LATEST NEWS
తెలంగాణ రాజకీయ యవనిక నుంచి బీఆర్ఎస్ క్రమంగా కనుమరుగౌతోందా? రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ఆ పార్టీ తడబాటే అందుకు నిదర్శనమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మాటల మాంత్రికుడిగా, అపర చాణక్యుడిగా పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారం చలాయించి తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క ఓటమి.. అధికారం దూరం కావడంతో రాజకీయంగా క్రియాశీల పాత్రపోషించడానికి ముందు వెనుకలాడుతున్నారు. పొలిటికల్ డెసిషన్స్ తీసుకునే విషయంలో తడబాటుకు గురౌతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమై.. ఎంపిక చేసుకున్న నాయకులతో మంతనాలకే పరిమితమౌతున్నారు. ఈ  పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కవిత ఎపిసోడ్ లో కూడా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వినా మరేం చేయలేక మౌనం వహించడమే ఇందుకు నిదర్శనమంటున్నారు.  ఇక  మంగళవారం (సెప్టెంబర్ 9)న జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా ఎటువైపు అన్న నిర్ణయం తీసుకోలేక మొత్తంగా  ఓటింగ్ కు దూరం కావాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు  ఉప రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఓటింగ్ కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది.  ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటింగ్ కు దూరంగా ఉండాలన్న సూత్రప్రాయ నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చినట్లు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మరి కొద్ది మంది నాయకులతో మంతనాలు జరిపిన కేసీఆర్.. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ కు పార్టీ సభ్యులు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.   తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుత పరిస్థితుల్లో  ఇటు ఎన్డీయేకు లేదా అటు ఇండియా కూటమికి ఎవరికి మద్దతు ఇచ్చినా రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు తప్పవని  భావించిన బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఓటింగ్ కు దూరంగా ఉండడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.   అదే ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయంగా నిర్ణయాలు తీసుకునే విషయంలో తబడాటుకు గురౌతోందన్న పరిశీలకులు విశ్లేషణలకు కారణమైంది. 
లోకేష్ ప్రాధాన్యత ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో రోజురోజుకూ పెరిగుతున్నది. ఇక ఇప్పుడు కేంద్రంలో లోకేష్ చక్రం తిప్పడానికి స్వయంగా చంద్రబాబే ఆమోదం తెలిపేశారు. తన స్థానంలో లోకేష్ ను ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం ఎంపీలకు మార్గదర్శనం చేసి, వారు ఎన్డీయూ కూటమి అభ్యర్థికే ఓటు వేసేలా పర్యవేక్షణ చేయడానికి లోకేష్ ను హస్తినకు పంపుతున్నారు. లోకేష్ ఢిల్లీలో సోమవారం (సెప్టెంబర్ 8) సాయంత్రం తెలుగుదేశం, జనసేన ఎంపీలతో భేటీ అవుతారు. వారంతా ఎన్డీయే అభ్యర్థికే ఓటు వేసేలా పర్యవేక్షించడంతో పాటు వారికి అందుకు అనుగుణంగా శిక్షణ కూడా ఇస్తారు.   పర్యవేక్షణ, శిక్షణ ఎందుకంటే.. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసే విధానం ఒకింత భిన్నంగా ఉంటుంది. అందుకే తెలుగుదేశం, జనసేన ఎంపీలకు ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఓటువేసే విధానంపై అవగాహన కల్పించడంతో పాటు, శిక్షణ కూడా ఇవ్వాలన్న చంద్రబాబు సూచన మేరకు లోకేష్ ఆ బాధ్యతన భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇక సోమవారం (సెప్టెంబర్ 8) రాత్రి హస్తినలోనే బస చేసి.. మంగళవారం (సెప్టెంబర్ 9) ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తారు. ఈ మేరకు తెలుగుదేశంపార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలకు సమాచారం ఇచ్చారు.  వాస్తవానికి సీఎం చంద్రబాబే స్వయంగా ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే బుధవారం ( సెప్టెంబర్ 10) అనంతపురంలో నిర్వహించే సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొనాల్సిన నేపథ్యంలో చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని బదులుగా నారా లోకేష్‌ను పంపిస్తున్నారు. 
తెలంగాణ బీజేపీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం సభలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని ఆరోపిస్తూ ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు గతేడాది హైదరాబాద్‌ ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్‌రెడ్డి అప్పట్లో తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కేసు కొనసాగుతుందని తెలిపింది. దీనిపై రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రసంగాలు అతిశయోక్తులతో ఉండేవేనని, వాటిని పరువు నష్టంగా పరిగణించలేమంటూ ట్రయల్‌ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. అయితే హైకోర్టు తీర్పును బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. బీజేపీ సుప్రీంకోర్టులో వేసిన పరువు నష్టం పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ ను రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దంటూ మందలించింది. 
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై 8న విచారించనున్నట్లు హైకోర్టు పేర్కొంది. తన సినిమా ప్రమోషన్ కు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారనీ, మంత్రిగా కొనసాగుతూ సినిమాలు చేస్తున్నారనీ పేర్కొంటూ, ఆయనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గత నెల 19న పిటిషన్ దాఖలు చేశారు.    ప్రభుత్వ భద్రతా సిబ్బంది, అధికారిక వాహనాలు, ఇతర వనరులను సినిమా కార్యక్రమాలకు వినియోగించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంద‌ని విజయ్ కుమార్ తన  పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి సినిమాల్లో నటన కొనసాగించడాన్ని అనైతికం, రాజ్యాంగవిరుద్ధమై చర్యగా ప్రకటించాలని ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్   గ‌త నెల‌లో హైకోర్టు ముందు విచారణకు వచ్చింది.  విచారణ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది జయంతి , ఉపముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై అభ్యంతరం తెలిపారు. వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తారన్నారు. వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ జోతిర్మయి ప్రతాప సీబీఐ, ఏసీబీ తరపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పేర్లను కేసుల విచారణ జాబితాలో (కాజ్‌లిస్ట్‌) పేర్కొనకపోవడాన్ని తప్పుపట్టారు. వారి పేర్లను చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను  వాయిదా వేశారు.  ఈ పిటిషన్ పై మ‌రోసారి హైకోర్టులో వాద‌న‌లు జ‌రుగ‌గా..ఈ కేసును సోమవారం (సెప్టెంబర్  8) విచారిస్తామ‌ని హైకోర్టు ప్ర‌క‌టించింది.  దీంతో ఈ కేసు విచారణ పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  
  జపాన్  దేశ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా రాజీనామా చేశారు. జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో  లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ కూటమి పరాజయం చెందింది. దీనికి బాధ్యత వహించాలంటూ సొంత పార్టీ నేతల నుంచి ఇటీవల ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇషిబా తన పదవికి రాజీనామా చేశారు. అంతర్గత విభేదాలకు స్వస్తి పలికేందుకు  షిగెరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచరం. అక్టోబర్‌లో జపాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఏడాది జూలైలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌ ఎగువసభలో అధికార సంకీర్ణ సర్కారు మెజారిటీని సాధించలేకపోయింది.  అంతకుముందు దిగువ సభలోనూ మెజారిటీ కోల్పోయింది. దాంతో సొంత పార్టీ సభ్యుల నుంచి ప్రధానిపై ఒత్తిడి పెరిగింది.ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వ మార్పు కోసం ముందస్తు ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అనే అంశంపై సెప్టెంబర్‌ 8న చర్చించి నిర్ణయం తీసుకునేందుకు లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశం నిర్వహించిన ఇషిబా.. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీకి ప్రత్యామ్నాయ నేతను ఎన్నుకునేందుకుగాను ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు చెప్పారు.  
ALSO ON TELUGUONE N E W S
  ఈమధ్యకాలంలో బాగా విస్తరించిన సోషల్‌ మీడియా వల్ల ఎన్ని విధాలుగా ఉపయోగాలు ఉన్నాయో.. అనర్థాలు కూడా అన్నే ఉంటున్నాయి. కొందరు సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేయడమే కాదు, ఇతరులను మానసిక వేదనకు గురి చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పోలీసులకు ఇలాంటి ఫిర్యాదులు అనేకం అందుతున్నాయి. టాలీవుడ్‌ నటి రంగసుధ ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. రాధాకృష్ణ అనే వ్యక్తి తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారనని ఆమె ఆరోపించారు. (Ranga Sudha)   వివరాల్లోకి వెళితే.. నటి రంగసుధ కొన్నాళ్ళ క్రితం రాధాకృష్ణ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నారు. వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం సుధ ఒంటరిగానే ఉంటున్నారు. తనకు దూరంగా ఉందన్న కోపంతో రాధాకృష్ణ ఈ చర్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. కొన్ని సోషల్‌ మీడియా పేజీలతో కలిసి రంగసుధను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని సుధ పేర్కొన్నారు. తాను రాధాకృష్ణతో కలిసి ఉన్న ఫోటోలను, వీడియోలను ఆన్‌లైన్‌లో పెడతానని గతంలోనే బెదిరించాడని ఆ ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్‌ మీడియాలో ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రంగసుధ కేసు విషయంలో విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.  
తెలుగు ప్రజలందరి ఉమ్మడి ఆస్థి ఏదైనా ఉందంటే అది 'గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం'(SP Balasubrahmanyam). ఆయన పాటల ప్రవాహంలో నిత్యం తెలుగువారంతా ప్రవహిస్తూనే ఉన్నారు. ఆయన వారసుడు 'ఎస్పీ చరణ్'(SP Charan)తెలుగు ప్రజలందరికి సుపరిచయస్తులే. సింగర్ గా నేటికీ ఎన్నో మంచి పాటలకి తన స్వరాన్ని అందిస్తు వస్తున్నారు. నటుడిగా, నిర్మాతగా కూడా పలు చిత్రాల ద్వారా తన సత్తా చాటాడు. ఎస్పీ చరణ్ కి 'చెన్నై'సాలిగ్రామంలోని సత్య గార్డెన్‌లో ఒక ప్లాట్ ఉంది. సదరు ప్లాట్ లో 'తిరుజ్ఞానం' అనే సహాయ దర్శకుడు నెలకి 40,500 రూపాయిల అద్దె ఒప్పందంతో నివాసం ఉంటున్నాడు. ఈ మేరకు 1.50 లక్షలు అడ్వాన్స్ కింద ఇవ్వడం జరిగింది. కానీ గత ఇరవై ఐదు  నెలలుగా 'తిరుజ్ఞానం' అద్దె చెల్లించడం లేదు. దీంతో చరణ్ తన ఏరియా పరిదిలోని 'కేకేనగర్' పోలీసులకి 'తిరుజ్ఞానం' పై ఫిర్యాదు చేసాడు. సదరు ఫిర్యాదులో నెలకి ఖచ్చితంగా అద్దె ఇస్తానని ఒప్పుకొని, అడ్వాన్స్‌గా ఇచ్చింది తప్ప, ఇరవై ఐదు నెలలుగా అద్దె చెల్లించడం లేదు. డబ్బులు అడిగితే అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు,బెదిరింపులకి పాల్పడుతున్నాడని చరణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు తిరుజ్ఞానంపై కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చరణ్ ప్రస్తుతం తన తండ్రి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తు 'ఈటీవీ'(Etv)వేదికగా ప్రసారమవుతున్న 'పాడుతా తీయగా'(Padutha Theeyaga)కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.తన తండ్రి లాగానే కార్యక్రమాన్ని ఎంతో హుందాగా జరిపిస్తున్నారనే కామెంట్స్ ని ప్రేక్షకుల నుంచి అందుకుంటున్నాడు. గత ఏప్రిల్ లో 'లవ్ యువర్ ఫాదర్' అనే చిత్రంలో హీరో తండ్రిగా కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు.  
వర్సటైల్ నటుడు, బాలీవుడ్ అగ్ర దర్శకుడైన 'అనురాగ్ కశ్యప్'(Anurag Kashyap)సమర్పణలో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'సాంగ్స్ ఆఫ్ ఫర్ గాటెన్ ట్రీస్'(Songs Of forgotten tress). మహిళా దర్శకురాలు 'అనుపర్ణ రాయ్'(Anuparna Roy)తెరకెకెక్కించిన ఈ చిత్రంలో 'సుమీ బాగెల్, రవి మన్, ప్రీతమ్ పైలానియా, నాజ్ షేక్, భూషణ్ షింపి' తదితరులు కీలక పాత్రలు పోషించారు. బిబాన్షు రాయ్, రోమిల్ మోడీ, రజన్ సింగ్  నిర్మించడం జరిగింది.  ఈ మూవీని ఇటీవల ప్రతిష్టాత్మక 82 వ వెనిస్ ఫిలింఫెస్టివల్ లో ప్రదర్శించగా, ఉత్తమ దర్శకురాలిగా 'అనుపర్ణ రాయ్'ని  పురస్కారం వరించింది. వెనిస్ లో ఒక భారతీయ దర్శకురాలు ఈ అరుదైన పురస్కారాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. ఒరిజోంటి విభాగంలో మన దేశం నుంచి ఎంపికైన ఏకైక సినిమా కూడా 'సాంగ్స్ ఆఫ్ ఫర్ గాటెన్ ట్రీస్' నే. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న సమయంలో 'అనుపర్ణ రాయ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యింది. అనంతరం ఆమె మాట్లాడుతు ఈ అవార్డు భారతీయ మహిళలందరికి అంకితం ఇస్తున్నట్టు పేర్కొంది.  ఇటలీ(Italy)లోని వెనిస్(Venice)దేశంలో జరిగే ఈ ఫెస్టివెల్ 1932 లో ప్రారంభమయ్యింది. పలు దేశాలకి చెందిన మేకర్స్ ఈ ఫెస్టివల్ లో తమ చిత్రం ప్రదర్శించడంతో పాటు,  పలు విభాగాల్లో 'ఒరిజోంటి అవార్డ్స్ ని అందుకోవడం ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. 'సాంగ్స్ ఆఫ్ ఫర్ గాటెన్ ట్రీస్' కథ విషయానికి వస్తే  ముంబైలో ఒంటరిగా జీవించే తోయా అనే  సెక్స్ వర్కర్, శ్వేత అనే కాలేజీ  ఇద్దరు మహిళల కథ. ఆ ఇద్దరు వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చినప్పటికీ, ఒకరినొకరు తెలుసుకున్న తర్వాత  అనుబంధాన్ని పెంచుకోవడంతో పాటు, ఒకరికొకరు తోడుగా మారతారు. ఈ క్రమంలో ఏం జరిగిందనేదే ఈ చిత్ర కథ. గంట ఇరవై నిమిషాల నిడివితో ఈ చిత్రం తెరకెక్కింది. అనుపర్ణ రాయ్ ఇప్పటి వరకు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కి  సహాయ దర్శకురాలిగా పని చెయ్యడంతో పాటు, 'రన్ టూ రివర్' అనే లఘు చిత్రానికి దర్శకురాలిగా పని చేసింది. పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు అనుపర్ణ రాయ్ ని అభినందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.    
దక్షిణ భారతీయ సినీ ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు 'రాఘవ లారెన్స్'(Raghava Lawrence). సుదీర్ఘ కాలం నుంచి నృత్య దర్శకుడుగా, దర్శకుడిగా, నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా తనదైన శైలిలో దూసుకుపోతు ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. 2023 లో 'కార్తీక్ సుబ్బరాజ్'(Karthik Subbaraj)దర్శకత్వంలో 'జిగర్తాండ' కి సీక్వెల్ గా తెరకెక్కిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోకపోవడంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని  పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో చేస్తున్నాడు. లారెన్స్ సామాజిక సేవలోను ముందుకు వరుసలో ఉంటు ఎంతో మందిని ఆదుకుంటు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే పేదరాలైన 'శ్వేత'(Swetha)అనే దివ్యాంగురాలు అనారోగ్య సమస్యలతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైపోయింది. అసలు ఒక అడుగు కూడా ముందుకు వెయ్యడం లేదు. ఈ విషయం లారెన్స్ దృష్టికి రావడంతో శ్వేతకి ఒక స్కూటీని బహుమతిగా అందించడంతో పాటు, నడిచేందుకు సపోర్ట్ గా కృత్రిమ కాలుని ఏర్పాటు ఏర్పాటు చేయించాడు. శ్వేత పూరిపాకలో నివసిస్తుండటంతో  సొంతిల్లు కట్టించాలని కూడా లారెన్స్  నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించిన శ్వేత, లారెన్స్ ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లారెన్స్ మరోసారి తన  మంచి మనస్సు చాటి చెప్పారని పలువురు నెటిజన్స్ అభినందిస్తున్నారు   2005 లో లారెన్స్ తన పేరుపై 'లారెన్స్  చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించి ఎంతో మంది అనాధల్ని, పేద వాళ్ళని పలు రూపాల్లో ఆదుకుంటు వస్తున్నాడు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సాయం చేస్తుండంతో పాటు, స్కాలర్ షిప్స్ కూడా ఇస్తూ ప్రోత్సహించే లారెన్స్  ఇప్పటి వరకు నూట యాభై మంది పిల్లలకి గుండె సంబంధిత వ్యాధులకి ఆపరేషన్ కూడా చేయించాడు.  బెంజ్, కాల భైరవ, బుల్లెట్, కాంచన 4 , హంటర్ అనే పలు క్రేజీ టైటిల్స్ తో కూడిన చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.  
  మెగాస్టార్ చిరంజీవి చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వాటిలో 'మన శంకర వరప్రసాద్ గారు' ముందుగా విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ఇంకా నాలుగు నెలలు సమయముండగా.. అప్పుడే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్టనర్ ని లాక్ చేసుకోవడం విశేషం. (Megastar Chiranjeevi)   చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ కావడంతో.. ప్రకటనతోనే 'మన శంకర వరప్రసాద్ గారు'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా, 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రావిపూడి నుంచి వస్తున్న సినిమా కావడంతో.. బిజినెస్ పరంగానూ అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ పరంగానూ భారీ ఆఫర్స్ వస్తాయి అనడంలో డౌట్ లేదు. (Mana Shankara Varaprasad Garu)   షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు'లో వెంకటేష్ ప్రత్యేక పాత్రలో మెరవనుండటం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. నవంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేయాలని మూవీ టీం టార్గెట్ గా పెట్టుకుంది.  
  సోషల్ మీడియా, అందునా ట్విట్టర్ అంటే మొదట గుర్తొచ్చేది ఫ్యాన్ వార్సే. అయితే ట్విట్టర్ ని సరిగ్గా వాడితే.. మనం ఇతరుల సాయం పొందడానికో లేక సాటి మనిషికి మనం సాయం చేయడానికో కూడా ఉపయోగపడుతుంది. తాజాగా ఓ ఎన్టీఆర్ అభిమాని తాను కష్టాల్లో ఉన్నానని ట్వీట్ చేయగా.. అతన్ని ఆదుకోవడానికి బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ ముందుకొచ్చారు.   "ప్రస్తుతం నేను చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాను. నా ఆరోగ్య సమస్యల వల్ల మొత్తం డబ్బు ఖర్చయిపోయింది. ఆర్థికంగా పూర్తిగా వెనకబడ్డాను. ఒక దశలో సూసైడ్ దాకా  కూడా వెళ్లాను. కానీ నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం మళ్లీ బ్రతకాలని నిశ్చయించుకున్నాను. ఈ తీవ్ర పరిస్థితిలో చివరికి ఒక్క ఆశతో నా బాధను ట్విట్టర్ లో నా స్నేహితులు, ఎన్టీఆర్ అభిమానులు, ఇతర ఫ్యాన్స్ తో పంచుకున్నా. కొంతమంది స్పందించి ఆర్థిక సహాయం అందించారు. ఇంకా సుమారు 2 లక్షల వరకు అవసరం ఉంది. దయచేసి, మిమ్మల్ని నా కుటుంబ సభ్యుల్లా భావిస్తూ, ఈ క్లిష్ట సమయంలో నాకు మీ వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాను." అంటూ సోమేశ్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు.     సోమేశ్ ట్వీట్ కి బెల్లంకొండ స్పదించాడు. మూవీ ప్రమోషన్స్ కోసం విజయవాడ వస్తున్నానని, నేరుగా కలిసి సాయం చేస్తానని చెప్పాడు. మరోవైపు మంచు మనోజ్ కూడా "నీ నంబర్ పంపు తమ్ముడు. ధైర్యంగా ఉండు. మేమంతా నీతో ఉన్నాం." అంటూ అతనికి ధైర్యం చెప్పాడు.     సోమేశ్ ట్వీట్ చూసి ఎన్టీఆర్ అభిమానులతో పాటు, ఇతర హీరోల అభిమానులు కూడా తమకు తోచిన సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే కష్టాల్లో ఉన్నానంటూ ఓ అభిమాని చేసిన ట్వీట్ కి స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.  
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీ 'ఓజీ'. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ అభిమానాలను ఫిదా చేసింది. సెప్టెంబర్ 19న ట్రైలర్ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో థర్డ్ సింగల్ కూడా విడుదల కానుంది. ఇలా వరుసగా అదిరిపోయే కంటెంట్ వదులుతూ.. అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న ఓజీ టీం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. (They Call Him OG)   'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని మేకర్స్ చూస్తున్నారు. దీని కోసం విజయవాడను వేదికగా ఎంచుకున్నారని తెలుస్తోంది. అంతేకాదు, సెప్టెంబర్ 22న ఈ ఈవెంట్ జరగనుందని సమాచారం. పవన్ కళ్యాణ్ కి తెలుగునాట ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. పైగా ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటిది విజయవాడ వేదికగా 'ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తే.. లక్షల్లో అభిమానులు తరలివచ్చే అవకాశముంది.  
  సెప్టెంబర్ 25న 'అఖండ-2'తో బాలకృష్ణ, 'ఓజీ'తో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర తలపడాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా 'అఖండ-2' వాయిదా పడింది. దీంతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ ఫైట్ మిస్ అయింది. అయితే, సెప్టెంబర్ కి మిస్ అయిన వీరి పోరు.. డిసెంబర్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది. (Balakrishna vs Pawan Kalyan)   'అఖండ-2'ని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే టైంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఆ సినిమా ఏదో కాదు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీని.. డిసెంబర్ మొదటి వారంలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.   హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'అఖండ-2'పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మరోవైపు 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఫిల్మ్ కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటిది ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగితే.. పోరు ఆసక్తికరంగా ఉంటుంది అనడంలో డౌట్ లేదు.  
  మహేష్ బాబుని శ్రీరాముడి పాత్రలో చూసుకోవాలనేది అభిమానుల కోరిక. ఆ అందం, ఆ పర్సనాలిటీకి రాముడి పాత్రలో ఆయన సరిగ్గా సరిపోతారని.. అభిమానులతో పాటు అందరూ భావిస్తుంటారు. ఇటీవల 'మిరాయ్'లో రాముడిగా మహేష్ కనిపిస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఆ వార్తల్లో నిజం లేదని టీం క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు మరో సంచలన వార్త తెరపైకి వచ్చింది. మహేష్ ని రాముడిగా చూపించే బాధ్యతను ఎస్.ఎస్. రాజమౌళి తీసుకున్నారని తెలుస్తోంది. (Mahesh Babu)   మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ని కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారతీయ పురాణాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని గతంలో ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు శ్రీరాముడిగా మహేష్ కనిపించబోతున్నారనే న్యూస్ బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, ఇప్పటికే దీనికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా పూర్తయిందని వినికిడి. రాజమౌళికి పర్ఫెక్షనిస్ట్ గా పేరుంది. అలాంటి దర్శకుడు రాముడిగా మహేష్ ని ఏ స్థాయిలో చూపిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. (SS Rajamouli)   మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'SSMB29' అనేది వర్కింగ్ టైటిల్. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఎక్కువ భాగం షూటింగ్ కెన్యాలో జరగనుంది. ఫస్ట్ లుక్ నవంబర్ లో విడుదల కానుంది. సినిమాని 2027 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  
ఫిలిం ఇండస్ట్రీలో ప్రేమాయణాలు, సహజీవనాలు, పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం. అయినప్పటికీ సెలబ్రిటీల ప్రేమ వ్యహారాల గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. తమ ప్రేమ కలాపాలతో ఎప్పుడూ ఎవరో ఒకరు వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్‌ మీనాక్షి చౌదరి కూడా అలాంటి రూమర్స్‌ని ఎదుర్కొంటున్నారు. అయితే అందులో ఎంత నిజం ఉంది అనేది పక్కన పెడితే.. మీనాక్షి ప్రేమాయణం అనే న్యూస్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ప్రచారం జరుగుతున్న మీనాక్షి లవ్‌స్టోరీలో హీరో ఎవరు అంటే.. కరెంట్‌ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన సుశాంత్‌.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. 2021లో వచ్చిన ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో ఫర్వాలేదు అనిపించుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన మీనాక్షి చౌదరితో సుశాంత్‌ ఎఫైర్‌ నడుపుతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా వీరిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించడం ఆ రూమర్స్‌కి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. మీనాక్షి మాస్క్‌తో హ్యాండ్‌ బ్యాగ్‌ పట్టుకుని నడుస్తుండగా, సుశాంత్‌ లగేజ్‌ ట్రాలీతో వెంబడి రావడం వీడియోలో రికార్డ్‌ అయ్యింది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ ఏమిటి అనే చర్చ సోషల్‌ మీడియాలో మొదలైంది.  గతంలో సుశాంత్‌, మీనాక్షిలపై వచ్చిన రూమర్స్‌పై మీనాక్షి స్పందించారు. సుశాంత్‌ తనకు ఫ్రెండ్‌ మాత్రమేనని మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మీనాక్షి గతంలోనే చెప్పింది. సెలబ్రిటీలు ఇలాంటి స్టేట్‌మెంట్స్‌ ఇవ్వడం సర్వసాధారణం అనే విషయం తెలిసిందే. అందుకే మళ్లీ మళ్లీ వీరి రిలేషన్‌ గురించి గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే మీనాక్షి చెప్పినట్టు సుశాంత్‌తో ఉన్నది నిజంగా ఫ్రెండ్‌షిప్పేనా.. లేక మరేదైనా వారి మధ్య ఉందా అనేది తెలియాల్సి ఉంది. తాజాగా చక్కర్లు కొడుతున్న ఎయిర్‌పోర్ట్‌ వీడియోపై సుశాంత్‌, మీనాక్షి స్పందిస్తే అందరికీ క్లారిటీ వస్తుంది. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  విజయం ప్రతి వ్యక్తి జీవితంలో పెట్టుకునే ఒక లక్ష్యం. అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు. కానీ చేసే పనిలో విజయం సాధించాలని, విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. అయితే చాలా మందికి విజయం అనేది మాటల్లో లేదా కలలో మాత్రమే ఉండిపోతుంది.  ఎంత ప్రయత్నం చేసినా కొందరు విజయం సాధించలేరు. ఎందుకు అనే ప్రశ్న వేసుకున్నా చాలా కారణాలు కళ్లముందు కనిపిస్తాయి. అయితే విజయం సాధించాలంటే కష్టపడుతూ ప్రయత్నం చేయడం మాత్రమే కాదు.. కొన్ని అలవాట్లను కూడా మార్చుకోవాలని చెబుతున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. ఎంత కష్టపడినా విజయం దక్కకుండా అడ్డుకునే అలవాట్లు ఏమిటి? వాటిని ఎలా మార్చుకోవాలి?తెలుసుకుంటే..   సోమరితనం.. చాలామంది కష్టపడుతూనే ఉన్నాం కానీ విజయం సాధించలేకపోతున్నాం అని అంటూ ఉంటారు. అయితే కష్టపడేవారిలో కూడా సోమరితనం ఉంటుంది.  సాధారణంగా కష్టపడ్డాం అని చెప్పేవారు కష్టపడిన సమయం గురించి పెద్దగా పట్టించుకోరు. విజయం సాధించాలంటే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అంతేకానీ ప్రయత్నం చేయాల్సిన సమయంలో చేయకుండా ఆ తరువాత ఎంత కష్టపడినా ఫలితం అందదు.   కోపం.. తన కోపమే తన శత్రువు అని అన్నారు పెద్దలు. కోపం విధ్వంసానికి దారితీస్తుంది. కోపం వల్ల వైఫల్యాలు ఎదురైనప్పుడు ఒత్తిడి, నెగెటివ్ ఆలోచనలు, ఓటమిని తీసుకోలేని తనం.. ఇట్లా చాలా మనిషిని డిస్టర్బ్ చేస్తాయి. కోపం మనిషిలో విచక్షణను చంపేస్తుంది. అందుకే కోపం ఉన్నవాడికి విజయం ఆమడ దూరంలో ఉంటుంది.   అహంకారం.. ఒక ఖచ్చితమైన మనిషికి ఉండకూడని గుణం అహంకారం. నేనే కరెక్ట్, నేను చెప్పిందే సబబు,  ఇది ఇలానే జరగాలి అనుకునే వ్యక్తి విజయం సాధించే దిశలో ఎదురయ్యే చాలా విషయాలను ఓర్పుగా అంగీకరించలేడు. ఎప్పుడైతే తన నిర్ణయాలను తప్ప దేన్నీ అంగీకరించలేని స్థితిలో ఉంటారో..అప్పుడు వ్యక్తి ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేరు.   అబద్దాలు చెప్పడం.. అవసరానికి అబద్దం చెప్పడం తప్పేం కాదు.. అని చాలా మంది అనుకుంటారు. ఈ కాలంలో అబద్దాలు చెప్పకుండా అస్సలు ఒక పని అయినా జరుగుతుందా అనుకునేవారు కూడా ఉంటారు. అయితే అబద్దాలు చెప్పడం వ్యక్తి జీవితంలో నెగిటివ్ దృక్పథాన్ని క్రమంగా పెంచుతుంది.  మనిషిలో నెగెటివ్ కోణం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి విజయం సాధించాలన్నా ఆ నెగెటివ్ కోణం అడ్డు పడుతూ ఉంటుంది.     పైన చెప్పుకున్న అలవాట్లను వదిలిపెడితే విజయం సాధించడం  సాధ్యం అవుతుంది. లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా విజయం ఎప్పుడూ ఆమడ దూరంలోనే ఉంటుంది.   - రూపశ్రీ  
వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, బాధ్యతలు, అవగాహనతో కూడిన సంబంధం. ఈ రోజుల్లో చాలా మంది కెరీర్, చదువులు లేదా వ్యక్తిగతంగా ఎదగాలి అనే  కారణంగా ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. బాగా గమనిస్తే చాలా వరకు వివాహాలు 30 ఏళ్లు దాటిన వాళ్లవే ఎక్కువగా ఉంటున్నాయి.  30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకునే ధోరణి ఈ మధ్య కాలంలో బాగా  పెరిగింది. అయితే ప్రతి పనికి లాభ నష్టాలు ఉన్నట్టే.. 30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకోవడం అనే విషయంలో కూడా లాభనష్టాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుంటే.. 30 ఏళ్ల లోపు వివాహం చేసుకోవడం మంచిదా? లేక 30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే మంచిదా? అనే విషయం మీద ఒక క్లారిటీ వస్తుంది.  దీని గురించి తెలుసుకుంటే.. 30 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. 30 సంవత్సరాల వయస్సులో చాలా మంది  కెరీర్‌లో సెటిల్ అయి ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం లేదా పొదుపు ఇలా చాలా కారణాలుగా  వివాహం తర్వాత ఆర్థిక అభద్రత తక్కువగా ఉంటుంది. భాగస్వామి పోషణ కూడా కష్టంగా అనిపించదు.  24-25 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకోవడంతో పోలిస్తే.. 30 ఏళ్ల తర్వాత చేసుకునే వివాహంలో ఆర్థిక భద్రత ఉంటుంది. మానసిక పరిపక్వత, అవగాహన.. చిన్న వయస్సులో తీసుకునే నిర్ణయాలు తరచుగా తొందరపాటుతో ఉంటాయి. కానీ 30 సంవత్సరాల తర్వాత చాలా వరకు పరిణతి చెందుతారు.  సంబంధాల గురించి మంచి అవగాహన ఉంటుంది. ఈ పరిపక్వత వివాహాన్ని బలంగా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వ్యక్తిగత వృద్ధి,  ఇండిపెండెన్స్.. 30 ఏళ్లలోపు వారు చదువులు, కెరీర్, ప్రయాణాలు,  అభిరుచులు మొదలైన వాటిలో బిజీగా ఉంటారు. కానీ 30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకునే వారు వైవాహిక బంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం.. 30ఏళ్ళ తర్వాత చాలా వరకు పరిణితి పొంది ఉంటారు.  వీరు  తమ ప్రాధాన్యతలను బాగా అర్థం చేసుకుంటారు. జీవితంలో  ఏమి కోరుకుంటున్నారో,  వారి కుటుంబం,  వృత్తిని ఎలా బ్యాలెన్స్  చేసుకోవాలో వారికి తెలుసి ఉంటుంది. డబ్బును సరిగ్గా ఉపయోగించడం.. 30 సంవత్సరాల తర్వాత చాలామందికి  డబ్బు గురించి మంచి అవగాహన వచ్చి ఉంటుంది.  దీని వల్ల డబ్బును ప్లానింగ్ గా ఖర్చు పెట్టడం తెలిసి ఉంటుంది. 30 ఏళ్ల తర్వాత వివాహం చేసుకోవడం వల్ల కలిగే నష్టాలు.. గర్భధారణలో సమస్యలు మహిళలకు 30 తర్వాత సంతానోత్పత్తి క్రమంగా తగ్గుతుంది. 35 తర్వాత గర్భధారణలో ఇబ్బందులు,  సమస్యలు వచ్చే అవకాశాలు పెరగవచ్చు. వయస్సుతో పాటు అండాల నాణ్యత తగ్గుతుంది. ఇది గర్భధారణలో సమస్యలను కలిగిస్తుంది. పురుషులకు వయస్సుతో పాటు స్పెర్మ్ నాణ్యత కూడా ప్రభావితమవుతుంది. ఇది గర్భధారణను ఆలస్యం చేస్తుంది. పెరుగుతున్న వయస్సుతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. ఇది ఆరోగ్యకరమైన వివాహ జీవితాన్ని గడపడం కష్టతరం చేస్తుంది. సామాజిక ఒత్తిడి, అంచనాలు.. 30 సంవత్సరాల తరువాత వివాహం విషయంలో కుటుంబం,  సమాజం నుండి  ఒత్తిడి ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచుతుంది. కొన్ని సార్లు ఒత్తిడి కారణంగా తొందరపాటులో పెళ్లికి ఒప్పుకోవడం, ఆ తరువాత నష్టాన్ని చూడటం జరుగుతుంది. సంబంధాలలో సర్దుబాటు కష్టం.. 30 సంవత్సరాల తరువాత  వ్యక్తి యొక్క ఆలోచనలు, అలవాట్లు,  జీవనశైలి చాలా స్థిరంగా మారతాయి. దీని కారణంగా కొత్త వ్యక్తితో సర్దుబాటు చేసుకోవడం కష్టం కావచ్చు. అలవాట్లు మార్చుకోవడానికి వీరు అంత తొందరగా అంగీకరించరు. దీని వల్ల విభేదాలు వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు.  పిల్లలను పెంచడం.. 30 ఏళ్ళ  తర్వాత పిల్లలు ఆలస్యంగా జన్మిస్తే పిల్లలు పెరిగే సమయానికి తల్లిదండ్రులు పెద్దవారవుతారు. ఇది పిల్లలను పెంచడంలో, వారి  భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేయడంలో సవాళ్లకు దారితీయవచ్చు. తల్లిదండ్రులు,  పిల్లల మధ్య పెద్ద తరం అంతరం పరస్పర అవగాహన,  బంధంలో ఇబ్బందులకు దారితీస్తుంది. ఆర్థిక ఒత్తిడి,  భవిష్యత్తు ప్రణాళిక.. 30 సంవత్సరాల తర్వాత ఉద్యోగ భాద్యతలు,   ఆర్థిక బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఇది వివాహం తర్వాత కొత్త బాధ్యతలను నెరవేర్చడం సవాలుగా చేస్తుంది. వివాహం తర్వాత జీవితంలో ఆర్థిక ప్రణాళికలను మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. పెద్ద వయస్సులో వివాహం చేసుకున్న తర్వాత, దంపతులు ఒకరితో ఒకరు సమయం గడపడం కంటే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది.                                 *రూపశ్రీ.
తల్లిదండ్రులు పిల్లలకు ప్రేమ, విలువలు,  రక్షణ ఇస్తారు.  ప్రతి పిల్లవాడికి మొదటి గురువు తల్లి అని అంటారు. అయితే ఇంటి బయట పిల్లలకు భాద్యతగా విద్య బుద్దులు నేర్పి,  జీవితాన్ని మలుపు తిప్పేది మాత్రం ఉపాధ్యాయులే. దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎందరో గొప్ప వ్యక్తులు, ఎన్నో వృత్తులలో నిపుణులుగా గుర్తించబడుతున్నారంటే అదంతా ఉపాధ్యాయుల బోధన ద్వారానే బీజం పడుతుంది. ఉపాధ్యాయులు పుస్తకాల జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా, సమాజంలో జీవించడం,  వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అమూల్యమైన సూత్రాలను కూడా పిల్లలకు బోధిస్తారు. ప్రతి పిల్లవాడి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర చాలా ముఖ్యమైనది. పాఠశాల,  ఉపాధ్యాయులు వారికి నిజమైన జీవితానికి కావలసిన జ్ఞానాన్ని ఇస్తాయి.   తల్లిదండ్రులు నేర్పలేని,  ఉపాధ్యాయులు బోధించగలిగే 5 జీవిత పాఠాలు ఉన్నాయి.  వాటి గురించి తెలుసుకుంటే.. క్రమశిక్షణ  ప్రాముఖ్యత.. ఇంట్లో పిల్లలు గారాబం  కారణంగా తరచుగా డిసిప్లిన్ తప్పుతారు.  ఇంట్లో పిల్లలు చాలా వరకు వారికి నచ్చినట్టు ఉంటారు. అయితే బడిలో ఉపాధ్యాయులే పిల్లలకు క్రమశిక్షణకు గల  నిజమైన అర్థాన్ని బోధిస్తారు. సమయానికి రావడం, హోంవర్క్ పూర్తి చేయడం, అల్లరిని కంట్రోల్ లో ఉంచడం,  చదువులో స్థిరంగా ఉండటం..  ఈ అలవాట్లు జీవితకాల విజయానికి పునాదిగా నిలుస్తాయి. జట్టుకృషి,  సహకారం.. పాఠశాలలో క్రీడలు, సమూహ ప్రాజెక్టులు,  సాంస్కృతిక కార్యకలాపాలు పిల్లలకు టీం వర్క్   శక్తిని తెలుపుతాయి. ఒంటరిగా కాకుండా కలిసి పనిచేయడం  గొప్ప విజయాలకు దారితీస్తుందని ఉపాధ్యాయుల బోధనలో నేర్చుకుంటారు. వైఫల్యాన్ని అంగీకరించడం.. పిల్లల తప్పులను ఇంట్లో కప్పిపుచ్చుతారు.  కానీ ఉపాధ్యాయులు వారికి వైఫల్యం నుండి పాఠం  నేర్చుకుని మళ్ళీ గెలవడానికి ధృఢంగా ఉండటం  నేర్పుతారు. ఈ గుణం తరువాత జీవితంలో పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి వారికి సహాయపడుతుంది. న్యాయం, సమానత్వం.. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని సమానంగా చూస్తారు. కులం, మతం, లింగం లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని వారు పిల్లలకు బోధిస్తారు. సమాజానికి సరైన దిశానిర్దేశం చేయడంలో ఈ విలువలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు.. ఉపాధ్యాయులు పిల్లలను తరగతి గదిలో ప్రశ్నలు అడగడానికి, ప్రసంగాలు ఇవ్వడానికి,  వేదికపై ప్రజెంటేషన్లు ఇవ్వడానికి ప్రోత్సహిస్తారు. ఇది వారి ఆత్మవిశ్వాసం,  కమ్యూనికేషన్ నైపుణ్యాలను బలోపేతం చేస్తుంది. ఇది భవిష్యత్తులో ప్రతి రంగంలోనూ విజయం సాధించడానికి దోహదం చేస్తుంది.                               *రూపశ్రీ.
రక్తపోటు నేటికాలంలో చాలా సాధారణం అయిపోయింది.  ఒకప్పుడు వయసుతో పాటు పెద్దవారికి మాత్రమే రక్తపోటు వచ్చేది.  తరువాత మధ్యవయసు వారిలో రక్తపోటు రావడం మొదలైంది. కానీ ఇప్పట్లో మాత్రం యువతలో ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలలో కూడా రక్తపోటు బయటపడుతూ ఉంటుంది.  సాధారణంగా ఉండాల్సిన దాని కంటే ఎక్కువ రక్తపోటు ఉండటం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.  ఈ రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు తినాలని వైద్యులు చెబుతుంటారు.  అయితే పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు ఏంటి?  ఏ ఆహారాలు తినాలి?  తెలుసుకుంటే.. తినాల్సిన ఆహారాలు.. అరటిపండ్లు.. అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది.  సులభంగా లభిస్తాయి, చవకైనవి కూడా. అన్ని రకాల వయసుల వారికి  అనువైనవి. అరటిపండ్లను స్మూతీలు, ఫ్రూట్ సలాడ్లలో కలపడం  లేదా వాటిని నేరుగా  తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచవచ్చు. కొబ్బరి నీరు.. కొబ్బరి నీరులో సహజ  ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి.   ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది.  అటు హైడ్రేట్ గా ఉంచుతూ.. రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.  పాలకూర.. పాలకూరలో  పొటాషియం, ఐరన్ తో పాటు ఇతర ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాలకూరను తీసుకుంటే రక్తపోటును చాలా వరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. దోసకాయ.. దోసకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది.  కేలరీలు తక్కువగా  ఉంటాయి.  పైగా ఇది  హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. ఇది రక్తపోటును నియంత్రణలో  ఉంచడానికి సహాయపడుతుంది.  టమోటాలు.. టమోటాలు  భారతీయ వంటకాల్లో  విరివిగా ఉపయోగిస్తుంటాం. అయితే టమోటాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.  టమోటాలను కూరల్లోనే కాకుండా జ్యూస్ కూడా చేసుకుని తాగవచ్చు. ఎక్కువ రక్తపోటు ఉన్నవారికి ఇలా జ్యూస్ చేసుకుని తాగడం మంచి ఉపశమనం  ఇస్తుంది. పెరుగు.. పెరుగు అద్భుతమైన ప్రోబయోటిక్ మాత్రమే కాదు..  ఇందులో  పొటాషియం కూడా సమృద్దిగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.  శరీరానికి పోషణ కూడా ఇస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది శక్తి ఉత్పత్తి, కండరాలు,  నరాల పనితీరు, రక్తంలో చక్కెర నియంత్రణ,  ఎముక ఆరోగ్యంతో సహా శరీరంలో 300 కి పైగా జీవరసాయన ప్రతిచర్యలలో కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం లోపం అలసట, కండరాల తిమ్మిరి, చిరాకు, హృదయ స్పందన సక్రమంగా లేకపోవడం, మానసిక రుగ్మతలు వంటి లక్షణాలకు దారితీస్తుంది. శరీరం సహజంగా మెగ్నీషియంను ఉత్పత్తి చేయదు.  దీన్ని ఆహారం నుండి పొందాలి. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాల గురించి తెలుసుకుంటే.. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు.. బచ్చలికూర.. బచ్చలికూర మెగ్నీషియం పవర్హౌస్. బచ్చలికూరలో  ఐరన్, ఫోలేట్,  యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది గుండె, ఎముక,  మెదడు ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది.  బాదం.. కేవలం గుప్పెడు బాదం లో సుమారు 80 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. వీటిలో  ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్,  విటమిన్ ఇ  కూడా సమృద్ధిగా ఉంటాయి. బాదం మెదడు పనితీరు,  శక్తి స్థాయిలకు  మద్దతు  ఇస్తుంది. గుమ్మడికాయ విత్తనాలు..  28 గ్రాముల గుమ్మడి విత్తనాలలో   150 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. వీటిలో  యాంటీఆక్సిడెంట్లు,  ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె,  ప్రోస్టేట్ ఆరోగ్యానికి చాలా మంచివి. సలాడ్లు, పెరుగు లేదా  స్వీట్స్ లలో వీటిని జోడించుకోవచ్చు. అవోకాడోస్.. ఒక మీడియం అవోకాడోలో పొటాషియం, ఫైబర్,  గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులతో పాటు 58 మి.గ్రా మెగ్నీషియం కూడా ఉంటుంది. అవోకాడోస్ జీవక్రియకు చాలా హెల్ప్  చేస్తాయి, మంటను తగ్గిస్తాయి.  ఇతర ఆహారాల నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్.. మంచి-నాణ్యత గల డార్క్ చాక్లెట్ రుచికరమైనది మాత్రమే కాదు  మెగ్నీషియం సమృద్దిగా కలిగి ఉంటుంది. ఇది ఔన్సుకు 64 మి.గ్రా  మెగ్నీషియం అందిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.  ఇది మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి,  హృదయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.  అరటిపండ్లు.. పొటాషియం కోసం అరటిపండ్లు చాలా మంచి ఎంపిక.  ఒక మీడియం సైజు అరటిపండులో  32 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. అవి కండరాల పనితీరుకు మద్దతును, శక్తిని ఇస్తాయి.  వ్యాయామం తర్వాత అరటిపండు తినేది ఇందుకే. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెగ్నీషియం లోపం రాకుండా ఉంటుంది.  మెగ్నీషియం  లోపం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త పడినట్టు ఉంటుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఈ రోజుల్లో చిన్నవారైనా, పెద్దవారైనా వెన్నునొప్పి, నడుము నొప్పి అనే ఫిర్యాదులు చేయడం చూస్తూనే ఉన్నాం.  వెన్నునొప్పి ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడుతుంది. ఈ నొప్పిని తరచుగా నిర్లక్ష్యం చేస్తారు. ఇది క్రమంగా పెరుగుతుంది. ఈ నొప్పి శారీరక అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, రోజువారీ వనులు చేసుకోవడంలో  కూడా ప్రభావితం చేస్తుంది. కానీ ఇలాంటి వెన్ను నొప్పి వెనుక స్లిప్ డిస్క్ లాంటి తీవ్రమైన సమస్య కూడా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం  ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.  అసలు స్లిప్ డిస్క్ అంటే ఏమిటి? ఇది వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది? దీన్నెలా గుర్తించాలి? పూర్తీగా తెలుసుకుంటే.. స్లిప్ డిస్క్.. స్లిప్డ్ డిస్క్‌ను వైద్య భాషలో 'హెర్నియేటెడ్ డిస్క్' అని కూడా అంటారు. వెన్నెముక ఎముకల మధ్య ఉన్న కుషన్ లాంటి డిస్క్ దాని స్థానం నుండి జారిపోయినప్పుడు ఇది జరుగుతుంది. ఈ డిస్క్ మృదువైన, జెల్లీ లాంటి నిర్మాణం, ఇది ఎముకలు ఒకదానికొకటి రాపిడి కాపాడుతుంది. ఎముకలు సజావుగా కదలడానికి కారణం అవుతుంది. ఈ డిస్క్ పగిలిపోయినప్పుడు లేదా దాని స్థానం నుండి జారిపోయినప్పుడు అది సమీపంలోని నరాలపై ఒత్తిడి తెస్తుంది, దీని కారణంగా నడుము నుండి పాదాల వరకు తీవ్రమైన నొప్పి, తిమ్మిరి,  బలహీనత వంటి సమస్యలు వస్తాయి. కారణాలు.. డిస్క్ జారిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిలో కొన్ని  రోజువారీ అలవాట్లకు సంబంధించినవి, అతి పెద్ద కారణం కూర్చోవడం లేదా తప్పు మార్గంలో వంగడం. దీనితో పాటు బరువైన వస్తువులను, ముఖ్యంగా తప్పు మార్గంలో ఎత్తడం వల్ల, డిస్క్ పై అదనపు ఒత్తిడి పడుతుంది. వయస్సు పెరగడం కూడా ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే వయస్సుతో డిస్క్ బలం తగ్గడం ప్రారంభమవుతుంది. ఊబకాయం, వ్యాయామం లేకపోవడం,  కొన్నిసార్లు ఆకస్మిక గాయాలు కూడా డిస్క్ జారిపోవడానికి కారణం అవుతాయి. స్లిప్ డిస్క్ సంకేతాలు.. నడుము,  వెన్నునొప్పి స్లిప్ డిస్క్ కు సంబంధించినదా కాదా అని తెలుసుకోవడానికి సరైన లక్షణాలను గుర్తించాలి. అత్యంత సాధారణ లక్షణం ఎప్పుడూ  తీవ్రమైన నొప్పి కలిగి ఉండటం. ఇది నడుము నుండి ప్రారంభమై కాళ్ళ వరకు వెళుతుంది. దీనిని సయాటికా అని కూడా అంటారు. దీనితో పాటు, చాలా మందికి కండరాలలో తిమ్మిరి, జలదరింపు లేదా బలహీనత కూడా అనిపించవచ్చు. అలాగే, కూర్చోవడం, నిలబడటం లేదా నడవడంలో ఇబ్బంది ఉన్నా,  లక్షణాలు ఎక్కువసేపు కొనసాగినా వైద్యుని వద్దకు వెళ్లడం మంచిది. స్లిప్ డిస్క్ ఎవరికి వచ్చే ప్రమాదం ఉంటుంది? శారీరక శ్రమలకు తక్కువ ప్రాముఖ్యత ఇచ్చే లేదా గంటల తరబడి ఒకే స్థితిలో కూర్చునే ఐటీ నిపుణులు, డ్రైవర్లు,  కార్యాలయ ఉద్యోగులు వంటి వారిలో స్లిప్ డిస్క్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమస్య భారీ బరువులు ఎత్తే కార్మికులు లేదా అథ్లెట్లలో కూడా కనిపిస్తుంది. ముందు జాగ్రత్తలు.. స్లిప్ డిస్క్‌ రాకుండా ఉండాలంటే  దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం ముఖ్యం. మొదటగా సరైన పద్ధతిలో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. కుర్చీపై కూర్చున్నప్పుడు  వీపును నిటారుగా ఉంచాలి.  ప్రతి 30-40 నిమిషాలకు కాస్త అటు ఇటు నడవాలి. బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు  నడుముపై కాకుండా  మోకాళ్లపై ఒత్తిడి ఉంచాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్  చేయడం వల్ల  వెన్నెముక బలోపేతం అవుతుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...