తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి  అన్నామలై కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఒక్కప్పుడు ప్రధాని మోడీకి అత్యంత విధేయుడు, కరడుగట్టిన బీజేపీ కార్యకర్త, అయిన అన్నామలై  బీజేపీకి గుడ్ బై చెప్పి..  వి ది లీడర్ అనే పేరుతో ఒక కొత్త స్వతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. అయితే సొంత కుంపటి పెట్టిన అన్నామలై ఇంత వరకూ కేంద్రంపై కానీ, కేంద్ర విధానాలపై కానీ ఘాటు విమర్శలు చేసిన సందర్భం లేదు. అటువంటి అన్నామలై, ఇప్పుడు..  ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా, అలాగే సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా సీజేపీ చేస్తున్న ఆందోళనకు బాహాటంగా మద్దతు పలికారు.   దేశవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశమవుతున్న ఎస్‌ఐఆర్  వివాదాలు, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీనామా డిమాండ్లు, అలాగే విపక్షాలు,  యువత చేపడుతున్న ఆందోళనలను కేంద్రం అణచివేయాలని చూడటాన్ని అన్నమలై తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి రాసిన సుదీర్ఘ లేఖలో  ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించిన పాత వ్యాఖ్యలను గుర్తుచేశారు. అప్పట్లో మోదీ చేసిన కామెంట్లను నేడు కేంద్ర ప్రభుత్వానికి అన్వయిస్తూ ఆయన పలు ప్రశ్నలు సంధించారు. మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జంతర్ మంతర్ ప్రాంతాన్ని నిరసనలకు అనర్హమైనదిగా ప్రకటించడం, నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారాలు వంటి అనేక కీలక అంశాలను ఆయన తన   లేఖలో ప్రస్తావించారు. కేవలం  వాట్సాపిజం ఎదురుదాడి ధోరణిని ప్రదర్శించకుండా, ప్రజలు లేవనెత్తుతున్న   ప్రశ్నలకు కేంద్రం సూటిగా సుత్తి లేకుండా సమాధానం ఇవ్వాలని అన్నామలై తన లేఖలో డిమాండ్ చేశారు.    సమస్యలకు వ్యతిరేకంగా వినిపిస్తున్న గొంతులను అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నామలై నిప్పులు చెరిగారు.    దసరా సందర్భంగా రావణ దహనంలో బొద్దింక దిష్టిబొమ్మను తగలబెట్టడం వంటి ఘటనలను సీజేపీకి ఉచిత ప్రచారం కల్పించడమేనని వ్యాఖ్యానించారు.  ఈ సందర్భంగా అన్నామలై కేంద్రంలోని మోడీ సర్కార్ ను నిలదీస్తూ కొన్ని ప్రశ్నలను సంధించారు.  సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.  ఇప్పటికే పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకతతో అసలే ఇబ్బందుల్లో ఉన్న బీజేపీకి, ఇప్పుడు నాటి మోడీ విధేయుడు సంధించిన ప్రశ్నాస్త్రాలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసినట్లైందనడంలో సందేహం లేదు.   [Annamalai Fires Center, Repression, Peoples Movement, BJP Central Government, Modi Old Comments, Tamil Nadu Politics, Annamalai We The Leader, Telugu One]
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో  భేటీ అయ్యారు. గురువారం (అక్టోబర్ 22) ఆయన   కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.   ఎన్నికల సంఘం 100 నియోజకవర్గాల్లో ఎన్నికలను నిలిపివేయడం, ఈ ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో  వీరిరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.  అంతేకాకుండా, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు, ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. అన్నిటికీ మించి   ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ రాజీనామా చేస్తారనీ, తెలుగుదేశం, జనసేన పొత్తు విచ్ఛిన్నం అంటూ సోషల్  మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మధ్య జరిగిన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ముఖ్యంగా బుధవారం (అక్టోబర్ 21) రాత్రి నుంచీ  సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పదవికి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయబోతున్నారని, తెలుగుదేశం పార్టీతో జనసేన తెగతెంపులు చేసుకోనుందంటూ కొందరు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీకి చెందిన కొన్ని సోషల్ మీడియా ఖాతాలలో కూడా ఈ వదంతు ప్రచారం అయ్యాయి.  దీంతో  ఈ ఊహాగానాలన్నింటికీ తెరదించుతూ పవన్ కళ్యాణ్ నేరుగా సీఎం నివాసానికి వెళ్లి ఎలాంటి భద్రత లేకుండా సమావేశం అయ్యారని అంటున్నారు.  కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన జనసేన, తెలుగుదేశం మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, రాష్ట్ర అభివృద్ధి,  ఎన్నికల వ్యూహాలపై ఇద్దరు నేతలు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని ఈ భేటీ మరోసారి చాటింది. ఎలాంటి ప్రోటోకాల్స్‌ను పాటించకుండా, అత్యంత సాధారణంగా పవన్ కళ్యాణ్  సీఎంను ఆయన అధికారిక నివాసానికి వెళ్లి కలవడం ఇరు పార్టీల మధ్యా ఉన్న సఖ్యత, సమన్వయాన్ని మరింత బలంగా చాటిందని పరిశీలకులు అంటున్నారు.    [Pawan Kalyan Meet  Chandrababu Naidu, AP Politics, Jana Sena TDP Alliance, Local Body Elections, Resign Rumours, Andhra Pradesh Politics, Telugu One]
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ'   చేపట్టిన ఉద్యమాన్ని అడ్డుకోవడానికి, లేదా అణచివేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ చేయగలిగినంతా చేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతలను అరెస్టు చేయడం, అలాగే మొదటి దశ నిరసనను అణచివేయడంలో కేంద్రం ఒకింత సక్సెస్ అయ్యింది కూడా. వరుస అరెస్టులు కేసులతో బొద్దింకల పార్టీ ఓ మెట్టు దిగి.. దీపావళి తరువాత వరకూ ఉద్యమానికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది కూడా. కానీ అంతలోనే మళ్లీ  శుక్రవారం (అక్టోబర్23) నిరసనకు పిలుపునిచ్చారు. అది పక్కన పెడితే.. కాక్రోచ్ ఉద్యమానికి పరకాల ప్రభాకర్ బహిరంగంగా మద్దతు తెలపడం ద్వారా కేంద్రానికి బిగ్ షాక్ ఇచ్చారు. ఇంతకీ ఈ పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.    కేంద్ర విత్త మంత్రి భర్త, ప్రముఖ ఆర్థిక వేత్త అయిన  పరకాల ప్రభాకర్, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 23న జరగనున్న బొద్దింకల నిరసనలో  పాల్గొంటానని ప్రకటించడం ద్వారా కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.  ఎన్నిక  అక్రమాలు, ఈవీఎం  నిర్వహణలో అవకతవకలపై పరకాల ప్రభాకర్ గత కొంతకాలంగా బహిరంగ విమర్శలు చేస్తున్న సంగతి విదితమే.  కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న నిర్మలా సీతారామన్ భర్తే  ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనడం కేంద్రానికి మింగుడుపడటం లేదు.    శుక్రవారం (అక్టోబర్ 23) జరగనున్న బొద్దింకల నిరసనలో కేంద్ర విత్త మంత్రి భర్త పరాకాల ప్రభాకర్‌తో పాటు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ తదితరులు  పాల్గొంటున్నారు.  అసలింతకీ సర్ విషయంలో పరకాల ప్రభాకర్ గత కొంత కాలంగా తన అభ్యంతరాలను బాహాటంగానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి అర్హుల పేర్లను కూడా తొలగిస్తున్నారంటూ ఆయన ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించారు.  ఓటర్ల జాబితాల్లో పేర్లు తొలగిన వారు  తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని కూడా ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.   ఈ నేపథ్యంలోనే ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఇప్పుడీ ఆందోళనలో ప్రత్యక్షంగా పొల్గొనేందుకు సిద్ధపడటం ద్వారా కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. పరకాల ప్రభాకర్ బొద్దింకల ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ప్రకటించడం విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు నిస్సందేహంగా ఇబ్బందికరంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అది పక్కన పెడితే.. విధానాల పరంగా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ ల అభిప్రాయాలు వేరు వేరు అన్న సంగతి గతంలో కూడా పలు సందర్భాలలో బయటపడింది. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలను గతంలో కూడా పరకాల ప్రభాకర్ పలు మార్లు విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై పలు మార్లు ఘాటు విమర్శలు చేశారు.  మరీ ముఖ్యంగా  ఆయన రచించిన ది క్రూకడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా ( The Crooked Timber of New India) పుస్తకంలోనూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనను బాహాటంగా మద్దతు ఇవ్వడం ద్వారా ఆయన కేంద్రానికి బిగ్ షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [Parakala Prabhakar Join CJP Protests, Union Minister Nirmala Sitharaman Husband, SIR Protest, Gyanesh Kumar,Resign Demand,  Shock, Center, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
హాలీవుడ్ చిత్ర సీమలోఒక శకం ముగిసింది. 'టాప్ గన్', 'ఏలియన్' వంటి ప్రపంచ ప్రఖ్యాత చిత్రాలతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసులని  గెలుచుకున్న లెజెండరీ నటుడు టామ్ స్కెరిట్ (Tom Skerritt)  కన్నుమూశారు.మొన్న 21న వృద్ధాప్య సహజ కారణాల వల్ల తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు, పబ్లిసిస్ట్ అధికారికంగా వెల్లడించారు.  ఈ అకస్మిక వార్త హాలీవుడ్ చిత్రసీమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అనేక దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో వెండితెరను ఏలిన ఒక గొప్ప నటుడి నిష్క్రమణ పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.   టామ్ స్కెరిట్ తన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో అసాధారణమైన మైలురాళ్లను దాటారు. ఆయన కెరీర్‌లో ఏకంగా 150కి పైగా చలనచిత్రాలు మరియు టెలివిజన్ ప్రొడక్షన్స్‌లో (over 150 on-screen credits)  కీ రోల్స్  పోషించి తిరుగులేని ముద్ర వేశారు.  ముఖ్యంగా 1979లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ మాస్టర్‌పీస్ 'ఏలియన్' చిత్రంలో ఆయన పోషించిన కెప్టెన్ ఆల్డస్ డల్లాస్ పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే 1986లో సూపర్ స్టార్ టామ్ క్రూజ్ సరసన ఆయన నటించిన 'టాప్ గన్' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు ఆయనకంటూ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.కేవలం సినిమాలలోనే కాకుండా టెలివిజన్ రంగంలోనూ టామ్ స్కెరిట్ తన సత్తా చాటుకున్నారు. 'పికెట్ ఫెన్సెస్' (Picket Fences) టెలివిజన్ డ్రామాలో ఆయన చేసిన అత్యుత్తమ నటనకు గాను ప్రతిష్టాత్మకమైన ఎమ్మీ (Emmy) అవార్డును సొంతం చేసుకున్నారు. తన కెరీర్‌లో రెండుసార్లు ఎమ్మీ నామినేషన్లు దక్కించుకోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం. 'మాష్' (MAS*H) వంటి క్లాసిక్ ప్రాజెక్ట్‌లలోనూ ఆయన చేసిన అద్భుతమైన అభినయం టెలివిజన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకుని బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.   ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, టామ్ స్కెరిట్ తన భార్య జూలీ టోకాశికితో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు మొత్తం ఐదుగురు సంతానం - ఆండీ, ఎరిన్, మాట్, కోలిన్ మరియు ఎమికో ఉన్నారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, ఆయనకు పలువురు మనమలు (సారా, మాడిసన్, సన్నీ, లూయిసా, జార్జియా) అలాగే ఇద్దరు మునిమనమలు (మారిగోల్డ్, రవి) ఉన్నారు. ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు. ఇది కూడా చదవండి: 418 Movie Review Telugu: 418 మూవీ రివ్యూ   "ప్రపంచం టోమ్‌ని ఒక గొప్ప నటుడిగా గుర్తిస్తే, మేము మాత్రం ఆయనలోని హాస్య చతురత, జిజ్ఞాస, విజ్ఞత మరియు మా జీవితాల్లోకి ఆయన తెచ్చిన అనంతమైన ప్రేమను చూశాము" అంటూ వారు పేర్కొన్నారు.సృజనాత్మకత, కథ చెప్పే కళ, సైనిక అనుభవజ్ఞుల సంక్షేమం మరియు తోటి వారికి సహాయం చేయడం పట్ల టామ్ స్కెరిట్ ఎప్పుడూ మక్కువ చూపేవారని కుటుంబీకులు గుర్తు చేసుకున్నారు. ఆయన వదిలి వెళ్లిన కళాఖండాలు, నటనలోని విలువలు రాబోయే తరాల నటులకు ఎప్పటికీ మార్గదర్శకం అవుతాయి. 93 ఏళ్ల సుదీర్ఘ జీవితంలో ఆయన కనబరిచిన అంకితభావం, కళాసేవ చిరస్మరణీయమైనవి. టామ్ స్కెరిట్ భౌతికకాయానికి సంబంధించిన స్మారక కార్యక్రమ వివరాలను త్వరలోనే కుటుంబ సభ్యులు వెల్లడించనున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పిస్తున్నారు. అయన వయసు 93 సంవత్సరాలు. డేట్ ఆఫ్ బర్త్ 1933 ఆగస్టు 25 .    [Tom Skerritt Passes Away, Tom Skerritt dead, Tom Skerritt actor, Top Gun star Tom Skerritt, Alien movie actor, Tom Skerritt age 93, Telugunews, TeluguCinema, Tollywood, Tollywood News]
నేచురల్ స్టార్ నాని, కయాదు లోహర్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమా ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఓటీటీలోకి వచ్చేసరికి సీన్ మారిపోయింది. టాక్ ఎలా ఉన్నా.. నాని స్టార్ పవర్ మాత్రం తగ్గలేదని ట్రెండింగ్‌లో సినిమా సాధిస్తున్న స్థానమే చెబుతోంది. నాని సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘ది ప్యారడైజ్’కు అనూహ్య స్పందన లభిస్తోంది. విడుదలైన కొద్ది సమయంలోనే ఇండియా వైడ్‌గా టాప్ ట్రెండింగ్‌లోకి రావడం ఆసక్తికరంగా మారింది. థియేటర్లలో సినిమాపై వచ్చిన చర్చలు, విమర్శలతో సంబంధం లేకుండా ఓటీటీలో ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నాని నటన, శ్రీకాంత్ ఓదెల టేకింగ్‌పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి కూడా ఈ ట్రెండింగ్‌కు ఒక కారణంగా కనిపిస్తోంది. మరి ఇండియా వైడ్‌గా నంబర్ వన్ ట్రెండింగ్‌లోకి వచ్చిన ‘ది ప్యారడైజ్’ ఇదే జోరును ఎన్ని రోజులు కొనసాగిస్తుంది? ఓటీటీలో ఈ సినిమా సాధించే ఆదరణ నాని మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: అక్క ట్రైలర్‌.. కీర్తి సురేశ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?.. మామూలు రచ్చ కాదు.!       [The Paradise Trending On Netflix, The Paradise OTT, The Paradise Netflix, Nani Paradise OTT, Nani Latest Movie, The Paradise, Natural Star Nani, Srikanth Odela, Kayadu Lohar, Telugu Film News]  
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు ‘ఫౌజీ’ చిత్ర బృందం సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదల చేసిన ఇంటెన్స్ పోస్టర్ ఆసక్తిని మరింత పెంచుతోంది. ‘హూ ఈజ్ హి?’ అనే ప్రశ్నతో విడుదలైన ఈ పోస్టర్ ఇప్పుడు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. ప్రభాస్‌ మిలటరీ అవతారాన్ని చూపిస్తూ రూపొందించిన ఈ పోస్టర్‌ వింటేజ్ డిజైన్‌తో ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. అగ్నికీలల మధ్య బంగారు నాణెంపై ప్రభాస్‌ సైడ్‌ ప్రొఫైల్‌ను పవర్‌ఫుల్‌గా చూపించారు. ‘ఫైల్ నంబర్ 25 డీక్లాసిఫై చేస్తున్నాం’, ‘ఒంటరిగా పోరాడే బెటాలియన్’, ‘1939 నుంచి మోస్ట్ వాంటెడ్’ వంటి క్యాప్షన్లు ఈ పోస్టర్‌లో ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రభాస్ పాత్ర వెనుక ఉన్న అసలు కథ ఏమిటనే ఉత్కంఠను ఇవి పెంచుతున్నాయి. ‘సీతారామం’తో క్లాసిక్ ప్రేమకథను తెరకెక్కించిన హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చరిత్రలో మరుగునపడిన ఓ సైనికుడి కథాంశంతో ఈ పీరియడ్ డ్రామా రూపొందుతోంది. ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని కొత్త పాత్రలో చూపించేందుకు దర్శకుడు ప్రయత్నిస్తున్నారు. ‘అతను ఎవరు?’ అనే ప్రశ్నకు సమాధానంగా విడుదల చేయనున్న క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.     [Prabhas Birthday, Fauji Movie, Prabhas Fauji Poster, Hanu Raghavapudi, Prabhas Military Look, Fauji Movie Update, Prabhas Upcoming Movies]
    -సినిమా పేరు: 418 -న‌టీన‌టులు: చైత్ర అచార్, ప్రీతీ పగడాలచరణ్ లక్కరాజు, సూర్య రాజ్, శశాంక్ పాటిల్, శ్రీ వైష్ణవ్  తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: దినేష్ దివాకరన్  -ఎడిటింగ్: అవినాష్  -మ్యూజిక్: వెంకీ జిజి -నిర్మాత‌లు:  యలమంచిలి రవి శంకర్, నవీన్ ఎర్నేని,   -బ్యానర్ :మైత్రి మూవీ మేకర్స్  -సమర్పణ: ప్రశాంత్ నీల్ -రచన,దర్శకత్వం: కీర్తన్ నాదగౌడ -రిలీజ్ డేట్ : అక్టోబర్ 23 , 2026  పాన్ ఇండియా బ్యానర్  మైత్రి మూవీ మేకర్స్, సలార్, డ్రాగన్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కలిసి ఈ రోజు 418 మూవీతో సెల్యులాయిడ్ పైకి వచ్చారు. పక్కా హర్రర్ థ్రిల్లర్. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.   కథ దట్టమైన అడవిని తలపించేటట్లుగా ఉండే 'వేదగిరి' అనే ఏరియాలో ఒక  మెడికల్ కాలేజీ.  ఆ కాలేజీ బాయ్స్ హాస్టల్ లో 418 రూమ్ నెంబర్ చాలా సంవత్సరాల నుంచి లాక్ చేసి ఉంటుంది. ఏ ఆడపిల్లైనా బాయ్స్ హాస్టల్ లోకి అడుగుపెట్టిందా, ఇక అంతే సంగతులు, 418 రూమ్ నెంబర్ లో ఉన్న అదృశ్య శక్తీ తన మృత్యు వేటని స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ  పదిమందిని అత్యంత దారుణంగా హతమార్చింది. పక్షులు సైతం తిండి గింజలు హాస్టల్ గేటు బయటనే తింటాయి కానీ లోపలకి వెళ్లవు. దీన్ని బట్టి 418 లో ఉన్న అదృశ్య శక్తీ ప్రభావం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.  418 లో ఉంది ఎవరు? ఆడవాళ్లు లోపలకి వస్తే ఎందుకు మృత్యు వేటని స్టార్ట్ చేస్తుంది? తనకి ఏమైనా కథ ఉందా? ఉంటే ఆ కథ మంచిదా? చెడ్డదా? మిగతా క్యారెక్టర్ల కథ ఏంటి? అసలు 418 లో ఉన్న అదృశ్య శక్తీ లక్ష్యం ఏమిటి? అది నెరవేరిందా? లేదా అనేదే 418 మూవీ . ఎనాలసిస్  కథగా చూసుకుంటే మొదటి నుంచి చివరి వరకు క్యూరియాసిటీ కలిగించే కథే. కానీ పరిమిత బడ్జెట్ ని మేకర్స్ ఎంచుకోవడం వల్ల 418 రేంజ్ కొంచం తగ్గింది. పైగా కీలకమైన సీన్స్ ని సింపుల్ గా తేల్చేసారు. ఉదాహరణకి  418 రూమ్ లో ఉన్న దుష్ట   దెబ్బకి భయపడే మెడికల్ కాలేజీ స్టూడెంట్  చాలా సింపుల్ గా కొన్ని క్లూస్ సంపాదిస్తాడు. అలా కాకుండా కొంచం టైం గ్యాప్ ఇచ్చి అనేక అవాంతరాల మధ్య కనుకున్నట్టుగా ఎస్టాబ్లిష్ చేసుండాల్సిందేమో. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన  ఇలాంటి లోపాలాన్ని సెకండ్ హాఫ్ బాగుండటంతో పెద్దగా ఇబ్బందిగా అనిపించవు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఎంట్రీ సీన్ లో జరిగే మారణకాండ కొంచం భయం కలిగిస్తుంది. దీంతో నెక్స్ట్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ కలుగుతుంది.అందుకు తగ్గటే స్టూడెంట్స్ వివేక్, రోహిత్ , సాషా,మ్యాగీ అండ్ మరో స్టూడెంట్ మధ్య వచ్చిన  సరదా, టెన్షన్  సీన్స్ బాగున్నాయి. కాకపోతే భయపడేది ఏమి ఉండదు. వివేక్, రోహిత్ ఆపోజిట్ కోణంలో ఆలోచిస్తారు కాబట్టి, ఆ ఇద్దర్ని,గదిలో ఉన్న అదృశ్య శక్తీ మధ్య టెన్షన్ తెప్పించే సీన్స్ సృష్టించాల్సింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో దేవిక సీన్స్ అన్ని సూపర్. ముఖ్యంగా ఒక బిడ్డకి జన్మనిచ్చి తల్లి అవ్వడం కోసం తాను తీసుకున్న నిర్ణయం తాలూకు సీన్స్ బాగున్నాయి. కానీ దేవిక కి వేరే ఛాయిస్ లేదు, బిడ్డ కావాలంటే తను చెప్పింది చేయాల్సిందే అని ఒక శక్తీ చెప్పే తీరుని మరింతగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. ఎందుకంటే టోటల్ కథకి ఆ నిర్ణయమే కీలకం కాబట్టి. చివరి ఇరవై నిముషాలు చాలా బాగుంది. క్లైమాక్స్ లో సాషా, దేవిక కి మధ్య ఇచ్చిన ట్విస్ట్ తాలూకు ఇంపాక్ట్ ని సాషా క్యారక్టర్ ఎంట్రీ దగ్గర నుంచే ఇస్తూ ఉండి ఉంటే 418 కి మరింతగా ప్లస్ అయ్యేది.      నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు: దేవిక గా చైత్ర అచార్ పలు పార్శ్యాలు ఉన్న షేడ్స్ లో అత్యద్భుతంగా పోషించింది. జాలిపడేలా , తిట్టుకునేలా, భయపడేలా ఇలా మూడు జోనర్స్ లో మెస్మరైజ్ చేసే పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో నో కాంప్రమైజ్.రోహిత్ గా చేసిన చరణ్ లక్కరాజు, వివేక్ గా చేసిన సూర్య రాజ్, సాషాగా చేసిన ప్రీతీ పగడాల మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. కీర్తన్ నాద గౌడ  దర్శకుడుగా సక్సెస్. రచయితగా ఒక మోస్తరుగా మెప్పించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ, మైత్రి మూవీ మేకర్స్  ప్రధాన బలం.   బలాలు 1 . కథ 2 . సెకండ్  హాఫ్  3 .నటీనటుల పెర్ఫార్మెన్స్  4 . డైరెక్షన్  బలహీనతలు  1 . పెద్దగా బయపెట్టకపోవడం  2 . కథనంలోని కొన్ని లోపాలు  చివరిగా చెప్పాలంటే 418 ఒక మోస్తరుగానే మెప్పించింది. రేటింగ్ 2 .5 /5                                                                                       అరుణాచలం  
Prabhas is back as Bhairava in Kalki 2. The makers have released a special behind-the-scenes video on the actor’s birthday, offering a glimpse of him on the sets of the sequel directed by Nag Ashwin. Bhairava emerged as one of the popular characters in Kalki 2898 AD, with Prabhas bringing a mix of humour, style and action to the role. The sequel is expected to continue his journey in the dystopian world, with audiences keen to see how his connection with Bujji and the larger Kalki universe unfolds. The birthday video shows Prabhas back in character against the backdrop of a specially constructed set. Although the glimpse does not reveal much about the film’s story, it offers an early look at the sequel’s production and builds anticipation for the next chapter. Amitabh Bachchan and Kamal Haasan are also returning as Ashwatthama and Supreme Yaskin, respectively. Produced by Vyjayanthi Movies, Kalki 2 will continue the story introduced in the first instalment, which combined mythology and science fiction. Further details about the film, including its release plans, are awaited. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Rukmini Vasanth has joined hands with Oke Oka Jeevitham director Shree Karthick for his next film. The actress will headline the yet-to-be-titled project, with Dev Ramnath and Vinay playing prominent roles. The makers unveiled an announcement glimpse titled Thara, introducing the project with a light-hearted tone. The video features Shree Karthick and his team receiving a call from the producers before meeting Rukmini Vasanth to narrate the story. Her enthusiastic response sets the tone for what the makers describe as a fun-filled road trip comedy. The glimpse also introduces a camera named Nikki, adding to the playful presentation. Shree Karthick earned recognition for Oke Oka Jeevitham, which blended science fiction with an emotional family drama. His collaboration with Rukmini Vasanth marks a new venture for the filmmaker, with the upcoming film expected to explore a different genre. Siruni Cine Corporation and Madboys Entertainment are jointly producing the project, with Saikrishna Gadwal serving as co-producer. Siruni Cine Corporation previously backed the National Award-winning film Chi La Sow, while Madboys Entertainment is expanding its presence in feature filmmaking. The makers are expected to announce the film's official title and further details soon. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
కీర్తి సురేశ్‌ను ఇప్పటివరకు ఎక్కువగా సాఫ్ట్‌ పాత్రల్లోనే చూశాం. కానీ ‘అక్క’ వెబ్ సిరీస్‌లో ఆమె లుక్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. చేతిలో తుపాకీ.. కళ్లలో కసి.. తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగించే మహిళగా కీర్తి కనిపిస్తున్నారు. మరోవైపు రాధికా ఆప్టే కూడా పవర్‌ఫుల్ పాత్రలో ఎదురుపడటంతో ట్రైలర్‌పై ఆసక్తి పెరిగింది. కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన ‘అక్క’ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. 1980ల నేపథ్యంలో, మహిళల ఆధిపత్యంలో నడిచే కల్పిత ప్రపంచం ‘పెర్నూరు’లో ఈ కథ సాగుతుంది. అక్కడి అధికార వ్యవస్థ, సంప్రదాయాలు, వారసత్వం చుట్టూ ఇద్దరు బలమైన మహిళల మధ్య ఏర్పడే పోరాటమే ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది. ఈ సిరీస్‌లో భవాని పాత్రలో కీర్తి సురేశ్ కనిపిస్తుండగా, రుద్ర పాత్రను రాధికా ఆప్టే పోషిస్తున్నారు. భవాని తన ఆధిపత్యాన్ని, తరతరాలుగా వస్తున్న వారసత్వాన్ని కాపాడుకోవాలని చూస్తుంది. అయితే బయటి నుంచి వచ్చే సవాలు ఆమె ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఈ నేపథ్యంలో భవాని, రుద్ర మధ్య మొదలయ్యే ఆధిపత్య పోరు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సాధారణ గ్యాంగ్‌స్టర్ కథలకు భిన్నంగా మహిళలే అధికార కేంద్రంగా ఉండే ప్రపంచాన్ని ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. అధికారం, కుటుంబం, విధేయత, ప్రతీకారం వంటి అంశాలు కథలో కీలకంగా కనిపిస్తున్నాయి. కీర్తి, రాధికా తొలిసారి కలిసి నటిస్తుండటం కూడా ఈ సిరీస్‌పై ఆసక్తిని పెంచుతోంది. ధర్మరాజ్ శెట్టి రచన, దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను యశ్ రాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. తనదైన ప్రపంచం, బలమైన మహిళా పాత్రలతో గ్యాంగ్‌స్టర్ జానర్‌ను కొత్త కోణంలో చూపించేందుకు ఈ సిరీస్‌ను రూపొందించారు. తన పాత్రలోని బలం, అంతర్గత సంఘర్షణలు భవానిని ప్రత్యేకంగా నిలబెడతాయని కీర్తి సురేశ్ కూడా పేర్కొన్నారు. ‘అక్క’ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్‌లోనే ఇద్దరి మధ్య పోరు తీవ్రంగా కనిపిస్తుండటంతో.. పూర్తి సిరీస్‌లో భవాని, రుద్రల మధ్య ఆధిపత్య పోరు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి. ఇది కూడా చదవండి: ప్రభాస్ బర్త్‌డే ట్రీట్.. ‘కల్కి 2’ స్పెషల్ వీడియో అదిరింది.!       [Keerthy Suresh Akka Trailer, Keerthy Suresh New Web Series, Keerthy Suresh VS Radhika Apte, Akka Trailer, Keerthy Suresh, Radhika Apte, Akka Netflix Series, Akka OTT Release Date, Telugu Film News]  
Prabhas' birthday celebrations brought a special reunion with director Prashanth Neel, renewing interest in their much-awaited collaboration, Salaar 2. A picture of the actor and filmmaker together has added to the anticipation surrounding the sequel. The Dino-mite duo previously teamed up for Salaar: Part 1 – Ceasefire, which emerged as a major box-office success. The film introduced Prabhas as Deva, a character whose imposing presence and violent world became central to the action drama. The film's ending left scope for the story to continue, making the sequel one of the most anticipated projects among fans. Their reunion on Prabhas' birthday has fuelled speculation about the next stage of Salaar 2. However, the meeting alone does not confirm when the sequel will go on floors or when its release plans will be announced. Produced by Hombale Films, Salaar 2 is expected to reunite the actor and director for another action-driven chapter in the franchise. Given the response to their first collaboration, expectations remain high for the sequel. Further updates on the film's production and schedule are awaited. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు మరో స్పెషల్ ట్రీట్ అందింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ ‘కల్కి 2’ నుంచి చిత్రబృందం ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల చేసింది. దీంతో భైరవను మరోసారి తెరపై చూడాలనుకుంటున్న అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.  ‘కల్కి 2898 ఏడీ’లో భైరవ పాత్రతో ప్రభాస్ ప్రేక్షకులను అలరించారు. భవిష్యత్తు ప్రపంచం, పురాణ నేపథ్యం, అత్యాధునిక సాంకేతికత కలగలిసిన ఈ కథకు సీక్వెల్‌గా ‘కల్కి 2’ రూపొందుతోంది. తాజా మేకింగ్ వీడియోలో ప్రభాస్ మరోసారి భైరవగా కనిపించి ఆకట్టుకున్నారు.  ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనతో మరో అద్భుతమైన సినీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చిత్రబృందం పేర్కొంది. ఈ వీడియోతో సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా సీక్వెల్‌లో తిరిగి కనిపించనున్నారు. ఇప్పటికే ‘కల్కి 2’ తదుపరి చిత్రీకరణ షెడ్యూల్‌కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. 2027 లో షూటింగ్ పూర్తి చేసి, 2028లో సినిమాను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. మొత్తానికి, ప్రభాస్ పుట్టినరోజున ‘కల్కి 2’ నుంచి వచ్చిన ఈ మేకింగ్ వీడియో అభిమానులకు ప్రత్యేక కానుకగా నిలిచింది. మరి భైరవ ఈసారి ఎలాంటి సాహసాలు చేయబోతున్నాడు? తొలి భాగాన్ని మించిన ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ ఎలా చూపించబోతున్నారు? అన్నది సినిమా నుంచి వచ్చే తదుపరి అప్‌డేట్స్‌తో తేలనుంది. ఇది కూడా చదవండి: ప్రభాస్ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. నంబర్ 1 ఏదో తెలుసా.? https://x.com/Kalki2898AD/status/2113458255221690735       [Prabhas Birthday Treat, Kalki 2 Making Video, Bhairava Is Back, Back, Prabhas Birthday, Happy Birthday Prabhas, HBD Prabhas, Kalki 2898 AD Sequel, Prabhas Kalki 2, Telugu Film News]  
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పటికే భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఏడీ 2’ వంటి సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ మరో కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పారంటే వార్త ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.  ‘మిరాయ్’ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని.. ప్రభాస్ కోసం ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే అవకాశం ఉందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027లో సినిమాను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని ‘ఈగల్’, ‘మిరాయ్’ సినిమాలతో తనదైన టెక్నికల్ మేకింగ్‌ను చూపించారు. ముఖ్యంగా ‘మిరాయ్’లో విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ప్రభాస్‌తో థ్రిల్లర్ సినిమా రూపొందిస్తే అది ఏ తరహాలో ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుంది? ఇప్పటికే ఉన్న సినిమాల షెడ్యూల్స్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే కార్తీక్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతుందని అంటున్నారు. ఇది కూడా చదవండి: ప్రభాస్ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. నంబర్ 1 ఏదో తెలుసా.?       [Prabhas New Movie, Prabhas Thriller Movie, Mirai Director, Karthik Gattamneni, People Media Factory, Prabhas Movies, Fauzi Movie, Spirit Movie, Kalki 2 Movie, Telugu Film News]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
దీపావళి, వివాహ వేడుకల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ అందంగా, ప్రకాశవంతంగా కనిపించాలని కోరుకుంటారు. ఈ ప్రత్యేక వేడుకల కోసం సిద్ధమయ్యే క్రమంలో చర్మానికి సరైన సంరక్షణ అందించడం చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పండుగలకు ముందు మెరిసే చర్మాన్ని పొందడానికి హైడ్రాఫేషియల్, కెమికల్ పీల్స్ మరియు లేజర్ ట్రీట్‌మెంట్లు అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతులు. అయితే, ఇవన్నీ వేర్వేరు పద్ధతుల్లో పనిచేస్తూ వివిధ చర్మ సమస్యలను పరిష్కరిస్తాయి. మీ చర్మం తత్వం, సమస్యలు, వైద్య చరిత్ర మరియు పండుగకు మీ దగ్గర ఉన్న సమయాన్ని బట్టి సరైన చికిత్సను ఎంచుకోవాలి. జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఏస్తెటిక్ డెర్మటాలజీ నివేదిక ప్రకారం, హైడ్రాఫేషియల్ అనేది క్లెన్సింగ్, ఎక్స్‌ఫోలియేషన్, ఎక్స్‌ట్రాక్షన్ మరియు హైడ్రేషన్‌లను మిళితం చేసే ఒక నాన్-ఇన్వాసివ్ చర్మ సంరక్షణ పద్ధతి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలు మరియు మలినాలను తొలగించడానికి ఒక ప్రత్యేకమైన పరికరాన్ని ఉపయోగిస్తుంది. డెర్మటాలజిస్ట్ డాక్టర్ అదితి వాధ్వా తెలిపిన వివరాల ప్రకారం, ఈ చికిత్స తక్కువ లేదా అసలు రికవరీ సమయం లేకుండా తక్షణ కాంతిని, తేమను మరియు నునుపైన చర్మాన్ని కోరుకునే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇది పండుగకు ముందు ఎలాంటి చికాకు లేకుండా తక్షణ మెరుపును ఇస్తుంది. మరోవైపు, కెమికల్ పీల్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి గ్లైకోలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ మరియు సాలిసిలిక్ యాసిడ్ వంటి జాగ్రత్తగా ఎంచుకున్న ఆమ్లాలను ఉపయోగిస్తాయి. ఇవి అసమాన చర్మపు రంగు, తేలికపాటి వర్ణద్రవ్యం, మొటిమలు మరియు గరుకైన చర్మ ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే, భారతీయ చర్మ తత్వాలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాలి; ఎందుకంటే సరైన పీల్ ఎంచుకోకపోతే లేదా అనంతర సంరక్షణ లోపిస్తే హైపర్‌పిగ్మెంటేషన్ సమస్య రావచ్చు. అందువల్ల ఈ పద్ధతిని నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. జర్నల్ ఆఫ్ లేజర్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నివేదిక ప్రకారం, లేజర్ చికిత్సలు నిర్దిష్ట చర్మ సమస్యలను నేరుగా లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రీకృత కాంతి శక్తిని ఉపయోగిస్తాయి. ఇవి మొటిమల మచ్చలు, మొండి పిగ్మెంటేషన్, వృద్ధాప్య సంకేతాలు మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే లేజర్ చికిత్సలకు ఎక్కువ ముందస్తు ప్రణాళిక అవసరం, ఎందుకంటే ఎరుపు, వాపు లేదా పొరలు ఊడిపోవడం వంటి లక్షణాలు ఉండవచ్చు మరియు మెరుగైన ఫలితాల కోసం బహుళ సెషన్లు అవసరమవుతాయి. కాబట్టి పండుగకు ముందే నిపుణులను సంప్రదించడం మంచిది.     Hydrafacial Vs Chemical Peel Vs Laser, Best Skin Treatment For Glow, Festive Skincare Routine, Dermatology Treatments For Face, Hydrafacial Benefits, Chemical Peel For Glowing Skin, Laser Skin Rejuvenation.
ఇంట్లో పండగలు వచ్చినా, ప్రత్యేక వేడుకలు జరిగినా లేదా దేవుడికి నైవేద్యం సమర్పించాలన్నా ముందుగా గుర్తుకు వచ్చే అద్భుతమైన పిండివంటకం జ్యూసీ జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూ. ఈ రుచికరమైన మిఠాయిని ఎంతో సులభంగా, పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రెసిపీలో చెప్పిన కొలతల ప్రకారం తయారు చేస్తే సుమారు 30 నుంచి 32 గుండ్రని, రుచికరమైన లడ్డూలు తయారవుతాయి. ఈ రెసిపీ తయారీకి కావలసిన పదార్థాలను పరిశీలిస్తే: ప్రధాన పదార్థమైన బొంబాయి రవ్వ 2 కప్పులు, నెయ్యి పావు కప్పుతో పాటు అదనంగా మరో 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 10, కిస్మిస్ 10, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు (లేదా దీనికి బదులుగా ఎండు కొబ్బరి పొడిని కూడా వాడవచ్చు), పంచదార సుమారు 1.75 కప్పులు (అంటే దాదాపు అర కిలో), యాలకులు 10, అలాగే మిశ్రమం కలపడానికి తగినన్ని గోరువెచ్చటి పాలు అవసరమవుతాయి. ముందుగా స్టవ్ మీద మందపాటి అడుగు గల, వెడల్పాటి పాన్‌ను పెట్టి అందులో పావు కప్పు నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక, ముందుగా సిద్ధం చేసుకున్న 10 జీడిపప్పులు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత, 10 కిస్మిస్‌లను కూడా వేసి అవి బాగా ఉబ్బే వరకు వేయించి, నెయ్యి లేకుండా ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లోని మిగిలిన నెయ్యిలో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకోవాలి. రవ్వ అడుగు మాడిపోకుండా ఉండటానికి మందపాటి పాన్ ఎంతగానో సహాయపడుతుంది. తక్కువ మంటపై రవ్వ నుంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు, రంగు కొద్దిగా మారేంత వరకు నిరంతరం కలుపుతూ వేయించాలి. రవ్వ చక్కగా వేగడానికి కొంత సమయం పడుతుంది, కానీ ఇది లడ్డూల టేస్ట్‌కి అత్యంత ముఖ్యం. రవ్వ బాగా వేగిన తర్వాత దానిని ఒక పెద్ద పళ్ళెంలోకి మార్చుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే పాన్‌ను ఉపయోగించి, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేయించాలి. తక్కువ మంటపై కొబ్బరిలోని తేమ పూర్తిగా తగ్గి, పొడిపొడిలాడేంత వరకు వేయించాలి. ఆ తరువాత, మరో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, కొబ్బరి ఎర్రగా మారుuntil వేయించాలి. ఇలా వేయించిన కొబ్బరి లడ్డూలకు మంచి సువాసనను, ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణాన్ని ఇస్తుంది. ఈ వేయించిన కొబ్బరిని కూడా రవ్వ ఉన్న పళ్ళెంలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో 1.75 కప్పుల పంచదార, 10 యాలకులు వేసి, మరీ మెత్తని పౌడర్‌లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పంచదార పొడిని రవ్వ, కొబ్బరి మిశ్రమంలో కలపాలి. స్పూన్‌తో కాకుండా చేతితో కలిపితే అన్ని పదార్థాలు చక్కగా కలిసిపోతాయి. బాగా రబ్ చేస్తూ మిశ్రమం ఒకేలా తయారయ్యేలా కలపాలి. ఇప్పుడు గోరువెచ్చటి పాలను కొద్దికొద్దిగా పోసుకుంటూ మిశ్రమాన్ని కలుపుకోవాలి. పాలు మరీ వేడిగా లేదా చల్లగా ఉండకూడదు. మొత్తం పాలు ఒకేసారి పోయకుండా, మిశ్రమం ముద్దగా అయ్యేలా చూసుకుంటూ సుమారు అర గ్లాసు పాలను తీసుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ఒక పళ్ళెంలో పెట్టి, పైన కొద్దిగా అదిమి, 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల రవ్వ పాలను పీల్చుకొని మరింత జ్యూసీగా మారుతుంది. 15 నిమిషాల తర్వాత, నానిన రవ్వ మిశ్రమాన్ని ఒకసారి మళ్ళీ బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లను కలపాలి. కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ చేతితో గట్టిగా నొక్కుతూ లడ్డూలుగా చుట్టుకోవాలి. పైన అలంకరణ కోసం ఒకటి రెండు జీడిపప్పులు, కిస్మిస్‌లు పెట్టి కొంచెం గట్టిగా నొక్కితే ఊడిపోకుండా ఉంటాయి. ఇలా మొత్తం మిశ్రమాన్ని ఎంతో రుచికరమైన లడ్డూలుగా చుట్టుకుంటే, నోట్లో వేస్తే కరిగిపోయే కమ్మటి రవ్వ లడ్డూలు సిద్ధమవుతాయి.     Juicy Rava Laddu, Sooji Ladoo Recipe, Rava Laddu with Perfect Measurements, Indian Festival Sweets, Easy Semolina Laddu, Traditional Sweet Recipes, Homemade Rava Laddu.  
ఇంట్లో పాలు కాచే సమయంలో కొన్నిసార్లు పాలు విరిగిపోతుండటం సర్వసాధారణం. అలా విరిగిన పాలను చూసి చాలామంది వాటిని వృథాగా పారేస్తుంటారు లేదా ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. కానీ, ఆ విరిగిన పాల మీగడతో కూడా ఎంతో రుచికరమైన, స్వచ్ఛమైన దేశీ నెయ్యిని అత్యంత సులభంగా తయారు చేసుకోవచ్చనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది. దీనికోసం ఎటువంటి ఖరీదైన వస్తువులు లేదా ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదు. ముందుగా మీరు సేకరించిన తగినంత మీగడను తీసుకుని, అది గడ్డకట్టేలా లేదా పెరుగు రూపంలోకి మారేలా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ పెరుగును ఒక మీడియం సైజు గిన్నెలోకి తీసుకుని, తగినన్ని నీటిని కలుపుతూ మజ్జిగ కవ్వంతో లేదా బ్లెండర్ సహాయంతో బాగా గిలకొట్టాలి. కొద్దిసేపటి తర్వాత పెరుగు నుంచి వెన్న వేరుపడటం గమనించవచ్చు. ఈ ప్రక్రియలో అడుగున మజ్జిగ మొత్తం పూర్తిగా ద్రవ రూపంలోకి మారుతుంది, పైకి తేలిన స్వచ్ఛమైన వెన్నను ఒక శుభ్రమైన స్పూన్ సహాయంతో జాగ్రత్తగా వేరు చేసి మరో పాత్రలోకి మార్చుకోవాలి. వెన్నకు అంటుకుని ఉన్న మిగిలిన మజ్జిగను పూర్తిగా తొలగించడానికి, దానిని స్వచ్ఛమైన నీటితో ఒకటి రెండు సార్లు సున్నితంగా కడగాలి. ఇలా చేయడం వల్ల నెయ్యి తయారీకి అసలైన వెన్న చక్కగా సిద్ధమవుతుంది. ఆ తరువాత ఒక చిన్న పాన్ లేదా గిన్నెను స్టవ్ మీద పెట్టి, మీడియం మంటపై ఈ వెన్నను వేడి చేయాలి. మంటను ఎప్పుడూ మితంగా ఉంచాలి, ఎందుకంటే మంట ఎక్కువగా ఉంటే వెన్న త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. వెన్న క్రమంగా కరుగుతూ చిన్న చిన్న బుడగలు మంచిగా ఏర్పడతాయి. ఈ సమయంలో అడుగు అంటకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి. క్రమంగా వెన్నలోని తేమ మరియు నీరు మొత్తం ఆవిరైపోయి, స్వచ్ఛమైన నెయ్యి స్పష్టంగా బంగారు రంగులో కనిపిస్తుంది. అప్పుడు మంచి సువాసన వెలువడిన వెంటనే గ్యాస్‌ను ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఈ నెయ్యిని గది ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత, ఏ మాత్రం తడి లేని శుభ్రమైన సన్నని జల్లెడ లేదా కాటన్ వస్త్రం ద్వారా దీనిని వడకట్టి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నిల్వ ప్రక్రియలో నెయ్యిలో కొద్దిగా కూడా నీరు చేరకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ తడి చెంచాలను దీనిలో ఉపయోగించకూడదు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే, మీరు ఇంట్లోనే తయారు చేసుకున్న స్వచ్ఛమైన దేశీ నెయ్యి నెలల తరబడి పాడవకుండా తాజాగానే ఉంటుంది.     Make Ghee From Spoiled Milk, Desi Ghee From Sour Milk, Curdled Milk Malai Hack, Homemade Pure Ghee Recipe, Kitchen Tips And Hacks, Reuse Spoiled Milk Ideas, Traditional Ghee Making.  
ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో ధనియాల నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? రోజూ నీళ్లు తాగే విషయంలో మనం చేసే పొరపాట్లు ఏమిటి? భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగవచ్చా? నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఆయుర్వేదం నీటిని తాగే విధానం గురించి ఏం చెబుతోంది? ఇలాంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఈ TeluguOne Health వీడియోలో సీనియర్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష నీటి ప్రాముఖ్యత, నీళ్లు తాగే సరైన పద్ధతులు, ఉదయం నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, ధనియాల నీటి వినియోగం గురించి వివరిస్తున్నారు. అలాగే భోజనం చేసే సమయంలో నీళ్లు తాగడం మంచిదా కాదా, జీర్ణక్రియకు సంబంధించి ఉన్న అపోహలు ఎంతవరకు నిజం, ఆయుర్వేదంలో చెప్పే ఫాంట (Phanta) తయారీ విధానం వంటి ఆసక్తికరమైన విషయాలను వివరిస్తారు. మన శరీరానికి నీరు ఎంతో అవసరం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, పోషకాలు శరీరంలోని వివిధ భాగాలకు చేరడం, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లడం వంటి అనేక ముఖ్యమైన పనులకు నీరు సహాయపడుతుంది. అయితే నీటిని ఎప్పుడు తాగాలి, ఎంత తాగాలి, భోజనానికి ముందు లేదా తర్వాత తాగాలా అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. ఈ విషయాలపై సరైన అవగాహన కలిగి ఉండటం ఆరోగ్యకరమైన జీవనశైలికి ఉపయోగపడుతుంది. ధనియాలను నీటిలో నానబెట్టి లేదా తగిన విధంగా తయారుచేసి తీసుకునే పద్ధతుల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ధనియాల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది? దానిని ఎలా తయారుచేసుకోవాలి? నీటిని తాగే విషయంలో పాటించాల్సిన పద్ధతులు ఏమిటి? అనే అంశాలపై డాక్టర్ శిరీష వివరణను తెలుసుకోండి. అలాగే ఆయుర్వేదంలో ఫాంట (Phanta) అని పిలిచే మూలికా పానీయాన్ని ఎలా తయారుచేస్తారు, దాని తయారీలో పాటించాల్సిన విధానం ఏమిటి అనే విషయాలను తెలుసుకోవచ్చు. జీర్ణక్రియకు సంబంధించిన అపోహలను తొలగించుకోవడానికి, రోజువారీ నీటి వినియోగంపై అవగాహన పెంచుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి, వయస్సు, శారీరక శ్రమను బట్టి నీటి అవసరాలు మారవచ్చు. కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యల కారణంగా నీటి పరిమాణంపై పరిమితులు ఉన్నవారు వైద్యుల సూచనలను పాటించాలి. ధనియాల నీటిని ఏదైనా వ్యాధికి నిర్ధారిత చికిత్సగా భావించకూడదు. ధనియాల నీటిని తాగే పద్ధతి, నీటి ప్రాముఖ్యత, భోజన సమయంలో నీళ్లు తాగడం, జీర్ణక్రియపై అపోహలు, ఆయుర్వేద ఫాంట తయారీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి.  
ఇయర్ బడ్స్ పెట్టుకుని రాత్రిళ్లు నిద్రపోయే అలవాటుందా.. ఈ నిజాలు తెలుసుకోండి..! ఈరోజుల్లో చాలామందికి రాత్రి పడుకునే ముందు ప్రశాంతంగా నిద్ర పట్టడం కోసం ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు, భజనలు లేదా పాడ్‌కాస్ట్‌లు వినే అలవాటు ఉంటుంది. ఈ చిన్న అలవాటు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి అంతా లేదా ఎక్కువ సమయం పాటు ఇయర్ బడ్స్ ధరించి పడుకోవడం వల్ల  చెవుల ఆరోగ్యానికి ఎంతో హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఈ చిన్న అలవాటు వల్ల భవిష్యత్తులో చెవులకు సంబంధించి పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. రాత్రి సమయంలో ఇయర్ బడ్స్ పెట్టుకుని పడుకోవడం వల్ల మన చెవుల్లో రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా నిద్రలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు లేదా  బోర్లా పడుకున్నప్పుడు దిండుకు ఇయర్ బడ్స్‌కు మధ్య పడే ఒత్తిడి కారణంగా చెవి భాగంలో తీవ్రమైన నొప్పి, చికాకు లేదా మంట పుట్టే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రోజూ జరగడం వల్ల చెవి చుట్టూ ఉన్న సున్నితమైన చర్మం దెబ్బతింటుంది , నొప్పి మరింత పెరుగుతుంది. ఇయర్ బడ్స్ చెవి రంధ్రంలో బిగుతుగా ఉండటం వల్ల చెవి లోపలికి గాలి సరిగ్గా వెళ్లకుండా అడ్డుపడుతుంది. దీనివల్ల చెవిలో తేమ , చెమట పేరుకుపోయి బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది చెవిలో ఇన్‌ఫెక్షన్లు రావడానికి ప్రధాన కారణం అవుతుంది. కొందరు ఇయర్ బడ్స్‌ను శుభ్రం చేయకుండా వాడటం లేదా ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. చెవుల్లో దురద, వాపు లేదా ఒక రకమైన ద్రవం కారడం వంటి లక్షణాలు కనిపిస్తే అది ఇన్‌ఫెక్షన్‌గా గుర్తించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. రాత్రి మొత్తం ఇయర్ బడ్స్ ద్వారా పెద్ద శబ్దాలతో మ్యూజిక్ వినడం వల్ల మన వినికిడి శక్తి క్రమంగా మందగించే ప్రమాదం ఉంది. ఎక్కువ గంటలు చెవులకు శబ్దం తగలడం వల్ల చెవిలోని నరాలు బలహీనపడతాయి. కొందరు తక్కువ సౌండ్ పెట్టుకుని   వింటున్నాము కదా అనుకుంటారు, కానీ రోజంతా లేదా రాత్రంతా చెవుల్లో ఆ పరికరాలు ఉంచుకోవడం వల్ల చెవి లోపల ఉండే సున్నితమైన భాగాలకు  నష్టం కలుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వినికిడి సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది. మ్యూజిక్ వింటే ప్రశాంతంగా నిద్ర పడుతుందని అనుకుంటాం కానీ, రాత్రి అంతా పాటలు లేదా పాడ్‌కాస్ట్‌లు ప్లే అవుతూ ఉంటే  మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోలేకపోతుంది. శబ్దాల కారణంగా మధ్యమధ్యలో నిద్రకు డిస్టర్బ్  కలుగుతుంది. దీనివల్ల ఉదయం లేచిన తర్వాత కూడా శరీరం అలసిపోయినట్లుగా , సుస్తీగా అనిపిస్తుంది. నిద్ర నాణ్యత దెబ్బతినడం వల్ల రోజంతా ఉత్సాహం లోపిస్తుంది. ఈ సమస్యలన్నింటి నుంచి సురక్షితంగా ఉండాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం... మీకు ఒకవేళ మ్యూజిక్ వింటూ నిద్రపోయే అలవాటు ఉంటే, పాటలు ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా టైమర్ సెట్ చేసుకోవడం మంచిది. వీలైతే ఇయర్ బడ్స్‌కు బదులుగా తక్కువ సౌండ్‌తో రూమ్‌లో చిన్న స్పీకర్ ఉపయోగించవచ్చు.  ఇయర్ బడ్స్‌ను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి , అంతేకాదు  ఎవరితోనూ వాటిని షేర్ చేసుకోకూడదు. చెవుల్లో ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది.                                                                                                                                                *రూపశ్రీ.
షుగర్ వ్యాధి ఉన్నవారిలో కిడ్నీ సమస్యలు ఎందుకు వచ్చే అవకాశం ఉంది? రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే మూత్రపిండాల పనితీరుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలను తెలుసుకోవడం ప్రతి డయాబెటిస్ పేషెంట్‌కు ఎంతో ముఖ్యం. ఈ TeluguOne Health వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ షుగర్ వ్యాధి, కిడ్నీల ఆరోగ్యం, సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగించే ఔషధ మొక్కల గురించి వివరిస్తారు. ముఖ్యంగా తెల్ల గలిజేరు అని పిలిచే పునర్నవ మొక్క, పల్లేరు గింజలు, పండ్ల సంప్రదాయ ఉపయోగాల గురించి తెలుసుకోవచ్చు. ఈ మూలికలను సంప్రదాయ వైద్యంలో ఎలా పరిగణిస్తారు, వాటిని ఉపయోగించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు అవసరమో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ వల్ల కిడ్నీలపై ఎలాంటి ప్రభావం పడవచ్చు? షుగర్ పేషెంట్లు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? పునర్నవ (తెల్ల గలిజేరు) మొక్కకు సంప్రదాయ వైద్యంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి? పల్లేరు గింజలు, పండ్లను సంప్రదాయ వైద్య విధానాల్లో ఎలా ఉపయోగిస్తారు? మూలికలతో తయారుచేసే ఔషధాలను వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తించడానికి వైద్య పరీక్షలు ఎందుకు ముఖ్యం? వంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం, వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడటం, అవసరమైన కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అందువల్ల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు తమ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పునర్నవ మరియు పల్లేరు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ వివరణతో కూడిన ఈ TeluguOne Health వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మూలికలు కిడ్నీ వ్యాధులను నయం చేస్తాయని నిర్ధారిత ఆధారాలు లేవు. వైద్యుల సూచన లేకుండా షుగర్ మందులను ఆపకండి లేదా మూలికలను వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకండి.