LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై  విమర్శలు  గుప్పించారు. ఇక తాను పదవీ విరమణ తర్వాత కూడా ప్రజాజీవితంలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవడం, ఆయన పాలనలో చోటుచేసుకున్నట్లు తాను భావిస్తున్న తప్పులను చట్టపరంగా ప్రశ్నించడం తన లక్ష్యాలన్నారు.  రిటైర్మెంట్ తర్వాత తనకు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిందనీ, అయితే తనకు పదవులపై కించిత్ కూడా ఆసక్తి లేదని చెప్పారు.  తనకు పని ఇవ్వమనీ, నిర్దుష్ట బాధ్యత అప్పగించాలనీ తాను చంద్రబాబును కోరినట్లు చెప్పారు. జగన్ రాజకీయాలకు వ్యతిరేకంగా పని చేయడానికి అవకాశం కల్పించాలని చంద్రబాబును తాను కోరాననీ, అయితే ఆయన తనకు ఎటువంటి  పనీ అప్పగించలేదని స్పష్టం చేశారు.  జగన్ హయాంలో జరిగినట్లు తాను ఆరోపిస్తున్న అవకతవకలు, తప్పిదాలను చట్టపరంగా ప్రశ్నించే పని అప్పగించాలని చంద్రబాబును కోరాననీ, అయితే ఆయన పట్టించుకోలేదని వివరించారు.   ప్రభుత్వం నుంచి తాను ఆశించిన బాధ్యత రాకపోవడంతో బయట ఉండి తనకు సాధ్యమైన మార్గాల్లో అదే అంశాలపై పోరాడుతున్నానన్నారు. ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అయితే తన ఎంట్రీ పట్ల తెలుగుదేశం అధినాయత్వం పెద్దగా ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు.   [AP Inteligence, Former Chief,  AB Venkateswara Rao, CBN, Jagan, Appolitics,  Former IPS, Telugu One]
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకుని  సొంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు షాక్ ఇచ్చింది.  ముఖ్యంగా యూపీలో ఒక్కరంటే ఒక్క సట్టింగ్ రాజ్యసభ సభ్యుడికి కూడా టికెట్ ఇవ్వలేదు. పదవీకాలం ముగియనున్న కేంద్ర మంత్రులతో  ఏ ఒక్క సిట్టింగ్ ఎంపీకి కూడా తిరిగి అవకాశం కల్పించకుండా, ఎనిమిది మంది కొత్త ముఖాలను బరిలోకి దింపుతున్నట్లు   ప్రకటించింది. యూపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం  సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం యూపీ  రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కేంద్ర కేబినెట్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు సీనియర్ మంత్రులకు కూడా రాజ్యసభ టికెట్ నిరాకరించడం సంచలనంా మారింది. యూపీ నుంచి ఖాళీ అవుతున్న పది రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్ర అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్రకారం అధికార బీజేపీ సులభంగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉండగా, మిగిలిన రెండు స్థానాలను ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకునే  అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ తన ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను  విడుదల చేసింది. ఈ జాబితాలో హర్దీప్ సింగ్ పురి, బీఎల్ వర్మ వంటి కేంద్ర మంత్రులకు చోటు దక్కలేదు. వీరు ఇద్దరూ గతంలో యూపీ కోటాలోనే రాజ్యసభ సభ్యులుగా సేవలందించినప్పటికీ, ఈసారి వారికి పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. పార్టీ విడుదల చేసిన కొత్త జాబితాలో ధర్మపాల్ సింగ్, రాధాకాంత్ ఓఝా, ప్రకాశ్ పాల్, విద్యాసాగర్ సోన్‌కర్, గోపీ కృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శ్రుతి గంగ్వార్‌లను అభ్యర్థులుగా ఖరారు చేశారు. 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని,   వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక ఉ:దని స్పష్టమవుతోంది. సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిరంతరం శ్రమించే సంస్థాగత కార్యకర్తలకు గుర్తింపునిచ్చేలా ఈ జాబితాను రూపొందించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో వివిధ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించారు. ఇందులో ముగ్గురు ఓబీసీ వర్గాలకు చెందిన వారు, ఇద్దరు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ), మరో ముగ్గురు అగ్రవర్ణాలకు చెందిన నాయకులు ఉన్నారు. అంతేకాకుండా, సామాజిక సమతుల్యతను పాటిస్తూ ఇద్దరు మహిళా అభ్యర్థులకు కూడా  స్థానం కల్పించడం విశేషం. బారాబంకి మాజీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్ తో పాటు ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ కుమార్తె శ్రుతి గంగ్వార్‌‌లను మహిళా కోటాలో బరిలోకి దించారు. ఇక ఇతర ప్రముఖులలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది. కింది స్థాయి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులను ఎగువసభకు పంపడం ద్వారా, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. గతంలో ఎంపీలుగా కొనసాగిన ప్రముఖులను పక్కనపెట్టి మరీ కొత్తవారికి అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో నాయకత్వ మార్పునకు పెద్దపీట వేస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసే దిశగా బీజేపీ అధిష్ఠానం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి యువత, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొనిపోయేలా నాయకత్వ బృందాన్ని సిద్ధం చేయడంలో ఈ రాజ్యసభ ఎన్నికల ఎంపిక ఒక ముఖ్యమైన మెట్టుగా నిల వనుంది. సిట్టింగ్‌లను కాదని సరికొత్త బృందాన్ని ఎగువసభకు పంపడం ద్వారా పార్టీలో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు, సమర్థులైన కొత్త నాయకులను జాతీయ స్థాయికి పరిచయం చేయాలనే ఉద్దేశం కూడా దీని వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో యూపీ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సీనియర్ నాయకులను పక్కనపెట్టడంపై కొంతమేర అంతర్గత అసంతృప్తి వ్యక్తమయ్యే ఆస్కారం ఉన్నప్పటికీ, సామాజిక సమీకరణాల కోణంలో ఈ జాబితా పార్టీకి ఎన్నికల సమయంలో లబ్ధి చేకూరుస్తుందని పార్టీ శ్రేణులు గట్టిగా విశ్వసిస్తున్నాయి. అక్టోబర్ 16న జరగనున్న పోలింగ్ అనంతరం ఈ కొత్త అభ్యర్థులందరూ ఏకగ్రీవంగా లేదా సులభంగానే రాజ్యసభకు ఎన్నికవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. [Rajya Sabha elections, BJP candidates, Uttar Pradesh politics, Union Ministers, UP Assembly elections, Telugu One]
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈక్వేటర్ ప్రావిన్స్‌లోని న్గోంబే-లుకోలేలా ప్రాంతం సమీపంలో రెండు పెద్ద పడవలు ప్రమాదవశాత్తూ ఎదురెదురుగా అత్యంత వేగంగా ఢీకొన్నాయి. ఈ ఘోర దుర్ఘటనలో ప్రాథమిక అంచనాల ప్రకారం కనీసం 30 మంది ప్రయాణికులు నీట మునిగి ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ప్రయాణికులు ఆచూకీ లేకుండా గల్లంతయ్యారు. రెస్క్యూ టీమ్‌లు, స్థానిక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ముమ్మరంగా గాలింపు మరియు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అధికారులు  ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదానికి గురైన రెండు పడవల్లో ఒకటి దేశ వాయువ్య ప్రాంతంలోని ఉబాంగి ప్రాంతం నుంచి కాంగో రాజధాని కిన్షాసాకు ప్రయాణిస్తుండగా, మరొక నౌక కిన్షాసా నుంచి లుకోలేలా ప్రాంతానికి వెళ్తోంది. ఈ క్రమంలో రెండు పడవలు ఒకదానికొకటి ఎదురుగా వచ్చి బలంగా ఢీకొనడంతో ఈ పెను ప్రమాదం సంభవించింది. ప్రమాద తీవ్రత కారణంగా పడవలు దెబ్బతిని ప్రయాణికులు ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం మరియు రాత్రి సమయంలో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రాణనష్టం భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ విషాద ఘటనను మరింత సంక్లిష్టం చేస్తూ, ప్రమాదానికి గురైన పడవల్లో ఒకదానిలో భారీ మొత్తంలో చమురు తరలిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పడవలోని ఆయిల్ అంతా నది నీటిలో పెద్ద ఎత్తున లీక్ కావడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. నది ఉపరితలంపై భారీ పరిమాణంలో చమురు తేలడంతో, ప్రయాణికులలో కొందరికి ఈత వచ్చినా కూడా నీటి నుంచి సురక్షితంగా బయటపడటం సాధ్యం కాలేదని, ఆయిల్ కారణంగా వారు ఈదుకుంటూ రాలేక ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. రెస్క్యూ సిబ్బందికి కూడా ఈ చమురు లీకేజీ వల్ల సహాయక చర్యలు చేపట్టడంలో తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాంగో నదిలో ఇలాంటి పడవ ప్రమాదాలు జరగడం సర్వసాధారణంగా మారిపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువుతో ప్రయాణికులను ఎక్కించడం, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణాల వల్ల ప్రతి ఏటా వందలాది మంది అమాయక ప్రజలు నీటిపాలై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటి, అనుమతి లేని ప్రయాణాలు ఎలా సాగుతున్నాయనే అంశాలపై అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేయడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.     [ congo river, boat collision, congo boat accident, kinsasha news, ubangi boat crash, congo river disaster,  Telugu One, Telugu News ]  
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్య ప్రజలను, వ్యాపారులను వేధిస్తూ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిని ఒక్కొక్కరిగా చట్టం ముందుకు తీసుకువస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిగా (DMHO) బాధ్యతలు నిర్వహిస్తున్న స్వర్ణకుమారి సోమవారం నాడు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వైద్యాధికారే స్వయంగా లంచం డిమాండ్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిని నడుపుతున్న నిర్వాహకుల నుంచి అనుమతులు లేదా ఇతర పనుల నిమిత్తం డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి భారీగా లంచం డిమాండ్ చేశారు. బాధితులు ఎంత బతిమలాడినా ఆమె తన పద్ధతి మార్చుకోలేదు. పైగా లక్ష రూపాయల ముట్టజెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో విసిగిపోయిన ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును సీరియస్‌గా పరిగణించిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహం రచించారు. సోమవారం నాడు ఒప్పందం ప్రకారం లంచం సొమ్ము అందజేసే సమయానికి రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ముందస్తుగా మాటువేశారు. పథకం ప్రకారం ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుల నుంచి ఖచ్చితంగా రూ. 1,00,000 (ఒక లక్ష రూపాయల) నగదును లంచం రూపంలో స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా మెరుపుదాడి చేశారు. ఏమాత్రం ఊహించని ఈ పరిణామానికి డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి నిశ్చేష్టులయ్యారు. అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద ఉన్న లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె కార్యాలయంలోనూ, నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కీలకమైన డాక్యుమెంట్లు, రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ వైద్యాధికారి హోదాలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సిన అధికారి, ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులను వేధించి రూ. 1 లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడటం వైద్యశాఖలో తీవ్ర కలకలం రేపింది. ఏసీబీ అధికారులు ఆమెపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుపరిచారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీని సంప్రదించాలని అధికారులు ఈ సందర్భంగా మరోసారి విజ్ఞప్తి చేశారు.        [ Ranga reddy dmho, acb raid, swarna kumari bribe, acb officers caught, telangana news, corruption in health department, CM Revanth reddy,Hyderabad police, health minister Damodar Raja Narasimha,  Telugu One, Telugu News ]    
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది. రాబోయే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పార్టీ పెద్దలు పూర్తిగా కొత్తవారికే పెద్దపీట వేశారు. పదవీకాలం ముగిసిన సిట్టింగ్ సభ్యులను, చివరకు కేంద్ర మంత్రులను కూడా పక్కనపెట్టడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.యూపీ నుంచి ఖాళీ కానున్న మొత్తం పది రాజ్యసభ స్థానాలకు అక్టోబర్ 16న ఎన్నికల పోలింగ్ జరగనుంది. అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్రకారం బీజేపీ సులభంగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ కేంద్ర నాయకత్వం సోమవారం తమ ఎనిమిది మంది అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా వెల్లడించింది. ఈ సరికొత్త జాబితాలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, బీఎల్ వర్మలకు చోటు దక్కకపోవడం గమనార్హం. గతంలో ప్రాతినిధ్యం వహించిన ఏ ఒక్క సిట్టింగ్ ఎంపీకి కూడా ఈసారి అధిష్ఠానం పునరావకాశం కల్పించలేదు. వీరి స్థానంలో పూర్తిగా క్షేత్రస్థాయి నుంచి పనిచేస్తున్న కొత్త ముఖాలను బరిలోకి దింపడం ద్వారా పార్టీ హైకమాండ్ బలమైన సంకేతాలు పంపింది.ఈ ఎంపిక వెనుక రాబోయే 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. భవిష్యత్ ఎన్నికల వ్యూహంలో భాగంగా పార్టీ సామాజిక సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఈ జాబితాలో ముగ్గురు ఓబీసీ వర్గాలకు, ఇద్దరు ఎస్సీ వర్గాలకు, మరో ముగ్గురు అగ్రవర్ణాలకు చెందిన నాయకులకు స్థానం కల్పించారు. సామాజిక సమతుల్యతతో పాటు మహిళా ప్రాతినిధ్యానికి కూడా ఈ జాబితాలో సముచిత స్థానం దక్కింది. బారాబంకి మాజీ ఎంపీ ప్రియాంక సింగ్ రావత్ తో పాటు, ప్రముఖ నేత శ్రుతి గంగ్వార్‌లను మహిళా కోటాలో బరిలోకి దించారు. అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించిన రాధాకాంత్ ఓఝా, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్ వంటివారికి అవకాశం లభించింది.పార్టీలో దశాబ్దాలుగా సేవనందిస్తున్న కింది స్థాయి నాయకులను, సంస్థాగతంగా చురుగ్గా ఉన్నవారినే ఈ పదవులకు ఎంపిక చేశారు. పెద్ద నాయకులను కాదని కొత్తవారితో ప్రయోగాలు చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహాత్మక నిర్ణయం రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ లకు సీట్లు నిరాకరించడం ద్వారా పార్టీలో ఎలాంటి అసంతృప్తి రాకుండా, అందరినీ కలుపుకుని పోయేలా నాయకత్వం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.           [ Rajya Sabha Elections 2026, BJP UP candidates list,  Hardeep Singh Puri BL Verma, Uttar Pradesh politics, BJP social engineering UP,  Hardeep Singh Puri, BL Verma, UP Assembly Elections 2027, PM MODI, UP CM Yogi ]  
ALSO ON TELUGUONE N E W S
తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలను ప్రాంతాల వారీగా విభజించడం సరికాదని సీనియర్ నటుడు నరేశ్ అన్నారు. తెలంగాణ సినిమా, రాయలసీమ సినిమా, ఉత్తరాంధ్ర సినిమా అంటూ చిత్రాలకు ప్రాంతీయ ముద్ర వేయడం ఇటీవల ఒక ఫ్యాషన్‌గా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ‘గరివిడి లక్ష్మి’ బయోపిక్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న నరేశ్.. తెలుగు సినిమా గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. పాటలకు, సంగీతానికి ఎలాంటి సరిహద్దులు ఉండవో సినిమాకు కూడా ప్రాంతీయ భేదాలు ఉండకూడదని నరేశ్ అన్నారు. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కొరియన్, మలయాళం, తమిళ సినిమాలను ఆదరిస్తున్నారని, అలాంటప్పుడు మన సినిమాలను మాత్రం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అంటూ ఎందుకు విడదీయాలని ప్రశ్నించారు. తమిళంలో వచ్చిన ‘మణ్ వాసనై’ సినిమాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ.. మట్టి వాసనకు ప్రాంతంతో సంబంధం ఉండదని, అది అందరినీ కలుపుతుందని చెప్పారు. అదే విధంగా మంచి కథ, భావోద్వేగాలు ఉన్న తెలుగు సినిమా కూడా ప్రతి ప్రేక్షకుడినీ చేరుకుంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌పై నరేశ్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. వినోదం, భావోద్వేగాలు కలగలిసిన ఈ చిత్రం ‘మహానటి’ తరహాలో మెప్పిస్తుందని అన్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు జాతీయ అవార్డులు కూడా వచ్చే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. మొత్తంగా చూస్తే.. ప్రాంతాలు, యాసలు, నేపథ్యాల ఆధారంగా సినిమాలకు ప్రత్యేక గుర్తింపులు ఇవ్వడం కంటే కథ, కంటెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే నరేశ్ వ్యాఖ్యల సారాంశంగా కనిపిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కటేనని, మంచి కంటెంట్‌ను ప్రేక్షకులు ఎక్కడి నుంచి వచ్చినా ఆదరిస్తారన్న అభిప్రాయాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు.   [Naresh, VK Naresh, Telugu Cinema, Telugu Film Industry, Regional Cinema, Telangana Cinema, Andhra Cinema, Garividi Lakshmi, Garividi Lakshmi Biopic, People Media Factory, Tollywood News]
  స్టార్ హీరోల కట్ అవుట్ కి  ధీటుగా రెండు దశాబ్దాల పై నుంచి స్టార్ డమ్ తో దూసుకుపోతన్న భామ నయనతార.చెక్కుచెదరని గ్లామర్, ఫిట్‌నెస్‌తో మిలియన్ల కొద్దీ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. రీసెంట్ గా మాల్దీవుల వెకేషన్‌లో సముద్ర తీరాన దిగిన కొన్ని గ్లామరస్ చిత్రాలని  నయనతార తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు.   వైట్ క్రాప్‌డ్ టాప్, షీర్ ర్యాప్ స్కర్ట్‌తో కూడిన ఈ టూ పీస్ అవుట్‌ఫిట్ ఫొటోలు సోషల్ మీడియాను ఒక్కసారిగా ఊపేసాయి. సముద్రం, ఆకాశం అందమైన బ్యాక్‌డ్రాప్‌గా ఉండగా, 'Orange Flavored Cigarettes'అనే పాటకు ట్యూన్ చేస్తూ ఆమె ఈ పిక్స్‌ని  పోస్ట్ చేశారు. అయితే, ఈ ఫొటోలకు నయన్ ఉపయోగించిన ఆర్టిస్టిక్ సాఫ్ట్ ఫోకస్, మోషన్ బ్లర్ ఎఫెక్ట్ నెటిజన్ల మధ్య ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. ఈ చిత్రాల్లో డబుల్ ఎక్స్‌పోజర్ మరియు మూవ్‌మెంట్ షాడోస్ కారణంగా ఫొటోస్ కొద్దిగా బ్లర్‌గా కనిపించాయి. దీంతో అభిమానులకు నయన్ అందాలను స్పష్టంగా చూడలేకపోయామనే చిన్న నిరాశ ఎదురైంది. ఇది కూడా చదవండి: రష్మిక నటిస్తుందా!.. వైరల్ మారిన న్యూస్       కానీ ఈ డిజిటల్ యుగంలో నెటిజన్లు ఊరికే ఉంటారా? నయనతార అందాన్ని స్పష్టంగా చూడాలనే కుతూహలంతో వినూత్నంగా ఆలోచించారు. వెంటనే అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎడిటింగ్ టూల్స్, డినోయిజింగ్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించారు. ఆ ఫొటోలలో ఉన్న మోషన్ బ్లర్‌ను తొలగించి, హెచ్‌డీ (HD) క్వాలిటీతో క్లియర్ వెర్షన్లను తయారు చేశారు. ఆపై ఆ క్లియర్ ఎడిటెడ్ పిక్స్‌ను ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయడం ప్రారంభించారు.     [Nayanthara Blurry Beach Photos Viral, Nayanthara, Nayanthara Beach Photos, Nayanthara Viral Pics, Nayanthara AI Edits, Nayanthara Blurry Photos., TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]
తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మధుమిత మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమెపై 89 ఏళ్ల వృద్ధుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తన మెడలో ఉన్న ఐదు సవర్ల బంగారు గొలుసు కనిపించకుండా పోవడానికి మధుమిత కారణమని, ఈ విషయంపై ఆమెను ప్రశ్నించినప్పుడు తనను బెదిరించారని వృద్ధుడు ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటన 2022లో జరిగినట్లు తెలుస్తుండగా.. తాజాగా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.  వివరాల్లోకి వెళ్తే.. తిరునెల్వేలి జిల్లా కేటీసీ నగర్‌కు చెందిన పేచ్చిముత్తు అనే 89 ఏళ్ల వ్యక్తి భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఫిజియోథెరపీ కోసం వెళ్లే సమయంలో మధుమితతో తనకు పరిచయం ఏర్పడిందని ఆయన తెలిపారు. 2022లో ఒకరోజు మధుమిత తనను కలవాలని కోరడంతో కోర్టు సమీపంలోని బస్టాప్‌కు కారులో వెళ్లినట్లు చెప్పారు. అనంతరం ఆమె తన వాహనంలో ఎక్కిందని, కొంతసేపటి తర్వాత ఆమెను బస్టాప్‌లో దించి ఇంటికి వెళ్లానని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత తన మెడలోని ఐదు సవర్ల బంగారు గొలుసు కనిపించలేదని గుర్తించినట్లు తెలిపారు.  గొలుసు కనిపించకపోవడంతో మధుమితకు ఫోన్ చేసి అడిగానని పేచ్చిముత్తు చెప్పారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన పరువు తీస్తానని ఆమె బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. అప్పట్లో భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ఇప్పుడు కేసు పెట్టినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రాజాక్కమంగళం పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఘటన జరిగిన ప్రాంతం తిరునెల్వేలి పోలీసుల పరిధిలో ఉండటంతో తదుపరి దర్యాప్తు కోసం కేసును అక్కడికి బదిలీ చేసే ప్రక్రియ చేపట్టారు.  ఇదిలా ఉంటే.. మధుమిత గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నగదు, బంగారు ఆభరణాలకు సంబంధించిన వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే ఆమె ఇంట్లో భారీగా బంగారం చోరీకి గురైన ఘటన కూడా సంచలనం సృష్టించింది. ఆ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి, 98 సవర్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆదాయపు పన్ను శాఖ కూడా ఆమె ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య 2022లో జరిగినట్లు చెబుతున్న మరో ఘటనకు సంబంధించి కేసు నమోదు కావడంతో మధుమిత పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది.  అయితే ఈ కేసులో మధుమితపై వచ్చిన ఆరోపణలు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలు నిజమా కాదా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. కేసు నమోదు కావడం మాత్రమే నేరం రుజువైనట్లు కాదన్న విషయం కూడా గమనించాల్సి ఉంది.     [Madhumitha YouTuber, YouTuber Madhumitha Case, Madhumitha Police Case, Madhumitha Gold Chain Case, Madhumitha Latest News, Tamil Nadu YouTuber, Madhumitha FIR, 89 Year Old Complaint, Gold Chain Theft Case, Madhumitha News, Tirunelveli Police Case]
తెలుగు సినీ ప్రేక్షకులకు రమాప్రభ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్దాల పాటు వందలాది సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు తన జీవితంలోని అనుభవాలను పుస్తక రూపంలో ప్రేక్షకులు, అభిమానులతో పంచుకోబోతున్నారు. రమాప్రభ జీవిత కథ ‘రమాప్రభ.. ఇదేనండి నా కథ’ పేరుతో పుస్తకంగా వెలువడింది. ఆమె 81వ పుట్టినరోజు సందర్భంగా ఈ పుస్తకాన్ని మదనపల్లెలో ఆవిష్కరించారు.  అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని బసినకొండ పంచాయతీ గంగన్నగారిపల్లెలో ఉన్న రమాప్రభ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక ప్రముఖులు, అభిమానులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రమాప్రభ మదనపల్లెలో ప్రశాంతమైన, ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె సినీ జీవితంలోని అనుభవాలు, వ్యక్తిగత జీవితంలోని తీపి, చేదు జ్ఞాపకాలు ఇప్పుడు పుస్తకంగా రావడం ఆసక్తికరంగా మారింది.  ఈ పుస్తకాన్ని స్థానిక డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు జింకల మోహనవల్లి రచించారు. ఇందుకోసం దాదాపు ఏడాది పాటు రమాప్రభను ఒప్పించి, ఆమె జీవితానికి సంబంధించిన విషయాలను తెలుసుకుని పుస్తకంగా మలిచినట్లు రచయిత్రి తెలిపారు. సాధారణంగా చాలామంది తమ ఆత్మకథలను తామే రాసుకుంటారని.. కానీ తన జీవిత కథను మరొకరు రాయడం తనకు ఆనందంగా ఉందని రమాప్రభ ఈ సందర్భంగా చెప్పడం విశేషం. తన పుట్టినరోజునే ఈ పుస్తకం ఆవిష్కరించడం మరింత సంతోషంగా ఉందని మోహనవల్లి అన్నారు.  ఇక రమాప్రభ సినీ ప్రయాణం విషయానికి వస్తే.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 1400కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ఎన్నో తరాల అగ్ర నటీనటులతో కలిసి పనిచేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య పాత్రల్లో, భావోద్వేగభరితమైన పాత్రల్లో తనదైన ముద్ర వేశారు. సినిమాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఆమె వ్యక్తిగత జీవితంలోనూ అనేక అనుభవాలను ఎదుర్కొన్నారు. ఆ ప్రయాణంలోని ముఖ్యమైన సంఘటనలు, మధుర జ్ఞాపకాలు, చేదు అనుభవాలు ‘ఇదేనండి నా కథ’లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.  వెండితెరపై ఒకప్పుడు బిజీగా గడిపిన రమాప్రభ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె జీవిత ప్రయాణాన్ని ఒకే పుస్తకంలో చదివే అవకాశం రావడం అభిమానులకు ప్రత్యేకమే. ఒక నటిగా ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, సినీ రంగంలోని అనుభవాలు, వ్యక్తిగత జీవితంలోని మలుపులు ఈ పుస్తకం ద్వారా మరింత దగ్గరగా తెలుసుకునే అవకాశం లభించనుంది.     Rama Prabha, Rama Prabha Biography, Rama Prabha Autobiography, Idenandi Na Katha, Rama Prabha Life Story, Rama Prabha 81st Birthday, Telugu Actress Rama Prabha, Rama Prabha Movies, Tollywood Veteran Actress, Rama Prabha Book, Telugu Cinema History
కన్నడ స్టార్ ధృవ సర్జా తన తదుపరి సినిమాలో సరికొత్త అవతార్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు యాక్షన్ ఇమేజ్‌తో ఎక్కువగా కనిపించిన ధృవ.. ఈసారి మాత్రం ప్రేమకథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు ‘కెమిస్ట్రీ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విశాల్ అత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధృవ సర్జాకు జోడీగా నభా నటేష్ నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఓ స్పెషల్ వీడియో ద్వారా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ‘కొంచెం చార్మ్.. కొంచెం మ్యాజిక్.. చాలా చాలా కెమిస్ట్రీ’ అంటూ ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు. టైటిల్‌కు తగ్గట్టుగానే విడుదల చేసిన పోస్టర్స్ కూడా సినిమాపై ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వర్షంలో, రెయిన్‌బో గొడుగు కింద ధృవ సర్జా, నభా నటేష్ కనిపిస్తున్న తీరు చూస్తుంటే.. ఇది మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఉండబోతుందనే ఫీలింగ్ వస్తోంది. ముఖ్యంగా ధృవ సర్జాను ఇప్పటివరకు మాస్ యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా చూసిన ఆడియన్స్‌కు ఈ లవర్ బాయ్ లుక్ కొత్తగా అనిపిస్తోంది. యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న ధృవ.. ఇప్పుడు రొమాంటిక్ కథలో ఎలా కనిపిస్తారనే ఆసక్తి మొదలైంది. ఇక నభా నటేష్‌కు కూడా ఈ సినిమా మంచి ఛాన్స్‌గా మారే అవకాశం ఉంది. కన్నడ సినిమాలతో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆమె.. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ధృవ సర్జాతో కలిసి ‘కెమిస్ట్రీ’లో కనిపించనున్నారు. ఇది కూడా చదవండి: ‘ఊసరవెల్లి’కి 15 ఏళ్లు.. నెగెటివ్ టాక్‌తో ఆల్ టైం రికార్డ్.. ఎన్టీఆర్ బాక్సాఫీస్ పవర్.! https://x.com/peoplemediafcy/status/2107351626474483732       [Chemistry Announcement Video, Chemistry Movie, Dhruva Sarja, Nabha Natesh, Vishal Atreya, TG Vishwa Prasad, People Media Factory, Telugu Film News]  
  పాన్ ఇండియా నటీమణి హోదాలో దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం  విజయ్ దేవరకొండ తో చేస్తున్న'రణబాలి' ముస్తాబులో బిజీగా ఉంది.  ఈ నెల 16 న రిలీజ్ కానుండగా ప్రచార కార్యక్రమాలు కూడా ఒక పక్కన జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా రష్మిక ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నేను అందరితో సరదాగా ఉంటానని కొంత మంది ట్రోల్స్ చేస్తుంటారు. నా ఉద్దేశ్యంలో అందరితో మంచిగా ఉండటం బలహీనత కాదు. నేను ఉన్న చోట పాజిటివ్ రావాలని అలా ఉంటాను. అందుకు నాకు ఏ పేరు పెట్టినా పర్వాలేదు. అందరకి నేను నచ్చాలని లేదు. ఇది కూడా చదవండి: విశ్వంభర రిలీజ్ డేట్ వచ్చేసింది: ఆ డేట్ కావడంతో ఫ్యాన్స్ లో పూనకాలు      నాకు ఇలా ఉండటమే ఇష్టం. నేను నాలా ఉండటానికి నటించాల్సిన అవసరం లేదు.ఎవరి కోసమో నేను మారలేను.అలాగే  రాహుల్ సంక్రుత్యుయన్ దర్శకత్వంలో చేయాలనీ ఎప్పట్నుంచో అనుకున్నాను. విజయ్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకొని చాలా రోజులయ్యింది. అందుకే రణబాలి ఒప్పుకున్నానని   రష్మిక  చెప్పుకొచ్చింది.   [Rashmika latest Speech, Rashmika Reveals the basic reason for accepting ranabaali, Rashmika Mandanna, Ranabaali Movie, Vijay Deverakonda, Rahul Sankrityan,TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]  
హ్యాపీ ఆక్స్ ఎంటర్టైన్మెంట్, ఎంఎస్ వారాహి క్రియేషన్స్, శతమానంభవతి ఆర్ట్స్ బ్యానర్ల మీద సాదత్, ముని శివ నిర్మించిన చిత్రం ‘సరిపోయారు ఇద్దరూ’. ‘శతమానంభవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఈ మూవీలో మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న, రాజేంద ప్రసాద్, సీనియర్ నటుడు నరేష్, రిధ్ది కుమార్, మేఘా చౌదరి కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీ టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. హిట్ మెషీన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసి టీం కు అభినందనలు తెలిపారు. టీజర్‌లో పల్లెటూరి వాతావరణం, వైజాగ్ సిటీని అందంగా చూపించారు. టీజర్ ప్రారంభంలో స్నేహితులుగా కలిసి ఉన్న నరేష్, రాజేంద్ర ప్రసాద్.. టీజర్ ఎండింగ్‌కి అలా ఎందుకు మారారు? అన్నదే కథ అన్నట్టు కట్ చేశారు. ఇక యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా సినిమాని సతీష్ వేగేశ్న తెరకెక్కించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కథ, ఎమోషన్స్, హాస్యం, ప్రేమ అన్ని రకాల అంశాలున్నాయని టీజర్‌ను గమనిస్తేనే తెలుస్తోంది. టీజర్‌లో మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న స్క్రీన్ ప్రజెన్స్ బాగున్నాయి. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్.. వైజాగ్ ఎపిసోడ్స్ సినిమాకి కీలకంగా ఉండబోతోన్నాయి. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. సమీర్ రెడ్డి సినిటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘ఊసరవెల్లి’కి 15 ఏళ్లు.. నెగెటివ్ టాక్‌తో ఆల్ టైం రికార్డ్.. ఎన్టీఆర్ బాక్సాఫీస్ పవర్.!       [Saripoyaru Iddaroo Teaser Launch, Saripoyaru Iddaroo Movie, Director Anil Ravipudi, Director Vegesna Satish, Telugu Movies 2026, Telugu Film News]  
జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ఊసరవెల్లి’ సినిమా విడుదలై నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2011 అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, విద్యుత్ జమ్వాల్, శ్యామ్, జయప్రకాశ్ రెడ్డి, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆ టైంలో ‘ఊసరవెల్లి’పై భారీ అంచనాలే ఉన్నాయి. అప్పటికే ‘కిక్’ లాంటి స్టైలిష్ ఎంటర్టైనర్ చేసిన సురేందర్ రెడ్డి.. ఎన్టీఆర్‌తో ఎలాంటి సినిమా తీస్తారనే ఆసక్తి ఉంది. పైగా ఎన్టీఆర్‌కు జోడీగా తమన్నా తొలిసారి కనిపించడం కూడా ఈ సినిమాపై హైప్ పెంచింది. కథ పరంగా కూడా ‘ఊసరవెల్లి’ కాస్త డిఫరెంట్ ప్రయత్నమే. డబ్బు కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడే టోనీ అనే వ్యక్తి చుట్టూ కథ తిరుగుతుంది. కశ్మీర్‌లో నిహారికను కలిసిన టోనీ.. ఆ తర్వాత ఆమె జీవితంలోకి ఎలా వస్తాడు? ఆమె గతం ఏంటి? అసలు టోనీ లక్ష్యం ఏంటి? అనే అంశాలతో సినిమా సాగుతుంది.  ‘ఊసరవెల్లి’ ఏకంగా 1800 థియేటర్లలో విడుదలై, అప్పట్లో రికార్డ్ సృష్టించింది. విడుదలైన తర్వాత ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రాలేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్, స్క్రీన్‌ప్లేపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ భారీ ఓపెనింగ్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ట్రేడ్ వర్గాలు సైతం ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినా చూసి ఆశ్చర్యపోయాయి. సినిమా విడుదలైన రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.15.75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ సమయంలో ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ రికార్డ్‌. మొదటి రోజు వసూళ్లలో అమెరికా నుంచి కూడా దాదాపు రూ.1.98 కోట్లు రావడం అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నైజాంలో రూ.3.73 కోట్లు, రాయలసీమలో రూ.2.92 కోట్లు రావడం కూడా రికార్డ్ స్థాయిలోనే నమోదైంది. ఇక మొదటి వారం పూర్తయ్యే సరికి ‘ఊసరవెల్లి’ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.56.46 కోట్ల గ్రాస్, రూ.39.23 కోట్ల షేర్ సాధించినట్లు అప్పటి ట్రేడ్ లెక్కలు వెల్లడించాయి. 2011లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ తెలుగు సినిమాల్లో ఒకటిగా ‘ఊసరవెల్లి’ నిలిచింది.  టాక్ ఎలా ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఏంటో చూపించిన సినిమాల్లో ‘ఊసరవెల్లి’ ఒకటి. అందుకే 15 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా పేరు వినిపిస్తే.. ముందుగా గుర్తొచ్చేది టోనీ పాత్ర కంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఆ భారీ ఓపెనింగ్ రికార్డే. ఇది కూడా చదవండి: సరిపోయారు ఇద్దరూ.. సైలెంట్‌గా పేరు మార్చుకొని వస్తున్న స్టార్ డైరెక్టర్.! https://x.com/SVCCofficial/status/2107297292822696005       [15 Years Of Oosaravelli, 15 Years For Oosaravelli, Jr NTR Oosaravelli Movie, Oosaravelli Movie 15 Yeras, Jr NTR, Tamannaah Bhatia, Surender Reddy, Telugu Film News]  
  ఫ్యాన్స్, ప్రేక్షకులతో పాటు టోటల్ టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నచిత్రం విశ్వంభర.. మరోసారి మెగాస్టార్ వన్ మాన్ షో సునామి పక్కా అనే నమ్మకం కూడా ఆ అందరిలో ఉంది. కానీ 'వై ది రిలీజ్ డేట్' అనే పరిస్థితి. ఇక ఆ డైలాగ్ కి గుడ్ బై.. నూటికి నూరు శాతం రిలీజ్ డేట్ ఇదే అంటుంది సినీ సర్కిల్ తాజా న్యూస్.   వచ్చే మహాశివరాత్రి రోజు థియేటర్స్ లో విశ్వంభర రిలీజ్ పక్కా అంటున్నారు. ఫాంటసీ మరియు డివైన్ ఎలిమెంట్స్ ఉన్న కధాంశం కావడంతో విశ్వంభర మహాశివరాత్రి కి రావడం కరెక్ట్ అని, అందుకే ఒక నో డేట్ ఎక్స్ చేంజ్ అంటున్నారు. త్వరలోనే  మేకర్స్ నుంచి అధికార ప్రకటన కూడా రానుందని టాక్. మరి ఫ్యాన్స్ శివరాత్రి వచ్చిన దాకా విశ్వంభర టీజర్, సాంగ్ ని చూసుకుంటూ ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.  బింబి సారా ఫేమ్ వశిష్ట దర్శకతంలో చిరు కెరీర్ లో  యువి క్రియేషన్స్ భారీ వ్యయంతో నిర్మించింది. ఇది కూడా చదవండి: భారత్‌లో ప్రశాంతత లేదు వ్యాఖ్యలపై సంజయ్ దత్ క్లారిటీ: ఈ సారి ఏం చెప్పాడంటే!     గ్రాఫిక్స్ పనులు లేటు కావడం వల్లనే ఇన్ని రోజులు లేట్.త్రిష హీరోయిన్ [   vishwambhara Release Date locked, Vishwambhara Release Date, Chiranjeevi About Vishwambhara Movie, Mallidi Vassishta, UV Creations, TeluguCinema News, Tollywood Cinema News, Tollywood, TeluguCinema]  
Nandamuri Balakrishna has resumed shooting for his upcoming action entertainer Dada in Mysore after recovering from a recent injury. The actor has joined the latest schedule, which is expected to be an extensive one and will primarily focus on key talkie portions of the film. Several prominent members of the cast are participating in the ongoing schedule alongside Balakrishna. The team is looking to complete crucial sequences that form an important part of the film during this phase of the shoot. Dada marks the reunion of Balakrishna and director Gopichand Malineni after their successful collaboration Veera Simha Reddy. The director is presenting Balakrishna in a rugged and powerful avatar, with the actor’s look from the film already generating attention. Manoj Manchu and Kajal Aggarwal are playing prominent roles in the movie. Produced by Venkata Satish Kilaru, Dada has music by S Thaman. The film is currently progressing with its production and is scheduled to hit worldwide screens on December 24, making it one of the major releases of the Christmas season. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మన దైనందిన జీవితంలో ఆహారం అత్యంత ప్రాథమికమైన అవసరం. కానీ నేటి ఆధునిక జీవన శైలిలో తెల్ల బియ్యం వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చూడటానికి ఎంతో తెల్లగా, ఆకర్షణీయంగా ఉండి, వండటానికి కూడా చాలా తేలికగా ఉండే ఈ తెల్ల బియ్యం, మన శరీరానికి తెలియకుండానే అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం, మధుమేహం (డయాబెటిస్), రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, ఫ్యాటీ లివర్ వంటి భయంకరమైన వ్యాధులకు తెల్ల బియ్యం అధిక వినియోగమే ప్రధాన కారణమవుతోంది. ఈ నేపథ్యంలో, మన ప్రాచీన సంప్రదాయ ఆహారమైన ఎర్ర బియ్యాన్ని (Red Rice) రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు. ఎర్ర బియ్యం అనేది ఎటువంటి పాలిష్ చేయని పూర్తి సహజమైన ధాన్యం. ప్రాసెస్ చేయకపోవడం వల్ల దీనిలోని పోషక విలువలు ఏమాత్రం నశించకుండా పూర్తి స్థాయిలో భద్రంగా ఉంటాయి. 100 గ్రాముల ఎర్ర బియ్యంలో ఉన్న పోషక విలువలను ఒక్కసారి పరిశీలిస్తే, అందులో శరీరానికి కావలసిన 356 కిలో కేలరీల శక్తి లభిస్తుంది. అలాగే దీనిలో 75.5 గ్రాముల పిండిపదార్థాలు, 9 గ్రాముల మాంసకృత్తులు (ప్రోటీన్), 3.3 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, మరియు 11 గ్రాముల పీచు పదార్థం (ఫైబర్) పుష్కలంగా లభిస్తాయి. సాధారణ తెల్ల బియ్యంతో పోలిస్తే ఎర్ర బియ్యంలో పీచు పదార్థం ఏకంగా 3 నుండి 4 రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. ఎర్ర బియ్యంలో ఉండే ఈ అత్యధిక ఫైబర్ పరిమాణం రక్తంలో గ్లూకోజ్ శోషణ వేగాన్ని గణనీయంగా నెమ్మదింపజేస్తుంది. దీని మూలంగా రక్తంలో ఒకేసారి చక్కెర స్థాయిలు పెరిగిపోకుండా అదుపులో ఉంటాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు లేదా చక్కెర వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలనుకునే వారు తమ ఆహారంలో తెల్ల బియ్యం మరియు సాధారణ ముడి బియ్యం స్థానంలో ఈ ఎర్ర బియ్యాన్ని ఎంచుకుంటే, గ్లూకోజ్ స్థాయిలను చాలా సులభంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీనివల్ల శరీరానికి నిరంతర శక్తి లభించడమే కాకుండా ఇన్సులిన్ స్థాయిలు కూడా క్రమబద్ధీకరించబడతాయి. కేవలం ఫైబర్ మాత్రమే కాకుండా, ఎర్ర బియ్యంలో ఫినాల్స్ మరియు యాంథోసైనిన్స్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. పరిశోధనల ప్రకారం ఇందులో దాదాపు 294 మిల్లీగ్రాముల ఫినాల్స్ మరియు యాంథోసైనిన్స్ లభిస్తాయి. ఈ విశిష్ట సమ్మేళనాలు మన జీర్ణవ్యవస్థలో కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నతను మందగించేలా చేసి, చక్కెర రక్తంలోకి వేగంగా కలవకుండా అడ్డుకుంటాయి. గుండె సంబంధిత లేదా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ గ్లూకోజ్ నియంత్రణ ప్రక్రియ ఎంతో మేలు చేస్తుంది. ఎర్ర బియ్యానికి ఆ ప్రత్యేకమైన ఎరుపు రంగు రావడానికి కారణం దానిలో ఉండే 'యాంథోసైనిన్' అనే బలమైన యాంటీఆక్సిడెంట్. ఈ యాంటీఆక్సిడెంట్ శరీరంలోని కణజాలాన్ని ఉచిత రాడికల్స్ నుండి కాపాడి, వ్యాధుల బారిన పడకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంతేకాకుండా, ఎర్ర బియ్యంలో ఉండే అధిక ఫైబర్ కారణంగా తక్కువ పరిమాణంలో అన్నం తిన్నా కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. ఇది అతిగా తినే అలవాటును నివారించి, బరువును అదుపులో ఉంచుతుంది. ప్రత్యేకించి పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును కరిగించడంలో, ఫ్యాటీ లివర్ వంటి తీవ్ర రుగ్మతలను తగ్గించడంలో ఎర్ర బియ్యం ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.     Red rice health benefits, Erra Biyyam benefits, red rice for weight loss, red rice for diabetes, nutrients in red rice, red rice vs white rice, healthy grains benefits, organic red rice benefits Telugu, health benefits of red rice.
మన సాంప్రదాయ వంటకాలలో రకరకాల పులుసులకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా కమ్మటి చేమదుంపల పులుసు సరిగ్గా పద్ధతి ప్రకారం చేస్తే వచ్చే ఆ రుచే వేరు. చేమదుంపలతో పులుసు తయారు చేసేటప్పుడు చాలామందికి జిగటగా రావడం లేదా దుంపలు సరిగ్గా ఉడకకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే సరైన కొలతలు మరియు సులువైన చిట్కాలు పాటిస్తే, ఇంటి నిండా గుమగుమలాడే వాసనలతో నాటి కాలపు రుచిని తలపించేలా నోరూరించే పులుసును సులభంగా తయారుచేసుకోవచ్చు. ఈ అద్భుతమైన వంటకాన్ని ఎంతో రుచికరంగా ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ సాంప్రదాయ పులుసు తయారీకి కావలసిన ప్రధాన పదార్థాల కొలతలను పరిశీలిస్తే: ముందుగా పావు కేజీ (250 గ్రాములు) చేమదుంపలను తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి ఉడికించుకున్న తర్వాత తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకోవాలి. పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ పరిమాణంలో ఉన్న చింతపండును నీళ్లలో నానబెట్టుకోవాలి. రుచితో పాటు సరైన ఘాటు కోసం 1.5 స్పూన్లు ఉప్పు, 1.5 స్పూన్లు కారం, 1/4 స్పూను పసుపు సిద్ధం చేసుకోవాలి. తాలింపు మరియు మసాలాల విషయానికి వస్తే 1 స్పూన్ పోపు గింజలు, 2 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల నూనె, 1/2 స్పూన్ జీలకర్ర-మెంతుల పొడి మరియు 1 స్పూన్ ధనియాల పొడి అవసరమవుతాయి. తయారీ విధానం విషయానికి వస్తే, ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాణలి లేదా పాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె కాగాక 1 స్పూన్ పోపు గింజలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ వెంటనే 2 రెమ్మల కరివేపాకు వేసి దోరగా వేయించాలి. పోపు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా కలపాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గి దోర రంగులోకి వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత, ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న 1/4 కేజీ చేమదుంపల ముక్కలను అందులో వేయాలి. ఆపై 1/4 స్పూను పసుపు, 1.5 స్పూన్ల ఉప్పు మరియు 1.5 స్పూన్ల కారం వేసి ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టేలా కలపాలి. ముక్కలకు ఉప్పు, కారం బాగా పట్టి, కొద్దిసేపు నూనెలో మగ్గనివ్వడం వల్ల చేమదుంపల లోపలి వరకు రుచి వెళ్తుంది. ఇలా ముక్కలు కాసేపు మగ్గాక, ముందుగా నీళ్లలో నానబెట్టుకుని తీసిన చింతపండు రసాన్ని (పులుసు) ఇందులో పోయాలి. పులుసు బాగా మరిగి మసలే వరకు మీడియం మంట మీద ఉంచాలి. పులుసు మరుగుతున్న సమయంలో 1/2 స్పూన్ జీలకర్ర-మెంతుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మెంతుల పొడి వేయడం వల్ల పులుసుకు అద్భుతమైన సువాసనతో పాటు ప్రత్యేకమైన రుచి వస్తుంది. మీకు కావాల్సిన చిక్కదనం వచ్చే వరకు బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. కొందరు చేమదుంపలను పచ్చిగానే తొక్క తీసి ముక్కలుగా కోసి పులుసు పెడుతుంటారు. కానీ, ముందుగా ఉడికించి తొక్క తీసిన తర్వాత పులుసు చేయడం వల్ల జిగట రాకుండా, ముక్క మెత్తగా ఉడికి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి లేదా వేడి చపాతీల్లోకి ఈ కమ్మటి చేమదుంపల పులుసును వడ్డిస్తే ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.     Chamadumpala Pulusu recipe, Taro Root Curry Telugu, Andhra style Chamadumpala Pulusu, Chamagadda Pulusu recipe, Arbi Gravy Telugu, traditional Andhra pulusu recipes, Chamadumpala curry step by step, tasty chamagadda curry.
మన శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి ప్రొటీన్లు, ఫైబర్ ఎంత అవసరమో, స్వచ్ఛమైన నీరు కూడా అంతే అత్యంత ముఖ్యం. సాధారణంగా ప్రతీ మనిషి రోజుకు 2.7 లీటర్ల నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే చాలామంది దాహం వేయనప్పుడు నీరు తాగడం మర్చిపోవడం లేదా తక్కువగా తాగడం వల్ల తెలియకుండానే తీవ్రమైన డిహైడ్రేషన్ బారిన పడుతుంటారు. మనం తీసుకునే నీటి పరిమాణం తగ్గినప్పుడు శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఢిల్లీలోని ధర్మశిల నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్, ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ కుమార్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, డిహైడ్రేషన్ ఏర్పడినప్పుడు మన శరీరంలో రక్తం పరిమాణం గణనీయంగా తగ్గిపోతుంది. రక్తంలో నీటి శాతం తగ్గి పరిమాణం పడిపోవడం వల్ల, శరీరంలోని ప్రధాన అవయవాలకు మరియు కణజాలాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలను నిరంతరం అందజేయడానికి గుండె సాధారణం కంటే చాలా వేగంగా మరియు కష్టపడి రక్తాన్ని పంప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల గుండె స్పందనలు అకస్మాత్తుగా పెరిగి, గుండె దడ వంటి లక్షణాలు తీవ్రమవుతాయి. తీవ్రమైన ఎండలో ఎక్కువ సమయం ఉండటం, వేడి వాతావరణంలో వ్యాయామం చేయడం వల్ల చెమట రూపంలో నీరు అధికంగా బయటకు పోతుంది. అలాగే జ్వరం, వాంతులు లేదా విరేచనాలు అయినప్పుడు శరీరంలో ద్రవాలు వేగంగా తగ్గిపోయి గుండెపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా వృద్ధులు, కొన్ని రకాల వైద్య మందులు వాడుతున్నవారు డిహైడ్రేషన్ ప్రమాదానికి అత్యంత వేగంగా గురవుతారు. శరీరంలో నీటి శాతం తగ్గిందని గుర్తించడానికి అసాధారణంగా తీవ్రమైన దాహం వేయడం, నోరు ఆరిపోవడం, మూత్రం ముదురు పసుపు రంగులోకి మారడం లేదా మూత్ర విసర్జన బాగా తగ్గిపోవడం ముఖ్య సంకేతాలుగా చెప్పవచ్చు. వీటితో పాటు తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, బలహీనత, నిలబడినప్పుడు తల తిరగడం, గుండె లయ తప్పి వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకవేళ డిహైడ్రేషన్ వల్ల గుండె వేగం పెరిగితే, వెంటనే చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటూ కొద్దికొద్దిగా నీరు తాగడం ప్రారంభించాలి. చెమట లేదా విరేచనాల వల్ల ఎలక్ట్రోలైట్లు కోల్పోతే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) లేదా కొబ్బరిబోండాం నీరు తీసుకోవడం ద్వారా కోల్పోయిన శక్తిని త్వరితగతిన తిరిగి పొందవచ్చు. రోజువారీ జీవితంలో తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.     Dehydration and heart rate, fast heartbeat dehydration, dehydration heart palpitations, symptoms of dehydration, high heart rate causes, dehydration effect on blood pressure, dehydration symptoms Telugu health, rapid pulse rate fluid loss.
ఉదయాన్నే  పరగడుపున టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. రోజును చురుగ్గా ప్రారంభించడానికి కాఫీ, టీ లు తాగుతూ ఉంటారు.  అయినప్పటికీ ఇవి శరీరంలో  అసిడిటీ, హార్మోన్ల అసమతుల్యత , ఇతర జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. వీటి స్థానంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుతూనే శరీరంలో ఉన్న అనారోగ్యాలను, జబ్బులను, ఇబ్బందులను తగ్గించగల పానీయం తాగడం చాలా మంచిది.  ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోవడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంతకీ అంత శక్తివంతమైన ఆ పానీయం ఏమిటో? దాన్ని ఎలా తయారుచేసుకుని తాగాలో.. వివరంగా తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. ధనియాలు,  జీలకర్ర,  సోంపు ,  వాము  పైన పేర్కొన్న దినుసులలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ​తయారీ విధానం... ఈ పానీయాన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని మరిగించాలి. అందులో అర టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు , పావు టీస్పూన్ వాము వేయాలి. ఈ మిశ్రమాన్ని నీరు సగం అయ్యేంత వరకు చిన్న మంటపై బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం లేదా అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం కాస్త నిమ్మరసం లేదా తేనె కూడా కలపవచ్చు. ఈ పానీయం తాగడం వల్ల శరీరానికి కలిగే  ఉపయోగాలు.. ​హార్మోన్ల సమతుల్యత.. మహిళల్లో ఎదురయ్యే థైరాయిడ్, పిసిఓడి , పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం  వంటి సమస్యలకు ఈ పానీయం చాలా మేలు చేస్తుంది. ధనియాలు , సోంపు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి. ​జీర్ణవ్యవస్థ మెరుగుదల.. జీలకర్ర , వాము జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ​రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ పానీయం సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయం.. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో జీలకర్ర , వాము కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ఈ పానీయం తాగడం ద్వారా శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ​చర్మ సౌందర్యం , డిటాక్సిఫికేషన్.. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఫలితంగా చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం సహజంగా మెరుస్తుంది. ​కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఈ పదార్థాల్లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు , వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ​ఈ డిటాక్స్ డ్రింక్‌ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున క్రమం తప్పకుండా తాగడం ద్వారా శరీరంలో సహజమైన మార్పులను గమనించవచ్చు. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా ఈ నేచురల్  పానీయాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా శరీరంలో చాలా మార్పులు గమనించవచ్చు.                       *రూపశ్రీ.
గొంతుకు, గడ్డానికి మధ్య భాగంలో , గడ్డానికి కింద చర్మం, కండర కణజాలం పెరిగి.. గొంతు, గడ్డం ఏకం అయినట్టు చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని డబుల్ చిన్ అని అంటారు. లావు పెరగడం వల్ల డబుల్ చిన్ వచ్చిందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే లావు ఎక్కువగా లేకపోయినా కొందరిలో డబుల్ చిన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే   డబుల్ చిన్ కు,  థైరాయిడ్ సమస్యలకు మధ్య ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయని  వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. డబుల్ చిన్ ఎందుకు, ఎలా వస్తుంది? థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేనప్పుడు శరీర జీవక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో బరువు వేగంగా పెరగడం, శరీరంలో నీరు చేరడం లేదా వాపులు రావడం సాధారణం. దీని ప్రభావం ముఖం , మెడ భాగాలపై స్పష్టంగా కనిపిస్తుంది. మెడ కింద కొవ్వు చేరడం లేదా ముఖం ఉబ్బినట్లు అవ్వడం వల్ల డబుల్ చిన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ సమస్య వల్ల మెడ ముందు భాగంలో ఉన్న గ్రంథి వాచి గాయిటర్ గా మారినప్పుడు కూడా గడ్డం కింద వాపు వచ్చి డబుల్ చిన్ లాగా కనిపించే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు డబుల్ చిన్ తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు , జీవనశైలి మార్పులు పాటించాలి..  థైరాయిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం.. థైరాయిడ్  లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల సలహా మేరకు సరైన మోతాదులో థైరాయిడ్ మందులు క్రమం తప్పకుండా వాడాలి. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు జీవక్రియ వేగవంతమై, అదనపు బరువు , వాపు తగ్గుతాయి.  పోషకాహార నియమం..  ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, మైదా , వేపుళ్లను పూర్తిగా తగ్గించాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు , తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరంలో సోడియం నిల్వలు ఎక్కువైతే నీరు చేరే అవకాశం ఉంది కాబట్టి ఉప్పు చాలా పరిమితంగా తినాలి. నీరు..  ప్రతిరోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. నీరు బాగా తాగితే ముఖం , మెడ భాగంలో నీరు చేరడం తగ్గి వాపు తగ్గుతుంది.  వ్యాయామం.. కేవలం మెడ భాగంలోనే కాకుండా శరీరం మొత్తానికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి. రోజూ క్రమం తప్పకుండా నడక, యోగా లేదా కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరిగి బరువు తగ్గుతారు. దీనితో పాటు మెడ , గడ్డం కండరాలను బలోపేతం చేసే చిన్న చిన్న ముఖ వ్యాయామాలు చేయవచ్చు. ఈ ఫేస్ వ్యాయామాలు మెడ వద్ద ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడానికి తోడ్పడతాయి.  నిద్ర , ఒత్తిడి..  రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్రలేమి , మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ప్రాణాయామం వంటివి పాటించాలి. పైన చెప్పుకున్న విధంగా థైరాయిడ్ కు సరైన వైద్యం పొందుతూ, ఆరోగ్యకరమైన ఆహారం , రోజువారీ వ్యాయామం అలవాటు చేసుకుంటే డబుల్ చిన్ సమస్య నుండి క్రమంగా బయట పడవచ్చు.                                                                                                                                     *రూపశ్రీ.
తలనొప్పి వచ్చిందంటే చాలు.. చాలామంది వెంటనే మెడికల్ షాప్‌‌కి వెళ్లి పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తెచ్చుకుని  మింగేస్తుంటారు. కానీ, తరచూ మాత్రలు వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎటువంటి టాబ్లెట్ వాడకుండానే ఇంట్లోనే చాలా తేలిగ్గా, సహజ పద్ధతుల ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు. ​మనం చేసే చిన్న చిన్న పనులు,  ఆక్యుప్రెషర్ పద్ధతులు తలనొప్పి నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. టాబ్లెట్ అక్కర్లేకుండానే తలనొప్పి తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలుసుకుంటే.. LI4 పాయింట్.. ​మన బొటనవేలు, చూపుడు వేలు కలిసే మధ్య భాగంను LI4 పాయింట్ అంటారు. ఈ భాగంలో  మరొక చేతి వేళ్లతో మెల్లగా నొక్కి పట్టి, వృత్తాకారంలో మసాజ్ చేయడం వల్ల తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఈ పాయింట్‌ను కొన్ని నిమిషాల పాటు నొక్కడం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. యాంగ్ టాంగ్ పాయింట్.. ​నుదురు, కనుబొమ్మల మధ్య భాగం, రెంటి మధ్య పాయింట్  ను యాంగ్ టాంగ్ పాయింట్అంటారు. ఈ పాయింట్ వద్ద చూపుడు వేలితో కాసేపు సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా, తలనొప్పి క్రమంగా తగ్గుతుంది. నీరు.. ​శరీరంలో నీటి శాతం తగ్గడం (డీహైడ్రేషన్) వల్ల కూడా చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి తలనొప్పిగా అనిపించిన వెంటనే ఒక పెద్ద గ్లాసు నీళ్లు లేదా నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కాంప్రెస్.. ​తలనొప్పిగా ఉన్నప్పుడు చల్లని లేదా వేడి కాంప్రెస్ ఉపయోగించడం చాలా మంచిది. ఐస్ క్యూబ్స్‌ను ఒక గుడ్డలో చుట్టి నుదుటిపై లేదా మెడ వెనుక భాగంలో ఉంచడం వల్ల, లేదా వేడి నీటిలో ముంచిన తువ్వాలును ఉంచడం వల్ల రక్తనాళాలు విశ్రాంతి పొంది నొప్పులు తగ్గుతాయి. ఆయిల్స్.. పుదీనా నూనె లేదా ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ కొద్దిగా తీసుకుని నుదుటిపై రాసి సున్నితంగా మసాజ్ చేయడం వల్ల లేదా వాటి సువాసన పీల్చడం వల్ల తలనొప్పి, ఒత్తిడి త్వరగా దూరం అవుతాయి. అధిక వెలుతురు, స్క్రీన్ల వెలుతురు వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించుకోవడానికి కాసేపు లైట్లు ఆర్పివేసి ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో కళ్లు మూసుకుని పడుకోవడం మంచిది. ఈ చిన్న చిన్న సహజ చిట్కాలను పాటించడం ద్వారా రూపాయి ఖర్చు లేకుండా, టాబ్లెట్ మింగే అవసరం లేకుండా తలనొప్పికి సులభంగా చెక్ పెట్టవచ్చు.                      *రూపశ్రీ.