ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులాల పేరుతో జరుగుతున్న విద్వేష రాజకీయాలపై డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కుల సంఘాలు ఏర్పాటు చేసుకుని వాటి  ద్వారా కొందరు నాయకులు మాత్రమే బాగా బాగుపడ్డారని, ఆయా కులాల్లోని సామాన్య ప్రజలు మాత్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా తీవ్రంగా నష్టపోతున్నారనిఅన్నారు.  అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్..  కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని  పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే  జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.   వైసీపీ  హయాంలో కుల రాజకీయాలు, ఒకరినొకరు కులం పేరుతో దూషించుకునే సంస్కృతి పరాకాష్టకు చేరిందని విమర్శించిన పవన్ కల్యాణ్..  నిజానికి 1998 నుంచే ఈ తరహా కుల ధోరణులు మొదలైనప్పటికీ,   వైసీపీ పాలనలో ఆ ధోరణులు పీక్స్ చేరుకున్నాయనీ,  జర్నలిస్టులను సైతం కులం పేరుతో బహిరంగంగా దూషించే స్థాయికి పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని దారుణమైన ఘటనలను పవన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ, దళిత యువకుడిని దారుణంగా హత్య చేసి, ఆ మృతదేహాన్ని ఏకంగా డోర్ డెలివరీ చేసినా అప్పటి పాలకులు హంతకుడిని వెనకేసుకొచ్చారన్నారు. అంత పెద్ద దారుణం జరిగినా దళిత సంఘాలు సైతం భయంతో మాట్లాడలేని నిరంకుశ పరిస్థితిని సృష్టించారనీ,  అదేవిధంగా..  కరోనా మహమ్మారి సమయంలో కేవలం నిజాలు మాట్లాడినందుకు డాక్టర్ సుధాకర్‌ను మానసికంగా తీవ్రంగా హింసించి, ఆయన మరణానికి కారణమైనప్పుడు ఏ కుల సంఘాలూ నోరు మెదపలేదని దుయ్యబట్టారు. ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు కుల సంఘాల నాయకులు మౌనంగా ఉండిపోవడం వల్లే ఆయా నాయకులు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని, కానీ ప్రజలు మాత్రం తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.  మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వంటి మహనీయులు కలలుగన్న కుల నిర్మూలన అనే ఆశయం నేటి రోజుల్లో పూర్తిగా సాధ్యమో కాదో తెలియదు కానీ..  కులాల మధ్య కనీస ఐక్యత, పరస్పర సహకారం ఉండటం నేటి సమాజానికి అత్యంత అవసరమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ విచ్ఛిన్నకర కుల రాజకీయాలకు ముగింపు పలకాలని తమ   ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందని తెలిపారు.  ఇకపై ఆంధ్రప్రదేశ్‌లో కులాల ఐక్యతను చాటుతూ, కేవలం అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఆధారంగానే రాజకీయాలు సాగుతాయని, ఇందుకు జనసేన నాయకత్వం  కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
తెలంగాణ గడ్డపై రాజకీయ  వేడెక్కింది. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన జనసేన పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో  సంచలనం సృష్టిస్తున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీని విస్తరిస్తామనీ, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ   పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన ప్రాంతీయవాదంపై కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే చాలా ప్రమాదకరమని  అభివర్ణించారు. అంతేకాకుండా.. తెలంగాణ గడ్డ ఎవరి జాగీరు కాదంటూ పవన్ కల్యాణ్  చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా గాయకుడు గద్దర్ బతికున్న సమయంలో ఆయనకు తాను వాహనం కొనిచ్చి సహాయం చేశాననీ,     ఏపీలో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేస్తాననీ ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై గద్దరు కుటుంబం మండిపడింది.  గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్  మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని,  తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని  అవమానించేలా ఉన్నాయని  మండిపడ్డారు. ఈ మేరకు ఆమె   సోషల్ మీడియా వేదికగా  పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. "పవన్ కల్యాణ్ ను   ఒక నటుడిగా, గద్దర్ అభిమానిగా తెలంగాణ ప్రజలు గౌరవిస్తారనీ, అయితే..  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన మాట్లాడిన మాటలను  తెలంగాణ ఆడబిడ్డగా   తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు.  అలాగే.. తెలంగాణ మీ జాగీరా  అన్న పవన్ వ్యాఖ్యలకు బదులిస్తూ.. అవును  తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే, ఈరోజు మా జాగీరు, రేపు మా బిడ్డల జాగీరు. ఇది ముమ్మాటికీ మా జాగీరే అని పేర్కొన్నారు.  
  తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. తాజాగా అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో త్వరలో జరగబోయే రాజ్యసభ ఉప ఎన్నికకు సంబంధించి అధికార తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఒక కీలకమైన మరియు వ్యూహాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకుంటూ, కూటమిలోని ఐక్యతను చాటిచెప్పేలా ఈ రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తున్నట్లు టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అధికారికంగా ప్రకటించారు. బుధవారం నాడు ఆయన విడుదల చేసిన ఈ ప్రకటనతో తమిళ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూటమిలోని మిగిలిన భాగస్వామ్య పక్షాలు కూడా ఏకగ్రీవంగా స్వాగతించాయి. ఈ ఉప ఎన్నిక రావడానికి వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. గతంలో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సీవీ షణ్ముగం ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మైలాం నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. దాంతో ఆయన తన ఎంపీ పదవికి మే 7వ తేదీన రాజీనామా చేసి, ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన ఆ ఒక్క రాజ్యసభ స్థానానికే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికను నిర్వహిస్తోంది. జూన్ 18వ తేదీన ఈ కీలకమైన ఉప ఎన్నిక జరగనుంది. అధికారంలో ఉన్న టీవీకే కూటమి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో, ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న ఎగువ సభలో కాంగ్రెస్ పార్టీ బలం మరో స్థానం పెరగడానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఈ రాజ్యసభ స్థానానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను రిటర్నింగ్ అధికారిగా పీ తెన్మోళి పర్యవేక్షిస్తున్నారు. జూన్ 8వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. అయితే ఇందులో భాగంగా ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరిస్తారని అధికారులు స్పష్టం చేశారు. ఆ తర్వాత జూన్ 9వ తేదీ నుండి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి జూన్ 11వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఆ గడువు ముగిసిన వెంటనే పోటీలో నిలిచే తుది అభ్యర్థుల అధికారిక జాబితాను ప్రకటిస్తారు. చివరగా జూన్ 18వ తేదీన అత్యంత ఉత్కంఠభరితంగా పోలింగ్ జరగనుంది. జూన్ 18న ఉదయం 9.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4.00 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ చూపిన ఈ పొత్తు ధర్మం కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నిర్ణయంతో తమిళనాడులో అధికార కూటమి మరింత బలోపేతం కావడమే కాకుండా, రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో కూడా ఈ కూటమి మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ALSO ON TELUGUONE N E W S
    పవన్ కళ్యాణ్(Pawan Kalyan),ప్రకాష్ రాజ్(Prakash Raj)కాంబో సెల్యులాయిడ్ పై చేసే మెస్మరైజ్ కి లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం సుస్వాగతం మూవీతో స్టార్ట్ అయిన ఆ కాంబో మ్యాజిక్  మొన్న ఓజి వరకు కొనసాగుతూనే వస్తుంది. రాజకీయాల్లోను భిన్న దృవాలుగా ఉంటూ పలు సంచలనాలకి వేదికగా నిలుస్తూ వస్తున్నారు.   పవన్ కల్యాణ్ ఇటీవల మాట్లాడుతూ తెలంగాణాలో జనసేన తరుపున పోటీ చేస్తామని ప్రకటించాడు. ఈ  వ్యాఖ్యలపై  ప్రకాష్‌రాజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తు 'మీరొస్తామంటే మేమొద్దంటామా.. రండి దొర  సింగిల్‌గా వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా చెప్పి రండి  అంటూ ట్వీట్ చేశాడు.  Also read: Peddi: మళ్ళీ పుడతామా యేటి.. పెద్ది బ్లాక్ బస్టర్  అయితే ప్రకాష్‌రాజ్ పోస్టుకి బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ప్రతి దాంట్లో వేలు ఎందుకు పెడతా. అసలు నువ్వెవరు.. తమిళోడివా.. తెలుగోడివా, కన్నడిగవా! ప్రతి విషయంపై  జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా ప్రధానివా!  అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వవద్దు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో అంటూ ప్రకాష్ రాజ్ కి  బండ్ల గణేష్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసాడు.  
  మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)పెద్ది(Peddi)తో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో నిన్న ప్రీమియర్స్ నుంచి సందడి చేస్తున్నాడు. గేమ్ చేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత వచ్చిన మూవీ కావడంతో అభిమానులతో పాటు, ప్రేక్షకులు పెద్ది ఎలా ఉంటాడో అనే ఆసక్తితో థియేటర్స్ లో అడుగుపెడుతున్నారు. బయటకి వచ్చిన వాళ్లంతా పెద్ది సూపర్ గా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటంతో పాటు చరణ్ నోటి నుంచి వచ్చిన 'మళ్ళీ పుడతామా యేటి, ఏదైనా ఈ భూమ్మీద ఉన్నప్పుడే చేసేయాలి'అనే మాటలోనే పెద్ది కథ మొత్తం ఉందని చెప్తున్నారు. మరి  వాళ్ళు చెప్తున్న పూర్తి పాయింట్ ఏంటో చూద్దాం. also read: Peddi Movie Review In Telugu: పెద్ది మూవీ రివ్యూ 'మళ్ళీ పుడతామా యేటి'.. పెద్దిలో చరణ్ తన క్యారక్టర్ కి తగ్గ పలికే ఊతపదం.. చిన్న చిన్న పనులు చేసుకునే పెద్ది డబ్బు కోసం ఆట కూలీగా క్రికెట్ ఆడతాడు. తన ఊరి మనిషి అప్పలసూరి వేగంగా వస్తున్న ట్రైన్ కి ఎదురు నుంచొని ప్రాణాలు కోల్పోతాడు. అప్పలసూరి చనిపోయేది తన ఊరు గురించి ప్రపంచానికి తెలియాలని. దీంతో పెద్ది తనకి పరిచయం, అలవాటు కూడా లేని కుస్తీని నేర్చుకొని ఇండియా తరుపున ఆడతాడు. కానీ సొంత శత్రువు చేసిన పని వల్ల ఫైనల్ ఆడకపోతాడు. దీంతో  తన ఊరి కోసం ఒక కాలు పోయేలా చేసుకొని పారా ఒలింపిక్ ఆడి తను అనుకున్న లక్షాన్ని సాధిస్తాడు. పైన చెప్పుకున్నవన్నీ ఎంతో కష్టమైనా కూడా 'మళ్ళీ పుడతామా యేటి, ఏదైనా సరే ఈ జన్మలోనే తీర్చుకోవాలని తన గోల్ సాధిస్తాడు. ఆ ఒక్క డైలాగ్ పెద్ది కథ మొత్తానికి జస్టిఫై అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు.  
టాలీవుడ్‌లో ఒక సినిమా విజయాన్ని డిసైడ్ చేయడంలో సోషల్ మీడియా టాక్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చే పెద్ద సినిమాల విషయంలో ప్రీమియర్ షోల నుంచే అసలు కథ మొదలవుతుంది. తాజాగా విడుదలైన 'పెద్ది' (Peddi) సినిమా విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఈ సినిమా ప్రీమియర్ షోలు పడగానే సోషల్ మీడియా వేదికగా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినిమాను మొదటగా చూసిన కొందరు నెటిజన్లు ఆరంభంలో కాస్త మిశ్రమ స్పందనను పంచుకోవడంతో అభిమానులు షాక్ అయ్యారు. ప్రీమియర్ షోల అనంతరం సోషల్ మీడియా వేదికగా మొదట యావరేజ్ టాక్ బయటకు వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతగా ఏం లేదు, కేవలం కొన్ని సీన్లు మాత్రమే పండాయని అభిప్రాయపడ్డారు. అలాగే సెకండ్ హాఫ్ పరవాలేదు, యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్ బాగున్నాయంటూ ఓవరాల్ గా మూవీ యావరేజ్ అన్నట్టుగా కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. ఈ రకమైన నెగెటివ్ మరియు యావరేజ్ కామెంట్లు చూసి అభిమానులు కాస్త కంగారు పడ్డారు. సినిమా ఫలితం ఏమౌతుందో, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరిస్థితి ఎలా ఉంటుందో అని ట్రేడ్ వర్గాల్లో కూడా చిన్నపాటి చర్చ నడిచింది. కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. రాత్రి వచ్చిన యావరేజ్ టాక్‌ను తిప్పికొడుతూ ఉదయానికి సీన్ పూర్తిగా మారిపోయింది. మౌత్ టాక్ అద్భుతంగా రావడం మొదలైంది. సినిమా చాలా బాగుందని, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులకు కూడా పర్ఫెక్ట్ విందు భోజనం లాంటిదని జనరల్ ఆడియన్స్ చెబుతున్నారు. ముఖ్యంగా సినిమాకు సెకండ్ హాఫ్ హైలైట్ అని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. డైరెక్టర్ రాసుకున్న ఎమోషనల్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్ మరియు క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో సీట్లలో కూర్చోనివ్వకుండా చేస్తున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. మొదట సోషల్ మీడియాలో వచ్చిన రివ్యూలు కేవలం కొందరి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, థియేటర్లలో సాధారణ ప్రేక్షకుడు సినిమాను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడని స్పష్టమైంది. ఉదయం షోల హౌస్‌ఫుల్ కలెక్షన్లు, పాజిటివ్ మౌత్ టాక్ చూస్తుంటే 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్‌లో ఒక సినిమా టాక్ క్షణాల్లో ఎలా మారిపోతుందో చెప్పడానికి ఈ సినిమా ఓ పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిచింది. మొత్తానికి నెగెటివ్ ప్రచారాన్ని దాటుకుని రేసులో దూసుకుపోతున్న ఈ క్రేజీ మూవీ, ఫస్ట్ వీకెండ్‌లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.  
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' (Dragon) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా విడుదలైన గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు (జూన్ 4) ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మూవీ నుండి సర్ ప్రైజ్ అయితే ఏం రాలేదు కానీ, ఎన్టీఆర్ తన ట్వీట్ తో 'డ్రాగన్'ని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. కేజీఎఫ్ సిరీస్, సలార్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన శుభాకాంక్షలు తెలియజేశారు. జూన్ 4న ప్రశాంత్ నీల్ బర్త్‌డే కావడంతో, తారక్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక ప్రత్యేకమైన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో ఆయన రాసిన మాటలు మరియు పంచుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ తన ట్వీట్‌లో, "హ్యాపీ బర్త్‌డే డైరెక్టర్ అవారే (కన్నడలో గారు). మీరు చెప్పే కథలంత ఘనంగా ఈ సంవత్సరం మీకు గడవాలని కోరుకుంటున్నాను. మన ఇద్దరి కాంబినేషన్‌లో రాబోయే ప్రాజెక్ట్ కోసం, మన భవిష్యత్తులో ఏముందో చూడటానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను" అంటూ విషెస్ చెప్పారు ఎన్టీఆర్.  ఈ ట్వీట్‌తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ లొకేషన్‌లో మైక్ పట్టుకుని నడుస్తున్న పవర్‌ఫుల్ వర్కింగ్ స్టిల్‌ను కూడా ఎన్టీఆర్ షేర్ చేశారు.   https://x.com/tarak9999/status/2062372979716342103
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan), బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో సందడి చేస్తోంది. ఒక సాధారణ ఆట కూలీ, అంతర్జాతీయ స్థాయి క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా ఎదిగి.. తనకి, తన ఊరికి గుర్తింపు ఎలా తెచ్చాడు అనేదే ఈ చిత్ర కథాంశం. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ‘పెద్ది’ సినిమాలోని ప్రేక్షకులను కట్టిపడేసే మేజర్ హైలైట్స్ ఇవే: 1. రామ్‌చరణ్ ‘ఆట కూలీ’ అవతారం సినిమా ప్రారంభంలో రామ్‌చరణ్ లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా ఉంటాయి. డబ్బుల కోసం వేరే ఊర్ల తరఫున క్రికెట్ మ్యాచ్‌లు ఆడే ఒక సాధారణ 'ఆట కూలీ' పాత్రలో చరణ్ పలికించిన సహజ నటన సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. 2. క్రికెట్ చరిత్రలో లేని సరికొత్త షాట్లు ఫస్టాఫ్‌లో వచ్చే క్రికెట్ మ్యాచ్‌లు కేవలం ఆటలా కాకుండా, పక్కా కమర్షియల్ మాస్ ఎలివేషన్లతో సాగుతాయి. ముఖ్యంగా క్రికెట్ రూల్స్ బుక్‌లో లేని సరికొత్త షాట్లను చరణ్ స్క్రీన్‌పై కొడుతుంటే మాస్ ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయం. 3. కుస్తీ వీరుడిగా శారీరక మేకోవర్ సినిమా సెకండాఫ్‌లోకి వచ్చేసరికి చరణ్ పూర్తిగా కుస్తీ క్రీడాకారుడిగా రూపాంతరం చెందుతారు. ఈ పాత్ర కోసం ఆయన పెంచిన బాడీ, రింగులో ఆయన చూపించిన రౌద్రం, యాక్షన్ సీక్వెన్సులు చరణ్ కెరీర్‌లోనే అత్యంత కష్టపడ్డ పాత్రల్లో ఇదొకటని నిరూపిస్తాయి. 4. ఇంటర్వెల్ ముందు మలుపు సినిమా ఇంటర్వెల్ కథను ఊహించని మలుపు తిప్పుతుంది. అప్పటివరకు వినోదాత్మకంగా సాగిన సినిమా.. ఇంటర్వెల్‌కి వచ్చేసరికి అప్పలసూరి (జగపతిబాబు) పాత్ర చుట్టూ అల్లిన ఒక వినూత్నమైన ఘట్టంతో థియేటర్లలో హై వోల్టేజ్ ఎమోషన్‌ను క్రియేట్ చేస్తుంది. 5. క్రికెట్ టు కుస్తీ.. ‘క్రాస్ ఓవర్’ మ్యాజిక్ ఒకే సినిమాలో రెండు భిన్నమైన క్రీడలను చూపించడం ఒక ఎత్తయితే.. క్లైమాక్స్ వైపు వెళ్లేకొద్దీ ఆ రెండు ఆటలను (క్రికెట్, కుస్తీ) మిక్స్ చేస్తూ హీరో మైదానంలో చేసే విన్యాసాలు, క్రాస్ ఓవర్ అథ్లెట్ కాన్సెప్ట్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను ఇస్తుంది. 6. ‘కొండ కింద ఊరు’ ఆత్మగౌరవ పోరాటం దర్శకుడు బుచ్చిబాబు కేవలం ఆటల చుట్టూనే కాకుండా, సమాజంలో గుర్తింపు లేని ‘కొండ కింద ఊరు’ ప్రజల ఆత్మగౌరవాన్ని కథాంశంగా ఎంచుకున్నారు. ఆ ఊరి మనుషుల భావోద్వేగాలు, వారి గెలుపు కోసం హీరో పడే తపన ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. 7. జగపతిబాబు, ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్ అప్పలసూరిగా జగపతిబాబు నటన సినిమాకి అసెట్‌గా నిలిచింది. ఆయనతో పాటు ఎమోషనల్ సీన్స్, కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ పాత్ర, జాన్వీ కపూర్ గ్లామర్ సినిమా స్థాయిని పెంచాయి. 8. ఏఆర్ రెహమాన్ సంగీతం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమా ప్రాణంగా నిలిచాయి. క్రీడా నేపథ్యంలో వచ్చే ఎమోషనల్ సీన్స్‌ను, యాక్షన్ బ్లాక్స్‌ను తన మ్యూజిక్‌తో ఆయన నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. 9. రత్నవేలు విజువల్ వండర్ ఆర్.రత్నవేలు కెమెరా పనితనం ప్రతి ఫ్రేమ్‌లోనూ గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర (విజయనగరం) పరిసర ప్రాంతాలు, పచ్చని లోయలు, జలపాతాలు మరియు స్టేడియం విజువల్స్‌ను ఆయన తెరపై ఆవిష్కరించిన తీరు కంటికి విందులా ఉంది. 10. గుండెలను హత్తుకునే భావోద్వేగాలు సినిమా సెకండాఫ్‌లో కేవలం ఫైట్లు, ఆటలకే పరిమితం కాకుండా.. ఆసుపత్రి నేపథ్యంలో వచ్చే కొన్ని సెంటిమెంట్ సీన్స్ మరియు హీరో గురువుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. కొన్ని లాజిక్స్, అక్కడక్కడా చిన్నపాటి లోపాలు పక్కన పెడితే.. కమర్షియల్ హంగులతో కూడిన ఒక సరికొత్త స్ఫూర్తిదాయకమైన స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.  
Cast: Ram Charan, Janhvi Kapoor, Jagapathi Babu, Shiva Rajkumar, Divyenndu Sharma Crew: Music Director: A.R. Rahman Cinematography: R. Rathnavelu Editing: Navin Nooli Writer-Director: Buchi Babu Sana Producer: Venkata Satish Kilaru   Mega Power Star Ram Charan's Peddi has finally arrived in theatres after being a highly anticipated film for over an year. Buchi Babu Sana after his Uppena shot this film for 285 days and brought a cross-over athlete point to the table. How did Ram Charan fare and what is the movie all about? Did it live up to expectations? Let's discuss in detail.  Plot: Peddi (Ram Charan) hails from a nameless village, referred to as Konda kinda ooru (Village in the Valley) and he is a cricketer coolie who plays for the team that bids high. Vijayanagaram and Bobbili teams bid for him and he always plays for Rambujji (Divyenndu) as he outbids Bobbili team by one rupee. Achiamma (Janhvi Kapoor), local politician (Rao Ramesh)'s daughter campaigns for her father to make him MLA while Rambujji's father is sitting MLA. Rambujji vs Achiamma battle grows to public humiliation range in cheapest way.  Peddi, who loves Achiamma goes against Rambujji. Hence, he gets humiliated on cricket field and looking at his playing style, popularity Gournaidu (Shiva Rajkumar) offers him to join his Kushti academy, as the wrestling sport is losing prominence. Meanwhile, Appalasoori (Jagapathi Babu) goes around every government office for 30 years to bring railway station and thereby an identity to his Konda Kinda ooru. What happens to him? Will Peddi take up Kushti? If so, why he changes to track and field? Watch the movie to know more.  Analysis: Ram Charan delivered a very earnest performance. His honesty, commitment and hardwork are visible in each frame. He transformed his body to fit different sports and villager posture. His performance in hospital scene and climax standout. His dance moves in Rai Rai Raa Raa a d Chikiri Chikiri are good. Next to him, Jagapathi Babu leaves a great impression. Unfortunately, none of the others have characters that really leave their mark.  Shiva Rajkumar has a great screen presence and he did pull off Gournaidu role but the character ends abruptly. Many other characters too seem to change just like that and Divyenndu Sharma is criminally underutilised. Boman Irani has nothing to offer. Janhvi Kapoor scenes and character needed a lot more refining and fine tuning. There is a line between crass and edgy, her scenes don't land perfectly on that line.  Buchi Babu once again relied heavily on shock value twist in the pre-climax stretch and pre-interval. He seems to believe in melodrama rather than subtlety and it works for few sequences only and not entirely. Convenience takes over and hero's challenges also appear to be drafted out because hero needs some. With concentration on one sport also, the necessary identity could have been achieved without the final twist.  Technically, AR Rahman took over the moment pre-interval stretch starts and he did not drop the tempo till the climax. His music enhanced visuals and performances. Rathanavelu's camera work is good. Navin Nooli's editing is severely patchy and at places, shots did not sync with content. Production values by Venkata Satish Kilaru standout but this film really needed 285 days of shoot?  Overall, Ram Charan's performance saves the movie from being random and choppy. With concentration on too many sports, and village issues, the screenplay lossss focus. Also, the commercial template style narrative undermines impact. But for Ram Charan it is an eaay one-time watch and for trying something beyond action dramas this sports drama can be given a chance.  Positives: Ram Charan's performance AR Rahman Background Score  Kushti scenes  Cinematography  Production Values  Negatives: Predictable Screenplay  Uneven pacing and editing  Janhvi Kapoor scenes  Underutilisation of Characters  Bottomline:  A complete one-man show of Ram Charan.  Rating: 2.75/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them
  -సినిమా పేరు: పెద్ది  -న‌టీన‌టులు:  రామ్ చరణ్, జాన్వీ కపూర్, శృతి హాసన్, శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యెందు శర్మ, బొమన్ ఇరానీ, అజయ్ ఘోష్ తదితరులు    -సినిమాటోగ్ర‌ఫీ: ఆర్. రత్నవేలు  -ఎడిటింగ్: నవీన్ నూలి -మ్యూజిక్: ఏ ఆర్ రెహ్మాన్  -నిర్మాత‌లు: వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా  -బ్యానర్స్: వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ఐవివై    -రచన,దర్శకత్వం: బుచ్చిబాబు సాన - రిలీజ్ డేట్: జూన్ 4  2026  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రీమియర్స్ నుంచే పెద్దితో వరల్డ్ వైడ్ గా ల్యాండ్ అయ్యాడు. ప్రచార చిత్రాల ద్వారా అభిమానులు, మూవీ లవర్స్, సినీ వర్గాల్లో పెద్దిపై  పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయి. మరి చరణ్ కెరీర్ లోనే మోస్ట్ ప్రెస్టేజియస్ట్ గా కూడా గుర్తింపు పొందిన పెద్ది ఎలా ఉందో చూద్దాం. కథ పెద్ది(రామ్ చరణ్) ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం దగ్గరలోని అడవుల్లో ఒక కొండ కింద ఉండే గ్రామంలో ఉంటాడు. గ్రామం అనే కానీ పేరు ఉండదు. బతకడం కోసం చిన్న చిన్న పనులు చేసుకునే పెద్ది ఆట కూలీగా క్రికెట్ ఆడుతుంటాడు. ఆడటమే కాదు ప్రతి బంతికి సిక్సర్లు కొట్టడంలో స్పెషలిస్ట్. చాలా మంది పెద్ది పై పందాలు కూడా కడుతుంటారు. అలాంటి పెద్ది క్రికెట్ ని వదిలి ప్రాణాలని, జీవితాన్ని పణంగా పెట్టి కుస్తీ నేర్చుకుంటాడు. పెద్ది క్రికెట్ ని వదిలి కుస్తీ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి? నేర్చుకునే సమయంలో పెద్దికి శత్రువులు ఏర్పడితే వాళ్ళు ఎవరు? పెద్దికి కుస్తీ నేర్పింది ఎవరు? కుస్తీ తోనే తన ఆట ఆపాడా? లేక మరో ఆట కూడా ఆడాడా? ఆడితే ఆ ఆట ఏంటి?  ఈ కథలో  మిగతా క్యారక్టర్ ల తీరు ఏంటి? అసలు పెద్ది లక్ష్యం ఏంటి? అది సాధించాడా లేదా అనేదే పెద్ది. ఎనాలసిస్   ప్రచార చిత్రాలతో పెద్ది కథ పలానా విధంగా ఉండబోతుందని ఆడియెన్స్ ఉహించుకున్నారో  పెద్ది అలాగే ఉంది. కానీ బుచ్చిబాబు అత్యద్భుతంగా తెరకెక్కించాడు. చరణ్ పెర్ ఫార్మెన్స్ ప్రధాన హైలెట్. వన్ మాన్ షో అని చెప్పవచ్చు. జాన్వీ క్యారక్టరయిజేషన్ ఇంకొంచం ఉంటే బాగుండేది. పైగా క్యారక్టర్ తీరుతెన్నులు ఓవర్ డోస్ అనిపించాయి. రెహ్మాన్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్ లెంట్.  సినిమా ప్రారంభమే బిస్వాన్ అనే స్పోర్ట్స్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ రావడం, పెద్ది గురించి  ఒక గ్రామస్థుడు   బిస్వాన్ కి చెప్పడంతో మంచి క్యూరియాసిటీ ఏర్పడింది. చరణ్ ఇంట్రడక్షన్ సూపర్.  పెద్ది, రామ్ బుజ్జి, అచ్చాయమ్మా తో వచ్చిన  సీన్స్ బాగున్నాయి. అప్పల సూరి క్యారక్టర్ లక్ష్యం, అందుకు చూపించే  తాపత్రయం టోటల్ ఫస్ట్ హాఫ్ కే హైలెట్.. అప్పలసూరి, పెద్ది మధ్య ఇంకొంచం  బాండింగ్ ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది. ఎంటర్ టైన్ మెంట్ ని కూడా మరింతగా ఎస్టాబ్లిష్ చెయ్యాల్సింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ పెద్ద కిక్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో పెద్ది కుస్తీ ఎపిసోడ్ సూపర్. గౌరు నాయుడుతో వచ్చిన సీన్స్ తో పాటు పోటీల సీన్స్ బాగున్నాయి. ఇంకా కుస్తీనే కదా ఉందనుకునే టైంలో పెద్ది తీసుకున్న ఒక నిర్ణయం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ గా పెద్ది చుట్టూనే నడుస్తుంది. చివరి పావుగంట మూవీ ఒక రేంజ్ లో ఉంది.. క్లైమాక్స్ సూపర్ నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు  పెద్దిగా చరణ్ పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మూవీ మొత్తాన్ని మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ తో ఒంటి చేత్తో నడిపించాడు. అచ్చాయమ్మాతో వచ్చే లవ్ సీన్స్ , సాంగ్స్ ,డాన్స్ . క్రికెట్, కుస్తీ, రెజ్లింగ్  సీన్స్ లో  చరణ్ పెర్ఫార్మ్ నభూతో నభవిష్యత్తు . నిజంగానే మన దేశం తరుపున ఒలింపిక్స్ కి పంపిస్తే చరణ్ గెలవడం ఖాయమని అనిపించాడు. క్లైమాక్స్  సీన్ లో అయితే ఏడిపించేసాడు. చరణ్ కెరీర్ లోనే పెద్ది పెర్ఫార్మ్  ఒక మైల్ స్టోన్  గా నిలబడుతుంది.  అచ్చాయమ్మా గా జాన్వీ అత్యద్భుతమైన పెర్ఫార్మ్ కనపరిచింది. పక్క విలేజ్ అమ్మాయి క్యారక్టర్ లో ఒదిగిపోయింది. గౌరు నాయుడు గా శివరాజ్ కుమార్ పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన క్యారక్టర్ ఔన్నత్యం యొక్క మొత్తాన్ని కళ్లతోనే చెప్పాడు. అసలు ఆ క్యారక్టర్ కి శివరాజ్ కుమార్ ని తప్ప మరొకర్ని ఊహించలేం. అప్పలసూరి గా చేసిన జగపతిబాబు కూడా అంతే. తెలుగు సినిమాకి దొరికిన ఎంత వాల్యుబుల్ ఆర్టిస్ట్ నో మరోమారు చెప్పాడు.అవార్డు తీసుకొచ్చే పెర్ఫార్మ్.  రామ్ బుజ్జిగా దివ్యెందు శర్మ పర్ఫెక్ట్ గా సూటయ్యాడు.  నాచురల్ పెర్ఫార్మ్ తన స్టైల్ అని మరో సారి చాటి చెప్పాడు. తెలుగులో మరిన్ని అవకాశాలు రావచ్చు. మిగతా రోల్స్ లో చేసిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి  పెద్దికి మరింత వన్నె తెచ్చారు. రత్నవేలు ఫొటోగ్రఫీ పెద్దికి మరింత ఎసెట్ అయ్యింది. మన కళ్ళ ముందు జరుగుతున్న కథ అని మనకి అనిపించేలా ఫొటోగ్రఫీ ఉండటం  రత్నవేలు స్పెషల్. ఎడిటింగ్,యాక్షన్ సీక్వెన్స్ కూడా సూపర్ ఉన్నాయి. బుచ్చిబాబు దర్శకుడిగా, రచయితగా నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. ప్రతి షాట్ ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తూ కథనాన్ని నడిపిన స్పీడ్ కి హాట్స్ హాఫ్ చెప్పవచ్చు .చరణ్ చెప్పినట్టుగా  అగ్ర దర్శకుడిగా నిలబడటం ఖాయం. వృద్ధి బ్యానర్ నిర్మాణ విలువలు  ఒక రేంజ్ లో ఉండటమే కాదు  పెద్ది అదనపు బలంగా  నిలిచాయి.   బలాలు 1 .కథ,  2 . చరణ్ పెర్ ఫార్మెన్స్  3 . కుస్తీ పోటీలు  4 .సాంగ్స్  5. అప్పల సూరి క్యారక్టర్  6 . ప్రీ క్లైమాక్స్  7 . క్లైమాక్స్  8 .డైరెక్షన్  బలహీనతలు  1 . జాన్వీ కపూర్ క్యారక్టర్ ని కొంచం ఓవర్ గా చూపించడం 2 . రచన పరంగా మరింత శ్రద్ద వహించకపోవడం   చివరిగా చెప్పుకోవాలంటే పెద్ది పక్కా రామ్ చరణ్ వన్ మాన్ షో రేటింగ్ 2 .75 / 5                                                                              అరుణాచలం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఓవర్సీస్, అర్లీ ప్రీమియర్ షోల టాక్ సోషల్ మీడియా వేదికగా రచ్చ లేపుతోంది. థియేటర్లలో సినిమా చూస్తున్న నెటిజన్లు, మెగా అభిమానులు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. చాలా రోజులుగా ఒక సరైన మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ చరణ్ అభిమానులకు ‘పెద్ది’ సినిమా ఒక అసలైన పండుగ లాంటి అనుభూతిని ఇస్తోందని పబ్లిక్ టాక్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్ర రన్ టైమ్ విషయానికి వస్తే, 3 గంటల 9 నిమిషాల సుదీర్ఘ నిడివి ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా సాగిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ మరియు ఆయన ఎలివేషన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో ఫస్టాఫ్ అంతా క్రికెట్, సాంప్రదాయ కుస్తీ పోటీల నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. హీరోగా రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్, స్టైల్ మరియు స్వాగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే దాదాపు 30 నిమిషాల సీక్వెన్స్ ఈ సినిమాకే మేజర్ హైలైట్ అని, ఆ సమయంలో వచ్చే కుస్తీ యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని ఎక్స్ రివ్యూస్ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ఫస్టాఫ్‌లో హీరో మరియు జాన్వీ కపూర్ మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ రొటీన్‌గా, క్లిషేగా ఉన్నాయని కొందరు పెదవి విరుస్తున్నారు. అలాగే విలన్ ట్రాక్ మరియు సినిమాలోని డైలాగ్స్ ఆశించిన స్థాయిలో లేవని, రంగస్థలం సినిమా రేంజ్ ఎమోషన్స్ ఇందులో పూర్తిగా పండలేదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ, ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) మరియు సాంగ్స్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచాయని నెటిజన్లు ఏకగ్రీవంగా ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌లో రెహమాన్ తన మ్యూజిక్‌తో థియేటర్లను షేక్ చేశాడని క్రెడిట్ ఇస్తున్నారు. రామ్ చరణ్ తన వన్-మ్యాన్ షోతో సినిమాను మొత్తం ముందుకు నడిపించాడని, సినిమాటోగ్రఫీ కూడా టాప్ నోచ్‌గా ఉందని రివ్యూస్ చెబుతున్నాయి. బిజినెస్ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ రేంజ్ సినిమా సినిమాకూ ఊహించని స్థాయికి పెరుగుతోంది. ఆయన గత ఏడు సినిమాల టోటల్ ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఏకంగా 1250 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంటే యావరేజ్‌గా ఒక్కో సినిమా బిజినెస్ దాదాపు 178 కోట్ల రూపాయల పైమాటే. ఇప్పుడు విడుదలైన ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ మాత్రమే రూ. 218.50 కోట్లు కావడం విశేషం. ఇది ఆయన గత చిత్రం 'గేమ్ ఛేంజర్' సాధించిన రూ. 221 కోట్ల బిజినెస్‌కు ఇంచుమించు సమానంగా ఉంది. చరణ్ కెరీర్‌లోనే 'ఆర్ఆర్ఆర్' చిత్రం రూ. 451 కోట్ల భారీ ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో అగ్రస్థానంలో నిలవగా, ఆచార్య రూ. 131.20 కోట్లు, వినయ విధేయ రామ రూ. 90 కోట్లు, రంగస్థలం రూ. 80 కోట్లు, మరియు ధ్రువ సినిమా రూ. 57 కోట్ల బిజినెస్ చేశాయి. ఈ భారీ నంబర్లను బట్టి రామ్ చరణ్ గ్లోబల్ మార్కెట్ వాల్యూ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఎక్స్ (ట్విట్టర్) రివ్యూస్ మరియు పబ్లిక్ టాక్ ప్రకారం, 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో భారీ వసూళ్ల వర్షం కురిపించి, రామ్ చరణ్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
టాలీవుడ్ హిస్టరీలోనే ఎన్నడూ చూడని విధంగా ఒక హీరోపై అభిమానం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ డ్రామా ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నడిబొడ్డున వెలుగు చూసిన ఒక అద్భుతమైన సంఘటన ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కూకట్‌పల్లిలోని ప్రముఖ చలనచిత్ర వేదిక అర్జున్ థియేటర్ ప్రాంగణంలో రామ్ చరణ్ అభిమానులు ఏకంగా ఆయనకు ఒక గుడినే నిర్మించేశారు. ‘పెద్ది’ సినిమాలో చరణ్ పోషించిన పల్లెటూరి రస్టిక్ రెజ్లర్ (కుస్తీ యోధుడు) గెటప్‌ను తలపించేలా ఒక భారీ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించారు. అంతేకాకుండా ఆ విగ్రహం ఉన్న పరిసర ప్రాంతానికి ‘శ్రీ కొణెదెల రామ్ చరణ్ దేవాలయం’ అంటూ ఒక పెద్ద నేమ్‌ బోర్డును కూడా ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం అర్జున్ థియేటర్ వద్ద వాతావరణం ఒక పెద్ద జాతరను తలపిస్తోంది. తమ ప్రియతమ హీరో విగ్రహాన్ని దర్శించుకునేందుకు అభిమానులు భారీగా క్యూ కడుతున్నారు. మెగాస్టార్ వారసుడి కల్ట్ క్యారెక్టర్‌కు కర్పూర హారతులు ఇస్తూ, కొబ్బరికాయలు కొడుతూ, పాలాభిషేకాలు చేస్తూ థియేటర్ ప్రాంగణాన్ని ఒక ఆధ్యాత్మిక కోణంలో మార్చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను షేక్ చేస్తున్నాయి. ‘ఉప్పెన’ లాంటి బ్లాక్‌బస్టర్‌తో ఇండస్ట్రీని ఊపేసిన టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్ మళ్లీ ఆ స్థాయి విలేజ్ బ్యాక్‌డ్రాప్, రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ చిత్రంలో కనిపించబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రంలో చరణ్ మేకోవర్, ఆయన బాడీ లాంగ్వేజ్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈ దేవాలయం తాలూకు విజువల్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. గ్లోబల్ స్టార్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విడుదల ముందే ఈ రేంజ్ మాస్ జాతర ఉంటే, రేపు థియేటర్లలో బొమ్మ పడ్డాక బాక్సాఫీస్ బద్దలైపోవడం ఖాయమని, మెగా ఫ్యాన్స్ సృష్టించే విధ్వంసం టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులను లిఖిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తమిళనాడు రాజకీయ యవనికపై సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, జోసెఫ్ విజయ్‌ను చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా కలుస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా కోలీవుడ్ వైవిధ్యభరిత నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ.. సీఎం విజయ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. చెన్నైలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లిన ఆయన, నూతన సీఎంకు ప్రత్యేకంగా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రత్యేక భేటీకి సంబంధించిన అందమైన ఫోటోను విజయ్ ఆంటోనీ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. గౌరవనీయ ముఖ్యమంత్రి విజయ్ గారిని కలవడం తనకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందంటూ రాసుకొచ్చారు. సమాజంలో సరికొత్త మార్పులు తీసుకురావడానికి, ప్రజా సేవలో దూసుకుపోవడానికి ఆయనకు ఆ దేవుడు ఎల్లప్పుడూ అపారమైన శక్తిని, విజ్ఞతను, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు విజయ్ ఆంటోనీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి. దళపతి విజయ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ హిట్స్ 'వేట్టైక్కారన్' (తెలుగులో పులివేట), 'వేలాయుధం' వంటి భారీ యాక్షన్ చిత్రాలకు విజయ్ ఆంటోనీ సంగీతం అందించారు. ఆ సినిమాల్లోని సాంగ్స్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా, ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్‌లో లూప్‌లో వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా విజయ్‌కి అదిరిపోయే మాస్ బీట్స్ ఇచ్చిన ఆంటోనీ.. ఇప్పుడు ఒక హీరోగా మారి, సీఎం హోదాలో ఉన్న విజయ్‌ను కలవడం విశేషం. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో సౌత్ సినీ ప్రియులు, ఇరు హీరోల అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. విజయ్ ఆంటోనీ షేర్ చేసిన ఈ పిక్ చూసిన నెటిజన్లు.. "ప్యూర్ ఓజీ కాంబినేషన్" (Original Gangster Combination) అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రచ్చ చేస్తున్నారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కామెంట్లు పెడుతూ, ఈ ఫోటోలను నెట్టింట విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. సంగీత దర్శకుడిగానే కాకుండా 'బిచ్చగాడు', 'కలైరాజన్' వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ నటుడిగా బలమైన ముద్ర వేసుకున్నారు విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఆయన వైవిధ్యమైన స్క్రిప్ట్‌లతో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టారు. అటు దళపతి విజయ్ సైతం ప్రజా సేవలో బిజీగా ఉంటూనే, సినిమా ఇండస్ట్రీతో తనకున్న అనుబంధాన్ని కొనసాగిస్తుండటంతో రాబోయే రోజుల్లో తమిళనాట మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భారతదేశంలో వివాహానికి ముందు జాతకాల పొంతనను చూస్తారు. మరీ ముఖ్యంగా పెద్దలు కుదుర్చే పెళ్లిలో జాతకాల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది.  జాతకాలు సరిపోతే..  గ్రహాలు , నక్షత్రాల అనుకూలంగా ఉంటే వైవాహిక బంధం ఎంతో బలంగా,  భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉంటారని కూడా పేర్కొంటారు.  అయితే కేవలం జాతకాల ఆధారంగా జీవిత భాగస్వామిని ఎంచుకోవడం సరిపోదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. బలమైన , సంతోషకరమైన సంబంధం కావాలంటే..  ఆలోచనలు, విలువలు, ప్రవర్తన , భవిష్యత్తు గురించి సరైన ప్రణాళిక, అవగాహన అన్నీ కూడా పొంతన కుదరడం జాతకాల కంటే ముఖ్యమైన విషయం. ఇందకోసం వివాహానికి మందు జాతకాల పొంతన కుదిరిందా లేదా అనే విషయం కంటే ఇటీవల వివాహానికి ముందు  కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా భాగస్వామిని ఎంచుకోవడం మంచిదని, ఇలా చేయడం వల్ల జీవితం ఎంతో బాగుటుందని అంటున్నారు. ఇంతకీ వైవాహిక బంధంలోకి వెళ్ళేముందు కాబోయే భాగస్వామిని అడగవలసిన ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. సంతోషకరమైన జీవితం అంటే.. పెళ్లికి ముందు తెలుసుకోవలసిన  ముఖ్యమైన విషయం ఏమిటంటే..  సంతోషకరమైన జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం. కొందరు వృత్తికి, విజయానికి ప్రాధాన్యత ఇస్తే, మరికొందరు కుటుంబానికి, స్థిరమైన జీవితానికి విలువ ఇస్తారు. ఇద్దరికీ జీవితంపై వేర్వేరు అంచనాలు ఉంటే, అది భవిష్యత్తులో విభేదాలకు దారితీయవచ్చు. అందువల్ల, ఇద్దరి కలలు , ప్రాధాన్యతల గురించి ఓపెన్ గా  చర్చించుకోవడం ముఖ్యం. ప్రేమ అంటే అర్థం.. ఒక సంబంధానికి పునాది ఇద్దరు భాగస్వాముల ప్రేమ ఎలా ఉంటుంది అనే విషయం పైన ఆధారపడి ఉంటుంది. బాల్యం, కుటుంబ నేపథ్యం , గత అనుభవాలు తరచుగా మనం ప్రేమను చూసే విధానాన్ని  తీర్చిదిద్దుతాయి. భార్యాభర్తల మధ్య సంబంధంలో గౌరవం, నమ్మకం , ఒకరితో ఒకరు మాట్లాడే తీరు.. వీటన్నింటి గురించి భాగస్వామికి  ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం చేసుకోవడం ముఖ్యం. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది చాలా విషయాలలో ముడి పడి ఉంటుంది. అంచనాలు.. కుటుంబానికి సంబంధించిన అంచనాల గురించి కూడా స్పష్టంగా చర్చించుకోవాలి. వివాహం తర్వాత కుటుంబ పాత్ర, తల్లిదండ్రులతో కలిసి జీవించాలా లేక విడిగా జీవించాలా, పిల్లల గురించి  అభిప్రాయాలు, నిర్ణయాలు ఏమిటి, ముఖ్యమైన విషయాలు, నిర్ణయాలలో  కుటుంబ సభ్యుల ప్రమేయం ఎంతవరకు ఉండాలి వంటి విషయాలపై ముందుగానే స్పష్టత ఉండటం మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో తలెత్తే అనేక గొడవలను ఈ స్పష్టత నివారిస్తుంది. బంధం నిర్వహణ.. ప్రతి సంబంధంలోనూ అభిప్రాయ భేదాలు రావడం సహజం, కానీ వాటిని ఎలా పరిష్కరిస్తారనేదే అత్యంత ముఖ్యం. పెళ్లికి ముందు కోపం, ఒత్తిడి లేదా అభిప్రాయ భేదాల వంటివి ఎదురైనప్పుడు   భాగస్వామి ఎలా స్పందిస్తారో అర్థం చేసుకోవడం ముఖ్యం. వారు మాట్లాడటం  ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటారా లేదా వాటిని తప్పించుకుంటారా అనేది సంబంధం ఎంత బలంగా ఉంటుంది అనే విషయంలో  కీలక పాత్ర పోషిస్తుంది. అలవాట్లు, ప్రవర్తన.. పైన చెప్పుకున్న విషయాలే కాకుండా  రోజువారీ అలవాట్లు , ప్రవర్తనను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్థిక నిర్వహణ, బాధ్యతలను నిర్వర్తించడం, ఒత్తిడి గా ఉన్నప్పుడు దాన్ని నియంత్రించుకోవడం,  పరస్పర ప్రవర్తన వంటి చిన్న విషయాలు  సంబంధాన్ని ఎన్నేళ్లు గడిచినా ఎంతో సంతోషంగా ఉంచగలవు.  ఈ అలవాట్లు వివాహం తర్వాత అకస్మాత్తుగా మారవు, కానీ ఎక్కువగా బాగా స్పష్టంగా కనిపిస్తాయి. పైన చెప్పుకున్న విషయాలను పెళ్లికి ముందు భాగస్వాములు ఇద్దరూ మాట్లాడుకోవడం వల్ల పెళ్లి తర్వాత అబిప్రాయ బేధాలు లేదా మనస్పర్థలు రాకుండా ఉండేందుకు సహాయపడతాయి.   జీవితంలో ఒక్కసారి ముడిపడే బంధాన్ని జీవితాంతం పదిలంగా ఉంచుకోవచ్చు.                                         *రూపశ్రీ.
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా  అమ్మాయి అయినా  కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత  మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు. అబ్బాయిలు ఆలస్యంగా వివాహం చేసుకోవడం పెద్దగా సమస్య కాదు, కానీ పెద్ద వయసులో అమ్మాయిలకు మంచి సంబందాలు రావడం లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం.  అమ్మాయిలకు వివాహానికి సరైన వయస్సు ఏమిటి అనే  విషయంపై సరైన స్పష్టత ఎక్కడా లేదు. అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా మొదట తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని, ఆ తర్వాత వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ 30ఏళ్ల  తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు పెద్ద సవాల్ ఎదురవుతోంది. దీనిగురించి రెలేషన్షపి నిపుణులు చెబుతున్న విషయాలు ఏంటో తెలుసుకుంటే.. కెరీర్ అడ్డంకి.. గతంలో ఆడపిల్లల చదువు, కెరీర్ కు ఇంత ప్రాముఖ్యత లేదు.  టెంత్,  ఇంటర్,  డిగ్ర లాంటివి పూర్తవ్వగానే ఆడపిల్లలకు పెళ్ళి చేసేవారు. పెళ్లి తర్వాత మహిళలు కూడా ఇంటిని,  భర్త,  పిల్లలు, అత్తమామలను చూసుకుంటూ ఉండే వారు. కానీ నేటికాలంలో అలా లేదు.. తల్లిదండ్రులు ఆడపిల్లలను కూడా కొడుకులతో సమానంగా చదివిస్తున్నారు. ఆడపిల్లలు తమ కెరీర్ ను అద్బుతంగా మలుచుకోవడంలో సపోర్ట్ చేస్తున్నారు. దీని వల్ల ఆడపిల్లలు కూడా తమ కెరీర్ ను బిల్డ్ చేసుకుని సెటిల్ కావడానికి సమయం పడుతోంది.  అది కాస్తా 30 ఏళ్ల వరకు వివాహానికి దూరం ఉండేలా చేస్తోంది. ఇదే తల్లిదండ్రులకు పెద్ద సవాల్ గా మారుతోంది.  ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించిన కూతురికి పెళ్లి చేయడం చాలా కష్టతరంగా మారింది. అబ్బాయిలకు కాస్త బెటర్.. అమ్మాయిల మాదిరిగానే పెద్ద వయసు అబ్బాయిలకు  కూడా వివాహం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే అబ్బాయి బాగా సంపాదిస్తే చిన్న వయసు అమ్మాయిల నుండి సంబంధాలు వస్తుంటాయి.  తల్లిదండ్రులు  తమ కూతురికి  ఆర్థిక భద్రత కల్పించే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. అయితే అమ్మాయిల విషయంలో అలా కాదు. ఒక అమ్మాయి ఎంత సంపాదించినా, ఆమె పెద్దది అయితే మంచి జత దొరకడం కష్టంగా ఉంటుంది. అబ్బాయిలు ఆశించడమే పెద్ద సమస్య.. కాలం ఎంత మారినా అది మగవారి ఆలోచనలు మార్చలేకపోతోంది.  మగవాళ్లకు తమ భార్యల పట్ల ఉన్న అవగాహన పెద్దగా మారలేదు. చాలా మంది మగవాళ్లు ఎక్కువగా ఆశిస్తున్నారనే మాట చాలా నిజం.  భార్య అటు ఉద్యోగం చేసి సంపాదించాలి,  అలాగే ఇటు ఇంటికి రాగానే ఇంటి పనులు అన్నీ ఆమె చేసి భర్తకు సేవలు చేస్తూ పిల్లలను కూడా చూసుకోవాలని కోరుకుంటారు.  చాలా సార్లు తమ తల్లితో భార్యను పోలుస్తారు,  వస్త్రధారణ నుండి అమ్మాయి పరిచయాల వరకు, స్నేహితులు, వ్యక్తిగత స్పేస్ వంటి విషయాలలో కూడా ఆబ్బాయిలు అమ్మాయిలను చికాకు పెడతారు. ఇలాంటివి అమ్మాయిలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఇవి కాస్తా వైవాహిక జీవితంలో అడ్డంకులకు కారణం అవుతున్నాయి. అమ్మాయిల వయసు పెరిగితే ఇదే సమస్య.. 30ఏళ్ళ తర్వాత అమ్మాయిలకు వివాహం విషయంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్య అమ్మాయి సంతానోత్పత్తి ఆమె వయస్సుతో ముడి పడి  ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ అమ్మాయి సంతానోత్పత్తి తగ్గుతుంది. అమ్మాయి పెద్దదైతే ఆ జంట పిల్లల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ఇది వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించకుండా చేస్తుంది. నేటి కాలంలో అమ్మాయిలు ఆర్థిక విషయం నుండి చాలా వరకు స్వతంత్రత కలిగి ఉన్నారు.  తన సొంత ఆలోచన ఉంటుంది. ఆమె తన భర్త లేదా కుటుంబం చెప్పే ప్రతిదానితో ఏకీభవించలేదు. ఆమె తన సొంత ఆలోచనకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే భార్యభర్తల మధ్య సమస్యలు సృష్టిస్తోంది. సరైన వయసు.. మేజర్ అయితే చాలు అమ్మాయిలు, అబ్బాయిలు వివాహానికి అర్హత పొందుతారు. కానీ వివాహానికి  సరైన వయసు అనేది వ్యక్తిగతంగా ఉంటుంది.  అమ్మాయిలు కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం వివాహానికి ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ చాలా మంది మహిళలు తమ కెరీర్ ను తొందరగా సెటిల్ చేసుకుని సరైన జోడి వెతుక్కుని హాయిగా సెటిల్ అవుతున్నారు.  అంటే.. వివాహం విషయంలో అబ్బాయిల  ఆలోచన కూడా ముఖ్యం.  వారు కూడా మారితేనే భార్యాభర్తల వైవాహిక జీవితం బాగుంటుంది.                           *రూపశ్రీ.  
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం.  ఇలాంటి పరిస్థితిలో అతిగా మాట్లాడం లేదా ఎక్కువ మాట్లాడటం కూడా భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేస్తుందని అంటున్నారు రెలేషన్షిప్ నిపుణులు. జరిగే ప్రతి విషయాన్ని తమ భాగస్వామితో పంచుకోవడం, ప్రతి విషయాన్ని చర్చించడం, అన్ని విషయాలు తమకు తెలిసి జరగాలి అనుకోవడం, ప్రతి చిన్న విషయం గురించి మాట్లాడటం.. ఇలా ప్రతిదీ భాగస్వామితో మాట్లాడం వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అవుతుంది అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఇది తెలుసుకోవాలి.. ఒక సంబంధాన్ని బలపరచడంలో  ముఖ్యమైనది ఎక్కువ మాట్లాడటం కాదు.. ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మాటలలో నిజాయితీ,  మాట్లాడే విషయం పట్ల అవగాహన,  దాని ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనవి.  ఏదో ఒకటి మాట్లాడాలి అని  కబుర్లు చెప్పుకోవడంలో బంధం బలపడటం అనేది జరగదు. ఇద్దరి ఆలోచనలు, ప్రవర్తనలు, ఇద్దరూ ఏదైనా విషయం గురించి మాట్లాడటం.. ఇలాంటి సందర్బాలు చాలా కొన్నే ఉన్నా అది బంధాన్ని బలపరుస్తుంది.  ఏదో ఒకటి మాట్లాడాలనే కారణంతో అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటే.. భాగస్వామి విసుగు చెంది  ఇలా కబుర్లు చెప్పడం అనే మంచి సమయానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సమయం ముఖ్యమే..  భార్యాభర్తలు రోజులో కొంత సమయం గడపడం చాలా కీలకమని నిపుణులే చెబుతున్నారు. ఇద్దరు కలిసి కొంత సమయం గడిపినప్పుడు, వారి మధ్య ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి, సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎప్పుడూ ఒకరితో మరొకరు అప్యాయత, అనురాగం,  ఇద్దరి మధ్య బంధం బలపడే  అవకాశం ఉంటుంది. చిన్న విషయాలు ఎందుకు మాట్లాడకూడదు.. కొందరు భాగస్వాములు చిన్న చిన్న విషయాలను కూడా చెబుతూ ఉంటారు. ఏ విషయాన్ని దాచుకోవడం లేదని, తాము బంధంలో ఎంతో నిజాయితీగా ఉంటున్నామని కూడా అంటుంటారు. కానీ ఇది చాలా పొరపాటు.  ప్రాముఖ్యత లేని విషయాల గురించి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య ఆసక్తి తగ్గి, అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇద్దరు కలిసి గడిపే సమయం నాణ్యంగా మార్చుకోవాలి. అంచనాలకు పోవద్దు.. టీవి, సినిమా, సీరియల్, చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు భార్యాభర్తల బందాలలో కొన్ని సంఘటనలు, సందర్భాలు చాలా సంతోషంగా, ఎంతో అపురూపంగా గడుపుతూ ఉంటారు.  ఇలాంటి బంధాలను చూసి తాము అలా ఉండాలని అనుకుంటారు చాలామంది. కానీ ఇలాంటి అంచనాలు పెట్టుకోవడం వల్ల చాలా అసంతృప్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కాస్తా భాగస్వామి విషయంలో ఒకరంటే ఒకరి పట్ల ఇష్టం,  ఆసక్తి తగ్గి,  చిరాకు, కోపం పెరిగేలా చేస్తుంది. మనిషిని బట్టే.. కొందరు ఎక్కువ మాట్లాడేవారు ఉంటారు. మరికొందరు తక్కువ మాట్లాడేవారు ఉంటారు. కాబట్టి మనిషిని బట్టి ముందుకెళ్లాలి.  బాగా మాట్లాడేవారితో ఏం మాట్లాడినా సరదాగా తీసుకుంటారు. కానీ ఎక్కువ మాట్లాడని వ్యక్తులు చిన్న చిన్న విషయాలకు చాలా చిరాగ్గా ఫీలవుతారు.  కాబట్టి మనిషిని బట్టి సాగితేనే బంధాలు బాగుంటాయి.                                    *రూపశ్రీ.
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు.  కొందరు బెడ్ టీని ఇష్టపడితే, మరికొందరు రోజంతా చాలా కప్పులు తాగుతారు.  వయసుకు తగ్గట్టు ఎంత టీ తాగాలి? దీని గురించి చాలామందికి తెలియదు.  అధికంగా టీ తాగడం వల్ల క్రమంగా శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. టీ ఆరోగ్య ప్రయోజనాలు.. టీలోని కెఫీన్ , ఇతర సమ్మేళనాలు శరీరానికి శక్తిని అందిస్తాయి, అయితే టీని  అధికంగా తీసుకున్నప్పుడు హానికరంగా కూడా మారుతుందని వైద్యులు అంటున్నారు. కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల, ఇటీవలి కాలంలో గ్రీన్ టీ ఒక ఆరోగ్యకరమైన పానీయంగా మారింది. చాలామంది పాలతో కాఫీలు, టీలు మానేసి గ్రీన్ టీ ఇష్టపడుతున్నారు.  ఈ సమ్మేళనాలకు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ , కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంతో సంబంధం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. పరిశోధనల ప్రకారం  గ్రీన్ టీ జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగే వ్యక్తులు  బరువు   విషయంలో పర్పెక్ట్ గా,  మొత్తం ఆరోగ్యం విషయంలో ఎంతో నిలకడగా   ఉంటారని పరిశోధనలో తేలింది.  రోజులో ఎంత టీ తాగాలి? ఎంత పరిమాణంలో టీ తాగడం సరైనది అనే విషయం చాలామందిని గందరగోళానికి గురిచేస్తుంది.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది వయస్సు, ఆరోగ్య పరిస్థితి , జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా టీనేజర్లు , యువకులు రోజుకు 1 నుండి 2 కప్పుల కంటే ఎక్కువ కెఫిన్ ఉన్న టీ తాగకూడదు. ఆరోగ్యంగా ఉన్న పెద్దలు 3 నుండి 5 కప్పుల గ్రీన్ టీ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ పరిమాణం మంచిదని  చెబుతున్నారు.  అంతకంటే ఎక్కువ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. టీ ఎక్కువగా తాగితే.. ఎక్కువగా టీ తాగడం హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల చంచలత్వం, నిద్రలేమి, తలనొప్పి, కడుపు నొప్పి , ఆందోళన వంటి సమస్యలు పెరగవచ్చు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారు తీసుకునే కెఫిన్ పరిమాణంపై శ్రద్ధ వహించాలని చెబుతున్నారు. పరిశోధనల ప్రకారం, గర్భధారణ సమయంలో అధిక కెఫిన్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ లవర్స్ ఇవి గుర్తుంచుకోవాలి.. టీ తాగే సమయం కూడా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఎక్కువగా టీ తాగడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వస్తాయి. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ శోషణ తగ్గుతుంది. వైద్యుల ప్రకారం, టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ దాని పరిమాణం, సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.                                 *రూపశ్రీ.
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం, చెడు  ఆహారపు అలవాట్లు శరీర రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. ఈ కారణంగానే పదే పదే   జలుబు, అలసట, ఇన్ఫెక్షన్లు , నీరసం వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి చాలామంది  విటమిన్ సి , విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు  తీసుకుంటూ ఉంటారు. ఇవి రెండూ రోగనిరోధక శక్తికి చాలా కీలకమైనవే. అయితే రోగనిరోధక శక్తిని బలంగా మార్చడానికి విటమిన్-సి, విటమిన్-డి.. ఈ రెండు విటమిన్లలో ఏది ముఖ్యమైనది?  వివరంగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి ఎందుకు అవసరం.. రోగనిరోధక వ్యవస్థ శరీరానికి రక్షణ కవచం వంటిది. ఇది శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర హానికరమైన పదార్థాలను గుర్తించి, నిర్మూలిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు లోపిస్తే, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. వైద్య నివేదికల ప్రకారం విటమిన్ సి శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది , యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగనిరోధక కణాలను ఉత్తేజపరచడంలో , వాపును నియంత్రించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం ఉన్నవారికి ఇన్ఫెక్షన్లు , శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కేవలం సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మాత్రమే రోగనిరోధక శక్తి బలపడదని, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం, సరైన పోషకాహారం కూడా చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ సి , డి రెండూ అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ రెండింటికీ వేర్వేరు విధులు ఉన్నాయి, కాబట్టి వీటిలో దేని లోపమైనా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందట. విటమిన్-సి.. విటమిన్ సి ఆరోగ్యానికి అత్యవసరం, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు.   ఇది శరీరంలో నిల్వ ఉండని, నీటిలో కరిగే విటమిన్, కాబట్టి ఇది ప్రతిరోజూ అవసరం. విటమిన్ సి శరీరంలోని తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది, దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో మరింత మెరుగ్గా పోరాడగలుగుతుంది.  విటమిన్ సి ఒక సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. తగినంత మోతాదులో విటమిన్ సి తీసుకోవడం వల్ల జలుబు కాలవ్యవధిని కొంత మేరకు తగ్గించవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి. విటమిన్-డి.. సూర్యరశ్మికి గురికావడం వల్ల విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి ఎముకలకు మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తికి కూడా అవసరం విటమిన్ డి శరీరంలోని టి-కణాలను , ఇతర రోగనిరోధక కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.  ఈ కణాలు వైరస్‌లు , బ్యాక్టీరియాలతో పోరాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ డి వాపును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది, తద్వారా శరీర రోగనిరోధక ప్రతిస్పందనను  బాలెన్స్ విటమిన్ డి లోపం ఉన్నవారికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ , ఇతర అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతూ, తక్కువ సూర్యరశ్మిని పొందే వ్యక్తులలో ఈ లోపం సర్వసాధారణం. పోషకాలను ఎలా పొందాలి? శరీరానికి అవసరమైన విటమిన్ సి , డి అందాలంటే, సరైన ఆహారం , జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం.   సిట్రస్ పండ్లు విటమిన్ సి కి మంచి వనరులు. నారింజ, ఉసిరి, నిమ్మకాయలు, జామకాయలు, క్యాప్సికమ్ , స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి కోసం, గుడ్డు పచ్చసొన, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు, పుట్టగొడుగులు , పాల ఉత్పత్తులను తినడం మంచిది.                             *రూపశ్రీ.
       ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు.  మరికొందరు దీన్ని కేవలం అలసట లేదా నీరసం అని కొట్టిపారేస్తుంటారు.  అయితే ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటు. . ఇది  శరీరంలో ఒక నిర్దిష్ట వ్యాధికి తొలి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు, దీనిని వైద్యపరంగా ప్లాంటార్ ఫాసైటిస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి గురించి , దానిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు  తీసుకోవాలో తెలుసుకుంటే.. ఉదయం పూట చీలమండలు ఎందుకు నొప్పిస్తాయి? పాదం అరికాలి భాగం మడమ ఎముక నుండి కాలివేళ్ల వరకు ఉంటుంది. ఇది ప్లాంటార్ ఫాసియా అనే మందపాటి, బలమైన కణజాలపు పొరతో కప్పబడి ఉంటుంది. మనం నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు ఈ పొర మన పాదాలను కుదుపుల నుండి కాపాడుతుంది. ఈ కండర పట్టీపై ఎక్కువ  ఒత్తిడి పడినప్పుడు, అది చిన్న చిన్న చిరుగులకు , వాపుకు కారణమవుతుంది. రాత్రిపూట మన పాదాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఈ కణజాలం సంకోచిస్తుంది. ఉదయం నిద్రలేచి నేలపై మొదటి అడుగు వేయగానే, సంకోచించిన ఈ కణజాలం అకస్మాత్తుగా మళ్లీ సాగి, తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంది. కారణాలు.. శరీరంలో పెరిగిన కొవ్వు మడమలపై నేరుగా అధికంగా ఒత్తిడిని కలుగజేస్తుంది.  చాలా పలుచగా ఉండే లేదా ఆర్చ్ సపోర్ట్ లేని చెప్పులు, బూట్లు ధరించడం వల్ల కూడా అరికాళ్ళు దెబ్బతింటాయి.  పనిలో భాగంగా  గంటల తరబడి చాలాసేపు నిలబడవలసి వస్తే.. అలాంటి వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు.  శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం, ఎముకలు బలహీనపడటం లేదా విటమిన్ డి లోపం కూడా మడమ నొప్పిని పెంచుతాయి. ఇంటి చిట్కాలు..  మడమకు రోజుకు రెండు నుండి మూడు సార్లు 15 నిమిషాల పాటు ఐస్ పెట్టాలి. దీనివల్ల వాపు తగ్గుతుంది. మంచం దిగే ముందు కాళ్లు ఉన్నట్టుండి చాపకుండా  కాళ్లను , కాలివేళ్లను ముందుకు వెనుకకు సాగదీయాలి. ఎల్లప్పుడూ మందపాటి కుషన్ ఉన్న సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించాలి. ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి. నొప్పి కొన్ని రోజుల పాటు కొనసాగితే , నడవడంలో మరింత ఇబ్బంది ఉంటే వెంటనే ఎముకల వైద్యుడిని సంప్రదించాలి.                              *రూపశ్రీ.