LATEST NEWS
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారత నావికాదళానికి చెందిన ఒక కీలక సమాచారాన్ని పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చేరవేసిన వ్యవహారంలో 31 సంవత్సరాల వయసున్న నావికాదళ సైనికుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఆన్‌లైన్ హనీట్రాప్‌లో పడి, దేశ భద్రతకే ముప్పు వాటిల్లేలా వ్యవహరించిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రదీప్ ముఖర్జీ అనే వ్యక్తి గత 2014 సంవత్సరంలో భారత నావికాదళంలో నావికుడిగా రిక్రూట్ అయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు నావికా కమాండ్ పరిధిలో అతను విధులు నిర్వర్తిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కోయంబత్తూరులోని రెడ్ ఫీల్డ్స్‌లో ఉన్న ప్రముఖ నావికాదళ నాయకత్వ శిక్షణా సంస్థ అయిన ఐఎన్ఎస్ అగ్రానిలో మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ కోర్సు చేయడానికి ప్రదీప్ వెళ్లారు. అయితే కోర్సు ప్రారంభమైన కొద్ది రోజులకే ఏపీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అతడిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రదీప్ ముఖర్జీని ఒక పాకిస్తానీ మహిళా గూఢచారి సంప్రదించింది. అత్యంత చాకచక్యంగా వలపు వల పన్నిన ఆ మహిళా ఏజెంట్, క్రమంగా ఆ నావికుడితో సోషల్ మీడియాలో స్నేహం పెంచుకుంది. కొద్ది రోజుల్లోనే ఆన్‌‌లైన్ ప్రేమాయణంలో మునిగిపోయిన ప్రదీప్, ఆ మహిళా ఏజెంట్ కోరిన వెంటనే విశాఖపట్నం నావికా స్థావరానికి సంబంధించిన అత్యంత సున్నితమైన, రహస్య వివరాలను లీక్ చేయడం ప్రారంభించాడు. నావికాదళానికి చెందిన వ్యూహాత్మక ఆస్తులు, నౌకాదళ కదలికలు మరియు కీలకమైన ఆపరేషన్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ పాకిస్తానీ ఏజెన్సీకి చేరవేశాడు. సరిహద్దు గూఢచర్యం, ఉగ్రవాద ముఠాలు మరియు దేశ భద్రతను దెబ్బతీసే శక్తులపై నిరంతరం నిఘా ఉంచే ఆంధ్రప్రదేశ్ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) విభాగం, ప్రదీప్ యొక్క డిజిటల్ కదలికల్లో కొన్ని అనుమానాస్పద ఆనవాళ్లను గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన సీఐ అధికారులు అతడిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దేశ రహస్య సమాచారం శత్రు దేశాలకు వెళుతున్నట్లు స్పష్టమైన ఆధారాలు సేకరించిన తర్వాత, దర్యాప్తు అధికారులు నావికా దళ ఉన్నతాధికారుల నుంచి అరెస్టుకు అధికారిక అనుమతి పొందారు. శనివారం ఉదయం కోయంబత్తూరులోని ఐఎన్ఎస్ అగ్రాని ప్రాంగణం వద్దకు ఒక ప్రత్యేక సీఐ బృందం చేరుకుని ప్రదీప్ ముఖర్జీని అదుపులోకి తీసుకుంది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి స్థానిక పోలీసు అధికారులకు తక్షణ సమాచారం అందించారు. అనంతరం తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం ట్రాన్సిట్ వారెంట్ కోసం కోర్టులో హాజరుపరిచారు. శనివారం సాయంత్రం అతడిని విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయానికి తరలించి, మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద పరిచయాలు, హనీట్రాప్ పట్ల రక్షణ సిబ్బంది ఎంతటి అప్రమత్తంగా ఉండాలనేదానికి ఈ ఘటన ఒక పెద్ద హెచ్చరికగా నిలిచింది.       [ indian navy data leak, pakistani spy honeytrap, vizag naval base secret leak, ins agrani arrest, ap counter intelligence, navy sailor arrested, Telugu One, Telugu News ]  
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది. క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్ఫూర్తితో కన్నతండ్రినే హత్య చేసిన ఓ కొడుకు ఉదంతం బిహార్‌లో కలకలం రేపింది. బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. దర్వా గ్రామానికి చెందిన రఘువీర్ సాహ్ని, ఆయన కుమారుడు శివ్ శంకర్ మధ్య కొంతకాలంగా ఆస్తి, కుటుంబ విషయాలపై వివాదాలు కొనసాగుతున్నాయి. సూరత్‌లో నివసిస్తున్న శివ్ శంకర్.. తండ్రిపై కక్ష పెంచుకుని హత్యకు కుట్ర పన్నాడు. ఈ క్రమంలో సూరత్‌లో ‘దృశ్యం-3’ సినిమా చూసిన శివ్ శంకర్.. సినిమాలో చూపించినట్టుగా పోలీసులకు ఆధారాలు దొరకకుండా హత్య చేయాలని ప్లాన్ చేశాడు. సూరత్ నుంచి బయలుదేరే ముందే తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. అనంతరం రైలులో సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించి బిహార్‌లోని పటోరి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆటోలో గ్రామానికి వెళ్లి.. అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనుక తలుపు నుంచి లోపలికి ప్రవేశించాడు. గాఢ నిద్రలో ఉన్న తండ్రి రఘువీర్ సాహ్నిపై గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా అక్కడి నుంచి తిరిగి సూరత్‌కు బయలుదేరాడు. అయితే.. నిందితుడు ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఓ చిన్న తప్పిదం అతడి గుట్టును రట్టు చేసింది. పటోరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న శివ్ శంకర్.. అప్పటివరకు స్విచ్ ఆఫ్‌లో ఉన్న ఫోన్‌ను ఆన్ చేసి తన భార్యకు కాల్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ ఆఫ్ చేశాడు. ఈ కాల్ పోలీసులకు కీలక ఆధారంగా మారింది. కాల్ డేటా, మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు అతడి కదలికలను ట్రాక్ చేశారు. హత్య జరిగిన సమయంలో పటోరి ప్రాంతంలో అతడి ఫోన్ యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం సూరత్‌లో అతడి కదలికలను గుర్తించి అక్కడే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శివ్ శంకర్ తండ్రిని తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సినిమా తరహాలో పోలీసులను మోసం చేయాలని చూసిన నిందితుడు.. చివరకు ఒక్క ఫోన్ కాల్‌తో పోలీసులకు చిక్కాడు.           [ Drishyam 3, Bihar Murder, Father Murder, Son Kills Father, Samastipur Crime, Shivsankar, Raghuveer Sahni, Crime Thriller, Movie Inspired Murder, Axe Attack, Property Dispute, Murder Case, Police Investigation, Technical Surveillance, Call Data Record, Mobile Tower Location, Patouri Railway Station, Surat, Bihar Crime, Crime News ]  
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌‌లోని టెల్ అవీవ్ నగరానికి బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానాన్ని గాల్లోనే హైజాక్ చేసేందుకు, కూల్చివేసేందుకు యత్నించినట్లు తీవ్ర అనుమానాలు ఎదుర్కొంటున్న కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ  విచారణలో తన నేరాన్ని ఎట్టకేలకు అంగీకరించాడు. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో పథకం ప్రకారమే కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ దృష్టిని మరల్చి అతడిపై దాడి చేసినట్లు హమ్మామీ విచారణ అధికారుల ఎదుట ఒప్పుకున్నాడు. తనకు ఎలాంటి ప్రాణభయం లేదని అతడు నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించినప్పటికీ, ఈ భారీ ఉగ్ర కుట్ర వెనుక అసలు సూత్రధారులు ఎవరనే దానిపై భద్రతా బలగాలు లోతుగా ఆరా తీస్తున్నాయి. ఈ కుట్రకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో లేదా ఇరాన్‌తో ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా దేశాలకు చెందిన ప్రత్యేక నిఘా బృందాలు సంయుక్తంగా ముమ్మర దర్యాప్తు చేపట్టాయి. యూఏఈలో జన్మించిన హమ్మామీ కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఇతడి తండ్రి ఒమన్ దేశానికి చెందినవారు కాగా, తల్లి సిరియా దేశస్థురాలు. ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్‌‌లో ఉద్యోగంలో చేరడానికి ముందు హమ్మామీ ఒమన్, సిరియా, మొరాకో వంటి పలు దేశాలలో నివసించినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా సిరియాలో సుదీర్ఘకాలం పాటు భీకరంగా సాగిన అంతర్యుద్ధం సమయంలో అతడు అక్కడే ఉండటంతో, ఆ సమయంలోనే తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడై ఉంటాడని భద్రతా అధికారులు గట్టిగా అనుమానిస్తున్నారు. నిందితుడి సోషల్ మీడియా ఖాతాలను నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించగా, వాటిలో వేలాదిగా ఉగ్రవాద పూరిత సందేశాలు, అనుమానాస్పద పోస్టులు లభించినట్లు గుర్తించారు. అతనిలో బలపడిన మత తీవ్రవాద ధోరణులే ఈ విమాన ప్రమాద కుట్రకు ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం హమ్మామీని కస్టడీలోకి తీసుకుని విచారణను మరింత వేగవంతం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పన్నిన ఈ కుట్ర మూలాలను పూర్తిగా ఛేదించేందుకు ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు, అటు భద్రతా సంస్థలు రంగంలోకి దిగి పక్కా ఆధారాలు సేకరిస్తున్నాయి.        [ Flydubai hijacking, Hamam Al Hammami, co-pilot admit, Tel Aviv flight, international terror conspiracy, aviation security news,Smith Matcher, Hamam Al Hammami, Co-Pilot Attack, Cockpit Attack, Pilot Axe Attack, Dubai to Tel Aviv Flight, Benjamin Netanyahu, Indian Pilot, Mid-Air Attack, Flight Safety, Aviation Security, Flydubai News, Israel News ]  
ALSO ON TELUGUONE N E W S
సినిమా సెలబ్రిటీలపై ఏదైనా వార్త వస్తే.. నిజానిజాలు పూర్తిగా బయటకు రాకముందే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ మధ్య కొందరు ఆన్‌లైన్ రిపోర్టర్లు, మీడియా సంస్థలు సంచలనానికి ప్రాధాన్యత ఇస్తున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి వార్తలపై తీవ్రంగా స్పందించింది. తనకు సంబంధించినదిగా ప్రచారం జరుగుతున్న కొన్ని వార్తల్లో వాస్తవం లేదని రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది. అసలు తనకు సంబంధం లేని విషయాన్ని తనకు ఆపాదిస్తూ కొన్ని మీడియా కథనాలు ప్రచురించాయని ఆమె మండిపడింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా వార్తలను సంచలనాత్మకంగా మార్చడం బాధాకరంగా ఉందని పేర్కొంది. తన గురించి తప్పుడు, దురుద్దేశపూరితమైన, ఊహాజనిత కథనాలు ప్రచురించిన వాళ్లు వాటిని ఉపసంహరించుకుని వాస్తవాలను స్పష్టం చేయాలని డిమాండ్ చేసింది. తన కుటుంబ నేపథ్యం గురించి కూడా రకుల్ ఈ సందర్భంగా ప్రస్తావించింది. తాను ఆర్మ్‌డ్ ఫోర్సెస్ నేపథ్యం నుంచి వచ్చానని.. ఇండస్ట్రీలో తనకు ఎలాంటి గాడ్‌ఫాదర్ లేరని చెప్పింది. కేవలం తన కష్టంతోనే ఈ స్థాయికి వచ్చానని పేర్కొంది. బాధ్యత కలిగిన చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా 20 ఏళ్ల వయసు నుంచే తన పన్నులను సక్రమంగా చెల్లిస్తున్నానని తెలిపింది. అంతేకాదు.. తన వ్యక్తిగత సామర్థ్యంలో గానీ, ఏదైనా ప్రొడక్షన్ హౌస్ తరఫున గానీ ఎలాంటి అక్రమ విదేశీ నగదు బదిలీల్లో తాను పాల్గొనలేదని రకుల్ స్పష్టం చేసింది. ఇక్కడితో ఆగకుండా.. తన పేరుతో దేశంలో కానీ, విదేశాల్లో కానీ ఎలాంటి బినామీ ఆస్తులు లేవని కూడా తేల్చిచెప్పింది. తనకు ఎవరూ ఎప్పుడూ ఖరీదైన ఆస్తులను గిఫ్ట్‌గా ఇవ్వలేదని.. తాను కూడా ఇలాంటి ఖరీదైన బహుమతులను స్వీకరించడాన్ని అంగీకరించనని చెప్పింది. మీడియా సంస్థలకు కూడా రకుల్ ఒక సూచన చేసింది. ప్రతి మీడియా సంస్థకు, ముఖ్యంగా పెద్ద సంస్థలకు కూడా వాణిజ్యపరమైన ఒత్తిళ్లు ఉంటాయని తాను అర్థం చేసుకోగలనని చెప్పింది. కానీ ఆ ఒత్తిడి వాస్తవాల ఖర్చుతో ఉండకూడదని పేర్కొంది. ముఖ్యంగా ఒక వ్యక్తి ప్రతిష్ఠ, జీవనోపాధి దెబ్బతినేలా వార్తలు ఉండకూడదని స్పష్టం చేసింది. కొన్నేళ్లుగా రకుల్ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రైడ్స్ సమయంలో.. విదేశీ నగదు బదిలీ స్కాంలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అలాగే, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఆమెకు ఖరీదైన ఆస్తులను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు కూడా గతంలో వార్తలు షికార్లు చేశాయి. వీటన్నింటికీ ఒక్క పోస్ట్ తో చెక్ పెట్టే ప్రయత్నం చేసింది రకుల్. ఇది కూడా చదవండి: 'బ్లడీ రోమియో' హీరోయిన్ విషయంలో ట్విస్ట్.. మీనాక్షి స్థానంలో ప్రీతీ ముకుందన్.! https://www.instagram.com/p/DeGdfNeKvhl/       [Rakul Preet Singh On IT Raids, Rakul Preet Singh Reaction On Expensive Gifts, Rakul Preet Singh Insta Post, Rakul Preet Singh Instagram, Rakul Preet Singh IT Raids, Rakul Preet Singh, Telugu Film News]  
వారణాసి నుంచి కొత్త అప్డేట్ ఏమైనా వస్తుందేమో అని ఎదురుచూస్తున్న అభిమాన ఆశావహులకి లెక్కే లేదు. ఈ నేపథ్యంలో మహేష్ సరసన జోడి కట్టబోయే హీరోయిన్ ఈమెనే అంటూ ఒక న్యూస్ వైరల్ గా మారింది.  డైసీ జెస్సికా ఎడ్గర్ జోన్స్..ప్రముఖ బ్రిటిష్ నటి.. తన అద్భుతమైన నటనతో ప్రపంచ సినీ ప్రేమికులని తన వైపు తిప్పుకున్న భామ. వారణాసిలో వన్ హాఫ్ హీరోయిన్ గా కనిపించబోతునట్టుగా టాక్. అంతటితో ఆగకుండా  మహేష్ బాబు, జెస్సికా  మధ్య కొన్ని ఎమోషనల్ తో పాటు కీలకమైన సీన్స్ రాబోతున్నాయని, వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ పై ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చాలా గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో డైసీ  పేరు వినిపించడం ఇది మొదటిసారి ఏమీ కాదు. గ్లోబల్ బ్లాక్‌బస్టర్ హిట్  'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్ సరసన 'జెన్నీ'క్యారక్టర్  కోసం ముందుగా ఈ బ్రిటిష్ సుందరినే ఎంపిక చేశారు. అయితే ఆ సమయంలో డేట్స్ కుదరకపోవడంతో    తప్పుకోవాల్సి వచ్చింది.మరి ఇప్పుడైనా మహేష్ తో జోడి కడుతుందేమో చూడాలి.   ఇది కూడా చదవండి: వెంకటేష్ సినిమాలో స్టార్ డైరెక్టర్: ఎవరో తెలిస్తే షాక్ అవుతారు! మరి 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో ప్రియాంక చోప్రా లాగానే డైసీ ఉండాలని కోరుకుందాం.      [Daisy Edgar Jones In Varanasi, Varanasi Movie, Mahesh Babu, SS Rajamouli, Daisy Edgar Jones, SSMB29 Updates, Varanasi Hollywood Actress, Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]    
Kiran Abbavaram is making his directorial debut with Reality, which was earlier announced as #KA13. The makers have now unveiled the title glimpse, offering a glimpse into the world of the movie and the character played by Kiran. Kiran plays Anandam, an earnest young man who manages a hotel and puts his family first. His biggest happiness comes from clearing his family debts, giving the character a relatable middle-class backdrop. The glimpse also showcases simple family moments, including a heartwarming sequence around making papads on a terrace. The movie features Devika Bhat as the female lead, while veterans like Sharat Kumar, Sai Kumar, Rohini and Annapurnamma are part of the cast. Sudharshan is also seen in a key role. Bheems Ceciroleo is composing the music, and he used popular bhajan Bhaja Govindam in the glimpse to enhance the feel. Produced by Sudhakar Chaganti, Reality is currently being shot in Machilipatnam, with the ongoing schedule expected to wrap up the final portions. The movie is gearing up for a worldwide theatrical release on December 25, during the Christmas holiday season.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో వస్తున్న ‘బ్లడీ రోమియో’పై మొదటి నుంచీ మంచి హైప్ ఉంది. ముఖ్యంగా నాని ఇందులో చెఫ్ కమ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడనే కాన్సెప్ట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇక ఈ సినిమాకు హీరోయిన్ ఎవరనే విషయంలో ఇప్పటివరకు రకరకాల పేర్లు వినిపించాయి. ముందుగా ‘బ్లడీ రోమియో’లో నాని సరసన మీనాక్షి చౌదరి నటించబోతుందని ప్రచారం జరిగింది. ఇటీవలే ఆమెను ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో నాని, మీనాక్షి జోడీ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ విషయంలోనే ట్విస్ట్ వచ్చినట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. మీనాక్షి చౌదరి స్థానంలో ‘ప్రీతీ ముకుందన్’ పేరు తెరపైకి వచ్చింది. సుజీత్ డిజైన్ చేసిన పాత్రకు మీనాక్షి కంటే ప్రీతీ ముకుందన్ బాగా సెట్ అవుతుందని మేకర్స్ భావించినట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ప్రీతీనే హీరోయిన్‌గా దాదాపు ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ప్రీతీ ముకుందన్ విషయానికి వస్తే.. ఈ మధ్య కాలంలో వరుస అవకాశాలతో సౌత్‌లో బిజీ అవుతున్న యంగ్ హీరోయిన్. ఇప్పటికే తమిళం, మలయాళంతో పాటు తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటోంది. నాని లాంటి స్టార్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలో ఛాన్స్ రావడం ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ అనే చెప్పాలి. మరోవైపు ‘బ్లడీ రోమియో’ మామూలు యాక్షన్ సినిమా కాదని మొదటి నుంచీ మేకర్స్ హింట్ ఇస్తున్నారు. నాని పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన యానిమేటెడ్ ప్రమోలో ఆయనను ‘నంబర్ వన్ చెఫ్ అండ్ గ్యాంగ్‌స్టర్’గా పరిచయం చేశారు. యాక్షన్, డార్క్ హ్యూమర్, ఫన్, లవ్ కలిసిన స్టైలిష్ కథగా ఈ సినిమాను సుజీత్ తెరకెక్కించబోతున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఎంట్రీ నిజమైతే సినిమాకు మరో క్రేజీ అట్రాక్షన్ యాడ్ అయినట్టే. నాని, పృథ్వీరాజ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో పెరుగుతోంది.  ‘బ్లడీ రోమియో’ రెగ్యులర్ షూటింగ్ ఈ అక్టోబర్‌లో ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. హైదరాబాద్‌తో పాటు లండన్, యూకేలోని ఇతర ప్రాంతాలు, ఢిల్లీలో కీలకమైన షెడ్యూల్స్ ఉండనున్నాయి. లండన్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇది కూడా చదవండి: రణబాలి టికెట్ రేట్ల పెంపు.. మేకర్స్ కీలక ప్రకటన.!       [Preity Mukhundhan In Bloody Romeo, Bloody Romeo Movie, Preity Mukhundhan, Natural Star Nani, Director Sujeeth, Meenakshi Chaudhary, Nani Next Movie, Telugu Film News]    
The release plans of Venkatesh and Trivikram Srinivas’ Aadarsha Kutumbam AK-47 are reportedly undergoing a change. The film, which was being lined up for an October 9 release, is said to be heading for a postponement, with October 30 now being discussed as the new release date. According to reports, the team needs more time to complete the post-production work and is unlikely to meet the October 9 deadline. The makers have reportedly informed distributors about their plans to target October 30, although an official announcement is yet to be made. The latest development has not gone down well with Venkatesh fans. They have been attacking Naga Vamsi and producer China Babu of Haarika Hassine Creations for wasting Venkatesh time. They are further criticising the rushed completion and delayed execution without proper planning to release the movie on time from the beginning.  For now, October 30 is said to be the date being considered by the team. If the reports turn out to be true, Aadarsha Kutumbam team will be looking at losing the lucrative Dasara holiday period. Naga Vamsi is said to be meeting press to address the issue very soon.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
అభిమానులు, సినీ ప్రేమికుల మైండ్ లో స్టిల్ ఈ సెకను కూడా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ల్యాండ్ కాబోతున్న అనిల్ రావిపూడి, వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతూనే ఉంటుంది. దీన్ని బట్టి ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏర్పర్చుకున్న స్థానం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.  ఇప్పుడు తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందబోయే కొత్త చిత్రానికి సంబంధించి టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా అనిల్ రావిపూడి తన సినిమాల్లో కామెడీ టైమింగ్ ఉన్న నటులను మాత్రమే కాకుండా, ప్రముఖ నటీనటులతో పాటు ఇతర దర్శకులను కూడా నటులుగా ప్రెజెంట్ చేయడానికి ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆయన రాబోయే నూతన ప్రాజెక్ట్‌లో  డైరెక్టర్ అనుదీప్ ఒక కామెడీ రోల్ లో చేయబోతున్నాడనే న్యూస్ తనని అందరూ చదవాలి, గుర్తించాలి అన్నట్టుగా తెగ చక్కర్లు కొడుతుంది. కథని మలుపు తిప్పే రోల్‌ అని కూడా టాక్.  ఇది కూడా చదవండి: సూపర్ స్టార్ సరసన శ్రీలీల: బాక్స్ బద్దలే!      ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో అనుదీప్ నటుడుగా తన సత్తా చాటుతున్నాడు. గత నెలలో వచ్చిన రోమాంచకం మూవీలో కూడా కీ రోల్ లో కనపడి నవ్వులు పూయించాడు.  ఇక అనిల్ రావిపూడి సినిమా విషయానికి వస్తే తన గత చిత్రాల రికార్డుకి భారీగానే సెండ్ హాఫ్  చెప్పాలనే పట్టుదలతో ఉన్నాడు. మరి నెక్స్ట్ సంక్రాంతి కూడా తనదే అవుతుందో లేదో చూడాలి.     [Anudeep In Anil Ravipudi And venkatesh Movie,Anil Ravipudi, Anil Ravipudi New Movie, Tollywood Cinema News, Anil Ravipudi Next Project, Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]      
పెద్ద సినిమా వస్తుందంటే చాలు.. టికెట్ రేట్లు పెరుగుతాయనే చర్చ మొదలవుతోంది. ముఖ్యంగా పండుగ సీజన్‌లో భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుంటే.. టికెట్ ధరల పెంపుపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ‘రణబాలి’ విషయంలోనూ అదే జరిగింది. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘రణబాలి’ టికెట్ రేట్లు పెంచబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు పెంచుకునేందుకు మేకర్స్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారనే టాక్ బాగా వైరల్ అయింది. దీంతో ‘రణబాలి’ చూడాలంటే జేబుకు కాస్త ఎక్కువే చిల్లు పడుతుందేమోనని ప్రేక్షకులు భావించారు. మరీ పండుగ సీజన్ కావడంతో టికెట్ ధరల పెంపుపై ఈ చర్చ మరింత పెరిగింది. అయితే ఈ వార్తలకు చిత్ర బృందం తాజాగా చెక్ పెట్టింది. టికెట్ రేట్ల పెంపు కోసం తాము ఎలాంటి దరఖాస్తు చేయలేదని మేకర్స్ స్పష్టం చేశారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ టికెట్ ధరలు పెంచేందుకు ఎలాంటి అనుమతి కోరలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పారు. అంతేకాదు.. ‘రణబాలి’ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణ టికెట్ ధరలతోనే థియేటర్లలోకి రానుందని మేకర్స్ తెలిపారు. పండుగ సీజన్‌లో ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే స్టాండర్డ్ ధరలకు రిలీజ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘ఆదర్శ కుటుంబం’ మళ్ళీ వాయిదా.. నాగవంశీ క్లారిటీ ఇచ్చిన 3 రోజులకే షాక్.! https://x.com/MythriOfficial/status/2106750362942165218       [No Ticket Hike for Ranabaali, Ranabaali Ticket Hike, Ranabaali Movie, Vijay Rashmika Movie, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Mythri Movie Makers, Telugu Film News]  
  శ్రీలీల కాలు కదిపితే ఏమవుతుందో తెలిసిందే. బాక్స్ లు బద్దలవ్వడమే. అంతలా తన డాన్స్ తో సెల్యులాయిడ్ ని షేక్ చేసి పడేస్తుంది. ఆ కనువిందు స్పెషల్ సాంగ్స్ తో కూడా కలిగిస్తాననే మాట ఇచ్చి 'పుష్ప 2 ' లో దెబ్బలు పడతాయిరో అంటూ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని రఫ్ఫాడించింది.  ఇప్పుడు ఈ భామ  రజనీకాంత్ నో కలిసి చిందేయనుంది. రజినీ  ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’ షూటింగ్ ప్రస్తుతం మైసూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా, తాజాగా మైసూర్ షూటింగ్ షెడ్యూల్‌కి సంబంధించిన కొన్ని విజువల్స్, లీక్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.  ఈ దృశ్యాలలో శ్రీలీల కనిపించడంతో నెటిజన్లు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అందరూ అనుకున్నట్లుగా శ్రీలీల ఇందులో కేవలం ఒక చిన్న పాత్రలోనో లేదా సెకండ్ హీరోయిన్‌గానో నటించడం లేదని, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలసి ఒక హై-వోల్టేజ్ ఊరమాస్ స్పెషల్ సాంగ్‌లో మెరిసిపోనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం.      శ్రీలీల మరోసారి భారీ ప్రాజెక్ట్‌లో మాస్ ఐటమ్ నంబర్‌కు సైన్ చేయడం విశేషం.   ఈ మాస్ నంబర్‌కు తమిళ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. తలైవా మాస్ మేనరిజమ్స్, శ్రీలీల అద్భుతమైన డాన్స్ స్టెప్పులు ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మైసూర్‌లో చిత్రీకరించిన ఈ ప్రత్యేక గీతం షూటింగ్‌లో రజనీకాంత్, శ్రీలీలలతో పాటు యంగ్ హీరో రామ్ పోతినేని, అలాగే రాశీ ఖన్నా కూడా పాల్గొనడం ఈ పాటపై ఉన్న క్యూరియాసిటీని మరింత పెంచేసింది. సాధారణంగా రజనీకాంత్ సినిమాల్లో నటించడం అంటే ప్రతీ ఆర్టిస్ట్‌కు ఒక కల. అందుకే శ్రీలీల కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి పట్టుదలకు పోకుండా, సూపర్ స్టార్ సినిమా కావడం, పవర్ ఫుల్ కాంబినేషన్ కుదరడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.   అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను లోకనాయకుడు కమల్ హాసన్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే.     ]Sreeleela Special Song Rajinikanth Dharman Movie, Sreeleela, Rajinikanth, Dharman Movie, Sreeleela Special Song, Anirudh Ravichander,kamal Haasan, Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
నాన్ వెజ్ ప్రియులకు చికెన్ కర్రీ పేరు వింటేనే నోరూరిపోతుంది. వారాంతాల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో ఇళ్లలో రకరకాల మసాలాలు నూరి చికెన్ కూరను ఎంతో రుచిగా వండుతుంటారు. అయితే కేవలం రుచి కోసమే కాకుండా, మన ఆరోగ్యానికి, ముఖ్యంగా కంటి చూపుకు చికెన్ కర్రీ అద్భుతమైన ఔషధంగా మారుతుందంటే మీరు నమ్ముతారా? సాధారణంగా మనం వంటకాల్లో సువాసన కోసం వాడే కరివేపాకును చాలామంది తినేటప్పుడు పక్కన పడేస్తుంటారు. కానీ, చికెన్ కర్రీ వండేటప్పుడు కరివేపాకులను ధారాళంగా ఉపయోగించి తింటే కంటి చూపు మెరుగుపడి, కాలక్రమేణా కళ్ళజోడు వాడాల్సిన అవసరమే రాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చికెన్‌లో శరీరానికి అవసరమైన అత్యధిక నాణ్యత కలిగిన ప్రొటీన్లతో పాటు విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రత్యేకించి చికెన్‌లో లభించే విటమిన్ A, విటమిన్ B3 (నియాసిన్), మరియు విటమిన్ B6 కంటి ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. మన కంటిలోని రెటీనా కాంతిని సరిగ్గా గ్రహించి స్పష్టమైన ప్రతిబింబాన్ని ఏర్పరచడానికి విటమిన్ A ప్రాథమిక మూలకం. శరీరంలో విటమిన్ A లోపిస్తే రేచీకటి, కళ్ళు పొడిబారడం (డ్రై ఐస్) వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. చికెన్ కర్రీలోని పోషకాలు కంటి నరాలకు బలాన్ని చేకూర్చి, కంటి కండరాలు అలసిపోకుండా కాపాడతాయి. ఇక కరివేపాకు విషయానికి వస్తే, ఇది కంటి చూపును మెరుగుపరిచే ఒక సహజమైన దివ్యౌషధం. కరివేపాకులో విటమిన్ A, విటమిన్ C మరియు విటమిన్ E తో పాటు ల్యూటిన్, జియాజంతిన్ మరియు కెరోటినాయిడ్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సిడేటివ్ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. వయస్సు పెరగడం వల్ల వచ్చే మెక్యులర్ డిజెనరేషన్, క్యాటరాక్ట్ (కంటి శుక్లాలు) మరియు రేచీకటి వంటి సమస్యలు రాకుండా నిరోధించడంలో కరివేపాకులోని పోషకాలు అద్భుతంగా పనిచేస్తాయి. చికెన్ మరియు కరివేపాకు కలయిక వల్ల విటమిన్ A మరియు యాంటీఆక్సిడెంట్ల లభ్యత రెట్టింపై కంటి ఆరోగ్యానికి అత్యంత మేలు జరుగుతుంది. మరి ఈ అద్భుతమైన కాంబినేషన్ ప్రయోజనాలు పూర్తిగా పొందాలంటే చికెన్ కర్రీని ఎలా వండుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. చికెన్ వండేటప్పుడు నూనెలో కేవలం పోపు కోసం మాత్రమే కాకుండా, గణనీయమైన పరిమాణంలో కరివేపాకులను వేసి మగ్గనివ్వాలి. వీలైతే కరివేపాకును లేతగా ఉన్నప్పుడే సేకరించి, పేస్ట్‌గా నూరి లేదా పొడి చేసి చికెన్ మసాలాలో కలిపి వండుకోవచ్చు. దీనివల్ల కరివేపాకును ఏరి పక్కన పడేసే అవకాశం ఉండదు మరియు అందులోని పోషకాలన్నీ కర్రీ రసంలోకి ఇంకి శరీరానికి సంపూర్ణంగా అందుతాయి. అంతేకాకుండా చికెన్ వండేటప్పుడు విపరీతంగా నూనె, ఘాటైన మసాలాలు వాడకుండా పరిమితంగా ఉపయోగిస్తే పోషక విలువలు దెబ్బతినకుండా ఉంటాయి. ఆధునిక డిజిటల్ యుగంలో గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మరియు స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లను చూడటం వల్ల పిల్లల నుండి పెద్దల వరకు అందరిలో కంటి అలసట, మంటలు, కళ్ళు పొడిబారడం మరియు చిన్న వయస్సులోనే సైట్ రావడం సర్వసాధారణమైపోయింది. ఇటువంటి తరుణంలో కంటికి అవసరమైన క్యారెట్లు, ఆకుకూరలతో పాటు చికెన్ కరివేపాకు కాంబినేషన్‌ను క్రమం తప్పకుండా వారంలో కనీసం ఒకట్రెండు సార్లు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కంటి నరాల బలహీనత తగ్గి కంటి చూపు మెరుగవుతుంది. క్రమశిక్షణతో కూడిన ఈ ఆహారపు అలవాట్లతో కళ్ళజోడు ధరించే అవసరం లేకుండా సులభంగా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.     Secret Chicken Curry Ingredient Vision, Improve Eyesight Naturally Foods, Chicken Curry Healthy Additions, Foods to Sharpen Vision Fast, Nutritional Eye Health Recipe.  
మన ఆరోగ్యానికి, శరీర బలానికి ఆహారమే ప్రాథమిక మూలాధారం. సాధారణంగా ఎముకల బలానికి పాలు, శరీర పోషణకు గుడ్లు తప్పనిసరి అని మనమందరం భావిస్తుంటాము. కానీ, మన సాంప్రదాయ ధాన్యాలైన రాగులు మరియు నల్ల శెనగలలో పాలు, గుడ్ల కంటే ఏకంగా 5 రెట్లు ఎక్కువ క్యాల్షియం మరియు అత్యంత సమృద్ధిగా పోషకాలు లభిస్తాయని తెలుసా? ప్రాచీన కాలంలో మన పూర్వీకులు రోజూ ఈ ధాన్యాలను తమ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్లనే రూపంలోనూ, శారీరక దృఢత్వంలోనూ ఎంతో బలంగా, ఆరోగ్యానందంగా జీవించగలిగారు. నేటి ఆధునిక జీవనశైలిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు, ఎముకల బలహీనత మరియు నరాల నిస్సత్తువ వేధిస్తున్న తరుణంలో రాగులు, నల్ల శెనగలను రోజూ తీసుకోవడం ద్వారా వీటన్నింటికీ నాచురల్ పరిష్కారం లభిస్తుంది. రాగుల విశిష్టత విషయానికి వస్తే, ఇందులో క్యాల్షియం పరిమాణం సాధారణ పాలతో పోలిస్తే 5 రెట్లు అధికంగా ఉంటుంది. ఎముకలను ఉక్కులా మార్చడంలో ఇది ఒక సూపర్ ఫుడ్‌లా సహాయపడుతుంది. రాగులను రోజుకు రెండు పూటలా తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. విశేషంగా ఉదయం పరగడుపున అలాగే మధ్యాహ్న సమయంలో రాగి సంకటి లేదా రాగి అంబలి రూపంలో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన సమగ్ర పోషణ సులభంగా అందుతుంది. రాగులలో ఉండే ప్రత్యేక పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా, జీర్ణక్రియ పనితీరును వేగవంతం చేసి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే రాగులను సరిగ్గా నానబెట్టి ఆహారంగా తీసుకున్నప్పుడే అందులోని పోషకాలన్నీ మన శరీరానికి సంపూర్ణంగా లభిస్తాయి. మరొకవైపు నల్ల శెనగలు పోషకాల ఘనిగా పనిచేస్తాయి. నల్ల శెనగలను ఉడకబెట్టి గానీ లేదా వేయించుకుని గానీ తినవచ్చు, అలాగే పొడి రూపంలో కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. నల్ల శెనగలు గుండె పనితీరును మెరుగుపరచడంలో అద్భుతంగా తోడ్పడతాయి. గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరకుండా కాపాడటంతో పాటు నరాల బలహీనతతో బాధపడేవారికి ఇది గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. చర్మాన్ని వివిధ రకాల సమస్యలు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించి నిగారింపును అందించడంలో కూడా నల్ల శెనగలలోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. రోజూ వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు ఉక్కులా మారడమే కాక, రోగనిరోధక శక్తి పెరిగి శరీరం రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. నేటి బిజీ లైఫ్‌స్టైల్‌లో ఖరీదైన సప్లిమెంట్ల వెనుక పడకుండా, మన పూర్వీకులు అందించిన రాగి సంకటి, రాగి అంబలి, నానబెట్టిన లేదా ఉడకబెట్టిన నల్ల శెనగలను మన దైనందిన ఆహారంలో చేర్చుకోవడం ఎంతైనా అవసరం. రోజుకు రెండు పూటలా ఈ ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని సరైన పద్ధతిలో తీసుకుంటే ఎముకల బలహీనత, నరాల నీరసం, గుండె సమస్యలు మరియు జీర్ణకోశ సమస్యలకు స్వస్తి చెప్పి సంపూర్ణ ఆరోగ్యాన్ని సులభంగా సొంతం చేసుకోవచ్చు.     Ragi Sangati Health Benefits, Black Chickpeas Benefits Nalla Senagalu, Ragi Sangati and Kala Chana, South Indian Superfood Combo, Ragi Sangati Weight Loss Diabetes.
నేటి ఆధునిక కాలంలో మహిళలను అత్యంత వేగంగా మరియు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్ మొదటి వరుసలో నిలుస్తోంది. రొమ్ము క్యాన్సర్ అనగానే చాలామందికి వెంటనే గుర్తొచ్చేది కేవలం రొమ్ములో ఏర్పడే గడ్డలు లేదా భరించలేని తీవ్రమైన నొప్పి మాత్రమే. అయితే వైద్య రంగంలో ఎంతగానో అవగాహన పెరుగుతున్నప్పటికీ, నేటికీ ఎంతోమంది మహిళలు కేవలం గడ్డలు, నొప్పి ఉంటేనే క్యాన్సర్ అని భావిస్తూ తీవ్రమైన పొరపాటు పడుతున్నారు. కానీ క్యాన్సర్ నిపుణులు మరియు ప్రముఖ వైద్యులు స్పష్టం చేస్తున్న విషయమేమిటంటే, రొమ్ము క్యాన్సర్ ప్రారంభ దశలో అసలు ఎటువంటి నొప్పిగానీ, ముట్టుకుంటే తెలిసే గడ్డలుగానీ ఉండాల్సిన అవసరం లేదు. ఎటువంటి శారీరక రుగ్మతలు లేకుండా మహిళలు చాలా ఆరోగ్యంగా ఉన్నారని భావించే సమయంలో కూడా లోపల క్యాన్సర్ కణాలు నిశ్శబ్దంగా విస్తరించే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి మహిళా తన శరీరంలో జరిగే సూక్ష్మమైన, నిశ్శబ్ద మార్పులను కూడా నిశితంగా గమనించడం అత్యంత ముఖ్యం. క్యాన్సర్ వ్యాప్తిని ప్రతిబింబించే ప్రధానమైన మరియు దాగి ఉన్న 5 దాగి ఉన్న హెచ్చరిక సంకేతాలను తెలుసుకోవడం ప్రాణరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. మొదటిది, చంక భాగంలో లేదా కాలర్ బోన్ (ఎముక) దగ్గర అకస్మాత్తుగా కనిపించే వాపులు లేదా గడ్డలు. రొమ్ము భాగంలో ఎటువంటి మార్పులు లేదా నొప్పి కనిపించకపోయినా, రొమ్ము క్యాన్సర్ కణాలు అత్యంత వేగంగా సమీపంలోని లింఫ్ నోడ్స్‌కు వ్యాపిస్తాయి. దీనివలన చంక భాగంలో చిన్నపాటి గడ్డలు లేదా వాపులు ఏర్పడతాయి. వీటిని సాధారణ అలసట లేదా చిన్న ఇన్ఫెక్షన్ అని నిర్లక్ష్యం చేయడం చాలా ప్రమాదకరం. రెండవది, రొమ్ము చర్మం యొక్క ఆకృతిలో వచ్చే మార్పులు. రొమ్ముపై ఉండే చర్మం ఒక్కసారిగా గుంటలు పడటం, చర్మం గరుకుగా మారడం, మందంగా అవ్వడం లేదా నారింజ పండు తొక్క రూపంలోకి మారడం క్యాన్సర్ తీవ్రతను సూచించే బలమైన సంకేతం. చర్మంలో వచ్చే ఈ విధమైన మార్పును మెడికల్ పరిభాషలో చాలా కీలకమైన హెచ్చరికగా భావిస్తారు. మూడవది, నిపుల్స్ అమరికలో వచ్చే అకస్మాత్తు మార్పులు. సహజంగా బయటకు కనిపించే నిపుల్స్ సడన్‌గా లోపలికి ముడుచుకుపోవడం లేదా వాటి రూపురేఖలు మారిపోవడం గమనిస్తే తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి. నాల్గవ అత్యంత కీలకమైన సంకేతం, నిపుల్స్ నుండి అసాధారణంగా ద్రావణాలు విడుదల కావడం. ఎటువంటి ఒత్తిడి లేదా పిండటం లేకుండానే దానంతట అదే రక్తం, నీరు లేదా పసుపు రంగు స్రావాలు కారడం గమనిస్తే దీనిని ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు. ఐదవ సంకేతం, రొమ్ము పరిమాణం మరియు ఆకారంలో సడన్‌గా వచ్చే తేడాలు. సాధారణంగా రెండు రొమ్ములు పూర్తి స్థాయిలో ఒకేలా ఉండవు, అది సహజమే. కానీ హఠాత్తుగా ఒక రొమ్ము మాత్రమే అసాధారణంగా పెద్దదిగా మారడం, భరించలేని బరువుగా అనిపించడం లేదా వీడని వాపు రావడం జరిగితే ఖచ్చితంగా వైద్య పరీక్షలు అవసరం. చాలామంది మహిళలు నొప్పి ఉంటేనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలని అనుకుంటారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రాథమిక దశల్లో క్యాన్సర్ కణాలు నొప్పిని కలిగించవు. అందుకే ప్రతి మహిళ నెలకు కనీసం ఒకసారైనా ఇంట్లోనే స్వయం రొమ్ము పరీక్ష (సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్) చేసుకోవడం ద్వారా తమ రొమ్ముల సాధారణ ఆకారాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇంటర్నెట్‌లో అరకొర సమాచారం వెతికి భయాందోళనకు గురికాకుండా, ఏ చిన్న అనుమానాస్పద మార్పు కనిపించినా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి మమోగ్రామ్ లేదా స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ప్రాథమిక దశలోనే ముందస్తుగా గుర్తించడమే రొమ్ము క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకోవడానికి ఏకైక మార్గం.     Is Cancer Always Painful, Painless Cancer Symptoms Women, Early Cancer Warning Signs, Women Cancer Awareness Facts, Silent Cancer Symptoms.
ఉదయాన్నే  పరగడుపున టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. రోజును చురుగ్గా ప్రారంభించడానికి కాఫీ, టీ లు తాగుతూ ఉంటారు.  అయినప్పటికీ ఇవి శరీరంలో  అసిడిటీ, హార్మోన్ల అసమతుల్యత , ఇతర జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. వీటి స్థానంలో శరీరాన్ని చురుగ్గా ఉంచుతూనే శరీరంలో ఉన్న అనారోగ్యాలను, జబ్బులను, ఇబ్బందులను తగ్గించగల పానీయం తాగడం చాలా మంచిది.  ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు తొలగిపోవడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంతకీ అంత శక్తివంతమైన ఆ పానీయం ఏమిటో? దాన్ని ఎలా తయారుచేసుకుని తాగాలో.. వివరంగా తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. ధనియాలు,  జీలకర్ర,  సోంపు ,  వాము  పైన పేర్కొన్న దినుసులలో ఆరోగ్యానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ​తయారీ విధానం... ఈ పానీయాన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని తీసుకుని మరిగించాలి. అందులో అర టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు , పావు టీస్పూన్ వాము వేయాలి. ఈ మిశ్రమాన్ని నీరు సగం అయ్యేంత వరకు చిన్న మంటపై బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. రుచి కోసం లేదా అదనపు ఆరోగ్య ప్రయోజనాల కోసం కాస్త నిమ్మరసం లేదా తేనె కూడా కలపవచ్చు. ఈ పానీయం తాగడం వల్ల శరీరానికి కలిగే  ఉపయోగాలు.. ​హార్మోన్ల సమతుల్యత.. మహిళల్లో ఎదురయ్యే థైరాయిడ్, పిసిఓడి , పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం  వంటి సమస్యలకు ఈ పానీయం చాలా మేలు చేస్తుంది. ధనియాలు , సోంపు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడతాయి. ​జీర్ణవ్యవస్థ మెరుగుదల.. జీలకర్ర , వాము జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ , మలబద్ధకం వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ​రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి ఈ పానీయం సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గేందుకు సహాయం.. శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో జీలకర్ర , వాము కీలక పాత్ర పోషిస్తాయి. క్రమం తప్పకుండా ఈ పానీయం తాగడం ద్వారా శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ​చర్మ సౌందర్యం , డిటాక్సిఫికేషన్.. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఫలితంగా చర్మంపై మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం సహజంగా మెరుస్తుంది. ​కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం.. ఈ పదార్థాల్లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు , వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ​ఈ డిటాక్స్ డ్రింక్‌ను ప్రతిరోజూ ఉదయం పరగడుపున క్రమం తప్పకుండా తాగడం ద్వారా శరీరంలో సహజమైన మార్పులను గమనించవచ్చు. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా ఈ నేచురల్  పానీయాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా శరీరంలో చాలా మార్పులు గమనించవచ్చు.                       *రూపశ్రీ.
గొంతుకు, గడ్డానికి మధ్య భాగంలో , గడ్డానికి కింద చర్మం, కండర కణజాలం పెరిగి.. గొంతు, గడ్డం ఏకం అయినట్టు చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని డబుల్ చిన్ అని అంటారు. లావు పెరగడం వల్ల డబుల్ చిన్ వచ్చిందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే లావు ఎక్కువగా లేకపోయినా కొందరిలో డబుల్ చిన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే   డబుల్ చిన్ కు,  థైరాయిడ్ సమస్యలకు మధ్య ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయని  వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. డబుల్ చిన్ ఎందుకు, ఎలా వస్తుంది? థైరాయిడ్ గ్రంథి పనితీరు సరిగ్గా లేనప్పుడు శరీర జీవక్రియ మందగిస్తుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో బరువు వేగంగా పెరగడం, శరీరంలో నీరు చేరడం లేదా వాపులు రావడం సాధారణం. దీని ప్రభావం ముఖం , మెడ భాగాలపై స్పష్టంగా కనిపిస్తుంది. మెడ కింద కొవ్వు చేరడం లేదా ముఖం ఉబ్బినట్లు అవ్వడం వల్ల డబుల్ చిన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా థైరాయిడ్ సమస్య వల్ల మెడ ముందు భాగంలో ఉన్న గ్రంథి వాచి గాయిటర్ గా మారినప్పుడు కూడా గడ్డం కింద వాపు వచ్చి డబుల్ చిన్ లాగా కనిపించే అవకాశం ఉంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు డబుల్ చిన్ తగ్గించుకోవడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు , జీవనశైలి మార్పులు పాటించాలి..  థైరాయిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం.. థైరాయిడ్  లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల సలహా మేరకు సరైన మోతాదులో థైరాయిడ్ మందులు క్రమం తప్పకుండా వాడాలి. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యంగా ఉన్నప్పుడు జీవక్రియ వేగవంతమై, అదనపు బరువు , వాపు తగ్గుతాయి.  పోషకాహార నియమం..  ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, మైదా , వేపుళ్లను పూర్తిగా తగ్గించాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు , తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరంలో సోడియం నిల్వలు ఎక్కువైతే నీరు చేరే అవకాశం ఉంది కాబట్టి ఉప్పు చాలా పరిమితంగా తినాలి. నీరు..  ప్రతిరోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. నీరు బాగా తాగితే ముఖం , మెడ భాగంలో నీరు చేరడం తగ్గి వాపు తగ్గుతుంది.  వ్యాయామం.. కేవలం మెడ భాగంలోనే కాకుండా శరీరం మొత్తానికి సంబంధించిన వ్యాయామాలు చేయాలి. రోజూ క్రమం తప్పకుండా నడక, యోగా లేదా కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు కరిగి బరువు తగ్గుతారు. దీనితో పాటు మెడ , గడ్డం కండరాలను బలోపేతం చేసే చిన్న చిన్న ముఖ వ్యాయామాలు చేయవచ్చు. ఈ ఫేస్ వ్యాయామాలు మెడ వద్ద ఉన్న చర్మాన్ని బిగుతుగా మార్చడానికి తోడ్పడతాయి.  నిద్ర , ఒత్తిడి..  రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర అవసరం. నిద్రలేమి , మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం ప్రాణాయామం వంటివి పాటించాలి. పైన చెప్పుకున్న విధంగా థైరాయిడ్ కు సరైన వైద్యం పొందుతూ, ఆరోగ్యకరమైన ఆహారం , రోజువారీ వ్యాయామం అలవాటు చేసుకుంటే డబుల్ చిన్ సమస్య నుండి క్రమంగా బయట పడవచ్చు.                                                                                                                                     *రూపశ్రీ.