ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ వివాదం మరోసారి బహిర్గతమైంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత  జగన్‌ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ జగన్ మీడియా ప్రచురించిన కథనంపై షర్మిల నిప్పులు చెరిగారు. తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.  సాధారణ కుటుంబ సంబంధాలను కూడా వక్రీకరించి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.   మహిళలను గౌరవిస్తామని చెప్పే జగన్..  ఇలాంటి నిరాధారమైన,  దిగజారిన వార్తలను తన సొంత మీడియా ప్రచురించడాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఈ  ప్రచురణ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో జగన్ స్వయంగా సమాధానం చెప్పాలని   డిమాండ్ చేశారు. గతంలో తమ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం రాజకీయ విభేదాలను పక్కనబెట్టి తన పిల్లల పెళ్లిళ్లకు అందరినీ ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా  గుర్తుచేశారు. రాజకీయంగా ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, కుటుంబ వేడుకల్లో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం జగన్ దిగజారుడుతనానికి పరాకాష్ఠగా షర్మిల అభివర్ణించారు. అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న   వివాదాల నేపథ్యంలో ఈ తాజా పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం రాజకీయ లబ్ది కోసమే జగన్  కుటుంబ వ్యవహారాలను బహిరంగ వేదికలపైకి లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని షర్మిల పదేపదే ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఇది కూడా చదవండి: వెల్తారా, వెళ్లరా: షర్మిల కుమార్తె వివాహానికి జగన్ హాజరుపై చర్చ.! అయినా..  తమ ప్రత్యర్థి అయితే చాలు…  వ్యక్తిత్వహననానికి పాల్పడడం, మహిళలను కించపరచడం వైసీపీ నేతలకు అలవాటేనంటూ.. నాడు నిండు సభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ పరిశీలకులు సైతం షర్మిలపై అనుచిత వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.    అంతెందుకు గతంలో షర్మిల కూడా పలు సందర్భాలలో జగన్ ది సైతాన్ సైన్యం   విమర్శించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబుకు తన కుమారుడి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు పసుపు రంగు చీర కట్టుకొని వెళ్లిన షర్మిలను దూషించిన ఘనత వైసీపీ సైకో సైన్యానిది. ఇప్పుడు కూడా తన కూతురు అంజిలి పెళ్లి పత్రిక అందించేందుకు చంద్రబాబును కలిసిన షర్మిలపై వైసీపీయులు దుర్భాషలాడుతున్నతీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మీకు నచ్చవచ్చు:   ఉంటే ఉండు, లేకుంటే దేశం విడిచిపో: వైఎస్ కంటే గొప్పోడివా.. జగన్ ను ఉతికి ఆరేసిన షర్మిల కుటుంబం.! ఎలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి: పేర్ని నానికెందుకు నొప్పి.? [YSSharmila, YSJagan, SharmiladaughterMarriage, Invitation, CBN, CharacterAssassination, TeluguOne]
 దేశ రాజధాని నూతన దిల్లీలో జరిగిన సోనియాగాంధీ ఆత్మకథ  బిలాంగింగ్ పుస్తకావిష్కరణ వేడుకలో సీటింగ్ అరేంజ్ మెంట్ రాజకీయ చర్చకు తావిచ్చింది.  ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి  దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియా కూటమి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో వేదికపై అతిథుల సీటింగ్  అరేంజ్ మెంట్ లో ప్రాధాన్యతల క్రమం రాజకీయ చర్చకు తెరలేపింది.   ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొదటి వరుసలో అదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన కూర్చుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  కర్ణాటక  ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు రెండో వరుసలో సరిపెట్టుకున్నారు.  ఇదే వేదికపై అఖిలేష్ యాదవ్ వంటి ఇతర విపక్ష నేతలు కూడా మొదటి వరుసలో ఆసీనులయ్యారు.  కాంగ్రెస్ పార్టీ  కార్యక్రమంలో సొంత పార్టీ ముఖ్యమంత్రులను రెండో వరుసలో కూర్చోబెట్టి, బయటి నుంచి వచ్చిన మిత్రపక్ష నేతలకు వారికి మించిన ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయంగా సంచలనంగా మారింది.  అంతే కాకుండా సోనియాగాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తొలి వరుసలో తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ రాహుల్ పక్కన ఆసీనులైన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అదే సమయంలో రేవంత్, డీకే వంటి నేతలు రెండో వరుసలో కూర్చున్న ఫొటోలు సైతం అదే స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కాగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ వద్ద ప్రాధాన్యత తగ్గిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.  అయితే  పరిశీలకులు మాత్రం అతిథి మర్యాదలో భాగంగానే కాంగ్రెస్ ఈ విధమైన సీటింగ్ అరేంజ్ మెంట్ చేసి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.  ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిలో అసంతృప్తి నిజమేనా? సొంత కార్యక్రమంలో సొంత నేతల కంటే.. ఇతర పార్టీల నేతలను గౌరవించడం సముచితంగా ఉంటుందని, అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ఆ విధమైన ఏర్పాట్లు చేసిందని చెబుతున్నారు.   నాయకులకు సముచిత గౌరవం ఇచ్చి మొదటి వరుసలో సీట్లు కేటాయించిందని కాంగ్రెస్ శ్రేణులు కూడా చెబుతున్నాయి.  పార్టీలో అత్యంత కీలకమైన నాయకురాలు ప్రియాంకా గాంధీ సైతం రెండో వరుసలోనే ఆసీనులవ్వడాన్ని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు.  అతిథులకు మర్యాదపూర్వకంగా మొదటి స్థానం కల్పించడం కాంగ్రెస్ సంప్రదాయమని, సోనియా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అదే చేసిందని అంటున్నారు.  మీకు నచ్చవచ్చు:  పార్టీ, ప్రభుత్వంపై పట్టుబిగించిన సీఎం రేవంత్.! రాహుల్ కు ఫిర్యాదు చేస్తా: తెలంగాణ సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబావుటా.!​ [Sonia, biography Belonging, Revanth Reddy Vijay,Seat, TeluguOne] 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను మరింత పటిష్టపరిచే దిశగా అధిష్ఠానం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జి బాధ్యతలను యువ నాయకుడు బీఎం సందీప్‌కు అప్పగిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది.    పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోద ముద్రతో ఈ నియామకం తక్షణమే అమల్లోకి రానున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ పార్టీని సమన్వయం చేసే తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.    గతంలో ఈ బాధ్యతలను నిర్వర్తించిన మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఈ మార్పు జరిగిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సంస్థాగత పదవి నుంచి తప్పుకున్న ఆమె, గతంలో రాష్ట్రంలో అందించిన విశేష సేవల పట్ల అధిష్ఠానం ప్రత్యేక ప్రశంసలు కురిపించింది.    కొత్త ఇన్‌ఛార్జి రేసులో పలువురు సీనియర్ జాతీయ నేతల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, మాణిక్‌రావు థాక్రే వంటి ఉద్ధండుల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ, అనూహ్యంగా అధిష్ఠానం బీఎం సందీప్ వైపు మొగ్గు చూపడం గమనార్హం.    ఈ పరిణామం సరిగ్గా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనలో ఉన్న సమయంలో జరగడం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తించింది. పార్టీ యంత్రాంగాన్ని మరింత ఉత్సాహపరిచేందుకు, క్షేత్రస్థాయిలో సమన్వయం సాధించేందుకు ఈ నాయకత్వ మార్పు దోహదపడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు  ఇతర రాజకీయ సవాళ్లు ఎదురుకానున్న తరుణంలో, కొత్త ఇన్‌ఛార్జి నియామకం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతుందని ఆశిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంతో సఖ్యతను పెంపొందిస్తూ, పార్టీని విజయపథంలో నడిపించడంలో బీఎం సందీప్ ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మీకు నచ్చవచ్చు: Under 19 Asia Cup: పాక్‌పై చివరి బంతికి భారత్  థ్రిల్లింగ్ విక్టరీ..కప్ మనదే.! [ BM Sandeep Telangana Congress In-charge, Telangana Congress news, AICC new appointments 2026, TPCC updates, Mallikarjun Kharge decisions ]
ALSO ON TELUGUONE N E W S
స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. దర్శకుడు రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న ఆమె.. ఇప్పుడు తల్లిగా ప్రమోషన్ పొందేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తన ఇంట్లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భర్త రాజ్‌తో పాటు కుటుంబ సభ్యులు, పెద్దల ఆశీర్వాదాల మధ్య కనిపించిన సమంత ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తొలి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమవుతున్న సమంత, రాజ్ నిడిమోరు తమ ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, మహిళలు హాజరైనట్లు ఫొటోలను బట్టి తెలుస్తోంది. ఒక ఫొటోలో రాజ్, సమంత ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటూ కనిపించారు. మరో ఫొటోలో కుటుంబ పెద్దలు సమంతకు ఆశీర్వాదాలు అందిస్తున్నారు. కుటుంబ సభ్యులందరితో కలిసి దిగిన ఫొటోను కూడా ఆమె పంచుకున్నారు. ఈ ఫొటోలకు సమంత కేవలం “Us” అనే చిన్న క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఆ ఒక్క పదంలోనే తమ కుటుంబ ఆనందాన్ని వ్యక్తం చేశారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సమంత, రాజ్ నిడిమోరు డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. ఇది కూడా చదవండి: ఉపాసన ఎమోషనల్.. ఆ సమయంలో రామ్ చరణ్.! ఈ ఏడాది జూన్‌లో ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్ సందర్భంగా సమంత తన ప్రెగ్నెన్సీ విషయాన్ని వెల్లడించారు. సినిమా పనులు పూర్తయ్యాక కొంతకాలం విరామం తీసుకుని మాతృత్వాన్ని ఆస్వాదించనున్నట్లు కూడా చెప్పారు. ఇప్పుడు బిడ్డ రాకకు ముందు కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు తీసుకుంటూ ప్రత్యేక పూజ నిర్వహించడం అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. మొత్తానికి బిడ్డ రాక కోసం సమంత, రాజ్ కుటుంబం ఎంతో ఆనందంగా ఎదురుచూస్తోంది. ఈ ప్రత్యేక వేడుక ఫొటోలు చూసిన అభిమానులు కాబోయే తల్లిదండ్రులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మీకు నచ్చవచ్చు:  తరుణ్ భాస్కర్‌ సోల్‌మేట్.. కొడుకు జీవితంలో ఈషా స్థానం ఏంటో చెప్పిన తల్లి.! ఆద్యను స్టేజ్‌పైకి వద్దన్న రేణు దేశాయ్.. కూతురి విషయంలో ఎందుకలా చేశారు.? https://www.instagram.com/p/Df3wsAQCDnf/       [Samantha Special Pooja, Samantha Pregnancy, Baby Countdown, Samantha Ruth Prabhu, Raj Nidimoru]
ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ అందరిలోను వారణాసి తర్వాత మహేష్ ఎవరి డైరెక్షన్ లో ఎలాంటి మూవీ చేస్తాడా అనే చర్చ జరుగుతూ ఉంది. మరి ఫిలిం సర్కిల్స్ , సోషల్ మీడియాలో కూడా అలాంటి చర్చనే  జరుగుతుంది కదా! ఆ చర్చల భావాన్ని చూద్దాం. రాజమౌళి వారణాసి మూవీతో  మహేష్ కి  ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ రావడం ఖాయం. ఆ గ్లోబల్ మార్కెట్‌ను నిలబెట్టుకోవడానికి మహేష్ తదుపరి చిత్రాన్ని కూడా అంతే స్థాయిలో ప్లాన్ చేయాల్సిందే. ఈ రేసులో అందరికంటే ముందుగా వినిపిస్తున్న పేరు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. 'యానిమల్' తో 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందీప్, గతంలోనే మహేష్ బాబుకు 'డెవిల్' అనే కథను వినిపించారు. అప్పట్లో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోయినా, ఇప్పుడు ప్రభాస్ 'స్పిరిట్' తర్వాత సందీప్ - మహేష్ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగాతో పాటు తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు కూడా ఈ లిస్టులో గట్టిగా వినిపిస్తోంది. 'విక్రమ్', 'లియో' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్ సృష్టించుకున్న లోకేష్, మహేష్ బాబు కోసం ఒక పవర్‌ఫుల్ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన ఈ ఇద్దరు దిగ్గజాలు చేతులు కలిపితే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కష్టమే.   మరోవైపు, రాజమౌళి సినిమా కోసం దాదాపు మూడేళ్ల పాటు ఒకే ప్రాజెక్ట్‌కు పరిమితమైన మహేష్ బాబు, 'వారణాసి' తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వేగంగా ఒక సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి పేరు తెరపైకి వచ్చింది. ఇది కూడా చదవండి:ప్రతి భారతీయుడు రక్తంలో శ్రీరాముడు ఉన్నాడంటున్న జావేద్: ఆ మాటని తప్పుబడుతుంది ఎవరో తెలుసా!   అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు ఒక విభిన్నమైన స్పోర్ట్స్ డ్రామా లేదా పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేసే ఆలోచనలో ఉన్నారని, సంక్రాంతి బరిలో దిగేలా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల నిర్మాత ధీరజ్ మొగిలినేని సైతం మహేష్ బాబు తదుపరి సినిమా అనిల్ రావిపూడితోనే చేయాలని బహిరంగంగా కోరడం ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చింది.   వీరితో పాటు 'పుష్ప' ఫేమ్ సుకుమార్, 'పెద్ది' దర్శకుడు బుచ్చిబాబు సానా పేర్లు కూడా అప్పుడప్పుడు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే మహేష్ బాబు 30వ సినిమాను భారీ అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తూ సరైన దర్శకుడి వేటలో ఉంది. ఏదేమైనా, అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ స్టార్ డైరెక్టర్ల జాబితాలో ఎవరికి సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారో అన్నది అటు అభిమానుల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. 2027 ఏప్రిల్ 7న విడుదల కావాల్సిన వారణాసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా ఆగస్టుకి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే  టాక్ వినిపిస్తోంది.    [Mahesh Babu, Varanasi, Rajamouli,sundeep Reddy Vanga, sukumar]
Looks like Aditya Dhar is ready to pull The Immortal Ashwatthama out of the archives. Social media is abuzz with reports that the filmmaker has reinitiated talks with Ranveer Singh to bring his ambitious mythological epic back on track. If things fall into place, Ranveer could take up the project after completing Pralay. Aditya Dhar originally planned the film after the success of Uri: The Surgical Strike, with Vicky Kaushal in the lead. However, the ambitious scale and budget requirements forced the filmmaker to put the project on the back burner. He eventually moved on to write and direct the Dhurandhar films. With the two Dhurandhar instalments reportedly crossing Rs. 3,000 crore in combined worldwide collections, Dhar is now in a much stronger position to revisit his dream project. The filmmaker is said to be keen on mounting Ashwatthama on the scale he originally envisioned. Ranveer Singh is currently busy with Pralay, for which he has undergone a significant makeover. The film is being shot on specially constructed sets, and the actor is expected to move on to his next commitments once the shoot is wrapped. Also Read: Chiru Leaks Again: Anaswara plays this character?  Interestingly, Ashwatthama is said to be targeting a December 2028 theatrical release, although the project is yet to be officially announced. The reported collaboration has already generated considerable discussion among movie buffs. For now, there is no official confirmation from Aditya Dhar or Ranveer Singh. But after the phenomenal box-office run of Dhurandhar, perhaps the filmmaker finally has the muscle to bring his long-pending epic to life. Check Out:  IFFI: Mayasabha becomes first ever to be nominated                      Tharun's mother confirms his relationship with Eesha   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తెలుగులో నటుడిగా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారి రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్‌కు ఒంగోలు కోర్టులో షాక్ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు రూ.95 లక్షల జరిమానా విధించడంతో పాటు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ మేరకు బుధవారం కోర్టు తీర్పు వెలువరించింది. దీంతో బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో మద్దిరాలపాడుకు చెందిన జెట్టి వెంకటేశ్వరరావుకు బండ్ల గణేష్ రూ.95 లక్షలు బాకీ ఉన్నారు. అయితే ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించే క్రమంలో తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ నుంచి రూ.95 లక్షల చెక్ ఇచ్చారు. కానీ ఆ చెక్ బ్యాంకులో చెల్లుబాటు కాకపోవడంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు తాజాగా బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే.. బండ్ల గణేష్‌కు గతంలోనూ బ్యాంకులతో ఆర్థికపరమైన వివాదాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్ శ్రీ పరమేశ్వర్ పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు యూనియన్ బ్యాంక్ ఇచ్చిన రుణాలకు సంబంధించి బండ్ల గణేష్, ఆయన కుటుంబ సభ్యులు తమ సొంత ఆస్తులను పూచీకత్తుగా తాకట్టు పెట్టారు. అయితే కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ సమయంలో తనఖా పెట్టిన ఆస్తులను బ్యాంక్ వేలం వేసింది. ఇది కూడా చదవండి: బడ్జెట్ 2 కోట్లు, కలెక్షన్ 150 కోట్లకుపైనే.. ఓటీటీలోకి 5 భాషల్లో కన్నడ బ్లాక్‌బస్టర్.! ఈ వేలం ప్రక్రియను సవాలు చేస్తూ బండ్ల గణేష్ రుణ వసూళ్ల ట్రైబ్యునల్ (డీఆర్‌టీ)ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ట్రైబ్యునల్ వేలం ప్రక్రియను రద్దు చేసింది. స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి యజమానులకు అప్పగించాలని, ఆస్తులను కొనుగోలు చేసిన వ్యక్తికి చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. అయితే డీఆర్‌టీ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు డీఆర్‌టీ ఉత్తర్వులను కొట్టివేస్తూ బ్యాంక్ తీసుకున్న చర్యలను సమర్థించింది. దీంతో బండ్ల గణేష్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలా ఒకవైపు రూ.95 లక్షల చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష, జరిమానా విధించడంతో పాటు మరోవైపు బ్యాంకు రుణాలకు సంబంధించిన ఆస్తుల వేలం వివాదం కూడా బండ్ల గణేష్‌ను వెంటాడుతోంది. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఆయనకు ఇప్పుడు వరుస న్యాయపరమైన సమస్యలు ఎదురవుతుండటం చర్చనీయాంశంగా మారింది. మీకు నచ్చవచ్చు: ‘ట్విలైట్’ హీరో ఇప్పుడు ఏజెంట్ 007.. జేమ్స్‌బాండ్‌గా సంచలన ఎంట్రీ.! IMDBలో ‘ది ఒడిస్సీ’ని క్రాస్ చేసిన ‘రామాయ‌ణ‌’.. 13 రోజుల క‌లెక్ష‌న్ ఎంతంటే.?       [BandlaGanesh, ChequeBounceCase, BandlaGaneshJailSentence, OngoleCourtVerdict]
సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమా విడుదల కాకముందే వరుస అవకాశాలు రావడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు హీరోయిన్ సాత్విక వీరవల్లి విషయంలో అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ అమ్మడికి.. తొలి సినిమా విడుదలకు ముందే మరో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17లో సాత్విక పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆమె ఎంపికయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా నాగచైతన్య 25వ సినిమాలోనూ సాత్విక వీరవల్లికి అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దర్శకుడు క్లాక్స్ తెరకెక్కించనున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఇటీవల యాంకర్ సుమతో జరిగిన ఇంటర్వ్యూలో నిర్మాత అల్లు అరవింద్ సాత్విక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలిపారు. నాగచైతన్య 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను నవంబర్ 23న ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇది కూడా చదవండి: RC17 హీరోయిన్ సర్‌ప్రైజ్.. ఐదుగురికి లుక్ టెస్ట్.! సాత్విక నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ నవంబర్ 20న విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే నాగచైతన్య సినిమాలో అవకాశం రావడం ఆమె కెరీర్‌కు మంచి ప్రారంభంగా చెప్పుకోవచ్చు. మరోవైపు RC17లోనూ ఆమె పేరు వినిపిస్తుండటంతో ఈ అమ్మడి పేరు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చకు వస్తోంది. మరి తొలి సినిమా విడుదల కాకముందే ఇన్ని క్రేజీ ఆఫర్లు వస్తున్న సాత్విక వీరవల్లి.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని పెద్ద ప్రాజెక్టుల్లో కనిపిస్తుందో చూడాలి. మీకు నచ్చవచ్చు: ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.! అప్పుడు ‘మల్లెపూల పల్లకి’.. ఇప్పుడు ‘రఘుకుల తిలక’.!       [Aakasamlo Oka Tara Movie, Satvika Veeravalli,  Naga Chaitanya NC25, Ram Charan RC17]
వరల్డ్ సెల్యులాయిడ్ వద్ద రామాయణ దూసుకుపోతూ ఉంది. కలెక్షన్స్ లాస్ట్ ఫిగర్ ఊహకి కూడా అందదనే మాటలు అభిమానుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే 1483 కోట్లు. రీసెంట్ గా స్టార్ రైటర్ జావేద్ అక్తర్  రామాయణ గురించి  చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఏ భారతీయుడైనా సరే మతాలకు అతీతంగా రాముడిని తన రక్తంలో కలిగి ఉంటాడని సంచలన ప్రకటన చేశారు. రాముడు కేవలం ఒక వ్యక్తి కాదని, ఆయనొక గొప్ప భావజాలం, నైతికతకి  ప్రతీక, జీవన విధానం అని ఆయన అభివర్ణించారు. తన ఈ వ్యాఖ్యల వల్ల కొందరు వ్యక్తులు తనపై కోపగించుకోవచ్చని ముందే స్పష్టం చేసినప్పటికీ, రాముడి ప్రాముఖ్యత మత సరిహద్దులని  దాటి ప్రతి ఒక్కరి హృదయాలని  హత్తుకుంటుందని  కూడా చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన జావేద్ అక్తర్, షారుఖ్ ఖాన్ నటించిన 'స్వదేస్' చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన 'పల్ పల్ హై భారీ' పాటని  గుర్తు చేసుకున్నారు. ఆ పాటకి  తాను రాసిన "మన్ సే రావణ్ జో నికాలే, రామ్ ఉస్కే మన్ మే హై" అనే పంక్తులు ప్రజల మనసులను ఎలా గెలుచుకున్నాయో వివరించారు.   రాముడిని మనం కొన్నిసార్లు ఒక వ్యక్తిగా పరిమితం చేసినప్పటికీ, ఆయన ఆకృతికి మించి చాలా విశలుడైనవాడని, మన సంస్కృతిలో ఆయన ఒక జీవన విధానంగా నిలిచిపోయాడని ఆయన పేర్కొన్నారు. ఇక రామాయణని ఇంకా చూడలేదని, అయితే తన కూతురు జోయా అక్తర్ మాత్రం ఆ చిత్రాన్ని చూసి ఎంతో అభినందించినట్లు  వెల్లడించారు. ఇది కూడా చదవండి:హైదరాబాద్ లో ప్రాపర్టీ అమ్మేసిన అనుష్క! అయితే జావేద్ అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలపై భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మౌలానా సాహిద్ రషీద్  ఈ వ్యాఖ్యలని  తీవ్రంగా తప్పుబట్టారు. జావేద్ అక్తర్ ఒక వ్యాపారవేత్త అని, బాలీవుడ్‌లో పాటలు అమ్ముకోవడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తుంటారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా, తాను నాస్తికుడినని చెప్పుకునే జావేద్ అక్తర్ ఇప్పుడు రాముడిపై ఇంతటి విశ్వాసం చూపడం ఏంటని ప్రశ్నిస్తూ, ఆయన తన పేరును 'జావేద్ అక్తర్' నుండి 'రామ్‌పాల్' గా మార్చుకోవాలని వ్యంగ్యంగా సలహా ఇవ్వడం గమనార్హం. ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండటంతో, కళాకారుల అభిప్రాయాలు, మతం మరియు రాజకీయాలకు సంబంధించిన సరిహద్దులపై మరోసారి పెద్ద ఎత్తున వాదనలు మొదలయ్యాయి.ఇక జావేద్ అక్తర్ సినీ జర్నీని చూసుకుంటే ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాలకి రచయితగా పని చేసాడు. అద్భుతమైన సాంగ్స్ కూడా అందించాడు. అందిస్తూ వస్తున్నాడు.    మీకు నచ్చవచ్చు:చిరంజీవితో మూవీపై రోజా రియాక్షన్! మీకు నచ్చవచ్చు:చరిత్ర సృష్టించిన మయసభ!   [Javed Akhtar, Ram Controversy, Maulana Sajid Rashidi, Tollywood]
హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్పై యాక్షన్ ఫ్రాంచైజీ 'జేమ్స్ బాండ్' నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ నటుడు డేనియల్ క్రెయిగ్ తర్వాత ఏజెంట్ 007 పాత్రలో ఎవరు కనిపిస్తారనే ప్రశ్నకు తెరపడింది. హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ కొత్త జేమ్స్ బాండ్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. 40 ఏళ్ల రాబర్ట్ ప్యాటిన్సన్ ఈ ప్రతిష్ఠాత్మక పాత్రను పోషించనున్న ఏడో నటుడిగా గుర్తింపు పొందాడు. ఇప్పటివరకు జేమ్స్ బాండ్ పాత్రలో సీన్ కానరీ, జార్జ్ లాజెన్‌బై, రోజర్ మూర్, తిమోతీ డాల్టన్, పియర్స్ బ్రాస్నన్, డేనియల్ క్రెయిగ్ నటించారు. వీరిలో డేనియల్ క్రెయిగ్ చివరిగా 2021లో విడుదలైన 'నో టైమ్ టు డై' చిత్రంలో బాండ్‌గా కనిపించాడు. అప్పటి నుంచి ఈ పాత్రను ఎవరు పోషిస్తారనే విషయంపై ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. ఎట్టకేలకు రాబర్ట్ ప్యాటిన్సన్‌ను ఎంపిక చేయడంతో ఈ చర్చలకు ముగింపు పలికినట్టయింది. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మిస్తున్న జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీలోని 26వ చిత్రానికి ప్రముఖ దర్శకుడు డెనిస్ విల్లెనెవ్ దర్శకత్వం వహించనున్నారు. 'పీకీ బ్లైండర్స్' సిరీస్‌తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న స్టీవెన్ నైట్ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు. అమీ పాస్కల్, డేవిడ్ హేమన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 2025లో ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన సృజనాత్మక నియంత్రణను అమెజాన్ ఎంజీఎం సొంతం చేసుకున్న తర్వాత రూపొందుతున్న తొలి జేమ్స్ బాండ్ చిత్రం కావడం విశేషం. ఇక కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్ కనిపించనున్న ఫస్ట్ లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. బాండ్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే బ్లాక్ టక్సేడో సూట్‌లో ఆయన స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం జోష్ ఓ'కానర్, కల్లమ్ టర్నర్ వంటి నటుల పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరకు రాబర్ట్ ప్యాటిన్సన్‌ను ఎంపిక చేస్తూ చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. ఇది కూడా చదవండి: ఉపాసన ఎమోషనల్ కామెంట్స్.. ఆ సమయంలో రామ్ చరణ్! ఈ సందర్భంగా రాబర్ట్ ప్యాటిన్సన్ స్పందిస్తూ.. జేమ్స్ బాండ్ ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప పాత్రల్లో ఒకటని, అలాంటి పాత్రను తనకు అప్పగించడం జీవితంలో దక్కిన గొప్ప గౌరవమని ఆనందం వ్యక్తం చేశాడు. దర్శకుడు డెనిస్ విల్లెనెవ్ కూడా ప్యాటిన్సన్‌కు స్వాగతం పలుకుతూ, ఆయన బాండ్ పాత్రకు సరికొత్త శైలిని తీసుకొస్తారని ప్రశంసించారు. ఈ పాత్రలో ఆయనను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇక రాబర్ట్ ప్యాటిన్సన్ కెరీర్ విషయానికి వస్తే.. 'హ్యారీ పాటర్ అండ్ ది గోబ్లెట్ ఆఫ్ ఫైర్', 'ట్విలైట్' సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 'టెనెట్', 'ది లైట్‌హౌస్', 'ది బ్యాట్‌మ్యాన్' వంటి చిత్రాలతో నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 2022లో వచ్చిన 'ది బ్యాట్‌మ్యాన్'లో బ్రూస్ వేన్ పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం 'ది బ్యాట్‌మ్యాన్ 2'తో పాటు పలు భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు జేమ్స్ బాండ్‌గా కొత్త అవతారం ఎత్తనున్న నేపథ్యంలో ఆయన 007గా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. మీకు నచ్చవచ్చు:  హైదరాబాద్‌లో ప్రాపర్టీ అమ్మేసిన అనుష్క! చిరంజీవి సినిమా అనగానే రోజా రియాక్షన్: రకరకాల కూరగాయలు ఉంటాయి కానీ, రకరకాల కులాలు ఉండవు!     [RobertPattinson, JamesBond, Daniel Craig, Agent007, DenisVilleneuve]
తల్లిగా మారడం అనేది ప్రతి మహిళ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన అనుభవం. అయితే ఆ ఆనందం వెనుక శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఎదురయ్యే మార్పులు, కోలుకునే ప్రక్రియ అంత సులభం కాదు. తాజాగా ఉపాసన కొణిదెల తన ప్రసవానంతర అనుభవాల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సమయంలో తన భర్త రామ్ చరణ్ అందించిన మద్దతు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత తనకు ఎదురైన కష్టాలను వివరిస్తూ ఉపాసన.. ఈ ప్రయాణంలో రామ్ చరణ్ తనకు ఎంతో అండగా నిలిచారని చెప్పారు. ఒక సపోర్టివ్ పార్ట్‌నర్ ఉండటం తన అదృష్టమని పేర్కొన్నారు. ప్రసవానంతర సమయంలో ఎదురయ్యే భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కోవడంలో భర్త సహకారం ఎంత ముఖ్యమో ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. “నా రెండో ప్రెగ్నెన్సీ, కవల పిల్లల తర్వాత పోస్ట్‌పార్టమ్ అనుభవం నన్ను ఊహించని విధంగా ప్రభావితం చేసింది. నేను ఇంకా కోలుకుంటున్నాను. ఈ సమయంలో నాకు అండగా నిలిచిన వైద్యులు, నా టీమ్‌కు కృతజ్ఞతలు” అనే భావంతో ఉపాసన తన అనుభవాన్ని పంచుకున్నారు. గర్భధారణ సమయంలోనే కాదు, ప్రసవం తర్వాత కూడా తల్లికి వైద్య, మానసిక సహాయం అందించడం ఎంతో అవసరమని ఆమె సూచించారు. తల్లిదండ్రుల బాధ్యతల విషయంలో సమాజంలో ఉన్న ఆలోచనా విధానం మారాలని ఉపాసన గతంలోనూ స్పష్టం చేశారు. తండ్రి పిల్లలకు ఆహారం పెట్టినా, డైపర్ మార్చినా అతన్ని గొప్పగా ప్రశంసిస్తుంటారని.. అదే పనిని తల్లి చేస్తే మాత్రం సహజమైన బాధ్యతగా చూస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది కూడా చదవండి: తరుణ్ భాస్కర్‌ సోల్‌మేట్.. కొడుకు జీవితంలో ఈషా స్థానం ఏంటో చెప్పిన తల్లి.! “తండ్రి పిల్లలను చూసుకోవడం ఎవరికో చేస్తున్న సహాయం కాదు. అది కూడా పేరెంటింగ్‌లో భాగమే, అతని బాధ్యత” అనే ఆమె అభిప్రాయం కూడా ప్రస్తుతం చర్చకు వస్తోంది. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిద్దరికీ సమాన బాధ్యత ఉండాలని ఆమె నొక్కిచెప్పారు. ప్రసవం తర్వాత మహిళలు ఎదుర్కొనే మానసిక ఆరోగ్య సమస్యలను చాలామంది గుర్తించకపోవడం, వాటి గురించి మాట్లాడటానికి సంకోచించడం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉపాసన తన అనుభవాన్ని బహిరంగంగా పంచుకోవడం, వైద్య సహాయం తీసుకోవాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవల పిల్లల తల్లిగా తనకు ఎదురైన అనుభవాన్ని చెబుతూ.. ఇతర మహిళలు కూడా తమ బాధలను దాచుకోకుండా, అవసరమైన సహాయం పొందాలని ఆమె కోరుకున్నారు. మీకు నచ్చవచ్చు: మళ్ళీ విలన్‌గా గోపీచంద్.. జయం, వర్షం రోజులు గుర్తొస్తాయా.? ఆద్యను స్టేజ్‌పైకి వద్దన్న రేణు దేశాయ్.. కూతురి విషయంలో ఎందుకలా చేశారు.? https://www.instagram.com/reel/Df1-OJbs1ot/       [Ram Charan, Upasana Konidela, Postpartum Recovery, Emotional]  
బొమ్మాళి, స్వీటీ అనుష్క శెట్టిని కొన్ని గంటలుగా సోషల్ మీడియా రౌండ్ అప్ చేసింది.  అనుష్క హైదరాబాద్‌లోని తన ఖరీదైన ఆస్తిని అమ్మేశారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఖరీదైన ప్రాంతంలో రిజిస్టర్ అయి ఉన్న ఆమె ఇల్లు లేదా ప్రాపర్టీని విక్రయించేశారనే వార్తలు ఒక్కసారిగా టాలీవుడ్‌లో కలకలం రేపాయి. అనుష్క గురించి ఇలాంటి రూమర్లు రావడం అభిమానులకి  ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.అనుష్క శెట్టి ఆస్తుల విషయానికి వస్తే, ఆమె కేవలం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మాత్రమే కాకుండా, నగరానికి శివార్లలో అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ఒక విశాలమైన ఫామ్‌హౌస్‌ని సైతం కలిగి ఉంది. ఆమె నివాసాలు ఎప్పుడూ కూడా ప్రకృతికి దగ్గరగా, అత్యంత నిరాడంబరంగా మరియు ప్రశాంతమైన జీవనశైలిని ప్రతిబింబించేలా ఉంటాయి.ఇది కేవలం సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఒక పుకారు మాత్రమేనని, ఆమె తన ఆస్తుల విషయంలో ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోలేదని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఇది కూడా చదవండి:చిరంజీవితో మూవీ అనగానే రోజా రియాక్షన్: రకరకాల కూరగాయలు ఉంటాయి కానీ, రకరకాల కులాలు ఉండవు!   ఏది ఏమైనప్పటికీ, అధికారికంగా ఎలాంటి స్పష్టత వచ్చే వరకు ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. బాహుబలి తర్వాత సినిమాలు తగ్గించుకుంటూ వస్తున్న అనుష్క నుంచి వచ్చిన ప్రీవియస్ మూవీ ఘాటీ.     మీకు నచ్చవచ్చు:అయ్యప్ప దీక్ష తీసుకున్న ఇరుముడి మేకర్స్! మీకు నచ్చవచ్చు: ధోని పై బాలయ్య కామెంట్స్ వైరల్!   [Anushka, Ghaati, anushka jubilee hills house, Tollywood]
  మెగాస్టార్ చిరంజీవి, అగ్ర రచయిత 'పరుచూరి బ్రదర్స్' కి మధ్య సినిమాల పరంగాను, వ్యక్తిగతంగానూ మంచి అనుబంధం ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఆ కాంబోలో వచ్చాయి. అలాంటి ఎన్నో చిత్రాల్లో ఒక చిత్రం ముఠామేస్త్రి. 1993 జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన ఈ సినిమా, శతదినోత్సవం జరుపుకోవడమే కాకుండా మ్యూజికల్ హిట్‌గానూ నిలిచింది. ఇప్పుడు ఈ అపురూప దృశ్యకావ్యం మరోసారి నవంబర్ 22న   రీ-రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాకు సంబంధించిన నాటి షూటింగ్ అనుభవాలను, ఆసక్తికరమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. చిరంజీవి మేస్త్రి స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు తన అద్భుతమైన నటనతో ఏ విధంగా ప్రాణం పోశారో ఆయన వివరించారు.   ఈ చిత్రంలో నటి రోజా కీలక పాత్రలో నటించగా, ‘సర్పయాగం’ తర్వాత ఆమెకు ఈ సినిమాలో అవకాశం దక్కింది. సెట్‌లోకి వెళ్లిన తొలి రోజుల్లో చిరంజీవితో కలిసి నటించాల్సి రావడంతో రోజా ‘డాడీ డాడీ’ అంటూ తన చేయి పట్టుకుని ఎంతో టెన్షన్ పడ్డారని, మెగాస్టార్‌లాంటి పెద్ద హీరో పక్కన నటించే అవకాశం రావడంతో ఆమె కళ్లలో ఆనందం స్పష్టంగా కనికట్టించిందని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు.  ఇక ముఠామేస్త్రి ఘన విజయం సాధించడంలో విషయంలో పరుచూరి డైలాగ్స్ సంభాషణలు చాలా కీలకం. ముఖ్యంగా “ఇక్కడ రకరకాల కూరగాయలు ఉంటాయి కానీ.. రకరకాల కులాలు ఉండవు. ఉన్నది ఒక్కటే కులం లేబర్‌ కులం” లాంటి శక్తివంతమైన డైలాగులను మెగాస్టార్ నోట చెప్పించగా, థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేసి హోరెత్తించారు. ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించిన మయసభ: IFFI నామినేషన్ దక్కించుకున్న తొలి తెలుగు వెబ్ సిరీస్! అదేవిధంగా “టోపీ పెట్టని మహమ్మదీయుడిని, బొట్టుపెట్టని హిందువుని, సిలువ వేయని క్రైస్తవుడిని..” అనే అద్భుతమైన డైలాగ్‌తో హీరో అన్ని మతాలను తనవేనని చాటుకుని ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.   “న్యాయం కోసం పోరాడుతుంటే.. పోలీసులు ఇచ్చిన బహుమతి” అంటూ పోలీసుల తీరును సున్నితంగా ఎండగట్టిన తీరు ప్రేక్షకులను ఆలోచింపచేస్తుంది.రాజ్  కోటి సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు, చిరంజీవి వేసిన మాస్ స్టెప్పులు అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించాయి. చిత్రంలోని క్లైమాక్స్ సన్నివేశం ప్రేక్షకులని మరో లెవల్‌కి  తీసుకెళ్తుంది. కేవలం హీరో పాత్రే కాకుండా, విలన్ రోల్ కి  సైతం అత్యంత బలమైన సంభాషణలు రాసారు.మీనా, రోజాలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నాటి రాజకీయ వాతావరణాన్ని, సామాజిక అంశాలను మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపంలో తెరకెక్కించిన ఈ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి ప్రతిభ అమోఘం. ప్రస్తుతం 4K క్వాలిటీతో వస్తున్న ఈ సినిమా రీ-రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   మీకు నచ్చవచ్చు: ఓం' ఫస్ట్ రివ్యూ! మీకు నచ్చవచ్చు:ఆకాశంలో ఒక తార ఫస్ట్ రివ్యూ   [Chiranjeevi, Paruchuri Gopala Krishna,Roja,Kondandarami reddy, meena, Mutamestri]
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
చాలామంది భారతీయుల దినచర్య ఉదయం పూట ఒక వేడి వేడి టీ కప్పుతోనే ప్రారంభమవుతుంది. దానికి తోడు రెండు బిస్కెట్లు తింటే అల్పాహారం పూర్తయినట్లుగా ఎంతో సంతృప్తిగా భావిస్తారు. తక్కువ ఖర్చుతో, ఎంతో సులభంగా దొరికే ఈ సాధారణ అలవాటు దాదాపు ప్రతి మధ్యతరగతి ఇళ్లలోనూ కనిపిస్తుంది. అయితే ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా కేవలం టీ, బిస్కెట్లు మాత్రమే తీసుకుంటే ఆరోగ్యంపై ఎలాంటి తీవ్ర ప్రభావం పడుతుందనేది చాలామందికి తెలియదు. కన్సల్టెంట్ డైటీషియన్, డయాబెటిస్ ఎడ్యుకేటర్ కనికా మల్హోత్రా తెలిపిన వివరాల ప్రకారం, ఈ అలవాటును కేవలం 30 రోజుల పాటు నిరంతరం కొనసాగిస్తే శరీరంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. టీ, బిస్కెట్లు తినడం అప్పటికప్పుడు ఆకలిని తాత్కాలికంగా తగ్గించినప్పటికీ, శరీరానికి అవసరమైన ఎలాంటి పౌష్టికాహారాన్ని అందించడంలో పూర్తిగా వెనుకబడతాయి. ముఖ్యంగా ప్యాకెట్లలో లభించే బిస్కెట్లలో మైదా పిండి, రిఫైండ్ చక్కెర, అదనపు కొవ్వు పదార్థాలు అధిక మోతాదులో నిండి ఉంటాయి. అలాగే తీపి కలిపిన టీ నేరుగా రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రొటీన్లు, పీచు పదార్థాలు పూర్తిగా లోపించిన ఇలాంటి అల్పాహారం తీసుకోవడం వల్ల రోజువారీ శక్తి తగ్గిపోవడం, ఆకలి నియంత్రణ కోల్పోవడం మరియు జీవక్రియ మందగించడం జరుగుతుంది. ఉదయం పూట మైదాతో తయారైన బిస్కెట్లు, చక్కెర కలిపిన పానీయాలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు క్షణాల్లో వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ అకస్మాత్తుగా పెరిగిన చక్కెర స్థాయిలను నియంత్రించడానికి శరీరం అత్యవసరంగా ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. ఇలాంటి ఆహారపు అలవాట్లను ప్రతిరోజూ క్రమం తప్పకుండా కొనసాగిస్తే కొంతమందిలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రీడయాబెటిస్ లేదా మధుమేహ సమస్యల బారిన పడినవారు ఇలాంటి ఆహారపు పొరపాట్ల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. బిస్కెట్లలో ఫైబర్ మరియు ప్రొటీన్లు నామమాత్రంగా ఉండటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన అస్సలు కలగదు. దీనివల్ల ఉదయం 10 గంటల సమయానికే విపరీతమైన ఆకలి వేయడం, శరీరం నీరసించిపోవడం, తీవ్రమైన అలసట, చిరాకు మరియు ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా, నెల రోజుల పాటు ఈ అలవాటును పాటిస్తే శరీరానికి కావలసిన విటమిన్లు, కాల్షియం, బి విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడి ఎముకల బలం క్షీణించే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: రోజూ ఉదయం, ఇలా పసుపు నీళ్లు తాగితే. చర్మం మెరిసిపోవడంతో పాటు బోలెడు లాభాలు! ఈ కేలరీల భారాన్ని గమనిస్తే, చక్కెర మరియు చెడు కొవ్వులు అధికంగా ఉండే టీ, బిస్కెట్లను రోజూ తీసుకోవడం ద్వారా శరీరంలో అదనపు కేలరీలు పేరుకుపోతాయి. ఇది క్రమంగా బరువు పెరగడానికి మరియు కొలెస్ట్రాల్ సంబంధిత గుండె సమస్యలకు దారితీస్తుంది. అలాగే టీలో ఉండే టానిన్లు ఆహారం ద్వారా శరీరానికి అందాల్సిన ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. దీనివల్ల రక్తహీనత వంటి సమస్యలు తలెత్తి శరీరం ఎప్పుడూ అలసటగా మారుతుంది. అయితే, టీ తాగే అలవాటును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు గానీ దానితో పాటు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. చక్కెర లేని టీ తీసుకోవడం, రాత్రంతా నానబెట్టిన 8 నుంచి 10 బాదం పప్పులను తినడం లేదా ఇంట్లో తక్కువ నూనెతో వేయించిన మఖానాలను అల్పాహారంగా ఎంచుకోవడం మంచిది. సరైన పోషకాహారాన్ని ఎంచుకోవడం ద్వారా కేవలం 30 రోజుల్లోనే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఫీవర్ తగ్గాక కూడా గుండె దడ, కాళ్ల వాపులు ఉంటున్నాయా? ఇవి ప్రమాదకర గుండె ముప్పుకు సంకేతాలు!                                   ఆంధ్రుల ప్రత్యేక సాత్విక రుచి: అల్లం పచ్చి కారంతో, వంకాయ కూర!       Biscuits With Morning Tea, Daily Biscuit Side Effects, Unhealthy Breakfast Habits, Sugar And Maida Dangers, Weight Gain Risks, Doctor Health Advice, Health Tips In Telugu.  
మనలో చాలా మంది రోజుకు రెండుసార్లు క్రమం తప్పకుండా పళ్ళు తోముకున్నప్పటికీ, దంతాల పై భాగంలో మరియు మూలల్లో కఠినమైన పాచి, పసుపు రంగు మరకలు పేరుకుపోవడం చాలా సాధారణమైన సమస్యగా మారిపోయింది. ఈ విధంగా దంతాలపై పేరుకుపోయే మురికి కాలక్రమేణా దంతాలను బలహీనపరచడమే కాకుండా, చిగుళ్ల వాపు మరియు ఇతర దంత సంబంధిత తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఈ మొండి మరకలను తొలగించుకోవడానికి ఎలాంటి ఖరీదైన డెంటల్ ట్రీట్‌మెంట్‌లకు లేదా ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన వంటింట్లో లభించే సాదాసీదా పదార్థాలతోనే వీటిని సులభంగా వదిలించుకోవచ్చు. దంతాలపై పడిన మొండి మరకలను పూర్తిగా వదిలించడంలో బేకింగ్ సోడా ఒక అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో 1 నుండి 2 స్పూన్ల బేకింగ్ సోడా తీసుకుని, అందులో తగినన్ని నీళ్లు లేదా కొద్దిగా కొబ్బరి నూనె కలిపి చక్కటి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పేస్ట్‌ను మీ టూత్‌బ్రెస్ట్‌పై వేసి పళ్లను, ముఖ్యంగా మరకలు ఎక్కువగా ఉండే వెనుక భాగాలను సుమారు ఒక నిమిషం పాటు చాలా మెల్లిగా రుద్దాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో నోరు కడుక్కోవడం ద్వారా దంతాల మీద ఉన్న మురికి సులభంగా వదులుతుంది. ఈ బేకింగ్ సోడా మిశ్రమాన్ని వారంలో కేవలం 2 నుంచి 3 సార్లు మాత్రమే క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల దంతాలపై ఉన్న పాచి పూర్తిగా తొలగిపోయి, మునుపటి మెరుపు తిరిగి వస్తుంది. అయితే బేకింగ్ సోడాను అతిగా ఉపయోగించడం దంతాల ఎనామిల్‌పై ప్రభావం చూపుతుంది కాబట్టి సూచించిన మోతాదులోనే వాడటం ఎంతో ముఖ్యం. ఇది దంతాల తెల్లటి రంగును కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు, మన నోటి ఆరోగ్యానికి పచ్చి కొబ్బరి నూనె ఒక దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ప్రతిరోజూ ఉదయం బ్రష్ చేసే ముందు ఒక స్పూన్ స్వచ్ఛమైన పచ్చి కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని కొన్ని నిమిషాల పాటు గట్టిగా పుక్కిలించాలి (ఆయిల్ పుల్లింగ్). ఇలా చేయడం వల్ల నోటిలోని దాదాపు హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది, చిగుళ్ల నుండి రక్తం కారడం తగ్గుతుంది మరియు పంటి నొప్పులు కూడా క్రమంగా దూరం అవుతాయి. ఇది కూడా చదవండి: ముఖంపై, మచ్చలు పోవాలంటే పచ్చి ,పాలను ఇలా రాయండి! ఇక బేకింగ్ సోడా, కొబ్బరి నూనె రెండింటినీ కలిపి ఉపయోగిస్తే మరింత అద్భుతమైన మరియు వేగవంతమైన ఫలితాలు ఉంటాయి. ఒక స్పూన్ బేకింగ్ సోడాలో రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలిపి ఒక ప్రత్యేక మిశ్రమంలా తయారు చేయాలి. దీనిని బ్రష్‌కి రాసుకుని పళ్లను శుభ్రం చేసుకోవడం ద్వారా పళ్లపై ఉన్న మురికి, పసుపు రంగు పూర్తిగా వదిలిపోతుంది. ఈ మిశ్రమం దంతాలను శుభ్రపరచడమే కాకుండా నోటిని రోజంతా తాజాగా ఉంచుతుంది మరియు నోటి దుర్వాసన రాకుండా సమర్థవంతంగా నివారిస్తుంది. ఈ సాధారణ ఇంటి చిట్కాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ దంతాలను ఆరోగ్యంగా, తెల్లగా, మెరిసేలా కాపాడుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఉడికించిన అలసందలు తింటే, శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!                           వింటర్ డైట్: చలికాలంలో బరువు తగ్గడానికి, పాటించాల్సిన సులువైన మార్గాలు!       Remove Tartar At Home, Yellow Teeth Remedies, Plague Removal Tips, Natural Dental Care, Oral Hygiene Tips, Doctor Health Advice, Health Tips In Telugu.
ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యతగా మారుతోంది. ముఖ్యంగా మధ్య వయస్కులు మరియు వృద్ధులు శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి జిమ్‌లకు వెళ్లే బదులు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. వైద్య నిపుణులు మరియు ఆరోగ్య సర్వేల తాజా నివేదికల ప్రకారం, 50 ఏళ్లు పైబడిన వారు ఇంట్లోనే వ్యాయామాలు చేయడానికి టీవీ మరియు యూట్యూబ్ (YouTube) మాధ్యమాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నట్లు వెల్లడైంది. బిజీ లైఫ్‌స్టైల్, ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవడం మరియు ఇంట్లోనే ఉంటూ నిపుణుల మార్గదర్శకత్వంలో వ్యాయామాలు చేయడం ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ వయసులో ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి వ్యాయామం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన పద్ధతిలో చేయడం అంతకంటే ముఖ్యం. చాలామంది మధ్య వయస్కులు తమ ఇళ్లలోని లివింగ్ రూమ్‌లలో డిజిటల్ స్క్రీన్‌లను ఆన్ చేసి, ప్రొఫెషనల్ ఫిట్‌నెస్ కోచ్‌లు అందించే గైడెడ్ వర్కవుట్‌లను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా యోగా, స్ట్రెచింగ్, లైట్ కార్డియో మరియు బ్యాలెన్స్ ఎక్సర్‌సైజెస్‌ను యూట్యూబ్ ద్వారా నేర్చుకుంటూ క్రమం తప్పకుండా ఆచరిస్తున్నారు. దీనివల్ల కీళ్ల నొప్పులు తగ్గుముఖం పట్టడంతో పాటు రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు అవకాశం లభిస్తుంది. ఇంటి వద్దే వ్యాయామాలు చేయడం వల్ల వృద్ధులకు ప్రయాణ భారం తప్పుతుంది. వ్యాయామశాలకు వెళ్లే శ్రమ లేకుండా, తమకు నచ్చిన సమయంలో, తమ శరీర సామర్థ్యానికి తగినట్లుగా వ్యాయామాలను ఎంచుకునే స్వేచ్ఛ లభిస్తుంది. యూట్యూబ్‌లో లభించే ఉచిత వీడియోలు మరియు లైవ్ సెషన్‌లు వీరికి ఎంతగానో సహాయపడుతున్నాయి. నిపుణుల సలహాల మేరకు రోజుకు కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు డిజిటల్ మాధ్యమాల సహాయంతో వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే, డిజిటల్ వ్యాయామాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఏ వయసు వారైనా తమ శరీర తత్వానికి, ఆరోగ్య పరిస్థితికి తగిన వ్యాయామాలను మాత్రమే ఎంచుకోవాలి. ఏకతాటిగా కష్టమైన వ్యాయామాలు కాకుండా, తేలికపాటి కదలికలతో ప్రారంభించి క్రమంగా సమయాన్ని పెంచుకోవాలి. ఇంట్లోనే ఉంటూ టీవీ స్క్రీన్ ద్వారా పెద్ద అక్షరాలు మరియు స్పష్టమైన విజువల్స్ సహాయంతో వ్యాయామాలు చేయడం వల్ల భంగిమలు (Posture) సరిగ్గా ఉండేందుకు వీలవుతుంది. ఇది కూడా చదవండి: ఎముకల బలం మరియు, హార్మోన్ల సమతుల్యత, కోసం వేయించిన ఖర్జూరాలు! ఈ డిజిటల్ ఫిట్‌నెస్ ట్రెండ్ కేవలం శారీరక బలాన్నే కాకుండా, వృద్ధులలో మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నామనే భావనను పోగొట్టుకోవడానికి, తమ వయసుకు తగిన ఆరోగ్య చిట్కాలు మరియు వ్యాయామ దినచర్యలను యూట్యూబ్ ద్వారా తెలుసుకుంటూ వారు ఉత్సాహంగా గడుపుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఈ డిజిటల్ వ్యాయామ ప్రయాణంలో తోడ్పాటునందిస్తూ, వారిని ప్రోత్సహిస్తుండటం విశేషం. మొత్తంగా చూస్తే, టెక్నాలజీ మరియు ఆరోగ్యం జోడై మధ్య వయస్కులు, వృద్ధుల జీవితాల్లో సానుకూల మార్పులను తెస్తున్నాయి. జిమ్‌ల చుట్టూ తిరిగే పని లేకుండా, ఖరీదైన వ్యాయామ పరికరాలు కొనుగోలు చేయకుండా కేవలం టీవీ మరియు యూట్యూబ్ మాధ్యమాలతో ఫిట్‌గా మారవచ్చని నిరూపితమవుతోంది. సరైన క్రమశిక్షణ, నిపుణుల పర్యవేక్షణ మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కూడిన ఈ ఇంటిపట్టునే చేసే వ్యాయామ విధానం రాబోయే రోజుల్లో మరింత ప్రాచుర్యం పొందుతుందనడంలో సందేహం లేదు. మీకు నచ్చవచ్చు:బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్, తర్వాత రోగనిరోధక శక్తి, కోలుకోవడం ఎలా?                                 మాయిశ్చరైజర్‌లో, SPF ఉంటే సరిపోతుందా? అసలు నిజాలు ఇవే!       Senior Fitness Workouts, Elders Home Exercise, YouTube Fitness Channels, Middle Aged Health Trends, Safe Workouts For Seniors, Healthy Aging Tips, Health Tips In Telugu.  
షుగర్ (Diabetes) ఉన్నవారికి గుండె జబ్బులతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందా? రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల మెదడులోని రక్తనాళాలు, గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? స్ట్రోక్ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి? ఇలాంటి ముఖ్యమైన ఆరోగ్య విషయాల గురించి ఈ వీడియోలో డాక్టర్ శాస్త్రి వివరించారు. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు సరిగా నియంత్రణలో లేకపోతే రక్తనాళాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్తనాళాలు దెబ్బతినడం, రక్తప్రసరణలో సమస్యలు ఏర్పడటం, గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యల ముప్పు పెరగవచ్చు. ముఖ్యంగా దీర్ఘకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి. డయాబెటిక్ స్ట్రోక్ అంటే ఏమిటి? మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో రక్తం గడ్డకట్టడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ పరిస్థితినే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. డయాబెటిస్ ఉన్నవారిలో స్ట్రోక్ ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? షుగర్ వ్యాధి మెదడులోని రక్తనాళాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కనిపించే ముఖ్యమైన లక్షణాలు: ముఖం ఒకవైపు వాలిపోవడం లేదా కండరాల్లో బలహీనత రావడం. ఒక చేయి లేదా కాలు అకస్మాత్తుగా బలహీనపడటం లేదా తిమ్మిరి రావడం. మాట తడబడటం లేదా మాట్లాడటంలో ఇబ్బంది కలగడం. అకస్మాత్తుగా చూపు మందగించడం లేదా కనిపించకపోవడం. నడవడంలో ఇబ్బంది, తల తిరగడం, శరీర సమతుల్యత కోల్పోవడం. అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం. స్ట్రోక్ విషయంలో గోల్డెన్ అవర్ ఎందుకు ముఖ్యం? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషం ఎంతో విలువైనది. మెదడుకు రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందువల్ల స్ట్రోక్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీపంలోని స్ట్రోక్ చికిత్స అందించే ఆసుపత్రికి వెళ్లాలి. ప్రారంభ గంటల్లో అందించే చికిత్స వల్ల మెదడుకు జరిగే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల స్ట్రోక్ చికిత్సలు లక్షణాలు ప్రారంభమైన సమయం ఆధారంగా నిర్ణయిస్తారు. అందుకే గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే స్ట్రోక్ వచ్చినప్పుడు ఆసుపత్రిలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? రక్తనాళాల్లో ఏర్పడిన అడ్డంకులను ఎలా గుర్తిస్తారు? తక్షణ చికిత్సలో ఎలాంటి వైద్య విధానాలను అనుసరిస్తారు? గుండె, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి షుగర్ వ్యాధిని ఎలా నియంత్రించుకోవాలి? వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను డాక్టర్ శాస్త్రి ఈ వీడియోలో వివరించారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు, అత్యవసర చికిత్స, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. సకాలంలో గుర్తించి వైద్య సహాయం అందించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. డయాబెటిస్, బ్రెయిన్ స్ట్రోక్, గుండె ఆరోగ్యం, స్ట్రోక్ లక్షణాలు, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత గురించి డాక్టర్ శాస్త్రి అందిస్తున్న పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి.  
మనం చేసే ప్రతి చిన్న పనీ మన భవిష్యత్తును నిర్ణయించినట్లే, మనం రోజూ ఆచరించే ప్రతీ అలవాటు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి జబ్బుల కంటే మన చెడ్డ అలవాట్లే మనల్ని నెమ్మదిగా బలహీనపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరికే అనలేదు. ధనం పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం కోల్పోతే అదే అసలైన దరిద్రం. శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మన పూర్వీకులు కొన్ని సులువైన జీవన సూత్రాలను చెప్పారు. వాటిని సరిగ్గా పాటిస్తే జీవితం ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. ఆ ముఖ్యమైన ఐదు ఆరోగ్య సూత్రాలు ఏమిటో  వివరంగా తెలుసుకుంటే..  సరైన ఆహార నియమం.. మన శరీరం జీర్ణవ్యవస్థపైనే మన ఆయుర్దాయం ఆధారపడి ఉంటుంది. కడుపులో ఉన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకముందే మళ్లీ మళ్లీ తినడం విషం తినడంతో సమానమని పెద్దలు చెబుతారు. ఆకలి లేకపోయినా కేవలం సమయం అయిపోయిందన్న ఒకే ఒక్క కారణంతో బలవంతంగా తినడం మనం చేసే అతి పెద్ద తప్పు. శరీరం చెప్పే ఆకలి సంకేతాలను వినడం నేర్చుకోవాలి కానీ గడియారపు ముళ్లను చూస్తూ తినకూడదు. ఆకలి ఉంటేనే, శరీరం కోరితేనే మితంగా, రుచిగా కాక ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.  నిద్ర.. ఈ కాలంలో చాలామంది రాత్రంతా మేలుకోవడం, తెల్లవారితే అతిగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నారు. అయితే అతిగా నిద్రపోవడం లేదా అసలు నిద్రపోకపోవడం రెండు పద్ధతులూ శరీర నాశనానికి దారితీస్తాయి. తెల్లవారుజామునే నిద్రలేవడం వల్ల మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, బద్ధకం దరిచేరదు. సూర్యుడితో పాటు నిద్రలేచి ప్రకృతితో మమేకమైతే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. క్రమబద్ధమైన నిద్ర శారీరక శక్తిని పునరుద్ధరిస్తుంది. శారీరక శ్రమ.. నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత శారీరక కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. శరీరాన్ని కదిలించకుండా కేవలం ఒకే చోట కూర్చుని పనిచేయడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. వ్యాయామం, యోగ, చిన్నపాటి నడక, ఇంటి పనులు వంటి సహజ కదలికలు శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. జిమ్‌లకు వెళ్లి విపరీతంగా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ రోజూ శరీరానికి తగిన శ్రమ ఇచ్చేలా చూసుకోవడం చాలా అవసరం. ఇది కూడా చదవండి    వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే..! మానసిక ప్రశాంతత.. శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అతిగా కోపగించుకోవడం వల్ల శరీరంలోని ప్రాణశక్తి లోపలి నుంచే క్షీణించిపోతుంది. కోపం మన ఆరోగ్యాన్ని నాశనం చేసే అతిపెద్ద శత్రువు. మనసుపై నిగ్రహం లేకపోతే ఏ పనీ సరిగ్గా చేయలేము. డబ్బు కంటే మనసు నిండుగా, సంతోషంగా ఉండటమే అసలైన ఐశ్వర్యం. యోగ, ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. శుచి , పరిశుభ్రత.. కేవలం మన ఇల్లు మాత్రమే కాకుండా మన శరీరం, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మూలస్తంభం. శరీరం, చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండటం మనలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. అలాగే మన ఆలోచనలు, మాటలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఈ ఐదు సూత్రాలు ఏవీ కొత్తవి కావు, మన దైనందిన జీవితంలో ఎంతో సులభంగా పాటించదగినవే. వీటిని రోజువారీ జీవితంలో అలవాటు చేసుకుంటే ఏ అనారోగ్య సమస్యలూ దరిచేరవు. జీవనశైలిలో చిన్న మార్పుతోనే పెద్ద మార్పును సాధించవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించవచ్చు.                                                                                                                                                 *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు.. ఈ 5 పండ్లతో ఎన్నో లాభాలు!  
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, గుండెను పదిలంగా కాపాడుకోవడానికి చాలామంది వాకింగ్ ను ఎంచుకుంటారు. అయితే, వాకింగ్ చేయాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ, దానిని నిలకడగా కొనసాగించడంలో చాలామంది విఫలమవుతుంటారు. వర్షం వచ్చిందని, చలికాలం అని, లేదా ఆ రోజు మూడ్ బాలేదని, బిజీగా ఉన్నామని రకరకాల కారణాలతో నడకను మధ్యలోనే ఆపేస్తుంటారు. అసలు వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని ఆ ముఖ్యమైన రహస్యం ఏమిటో  వివరంగా తెలుసుకుంటే.. ఉత్సాహం కాదు.. సరైన ప్లానింగ్ ముఖ్యం.. చాలామంది ఫిట్‌నెస్ విషయంలో ఒక పెద్ద పొరపాటు చేస్తుంటారు. మొదటి రోజే ఉత్సాహంతో నలభై ఐదు నిమిషాలు లేదా గంటపాటు నడవాలని నిర్ణయించుకుంటారు. అలా మొదటి రోజు కష్టపడి నడిచాక, రెండో రోజు కాళ్ల నొప్పితో బాధపడతారు. మూడో రోజు పని ఒత్తిడి, నాలుగో రోజు వాతావరణం బాగోలేకపోవడంతో వాకింగ్ కు స్వస్తి చెబుతారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఫిట్‌నెస్ సాధించడంలో ఎక్కువ మోటివేషన్ ఉన్నవారు కాదు, మంచి అలవాట్లు ఏర్పరచుకున్నవారే విజయం సాధిస్తారని నిపుణులు చెబుతున్నారు. వేగం కాదు.. ఈ లాజిక్ ముఖ్యం.. గుండె ఆరోగ్యం కోసం వేగంగా నడవాలని,  హార్ట్ పాయింట్లు అని ఈ మధ్య చాలామంది వేగంగా నడుస్తూ ఉంటారు. కానీ ఎంత వేగంగా నడిచాం లేదా ఎంతసేపు నడిచాం అనేది ముఖ్యం కాదు, ప్రతీరోజూ నడకను కొనసాగించామా లేదా అనేదే చాలా కీలకం. ఈ క్రమంలోనే వాకింగ్ ప్రారంభించాలనుకునేవారి కోసం ఒక సులభమైన , అద్భుతమైన మార్గం ఉంది. అదేంటంటే.. ఈజీగా.. హుషారుగా.. మొదటగా మొదటి మూడు వారాలు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే నడవాలి. కేవలం ఐదు నిమిషాలు నడవడం వల్ల గుండెకు పెద్దగా ప్రయోజనం చేకూరకపోవచ్చు, కానీ మన మెదడుకు ఒక కొత్త అలవాటును నేర్పించడానికి ఇది సరిగ్గా సరిపోతుంది. మొదటి మూడు వారాలు ఐదు నిమిషాలు నడిచిన తర్వాత, ఆ సమయాన్ని మరో ఐదు నిమిషాలు పెంచి పది నిమిషాలు చేయాలి. ఆ తరువాత మరో మూడు వారాలకు పదిహేను నిమిషాలు, ఇలా క్రమంగా ఇరవై నుంచి ముప్పై నిమిషాలకు పెంచుకుంటూ పోవాలి. ఇది కూడా చదవండి   మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​ ఇక్కడ ప్రధాన లక్ష్యం మొదట్లోనే శరీరాన్ని అలసటకి గురి చేయడం కాదు, నడకను ఒక మంచి అలవాటుగా మార్చుకోవడం. అలవాటు ఏర్పడిన తర్వాత ఫిట్‌నెస్ అనేది దానంతట అదే మన సొంతం అవుతుంది. చిన్న చిన్న చిట్కాలు.. వాకింగ్ కు మార్గాలు.. నడకను ఎటువంటి ఆటంకాలు లేకుండా క్రమం తప్పకుండా సాగించడానికి కొన్ని చిన్నచిన్న చిట్కాలు ఎంతో సహాయపడతాయి. రాత్రి పడుకునే ముందే మరుసటి రోజు ఉదయం వాకింగ్ కి వేసుకునే దుస్తులను సిద్ధంగా ఉంచుకోవాలి. వీలైతే వాటిని పక్కనే ఉంచుకోవడం మంచిది. అలాగే షూస్‌ను మంచం పక్కనే ఉంచాలి. ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలి. దీనివల్ల మనం అలసత్వాన్ని గెలవడం కంటే అసలు అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా ఉండవచ్చు. హ్యాబిట్ స్టాకింగ్.. హ్యాబిట్ స్టాకింగ్ అనే ఒక అద్భుతమైన పద్ధతిని పాటించవచ్చు. ఉదయం నిద్రలేచి బ్రష్ చేసిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా నేరుగా వాకింగ్ కి వెళ్ళిపోవాలి. వాకింగ్ పూర్తయిన తర్వాతే స్నానం చేసేలా దినచర్యను మలచుకోవాలి. ఒక పాత అలవాటుకు మరో కొత్త అలవాటును ఇలా జోడించడం వల్ల పనులు మర్చిపోయే అవకాశం ఉండదు. ఒకవేళ వర్షం కారణంగా బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే, ఇంట్లోనే ఐదు నిమిషాల పాటు నడవాలి కానీ వాకింగ్ అలవాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించకూడదు. మొదలు పెట్టిన రోజే పది కిలోమీటర్లు నడవడం కంటే, ఏడాది పొడవునా ప్రతీరోజూ పది నిమిషాల చొప్పున నడవడం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మన గుండెకు కావాల్సింది ఏదో ఒక్కరోజే చేసే  ప్లానింగ్ కాదు.. ప్రతీరోజూ కొనసాగించే ప్లానింగ్ కావాలి. ఈ చిన్నపాటి నియమాలను పాటిస్తూ, వాకింగ్ ను జీవితంలో ఒక భాగం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతమవుతుంది.                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు  మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!                                 మీకు తెలుసా ..ఈ విటమిన్లు లోపిస్తే లివర్ దెబ్బతింటుంది..!