లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి తన వ్యాఖ్యలతో దేశ రాజకీయాల్లో పెను దుమారం రేపారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా దేశ అంతర్గత విషయాలపై విమర్శలు చేయడం ఆయనకు పరిపాటిగా మారిందన్న విమర్శలు మళ్లీ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో  చర్చకు దారితీశాయి.   కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో  అనేక లోపాలు ఉన్నాయని విదేశీ వేదికపై విమర్శించడం ఇప్పుడు అధికార పక్షంతో పాటు రాజకీయ పరిశీలకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  సాధారణంగా విదేశాలకు వెళ్లినప్పుడు తమ మాతృభూమి గొప్పతనాన్ని చాటిచెప్పడం భారత సంప్రదాయం. మన ఇతిహాసమైన మహాభారతంలో సైతం, అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా బయటి వ్యక్తుల ముందు మన లోపాలను ఎత్తిచూపకూడదని ధర్మరాజు తన తమ్ముళ్లకు సూచించిన సందర్భాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  అయితే.. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత స్థానంలో ఉన్న రాహుల్ గాంధీ.. విదేశీ సదస్సుల్లో, విదేశీ మీడియా ముందు దేశ ప్రతిష్ఠను మసకబార్చులా  మాట్లాడటం   సమంజసం కాదన్న అభిప్రాయం గట్టిగా వ్యక్తమౌతోంది.    దేశంలో ఏవైనా సమస్యలు ఉంటే, ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే  హక్కు రాహుల్ గాంధీకి ఉంది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రజలను చైతన్యవంతం చేయాలి. అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వానికి నిర్దిష్ట సూచనలు ఇవ్వాలి.. కానీ, స్వదేశంలో చేయాల్సిన రాజకీయ పోరాటాన్ని పక్కనపెట్టి, విదేశీ గడ్డపై దేశ ఆర్థిక వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో ఇండియా ప్రతిష్ఠ దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది.  ప్రస్తుతం ఇండియా చుట్టూ ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు   సున్నితంగా ఉన్నాయి. చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలు భారత్‌లో అస్థిరతను సృష్టించేందుకు నిరంతరం ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో   దేశ బలహీనతలను విదేశీ వేదికలపై ఎత్తిచూపడం ద్వారా  శత్రుదేశాలకు   ఆయుధాలు అందించినట్లు అవుతుందని పరిశీలకులు అంటున్నారు.  ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమి నేతలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని   అభిప్రాయపడుతున్నారు.   కొలంబియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ  విరుచుకుపడింది. రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ, గత పన్నెండేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజలు  సుఖసంతోషాలతో జీవిస్తున్నారని పేర్కొంది.. ఇప్పటికే ప్రధాని మోదీ పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ రాజకీయ వైఖరిని ఎద్దేవా చేస్తూ మాట్లాడిన విషయాన్ని వారు గుర్తుచేశారు.  ఇది కూడా చదవండి:  రాహుల్ విదేశీ పర్యటన: శశిథరూర్ వ్యాఖ్యలు వైరల్.!​ అదలా ఉంటే.. ఇటీవల సోనియా గాంధీ ఆత్మకథ విడుదల సందర్భంగా తన తల్లిదండ్రులను పార్వతీపరమేశ్వరులతో పోలుస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసి, మరో వివాదానికి తెరలేపాయి.   నిజానికి ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలు సామాన్య ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. ఒక బలమైన ప్రతిపక్ష నేతగా ఆయన ఎదుగుతున్నారనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ, ఆ సానుకూల వాతావరణాన్ని నిలబెట్టుకోవాల్సింది పోయి, ఆయన ఇలాంటి అనవసర వివాదాల్లో చిక్కుకుంటూ తన వ్యక్తిత్వాన్ని, రాజకీయ ప్రతిష్ఠను ఆయనే స్వయంగా తగ్గించుకుంటున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.    రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ తన ప్రసంగాల శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సందర్భోచితంగా, దేశ ప్రయోజనాలకు భంగం కలగని రీతిలో వ్యవహరించకపోతే, అది వ్యక్తిగతంగా ఆయనకే కాకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమయోచిత వ్యాఖ్యలు చేయనంత కాలం హస్తం పార్టీకి రాజకీయ కష్టాలు తప్పవని, ప్రజల విశ్వాసాన్ని పూర్తిస్థాయిలో గెలుచుకోవడం కష్టతరమవుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.   మీకు నచ్చవచ్చు: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై దుమారం​ 8 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు.. అదానీ ఆస్తులు ఎలా పెరిగాయి: రాహుల్ గాంధీ   [Rahul Gandhi, ColumbiaUniversitySpeech, IndianEconomy, BJPReaction, TeluguOne]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ వివాదం మరోసారి బహిర్గతమైంది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, వైసీపీ అధినేత  జగన్‌ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ జగన్ మీడియా ప్రచురించిన కథనంపై షర్మిల నిప్పులు చెరిగారు. తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.  సాధారణ కుటుంబ సంబంధాలను కూడా వక్రీకరించి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.   మహిళలను గౌరవిస్తామని చెప్పే జగన్..  ఇలాంటి నిరాధారమైన,  దిగజారిన వార్తలను తన సొంత మీడియా ప్రచురించడాన్ని ఎలా సమర్థించుకుంటారని నిలదీశారు. ఈ  ప్రచురణ వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో జగన్ స్వయంగా సమాధానం చెప్పాలని   డిమాండ్ చేశారు. గతంలో తమ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం రాజకీయ విభేదాలను పక్కనబెట్టి తన పిల్లల పెళ్లిళ్లకు అందరినీ ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా  గుర్తుచేశారు. రాజకీయంగా ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, కుటుంబ వేడుకల్లో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం జగన్ దిగజారుడుతనానికి పరాకాష్ఠగా షర్మిల అభివర్ణించారు. అన్నదమ్ముల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న   వివాదాల నేపథ్యంలో ఈ తాజా పరిణామం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం రాజకీయ లబ్ది కోసమే జగన్  కుటుంబ వ్యవహారాలను బహిరంగ వేదికలపైకి లాగుతూ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని షర్మిల పదేపదే ఆరోపిస్తున్న సంగతి విదితమే. ఇది కూడా చదవండి: వెల్తారా, వెళ్లరా: షర్మిల కుమార్తె వివాహానికి జగన్ హాజరుపై చర్చ.! అయినా..  తమ ప్రత్యర్థి అయితే చాలు…  వ్యక్తిత్వహననానికి పాల్పడడం, మహిళలను కించపరచడం వైసీపీ నేతలకు అలవాటేనంటూ.. నాడు నిండు సభలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానించిన విషయాన్ని గుర్తు చేస్తూ పరిశీలకులు సైతం షర్మిలపై అనుచిత వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.    అంతెందుకు గతంలో షర్మిల కూడా పలు సందర్భాలలో జగన్ ది సైతాన్ సైన్యం   విమర్శించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబుకు తన కుమారుడి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు పసుపు రంగు చీర కట్టుకొని వెళ్లిన షర్మిలను దూషించిన ఘనత వైసీపీ సైకో సైన్యానిది. ఇప్పుడు కూడా తన కూతురు అంజిలి పెళ్లి పత్రిక అందించేందుకు చంద్రబాబును కలిసిన షర్మిలపై వైసీపీయులు దుర్భాషలాడుతున్నతీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. మీకు నచ్చవచ్చు:   ఉంటే ఉండు, లేకుంటే దేశం విడిచిపో: వైఎస్ కంటే గొప్పోడివా.. జగన్ ను ఉతికి ఆరేసిన షర్మిల కుటుంబం.! ఎలహంక ప్యాలెస్ లో షర్మిల కుమార్తె పెళ్లి: పేర్ని నానికెందుకు నొప్పి.? [YSSharmila, YSJagan, SharmiladaughterMarriage, Invitation, CBN, CharacterAssassination, TeluguOne]
 దేశ రాజధాని నూతన దిల్లీలో జరిగిన సోనియాగాంధీ ఆత్మకథ  బిలాంగింగ్ పుస్తకావిష్కరణ వేడుకలో సీటింగ్ అరేంజ్ మెంట్ రాజకీయ చర్చకు తావిచ్చింది.  ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి  దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండియా కూటమి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో వేదికపై అతిథుల సీటింగ్  అరేంజ్ మెంట్ లో ప్రాధాన్యతల క్రమం రాజకీయ చర్చకు తెరలేపింది.   ఈ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మొదటి వరుసలో అదీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పక్కన కూర్చుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  కర్ణాటక  ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు రెండో వరుసలో సరిపెట్టుకున్నారు.  ఇదే వేదికపై అఖిలేష్ యాదవ్ వంటి ఇతర విపక్ష నేతలు కూడా మొదటి వరుసలో ఆసీనులయ్యారు.  కాంగ్రెస్ పార్టీ  కార్యక్రమంలో సొంత పార్టీ ముఖ్యమంత్రులను రెండో వరుసలో కూర్చోబెట్టి, బయటి నుంచి వచ్చిన మిత్రపక్ష నేతలకు వారికి మించిన ప్రాధాన్యత ఇవ్వడం రాజకీయంగా సంచలనంగా మారింది.  అంతే కాకుండా సోనియాగాంధీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో తొలి వరుసలో తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్ రాహుల్ పక్కన ఆసీనులైన ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అదే సమయంలో రేవంత్, డీకే వంటి నేతలు రెండో వరుసలో కూర్చున్న ఫొటోలు సైతం అదే స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కాగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ వద్ద ప్రాధాన్యత తగ్గిందంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.  అయితే  పరిశీలకులు మాత్రం అతిథి మర్యాదలో భాగంగానే కాంగ్రెస్ ఈ విధమైన సీటింగ్ అరేంజ్ మెంట్ చేసి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.  ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిలో అసంతృప్తి నిజమేనా? సొంత కార్యక్రమంలో సొంత నేతల కంటే.. ఇతర పార్టీల నేతలను గౌరవించడం సముచితంగా ఉంటుందని, అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ఆ విధమైన ఏర్పాట్లు చేసిందని చెబుతున్నారు.   నాయకులకు సముచిత గౌరవం ఇచ్చి మొదటి వరుసలో సీట్లు కేటాయించిందని కాంగ్రెస్ శ్రేణులు కూడా చెబుతున్నాయి.  పార్టీలో అత్యంత కీలకమైన నాయకురాలు ప్రియాంకా గాంధీ సైతం రెండో వరుసలోనే ఆసీనులవ్వడాన్ని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు.  అతిథులకు మర్యాదపూర్వకంగా మొదటి స్థానం కల్పించడం కాంగ్రెస్ సంప్రదాయమని, సోనియా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అదే చేసిందని అంటున్నారు.  మీకు నచ్చవచ్చు:  పార్టీ, ప్రభుత్వంపై పట్టుబిగించిన సీఎం రేవంత్.! రాహుల్ కు ఫిర్యాదు చేస్తా: తెలంగాణ సీఎం రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరుగుబావుటా.!​ [Sonia, biography Belonging, Revanth Reddy Vijay,Seat, TeluguOne] 
ALSO ON TELUGUONE N E W S
  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ రోజు ENE 2 ఉరఫ్ ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 తో సందడి చేస్తున్నాడు. నిన్న నైట్ ప్రీమియర్స్ నుంచే  పాజిటివ్ టాక్ వినిపిస్తుండటం విశ్వక్ సేన్ కి కొంచం ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే ప్లాప్స్ ని ప్రాణ స్నేహితులుగా మార్చుకొని తిరుగుతున్నాడు. అందులో ఒక మూవీ కల్ట్. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అక్టోబర్ 30 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, 20 రోజుల్లోపే అంటే కేవలం 20 రోజుల వ్యవధిలోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టడం విశేషం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.  ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండానే సైలెంట్ గా వదిలేసారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రావడం పాన్-ఇండియా సినీ అభిమానులకు, థ్రిల్లర్ ప్రేమికులకు పెద్ద సర్‌ప్రైజ్ అనే చెప్పాలి. థియేటర్లలో  మిస్ అయిన వారు లేదా మళ్లీ చూడాలనుకునే వారు ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయవచ్చు.    భారతీయ సినీ చరిత్రలోనే తొలి స్లాషర్ చిత్రంగా ప్రచారమైన ఈ సినిమా కథాంశం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. గోవా హోంమంత్రి కుమారుడు ఎల్విన్ (తారక్ పొన్నప్ప) తన పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బడా ప్రముఖులను ఆహ్వానించి ఒక గ్రాండ్ పార్టీ నిర్వహిస్తాడు. ఆనందంగా, వేడుకలా మొదలైన ఆ పార్టీ అనూహ్యంగా ఒక ప్రాణాంతక ఆటగా, వరుస హత్యల పరంపరగా మారుతుంది. పార్టీ జరిగే వేదిక చుట్టూ పేలుడు పదార్థాలు అమర్చడంతో పోలీసులు కూడా లోపలికి వెళ్లి అతిథులను కాపాడలేని నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. సరిగ్గా అప్పుడే ఆ పార్టీలో ఉన్న డీఎస్పీ సంకల్ప్ నాయక్ పాత్రలో విశ్వక్ సేన్ రంగంలోకి దిగి అతిథులను ఎలా కాపాడాడు, ఈ మారణహోమం వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు అనేదే ప్రధాన కథ.   విశ్వక్ సేన్ నటన, యాక్షన్ సన్నివేశాల్లో ఆయన చూపించిన స్వాగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే సన్నివేశాలు, చివరి 30 నిమిషాల కథనం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని విమర్శకులు, ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. 2 గంటల 43 నిమిషాల నిడివి గల ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ (UA) సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమాకు 123తెలుగు వంటి పోర్టల్స్ 2.75/5 రేటింగ్ ఇవ్వగా, ప్రేక్షకుల నుంచి 3.35/5 రేటింగ్ లభించింది. గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ, వివేక్ చేపురి, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ వంటి నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సందీప్ కాకరాల నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ సినిమా మూడ్‌ను చక్కగా ఎలివేట్ చేశాయి. యాక్షన్, హారర్, థ్రిల్లర్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ల్ట్' సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండటంతో, వయలెంట్ సర్వైవల్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఇది మంచి ఓటీటీ ఆప్షన్‌గా నిలుస్తోంది.   
నటీనటులు: విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్, శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్, రామ్   సాంకేతిక నిపుణులు: రచన: శాంతన్ రాజ్, తరుణ్ భాస్కర్ సంగీతం: వివేక్ సాగర్ ఎడిటింగ్: రవితేజ గిరిజాల సినిమాటోగ్రఫీ: ఏజే ఆరోన్ దర్శకత్వం: తరుణ్ భాస్కర్ నిర్మాతలు: సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి   తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వం లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emayyindi) బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా, కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ కల్ట్ స్టేటస్ కారణంగానే, మేకర్స్ 8 ఏళ్ల తర్వాత కొంతమంది కొత్త నటీనటులను జోడించి, దాదాపు అదే సాంకేతిక బృందంతో ఈఎన్ఈ రిపీట్ (ENE Repeat) పేరుతో సీక్వెల్ తీశారు. ఈరోజే ( 19th November) విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో వివరంగా చూద్దాం.   కథ: వివేక్ (Vishwak Sen) దర్శకత్వంలో కౌశిక్ (Abhinav Gomatham) కమెడియన్‌గా, కార్తీక్ (Srinath Maganti) కెమెరామెన్‌గా, ఉపేంద్ర అలియాస్ ఉప్పు (Venkatesh) ఎడిటర్‌గా ఒక సినిమా చేస్తారు. ఆ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అందరూ అనుకుంటారు, కానీ మొదటి రివ్యూలోనే అది ఫ్లాప్ అని తేలిపోతుంది. వివేక్ ఆ బాధ్యతను తనపై వేసుకుని, అప్పులన్నీ తానే తీర్చాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో తనను తాను ఒంటరిగా బంధించుకోవడంతో, అతని ప్రేయసి షిర్లీ (Anisha Ambrose) అతన్ని వదిలి వెళ్లి, ఫారిన్ సబ్సిడీ ప్రొడక్షన్‌లో స్పెషలైజేషన్ ఉన్న లైన్ కో-ఆర్డినేటర్‌గా సెటిల్ అవుతుంది. వివేక్ ఎనిమిదేళ్ల పాటు చిన్న చిన్న పనులు చేసుకుంటూ గడుపుతాడు. మరోవైపు, ప్రతి సినిమాలో చెంపదెబ్బ తినడం ఒక సెంటిమెంట్‌గా మారడంతో కౌశిక్ ఆ పాత్రలతోనే సెటిల్ అవుతాడు. కార్తీక్ సినిమాటోగ్రాఫర్‌గా స్థిరపడతాడు. ఉప్పు కజిన్ సిస్టర్ కీర్తన (Shivatmika Rajasekhar) తండ్రి (Ram) చాలా కంట్రోలింగ్ మనస్తత్వం గల వ్యక్తి. ఆమెను డాక్టర్ చేయాలని ఆయన అనుకుంటారు, కానీ ఆమె సినిమాపై ఉన్న ఇష్టంతో పరోక్షంగా చదువు మానేసి కార్తీక్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. ఈ గ్యాంగ్ వల్ల ఆమె పెళ్లి సంబంధం గందరగోళంగా మారుతుంది. దాంతో ఆమె తండ్రి, డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం తాను ఖర్చు చేసిన అదే బడ్జెట్‌లో ఒక సినిమా తీయాలని వీరికి సవాల్ విసురుతాడు. మరి వీరు ఆ సవాల్‌ను పూర్తి చేయగలిగారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.   విశ్లేషణ: సైకో వివేక్‌గా మళ్లీ తన జోన్‌లోకి వచ్చిన విశ్వక్ సేన్ నటనతో మెప్పించాడు. కానీ ప్యానిక్ అటాక్స్, గుండె దడ వంటి సన్నివేశాల్లో అతని నటనకు అకస్మాత్తుగా కట్స్ పడుతూ ఉంటాయి. అతని పాత్ర రాసుకున్న విధానం అస్తవ్యస్తంగా అనిపిస్తుంది; అతనికి ఇగో ఎక్కువని స్నేహితులు నమ్ముతారు కానీ, ఎప్పుడూ కూర్చుని మాట్లాడుకోరు. శ్రీనాథ్ మాగంటి బాగానే చేశాడు కానీ, కొన్నిసార్లు షాట్‌లో ఎనర్జీని తీసుకురావడానికి అవసరం కంటే ఎక్కువగా ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. గ్యాంగ్‌తో పాటు కథకు కీలకంగా ఉండాల్సిన శివాత్మిక రాజశేఖర్ పాత్రను త్వరగా పక్కన పెట్టేశారు, ఆమె సమస్యలను ఒకే ఒక్క బిట్‌లో పరిష్కరించేశారు. అభినవ్ గోమఠం తన వరుస వన్-లైనర్లతో, ఎలుగుబంటి ఎపిసోడ్‌తో థియేటర్లో నవ్వులు పూయించాడు. కానీ అతని పాత్ర మళ్లీ ఒకేలా సాగుతుంది. వెంకటేష్ బాగా చేశాడు. అనీషా పాత్ర వృథా అయింది. రామ్ మరియు ఇతర నటులు పెద్దగా ప్రభావం చూపలేదు, అయితే అందరిలోనూ తాళ్లూరి రాజేశ్వరికి మంచి సన్నివేశం దక్కింది.  సినిమాలపై ఇన్-హౌస్ సెటైర్లు వేయడంలో తరుణ్ భాస్కర్ తన పట్టును చూపించాడు. కానీ ప్రధాన ఎమోషనల్ సన్నివేశాల్లో అతని రచన చాలా తేలిపోవడంతో అన్నీ రాండమ్‌గా అనిపిస్తాయి. సింగిల్ షాట్ సీన్ ఎగ్జిక్యూషన్‌లో ఎలాంటి ప్రయోజనం కనిపించదు. సరైన కో-ఆర్డినేషన్ లేకుండా డార్క్ మరియు కేయాటిక్ హ్యూమర్ కోసం చేసిన బలవంతపు ప్రయత్నంలా అనిపిస్తుంది. ఎగ్జిక్యూషన్ పరంగా తరుణ్ ఫ్రెంచ్, జపనీస్ సినిమాల్లో తరచుగా వాడే కొన్ని కెమెరా టెక్నిక్స్, ఎడిటింగ్ ప్యాటర్న్స్ ప్రయత్నించాడు కానీ, ఆ టెక్నిక్స్‌కు అవసరమైన సరైన ప్రయోజనాన్ని మాత్రం ఇవ్వలేకపోయాడు. సుజీత్, సందీప్ రెడ్డి వంగా, నందిని రెడ్డి, అనిల్ రావిపూడిలను క్యామియోల కోసం తీసుకురావడంలో అతని తెలివితేటలు కనిపిస్తాయి, కానీ వాటిలో ఎక్కువ భాగాన్ని క్రెడిట్స్ తర్వాత పెట్టాడు. పంచతంత్రం సినిమా లాంటి గందరగోళం నుంచి పుట్టే కామెడీ లోనే సొల్యూషన్ తేవాలి అని ప్రయత్నించాడు కానీ రచన లో ఆ పదును కుదరలేదు.  ట్రాపిక్ థండర్, నైట్ ఎట్ ది మ్యూజియం తరహాలో, అసలు థీమ్స్‌ను ప్లేసిబోలుగా జోకుల్లో అంతర్లీనంగా ఉంచుతూ సెటైరికల్ అంశాలను కథనంలోకి ఎక్కువగా తీసుకురావడానికి సినిమా ప్రయత్నిస్తుంది. అయితే అవన్నీ సహజంగా కాకుండా రాండమ్‌గా అనిపించడమే ఇక్కడ సమస్య. ఈ నగరానికి ఏమైంది ఆ విషయంలో చాలా మెరుగ్గా చెప్పగలిగారు. టెక్నికల్‌గా కొన్ని భాగాలు బాగున్నా, చాలా ఛాయిస్‌లు వర్కౌట్ కాలేదు. వివేక్ సాగర్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నిరాశపరిచాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా చూస్తే, ఈ సినిమా మంచి నవ్వులను అందిస్తుంది కానీ, కథనంలో బలమైన లోతు లేదు. థీమాటిక్‌గా ఇందులో మంచి కోర్ పాయింట్ ఉంది, కానీ తమాషా సినిమా తరహా లోనే ఇది కూడా చెప్పాల్సిన విషయం మనసుకు హత్తుచుకునే లా చెప్పడం లో విఫలం అయ్యింది అనే చెప్పాలి. ఒక్కసారి చూడొచ్చు.    ప్లస్ పాయింట్స్: ప్రధాన బృందం నటన అభినవ్ పంచులు  సినిమా కోర్ పాయింట్ పెద్ద దర్శకుల క్యామియోస్  మైనస్ పాయింట్స్: ప్లేసిబో ఎఫెక్ట్‌ను మరీ సింపుల్‌గా తేల్చెయ్యడం కథనం లో పట్టు లేకపోవడం గందరగోళం నుంచి పట్టించాలి అనుకున్న కామెడీ ఇంకా గందరగోళం గా ఉండటం క్లైమాక్స్ లో పట్టు లోపించడం  పేలవమైన రచన   చివరి గా: తక్కువ అంచనాలతో వెళ్తే, జోకుల కోసం ENE రిపీట్ ఒక్కసారి చూడొచ్చు.   రేటింగ్: 2.5/5   గమనిక: ఈ రివ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు రచయిత యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. వీటికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు. వీటిపై స్పందించే ముందు వీక్షకులు తమ విచక్షణను ఉపయోగించాలని సూచించడమైనది.  
Cast: Vishwak Sen, Abhinav Gomatham, Srinath Maganti, Venkatesh, Shivatmika Rajasekhar, Anisha Ambrose, Ram Crew:  Written by Shantan Raj, Tharun Bhascker  Music by Vivek Sagar  Editing by Ravi Teja Girijala Cinematography by AJ Aaron  Directed by Tharun Bhascker  Produced by Srujan Yarabolu, Sandeep Nagireddy    Ee Nagaraniki Emayyindi earned a cult following even though box office wise it did not have such an impact. Due to this cult status, makers after 8 years did sequel, ENE Repeat with few additions to the cast and retaining most of the crew. The movie released on 19th November and let's discuss about it in detail.    Plot:  Vivek (Vishwak Sen) directs a film with Koushik (Abhinav Gomatham) in a comedian role while Karthik (Srinath Maganti) handles camera and Upendra aka Uppu (Venkatesh) handles edit. They all think the film is going to be a hit but first review itself declares it as a flop. Vivek takes the blame and decides to pay off debts by himself.  He ends up locking up himself prompting his love Shirley (Anisha) to leave him and settle as line co-ordinator, specialising in foreign subsidy production. He works for in small jobs for eight years. Meanwhile, Koushik settles as a person who gets slapped in every film as it becomes a sentiment. Karthik (Srinath Maganti) settles as a cinematographer.  Uppu's cousin sister Keerthana (Shivatmika) has a controlling father (Ram), who wants her to become a doctor but she indirectly drops out to pursue her passion for cinema. She works with Karthik as an assistant. Her marriage proposal gets tossed up into a mess by the gang and they are challenged by her father to make a film in the same budget he spent for destination wedding. Can they pull it off? Watch the movie to know more.    Analysis:  Vishwak Sen shines as a performer as he is back in the zone as psycho Vivek in the film. But his performance gets randomly cut to show the panic attacks and palpitations. The writing for his character grows erratic as his friends believe he is egoistic but they never sit and talk.  Srinath Maganti is good but at times he felt he needs to over compensate and bring all the energy into a shot. Shivatmika Rajasekhar had to be the crux of the story with the gang but she gets sidelined quickly and then her problems are resolved in one bit.  Abhinav Gomatham gets the house down in laughter with his consistent one-liners and bear episode. But the character is again monotonic. Venkatesh is good. Anisha is wasted. Ram and others leave very less impact while Talluri Rajeswari gets better scene among all.  Tharun Bhascker showcases good command in comedy and in-house satires on movies but his writing gets so shallow in main emotional moments that everything feels random. The execution of oner/single shot scene lacks any purpose as it feels like forced attempt at dark and chaotic humour without proper co-ordination.  Execution wise Tharun tries some camera techniques and editing patterns that are used regularly in French and Japanese cinema but doesn't give them the purpose that these techniques need. His intelligence is visible in bringing Sujeeth, Sandeep Reddy Vanga, Nandini Reddy, Anil Ravipudi for cameos but he packs most of them after credits.  Like Tropic Thunder, Night at the Museum, movie tries to bring sataric elements more into the narrative while real themes are underlined in these jokes as placebos. Problem lies in them feeling random rather than earned while ENE nailed that part better. Technically few portions are good while several choices do not land. Vivek Sagar's music and score are underwhelming.  Production values are decent and overall, film offers good laughs but lacks cohesive narrative depth. Thematically, it had a very good core point but like in Tamasha it becomes more random and chaotic than intended losing the purpose of being intentionally quirky, edgy.    Positives:  Performances of the core group Abhinav's witty one-liners  Basic premise  Cameos  Negatives:  Random tonal shifts  Chaotic humour doesn't shine always  Climax feels more random  Writing needed more refinement  Over simplification of placebo effect.   Bottomline: ENE Repeat is watchable for the jokes but with low expectations.    Rating: 2.5/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
సినిమా బాగుంటే అందులో పెద్ద స్టార్లు ఉండాల్సిన అవసరం లేదని మరోసారి నిరూపిస్తోంది ‘హ్యాపీ జర్నీ’. ఎలాంటి భారీ అంచనాలు, హడావుడి లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో నిలవడంతో పాటు, రేటింగ్స్ విషయంలోనూ మంచి స్పందన అందుకుంటోంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ‘కొన్ని ప్రయాణాలు ప్రణాళికలను మారుస్తాయి.. మరికొన్ని జీవితాలనే మార్చేస్తాయి’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఐఎండీబీలో 9.7/10 రేటింగ్, బుక్ మై షోలో 9.5/10 రేటింగ్ సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రేటింగ్స్ ప్రేక్షకుల అభిప్రాయాల ఆధారంగా మారే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఈ స్థాయి రేటింగ్స్ రావడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. వేర్వేరు వయసులు, మనస్తత్వాలు కలిగిన ఏడుగురు మహిళలు ఒక యూరప్ ట్రిప్‌కు బయలుదేరుతారు. వారి ప్రయాణం మొదట్లో సరదాగా సాగినా.. ఒక్కొక్కరి మధ్య అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. వేర్వేరు తరాలకు చెందినవారు ఒకే ప్రయాణంలో కలవడంతో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. అలా నవ్వులు, భావోద్వేగాల మధ్య సాగుతున్న వారి ప్రయాణంలో ఓ అమ్మాయి కనిపించకుండా పోవడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఈ సినిమాలో ఆమని, అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, సునైనా బాదం, రూపా శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వంశీధర్ గౌడ్, రవి శివతేజ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించారు. అభిరామ్ నాయుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణంలోనూ భాగమయ్యారు. బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. మణికందన్ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్స్ట్‌లోనూ అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబంతో కలిసి చూడగలిగే ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సినిమా ఒక మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా మహిళల ప్రయాణం, వారి మధ్య స్నేహం, అనుబంధాలు, ఎదురయ్యే అనూహ్య సంఘటనలతో కథ సాగడం ఈ సినిమాకు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మొత్తానికి థియేటర్లలో పెద్దగా ప్రచారం పొందని ‘హ్యాపీ జర్నీ’ ఓటీటీలో మాత్రం కొత్త ప్రేక్షకులను సంపాదించుకుంటోంది. భారీ స్టార్ కాస్ట్ లేకపోయినా.. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఓటీటీలో మంచి రేటింగ్‌తో ట్రెండింగ్‌లో ఉండటంతో అసలు ఈ సినిమాలో ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో కనిపిస్తోంది.       [HappyJourneyMovie, HappyJourneyOTT, SunNXT, AamaniMovies, AnnapurnammaMovies] 
తెరపై సూపర్‌స్టార్‌గా అభిమానులను అలరించే రజనీకాంత్.. నిజ జీవితంలో మాత్రం కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయటకు చూపించడానికి ఇష్టపడని ఆయనకు సంబంధించిన కొన్ని అరుదైన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి గ్రీస్‌లో సరదాగా గడుపుతున్న రజనీకాంత్ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహ వేడుక గ్రీస్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు రజనీకాంత్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. పెళ్లి వేడుకలు పూర్తయిన తర్వాత అక్కడే కొంత సమయం గడిపిన ఆయన.. భార్య లత, కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్య, మనవళ్లతో కలిసి ఏథెన్స్ నగరంలో పర్యటించారు. ఈ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను ఆయన కుమార్తె సౌందర్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో రజనీకాంత్ తన భార్య లత చేయి పట్టుకుని నడుస్తూనే.. మరోవైపు మనవళ్ల చేతులు పట్టుకుని కనిపిస్తున్నారు. ఆయన కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్య కూడా ఈ ఫోటోల్లో ఉన్నారు. ఐశ్వర్య కుమారులు యాత్ర రాజా, లింగా రాజా.. సౌందర్య కుమారులు వేద్ కృష్ణ, వీర్‌లతో కలిసి రజనీ ఎంతో ఆనందంగా గడిపారు. బ్రౌన్ కలర్ స్వెటర్, బ్లాక్ ట్రాక్ ప్యాంట్, వైట్ స్కార్ఫ్, బ్లూ క్యాప్‌తో ఆయన కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలను షేర్ చేసిన సౌందర్య.. “ఏథెన్స్‌లో మేము అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించుకున్నాం. ఈ అందమైన కుటుంబ విహారయాత్రలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాం” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా తమ ఆనందాన్ని కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. నటి రాశీ ఖన్నా 'హౌ క్యూట్' అంటూ స్పందించగా.. మరికొందరు 'నిజ జీవితంలోనూ ఆయన గెలిచారు.. ఎంత అందమైన కుటుంబం' అంటూ ప్రశంసిస్తున్నారు. ఇది కూడా చదవండి: గోదారి గట్టు, మీసాల పిల్ల.. అంతకుమించి మరో పాట.. వెంకీ సినిమా ఫస్ట్ సింగిల్‌పై అప్‌డేట్! ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'జైలర్ 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధర్మన్' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో రామ్ పోతినేని, సిమ్రన్, నయనతార, రాశీ ఖన్నా, శ్రీలీల, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా 2027లో విడుదల కానుంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో గడిపే సమయానికి రజనీకాంత్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ ఫోటోలు మరోసారి చూపిస్తున్నాయి. మీకు నచ్చవచ్చు: విలన్‌గా గోపీచంద్ రీ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన టీమ్! వారణాసి వాయిదా: అసలు నిజమేంటి? బాల్ రాజమౌళి కోర్టులో లేదా?       [RajinikanthFamily, RajinikanthGreecePhotos, RajinikanthGrandchildren, SoundaryaRajinikanth RajinikanthAthensTrip]
సినిమా ప్రమోషన్స్‌లో కొత్తదనం చూపించాలంటే నాని తర్వాతే ఎవరైనా. తన సినిమాలకే కాదు.. తాను సమర్పిస్తున్న సినిమాల ప్రమోషన్స్‌లోనూ నాని తనదైన స్టైల్‌లో సందడి చేస్తుంటారు. ఇప్పుడు నితిన్ నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ కోసం కూడా అదే జోష్ చూపించారు. తాజాగా జరిగిన జామ్ పార్టీలో నాని, నితిన్ కలిసి ‘రుకు రుకు రుక్మిణి’ పాటకు స్టెప్పులేస్తూ సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా నాని, నితిన్ కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పార్టీ పూర్తి వీడియోను రేపు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ ప్రమోషనల్ ఈవెంట్‌లో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. నాని, నితిన్ మధ్య ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. నాని తన కెరీర్ ప్రారంభంలో నితిన్‌ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. https://x.com/UnanimousProds/status/2123005403000967215 "ఒకప్పుడు నేను నితిన్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ ని. నా బిగినింగ్స్ లో ఒక పేజీ నితిన్ ది. ఇప్పుడు నితిన్ రీ బిగినింగ్స్ లో ఒక పేజీ నాది." అంటూ నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  ఇది కూడా చదవండి: అప్పుడు మల్లెపూల పల్లకి.. ఇప్పుడు రఘుకుల తిలక.! నితిన్ నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఫియా సయ్యద్ హీరోయిన్. ఈ సినిమాను నాని సమర్పించగా, దీప్తి గంటా నిర్మించారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మీకు నచ్చవచ్చు: నీ గూడు చెదిరింది.. ప్రతి పదంలోనూ ఒక విషాదం.. పాటలోని అసలు భావం ఇదే.! రెండేళ్లుగా మంచానికే పరిమితమైన స్టార్ యాక్టర్.. కన్నీళ్లు తెప్పిస్తున్న రియల్ స్టోరీ.!       [Nani Nithiin Dance, Alias Rukmini, Jam Party, Ruku Ruku Rukmini Song]
కోలీవుడ్ స్టార్ సూర్య సినిమాలో టాలీవుడ్ హీరో గోపీచంద్ విలన్‌గా నటించబోతున్నారంటూ వచ్చిన వార్తలకు తెరపడింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని గోపీచంద్ టీమ్ అధికారికంగా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వెల్లడించింది. ఇటీవల సూర్య 49వ సినిమాలో గోపీచంద్ విలన్‌గా కనిపించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ సినిమాల్లో విలన్‌గా మెప్పించిన గోపీచంద్.. మళ్లీ అదే తరహా పాత్రలో కనిపిస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఆశించారు. ముఖ్యంగా సూర్యతో తలపడే పాత్రలో ఆయన నటిస్తారనే ప్రచారం ఆసక్తి రేపింది. అయితే ఈ వార్తలపై తాజాగా గోపీచంద్ టీమ్ స్పందించింది. రాబోయే తమిళ సినిమాలో గోపీచంద్ విలన్‌గా నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా తప్పు అని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ని కోరింది. అంతేకాదు.. గోపీచంద్ తదుపరి సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు, అప్‌డేట్స్ ఏవైనా ఉంటే తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే వెల్లడిస్తామని తెలిపింది. దీంతో సూర్య సినిమాలో గోపీచంద్ విలన్ అనే ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడినట్లయింది.  ఇది కూడా చదవండి: మళ్ళీ విలన్‌గా గోపీచంద్.. జయం, వర్షం రోజులు గుర్తొస్తాయా.? కాగా, ప్రస్తుతం గోపీచంద్ హీరోగా రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘భరతవర్ష’ ఒకటి. మరో సినిమా 'సింగ' వెంకట్ దర్శకత్వంలో రూపొందుతోంది. మీకు నచ్చవచ్చు:  ఆకాశంలో ఒక తార vs డియర్ ఆస్ట్రోనాట్.. ఒకే రోజు ఒకే కథతో రెండు సినిమాలు.! తను మాట్లాడలేదు.. చిరు నోటి నుంచి బయటపడ్డ అసలు సీక్రెట్.!       [Gopichand, Villain Role, Suriya 49, Bharata Varsha, Singa Movie]  
బాలీవుడ్‌ కి సరికొత్త ఊపిరిని ఇవ్వడంతో పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించింది ధురంధర్ సిరీస్. ఈ ఘనతకి ప్రధాన ఆద్యుడు దర్శకుడు ఆదిత్య ధర్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. దీంతో ఆదిత్య ధర్ కొత్త మూవీ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అప్ కమింగ్ మూవీ ఇదే అంటూ తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ధురంధర్  హీరో రణ్‌వీర్ సింగ్,  ఆదిత్య ధర్ మరోసారి చేతులు కలపబోతున్నట్లు సమాచారం. . ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈసారి ఎలాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్ కాకుండా పూర్తిగా విభిన్నమైన పౌరాణిక, చారిత్రక నేపథ్యంతో కూడిన భారీ మైథలాజికల్ యాక్షన్ డ్రామాని  తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోందని, 2027 సంవత్సరంలో షూటింగ్ ప్రారంభించి 2028 డిసెంబర్ నాటికి ఈ సినిమాను థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ఓం రిలీజ్ వేళ ఫ్యాన్స్ కి ధనుష్ నుంచి సరికొత్త పిలుపు: సీఎం విజయ్ ఏం చేసాడయ్యా!   మౌర్య సామ్రాజ్య నేపథ్యాన్ని లేదా పురాణ గాథలని  ఆధారంగా చేసుకుని ఒక విజువల్ వండర్‌గా  తీర్చిదిద్దాలని  ఆదిత్య ధర్ భావిస్తున్నారట. కేవలం సాధారణ వినోదమే కాకుండా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. అయితే, గతంలో ఆదిత్య ధర్ తెరకెక్కించాలనుకుని ఆగిపోయిన 'అశ్వత్థామ' ప్రాజెక్ట్‌ను మళ్లీ రీవిజిట్ చేస్తున్నారా లేక పూర్తిగా కొత్త మైథలాజికల్ కథతో వస్తున్నారా అనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.   మీకు నచ్చవచ్చు:విశ్వక్ సేన్ సంచలన కామెంట్స్: ఫ్లాప్ మూవీకి సక్సెస్ మీట్! మీకు నచ్చవచ్చు: చిరంజీవితో రోజా మూవీ: ఆ రోజు ఏం జరిగిందంటే.. ప్రముఖ రచయిత వ్యాఖ్యలు వైరల్!   [Aditya Dhar,Ranveer Singh,  mythological, Mourya Chakravarthy]
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ మూవీ వాయిదా పడే అవకాశముందనే ప్రచారం మొదలైంది. ఏప్రిల్ 7, 2027న విడుదల కావాల్సిన ఈ సినిమా జులై 30కి వెళ్లిపోవచ్చనే వార్తలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సినిమా వాయిదా పడుతుందా లేదా అనేది షూటింగ్‌పై ఆధారపడి లేదు. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయిందట. ఎడిటింగ్ పనులు కూడా చాలావరకు ముగిశాయని తెలుస్తోంది. కీలక సన్నివేశాల్లో ఎక్కువ భాగం ఇప్పటికే ఎడిట్ చేశారట. అయితే ఫైనల్ ఎడిట్‌ను మాత్రం ఇంకా లాక్ చేయాల్సి ఉందని సమాచారం. ఈ సినిమా కోసం ప్రపంచంలోని ప్రముఖ VFX సంస్థలు పనిచేస్తున్నాయి. రాజమౌళి ఈ సంస్థలకు డిసెంబర్ చివరి నాటికి విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి చేసి అందించాలని డెడ్‌లైన్ విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడే సినిమా విడుదల తేదీపై అసలు ఉత్కంఠ నెలకొంది. VFX పనులు అనుకున్న సమయానికి పూర్తయితే.. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను పరుగులు పెట్టించనున్నారట. రీ-రికార్డింగ్, సౌండ్ మిక్సింగ్ సహా తుది మెరుగులు దిద్దే పనులను వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ‘వారణాసి’ విడుదల తేదీ విషయంలో కీలకమైన అంశం VFX పనులే అన్నమాట. అవి సమయానికి అందితే ఏప్రిల్ 7న సినిమా విడుదలకు మార్గం సుగమం అవుతుంది. ఇది కూడా చదవండి: వారణాసి స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.! ఇక సినిమాలో కొన్ని ప్యాచ్‌వర్క్ సన్నివేశాల కోసం జనవరిలో చిన్న షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇది చాలా తక్కువ రోజుల షూటింగ్ మాత్రమేనని తెలుస్తోంది. ఆ తర్వాత మార్చిలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, మార్చి నుంచి ఏప్రిల్ వరకు భారీ స్థాయిలో గ్లోబల్ ప్రమోషన్స్ నిర్వహించాలనేది మేకర్స్ ప్రణాళికగా ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ‘వారణాసి’ టీమ్ ఏప్రిల్ 7 విడుదల లక్ష్యంగానే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అయితే డిసెంబర్ చివరి నాటికి VFX పనులు ఎంతవరకు పూర్తవుతాయన్నదే ఇప్పుడు కీలకం. ఒకవేళ VFX సంస్థలు డెడ్‌లైన్‌లోగా పనులు పూర్తి చేయలేకపోతే మాత్రం సినిమా విడుదలను జులైకి వాయిదా వేసే అవకాశం ఉందని టాక్. మీకు నచ్చవచ్చు: రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌.. వారణాసి తర్వాత జక్కన్న నెక్స్ట్ మూవీ ఇదేనా.? హైదరాబాద్‌లో ఐమాక్స్ రీఎంట్రీ.. ఫస్ట్ మూవీ ఇదే.!       [Varanasi Release Date, Varanasi VFX, Mahesh Babu, SS Rajamouli]  
సంక్రాంతి సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా ఆయన తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'జనవరి 12 విడుదల'పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. మూవీ ఫస్ట్ సింగిల్‌ను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పాటలను ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆయన మొదటి పాటను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ పాటకు సంబంధించిన ప్రకటనను కూడా అనిల్ రావిపూడి తనదైన కామెడీ స్టైల్‌లో చేయబోతున్నారట. ఇందుకోసం ఒక చిన్న కామెడీ స్కిట్‌ను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. గత సినిమాల ప్రమోషన్ల మాదిరిగానే ఈసారి కూడా తనదైన మార్క్ చూపించడానికి అనిల్ రెడీ అవుతున్నారు. అనిల్ రావిపూడి సినిమాల్లో పాటలకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. గతంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలోని 'గోదారి గట్టు మీద రామచిలకవే', 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలోని 'మీసాల పిల్ల' పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాటలు సినిమాలపై అంచనాలను పెంచడంలో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు 'జనవరి 12 విడుదల' సినిమాలో కూడా అలాంటి క్యాచీ మెలోడీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా మొదటి పాట ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ బామ్మర్దులుగా కనిపించబోతున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తాయని సమాచారం. వెంకటేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి కనిపించనుంది. కథలో కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా కామెడీగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే వెంకటేష్, కీర్తి సురేష్ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు గతంలో వచ్చిన 'ఎఫ్ 2' తరహాలో వినోదాన్ని పంచుతాయని ప్రచారం జరుగుతోంది. ఇది కూడా చదవండి:  ఫహాద్ ఫాజిల్ కొత్త అవతారం.. కరాటే ట్రైనింగ్ ఫొటోలు వైరల్! మరోవైపు ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే ప్రాజెక్ట్ గురించి కూడా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. 2028లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఆయన సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టును కళ్యాణ్ రామ్ నిర్మించే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతానికి అనిల్ రావిపూడి దృష్టి అంతా 'జనవరి 12 విడుదల' సినిమాపైనే ఉంది. ఇప్పటికే ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2027 జనవరి 12న థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ వంటి ఇద్దరు హీరోలు కలిసి నటిస్తుండటం, అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడం, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పుడు డిసెంబర్ మొదటి వారంలో విడుదల కానున్న ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి 'గోదారి గట్టు', 'మీసాల పిల్ల' పాటల తరహాలో ఈ కొత్త పాట కూడా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. మీకు నచ్చవచ్చు:  శుక్ర మహాదశ నుంచి ఎస్సై పరీక్షల వరకు.. ర‌వితేజ అండ్ గ్యాంగ్‌ అదిరిపోయే కామెడీ.! ‘ట్విలైట్’ హీరో ఇప్పుడు ఏజెంట్ 007.. జేమ్స్ బాండ్‌గా సంచలన ఎంట్రీ!       [January12Vidudala, Venkatesh, KalyanRam, AnilRavipudi, GVPrakashKumar] 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మన సంస్కృతిలో కొన్ని ప్రాంతాల ప్రజల ఆహారపు అలవాట్లు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా బెంగాలీలు చేపలను ఎంత ఇష్టంగా తింటారో మనందరికీ తెలిసిందే. రోజులో ఒక్కసారైనా చేప రుచి చూడాలని వారు ఎంతో ఆశ పడతారు, చేపలు లేకుండా తమ రోజువారీ భోజనం అసంపూర్ణమని భావిస్తారు. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, చేపలలో సమృద్ధిగా లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు మరియు విటమిన్ల వల్లే వారు వీటిని అంతగా ఇష్టపడతారు. కేవలం 5 దశల్లో అర్థమయ్యే ఈ ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే, ప్రతిరోజూ లేదా కనీసం వారానికి ఒకసారైనా చేపలను ఆహారంలో చేర్చుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. చేపలను రోజూ లేదా క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. మారుతున్న వాతావరణంలో వచ్చే సాధారణ అనారోగ్యాలను ఎదుర్కొనేందుకు ఈ ఇమ్యూనిటీ పవర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక చేపలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మన శరీరంలోని రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అందుకే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి చేపలు ఒక అద్భుతమైన సహజసిద్ధమైన ఆహారంగా నిలుస్తాయి. గుండెతో పాటు మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా చేపలు అమోఘంగా పనిచేస్తాయి. చేపలను క్రమం తప్పకుండా తినడం వల్ల జ్ఞాపకశక్తి చురుగ్గా మారుతుంది మరియు వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు వంటి సమస్యలు దరిచేరవు. అంతేకాకుండా, వయసు సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ఇవి తగ్గిస్తాయి. చేపలలో ఉండే ప్రోటీన్లు చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఇవి కండరాల నిర్మాణానికి తోడ్పడటంతో పాటు, శరీరానికి అవసరమైన బలాన్ని అందించి మనల్ని రోజంతా ఉల్లాసంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. మన కంటి చూపును కాపాడుకోవడానికి కూడా చేపలలోని పోషకాలు మరియు విటమిన్లు ఎంతగానో సహాయపడతాయి. వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మందగించకుండా ఉండాలంటే పోషకాహారం అవసరం, దానికి చేపలు మంచి ఎంపిక. కేవలం అంతర్గత ఆరోగ్యమే కాకుండా, బాహ్య సౌందర్యాన్ని పెంచడంలోనూ చేపలు ముందుంటాయి. చేపలలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని కాంతివంతంగా మార్చుతాయి. అలాగే జుట్టు రాలడాన్ని పూర్తిగా తగ్గించి, కురులు ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉండేలా చేస్తాయి. ఇది కూడా చదవండి:కేలరీల ఖజానా, నల్ల శెనగలు.. చలికాలంలో ఇవి తింటే మీ శరీరానికి అసలైన శక్తి! ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి ఎంతో అవసరం. చేపలలో ఉండే విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచడమే కాకుండా, శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది. కొందరు చేపలను రోజూ తింటే, మరికొందరు వారానికి ఒక్కసారైనా తింటూ ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఏదేమైనా, సరైన మోతాదులో చేపలను మన ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి అందే పోషకాలు అపారం. సరళమైన ఆహారపు అలవాటుతో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటే ఆశ్చర్యం కలగక మానదు. గుండె రక్షణ, మెదడు చురుకుదనం, కండరాల బలం, కంటి చూపు, చర్మ సౌందర్యం, జుట్టు రక్షణ మరియు బలమైన ఎముకలు—ఇలా అన్నింటికీ చేపలు ఒక సమగ్ర పరిష్కారంగా నిలుస్తాయి. మీ రోజువారీ లేదా వారపు డైట్‌లో చేపలను చేర్చుకోవడం ద్వారా మీరు కూడా ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు ఒక అడుగు వేయవచ్చు. మీకు నచ్చవచ్చు:కిడ్నీలు సేఫ్‌గా ఉండాలంటే, రోజూ ఈ డ్రింక్ తాగండి!                                రోగనిరోధక శక్తిని పెంచే, క్యాప్సికమ్ గురించిన, ఆసక్తికర విషయాలు!       Eating Fish Daily Benefits, Omega 3 Health, Coastal Diet Longevity, Heart And Brain Foods, Healthy Seafood Nutrition, Doctor Health Advice, Health Tips In Telugu.  
చలికాలం రాగానే చాలామందిని వేధించే పెద్ద సమస్య జుట్టు రాలడం మరియు జుట్టు పెరుగుదల మందగించడం. మారుతున్న వాతావరణం, పొడి గాలి, ఆహారపు అలవాట్ల వల్ల దువ్వెన పట్టినప్పుడల్లా వెంట్రుకలు ఊడిపోతూ ఆందోళన కలిగిస్తాయి. అయితే నిపుణుల ప్రకారం చలికాలంలో హెయిర్ గ్రోత్ పూర్తిగా ఆగిపోదు, కానీ వేగం మాత్రం తగ్గుతుంది. చల్లని గాలి కారణంగా తల చర్మంలోని రక్తనాళాలు కుచించుకుపోతాయి. దీనివల్ల జుట్టు కుదుళ్లకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు తగ్గిపోయి వెంట్రుకలు బలహీనపడతాయి. దీనికి తోడు శరీరంలో విటమిన్ డి లోపం కూడా జుట్టు పెరుగుదల తగ్గడానికి ఒక ప్రధాన కారణంగా నిలుస్తుంది. చలికాలంలో మనం వేసుకునే ఉన్ని టోపీలు, స్కార్ఫ్‌ల రాపిడి వల్ల కూడా వెంట్రుకలు చిక్కులు పడి మధ్యలోనే తెగిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా హెయిర్ కలరింగ్, బ్లీచింగ్, స్ట్రెయిట్‌నర్లు వంటి స్టైలింగ్ సాధనాలను తరచూ వాడటం వల్ల కురులు తేమ కోల్పోయి నిర్జీవంగా మారుతాయి. చలిని తట్టుకోవడానికి మరీ వేడినీళ్లతో తలస్నానం చేస్తే జుట్టులోని సహజ నూనెలు పూర్తిగా పోతాయి. అందుకే ఎప్పుడూ గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలి. వారానికి 2 లేదా 3 సార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. జుట్టు కుదుళ్లకు తిరిగి బలం చేకూర్చాలంటే రోజుకు 10 నిమిషాల పాటు సున్నితమైన ఆయిల్ మసాజ్ ఎంతో మేలు చేస్తుంది. గోరువెచ్చని కొబ్బరి నూనె, ఆముదం లేదా ఆర్గాన్ ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల తల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపడి హెయిర్ గ్రోత్‌కు తోడ్పడుతుంది.  షాంపూ విషయంలో సల్ఫేట్, పారాబెన్ లేని మాయిశ్చరైజింగ్ షాంపూలను ఎంచుకోవాలి. గ్లిజరిన్, హయలురోనిక్ యాసిడ్, షియా బటర్ ఉన్న కండీషనర్లు వాడటం వల్ల జుట్టు మృదువుగా ఉంటుంది. అలాగే వారానికి ఒకసారి డీప్ కండీషనింగ్ హెయిర్ మాస్క్ వేసుకుని 30 నిమిషాల తర్వాత కడిగేస్తే కురులకు లోతైన తేమ అందుతుంది. ఇది కూడా చదవండి:స్టెంట్‌లు, బైపాస్ సర్జరీల వల్ల ఆయుష్షు పెరుగుతుందా? తాజా అధ్యయనం ఏం చెబుతోంది? తలస్నానం తర్వాత జుట్టు కొద్దిగా తడిగా ఉన్నప్పుడే వెంట్రుకల చివర్లకు హెయిర్ సీరమ్ రాయాలి. ఇది బయటి పొడిగాలి నుంచి కురులకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతి 6 నుంచి 8 వారాలకు ఒకసారి జుట్టు చివర్లను కొద్దిగా కత్తిరించుకోవడం వల్ల చిట్లిపోయే సమస్య తగ్గి ఆరోగ్యకరమైన పెరుగుదల కనిపిస్తుంది. బయటి సంరక్షణతో పాటు లోపలి పోషణ కూడా అంతే ముఖ్యం. ఆహారంలో బయోటిన్, ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. గుడ్లు, బాదం, వాల్‌నట్స్, అవిసె గింజలు, ఆకుకూరలు, చేపలు, అవకాడో వంటి పోషకాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. చలికాలంలో దాహం తక్కువగా ఉన్నా రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగడం మర్చిపోకూడదు. ఈ చిన్న మార్పులతోనే చలికాలపు జుట్టు సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. ఒకవేళ విపరీతంగా జుట్టు ఊడిపోతున్నా, తలపై ప్యాచెస్ లాగా బట్టతల కనిపిస్తున్నా లేదా చుండ్రు సమస్య తీవ్రంగా ఉన్నా సొంత చిట్కాలు ఆపి వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం ఉత్తమం. మీకు నచ్చవచ్చు:నేచర్ ప్రిస్క్రిప్షన్: డాక్టర్లు సైతం సిఫారసు చేస్తున్న ,అద్భుతమైన ప్రకృతి రహస్యం!                                 సరికొత్త క్యాన్సర్ చికిత్సలు: వైద్య రంగంలో నూతన మైలురాళ్ళు ఇవే!       Winter Hair Growth, Winter Hair Care Tips, Stop Winter Hair Fall, Scalp Hydration Tips, Healthy Hair Routine, Dermatologist Hair Advice, Health Tips In Telugu.
అమ్మమ్మ చేతి వంట తలచుకోగానే మనసులో ఒక తీయని జ్ఞాపకం మెదులుతుంది. ముఖ్యంగా ఆంధ్ర సంప్రదాయ స్వీట్లలో నెయ్యి సున్నుండలు ప్రత్యేక స్థానంలో నిలుస్తాయి. బయట కొనే మిఠాయిలతో పోలిస్తే ఇంట్లోనే స్వచ్ఛమైన పదార్థాలతో తయారుచేసే సున్నుండల రుచే వేరు. పొట్టు లేని మినపప్పు, బెల్లం లేదా పంచదార పొడి, యాలకుల పొడి, మంచి నెయ్యి కలిపి చేసే ఈ ఆంధ్ర స్వీట్ నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుంది. నాణ్యమైన నెయ్యి వాడితే ఈ సున్నుండలు ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉంటాయి. ఈ కమ్మని సున్నుండల తయారీ విధానం కోసం ముందుగా కొలతలను సరిగ్గా సిద్ధం చేసుకోవాలి. పొట్టు లేని మినపప్పు లేదా మినపగుళ్లు 2 కప్పులు తీసుకోవాలి. కావాలనుకుంటే వీటిలో కొద్దిగా బియ్యం కూడా కలుపుకోవచ్చు. తీపి కోసం బెల్లం లేదా పంచదార పొడి 1 కప్పు, సువాసన కోసం అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలాగే కరిగించి కొద్దిగా గోరువెచ్చగా చేసుకున్న నెయ్యి సుమారు అర కప్పు వరకు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు వేయించే ప్రక్రియతో అసలైన రుచి మొదలవుతుంది. ముందుగా తీసుకున్న 2 కప్పుల మినపప్పును మీడియం మంటపై వేయించాలి. గరిటెతో రెండు, మూడు సార్లు కలుపుతూ మంచి సువాసన వచ్చే వరకు, రంగు మారే వరకు నిదానంగా వేయించాలి. పప్పు మాడిపోకుండా జాగ్రత్త పడుతూ వేయించిన తర్వాత, వాటిని కాసేపు ఫ్యాన్ కింద పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన పప్పుతోనే పిండి మెత్తగా, కమ్మగా వస్తుంది. ఆ తర్వాత మిక్సీలో మెత్తని పిండి సిద్ధం చేసుకోవాలి. చల్లారిన మినపప్పును మిక్సీ జార్‌లో వేసి, దానిలో 5 యాలకులు కూడా జత చేయాలి. వీటిని మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పంచదార వాడుతుంటే, ఆ పంచదారను కూడా ఇందులో వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పిండి సమానంగా మెత్తగా ఉండటం వల్ల సున్నుండలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇది కూడా చదవండి:శీతాకాలంలో, పచ్చి బఠానీలు తింటే బరువు తగ్గవచ్చా? నిపుణులు ఏం చెబుతున్నారు? ఇక సున్నుండలు చుట్టే ఘట్టం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. దానిలో ముందుగా కరిగించి గోరువెచ్చగా ఉంచుకున్న అర కప్పు నెయ్యిని కొద్దికొద్దిగా పోస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం నెయ్యి పట్టేలా చేతితో చక్కగా కలపాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండి వేడి మీద ఉన్నప్పుడే నిమ్మకాయ సైజంతా ఉండలుగా చుట్టుకోవాలి. పిండి చల్లారితే ఉండలు సరిగ్గా కట్టడం కష్టమవుతుంది కాబట్టి గోరువెచ్చని వేడి ఉన్నప్పుడే వేగంగా చుట్టడం ముఖ్యం. ఇలా తయారుచేసుకున్న నెయ్యి సున్నుండలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటాయి. రోజుకో సున్నుండ తిన్నా ఆ కమ్మదనం, సంప్రదాయ రుచి మనసును నింపుతుంది. మీరు కూడా ఇంట్లోనే ఈ సులభమైన పద్ధతిలో చేసి చూసి, అమ్మమ్మ నాటి తీపి రుచిని ఆస్వాదించండి. మీకు నచ్చవచ్చు:ఇంజెక్షన్లతో పనిలేదు, ఇకపై మాత్రలతోనే బరువు తగ్గింపు: పూర్తి వివరాలు ఇవే!                                 ఉదయం పూట, వ్యాయామాలు చేసేవారికి, బ్లడ్ షుగర్ ఎందుకు పెరుగుతుంది?       Ghee Sunnundalu Recipe, Minapa Sunnundalu, Urad Dal Ladoo, Andhra Traditional Sweets, Healthy Indian Desserts, Homemade Festival Recipes, Cooking Recipes In Telugu.  
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని నిరంతరం శుద్ధి చేస్తూ, శరీరంలోని వ్యర్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అయితే, జీవనశైలిలో మార్పులు , వివిధ ఆరోగ్య సమస్యల కారణంగా కిడ్నీలు బలహీనపడే ప్రమాదం ఉంది. కిడ్నీలు దెబ్బతినడం మొదలైనప్పుడు మన శరీరం కొన్ని హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా, మూత్ర విసర్జనలో వచ్చే మార్పులు కిడ్నీ సమస్యలకు తొలి సంకేతాలుగా భావించవచ్చు. వీటిని ముందుగానే గుర్తించడం ద్వారా పెద్ద ముప్పు నుంచి బయటపడవచ్చు. మూత్రంలో నురుగు.. సాధారణంగా కిడ్నీల పనితీరు మందగించినప్పుడు మూత్రం రంగు, పరిమాణం , దాని స్వభావంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. కొందరిలో మూత్రం చేసే సమయంలో విపరీతంగా , ఎక్కువసేపు నిలిచి ఉండే తెల్లటి నురగ వస్తుంటుంది. ఇలా తరచూ జరగడం మూత్రంలో ప్రొటీన్ బయటకు పోతున్నదనేదానికి ముఖ్య సంకేతం. ఆరోగ్యవంతమైన కిడ్నీలు శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ను ఉంచుకుని వ్యర్థాలను మాత్రమే బయటకు పంపిస్తాయి. కానీ కిడ్నీ ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు ప్రొటీన్ మూత్రం ద్వారా కారిపోతుంది. మూత్రం రంగు.. మూత్రం రంగులో వచ్చే మార్పులను కూడా తేలికగా తీసుకోకూడదు. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ ఎటువంటి కారణం లేకుండా మూత్రం ముదురు పసుపు రంగులో, గోధుమ రంగులో లేదా తేయాకు రంగులో పడుతుంటే అప్రమత్తం కావాలి. కొన్ని సందర్భాల్లో మూత్రం గులాబీ రంగులో లేదా ఎరుపు రంగులో రావడం కూడా జరుగుతుంది. దీనిని వైద్య పరిభాషలో హెమటూరియా అంటారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, ఇన్ఫెక్షన్లు తలెత్తడం లేదా వాపు కారణంగా ఇలా జరగవచ్చు. నొప్పులు లేకపోయినా మూత్రంలో రంగు మారడం లేదా రక్తం పడటం జరిగితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. మూత్రవిసర్జన వేళలు.. మూత్ర విసర్జన చేసే వేళల్లో వచ్చే తేడాలు కూడా కిడ్నీ సమస్యలను సూచిస్తాయి. పగటిపూట లేదా రాత్రి సమయంలో సాధారణం కంటే చాలా ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం కిడ్నీల సామర్థ్యం తగ్గడానికి ఒక కారణం కావచ్చు. కిడ్నీలు మూత్రాన్ని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోవడం  వల్ల ఈ సమస్య ఎదురవుతుంది. దీనికి తోడు డయాబెటిస్ లేదా ప్రోస్టేట్ సమస్యలు కూడా కారణం కావొచ్చు. మరోవైపు, అకస్మాత్తుగా మూత్రం వచ్చే పరిమాణం చాలా తగ్గిపోవడం లేదా పూర్తిగా ఆగిపోవడం జరిగితే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి సంకేతం. ఇది కూడా చదవండి   కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే! వాసన.. మూత్రం నుండి తీవ్రమైన లేదా సాధారణం కాని ఘాటైన వాసన రావడం కూడా కొన్నిసార్లు శరీరంలో నీటిశాతం తగ్గడం వల్ల లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ఈ లక్షణాలతో పాటు పొత్తి కడుపులో  నొప్పి, జ్వరం లేదా మంట వంటి సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మరికొన్ని సిగ్నల్స్.. మూత్రంలో కనిపించే ఈ మార్పులతో పాటు శరీరం ఇతర సంకేతాలను కూడా ఇస్తుంది. ముఖం మరియు పాదాలు ఉబ్బడం, ఒంట్లో తీవ్రమైన నీరసం నిరంతరం వేధించడం, ఆకలి మందగించడం, వికారంగా అనిపించడం, చర్మంపై విపరీతమైన దురద పుట్టడం , కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని అర్థం చేసుకోవాలి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్లే ఇవన్నీ జరుగుతాయి. అధిక రక్తపోటు, మధుమేహం దీర్ఘకాలికంగా నియంత్రణలో లేకపోవడం, కిడ్నీలో రాళ్లు, పదే పదే వచ్చే మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు , వైద్యుల సలహా లేకుండా విచ్చలవిడిగా పెయిన్‌కిల్లర్స్ వంటి మందులను వాడటం వల్ల కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటాయి. కాబట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, తగినంత నీరు తాగుతూ ఉండటం , ఏ చిన్న అనారోగ్య లక్షణం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                              *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..​                                  మోకాళ్ల నొప్పులతో ఇబ్బందా..ఈ 5 వ్యాయామాలు మిస్ అవ్వకండి .! ​  
మన శరీరంలోని కిడ్నీలు, లివర్ వంటి ముఖ్యమైన అవయవాలు ఆరోగ్యంగా పనిచేస్తున్నాయా? వాటిలో ఏవైనా సమస్యలు మొదలైతే శరీరం ముందుగానే కొన్ని సంకేతాలను ఇస్తుందా? అసలు ఈ సంకేతాలను ఎలా గుర్తించాలి? మన శరీర ఆరోగ్యాన్ని అర్థం చేసుకోవడంలో చెవులు, కళ్లు, పెదవుల ఆకృతి వంటి బాహ్య లక్షణాలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మన శరీరంలోని ప్రతి అవయవం తనదైన ప్రత్యేక విధులను నిర్వహిస్తుంది. కిడ్నీలు రక్తంలోని వ్యర్థ పదార్థాలను వడపోసి బయటకు పంపడంలో, శరీరంలో నీరు, లవణాల సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే లివర్ ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన పిత్తరసాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు శరీరంలోని అనేక ముఖ్యమైన జీవక్రియల్లో పాల్గొంటుంది. ఈ అవయవాల పనితీరులో మార్పులు వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఈ వీడియోలో డాక్టర్ ఉమా వెంకటేష్ (Dr. Uma Venkatesh) పంచభూతాల సిద్ధాంతం, శరీరంలోని అవయవాల పనితీరు, నాడి ప్రాధాన్యత గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటు చెవులు, కళ్లు, పెదవుల ఆకృతిని పరిశీలించడం ద్వారా శరీరంలోని అంతర్గత ఆరోగ్య పరిస్థితుల గురించి ఎలా అర్థం చేసుకోవచ్చనే అంశాలను పల్స్ బ్యాలెన్సింగ్ (Pulse Balancing) విధానం ద్వారా తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో మీరు తెలుసుకోగలిగే ముఖ్యమైన అంశాలు: కిడ్నీలు, లివర్ మన శరీరంలో నిర్వహించే ముఖ్యమైన విధులు ఏమిటి?   ఈ అవయవాల ఆరోగ్యంలో మార్పులు వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏమిటి?   కిడ్నీ సమస్యలకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను ఎలా  గుర్తించాలి?   లివర్ ఆరోగ్యాన్ని సూచించే లక్షణాలు ఏమిటి?    చెవులు, కళ్లు, పెదవుల ఆకృతికి శరీర ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏమిటి?   పంచభూతాల సిద్ధాంతం ప్రకారం శరీర అవయవాల పనితీరును ఎలా వివరిస్తారు?   నాడి పరిశీలన, పల్స్ బ్యాలెన్సింగ్ విధానంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?   మన అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శరీరం ఇచ్చే మార్పులను నిర్లక్ష్యం చేయకుండా గమనించడం, అవసరమైనప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం. కేవలం బాహ్య లక్షణాలు లేదా అవయవాల ఆకృతిని బట్టి కిడ్నీ, లివర్ వ్యాధులను నిర్ధారించలేము. సరైన వైద్య పరీక్షలు, నిపుణుల సలహాతోనే ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకోవాలి. కిడ్నీ, లివర్ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడానికి డాక్టర్ ఉమా వెంకటేష్ అందిస్తున్న ఈ విలువైన సమాచారాన్ని పూర్తిగా చూడండి. TeluguOne Health – ఆరోగ్యంపై అవగాహన, ఆరోగ్యకరమైన జీవితానికి మార్గదర్శకం.
శరీరంలోని ప్రతి విభాగానికి ఆక్సిజన్ సక్రమంగా అందాలంటే మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. కానీ మారుతున్న జీవనశైలి, విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం, చెడు అలవాట్లు మన శ్వాస వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు చాలా సాధారణం అయిపోతున్నాయి. ముఖ్యంగా క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (Chronic Obstructive Pulmonary Disease) సీఓపీడీ అనే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, కేవలం వయసు మళ్ళిన వారికే కాకుండా నలభై ఏళ్లకంటే తక్కువ వయసు ఉన్న యువతలో కూడా ఈ సమస్యల బారిన పడుతున్న వారు క్రమంగా పెరుగుతున్నారు. ఈ వ్యాధి ముదిరినప్పుడు రోగులకు సాధారణంగా శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. world copd day.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా నవంబర్ నెల మూడవ బుధవారం రోజున ప్రపంచ సీఓపీడీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది ఈ దినోత్సవం సందర్భంగా శ్వాస ఆడకపోవడం లేదా ఆయాసంగా ఉందా, అయితే అది సీఓపీడీ కావచ్చు అనే ముఖ్యమైన అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు హరిస్తున్న ప్రధాన కారణాలలో మూడవ స్థానంలో ఉంది. దీనివల్ల ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అనారోగ్యానికి ప్రధాన కారణం దాదాపు డెబ్బై శాతానికి పైగా పొగాకు , ధూమపానమే అని నిపుణులు చెబుతున్నారు. సీఓపీడీ బారిన పడినప్పుడు ఊపిరితిత్తులలోని గాలి నాళాల్లో తీవ్రమైన మంట , వాపు ఏర్పడుతుంది. దీనివల్ల గాలి లోపలికి వెళ్లడం, బయటికి రావడంలో అవరోధం ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఈ సమస్యలో ఉన్న అతి పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, దీని లక్షణాలు చాలా నెమ్మదిగా బయటపడతాయి. ప్రారంభ దశలో వీటిని గుర్తించడం కష్టం కావడం వల్ల చాలా మంది సాధారణ దగ్గు లేదా వయసు మళ్లడం వల్ల వచ్చే బలహీనత అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. ఉదయం పూట ఎక్కువగా దగ్గు రావడం, దగ్గుతో పాటు కఫం పడటం దీని ప్రధాన లక్షణం. అలాగే కాస్త దూరం నడిచినా, మెట్లు ఎక్కినా లేదా చిన్నపాటి శారీరక పని చేసినా వెంటనే ఆయాసం రావడం గమనించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగేకొద్ది ఎలాంటి పనులు చేయకపోయినా విశ్రాంతి సమయంలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ఇవే కాకుండా సీఓపీడీ సోకినప్పుడు ఛాతీలో బిగువుగా అనిపించడం, బరువుగా ఉండటం, శ్వాస తీసుకునేటప్పుడు పీపీ మంటూ శబ్దం రావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరిలో తరచుగా బ్రాంకైటిస్ లేదా నిమోనియా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా బరువు తగ్గడం, తీవ్రమైన అలసట , నీరసం  కూడా ఈ వ్యాధి లక్షణాలే. కొందరిలో చలి గాలి తగిలినా లేదా కాలుష్యం బారిన పడినా ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇది కూడా చదవండి  షుగర్ ఉన్నవారికి స్ట్రోక్ ముప్పు పొంచి ఉందా..ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి! ధూమపానం , సిగరెట్, బీడీలు కాల్చే అలవాటు ఈ వ్యాధికి ప్రధాన శత్రువు. పొగత్రాగని వారితో పాటు చుట్టుపక్కల ఉండి ఆ పొగ పీల్చేవారికి కూడా ఈ ప్రమాదం ఉంటుంది. ఇది కాకుండా నగరాల్లో ఉండే తీవ్రమైన వాతావరణ కాలుష్యం, ఇళ్లలో వంట చేయడానికి ఉపయోగించే చెక్క, బొగ్గు వంటి కట్టెల పొగ కూడా ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయి. కొన్ని సందర్భాలలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా చిన్న వయసులోనే ఇది రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం కష్టమైనప్పటికీ, ప్రారంభ దశలోనే గుర్తిస్తే తగిన చికిత్స , జీవనశైలి మార్పుల ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. దీనికోసం ప్రధానంగా ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. కాలుష్యం , దుమ్ము ధూళి ఉండే ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ఇన్‌హేలర్లు  వాడటం, క్రమంగా శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కాపాడుకోవచ్చు. ఏదైనా అనారోగ్య లక్షణాలు దీర్ఘకాలంగా వేధిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే  వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ఎంతో మంచిది.                                                                                                                                               *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..                                  వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే..!​