
ఇటీవల విజువల్ వండర్‌గా, మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ‘నాగబంధం’. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్టింగ్స్‌తో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమాకు అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మించారు. ఇప్పుడీ ‘నాగబంధం’ టీమ్, తమ తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను టాలెంటెడ్ హీరో శర్వానంద్‌తో ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరో సంచలన విషయం ఏమిటంటే, దీని కోసం ఏకంగా రూ. 80 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించబోతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలవనుందని అంచనా వేస్తున్నారు.
‘నాగబంధం’ సినిమాతో విజువల్స్ పరంగా, మేకింగ్ వాల్యూస్ పరంగా అద్భుతమైన ప్రతిభను కనబరిచిన ఈ టెక్నికల్ అండ్ ప్రొడక్షన్ టీమ్, శర్వానంద్ కోసం ఒక విభిన్నమైన, మునుపెన్నడూ చూడని సరికొత్త కథాంశాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ శర్వానంద్ బాడీ లాంగ్వేజ్‌కు, ఆయన నటనకు సరిగ్గా సరిపోయేలా ఉండటంతో పాటు, కమర్షియల్‌గా కూడా భారీ స్థాయిలో వర్కవుట్ అయ్యే ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
రూ. 80 కోట్ల బడ్జెట్ అంటే కేవలం మేకింగ్ పరంగానే కాకుండా, హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ (VFX), భారీ యాక్షన్ సీక్వెన్సులు, దేశ విదేశాల్లో జరిపే గ్రాండ్ ప్రొడక్షన్ షెడ్యూల్స్ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారని టాక్. ‘నాగబంధం’ టీమ్‌కు గ్రాండ్ విజువల్స్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంలో ఉన్న అనుభవం ఈ కొత్త ప్రాజెక్ట్‌కు ప్లస్ పాయింట్ కానుంది.
శర్వానంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'భోగి' అనే పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే ఈ కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని వినికిడి. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని టాక్.
Nagabandham, Sharwanand, Tollywood






