలను ఆమె పంచుకున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆసక్తి పెరిగింది. కానీ ఇప్పుడు అకౌంట్ డీయాక్టివేట్ కావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అన్నా కొణిదెల ఇన్‌స్టాగ్రామ్ నుంచి తప్పుకోవడానికి సోషల్ మీడియాలో వస్తున్న నెగిటివ్ కామెంట్లు కారణమై ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. పవన్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. ఆయనపై జరిగే రాజకీయ విమర్శలు కొన్నిసార్లు కుటుంబ సభ్యుల వరకు కూడా వెళ్తుంటాయి. ఈ క్రమంలో అన్నా కూడా ఆన్‌లైన్‌లో విమర్శలను ఎదుర్కొన్నారనే కథనాలు వస్తున్నాయి. అయితే ఆమె ఖాతాను ఎందుకు డీయాక్టివేట్ చేశారనే విషయంపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి వివరణ రాలేదు. కాబట్టి నెగిటివ్ కామెంట్ల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని నిర్ధారించలేం. వ్యక్తిగత కారణాలతోనైనా ఆమె సోషల్ మీడియాకు విరామం ఇచ్చి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే ఇది తాత్కాలిక విరామమా? లేక అన్నా కొణిదెల ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇది కూడా చదవండి: కొమ్మూరి సాంబశివరావు శత జయంతి.. ఇందిరా గాంధీ హత్యను ముందే ఊహించిన రచయిత.!       [Pawan Kalyan Wife Instagram Deactivated, Anna Konidela Instagram Deactivated, Anna Konidela Instagram, Pawan Kalyan, Anna Konidela, Instagram, Telugu Film News]  
సాయి పల్లవి సీతమ్మ వారుగా రామాయణతో అలరిస్తున్న విషయం తెలిసిందే. అదే టైంలో ధనుష్ తో చేస్తున్న ఓం సినిమాలో లేడీ ఐపిఎస్ ఆఫీసర్ గా కనిపిస్తుంది. రీసెంట్ గా ఓం కి సంబంధించి మేకర్స్ సాయి పల్లవి లుక్ రిలీజ్ చేసారు.  'నిత్యారెడ్డి' అనే అత్యంత శక్తివంతమైన,  విభిన్నమైన క్యారక్టర్ లో కనిపించబోతుంది. ఆమె కెరీర్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని సరికొత్త కోణంలో ఈ క్యారక్టర్ సాగనుందని సమాచారం. కేవలం సాధారణ రోల్ కే పరిమితం కాకుండా, కథలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఇంటెన్స్ రోల్‌లో  తన అద్భుతమైన నటనతో మెప్పించనున్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణాని అడ్డుకునేందుకు పోలీస్ ఆఫీసర్ నిత్య రెడ్డి ఏం చేసిందో తెలియాలంటే  నవంబర్ 20 వరకు ఆగాల్సిందే.  ఎందుకంటే ఓం రిలీజ్ డేట్ నవంబర్ 24. ఇది కూడా చదవండి: నా కెరీర్ నిలబెట్టింది ఆయనే: జయప్రద వ్యాఖ్యలు వైరల్!      నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ కల్పిత కథను దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ చిత్రంలో సాయిపల్లవితో పాటు ట్రెండింగ్ హీరోయిన్ శ్రీలీల కూడా మరో కీలక నాయికగా చేస్తున్న విషయం తెలిసిందే. 'అమరన్' తో విజయాన్ని అందుకున్న రాజ్ కుమార్ పెరియసామి దర్శకుడు.     [Sai Pallavi Om Movie Update, Sai Pallavi, Om Movie, Dhanush, Nithya Reddy, Rajkumar Periasamy, Tollywood News, Telugu Movie News,Telugu Cinema, Tollywood, Telugu News, Tollywood News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతిరోజూ మన ఇళ్లలో బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు ఒక అత్యంత ముఖ్యమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారంగా నిలుస్తుంది. తక్కువ ఖర్చులో అత్యధిక పోషకాలను, పూర్తి స్థాయి అమైనో ఆమ్లాలను అందించే ఏకైక సంపూర్ణ ఆహారం ఏదైనా ఉందంటే అది ఎగ్‌ మాత్రమే. అయితే ఫిట్‌నెస్ ప్రియులు, జిమ్‌కు వెళ్లేవారు మరియు బరువు తగ్గాలనుకునే వారు గుడ్లను ఏ పద్ధతిలో ఉడికించి లేదా వేయించి తింటే అసలైన ప్రయోజనం లభిస్తుందనే అంశంపై ఎప్పుడూ ఆసక్తికరమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. కొందరు ఉడకబెట్టిన గుడ్లు ఉత్తమమని భావిస్తే, మరికొందరు ఫ్రైడ్ ఎగ్స్ లేదా ఆమ్లెట్లు రుచిగా ఉంటాయని ఇష్టపడతారు. అయితే, శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం వంట చేసే పద్ధతి గుడ్డులో ఉండే పోషకాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది తెలుసుకోవడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. సాధారణంగా ఒక మధ్యస్థాయి గుడ్డు నుంచి మన శరీరానికి దాదాపు 6 నుండి 6.3 గ్రాముల వరకు అధిక నాణ్యత గల పూర్తి స్థాయి ప్రోటీన్ అందుతుంది. మనం గుడ్డును ఉడికించినా, వేయించినా లేదా పోచ్ చేసినా దానిలోని ప్రాథమిక ప్రోటీన్ నిర్మాణం అలాగే ఉంటుంది. కానీ ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, ఆ ప్రోటీన్‌ను మన శరీరం ఎంత సమర్థవంతంగా గ్రహిస్తుంది, అలాగే దానితో పాటు శరీరంలోకి ఎంత అదనపు కొవ్వు, క్యాలరీలు చేరుతాయి అనేదే అసలు విషయం. పచ్చి గుడ్లతో పోలిస్తే, ఉడికించిన లేదా వేడి చేసిన గుడ్లను తిన్నప్పుడు మన శరీరం సుమారు 91 శాతం వరకు ప్రోటీన్‌ను అత్యంత సులువుగా జీర్ణం చేసుకుని గ్రహిస్తుంది. అదే ఒకవేళ పచ్చి గుడ్లను తీసుకుంటే, వాటిలో ఉండే అవిడిన్ అనే ప్రోటీన్ బయోటిన్‌ను బంధించి శరీరానికి అందకుండా చేస్తుంది మరియు కేవలం 50 శాతానికి పైగా మాత్రమే ప్రోటీన్ శోషణ జరుగుతుంది. అంతేకాకుండా, పచ్చి గుడ్ల వల్ల సాల్మోనెల్లా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. కాబట్టి గుడ్డును సరిగ్గా ఉడికించి లేదా వేయించి తినడమే ఎల్లప్పుడూ సురక్షితమైన మార్గం. ఇక ఉడికించిన గుడ్ల విషయానికి వస్తే, వీటిని ఉడకబెట్టేటప్పుడు ఎలాంటి అదనపు నూనె లేదా వెన్న అవసరం లేదు కాబట్టి క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక ఉడికించిన గుడ్డులో కేవలం 70 నుండి 80 క్యాలరీలు మాత్రమే ఉండి, ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. దీనివల్ల పదే పదే ఆకలి వేయకుండా ఉండి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక తిరుగులేని అద్భుతమైన ఎంపికగా మారుతుంది. మరోవైపు, ఫ్రైడ్ ఎగ్స్ విషయానికి వస్తే, వీటిని వేయించడానికి నూనె లేదా వెన్నను ఉపయోగించడం వల్ల కేలరీలు మరియు సంతృప్త కొవ్వుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద గుడ్లను ఎక్కువ సేపు ఫ్రై చేయడం వల్ల కొలెస్ట్రాల్ ఆక్సీకరణం చెంది, కొన్ని సందర్భాల్లో ప్రోటీన్ నిర్మాణం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే మీరు ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన నూనెలను కేవలం ఒక టీస్పూన్ మాత్రమే వాడి, మితమైన వేడిలో వేయించుకుంటే నష్టం పెద్దగా ఉండదు. అయినప్పటికీ, ఎలాంటి అదనపు కొవ్వులు చేరకుండా, పూర్తి పోషకాలను, దాదాపు 6.3 గ్రాముల ప్రోటీన్‌ను సురక్షితంగా పొందడానికి ఉడికించిన లేదా పోచ్ చేసిన గుడ్లే అత్యుత్తమమైన మరియు ఆరోగ్యకరమైన మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారు ఈ చిన్న పోషకాహార సూత్రాలను పాటిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.     Boiled Eggs Vs Fried Eggs, Egg Protein Content, Boiled Egg Nutrition, Fried Egg Calories, Best Way To Cook Eggs, Fitness Diet Tips, Egg Cooking Methods Comparison.
నా కూతురు యూరప్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు నాతో పంచుకున్న ఒక చిన్న కథ నా ఆలోచనలను పూర్తిగా మార్చివేసింది. అది కేవలం ఒక ప్రయాణపు అనుభవం మాత్రమే కాదని, మనందరికీ జీవితం నేర్పించే ఒక అద్దం లాంటిదని నాకు అర్థమైంది. ఆమె నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న ఒక పెద్ద కాస్ట్‌కో (Costco) స్టోర్‌ను సందర్శించినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో బయట వాతావరణం చాలా చలిగా ఉంది. జనాలు ఎవరి హడావిడిలో వారు లోపలికి వస్తూ, బయటికి వెళుతున్నారు. అక్కడి ప్రవేశ ద్వారం దగ్గర ఐదేళ్లు కూడా నిండని ఒక చిన్న అబ్బాయి ఎంతో ఉత్సాహంగా నిలబడి ఉన్నాడు. అతని చేతిలో కొన్ని చిప్స్ ప్యాకెట్లు ఉన్నాయి. అతని మెడలో ఒక చిన్న బోర్డు వేలాడుతోంది, దానిపై పిల్లల దస్తూరితో కొంచెం వంకర టింకరగా  స్కౌట్ ఛారిటీ కోసం కేవలం $20 చెల్లించి ఒకటి కొనండి  అని రాసి ఉంది. స్టోర్‌కు వస్తున్న వందలాది మంది జనాలు అతని పక్కనుండి పట్టించుకోకుండా వెళుతున్నారు. కొందరు తొందరలో ఉన్నారు, కొందరు ఫోన్లలో మాట్లాడుతున్నారు, ఇంకొందరు ఆ చిన్నారిని చూసినా కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఆ చిన్న పిల్లోడు మాత్రం తన ప్రయత్నం ఏమాత్రం విరమించలేదు. తన చిరునవ్వు చెదరని చిన్న అడుగులతో ప్రతి ఒక్కరి దగ్గరికీ వెళ్తున్నాడు. వాళ్ళ వైపు పైకి చూస్తూ అమాయకంగా,  మీరు దయచేసి ఒక ప్యాకెట్ కొంటారా?  అని అడుగుతున్నాడు. కొందరు కొన్నారు, మరికొందరు చిరునవ్వు నవ్వి  వద్దులే బాబూ, థాంక్యూ  అని ముందుకు వెళ్లిపోయారు. అంత చిన్న వయసులో ఇన్నిసార్లు  వద్దు  అనే పదాన్ని వింటే కచ్చితంగా ఏడుస్తాడు లేదా బాధపడి తన టీచర్ వెనుక దాక్కుంటాడు అని నా కూతురు మనసులో అనుకుంది. కానీ అక్కడ ఊహించని దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతి  వద్దు  మాట విన్న తర్వాత, ఆ పిల్లాడు ఏమాత్రం నిరాశ చెందకుండా చిరునవ్వుతో నెమ్మదిగా తలూపి, వెంటనే తర్వాతి వ్యక్తి వైపు తిరిగేవాడు. అతని ముఖంలో ఎలాంటి భయం, సిగ్గు లేదా అసంతృప్తి ఛాయలు లేవు. కేవలం అద్భుతమైన ఆత్మవిశ్వాసం మాత్రమే కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయిన నా కూతురు ఆపుకోలేక అతని దగ్గరకు వెళ్లి ఒక ప్యాకెట్ కొనుగోలు చేసింది. అది చూసి ఆ చిన్నారి కళ్ళు ఆనందంతో మెరిశాయి, సంతోషంతో గెంతుతూ  చాలా థాంక్యూ!  అని కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు నా కూతురు ఆప్యాయంగా అతన్ని చూస్తూ, నువ్వు ఇంకా ఎన్ని ప్యాకెట్లు అమ్మాలి బాబూ? ఇక్కడ ఇంకెంతసేపు నిలబడతావు?  అని అడిగింది. ఆ పిల్లాడు ఇచ్చిన సమాధానం ఆమెను తీవ్రంగా కదిలించింది. అతను ఎలాంటి సందేహం లేకుండా,  100 మంది నాకు  వద్దు  అని చెప్పే వరకు నేను ఇక్కడే ఉండి అడుగుతాను!  అని బదులిచ్చాడు. ఆశ్చర్యపోయిన నా కూతురు అతని పక్కనే నిలబడి ఉన్న టీచర్ వైపు చూసింది. అప్పుడు ఆ టీచర్ చిరునవ్వుతో ఇలా వివరించింది:  మా లక్ష్యం కేవలం ప్యాకెట్లు అమ్మడం కాదు. ఈ చిన్న వయసులోనే ఆ పిల్లాడికి  వద్దు అనే తిరస్కారాన్ని ఎదుర్కొనే తత్వాన్ని నేర్పించడమే మా అసలు లక్ష్యం. జీవితంలో ఎవరైనా  వద్దు  అని చెప్పినా దానిని ధైర్యంగా అంగీకరిస్తూ, ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తర్వాతి వ్యక్తిని అడిగే మానసిక దృఢత్వాన్ని పెంపొందించడం కోసం మేము ఈ శిక్షణ ఇస్తున్నాము.  ఈ మాటలు విన్న తర్వాత నా కూతురు కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. నేను కూడా దీన్ని లోతుగా ఆలోచించాను. నేడు మనం మన పిల్లలకు ఏమి నేర్పుతున్నాం? కష్టపడి చదువుకో, క్లాస్‌లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో, ప్రతి పోటీలో గెలువు, అందరికంటే ముందుండు అని మాత్రమే చెబుతున్నాం. కేవలం ఎలా గెవాలో నేర్పుతున్నామే తప్ప, ఓటమిని ఎలా ఎదురుకోవాలో నేర్పడం లేదు. విజయానికి అందమైన మార్గం చూపుతున్నాం కానీ, ఎవరైనా వద్దు  అంటే లేదా రిజెక్ట్ చేస్తే వచ్చే నిరాశను ఎలా తట్టుకోవాలో ఆ ధైర్యాన్ని మాత్రం ఇవ్వడం లేదు. కానీ నిజ జీవితంలో వారికి అత్యంత అవసరమైన గుణపాఠం అదే. ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ మనం కోరుకున్నట్లుగా అవును  అని మన దారికి స్వాగతం పలకదు. కష్టకాలంలో మనం వినే  వద్దు  అనే మాట మనల్ని పూర్తిగా విరిచేయగలదు లేదా మరింత బలోపేతం చేయగలదు. కొన్నిసార్లు, ఒకే ఒక  అవును  నేర్పించేదానికంటే ఈ 100  వద్దు లు మనకు జీవిత సత్యాలను ఎంతో ఎక్కువగా నేర్పిస్తాయి.     Power Of 100 Nos, Handling Failure And Rejection, Resilience Over Success, Inspirational Life Lessons, Mental Toughness, Overcoming Fear Of Failure, Motivational Mindset.
ఎంత దగ్గరి వ్యక్తులకైనా సరే.. ఈ విషయాలు అస్సలు చెప్పకండి.. మనిషి జీవితం సక్సెస్ గా ఉండటానికి, కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగడానికి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆయన చెప్పిన విషయాలు చాణక్య నీతి పేరుతో ఎంతో ప్రాచుర్యం పొందాయి.    కాలం ఎంత మారినా చాణక్య నీతిలో చెప్పిన సూత్రాలు నేటి ఆధునిక కాలంలో కూడా అందరికీ వర్తించేలాగా, అందరూ ఆచరించదగినవిగా ఉంటాయి.  ఇంకా చెప్పాలంటే.. మనిషి స్వభావాన్ని ఆయన వేల ఏళ్ల కిందటే ఖచ్చితంగా అంచనా వేసి ఈ విషయాలన్నీ చెప్పగలిగారు.     సాధారణంగా మనకు ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం కలిగినా ముందుగా కుటుంబ సభ్యులతో పంచుకోవాలని అనుకుంటాం. రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు లేదా చాలా సన్నిహితులు అయినప్పటికీ కొన్ని విషయాలను ఎవరితోనూ పంచుకోకూడదని ఆచార్య చాణక్య  హెచ్చరిస్తున్నారు. కొన్ని  విషయాలను ఎంత  దగ్గరి వ్యక్తులకు కూడా చెప్పకుండా రహస్యంగా ఉంచితేనే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా సంతోషంగా ఉండగలమని ఆయన స్పష్టం చేశారు. ఆ విషయాలు ఏంటో  వివరంగా తెలుసుకుంటే.. ఆర్థిక  ఇబ్బందులు.. వ్యాపారంలో నష్టం వచ్చినా లేక ఎవరి వద్దనైనా అప్పులపాలైనా ఆ విషయాలను కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఉండటమే మంచిదని చాణక్యుడు అభిప్రాయపడ్డారు. ఈ రకమైన ఆర్థిక సమస్యల గురించి ముందే చెబితే వారు అనవసరంగా ఆందోళన చెందుతారు. దీనివల్ల ఇంటి వాతావరణం కూడా నిరాశానిస్పృహలతో నిండిపోతుంది. ఒకవేళ  నిజంగా ఇంట్లో వారి ఆర్థిక సహాయం లేదా సలహా అవసరమైతే తప్ప మిగతా సమయాల్లో  ఆర్థిక సమస్యలను ఎవరికీ చెప్పకుండా ఉండటమే చాలా మంచిది.  భార్యాభర్తల  వ్యక్తిగత గొడవలు.. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు లేదా గొడవలు రావడం సర్వసాధారణం. అయితే ఈ వ్యక్తిగత విషయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కుటుంబంలోని ఇతర సభ్యులకూ లేదా బయటి వ్యక్తులకూ చెప్పకూడదు. ఇలాంటి విషయాలను అందరి ముందు చర్చించడం వల్ల మీపై ఇతరులకు ఉండే గౌరవం తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇతరులు మీ సమస్యలను చూసి పైకి సానుభూతి చూపినప్పటికీ, వెనుక నుంచి మీ గురించి చులకనగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి మీ సమస్యలను మీరే ప్రశాంతంగా కూర్చుని పరిష్కరించుకోవడం మంచిది. ఆఫీస్ లో  అవమానాలు లేదా ఉద్యోగ సమస్యలు.. వృత్తి జీవితంలో ఎవరికైనా కొన్నిసార్లు పై అధికారుల నుంచి తిట్లు లేదా సహోద్యోగుల నుంచి అవమానాలు ఎదురుకావచ్చు. ఇలాంటి విషయాలను ఇంట్లో వాళ్లతో పంచుకుంటే వారు మీ గురించి అనవసరంగా బాధపడతారు. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళ దృష్టిలో మీ విలువ క్రమేపీ తగ్గిపోతుంది. మిమ్మల్ని బలహీనుడిగా భావించే అవకాశం ఉంటుంది కాబట్టి వృత్తిపరమైన విషయాలను ఆఫీస్ లోనే వదిలేయడం మంచిది.  మనసులోని బలహీనతలు , భయాలు.. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బలహీనత లేదా భయం ఉంటుంది. అయితే మనకున్న ఆ బలహీనతలను ఎవరికీ, కనీసం దగ్గరి కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా గొడవలు లేదా వాదనలు జరిగితే కొందరు వ్యక్తులు మన బలహీనతనే మనకు వ్యతిరేకంగా వాడుకుని మనల్ని మరింత మానసికంగా ఇబ్బంది పెట్టవచ్చు. చేయబోయే  పనులు లేదా లక్ష్యాలు.. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, పెద్ద లక్ష్యాన్ని సాధించాలనుకున్నా ఆ పని పూర్తి అయ్యే వరకు ఎవరికీ చెప్పకూడదు. పని పూర్తి కాకముందే అందరికీ ఆ విషయం చెబితే ఇతరుల అనవసరమైన సలహాలు, సందేహాలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అందుకే మీ విజయాన్ని ముందుగా సాధించి చూపించిన తర్వాతే పదిమందితో పంచుకోవడం ఎప్పుడూ మంచి ఫలితాలను ఇస్తుంది.                                                                                                                                                  *రూపశ్రీ.
ఇంటి బాధ్యతలను మోస్తూ, కుటుంబం  కోసం నిరంతరం శ్రమిస్తున్న మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం. ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటి పనులు, ఆఫీస్ బాధ్యతల ఒత్తిడిలో పడి మహిళలు తమ శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పులను, అనారోగ్య సూచనలను సాధారణంగా కొట్టిపారేస్తుంటారు. అయితే, మన శరీరం ప్రతి చిన్న విషయానికీ స్పందిస్తూ కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇస్తూ ఉంటుంది. వాటిని సమయానికి గుర్తించి జాగ్రత్త పడకపోతే అది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అసలు కొందరు మహిళలు ఘాటైన వాసనలు పదే పదే చూడాలని ఎందుకు అనుకుంటారు? దీని వెనకున్న ఆరోగ్య సమస్య ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. ఘాటైన వాసనలు.. రోజూవారీ జీవితంలో మనలో చాలామందికి కొన్ని వింత అలవాట్లు ఉంటాయి. ముఖ్యంగా అమృతాంజనం, విక్స్ లేదా నీలగిరి తైలం వంటి ఘాటైన వాసనలను పదే పదే పీల్చాలని అనిపించడం, లేదా వాటిని దగ్గరగా పెట్టుకుని చూడటం చేస్తుంటారు. అలాగే వంటగదిలో ఉండే దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాలను , మసాలా దినుసులను సాధారణ మోతాదు కంటే ఎక్కువగా, నేరుగా నమిలి తినాలనిపించడం లాంటి కోరికలు కలుగుతుంటాయి. ఇవి కేవలం సాధారణ రుచికి సంబంధించిన అలవాట్లు కాకపోవచ్చు. ఎందుకు ఈ అలవాట్లు..? వైద్య శాస్త్రం ప్రకారం, శరీరంలో హిమోగ్లోబిన్ లేదా ఐరన్ శాతం తగ్గినప్పుడు ఇలాంటి ప్రవర్తనలు కనిపిస్తుంటాయి. దీనిని 'పికా' (Pica) అనే ఆరోగ్య పరిస్థితిగా చెబుతారు. శరీరంలో రక్తం కొరత ఏర్పడినప్పుడు లేదా ఎర్ర రక్త కణాల నిర్మాణం మందగించినప్పుడు, మెదడుకు అందవలసిన పోషకాలు సరిగ్గా అందక ఇటువంటి వింతైన కోరికలు పుట్టుకొస్తాయి. మట్టి, సుద్ద, ఐస్ ముక్కలు తినాలనిపించడం ఎంత సాధారణమో, ఘాటైన వాసనలను పీల్చాలనిపించడం , మసాలా దినుసులను తినాలనిపించడం కూడా అదే కోవలోకి వస్తుంది. కారణాలు.. మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపించడానికి ప్రధాన కారణాలు రకరకాలుగా ఉంటాయి. క్రమ పద్ధతిలో లేని జీవనశైలి, నెలసరి సమయాల్లో అధిక రక్తస్రావం, పోషకాహార లోపం,  విశ్రాంతి సరిగా లేకపోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ మోతాదు వేగంగా పడిపోతుంది. దీనివల్ల ఎప్పుడూ నీరసం, తలతిరగడం, శరీరం తెల్లగా మారడం, ఏకాగ్రత తగ్గడం, పనులపై ఆసక్తి సన్నగిల్లడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనికి తోడు ఈ ఘాటైన వాసనలను పీల్చడం వల్ల లేదా మసాలా పదార్థాలను అధికంగా తినడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం దొరికినట్లు అనిపించినా, అది దీర్ఘకాలంలో కడుపులో మంట, అల్సర్ , జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి వింత లక్షణాలు లేదా అలవాట్లు మీలో లేదా మీ చుట్టూ ఉన్న మహిళల్లో కనిపిస్తే ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దు. వెంటనే ఒకసారి వైద్యులను సంప్రదించి కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC) పరీక్ష చేయించుకోవడం ద్వారా హిమోగ్లోబిన్ శాతాన్ని పరిశీలించుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలము. పోషకాహార లోపాన్ని సరిదిద్దడానికి రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, బీట్రూట్, దానిమ్మ పండ్లు, ఖర్జూరాలు, బెల్లం, వేరుశెనగలు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే పదార్థాలను చేర్చుకోవాలి. శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన ఆలోచనలే మహిళల నిజమైన ఎదుగుదలకు, సాధికారతకు బలమైన పునాది వేస్తాయి.                                                                                                                                                  *రూపశ్రీ.
మన శరీరానికి ఎముకలు ఎంత బలంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాము. ముఖ్యంగా ఎముకలు , దంతాలు పటిష్టంగా ఉండటంలో కాల్షియం  చాలా అవసరం. ఇది కేవలం ఎముకలను గట్టిపరచడమే కాకుండా, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, నరాల ద్వారా మెదడుకు సంకేతాలు అందడంలో , రక్తం గడ్డకట్టే ప్రక్రియలోనూ కీలకపాత్ర  పోషిస్తుంది. అయితే చాలా మంది రోజూ పాలు, పెరుగు లాంటివి తీసుకుంటున్నప్పటికీ, వారి శరీరానికి తగినంత కాల్షియం అందడం లేదని ఆందోళన చెందుతుంటారు. మనం తీసుకునే ఆహారంలో కొన్ని పొరపాట్లు ఉండటం వల్ల, అది శరీరంలో కలిసిపోవడానికి బదులుగా నీటిలా కరిగిపోయి వృథాగా బయటకు వెళ్లిపోతుంటుంది. అలా జరగడానికి కారణాలు ఏంటో.. ఆ ఆహారపు పొరపాట్లు ఏమిటో వివరంగా తెలుసుకుంటే.. విటమిన్-డి లేకపోవడం.. శరీరంలో కాల్షియం లోపించడానికి ప్రధాన కారణాలలో విటమిన్ డి లేకపోవడం ఒకటి. మనం ఎంత కాల్షియం తీసుకున్నప్పటికీ, అది ఎముకలకు చేరాలంటే శరీరంలో తగినంత విటమిన్ డి ఉండటం చాలా అవసరం. ఒకవేళ విటమిన్ డి లోపిస్తే మాత్రం మనం తీసుకునే పోషకాలు పూర్తిగా శోషించబడవు. ఉదయం పూట ఎండలో కాసేపు గడపడం లేదా అవసరమైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు. విటమిన్ డి లేకపోతే క్యాల్షియం శరీరంలో పూర్తిగా వృథా అయిపోతుంది. ఉప్పు.. మనం రోజూ తినే ఆహారంలో ఉప్పు మోతాదు ఎక్కువైతే అది ఎముకల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతుంది. ఉప్పులో ఉండే సోడియం  మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లేటప్పుడు, దానితో పాటు శరీరంలోని ముఖ్యమైన కాల్షియం కూడా కరిగిపోయి బయటకు వెళ్లిపోతుంది. చిప్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, నిల్వ ఉంచిన పచ్చళ్ళు , అతిగా ఉప్పు ఉండే పదార్థాలను రోజూ తీసుకోవడం వల్ల ఎముకలు క్రమంగా గుల్లబారే ప్రమాదం ఉంది. దీనితో పాటు అతిగా టీ లేదా కాఫీలు తాగే అలవాటు ఉన్నవారిలో కూడా కాల్షియం శోషణ మందగిస్తుంది. కాల్షియం ఆహారాలు తీసుకోకపోవడం..   డైట్ లో కాల్షియం సమృద్ధిగా ఉండే పదార్థాలను పూర్తిగా విస్మరించడం కూడా సమస్యను కలిగిస్తుంది. కేవలం ఏదో ఒకటి తింటున్నాము అనుకోకుండా పాలు, పెరుగు, పన్నీర్, ఆకుకూరలు, వివిధ రకాల గింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరానికి అవసరమైన విభిన్న రకాల పోషకాలు అందాలంటే ఆహారంలో   వెరైటీగా  ఉండాలి. అవసరమైతే ఆహార నిపుణులను సంప్రదించి సరైన సప్లిమెంట్లను కూడా వాడుకోవచ్చు. ఆహారాలతో  పాటు ధూమపానం , మద్యం సేవించే అలవాట్లు కూడా ఎముకల బలాన్ని దెబ్బతీస్తాయి. ఇటువంటి వ్యసనాలు శరీరంలో కొత్త ఎముకల తయారీని మందగించి, ఉన్న ఎముకలు వేగంగా బలహీనపడేలా చేస్తాయి. దీనివల్ల శరీరానికి అందే కాల్షియం పూర్తిగా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ సమస్యలన్నింటి నుంచి దూరంగా ఉండాలంటే వ్యసనాలకు దూరంగా ఉంటూ, రోజూ కాసేపు నడక వంటి వ్యాయామాలు చేస్తూ, సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.                                                                                                                                           *రూపశ్రీ.
శాకాహారం మంచిదా లేక మాంసాహారం మంచిదా అనే చర్చ చాలా సందర్భాలలో వస్తుంది. ముఖ్యంగా మాంసాహారాన్ని ఇష్టపడేవారు, శాకాహారాన్ని ఇష్టపడేవారు ఒకే దగ్గర చేరినప్పుడు ఈ రెండింటి మధ్య గల తేడా గురించి చాలా వాదించుకుంటూ ఉంటారు. దీర్ఘాయువుకు శాకాహారమే కీలకం అని కొందరు నమ్మితే..  మాంసంలో లభించే ప్రోటీన్ మరియు పోషకాలు మరింత ప్రయోజనకరమని మరికొందరు వాదిస్తారు. అయితే ఆరోగ్యం , దీర్ఘాయువు కోసం ఏ ఆహారం నిజంగా మంచిది? ఆరోగ్య నిపుణులు,  పరిశోధకులు దీని గురించి ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే..   శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు.. శాకాహారులకు గుండె జబ్బులు, అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం , క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి.  శాకాహారుల ఆహారంలో పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా , వల్ల, వారు సాధారణంగా తక్కువ బరువు మరియు తక్కువ బాడీ మాస్ ఇండెక్స్‌ను కలిగి ఉంటారు. కూరగాయలు , పండ్ల నుండి లభించే విటమిన్లు E, C , కెరోటిన్ శరీరాన్ని అంతర్గతంగా బలోపేతం చేయడానికి సహాయపడతాయి,  తక్కువ సంతృప్త కొవ్వులు గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. మాంసాహారం.. శాకాహారులు ఎక్కువ కాలం జీవిస్తారని చాలా కాలంగా నమ్మేవారు, కానీ చైనాలోని వృద్ధులపై ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ఈ భావనను సవాలు చేసింది. ఈ పరిశోధన ప్రకారం, మాంసాహారం తినేవారితో పోలిస్తే, కఠినమైన శాకాహారాన్ని పాటించేవారికి 100 ఏళ్ల వయస్సును చేరుకునే అవకాశం తక్కువగా ఉన్నట్లు కనుగొనబడిందట. దీని అర్థం, వృద్ధాప్యంలో శరీరానికి అవసరమైన పోషకాలను కేవలం మొక్కల ఆధారిత ఆహారంతో మాత్రమే పొందలేము. మధ్యేమార్గం.. మాంసాహారం తినేవారితో పోలిస్తే, చేపలు , పాల ఉత్పత్తులను తినేవారు లేదా చేపలు, పాల ఉత్పత్తులతో కూడిన శాకాహారాన్ని  తీసుకునేవారికి ఆరోగ్యపరంగా బాగుంటుందట. దీనిని బట్టి దీర్ఘకాలం  ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడంలో, పూర్తిగా శాకాహారిగా లేదా పూర్తిగా మాంసాహారిగా ఉండటం కంటే, సమతుల్య ఆహారం తీసుకోవడమే ఎక్కువ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ఇతర కారకాలు.. దీర్ఘాయువు కేవలం ఆహారపు అలవాట్లపై మాత్రమే ఆధారపడి ఉండదని పరిశోధకులు అంటున్నారు. జన్యుపరంగా, జీవనశైలి, శారీరక శ్రమ, మొత్తం ఆరోగ్యం వంటి అనేక అంశాలు కూడా సమాన పాత్ర పోషిస్తాయి. అందువల్ల, కేవలం శాకాహారిగా లేదా మాంసాహారిగా ఉండటం అనేది దీర్ఘాయువు నిర్ణయించబడదు అంటున్నారు.                                  *రూపశ్రీ