మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ జాతీయ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి  హోంమంత్రి అమిత్ షా కు ఉప ప్రధానిగా ప్రమోషన్ దక్కనుందంటూ వైసీపీ మాజీ నాయకుడు,  రాజ్యసభ మాజీ సభ్యుడు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు  హాట్ టాపిక్ గా మారింది.  కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.   కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షాకు డిప్యూటీ పీఎం పదవి దక్కనుందంటూ వస్తున్న కథనాలను సమర్ధిస్తూ..  రాబోయే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో అమిత్ షాను ఉప ప్రధానిగా మోడీ నియమించనున్నట్లు విజయసాయి పేర్కొన్నారు.  దేశ రాజకీయాల్లో అత్యంత నిర్ణయాత్మకమైన, పాత్ర పోషిస్తున్న అమిత్ షాకు ఉప ప్రధానిగా ప్రమోషన్ రావడం సముచితమని పేర్కొన్న విజయసాయి..  దేశ ప్రయోజనాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో అమిత్ షా వెనుకాడరనీ, అందువల్లే ఉప ప్రధాని పదవికి ఆయన అన్ని విధాలా అర్హులని  పేర్కొన్నారు.  భారత రాజకీయ చరిత్రలో గతంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులు ఉప ప్రధాని బాధ్యతలను స్వీకరించిన దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి   ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పదవితో అమిత్ షాకు దక్కబోయే స్థానాన్ని పోల్చారు. గతంలో సర్దార్ పటేల్ అలంకరించిన ఈ ఉన్నతమైన డిప్యూటీ పీఎం హోదాను అమిత్ షాకు కేటాయించడం  సముచితంగా ఉంటుందని పేర్కొన్న విజయసాయి.. , ముందుముందు  అమిత్ షా చేపట్టనున్న ఈ కొత్త బాధ్యతకు మద్దతు తెలుపుతూ అభినందనలు తెలిపారు.   అమిత్ షా ఉప ప్రధాని అంటూ ఎటువంటి అధికారిక ప్రకటనా రాకముందే..   విజయసాయి రెడ్డి వంటి సీనియర్ పార్లమెంటేరియన్ ఈ అంశంపై బహిరంగంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.   భారతదేశంలో 2014 నుంచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు విడతల్లోనూ డిప్యూటీ పీఎం పదవిని ఎవరికీ ఇవ్వలేదు. గతంలో బీజేపీ హయాంలోనే అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఆ హోదాను ఎవరికీ కేటాయించలేదు.  ఈ నేపథ్యంలో అమిత్ షాకు  ఉప ప్రధాని పదవి  అప్పగించడం ద్వారా, భవిష్యత్తులో ప్రధాని పదవిని చేపట్టబోయేది అమిత్ షాయే అన్న సంకేతాన్ని వ్యూహాత్మకంగా విజయసాయి ట్వీట్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పటి వరకూ అయితే..  ఉప ప్రధాని నియామకంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయినప్పటిక.. , విజయసాయి రెడ్డి పోస్ట్ వల్ల జాతీయ స్థాయిలో   ఈ విషయంపై చర్చ జోరందుకుంది.  ఒకవేళ  అమిత్ షా అధికారికంగా ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తే, అది దేశ రాజకీయ ముఖచిత్రాన్ని,  అధికారిక ప్రాధాన్యతలను  మార్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.   Amit Shah Deputy PM news, Vijaya Sai Reddy tweet on Amit Shah, Union Cabinet Reshuffle 2026, Narendra Modi government Deputy Prime Minister, YSRCP BJP political updates
   బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న *యువ సంగ్రామ సభ' కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 18న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బీఆర్‌ఎస్  పార్టీ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. విచారణ సందర్భంగా సభ నిర్వహణకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, కార్యక్రమం నిర్వహించేందుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వెంటనే అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం తరఫున కూడా వాదనలు వినిపించాయి. అన్ని అంశాలను పరిశీలించిన హైకోర్టు సభ నిర్వహణకు అనుమతి ఇస్తూనే పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సభ కారణంగా జాతీయ రహదారి లేదా ఇతర ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ హైవేలను దిగ్బంధించరాదని స్పష్టం చేసింది.  అలాగే సభ నిర్వహణ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. అదేవిధంగా, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కార్యక్రమాన్ని నిర్వహిం చాలని, సభ నిర్వాహకులు పోలీసులు సూచించే అన్ని నిబంధనలు, షరతులను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, జనస మ్మర్ద నియంత్రణ వంటి అంశాల్లో పోలీసులకు పూర్తిగా సహకరించాలని కూడా సూచించింది. హైకోర్టు అనుమతితో శనివారం (జూలై 18) సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సభ నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ సభకు పార్టీ అగ్రనేతలు, యువ నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సభ నిర్వహణకు పోలీసులు కూడా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టే అవకాశముంది. BRS Youth Sangram Sabha, Telangana High Court, Saroornagar Indoor Stadium, BRS Party, KCR, KTR, CM Revanth reddy
పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో  సోనమ్ నిరశన చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలో సోనమ్ వాంగ్‌చుక్ ప్రత్యక్షంగా పాల్గొని నిరాహార దీక్ష చేపట్టడం రాజకీయంగా కూడా ప్రధాన్యత సంతరించుకుంది . సోనమ్ వాంగ్ ఛుక్ చేపట్టిన నిరవధిక నిరశనకు రోజురోజుకూ   ప్రజాదరణతో పాటు నెటిజన్ల మద్దతు కూడా పెరుగుతోంది.   కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా వేదికగా ఉద్భవించి, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయ పోరాటాల్లోకి అడుగుపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.   ఈ క్రమంలోనే   పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడమే కాకుండా..  నిరశన దీక్ష చేపట్టి, ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకునే వరకు   దీక్షను విరమించేది లేదని ప్రకటించారు. ఈ పరిణామం కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు ఒక్కసారిగా జాతీయ స్థాయి  ప్రాధాన్యత వచ్చింది.   ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్  వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది.  గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి.  ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.   ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వాంగ్ చుక్ నిరశనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది.  అలాగే సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.   ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్ల  నిరశన దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌ను  కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు.   ఇలా విపక్షాల మద్దతు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో ఈ ఆందోళన తీవ్ర రూపం దాలుస్తున్నా..  కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంత వరకూ స్పందించలేదు.  ఇలా స్పందించకపోవడానికి సోనమ్ వాంగ్ చుక్ నిరసన, కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనల ప్రభావం కేంద్రంపై ఇసుమంతైనా లేదని చాటే వ్యూహమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే.. సోనమ్ వాంగ్ చుక్ కు పెరుగుతున్న మద్దతు,  యువత నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహంతో కేంద్రం ఒకింత ఆందోళన చెందుతున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. అంతే కాదు.. సోనమ్ వాంగ్ చుక్ నిరశన విషయంలో ప్రభుత్వ మౌనం, నిర్లక్ష్యం పట్ల నెటిజనులు ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ లీకేజీ అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తు దేశ వ్యాప్తంగా విద్యావేత్తలు, విద్యార్థుల  తల్లిదండ్రులు కూడా వాంగ్ చుక్ నిరశనకు మద్దతు తెలుపుతూ.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.    public support growing day by day to Wangchuks protest, Cockroach Janta Party, Dharmendra Pradhan Resignation Demand, NEET Paper Leak Controversy, Jantar Mantar Delhi Protest
ALSO ON TELUGUONE N E W S
ఇటీవల విజువల్ వండర్‌గా, మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ‘నాగబంధం’. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్టింగ్స్‌తో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమాకు అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించారు. ఇప్పుడీ ‘నాగబంధం’ టీమ్, తమ తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను టాలెంటెడ్ హీరో శర్వానంద్‌తో ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో సంచలన విషయం ఏమిటంటే, దీని కోసం ఏకంగా రూ. 80 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలవనుందని అంచనా వేస్తున్నారు.  ‘నాగబంధం’ సినిమాతో విజువల్స్ పరంగా, మేకింగ్ వాల్యూస్ పరంగా అద్భుతమైన ప్రతిభను కనబరిచిన ఈ టెక్నికల్ అండ్ ప్రొడక్షన్ టీమ్, శర్వానంద్ కోసం ఒక విభిన్నమైన, మునుపెన్నడూ చూడని సరికొత్త కథాంశాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ శర్వానంద్ బాడీ లాంగ్వేజ్‌కు, ఆయన నటనకు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో పాటు, కమర్షియల్‌గా కూడా భారీ స్థాయిలో వర్కవుట్ అయ్యే ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. రూ. 80 కోట్ల బడ్జెట్ అంటే కేవలం మేకింగ్ పరంగానే కాకుండా, హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ (VFX), భారీ యాక్షన్ సీక్వెన్సులు, దేశ విదేశాల్లో జరిపే గ్రాండ్ ప్రొడక్షన్ షెడ్యూల్స్ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారని టాక్. ‘నాగబంధం’ టీమ్‌కు గ్రాండ్ విజువల్స్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో ఉన్న అనుభవం ఈ కొత్త ప్రాజెక్ట్‌కు ప్లస్ పాయింట్ కానుంది.  శర్వానంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'భోగి' అనే పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే ఈ కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని వినికిడి. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని టాక్.      Nagabandham, Sharwanand, Tollywood  
టాలీవుడ్‌లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉన్న వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆయనపై సంచలన నిర్ణయం తీసుకుంది. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో, జానీ మాస్టర్‌కు ఫెడరేషన్ సహాయ నిరాకరణ (నాన్-కోఆపరేషన్) ప్రకటించింది. యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ప్రధాన ఆరోపణతో ఈ కఠినమైన చర్యలకు పూనుకుంది. ఈ నిర్ణయం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.  ఇకపై జానీ మాస్టర్ దేశంలో ఏ భాషా చిత్రానికి, ఏ పరిశ్రమలో వర్క్ చేసినా కూడా సినీ పరిశ్రమకు చెందిన మిగతా 23 క్రాఫ్ట్‌ల సభ్యులు ఎవరూ ఆయనకు సహకరించబోరని ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ అధికారికంగా ప్రకటన విడుదల చేయడమే కాకుండా, సినిమా నిర్మాతలకు కూడా ఈ విషయాన్ని గట్టిగా తెలియజేయాలని నిర్ణయించింది. ఈ వివాదం వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని ఫెడరేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. జానీ మాస్టర్ తన భార్యకు ఉన్న అసోసియేషన్ పదవిని అడ్డుపెట్టుకుని, యూనియన్‌లో పూర్తి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఈ నెల 12న జానీ మాస్టర్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, ఫెడరేషన్ సభ్యులను రెచ్చగొట్టేలా మాట్లాడిన తీరు పరిశ్రమలో తీవ్ర దుమారం రేపింది. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఆయన ప్రవర్తించారని ఫెడరేషన్ ప్రతినిధులు మండిపడుతున్నారు.  ఈ వివాదంపై చర్చించేందుకు, ఆయన వివరణ కోరేందుకు ఈ నెల 14న ఫెడరేషన్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా జానీ మాస్టర్‌ను ఆదేశించారు. అయితే ఆ విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో ఫెడరేషన్ ఈ చర్యను మరింత తీవ్రంగా పరిగణించింది. ఆ తర్వాత ఈ నెల 17 మధ్యాహ్నం ఫెడరేషన్ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమై ఈ సహాయ నిరాకరణ నిర్ణయాన్ని అధికారికంగా ఖరారు చేశారు. ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్ జానీ మాస్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందిన తేదీ నుండి సరిగ్గా 7 రోజుల వ్యవధిలో ఆయన లిఖితపూర్వకంగా ఫెడరేషన్‌కు వివరణ ఇవ్వాలని, లేదా బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ 7 రోజుల గడువులోగా జానీ మాస్టర్ నుండి సరైన వివరణ రాకపోయినా, లేదా ఆయన పద్ధతి మార్చుకోకపోయినా సినీ పరిశ్రమ నుండి ఆయనను శాశ్వతంగా బహిష్కరించే (పర్మనెంట్ బ్యాన్) అవకాశం ఉందని ఫెడరేషన్ హెచ్చరించింది.  ఫెడరేషన్ తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. ఒకవేళ ఈ సహాయ నిరాకరణ సుదీర్ఘ కాలం అమల్లో ఉంటే, జానీ మాస్టర్‌తో భారీ బడ్జెట్ సినిమాలు చేయాలనుకునే స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలకు ఇది పెద్ద అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. 23 క్రాఫ్ట్‌ల కార్మికులు సహకరించకపోతే షూటింగ్‌లు జరపడం అసాధ్యం కాబట్టి, ఇది ఆయన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.  మరి ఈ నోటీసులపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో, ఎలాంటి వివరణ ఇస్తారో అని చిత్ర పరిశ్రమ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.     Telugu Film Federation, Jani Master, Controversy, Boycott, Tollywood  
    ధురంధర్ పార్ట్ 1 , పార్ట్ 2 .. ఈ రెండు చిత్రాల పేర్లు చెప్పగానే సగటు సినీ ప్రేమికుడు సైతం ఆ చిత్రాలు సాధించిన ఘనవిజయం గురించి, రికార్డుల గురించి, గూస్ బంప్స్ సీన్స్ గురించి గుక్క తిప్పుకోకుండా చెప్తాడు.. అంతలా ధురంధర్ భారతీయ సినీ యవనిక పై జెండా పాతింది.ఇందుకు ముఖ్య కారణం ఆదిత్యధర్(Aditya Dhar)అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కలెక్షన్స్ పరంగా కూడా భారీ రికార్డుని సెట్ చేసాడు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గురువారం నిర్వహించిన ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో ఒక సంచలన ప్రకటన చేశారు. అస్సాం చరిత్రలోనే అత్యంత వీరుడైన అహోం సామ్రాజ్య సైన్యాధిపతి 'లాచిత్ బోర్ఫుకన్' జీవితకథ ఆధారంగా ఒక భారీ బాలీవుడ్ చిత్రాన్ని నిర్మించాలని వారి ప్రభుత్వం యోచిస్తోందని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని  డైరెక్ట్ చేయాల్సిందిగా  స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్‌ని సంప్రదించినట్లు  అధికారికంగా వెల్లడించారు. 'ధురందర్' సిరీస్ చిత్రాలతో ఆదిత్య ధర్ తన అసాధారణ మేధస్సుని నిరూపించుకున్నారని, ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో ఆయన అత్యంత ప్రతిభావంతుడని ముఖ్యమంత్రి ప్రశంసించారు.  లాచిత్ బోర్ఫుకన్ వంటి వీరుడి కథని  అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఆదిత్య ధర్ సరైన ఎంపిక అని అస్సాం ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.  ఈ భారీ చారిత్రాత్మక చిత్రం కోసం అస్సాం ప్రభుత్వం తన 2026-27 వార్షిక బడ్జెట్‌లోప్రత్యేకంగా నిధులని  కూడా కేటాయించింది. కేవలం లాచిత్ బోర్ఫుకన్ మాత్రమే కాకుండా, స్వాతంత్ర  సమరయోధుడు కుశాల్ కాన్వర్ పై కూడా సినిమా తెరకెక్కించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిత్య ధర్‌తో జరిపిన ప్రాథమిక చర్చలు చాలా సానుకూలంగా సాగాయి. ఈ ప్రాజెక్ట్ యొక్క క్రియేటివ్ విజన్ మరియు స్క్రిప్ట్ చర్చల కోసం ఆగస్టు నెలలో ఆదిత్య ధర్ స్వయంగా అస్సాంలో పర్యటించనున్నారు. అయితే, ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఆదిత్య ధర్  డైరెక్ట్ చేయలేకపోతే, ఇతర ప్రముఖ దర్శకులను సంప్రదిస్తామని, కానీ లాచిత్ బోర్ఫుకన్ బయోపిక్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడం మాత్రం ఖాయమని సీఎం స్పష్టం చేశారు.   also read: ఎందుకు ఇలా తెరకెక్కించారు.. ఇక మారరా! 17వ శతాబ్దానికి చెందిన  లాచిత్ బోర్ఫుకన్  అస్సాం చరిత్రలో అత్యంత శక్తివంతమైన సైనిక కమాండర్లలో ఒకరు. ముఖ్యంగా 1671లో జరిగిన చారిత్రాత్మక 'సారైఘాట్ యుద్ధంలో' మొఘల్ సామ్రాజ్య సైన్యాన్ని గజగజలాడించి, అస్సాంలోకి మొఘలులు అడుగుపెట్టకుండా అడ్డుకున్న ధీరుడు. ఆ యుద్ధ సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రణరంగంలోకి దూకి, తన సైనికుల్లో వీరోచిత స్ఫూర్తిని నింపారు. అస్సాం సంస్కృతిలో, భారత సైనిక చరిత్రలో ఆయన ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ అసాధారణ వీరుడి కథను హిందీలో భారీ కాన్వాస్‌పై తెరకెక్కించి ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు పరిచయం చేయడమే లక్ష్యంగా అస్సాం ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరి 'ధురందర్'తో సంచలనాలు సృష్టించిన ఆదిత్య ధర్ ఈ చారిత్రాత్మక వీరగాథని తెరకెక్కిస్తే వెండితెరపై ఎలా ఆవిష్కరిస్తాడో  చూడాలి. adityadhar, lachit borphukan, himantha biswa sharma, assam, dhurandhar 2  
హాలీవుడ్ సంచలన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తొలిరోజే ప్రకంపనలు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో జూలై 17న విడుదలైన ఈ మైథలాజికల్ యాక్షన్ ఎపిక్, భారతీయ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. మ్యాట్ డామన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, దేశవ్యాప్తంగా థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ట్రేడ్ వర్గాల అంచనాలకు తగ్గట్టుగానే మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించి, ఈ ఏడాది ఇండియాలో బిగ్గెస్ట్ హాలీవుడ్ ఓపెనర్స్ జాబితాలో చేరిపోయింది. 'ది ఒడిస్సీ' చిత్రం ఇండియాలో మొదటి రోజు ఏకంగా రూ. 20.76 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక నెట్ కలెక్షన్ల పరంగా చూస్తే రూ. 17.40 కోట్లు రాబట్టి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచింది. దేశవ్యాప్తంగా దాదాపు 8,413 షోలలో ప్రదర్శితమైన ఈ సినిమా, తొలిరోజు 48.7 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ముఖ్యంగా IMAX, 4DX వంటి ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్స్‌లో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టారు. నోలన్ గత చిత్రం 'ఓపెన్‌హైమర్' సాధించిన క్రేజ్‌ను ఈ సినిమా కంటిన్యూ చేస్తోందని స్పష్టమవుతోంది. భాషల వారీగా చూసుకుంటే, ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్ సింహభాగం వసూళ్లను సాధించింది. ఇంగ్లీష్ వెర్షన్ మాత్రమే దాదాపు రూ. 13.75 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టగా, 4,401 షోలలో ఏకంగా 77 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేయడం విశేషం. హిందీ డబ్బింగ్ వెర్షన్ 2,851 షోల నుండి రూ. 1.90 కోట్ల నెట్ వసూలు చేయగా, సౌత్ మార్కెట్లలో కూడా సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో క్రిస్టోఫర్ నోలన్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ మరోసారి నిరూపితమైంది. తెలుగు వెర్షన్ 675 షోల ద్వారా దాదాపు రూ. 1.10 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో తెలుగు ఆక్యుపెన్సీ 30 శాతంగా నమోదైంది. మరోవైపు తమిళ వెర్షన్ 486 షోలతో రూ. 65 లక్షల నెట్ వసూలు చేస్తూ 28 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.  అన్ని వెర్షన్ లు కలుపుకొని తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 'ది ఒడిస్సీ'కి రూ. 3.40 కోట్లు వచ్చాయి. ఏపీలో రూ. 1.09 కోట్లు రాగా, తెలంగాణలో రూ. 2.31 కోట్లు వచ్చాయి. ఒక్క  హైదరాబాద్ లోనే 2 కోట్లకు పైగా వసూళ్ళు రావడం విశేషం. హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు పురాణగాథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ట్రోజన్ యుద్ధం తర్వాత ఒడిస్సియస్ తన భార్య పెనెలోప్‌ను చేరుకోవడానికి చేసిన సాహసోపేతమైన ప్రయాణం, వింత జీవులతో పోరాటాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.     Christopher Nolan, The Odyssey, Box Office, India  
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పెట్టిన ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రియాంక చోప్రాకు మహేష్ బాబు తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. మహేష్ బాబు తన ట్వీట్‌లో ప్రియాంక చోప్రాను విష్ చేస్తూ పెట్టిన క్యాప్షన్ ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. "ఒకే ఒక్క మందాకినికి జన్మదిన శుభాకాంక్షలు.. పీసీ నీకు రాబోయే కాలం ఎంతో అద్భుతంగా సాగాలి.. నీకు నా ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయి, నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి" అంటూ మహేష్ బాబు హార్ట్ ఎమోజీలతో తన ప్రేమను వ్యక్తపరిచారు. ఈ ప్రత్యేకమైన పోస్ట్‌తో పాటు మహేష్ బాబు రెండు అద్భుతమైన ఫోటోలను కూడా షేర్ చేశారు. అందులో మొదటి ఫోటోలో ప్రియాంక చోప్రా ఎంతో పవర్‌ఫుల్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తుండగా, రెండో ఫోటోలో ప్రకృతి ఒడిలో ఎంతో సరదాగా గాల్లోకి ఎగురుతూ కెమెరాకు చిక్కారు.  కాగా, మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' అనే భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో మందాకిని అనే పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తోంది. https://x.com/urstrulyMahesh/status/2078324599394279933     Mahesh Babu, Varanasi Movie, Priyanka Chopra, Mandakini, SS Rajamouli  
సెలబ్రిటీలంటే కేవలం వెండితెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో వారు ఎలా ప్రవర్తిస్తారనే దానిపై కూడా అభిమానులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. కొన్నిసార్లు వారు చేసే చిన్నపాటి సున్నితమైన పనులు సమాజంలో చాలా పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. తాజాగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. గ్లామర్‌కు మాత్రమే కాకుండా, అపారమైన మానవత్వానికి కూడా తను కేరాఫ్ అడ్రస్ అని శ్రియ మరోసారి నిరూపించుకున్నారు. ఒక చిన్నారి పట్ల ఆమె చూపించిన అమితమైన ఆప్యాయత ఇప్పుడు ఇంటర్నెట్‌లో లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంటోంది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో శ్రియ శరణ్ కెమెరాల ముందుకు వచ్చి ఫోటోలకు ఎంతో ఉత్సాహంగా పోజులిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో, చేతిలో ఐస్‌క్రీమ్ పట్టుకున్న ఒక చిన్నారి ఆమెను చూసి చాలా ఆనందంగా, ఉద్వేగంతో ఆమె వైపు పరుగెత్తుకుంటూ వచ్చింది. అయితే, ఆ హడావుడిలో పాప బ్యాలెన్స్ తప్పి, చేతిలో ఉన్న ఐస్‌క్రీమ్ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఎంతో ఇష్టంగా తింటున్న ఐస్‌క్రీమ్ నేలపాలు కావడంతో ఆ చిన్నారి తీవ్ర నిరాశకు గురై అక్కడికక్కడే బావురుమంటూ గట్టిగా ఏడవడం ప్రారంభించింది. అక్కడ ఉన్న వారంతా ఏం జరుగుతుందో అని చూస్తుండగానే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రియ వెంటనే స్పందించారు. తన స్టార్ హోదాని, చుట్టూ ఉన్న కెమెరాలను పక్కనబెట్టి, శ్రియ వెంటనే ఆ చిన్నారి వద్దకు వెళ్లారు. ఎంతో ఆప్యాయంగా ఆ పాపను తన చేతుల్లోకి ఎత్తుకుని ఓదార్చడం మొదలుపెట్టారు. తనను హత్తుకుని, ఎంతో ప్రేమగా బుజ్జగిస్తూ, ముచ్చటైన మాటలతో ఆ చిన్నారిని నవ్వించడానికి శ్రియ ప్రయత్నించారు. శ్రియ చూపించిన ఆత్మీయతతో ఆ పాప ఏడుపు ఒక్క నిమిషంలోనే ఆగిపోయింది. ఆ చిన్నారి పెదవులపై మళ్లీ అందమైన చిరునవ్వు పూసింది. ఈ అరుదైన, హృదయాన్ని హత్తుకునే క్షణాన్ని అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా షేర్ అవుతూ ట్రెండింగ్‌గా మారింది. నేటి డిజిటల్ యుగంలో సెలబ్రిటీల చిన్న చిన్న కదలికలు కూడా నెగెటివ్ కోణంలో చర్చకు వస్తుంటాయి. కానీ ఎలాంటి హంగు, హార్బాటాలు లేకుండా శ్రియ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "రియల్ స్టార్ అంటే ఇలాగే ఉండాలి" అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, "చిన్న పిల్లల మనసును గెలుచుకోవడం అందరికీ సాధ్యం కాదు, శ్రియ మనసు చాలా గొప్పది" అని మరికొందరు కొనియాడారు. కేవలం లైక్‌ల కోసం స్టంట్లు చేసే కాలంలో, మనస్ఫూర్తిగా చేసే ఒక చిన్న సాయం లేదా ప్రేమపూర్వక ప్రవర్తన ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేస్తుందని శ్రియ శరణ్ ఈ సంఘటన ద్వారా చాటి చెప్పారు. ఈ మధుర క్షణం అభిమానుల గుండెల్లో శ్రియపై ఉన్న గౌరవాన్ని మరింత రెట్టింపు చేసింది.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన బ్లాక్‌బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. అయితే ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కొన్ని ప్రతిష్టాత్మక సినిమాలు అట్టహాసంగా ప్రారంభమై కూడా మధ్యలోనే నిలిచిపోయాయి. సత్యాగ్రాహి, కోబలి వంటి చిత్రాల జాబితాలో అభిమానులను ఇప్పటికీ తీవ్రంగా నిరాశపరిచే మరో క్రేజీ ప్రాజెక్ట్ 'ప్రిన్స్ ఆఫ్ పీస్' (Prince of Peace). లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, జీసస్ క్రైస్ట్  బయోపిక్‌గా ఈ సినిమాను తెరకెక్కించాలని ఒక అద్భుతమైన భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. యేసుక్రీస్తు పవిత్ర జీవితం, ఆయన చేసిన గొప్ప పనులు, సమాజానికి ఆయన అందించిన ప్రేమ, శాంతి సందేశాలను నేటి తరానికి చాటిచెప్పాలనే బలమైన ఆశయంతో ఈ కథ రూపుదిద్దుకుంది. ఈ మహా ప్రాజెక్ట్ కోసం ప్రముఖ రచయిత జె.కె. భారవి అద్భుతమైన స్క్రిప్ట్ వర్క్‌ను సిద్ధం చేశారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ కథలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఒక పవర్‌ఫుల్ రోల్‌ను డిజైన్ చేశారు. అయితే ఇందులో పవన్ కల్యాణ్ పోషించాల్సింది జీసస్ పాత్ర కాదని, కానీ కథను పూర్తిగా మలుపు తిప్పే ఒక అత్యంత కీలకమైన, శక్తివంతమైన పాత్ర అని స్వయంగా దర్శకుడే వెల్లడించారు. ఈ భారీ చిత్రంలో కథానాయికగా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని ఎంపిక చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ చిత్రాన్ని 2010లో అధికారికంగా అనౌన్స్ చేశారు. ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించేందుకు ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చారు. 'ప్రిన్స్ ఆఫ్ పీస్' చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళంతో పాటు ఇంగ్లీష్ భాషలోనూ రూపొందించి అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దే క్రమంలో పవన్ కల్యాణ్, సింగీతం శ్రీనివాసరావు, నిర్మాత కొండా కృష్ణంరాజులతో కూడిన చిత్ర బృందం ఏకంగా ఇజ్రాయెల్, జెరూసలేం, జోర్డాన్, బెత్లహేం వంటి అంతర్జాతీయ చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. యేసుక్రీస్తు నడయాడిన ఆయా పవిత్ర ప్రాంతాలలో లొకేషన్ల వేటను ముమ్మరంగా నిర్వహించారు. విజువల్ వండర్‌గా, అత్యంత సహజంగా ఈ సినిమాను తెరకెక్కించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయి, ఇక రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై సెట్స్ పైకి వెళ్తుందనగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా అర్ధాంతంగా ఆగిపోవడానికి ప్రధాన కారణం విపరీతంగా పెరిగిపోయిన బడ్జెట్. అంతర్జాతీయ లొకేషన్లు, భారీ విజువల్ ఎఫెక్ట్స్, అగ్ర నటీనటుల రెమ్యునరేషన్ల కారణంగా మొదట అనుకున్న బడ్జెట్ అంచనాలు పూర్తిగా దాటిపోయి నిర్మాణ వ్యయం ఊహించని స్థాయికి పెరిగింది. అంతటి భారీ బడ్జెట్‌ను భరించడం అప్పట్లో అంత సులభం కాకపోవడంతో దర్శక నిర్మాతలు వెనక్కి తగ్గక తప్పలేదు. దీనికి తోడు స్క్రిప్ట్ వర్క్ కోసమే దాదాపు రెండేళ్లకు పైగా సుదీర్ఘ సమయం పట్టడంతో పవన్ కల్యాణ్ కూడా తన తదుపరి కమిట్‌మెంట్స్, ఇతర సినిమాలతో బిజీగా మారిపోయారు. అలా ఒక అంతర్జాతీయ స్థాయి విజువల్ వండర్ కావాల్సిన పవన్, సింగీతంల కలల ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకుండానే నిలిచిపోయింది.     Pawan Kalyan, Singeetham Srinivasa Rao, Anushka Shetty 
తెలుగు సినీ పరిశ్రమలో సుప్రసిద్ధ గీత రచయితగా తనదైన ముద్ర వేసుకున్న చంద్రబోస్ తన కెరీర్‌లో వేల పాటలతో శ్రోతలను అలరించారు. సందర్భం ఏదైనా సరే, ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా అద్భుతమైన సాహిత్యాన్ని అందించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. భాషాభిమానంతో పాటు జీవితంలో ఎదురైన ఎన్నో అవమానాలను ఆభరణాలుగా మార్చుకుని ఎదిగిన ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. అయితే, తన సుదీర్ఘ కెరీర్‌లో వేలాది హృదయాలను కదిలించేలా పాటలు రాసిన ఈ గొప్ప లిరిసిస్ట్‌ను కూడా కంటతడి పెట్టించిన ఒక ప్రత్యేకమైన పాట ఉంది. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'రంగస్థలం' లోని 'ఓరయ్యో నా అయ్యో' అనే అత్యంత భావోద్వేగభరితమైన గీతం. ఈ పాట కేవలం ఒక రచన మాత్రమే కాదని, అది తన హృదయంలో ఎప్పటికీ చెరిగిపోని ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని చంద్రబోస్ ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి వివరించారు. ఈ పాట‌ను స్వ‌యంగా చంద్ర‌బోస్ ఆల‌పించ‌డం మ‌రో విశేషంగా చెప్పుకోవ‌చ్చు.  ఈ అద్భుతమైన 'ఓరయ్యో' పాట ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఈ పాట రచన దుబాయ్‌లో జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, దర్శకుడు సుకుమార్‌ల సమక్షంలో చంద్రబోస్‌కు ఈ పాటను రాసే అవకాశం లభించింది. చిత్ర దర్శకుడు సుకుమార్ ఆ సన్నివేశానికి సంబంధించిన ఎమోషన్‌ను వివరించిన వెంటనే, చంద్రబోస్ మనసు చలించిపోయింది. ఆ క్షణంలో తన మనసులో మెదిలిన తీవ్రమైన దుఃఖాన్ని, భావాలను కాగితంపై నిక్షిప్తం చేసి దేవి శ్రీ ప్రసాద్‌కు అందజేశారు. దేవి శ్రీ ప్రసాద్ ఆ పదాలకు ప్రాణం పోస్తూ అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ స్వయంగా ఆ పాటను పాడి వినిపించారు. ఆ సమయంలో పాటను పాడుతుండగానే తన మనసులో ఏదో తెలియని ఒక పెద్ద బాధ, గుండెను పిండేసే దుఃఖం కలిగాయని, కళ్ల నుంచి తెలియకుండానే కన్నీళ్లు ఉబికి వచ్చాయని ఆయన ఆనాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. దుబాయ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, ఆయన తన ఇంట్లో వంటగదిలో వంట చేసుకుంటున్న తన భార్యకు ఈ పాటను వినిపించారు. ఆ పాట వింటూనే ఆమె కంటతడి పెట్టుకోవడం చూసి, ఈ పాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుందని చంద్రబోస్‌కు బలమైన నమ్మకం కలిగింది. ఆ తర్వాత ఆయన అన్నయ్య కూడా ఈ పాట విని తీవ్రమైన భావోద్వేగానికి గురికావడం విశేషం. చంద్రబోస్ తన 25 ఏళ్లకు పైగా సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని జ్ఞాపకాలను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రంగస్థలం చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చంద్రబోస్ రాసిన పాటల సాహిత్యాన్ని అద్భుతంగా ప్రశంసిస్తూ, “మీ పెన్నుకు వెన్నువంచి నమస్కారం చేస్తున్నాను” అని చెప్పిన మాటలు తన జీవితంలోనే అత్యంత గొప్ప గౌరవంగా భావిస్తానని ఆయన చెప్పారు. ఈ ప్రయాణంలో తానేమీ పూలబాటపై నడవలేదని, కెరీర్ ఆరంభంలో ఎన్నో అవమానాలు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నానని వెల్లడించారు. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, అలాగే చీత్కారాలే సత్కారాలుగా మార్చుకుని ఎంతో సహనంతో ముందుకు సాగానని యువతకు స్ఫూర్తినిచ్చారు. తెలుగు భాషపై అచంచలమైన ప్రేమ కలిగిన చంద్రబోస్, ఆంగ్ల భాషలో కేవలం రెండున్నర లక్షల పదాలు మాత్రమే ఉండగా, మన తెలుగు భాషలో ఏకంగా ఆరున్నర లక్షల పదాల అపార సంపద ఉందని ఒక అద్భుతమైన గణాంకాన్ని పంచుకున్నారు. భాష బలహీనమైతే సమాజంలో బంధాలు కూడా బలహీనమవుతాయని, తల్లి భాషను కాదంటే కన్నతల్లిని కాదన్నట్టేనని ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా రెండు పరిశ్రమల మధ్య ఉన్న వ్యత్యాసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో ఒకరికొకరు ఇచ్చుకునే మద్దతు, సహకారం వంటివి బాలీవుడ్‌లో ఎంతమాత్రం కనిపించవని ఆమె తన మనసులోని అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఆరోగ్యకరమైన వాతావరణం ముంబైలో లోపించిందనే విషయాన్ని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ తనను ఎప్పుడూ ఎంతో ప్రేమగా చూసుకుందని రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. టాలీవుడ్‌లో తోటి నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఒకరినొకరు ఎంతగానో ప్రోత్సహించుకుంటారని ఆమె కొనియాడారు. ఒకరి సినిమా ట్రైలర్ విడుదలైనా, పాటలు విడుదలైనా మరొకరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తారని రకుల్ పేర్కొన్నారు. అంతేకాకుండా, ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్లకు అందరూ కలిసికట్టుగా వెళ్తారని, సినిమాలు మంచి విజయాలు సాధించినప్పుడు సక్సెస్ పార్టీలను కూడా అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారని ఆమె వివరించారు. టాలీవుడ్‌లో తాము ఇతరుల చిత్రాల ప్రత్యేక స్క్రీనింగులు, ప్రీమియర్ షోలకు ఎంతో ఆనందంగా వెళ్తామని, అక్కడ సినిమాలు చూసి ఒకరికొకరు తోడుగా నిలబడతామని ఆమె చెప్పారు. అయితే బాలీవుడ్‌లో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని రకుల్ ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్రమైన పోటీతత్వం, అభద్రతాభావం (ఇన్‌సెక్యూరిటీ) చాలా ఎక్కువగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇతరుల సినిమాలను సపోర్ట్ చేయడానికి అక్కడి వారు పెద్దగా ఇష్టపడరని రకుల్ సంచలన నిజాన్ని బయటపెట్టారు. తాను హైదరాబాద్ నుండి ముంబైకి వెళ్లి అక్కడ స్థిరపడిన తర్వాతే ఈ వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనించానని ఆమె అన్నారు. బాలీవుడ్‌లో కూడా టాలీవుడ్ లాంటి ఆరోగ్యకరమైన, స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటే ఇండస్ట్రీకి ఎంతో బాగుంటుందని రకుల్ ఆకాంక్షించారు. కానీ, బాలీవుడ్ జనాల్లో ఉన్న విపరీతమైన అభద్రతాభావం వల్ల అక్కడ అలాంటి సపోర్టివ్ వాతావరణం సాధ్యం కావడం లేదని రకుల్ విశ్లేషించారు. చిత్ర పరిశ్రమ ఏదైనా సరే, ఈ విధమైన పరిస్థితిని మార్చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఎంతైనా ఉందని ఆమె గుర్తుచేశారు. ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే చిత్ర పరిశ్రమలు మరింత బలంగా, ఆరోగ్యకరంగా మారుతాయని తాను బలంగా నమ్ముతానని రకుల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రకుల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.     Rakul Preet Singh, Interview, Tollywood, Bollywood  
టాలీవుడ్ ప్రేక్షకులకు నటి నమిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘సొంతం’, ‘జెమిని’, ‘బిల్లా’, ‘సింహా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్నారు. అప్పట్లో నమిత గ్లామర్‌కు, ఆమెకున్న భారీ ఫాలోయింగ్‌కు ఇండస్ట్రీ సైతం ఫిదా అయిపోయింది. బొద్దు బొద్దుగా ఉంటూ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ క్వీన్, 2017 లో వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు నెమ్మదిగా దూరమయ్యారు. ఆపై 2022 లో 41 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఆమె పూర్తిగా తన వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన నమితను చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఆమె మునుపటి రూపానికి, ఇప్పటి రూపానికి అస్సలు సంబంధమే లేకపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల నమిత ఒక జిమ్‌లో వర్కౌట్ చేస్తూ రికార్డ్ చేసిన మిర్రర్ సెల్ఫీ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో నమిత మునుపటి కంటే చాలా నాజుగ్గా, స్లిమ్‌గా కనిపిస్తున్నారు. గ్రే కలర్ క్రాప్ టాప్, డార్క్ గ్రే టైట్స్ ధరించి అద్దం ముందు నిలబడి సెల్ఫీ తీసుకుంటూ ఆమె ఇచ్చిన పోజులు అభిమానులను స్టన్ చేస్తున్నాయి. పెళ్లయి, ఇద్దరు పిల్లలకు తల్లయ్యాక కూడా నమిత ఇంత కఠినమైన వర్కౌట్స్ చేస్తూ తన బాడీని పూర్తిగా మార్చేసుకోవడం నిజంగా అభినందనీయమంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరైతే "ఈమె మన పాత నమితనేనా? అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం" అంటూ పోస్టులు పెడుతున్నారు. సాధారణంగా గర్భధారణ తర్వాత మహిళల్లో బరువు పెరగడం సహజం. అయితే నమిత తన ప్రసవానంతరం పెరిగిన బరువును తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడి కఠినమైన డైట్, క్రమం తప్పకుండా జిమ్ సెషన్లు చేసినట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. నమిత వయసు ప్రస్తుతం 45 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఇంతటి డెడికేషన్ చూపించి భారీగా బరువు తగ్గడం సామాన్యమైన విషయం కాదు. ఈ కొత్త అవతారంలో ఆమె మళ్లీ వెండితెరపై సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కూడా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో నడుస్తోంది. ఏది ఏమైనా, నమిత లేటెస్ట్ ట్రాన్స్‌ఫార్మేషన్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. https://www.instagram.com/reel/Da0FN_qp43M/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==  
   పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.  అయితే.. ఇలా పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం సరైనదేనా?  దీని వల్ల కలిగే పర్యవసానాలు ఏంటి? తెలుసుకుంటే.. మంచి, చెడు.. పిల్లలు అనేది వారి వయసును పరిగణలోకి తీసుకునే.. అలాంటి పిల్లల మెదడు ఇంకా ఎదిగే దశలో ఉంటుంది.  ఈ కారణంగా పిల్లలకు మంచి ఏది చెడు ఏది అనే విషయాలు అర్థం చేసుకునేంత ఆలోచన ఉండదు. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు అలా బట్టలు మార్చుకున్నా లేదా విప్పినా అది పెద్ద విషయమేమీ కాదని అనుకుంటారు. ఇదెప్పుడూ మంచిది కాదు. ప్రైవసీ.. ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన విషయం. తల్లిదండ్రులైనా సరే.. పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం ద్వారా వారికి శరీరం వాల్యూ తెలియదు. శరీరం బట్టలు లేకుండా ఉన్నప్పుడు ఒకరికి కనిపించకూడదని, ఇతరుల ముందు ఎల్లప్పుడూ శరీరాన్ని వస్త్రాలతో కప్పి ఉంచాలని.. ఇలాంటి చిన్న విషయాలు వారు తెలుసుకోలేరు.  ఈ కారణంగా వారికి  శరీరం గురించి అవగాహన రాదు. హద్దలు.. పిల్లలకు కూడా వ్యక్తిగత హద్దులు అనేవి ఉండాలి.  తమ ముందు ఎవరు ఎలా ఉండాలి?  తాము ఎవరి ముందు ఎలా ఉండాలి వంటివి పిల్లలు అర్థం చేసుకోవాలంటే అది తల్లిదండ్రుల ద్వారా మాత్రమే సాధ్యం  అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లల ముందు దుస్తులు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు మార్చుకున్నా పర్వాలేదని,  తాము కూడా ఎవరి ముందైనా బట్టలు మార్చుకోవచ్చని అనుకుంటారు. తల్లిదండ్రులు చేసే పని వల్ల వారికి హద్దులు అనేవి అర్థం కావు. తప్పులు.. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే పిల్లలు తప్పు మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరైనా బట్టలు మార్చుకొనేటప్పుడు కూడా తాము చూడటం తప్పు కాదని అనుకుంటారు. ఇది ఇతరుల ప్రైవసీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఇతరులకు విలువ కూడా ఇవ్వకుండా తయారవుతారు. ఈ వయసుకు తప్పనిసరి.. పిల్లలకు వయసు అనుసరించి ప్రైవసీ నేర్పాలి. ముఖ్యంగా మూడు సంవత్సరాల తర్వాత పిల్లలకు ప్రైవసీ నేర్పాలి.  ఇతరుల ముందు బట్టలు మార్చుకోవడం,  విప్పడం  చేయరాదని, ఇతరులు బట్టలు మార్చుకొనేటప్పుడు చూడరాదని పిల్లలకు చెప్పాలి.  ఇదంతా తల్లిదండ్రులు తమ నుండే మొదలు పెట్టాలి.                                    *రూపశ్రీ  
  ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారం అనుకునేవారు.  వారిని పెంచి పెద్ద చేయాలి,  మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి.  ఆడపిల్ల పుట్టిందంటే పెద్ద ఆర్థిక భారంగా భావించేవారు. కానీ నేటికాలంలో ఆడపిల్లే కావాలని ఆశ పడే తల్లిదండ్రులు ఉన్నారు.  ముఖ్యంగా.. ఆడపిల్లను యువరాణిలాగా,  అపురూపంగా పెంచే వారు ఉన్నారు.  తల్లిదండ్రులు ఇద్దరిలో ఆడపిల్ల విషయంలో తండ్రే ఎక్కువ ప్రేమ చూపిస్తాడని అందరూ అంటారు. అందుకే ఆడపిల్లను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని అంటుంటారు.  అయితే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి కొన్ని అలవాట్లు వదులుకోవాలి.  లేదంటే ఆడపిల్ల ఎదుగుదల దెబ్బతింటుంది, పైగా ఆడపిల్ల భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది.  ఇంతకూ ఆడపిల్ల తండ్రులు వదులుకోవలసిన అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. కోపంగా అరవడం.. చాలామంది మగాళ్లకు కోపంతో గట్టిగా అరవడం అనే అలవాటు ఉంటుంది. కానీ ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఇంట్లో ఇలా కోపంగా, గట్టిగా అరిస్తే ఆడపిల్లలకు భయం పెరిగి నమ్మకం తగ్గుతుంది.  తనకు ఏదైనా బాధ లేదా సమస్య అనిపిస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోలేదు. అందుకే కోపంగా అరిచే అలవాటు ఉంటే ఆ అలవాటు మానేయ్యాలి. భార్యను తక్కువ చేయడం.. భార్య మీద అరవడం, బార్యను తక్కువ చేసి మాట్లాడటం వంటివి చాలా మంది మగాళ్లకు ఉండే అలవాటు. అయితే కూతురు ఉన్నప్పుడు ఇలా  భార్యను తక్కువ చేసి మాట్లాడటం, భార్య మీద అరవడం వంటివి చేయరాదు. ఎందుకంటే భార్య విషయంలో మగాడు చేసే ప్రవర్తన వల్ల కూతురికి తండ్రి మీద గౌరవం తగ్గిపోతుంది. అతను ఎప్పటికీ కూతురి దృష్టిలో ఉన్నతంగా ఉండలేడు. అందుకే కూతురి ముందు భార్యను తిట్టడం, చిన్నతనంగా మాట్లాడటం, అవమానించడం చేయకూడదు. ఆడపిల్లలను తక్కుగా మాట్లాడటం.. చాలామంది మగాళ్లు ఆడపిల్లల విషయంలో అనే మాట.. నువ్వు ఆడపిల్లవు అది చేయకు ఇది చేయకు అని.  నువ్వు చేయలేవు అని అనడం.  ఇలా మాట్లాడటం వల్ల ఆడపిల్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఆడపిల్ల తన జీవితంలో ఎలాంటి ఉన్నత లక్ష్యాలు సాధించకపోగా, భయస్థురాలిగా ఉండిపోతుంది. అందుకే ఆడపిల్లలను ప్రోత్సహించాలి తప్ప తక్కువ చేసి మాట్లాడకూడదు. పద్దతుల పేరుతో కఠినం.. సమాజంలో ఎంతో మంది తల్లిదండ్రులు పద్దతులను  మగపిల్లల కంటే ఆడపిల్లలను పెంచడంలోనే ఎక్కువ ప్రయోగిస్తారు. పద్దతుల పేరుతో ఆడపిల్లలను కఠినంగా, వారిని భయపెడుతూ పెంచుతారు.  కానీ ఆడపిల్లలను పద్దతుల పేరుతో భయపెట్టి కాదు.. ప్రేమతో పెంచాలి. సమస్యలు, పరిష్కారం.. ఆడపిల్లకు సామర్థ్యం ఉండదని, ఏ సమస్యను వారు ఎదుర్కోలేరని తల్లిదండ్రులు అనుకుంటారు. ఈ కారణంగానే ఆడపిల్ల ఏదైనా సమస్య అనగానే తండ్రే పరిష్కరించడం ఆడపిల్లను సేఫ్ జోన్ లో ఉంచడం చేస్తారు.  దీని వల్ల ఆడపిల్ల చేతకాని దాని లాగా,  సమస్యలు వచ్చినప్పుడు దిక్కుతోచక నిస్సహాయంగా ఉండిపోతుంది. అందుకే అన్ని సమస్యలు తండ్రి పరిష్కరించకుండా కొన్ని ఆడపిల్ల కూడా పరిష్కరించేలా అవకాశం ఇవ్వాలి.  ఇది జీవితంలో కొండంత ధైర్యాన్ని, సమస్యలను ఎదుర్కునే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.                                        *రూపశ్రీ.
  ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.. బయట ఎన్ని సమస్యలు ఉన్నా,  ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నా ఇంటికి రాగానే సంతోషం బోలెడు ప్రశాంతత,  జీవితంలో ఊరట కలుగుతోంది అంటే.. ఆ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉందని అర్థం. కానీ కొన్ని కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే కుటుంబ సభ్యులు చాలా వరకు మానసికంగా డిస్టర్బ్ అవుతుంటారు. అయితే  కుటుంబ వాతావరణం అనారోగ్యంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తరాల అంతరం వల్ల కుటుంబంలో వాతావరణం సరిగా లేకుండా ఉండే అవకాశం ఉంది, అలాగే కుటుంబ అలవాట్ల వల్ల కూడా వాతావరణం దెబ్బతింటుంది. కానీ కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.  వాటిని తెలుసుకుంటే.. కుటుంబం తిరిగి ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమోషన్స్ దుర్వినియోగం.. కుటుంబంలో సులభంగా గుర్తించగలిగే ప్రమాదకరమైన విషయాలు ఏవీ ఉండవు. కానీ చాలా సున్నితంగా ఉంటూనే మనుషుల్ని బాధపెడతారు. ఎమోషన్స్ తో ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులు తమదే తప్పు అన్న భావనను కుటుంబంలో  వ్యక్తికి కలిగిస్తారు. కొన్నిసార్లు, వారు బాధితులుగా నటిస్తూ ఎదుటివారిని ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం, సంతోషం ఉండవు. నిర్ణయాల దగ్గర బంధనం..  కుటుంబంలో జీవిత నిర్ణయాల గురించి మిమ్మల్ని అడగకుండా, తమకు తాము నిర్ణయాలు తీసుకుని ఆఖరిగా మీకు చెబుతూ ఉంటే.. ఒకవేళ అదే నిజమైతే, ఇది నిర్లక్ష్యం చేయకూడని విషయమని లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. . ఈ నియంత్రణ చిన్నతనం నుండి కౌమారదశ వరకు ఆరోగ్యకరంగానే ఉంటుంది. , కానీ  పెద్దయ్యాక కుటుంబ సభ్యుల నుండి ఇదే వైఖరి కొనసాగడం మంచిది కాదు. హద్దులు లేకపోవడం.. ప్రతిఒక్కరూ ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించుకున్నప్పుడే కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలా చేయడంలో విఫలమైతే, కాలక్రమేణా విషపూరితమైన సంబంధాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఈ విషయాలు  వ్యక్తి యొక్క భావోద్వేగ ఎదుగుదలకు చాలా కీలకమైనవి. గొడవల పరిష్కారం.. పరిష్కారం కాని కుటుంబ వివాదాలు చాలా కుటుంబాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పదేపదే మరో వాదనకు లేదా ఘర్షణకు దారితీసి, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. దీనివల్ల, ఆ విషయం పరిష్కారమైన తర్వాత కూడా ఎమోషనల్ దూరం పెరగవచ్చు. పట్టించుకోకపోవడం.. కుటుంబంలో మీ భావాలను లేదా అభిప్రాయాలను ఎప్పుడూ  పట్టించుకోవడం జరిగితే అది కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతై ఎమోషనల్ సపోర్ట్ లేదా అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుందో అప్పుడు ఆ ఇంట్లో వ్యక్తి పరాయివాడుగా ఫీలవుతారు.                                     *రూపశ్రీ.  
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే సులభమైన యోగా ఆసనాలు మరియు వ్యాయామాలను వివరంగా చూపించారు. ఈ యోగా పద్ధతులను సరైన విధంగా, క్రమం తప్పకుండా చేస్తే మోకాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్ల కదలిక మెరుగుపడుతుంది. మోకాళ్లలో గట్టిదనం తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇవి ఉపయోగపడవచ్చు. వయస్సుతో వచ్చే మోకాళ్ల సమస్యలు, ఆస్టియోఆర్థ్రైటిస్ ప్రారంభ దశలో ఉన్నవారు లేదా ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసే వారు కూడా ఈ వ్యాయామాల గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: మోకాళ్ల నొప్పికి కారణాలు మోకాళ్ల కండరాలను బలపరిచే యోగా వ్యాయామాలు నొప్పిని తగ్గించే సులభమైన స్ట్రెచింగ్ పద్ధతులు నడవడం, మెట్లు ఎక్కడం సులభం కావడానికి ఉపయోగపడే సూచనలు మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునే యోగా చిట్కాలు గమనిక: మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న వారు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదా శస్త్రచికిత్స అనంతర పరిస్థితి ఉంటే, ఈ వ్యాయామాలను ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి
నేటికాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్య కాలుష్యం.   గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది. అయితే చాలామంది ఇళ్లలో కూడా గాలి స్వచ్చంగా లేకపోవడం వల్ల శ్వాస సంబంధం సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంట్లో గాలి కాస్త డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది.   కొన్ని రకాల మొక్కలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల  గాలిని శుద్ది చేసి గాలిని స్వచ్చంగా మారుస్తాయి. అంతేకాదు. ఆక్సిజన్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తాయి.  ఇంట్లో ఆక్సిజన్ స్థాయిలను మెరుగు పరిచి,  గాలిని శుద్ది చేసే ఆ మొక్కలు ఏవో తెలుసుకుంటే.. ఇండోర్ మొక్కలు ఎందుకు ప్రయోజనకరంగా పరిగణించబడతాయి..? ఇంట్లో పెంచే మొక్కలను ఇండోర్ మొక్కలు అని అంటారు.  ఈ మొక్కలు  గాలిని సహజంగా శుద్ది చేసే పరికరాలుగా  పనిచేస్తాయి. అవి కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించి, ఆక్సిజన్‌ను విడుదల చేయడం ద్వారా గాలిలోని హానికరమైన కాలుష్య కారకాలను తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, అవి ఇంటి అలంకరణకు కూడా ఎంతో మంచివి.  చాలా మంది ఇళ్లలో అలంకరణ కోసం మొక్కలను పెంచుతారని అనుకుంటారు. కానీ.. ఇవి అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఇంట్లో గాలిని శుద్ది చేయడానికి కూడాపెంచుతారు. ఇంట్లో గాలిని శుద్ది చేసి ఆక్సిజన్ పెంచే మొక్కలు.. పీస్ లిల్లీ.. ఇంటి లోపల చక్కగా పెరిగే ఒక  మొక్క పీస్ లిల్లీ..  ఈ మొక్కల పువ్వులు చాలా విభిన్నంగా ఉంటాయి. గాలి చాలా బాగా శుద్ది చేయడంలో ఈ మొక్కలు చాలా గొప్పగా సహాయపడతాయి.  కలబంద.. కలబంద ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా ఉండే మొక్క, అయితే ఇళ్లలో వాడే  డిటర్జెంట్లు, పెయింట్లు,  గమ్ లలో  ఉండే కొన్ని సాధారణ రసాయనాలు గాలిలో కలిసిపోయి ఉంటాయి. అలాంటి  గాలిని శుద్ధి చేసి, ఇంటిని తాజాగా ఉంచే సామర్థ్యం కలబందకు ఉంది. స్నేక్ ప్లాంట్.. నీరు, వెలుతురు, సూర్యరశ్మి సరిగా లేకపోయినా, చాలా తక్కువగా ఉన్నా సరే..అలాంటి వాతావరణంలో కూడా స్నేక్ ప్లాంట్ పెరుగుతుంది. దీనికున్న ప్రత్యేక లక్షణం .. ఇది రాత్రిపూట కూడా కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మారుస్తుంది, అందువల్ల ఇది పడకగదిలో పెంచడానికి కూడా చాలా అనువైన మొక్క. మనీ ప్లాంట్.. వాస్తు పరంగా , శాస్త్రీయంగా కూడా చాలా ప్రాచుర్యం పొందిన మొక్క మనీ ప్లాంట్, భారతీయులలో చాలా ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటుంది. ఇది ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదని,  ఆర్థిక ఎదుగుదల ఉంటుందని అనుకుంటారు. ఇంటిలోని మూసి ఉన్న గదులలోని కలుషిత గాలిని శుభ్రపరచడానికి , ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. స్పైడర్ ప్లాంట్.. పొడవాటి, చారల ఆకులతో ఉండే ఈ మొక్క వేగంగా పెరుగుతుంది . దీనికి పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు. గాలి నుండి కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పైన చెప్పుకున్న మొక్కలను ఇంట్లో  పెంచుకుంటే ఇంటి వాతావరణం,  ఇంటి గాలి చాలా శుద్ధంగా మారుతుంది.                                   *రూపశ్రీ.  
ఉద్గీత ప్రాణాయామం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు..రోజుకు 5 నిమిషాలు చాలు.! రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం (ఓం ధ్యానం) చేస్తే శరీరం, మనసు ఎలా మారుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో ప్రముఖ సీనియర్ యోగా థెరపిస్ట్ & ఆయుర్వేద డైటీషియన్ శ్రీమతి స్రవంతి రఘు గారు ఉద్గీత ప్రాణాయామాన్ని సరైన పద్ధతిలో ఎలా చేయాలో సులభంగా వివరిస్తారు. అలాగే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయంగా నిరూపితమైన అంశాలు, ఒత్తిడి తగ్గడం, మానసిక ప్రశాంతత పెరగడం, ఏకాగ్రత మెరుగుపడడం, మంచి నిద్రకు సహాయపడడం వంటి విషయాలను వివరంగా తెలియజేస్తారు. అంతేకాకుండా, ఉద్గీత ప్రాణాయామాన్ని ఎవరు చయాలి? ఎవరు చేయకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రారంభ స్థాయి వారు ఎలా ప్రారంభించాలి? వంటి ముఖ్యమైన సందేహాలకు కూడా సమాధానాలు ఈ వీడియోలో పొందుపరిచారు. యోగా, ధ్యానం, సహజ ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఉపయోగకరమైన వీడియో ఇది. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, ఉద్గీత ప్రాణాయామాన్ని సరైన విధంగా అభ్యసించి ఆరోగ్యకరమైన జీవనశైలికి నాంది పలకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)