ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో   కాంగ్రెస్ ఖాతా తెరిచింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల ఫలితాలను ప్రకటించారు. తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.  మరి కొన్నింటిలో ఆధిక్యంలో ఉంది.  చీరాల మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలలో   వైసీపీ సోదిలోకి కూడా కనిపించలేదు. అనూహ్యంగా అక్కడ తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా ఫలితాలు వెలువడ్డాయి. చీరాల మునిసిపాలిటీ ఎన్నికలలో ప్రధానంగా తెలుగుదేశం కూటమితో కాంగ్రెస్ హోరాహోరీ తలపడింది. ఇక్కడ వైపీపీ మూడో స్థానానికే పరిమితమైంది.  మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య  శుక్రవారం ప్రారంభించారు.    చీరాల మున్సిపాలిటీలో  తెలుగుదేశం అభ్యర్థులు ముందంజలో ఉండగా, రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. పలు వార్డులలో తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చింది. అయితే వైసీపీ మాత్రం కనీస పోటీ ఇవ్వలేక చతికిల బడింది. చీరాల మునిసిపాలిటీలో పలు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చారు.  గతంలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన రాజకీయ పరిణామాలు, స్థానిక సమీకరణాల ప్రభావం ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చీరాలలో ఆమంచి కృష్ణ ప్రసాద్ కు ఉన్న పట్టు కాంగ్రెస్ కు లాభించిందని అంటున్నారు. 2024 ఎన్నికల ముందు వైసీపీ నుంచి ఆమంచి కాంగ్రెస్ లో చేరారు. కాగా.. 2024 ఎన్నికల్లోనూ చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి 41,859ఓట్లు దక్కించుకున్నారు. మూడో స్థానంలో నిలిచారు.  ఇది కూడా చదవండి:  ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల: మూడు దశల్లో పోలింగ్.! ఆమంచికి చీరాలలో ఉన్న పట్టు వైసీపీకి మైనస్ గా మారింది. చీరాలలోని ఒక్క వార్డులో కూడా వైసీపీ అభ్యర్థి కనీసం రెండో స్దానానికి చేరుకోలేకపోయారు. ఇక కాంగ్రెస్ విజయం సాధించిన 25వ వార్డులో వైసీపీ బాగా వెనుక బడింది.    చీరాల మున్సిపాలిటీలోని మెజారిటీ వార్డులను కైవసం చేసుకుంటూ తెలుగుదేశం కూటమి ముందంజలో దూసుకుపోతోంది.  మున్సిపల్ చైర్మన్  ఓటింగ్‌లోనూ తెలుగుదేశం అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యతలో ఉన్నారు. మొత్తంగా కడపటి సమాచారం అందే సరికి చీరాలలో ఎనిమిది  వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే చీరాలలో ఆ పార్టీ కనీస పోటీ కూడా ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉంది.   మీకు నచ్చవచ్చు:  [Chirala Municipal Election, Congress, Ahead Ycp,  Competition TDP Versus Congress, Andhra Pradesh Politics, Amanchi Krishna Mohan, Effect, Telugu One]
ఏపీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి బిగ్ షాక్ అనడంలో సందేహం లేదు. అలాగే గురువారం (నవంబర్ 5) జరిగిన పరిషత్ ఎన్నికలలో కూడా వైసీపీ చేతులెత్తేసినట్లేనని జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన తీరును బట్టి పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కింద పడ్డా పై చేయి నాదేనని చాటుకోవడానికి జగన్ పడుతున్న తాపత్రేయం ఆయన  ఓటమిని అంగీకరించేశారనడానికి నిదర్శనంగా వారు చూపుతున్నారు.   పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.  గత రెండేళ్లుగా అంటే 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దారుణ ఓటమి తరువాత నుంచీ ఏం చెబుతున్నారో, తాజాగా స్థానిక సమరంలో ఓటమి తరువాతా అదే చెప్పారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. ప్రజాస్వామ్య బద్ధంగా జరగాల్సిన ఎన్నికలలో అధికార పార్టీ యంత్రాంగం అక్రమాలకు పాల్పడిందని, నిబంధనలను తుంగలో తొక్కి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు  అడ్డదార్లు తొక్కిందనీ   ఆరోపించారు. అదే సమయంలో తన హయాంలో 2021లో జరిగిన స్థానిక ఎన్నికల గురించి లేశమాత్రమైనా ప్రస్తావించలేదు.  మునిసిపోల్స్ లో  ప్రజాతీర్పును అంగీకరించే సాహసం చేయలేని జగన్.. మొత్తంగా ఎన్నికల ప్రక్రియపైనే బురద జల్లే ప్రయత్నం చేశారు.   అసలు ఇవి  ఎలక్షన్లే కావని, ఇవన్నీ కేవలం సెలక్షన్లు మాత్రమేనంటూ  వితండ వాదానికి తెరలేపారు.  తన హయాంలొ   నామినేషన్లు కూడా వేయనివ్వకుండా బలవంతపు ఏకగ్రీవాలతో అరాచకం సృష్టించిన చరిత్రను కన్వీనియెంట్ గా మరిచిపోయారు.  ఇది కూడా చదవండి:  నేను గానీ, ఒక్క సైగ గానీ చేస్తే.. ప్రత్యర్థులకు జగన్ వార్నింగ్.! ఇక తాజాగా జగన్ గురువారం (నవంబర్ 5) మీడియా సమావేశంలో మాట్లాడిన దానిని బట్టి, ఓటమి తప్పదన్న నిర్ణయానికి ముందే వచ్చేసి, ఆ ఒటమి నెపాన్ని పోలీసులు, ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై నెట్టేసి నైతిక విజయం తమదేనని చెప్పుకోవడానికి వృధా ప్రయత్నం చేశారని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పరిషత్ ఎన్నికలలో కనీసం పరువు దక్కే అవకాశాలే లేవన్న అంచనాతో జగన్ బెదరింపులకు తెగించారు.  నిరాశా వాదం, నిర్హేతుక వాదనలతో జగన్ తన ప్రెస్ మీట్ ముగించారు. మొత్తంగా స్థానిక సమరంలో పార్టీ పరాజయానికి అధికార తెలుగుదేశం కూటమి కారణమంటూ నెపాన్ని నెట్టేసి, ప్రెస్ మీట్ మొత్తాన్నిస్వోత్కర్ష, పరనిందలకు పరిమితం చేశారు. కాగా ఓ వైపు జగన్ ప్రభుత్వ అధికార దుర్వినియోగం పై ప్రసంగిస్తుంటూ.. స్థానిక ఓటమిని శిరసావహిస్తున్నామనీ, వైసీపీపై ప్రజా వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనమనీ వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరో ప్రెస్ మీట్ లో కుండబద్దలు కొట్టారు. పార్టీ తీరు ఇలాగే ఉంటే ఏ ఎన్నికలోనైనా ఇదే ఫలితం పునరావృతమౌతుందనిఅంగీకరించారు.   మీకు నచ్చవచ్చు:  [Jagan Press Meet on Municipal Results, Parishad Polls, Andhra Pradesh Political News, Telugu One]  
తెలుగు రాష్ట్రాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, రాజకీయ పంచాయతీలు మరోసారి తెరమీదకు వచ్చాయి. పెద్ద ఎత్తన చర్చకు తెరలేపాయి.   వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే   జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలు, వివాదాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి.  వైఎస్ షర్మిల కుమార్తె వివాహ వేడుకకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలు,  అసలు మేనకోడలి వివాహ వేడుకకు జగన్ హాజరౌతారా అన్న సందేహాలు బలంగా వ్యక్తమౌతున్నాయి.   ఇటీవల కాలంలో వైఎస్ కుటుంబంలో   ఆస్తి తగాదాలకు సంబంధించిన వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్‌లో వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం నిర్వహించడానికి వైఎస్ షర్మిల జగన్  అనుమతి కోరారు.  అయితే భద్రతా కారణాలు ప్రస్తావిస్తూ ఆ ప్రాంగణాన్ని వివాహ వేడుకకు ఉపయోగించేందుకు వైఎస్ జగన్ అంగీకరించలేదు. ఈ విషయంలో మరోసారి అన్నా చెళ్లెళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.   కుటుంబ భవనంలో వివాహం జరగకపోవడంతో, వివాహ వేదికను వేరే ప్రాంతానికి మారుస్తున్నట్లు వైఎస్ షర్మిల స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అదే సమయంలో అసలు ఎలహంక తన ఆస్తి అని కూడా విస్పష్టంగా ప్రకటించారు. అయితే కుమార్తె వివాహం నేపథ్యంలో తగాదాలు, అనవసర వివాదాలు ఎందుకని భావించి వేదికను మార్పు చేసినట్లు ఆమె ఆ సందర్భంగా చెప్పారు.  ఈ నేపథ్యంలో నవంబర్ 25న జరగనున్న ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులందరూ హాజరవుతారా లేదా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకకు వైఎస్ జగన్ తన సతీమణితో కలిసి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ కుటుంబ వేడుక రాజకీయ వర్గాల్లో  ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆ తర్వాత కాలంలో రాజకీయ పరిణామాలు, ఆస్తుల పంపిణీ వివాదాలు మరింత ముదిరాయి.   ఇది కూడా చదవండి: యలహంక ప్యాలెస్ నా ఆస్తి: షర్మిల సంచలన ప్రకటన.! తాజాగా ఇప్పుడు  కుమార్తె వివాహం సందర్భంగా చోటుచేసుకున్న వేదిక మార్పు వివాదం నేపథ్యంలో..  ఈ వేడుకకు   జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.  సొంత చెల్లెలు కుమార్తె వివాహ వేడుకకు మేనమామ హోదాలో జగన్   హాజరై ఆశీర్వదిస్తారా లేక ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ మోహన్ రెడ్డి వైఎస్ అనీల్ రెడ్డి ఇంటో వివాహ వేడకకు హాజరయ్యారు. ఏపీలో మునిసిపల్, పరిషత్ ఎన్నికల కారణంగా జగన్ పొలిటికల్ గా చాలా చాలా బీజీ అయినప్పటికీ, వెసులుబాటు చేసుకుని చెన్నై వెళ్లి మరీ ఆ వివాహానికి హాజరయ్యారు. మరి ఇప్పుడు సొంత చెల్లెలి కుమార్తె వివాహానికి హాజరౌతారా? లేక చెల్లెలితో ఉన్న విభేదాల కారణంగా ముఖం చాటేస్తారా అన్నది ఆసక్తిగా మారింది.   మీకు నచ్చవచ్చు:  యలహంక భూమి షర్మిలదే: కుండబద్దలు కొట్టిన విజయమ్మ: జగన్ కు షాక్.! ఎలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి: పేర్ని నానికెందుకు నొప్పి.? [Will   Jagan Attend YS Sharmila Daughter Wedding, Yelahanka Palace Controversy, YSR family Disputes, Anjili Reddy wedding, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Kamal Haasan has unveiled the title and first look of his upcoming action entertainer with director SU Arun Kumar. Titled Sandiyar, the film promises a high-octane action experience, with the announcement arriving as a special birthday and Diwali treat. The first-look poster presents Kamal Haasan in a fierce and intimidating avatar. Sporting a long beard and holding a gun, he is seen breaking a car window, with blood stains hinting at a violent action episode. The title Sandiyar aptly reflects the character's aggressive nature, while Kamal's commanding screen presence makes the first look particularly striking. The legendary actor has undergone a remarkable physical transformation for the role, sporting a lean, muscular and chiselled physique. His dedication to achieving such a frame at this stage of his career once again reflects his passion for reinventing himself. Also Read: Yash scores a hat-trick of Rs.100 crore openers Rockstar Anirudh Ravichander has been roped in to compose the music, adding further excitement to the project. Produced on a grand scale by Kamal Haasan's Raaj Kamal Films International (RKFI), along with Mahendran and Turmeric Media, Sandiyar brings together an exciting combination of talent. The powerful first look has already raised expectations for this action spectacle.   Check Out: Shocking: Bomb threat for Amitabh's Jalsa                      Scene Movie Review    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్‌గా వెలిగిన వారు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం చాలా అరుదు. ముఖ్యంగా సినిమాలకే పూర్తిగా గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చిన వారు మళ్లీ నటిస్తామంటే అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు సీఎం, దళపతి విజయ్ విషయంలోనూ ఇదే జరగబోతోందా? అంటే కోలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం అవుననే అంటోంది. తమిళ సినీ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. తన పూర్తి సమయాన్ని ప్రజాసేవకే కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ‘జన నాయగన్’ తన చివరి సినిమా అని ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో విజయాన్ని అందుకుని తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇకపై విజయ్‌ను వెండితెరపై చూసే అవకాశం ఉండదని అభిమానులు భావించారు. అయితే తాజాగా విజయ్ అభిమానులకు ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం రూపొందించనున్న ఓ ప్రత్యేక ప్రచార చిత్రంలో సీఎం విజయ్ స్వయంగా కనిపించబోతున్నారట. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యాడ్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ప్రచార చిత్రానికి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారట. ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్ ఏకంగా రెండు రోజుల కాల్షీట్ కూడా కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కూడా చదవండి: శ్రీలీలను టాలీవుడ్‌ పక్కన పెట్టింది.. కోలీవుడ్‌ నెత్తిన పెట్టుకుంటోంది.! సాధారణంగా ప్రభుత్వ ప్రకటనలు చాలా తక్కువ సమయంలో, పరిమిత బడ్జెట్‌తో రూపొందిస్తుంటారు. కానీ విజయ్ నటించనున్న ఈ యాడ్ ఫిల్మ్‌ను మాత్రం భారీ స్థాయిలో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రచార చిత్రం కాన్సెప్ట్ ఇంకా బయటకు రాలేదు. ఇక విజయ్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ గురించి చెప్పుకోవాలంటే.. గతంలో వీరిద్దరి కలయికలో ‘యోహాన్: అధ్యం ఒండ్రు’ అనే సినిమా రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. మీకు నచ్చవచ్చు: బాలయ్య ‘దాదా’ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.! ఒకే ఏడాది మూడు సినిమాలు.. సూర్యను చూసి మన స్టార్స్ మారతారా.?       [Tamil Nadu CM Vijay, Vijay Government Advertisement, CM Vijay Ad Shooting, Thalapathy Vijay, Gautham Vasudev Menon, Vijay Gautham Menon, Vijay Jana Nayagan, Telugu Film News]  
Yash has created a phenomenal box-office record with Ramayana, joining the elite league of Indian superstars like Rajinikanth and Prabhas. The actor has now delivered three consecutive films with worldwide opening-day grosses of over Rs.100 crore, establishing an unprecedented hat-trick at the Indian box office. After KGF: Chapter 2 and Toxic, Yash's latest outing Ramayana has continued his extraordinary opening streak with an estimated worldwide gross of Rs.155 crore+ on its first day. The film also collected over Rs.33 crore gross from the South Indian states alone, setting a new record for the biggest pre-Diwali opening in Indian cinema. The achievement further underlines Yash's remarkable journey from Kannada cinema to becoming one of India's biggest pan-India stars. His stronghold in the Hindi-speaking markets, coupled with his growing popularity across other languages, has made his theatrical appeal a nationwide phenomenon. Playing the ambitious Ravana in Ramayana, Yash has delivered a career-best performance, bringing tremendous intensity and authority to the mythological character. He is receiving high praises for his screen presence and destroyed all the negative impression of his Toxic film.  Also Read: Scene Movie Review The film also marks an important step in his journey as a producer, with Yash joining Namit Malhotra as a producing partner. With three successive mega-openers across different genres, Yash is strengthening his position as a star with both immense box-office pull and growing creative ambitions. Check Out: Mookuthi Amman 2 Movie Review                      Sai Durgha Tej engaged to Kiran   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Cast: Nayanthara, Urvashi, Regina Cassandra, Dhuniya Vijay, Ramachandra Raju, Abhinaya, Yogi Babu, Sneha, Khushbhu Sundar, Sunil Crew: Written by Sundar C, Venkat Raghavan Cinematography by Gopi Amarnath Editing by Fenny Oliver Music by Hiphop Tamizha Directed by Sundar C Produced by Sundar C, Ishari K. Ganeshan, Nayanthara, Vignesh Shivan, Khushbu Sundar Nayanthara has delivered a big hit with Mookuthi Amman, in the direction of RJ Balaji. The movie was inspired by Oh My God kind of films. Now, the sequel has been directed by Sundar C, who is known for his commerical formulaic films. Mookuthi Amman 2 released for Diwali festival and Regina Cassandra has played antagonist. Let's discuss about the movie in detail.  Plot:  Shakti (Nayanthara) is a lady cop in city, Vizag. She lives with her mother (Urvashi). At night, she keeps getting nightmares of big demons and war following her. She meets a fortune teller and she understands that she is goddess, herself. On the other hand, MLA's son (Duniya Vijay) gets arrested on purpose and he meets a tantric (Sunil). He tells him about a big astrological event, all planets aligning moment which happens once in 2000 years. He goes to village Mylanchi.  Shakti keeps getting summoned to Mylanchi and her life gets living hell with everything noting her to move to Mylanchi. She fights an entire gang of occult practioners who kidnap a girl for demonic sacrifice and saves her. She asks for official promotion to Mylanchi. There she is welcomed by Mantrika (Regina Cassandra), who has been awakened by Sunil. She is waiting for this moment from 2000 years. What is her connection with Shakti? Why did she living like a human when she is Mookuthi Amman? Watch the movie to know more.  Analysis:  Nayanthara is good and fits the Amman role, perfectly. She pulls off action sequences with ease and her screen presence is commendable. Regina Cassandra is also good and her screen presence is equally powerful. She does give her character a lot of grace in body language, while looking stunningly beautiful. But the writing undermines both of their characters.  In famous Sundar C style, the screenplay tries to be pacy and racy. But the content doesn't really excite or match the narrative. It feels like random stuff happening from start to end with no substantial stakes to talk about. We get several moments of Nayanthara being equated to Amman but none really land.  Duniya Vijay, Sunil and Ramachandra Raju are just cardboard caricatures with no real character. The progression of Shakti as the human to her divine form is not really written properly. If God wants to take human form to lead the life of the unborn that died because of her actions to mature or if it is just a convenient plot device, it is hard to pin point.  Sundar C tries to package the film with comedy, big action episodes, VFX led fights and there are loads of visual effects attempted. None of them look original as we see Mookuthi Amman wielding her trident like Thor's hammer and fights seem very routine and repetitive. The purpose for Amman accepting her mistake needed weightage for film to really standout but director doesn't make any use of it.  Khushbu Sundar and Sneha cameoes are wasted as they lack any impact. Production values are decent and the budget is visible. VFX work and cinematography are not outstanding or eyesore. Editing could have been better as several sequences appear random. Music by Hiphop Thamizha doesn't work at all. Overall, the movie tries to evoke God vs Devil fight and emotions but doesn't really deliver any sort of adrenaline rush or memorable moments.  Positives: Nayanthara's screen presence VFX work for the budget Production values  Negatives: Routine Story Disinteresting Screenplay Lack of solid drama moments Feels rushed  More or less tries to stick to cliches Bottomline: Old cliches work against this Amman film.  Rating: 2.25/5  Also Read: Scene Movie Review  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. తెలుగులో వరుస పరాజయాలతో కొత్త అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తున్నా.. కోలీవుడ్ మాత్రం ఈ బ్యూటీకి రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఏకంగా రజినీకాంత్, అజిత్, ధనుష్ వంటి ముగ్గురు స్టార్ నటుల సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ‘ధమాకా’ విజయంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాల్లో అవకాశాలు అందుకుంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. అయితే వరుసగా సినిమాలు చేసినా.. ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. దీంతో తెలుగులో ఆమె కొత్త సినిమాల జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. కానీ తమిళంలో మాత్రం శ్రీలీలకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే శివకార్తికేయన్‌తో ‘పరాశక్తి’ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు అక్కడి స్టార్ల సినిమాల్లో భాగమవుతోంది. ముందుగా ధనుష్‌తో ‘ఓం’ సినిమాలో నటిస్తోంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, మమ్ముట్టి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో శ్రీలీల ఒక మిడిల్ క్లాస్ గృహిణి పాత్రలో, ధనుష్ భార్యగా నటిస్తోంది. నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కూడా చదవండి: ఒకే ఏడాది మూడు సినిమాలు.. సూర్యను చూసి మన స్టార్స్ మారతారా.? ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలోనూ శ్రీలీలకు ఛాన్స్ దక్కింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ధర్మన్’లో ఆమె భాగమైంది. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే నయనతార, సిమ్రాన్, రాశీ ఖన్నా వంటి ప్రముఖ నటీమణులు ఇందులో ఉన్నారు. తాజాగా శ్రీలీలను కూడా ఆహ్వానిస్తూ మేకర్స్ అధికారికంగా గ్లింప్స్ విడుదల చేశారు. ఇక అజిత్ కుమార్‌తోనూ శ్రీలీల జతకట్టబోతోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘డేర్ డెవిల్’ సినిమాలో ఆమె నటించనుంది. నవంబర్ 2న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అజిత్ భార్య షాలిని తన బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇలా ఒకే సమయంలో ధనుష్, రజినీకాంత్, అజిత్ వంటి ముగ్గురు స్టార్ల సినిమాల్లో శ్రీలీల భాగం కావడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్‌గా మారనుంది. టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస అవకాశాలతో దూసుకుపోయిన శ్రీలీలకు ఇప్పుడు కొత్త సినిమాలు లేకపోవడం ఒకవైపు చర్చనీయాంశంగా మారితే.. మరోవైపు కోలీవుడ్‌లో ఇంతటి భారీ లైనప్ ఉండటం ఆసక్తి కలిగిస్తోంది.  మీకు నచ్చవచ్చు: మహాకాళి ‘అయిగిరి నందిని’ సాంగ్.. ఎనిమిది నిమిషాలు పూనకాలే.! ‘రాకా’ షాకింగ్ అప్డేట్.. 2025లో షూటింగ్ స్టార్ట్.. ఇంకా సగం కూడా పూర్తి కాలేదా.?       [Sreeleela Tamil Movies, Sreeleela Kollywood Lineup, Dhanush Om Movie, Rajinikanth Dharman Movie, Ajith Kumar Dare Devil, Sreeleela, Rajinikanth, Ajith, Dhanush]  
  -సినిమా పేరు: మహాశక్తి  న‌టీన‌టులు: నయనతార, రెజీనా, దునియా విజయ్, సునీల్, గరుడ రామ్, ఊర్వశి , యోగిబాబు తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: గోపి అమర్ నాధ్  -ఎడిటింగ్: ఫెన్నీ ఒలివర్   -మ్యూజిక్: హిప్ హాప్ తమిళ  -నిర్మాత‌లు: ఇసారి కె గణేష్, ఖుష్బూ సుందర్,  -బ్యానర్: వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ లిమిటెడ్   -రచన,దర్శకత్వం: సుందర్ సి  -రిలీజ్ డేట్ : నవంబర్ 6  2026  లేడీ సూపర్ స్టార్ నయనతార, అగ్ర దర్శకుడు సుందర్ కాంబోలో తెరకెక్కిన మహాశక్తి (తమిళ్ లో మూక్కుతి అమ్మన్ 2 )  ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2020 లో వచ్చిన హిట్ బొమ్మ అమ్మోరు తల్లి ( తమిళంలో ‘మూకుత్తి అమ్మన్‌’) కి  సీక్వెల్. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.  కథ  శక్తి( నయనతార) పోలీస్ హోమ్ గార్డ్. నెమ్మదస్తురాలితో పాటు చిన్నసైజు భయస్తురాలు.  నైట్ నిద్రపోయే సమయంలో చేతిలో కత్తితో గుర్రంపై ఒక వ్యక్తి వచ్చి 'మైలాంచి' అనే విలేజ్ రమ్మని ఆవేశపూరితమైన వాక్కుతో చెప్తుంటాడు.శక్తి పెంపుడు తల్లి బాలమ్మ( ఊర్వశి)కి కూడా ఆ విధంగా కనిపిస్తుండటంతో పాటు మాటలు వినిపిస్తూ ఉంటాయి. బైరా( రెజీనా కసాండ్రా) రెండువేల సంవత్సరాల క్రితం తనంతట తానుగా సజీవ సమాధి అవుతుంది. అలాంటి బైరా మళ్ళీ రెండు వేల సంవత్సరాలకి ఆశ్వయుజ మాసం, అష్టదశమి వేళ తొమ్మిది గ్రహాలు ఒకే కక్ష్యలోకి వచ్చే కొన్ని రోజుల ముందు పునరుజ్జీవం పొందుతుంది. శక్తిని అంతమొందించడానికి చూస్తుంటుంది. శక్తిని బైరా ఎందుకు టార్గెట్ చేసింది? రెండువేల సంవత్సరాల క్రితం సజీవ సమాధి అయ్యి మళ్ళీ ఇప్పుడు రావడానికి కారణం ఏంటి?  శక్తి ఎవరు?  శక్తి, బైరాకి మధ్య  ఏంటి సంబంధం? అసలు రెండువేల సంవత్సరాల క్రితం ఏం జరిగింది? దానికి ఇప్పుడు ఇచ్చిన ముగింపు ఏంటి అనేదే మహాశక్తి. ఎనాలసిస్  ఈ మధ్య కాలంలో ప్రస్తుత జనరేషన్ మెంటాలిటీకి  డివోషనల్ డ్రామా జోడించి  సినిమాలు రావడం చాలా తగ్గిపోయాయి. అలాంటి ఈ టైంలో  మేకర్స్  చాలా డేర్ గా మహాశక్తిని తెరకెక్కించారు. డైరెక్షన్, ఆర్ ఆర్, గ్రాఫిక్స్ విషయంలో సైతం భారీగా సక్సెస్ అయ్యారు. కాకపోతే అవసరం లేని చోట కూడా గ్రాఫిక్స్ ఉపయోగించడం కొంచం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. కాకపోతే గ్రాఫిక్స్ పై పెట్టిన శ్రద్ద కథనం విషయంలో చూపించలేదు. ఉదాహరణకి సినిమా స్టార్టింగ్ లో చాలా దేవాలయాల దగ్గర అనుకోని ప్రమాదాలు జరిగి భక్తులు చనిపోతున్నారని ఒక మహా పండితుడు బాధపడతాడు. ఆ తర్వాత తన రహస్య గ్రంధాల ద్వారా అదంతా ఒక సైతాన్ సృషించే విధ్వంసం అని తెలుసుకుంటాడు. ఈ పాయింట్ నే కథ ఆత్మగా చేసుకొని సెకండ్ హాఫ్ లో యాజ్ టిజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేది.ఆ విధంగా కాకుండా అనవసరమైన ట్రాక్ ని ఎక్కువగా తగిలించుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో మొదటి 15 నిముషాలు బాగానే ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన సీన్స్ అన్ని తేలిపోయాయి. భయాన్ని మైంటైన్ చేస్తూ ఉండే శక్తి(నయనతార) రహస్యాలని తెలుసుకోవాలని ఎలా అనుకుంటుంది. కాబట్టి శక్తిని దైర్యవంతురాలిగానే ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది. సునీల్, దునియా విజయ్ మధ్య వచ్చిన సీన్స్ తో పాటు క్షుద్రశక్తులు గల గరుడ రామ్ నరబలులు ఇస్తుండటం, తన కొడుకుని చంపినందుకు శక్తి పై పగ పెంచుకోవడం ఎపిసోడ్ కూడా బాగుంది. బైరా(రెజీనా) ఎంట్రీ సీన్ అయితే సూపర్.. మూవీపై ఇంట్రెస్ట్ కూడా కలిగించింది. కానీ ఆ తర్వాత వచ్చిన సీన్స్ రొటీన్ . యోగబాబు కామెడీ పేలలేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.సెకండ్ హాఫ్ లో చూసుకుంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది. కాకపోతే బైరా, ప్రస్తుత యువరాజు,కాబోయే రాజు(దునియా విజయ్) ట్రాక్ పెద్దగా సెట్ అవ్వలేదు. మహాశక్తి(నయనతార) అమ్మవారి ట్రాక్ ని కూడా బైరా ట్రాక్ కి సమానంగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది. పోరాట సన్నివేశాలు పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. పెళ్లి ఎపిసోడ్ వేస్ట్.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సైతం  సింపుల్ గా తేల్చిపడేసినట్టుగా ఉంది.  నటీనటులు సాంకేతిక నిపుణల పని తీరు  శక్తి , మహాశక్తి గా నయనతార మరో సారి తన పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేసింది. కాకపోతే శక్తి గా ఉన్నప్పుడు తన ఫేస్ మొత్తం డల్ గా కనిపించింది. అది కూడా నటనలో ఒక భాగమైతే అని మాత్రం అనుకోలేం. ఫేస్ లో డల్ నెస్ కనపడిందనేది మాత్రం పక్కా.బైరా( రెజీనా కాసాండ్రా) ఒక రేంజ్ పెర్ఫార్మ్ చేసింది. పలు రకాల క్యారక్టర్ లని సృష్టించుకునే పాన్ ఇండియా మేకర్స్ తమ పరిశీలనలోకి రెజీనా ని కూడా తీసుకుంటారు. అంతలా తన పెర్ఫార్మ్ తో మెస్మరైజ్ చేసి పడేసింది దునియా విజయ్ కూడా అంతే . మేకర్స్ పెట్టుకున్న నమ్మకానికి ఒకటికి పదింతలు న్యాయం చేసాడు   మిగతా క్యారెక్టర్స్ లలో చేసిన సునీల్, గరుడ రామ్ తో పాటు అందరూ తమ క్యారక్టర్ తగ్గ పెర్ఫార్మ్ చేశారు. హిప్ హాఫ్ తమిళ ఆర్ ఆర్ ఒక రేంజ్ లో ఉంది. సినిమాకి ప్రాణంగా కూడా నిలిచింది. ఫొటోగ్రఫీ కూడా అంతే . సూపర్.. దర్శకుడిగా సుందర్  ఎప్పటిలాగానే స్క్రిప్ట్ తో చెడుగుడు ఆడుకున్నాడు. గ్రాఫిక్స్ కి సంవత్సరాలకి సంవత్సరాలే పడుతున్న ఈ రోజుల్లో చాలా తక్కువ సమయంలోనే గ్రాఫిక్స్ తో కూడా షేక్ చేసి పడేసాడు. కథనం విషయంలో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయాడు. నిర్మాణ విలువలు తగ్గేదేలే అనే విధంగా ఉన్నాయి. బలాలు  1 . కథ  2 . డైరెక్షన్    3 . నయనతార, రెజీనా పెర్ఫార్మెన్స్  బలహీనతలు  1 . ఆకట్టుకొని కథనం చివరిగా చెప్పాలంటే డివోషనల్ చిత్రాలని ఇష్టపడే వాళ్ళకి 'మహాశక్తి' నచ్చవచ్చేమో. రేటింగ్ 2 .25 /5                                                                                                                       అరుణాచలం 
ఒక సినిమా కోసం రెండేళ్లు, మూడేళ్లు కేటాయించడం ఇప్పుడు స్టార్ హీరోలకు కామన్ అయిపోయింది. పాన్ ఇండియా సినిమా అనే పేరుతో షూటింగ్ మొదలుపెట్టిన దగ్గరి నుంచి రిలీజ్ వరకు చాలా సమయం తీసుకుంటున్నారు. కానీ కోలీవుడ్ స్టార్ సూర్య మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వెళ్తున్నారు. ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అది కూడా ఒకే తరహా కథలతో కాదు.. మూడు విభిన్న జానర్స్‌లో మూడు డిఫరెంట్ పాత్రలతో. 2026లో సూర్య నుంచి ఇప్పటికే ‘కరుప్పు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ‘సీన్’ సినిమాతో మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈ మూడు సినిమాలను గమనిస్తే సూర్య ఎంచుకున్న కథల్లో ఎంత వైవిధ్యం ఉందో అర్థమవుతుంది. ముందుగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘కరుప్పు’ విషయానికి వస్తే.. ఇది కమర్షియల్ ఫాంటసీ ఎంటర్‌టైనర్. ఫాంటసీ, భక్తి, సామాజిక అంశాలను కలిపి రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక రెండో సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ మూవీలో సూర్య ఒక మధ్యవయస్కుడైన వ్యక్తిగా కనిపించగా.. మమితా బైజు ఆయనకు జోడీగా నటించారు. ఏజ్ గ్యాప్ లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అంశాలతో తెరకెక్కిన ఈ న్యూ ఏజ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది కూడా చదవండి: సీన్ మూవీ రివ్యూ! ఇక ఇప్పుడు ‘సీన్’తో మరో కొత్త ప్రయోగం చేశారు సూర్య. మలయాళంలో ‘ఆవేశం’ వంటి విభిన్నమైన సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న జీతూ మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో సూర్య డీఎస్పీ ఇన్బరాజ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నజ్రియా నజీమ్, నస్లెన్ కీలక పాత్రలు పోషించారు. సీరియస్ క్రైమ్ చుట్టూ సాగే కథలో కామెడీని మిక్స్ చేస్తూ దర్శకుడు మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ఇలా ఒకే ఏడాదిలో ఫాంటసీ కమర్షియల్ ఎంటర్‌టైనర్, న్యూ ఏజ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ కామెడీ.. ఇలా మూడు విభిన్న జానర్స్‌లో సూర్య ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ఇక్కడే తెలుగు ప్రేక్షకులు మన స్టార్ హీరోల గురించి చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని మన స్టార్స్ ఒక్కో సినిమాకు రెండేళ్లు, మూడేళ్లు కేటాయిస్తున్నారు. భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌ల పేరుతో సినిమాల నిర్మాణ సమయం పెరిగిపోతోంది. దీంతో అభిమానులు తమ అభిమాన నటుడి సినిమాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. పాన్ ఇండియా సినిమా చేయడం తప్పు కాదు. భారీ స్థాయిలో సినిమాలు తెరకెక్కించడం కూడా అవసరమే. కానీ అదే సమయంలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ, వీలైనంత వేగంగా సినిమాలు చేస్తే బాగుంటుందని తెలుగు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సూర్య లాగా ఒకే ఏడాదిలో రెండు, మూడు సినిమాలు చేయకపోయినా.. కనీసం రెగ్యులర్‌గా సినిమాలు విడుదల చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరి సూర్య చూపిస్తున్న ఈ స్పీడ్, జానర్ వైవిధ్యాన్ని మన తెలుగు స్టార్స్ కూడా ఫాలో అవుతారా? లేక పాన్ ఇండియా ప్రాజెక్టులకే ఎక్కువ సమయం కేటాయిస్తారా? అన్నది చూడాలి. మీకు నచ్చవచ్చు: ‘రాకా’ షాకింగ్ అప్డేట్.. 2025లో షూటింగ్ స్టార్ట్.. ఇంకా సగం కూడా పూర్తి కాలేదా.? తొలి భారతీయ నటుడిగా విజయ్‌ సేతుపతి రికార్డు.. ఇంటర్నేషనల్‌ వేదికపై అరుదైన అవకాశం!       [Suriya Three Movies in One Year, Suriya 2026 Movies, Karuppu Movie, Vishwanath & Sons, Scene Movie, Telugu Star Heroes, Pan India Movies, Suriya Latest Movies, Telugu Film News]  
ఒక సినిమా షూటింగ్ మొదలైందంటే ఏడాది లోపే పూర్తవుతుందని అనుకుంటాం. కానీ కొన్ని సినిమాల విషయంలో మాత్రం అంచనాలు తలకిందులవుతున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్, హైటెక్నికల్ వర్క్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రాలకు ఎక్కువ సమయం పడుతోంది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ పరిస్థితి కూడా ఇలాగే ఉందా? అంటే ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా టాక్ అవుననే అంటోంది. ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో ‘రాకా’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ‘జవాన్’తో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ వందల కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను అంతర్జాతీయ స్థాయి విజువల్ స్పెక్టకిల్‌గా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ విషయంలో తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దాదాపు ఏడాదిన్నరగా షూటింగ్ జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు కేవలం 40 శాతం మాత్రమే చిత్రీకరణ పూర్తయిందని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దాదాపు రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ జరుగుతున్నా ఇంకా సగం కూడా పూర్తి కాలేదనే వార్త ఇప్పుడు బన్నీ అభిమానుల్లో చర్చకు దారితీస్తోంది. ఒకవేళ ఈ సమాచారం నిజమైతే.. మిగిలిన 60 శాతం షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ఆ తర్వాత భారీ స్థాయిలో చేయాల్సిన వీఎఫ్ఎక్స్ పనులకు మరికొంత సమయం అవసరం అవుతుంది. దీంతో ఇప్పటికే ప్రచారంలో ఉన్న 2027 రిలీజ్ ప్లాన్ సాధ్యమవుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చదవండి: మహేష్ మెచ్చిన రామాయణ.. వారణాసి రాముడు ఏమన్నాడంటే.? అయితే సినిమా ఆలస్యానికి అట్లీ ప్రత్యేకమైన విజన్ కూడా కారణమై ఉండొచ్చని అంటున్నారు. ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌ను అత్యంత జాగ్రత్తగా తెరకెక్కిస్తూ, విజువల్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ముంబైలో భారీ సెట్స్ నిర్మించి చిత్రీకరణ జరుపుతున్నారు. మరోవైపు అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. 37 మంది పెర్ఫార్మర్లను ఒకేసారి రియల్ టైమ్‌లో మోషన్ క్యాప్చర్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం ఈ సినిమా స్థాయిని తెలియజేస్తోంది. మొత్తానికి ‘రాకా’ విషయంలో అసలు ప్రశ్న ఒక్కటే. అట్లీ అనుకున్న విజువల్ వండర్‌ను తెరపైకి తీసుకురావడానికి ఇంత సమయం తీసుకుంటున్నారా? లేక షూటింగ్ షెడ్యూల్స్‌లో ఏమైనా మార్పులు జరిగాయా? అన్నది తెలియాల్సి ఉంది. సినిమా ఆలస్యమైనా పర్వాలేదు.. క్వాలిటీ విషయంలో మాత్రం తగ్గొద్దని బన్నీ అభిమానులు కోరుకుంటున్నారు. మీకు నచ్చవచ్చు: అమెరికాలో మెగాస్టార్.. కాకా ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే.? మహాకాళి 'అయిగిరి నందిని' సాంగ్.. ఎనిమిది నిమిషాలు పూనకాలే.!       [Raaka Shooting 40 Percent Complete, Allu Arjun Raaka Movie, Raaka Movie Shooting Update, Allu Arjun Atlee Movie, Allu Arjun, Atlee, Sun Pictures, Sai Abhyankkar, Telugu Film News]  
పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య, నటి రేణు దేశాయ్‌ మరోసారి తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పవన్‌ కల్యాణ్‌తో విడాకులు తీసుకొని 14 ఏళ్లు గడిచినా, ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా ఆయన మాజీ భార్యగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసాన్ని గుర్తు చేసుకుంటూ.. శ్రీరాముడి వనవాసం కూడా ముగిసింది, మరి తన వనవాసం ఎప్పుడు ముగుస్తుందని ప్రశ్నించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు ప్రేక్షకులు తనను కేవలం పవన్‌ కల్యాణ్‌తో పరిచయం ఉన్న వ్యక్తిగానే చూస్తున్నారని రేణు దేశాయ్‌ అన్నారు. ‘బద్రి’ సినిమా కోసం 1999లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడే తన జీవితం మొదలైందన్నట్లుగా కొందరు భావిస్తున్నారని, అంతకుముందు తనకంటూ ఓ జీవితం ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గతాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి కేవలం పవన్‌ కల్యాణ్‌తో ఉన్న సంబంధం ఆధారంగానే తనను గుర్తించడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. 14 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఈ వనవాసం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదని భావోద్వేగానికి గురయ్యారు. 2012లో పవన్‌ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత తాను ఖాళీగా ఉండలేదని, ఎన్నో పనులు చేశానని రేణు దేశాయ్‌ గుర్తు చేశారు. విడాకుల అనంతరం ఓ మరాఠీ సినిమాను నిర్మించానని, అది మంచి విజయాన్ని సాధించిందని తెలిపారు. ఆ తర్వాత మరో సినిమాకు కథ రాయడంతో పాటు నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టానని వెల్లడించారు. డ్యాన్స్‌ షోలకు పనిచేశానని, కవితలు రాశానని, ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తున్నానని చెప్పారు. ఇన్ని పనులు చేస్తున్న తనను ఎవరూ గుర్తించడం లేదన్నట్లుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. మరోవైపు సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్‌ గురించి కూడా రేణు దేశాయ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను జంతువులపై ప్రేమతో ఓ కుక్కను కాపాడినా కొందరు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ లేకపోతే తనకు జీవించే అర్హతే లేదన్నట్లుగా కొందరు కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిగా తనకంటూ ఓ జీవితం, ఇష్టాలు, అభిరుచులు ఉన్నాయని.. వాటిని గుర్తించకుండా ప్రతి విషయాన్నీ పవన్‌ కల్యాణ్‌తో ముడిపెట్టి మాట్లాడటం బాధిస్తోందని పేర్కొన్నారు. విడాకుల తర్వాత కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. ఇది కూడా చదవండి: తొలి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి రికార్డు.! ఇక రేణు దేశాయ్‌ సినీ ప్రయాణం విషయానికొస్తే.. తెలుగులోకి రాకముందు ముంబైలో మోడల్‌గా పనిచేశారు. ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొనడంతో పాటు 30కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించారు. ‘బ్రీత్‌లెస్‌’ మ్యూజిక్‌ వీడియోతోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ సరసన ‘బద్రి’ (2000) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘జానీ’ (2003) చిత్రంలోనూ నటించారు. ‘జానీ’ సినిమాకు ప్రొడక్షన్‌ డిజైనర్‌గా కూడా పనిచేశారు. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. పవన్‌ కల్యాణ్‌, రేణు దేశాయ్‌లకు ఇద్దరు పిల్లలు.. కుమారుడు అకీరా నందన్‌, కుమార్తె ఆద్య. విడాకుల తర్వాత కూడా రేణు తన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ, తన వృత్తిపరమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (2023) సినిమాతో మళ్లీ తెలుగు తెరపై కనిపించారు. జంతు సంరక్షణ కోసం ఓ సంస్థను నిర్వహిస్తూ వీధి కుక్కలు, పిల్లులకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఇన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇప్పటికీ తనను పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్యగానే చూడటంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మీకు నచ్చవచ్చు: డాక్టర్ను ఫ్లాట్‌కి పిలిచి దాడి.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్ వెనుక కథ.!     [Renu Desai, Renu Desai Emotional Comments, Renu Desai 14 Years Exile, Pawan Kalyan Ex Wife, Renu Desai Interview, Renu Desai Social Media Trolling, Renu Desai Divorce, Akira Nandan, Aadya, Renu Desai Latest News]
‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి చిత్రాలతో తనలోని విలక్షన నటుడ్ని అందరికీ పరిచయం చేసుకున్నాడు సరోజ్ కుమార్. ఆయన నటన, మేకింగ్, టేకింగ్ అంటే ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులకు ఎంతో ఇష్టం.  ప్రస్తుతం సరోజ్ మరో వినూత్న కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. సరోజ్ ప్రధాన పాత్రలో రానున్న నూతన చిత్రం ‘ఛప్రి’. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు.  BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. స్లమ్‌లో ఉండే ఓ కుర్రాడు.. అతడి ప్రేమ ప్రయాణం.. ఆ జర్నీలో కొంత మంది డబ్బున్న వ్యక్తులు ఎదురు పడటం, వారి వల్ల అతని జీవితం తలకిందులు అవ్వడం అనే ఆసక్తికరమైన పాయింట్స్‌తో ‘ఛప్రి’ మూవీని తెరకెక్కించారు. ప్రేమ చుట్టూ తిరిగే ఈ కథలో చివరకు ఏం జరుగుతుంది? అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అతని ప్రేమలో విజయం సాధిస్తాడా? లేదా? అన్నది ‘ఛప్రి’ మూల కథ.  ఇది కూడా చదవండి: హీరోయిన్‌గా కేజీఎఫ్‌ మదర్.. ఎమోషన్ నుంచి రొమాన్స్‌కి షిఫ్ట్.! ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని తాజాగా విడుదల చేశారు. ‘ఛప్రి’ ఫస్ట్ లుక్‌లో సరోజ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. స్లమ్ కుర్రాడిలా రా అండ్ రస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ని గమనిస్తుంటే ఫుల్ యాక్షన్ మోడ్‌లో హీరో కనిపిస్తున్నారు. తన మార్క్ రా స్టోరీలతో అలరించే సరోజ్ కుమార్.. ‘ఛప్రి’తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. మీకు నచ్చవచ్చు: మహాకాళి 'అయిగిరి నందిని'  సాంగ్.. ఎనిమిది నిమిషాలు పూనకాలే.! బాలయ్య ‘దాదా’ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.!       [Chapri Movie First Look, Bandi Saroj Kumar, Chapri Movie, Chapri First Look, Mangalyaṁ, Parakramam, Nirbandham, Telugu Movies, Telugu Film News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
అమ్మమ్మల కాలం నాటి అరుదైన వంటకాల రుచి ఎప్పటికీ ప్రత్యేకమే. అందులోనూ నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే పెసరపప్పు హల్వా పేరు వింటేనే నోట్లో నీళ్లుూరుతాయి. ఏ ప్రత్యేక సందర్భమైనా, పండగలైనా లేదా దేవునికి నైవేద్యం సమర్పించాలన్నా ఈ సంప్రదాయ తీపి వంటకం ఎప్పుడూ ముందుంటుంది. ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోగలిగే ఈ అద్భుతమైన స్వీట్ తయారీ విధానం మరియు దానికి కావలసిన కచ్చితమైన కొలతలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అద్భుతమైన హల్వా తయారీ కోసం ప్రధానంగా ఒక టీ గ్లాస్ పెసరపప్పు, నాలుగు గ్లాసులు నీళ్లు, అర గ్లాసు కంటే కొద్దిగా తక్కువ స్వచ్ఛమైన నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులు, ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండి, రెండు గ్లాసులు చక్కెర, నాలుగు దంచిన యాలకులు మరియు చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ అవసరమవుతాయి. ఈ ప్రాచీన రెసిపీ తయారీలో మొదటి దశగా, ఒక మందపాటి పాన్‌లో ఒక టీ గ్లాస్ పెసరపప్పును తీసుకొని చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. పప్పును ఇలా వేయించడం వల్ల హల్వాకు అద్భుతమైన రుచి, కమ్మటి వాసన వస్తాయి. అయితే పప్పు మాడిపోకుండా చిన్న మంటపై నిరంతరం కలుపుతూ వేయించడం చాలా ముఖ్యం. చక్కగా వేగిన తర్వాత వీటిని కుక్కర్‌లోకి తీసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఏ గ్లాసుతో పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాసుతో సరిగ్గా నాలుగు గ్లాసుల నీళ్లు పోయాలి. సాధారణంగా మూడు గ్లాసులు పోస్తే పప్పు ముద్దగా మారుతుంది కాబట్టి, హల్వా కాస్త పల్చగా, సాఫ్ట్‌గా రావడానికి అదనంగా మరొక గ్లాసు నీళ్లు కలుపుకోవడం చాలా ముఖ్యం. కుక్కర్‌కు మూత పెట్టి మధ్యస్థ మంటపై 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును బాగా ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి, ఉడికిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. కావాలనుకుంటే మిక్సీ జార్‌లో వేసి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా ఎనిపిన పప్పు మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసి, అవి బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే వేడి నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ గోధుమపిండి వేసి చిన్న మంటపై బాగా వేయించాలి. గోధుమపిండి రంగు మారి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవడం ద్వారా ఇది హల్వాకు అద్భుతమైన బైండింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. గోధుమపిండి సరిగ్గా వేగిన తర్వాత, ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని అందులో కలపాలి. మంటను చిన్న నుండి మీడియం స్థాయికి మార్చి, ఉండలు కట్టకుండా కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి పప్పు మిశ్రమం బాగా చిక్కబడుతుంది. మిశ్రమం చిక్కబడుతూ ఉన్న సమయంలో, మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అదనంగా వేసి బాగా కలపాలి. అడుగు అంటకుండా నిరంతరం గరిటెతో కలుపుతూ ఉండటం ఈ వంటకంలో అత్యంత కీలకమైన భాగం. హల్వా మరింత చిక్కబడిన తర్వాత, ఏ గ్లాసుతో పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాసుతో రెండు గ్లాసుల చక్కెరను వేసుకోవాలి. ఒకవేళ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కోరుకుంటే చక్కెర స్థానంలో బెల్లంతో కూడా ఈ హల్వాను ఎంతో రుచిగా చేసుకోవచ్చు. ఇది కూడా చదవండి:https://teluguone.com/news/content/nethi-bobbatlu-recipe-35-236219.html చక్కెర వేసిన తర్వాత మంటను తగ్గించి, చక్కెర పూర్తిగా కరిగి హల్వా దగ్గర పడే వరకు కలపాలి. చక్కెర కరిగిన తర్వాత మిశ్రమం కొద్దిగా పల్చబడినట్లు అనిపించినా, నిరంతరం కలుపుతూ ఉంటే మళ్ళీ చక్కగా చిక్కబడుతుంది. ఈ దశలో మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండాలి. హల్వా పూర్తిగా చిక్కబడిన తర్వాత, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. హల్వా మరింత గట్టిపడిన తర్వాత, మరొక టేబుల్ స్పూన్ నెయ్యి మరియు దంచిన నాలుగు యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ స్టేజ్‌లో నెయ్యి పాన్ అంచుల నుండి విడిపోవడం, హల్వా పాన్‌కు అంటుకోకుండా సులువుగా రావడం ప్రారంభమవుతుంది. ఇలా పాన్ నుండి విడివడుతున్నప్పుడే పెసరపప్పు హల్వా పూర్తిగా రెడీ అయినట్లు భావించాలి. వెంటనే స్టవ్ ఆపివేసి, ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులను అందులో వేసి బాగా కలపాలి. అంతే, ఎంతో సువాసన వెదజల్లే, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే అచ్చమైన అమ్మమ్మల కాలం నాటి పెసరపప్పు హల్వా సిద్ధమవుతుంది. దీన్ని వేడి వేడిగా లేదా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే కుటుంబసభ్యులందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ప్రత్యేక పండగ రోజుల్లోనూ, అతిథులు వచ్చినప్పుడు ఈ ట్రెడిషనల్ స్వీట్‌ను చేసి మీ ఇంట్లో అందరి ప్రశంసలను అందుకుని ఆనందించండి. మీకు నచ్చవచ్చు:https://teluguone.com/news/content/crispy-rice-flour-murukku-35-236136.html                                 https://teluguone.com/news/content/masala-vada-recipe-35-235245.html       Moong Dal Halwa Recipe, Traditional Indian Sweets, Authentic Yellow Lentil Halwa, Grandmothers Special Recipe, Festival Dessert Ideas, Buttery Sweet Recipes, Food Articles In Telugu.  
నాన్ వెజ్ ప్రియులు ఎప్పుడూ ఒకే రకమైన వంటకాలకు బదులుగా వైవిధ్యమైన రుచులను కోరుకుంటారు. సాధారణంగా ఎరుపు రంగు కారంతో చేసే కూరలకు భిన్నంగా, సరికొత్త పచ్చి కారం మరియు సువాసన వెదజల్లే పచ్చి మసాలాలతో తయారు చేసే గ్రీన్ మటన్ కర్రీ రుచి నూటికి నూరుపాటలు అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రత్యేకమైన కూరను రుచి చూస్తే ఎవరైనా మళ్లీ మళ్లీ కావాలని అడుగుతారు. ఈ అరుదైన మరియు కమ్మనైన రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రామాణికమైన గ్రీన్ మటన్ కర్రీ తయారీ కోసం ప్రధానంగా సరిగ్గా 1 కేజీ బరువున్న లేత మటన్ చాప్స్ లేదా బోన్ పీసెస్‌ను తీసుకోవాలి. దీనితో పాటు సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ ముక్కలు, అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కూర వేయించడానికి సరిగ్గా 4 టేబుల్ స్పూన్ల నూనె మరియు తగినంత నీరు ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలి. నాన్ వెజ్ వంటకాల్లో ఈ కొలతలు పక్కాగా ఉంటేనే కూర యొక్క అసలైన రుచి మరియు పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇక ఈ కూరకు ప్రత్యేకమైన సువాసనను తెచ్చే పచ్చి మసాలా పేస్ట్ తయారీ చాలా కీలకం. దీనికోసం ముక్కలుగా కోసిన 4 ఉల్లిపాయలు, పొట్టు తీసిన 3 వెల్లుల్లి గడ్డలు, 3 అంగుళాల అల్లం ముక్క, కారానికి తగినట్లుగా 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 5 నుంచి 6 లవంగాలు, 2 యాలకులు, అర కప్పు తాజా పచ్చి కొబ్బరి తురుము, గుప్పెడు తాజా కొత్తిమీర అలాగే ఒక గుప్పెడు తాజా పుదీనా ఆకులను సేకరించుకోవాలి. మొదటగా శుభ్రం చేసి పెట్టుకున్న 1 కేజీ మటన్ ముక్కలను గిన్నెలో వేసి, రుచికి సరిపడా ఉప్పు జోడించి అధిక మంటపై 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించాలి. ఇలా చేయడం వల్ల మటన్‌లోని సహజమైన నీరంతా బయటకు వస్తుంది. ఆ తర్వాత సరిగ్గా 1 గ్లాసు నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి మధ్యస్థ మంటపై సుమారు 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా చదవండి:https://teluguone.com/news/content/chinta-chiguru-royyala-curry-35-236222.html ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి మరియు నల్ల మిరియాలు వేసి పచ్చివాసన పూర్తిగా పోయే వరకు వేయించాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత దానిని మిక్సీ జార్‌లోకి మార్చుకుని, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తటి పచ్చని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చివరగా ఒక వెడల్పాటి మందపాటి పాత్రలో ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కలను ఆ నీటితో సహా వేయాలి. ఆపై మనం ముందుగా సిద్ధం చేసుకున్న గుమగుమలాడే తాజా గ్రీన్ మసాలా పేస్ట్‌ను ఇందులో కలిపి మంటపై బాగా ఉడికించుకోవాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత దించుకుంటే నోరూరించే అచ్చమైన గ్రీన్ మటన్ కర్రీ సిద్ధమవుతుంది. మీకు నచ్చవచ్చు:https://teluguone.com/news/content/nalla-kura-fry-35-236225.html                               https://teluguone.com/news/content/senagapappu-mutton-curry-35-235799.html     Green Mutton Curry, Hariyali Mutton Recipe, Green Masala Mutton, Non Veg Recipes, Traditional Cooking Guide, Mutton Gravy Dishes, Food Articles In Telugu.
దీపావళి పండుగ అనగానే వెలుగులు, బాణసంచా మరియు ఉత్సాహం ఉరకలేస్తాయి. కానీ చిన్న క్షణం నిర్లక్ష్యం మొత్తం ఆనందాన్ని వైద్య అత్యవసర పరిస్థితిగా మార్చేయవచ్చు. ముఖ్యంగా టపాసులు కాల్చేటప్పుడు వెలువడే మంటలు, నిప్పు రవ్వలు మరియు ప్రమాదకర రసాయన కణాలు కంటికి తగిలి తీవ్రమైన గాయాలవుతుంటాయి. మేరెంగో ఆసియా హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శిబాల్ భర్తియా ప్రకారం, ఈ ప్రమాదాలు కంటిలోని కార్నియా, లెన్స్ లేదా రెటినాపై తీవ్ర ప్రభావం చూపి કీరమైన దృష్టి లోపానికి దారితీసే అవకాశం ఉంది. టపాకాయ పేలుడు సంభవించినప్పుడు కేవలం ఒక నిప్పు రవ్వ మాత్రమే కాకుండా, తీవ్రమైన వేడి, పేలుడు తరంగాలు, ఎగసిపడే తునకలు మరియు రసాయన అవశేషాలు ఒకేసారి కంటిపై దాడి చేస్తాయి. కార్నియాపై గీతలు పడటం లేదా కాలిపోవడం వంటి సాధారణ సమస్యల నుంచి, కంటిలోపల రక్తస్రావం కావడం (హైఫేమా), ఐరిస్ చిట్లడం, లెన్స్ స్థానభ్రంశం చెందడం లేదా రెటినా దెబ్బతినడం వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. ఈ గాయాల వల్ల కంటి చూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. బయట కనిపించే చిన్న ఎరుపెక్కడం లేదా నొప్పి ఒక్కోసారి లోపలి తీవ్రతను పూర్తిగా బయటపెట్టవు. కొన్నిసార్లు రెటినా డిటాచ్‌మెంట్ వంటి సమస్యలు ప్రమాదం జరిగిన రోజుల లేదా వారాల తర్వాత బయటపడవచ్చు. అంతేకాకుండా, అంతర్గత నష్టం కారణంగా పెరిగే కంటి ఒత్తిడి నెలలు లేదా సంవత్సరాల తర్వాత కూడా సమస్యలను సృష్టించవచ్చు. అందువల్ల, కంటికి బలమైన దెబ్బ తగిలితే చూపు సాధారణంగా కనిపించినప్పటికీ తప్పనిసరిగా నేత్ర వైద్య పరీక్ష చేయించుకోవడం అత్యంత ముఖ్యం. టపాసులు కాల్చేవారే కాకుండా, చుట్టుపక్కల ఉండే ప్రేక్షకులు, బాల్కనీల నుండి వీక్షించే ఇటువంటవారు మరియు చిన్న పిల్లలు కూడా ఈ ప్రమాదాల బారిన పడుతున్నారు. రాకెట్లు మరియు చక్రాలు వంటి బాణసంచా ఊహించని దిశలో దూసుకురావడం వల్ల దూరం నుండి చూసేవారికి కూడా హాని కలుగుతుంది. పిల్లలు దీనిలోని ప్రమాదాలను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల వారు మరింత ఎక్కువగా ప్రభావితమవుతారు. ఇది కూడా చదవండి:https://teluguone.com/news/content/diwali-pollution-35-236362.html కంటికి గాయమైన వెంటనే తక్షణ వైద్య సహాయం తీసుకోవడం ద్వారా చూపును కాపాడుకునే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో కంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్దకూడదు లేదా నొక్కకూడదు. కంటిలో ఏదైనా ముక్క ఇరుక్కుంటే దాన్ని అలాగే ఉంచి అత్యవసర సహాయం కోరాలి. వైద్య సలహా లేకుండా ఎలాంటి ఐ డ్రాప్స్, నూనెలు లేదా కాటుక వంటి ఇంటి చిట్కాలను ఉపయోగించకూడదు. రసాయనాలు లేదా పొడి కంటిలో పడితే వెంటనే శుభ్రమైన పారే నీటితో కడగాలి. పెద్ద లేదా లోతైన గాయాలు సంభవించినట్లు భావిస్తే వెంటనే సమీపంలోని నేత్ర వైద్య అత్యవసర విభాగానికి చేరుకోవాలి. టపాసులు కాల్చేటప్పుడు రక్షణ కళ్లద్దాలు ధరించడం, వెలిగించిన టపాసుల దగ్గర వంగకపోవడం మరియు వెలగని టపాసులను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయకపోవడం ద్వారా ఈ ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు. మీకు నచ్చవచ్చు:https://teluguone.com/news/content/dhanteras-2026-shopping-35-236242.html                                 https://teluguone.com/news/content/dark-circles-remedy-35-236423.html       Diwali Eye Injury Safety, Cracker First Aid Tips, Fireworks Eye Care, Emergency Medical Precautions, Festival Safety Guide, Doctor Health Advice, Health Tips In Telugu.
మలబద్ధకం సమస్యతో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సరిగ్గా మలవిసర్జన కాకపోవడం, మలం గట్టిగా రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రోజువారీ జీవితాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలాంటి సమస్యలకు సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ మలబద్ధకం సమస్యకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరించారు. వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల వంటి సహజ పదార్థాల ఉపయోగాలు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వాటి పాత్ర గురించి తెలియజేశారు. మలబద్ధకం సమస్యకు కారణాలు ఏమిటి? పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? మలవిసర్జన సాఫీగా జరిగేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి? వాము, బెల్లం, కరక్కాయలను ఎలా ఉపయోగించాలి? మలబద్ధకం సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సహజమైన పద్ధతులతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య తరచూ వేధిస్తున్నా, తీవ్రమైన కడుపునొప్పి లేదా మలంలో రక్తం కనిపించినా వైద్యులను సంప్రదించడం అవసరం. మలబద్ధకం సమస్యకు ఆయుర్వేదంలో సూచించే సహజ పరిష్కారాలు, వాము, బెల్లం, కరక్కాయ పెచ్చుల ఉపయోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
నేటి కాలంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్లు మన దైనందిన జీవితంలో ప్రధాన భాగమైపోయాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు స్క్రీన్ వైపు చూడటం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా వాడకం, ఆఫీస్ పని లేదా వినోదం కోసం గంటల తరబడి డివైజ్‌ల ముందే గడపడం సర్వసాధారణం అయింది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమ్ ఎక్కువైతే దుష్పభావాలు ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే తాజాగా..  ఈ విషయం గురించి  వైద్య నిపుణులు , పరిశోధకులు చెబుతున్న విస్తుపోయే నిజాలేంటో వివరంగా తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల నేరుగా పక్షవాతం వస్తుందని చెప్పలేము. అయితే ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తూ గడపడం అనేది ఒక రకమైన నిశ్చల జీవన శైలితో ముడిపడి ఉంటుంది. ఈ విధంగా శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకే చోట కూర్చునే అలవాటు వల్ల క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా బరువు పెరగడం, హై బ్లడ్ ప్రెషర్, మధుమేహం , చెడు కొలెస్ట్రాల్  వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కూడా పక్షవాతం ముప్పును పెంచే ప్రధాన కారణాలలో ముఖ్యమైనవిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అమెరికన్ స్ట్రోక్  అసోసియేషన్  కు చెందిన జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అరవై  సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు శారీరక శ్రమ లేకుండా కేవలం కూర్చునే పనులలో  గడిపితే, వారిలో పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది నేరుగా స్క్రీన్ వల్ల జరిగే నష్టం కాకపోయినా, ఎక్కువ సమయం కదలకుండా కూర్చునే స్వభావం వల్ల కలిగే దుష్పరిణామం అని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి స్క్రీన్ చూసే గంటలను మాత్రమే లెక్కగట్టి ప్రమాదాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే రోజంతా కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి క్రమం తప్పకుండా వ్యాయాయం చేస్తుంటే, అస్సలు శారీరక శ్రమ లేని వ్యక్తితో పోలిస్తే అతనిలో ప్రమాదం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య ఏర్పడినప్పుడు అది రక్తపోటును , జీవక్రియలను నియంత్రించడం కష్టం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం , గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు అనేది పక్షవాతానికి దారితీసే అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి కాబట్టి, బీపీని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. యువత కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పక్షవాతం కేవలం వృద్ధులలోనే వస్తుందని అనుకోవడం  పొరపాటు. మారుతున్న జీవన శైలి కారణంగా నేడు యువతలో కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగరీత్యా లేదా చదువురీత్యా ఎప్పుడూ స్క్రీన్ ముందు పనిచేయాల్సిన వారు పూర్తిగా డివైజ్ లను పక్కన పెట్టడం సాధ్యం కాదు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. జాగ్రత్తలు.. రోజూ గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్న బ్రేక్ లు  తీసుకోవడం మంచిది. కుర్చీలోంచి లేచి కొద్దిసేపు నడవడం, ఫోన్ మాట్లాడేటప్పుడు గదిలో తిరగడం, అలాగే రోజూవారీ జీవితంలో తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెద్దలు ప్రతి వారం కనీసం నూట యాభై నిమిషాల పాటు ఏదైనా వ్యాయామం లేదా నడక వంటి శారీరక కార్యకలాపాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.  వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగత్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం , ప్రశాంతమైన నిద్ర  చాలా అవసరం. గుర్తుంచుకోవాల్సిన విషయం.. కేవలం స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల మాత్రమే పక్షవాతం రాకుండా నివారించలేము. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన వ్యాయామం ఇస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎవరికైనా ముఖం ఒకవైపు వంకరపోవడం, శరీరంలో అకస్మాత్తుగా బలహీనత రావడం, మాట తడబడటం, చూపు మందగించడం లేదా విపరీతమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.                                                                                                                                          *రూపశ్రీ*
వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు మనుషుల జీవన శైలిని , బాధ్యతలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పటివరకు కుటుంబ నియంత్రణ , గర్భనిరోధక బాధ్యతలు ఎక్కువగా మహిళల మీదే ఉంటూ వచ్చాయి. మార్కెట్లో లభించే వివిధ రకాల గర్భనిరోధక మాత్రలు లేదా పద్ధతులు అన్నీ మహిళల శారీరక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే. కానీ మారుతున్న కాలానికి తగినట్టుగా వైద్య శాస్త్రం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. తాజాగా పురుషుల కోసం ప్రత్యేకంగా గర్భనిరోధక మాత్రలను తీసుకువచ్చే దిశగా పరిశోధనలు జోరుగా సాగుతున్నాయి. ఈ కొత్త  ఆవిష్కరణ భవిష్యత్తులో గర్భనిరోధక పద్ధతులపై  చాలా అంచనాలు సృష్టిస్తోంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..  గర్బనిరోధక మాత్రలు.. సాధారణంగా మహిళలు వాడే గర్భనిరోధక మాత్రలు వారి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. దీనివల్ల వారిలో కొన్ని రకాల శారీరక మార్పులు లేదా దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది. కానీ పురుషుల కోసం తయారు చేస్తున్న ఈ సరికొత్త  మాత్రల ప్రత్యేకత ఏమిటంటే ఇవి ఎలాంటి హార్మోన్ మార్పులకు గురిచేయవు. కేవలం పురుషుల శరీరంలో ఉండే శుక్రకణాల కదలికలను మాత్రమే నేరుగా ప్రభావితం చేసేలా ఈ మందులను రూపొందిస్తున్నారు. మానవ శరీరంలో , పురుషుల వ్యవస్థలో ప్రత్యేకంగా ఉండే ఒక ఎంజైమ్ పై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. శుక్రకణాలు ముందుకు కదలడానికి , మహిళల అండం వరకు సులభంగా చేరుకోవడానికి ఈ ప్రత్యేక ఎంజైమ్ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా కనిపెడుతున్న  ఔషధం తీసుకున్నప్పుడు ఆ ఎంజైమ్ కొన్ని గంటల పాటు తాత్కాలికంగా నిలిచిపోతుంది. దీనివల్ల శుక్రకణాలు సాధారణ పద్ధతిలో ముందుకు కదలలేవు. ఫలితంగా అవి అండం వరకు చేరే సామర్థ్యాన్ని కోల్పోతాయి కాబట్టి  గర్భధారణ జరిగే అవకాశం చాలావరకు తగ్గిపోతుంది. పురుషుల కోసం కనిపెడుతున్న ఈ కొత్త  గర్భనిరోధక మాత్రల గురించి శాస్త్రవేత్తలు వెల్లడించిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే వీటిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా మింగాల్సిన అవసరం ఉండదు. శారీరక సంబంధానికి కేవలం ముప్పై నిమిషాల ముందు ఈ మాత్రను తీసుకుంటే సరిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి దశలో జరిపిన పరీక్షల ప్రకారం ఈ మందు ప్రభావం శరీరంలో కొన్ని గంటల పాటు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో జరిగే క్లినికల్ పరీక్షలు , పరిశోధనలు విజయవంతమైతే పురుషులు రోజూ ఎలాంటి మందులు వాడకుండా కేవలం అవసరమైనప్పుడు మాత్రమే వీటిని ఉపయోగించే వెసులుబాటు కలుగుతుంది. ఈ మాత్రలు తీసుకుంటే పురుషులలో శుక్రకణాల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుందా అని చాలా మందిలో ఒక  సందేహం కలుగుతుంది . అయితే ఈ మాత్రల ప్రధాన ఉద్దేశం పురుషులలో శుక్రకణాలు పుట్టకుండా చేయడం కాదు. కేవలం తాత్కాలికంగా వాటి కదలికలను నిలిపివేయడం లేదా మందగించడం మాత్రమే. ఈ  మాత్ర  ప్రభావం పూర్తిగా ముగిసిన తర్వాత శుక్రకణాలు నార్మల్ గా  తమ సాధారణ స్థితికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ మందు ప్రభావం పోయిన తర్వాత పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం పూర్తిగా సాధారణ స్థితికి వస్తుందా లేదా అనేదానిపై మరింత లోతైన పరీక్షలు అవసరం అంటున్నారు. ఈ కొత్త ఆవిష్కరణను ప్రస్తుతం జంతువులపై ప్రయోగించి పరిశీలిస్తున్నారు. మనుషులపై వీటిని వాడే ముందు వాటి భద్రత , సరైన మోతాదును నిర్ణయించడం  చాలా ముఖ్యం. ఏవైనా దుష్ప్రభావాలు వస్తాయా లేదా అని నిరంతరం పరిశీలించాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిశోధనలు అన్నీ విజయవంతమైతే భవిష్యత్తులో గర్భనిరోధక బాధ్యతలను కేవలం మహిళలు మాత్రమే కాకుండా  భాగస్వాములిద్దరూ సమానంగా పంచుకోవడానికి ఒక చక్కటి అవకాశం లభిస్తుంది. అయితే ఈ మాత్రలు కేవలం గర్భధారణను మాత్రమే నివారిస్తాయి కానీ ఎలాంటి లైంగిక  వ్యాధుల నుంచి రక్షణ ఇవ్వలేవని వైద్యులు స్పష్టం చేస్తున్నారు                             *రూపశ్రీ.