
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు.. రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునే వెసులుబాటు కూడా కల్పించింది. అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఈ మొత్తాల్లో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది. పెంచిన ధరలు సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి.
అలాగే రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో విడుదలైన తొలి పది రోజులు పెంచిన టికెట్ ధరలతో పాటు అదనపు షోల ద్వారా సినిమా భారీ వసూళ్లకు అవకాశం ఏర్పడింది.
వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: షాకిచ్చిన పవన్ కళ్యాణ్ సతీమణి.. ఇన్‌స్టాగ్రామ్ డీయాక్టివేట్ అసలు కారణం ఇదేనా.?

[Aadarsha Kutumbam AP Ticket Price Hike, Aadarsha Kutumbam Ticket Prices, Aadarsha Kutumbam Movie, Aadarsha Kutumbam Release Date, Venkatesh, Trivikram Srinivas, Srinidhi Shetty, Telugu Film News]





