Home

»

Gossips

టాలీవుడ్ స్టార్ AI సిక్స్ ప్యాక్: బడా డైరెక్టర్‌కి చుక్కలు చూపిస్తున్న హీరో.!

Oct 27, 2026 10:30AM

సినిమాల్లో పాత్రకు తగ్గట్టుగా హీరోలు తమ శరీరాకృతిని మార్చుకోవడం సహజం. ముఖ్యంగా భారీ యాక్షన్‌ సినిమాల కోసం సిక్స్ ప్యాక్‌తో కనిపించేందుకు ప్రత్యేకంగా కసరత్తులు చేస్తుంటారు. అయితే ఓ భారీ పాన్ ఇండియా మూవీ విషయంలో మాత్రం సిక్స్ ప్యాక్ అంశం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాలో నటిస్తున్న స్టార్‌ను సిక్స్ ప్యాక్‌తో కనిపించాలని దర్శకుడు కోరారట. అందుకు తగ్గట్టుగా శరీరాకృతిని మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే ఆ హీరో అనుకున్న స్థాయిలో సిక్స్ ప్యాక్ సాధించలేకపోయారని, అంతేకాకుండా ఈ విషయంలో ఆయనకు పెద్దగా ఆసక్తి కూడా లేదని ప్రచారం జరుగుతోంది.

దీంతో షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో AI, VFX సాంకేతికతను ఉపయోగించి హీరోకి సిక్స్ ప్యాక్ ఉన్నట్లుగా చూపించాలనే ఆలోచనకు డైరెక్టర్ వచ్చినట్లు టాక్. 

నిజానికి ఈ పద్ధతిని అనుసరించడం దర్శకుడికి ఏమాత్రం ఇష్టం లేద, సహజంగా హీరో శారీరకంగా సిద్ధమై తెరపై కనిపిస్తే వచ్చే ప్రభావం వేరుగా ఉంటుందని ఆయన భావిస్తున్నారట. కానీ షూటింగ్ ఆలస్యమయ్యే పరిస్థితులు ఎదురుకాకుండా ఉండేందుకు మరో మార్గం లేక ఈ దారిని ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: ప్రభాస్‌తో సినిమా.. ఆ యాంగిల్‌నే చూపిస్తానంటున్న త్రివిక్రమ్.!

 

 

 

[Tollywood Star, AI Six Pack, Six Pack VFX, Telugu Hero, Body Transformation, Tollywood Hero, Telugu Film News, Telugu Movie News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com